DGP Anurag Sharma
-
డీజీపీ అనురాగ్ శర్మకు ఘనంగా వీడ్కోలు
-
ఎన్ని ఎన్‌కౌంటర్లన్నది చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: ‘‘నాకు జన్మనిచ్చింది రాజస్తాన్. కానీ జీవితాన్నిచ్చింది హైదరాబాద్. దానికి తోడు నా భార్య హైదరాబాదీయే. 60 ఏళ్లలో 25 ఏళ్లు మాత్రమే çస్వస్థలంలో ఉన్నా. మిగతా జీవితమంతా హైదరాబాదే. భార్య, పిల్లలు, చుట్టాలు, స్నేహితులు.. అంతా ఇక్కడే. హైదరాబాద్‌కు హాట్ సిటీ లాంటిది పాతబస్తీ.. కీలక సమయంలో ఆ ప్రాంతానికి డీసీపీగా పనిచేయడం జీవితంలో ఎనలేని సంతృప్తినిచ్చింది’’ అని డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. కీలకమైన గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్‌లలో చాలా కాలం పనిచేశారు, ఆ అనుభవం ఎలాంటిది? - ఇప్పుడున్నంత ప్రశాంత వాతావరణం అప్పుడు లేదు. 2007 వరకు ఉద్రిక్తమైన వాతావరణం ఉండేది. గ్రేహౌండ్స్‌లో గ్రూప్ కమాండర్‌గా పనిచేసిన సందర్భంలో ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటామో? అసలు వస్తామో లేదో కూడా నమ్మకం ఉండేది కాదు. ఉగ్రవాదుల హెచ్చరికలు, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, అనుమానితులను ప్రశ్నించడం.. అదంతా సెపరేట్ పోలీసింగ్. నా సక్సెస్‌లో ఆ పోస్టింగ్స్ కూడా కీలకం. ఇప్పటివరకు ఎన్ని ఎన్కౌంటర్లు చూశారు, మీ నేతృత్వంలో ఎన్ని జరిగాయి? - ప్రతీదీ ఎన్కౌంటర్ అనడం కరెక్ట్ కాదేమో. కొన్నిసార్లు ఎదుటి వారు ముందు కాల్పులు జరపడం మొదలుపెడితే.. ఇరువైపులా పరిస్థితి ఎవరి చేతుల్లో ఉండదు. అలా లెక్కలేనన్ని ఎన్కౌంటర్లు చూశాను. ఎన్ని అన్నది లెక్కపెట్టుకోలేదు. లెక్క ఉన్నా చెప్పడం మంచిది కాదు. చాలాసార్లు ఎన్కౌంటర్లలో యువత చనిపోయారు కదా.. అలాంటి సందర్భాల్లో బాధ అనిపించలేదా? - ప్రాణం చాలా విలువైంది. కాల్పులు శత్రువు వైపు నుంచి ప్రారంభమయ్యాక ఆపడం గానీ, నిలువరించడం గానీ మన చేతుల్లో ఉండదు. చాలా మంది తెలిసీ తెలియని వయసులో మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా యువతీ యువకులు మృతిచెందిన సమయంలో బాధనిపించినా.. బయటపడలేం. వృత్తి అలాంటిది. అలాగని మేం కర్కశులం కాదు. మీ 35 ఏళ్ల సర్వీసులో గర్వంగా అనిపించిన పోస్టింగ్ ఏది? - చెప్పాలంటే డీజీపీ పోస్టు కన్నా.. గ్రేట్‌గా ఫీలయ్యేది గతంలో చేసిన హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీ పోస్టు. నిప్పు మీద వేలాడుతున్నట్టుగా ఉండే పోస్టింగ్‌లో మూడున్నరేళ్లపాటు చేశాను. ఇప్పటివరకు నా రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో, తర్వాత ముంబై పేలుళ్ల సమయంలో.. ఇలా ఒకదానిపై ఒకటి టెన్షన్ పెంచిన సమయంలోనూ.. అక్కడి యువత, ప్రజల సహకారంతో దుర్ఘటనలేమీ జరగకుండా పనిచేసి విజయం సాధించాను. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏమిటి, మళ్లీ పుంజుకుంటోందా? - అందుకు అవకాశమే లేదు. పేరుకు మావోయిస్టు తెలంగాణ కమిటీ ఉన్నా.. పూర్తిగా ఛత్తీస్‌గఢ్ నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. గిరిజన యువతను రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న విద్య, ఉపాధి అవకాశాలతో యువత అభివృద్ధి వైపు చూస్తోంది. మావోయిస్టు పార్టీలో చేరి ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితిని యువత వద్దనుకుంటోంది. భవిష్యత్‌లో మావోయిస్టు పార్టీ పుంజుకునే పరిస్థితులు లేవు. శాఖలో అధునాతన సాంకేతికత వినియోగం పరిస్థితి ఏమిటి? - గత పదేళ్లలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఏ సమాచారమైనా క్షణాల్లో కేంద్ర కార్యాలయాలకు చేరిపోతోంది. దాంతో ఉగ్రవాద కార్యకలాపాలు, మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో రాష్ట్ర పోలీసు శాఖ విజయవంతమైంది. అధికారులు, సిబ్బంది కూడా టెక్నాలజీపై ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నారు. నిందితుల లొకేషన్లు, కాల్‌డేటా, ఇతరత్రా వ్యవహారాలు మొత్తం వేగంగా తెలుసుకోగలుగుతున్నాం. నేరస్తులకు శిక్ష పడేలా సాంకేతిక ఆధారాలు తోడ్పడుతున్నాయి. నయీమ్ కేసులో రాజకీయ నేతలపై కేసులు పెట్టలేకపోయారన్న ఆరోపణలపై మీ వివరణ? - నయీమ్‌తో కలసి తిరిగిన కొందరు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. రాజకీయ నేతల విషయానికొస్తే పెద్దగా ఆధారాల్లేవు. ఆధారాలున్న అంశాల్లో చర్య లు తీసుకున్నాం. సిట్ కేసులు నమోదు చేసి చార్జిషీట్లు వేస్తోంది. రాజకీయంగా నయీమ్ కేసులో కొంత ఒత్తిడి వచ్చినా అది ఆధారాలను బట్టి చూడాల్సి ఉంటుంది. పక్కాగా ఆధారాలుంటే ఎవరినీ వదలే ప్రసక్తి లేదు. మీ తర్వాత వచ్చే డీజీపీకి మీరిచ్చే సూచనలు, శాఖాపరంగా ఉన్న సమస్యలు? - నా తర్వాత డీజీపీగా వచ్చే అధికారి చాలా సమర్థవంతుడే. పోలీస్ శాఖకు ఉన్న సమ స్య అధికారుల విభజన పూర్తికాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, స్టేషన్ల నిర్మాణం, టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో మాదిరి రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర పోలీసు శాఖ మూడున్నరేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని సాధించింది. దీన్ని కొనసాగిస్తూ మరింత ఆధునీకరణ సాధిస్తే దేశంలోనే టాప్‌గా నిలుస్తాం. -
ఇన్చార్జి డీజీపీగా మహేందర్‌రెడ్డి?
-
ఇన్చార్జి డీజీపీగా మహేందర్‌రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖ కొత్త బాస్ ఎవరనే అంశానికి తెరపడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ ఈ నెల 12న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా 1986 బ్యాచ్ అధికారి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి వైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డీజీపీగా ఆయన నియామకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచనప్రాయంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం అసెంబ్లీ వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల యూపీఎస్సీకి పంపాల్సిన జాబితాపై తుది కసరత్తు చేయకపోవడం, పూర్తిస్థాయి డీజీపీ ప్రక్రియకు కనీసం 2–3 నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రతిపాదిత అధికారుల జాబితా యూపీఎస్సీకి వెళ్లి తిరిగొచ్చే వరకు ఇన్చార్జి డీజీపీగా మహేందర్‌రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక యూపీఎస్సీకి ప్రతిపాదిత అధికారుల జాబితాను పంపాలని ప్రభు త్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ తొలుత ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2015 నవంబర్ 11న యూపీఎస్సీ నుంచి ప్రతిపాదిత అధికారుల జాబితా ప్రభుత్వానికి తిరిగొచ్చాక ప్రభుత్వం ఆయన్ను నవంబర్ 12న పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఎం. మహేందర్‌రెడ్డిని తొలుత ఇన్చార్జి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 10న ఆదేశాలిచ్చే అవకాశం ఉందని సీఎంఓ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 11, 12 సెలవు దినాలు కావడంతో 10వ తేదీనే ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలివ్వొచ్చని తెలిసింది. కొత్త కొత్వాల్ ఎవరు?.. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఎం. మహేందర్‌రెడ్డి ఇన్చార్జి డీజీపీగా నియమితులైతే కొత్త కొత్వాల్ రేసులో నిలిచేందుకు అదనపు డీజీపీ హోదాలో ఉన్న అధికారులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం నగర కమిషనరేట్ పరిధిలో మహేందర్‌రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, కొత్త టెక్నాలజీ వినియోగం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగించే సామర్థ్యంగల అధికారుల కోసం సీఎం కార్యాలయం, ఇంటెలిజెన్స్ విభాగం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో 11 మంది అధికారులు పనిచేస్తున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన వీకే సింగ్, సంతోష్‌మెహ్రా, గోపికృష్ణ వచ్చే ఏడాది జనవరిలో డీజీపీ హోదా పదోన్నతి పొందనున్నారు. దీంతో వారికి నగర కమిషనర్ రేసులో ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న 1988 బ్యాచ్‌కు చెందిన పూర్ణచందర్రావు సీపీ రేసులో పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే 1990 బ్యాచ్‌కు చెందిన శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, రవిగుప్తా, గోవింద్సింగ్లలో అంజనీకుమార్ , గోవింద్‌సింగ్‌ల పేర్లు కమిషనర్ రేసులో వినిపిస్తున్నాయి. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, రాజీవ్ రతన్లలో తెలంగాణ అధికారి, ప్రస్తుతం సివిల్ సప్లైస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ ప్రధాన రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. వారి తర్వాత 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ పేరు సైతం సీపీ రేసులో వినిపిస్తున్నా జూనియర్ అదనపు డీజీపీ కావడంతో ఇస్తారా లేదా అనే దానిపై అనుమానం నెలకొంది. 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్ షరాఫ్ కేంద్ర సర్వీసులోని జాతీయ పోలీస్ అకాడమీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తుండటంతో ఆయన ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. దీంతో పూర్ణచందర్రావు, అంజనీకుమార్, సీవీ ఆనంద్‌లలో ఒకరిని కమిషనర్‌గా ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. మహేందర్‌రెడ్డి నేపథ్యం ఇదీ... ఖమ్మం జిల్లాకు చెందిన ఎం. మహేందర్‌రెడ్డి బీటెక్ పూర్తిచేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన సర్వీసు ప్రారంభంలో ఏఎస్పీ గోదావరిఖని, గుంటూరులలో పనిచేశారు. అనంతరం నిజామాబాద్, కర్నూలు జిల్లాల ఎస్పీగా, నగర కమిషనరేట్‌లో ఈస్ట్ జోన్ డీసీపీగా, నేషనల్ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా డీఐజీ హోదాలో విధులు నిర్వర్తించారు. తదనంతరం సైబరాబాద్ కమిషనర్ ఏర్పాటు నుంచి నాలుగేళ్లపాటు పనిచేయగా, ఐజీ హోదాలో పోలీస్ కంప్యూటర్ సర్వీస్, గ్రేహౌండ్స్‌లో కొద్ది రోజులపాటు పనిచేశారు. 2009 నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, రాష్ట్ర ఆవిర్భావం నుంచి హైదరాబాద్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. -
ఆన్లైన్లోనే క్రైమ్ కంట్రోల్ రివ్యూ
సాక్షి, హైదరాబాద్: క్రైమ్ కంట్రోల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు ద్వారా ప్రతీ రోజు, ప్రతీ నెల జరిగే నేరాలు, వాటి నియంత్రణకు సంబంధించి ఎస్పీలు, ఐజీలు, ఇతర అధికారులు ఆన్లైన్ ద్వారానే రివ్యూ చేసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ అభిప్రాయపడ్డారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు పురోగతిపై ఎంపవర్ కమిటీ సోమవారం భేటీ అయ్యింది. మండల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగే అతి చిన్న నేరాలను సైతం సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు ద్వారా డేటా బేస్‌తో అనుసంధానం చేసుకోవాలన్నారు. దీని వల్ల నేరాల సంఖ్య సమగ్రంగా తెలుస్తుందని వారికి సూచించారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అభివృద్ధిలో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోందని తెలిపారు. చైర్మన్ డీజీపీ అనురాగ్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీపీ రవి గుప్తా తదితర అధికారులు పాల్గొన్నారు. -
కొత్త పోలీస్ బాస్ ఎవరు?
-
కొత్త పోలీస్ బాస్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ వచ్చే నెల 12వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ నియామకానికి సంబంధించి యూపీఎస్సీకి పంపించాల్సిన జాబితాపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సీనియర్ ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే డీజీపీ హోదాలో ఉన్న అధికారుల బయోడేటా, ట్రాక్ రికార్డు, కేసులు, క్లియరెన్సులు, విజిలెన్స్ సర్టిఫికెట్ తదితర వ్యవహారాలు మొత్తం పూర్తయినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద డీజీపీ అభ్యర్థుల వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఏసీఆర్) సైతం క్లియర్ అయినట్టు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లో యూపీఎస్సీకి... డీజీపీ ఎంపిక ప్రక్రియ కోసం ప్రభుత్వం రాష్ట్ర కేడర్‌లో డీజీపీ హోదాలో పనిచేస్తున్న ఏడుగురు అధికారుల పేర్లను రెండు రోజుల్లో యూపీఎస్సీకి పంపిస్తోంది. ఇందులో 1983 బ్యాచ్‌కు చెందిన తేజ్ దీప్కౌర్, 1984 బ్యాచ్ అధికారి సుదీప్ లక్టాకియా, 1985 బ్యాచ్ అధికారి ఈష్‌కుమార్, 1986 బ్యాచ్ అధికారులు రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, అలోక్ ప్రభాకర్, కృష్ణప్రసాద్ పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలోని అధికారుల ట్రాక్ రికార్డు, ఏసీఆర్లు, తదితరాలు పరిశీలించిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముగ్గురు అధికారుల పేర్లను రాష్ట్రానికి తిరిగి పంపిస్తుంది. ఈ ముగ్గురిలో ఒకరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. రేసు నుంచి వాళ్లు ఔట్... రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్, ప్రస్తుతం కేంద్ర సర్వీసులోని సీఆర్పీఎఫ్ అదనపు డీజీపీగా ఉన్న సుదీప్ లక్టాకియాకు అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ ఆయనకు డీజీపీ హోదా పదోన్నతితో పాటు సీఆర్పీఎఫ్ ప్రత్యేక డీజీపీగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. దేశంలోనే అత్యంత కీలకమైన పోలీస్ యూనిట్‌కు బాస్‌గా నియమించడంతో లక్టాకియా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు స్పష్టంచేశారు. అంత కీలక పదవి వదులుకొని రాష్ట్ర డీజీపీ రేసులోకి వచ్చేందుకు ఆయన ఆసక్తి చూపడంలేదని వారు తెలిపారు. ఇకపోతే మిగిలిన ఆరుగురిలో ఒకరిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, మరో అధికారి అలోక్ ప్రభాకర్ 15 ఏళ్లుగా కేంద్ర సర్వీసులోనే కొనసాగుతున్నారు. ఆయన కూడా రాష్ట్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. ఇక మిగిలిన నలుగురిలో ఈష్‌కుమార్ దేశ పోలీస్ శాఖ డేటా సర్వీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు డైరెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఈయన కూడా రాకపోవచ్చని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన ముగ్గురు రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్.. వీరి ముగ్గురి పేర్లు యూపీఎస్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందే జాబితాలో ఉంటాయని సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరు డీజీపీగా పదవి చేపడతారు. ముందుగా ఇన్చార్జి డీజీపీనే... రేసులో వినిపిస్తున్న ముగ్గురిలో ఒకరిని నవంబర్ 12వ తేదీన ఇన్చార్జి డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 12న అనురాగ్‌శర్మ తన బాధ్యతలను ఇన్చార్జి డీజీపీకి అందజేయనున్నారు. ఇక మహేందర్‌రెడ్డి, రాజీవ్ త్రివేది, కృష్ణప్రసాద్.. వీరిలో ఎవరు ఇన్చార్జి డీజీపీగా నియుక్తులు అవుతారన్న దానిపై పోలీస్ శాఖలో ఉత్కంఠ నెలకొంది. యూపీఎస్సీకి రెండు రోజుల్లో జాబితా వెళితే.. ముగ్గురి పేర్ల ప్రతిపాదిత జాబితా రావడానికి కనీసం నెల నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. అప్పటివరకు ఇన్చార్జి డీజీపీయే డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
దేశ రక్షణలో సైనికుల పాత్ర కీలకం
హైదరాబాద్: దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎంతో కీలకమని, అలా దేశం కోసం సేవ చేస్తూ అమరులైన సైనికులను స్మరించుకోవడం వారికిచ్చే గౌరవమని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి పోలీసు అమరవీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన సంస్మరణ పరుగును ఆదివారం గవర్నర్ ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ సైనికుల్ని యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ రక్షణకు ముందుకు రావాలన్నారు. పోలీసులు నిరంతరం ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం 10కె, 5కె, 2కె రన్లను గవర్నర్, డీజీపీ అనురాగ్‌శర్మ ప్రారంభించారు. పరుగులో సీపీ మహేందర్‌రెడ్డితో పాటు యువకులు, ఔత్సాహికులు వేలాదిగా రన్లో పాల్గొన్నారు. -
పోలీసు త్యాగాలను గుర్తిద్దాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని, అమరులైన పోలీసులను స్మరించుకోవాలని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఈ నెల 15న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో నిర్వహిస్తున్న పోలీస్ రన్‌కు సంబంధించిన టీ షర్ట్, మెడల్‌ను సీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలసి అనురాగ్‌శర్మ గురు వారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్లో 2కె, 5కె, 10కె రన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ మెడల్ ఇస్తామని పేర్కొన్నారు. 2014 గౌహతిలో నిర్వహించిన డీజీపీల సమావేశంలో పోలీసుల త్యాగాలను వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రధాని సూచించారని వివరించారు. దీనికోసం కేంద్రం ప్రారంభించిన వెబ్సైట్లో పోలీస్ సిబ్బంది చేసిన కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు అప్లోడ్ చేస్తున్నాయన్నారు. గతేడాది రాష్ట్రంలోని వివిధ పోలీస్ సంస్థలు, పారా మిలిటరీతో కలసి పోలీస్ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈసారి కూడా ఈ నెల 14 నుంచి 16 వరకు నెక్లెస్‌రోడ్‌లో ఎక్స్పో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ రన్లో పాల్గొని, విజయవంతం చేయాలని అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. పోలీస్ రన్ నిర్వహణకు ఎస్.ఎల్.ఎన్ టెర్మినస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి రూ.5 లక్షల చెక్కును ఐజీ సౌమ్యామిశ్రా సమక్షంలో డీజీపీకి అందజేశారు. -
‘మెట్రో’ భద్రత ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రైలు త్వరలో పట్టాలెక్కబోతోంది. మెట్రో తొలి దశను వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం దగ్గర పడుతున్నా మెట్రో రైలు భద్రతపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కీలకమైన మెట్రో రైలు భద్రత ఎవరి చేతికి వెళ్తుంది? పోలీస్ శాఖ చేతికి వస్తుందా? లేక ప్రైవేట్ ఏజెన్సీల చేతికి వెళ్తుందా? అనే దానిపై హెచ్ఎంఆర్, పోలీస్ శాఖ మధ్య సందిగ్ధత ఏర్పడింది. సాయుధ బలగాలతో గస్తీ.. దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే అందు బాటులోకి వచ్చిన మెట్రో రైళ్లు, వాటి భద్రత వ్యవహారాలు మొత్తం సాయుధ బలగాలు, పోలీస్ శాఖ చేతిలోనే ఉన్నాయి. ఉగ్రవాద ముప్పు నుంచి ప్రతిక్షణం కాపాడేందుకు ప్రత్యేకమైన భద్రత వ్యవస్థలను అందుబాటు లోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు భద్రత కూడా పోలీస్ శాఖ చేతిలోనే ఉండాలని గతంలోనే రెండు సార్లు సమావే శమై ఇరు విభాగాల అధికారులు నిర్ణయానికి వచ్చారు. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవు తున్నా ఇప్పటివరకు మెట్రో రైలు భద్రత ఎవరి బాధ్యత అన్న దానిపై రెండు విభాగాల్లోని అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. ప్రైవేట్ సెక్యూరిటీకి మొగ్గు.. హెచ్ఎంఆర్, పోలీస్ శాఖ మెట్రో రైలు భద్రతపై సమావేశమైనప్పుడు.. పోలీస్ శాఖనే పూర్తి స్థాయిలో భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించాలని, ఇందుకు ప్రత్యేకంగా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని రెండు విభాగాలు నిర్ణయించుకున్నాయి. నాగోల్, మియాపూర్, ఎస్ఆర్నగర్లో మెట్రో పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేసి, మరో ఐదు ఔట్‌పోస్టులను పెట్టుకోవాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నాయి. మూడు పోలీస్స్టేషన్లకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఉండటంతో పాటు ఔట్ పోస్టుల్లో ఎస్ఐ ర్యాంక్ అధికారిని నియమించాలని, కో–ఆర్డినేట్ చేసుకోవడానికి డీఎస్పీ లేదా ఎస్పీ స్థాయి అధికారి ఒకరు ఉంటారని భావించాయి. తీరా సమయం దగ్గరపడుతున్న టైమ్‌లో ప్రత్యేక పోలీస్స్టేషన్లు అక్కర్లేదని, కొన్ని చోట్ల పోలీస్ సిబ్బంది భద్రత, మిగతా అంతా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంటే సరిపోతుందని మెట్రో ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జీఆర్పీ నేతృత్వంలోనే... మెట్రో రైలు భద్రత వ్యవహారాలు మొత్తం ప్రస్తుతం ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ) విభాగం కిందే పనిచేస్తోందని ఉన్నతా ధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, ఖాజీపేట, హన్మకొండ ఇలా పలు రైల్వేస్టేషన్లలో రాష్ట్ర పోలీస్ కింద పనిచేసే రైల్వే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటి లాగే మెట్రో రైల్వే స్టేషన్లు కూడా జీఆర్పీ కిందే పనిచేసేలా ప్రణాళిక రూపొందించుకుంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. స్టేషన్లతోపాటు బోగీల్లోనూ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందిని భద్రత వ్యవహారాల్లో నిమగ్నం చేయాలని యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోం.. పోలీస్ స్టేషన్లు, సాయుధ సిబ్బంది లేకుండా మెట్రో రైలు భద్రతను పర్యవేక్షించడం సాధ్యం కాదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఢిల్లీ మెట్రో రైలు భద్రత మొత్తం సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) చేతిలో ఉంటుంది. కోల్కత్తా మెట్రో భద్రత ఏకంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) చేతికిచ్చారు. బెంగళూరు మెట్రో భద్రతను ప్రైవేట్ సెక్యూరిటీకి ఇచ్చి భంగపడాల్సి వచ్చింది. ఎలాంటి అధికారాలు లేని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అసాంఘిక శక్తులను నియంత్రించడం సాధ్యం కాదని తేలడంతో ఆర్పీఎఫ్, లేదా సీఐఎస్ఎఫ్కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మెట్రో నగరాలు ఉగ్రవాద టార్గెట్‌లో ఉంటాయని, అలాంటి ముప్పును ఎదుర్కోవడం, వాటిని నియంత్రించేందుకు సాయుధ బలగాలు, సివిల్ పోలీస్ సిబ్బంది నేతృత్వంలో భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు భద్రత అప్పగిస్తే విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో సమావేశమవుతాం మెట్రో రైలు భద్రతకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసు కోవాల్సిన చర్యలపై హైదరాబాద్ మెట్రో రైలు ఉన్నతాధికారులతో సమావే శమవుతాం. మెట్రో రైలు భద్రత పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు స్టేషన్లు, సాయుధ సిబ్బంది తప్పనిసరి. గతంలో జరిగిన సమావేశాల్లోనూ ఇదే చెప్పాం. దీనిపై త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందిం చుకుంటాం. – డీజీపీ అనురాగ్ శర్మ -
15న పోలీస్ మెమోరియల్ రన్
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని (అక్టోబర్ 21) పురస్కరించుకొని అక్టోబర్ 15న హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద పోలీసుశాఖ ‘మెమోరియల్ రన్’ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పోలీసు బలగాల సిబ్బంది, అధికారులతోపాటు ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం డీజీపీ కార్యాలయంలో ఇండియన్ పోలీస్ అమరవీరుల మెమోరియల్ రన్ (ఐపీఎంఎంఆర్) వెబ్సైట్, ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలతోపాటు ప్రచార వాహనాలను ప్రారంభించారు. రన్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ www. policerun. inను డీజీపీ అనురాగ్‌శర్మ, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ప్రారంభించగా ఫేస్బుక్ ఖాతా www. facebook. com/ PoliceRun2017ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే ట్వీటర్ ఖాతా@ipmmr20172017ను అదనపు డీజీపీ గోపీకృష్ణ ప్రారంభించారు. అనంతరం మెమోరియల్ రన్‌కు సంబంధించి అన్ని జిల్లాల్లో ప్రచారం కోసం మూడు వాహనాలను డీజీపీ అనురాగ్ శర్మ, మిథాలీరాజ్, కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మాది పోలీసు కుటుంబమే: మిథాలీరాజ్ పోలీసు సిబ్బంది త్యాగాలు, వారి సేవలు తనకు బాగా తెలుసని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాల్‌రాజ్ పేర్కొన్నారు. తన తాత, తండ్రి పోలీసుశాఖలో పనిచేశారని, పోలీసు సిబ్బంది కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసన్నారు. కంటికి రెప్పలా పోలీసులు కల్పిస్తున్న రక్షణ వల్లే తాము దైర్యంగా క్రికెట్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నామని అభిప్రాయపడ్డారు. మహిళా రక్షణలో రాష్ట్ర పోలీసులు చేపడుతున్న చర్యలు భేష్ అని కితాబిచ్చారు. -
కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలి
డీజీపీకి ఆర్యవైశ్య మహాసభ వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య మహాసభ సోమవారం డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేసింది. స్మగ్లర్ల పేరుతో తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా పుస్తకంలో పేర్కొన్నారని, ఈ మేరకు ఐలయ్యపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తమ ఆర్యవైశ్యులు చేస్తున్న ఫిర్యాదులపై తగుచర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో రాష్ట్ర సం ఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, రాజశేఖర్ గుప్తా, రెడ్డిశెట్టి ఉన్నారు. నాకు రక్షణ కల్పించండి: ఐలయ్య ఆర్యవైశ్య సంఘం నుంచి తనకు ప్రమాదం ఉన్నందున జీవితాంతం పోలీసుల రక్షణ కావాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య కోరారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’అనే పుస్తకాన్ని రచించినందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, దుబాయ్, యుఎస్ఏ తదితర ప్రాంతాల నుండి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. తనకు వచ్చే ఫోన్‌కాల్స్‌లోని కొన్నింటిని ఏసీపీ కూడా మాట్లాడారని తెలిపారు. వారు తనపై కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. తన జీవితంలో అసహజ మరణం అంటూ జరిగితే ఆర్యవైశ్య సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించి తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఏడు సెల్ ఫోన్ నంబర్లను గుర్తించాం ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్‌కు సంబంధించి ఏడు ఫోన్ నంబర్లను ట్రేస్చేశామని ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడు నంబర్లు ఆర్యవైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులవని తేలిందని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. భద్రత కల్పించండి: అసదుద్దీన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వెంటనే తగిన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఐలయ్యను బెదిరిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూచించారు. బెదిరింపులు సరికాదు: తమ్మినేని ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు వస్తున్న బెదిరింపులను టీమాస్ ఖండిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన టీమాస్ సభలో తమ్మినేని ప్రసంగించారు. ఐలయ్య రాసిన పుస్తకాల్లో వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని, కులాల సామాజిక చరిత్రను మాత్రమే ఆయన వెలికితీశారన్నారు. ఆయన వైశ్య కులంలోని అసంబద్ధ విధానాలనే విమర్శించారని, బ్రాహ్మణులు, రెడ్లు వంటి కులాల్లోని ఆధిపత్య సంస్కృతిపై కూడా అనేక విమర్శలున్నాయని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐలయ్య వంటి వారిపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. ఐలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. -
నోట్ల మార్పిడిపై 23 కేసులు
పార్లమెంటరీ కమిటీ భేటీలో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో పార్లమెంటరీ కమిటీతో డీజీపీ బృందం సమావేశమైంది. పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో కేసుల నమోదు, నకిలీ కరెన్సీ కేసులు తదితర అంశాలపై చర్చించడంతో పాటుగా ఓ నివేదికనూ పార్లమెంట్ కమిటీకి అందించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో పాటు సీఐడీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు విభాగాలతో భేటీ: కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపై రాష్ట్రానికి చెందిన వివిధ విభాగాల అధికారులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహించింది. మైనారిటీ వ్యవహారాలకు సంబంధించిన పథకాలు, నిధుల వినియోగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఆర్థిక శాఖ, పలు విభాగాలతో భేటీ అయ్యింది. నోట్ల రద్దు తర్వాత సమస్యలపై బ్యాంకు యాజమాన్యాలతో కమిటీ సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. -
గణేశుడికి జియోట్యాగ్!
- సులభతరం కానున్న వినాయక నిమజ్జనం - ప్రత్యేక క్యూఆర్ కోడ్ సైతం ఏర్పాటు - ఒక్క క్లిక్‌తో విగ్రహాల పూర్తి వివరాలు.. - పోలీసులకు తప్పనున్న తిప్పలు - గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ కమి షనరేట్ పరిధిలో విగ్రహాల సంఖ్య, ఎత్తు, మండపం అనుమతి తీసుకున్న వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరచనుంది. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించే ప్రతి వినాయక విగ్రహానికి జియోట్యాగ్ ఏర్పాటు చేశారు. గతంలో పోలీసులు మండపం వద్దకు వెళ్లి తనిఖీ చేసి తమ రిజిస్టర్లో నమోదు చేసుకుని, నిర్వా హకుల సంతకం తీసుకునేవారు. కానీ ఇప్పుడలా కాకుండా జియోట్యాగ్ ద్వారా మండపానికి 50 మీటర్ల దూరంలో ఉండ గానే హైదరాబాద్ ‘కాప్‌యాప్’ద్వారా కమాండ్ సెంటర్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి. పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లారా లేదా అనే వివరాలనూ దీని ద్వారా తెలుసుకోవచ్చు. విగ్రహాల వివరాలు పక్కాగా.. ఈసారి హైదరాబాద్‌లో కొత్తగా ప్రతి గణేశుడికి క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్)ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ బార్కోడ్ ద్వారా పోలీసు సిబ్బంది ట్యాబ్‌లో స్కాన్ చేయగానే విగ్రహం ఎత్తు మండప నిర్వాహకులు తదితర వివరాలు ప్రత్యక్షమవుతాయి. నిమజ్జన సమయంలో విగ్రహం ఎంతవరకు వచ్చింది.. ఎప్పుడు నిమజ్జనం అవుతుంది.. వంటి వివరాలను కూడా పోలీసులకు తెలియజేస్తుందన్నమాట. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనమైన విగ్రహాల సంఖ్యను పోలీసులు లెక్కిస్తూ నమోదు చేసుకోవాల్సి వచ్చేది. క్యూఆర్ కోడ్ వల్ల ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నిమజ్జనమైన విగ్రహాల వివరాలు పక్కాగా తెలిసిపోతాయి. క్రేన్ల రీడిజైన్.. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన క్రేన్ల కొండీల (హుక్స్)ను రీడిజైన్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలి పారు. విగ్రహాలు నీళ్లలోకి వెళ్లగానే కొండీలు వాటంతట అవే తెరుచుకుంటాయన్నారు. గతంలో వాటిని మనుషులు తీసేవార ని, భారీ విగ్రహాల నిమజ్జనం సమయంలో కొండీల తొలగింపు కష్టంగా ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య ఉండబోదన్నారు. 24 వేల మందితో బందోబస్తు.. నగరంలో సెప్టెంబర్ 5న జరిగే నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తుపై డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం సమీక్ష నిర్వ హించారు. 24 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి డీజీపీకి తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ పారామిలిటరీ బలగాలు, ఏపీ పోలీస్ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌లోని పోలీస్ సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేస్తున్నట్టు తెలిపారు. యూనిఫాం సర్వీసులైన ఫారెస్ట్, ఎక్సైజ్ సిబ్బందిని కూడా బందోబస్తులో వినియోగించనున్నామన్నారు. ఈ మేరకు ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల నుంచి 2 వేల మందిని కేటాయించా లని సంబంధిత విభాగాధిపతులకు లేఖలు రాశామన్నారు. -
నవంబర్ 12న డీజీపీ రిటైర్మెంట్!
► కొత్త డీజీపీ ఎవరన్నదానిపై చర్చ ► రాష్ట్ర హోంశాఖ సలహాదారుడిగా అనురాగ్‌శర్మ! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్‌శర్మ నవంబర్ 12న పదవీ విరమణ చేయబోతున్నారు. తెలంగాణ తొలి డీజీపీగా నియమితులైన ఆయన 2014 జూన్ 2న ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2015 నవంబర్ 12న పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో అనురాగ్‌శర్మ ఈ ఏడాది నవంబర్ 12న పదవీ విరమణ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేసులో ఎవరు..? 1982 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనురాగ్‌శర్మ ప్రస్తుతం రాష్ట్ర కేడర్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన తర్వాత 1983 బ్యాచ్‌లో ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, 1984 బ్యాచ్‌లో సుదీప్ లక్టాకియా సీఆర్పీఎఫ్ అదనపు డీజీపీగా ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఈష్‌కుమార్ నేషనల్ క్రైమ్ రికారŠుడ్స బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది డైరెక్టర్ జనరల్ హోదా పొందిన 1986 బ్యాచ్ అధికారులు మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, రాజీవ్‌త్రివేది, ఆలోక్ ప్రభాకర్ ఉన్నారు. ఈ ఏడుగురూ డీజీపీ పోస్టు కోసం పోటీపడే జాబితాలో కనిపిస్తున్నారు. వీరిలో సుదీప్ లక్టాకియా, ఈష్‌కుమార్, అలోక్ప్రభాకర్ కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. వీరు డీజీపీ రేసులో ఆసక్తి చూపడంలేదు. ఇక మిగిలింది తేజ్‌దీప్‌కౌర్, మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, రాజీవ్‌త్రివేది. ఈ నలుగురిలో ప్రభుత్వం నవంబర్ 12న ఇన్చార్జి డీజీపీగా ఎవరి పేరు ప్రతిపాదిస్తుందన్న దానిపై పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ప్యానల్లో అందరి పేర్లు..: డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్‌గా 30 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న, డీజీపీ హోదా ఉన్న అధికారుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ప్యానల్ జాబితా రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించాలి. రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఏడుగురు అధికారులు డీజీపీ హోదాలో ఉన్నారు. వీరందరి పేర్లూ కేంద్రానికి పంపించాలి. అయితే కేంద్ర సర్వీసులో ఉన్నవారి డిప్యుటేషన్ గడువు ముగియకుండా వెనక్కి పంపడం కుదరదు. ఈ క్రమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారుల్లోని ముగ్గురి పేర్లను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. ఈ ముగ్గురిలో ఒక అధికారిని డీజీపీగా నియమించుకునే విచక్షణాధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అనురాగ్‌శర్మకు కీలక పదవి..! డీజీపీగా పదవీవిరమణ చేయనున్న అనురాగ్‌శర్మకు కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్ర ప్రభుత్వంలో గానీ కీలక పదవి వరించనున్నట్టు అటు పోలీస్, ఇటు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో హోంశాఖ, అంతర్గత భద్రత వ్యవహారాలను మానిటరింగ్ చేసేందుకు అనురాగ్‌శర్మను హోంశాఖ సలహాదారుడిగా నియమించే ఆలోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా అటు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వద్ద ఆయనకు మంచి పేరుంది. దీంతో కేంద్ర హోంశాఖలో ఓఎస్డీగా, లేదంటే ప్రత్యేక కమిటీ వేసి, దానికి చైర్మన్‌ను చేసే ఆలోచనలో కూడా కేంద్ర హోంశాఖ వర్గాలున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. -
నిరుద్యోగులను జాబ్‌తో కనెక్ట్ చేస్తుంది
► నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపే మార్గం ► ప్రత్యేక వాహనం రూపొందించిన నగర పోలీసులు ► కమ్యూనిటీ పోలీసింగ్ చర్యల్లో భాగంగానే ► ప్రారంభించిన డీజీపీ సాక్షి, హైదరాబాద్ : ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు, సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం కోసం నగర పోలీసులు అమలు చేస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్‌లో మరో ముందడుగు పడింది. నిరుద్యోగులైన యువ తకు వారివారి ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగావ కాశాలు కల్పించడం కోసం సిటీ పోలీసులు ‘జాబ్ కనెక్ట్’పేరుతో ఓ ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. దీన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించారు. ఏమిటీ వాహనం..? ప్రస్తుతం నగరంలోని బస్తీలు, కాలనీల్లో నిరుద్యోగ, అర్హతలకు తగిన ఉద్యోగాలు లేని యువత ఎందరో ఉన్నారు. వీరంతా ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడం కూడా వీరికి గగనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు ‘జాబ్ కనెక్ట్’వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనం షెడ్యూల్ ప్రకారం నిత్యం కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ల ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగులు, ఎలాంటి అండదండలు లేనివారు ఉంటున్న ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని వెళ్తుంది. ఎలా ఉపకరిస్తుంది? దీని నిర్వహణ కోసం నగర పోలీసు విభాగం టీఎంఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వీరు సిటీలోని రిటైల్ రంగంతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉన్న ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ఆయా ప్రాంతాల కు వెళ్లినప్పుడు అక్కడి యువత ఈ వాహ నంలో ఉన్న సిబ్బందిని సంప్రదించడం ద్వారా ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తమ అర్హతలు, ఆసక్తుల్ని రిజిస్టర్ చేసుకోవ చ్చు. ఇలా రిజిస్టర్ అయిన వారికి అనువైన ఉద్యోగం ఉన్నట్లైతే ‘జాబ్ కనెక్ట్’సిబ్బంది ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం ఇచ్చి సమన్వ యం చేస్తారు. అవసరమైన వారికి ఇంటర్వ్యూ తదితరాల్లో శిక్షణ కూడా ఇస్తారు. అంతేకా కుండా... ‘జాబ్ కనెక్ట్’వ్యాన్‌కు అమర్చిన స్క్రీన్ ద్వారా ప్రజలకు అవసరమైన సూచ నలు, సలహాలను పోలీసులు అందిస్తుంటారు. మరోపక్క నగర పోలీసులు రూపొందించిన ‘హాక్–ఐ’యాప్ ద్వారానూ నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ‘చేయూత’స్ఫూర్తితో... నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి గత ఏడాది డిసెంబర్ 4న ‘చేయూత’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు సిబ్బందిని వారి పరిధుల్లో ఉన్న కాలనీలు, బస్తీలకు పంపడం ద్వారా మొత్తం 7,540 మంది నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం టీఎంఐ సంస్థతో కలిసి 40 కంపెనీలతో భారీ జాబ్‌మేళా నిర్వహించి 1,300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో సీపీ మహేందర్‌రెడ్డి ఈ విధానం అన్ని ఠాణాల పరిధుల్లోనూ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాన్‌కు రూపమిచ్చారు. నిస్పృహకు లోనైతే ఇబ్బందే విద్యార్హతలు ఉన్న తర్వాత ఉద్యో గాలు రాకపోతే యువత నిస్పృహకు లోనవుతారు. అలాంటి వారే దారితప్పి నేరాలకు పాల్పడే ఆస్కారం ఉంది. అలా కాకుండా చేయడానికి ఇలాంటి చర్యలు చాలా కీలకం. నగర పోలీసులు ‘జాబ్ కనెక్ట్’ను పరిచయం చేయడం శుభపరి ణామం. ఇది పోలీసింగ్లోనే కొత్త ఒరవడి. – అనురాగ్ శర్మ, డీజీపీ పరిచయాలు అవసరం లేకుండా కంపెనీలో తెలిసిన వారి అవసరం లేకుండా అర్హులైన యువతకు ఉద్యోగావ కాశాలు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగాల కల్పనలో దేశంలోనే మంచి పేరున్న టీఎంఐ సంస్థతో కలసి పని చేస్తున్నాం. ప్రధానంగా బస్తీలు, నిరుపేదలు నివసించే, వెనుకబడిన కాలనీలపై దృష్టి పెట్టనున్నాం. – ఎం.మహేందర్‌రెడ్డి, నగర కొత్వాల్ ఆ రెండిటికీ వారధిగా పనిచేస్తాం అనేక సంస్థల్లో ఉన్న ఉద్యోగాల వివరాలను తెలుసుకోవడం, నిరుద్యోగులకు ఆ వివరాలు తెలిపి అర్హులైన వారి పొందేలా చేయడం... ఈ రెండిటికీ మధ్య మేము వారధిగా పనిచేస్తాం. ఈ వ్యాన్ ద్వారా ఉద్యోగాల కోసం తిరిగే అవకాశంలేని వారి ముంగిట్లోకి అవకాశాలను తీసుకువెళ్తాం. – మురళీధరన్, టీఎంఐ చైర్మన్ -
డ్రగ్స్ తర్వాత ఇదే అతిపెద్ద వ్యాపారం
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న మానవ అక్రమ రవాణా - రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను నియంత్రిస్తున్నాం - 2014 నుంచి ఇప్పటివరకు 1,397 మందిని రక్షించాం - మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవంలో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా సాగుతున్న వ్యాపారాల్లో డ్రగ్స్ తర్వాత స్థానంలో మానవ అక్రమ రవాణా ఉందని డీజీపీ అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా నేతృత్వంలో పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల హక్కులు, వేధింపుల నియంత్రణకు కృషిచేస్తున్న మహితా, ప్లాన్ ఇండియా సంస్థల ప్రతినిధులు, ప్రాసిక్యూషన్ విభాగం అధికారులు కలసి పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఐడీ ఆధ్వర్యంలో వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నామని, ఇప్పటివరకు 953 అక్రమ రవాణా కేసులు నమోదు చేశామని, 1,397మంది మహిళలు, యువతులను రక్షించామని తెలిపారు. వ్యభిచార కూపాల నుంచి బయటపడ్డ వారికి సరైన ఆధారం కల్పించి, ఆదాయ మార్గాలు చూపిస్తే మళ్లీ వ్యభిచార వృత్తిలోకి వెళ్లకుండా ఉంటారని, దీనిపై పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. సీఐడీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ ద్వారా వేలాది మంది బాలకార్మికులను తల్లిదండ్రుల చెంతకు పంపించామని, బాలలతో పనిచేయిస్తున్నవారిపై పీడీ యాక్ట్ పెంట్టేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాను నియంత్రించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. కాగా, ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాదిన మానవ అక్రమ రవాణా సమస్య తక్కువగా ఉందని డీజీపీ వెల్లడించారు. మరింత సామర్థ్యం పెంచుకోవాలి... మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు, న్యాయవాదులు మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాలని సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఐజీ సౌమ్యామిశ్రా అభిప్రాయపడ్డారు. వ్యభిచార కూపాలు, బాలకార్మిక వ్యవస్థ, అవయవాల అక్రమ రవాణా, బలవంతపు భిక్షాటన.. ఇలా అనేక రకాలుగా కొందరు వ్యక్తులు మహిళలు, చిన్నారులను వేధిస్తున్నారని, వీరికి కఠినమైన శిక్షలు పడాలంటే పోలీసులు, న్యాయవాదులు సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహితా స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, ప్లాన్ ఇండియా స్వచ్చంద సంస్థ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ అనితా కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ నిపుణుడు సుధామురళీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్‌రావు, యునిసెఫ్ ప్రతినిధి డేవిడ్ రాజ్, సీఐడీ అధికారులు పాల్గొన్నారు. బాధితులుగా చూడాలి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ వ్యభిచార గృహాల నుంచి మహిళలను బాధితులుగా గుర్తించి కాపాడాలని, వారిని నిందితులుగా చూడవద్దని పోలీస్ అధికారులకు సూచించారు. వారు ఈసడింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందని గుర్తుచేశారు. -
‘అవసరం అయితే అకున్‌కు భద్రత పెంపు’
హైదరాబాద్ : ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు బెదిరింపు కాల్స్‌పై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. బెదిరింపు కాల్స్‌ను ధ్రువీకరించిన ఆయన ... అవసరం అయితే అకున్ సబర్వాల్‌కు అదనపు భద్రత కల్పిస్తామన్నారు. బెదిరింపు కాల్స్‌పై ఇంటెలిజెన్స్ అధికారులకు అకున్ సబర్వాల్ ఫిర్యాదు చేశారన్నారు. ఈ కాల్స్‌పై విచారణ జరుగుతోందని, అవి ఎక్కడ నుంచి వచ్చాయో ఇంటెలిజెన్స్ పరిశీలిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో బెదిరింపు కాల్స్‌పై స్పష్టత వస్తుందన్నారు. కాగా డ్రగ్స్ మాఫియా కేసు విచారణను తక్షణమే నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు అకున్ సబర్వాల్‌కు కాల్ చేసి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ ఇంటర్నెట్ ద్వారా అగంతుకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫోన్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ముఠా నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. -
పోలీస్ ఆత్మహత్యలపై అధ్యయనం
ఐపీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో వరసగా చోటుచేసుకుంటున్న సిబ్బంది ఆత్మహత్యలపై డీజీపీ అనురాగ్ శర్మ దృష్టి సారించారు. ఆత్మహత్యలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతో గురువారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో భేటీ అయ్యారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి అధికారులు, సిబ్బందిలో ఉన్న ఒత్తిడి నివారణ, మానసిక కుంగుబాటు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీనిపై శిక్షణ విభాగం ఐజీ చారుసిన్హా నేతృత్వంలో అధికారులు కలసి పనిచేయాలని, ఒత్తిడి నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆలోచనలను చారుసిన్హాకు తెలియజేయాలని అధికారులకు డీజీపీ సూచించారు. అలాగే తీసుకోవాల్సిన చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళిక కూడా తయారుచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పలువురు పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పెట్టెలోనే ఫిర్యాదులు..!
ముఖ్యమంత్రికి చేరని పోలీస్ ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీస్ కాన్ఫరెన్స్‌ను సీఎం కేసీఆర్ నిర్వహించారు. ప్రజలకు అందించాల్సిన పాలన, అవినీతి, అక్రమాల నియంత్రణ.. ప్రభుత్వ విధివిధానాలను కింది స్థాయిలో పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలతో పాటు పై స్థాయిలో ఉండే ఐపీఎస్ అధికారులందరికీ వివరించారు. అలాగే పోలీస్ శాఖలో తీసుకురావాల్సిన మార్పు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, సూచించాల్సిన సలహాలు, చేయాల్సిన ఫిర్యాదులు.. సీక్రెట్ బాక్స్ (సలహాల పెట్టె)లో వేయాలని ప్రకటించారు. ఆ సలహాల పెట్టెను స్వయంగా తానే పరిశీలిస్తానని, అందులో సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. దీంతో 80 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 36 మంది ఇన్స్పెక్టర్లు పోలీస్ శాఖలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు, జిల్లాల్లో పలువురు ఎస్పీలు చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. దీని పై నివేదిక రూపొందించి సీఎంకు ఉన్న తాధికారులు అందించాల్సి ఉంది. సమావేశం నిర్వహించి రెండు నెలలు గడిచింది. సలహాల పెట్టెను డీజీపీ అనురాగ్ శర్మ ఓపెన్ చేసి నెలన్నర గడిచిపోయింది. అసలు ఆ ఫిర్యాదులేంటి, వాటిలో ఉన్న అధికారుల సంగతేంటి, వారు పాల్పడుతున్న అక్రమాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను పట్టించుకోలేదని కింది స్థాయి సిబ్బంది నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులపై ఓ కమిటీ వేసి సమీక్ష నిర్వహించాల్సిన అధికారులు సమయం లేదంటూ దాటవేయడం ఏంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. -
డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దు: కేసీఆర్
హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో పలుశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఎంత మందికి నోటీసులు జారీ చేశారో, ఎంత మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారన్న వివరాలతో కూడిన డ్రగ్స్ రాకెట్ కేసు నివేదికను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్.. విచారణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దని, దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టొద్దని అకున్ సబర్వాల్ సహా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమీక్షకు డీజీపీ అనురాగ్ శర్మ, అకున్ సబర్వాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కేసు విచారణకుగానూ అవసరమైతే మరికొంత మంది పోలీసుల సహాయం తీసుకోవాలని అకున్ సబర్వాల్‌కు కేసీఆర్ సూచించారు. సమిష్టి కృషి చేయడం వల్లే వీటిని రూపుమాపవచ్చునని, నార్కోటిక్ సహాయంతో కేసు విచారణ సులువుగా మారుతుందని పోలీసులకు కేసీఆర్ సలహా ఇచ్చారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ప్రధాన నిందితుడు కెల్విన్‌తో పాటు మహ్మద్ ఖద్దుస్, మహ్మద్ వాహిద్‌లను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. నేటి సాయంత్రానికి వీరి సిట్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటికే కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురిని అదుపులోకి ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. పది రోజుల సెలవుపై వెళ్లాలన్న నిర్ణయాన్ని అకున్ సబర్వాల్ ఇదివరకే వెనక్కి తీసుకుని కేసు విచారణను వేగమంతం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిని ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ అధికారులు విచారించనున్నారు. పలువురు సినీ ప్రముఖులకు ఈ కేసులో నోటీసులు అందడంతో పాటు మరికొందరి పేర్లు వెలుగుచూస్తాయని కథనాలు ప్రచారం కావడంతో ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది. హైదరాబాద్‌లో పలు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులతో పాటు సినీ సెలబ్రిటీలు, ఇతర రంగాలకు చెందినవారు డ్రగ్స్ కు బానిసైనట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
గ్రామీణ పోలీస్ స్టేషన్లలో మార్పులు
♦ పోలీస్ కమిషనర్లు/ఎస్పీలతో డీజీపీ సుదీర్ఘ భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తరహాలో ప్రతి జిల్లా పోలీస్ యూనిట్ మార్పు చెందాలని డీజీపీ అనురాగ్ శర్మ ఆకాంక్షించారు. పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా పోలీస్ సిబ్బందితోపాటు పోలీస్ వ్యవస్థ కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన అవసర ముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీస్ శాఖలో నూతన పోలీసింగ్ విధానం– అమ లుపై రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులం దరితో గురువారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.పదేళ్లలో పోలీస్ శాఖ తీసు కురావాల్సిన యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. జిల్లా పోలీస్ స్థిరీకరణ ప్రణాళిక.. ప్రతి పోలీస్‌స్టేషన్ అవసరాలను గుర్తించి వాటిని ఆధునిక సౌకర్యాలతో ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ వెస్ట్ జోన్ ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థిరీకరణ ప్రణాళిక తయారు చేశారు. ప్రక్షాళనకు అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. మే నెలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారుల సమావేశం అనంతరం హైదరాబాద్ సిటీ పోలీస్ తరహాలో ప్రతీ పోలీస్ స్టేషన్లోను అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని డీజీపీ నిర్ణయించారు. యూనిట్ అధికారులు జిల్లా నుంచి ఇన్స్పెక్టర్, ఎస్.ఐ.హోదా అధికా రులతో కూడిన 7 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్లను పరిశీలించడంతో పాటు స్టేషన్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కాగా టెక్నాలజీని, స్టేషన్ వాతావరణాన్ని మార్చేందుకు ప్రతీ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఒక మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్‌ల సందర్శన ప్రస్తుతం సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 4 రాష్ట్రాలకు చెందిన 16మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు గురువారం డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. తెలంగాణలోని సాంస్కృతిక వ్యవహారాలు, పోలీసింగ్ విధానంపై పలు విషయాలను ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆబ్కారీ శాఖ చేస్తున్న దర్యాప్తునకు తమ టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఇంటెలిజెన్స్ విభాగాలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. -
నో ఎంట్రీ పేరుతో దోచుకుంటున్నారు
పోలీసుల చర్యలపై డీజీపీకి లారీ యజమానుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సివిల్, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, అనుమతులున్నా తనిఖీల పేరుతో ఇష్టారా జ్యంగా వారు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆరోపించింది. ఈమేరకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఆ సంఘ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో సీజ్ చేసిన లారీలను కోర్టుకు కాకుండా స్టేషన్ నుంచి విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని అసోసియేషన్ కోరింది. ప్రమాదాల కేసుల్లో లారీల తప్పున్నా.. లేకున్నా.. పెద్ద వాహనం కాబట్టి కేసులు నమోదు చేస్తున్నారని, తప్పెవరిదో విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో సెక్షన్ 337, 338, 304ఏలో లారీ డ్రైవర్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. తనిఖీల సమయంలో అన్ని ధ్రువీకరణ పత్రాలు చూపించినా ట్రాఫిక్ పోలీసులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే డ్రైవర్లను ఇబ్బందులకు గురిచే స్తున్నారని ఆరోపించారు. జంటనగరాల్లో పగటి సమయాల్లో నో ఎంట్రీ ఉందని, అయితే ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర సర్వీస్ రోడ్డులో నో ఎంట్రీ పేరుతో ఇష్టారాజ్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. -
పోలీస్ శాఖలో జోన్ల లొల్లి
- రాష్ట్ర స్థాయి ఉద్యోగులుగా కానిస్టేబుళ్లు, ఎస్సైలు - నియామక పద్ధతులు మార్చాలని నిర్ణయం - విభేదిస్తున్న సీనియర్ ఐపీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో జోన్ల రద్దు సంక్షోభం మొదలైంది. రాష్ట్రంలో జోన్ల విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పోలీస్ శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ప్రస్తుతం పోలీస్ శాఖలో జిల్లా కేడర్‌లో ఉన్న కానిస్టేబుళ్లు, రేంజ్ కేడర్‌గా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లు, జోన్ల వారీగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు.. ఇక రాష్ట్ర కేడర్ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ ఇటీవల కీలక భేటీ నిర్వహించింది. ఇందులో ఒక్కో ఐపీఎస్ అధికారి ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం ఐపీఎస్ అధికారులు కానిస్టేబుళ్లను రాష్ట్ర ఉద్యోగులుగా మార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీని వల్ల శాంతి భద్రతల సమస్యలు, సీనియారిటీ వ్యవహారం, పదోన్నతులు, బదిలీల వ్యవçహారాల్లో ఇబ్బందులొస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కేడర్‌గా గుర్తించే వ్యవహారాన్ని విభేదిస్తున్నట్లు తేల్చిచెప్పారు. రాష్ట్ర స్థాయితో ప్రయోజనం? జిల్లా పరిధిలోనే పనిచేసేలా కానిస్టేబుళ్ల ఎంపిక జరుగుతుంది. అవసరమైతే డిప్యూటేషన్‌పై ప్రత్యేక విభాగాలకు బదిలీ చేసేవారు. అయితే ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో పనిచేయడం వల్ల పోలీస్స్టేషన్లలో ఎస్సైలను, ఇన్స్పెక్టర్లను లెక్కచేయట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుళ్ల వ్యవహారంపై ఇటీవల ఏకంగా కేబినెట్ భేటీలో సీనియర్ మంత్రి సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. ఒకే జిల్లాలో పనిచేయడం వల్ల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వీరి వల్లే ఎస్సైలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రతి పోస్టును రాష్ట్ర కేడర్‌గా పరిగణించాలని, జోన్ల రద్దులో ఈ విషయాన్ని చేర్చాలని డీజీపీని ఆదేశించినట్లు తెలిసింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. రాష్ట్ర కేడర్‌కు మారితే జిల్లా కేడర్‌కు చెందిన కానిస్టేబుల్ కానీ, రేంజ్ కేడర్‌కు చెందిన ఎస్సై కానీ అవినీతికి పాల్పడితే రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పనిష్మెంట్ కింద బదిలీ చేయొచ్చు. దీంతో వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చనేది ఓ వాదన. జిల్లాల విభజనకు ముందు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ రెండు జోన్లు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ నాలుగు రేంజ్లుండేవి. ఒక్కో రేంజ్ కింద 2 జిల్లాల యూనిట్లు ఉంటాయి. ఎస్ఐలను ఈ జిల్లాల పరిధిలోనే బదిలీ చేసే అవకాశం ఉండేది. పాత జిల్లాల ప్రకారం వరంగల్ జోన్ కింద 4, హైదరాబాద్ జోన్ కింద 5 జిల్లాలుండేవి. హైదరాబాద్, సైబరాబాద్ కూడా హైదరాబాద్ జోన్ కిందకు వచ్చేవి. ఎస్సైలకు గెజిటెడ్ హోదా! ఎస్సైలను రాష్ట్ర కేడర్‌గా గుర్తించడంలో పెద్దగా సమస్యలేవీ కన్పించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సీనియారిటీ లిస్ట్‌ను బ్యాచ్‌ల వారీగా పాటిస్తే ఇబ్బంది లేదని ఎస్సైలు చెబుతున్నారు. అయితే తమకు గెజిటెట్ హోదా కల్పిçస్తూ రాష్ట్ర కేడర్ చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఇన్స్పెక్టర్ల విషయంలో మాత్రం కోర్టుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. జోన్ల వారీగా ఉన్న తమకు పదోన్నతులు, సీనియారిటీలో న్యాయం జరగలేదని, రాష్ట్ర కేడర్‌గా చేస్తే సమస్య మరింత జఠిలమవుతుందని ఇన్స్పెక్టర్లు పేర్కొంటున్నారు. బ్యాచ్‌ల వారీగా కాకుండా సీనియారిటీ పేరుతో వరంగల్ జోన్లో ఉన్న వారికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తం చేస్తే మూకుమ్మడి సెలవులో వెళతామని, డీజీపీ సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. అభ్యంతరాలు పరిశీలిస్తాం జోన్ల రద్దుపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాం. జోన్ల రద్దు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. జోన్ల రద్దు, రాష్ట్ర కేడర్ ఉద్యోగుల లాభ నష్టాలపై అధ్యయనం చేస్తున్నారు. కానిస్టేబుళ్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వారిని రాష్ట్ర కేడర్ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు వారి బదిలీలు, పదోన్నతుల విషయంలో మాత్రం రేంజ్ వరకే పరిమితి చేయాలనే ఆలోచనను చాలా మంది ఐపీఎస్‌లు వ్యక్తంచేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. – డీజీపీ అనురాగ్‌శర్మ -
ఆకతాయిలపై కఠిన చర్యలకు కొత్త చట్టం
ప్రతిపాదనలను కేంద్రానికి పంపాం: డీజీపీ హైదరాబాద్: మహిళలను వేధించే ఆకతాయిలు, పోకిరీలపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఇందుకు ‘యాంటీ ఈవ్ టీజింగ్ యాక్ట్’పేరుతో మరింత కఠినమైన చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపినట్లు తెలిపారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్లో ‘బీ బోల్డ్ ఫర్ ఛేంజ్’పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత చట్టాల వల్ల పెద్దగా ఉపయోగం లేదని, స్వల్ప ఫైన్ చెల్లించి ఈవ్‌టీజర్లు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. తాము కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో కనీసం 10 వేల నుంచి 15 వేల అపరాధ రుసుము, జైలు శిక్ష ప్రతిపాదించినట్లు తెలిపారు. మహిళల రక్షణ, వారి హక్కులు కాపాడేందుకు పలు చట్టాలు అమలు అవుతున్నాయని, వాటిపై చదువుకున్నవారికి కూడా సరైన అవగాహన లేకపోవడం విచారకరమని అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా అన్నారు. మొత్తం పోలీసుల్లో మహిళలు 5 శాతం కంటే తక్కువగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. వరకట్న వ్యతిరేక చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమే అని డీజీపీ అన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్పర్సన్ కామినీ షరాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
జేజే యాక్ట్ అమలులో సవాళ్లు
- హైకోర్టు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ - 16–18 ఏళ్ల వారి నేరాల సంఖ్య పెరిగిపోతోంది - కేసుల విచారణకు న్యాయాధికారుల కొరత - ఉన్న వారే జేజే, పోక్సో కేసులనూ విచారిస్తున్నారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: జువెనైల్ జస్టిస్ చట్టం (జేజే యాక్ట్)–2015, లైంగిక నేరాల నుంచి పిల్లల సంరక్షణ చట్టం (పోక్సో యాక్ట్)–2012 అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో న్యాయాధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నారు. 16–18 ఏళ్ల వారి నేరాల సంఖ్య పెరిగిపోతోందని, పోక్సో కేసులూ పెరుగు తున్నాయన్నారు. ఈ కేసులను విచారించేందుకు తగిన సంఖ్యలో న్యాయాధికారులు లేరని, ఉన్న వారే మిగిలిన కేసులతోపాటు జేజే, పోక్సో కేసుల ను విచారించాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు ఈ కేసుల పరిష్కారం విషయంలో న్యాయాధికారులకు సహాయ, సహకారాలు అందడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ఎంసీహెచ్ ఆర్డీలో ఉమ్మడి హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వం, యునెస్కో సంయుక్త ఆధ్వర్యంలో జేజే, పోక్సో చట్టాలపై ఓ కార్యక్రమం నిర్వహించాయి. కార్యక్రమంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ కీలకోప న్యాసం చేశారు. జువైనల్ కేసుల పరిష్కారంలో డాక్టర్లు, సైకాలజిస్టుల పాత్ర కీలకమని, అయితే సైకాలజిస్టులు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. బాధిత పిల్లలకు న్యాయస్థానాల్లోని వాతావరణం వల్ల విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చేందుకే భయప డుతున్నారని, ఇది కేసు విచారణపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. బాధిత పిల్లలకు ఈ రకమైన భయాన్ని పోగొట్టేందుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణ నిమిత్తం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశామని వివరించారు. నేరం చేసిన బాలల వయస్సు నిర్ధారణ న్యాయాధికారులకు పెద్ద సమస్య అని జస్టిస్ రంగనాథన్ తెలిపారు. డాక్టర్ల సాయం లేనిదే వయస్సు నిర్ధారణ సాధ్యం కాదని, వయస్సు నిర్ధారణ అయితే తప్ప కేసులో ముందుకెళ్లడం కుదరదని పేర్కొన్నారు. కార్యక్ర మంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్, జస్టిస్ అంబటి శంకర నారాయణ, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, రిజిస్ట్రార్ (మేనేజ్మెం ట్) డి.నాగార్జున, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు, పలువురు న్యాయాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కుటుంబాల్లోనే ఎక్కువగా లైంగిక దాడులు: డీజీపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, బాలలపై లైంగిక దాడులకు సంబంధించి ఈ ఏడాది 464 కేసులు నమోదయ్యాయని, కుటుంబాల్లోనే లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా పిల్లల పాఠ్యపుస్తకాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ముద్రించి ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సోనికుట్టీ జార్జ్ మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
తెలంగాణలో మావోయిస్టులు అడుగుపెట్టలేరు
భూపాలపల్లి జిల్లాలో త్వరలో రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలు మేడారంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు- డీజీపీ అనురాగ్‌శర్మ భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు అడుగుపెట్టలేరని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు, జిల్లా పోలీసు కార్యాలయాలను శుక్రవారం పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ మొబైల్ కంట్రోల్ రూంను ప్రారంభించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో సమావేశమైన అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తూ, మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు. భద్రతాపరంగా తాము రాజీ పడేది లేదన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో త్వరలోనే రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మేడారంలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తానని అన్నారు. మేడారం జాతరను దిగ్విజయంగా జరిపేందుకు జిల్లా పోలీసులు పకడ్భందీ ప్రణాళికలు రూపొందించాలని డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి బహుమతులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్‌హెగ్డే, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు శ్రీనివాస్, కెఆర్కె ప్రసాద్ పాల్గొన్నారు. -
నయీం ఖాకీలకు చార్జిమెమోలు!
14 మందికి జారీ చేసిన డీజీపీ కార్యాలయం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి డీజీపీ కార్యాలయం చార్జిమెమోలు జారీ చేసినట్టు తెలిసింది. నయీంతో అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను సస్పెండ్ చేసిన డీజీపీ అనురాగ్ శర్మ.. మైనర్ పనిష్మెంట్ల కింద 14 మందికి చార్జిమెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నయీంతో కలిసి ఎందుకున్నారు, అతడికి మీకు సంబంధం ఏంటి, సిట్ దగ్గరున్న ఆధారాలపై మీ వివరణ ఏంటి.. అనే అంశాలను చేరుస్తూ వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ మెమోలపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. సంబంధిత అధికారిగానీ, సిబ్బందిగానీ ఇచ్చే వివరణ సరిగ్గా లేకుంటే తదుపరి చర్యలకు వెళ్లే అవకాశం ఉంటుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు. లైట్ తీసుకో..: మరోవైపు నయీం కేసులో ఇక పోలీస్ శాఖ గానీ, ప్రభుత్వం గానీ ముందుకు వెళ్లే వీలు లేదని చార్జిమెమోలు అందుకున్న అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. సస్పెన్షన్పైనే తీవ్రమైన ఒత్తిడి ఉందని, చార్జిమెమోలు సూత్రప్రాయంగా ఇచ్చినవేనని, అంతకు మించి ఇందులో తదుపరి చర్యలకు వెళ్లే ప్రసక్తే లేదని ఓ డీఎస్పీ స్పష్టంగా చెబుతున్నారు. -
తెలంగాణ పోలీస్‌కు దేశవ్యాప్త గుర్తింపు: డీజీపీ
పోలీస్ క్రీడాకారులకు రూ.70 లక్షల నగదు పురస్కారం సాక్షి, హైదరాబాద్: పోలీస్ క్రీడాకారులు సాధించిన పతకాలతో దేశం మొత్తంలో తెలంగాణ పోలీస్‌కు ఆల్‌రౌండర్‌గా గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆలిండియా స్పోర్ట్స్ డ్యూటీ మీట్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన 105 మంది పోలీస్ క్రీడాకారులకు రూ.70 లక్షల నగదు పురస్కారాలను బుధవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా జపాన్, కెనడా, ఇటలీ తదితర దేశాల నుంచి ఫైరింగ్ ఆర్మ్స్ను రూ.2.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని, దీనికి తగ్గట్టుగా ఫలితాలు రావాలని ఆశిద్దామని పేర్కొన్నారు. మంచి ఫలితాలు రాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పోలీస్ క్రీడాకారులను ముందు నుంచి తోడ్పాటు అందిస్తున్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదీతోపాటు స్పోర్ట్స్ ఐజీ శ్రీనివాస్‌రావులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. దేశంలోనే ది బెస్ట్ డాగ్ అనిపించిన రీటా సైతం రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని అందుకోవడం విశేషం. కార్యక్రమంలో పోలీస్ అధికారులు గోపీకృష్ణ, రవిగుప్తా, శివధర్‌రెడ్డి, మల్లారెడ్డి, నాగిరెడ్డి, సంజయ్‌కుమార్ జైన్, సౌమ్యా మిశ్రా, షికా గోయల్, చారు సిన్హా, రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ పోలీసుకు దేశవ్యాప్త గుర్తింపు: డీజీపీ
హైదరాబాద్: పోలీస్ క్రీడాకారులు సాధించిన పతకాలతో దేశం మొత్తంలో తెలంగాణ పోలీసుకు ఆల్‌రౌండర్‌గా గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. ఆలిండియా స్పోర్ట్స్ డ్యూటీ మీట్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన 105 మంది పోలీస్ క్రీడాకారులకు రూ.70 లక్షల నగదు పురస్కారాలను పోలీస్ ముఖ్య కార్యాలయంలో బుధవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా జపాన్, కెనడా, ఇటలీ తదితర దేశాల నుంచి రూ.2.5 కోట్లు వెచ్చించి ఫైరింగ్ ఆర్మ్స్ను కొనుగోలు చేశామని, దీనికి తగ్గట్టుగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నానని అన్నారు. మంచి ఫలితాలు రాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పోలీస్ క్రీడాకారులను ముందు నుంచి తోడ్పాటు అందిస్తున్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదీతోపాటు స్పోర్ట్స్ ఐజీ శ్రీనివాస్‌రావులను డీజీపీ అభినందించారు. దేశంలోనే ది బెస్ట్ డాగ్ అనిపించిన రీటా సైతం రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని అందుకోవడం విశేషం. కార్యక్రమంలో పోలీస్ అధికారులు గోపీకృష్ణ, రవిగుప్తా, శివధర్‌రెడ్డి, మల్లారెడ్డి, నాగిరెడ్డి, సంజయ్‌కుమార్ జైన్, సౌమ్యా మిశ్రా, షికా గోయల్, చారు సిన్హా, రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయంలో నయీమ్ ఖాకీలు!
- అమెరికా వెళ్లేందుకు అనుమతికోసం విశ్వప్రయత్నం - ఓ మంత్రితో ఏకాంతంగా భేటీ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ఆరోపణలతో సస్పెండైన ఇద్దరు పోలీసు అధికారులు సోమవారం సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. నయీమ్‌తో అంటకాగారని, పలు దందాలకు సహకరిం చారనే ఆరోపణల నేపథ్యంలో దాదాపు నెల రోజుల కింద ఐదుగురు పోలీసు అధికారులను డీజీపీ అనురాగ్‌శర్మ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వెలుగులోకి రాని అధికారులు ఇలా సచివాలయంలో కనిపించడంతో మీడియా, ఇతర పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. అమెరికా వెళ్తాం.. అనుమతి కావాలి నయీమ్ కేసులో సస్పెండైన అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌రావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావు సోమవారం సచివాలయానికి వచ్చారు. వ్యక్తిగత కారణాల రీత్యా అమెరికా వెళ్లేందుకు అనుమతి కావాలంటూ ఇటీవల వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని.. ఆ అనుమతి వ్యవహారం ఎంతవరకు వచ్చిందనేది తెలుసుకునేందుకు సచివాలయానికి వచ్చారని వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. సచివాలయంలోని సి బ్లాక్‌లో ఉన్న సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లోకి వెళ్లిన ఈ ఇద్దరు అధికారులు... తమ విదేశీ పర్యటన అనుమతిపై ఆరా తీశారని, అయితే ఆ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపామని జీఏడీ అధికారులు చెప్పారని సమాచారం. సీఎం కార్యాలయం నుంచి అనుమతిపై స్పష్టత రాగానే ఆదేశాలిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. మంత్రితో ఏకాంతంగా భేటీ? ఈ ఇద్దరు పోలీసు అధికారులు జీఏడీకి వెళ్లడానికి ముందుగా... తొలి నుంచీ తమ వాదనను బలపరుస్తున్న ఓ సీనియర్ మంత్రితో ఏకాంతంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. తమ విదేశీ పర్యటనకు అనుమతిప్పించేలా ప్రయత్నించాలని ఆ మంత్రికి మొరపెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. సస్పెన్షన్ వ్యవహారంపై ఇప్పటికే రగిలిపోతున్న ఆ సీనియర్ మంత్రి.. ఈ ఇద్దరు అధికారుల తరఫున పైరవీకి సిద్ధమైనట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. అయితే.. నయీమ్ కేసులో సస్పెన్షన్‌లో ఉన్న అధికారులు.. హైదరాబాద్ విడిచివెళ్లేందుకు డీజీపీ అనురాగ్‌శర్మ నుంచి అనుమతి రావాల్సి ఉందని ఉన్నతా« దికారులు అభిప్రాయపడ్డారు. నయీమ్ కేసు విచారణలో ఉన్న సమయంలో ఆరోపణలున్న అధికారులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొంటున్నారు. -
అధికారుల కృషి వల్లే ఆ గుర్తింపు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. డీజీపీ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 75 ఉత్తమ సేవాపతకాలు, 55 పోలీస్ మెడల్స్‌ను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు వినూత్నమైన కార్యాచరణతో పోలీస్ శాఖ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రానికి 26 గ్యాలంటరీ అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులను 2016 స్వాతంత్య్ర దినోత్సవం నాడు అందజేశారు. -
నయీమ్ కేసులో మంత్రాంగం!
- సీనియర్ మంత్రిని రంగంలోకి దించిన ‘నయీమ్ ఖాకీలు’ - ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానని వారికి మంత్రి హామీ సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు తదుపరి చర్యల నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. నయీమ్‌తో లింకులపై మౌఖిక విచారణ, క్రిమినల్ కేసుల నుంచి బయటపడేందుకు ఓ రిటైర్డ్ డీజీపీ ద్వారా ఒత్తిడి తేవాలనుకున్నా అది బెడిసికొట్టడంతో తాజాగా కులంకార్డును తెరపైకి తెచ్చారు. ఈ కేసులో సామాజికవర్గపరంగా కేవలం తమను మాత్రమే టార్గెట్ చేసి మిగతా అధికారులను మైనర్ పనిష్మెంట్లతో సరిపెట్టి కాపాడారని ఆరోపిస్తూ ఓ సీనియర్ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమను గట్టెక్కించాలని ఆరుగురు అధికారులు మంత్రిని కలసి వేడుకున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీజీపీయే టార్గెట్... ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలోనూ ఇప్పటివరకు తమ వర్గం అధికారులను ఏ ప్రభుత్వం టార్గెట్ చేయలేదని, చేసేందుకు కూడా ప్రయత్నించలేదని ఆరోపణలెదుర్కుంటున్న అధికారులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇదే తరుణంలో డీజీపీ అనురాగ్ శర్మపైనే ఫిర్యాదు చేయాలని సీనియర్ మంత్రికి సంబంధిత అధికారులు సూచించారని తెలిసింది. నయీమ్ కేసులో ఎనిమిది నెలల నుంచి చర్యలకు సాహసించని డీజీపీ ఒకేసారి ఇంత మంది అధికారులపై వేటు వేయడం వెనకున్న అసలు నిజాలు బయటకు రావాలని మంత్రి భావిస్తున్నారని తెలిసింది. దీనంతటికీ ప్రధాన కారణంగా ఉన్న డీజీపీ అనురాగ్ శర్మపై నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయాలని సీనియర్ మంత్రి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సస్పెండ్ అయిన ఐదుగురిలో ముగ్గురు, విచారణ ఎదుర్కోనున్న మరో ముగ్గురు అధికారులు ఒకే సామాజికవర్గం వారు కావడంతో సీఎం వద్దే తేల్చుకుంటానని మంత్రి వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
గ్యాంగ్ నయీమ్
-
గ్యాంగ్ నయీమ్
♦ ఐదుగురు ఖాకీల సస్పెన్షన్ ♦ మరో 20 మంది పోలీసు అధికారుల విచారణ.. ♦ ఆరోపణలు రుజువైతే వారిపైనా వేటు ♦ అప్పటివరకు విధుల నుంచి తొలగించి వీఆర్‌లో ఉంచాలని డీజీపీ ఆదేశం ♦ సస్పెండ్ అయినవారిలో అదనపు ఎస్పీ, ఇద్దరు ఏసీపీలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో పోలీస్ అధికారులపై ఎట్టకేలకు వేటు పడింది! నయీమ్‌తో చేతులు కలిపి కోట్లు గడించిన ఖాకీలపై పోలీస్ శాఖ కొరడా ఝళిపించింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది పోలీస్ అధికారులపై డీజీపీ అనురాగ్ శర్మ చర్యలు తీసుకున్నారు. వారిలో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేయగా, మిగతావారిపై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలతోపాటు విచారణకు ఆదేశిస్తూ గురువారం ఆదేశాలు వెలువరించారు. ప్రభుత్వంపైనే ఒత్తిడి కిందటేడాది ఆగస్టు 8న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ శివారులో నయీమ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతడి ఆస్తులు, దందాలు, సెటిల్మెంట్లు, భూకబ్జాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే విచారణ నుంచి తప్పించుకునేందుకు, సస్పెన్షన్ వేటు పడకుండా ఉండేందుకు పలువురు అధికారులు ఏకంగా ప్రభుత్వంపైనే ఒత్తిడి తెచ్చారు. కొన్నాళ్లపాటు నయీమ్ కేసు మూతపడిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే పోలీస్ ఉన్నతాధికారులు రెండ్రోజుల క్రితం ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నయీమ్ తో అంటకాగిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి పొందినట్టు తెలిసింది. వారిపై చర్యలు తీసుకోకుంటే పోలీస్ విభాగంపైనే అపవాదు ఉండిపోతుందని,నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా పదోన్నతుల్లో అందలం ఇచ్చారన్న ఆరోపణలెదుర్కోవడం ప్రభుత్వానికి కూడా మంచిది కాదని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆరోపణలు రుజువైతే వేటే.. నయీమ్‌తో కలిసి సెటిల్మెంట్లు చేయించుకోవడం, ఫ్లాట్లు గిఫ్టులుగా పొందడం, లంచాలు తీసుకోవడం.. తదితర కార్యక్రమాలకు అలవాటుపడ్డ వారిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. అప్పటివరకు వారిని విధుల్లో నుంచి తొలగించి వీఆర్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. విచారణలో ఆరోపణలు రుజువైతే వారిపై కూడా సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ ఎదుర్కోవాల్సిన అధికారులు వీరే.. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ చంద్రశేఖర్, మహబూబ్‌నగర్ ట్రైనింగ్ కాలేజీ డీఎస్పీ సాయి మనోహర్, ఇల్లందు డీఎస్పీ ప్రకాశ్‌రావు, జెన్కో డీఎస్పీ వెంకట నర్సయ్య, పోలీస్ అకాడమీలో ఉన్న డీఎస్పీ అమరేందర్‌రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న, మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఇన్స్పెక్టర్ కిషన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికిరణ్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, టాస్క్‌ఫోర్స్ నార్త్‌జోన్ ఇన్స్పెక్టర్ బల్వంతయ్య, ఇన్స్పెక్టర్ రవీందర్, ఇన్స్పెక్టర్ సూర్యప్రకాశ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ మాజిద్, హెడ్‌కానిస్టేబుళ్లు ఆనంద్, మహ్మద్ మియా, కానిస్టేబుల్ బాలయ్య. పదోన్నతుల ముందు కలకలం రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. ఇన్స్పెక్టర్ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ వరకు పదోన్నతుల ప్రక్రియను పోలీస్ శాఖ ఇప్పటికే వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నయీమ్ కేసులో అంటకాగిన అధికారులకు కూడా పదోన్నతులు కల్పిస్తే పోలీస్ శాఖ నైతిక విలువ దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ వర్గాలతో చర్చించారు. కేవలం 25 మంది అధికారుల వల్ల మిగిలినవారికి అన్యాయం చేసిన వారిమవుతామని వివరించినట్టు తెలిసింది. దీనితో వీరి సస్పెన్షన్, విచారణ నిర్ణయంతో పదోన్నతులకు సైతం లైన్‌క్లియర్ అయ్యిందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతులు కల్పించి, తదుపరి దశలో డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ పదోన్నతులు కల్పించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మా దగ్గర ఆధారాలున్నాయి నయీమ్‌తో అంటకాగినట్టు ఆరోపణలు మోపి చర్యలు తీసుకున్న అధికారుల ఎదుట త్వరలోనే అసలు అధికారులకు సంబంధించిన అధారాలు పెడతామని సస్పెన్షన్‌కు గురైన పలువురు అధికారులు స్పష్టం చేశారు. తాము మాత్రమే సస్పెన్షన్‌కు గురవడం, మిగతా వారికి ఎలాంటి సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సరి కాదని, తామేమీ నయీమ్‌తో వ్యక్తిగత పనులు చేయించుకోలేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టులను ఏరివేసేందుకు నయీమ్‌ను పెంచి పోషించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకపోవడం పారదర్శకమైన చర్య ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామని పలువురు అధికారులు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది. -
నయీం కేసులో మరో కొత్త మలుపు
-
నయీం కేసులో మరో కొత్త మలుపు
గ్యాంగ్‌స్టర్ నయీం కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. సీఐడీ అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్ (మీర్‌చౌక్), సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మస్తాన్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో మద్దిపాటి శ్రీనివాస్ పేరు చాలా సందర్భాల్లో బహిరంగంగానే వినిపించింది. మొత్తం 25 మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఐదుగురిని సస్పెండ్ చేయగా, నలుగురిపై మౌఖిక విచారణ జరగనుంది, 16 మందిని స్వల్ప శిక్షలతో సరిపెడుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నయీం కేసు మరోసారి వెలుగులోకి రావడం, అందులో పోలీసులపై చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. -
19న రాష్ట్ర స్థాయి పోలీస్ సదస్సు
-
19న రాష్ట్ర స్థాయి పోలీస్ సదస్సు
ఎస్ఐ నుంచి డీజీపీ వరకు అందరితో సీఎం సమావేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈనెల 19న రాష్ట్రస్థాయి పోలీస్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం 11 నుంచి జరిగే విస్తృత సదస్సులో వివిధ స్థాయిల పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి స్వయంగా చర్చిస్తారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలైన పోలీసు అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలని సీఎం భావిస్తున్నారు. పోలీసు శాఖను మరింత బలోపేతం చేయడానికి, సమాజానికి ఉపయోగపడేవిధంగా మరిన్ని కార్యక్రమాలను పోలీసు శాఖ ద్వారా చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు సామాజిక దురాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు, మోసాలు, ప్రమాదాలు, మాఫియా శక్తుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపైనా విస్తృతంగా చర్చించాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులతో మాట్లాడితేనే కష్టనష్టాలు, వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ముఖ్యమంత్రే స్వయంగా అందరు అధికారులతో మాట్లాడాలని నిర్ణయించారు. అన్ని స్థాయిల అధికారులకు ఆహ్వానం శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ స్థాయి నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల పోలీసు అధికారులను, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను ఈ సదస్సుకు ఆహ్వానించాలని డీజీపీ అనురాగ్ శర్మను సీఎం ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఫర్నిచర్ ఉందా? భవనం పరిస్థితి ఏంటి? ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో గుడుంబా, పేకాట, సట్టా తదితర అసాంఘిక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయా? డ్రగ్స్, గంజాయిని పూర్తిస్థాయిలో ఎలా అదుపు చేయాలి? మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అమ్మే దుర్మార్గాన్ని ఎలా అరికట్టాలి? వ్యభిచార గృహాలెక్కడైనా నడుస్తున్నాయా? ఎస్సీ, ఎస్టీలకు ఎదురయ్యే అవమానాలు, అఘాయిత్యాల విషయంలో ఎలా స్పందిస్తున్నారు? ఇతర నేరాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి, పరిష్కార మార్గాలు ఆలోచించనున్నారు. ఈ సదస్సుకు అధికారులు సమగ్ర వివరాలతో హాజరు కావాలని సీఎం కోరారు. -
కానిస్టేబుళ్లకు సరికొత్త శిక్షణ
ట్రైనీలకు ‘క్రావ్ మగ’ ఆత్మరక్షణ కోర్సు: డీజీపీ అనురాగ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరిగిన పోలీసు నియామకాల్లో ఎంపికైన కానిస్టే బుళ్లకు సరికొత్త మాడ్యుల్‌తో శిక్షణ మొదలైంది. గతంలోని మూస శిక్షణ పద్ధతులకు స్వస్తి పలుకుతూ పూర్తిస్థాయిలో శిక్షణ షెడ్యూల్‌ను అందుబా టులోకి తెచ్చారు. పెరుగుతున్న టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంశాలను దృష్టిలో పెట్టు కొని పోలీసు సిబ్బంది మాన సిక స్థితిగతు లను కూడా అభివృద్ధి చేసే దిశగా రెండు సెమిస్టర్ల శిక్షణ విధానాన్ని ప్రవేశపెట్టారు. రెండు సెమిస్టర్లు: 9 నెలలపాటు 7,379 మంది సిబ్బందికి సాగే శిక్షణలో జీవన నైపుణ్యాలు, కమ్యూనిటీ పోలీ సింగ్, పబ్లిక్ స్పీకింగ్, ఇజ్రాయెల్ సిబ్బందికి ఇచ్చే ‘క్రావ్ మగ’ ఆత్మరక్షణ, చిన్నారులపై లైంగిక వేధింపులు –నియంత్రణ, మనుషుల అక్రమ రవాణా, జెండర్ అవేర్నెస్, నైపు ణ్యాలు, సైబర్ క్రైమ్స్, ఆర్థిక నేరాలు–దర్యాప్తు తీరుతె న్నులుంటాయని డీజీపీ అనురాగ్‌శర్మ వెల్ల డించారు. వీటితో పాటు నేరాలు, నియం త్రణకు మార్గదర్శ కాల మీద దృష్టిపెట్టినట్లు డీజీపీ తెలిపారు. చివరగా సిబ్బంది మొత్తా నికి సైకోథెరపిస్టు –మెంటరింగ్, ప్రజలతో ఎలా వ్యవహరిం చాలన్న అంశంలో ముఖా ముఖి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంపికైన వారికి ల్యాప్ ట్యాప్ అందజేస్తున్నామన్నారు. -
రూ. 65 కోట్లు కాదు.. 316 కోట్లు
బోధన్ స్కామ్‌పై సీఐడీ నివేదిక.. - 2005 నుంచే అక్రమాలు - శివరాజు విచారణలో సంచలన అంశాలు వెల్లడి సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి పుట్ట పగలబోతోంది. సర్కిల్ కార్యాలయాల్లో సాగిన దందా కేంద్ర కార్యాలయం వరకు విస్తరించినట్టు సీఐడీ ఆధారాలతో సహా నిరూపించబోతోంది. అధికారులు బ్రోకర్లు కలసి చేసిన ఈ స్కాంపై సీఐడీ కీలక అంశాలను ఏ1గా ఉన్న శివరాజు నుంచి రాబట్టగలిగింది. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కుంభకోణం ఇప్పటిది కాదని, 15 ఏళ్ల నుంచి నడుస్తోందని పూసగుచ్చినట్టు సీఐడీ అధికారులకు శివరాజు చెప్పినట్టు తెలిసింది. పాత్రదారులు ఎవరు... శివరాజుతో కుమ్మౖక్కై కోట్లు గడించిన అధికారుల పాత్ర ఏంటన్న అంశాలపై సీఐడీ రాష్ట్ర డీజీపీ పూర్తి నివేదిక సమర్పించారు. కేంద్ర కార్యాలయం నుంచే... బోధన్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్... ఈ నాలుగు సర్కిల్ కార్యాలయాలను డీసీటీవో కంటే శివరాజే ఎక్కువగా ఆపరేట్ చేసినట్టు సీఐడీ గుర్తిం చింది. గతంలో డీసీటీవోలుగా పనిచేసిన అధికారులు ప్రస్తుతం కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారని, మరికొంత మంది బదిలీ అయి ఇతర విభాగాలకు వెళ్లిపోయా రని, వారి పేర్లతో సహా శివరాజు బయటపెట్టి నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. గతం లో ఈ విభాగంలో పనిచేసిన నలుగురు ఐఆర్ ఎస్ అధికారులు కుట్రలో ప్రధాన భాగస్వా ములయ్యారని విచారణలో బయటపడినట్టు తెలిసింది. వీరి ద్వారా కేంద్ర కార్యాలయంలో సర్కిల్ కార్యాలయాల్లోని ఆడిటింగ్ ఫైళ్లను పరిశీలించకుండా చేశాడని సీఐడీ గుర్తించింది. 2012 నుంచి కాదు... వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్లో 2012 నుంచి కుంభకోణం జరిగిందని ఆ విభాగం కమిషనర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కానీ 2005 నుంచి స్కాం జరిగినట్టు సీఐడీ విచారణలో గుర్తించింది. అలాగే... రూ.65కోట్లు మాత్రమే నకిలీ చలాన్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని వాణిజ్య పన్నుల శాఖ తెలుపగా, రూ.316 కోట్ల కుంభకోణం జరిగిందని సీఐడీ దర్యాప్తు బృందాలు డీజీపీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత భారీతేడా ఉన్నా వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు గుర్తించకపోవడంపై సీఐడీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. అధికారులకు బంపర్ ఆఫర్లు... శివరాజు నిజామాబాద్‌ను కేంద్రంగా చేసుకొ ని దందా సాగించాడు. అతడికి సహకరించిన ఏసీటీవోలు, డీసీటీవోలు, అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లకు ఆరు నెలలకోసారి ఆఫర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక, ముంబై.. ఇలా టూర్ ప్యాకేజీలు ఇచ్చి దగ్గరుండి స్కాం పనులు చక్కబెట్టుకున్నట్టు విచారణలో బయటపడింది. ఇలా శివరాజుకు సహకరించిన 16 మంది అధికారుల జాబితా ను నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. వివరాలివ్వడంలోనూ జాప్యం... స్కాం విచారణ మొదలుపెట్టిన నాటి నుంచి సీఐడీ అడిగిన ఏ వివరాలనూ వాణి జ్య పన్నుల శాఖ తమకు అందించలేదని సీఐడీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చీఫ్ సెక్రెటరీ ఆదేశించిన తర్వాతే వివరాలు అందించారన్నారు. ఈ జాప్యం వెనుక అసలు కోణాలు శివరాజు విచారణలో బయటపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. కేసుల నమోదుకు రంగం సిద్ధం... శివరాజుకు సహకరించి ప్రభుత్వ ఖజానా ను జేబులోకి మళ్లించుకున్న 16 మంది అధికారులపై సీఐడీ ఇప్పుడు నజర్ పెట్టిం ది. సీఎం శాఖ కావడం, పైగా 15 ఏళ్ల నుంచి స్కాం జరుగుతుంటే పట్టించుకోక పోవడంపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. దీనితో వీరిపై కేసులు నమోదు చేసి విచారించాలని సీఐడీ భావిస్తోంది. ఇందుకు అన్ని ఆధారాలను సిద్ధంచేసి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆధారాలను బట్టి ముందుకెళ్తున్నాం: డీజీపీ అనురాగ్‌శర్మ బోధన్ వాణిజ్య పన్నుల శాఖ స్కాంలో సీఐడీ వేగవంతంగా విచారణ సాగిస్తోంది. అరెస్టయిన వారి నుంచి సేకరించిన వివరా లను బట్టి మరికొంత మందిని విచారించా ల్సి ఉంది. స్కాంలో ఆరోపణలెదుర్కుంటు న్న వారికి నోటిసులిచ్చి వాంగ్మూలాలు నమోదు చేయాలి. శివరాజు చెప్పిన అంశాలపై మరికొంత స్పష్టత, మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఎంతటి అధికారులైనా స్కాంలో పాత్రదారులని తేలితే అరెస్ట్ చేయక తప్పదు. -
నేరాల నియంత్రణను గాలికొదిలేశారు!
- పలువురు ఎస్పీలు/కమిషనర్లపై ఉన్నతాధికారుల ఆగ్రహం - సున్నితమైన కేసులను వివాదాస్పదం చేస్తున్నారు.. - చిన్న జిల్లాల ఏర్పాటును అర్థం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి - పనితీరు మార్చుకోవాలని డీజీపీ ఆదేశం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవలు, పాలన సౌలభ్యంకోసం ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించింది. అయితే ఈ అంశాన్ని పట్టించుకోవడంలో పలువురు ఎస్పీలు/ కమిషనర్లు విఫలమవుతున్నారని పోలీస్ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా కమిషనర్లు, ఎస్పీలు అయిన అధికారులు కేవలం స్వంత పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని, నేరాల నియంత్రణను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు పోలీస్ బాస్‌లను తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్టు తెలుస్తోంది. భూపాలపల్లిలో జరిగిన దుప్పులవేట కేసులో సరైన రీతిలో సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయలేకపోయారని, దీనితో కేసులో రాజకీయ నేతలుండటం వల్లే కేసు పక్కదారి పట్టించారన్న ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్లయిందని భావిస్తున్నారు. దీనితో జిల్లా బాధ్యులుగా ఉన్న అధికారులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులను దగ్గరుండి పర్యవేక్షించాల్సింది పోయి, పట్టించుకోకుండా ఉన్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో డీజీపీ అనురాగ్‌శర్మకు పలు రాజకీయ పార్టీల నేతలు ఫిర్యాదు కూడా చేశారు. పనితీరు సరిగ్గా ఉంటే ఇలాంటి ఆరోపణలు రావని, ఇక నుంచి సరైన రీతిలో స్పందించాలని డీజీపీ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మంథని కేసులో వైఫల్యం... మంథనిలో జరిగిన మధుకర్ మృతి వ్యవహారంలో కమిషనరేట్ ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే విషయం వివాదాస్పదమైందని ఉన్నతాధికా రులు భావిస్తున్నారు. ఘటన జరిగి.. పోస్టుమార్టం అయిన తర్వాత ఆందోళనలు చోటు చేసుకోవడం, రాజకీయంగా కేసులో ఒత్తిడి రావడం.. తదితర అంశాలను పట్టించుకోకుండా కమిషనరేట్ అధికారులు వ్యవహరించారని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. మధుకర్ మృతి కేసులో సంఘటన స్థలానికి కూడా కమిషనర్ వెళ్లకపోవడం, పైగా కొత్తగా విధుల్లో చేరిన ఏసీపీపైనే భారం వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డీజీపీ అనురాగ్ శర్మ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో డీజీపీ స్వయంగా కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. బాధితుడి కుటుంబాన్ని కలసి విచారణపై నమ్మకం కల్గించేలా దైర్యం చెప్పాలని సూచించడంతో అప్పటికప్పుడు కమిషనర్, మధుకర్ గ్రామానికి వెళ్లినట్టు తెలిసింది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా పనితీరులో కూడా ప్రతిభ చూపాలని ఉన్నతాధికారులు ఎస్పీలు/కమిషనర్లకు సూచించినట్టు తెలిసింది. పర్యవేక్షణ లోపమే.. ఏ జిల్లాలో అయినా సున్నితమైన కేసులు, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు జరిగే కేసులు ఉన్నట్టయితే వెంటనే సంబంధిత ఎస్పీ/కమిషనర్ ఆ విషయాన్ని డీఐజీ, ఐజీ, డీజీపీకి చేరవేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న చాలా మంది ఎస్పీలు, కమిషనర్లు ఏ విషయాన్ని కూడా తగిన పద్ధతిలో ఉన్నతాధికారులకు చెప్పడం లేదని డీజీపీ కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులు కూడా పెద్దగా జిల్లాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, ఇక నుంచి ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది. -
రాష్ట్రంలో ‘అగ్రిగోల్డ్’ కదలిక!
- ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోరాటంతో ఇక్కడ కేసులపై సమీక్ష - డీజీపీ అనురాగ్ శర్మతో ఏపీ సీఐడీ చీఫ్ భేటీ - తెలంగాణలోని ఆ సంస్థ ఆస్తుల స్వాధీనానికి కసరత్తు సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అగ్రిగోల్డ్ ఆస్తులు, వేలం పాటకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పోరాటంతో.. తెలంగాణలోనూ ఆ సంస్థ ఆస్తుల స్వాధీనానికి సీఐడీ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం డీజీపీ అనురాగ్ శర్మ ఆధ్వర్యంలో కీలక సమీక్ష జరిగింది. ప్రస్తుతం ఏపీలో అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనం, వేలం పాటపై డీజీపీ అనురాగ్ శర్మ వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా తెలంగాణలో అగ్రిగోల్డ్ సంస్థపై ఉన్న కేసులు, డిపాజిట్ దారులు, స్వాధీనం చేసుకోవాల్సి ఆస్తులు, చెల్లించిన మొత్తాన్ని ఏ విధంగా అందజేయాలన్న అంశాలపై సమీక్షించినట్టు తెలిసింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి శనివారం రెండు రాష్ట్రాల డీజీపీలు, రెండు రాష్ట్రాల సీఐడీ ఉన్నతాధికారులు భేటీ కావాలని నిర్ణయించారు. రెండు కేసులు.. నాలుగేళ్లుగా పెండింగ్ అగ్రిగోల్డ్‌కు సంబంధించి తెలంగాణలో ఇప్పటివరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని సీఐడీ అధికారులు చెప్పారు. నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్‌స్టేషన్‌లో 2013లో ఒక కేసు నమోదు కాగా, 2015లో సీఐడీ విభాగంలో మరో కేసు నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులు నమోదై ఏళ్లు గడుస్తున్నా.. సీఐడీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2.5 లక్షల మంది డిపాజిట్‌దారులు రాష్ట్రంలో 2.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని సీఐడీ అధికారులు గుర్తించారు. వీరంతా సుమారు రూ.460 కోట్ల వరకు డిపాజిట్లు చేశారని తేల్చారు. ఈ మేరకు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించాలని.. ఏపీ సీఐడీ స్వాధీనం చేసుకోకుండా మిగిలిన ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తే డిపాజిట్ దారులకు న్యాయం జరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్‌కు సంబంధించి మహబూబ్‌నగర్ (పాత) జిల్లాలోని బాల్నగర్, గద్వాల, జడ్చర్ల, నల్లగొండ(పాత) జిల్లాలోని చౌటుప్పల్, మిర్యాలగూడ, ఖమ్మం, రంగారెడ్డిలోని గచ్చిబౌలిలలో ఆస్తులున్నాయని సీఐడీకి ఫిర్యాదు చేసిన బాధితులు పేర్కొన్నారు. దీంతో ఆ ఆస్తుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎంత వరకు స్వాధీనం చేసుకోవచ్చనే అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. సీఐడీ దర్యాప్తుపై నమ్మకం లేదు రెండు రాష్ట్రాల్లో సీఐడీ చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఆలిండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అండాల్ రమేష్‌బాబు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని, డైరెక్టర్లు ఇంకా పరారీలోనే ఉన్నట్టు సీఐడీ చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఆస్తులను కూడా జప్తు చేసి వేలం పాటలో చూపాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. రోజుకో ఏజెంటు, బాధితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారానే తెలంగాణలో అగ్రిగోల్డ్ కేసులను విచారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కేసులన్నీ ఆన్లైన్!
⇒ ఫిర్యాదులు, కేసుల స్థితిపై ఫిర్యాదుదారుల సెల్‌ఫోన్‌కు సందేశాలు ⇒ సీసీటీఎన్ఎస్ గోలైవ్ ప్రాజెక్టుతో టెక్నాలజీ పోలీసింగ్ సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖ ప్రజలకు మరింత చేరువయ్యేలా, ఫిర్యాదులు, కేసుల స్థితిని సులభంగా తెలుసుకునేలా.. రాష్ట్ర పోలీస్ శాఖ ‘సీసీటీఎన్ఎస్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్నాళ్లూ ఫిర్యాదులు, కేసుల పరిస్థితి ఏ స్థితిలో ఉందనేది తెలుసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. దీనికి ‘సీసీటీఎన్ఎస్’ ద్వారా పరిష్కారం లభించనుంది. ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్‌లు ఎవరైనా ఫిర్యాదు చేసిన నిమిషాల్లోనే పిటిషన్ నంబర్, తదితర వివరాలతో ఫిర్యాదుదారు సెల్‌ఫోన్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ అందుతుంది. 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ కాపీతో సహా ఫిర్యాదుదారుల ఈ– మెయి ల్ ఐడీకి, మొబైల్‌కు పంపించనున్నారు. ఇక ‘సీసీటీ ఎన్ఎస్’లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల నుంచి డీజీపీ కార్యాలయంలోని పీసీఎస్ (పోలీస్ కంప్యూటర్ సర్వీస్) సర్వర్లకు ప్రతి పిటిషన్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ, సీడీ (కేస్ డైరీ) తదితర 14 రకాల కాపీలను అప్లోడ్ చేస్తారు. నిత్యం వచ్చే పిటిషన్లు, నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలన్నింటినీ సీసీటీఎన్ఎస్ (ఈ–కాప్స్)ద్వారా పంపిస్తారు. దీంతో రాష్ట్రంలో ఏ పోలీస్‌స్టేషన్‌లో ఏకేసు నమోదైంది, దాని పరిస్థితేమిటన్న అంశాలను డీజీపీ సహా అన్ని ర్యాంకుల్లోని అధికారులు తెలుసుకోవచ్చు. డీఎస్ఆర్ సైతం ఆన్లైన్లోనే.. రోజూ పోలీస్స్టేషన్ల నుంచి ఎస్పీలకు, ఎస్పీల నుంచి డీజీపీకి డీఎస్ఆర్ (డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్)లను పంపిస్తారు. ప్రస్తుతం వీటిని పోస్టు రూపంలో పంపు తున్నారు. ఇక నుంచి నేరుగా సీసీటీఎన్ఎస్ కింద ప్రతి అధికారికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ అందజేస్తా రు. నేరుగా సంబంధిత అధికారి యూజర్ ఐడీకి డీఎస్ఆర్ వచ్చేస్తుంది. సీసీటీఎన్ఎస్ (ఈ–కాప్స్) ద్వారా సంబంధిత అధికారి తన మొబైల్ ఫోన్లోని అప్లికేషన్ ద్వారా డీఎస్ఆర్, కేసుల స్థితి, దర్యాప్తు పరిస్థితులను పరిశీలించవచ్చు. 2002 నుంచి ప్రతీ ఎఫ్ఐఆర్ 2002 నుంచి 2017 మార్చి 28 వరకు అన్ని ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు కేసు ఏ దశలో ఉందన్న అంశాలను పోలీసు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. నేరుగా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నేరస్తుల ట్రాకింగ్ ఒక రాష్ట్రంలో అరెస్టైన నేరగాళ్ల వివరాలను సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు ద్వారా అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు పంచుకోవచ్చు. అంతేకాదు ఒక వ్యక్తి పేరు సీసీటీఎన్ఎస్ ఈ–కాప్స్ ఎంటర్‌ప్రైజెస్‌లో టైప్ చేసి, సెర్చ్ చేస్తే అతడిపై ఉన్న మొత్తం కేసుల చిట్టా బయటకు వస్తుంది. 15 వేల పోలీస్స్టేషన్ల డేటా దేశవ్యాప్తంగా 2 వేల కోట్లతో ప్రారంభించిన సీసీటీ ఎన్ఎస్ ప్రాజెక్టులో 15 వేల పోలీస్స్టేషన్లు ఆన్లైన్ ద్వారా డేటా అప్లోడ్, షేరింగ్ చేస్తున్నాయి. 6 వేల మంది పోలీసు అధికారులు ఈ ప్రాజెక్టు ద్వారా ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో రూ.61 కోట్లతో పనులు చేపట్టారు. 4 క్రితం ప్రారంభమైన ఈ సాఫ్ట్వేర్ రూపకల్పన సోమ వారం నాటికి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. -
బోధన్ స్కాంపై నేడు సీఎస్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: బోధన్ సర్కిల్లో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలా న్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ డీజీపీ అనురాగ్ శర్మకు సమాచారం అందించారు. గురువారం ఉదయం సీఎస్ చాంబర్లో కేసు దర్యాప్తుSపై సమీక్ష జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సోమేశ్‌కుమార్ సూచించారు. కేసు దర్యా ప్తులో ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారి స్థానంలో మరొకరిని నియమిం చారు. అదనపు ఎస్పీని ఎప్పటికప్పుడు కేసు దర్యాప్తు వివరాలు తెలుసుకుంటూ ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఈ వ్యవహారంపై కూడా సీఎస్ సమీక్ష జరప నున్నారు. అటు కమర్షియల్ శాఖలోనూ పలువురు అధికారుల పాత్రపై సీఐడీ నివేదిక రూపొందించినట్టు తెలిసింది. -
లైంగిక వేధింపులు: 90శాతం తెలిసిన వారే నిందితులు!
హైదరాబాద్: దేశం మొత్తంలో 51 శాతం బాలికలు, 43 శాతం బాలురు ఆన్లైన్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని డీజీపీ అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీ వ్యక్తి చేతికి స్మార్ట్‌ఫోన్, నెట్ రావడంతో వేధింపుల కేసులు పెరిగాయన్నారు. ఇంటర్నెట్ సామాన్యుడికి కేవలం 4 శాతం మాత్రమే ఉపయోగ పడుతోందని చెప్పారు. మిగతా 96శాతం క్రైం కార్నర్‌కు కేరాఫ్‌గా మారుతోందని అభిప్రాయపడ్డారు. బాలబాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల కేసుల్లో 90శాతం తెలిసిన వ్యక్తులే నిందితులవుతున్నారని తమ అధ్యయనంలో బయటపడిందని డీజీపీ స్పష్టం చేశారు. సీఐడీ నేతృత్వంలో జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న ఆన్లైన్లో చిన్నారులకు లైంగిక వేధింపులు - నియంత్రణ చర్యలు సదస్సులో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, పాఠశాలల యాజమాన్యాలను ఉద్దేశించి మాట్లాడారు. తమ కూతురు పలాన వ్యక్తి వల్ల లైంగిక వేధింపులకు గురైందని తెలిసినా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు బయటపడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో నిందితుల పలుకుబడితో బయటపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలల్లో బాలికలు లైంగిక వేధింపులకు గురవుతుంటే అక్కడి యాజమాన్యాలు తమ స్కూల్ గౌరవం చెడిపోతుందని విషయాన్ని దాచేస్తున్నారన్నారు. సమాజంలో స్టేటస్ సింబల్ పేరుతో తల్లిదండ్రులు పిల్లలకు విచ్చలవిడి స్వేచ్చ ఇస్తున్నారని, స్మార్ట్ఫోన్లు, ట్యాబులు.. ఇలా లావిష్‌నెస్ పెరగడం లైంగిక వేధింపులు ఎక్కువవడానికి ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తం కావాలని కోరారు. -
షీ టీమ్స్‌పై మహిళలకు అవగాహన కల్పించాలి
రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ భార్య మమత హైదరాబాద్: మహిళలకు షీ టీమ్స్‌పై మరింత అవగాహన కల్పించాలని డీజీపీ అనురాగ్‌శర్మ భార్య మమత అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ రెండో వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మమత మాట్లాడుతూ.. ఆకతాయిల నుంచి మహిళలు ఆత్మరక్షణ ఎలా చేసు కోవాలో షీ టీమ్స్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. నగరంలో షీ టీమ్స్ రావడంతో ఆకతాయిల ఆగడాలు తగ్గాయన్నారు. ప్రజలకు, పోలీసులకు షీ టీమ్స్ వారధిగా పనిచేస్తున్నాయన్నారు. ఇంట్లో చెప్పుకోలేక తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్న మహిళలకు షీ టీమ్స్ అండగా నిలిచి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 524 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనంతరం సినీ నటి ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళలకు మరింత ధైర్యం వచ్చిందన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన రెండు లఘు చిత్రాలను, బ్రోచర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మాదాపూర్ డీసీపీ శివప్రసాద్, ఏసీపీ రమణకుమార్, సీఐ కళింగరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలకు ఫోరెన్సిక్ ఫోర్స్..
సైబర్ ఫోరెన్సిక్ సెల్ ఏర్పాటుకు పోలీస్ శాఖ యోచన సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా సైబర్‌నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేరాల నియంత్రణకు సైబర్ ఫోరెన్సిక్ సెల్లు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా దక్షిణాసియా మొత్తం లో హైదరాబాద్‌లోనే అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్(సీఎఫ్ఎల్) ఉంది. ప్రస్తుతం ఈ–మార్కెట్ ఊపందుకుంటోంది. అదే స్థాయిలో సైబర్ నేరాలుకూడా పెరిగే ప్రమాదం ఉండటంతో వాటి నియం త్రణకు ప్రతి జిల్లాకూ ఒక సైబర్ ఫోరెన్సిక్ సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నారు. ఒక్కో జిల్లాకు రూ.65లక్షలు.. ప్రతీ జిల్లాలో పూర్తి స్థాయి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.65లక్షలు ఖర్చవుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మంజూరు అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా రాష్ట్ర పోలీస్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆధునీకరణ (ఎంఓపీఎఫ్) నిధులను ఈ సారి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ఉపయోగించుకోవాలని భావి స్తోంది. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ప్రస్తుతం సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులో ఉంది. మిగిలిన ఎనిమిది కమిషనరేట్లతో పాటు జిల్లా పోలీస్ విభాగాలకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలంటే రూ.15కోట్ల వరకు నిధులు అవసరం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నిధుల్లో 60 శాతం కేంద్రం, 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌లో శిక్షణ.. జిల్లాలు/కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేయబోయే సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఎస్ఐ నేతృత్వంలో ఆరుగురు సిబ్బంది పనిచేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీపై పట్టు ఉండి, సైబర్ నేరాల నియంత్రణకు ఆసక్తి కనబరిచే అధికారులు, సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నారు. ఈ బృందాలకు హైదరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శిక్షణ ఇప్పించి జిల్లాల్లో ఫోరెన్సిక్ సెల్‌లను నిర్వహించాలని యోచిస్తున్నారు. -
అన్ని జిల్లాల్లో ‘భరోసా’ కేంద్రాలు
ఉమెన్ అండ్ చైల్డ్ ఎక్స్పో ప్రారంభంలో నాయిని నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: న్యాయపరంగా, వైద్యపరంగా, చట్టపరంగా హైదరాబాద్‌లోని బాధిత మహిళలకు అండగా ఉంటున్న ‘భరోసా’ కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు, షీ టీమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా వద్ద ‘ఉమెన్ అండ్ చైల్డ్ ఎక్స్పో’ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల ఈ ఎక్స్పోను శనివారం నాయిని ప్రారంభించారు. తెలంగాణ వచ్చాక మహిళల భద్రత కోసం ప్రారంభించిన షీటీమ్స్ సేవలు సత్ఫలితాలి స్తున్నాయని, వీటిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని నాయిని చెప్పారు. మహిళల భద్రత కోసం కృషి చేస్తున్న షీటీమ్ సేవలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. దీనికితోడు నగర పోలీసులు ప్రారంభించిన ‘భరోసా’ రాకతో బాధిత మహిళలు, పిల్లలకు సత్వర న్యాయం, వైద్యం, కౌన్సెలింగ్ లభిస్తున్నాయన్నారు. రాజధాని అభివృద్ధి శరవేగంగా సాగేందుకు ‘భద్రత’ ఉపయోగపడుతుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. నేరరహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాలన్న ట్యాగ్‌లైన్‌తో ఆదివారం ఉదయం నిర్వహించే ‘షీటీమ్స్ 5కే రన్’లో ప్రజలను కూడా భాగస్వాములు చేసే దిశగా చర్యలు తీసుకున్నామని నగర అదనపు పోలీసు కమిషనర్, షీటీమ్స్ ఇన్చార్జ్ స్వాతిలక్రా తెలిపారు. అనంతరం బాలికలపై లైంగిక వేధింపులపై తీసిన షార్ట్ ఫిల్మ్‌లను ప్రదర్శించారు. -
పోలీసు సర్వీస్ రూల్స్‌లో మార్పులు!
ఉమ్మడి సర్వీసు రూల్స్ కారణంగా సమస్యలు ⇒ అనవసరపు విభాగాలకు స్వస్తి చెప్పాలని సర్కారు యోచన ⇒ కొత్త రూల్స్‌కోసం రిటైర్డ్ డీఐజీ గంగాధర్ నేతృత్వంలో కమిటీ సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో సర్వీసు నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రూల్స్‌నే అన్వయించుకున్న పోలీసు శాఖ.. తాజాగా కొత్త సర్వీసు నిబంధనలతో ముందుకు రానుంది. డీజీపీ అనురాగ్‌శర్మ దీనికి సంబం ధించి రిటైర్డ్ డీఐజీ గంగాధర్ నేతృత్వంలో రిటైర్డ్ అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, రిటైర్డ్ ఏవోలు వెంకయ్య, దశరథ్‌రెడ్డి, ఆదినారా య ణ, యూసఫ్ మొయినుద్దీన్, రిటైర్డ్ సూపరిం టెండెంట్ విశ్వం సభ్యులుగా ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రస్తుత సర్వీసు రూల్స్‌ను పరిశీలించి.. మార్పులు, కొత్త నిబం ధనల రూపకల్పనకు సిఫార్సులు చేస్తుంది. ఆ రూల్స్‌తో ఇబ్బందులు: రాష్ట్ర విభజన తర్వాత అన్వయించుకున్న ఏపీ పోలీసు సర్వీసు రూల్స్‌తో పలు సమస్యలు నెలకొన్నాయి. నియామకాలు, పదోన్నతులు, సర్వీసు ప్రయో జనాలు, ఇంక్రిమెంట్లు వంటి 16 రకాల సమస్యలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హోం శాఖ సర్వీసు రూల్స్‌ను సమీక్షించి.. రాష్ట్ర పోలీసు అడ్మిన్ వ్యవహా రాలు, ఆపరేషన్స్ వ్యవహారాలకు తగ్గట్టుగా రూపొందించుకోవాలని నిర్ణయించింది. అనవసరపు విభాగాలకు స్వస్తి ఉమ్మడి రాష్ట్రంలో 256కు పైగా ఐపీఎస్ అధికారులు పనిచేసే పోస్టులుండేవి. దాంతో అవసరమున్నా, లేకపోయినా ప్రతి విభాగా నికి ఐజీ నుంచి డీజీ స్థాయి హోదా వరకు ఉన్న అధికారులకు పోస్టులు ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో సర్వీసు రూల్స్‌పై ఏర్పాటు చేసిన కమిటీకే.. పోలీసు శాఖలోని అనవసరపు విభాగాలను తొలగించే పని కూడా అప్పగిం చారు. ఒకే తరహా పనులు చేసే రెండు మూడు విభాగాలుంటే వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. తొలగిపోనున్న కీలక సమస్యలు రాష్ట్ర విభజనలో ఇప్పటివరకు సివిల్ డీఎస్పీ, అదనపు ఎస్పీలు, నాన్ కేడర్ ఎస్పీల విభజన పూర్తి కాలేదు. డీఎస్పీ స్థాయి అధికారుల సీనియారిటీ జాబితా తప్పులతడకగా ఉండటంతో ఇప్పటివరకు కమల్‌నాథన్ కమిటీ విభజన చేయలేక పోయింది. పైగా కొందరు అధికారులు కోర్టుల నుంచి స్టే తీసుకువచ్చారు. సర్వీసు రూల్స్‌లో లోపాలే ఈ పరిస్థితికి కారణమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల రూల్స్ మారిస్తే సమస్యలు తొలగిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కమిటీ దృష్టి సారించే అంశాలివే... సర్వీసు రూల్స్ కమిటీ మొత్తం 34 అంశాలను సమీక్షించి, నూతన నిబంధ నలను రూపొందించనుంది. స్పెషల్ పోలీస్ బెటాలియన్లలోని కానిస్టేబుల్ నుంచి డీఐజీ వరకు ఉన్న రూల్స్ మార్పు; ఆర్మ్డ్ రిజర్వ్‌లోని రిజర్వ్ ఇన్స్పెక్టర్ నుంచి కమాండెంట్ వరకు రూల్స్ సమీక్ష, మార్పు; పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఇన్స్పెక్టర్ నుంచి డైరెక్టర్ హోదా వరకు ఉన్న నిబంధనలు, సివిల్ విభాగంలో కానిస్టేబుల్ నుంచి నాన్ కేడర్ ఎస్పీ వరకు రూల్స్‌ను సమీక్షించనున్నారు. అదే విధంగా సీపీఎల్ అంబర్పేట్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఇంటలిజెన్స్ విభాగం, ప్రింటింగ్ విభాగం, పోలీసు అకాడమీ, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్, పోలీస్ లీగల్ అండ్ మెడికల్ సర్వీ సెస్, పోలీస్ సెక్రటేరియట్ ఎస్టాబ్లిష్మెం ట్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ), పోలీస్ కమ్యూనికేషన్స్, సబార్డి నేట్ రూల్స్, పీటీవో సబార్డినేట్ రూల్స్, ఇంటలిజెన్స్ సబార్డినేట్ రూల్స్, ఏపీ పోలీస్ మాన్యువల్, స్పెషల్ పోలీస్ మాన్యువల్, కంప్యూటర్స్, సీఐడీ అడ్‌హక్ రూల్స్ 1981, ఏపీ మినిస్టీరియల్ సర్వీసు రూల్స్‌లను పూర్తి స్థాయిలో సమీక్షించి నూతన నిబంధనలను సిఫారసు చేసే అవకాశముంది. -
ఏసీబీ డీజీగా అనురాగ్ శర్మకు అదనపు బాధ్యతలు
⇒ డైరెక్టర్‌గా ఉన్న చారుసిన్హాపై బదిలీ వేటు ⇒ ట్రైనింగ్ ఐజీగా పోస్టింగ్ ⇒ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి గ్రేహౌండ్స్‌కు ట్రాన్స్ఫర్ ⇒ నల్లగొండ కేసులే చారుసిన్హా బదిలీకి కారణమన్న ఏసీబీ వర్గాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా డీజీపీ అనురాగ్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న ఐజీ చారుసిన్హాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ట్రైనింగ్ ఐజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని గ్రేహౌండ్స్ ఐజీగా నియమిం చడంతోపాటు ఆయన స్థానంలో చారుసిన్హా ను ట్రైనింగ్ ఐజీగా నియమించింది. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ బదిలీలపై అటు ఏసీబీలోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. చారుసిన్హాపై నల్లగొండ నేతల వార్ ఏసీబీ డీజీగా పదవీ విరమణ పొందిన ఏకే ఖాన్ తర్వాత ఆ విభాగాన్ని చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. అప్పటి నుంచి అక్రమా ర్కులుగా ముద్రపడ్డ విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ఇక్కడే చారుసిన్హాకు ఎదురుదెబ్బ తగిలినట్టు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. నల్లగొండ జిల్లాలో ఈ మూడు విభాగాల్లోని అధికారులపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించడంతో అక్కడి అవి నీతి అధికారులు ప్రజా ప్రతినిధులను ఆశ్రయిం చారు. తాము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశామని, అయినా తమను ఏసీబీ వెంటాడుతోందని, ఆ కేసులు తమపైకి రాకుండా చూడాలని కీలక నేతలపై ఒత్తిడి తెచ్చా రని తెలిసింది. ఇటీవలే విజిలెన్స్ నల్లగొండ విభాగం ఎస్పీ ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యారు. అలాగే ఇద్దరు రెవెన్యూ అధికారులపై అక్రమాస్తుల కేసును ఏసీబీ... ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడి వరకు ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి ఏసీబీపై పడలేదు. కానీ కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న కీలక అధికారులపై ఏసీబీ దృష్టి సారించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి అనుమతి కావాలని ఏసీబీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో సంబంధిత ఆరోపణలెదుర్కొం టున్న అధికారి కీలక నేతలకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే సంబంధిత నేతలు ప్రభుత్వ పెద్దల వద్ద ఏసీబీ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే ముందస్తు అనుమతులు లేకుండా ఏసీబీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారంటూ పరోక్షంగా చారుసిన్హాపై నేతలు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కావాలనే తమ మనుషులను ఏసీబీ టార్గెట్ చేస్తోందని, దీనంతటికీ చారుసిన్హాయే కారణమని తెలియడంతో అప్పటికప్పుడు ఐజీని బదిలీచేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. -
నయీమ్‌తో పోలీసుల విందుపై స్పందించాలి
రాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు సీపీఐ నేత నారాయణ లేఖ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసుల వివరాలు బహిర్గతం చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మకు ఆదివారం ఆయన లేఖ రాశారు. నయీమ్ ఉదంతాలపై సీబీఐ విచారణ చేయించాలని తాను కోర్టులో పిల్ వేస్తే...ప్రభుత్వం మాత్రం సిట్‌తో సరిపో తుందని చెప్పిందని గుర్తుచేశారు. నయీమ్‌తో పోలీసు ఉన్నతాధికారులు విందు భోజనాలు చేస్తున్న ఫొటోలు బహిర్గతమైన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ఇప్పటికైనా నయీమ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. -
పనితీరు మెరుగుపరుచుకోండి
సాక్షి, హైదరాబాద్: పనితీరు మెరుగుపరు చుకోవాలని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణ, నేరస్థులపై ఉక్కు పాదం మోపాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ అనురాగ్‌శర్మ సూచించారు. బడ్జెట్ సమీక్ష సందర్భంగా మంగళవారం రాష్ట్ర పోలీ స్ ముఖ్యకార్యాలయంలో సుదీర్ఘ భేటీ జరిగిం ది. బడ్జెట్‌పై అధికారులతో 3 గంటల పాటు చర్చించారు. అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఎస్పీలు, కమిషనర్లపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఇద్దరు ఎస్పీల బదిలీ వేటు నేపథ్యంలో పని తీరు మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. కొత్త జిల్లాల్లో చేప ట్టాల్సిన పలు నిర్మాణాలపై ఎస్పీలు ప్రతిపా దనలు సమర్పించారు. సీసీ కెమెరాల, కమాం డ్ కంట్రోల్ సెంటర్లు, టెక్నాలజీ వినియోగం తదితరాలకు రూ.5,038 కోట్లు అవసరమని ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. ప్రతిపాదనలను 2 రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్టు తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా ‘పోలీసు ల్యాబ్స్’ ఏర్పాటు
సీసీఎస్ ప్రారంభోత్సవంలో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. నేరగాళ్లకు చెక్ పెట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ప్రతి జిల్లాలోనూ క్రైమ్, సైబర్ ల్యాబ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.7.3 కోట్లతో ఆధునీకరించిన హైదరాబాద్ సెంట్ర ల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) భవనంతోపాటు రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన ల్యాబ్స్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ ల్యాబ్స్‌లో ఉన్న సదుపాయాలు, కొంత పరిజ్ఞానం కేవలం హైదరాబాద్ పోలీసుకు మాత్రమే సొంతమని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అవి అందుబాటులో లేవన్నారు. సీసీఎస్‌ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి, డీసీపీ అవినాశ్ మహంతిలను డీజీపీ అభినందించారు. సీసీ ఎస్ ఆధీనంలో ఏర్పాటైన క్రైమ్, సైబర్ ల్యాబ్స్‌ను పరిశీలించిన ఆయన ఈ తరహాలో నే అన్ని జిల్లాలు, సీఐడీల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. భారీ కేసుల్ని సీసీఎస్‌లోని ల్యాబ్స్ సహకారంతోనే దర్యాప్తు చేయిస్తామని డీజీపీ వివరించారు. జిల్లాల వారీగా ల్యాబ్స్ ఏర్పాటుకు సంబంధించి మంగళవారం అందరు ఎస్పీలతో సమావేశం నిర్వ హించనున్నట్లు పేర్కొన్నారు. సీఐడీతో పాటు జిల్లాల వారీగా అవసరమైన నిధులపై అంచనాలు రూపొందిస్తామని, ఈ బడ్జెట్లోనే ప్రభుత్వం నుంచి వాటిని పొందేలా కృషి చేస్తామన్నారు. -
'అమాయకులపై అక్రమ కేసులు'
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులతో పాటు అమాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సోమవారం డీజీపీ అనురాగ్‌శర్మను కలిశారు. అనంతరం శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రకటనలు చేస్తూనే పోలీసులు కేసులు బనాయించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి కుమారునిపై నమోదు చేసిన కేసుపై తక్షణమే విచారణ జరిపి, కేసును ఎత్తివేయాలని డీజీపీకి వినతి పత్రం సమర్పించారు. డీజీపీని కలిసిన వారిలో నిరంజన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. -
హోంగార్డుల సమస్యలు కొలిక్కి!
-
హోంగార్డుల సమస్యలు కొలిక్కి!
సీఎంతో సుదీర్ఘంగా చర్చించిన హోంమంత్రి, డీజీపీ పెండింగ్ సమస్యలపై త్వరలోనే ప్రకటన సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన కోసం హోంగార్డులు కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌తో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ,, ఐజీ (హోంగార్డ్స్) బాల నాగాదేవీ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే హోంగార్డుల డిమాండ్లన్నీ ఒకేసారి చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుందని, మొదటి దఫాలో భాగంగా వేతన పెంపుపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నాయి. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న 21 వేల మంది హోంగార్డులకు హెల్త్‌కార్డులు అందించే ఆలోచన కూడా ఉన్నట్టు వివరించాయి. బస్ పాస్‌ల సౌకర్యం కల్పించాలని ఆర్టీసీకి త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం నుంచి అసెంబ్లీ పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో డీజీపీతో సీఎం కేసీఆర్ చర్చించడంతో హోంగార్డులకు తీపి కబురు అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. హోంగార్డుల డిమాండ్లు... మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని కానిస్టేబుళ్లుగా మార్చాలి. కానిస్టేబుల్ నియామకాల్లో ఇన్‌సర్వీస్‌లో ఉన్న హోంగార్డులను శిక్షణకు పంపాలి. డెప్యుటేషన్‌లో ఉన్న హోంగార్డులను అదే విభాగంలో క్రమబద్ధీకరించాలి. హోంగార్డు బెటాలియన్ ఏర్పాటు చేయాలి. కనీసం వేతనం రూ. 25 వేలకు పెంచాలి. ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలి. వేతనంతో కూడిన సాధారణ, మెడికల్ సెలవులు, బస్‌పాస్‌లు అందించాలి. డెప్యుటేషన్, ట్రావెలింగ్, డెయిలీ అలవె న్సులు, మెటర్నిటీ సెలవులు ఇవ్వాలి. పదవీ విరమణ, సాధారణ మరణం పొం దిన వారికి రూ. 10 లక్షలు అందించాలి. -
రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్
-
రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్
నేరాల సంఖ్య తగ్గింది: ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని, శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖలోని పలు అంశాలపై శుక్రవారం ప్రగతి భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంఓ అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో పోలీసు, పరిశ్రమల శాఖలు మెరుగ్గా పనిచేస్తున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పలువురు అభిప్రాయపడ్డారని తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానం ప్రకటించిన తర్వాత 2500కుపైగా పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తి కూడా ప్రారంభమైందన్నారు. దీనంతటికీ ప్రదాన కారణం శాంతి భద్రతలు మెరుగ్గా ఉండటమే కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని, అదే విధంగా నేరస్తుల్లోనూ మార్పు వచ్చిందన్నారు. మానవతా దృక్పథంతో పోలీసులు నేరస్తులను మారుస్తున్నారన్నారు. పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ అంశం గురించి డీజీపీ అనురాగ్ శర్మ సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
పోలీసుశాఖలో ‘ఆర్డర్లీ’ కలవరం!
ఏడీజీ వ్యవహారంపై సర్వత్రా చర్చ ఢిల్లీ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ ఆరా సాక్షి, నెట్వర్క్: పోలీసుశాఖలో కలవరం మొదలైంది. ఆర్డర్లీ వ్యవస్థ పేరిట జరుగుతున్న అరాచకాలపై కింది స్థాయి సిబ్బందిలో తీవ్ర చర్చ జరుగుతోంది. అదనపు డీజీపీ వ్యవహారంపై ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్య పోయారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీజీపీ అనురాగ్ శర్మ ఈ వ్యవహారంపై ఆరా తీసినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం తతంగం మీద తనకు నివేదిక అందిం చాలని ఇంటెలిజెన్స్ అధికారులను డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది. డిసెంబర్లో జరిగిన వ్యవహారం నుంచి కానిస్టేబుల్‌ను కొట్టిన ఘటన, ఇతరత్రా అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించినట్టు తెలియవచ్చింది. సోమవారంలోగా నివేదికకు సీఎస్ ఆదేశం... అదనపు డీజీపీ వ్యవహారంపై ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి సోమవారానికల్లా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. సీసీ ఫుటేజీ పరిశీలన... తమ వ్యవహారం బయటపడటంతో సంబంధిత అధికారి కార్యాలయం లీకేజీ చేసిన వారి గుర్తింపునకు కంకణం కట్టుకున్నట్టు తెలిసింది. మొత్తం డీజీపీ కార్యాలయానికి నిత్యం వచ్చి వెళ్లే వారి జాబితాపై దృష్టి సారించినట్టు సమాచారం. తమకు జరిగే అన్యాయాలు చెప్పుకోవడానికి వచ్చే బాధితులు మొదలుకొని వీఐపీలు, జర్నలిస్టులు, పోలీసు సిబ్బంది, అధికారులు.. ఇలా డీజీపీ ఆఫీసుకు వచ్చి వెళ్లే వారి సీసీ ఫుటేజీ కావాలని భద్రతాధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలియవచ్చింది. తమ కార్యాలయానికి వచ్చి వెళ్లే వారే సమాచారం లీక్ చేశారని, వారిని గుర్తించి క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేయాలనే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమ అధికారి వ్యవహారం బయటపడటం జీర్ణించుకోలేని కార్యాలయ అధికారులు ఇలాంటి విపరీత ధోరణికి తెరదీశారని తెలిసింది. -
‘ద్యావుడా’ను ఆపేయండి
డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు సాక్షి, హైదరాబాద్: ద్యావుడా సినిమా టైటిల్‌తో పాటు చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించారని, ఆ సినిమాపై నిషేధం విధించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో శివుడు, వెంకటేశ్వర స్వామిని అభ్యంతకరంగా చిత్రీకరించి యూట్యూబ్‌లో విడుదలు చేశారని పరశురాం పరివార్ సంఘం సోమవారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఫిర్యాదు చేసింది. యూట్యూబ్‌లో సినిమా ట్రైలర్ వివాదాస్పదంగా ఉందని, పూర్తి సినిమా కూడా హిందు మనోభావాలను దెబ్బతీసేలా ఉంటుందన్న ఆందోళన ఉందని, వెంటనే సినిమా డైరెక్టర్ దాసరి సాయిరామ్, నిర్మాత హరికుమార్రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంఘం నాయకులు డీజీపీని కోరారు. శివలింగంపై మద్యం, మాంసం, సిగరెట్లను అభిషేకంలాగా కుమ్మరిస్తూ అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్‌లో ట్రైలర్‌ను తొలగించడంతోపాటు.. సినిమా విడుదలపై నిషేధం విధించాలని సంఘం అధ్యక్షుడు ఆత్మకూరి కిషోర్, తదితరులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఇప్పటికే తాము ఫిలిం చాంబర్స్, దేవాదాయ మంత్రికి, సీసీఎస్ సైబర్ క్రైమ్, సెన్సార్‌బోర్డుకు కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. -
పోలీస్ శాఖలో క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్
అన్ని జిల్లాల్లో అమలుకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వ్యవస్థను పోలీస్ శాఖలోనూ అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయించారు. పోలీస్ శాఖ ఎన్ఫోర్స్ మెంట్ విధానంలో క్యాష్‌లెస్‌ను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణ ప్రసాద్, పీసీఎస్ అదనపు డీజీపీ రవిగుప్తా ఆధ్వర్యంలో శనివారం సమీక్ష జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిష నరేట్ల పరిధిలోని ట్రాఫిక్ విభాగం నిర్వహిస్తున్న ఈ–చలాన్ వ్యవస్థను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. హైదరాబాద్ కమిషన రేట్లోని ఈ–చలాన్ సాఫ్ట్వేర్, సర్వర్లు, సిబ్బంది శిక్షణపై ఎస్పీలు ఆధ్యయనం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిం చారు. క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్, ఈ–చలాన్ విధానంపై జిల్లాల పోలీస్ సిబ్బందికి శిక్షణనివ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఖర్చుపై పోలీస్ కంప్యూటర్ సర్వీ సెస్ అదనపు డీజీపీ నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. -
వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి
డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రిం చాలని.. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ కోరారు. హైదరాబా ద్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలోని అశ్విని అలర్జీ కేంద్రం తలపెట్టిన స్వచ్ఛ ఆకాశ్ అభియాన్ ప్రచారోద్యమాన్ని గురువారం డీజీపీ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని 20 ప్రధాన ప్రాంతాల్లో వాయు కాలుష్యం స్థాయిలపై ఈ ఆస్పత్రి వైద్యులు జరిపిన అధ్యయన నివేదికను సైతం డీజీపీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగిందని ఈ అధ్యయనంలో తేలిందన్నారు. అశ్వినీ అలర్జీ కేంద్రం వైద్యులు, ప్రముఖ ఆస్తమా నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ మెట్రో రైలు పనుల వల్ల నగరంలో వాయు కాలుష్యం పెరిగిందన్నారు. -
నయీం కేసులో డీజీపీని కలిసిన పుట్టా మధు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రికి సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే పుట్టా మధు డీజీపీ అనురాగ్ శర్మకు చెప్పారు. గురువారం డీజీపీని కలిసిన ఆయన నయీం గ్యాంగ్ తదితర అంశాల గురించి డీజీపీకి వివరించారు. నయీంతో కలిసి ఆ కాంగ్రెస్ మాజీ మంత్రి పలు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నయీం గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని పుట్టా మధు చెప్పారు. నయీంతో మాజీ మంత్రికి ఉన్న సంబంధాలపై మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నానని ఆయన చెప్పారు. సదరు మాజీ మంత్రి చేసిన భూకబ్జాల వివరాలను డీజీపీకి సమర్పించినట్లు తెలిపారు. డీజీపీ సానుకూలంగా స్పందించి ఆధారాలను సిట్‌కు పంపిస్తామని అన్నారు. -
మెట్రో రైలు కు 17 కొత్త పోలీసు స్టేషన్లు
⇒ మరో 48 ఔట్ పోస్టుల ఏర్పాటు ⇒ మెట్రో రైలు భద్రతపై సమీక్షలో డీజీపీకి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రక్షణకు మెట్రో కారిడార్ వెంబడి 5 ‘ఏ- కేటగిరీ’, 12 ‘బీ- కేటగిరీ’ పోలీస్స్టేషన్లతో సహా 48 పోలీసు ఔట్ పోస్టులను నిర్మించాలని ప్రతిపాదనలు అందాయి. మెట్రో భద్రతపై డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమీక్షలో రైల్వేలు, రోడ్డు భద్రత విభాగం అదనపు డీజీ కృష్ణ ప్రసాద్ ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. మెట్రో ప్రయాణికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఓ నివేదికను అందజేశారు. మెట్రో భద్రతకు సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మెట్రో రైలు ఎండీ ఎంవీఎస్ రెడ్డి, నగర సీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీలు అంజనికుమార్, సందీప్ శాండిల్య, సైబరాబాద్, రాచకొండ సీపీలు మహేశ్ భగవత్, నవీన్ చంద్, ఇంటెలిజెన్స్ ఐజీ శివానంద్ నింబర్గ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల సేవలు చిరస్మరణీయం: నాయిని
-
పోలీసుల సేవలు చిరస్మరణీయం: నాయిని
హైదరాబాద్ : పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని తెలంగాణ పోలీస్ శాఖ శుక్రవారం ఉదయం గోషా మహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ, పోలీస్ అధికారులు ...పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ శాఖ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ పోలీసుల సేవల చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీసు శాఖలో అనేక మార్పులు తెచ్చామన్నారు. ఎండనకా..వాన అనకా పనిచేసేది పోలీసులేనని అన్నారు. ఈ ఏడాది 470మంది పోలీసులు అమరులయ్యారన్నారు. పోలీసుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ ఏడాది విధినిర్వహణలో అమరులైన హోంగార్డులకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ అనురాగ శర్మ తెలిపారు. -
పోలీస్ అధికారులకు కొత్త వాహనాలు
- అన్ని స్థాయిలవారికి ప్రభుత్వం మంజూరు చేసింది - కొత్త జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమీక్షలో డీజీపీ అనురాగ్ శర్మ హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి కావాల్సిన కనీస సదుపాయల్లో కార్యాలయ భవనంతో పాటుగా ఫర్నిచర్, పూర్తి స్థాయిలో సిబ్బంది, కంప్యూటర్లు, ఫ్యాక్స్, జిరాక్స్ మిషన్లు అన్నీ త్వరగా సమకూర్చుకోవాలని కొత్త ఎస్పీలు, పోలీసు కమిషనర్లను రాష్ట్ర పోలీసు విభాగం డైరెక్టర్ జనరల్ అనురాగ్ శర్మ ఆదేశించారు. ప్రభుత్వం నూతన వాహనాలను మంజూరు చేసిందని, అన్ని స్థాయిల అధికారులకు వాహనాలు ఇస్తామని ఆయన తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో పాత, కొత్త జిల్లాల ఎస్పీలు, నూతన పోలీస్ కమిషనర్లతో కొత్త జిల్లాల్లో గత తొమ్మిదిరోజుల అనుభవాలను డీజీపీ సమీక్షించారు. ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచించి ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ప్రభుత్వం, ప్రజలు ఆశించిన విధంగా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పని చేయాలని అన్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న కార్యాలయాల ఫోటోలు, సిబ్బంది గదులు, నూతన పోలీసు స్టేషన్లు, సర్కిల్ల కార్యాలయ ఫోటోలు, సిబ్బంది వివరాలతో నూతన జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వార డీజీపీకి వివరించారు. జిల్లా భౌగోళిక స్వరూపం, అక్కడి రాజకీయ వాతావరణం, ప్రజల అవసరాలు, వారి సంప్రదాయం అన్నీ కూడా జిల్లా ఎస్పీలు బాగా స్టడీ చేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు. కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, ఈ లోపు తమ అవసరాలని ప్రాధాన్యతలను ఉన్నతాధికారులకు తెలియచేస్తూ వుండాలన్నారు. సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, రామగుండం, కరీంనగర్, వరంగల్, పోలీస్ కమీషనర్లతో పాటుగా అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు పాల్గొన్నారు. -
దేశ రక్షణలో పోలీస్ కీలకం: గవర్నర్
- ‘అమరుల సంస్మరణ’ పరుగు ప్రారంభించిన నరసింహన్ హైదరాబాద్: దేశరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైందని, ఫ్రెండ్లీ పోలీస్తో ప్రజలకు మరింత చేరువయ్యారని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడి నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో భారతీయ పోలీసు అమర వీరుల తొలి సంస్మరణ పరుగును ఆయన ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడు తూ దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరుల సేవలు మరువలేనివన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా 10కె, 5కె, 2కె రన్లను నిర్వహించారు. వీటిలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్లో పాల్గొన్న వారందరికీ పోలీసు శాఖ తరఫున ప్రోత్సాహక పతకాలను అందజేశారు. రన్లో 5వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, జాతీయ పోలీస్ అకాడమీ డీజీ అరుణా బహుగుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు ఐపీఎస్ అధికారులు, ఏసీపీలు పాల్గొన్నారు. రెండోరోజు ఆకట్టుకున్న ఎక్స్పో... రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో రెండోరోజు ఏర్పాటుచేసిన పోలీస్ ఎక్స్పో ఎంతగానో ఆకట్టుకుంది. రన్లో పాల్గొన్న వారంతా ఎక్స్పోను సందర్శించి వివిధ స్టాళ్లల్లో ఏర్పాటుచేసిన ఆయుధాలతో పాటు ఫొటోలను తిలకించారు. -
అమర పోలీసుల సంస్మరణార్థం 10కె రన్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 16 నుంచి మూడు రోజుల పాటు 2కె, 5కె, 10కె రన్ పోటీలను నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసి, పోలీసు సేవలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో 5 వేల మంది పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన సీనియర్ అధికారులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో తొలిసారి అమర పోలీసుల సంస్మరణార్థం రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. అమెరికాలో ట్విన్ టవర్స్ ఘటన తర్వాత న్యూయార్క్ పోలీసు డిపార్టుమెంట్ (ఎన్‌వైపీడీ) ఏటా రన్ నిర్వహిస్తోందని, అలానే రాష్ట్రంలోనూ పోటీలు ప్రారంభించనున్నామని, ఇక నుంచి ఏటా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం 2కె, 5కె, 10కె పోటీలు నిర్వహిస్తున్నామని, అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఠీఠీఠీ.ఞౌజీఛ్ఛిటఠ.జీ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అలానే హైదరాబాద్‌లోని మాదాపూర్, కూకట్పల్లి, సరూర్‌నగర్, కుషాయిగూడ, అబిడ్స్, బంజారాహిల్స్, చార్మినార్, పంజాగుట్ట, ఉస్మానియా యూనివర్శిటీ, అంబర్‌పేట, నారాయణగూడ పోలీస్స్టేషన్లలోనూ పేర్లు నమోదు చేయించుకోవచ్చని చెప్పారు. 2కె రన్లో పాల్గొనే వారు రూ.250, 5కె రన్‌కు రూ.300, 10కె రన్‌కు రూ.350 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జర్నలిస్టులు ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతిస్తారని చెప్పారు. రన్లో విజయం సాధించిన వారికి మెడల్స్ అందజేస్తామని, పోటీలో పాల్గొనే వారికి టీ-షర్ట్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. పోలీసు సేవలపై ‘ఎక్స్ పో’ పోలీసు సేవలపై అక్టోబర్ 15, 16 తేదీల్లో పీపుల్స్ ప్లాజాలో ‘‘ఎక్స్ పో’’ నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర విభాగాల పోలీసు స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌త్రివేది, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా, రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్, సీఐడీ చీఫ్ సౌమ్యామిశ్రా, సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు
పంజగుట్ట: రాష్ట్రంలో ప్రెస్ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో చెప్పేందుకు ప్రెస్‌క్లబ్‌లో కమ్యునిటీ సీసీ కెమరాలు ఏర్పాటు చేయడమే నిదర్శనమని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. పత్రికారంగం వారు కెమరాలు ఏర్పాటు చేస్తే మరికొందరు ముందుకు వస్తారన్నారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కమ్యునిటీ సీసీ కెమరాల మనిటరింగ్ను ఆయన నగర పోలీస్ కమీషనర్ ఎం.మహేందర్ రెడ్డి, పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర్ రావులతో కలిసి ప్రారంభించారు. క్లబ్లో 16 కెమరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ... గతంలో దిల్‌శుఖ్‌నగర్ బాబు పేలుళ్ల కేసులో పోలీసుల ఆధ్వర్యంలో ఓ షాపులో ఏర్పాటు చేసిన కెమరావల్లే ఎన్నో ఆధారాలు సేకరించగలిగామన్నారు. నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రెస్‌క్లబ్‌లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడటంతో మీడియాదే కీలకపాత్ర అన్నారు. డీసీపీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ .. మీడియా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమన్నారు. సీనియర్ పాత్రికేయులు శైలేష్ రెడ్డి మాట్లాడుతూ .. పోలీసులు మీడియా కలిసి పనిచేస్తుందని చెప్పడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు రాజమౌళి చారి, ప్రధానకార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌ను ఫ్యామిలీ క్లబ్‌గా, సేఫ్టీ క్లబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. మీడియా, పోలీసులు మరింత ఫ్రెండ్లీగా ఉండి సేఫ్, సెక్యుర్డ్ తెలంగాణ రూపొందించే దిశగా అడుగులేయాలన్నారు. పోలీస్ రంగంలో విశేష మార్పులు వచ్చాయని, అందుకు డైనమిక్ అధికారులే కారమన్నారు. హైదరాబాద్‌లో నేరం చేస్తే తప్పించుకోలేమని నేరస్ధుల్లో భయం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు రవికాం త్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు దుగ్గు రఘ, రమేష్ వైట్ల, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు నరేందర్ జి పద్మశాలి, ఎ.రాజేష్, పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్‌స్పెక్టర్ మోహన్ కుమార్, ఎస్సై లింగారెడ్డి పాల్గొన్నారు. -
డీజీపీని కలసిన గద్దర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి గద్దర్ డీజీపీ అనురాగ్‌శర్మను మంగళవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. 1997లో తనపై జరిగిన కాల్పుల ఘటనపై పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు డీజీపీకి ఒక వినతిపత్రం అందజేశారు. 1997లో సికింద్రాబాద్ అల్వాల్‌లోని తన నివాసంలో గద్దర్‌పై గ్రీన్కోబ్రా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది నయీమ్ ముఠానేనని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అప్పటి డీజీపీ హెచ్.జె.దొర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. కానీ దర్యాప్తులో కాల్పులకు పాల్పడిన వ్యక్తులెవరనేది తెలియలేదు. ఇటీవల గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గ్రీన్కోబ్రా, బ్లాక్ కోబ్రాల పేరిట నయీమ్ అరాచకాలు సృష్టించినట్లు అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై జరిగిన కాల్పుల ఘటనపై పునర్విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని గద్దర్ డీజీపీని కోరారు. -
'నాపై దాడి కేసును పునర్విచారించండి'
హైదరాబాద్: ప్రజాకవి గద్దర్ తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మను మంగళవారం కలిశారు. తనపై జరిగిన దాడి కేసును మరోసారి విచారించాలని గద్దర్ కోరారు. 1997, ఏప్రిల్ 6 న గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో మూడు బుల్లెట్లు గద్దర్ శరీరంలోకి దూసుకెళ్లాయి. డాక్టర్లు మూడు బుల్లెట్లలో రెండింటిని బయటికి తీశారు. మూడవ బుల్లెట్ తీయడానికి వీలుపడకపోవడంతో శరీరంలో ఉండిపోయింది. ఈ కేసు విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన గద్దర్ మరోసారి విచారణ చేపట్టాల్సిందిగా డీజీపీని కోరారు. -
డయల్-100 సర్వీస్‌ను వాడుకోండి: డీజీపీ
హైదరాబాద్: జంట నగరాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దష్ట్యా ట్రాఫిక్ పోలీసులతోపాటు శాంతిభద్రతలను పర్యవేక్షించే సివిల్ పోలీసులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేష్ భగవత్ తదితర సీనియర్ అధికారులతో డీజీపీ గురువారం సమావేశమై వర్షాల పరిస్థితిపై చర్చించారు. వర్షాల వల్ల రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు సోషల్ మీడియాను వినియోగించుకోవాలన్నారు. ఎఫ్ ఎం రేడియో, టీవీ స్క్రోలింగ్, మైక్ ఎనౌన్స్మెంట్, వాట్సప్, ఫేస్బుక్ వంటి ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని ఆదేశించారు. వర్షం కారణంగా నీళ్లు ఇళ్లలోకి, సెల్లార్లలోకి వచ్చినా డయల్ - 100 సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మెట్రో రైలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. నాలాలు పొంగడం, రోడ్లపై మ్యాన్ హోల్స్ కనిపించకపోవడం వంటి కారణాలతో వృద్ధులు, బాలలు, మహిళలు ప్రమాదాల బారినపడే అవకాశం ఉన్నందున గల్లీల్లోని రోడ్ల పట్ల పోలీస్ సిబ్బంది శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యాలయ వేళలు, పాఠశాలలు, కళాశాలల సమయాల్లో ఎదురయ్యే ట్రాఫిక్ జామ్‌ను వెంటవెంటనే క్లియర్ చేసే విధంగా ప్రతి పోలీస్ అధికారి రెండు మూడు రోజుల పాటు పనిచేయాలని ఆదేశించారు. -
భద్రాద్రి రామయ్యకు డీజీపీ పూజలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. -
పోలీసు విభజనకు సీనియర్ ఐపీఎస్‌లు
ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ అనురాగ్‌శర్మ సాక్షి, హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీసు విభజనకు సంబంధించి డీజీపీ అనురాగ్‌శర్మ వేగం పెంచారు. పోలీస్ స్టేషన్ల పరిధి, సిబ్బంది విభజన తదితర అంశాలను పరిష్కరించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులను రంగంలోకి దింపారు. జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేసి, జిల్లా పోలీసింగ్‌పై పూర్తి అవగాహన ఉన్న అధికారులను జిల్లాల ఇన్చార్జిలుగా నియమించారు. మెదక్-కృష్ణప్రసాద్, రంగారెడ్డి-ఎం.గోపీకృష్ణ, నల్గొండ-రవిగుప్త, ఖమ్మం-అంజనీకుమార్, ఆదిలాబాద్-సందీప్ శాండిల్య, మహబూబ్‌నగర్-కె.శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్-సౌమ్యామిశ్రా, నిజామాబాద్-సంజయ్‌కుమార్‌జైన్, వరంగల్-బి.మల్లారెడ్డిలకు బాధ్యతలు అప్పగిస్తూ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ జిల్లాల విభజన పనుల్లో ప్రస్తుత జిల్లా ఎస్పీలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. జిల్లాల సబ్డివిజన్లు, ఠాణాల పరిధి తదితర అంశాలను చర్చించనున్నారు. అలాగే జిల్లా స్థాయిలో జరిగిన కానిస్టేబుళ్ల నియామకాలు, జోనల్ స్థాయిలో జరిగిన సబ్ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల్లో బందోబస్తు చర్యలు పుష్కలం. పోలీసులు పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 12(శుక్రవారం) నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో దాదాపు 13,474 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఘాట్ల వద్ద 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మేజర్, మైనర్, లోకల్ ఘాట్లు 57 వరకు ఉన్నాయి. వీటి వద్ద భద్రత కోసం 6,754 మంది పోలీసులను కేటాయించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాగా రద్దీ ఉండే అవకాశమున్నా బీచుపల్లి ఘాట్‌కు శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్‌ను ఇన్చార్జిలుగా నియమించినట్లు తెలిపారు. అలంపూర్ పుష్కర ఘాట్‌కు ఐజీ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఈగలపెంట వద్దనున్న ఘాట్‌కు సెక్యూరిటీ వింగ్ జాయింట్ సీపీ మహేందర్ కుమార్ రాథోడ్, కృష్ణా గ్రామం వద్దనున్న ఘాట్‌కు సీఐడీ ఎస్పీ ఎం.శ్రీనివాసులుకు భద్రతా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని 28 పుష్కరఘాట్ల భద్రత కోసం 6,720 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. జిల్లాలో రద్దీగా ఉండే వాడపల్లి ఘాట్‌కు నార్త్‌జోన్ ఐజీ వై నాగిరెడ్డి, సాగర్ ఘాట్‌కు డీఐజీ ఎంకే సింగ్, మఠంపల్లి ఘాట్‌కు గ్రేహౌండ్స్ ఎస్పీ తరుణ్జోషిని కేటాయించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు పుష్కర భక్తులకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను అంచనా వేసి అదుపు చేసేందుకు రెండు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో 55, మహబూబ్‌నగర్ జిల్లాలో 33 ట్రాఫిక్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. రహదారి వెంబడి ఎక్కడికక్కడ ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను నెలకొల్పిన్లు తెలిపారు. మహిళలపై వేధింపులు జరగకుండా చూసేందుకు 27 ‘షీ’ టీమ్‌లను, సంఘవిద్రోహ చర్యలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 80 చెక్ టీమ్‌లను నియమించామని పేర్కొన్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద దాదాపు 555 సీసీ కెమెరాలతో ఎల్లవేళలా గస్తీ నిర్వహిస్తామని వివరించారు. రెండు జిల్లాల ఎస్పీలు భక్తుల సౌకర్యార్థం కోసం మొబైల్ యాప్‌లను ఏర్పాటు చేశారన్నారు. -
'పక్కా సమాచారంతోనే స్కెచ్'
హైదరాబాద్: పక్కా సమాచారంతోనే గ్యాంగ్ స్టర్ నయీంను గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకుందని చెప్పారు. మిలీనియం టౌన్ షిప్ లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్ మెన్ ముందుగా కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ కాసేపట్లో వెల్లడించే అవకాశముంది. అయితే నయీంతో పాటు ఎవరైనా హతమయ్యారా, ఎవరైనా అరెస్ట్ చేశారా అనే విషయాలు వెంటనే వెల్లడి కాలేదు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నయీం ముఠాకు చెందిన పలువురు కొద్ది రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్య కేసులతో పాటు భూ దందా, సెటిల్మెంట్లు కేసులు కూడా నయీంపై ఉన్నాయి. -
కేసీఆర్‌తో డీజీపీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఎంసెట్-2 పేపర్ లీకేజ్ కేసుపై ముఖ్యమంత్రితో చర్చించారు. తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ వ్యవహారంపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు ఇక్బాల్ అనుచరుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కన్సల్టెన్సీ యజమాని రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సీఐడీ అధికారులు కాసేపట్లో ప్రకటించే అవకాశముంది. -
డీజీపీ, ఉన్నతాధికారులతో రాజీవ్ శర్మ భేటీ
హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్, పరీక్ష రద్దు అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎంసెట్-2 లీక్‌పై సీఐడీ అధికారులు నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదికను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. మరోవైపు ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున శుక్రవారం సచివాలయానికి తరలి వస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారి ర్యాంకులు రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఎంసెట్ -2 లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న విద్యా, ఆరోగ్య శాఖ మంత్రులు ఎంసెట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామాలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంసెట్ -2ను రద్దు చేస్తే.. పెద్ద ఎత్తున విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని దానికి బదులు తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ.. కడియం, లక్ష్మారెడ్డి తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండి చేస్తూ.. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలు అరెస్ట్ చేశారు.