హోంగార్డుల సమస్యలు కొలిక్కి!
- సీఎంతో సుదీర్ఘంగా చర్చించిన హోంమంత్రి, డీజీపీ
- పెండింగ్ సమస్యలపై త్వరలోనే ప్రకటన
- మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని కానిస్టేబుళ్లుగా మార్చాలి.
- కానిస్టేబుల్ నియామకాల్లో ఇన్‌సర్వీస్‌లో ఉన్న హోంగార్డులను శిక్షణకు పంపాలి.
- డెప్యుటేషన్‌లో ఉన్న హోంగార్డులను అదే విభాగంలో క్రమబద్ధీకరించాలి.
- హోంగార్డు బెటాలియన్ ఏర్పాటు చేయాలి.
- కనీసం వేతనం రూ. 25 వేలకు పెంచాలి. ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలి.
- వేతనంతో కూడిన సాధారణ, మెడికల్ సెలవులు, బస్‌పాస్‌లు అందించాలి.
- డెప్యుటేషన్, ట్రావెలింగ్, డెయిలీ అలవె న్సులు, మెటర్నిటీ సెలవులు ఇవ్వాలి.
- పదవీ విరమణ, సాధారణ మరణం పొం దిన వారికి రూ. 10 లక్షలు అందించాలి.
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన కోసం హోంగార్డులు కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌తో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ,, ఐజీ (హోంగార్డ్స్) బాల నాగాదేవీ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే హోంగార్డుల డిమాండ్లన్నీ ఒకేసారి చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుందని, మొదటి దఫాలో భాగంగా వేతన పెంపుపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నాయి.
అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న 21 వేల మంది హోంగార్డులకు హెల్త్‌కార్డులు అందించే ఆలోచన కూడా ఉన్నట్టు వివరించాయి. బస్ పాస్‌ల సౌకర్యం కల్పించాలని ఆర్టీసీకి త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం నుంచి అసెంబ్లీ పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో డీజీపీతో సీఎం కేసీఆర్ చర్చించడంతో హోంగార్డులకు తీపి కబురు అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
హోంగార్డుల డిమాండ్లు...