Home Guard
-
Home Guard: ఈశ్వర్.. సూపర్
జీవితంపై విరక్తి చెంది.. క్షణికావేశంలో చెరువులో దూకే వారి పాలిట ఆపద్బాంధవుడయ్యాడు ఆ (Home Guard)హోంగార్డు.. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మందికి పునర్జన్మ ప్రసాదించాడు.. ఆయా కుటుంబాల్లో చీకట్లు అలుముకోకుండా కొత్త ‘ఊపిరి’ పోశాడు.. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్(Saroor Nagar Police Station) పరిధిలోని చెరువు కట్టపై పోలీస్ ఔట్ పోస్ట్ ఇన్చార్జిగా 2020 నుంచి 2023 వరకు మూడేళ్లపాటు విధులు నిర్వర్తించాడు మంత్రి ఈశ్వరయ్య అలియాస్ ఈశ్వర్. అదే సమయంలో వివిధ కారణలతో సరూర్‌నగర్ చెరువులోకి దూకి ఆత్మ హత్యకు యత్నించిన 23 మందిని రక్షించాడు. బాధితులను రక్షించే క్రమంలో కొన్నిసార్లు ప్రాణపాయం వరకూ వెళ్లాడు. అయినా వెరవకుండా చెరువులో దూకేవారి ప్రాణాలను కాపాడాడు. అతని ధైర్య సాహసాలు, సేవలకు గుర్తింపుగా కేంద్రం ప్రతిష్టాత్మక భారత రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు ఇటీవల ఎంపికచేసింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతులమీదుగా ఈశ్వర్ అవార్డు అందుకోనున్నారు. కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని.. మహేశ్వరం(maheshwaram) మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఈశ్వర్ చిన్నప్పుడు బావులు, చెరువుల్లో ఈత నేర్చుకున్నాడు. స్నేహితులతో ఈత కొట్టే సమయంలో పోటీలు పెట్టుకుని మొదటి స్థానంలో నిలిచేవాడు. 2000 సంవత్సరంలో హోంగార్డుగా ఎంపికయ్యాడు. 2020లో సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. చెరువు కట్టపై పోలీస్ ఔట్ పోస్ట్ డ్యూటీ వేశారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. కాపాడే క్రమంలో అతడు కళ్ల ముందే చనిపోయాడు. ఈ సంఘటన (Ishwar)ఈశ్వర్‌ను కలిచివేసింది. అదే సమయంలో వివిధ కారణాలతో ఎంతోమంది చెరువులో దూకి ఆత్మ హత్యయత్నానికి పాల్పడుతుంటారని.. అలాంటి వారిని కష్టపడి రక్షించి ప్రాణాలు పోకుండా చూడాలని సీఐ సీతారామ్ చేసిన హితబోధ తన కర్తవ్యాన్ని గుర్తు చేశాయి. ఈ క్రమంలోనే రెండు రోజులకే చెరువులో దూకిన యువకుడిని కాపాడాడు. ప్రేమ విఫలమై, సంసారంలో కలతలు వచ్చి గొడవలు పడిన దంపతులను రక్షించాడు. గాయాలైనా వెరవక.. చెరువులో దూకిన వారిని రక్షించే క్రమంలో కష్టంగా ఉండేది. బరువుగా ఉన్న వారిని ఒడ్డుకు తీసుకువచ్చే క్రమంలో ఒక్కోసారి పట్టుకొని చెరువు లోపలికి లాగేవారు. చెరువులో ముళ్లు, రాళ్లు, పడేసిన సీసాల ముక్కలు కాళ్లకు తగిలి తీవ్ర గాయాలయ్యేవి. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని, చెరువులో దూకిన వారిని ప్రాణాలతో కాపాడాలని కుటుంబ సభ్యులు, ఏసీపీ, సీఐ, ఎస్ఐలు చెప్పి ప్రోత్సహించేవారు. అలా 23 మందిని రక్షించాడు. భారత రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు ఎంపికకావడంపై ఎంతో మంది పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈశ్వర్ ప్రస్తుతం మహేశ్వరం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: అప్పులు చేసి అమెరికా వెళ్లిన వారికి ఊహించని దెబ్బ!బాధ్యత మరింత పెంచింది: మంత్రి ఈశ్వరయ్యచెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిలో ప్రాణాలతో బయటపడ్డవారు ఇప్పటికీ ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. నీ వల్లే ఈరోజు బతికిబట్టకట్టామని, కొత్త జీవితాన్ని ఇచ్చావంటూ కృతజ్ఞతలు చెబుతుంటారు. వారు మాట్లాడుతుంటే నిజంగా గర్వంగా ఉంటుంది. రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. -
AP: మామూళ్లు ఇచ్చుకో.. వ్యభిచారం రైట్ రైట్!
చిత్తూరు జిల్లా: శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే నిందితులకు అండగా ఉంటూ ‘‘మేముండాం.. నువ్వు ఏమైనా చేసుకో.. మాకు మామూళ్లు ఇచ్చుకో.. మేం చూసుకుంటాం’’ అంటూ ఫోన్లో హోంగార్డ్, లాడ్జి నిర్వాహకుడి మధ్య జరిగిన సంభాషణ సోమవారం వాట్సాప్ గ్రాపుల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. వి.కోట పోలీస్ స్టేషన్లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పట్టణంలోని ఓ లాడ్జి నిర్వాహకుడి మధ్య వ్యభిచార నిర్వహణ.. మామూళ్లపై సెల్ఫోన్లో జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది.ఇందులో హోంగార్డు మాట్లాడుతూ ‘మాకు ప్రతి నెలా మామూళ్లు ఇచ్చుకుని లాడ్జిలో వ్యభిచారం(బ్రోతలింగ్) నిర్వహించుకో.. మన సార్ మనకు ముందుగా సమాచారం ఇస్తాడు. రైడింగ్ జరిగితే నేను నీకు ముందుగా సమాచారం ఇస్తాను. ఎవరికీ అనుమానం రాకుండా అమ్మా యిలను తెప్పించుకో.. మిగతా విషయాలు నేను చూసుకుంటా.. నువ్వు మాకు ప్రతి నెలా మామూళ్లు ఇస్తే చాలు.. జాగ్రత్త.’ అంటూ లాడ్జి నిర్వాహకుడితో జరిపిన సంభాషణ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తోంది. -
పోలీస్ స్టేషన్లోహోంగార్డు ఆత్మహత్యాయత్నం
ఘట్కేసర్: ఓ హోంగార్డు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పరుశురాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా , మక్త అనంతారం గ్రామానికి చెందిన మహ్మద్ ఘని హైమద్ చెర్లపల్లి పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 258, 268లో 30 గుంటల భూమి ఉంది. దాయాదులు అఫ్జల్, జబ్బార్ తన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకోకుండా అడ్డుకుంటున్నారని మంగళవారం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. అయినా తనకు న్యాయం చేయడం లేదని మనస్తాపానికి లోనైన మహ్మద్ ఘని బుధవారం సాయత్రం బాటిల్లో డీజిల్ తీసుకుని స్టేషన్‌కు వచ్చాడు. నేరుగా ఇన్స్పెక్టర్ క్యాబిన్లోకి వెళ్లిన అతను ఆయన ఎదుటే డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తక్షణమే స్పందించిన ఇన్స్పెక్టర్, ఇతర పోలీసులు అతడి నుంచి డీజిల్ బాటిల్‌ను లాక్కున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ మేరకు అతడిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
టిక్ టాక్ బామ్మ.. వయసు 78.. ఫాలోవర్లు 23 వేలు
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ ట్రెండింగ్ డ్యాన్స్ ఇరగదీస్తున్న విజయలక్ష్మి బంజారాహిల్స్: ఆమె భామ కాదు.. బామ్మ.. స్టేజీ ఎక్కి డ్యాన్స్ మొదలెట్టిందంటే చాలు.. కుర్రకారు ఈలలు, గోలలు.. ఆమె డ్యాన్స్ చూస్తే పెద్దవాళ్లు ఐనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.. ఆమె వేసే స్టెప్పులకు కురీ్చల్లో నుంచి అమాంతం లేసి చప్పట్లు చరవాల్సిందే.. ఇంతకూ ఆ బామ్మ వయసు ఎంతో తెలుసా..! సరిగ్గా 78 ఏళ్లు.. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 23 వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. టిక్ టాక్ భామ్మగా పిలుచుకునే ఆమె పేరు విజయలక్ష్మి. పదేళ్ల పాటు హోంగార్డుగా.. బాలానగర్‌కు చెందిన విజయలక్ష్మి పదేళ్లపాటు హోంగార్డుగా పనిచేసింది. బాలనగర్, కూకట్పల్లి, చందానగర్, జీడిమెట్ల, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది. మనువడు ఫోన్ చూసే క్రమంలో ఆమె టిక్ టాక్‌లో తనకు ఒక ఖాతాను ఏర్పాటు చేసుకుంది. డ్యాన్స్ చేయడం, నటులను అనుకరించడం, డైలాగ్‌లకు అనుగుణంగా నటించడం ప్రారంభించింది. ఇంకేముంది ఆమెను ఫాలో చేసే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. దీంతో టిక్ టాక్ బామ్మగా ఆమెకు ఎక్కడలేని గుర్తింపు వచి్చంది. అదే సమయంలో టిక్‌టాక్ నిషేధించడంతో టికి అనే మరో యాప్‌లోకి వెళ్లింది. అందులోనూ దాదాపు 2.5 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. అది కూడా బ్యాన్ కావడంతో బామ్మ తాజాగా ఇన్‌స్టా వైపు మళ్లింది.యూత్ ఫిదా.. తన ఇద్దరు కుమారులకు దూరమై ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి అక్కడక్కడ నృత్య కార్యక్రమాలకు హాజరయ్యేది. ఈ క్రమంలోనే సినీనటి కరాటే కళ్యాణితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ఆమెతోనే ఉంటోంది. బామ్మ నృత్యాలకు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాలో ఇప్పటికే దాదాపు 3300 డ్యాన్స్ వీడియోలను పోస్టు చేసింది. ఇటీవల ఆమె వినాయకుడి మండపం వద్ద వేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. క్లాస్ అయినా, మాస్ అయినా పాట ఏది వచి్చనా ఆమె స్టెప్పులను ఎవరూ ఆపలేరు. యువతతో కలిసి డ్యాన్స్ చేయడానికి బామ్మనే పోటీపడుతుంది. ఈ వయసులోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా డ్యాన్స్ చేసే ఆ బామ్మ ప్రతిరోజు యోగ చేస్తుంది. మితమైన, పోషకాహారం తీసుకుంటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది.సినిమాల్లోకి.. ప్రస్తుతం బామ్మ సినిమాల వైపు అడుగులు వేసింది. విడుదలకు సిద్ధమైన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రంలో ఆమె బామ్మ పాత్రలో నటించింది. ఇదే కాకుండా కొన్ని ఛానెళ్లలో బామ్మ మాట పేరుతో సుభాషిౠతాలు, విలువలు, మానవ సంబంధాల గురించి వివరిస్తుంది. ఈ బామ్మకు సినీ పరిశ్రమలోనూ పలువురు ఇన్‌స్టా అభిమానులు ఉన్నారు. -
దొంగలతో కలిసిన కానిస్టేబుళ్లు, హోంగార్డు..
⇒ నిందితులను లోతుగా విచారించగా.. వీరికి గాందీనగర్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించే కె.అశోక్ (45), కానిస్టేబుల్ పి.సోమన్న (38), సైఫాబాద్ ఠాణా కానిస్టేబుల్ సాయిరామ్ (34)లు సహకరిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. నిందితుల బృందంలోని సభ్యుడు షానవాజ్‌ను ఎస్.ఆర్.నగర్ పోలీసులు ఒక కేసు నిమిత్తం గతంలో అరెస్టు చేశారు. ఆ సమయంలో హోంగార్డు అశోక్ ఎస్.ఆర్.నగర్ క్రైమ్ విభాగంలో విధులు నిర్వర్తించేవాడు.నిందితుడు షానవాజ్‌ను చోరీ కేసు నుంచి ఇతను బయటపడేశాడు. నిందితుల బృందం ఎప్పుడు హైదరాబాద్‌కు వచి్చనా హోంగార్డు అశోక్‌కు గ్రూప్ సభ్యుల ఫొటోలు పెట్టి వీరు మనవారే.. ఎక్కడైనా దొరికితే పట్టుకోవద్దు అని ముందుగానే సమాచారం పంపుతాడు. ⇒ గత జూన్ నెలలో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిందితుల గ్రూప్‌లో ఒక సభ్యుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు షానవాజ్.. హోంగార్డు అశోక్‌కు ఫోన్ చేసి తనను విడిపించాలని కోరాడు. అశోక్ గాం«దీనగర్ పోలీస్‌స్టేషన్‌లో పని చేసే సోమన్న అనే కానిస్టేబుల్ సాయంతో సైఫాబాద్‌లో విధులు నిర్వహించే సాయిరామ్‌కు చెప్పి నిందితుడిని తప్పించారు. ఇందుకోసం ఈ గ్రూప్‌లోని సభ్యుడు హోంగార్డు భార్య అకౌంట్‌కు ఆన్లైన్ ద్వారా రూ.19 వేలు ద్వారా పంపగా.. హోంగార్డు సోమన్నకు రూ.6 వేలు ఇచ్చాడు. సోమన్న సాయిరామ్‌కు రూ.3 వేలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఆధారాలతో సహా దొరకడంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నామని బృందాన్ని నడిపించే ప్రధాన నిర్వాహకులు ఝార్ఖండ్‌కు చెందిన కంచన్ నోనియా (34), రాహుల్ కుమార్ యాదవ్ (30)తో పాటు షాను (25), రింకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
Sowmya Janu: దాడి చేసింది సినీనటి సౌమ్య జాను
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హోంగార్డుపై దాడికి పాల్పడింది సినీనటి సౌమ్యజాను గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన ఓ మహిళ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడిపై దాడికి పాల్పడింది. పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా సంఘటనకు కారణమైన మహిళను సినీనటి సౌమ్య జానుగా గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా అందుబాటులో లేదని తెలిపారు. ఆమె సెల్ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయన్నారు. ఆమెపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సౌమ్యజాను సంఘటన అనంతరం ఓ చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో తాను అత్యవసర పనిపై వెళుతూ రాంగ్రూట్లో వచి్చనట్లు అంగీకరించారు. అయితే తనను అక్కడ విధుల్లో ఉన్న పోలీసు బూతులు తిట్టినందునే తాను ఎదురుదాడి చేయాల్సి వచి్చందన్నారు. తాను అతని లైఫ్ జాకెట్ చించలేదని తెలిపారు. తాను కూడా హోంగార్డుపై ఫిర్యాదు చేస్తానన్నారు. తనను పోలీసులు విచారణకు పిలవలేదని ఆమె స్పష్టం చేశారు. -
హోంగార్డు ఉద్యోగాల పేరిట ఐపీఎస్ అధికారి ఘరాన మోసం
మంగళగిరి: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఓ ఐపీఎస్ అధికారి శఠగోపం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక ఐపీఎస్ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. ఏలూరులో పనిచేసిన సమయంలో ఏలూరుకు చెందిన ఒక మహిళతో సహజీవనం చేశారు. అనంతరం ఐజీపీ హోంగార్డు రాష్ట్ర అధికారిగా పనిచేసిన సమయంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఐజీపీ సహకారంతో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మందికిపైగా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. అధికారి ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. అధికశాతం మందికి పోస్టింగులు ఇవ్వలేకపోయారు. దీంతో నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో 2022లో ఐజీపీ హోంగార్డ్స్ పేరుతో తాను పోస్టులో లేకపోయినా తనే ఐజీపీ హోంగార్డు అయినట్లు సంతకాలు చేసి నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చారు. వాటితో అభ్యర్థులు పోలీస్ ఉన్నతాధికారులను కలవగా అనుమానం వచ్చి రహస్యంగా విచారణ చేశారు. అవి నకిలీ అపాయింట్మెంట్లు అని తేలడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే సమయంలో బాధిత నిరుద్యోగి తలాజి విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలతో విస్తుపోయినట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కొంతనగదు దళారుల ఖాతాల నుంచి ఐజీపీతోపాటు ఆయన ప్రియురాలి ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో విల్లాలు కొన్నట్టు సమాచారం. దీంతో అధికారి ప్రియురాలి పెద్ద అల్లుడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన దళారులు ఏడుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరెస్టులతో అప్రమత్తమైన అధికారి మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. -
ఖమ్మం జిల్లా కల్లూరులో ఎస్ఐ Vs హోంగార్డు..
కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన హోంగార్డు సిరసాని రాంబాబు(సస్పెన్షన్‌లో ఉన్నారు) తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా జిల్లా హోంగార్డుల వాట్సాప్ గ్రూప్‌లో శుక్రవారం మెసేజ్ పెట్టడం పోలీసు శాఖలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్ మృతి విషయం మరువకముందే.. ఈ మెసేజ్ పెట్టడం, విషయం ఆనో టా ఈనోటా బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో సిరసాని రాంబాబుతో ‘సాక్షి’మాట్లాడగా, హోంగార్డులు పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, చాలీచాలని జీతంతో ఇబ్బందిపడుతున్నారని వాపోయాడు. కల్లూరులో భూమి విషయంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కొందరు తన తల్లిదండ్రులపై ఫిబ్రవరి 10న దాడి చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ సమయాన వేరే ప్రాంతంలో ఉన్న తాను ఫిబ్రవరి 28న ఎస్ఐ పి.రఘుతో కేసు విషయమై మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్ప డమేకాక ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహ త్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆరోపణల్లో వాస్తవం లేదు: ఎస్ఐ సస్పెండ్ అయిన హోంగార్డు సిరసాని రాంబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కల్లూరు ఎస్ఐ పి.రఘు స్పష్టం చేశారు. భూమి అక్రమంగా ఆయనే ఆక్రమించాడని, ఇతర ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు. గతంలో తోటి హోంగార్డును కొట్టి సస్పెండ్ అయ్యి జైలుకు వెళ్లి రాగా, కొంత కాలానికి విధుల్లో తీసుకున్నట్లు తెలిపారు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోగా, మద్యం సేవించి విధులకు వస్తుండడంతో సస్పెండ్ చేశారని వెల్లడించారు. -
డిపార్ట్మెంట్లో కాకుండా వేరే ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వాలని కోరా: సంధ్య
-
నా భర్తను హోంగార్డు ఆఫీస్ వాళ్లే చంపారు: రవీందర్ భార్య
-
హోంగార్డ్ రవీందర్ మృతిపై కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: హోమ్ గార్డ్ రవీందర్ మృతి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 306 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో ఏఎస్ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు పేర్లను నిందితులుగా చేర్చారు. జీతం గురించి అడిగితే ఏఎస్ఐ, కానిస్టేబుల్ అవమానించారని మృతుడు హోమ్ గార్డ్ రవీందర్ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు చెప్పారు. కాగా.. హోంగార్డు అంశం తెలంగాణ హైకోర్టుకు చేరింది.హోంగార్డ్ రవీందర్ చావుకు కారణమైన అధికారులను శిక్షించాలని పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను హోమ్ గార్డ్ JAC దాఖలు చేసింది.హోంగార్డ్ రవీందర్ చావుతో జేఏసీ సభ్యులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అధ్యక్షుడు నారాయణను అరెస్ట్ చేశారని ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియదని పిటిషన్లో జేఏసీ పేర్కొంది.హోంగార్డ్ రవీందర్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇదీ చదవండి: నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే:హోంగార్డ్ రవీందర్ భార్య సంచలన ఆరోపణలు -
హోంగార్డు రవీందర్ మృతి..ఉస్మానియా వద్ద హైటెన్షన్ వాతావరణం
-
హోంగార్డు రవీందర్ మృతిపై భార్య కన్నీరు మున్నీరు
-
నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్ భార్య
సాక్షి, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ సూసైడ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘నా భర్తను తగలబెట్టారు. కానిస్టేబుల్‌చందు, ఏఎస్ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె. తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. "నా భర్త ఫోన్ అన్‌లాక్ చేసి మొత్తం డేటా డిలీట్ చేశారు. హమీద్ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్ బంక్‌లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారామె. జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు. రవీందర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. -
హోంగార్డ్ రవీందర్ మృతి
-
హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: టైంకి జీతం పడలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి చెందారు. చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో వైద్యులు ప్రకటించారు. నాలుగు రోజుల కిందట.. జీతాలు పడలేదనే ఆవేదనతో ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. తీవ్ర గాయాలైన ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. హోంగార్డ్ రవీందర్ మృతిపై హోంగార్డ్ జేఏసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏం జరిగిందంటే.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. సకాలంలో జీతాలు అందక.. బ్యాంక్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అవుతోందన్న మనస్థానంతో రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 55 శాతం పైగా కాలిన గాయాలతో ఆయన తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఆపై పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. వేధింపులు కూడా.. అయితే ఆయన భార్య సంధ్య మాత్రం.. సకాలంలో జీతం అందకపోవడం మాత్రమే కాదని.. అధికారుల వేధింపులు కూడా తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణమని చెబుతున్నారు. జీతాలు అందకపోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు తన భర్తకి మంచి చికిత్స అందించలేని స్థితిలో ఉన్నానని, హోంగార్డుల దుస్థితికి ఇది నిదర్శనమని ఆమె పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ స్పందించాలంటూ కోరారామె. మరోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటన హోంగార్డుల్లో ఆవేశాగ్రహాలకు దారి తీసింది. విధుల బహిష్కరణతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణకు పిలుపు ఇచ్చింది హోంగార్డ్ జేఏసీ. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలంటూ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రవీందర్‌కు మద్దతుగా హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని సంఘీభావం కూడా ప్రకటించారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. రాజకీయ విమర్శలు ఇంకోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం రాజకీయ దుమారం రేపింది. ఎమ్మెల్యే రాజాసింగ్.. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వమే రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి రవీందర్‌ను, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. కనీస హక్కులను కూడా పరిరక్షించకుండా.. హోంగార్డ్ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని, హామీ ఇచ్చి ఐదేళ్లైనా హోంగార్డుల ఉద్యోగ భద్రత విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
నా భర్త లాస్ట్‌స్టేజీలో ఉన్నారు.. హోంగార్డు నాగమణి వీడియో వైరల్
ఖలీల్‌వాడి: సీఎం సారూ.. హోంగార్డులను పర్మినెంట్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్‌స్టేషన్ హోంగార్డు నాగమణి చేసిన వీడియో వైరల్ అయ్యింది. గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్ భార్య అనుభవిస్తున్న బాధను తాను కూడా అనుభవిస్తున్నట్లు చెప్పారు. ‘‘నా భర్త సాయికుమార్ లాస్ట్‌స్టేజీలో ఉన్నారని డాక్టర్లు చెప్పారు. పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాం.. చాలా ఇబ్బందులు పడుతున్నాం. నాలా చాలా మంది హోంగార్డులు తమ వ్యక్తిగత బాధలను చెప్పుకోలేక పోతున్నారు. చాలీచాలని జీతాలతో బతకలేకపోతున్నాం. హాస్పిటల్ ఖర్చులు, స్కూల్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం.. పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నామే గాని మావి విలువ లేని బతుకులు.. సీఎం సారు హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని గతంలో చెప్పారు అందుకే అడుగుతున్నాం..హోంగార్డు యూనియన్ నేతలైన ఏడుకొండలు, ప్రేమ్, రాజేందర్, ఇబ్రహీం, వెంకటేశ్, శివన్న సీఎం సార్‌కు ఈ వీడియోను చేరే వరకు పంపండి’’అని ఆ వీడియోలో కోరారు. తామూ తెలంగాణ బిడ్డలమేనని హోంగార్డులకు న్యాయం చేస్తే సీఎం కేసీఆర్ ఫొటో పెట్టుకొని బతుకుతామని ఆ వీడియోలో ఆమె వ్యాఖ్యానించారు. చదవండి: హోంగార్డులూ..ఆత్మహత్యలు చేసుకోకండి -
హోంగార్డులూ..ఆత్మహత్యలు చేసుకోకండి
సంతోష్ నగర్: హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..పోరాడి హక్కులు సాధించుకుందామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయస్థితిలో అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ను ఆయ న గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హోంగార్డుల విషయంలో శ్రమదోపిడీ జరుగుతోందని..వారికి కనీస హక్కు లు ఇవ్వడం లేదన్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. ఈ ఘటనపై విచారణ జరగాలన్నారు. ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ధర్నాకు కిషన్‌రెడ్డి మద్దతు: అపోలో డీఆర్డీఓ ఆస్పత్రి ఆవరణలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న హోంగార్డులకు కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారు. 17 సంవత్సరాలుగా హోంగార్డుగా సేవలు అందిస్తున్న రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. మనం అవసరమైతే పోరాటం చేద్దాం కానీ.., ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాగా, హోంగార్డులను ఇలాంటి పరిస్థితిలో తాను ఎప్పుడూ చూడలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. అంతకు ముందు ఆయన రవీందర్‌ను పరామర్శించారు. -
రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉంది: ఈటల రాజేందర్
-
పోయి కేసీఆర్ ని అడుక్కో..హోమ్ గార్డ్ ఆడియో లీక్ వైరల్
-
అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా
అఫ్జల్‌గంజ్/సంతోష్‌నగర్: న్యాయంగా రావాల్సిన జీతాన్ని అడిగేందుకు వెళ్లిన తనను హోంగార్డు కార్యాలయ సిబ్బంది దూషించడంతోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు హోంగార్డు రవీందర్ తెలిపారు. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రక్షాపురం నివాసి రవీందర్ తనకు రావాల్సిన జీతం కోసం గోషామహల్‌లోని హోంగార్డు కార్యాలయానికి మంగళవారం వెళ్లారు. అక్కడి సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలు కాగా వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రవీందర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. హోంగార్డు అంటే ప్రతి నెలా 1వ తారీఖునే జీతాలిచ్చేయాలా అని చిన్నచూపు చూశారని ఆవే దన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానం రాష్ట్రంలోని ఏ హోంగార్డుకూ జరగకూడదన్నారు. కాగా ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రవీందర్‌ను రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్ నారాయణ పరామర్శించారు. రవీందర్ భార్య సంధ్యతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రవీందర్‌కు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 16 వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నిరసన తెలిపిన హోంగార్డులు..: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ బుధవారం సాయంత్రం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రి ఆవరణలో హోంగార్డులు ఆందోళనకు దిగారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలనీ, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సీఎందే బాధ్యత: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రవీందర్ ఆత్మహత్యాయ త్నా నికి కేసీఆరే బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా 2017లో సీఎం కేసీఆర్ హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. హోంగార్డులకు బీజేపీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: బండి అమెరికా పర్యటనలో ఉన్న ఎంపీ బండి సంజయ్ బుధవారం రాత్రి (భారత సమయం) హోంగార్డు కుటుంబ సభ్యులతోపాటు హోంగార్డ్ అసోసియేష న్ జేఏసీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ వీడియోకాల్ చేసి మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ దృశ్యాలను వెంటనే బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. -
రవీందర్‌కు సీరియస్.. విధుల బహిష్కరణకు హోంగార్డ్ జాక్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: జీతాల ఆలసత్వంపై ఆవేదనతో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న హోంగార్డు జేఏసీ ఆస్పత్రికి చేరుకోగా.. బుధవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీందర్‌కు మద్దతుగా.. ఉస్మానియా హాస్పిటల్‌కు భారీగా తరలి రావాలని హోం గార్డ్ JAC పిలుపు ఇచ్చింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. అదే సమయంలో.. హోంగార్డులు ఎవరు అఘాయిత్యాలకు ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేసింది. జేఏసీ పిలుపు మేరకు హోంగార్డులు ఉస్మానియాకు తరలి వస్తున్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. సకాలంలో జీతం రావట్లేదనే ఆవేదనతో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. 55 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడరు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మరోవైపు హోంగార్డులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై అధికార కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది హోంగార్డుల జేఏసీ. ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ.. హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి అని డిమాండ్ చేశారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న 22వేల హోంగార్డులను పర్మినెంట్ చేయాలన్నారు. మరొక హోంగార్డు రవీందర్ మాదిరి ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. -
గుండెపోటుతో హోంగార్డు మృతి
అనంతపురం: మండలంలోని అండేపల్లి గ్రామానికి చెందిన హోంగార్డు ఎర్ర మారెన్న (41) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి రాయదుర్గం పోలీసుస్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను తోటి సిబ్బంది వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య నాగమణి, ముగ్గురు కుమారైలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కె.శ్రీనివాసరావు బుధవారం ఉదయం అండేపల్లి గ్రామానికి చేరుకుని బాధత కుటుంబసభ్యులను పరామర్శించారు. మారెన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మారెన్న భార్య నాగమణికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసానిచ్చారు. అంత్యక్రియలకు రూ.10 వేల తక్షణ సాయాన్ని అందజేశారు. అలాగే హోంగార్డు వెల్పేర్ అసోసియేషన్ తరపున రూ.10 వేల ఆర్థిక సాయాన్ని డీఎస్పీ బి.శ్రీనివాసులు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు లక్ష్మణ, శ్రీనివాసులు, ఎస్ఐలు రాజేష్, సుధాకర్, ఆర్ఎస్ఐ మక్బూల్, హోంగార్డు ఇన్చార్జ్ ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మారెన్న మృతదేహానికి రాష్ట్ర జానపద, సృజనాత్మక ఆకాడమీ డైరెక్టర్ బాబురెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్, సచివాలయ మండల కన్వీనర్ సాకే గంగాధర్, ఎంపీటీసీ మల్లేష్ ఘనంగా నివాళులర్పించారు. -
హోంగార్డు మృతి.. పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు
ఒడిశా: హోంగార్డు అనుమానాస్పద మృతి ఘటనలో జిల్లా ఎస్పీ వివేకానంద శర్మ ఆదేశాల మేరకు ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసిన మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పుటాసింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పుటాసింగి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అవినాష్ లిమ్మ(33) సోమవారం రాత్రి అనుమనాస్పద రీతిలో పుటాసింగిలోని ఓ మండపంపై శవమై కనిపించాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసు శాఖ నుంచి సరైన స్పందన లేకపోవడంతో మతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లిన లిమ్మ కుటుంబీకులు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. విషయం జిల్లా ఎస్పీ వివేకానంద శర్మ దృష్టికి వెళ్లడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఎలా అప్పగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతికి గల పూర్తి కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిని గ్రామానికి చేరుకున్న సిబ్బంది.. పూడ్చి పెట్టి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లిమ్మ కుటుంబీకులు, గ్రామస్తులు దీనిపై వ్యతిరేక వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు వారికి నచ్చజెప్పి, మృతదేహాన్ని వెలుపలికి తీశారు. అనంతరం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించి, భద్రపరిచారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం చేయనున్నారు. అయితే ఇది హత్య? లేక సహజ మరణమా అనే వివరాలు పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. -
రోడ్డుకు అడ్డంగా పడుకుని పోలీసు వినూత్న నిరసన.. ఏం జరిగిందంటే?
ఛండీఘర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల అవినీతిని భరించలేక.. ఓ హోంగార్డ్ వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసనకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ హోంగార్డ్.. తోటి పోలీసులు అవినీతి చూసి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో హైవేకు అడ్డుగా ఓ తాడు కట్టి వాహనాలను నిలిపివేశాడు. అనంతరం.. రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. ‘నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు’ అంటూ భోగ్పూర్ ప్రాంతంలో పఠాన్‌కోట్ హైవేపై నిరసనకు దిగాడు. ఇది చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో అక్కడే మరో పోలీసు అధికారి.. నిరసనకు దిగిన హోంగార్డ్ను పైకిలేపే ప్రయత్నం చేశాడు. హోంగార్డ్ వినకపోవడంతో అతడిని కాలితో తన్నాడు. దీంతో, ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఇక, ఈ ఘటనపై భోగ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సుఖ్జిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక గొడవకు సంబంధించి ఓ యువకుడిని హోంగార్డు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. అది మంజూరు చేయబడింది. దీని తర్వాత అతను విడుదలయ్యాడు. హోంగార్డు జవాన్‌ను తన్నలేదని సుఖ్జిత్ సింగ్ పేర్కొన్నారు. ‘Jehra mai chor fad ke liauna oh Thane Wale paise laike chadi jande’ रिश्वतखोरी से दुखी हो कर पुलिस मुलाजिम ने #jalandhar के भोगपुर में रोड जाम कर विरोध प्रदर्शन किया। #PunjabPolice pic.twitter.com/QyajO37Cvd — Harpinder Singh (@HarpinderTohra) July 22, 2023 ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అరెస్ట్ -
నకిలీ హోంగార్డుల కేసు ఏసీబీకి..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో వెలుగుచూసిన నకిలీ హోంగార్డుల నియామకం కుంభకోణం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి బదిలీ అయింది. కేసును పోలీసుశాఖ నుంచి ఏసీబీకి బదిలీచేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు కేవలం ఏడుగురు నిందితులుగా ఉన్న ఈ కేసులో ఇప్పుడు మరో 86 మందిని చేర్చారు. మొత్తం నిందితులు 93 మందిలో.. నకిలీ హోంగార్డులు 90 మంది, విధుల నుంచి తొలగించిన హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. అక్రమాలకు పాల్పడినవారిలో వణుకు ఈ కేసు దర్యాప్తును ఏసీబీ చేపట్టడంతో అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు, పోలీసుల్లో వణుకు మొదలైంది. నకిలీ హోంగార్డుల నుంచి టీడీపీ నేతలు వసూలు చేసిన రూ.5 కోట్లలో చిత్తూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత సింహభాగాన్ని చినబాబుకు ముట్టచెప్పినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో డీఎస్పీలు, జిల్లా పోలీసుశాఖకార్యాలయంలో పనిచేసే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, నాటి ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో సాక్ష్యాలు సేకరించి నిందితులకు ఉచ్చు బిగించడంపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు. దొడ్డిదారిన నియమించిన అధికారులు 2014 నుంచి 2019 వరకు విడతలవారీగా చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో 90 మంది హోంగార్డులను చేర్చారు. పోలీసుశాఖ నుంచి నోటిఫికేషన్ లేకుండా, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా కొందరు పోలీసు అధికారులు, తెలుగుదేశం నేతలు కలిసి వీరిని చేర్పించేశారు. ఈ దొడ్డిదారి నియామకాల్లో నాటి టీడీపీ ప్రభుత్వ మంత్రి నుంచి జిల్లాకు చెందిన టీడీపీ తమ్ముళ్లు ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. టీడీపీ నేతలు చెప్పిందే చాలు అన్నట్టు.. పోలీసుశాఖలోని పెద్ద హోదాల్లో పనిచేసిన అధికారులు ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ హోంగార్డులను ఆన్–పేమెంట్ కింద టీటీడీ, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ, విద్యుత్‌శాఖ, రవాణాశాఖ, లా అండ్ ఆర్డర్ విభాగాల్లో చొప్పించేశారు. దొడ్డిదారిన, తప్పుడు డ్యూటీ ఆర్డర్ (డీవో)లతో పోస్టులు పొందిన నకిలీ హోంగార్డులకు ప్రభుత్వం రూ.12 కోట్లకుపైగా వేతనాలు కూడా చెల్లించింది. ఈ బాగోతాన్ని గుర్తించిన చిత్తూరు జిల్లా పోలీసుశాఖ గతేడాది జూలై 16వ తేదీన ఏఆర్ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డిసెంబర్ 11న ఏడుగురిని (నకిలీ హోంగార్డులు నలుగురు, విధుల నుంచి తొలగించిన హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్‌ను) అరెస్టు చేశారు. రూ.కోట్లు చేతులు మారడం, పోలీసుశాఖలోని ఉద్యోగుల ప్రమేయం ఉండటంతో డీజీపీ ఈ కేసును ఏసీబీకి బదిలీ చేశారు. -
AP: 87 మంది హోంగార్డులు తొలగింపు.. ఏ ఒక్కర్నీ వదలం
సాక్షి, చిత్తూరు: అందరి తప్పొప్పుల్ని సరిదిద్దే పోలీసు శాఖలోకే తప్పుడు పత్రాలతో ప్రవేశిస్తే.. ఇలా దాదాపు ఎనిమిదేళ్లుగా నెలనెలా జీతాలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తే.. అవును, చిత్తూరు పోలీసు జిల్లాలో అక్షరాలా ఇదే జరిగింది. ఇందుకు ప్రధాన బాధ్యులు టీడీపీ నేతలు.. వారి మాటను కాదనలేకపోయిన అప్పటి పోలీసు ఉన్నతాధికారులు. ఈ ఘటనలో 87 మంది హోంగార్డులను తొలగిస్తూ శనివారం అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు జిల్లా పోలీసు శాఖను కుదిపేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. బయటపడింది ఇలా.. హోంగార్డుల్లో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి పోలీసు శాఖలోని స్టేషన్లలో పనిచేయడం. వీళ్లకు ప్రభుత్వం నుంచే వేతనాలు అందుతాయి. రెండోది.. ఆన్–పేమెంట్. అగి్నమాపక, టీటీడీ, ఆరీ్టసీ, రవాణాశాఖ, ఎఫ్‌సీఐ లాంటి సంస్థల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీళ్లకు ఆయా శాఖల నుంచి ప్రతీనెలా వేతనాలు అందుతాయి. ఈ సంస్థల్లో పనిలేనప్పుడు వీరిని పోలీసుశాఖకు అప్పగిస్తారు. ఆ సమయంలో వాళ్లకు వేతనాలు చెల్లించరు. పని ఉంటేనే వేతనాలు చెల్లిస్తారు. ఇటీవల ఇలాంటి హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేటపుడు చిత్తూరు ఆర్ఐ మురళీధర్ ఉండాల్సిన వాళ్లకంటే కొందరు ఎక్కువగా ఉండటంతో విషయాన్ని ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, మూణ్ణెల్ల క్రితం వన్‌టౌన్‌లో ఆర్ఐ మురళీధర్ ఈ విషయమై ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత మణికంఠ అనే హోంగార్డును విచారించగా.. చిత్తూరుకు చెందిన టీడీపీ నేతల ఆదేశాలతో తాను, యువరాజ్, జయకుమార్, కిరణ్ తదితరులు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డబ్బులు వసూలుచేసి, అప్పటి అధికారులకు లంచంగా ఇచ్చి హోంగార్డు ఉద్యోగాలు పొందినట్లు అంగీకరించాడు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన ఎస్పీ మరిన్ని వివరాలు రాబట్టారు. చదవండి: (కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి) అరెస్టులకు న్యాయపరమైన సలహాలు హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేపుడు పాస్‌పోర్టు, డీఓ (డ్యూటీ ఆర్డర్)ను అధికారులు ఇస్తుంటారు. ఇలా ఇచ్చేటపుడు నిజమైన హోంగార్డును పుత్తూరు అగి్నమాపక శాఖలో విధులు కేటాయిస్తున్నట్లు టైపుచేసి, ఇతనితో పాటు అదనంగా మరో ఐదుగురు నకిలీ హోంగార్డుల పేర్లను టైపుచేసి డీఓ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంటారు. ఇలా ఏకంగా 87 మందిని పలు సంస్థల్లో నియమించేశారు. ఇందులో కీలకపాత్ర పోషించింది టీడీపీ హయాంలో చినబాబుకు కుడిభుజంగా మెలగిన చిత్తూరు జిల్లా పార్టీ నేతగా తెలుస్తోంది. ఇతను ఆడమన్నట్లు ఆడిన అప్పటి చిత్తూరు పోలీసు బాసు, ఓ ప్రత్యేక డీఎస్పీ సైతం ఈ కుంభకోణంలో చిక్కుకున్నారు. మరోవైపు.. చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరుకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు కొందరు దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలుచేసిన మొత్తంలో కొంత ఉన్నతాధికారులకు ఇచ్చి మిగిలిన సొమ్ము చిన్నబాబుకు అందజేశారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అప్పటి ఐపీఎస్ అధికారి, డీఎస్పీలు, ఆర్ఐలతో పాటు టీడీపీ నేతలను అరెస్టుచేయడానికి పోలీసులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తమ్ముళ్లలో వణుకు.. నిజానికి.. పోలీసుశాఖలో అంతర్లీనమైన హోంగార్డులు విధుల్లోకి చేరాలంటే నోటిఫికేషన్, శారీరక దేహదారుఢ్య పరీక్షలు, తుదిగా రాత పరీక్షల్లో ప్రతిభ చూపించడం తప్పనిసరి. అయితే, ఇవేమీ లేకుండా 2014–2019 మధ్య కాలంలో చిత్తూరు జిల్లా పోలీసుశాఖలోకి దాదాపు 87 మంది హోంగార్డులు చేరిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నకిలీ హోమ్‌గార్డులు నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హోంగార్డుల తొలగింపు విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో చిత్తూరుకు చెందిన తెలుగు తమ్ముళ్లు వణికిపోతున్నారు. ఏ ఒక్కర్నీ వదలం ఇది చాలా పెద్ద నేరం. అసలు ఎలాంటి పరీక్షలు, శిక్షణ లేకుండా పోలీసుశాఖలో చేరిపోవడం అంటే తమాషా కాదు. ప్రాథమికంగా 87 మంది హోంగార్డులను డీఐజీ తొలగించారు. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఉద్దేశ్యపూర్వకంగా తప్పు అని తేలితే ఆ హోంగార్డులను సైతం అరెస్టుచేస్తాం. ఈ కుట్రలో పాలు పంచుకున్న వాళ్లు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదు. – వై. రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు. -
చెత్తబుట్టలో వేసేందుకు యత్నం.. చిన్నారిని రక్షించిన ట్రాఫిక్ హోంగార్డు
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తాగిన మైకంలో ఓ యాచకురాలు ఏడాదిలోపు వయసున్న చిన్నారిని కోణార్క్ థియేటర్ ముందున్న చెత్తబుట్టలో వేసేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నహోంగార్డు రామకృష్ణకు సమాచారం చేరవేశారు. విషయం తెలుసుకున్న హోంగార్డు.. వెంటనే పరుగులు తీసి చిన్నారిని రక్షించాడు. చిన్నారికి సపర్యలు చేసి తల్లి ఒడికి చేర్చాడు. హోం గార్డు రామకృష్ణ చూపిన మానవత్వానికి పనికి అక్కడున్న స్థానికులు అభినందనలు తెలియజేశారు. -
ఎస్ఐ పాడుబుద్ధి.. మహిళా హోంగార్డుతో పరిచయం పెంచుకుని..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళా హోంగార్డును మోసం చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) ఎస్ఐని ‘దిశ’ పోలీసులు అరెస్టు చేశారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్‌కుమార్ మంగళవారం ఈ కేసు వివరాలను మచిలీపట్నంలో మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి సెబ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కొమ్మా కిరణ్‌కుమార్.. బందరు సబ్‌జైలులో పని చేస్తున్న మహిళ హోంగార్డుతో పరిచయం పెంచుకున్నాడు. నాలుగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. చదవండి: గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్ ఆమె వద్ద పలుమార్లు డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇటీవల ఇంటి అవసరాల నిమిత్తం కిరణ్‌ను ఆమె డబ్బులడిగింది. ‘డబ్బులివ్వను.. ఏమి చేసుకుంటావో చేసుకో’ అంటూ అతను బెదిరించడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు సోమవారం ‘స్పందన’లో ఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే ఎస్ఐ కిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ‘దిశ’ పోలీసులను ఆదేశించారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్‌కుమార్ కేసు నమోదు చేసి 24 గంటల్లో కిరణ్‌ను అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు రాజీవ్ చెప్పారు. -
జ్యూస్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం
బంజారాహిల్స్ (హైదరాబాద్): మహిళా ఉద్యోగినికి జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ హోంగార్డు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి డబ్బుల కోసం డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్టీఏలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి తన భర్త నుంచి విడిగా ఉంటోంది. 2018లో ఆమె ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ ఆమెకు ఆర్టీఏలో పనిచేసే హోంగార్డు స్వామి పరిచయమయ్యాడు. అతనే ఆమెకు అద్దె ఇల్లు చూపించి పిల్లలను స్కూల్లో జాయిన్ చేశాడు. ఆమె కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ నమ్మకం పెంచుకున్నాడు. ఆమె ద్వారా కుటుంబ విషయాలు అన్ని తెలుసుకున్నాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై కన్నేసిన స్వామి ఓ పథకం వేశాడు. ఓ రోజు జ్యూస్ తీసుకొని ఇంటికి వచ్చాడు. జ్యూస్ తాగిన ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించాడు. విషయం బయటకు చెబితే వీడియో ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు వీడియో కాల్ చేస్తూ దుస్తులు తీసి చూపించాలంటూ వేధించేవాడు. తీసిన వీడియోను డిలీట్ చేయాలంటే తనకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయసాగాడు. దీంతో అతని వేధింపులు భరించలేక ఆ మహిళ ఈ ఏడాది హైదరాబాద్‌కు బదిలీ చేయించుకుంది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటోంది. అయినప్పటికి స్వామి వేధింపులు ఆగలేదు. నగరానికి కూడా వచ్చి ఆమె వీడియోను తోటి సిబ్బందికి చూపిస్తానంటూ బెదిరించసాగాడు. ఇది భరించలేక బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్వామిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్‌తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్‌ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్‌కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి..
భువనగిరి క్రైం/కొండపాక (గజ్వేల్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని అల్లుడిని దారుణంగా మట్టు బెట్టించాడు. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రామచంద్రయ్య గౌడ్ కుమారుడు ఎరుకల రామకృష్ణ (32) 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అప్పట్లో యాద గిరిగుట్టలోనే ఉంటూ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, వెంకటేశం కొద్ది రోజులకే వీరి ప్రేమ విషయం తెలుసుకుని రామకృష్ణను దూరం పెట్టాడు. ఇదే క్రమంలో 2019లో తుర్కపల్లిలో గుప్తనిధుల కేసులో రామకృష్ణను విధుల నుంచి తొలగించారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో రామకృష్ణను వెంకటేశమే గుప్తనిధుల కేసులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అప్పటి నుంచి రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి ) పలుమార్లు బెదిరించినా ఫలితం లేక.. రామకృష్ణ, భార్గవి పెద్దలను ఎదిరించి 2020 ఆగస్టు 16న నల్ల గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ఆల యంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత రెండు నెలల్లోనే రెండుసార్లు వెంకటేశం తన కుమార్తెను వదిలిపెట్టాల్సిందిగా రామకృష్ణను బెదిరించాడు. ఈ క్రమంలో భార్గవి ఆస్తిలో వాటా అడగనంటూ తండ్రికి ఓ పత్రం కూడా రాసిచ్చింది. భువనగిరి తాతానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న రామకృష్ణ దంపతులకు ఓ పాప (ప్రస్తుతం ఆరు నెలలు) కూడా పుట్టింది. సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకుని.. రామకృష్ణపై కక్ష పెంచుకున్న వెంకటేశం కొద్ది నెలల క్రితమే అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు చెల్లించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకువెళ్లారు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి పలుమార్లు ఫోన్లు చేసినా పనిచేయలేదు. మరుసటి రోజు కూడా రామకృష్ణ ఆచూకీ లేకపోవడంతో భార్గవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోనె సంచిలో కట్టి, వాహనంలో తరలించి.. లతీఫ్, అమృతయ్యలు రామకృష్ణను గుండాల మండలం రామారం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ మరో తొమ్మిది మందితో కలిసి తాళ్లతో బంధించారు. అనంతరం రామకృష్ణ తలపై మేకులు కొట్టి దారుణంగా హింసించి అదే రోజు రాత్రి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి టాటాఏస్ వాహనంలో లతీఫ్ ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజాము వరకు శవాన్ని వాహనంలోనే ఉంచారు. తర్వాత కొండపాక మండలం లకుడారం గ్రామంలోని ఓ నీళ్లు లేని కాల్వలో పూడ్చిపెట్టారు. ఐదు నెలల క్రితమే వ్యూహరచన రామకృష్ణను హత్య చేసేందుకు ఐదు నెలల క్రితమే వ్యూహం రచించినట్లు సుపారీ కిల్లర్ లతీఫ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 11మంది భాగస్వాములు కాగా, లతీఫ్, గోలి దివ్య, అఫ్జల్, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు, ఆస్తిలో వాటా కావాలని రామకృష్ణ ఒత్తిడి చేస్తుండడంతోనే అతడిని హత్య చేయాలని వెంకటేశం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రామకృష్ణ హత్యోదంతం బయటకు రాగానే యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లో ఉంటున్న వెంకటేశం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయాడు. (చదవండి: బంజారాహిల్స్‌లో భూకబ్జా ముఠా హల్చల్) పూడ్చిన గొయ్యి తవ్వి.. భార్గవి ఫిర్యాదు నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన భువనగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు లకుడారం గ్రామ శివారులో శవాన్ని పూడ్డి పెట్టినట్టుగా అందిన సమాచారం మేరకు.. ఆదివారం ఉదయం లకుడారం శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద రైల్వే పనులు జరుగుతున్న చోట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాల్వలో గొయ్యి తీసి పూడ్చివేసినట్టు అనుమానం రావడంతో సాయంత్రం రామకృష్ణ చిన్నమ్మ కుమారుడు జహంగీర్‌గౌడ్ సమక్షంలో కుకునూరుపల్లి పోలీసులతో కలిసి తవ్వించారు. మృతదేహం కన్పించడంతో బయటకు తీశారు. అది రామకృష్ణదేనని జహంగీర్ నిర్ధారించాడు. కాగా తన కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ తల్లి కలమ్మ డిమాండ్ చేసింది. నా తండ్రే హత్య చేయించాడు నేను కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో నా తండ్రే డబ్బులిచ్చి హత్య చేయించాడు. నా బంధువు మోత్కూరుకు చెందిన యాకయ్య నెల క్రితం లతీఫ్‌ను నా భర్తకు పరిచయం చేశాడు. శుక్రవారం లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య పథకం ప్రకారం భూములు చూపించాలంటూ తీసుకెళ్లి హత్య చేశారు. – భార్గవి -
హోంగార్డు హత్య.. మద్యం మత్తులో యువకుల దాష్టీకం
సాక్షి, బొమ్మలసత్రం (నంద్యాల): నంద్యాల పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి నలుగురు యువకులు మద్యం మత్తులో హోంగార్డును చంపేశారు. త్రీటౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఎంఎస్ నగర్‌కు చెందిన చిన్నబాబు ఆదివారం రాత్రి మద్యం సేవించేందుకు స్నేహితులు నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన బాలిరెడ్డి, మహమ్మద్‌గౌస్, మహమ్మద్ రఫితో కలిసి స్థానిక రైల్వేస్టేషన్ వద్ద మద్యం కొనుగోలు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలోని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ ప్రాంతంలోకి వెళ్లారు. అర్ధరాత్రి వరకు అక్కడే మద్యం సేవించి ఆ తర్వాత కేకలు వేస్తూ బైక్‌లపై బయటకు వస్తుండటంతో హోంగార్డు కుమ్మరి రాజశేఖర్(44) అడ్డుకున్నాడు. మద్యం సేవించి కేకలు వేయడం మంచిది కాదని వారించాడు. కాగా మద్యం మత్తులో ఉన్న యువకులు రాజశేఖర్‌పై దాడికి పాల్పడి పక్కకు తోయడంతో ఇనుప గేటు కు తల బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో హోంగార్డు రామసుబ్బయ్య గమనించి అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ రఘువీరారెడ్డి మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. చదవండి: (భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..) -
రాజన్న దర్శనం.. భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ప్రదీప్ భక్తుల నుంచి డబ్బు తీసుకుని నేరుగా భారీకేడ్ జరిపి ఆలయంలోకి అనుమతించిన వైనం సెల్‌ఫోన్ కెమెరాకు చిక్కింది. ఎస్పీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని ఈవో రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు. సదరు హోంగార్డుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈవో ఆదేశించారు. (చదవండి: మంత్రుల ఆదేశాలు బేఖాతర్.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే) -
గుడ్‌న్యూస్: హోంగార్డుల జీతం 30 శాతం పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న హోంగార్డులకు రోజువారీ జీతం 30 శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు వీరికి రోజుకు రూ.675 వేతనం వచ్చేది. తాజా పెంపు నేపథ్యంలో ఇకపై రోజుకు రూ.877 జీతంగా రానుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 20 వేల మందికిపైగా హోంగార్డులకు లబ్ధి చేకూరనుంది. (చదవండి: ఎంఎంటీఎస్ రైలులో కత్తితో హల్చల్) -
‘నన్ను, నా పిల్లల్ని నరికేస్తానంటున్నాడు’.. హోంగార్డ్‌పై భార్య ఫిర్యాదు
అనంతపురం: ‘నన్ను, నా పిల్లల్ని నరికిపారేస్తానని భర్త బెదిరిస్తున్నాడు. అతని నుంచి మాకు ప్రాణహాని ఉంది’ అంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పకు జిల్లా జైలు హోంగార్డు నీలిమ ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని ఎస్పీ చేపట్టారు. వివిధ సమస్యలపై 153 అర్జీలు అందాయి. తన సమస్యను ఎస్పీ దృష్టికి హోంగార్డు నీలిమ అర్జీ రూపంలో తీసుకువచ్చి మాట్లాడారు. నగరానికి చెందిన బాబాఫకృద్దీన్తో తనకు 11 ఏళ్ల క్రితం వివాహమైందని, తమకు ఇద్దరు ఆడపిల్లలు సంతానమని వివరించారు. తనను భర్త తరచూ కొట్టేవాడన్నారు. తాజాగా చంపుతానని బెదిరిస్తున్నాడని వాపోయారు. నీలిమ సమస్యపై ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. విచారణ, తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటుకున్న హోంగార్డు..
-
Hyderabad: మానవత్వం చాటుకున్న హోంగార్డు..
హైదరాబాద్: గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే దీని ప్రభావానికి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష బీభత్సానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా హైదరాబాద్‌లో వర్షంలో ఆసుపత్రికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళను 100 పెట్రోల్ వెహికిల్ హోంగార్డు సమయానికి ఆసుపత్రికి తరలించాడు. వర్షం ప్రభావానికి ఓ గర్భిణి ఆసుపత్రికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుంది. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు 100కి ఫోన్ కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న హోంగార్డు ఇమ్రాన్ ఖాన్ బాధిత మహిళను ఎత్తుకుని గాంధీ ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారులు, నెటిజన్లు హోంగార్డు ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశసింస్తున్నారు. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం -
బిడ్డ పుట్టిన విషయం కూడా చెప్పక పోవడంతో..
తిరువళ్లూరు/చెన్నై: భార్య తీరుతో మనస్తాపం చెంది కడంబత్తూరు యూనియన్ పుదుపట్టు గ్రామానికి చెందిన నటరాజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి తిరునిండ్రవూర్‌కు చెందిన యువతితో గత ఏడాది వివాహమైంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారం క్రితం జ్యోతికి ఆడబిడ్డ పుట్టింది. అయితే బిడ్డ పుట్టిన విషయాన్ని చెప్పకపోవడంతో నటరాజన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 21న పెళ్లిరోజు కావడంతో భార్యకు కాల్ చేశాడు. ఆమె తీయకపోవడంతో కలత చెంది ఆదివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహిత దారుణహత్య తిరువొత్తియూరు: పుదుచ్చేరి విల్లియనూర్కు చెందిన బాల భాస్కరన్ భార్య ఆరోగ్య మేరి (31) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ నెల 19వ తేదీ ఆస్పత్రికి వెళ్లిన ఆమె ఇంటికి రాలేదు. ఫిర్యాదు మేరకు విల్లియనూరు పోలీసులు ఆరోగ్యమేరితో పాటు పని చేస్తున్న డ్రైవర్ రమేష్‌ను విచారించారు. తనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతనిచ్చిన సమాచారంతో గొనె సంచుల్లో ముక్కలుగా ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
డూప్లి ‘కేటు’ హోంగార్డులు!
చిత్తూరు అర్బన్: పోలీసు శాఖలో భాగమైన హోంగార్డుల్లో ఇద్దరు అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు. హోంగార్డులుగా పని చేస్తూనే లొసుగులను పసిగట్టి మరో ఇద్దరికి హోంగార్డు ఉద్యోగాలను కట్టబెట్టిన బాగోతం వెలుగుచూసింది. ఒక్కో పోస్టుకు రూ.3లక్షల చొప్పున వసూలు చేయడం గమనార్హం! వివరాలు.. చిత్తూరులోని ఆర్మ్డ్ రిజర్వు(ఏఆర్) విభాగంలో 11 మంది హోంగార్డులు రైల్వేలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూలైకు సంబంధించి వేతనాల కోసం 13 మంది పేర్లతో డ్యూటీ సర్టిఫికెట్ రావడంతో ఏఆర్ ఇన్స్పెక్టర్ మురళీధర్ ఈనెల 19న టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: 8 కిలోల బంగారంతో వ్యాపారి అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు మండలంలోని తుమ్మిందకు చెందిన డి.రాఘవేంద్ర(46), మిట్టూరు వాసి జె.కె.గురుభూషన్(34), ఓటిచెరువు వాసి టి.యువరాజ్ (39), మురకంబట్టుకు చెందిన ఆర్.మణిగండన్(39ను 20వ తేదీన అరెస్టు చేశారు. వీరిలో యువరాజ్, మణిగండన్ ఇద్దరూ కూడా ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరికీ గుంతకల్లు డివిజన్లోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాలిస్తున్నట్లు నకిలీ రిక్రూట్మెంట్ ఆర్డర్లు సృష్టించి డ్యూటీలు కేటాయించారు. ఇందుకోసం ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హోంగార్డు విభాగానికి డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఏఆర్ఐ, ముగ్గురు పర్యవేక్షకులున్నా ఇవేమీ పట్టకుండా పనిచేస్తుండటం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బయటపడిందిలా... జూలైకు సంబంధించి తమవద్ద ఉన్న జాబితా కాకుండా అదనంగా ఇద్దరి డ్యూటీ సర్టిఫికెట్లు రావడాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఓ కంప్యూటర్ ఆపరేటర్ గుర్తించారు. వీళ్లకు జీతాలు ఎలా ఇవ్వాలో తెలియక అధికారులకు విషయాన్ని చెప్పడంతో నకిలీ బాగోతం బయటపడింది. అసలు రెగ్యులర్ హోంగార్డులు ఎందరు ఉన్నారు? పేమెంట్ హోంగార్డులు ఎందరు ఉన్నారనే పక్కా సమాచారం అధికారుల వద్ద లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని నిందితులు నకిలీ రిక్రూట్మెంట్ ఆర్డర్లు, డ్యూటీ పాస్‌పోర్టులు ఇచ్చి మోసాలకు పాల్పడ్డారు. గతంలో ఎన్నో.. హోంగార్డుల నియామకానికి సంబంధించి జిల్లా పోలీసుశాఖ పలుమార్లు నవ్వులపాలైంది. పదేళ్ల క్రితం 34 మంది హోమ్‌గార్డులను అక్రమంగా నియమించినందుకు అప్పట్లో జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగిని అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం చిత్తూరు ట్రాఫిక్ స్టేషన్లో పనిచేసే హోమ్‌గార్డు.. పలువురికి ఉద్యోగాలిప్పిస్తామంటూ భారీగా వసూళ్లకు పాల్పడడంతో అతడ్ని కూడా అరెస్టు చేశారు. తాజా ఘటనలో ఇద్దరు హోమ్‌గార్డులు అరెస్టు కావడం ఈ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతోంది. ఉన్నతాధికారులు హోమ్‌గార్డులను ఆర్డర్లీ వ్యవస్థకే పరిమితం చేయకుండా వారి సాధక బాధలపై కూడా దృష్టిపెట్టి, హోంగార్డు విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటోంది. చర్యలు తీసుకున్నాం నకిలీ పత్రాలతో హోంగార్డు పోస్టు రిక్రూట్మెంట్, డ్యూటీ పాస్‌పోర్టు ఇచ్చిన ఇద్దరితో పాటు క్రైమ్ జరుగుతోందని తెలిసి డ్యూటీలకు వెళ్లిన వారిని అరెస్టు చేశాం. ఇంకా ఎవరైనా డబ్బులిచ్చి మోసపోయి ఉంటే డయల్–100కు ఫోన్‌చేసి చెప్పండి. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు చదవండి: రాహుల్ హత్యకేసు కొలిక్కి -
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డుకు జైలుశిక్ష ఖరారు
-
నాంపల్లి కోర్టు: లైంగిక వేధింపుల కేసు.. హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. లైంగిక దాడి కేసులో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వివరాలు.. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డ్ మల్లికార్జున్‌కు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలుశిక్ష విధించించింది. దాంతో పాటు బాధితురాలి కుటుంబానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కేసేంటంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకారాంగేట్ వద్ద మైనర్ బాలికపై హోంగార్డు మల్లికార్జున్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 19న హోంగార్డు మల్లికార్జున్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బాలిక గర్భం దాల్చడంతో.. మెడికల్ రిపోర్ట్స్ నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వరకు.. అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని కోర్టులో సమర్పించారు. వీటన్నింటిని పరిశీలించిన కోర్టు నిందితుడు మల్లికార్జున్‌కు 30 ఏళ్ల జైలుశిక్షతోపాటు.. బాధితురాలి కుటుంబానికి రూ.40 వేలు చెల్లించాలని ఆదేశించింది. -
ఒక్క అంకె రూ. 50 వేలు నష్టం
సాక్షి, సిటీబ్యూరో: గూగుల్ పేలో నగదు చెల్లించే సమయంలో ఎదుటి వారి ఫోన్ నంబర్లో ఒక్క అంకె తేడా వేయడం రూ. 50 వేలు నష్టపోవడానికి కారణమైంది. పొరపాటున మరో ఖాతాలో పడిన ఈ మొత్తాన్ని ఆ బ్యాంక్ జమ చేసుకుంది. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ► బాధితుడు ఓ డీసీపీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. తన గూగుల్ పే ఖాతా నుంచి ఓ నంబర్‌కు రూ. 50 వేలు పంపాలని భావించారు. ► ఈ పనిని తన కుమార్తెకు అప్పగించారు. ఆమె ఆ ఫోన్ నంబర్లో చివరి అంకె తప్పుగా కొట్టారు. ఫోన్ నంబర్ సరిచూసుకోకుండానే పే చేసేశారు. దీంతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌కు లింకైన బ్యాంకు ఖాతాకు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతమైన నర్సీపట్నంకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తం వెళ్లిపోయింది. ► కాస్త ఆలస్యంగా ఈ విషయం గుర్తించిన బాధితుడు నగదు వెళ్లిన ఫోన్ నంబర్లో సంప్రదించారు. అయితే అప్పటికి తన ఖాతాలో రూ. 15 వేలు మాత్రమే ఉన్నాయంటూ సమాధానం వచ్చింది. అసలేం జరిగిందో అర్థం కాని ఆ వ్యక్తి బ్యాంకునకు వెళ్లి ఆరా తీశారు. సదరు బ్యాంకు నుంచి అతగాడు తీసుకున్న గోల్డ్ లోన్‌కు సంబంధించిన అసలు, వడ్డీ చాన్నాళ్లూగా పెండింగ్‌లో ఉండి బకాయి పెరిగిందని, ఈ నేపథ్యంలోనే ఖాతాలో రూ. 50 వేలు పడిన మరుక్షణం ఖాతాదారుడినైన తన అనుమతి కూడా లేకుండానే బ్యాంకు రూ. 35 వేలు జమ చేసుకున్నట్లు వెల్లడైంది. ► ఇదే విషయాన్ని నర్సీపట్నం వ్యక్తి నగరానికి చెందిన హోంగార్డుకు చెప్పారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సదరు బ్యాంకు అధికారులకు లేఖ రాసి సంప్రదించడం ద్వారా తన డబ్బు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. -
సీఐ అవమానించారని మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం
ఆదోని(కర్నూలు జిల్లా): స్థానిక త్రీ టౌన్ పోలీసుస్టేషన్‌కు బదిలీపై వచ్చిన మహిళా హోంగార్డు రామకృష్ణమ్మ ఆదివారం తన ఇంట్లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీఐ చేసిన అవమానానికి తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈమె తన ముగ్గురు పిల్లలతో ఆదోనిలోని సీతారామనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 1వ తేదీన ఎమ్మిగనూరు పోలీస్‌స్టేషను నుంచి బదిలీపై ఆదోని త్రీటౌన్‌కు వచ్చారు. సీఐకు రిపోర్టు చేయగా జాయిన్ చేయించుకోలేదని, తిరిగి ఎమ్మిగనూరుకు వెళ్లమన్నారని, అవమానకరంగా మాట్లాడారని సెల్ఫీ వీడియోలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆమె శానిటైజర్ తాగారు. ఇరుగుపొరుగు వారు, బందువులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై త్రీ టౌన్ సీఐ నరేష్‌బాబు మాట్లాడుతూ.. రాత్రి పూట గస్తీకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో తాను హోంగార్డు ఇన్చార్జ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఆమెకు రిటర్న్ పాస్‌పోర్ట్ ఇచ్చానన్నారు. తాను అవమానించినట్లు హోంగార్డు రామకృష్ణమ్మ చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. రామకృష్ణమ్మకి పరామర్శ సాక్షి, అమరావతి: మహిళా హోంగార్డు రామకృష్ణమ్మ ఆత్మహత్యా ప్రయత్నం ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఆరా తీసింది. ఈ విషయంపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదివారం ఎస్పీ ఫక్కీరప్పతో మాట్లాడారు. బాధితురాలు రామకృష్ణమ్మను ఆమె ఫోన్లో పరామర్శించి, ధైర్యం చెప్పారు. చదవండి: బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి.. భర్త ఒక్కసారిగా షాక్ వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ... -
లాక్డౌన్.. నన్నే బయటకు వెళ్లనివ్వవా?
సాక్షి, హిమాయత్‌నగర్: లాక్డౌన్ కారణంగా పోలీసులు బయటకు వెళ్లనివ్వట్లేదనే కారణంతో ఓ హోంగార్డు బైక్‌ను తగలబెట్టాడు ఓ ప్రబుద్ధుడు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... స్థానిక ఫరీద్బస్తీకు చెందిన మహ్మద్ సికిందర్ ఇంటెల్లిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో హోంగార్డు(డ్రైవర్)గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21వ తేదీ శుక్రవారం డ్యూటీ నుంచి వచ్చిన సికిందర్ తన బైక్‌ని ఇంటి వద్ద రోడ్డుపై పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లిపోయాడు. అదేరోజు అర్ధరాత్రి తన టూవీలర్ తగలబడుతున్న మంటల శబ్ధం వినిపించి బయటకు వచ్చి నీళ్లు కొట్టగా.. అప్పటికే బైక్ మొత్తం దగ్ధం అయ్యింది. దీంతో శనివారం ఉదయం నారాయణగూడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సికిందర్ ఇదే బస్తీకు చెందిన మహ్మద్ అబిద్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని పేర్కొన్నాడు. ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులకు కొన్ని ఆశక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. మహ్మద్ అబిద్ అనే వ్యక్తి కొంతకాలంగా మానసికపరమైన ఒత్తిడితో ఉంటున్నాడు. సికిందర్‌కు అబిద్లకు మధ్య ఇటీవల చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే లాక్డౌన్ కారణంగా అబిద్‌ను పోలీసులు బయటకు వెళ్లనివ్వడం లేదనే కక్షతో సికిందర్ బైక్‌ని తగలబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో సోమవారం అబిద్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. గతంలో పలు ఫిర్యాదులు.. మహ్మద్ అబిద్‌పై గతంలో ఫరీద్ బస్తీకి చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. అబిద్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, రాళ్లు వేయడం, అందరూ చూస్తుండగానే ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేస్తుండేవాడు. దీంతో విసిగెత్తిన పలువురు మహిళలు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అబిద్‌పై పలు పెట్టి కేసులు నమోదు చేసి వదిలేశారు. చదవండి: యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్: ‘దొరికిన’వన్నీ డీఎంహెచ్‌ఓలకే! Hyderabad: సాబ్.. ఛోడ్‌దో సాబ్.. -
Home Guards: ఆంధ్ర వైపు తెలంగాణ హోంగార్డుల చూపు!
సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏపీకి చెందిన 1200 మంది హోంగార్డులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం వారంతా తెలంగాణ పోలీస్ శాఖలోనే ఉండిపోవడంతో నిబంధనల ప్రకారం ఏపీకి బదిలీ అయ్యే అవకాశం లేకుండా పోయింది. కొలువు తెలంగాణలో అయినా.. వారందరికీ ఏపీలోని 13 జిల్లాల్లో చిరునామా (ఆధార్, ఇల్లు) ఉండడం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అమలౌతున్న అనేక సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఆరోగ్య శ్రీ కార్డుపై కరోనాకు ఏపీలో చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులకు కరోనా, మరేదైనా రోగం వస్తే తెలంగాణలో ఉంటున్న తమకు ఏపీలో వైద్య సేవలు అందడం లేదని వాపోతున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా తదితర పథకాలను సైతం తమ కుటుంబ సభ్యులు అందుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు తెలంగాణలో ఉంటున్నప్పటికీ వారి చిరునామా ఏపీలో ఉండడంతో నాన్ లోకల్ కావడంతో అక్కడి పోలీస్ రిక్రూట్మెంట్లో అవకాశాలు కోల్పోతున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు 40 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితి ఉన్నప్పటికీ.. ఆ హోంగార్డులకు తెలంగాణ కానిస్టేబుల్ పోస్టుల్లో 20శాతం, ఏపీఎస్పీలో 15శాతం, ఏఆర్‌లో 10శాతం చొప్పున హోంగార్డులకు ఇచ్చే రిజర్వేషన్ తమకు దక్కడం లేదని వాపోతున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో అవకాశాలను కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ ఇటీవల ఏపీ, తెలంగాణ డీజీపీలు డి.గౌతమ్ సవాంగ్, ఎం.మహేందర్‌రెడ్డిని కలిసి విన్నవించుకున్నారు. ఆంధ్రాకు బదిలీ చేయండి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్ల క్రితం హోంగార్డుగా ఎంపికైన చాలా మంది రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఉండిపోయారు. ఏపీకి చెందిన మేము తెలంగాణలో హోంగార్డు ఉద్యోగం చేస్తున్నప్పటికీ నాన్ లోకల్‌గానే పరిగణిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ అనేక అవకాశాలు కోల్పోతున్నాం. అవకాశం ఉంటే ఏపీకి బదిలీ చేయండి. లేదంటే తెలంగాణలో ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ప్రకటించి పోలీస్ రిక్రూట్మెంట్లో మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –ఎస్.లక్ష్మీనారాయణరెడ్డి, తెలంగాణ హోంగార్డు, ప్రకాశం జిల్లా వాసి చదవండి: గ్రామ పారిశుద్ధ్య కార్మీకులకు ప్రత్యేక కిట్లు -
మిస్ ఫైర్ కాదు.. భార్యను కాల్చి చంపాడు..
-
గత కొంతకాలంగా హోంగార్డు వినోద్, భార్య రత్నప్రభకు విభేదాలు
-
హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: హోంగార్డ్ వినోద్ భార్య మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్యతో గొడవల వల్లే వినోద్ కాల్పులు జరిపినట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు మీడియాకు వెల్లడించారు. గత కొంతకాలంగా హోంగార్డు వినోద్, భార్య రత్నప్రభకు విభేదాలు నెలకొన్నాయి. నాలుగు నెలలుగా భార్య నగలు తాకట్టు పెట్టిన విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వివాదాలు తీవ్రస్థాయికి వెళ్లడంతో భార్యను గన్‌తో కాల్చి చంపాడని.. కాల్పుల్లో రత్నప్రభ అక్కడికక్కడే చనిపోయిందని ఏసీపీ తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా.. గన్ మిస్ ఫైర్ అయిందని హోంగార్డ్ వినోద్ చెప్పాడని ఏసీపీ హనుమంతరావు వివరించారు. హోంగార్డుపై కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. చదవండి: అద్దె కోసం వచ్చామంటూ 12 సవర్ల బంగారం దోచేశారు పాజిటివ్ వచ్చింది బాబూ; పకోడీలు వేసి వస్తా! -
తుపాకీ మిస్ ఫైర్.. హోంగార్డు భార్య మృతి
సాక్షి, విజయవాడ: తుపాకీ పేలి హోంగార్డు భార్య మృతి చెందిన ఘటన నగరంలో జరిగింది. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ శశిభూషణ్ వద్ద అసిస్టెంట్‌గా హోంగార్డు వినోద్ విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం శశిభూషణ్ అనంతపురం క్యాంప్‌కు వెళ్లగా.. హోంగార్డు వినోద్ వద్ద ఏఎస్పీ తుపాకీ ఉంది. హోంగార్డు.. ఆదివారం రాత్రి తన భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్‌ఫైర్ అయ్యింది. ఆమె గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో భార్య సూర్య రత్నప్రభ అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమ్మో.. కింగ్ కోబ్రా: భయంతో జనం పరుగులు పాజిటివ్ వచ్చింది బాబూ; పకోడీలు వేసి వస్తా! -
హోంగార్డ్‌తో అఫైర్! మహిళను కొట్టి.. కిటికీకి కట్టేసి
సాక్షి, ఖమ్మం: హోం గార్డ్‌తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన ఇల్లందు పట్టణంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఎల్బీఎస్ నగర్లో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ స్థానికంగా ఉన్న కిరాణా షాపులో పనిచేస్తుంది. ఇల్లందు పోలీస్ స్టేషన్లో హోం గార్డ్‌గా పనిచేస్తున్న నరేష్ ఇక్కడి ఆర్ అండ్ ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో నరేష్ ఆదివారం మధ్యాహ్నం సదరు మహిళ ఇంట్లో.. ఆమెతో మాట్లాడుతుండగా నరేష్ తల్లితోపాటు అతడి బంధువులు ఆ మహిళ ఇంటిపై దాడి చేశారు. ఆమెను విచాక్షణారహితంగా కొట్టి బయట కిటికికీ తాడుతో చేతులు కట్టేశారు. అయితే బాధితురాలు మాత్రం నరేష్ తన వద్ద నుంచి కొందరికి డబ్బులు ఇప్పిస్తాడని.. ఈ క్రమంలో ఆదివారం డబ్బుల కోసం వచ్చాడని చెపుతుంది. గత కొన్ని రోజులుగా నరేష్ ఇంటికి సరిగా రాకపోవడం.. తరచుగా ఆ మహిళ ఇంటికి వెళ్లడం తదితర కారణాల వలన ఆ మహిళకు, నరేష్‌కు మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోందని దృఢంగా నమ్మిన ఆయన బంధువులు ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల జోక్యంతో ఈ గొడవ సద్దుమణిగింది. చదవండి: భర్తను వదిలి వచ్చెయ్మన్నాడు.. మాట వినకపోవడంతో -
హోంగార్డు ఉదారత, సోషల్ మీడియాలో ప్రశంసలు
ఇటీవల కేరళలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం తీవ్ర గాయాలపాలైంది. దీంతో స్థానికులంత హుటాహుటిని వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ కుటుంబానికి చెందిన 7 నెలల చిన్నారిని అక్కడే వదిలేశారు. అమ్మ-నాన్న ఎవరూ కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించిన ఆ చిన్నారిని అక్కడే ఉన్న ఓ హోంగార్డు చేరదీసి లాలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విధులు నిర్వహిస్తునే చిన్నారిని బుజ్జగిస్తున్న సదరు హోంగార్డుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సదరు హోంగార్డు హృదయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఈ పోలీసుకు బిగ్ సెల్యూట్’, ‘లెజెండరీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 32 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను బుధవారం కేరళ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో దీనికి ‘రామపురంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన వారంత తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం నుంచి 7 నెలల చిన్నారి బయటపడింది. దీంతో ఆ పాపను రోడ్డు మీదే వదలిలేశారు. ఇక కుటుంబ సభ్యులు ఎవరు కనిపించకపోవడంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది. అక్కడే విధులు నిర్వహిస్తోన్న హోంగార్డు చిన్నారిని దగ్గరకు తీసుకుని లాలించాడు. పాప ఏడవకుండా భుజాన వేసుకుని ఆటుఇటూ తిరుగుతూ భుజ్జగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొద్ది గంటల తర్వాత పాపకు సంబంధించిన బంధువులు వచ్చి తీసుకుని వెళ్లారు’ అంటూ తమిళంలో ట్వీట్ చేశారు. കായംകുളം രാമപുരത്ത് നടന്ന വാഹനാപകടത്തിൽ ഗുരുതര പരിക്കേറ്റ അമ്മയെയും ബന്ധുക്കളെയും മെഡിക്കൽ കോളേജിലേക്ക് മാറ്റിയപ്പോൾ അപകടത്തിൽ നിന്നും രക്ഷപ്പെട്ട ഏഴു മാസം പ്രായമുള്ള കുഞ്ഞിൻ്റെ സംരക്ഷണം ബന്ധുക്കൾ എത്തുന്നത് വരെ ഏറ്റെടുത്ത് കുഞ്ഞിനെ പരിചരിക്കുന്ന ഹോം ഗാർഡ് കെ എസ് സുരേഷ്. pic.twitter.com/R6RdoQ6zwV — Kerala Police (@TheKeralaPolice) March 9, 2021 -
హోంగార్డు పేరుతో మరో మహిళకు రుణం
ఓ ప్రైవేట్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పోలీసు విభాగంలో పనిచేసే హోంగార్డు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈమె పేరుతో బ్యాంకు అధికారులు మరో మహిళకు రూ.8.8 లక్షల వ్యక్తిగత రుణం ఇచ్చేశారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఈ సమస్య వచ్చిపడింది. విషయం తెలిసిన హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించారు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని బౌరంపేటకు చెందిన ఓ మహిళ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో హోంగార్డు. ముషీరాబాద్‌లోని యాక్సస్ బ్యాంకు ఖాతాలో ఈమె జీతం జమవుతోంది. ఆ బ్యాంకు నుంచి రూ.3 లక్షల వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె వివరాలను పరిశీలించిన బ్యాంకు అధికారులు అప్పటికే ఆమె పేరుతో ఇండస్ఇండ్ బ్యాంకులో రూ.8.8 లక్షలు రుణం ఉన్నట్లు గుర్తించారు. అది తీరే వరకు మరో రుణం పొందే అవకాశం లేదన్నారు. కంగుతిన్న ఆ హోంగార్డు ఇండస్ఇండ్ బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా సూరారం ప్రాంతానికి చెందిన మహిళ మీ పాన్‌కార్డుతో 2018 సెప్టెంబర్ 7న రూ.8.8 లక్షల రుణం తీసుకుందని చెప్పారు. ఇప్పటికీ రూ.5,98,337 బకాయి ఉందన్నారు. పొరపాటు.. బ్యాంకు అధికారులదే.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన వివరాలు వినియోగించి రుణం తీసుకున్నారంటూ హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సుంకరి శ్రీనివాసరావు దర్యాప్తు చేశారు. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2018 సెప్టెంబర్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళ పేరు, హోంగార్డు పేరు ఇంటి పేరుతో సహా ఒకటే. రుణం మంజూరు సమయంలో ఈ పేరు ఆధారంగా సంబంధిత వెబ్సైట్లో ఇండస్ఇండ్ బ్యాంకు అధికారులు సెర్చ్ చేశారు. ఆ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న వారి పేరు, పాన్ నెంబర్, సిబిల్ స్కోర్ తదతరాలు కనిపిస్తాయి. అప్పట్లో ఈ బ్యాంకు అధికారులు సెర్చ్ చేసిన సందర్భంలో దరఖాస్తు చేసుకున్న అసలు మహిళతో పాటు మహిళా హోంగార్డు వివరాలు కనిపించాయి. బ్యాంకు అధికారులు పొరపాటున హోంగార్డు పేరు, ఆమె పాన్ నంబర్‌ను ఫిక్స్ చేస్తూ దరఖాస్తు చేసుకున్న మహిళకు రుణం మంజూరు చేశారు. వాయిదాలను చెల్లిస్తుండటంతో.. అప్పటి నుంచి ఆమె నెలసరి వాయిదాలను సక్రమంగా చెల్లిస్తుండటంతో బ్యాంకు అధికారులకు వివరాలు సరిచూడాల్సిన అవసరం రాలేదు. తాజాగా మహిళ హోంగార్డు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులు జరిపిన పరిశీలనతో తెరపైకి వచ్చింది. ఈ విషయాలను దర్యాప్తులో గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు మూడు పక్షాలను ఠాణాకు పిలించారు. అసలు విషయం వారందరికీ వివరించగా తమ పొరపాటును సరిదిద్దుకునేందుకు అంగీకరించిన ఇండస్ ఇండ్ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. -
బాలికపై హోంగార్డు లైంగిక దాడి
అడ్డగుట్ట: మాయమాటలతో మభ్యపెట్టి ఓ మైనర్ బాలికపై హోం గార్డు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అడ్డగుట్టలోని కమ్యూనిటీహాలు ప్రాంతానికి చెందిన మల్లికార్జున్ (40) హోంగార్డు. హైద్రాబాద్ సీసీఎస్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. మాయమాటలతో బాలికను మభ్యపెట్టి మోసం చేశాడు. బాలిక ఇంట్లో ఎవరూలేని సమయం చూసి అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని ఆమెను భయపెట్టాడు. కాగా, బాలికకు రెండు రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. బాధితులు స్థానిక తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మల్లికార్జున్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: దారుణం: భార్య ఆత్మను వెళ్లగొట్టాలని కూతురునే.. నిర్లక్ష్యపు నడక, బైకర్ అతివేగం.. మీరు మారరా! -
కరోనా పరీక్షల్లో నెగిటివ్.. హోంగార్డు మృతి..
కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందాడు. కీసరలో నివసించే ఎం.గణేష్ (30) అనే హోంగార్డ్ ఈ నెల 3న కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరాడు. మొబైల్ వాహనం నడుపుతున్న గణేష్ విధుల్లో చేరిన ఐదు రోజులకే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఈ నెల 8న స్టేషన్లో రిపోర్టు చేసి ఇంటి వద్దే ఉన్న ఆయనకు 10న శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈసీఐఎల్‌లోని జీనియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. తన ఆరోగ్య పరిస్థితిని స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు తెలిపి సెలవు తీసుకున్నాడు. తిరిగి శుక్రవారం సాయంత్రం మరోసారి ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో జీనియా ఆసుపత్రికి వెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడకూడా వైద్యులు అదే సలహా ఇచ్చారు. దీంతో మెరుగైన వైద్యం కోసం మలక్‌పేట్ యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ నెల 10 చర్లపల్లిలోని వింటాల్యాబ్, 12న రాచకొండ సీపీ కార్యాలయంలో కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు తెలిపారు. మృతుడికి భార్య, రెండున్నర సంవత్సరాల కూతురు, ఏడాది వయసున్న పాప ఉన్నారు. గణేష్ మృతిపట్ల కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్, సిబ్బంది సంతాపం తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. -
హోంగార్డ్ అకృత్యం
తూర్పుగోదావరి,కాకినాడ క్రైం: ఓ హోంగార్డు వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు... కాకినాడ డెయిరీ ఫారం కూడలి సత్యానగర్‌కి చెందిన చెల్లవరపు శివజ్యోతికి ఏడేళ్ల క్రితం విజయనగరానికి చెందిన చెల్లవరపు స్వామినాయుడుతో వివాహమైంది. స్వామినాయుడు వృత్తి రీత్యా హోంగార్డు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వివాహానంతరం శివజ్యోతి భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వివాహమైన తొలినాళ్ల నుంచి స్వామినాయుడు భార్య శివజ్యోతిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. అనుమానం నెపంతో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులతో మాట్లాడవద్దనేవాడు. భార్య ను తీవ్రంగా కొట్టేవాడు. ఒకరోజు తక్షణమే పుట్టింటికి వెళ్లిపోమ్మని పోషణ నిమిత్తమయ్యే ఖర్చు పంపిస్తానని చెప్పి స్వామినాయుడు ఆమె పిల్లలిద్దరితో కలిసి ఏడాది క్రితం కాకినాడలోని పుట్టింటికి పంపేశాడు. నాటి నుంచి పుట్టింట్లో ఉంటున్న శివజ్యోతికి భర్త చిల్లిగవ్వైనా పంపకపోవడంతో స్థానికంగా ఓ పాఠశాలలో టీచరుగా పనిచేస్తూ పిల్లల్ని పోషించుకుంటూ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే లాక్డౌన్ కారణంగా ఆ ఉద్యోగమూ పోయింది. నాటి నుంచి శివజ్యోతి కష్టాలు రెట్టింపయ్యాయి. మెకానిక్ అయిన తండ్రి సంపాదనతోనే అంతంత మాత్రంగా జీవనం కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ఏడాది తర్వాత స్వామినాయుడు మంగళవారం హైదరాబాద్ నుంచి కాకినాడ అత్త ఇంటికి వచ్చాడు. ఏడాదిగా తాము పడిన కష్టాలు చెప్పుకొని భార్య, బిడ్డలని పోషించే బాధ్యత లేదా అని భర్తని నిలదీసింది. ఇదే విషయంపై ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. భార్యకి సమాధానం చెప్పలేక స్వామినాయుడు ఆమెని విచక్షణా రహితంగా కొట్టాడు. ముఖం, మెడ భాగాలపై గోళ్లతో రక్కాడు. భర్త హింస భరించలేక శివజ్యోతి ఇంట్లో ఉన్న ఫ్లోర్‌క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్)కి తరలించారు. బాధితురాలికివైద్యం అందించామని చెప్పిన వైద్యులు ఆమె ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఈ ఘటనపై కాకినాడ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. -
భార్యపై అనుమానం.. కరోనాతో అవకాశం
న్యూఢిల్లీ: భార్యకు ఓ హోం గార్డుతో అక్రమ సంబంధం ఉందని భావించాడు ఓ వ్యక్తి. అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. కరోనా వైరస్ రూపంలో అవకాశం రావడంతో.. హోం గార్డుతో పాటు అతడి కుటుంబ సభ్యులపై విష ప్రయోగం చేశాడు. అదృష్టం బాగుండటంతో హోం గార్డు కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. సదరు వ్యక్తిపై కేసు నమోదయ్యింది. వివరాలు.. ప్రదీప్(42) అనే వ్యక్తి, ఓ హోం గార్డుతో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. దాంతో హోం గార్డును చంపాలని భావించాడు. కరోనా రూపంలో అవకాశం రావడంతో హోం గార్డును చంపేందుకు పథకం రచించాడు. ఇందుకు గాను ఇద్దరు మహిళల సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో సదరు స్త్రీలు ఆదివారం సాయంత్రం ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లో నివాసం ఉంటున్న హోం గార్డు ఇంటికి వెళ్లారు. తాము ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలమని.. కరోనా చెకప్ కోసం వచ్చామని చెప్పారు. ప్రభుత్వం కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు మందులు ఇస్తుందని నమ్మబలికారు. ఆ తర్వాత హోం గార్డు, అతని కుటుంబ సభ్యుల చేత విషం తాగించారు. అనంతరం నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నారు. కాసేపటికే హోం గార్డుతో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అనంతరం హోం గార్డు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.(కరోనానూ క్యాష్..) బాధితుడి ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా సదరు మహిళలను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. వారు ప్రదీప్ తమకు డబ్బులు ఇచ్చి.. హోం గార్డు కుటంబానికి విషం ఇవ్వాల్సిందిగా కోరాడని పోలీసుల విచారణలో తెలిపారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న ప్రదీప్ కోసం గాలిస్తున్నారు.(దొంగకు కరోనా.. పోలీసులకు క్వారంటైన్) -
హోంగార్డుతో గుంజీలు..
-
లాక్డౌన్ పాస్ అడిగినందుకు గుంజీలు..
దేశమంతా లాక్డౌన్ అమలవుతున్న వేళ అనవసరంగా రోడ్డుపైకి వస్తున్న వారిని అదుపు చేయడానికి పోలీసులు నానాతంటాలు పడుతున్నారు. తిట్టి, కొట్టి ఆఖరికి బుజ్జగించి మరీ ఇంటి నుంచి బయటికి రావొద్దని వాహనదారులకు సూచిస్తున్నారు. అయినప్పటికీ పోలీసుల ఆదేశాలను లెక్కచేయని కొంత మంది పోలీసులతోనే వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుపైకి వచ్చిన ఓ అధికారిని లాక్డౌన్ పాస్ చూపించండి అని అడిగినందుకు పోలీసు అధికారితో గుంజీలు తీయించారు. ఈ అమానుష ఘటన బిహర్లో అరారియా జిల్లాలో చోటుచేసుకుంది. పాట్నాకు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌పోస్ట్ వద్ద తనిఖీ కోసం పోలీసులు ఓ అధికారి కారును ఆపారు. కార్లోని వ్యక్తి తాను వ్యవసాయశాఖ అధికారిని అని చెప్పగా.. లాక్డౌన్ పాస్ చూపించాలని విధి నిర్వాహణలో ఉన్న హోంగార్డు కోరాడు. దీంతో ఆగ్రహించిన అధికారి.. కారి దిగి హోంగార్డుతో వాగ్వాదానికి దిగారు. అధికారిని పాస్ అడిగినందుకు శిక్షగా చేతులు కట్టుకొని హోంగార్డుతో గుంజీలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. (కిస్సింగ్ పోటీ.. మండిపడుతున్న నెటిజన్లు ) ‘లాక్డౌన్ పాస్ అడిగినందుకు వ్యవసాయ అధికారి ఒక హోమ్ గార్డ్ జవాన్‌ను శిక్షిస్తున్నాడు.’ అని ట్వీటర్లో పోస్ట్ చేశారు. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ‘కారు ఎలా ఆపారు.. అతను ఒక వ్యవసాయశాఖ అధికారి’ అంటూ సీనియర్ పోలీసు ఒకరు హోంగార్డుపైకి అరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అధికారుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ పోలీస్‌పై ఇలా అవమానకరంగా ప్రవర్తించినందుకు సదురు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 18 వేలు దాటగా.. ఈ మహమ్మారి బారిన పడి దాదాపు 590 మంది మరణించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా మే 3 వరకు లాక్డౌన్ అమలవుతోంది. (వైరస్ ఉగ్రరూపాన్ని చూస్తారు: డబ్ల్యూహెచ్ఓ ) -
బకాయిలు ఇవ్వండి మహాప్రభో!
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న హోంగార్డుల్లో అనేక మంది సకాలంలో జీతాలు అందక సతమతం అవుతున్నారు. ఈ నెల్లో శుక్రవారం వరకు అనేక మంది ‘హోం’గడవని గార్డులుగా మారారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి వేతనాలు అందరికీ సకాలంలో అందకపోవడం, గతంలో కోత పెట్టిన జీతం ఇవ్వకపోవడం, బందోబస్తులకు సంబంధించిన ఫీడింగ్ చార్జీల అంశాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసు విభాగంలో మిగతా సిబ్బందితో సమానంగా డ్యూటీలు చేస్తున్నా హోంగార్డులకునెలకు దక్కేది రూ.22 వేలే. కాగా ఈ నెలలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి ఒక్కసారిగా వేతనాలు అందలేదు. హోంగార్డుల హాజరు నమోదు చేయడానికి బయోమెట్రిక్ విధానం అమలులో లేదు. ఈ నేపథ్యంలో ప్రతి నెల వారు పని చేసిన రోజులకు సంబంధించి పోలీసుస్టేషన్లు, ప్రత్యేక యూనిట్ల నుంచి అటెండెన్స్ హోంగార్డ్స్ కార్యాలయానికి చేరాల్సి ఉంటుంది. అక్కడ వీరి వేతనాల బిల్లులు రూపొంది కమిషనర్ ఆఫీసుకు చేరతాయి. ఇక్కడ ఆమోద ముద్రపడిన అనంతరం జీతం డబ్బు ఆయా హోంగార్డులకు ఖాతాల్లోకి చేరుతుంది. అప్పట్లో గడిచిన పోయిన నెలకు సంబంధించి ఒకటో తేదీ నుంచి 30 లేదా 31 వరకు నెలగా లెక్కించే వారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా వీరికి తర్వాతి నెల్లో 20వ తారీఖున జీతాలు అందేవి. ఈ విధానాన్ని మారుస్తున్నామని, ఇకపై ఒకటో తేదీకల్లా జీతం బ్యాంకు ఖాతాలో పడేలా చర్యలు తీసుకుంటున్నామంటూ గత ఏడాది మేలో అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ఆ నెల్లో 20 వరకు హాజరు తీసుకుంటామని, కోల్పోతున్న పది రోజుల మొత్తాన్ని రెండు మూడు నెలల్లో ఖాతాల్లోకి జమ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక ఇబ్బంది అయినప్పటికీ ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి జీతం అందుకోవచ్చనే ఉద్దేశంతో హోంగార్డులు అందుకు అంగీకరించారు. దీంతో గత ఏడాది మే నెలలో వీరికి 20 రోజుల జీతమే అందింది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా మొదటి వారంలోనే జీతం వస్తోంది. అయితే ఇప్పటికి పది నెలలు కావస్తున్నా... ఆ పది రోజుల వేతన బకాయి విషయం మాత్రం అధికారులు మర్చిపోయారు. దీనికి తోడు ఫిబ్రవరి నెలకు సంబంధించి అందరు హోంగార్డులకు ఒకేసారి వేతనాలు అందలేదు. సిటీలో ట్రాఫిక్ విభాగంతో పాటు మరో మూడు యూనిట్లలో కలిపి 6700 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ట్రాఫిక్‌లో పని చేస్తున్న వారికి ముందుగా జీతాలు అందాయి. శుక్రవారం యూనిట్–1, 2, 3లకు చెందిన వారి బ్యాంకు ఖాతాల్లో జీతం జమయ్యాయి. ఆలస్యమైనా ఈసారి పది రోజుల బకాయితో సహా జీతం వస్తుందని భావించిన సిబ్బందికి నిరాశే మిగిలింది. తమకు బత్తా కింద రూ.12 వేల వరకు రావాల్సి ఉందని, కనీసం రూ.6 వేలైనా ఇవ్వాల్సిందిగా మెరపెట్టుకుంటున్నా వీరి బాధ అరణ్యరోదనగా మారింది. సిటీ పోలీసు విభాగానికి చెందిన ఓ హోంగార్డు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘జీతం కూడా ప్రతి నెలా సరైన సమయానికి రాకపోతే ఇక మా గతి ఏంటి? గతంలో కట్ చేసిన పది రోజుల జీతం విషయం ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. బత్తా ఇమ్మన్నా ఆదుకునే నాథుడే లేకుండా పోయాడు’ అని వాపోయారు. -
ఆ ఊరిలో మంచి పోలీస్.. చెడ్డ పోలీస్!
సాక్షి, కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో ఒక పోలీసు ఔదార్యాన్ని ప్రదర్శించగా మరో పోలీసు కీచకుడిగా మారాడు. చిలకలపూడి పోలీస్ స్టేషన్ సీఐ ఆపదలో ఉన్న ఓ గర్భిణి (మైనర్ బాలిక) పట్ల పెద్ద మనసు చాటారు. పోక్సో కేసులో బాధితురాలిగా ఉన్న గర్భిణికి సీఐ మోర్ల వెంకటరమణ రక్తదానం చేశారు. ఆయనను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందించారు. ఇక ఇదే మచిలీపట్నంలో ఫణీంద్ర అనే హోంగార్డు ప్రేమ పేరుతో ఓ బాలికను మోసం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుశ్చర్యకు పాల్పడింది మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డే కావడం గమనార్హం. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హోంగార్డు ఫణీంద్రను అరెస్టు చేసి విచారిస్తున్నామని అడిషనల్ ఎస్పీ సత్తిబాబు తెలిపారు. -
‘నీ భార్యకు విడాకులివ్వకుంటే చంపేస్తాం’
చాంద్రాయణగుట్ట: భార్యను సరిగా చూసుకోలేని స్థితిలో ఉన్న భర్త వెంటనే విడాకులు ఇవ్వాలంటూ ఓ హోంగార్డును ముగ్గురు దారుణంగా కొట్టిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. జీఎం కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఇమ్రాన్ ఇంటెలిజెన్స్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో తాళ్లకుంటలోని సుహానా ఫంక్షన్ హాల్ ఎదురుగా తన ద్విచక్ర వాహనానికి వాషింగ్ చేయిస్తున్నాడు. ఈ సమయంలో హబీబ్ ఇమ్రాన్ అనే వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి హోంగార్డును కొట్టడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా అతని మర్మాంగాలపై తీవ్రంగా తన్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హోంగార్డు డయల్ 100కి కాల్ చేసేందుకు ప్రయత్నించగా ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. మరో ఇద్దరు కూడా కలిసి అతడి ముఖంపై తీవ్రంగా కొట్టారు. ‘నీ భార్యకు విడాకులు ఇవ్వు.. లేదంటే చంపేస్తాం’ అని బెదిరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారు బాధితుడికి దూరపు బంధువులుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. దాడికి దిగిన ప్రధాన నిందితుడు హబీబ్ ఇమ్రాన్ గతంలోనూ తనను తీవ్రంగా బెదిరించినట్లు అబ్దుల్ ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
‘వాళ్లు పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారు’
సాక్షి, విజయవాడ: విధుల్లో పోలీసులతోపాటు హోంగార్డులు సమానంగా కష్టపడుతున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 57వ హోంగార్డు వ్యవస్థాపక వేడుకలు విజయవాడలో శుక్రవారం ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గౌతమ్ సవాంగ్ హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోంగార్డుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంగార్డులకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. పోలీసులతో సమానంగా హోంగార్డులకు యాక్సిస్ బ్యాంకు ద్వారా రూ.30 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ సౌకర్యాన్ని కల్పించామన్నారు. హోంగార్డులకు పోలీసు శాఖ తరపున తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. -
హోంగార్డు కొట్టాడని.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు : నలుగురు చూస్తుండగా కొడుతూ, పోలీస్ స్టేషన్‌కి ఈడ్చుకెళ్లారనే బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మాచర్ల మండలం రాయవరంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మాచర్ల పీఎస్‌లో పనిచేసే హోంగార్డు రాజేశ్, ఆటో డ్రైవర్ శ్రీనుతో ఉన్న వ్యక్తిగత గొడవలతో అతిగా ప్రవర్తిస్తూ, అతనిపై చెప్పులతో దాడి చేశాడు. అలాగే బజారులో కొట్టుకుంటూ స్టేషన్‌కి తీసుకెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. -
వేతనానందం
పోలీస్‌శాఖలోని హోంగార్డుల జీవితాల్లో దీపావళి వెలుగు ముందే వచ్చేసింది. ప్రభుత్వం వారి వేతనాలను పెంచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో హోంగార్డుల కష్టాలను ప్రత్య క్షంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి..సీఎం అయ్యాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే వారి వేతనాలను పెంచుతూ నిర్ణయంతీసుకున్నారు. ఆ మేరకు నెలకు రూ.18000నుంచి 21,300 పెంచుతూ ప్రభుత్వంశనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల దినసరి వేతనాన్ని రోజుకు రూ.600 నుంచి 710కు పెంచింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, ఇంత త్వరగా అమలులోకి తీసుకొచ్చారని, తమ కుటుంబాల్లో మరింత వెలుగు నింపారని హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోంగార్డులకు నెలసరి వేతనాన్ని రూ.3 వేల నుంచి 6 వేలకు పెంచారని, ఆయన తనయుడు మళ్లీ ఇప్పుడు పెంచారని వారు పేర్కొంటున్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హోంగార్డుల వేతనాన్ని పెంచుతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేశారని అన్నారు. నెలసరి జీతం రూ.18000 నుంచి 21,300 వచ్చేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. 715 కుటుంబాలకు ప్రయోజనం జిల్లా పోలీసు శాఖలో సుమారు 715 మంది హోంగార్డులు పని చేస్తున్నారు. హోంగార్డుల జీతాలు పెంచుతూ శనివారం సాయంత్రం జీఓ విడుదలైంది. జిల్లాలో 715 మందికి ప్రయోజనం కలగనుంది. అందులో 58 మంది మహిళలు ఉన్నారు. జీతాలు పెంచినందుకు జిల్లాలోని హోంగార్డులు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మాట నిలబెట్టుకున్న సీఎం హోంగార్డుల జీతం పెంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. మా జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – కె.శ్రీనివాసులు, హెచ్‌జీ 959, కడప వన్‌టౌన్ దీపావళి ముందే వచ్చింది మాకు జీతాలు పెంచడం హర్షణీయం. దీపావళికి ముందే మా జీవితాల్లో వెలుగు నింపారు. మా కుటుంబ సభ్యులందరం సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – సి.జలజాక్షి, డబ్లూహెచ్జీ 201, కడప హర్షణీయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు నెలల్లోనే అన్ని వర్గాల సంక్షేమంతో పాటు మాపై కూడా దృష్టి పెట్టి వేతనాల పెంపు చేపట్టడం హర్షణీయం. – పి.కిషోర్‌బాబు, హెచ్‌జి 838, కడప ఒన్‌టౌన్ పీఎస్ డ్రైవర్ ఆత్మస్థైర్యం పెంచారు హోంగార్డుల వ్యవస్థలో పని చేస్తున్న మహిళలలో కూడా ఈ వేతనాల పెంపు మరింత ఆత్మస్థైర్యం పెంపొందిస్తోంది. కారుణ్య నియామకాల కింద పోలీసు కుటుంబాల సభ్యులకు కొందరికి హోంగార్డులుగా.. గతంలో పని చేసిన పోలీసు అధికారులు నియామకాలు చేపట్టారు. అలాంటి వారి జీవితాల్లో మరింత వెలుగు నింపారు. – శ్యామల, మహిళా హోంగార్డు, జిల్లా పోలీసు కార్యాలయం, కడప -
హోంగార్డులు ఇక ఖుషీ.. ఖుషీగా
సాక్షి, నెల్లూరు : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా హోంగార్డ్స్ దినసరి వేతనాలను పెంచుతూ జీఓ జారీ చేశారు. ఎన్నికల ప్రచార సభలో మీ సమస్యలను ‘నేను విన్నాను.. మీకు నేనున్నానంటూ’ వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు సిబ్బందికి భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీక్లి ఆఫ్ అమలు చేయడంతో పాటు హోంగార్డులకు మెరుగైన వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూన్‌లో వీక్లీ ఆఫ్‌ను అమల్లోకి తీసుకు వస్తూ జీఓ జారీ చేశారు. తాజాగా శనివారం హోంగార్డ్స్ దినసరి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కు పెంచుతూ జీఓ విడుదల చేశారు. ముఖ్యమంత్రి చర్యలతో హోంగార్డుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ముక్త కంఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో 769 మంది హోంగార్డులు ఉన్నారు. వీరిలో 617 మంది పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తుండగా 157 మంది డిప్యుటేషన్‌పై ఆర్టీసీ, జైళ్లు, విజిలెన్స్, ట్రాన్స్‌కో, ఎఫ్‌సీఐ, ఏసీబీ, దూరదర్శన్, ఆర్టీఓ, అగ్నిమాపకశాఖ తదితర శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖలో పని చేస్తున్న హోంగార్డులు పోలీసులతో సమానంగా సేవలందిస్తున్నారు. అయితే వీరికిచ్చే జీతం అంతంత మాత్రంగానే ఉండేది. గత ప్రభుత్వాలు వీరికి నామ మాత్రంగా వేతనాలు పెంచడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. పెరిగిన జీతాలు సైతం కాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. దీంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. పెరిగిన అవసరాలకు సరిపడా వేతనాలు పెంచాలని పలు దఫాలుగా గత ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండాపోయింది. హామీని నెరవేర్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర, ఎన్నికల ప్రచారంలో హోంగార్డులు తమ సమస్యలను అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారి సాధక బాధలను విన్న ఆయన నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి శనివారం హోంగార్డుల దినసరి వేతనాన్ని రూ.710కు పెంచుతూ జీఓ జారీ చేశారు. పెరిగిన వేతనాలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు నెలకు సగటున రూ.18,000 వేతనం హోంగార్డులకు వచ్చేది. తాజా పెంపుతో (30 రోజులకు) రూ. 21,300 రానుంది. వేతన పెంపుపై హోంగార్డుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రుణపడి ఉంటాం మా సాధక బాధలు విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెరుగైన వేతనాలు అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వేతనాన్ని రూ.710కు పెంచుతూ జీఓ విడుదల చేసి మాటతప్పని మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేశారు. హోంగార్డులందరూ ఆయనకు రుణపడి ఉన్నారు. – పి. శరత్‌బాబు, హోంగార్డు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు దినసరి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీఓ విడుదల చేయడం హర్షణీయం. ముఖ్యమంత్రి చర్యలపై హోంగార్డులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు జిల్లా హోంగార్డుల తరఫున కృతజ్ఞతలు – ఆర్ సునీల్‌కుమార్, హోంగార్డు -
హోంగార్డుల జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం
-
హోంగార్డుల జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : సుదీర్ఘ పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాల నియామకం, ఆశా వర్కర్ల జీతాల పెంపు, ట్యాక్సీ, ఆటోలు నడుపుకొనే బడుగు జీవులకు ఆర్థిక సహాయం వంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ సీఎం జగన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమకు వేతనాన్ని పెంచారంటూ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. -
పురుగుమందు తాగి హోంగార్డు ఆత్మహత్య
ప్రకాశం, చీరాల రూరల్: పురుగుమందు తాగి హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఈపురుపాలెం పంచాయతీ బోయినవారిపాలెంలో శుక్రవారం రాత్రి జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిన శ్రీనివాసరావు (42) ఈపురుపాలెం పోలీసుస్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తుంటాడు. విధుల పట్ల అంకిత భావంతో ఉండే అతడు ఏం జరిగిందో తెలియదుగానీ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. శ్రీనివాసరావు కలెక్టర్ చేతుల మీదుగా 2018లో ఉత్తమ హోంగార్డు అవార్డు కూడా అందుకున్నాడు. మృతుడికి భార్య ఉమ, కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హోంగార్డు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఎస్ఐ తెలిపారు. -
ప్రేమ పేరుతో హోంగార్డు మోసం
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు పోలీసుల చర్యలు ఆ శాఖ పరువు తీస్తున్నాయి. దీంతో పోలీసు ఉద్యోగుల వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే కొమురం ఆసిఫాబాద్ జిల్లాలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి మహిళల అక్రమరవాణా కేసులో జైలుపాలయ్యాడు. ఇక లక్సెట్టిపేటకు చెందిన రిజర్వ్ సీఐ శ్రీనివాస్‌పై 498-ఎ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువతి గర్భందాల్చి బిడ్డకు జన్మనిస్తూ మృతి చెందింది. ఇందుకు జిల్లాకు చెందిన ఓ హోంగార్డే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల ప్రవర్తనపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఏఆర్ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న సజ్జన్‌లాల్ ధాంపూర్‌కు చెందిన అరుణ అనే యువతిని ప్రేమపేరుతో గర్భవతిని చేశాడు. ఆమె ఆదివారం ఆసిఫాబాద్‌లో మగబిడ్డకు జన్మనిచ్చి అనంతరం మృతి చెందింది. అయితే గతంలోనే సజన్ లాల్‌కు పెళ్లి కాగా, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ప్రేమ, పెళ్లి పేరుతో అరుణను లోబరచుకుని గత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. గర్భవతి అయిన ఆమెకు ఇవాళ ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకు వెళ్లకుండా ఆలస్యం చేశాడు. దీంతో ఆమె దారిలోనే బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి అక్కడ నుంచి సజ్జన్ లాల్ పరారయ్యాడు. అరుణ మృతితో న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తీసుకు వెళ్లేది లేదని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కాగా సజన్ లాల్ వ్యవహారంపై గతంలోనే ఆసిఫాబాద్ పోలీసులకు అరుణ బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తన చెల్లెలు చనిపోయిందని అరుణ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ సత్యనారాయణ...బాధితురాలి కుటుంబసభ్యులను సముదాయించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఇక పుట్టిన బిడ్డను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
నకిలీ పోలీసు అరెస్టు..!
సాక్షి, విజయనగరం : నిరుద్యోగ యువకులను బురిడీ కొట్టించిన ఓ నకిలీ పోలీసును భీమవరం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చీపురుపల్లికి చెందిన ప్రసాద్ ఎస్ఐగా చలామణి అవుతూ గుట్లపాడుకు చెందిన ముగ్గురు యువకులకు హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. వారివద్ద నుంచి రూ.24వేల చొప్పున వసూలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రసాద్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి పోలీస్ యూనిఫామ్, బొమ్మతుపాకీ, లాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. -
చైత్రకు చిక్కాడు స్నాచర్
దొడ్డబళ్లాపురం : చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని ఒక మహిళా హోం గార్డ్ ధైర్య సాహసాలు ప్రదర్శించి పట్టుకున్న సంఘటన నెలమంగల పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. నెలమంగల పట్టణ శివారులోని సొండెకొప్ప బైపాస్ వద్ద ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం సొండెకొప్ప వద్ద మహిళా హోం గార్డ్ చైత్ర విధుల్లో ఉంది. ఈ సమయంలో ఉమేశ్ అనే యువకుడు తన స్నేహితుడితో బైక్‌పై వచ్చి అక్కడే నిల్చున్న మహిళ మెడలో గొలుసు తెంపుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు. తక్షణం తేరుకున్న చైత్ర ఉమేశ్ పరారవడానికి ప్రయత్నిస్తుండగా పరుగున వెళ్లి పట్టుకుంది. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా చైత్ర తన పట్టు వదల్లేదు. పట్టుబడ్డ ఉమేశ్‌ను స్థానికులు చితకబాదారు. తరువాత చైత్ర, చైన్‌స్నాచర్ ఉమేశ్‌ను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎస్ఐనంటూ యువతికి వల..!
సాక్షి, గుంటూరు: విజిలెన్స్ ఎస్ఐనంటూ యువతిని ప్రేమలోకి దింపి మోసగించిన ఓ హోంగార్డు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనకు పరిచయం ఉన్న గన్మెన్ల వద్ద ఉన్న తుపాకులు తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చి, వాటిని యువతికి పంపి ప్రేమలోకి దించాడు. తర్వాత ఆమె తల్లి వద్ద రూ.12.50 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే తనపైనే నిందలు వేసి నిరాకరించడంతో మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె తల్లి మంగళవారం గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. నరసరావుపేటలో హోంగార్డుగా పనిచేస్తున్న అనిల్ ఫేస్బుక్లో రిక్వెస్టులు పెట్టి పరిచయమై తాను విజిలెన్స్ ఎస్ఐనంటూ తుపాకీ పట్టుకున్న ఫొటోను, ఓ నకిలీ ఐడీని యువతికి పంపాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. అతను ఎస్ఐ అని నమ్మిన యువతితో పాటు ఆమె తల్లి కూడా పెళ్లికి అంగీకరించారు. బ్యాంకు లోను కింద రూ.15లక్షలు కట్టాల్సి ఉందని, డబ్బు ఇవ్వాలని కోరాడు. వారు బంగారాన్ని తాకట్టు పెట్టి, మరికొంత అప్పు చేసి విడతలుగా రూ.12.50 లక్షలు అనిల్‌కు ఇచ్చారు. కొంతకాలం తరువాత పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో మీ అమ్మాయి మంచిది కాదంటూ ఆరోపణలు చేశాడు. తన స్నేహితుడితో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కనీసం తమ డబ్బు అయినా ఇవ్వమని అడిగితే ఇవ్వాల్సింది రూ.6 లక్షలే అంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. గట్టిగా మాట్లాడితే తాను చావడమో, మిమ్మల్ని చంపడమో చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనిల్ ప్రవర్తన తో తన బిడ్డ జీవితం నాశనమైందని, పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది. -
విశాఖ హోంగార్డులపై కక్ష సాధింపు
సాక్షి, అమరావతి బ్యూరో: పోలీసులతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డులపై విశాఖ నగర పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తాము చెప్పిన పార్టీకి అనుకూలంగా పనిచేయలేదనే కారణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూలురనే ముద్ర వేసి 52 మంది హోంగార్డులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచారు. ఆ తర్వాత వివిధ కారణాలు చూపుతూ వారిని ఆర్టీసీ విభాగంలో విధులకు కేటాయించారు. అయితే వారికి తగినంత వేతనం ఇవ్వలేమంటూ ఆర్టీసీ యాజమాన్యం చేతులు ఎత్తేయడంతో వారంతా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. 2 నెలలుగా వేతనాలు లేకుండా జీవనం సాగిస్తున్న దుస్థితి వారిది. తాము ఏ తప్పూ చేయకపోయినా విధుల నుంచి తొలగించి ఇబ్బందులు పెట్టడం అన్యాయమంటూ వారంతా వాపోతున్నారు. ఉన్నతాధికారుల వద్ద విన్నవించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా హోంగార్డులకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు. కమిషనరేట్ ప్రాంగణంలోకి రానివ్వకుండా అడ్డు.. విశాఖపట్నం నగర పరిధిలో 1,196 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 875 మంది జనరల్ విధుల్లో ఉండగా.. మరో 321 మంది డెప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇటీవల వీరిలో 52 మంది హోంగార్డులను ఎన్నికల ముందు జనరల్ విధుల నుంచి బదిలీ చేస్తూ ఆర్టీసీ విభాగానికి కేటాయించారు. అయితే అక్కడ హోంగార్డులకు ఇచ్చే రోజువారీ వేతనం రూ. 600లు ఇవ్వలేమని.. కేవలం రూ. 400లే ఇస్తామని ఆర్టీసీ యాజమాన్యం తేల్చిచెబుతూ వారిని వెనక్కి పంపింది. దీంతో అటు ఎన్నికల విధులకు హాజరుకాలేక.. ఇటు ఆర్టీసీలో పనిచేయలేక రెండు నెలలుగా వారంతా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో వారికి వేతనాలు అందలేదు. న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించుకోవడానికి వెళ్లగా.. కనీసం కమిషనరేట్ ప్రాంగణంలోకి వారిని రానివ్వకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి అడ్డుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. కేవలం వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులనే కారణంగానే వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాంగార్డుల నుంచి మాముళ్లు వివిధ పోలీసుస్టేషన్లు, ట్రాఫిక్, జనరల్, డ్రైవర్లుగా పనిచేసే హోంగార్డులకు ప్రతినెలా విధులు మార్చాలని జీవో ఉన్నప్పటికీ అది రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. కొందరు ఉన్నతాధికారులు తమ పనుల కోసం వారిని వినియోగించుకుంటూ ఒకే చోట కొనసాగేలా చేసుకుంటున్నారు. విశాఖ సిటీ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులకు ఏసీపీ నేతృత్వం వహిస్తారు. ప్రతి 45 మంది హోంగార్డులకు ఒక హెడ్‌కానిస్టేబుల్ ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. వీరిపై ఓ ఆర్ఐ ఇన్చార్జిగా ఉంటారు. అయితే ఆర్‌ఐకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే డ్యూటీ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోంగార్డుల నుంచి నెలవారీ మామూళ్లు కూడా వసూలు చేస్తున్నారని ఆ శాఖ వర్గీయులే గుసగుసలాడుకోవడం గమనార్హం. -
4 నెలలుగా హోంగార్డులకు అందని జీతాలు
-
హోంగార్డుగా పని చేస్తూ నేరాలు
నాగోలు: ఎస్ఐ పేరుతో నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకుని మరో ఇద్దరితో కలిసి బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న హోం గార్డుతో సహా అతడి అనుచరులు ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక ఎయిర్ ఫిస్టల్, నకిలీ ఐడీ కార్డులు, ఫార్చునర్ కారుతో పాటు రూ.36 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో రాచకొండ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లెలగూడ, న్యూ గాయత్రీనగర్‌కు చెందిన కాసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోం గార్డుగా పని చేస్తున్నాడు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు జిల్లెలగూడలో వీటీ రియల్ ఫైనాన్స్ చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నాడు. ఇంటలిజెన్స్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీ కార్డు సృష్టించడమేగాక, ఒక ఎయిర్ ఫిస్టల్ కొనుగోలు చేశాడు. గతంలో హోం గార్డులుగా పని చేసిన ఎల్బీనగర్ మన్సూరాబాద్‌కు చెందిన తాళ్లూరి అశోక్, ఉప్పల్‌కు చెందిన అశోక్ రెడ్డితో ముఠా ఏర్పాటు చేశాడు. అశోక్‌కు కానిస్టేబుల్‌గా, అక్కిరెడ్డిని జర్నలిస్ట్‌గా పేర్కొంటూ నకిలీ ఐడీ కార్డులు సృష్టించాడు. ముగ్గురూ కలిసి వెంకటేశ్వర్‌రెడ్డి కారుకు పోలీస్ సైరన్ ఏర్పాటు చేసుకుని టోల్ గేట్లు తదితర ప్రాంతాల్లో వాహనదారులు, ప్రజలను భయాందోళనలకు గురి చేసేవారు. గతంలో వీరు యాదగిరి గుట్ట ప్రాంతంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, సేల్ డీడ్ చేసుకున్నారు. అయితే స్థలం విలువ పెరగడంతో యజమాని స్థలం ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని బెదిరించేందుకు ఎయిర్ ఫిస్టల్ తీసుకుని కారులో వెళుతుండగా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫిస్టల్, నగదు, నకిలీ ఐడీ కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ పృధ్వీధర్‌రావు, ఎల్బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఓటీ సీఐ రవికుమార్, ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా ఎస్ఐకి తాళి కట్టేందుకు యత్నం హోంగార్డు అరెస్ట్
చెన్నై ,టీ.నగర్: మహిళా ఎస్ఐకు బలవంతంగా తాళి కట్టేందుకు ప్రయత్నించిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నుంగంబాక్కం పోలీసు స్టేషన్లో మహిళా ఎస్ఐగా విల్లుపురం జిల్లా, తిరుక్కోవిలూరుకు చెందిన మణిమేగలై (24) పనిచేస్తున్నారు. ఈమె 2016లో వేలూరు కాట్పాడి పోలీసు స్టేషన్లో ఎఎస్ఐగా పనిచేశారు. ఆ సమయంలో కాట్పాడికి చెందిన బాలచంద్రన్ (25) హోంగార్డుగా పనిచేస్తూ వచ్చాడు. అతనితో మణిమేగలై చనువుగా ఉండేదని తెలిసింది. దీన్ని ప్రేమగా భావించిన బాలచంద్రన్ మణిమేగలైను ఒన్‌సైడ్‌గా ప్రేమించాడు. ఇలా ఉండగా శనివారం రాత్రి చెన్నైకు చేరుకున్న బాలచంద్రన్ ఎగ్మూరులోని ఉడుపి హోటల్ వద్ద మణిమేగలైతో మాట్లాడాడు. ఆ సమయంలో తాను ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నట్లు తనను వివాహం చేసుకొమ్మని కోరాడు. ఇందుకు మణిమేగలై నిరాకరించింది. అయినప్పటికీ తాను సిద్ధంగా తెచ్చుకున్న తాళిబొట్టును మణిమేగలై మెడలో ప్రజల సమక్షంలోనే కట్టేందుకు ప్రయత్నించాడు. దీన్ని ఊహించని మణిమేగలై అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించింది. ప్రజలు బాలచంద్రన్‌ను పట్టుకుని ఎగ్మూరు పోలీసు స్టేషన్లో అప్పగించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
తీగలాగితే కదిలిన అవినీతి డొంక
గుంటూరు రూరల్: వ్యభిచార గృహాల నిర్వాహకులను బెదిరించడంతో పాటు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి భారీస్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డ్, గతంలో ఓ న్యూస్ చానల్ (సాక్షికాదు) లో పని చేసిన కెమేరామన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను బెదిరించి నగదు వసూలుకు పాల్పడిన ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఊహించని నిజాలు బయటపడ్డాయి. నగరంలోని నగరాలు ప్రాంతానికి చెందిన మల్లేశ్వరి వ్యభిచార గృహం నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డ్, గతంలో న్యూస్ చానల్లో పనిచేన కెమేరామన్లు ఆమెను బెదిరించి నగదు వసూలు చేశారు. నెలానెలా మూమూళ్లు ఇస్తే ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. ఏఆర్ కానిస్టేబుల్ బెదిరింపులు ఈ క్రమంలో రెండు రోజుల కిందట 6వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ మల్లేశ్వరి వద్దకు వెళ్లి రూ. 20 వేలను బెదిరించి వసూలు చేశాడు. దీంతో ఆమె గతంలో తనకు హామీ ఇచ్చిన హోంగార్డు, కెమేరామన్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని చెప్పింది. దీంతో ఇద్దరు కలసి ఏఆర్ కానిస్టేబుల్‌పై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఊహించని నిజాలు బయట పడ్డాయి. కెమేరామన్, హోంగార్డులే బెదిరిపులకు పాల్పడుతూ వసూళ్లు చేస్తుంటారని తెలిసింది. దీంతో వారినీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా బాగోతం బయటపడింది. పలు స్టేషన్లలో కేసుల నమోదు గతంలోనూ హోంగార్డు, మాజీ కెమేరామన్ ఇదే విధంగా వసూళ్లకు పాల్పడ్డ ఘటనల్లో నగరంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కెమేరామన్ గతంలో పాత గుంటూరుకు చెందిన ఒక మహిళను బెదిరించి నగదు వసూలు చేశాడు. దీంతో ఆమె జిల్లా ఎస్పీని సంప్రదించగా పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. నగరంలోని ఈస్ట్, వెస్ట్ పరిధిలో మరో రెండు పోలీస్స్టేషన్లలో ఇద్దరిపై కేసులు నమోదైనట్లు సమాచారం. అయినా, వారిలో మార్పు రాలేదు. నగరంలోని పలు వ్యభిచార గృహాల నిర్వాహకుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. గతంలో నగరంపాలెంలో ఓ పత్రికా విలేకరి ఇదే విధంగా వ్యభిచారం నిర్వాహకురాలిని బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడిన ఘటనలో ప్రస్తుతం అదుపులోఉన్న కెమేరామన్ హస్తం ఉన్నట్లు సమాచారం. బెందిరింపులే ప్రవృత్తిగా హోంగార్డు అండతో నగరంలోని నగర శివారుల్లోని వ్యభిచార గృహాల్లో లక్షలాది రూపాయలు వసూళ్లు చేశాడని సమాచారం. బెదిరింపులకు పాల్పడేది ఇలా... ముందుగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారి ఆచూకీ తెలుసుకుని అది ఏస్టేషన్ పరిధిలోకి వస్తుందో చూస్తారు. అనంతరం ఆ స్టేషన్‌కు వెళ్లి అక్కడ వారికి అనుకూలమైన కానిస్టేబుల్‌ను ఎంచుకుని అతని సహాయంతో హోంగార్డ్, కెమేరామన్లు వారిని బెదిరిస్తారు. ఒకవేళ కానిస్టేబుల్ వారికి అనుకూలించకపోతే అతనిపై లేనిపోని ఆరోపణలు చూపి అతనిని బెదిరించి వారి వైపునకు మలుచుకుంటారు. దీంతో చేసేదిలేక కానిస్టేబుల్స్ సైతం వారు చెప్పినట్లు ఆడుతుంటారని సమాచారం. ఈ క్రమంలో వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి వచ్చే నగదును అందరూ పంచుకునేవారని తెలిసింది. ఈ విధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి లక్షల్లో నగదును వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. నిందితుల అరెస్టు ఎట్టకేలకు నల్లపాడు పోలీస్‌స్టేషన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలిసింది. అయితే, వీరితో పాటు వ్యభిచార గృహాల నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తేగానీ ఇటువంటి అరాచక శక్తులకు అడ్డుకట్ట పడదు. -
మద్యం మత్తులో హోంగార్డు దాడి
విశాఖపట్నం, నర్సీపట్నం: మద్యం మత్తులో హోంగార్డు ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నాడు. అకారణంగా చేయి చేసుకోవడాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో హోంగార్డును నిలదీశారు. జనసమర్ధంగా ఉండే ఆర్టీసీ కూడలిలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నక్కపల్లి మండలం డొంకాడ గ్రామానికి చెందిన సకిరెడ్డి శివ, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై శుభకార్యం నిమిత్తం గొలుగొండ మండలం జోగంపేట వెళ్లి తిరిగి వస్తుండగా పట్టణంలోని ఆర్టీసీ కూడలి వద్దకు వచ్చేసరికి విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు వంతల బేష్ వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉండడంతో కిందపడిపోయాడు వెంటనే లేచి ద్విచక్రవాహనంపై ఉన్న శివపై చేయి చేసుకున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ త్రిబుల్స్ డ్రైవింగ్ చేస్తున్నారని శివపై ఆన్లైన్లో కేసు నమోదు చేశాడు. ఇంతటితో ఆగకుండా హోంగార్డు ... శివను విచక్షణరహితంగా కొట్టాడు. హోంగార్డును తీరును చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిని నిలదీశారు. విధి నిర్వహణలో మద్యం సేవించడమే కాకుండా అకారణంగా చేయి చేసుకోవడం ఏమిటిని నిలదీశారు. ట్రాఫిక్, మొబైల్ పోలీసులు సర్టిచెప్పే ప్రయత్నం చేశారు. హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని బాధితులకు అండగా నిలిచిన స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కూడలికి అటు ఇటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయంలో తెలుసుకున్న సీఐ సింహాద్రినాయుడు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్దిచెప్పి, వివాదానికి కారణమైన హోంగార్డును పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. జరిగిన సంఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. హోంగార్డు సస్పెన్షన్‌కు సిఫారసు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి సకిరెడ్డి శివపై చేయి చేసుకున్న హోంగార్డును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీకి నివేదించినట్టు ఏఎస్పీ ఆఫీజ్ హారీఫ్ తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐ, సిబ్బంది ఇటువంటి సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. తమ సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇబ్బంది కలిగించినట్టయితే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
అసభ్యంగా తాకుతూ హోంగార్డు వెకిలి చేష్టలు..
కొచ్చి : రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే మహిళలు, బాలికల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. కొచ్చిలోని తివారాలో చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్ అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. ఎలమక్కరాకు చెందిన 58 ఏళ్ల శివకుమార్ యూనిఫాంలో ఉండి కూడా కావాలని మహిళలను, స్కూలు విద్యార్థులను అసభ్యంగా తాకారు. దీంతో తాత్కాలిక ఉద్యోగి అయిన అతన్ని ఫైర్ డిపార్డ్మెంట్కు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెలిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో సీటి పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరో వైపు శివకుమార్‌పై ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహిళలు, బాలికల పట్ల హోంగార్డు వెకిలి చేష్టలు..
-
అమ్మ..హోమ్‌గార్డూ!
ప్రకాశం, చీరాల: ఈపూరుపాలెం పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఓ హోమ్‌గార్డు ఆ స్టేషన్లో చేస్తున్న హల్చల్ అంతా..ఇంతా..కాదు. రూరల్ పోలీసుస్టేషన్‌కు అధికారులు ఎవరు వచ్చినా మాయమాటలు చెప్పి లోబరుచుకుంటాడు. వారి సొంత పనులు చేస్తూ పోలీసుస్టేషన్లలో చక్రం తిప్పుతుంటాడు. చివరకు పోలీసు క్వార్టర్స్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి షాపులు నిర్మించి అద్దెకు ఇస్తున్నాడంటే అతని హవా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా పోలీసు శాఖకు చెందిన హోమ్‌గార్డు స్థలాన్ని ఆక్రమించి షాపులు నిర్మించి అద్దెలు వసూలు చేసుకుంటున్నాడు. వివరాలు.. రూరల్ పోలీసుస్టేషన్లో చాలాకాలంగా హోమ్‌గార్డుగా తిష్ట వేసి వి«ధులు నిర్వహిస్తున్నాడు. ఏళ్ల తరబడి ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తూ స్టేషన్ వ్యవహారాలు చూస్తుంటాడు. హోమ్‌గార్డు కన్ను పోలీసు క్వార్టర్స్‌కు ఎదురుగా ఉన్న విలువైన స్థలంపై పడింది. మొదట్లో చిన్నగుడిసె వేసి ఆక్రమించాడు. ఇక తనను ఎవరూ అడగరని నిర్ధారించుకున్నాడు. ముందు వేసిన గుడిసెను తొలగించి ఈపూరుపాలెం–బాపట్ల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న రూ.8 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అందులో రెండు దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. పోలీసు శాఖలో పనిచేసే హోమ్‌గార్డు కావడం.. స్టేషన్లో పెత్తనం చేస్తున్న ఉద్యోగి కావడంతో స్థానికులు అడ్డు చెప్పలేకపోతున్నారు. అలాగే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నా జంకుతున్నారు. కళ్లముందే లక్షలాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం ఆక్రమించి గదులు నిర్మించి అద్దెకిస్తున్నా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో చీరాల డీఎస్పీగా పనిచేసిన డాక్టర్ ప్రేమ్‌కాజల్‌కు ఈ వ్యవహారం తెలియడంతో హోమ్‌గార్డు ఆక్రమణలపై దష్టి సారించి ఆక్రమణలకు పాల్పడుతున్న హోమ్‌గార్డుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అప్పుడు కొంతకాలం రేకుల షెడ్డును మూసివేసిన హోమ్‌గార్డు..ఇటీవల డీఎస్పీ బదిలీ కావడంతో మళ్లీ తనపంథాను యథావిధిగా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి హోమ్‌గార్డు చేసే అక్రమాలపై చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
హోంగార్డుల సంక్షేమానికి కృషి
కర్నూలు : హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల సంక్షేమానికి చేపట్టిన సంక్షేమ పథకాల పత్రాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డుల సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డుల సంక్షేమ పథకాల పత్రాన్ని ప్యాకెట్ డైరీగా ఉంచుకోవాలని, ప్రభుత్వ పథకాల గురించి తమ కుటుంబాలకు కూడా తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, చంద్రన్న బీమా పథకం, వ్యక్తిగత ప్రమాద బీమా, మెడి క్లెయిమ్ పాలసీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన తదితర పథకాల గురించి వివరించారు. హోంగార్డులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎన్.చంద్రమౌళి, డీఎస్పీలు బాబుప్రసాద్, సి.ఎం.గంగయ్య, లక్ష్మినారాయణరెడ్డి, సీఐ పవన్‌కిషోర్, ఈ–కాప్స్ ఇన్చార్జ్ రాఘవరెడ్డి పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.. కర్నూలు హోంగార్డు యూనిట్లో పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు యల్లప్ప కుటుంబానికి వెల్ఫేర్ ఫండ్ చెక్కును ఎస్పీ అందజేశారు. యల్లప్ప భార్య శకుంతలను శనివారం ఎస్పీ తన కార్యాలయానికి పిలిపించి రూ.10 వేల చెక్కు ఇచ్చారు. వారి కుటుంబంలో ఒకరికి త్వరలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ కమాండెంట్ చంద్రమౌళి, హోంగార్డు డీఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
నగరంలోని ఆ నాలుగు రోడ్లలో నరకం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్‌లో హోంగార్డుల ఆందోళనతో సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వాహనదారులు సుమారు మూడు గంటలుగా నరకం అనుభవిస్తున్నారు. ట్యాంక్ బండ్ మొదలు ఖైరతాబాద్-నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్-పంజాగుట్ట, సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్లలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల సమయం నుంచి ట్రాఫిక్ జామ్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన గుర్రం గౌడ్ అనే హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించిన 400 మంది హోంగార్డులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలంటూ హోర్డింగ్ ఎక్కి ఆందోళనకు దిగాడు. లేకపోతే పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీని కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గౌడ్ ఆందోళనకు మద్దతుగా మరో 250 మంది హోంగార్డులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలంటూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు ఉద్యోగం చేయించుకొని, అనంతరం సర్వీస్ నుంచి తొలగించాని ఆవేదన వ్యక్తం చేశారు. 400 మంది హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాంటూ డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారుడిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. -
హోంగార్డుకు ఆర్థిక సాయం
విజయనగరం టౌన్ : జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కోరాడ అప్పారావుకు ఎస్పీ జి. పాలరాజు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల చెక్‌ను అందజేశారు. శుక్రవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ, హోంగార్డులు పదవీ విరమణ చేసినా, మరణించినా వారి కుటుంబానికి హోంగార్డుల ఒక్కరోజు అలవెన్స్‌ను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో హోమ్గార్డ్స్ ఇన్చార్జి ఆర్ఎస్సై మురళీధర్, ఆఫీస్ సూపరింటెండెంట్ బి.చంద్రశేఖర్, జూనియర్ సహాయకులు పాల్గొన్నారు. -
హోంగార్డులతో ఉన్నతాధికారి వెట్టి చాకిరి
హైదరాబాద్ : హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రాఘవరావు హోంగార్డులతో సొంత పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజేంద్రనగర్ కిస్మత్‌పురాలో సొంత విల్లా నిర్మాణంలో హోంగార్డులతో పనులు చేయిస్తున్నారని పలువురు హోంగార్డులు మీడియాకు విషయం లీక్ చేశారు. పని చేయకపోతే హోంగార్డులను బెదిరింపులకు గురి చేస్తున్నారని గోప్యంగా విషయం వెల్లడించారు. పోలీసుశాఖలో ఇంకా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గతంలో ఆర్బీవీఆర్లో ఆ ఉన్నతాధికారి అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిన్‌గా పని చేశారు. 2009లో రిటైర్డ్ అయినా తిరిగి ఆర్బీవీఆర్లోనే ఓఎస్డీగా అధికారుల అండతో జాయిన్ అయ్యాడు. ఇన్నేళ్లుగా అదే పదవిలో కొనసాగుతుండడంతో అతనికి ఎదురు చెప్పేవాళ్లు కరువయ్యారు. -
అవ్వకు బువ్వపెట్టి.. ఆశ్రమంలో చేర్పించాడు
సాక్షి, హైదరాబాద్: అది నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కూకట్పల్లి జేఎన్టీయూ సిగ్నల్.. జనం ఎవరి సోయిలో వాళ్లు.. రోడ్డు పక్కనే ఒక అవ్వ.. పెట్టే దిక్కులేక చాన్నాళ్ల నుంచి తిండి తిననట్లు బక్కచిక్కిన శరీరం.. ఎటు పోవాలో, ఏం చెయ్యాలో తెలియని బిత్తరచూపులు! అటుగా వచ్చిన హోంగార్డు ఒకరు ఆ అవ్వను చూసి చలించిపోయాడు. పక్కనున్న టిఫిన్ సెంటర్ నుంచి ఆహారం తీసుకొచ్చి ఓపికగా అవ్వకు తినిపించాడు. అంతేనా, అధికారుల సాయంతో అవ్వను ఆశ్రమంలో చేర్పించాడు. అతని పేరు బి.గోపాల్. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డు. ఉద్యోగరీత్యా అతని స్థాయి చిన్నదే అయినా, ఉన్నత వ్యక్తిత్వం అతని సొంతం. అందుకే ఉన్నతాధికారుల నుంచి సామాన్యపౌరుల దాకా అందరూ అతన్ని అభినందిస్తున్నారు. తెలంగాణ డీజీపీకి పీఆర్వో భార్గవి పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ వృద్ధురాలిని చర్లపల్లిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆనందాశ్రమానికి తరలించినట్లు భార్గవి తెలిపారు. -
ఒత్తిడితో విలవిల
సాక్షి, విశాఖపట్నం: విశ్రాంతి ఇవ్వకుండా మన చేత ఇలా డ్యూటీలు మీద డ్యూటీలు చేయిస్తున్నంత కాలం మనకి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఒత్తిడి తట్టుకోలేక ఎవరో ఒకరూ ఇలాగే ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. పోలీస్ వ్యవస్థ ఇంకెప్పుడు మారుతుందో? ఆఫీసర్స్ అందరికి శతకోటి వందనాలు.. చావగొడుతున్నారు.. తిండి తిప్పల్లేవు.. కంటిమీద కునుకు లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. పోలీస్, రెవెన్యూ సిబ్బంది తమ సహచర ఉద్యోగులకు పెడుతున్న మెసేజ్‌లు ఇవి. ఎంత ఒత్తిడితో పోలీస్, రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారో ఈ మెసేజ్‌లు చూస్తే అర్థమవుతోంది. ఏపీఐఐసీ ప్రాంగణంలో జరుగుతున్న మూడ్రోజుల భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ అధికారులు.. సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సదస్సు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న చేపల రాజు (39) అనే హోంగార్డు గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. లక్ష్మిటాకీస్ దరి చిలకపేటకు చెందిన ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో ఏఆర్ కానిస్టేబుల్ సన్యాసిరావు(పీసీ నెం.531) ఒత్తిడి తట్టుకోలేక ఫిట్స్ రావడంతో రక్తం కక్కుకుంటూ కూలబడిపోయాడు. అతడిని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అతను కూడా గుండెపోటుకు గురైనట్టుగానే చెబుతున్నారు. పరిస్థితి విçషమంగా ఉందని కేజీహెచ్ వైద్యులు వెల్ల డించారు. ఈయన హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరే కాదు.. రెవెన్యూ శాఖలో కూడా ఓ డెప్యుటీ తహసీల్దార్‌తో సహా ముగ్గురు సిబ్బంది హైబీపీతో ఆస్పత్రి పాలైనట్టుగా తెలియవచ్చింది. గతంలో కూడా ఇదే రీతిలో పార్లమెంటరీ స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరిగిన సమయంలో స్టీల్ ప్లాంట్ భూసేకరణ విభాగం స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ నోవొటల్ వద్ద వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతున్న సమయంలోనే గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఓవైపు భూకబ్జాలు.. రికార్డుల టాంపరింగ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సిట్ సిఫార్సులు, కేసులు నివేదికలతో రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మరో వైపు వరుసగా జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మేళనాలతో క్షణం తీరికలేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. భాగస్వామ్య సదస్సు ప్రాంగణం వద్దే హోంగార్డు గుండెపోటుతో మరణించడం.. మరో కానిస్టేబుల్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నా.. సీఎంతో సహా కేబినెట్ మొత్తం ఇక్కడే ఉన్నా వారిలో చలనం లేకపోవడం దురదృష్టకరం. కనీసం చనిపోయిన కానిస్టేబుల్ ఇంటికి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, అధికారి కానీ పరామర్శించేందుకు వెళ్లిన పాపానపోలేదు. దీంతో ఇంకెంతకాలం ఒత్తిడిలో పనిచేయాలంటూ పోలీస్, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలనే తేడా లేకుండా రేయింబవళ్లు భార్య, బిడ్డలకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్నా కనీస గుర్తింపు కూడా లేదని వాపోతున్నారు. సదస్సు ప్రాంగణంలోనే రక్తం కక్కుకుంటూ కుప్పకూలిన ఏఆర్ కానిస్టేబుల్ -
అర్ధరాత్రి హోంగార్డు సాహసం
రంగారెడ్డి/యాలాల(తాండూరు): అర్ధరాత్రి వేళ నిలిపి ఉంచిన లారీల నుంచి డీజిల్‌ను తస్కరించే ముఠాకు యాలాల పీఎస్‌కు చెందిన ఓ హోంగార్డు చెమటలు పట్టించాడు. నలుగురు సభ్యులున్న ఈ ముఠాను ఒక్కడే ధైర్యంగా దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెంటాడటంతో దుండగులు తాము ప్రయాణిస్తున్న కారును వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యాలాల ఠాణాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న భీంరెడ్డి విధుల్లో భాగంగా బుధవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని తాండూరులో వదిలేసి తిరిగి యాలాల ఠాణాకు వాహనంలో ఒంటరిగా వెళుతున్నాడు. మార్గమధ్యలో లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నిలిపి ఉంచిన లారీల పక్కన ఓ తెల్లటి కారు (ఏపీ 28 ఏటీ 2889) అనుమానాస్పదంగా ఉండటం గమనించాడు. కారు దగ్గరకు వెళ్లి పరిశీలించగా నిలిపి ఉంచిన లారీ నుంచి డీజిల్‌ను తస్కరిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే తేరుకుని భీంరెడ్డి వారిని పట్టుకునేందుకు యత్నించాడు. భీంరెడ్డి రాకను గమనించిన ముఠా.. కారును కొడంగల్ మార్గంలో ముందుకు పోనిచ్చారు. భీంరెడ్డి పోలీసు వాహనంలోనే దుండగుల కారును వెంబడించాడు. ఇలా దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెంటాడగా, దౌలాపూర్–తిమ్మాయిపల్లి మార్గంలో ఉన్న మైసమ్మ ఆలయం వద్ద దుండగులు కారును వదిలేసి చెరో వైపు పరారయ్యారు. ఘటన స్థలంలో నిలిపి ఉంచిన కారు టైర్లలోంచి గాలిని తీసేసిన భీంరెడ్డి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే పలు లారీల నుంచి తస్కరించిన దాదాపు 250 లీటర్ల డీజిల్ డబ్బాలను కారులోంచి స్వాధీనం చేసుకున్నారు. కారును యాలాల ఠాణాకు తరలించారు. కారు నెంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా హోంగార్డు చేసిన సాహసంపై తోటి ఉద్యోగులు, మండలవాసులు అభినందిస్తున్నారు. -
బతుకు బండి లాగాలని..
గుంటూరు: మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. లేకుంటే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా భృతి చెల్లిస్తాం.. అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాటలు నీటి మూటగానే మిగిలాయి. పేదరికాన్ని జయిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ విద్యను పూర్తి చేసిన యువత రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక, కూలీ పనులు చేయడం చేతకాక ఏమి చేయాలో పాలు పోని అయోమయ స్థితిలో యువత కొట్టుమిట్టాడుతున్నారు. 7వ తరగతి విద్యార్హత ఉన్న డ్రైవర్ పోస్టుల కోసం డిగ్రీ ఆపై చదువులు చదివిన యువత పోటీ పడాల్సిన గత్యంతరం ఏర్పడింది. నిరుద్యోగ రక్కసి కోరల్లో నిరుద్యోగ యువత సతమతమౌతున్నారనడానికి హోంగార్డు డ్రైవర్ పోస్టులే నిదర్శనం. యువత పోటాపోటీ.. రాజధాని ప్రాంతమైన గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో మొత్తం 40 హోంగార్డు డ్రైవర్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత మొత్తం 600 దరఖాస్తులు అందాయి. వారిలో అర్హత ఉన్న 340 మందిని శనివారం పిలిపించగా వారిలో 274 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన, ఎత్తు కొలతలు పరిశీలించి వారిలో 10 మంది నిబంధనల ప్రకారం ఎత్తు లేక పోవడంతో వెనక్కి పంపించి మిగిలిన వారికి రాత పరీక్ష నిర్వహించగా 84 మంది డ్రైవింగ్ టెస్ట్‌కు అర్హత సాధించారు. వారికి ఆదివారం జిల్లా ఉపరవాణాశాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు పీజీ, ఆరుగురు బీటెక్, పది మంది డిగ్రీ చదివారు. మిగిలిన వారంతా పది పాసైన వారు ఉన్నారు. కనీస విద్యార్హత 7వ తరగతి చదివిన వారు లేకపోవడం గమనార్హం. డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి చివరిగా మెడికల్ టెస్ట్‌లు జరిపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ హోంగార్డు డ్రైవర్ పోస్టులకు యువత పోటీ పడ్డారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. నాతోపాటు అదనపు ఎస్పీ, హోంగార్డు డీజీ కార్యాలయ సిబ్బందితో కలసి కమిటీ ఉంటుంది. ఎంపిక ప్రక్రియను వీడియా ద్వారా నమోదు చేశాం. అర్హులకు త్వరలో శిక్షణ ఇస్తాం. – సీహెచ్ విజయారావు, అర్బన్ ఎస్పీ ఎనిమిదేళ్లుగా డ్రైవర్‌గా చేస్తున్నా.. డిగ్రీ పూర్తి చేశాక ఏడాది పాటు ఖాళీగా ఉన్నాను. ఉద్యోగాల కోసం పలు చోట్లు ప్రయత్నించాను. ప్రయోజనం లేకపోవడంతో లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకొని 2008 నుంచి ప్రైవేటు వాహనాలకు డ్రైవర్‌గా చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాను. ఉద్యోగం వస్తే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. – కె.బాజి -
ఖమ్మంలో హోంగార్డు కుటుంబం ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో శనివారం కలకలం రేగింది. స్థానికంగా ఇన్న రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కల్లూరు మండలానికి చెందిన కాశీ విశ్వనాథ్, ఆయన కుమారులు జయంత్, అజయ్ గా నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాశీ విశ్వనాథ్ హోంగార్డుగా పని చేస్తున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
హోంగార్డు డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు: రాజధానిగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో పోలీస్ విధులు పెరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులకు వాహనాల కేటాయింపు జరగడంతో మూడేళ్లుగా అర్బన్ జిల్లా పోలీసులు డ్రైవర్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించేందుకు హోంగార్డు పోస్టులో డ్రైవర్లను తీసుకునేందుకు అర్బన్ ఎస్పీ సిహెచ్.విజయారావు శ్రీకారం చుట్టారు. అర్బన్ జిల్లా పరిధికి చెందిన అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 40 హోంగార్డు పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అర్హతల వివరాలను బుధవారం ఎస్పీ వెల్లడించారు. అర్హతలు అర్బన్ జిల్లా పరిధిలోని గుంటూరు నగరంతోపాటు నల్లపాడు, మేడికొండూరు, పత్తిపాడు, వట్టిచెరుకూరు, చేబ్రోలు, కాకాని, మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని వారు మాత్రమే దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి, 7వ తరగతి పాసై, కనీసం 160 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎలాంటి కేసులు లేకుండా, సత్ప్రవర్తన కలిగి ఉండి, ఆరోగ్యవంతులు అర్హులు. హెవీమోటరు వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు ఇలా.. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 8న ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేస్తారు. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యుర్థులు ఎస్పీ గుంటూరు అర్బన్ జిల్లా పేరుతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లే విధంగా రూ.25 డీడీని తీసుకొని ప్రత్యేక కౌంటర్ వద్దకు వెళ్లాలి. అక్కడ డీడీ చూపితే విధుల్లో ఉండే అధికారులు దరఖాస్తు అందజేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటుగా విద్యార్హత, జనన ధ్రువీకరణ, స్థానికత, కుల ధ్రువీకరణ, లైసెన్స్, ఆధార్ జిరాక్స్ కాపీలతో పాటు మూడు పాస్‌పోర్టు ఫొటోలను జతచేసి అధికారులకు అందజేయాలి. సద్వినియోగం చేసుకోండి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాసం ఉంటున్న వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తుల అందజేతలో ఎలాంటి తప్పులు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టినా విచారణలో పట్టుబడితే చర్యలు తప్పవు. అర్హులైన వారు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. –సిహెచ్.విజయారావు, అర్బన్ ఎస్పీ -
హోంగార్డుల వేతనం.. 20,000
సాక్షి, హైదరాబాద్ : హోంగార్డులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హోంగార్డుల వేతనాలను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హోంగార్డులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇస్తామని వెల్లడించారు. బుధవారం ఇక్కడ ప్రగతిభవన్‌లోని ‘జనహిత’లో హోంగార్డులతో సీఎం సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో వేతనాల ’పెంపుతోపాటు పలు కీల కమైన ప్రకటనలు చేశారు. వేతనాల పెంపుతో ఏడాదికి దాదాపు రూ.265 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడనుంది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో దాదాపు 18,900 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారు. ఏడాదికి రూ.వెయ్యి చొప్పున ఇంక్రిమెంట్ అమలు చేయనున్నట్టు వెల్లడించారు. మన ఆదాయం అంతా మన ప్రజలకు చెందాలనే లక్ష్యంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరూ వెట్టిచాకిరీ చేయకూడదని సీఎం అన్నారు. ప్రత్యేక పరీక్షతో కానిస్టేబుళ్లుగా నియామకం ‘చాలా విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేలల్లో ఉన్నారు. అసలు పరిస్థితి మీకు అర్థం కావాలనే అందరినీ పిలిపించుకుని మాట్లాడుతున్నాను. హోంగార్డులను క్రమబద్ధీకరించేందుకు గతంలో మూడు రాష్ట్రాలు ప్రయత్నించాయి. అయితే, వాటిని కోర్టులు కొట్టివేశాయి. రోస్టర్ విధానం లేకుండా ఎలాంటి నియామకాల ప్రక్రియ జరగకూడదు. ఈ రోజు నుంచి ప్రత్యేక కానిస్టేబుళ్ల నియామకాలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. కానిస్టేబుళ్ల నియామకాల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 10 నుంచి 25 శాతానికి పెంచుతాం. రోస్టర్ అమలు చేస్తూనే హోంగార్డుల నియామకాల్లో అధికారులు కాస్త దయ చూపాలి. సాధారణ అభ్యర్థులతో కాకుండా హోంగార్డులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలి’అని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఒప్పంద అధ్యాపకులు, ఇతర సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చేసే మంచి పనులపై ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నాయని విమర్శించారు. సీఎంకు శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న హోంగార్డుల సమస్యలను పరిష్కరించినందుకు సీఎంకు హోంగార్డుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్లో మాట్లాడుతూ హోంగార్డులకు గౌరవప్రదమైన నెలసరి వేతనం 12 వేల నుండి 20 వేలకు పెంచడంతో పాటు, డబుల్ బెడ్రూమ్స్, రిక్రూట్మెంట్లో వారికి ప్రత్యేక అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రికి డీజీపీ కృతజ్ఞతలు అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను మానవత్వంతో అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని అన్నారు. హోంగార్డులపై వరాల జల్లు కురిపించిన సీఎంకు రాష్ట్ర పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యేదుల గోపిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. హోంగార్డులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు -
హోంగార్డుల సమస్యలపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హోంగార్డుల రెగ్యులరైజేషన్‌పై ముఖ్యమంత్రి ఆలోచన చేశారని.. రెగ్యుల రైజేషన్‌కు అర్హత లేనివారిని హోంగార్డులుగానే కొనసాగించాలా, క్లాస్–4 ఉద్యోగులుగా మార్చాలా అనే అంశాలను చర్చిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం శాసన మండలిలో పోలీసు శాఖ ఆధునికీకరణపై జరిగిన లఘు చర్చలో మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, సుంకరి రాజు, రాములు నాయక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు నాయిని సమాధానమిచ్చారు. హోంగార్డుల వేతనాలను కూడా రూ.12 వేలకు పెంచామని గుర్తు చేశారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు చేపడితే కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. ‘ఓవైపు రెగ్యులరైజ్ చేయాలంటూ మరోవైపు కేసులు పెడుతూ అడ్డుకుంటున్నారు.. ఇదేం పద్ధతయ్యా..!’అని విమర్శించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కల్పించుకొని న్యాయం జరగని వారు కోర్టుకు వెళతారని, కోర్టును ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు. -
సీఐ మసాజ్ బాగోతంపై సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్ : సరూర్‌నగర్ సిఐ లింగయ్య తన స్టేషన్లో హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న బాగోతంపై రాచకొండ కమిషనర్ సీరియస్ అయ్యారు. కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ మహేష్ భగవత్ దీనిపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని డీసీపీ(అడ్మిన్) ప్రకాష్‌రెడ్డిని సంఘటనపై విచారణ అధికారిగా నియమించారు. వివరాల్లోకి వెళితే... సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సుందరి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. స్టేషన్లో పనిచేసే హోంగార్డుతో ఇంటి వద్ద బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు మీడియా ఛానెల్లో హల్చల్ చేశాయి. మన్సూరాబాద్‌లోని ఇంటివద్ద సీఐ లింగయ్య యూనిఫామ్‌లో ఉన్న హోంగార్డు సైదానాయక్తో బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే మీడియాలో ప్రసారం అయిన దృశ్యాల్లో ఉన్నది తాను కాదని, తనకు మసాజ్ చేయించుకోవటంకానీ, మద్యం సేవించే అలవాటు అసలే లేదని సీఐ లింగయ్య పేర్కొన్నారు. సైదానాయక్ అనే హోంగార్డు అక్టోబర్ 14న రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సెలవులో ఉన్నాడని, అనంతరం ఇక్కడినుంచి బదిలీపై వెళ్ళాడని అన్నారు. మూడు నెలలుగా సరూర్‌నగర్‌లో హోంగార్డు లేడని ఆయన స్పష్టం చేశారు. తనపై గిట్టనివాళ్లే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. -
టాటా.. బైబై..
హోంగార్డుగా పనిచేస్తున్న అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు. చిన్న కుటుంబం.. చింతలు లేని కుటుంబం. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీకి బయల్దేరాడు. వెళ్లే ముందు భార్యాపిల్లలతో కాసేపు సరదాగా గడిపాడు. టాటా.. బైబై.. అంటూ ముగ్గురికీ వీడ్కోలు చెప్పాడు. అదే తుది వీడ్కోలు అవుతుందని వారిలో ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. అలా ఇంటి నుంచి బయటకు వెళ్లిన పది నిమిషాల్లోనే.. అతడు ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు. సాక్షి, రఘునాథపాలెం : మండలంలోని వీవీపాలెం వద్ద ఖమ్మం–వైరా ప్రధాన రోడ్డుపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ జి.వెంకటరమణ(38) అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్ఐ గోపి తెలిపిన వివరాలు.. కొణిజర్లకు చెందిన వెంకటరమణ, ఖమ్మంలో ట్రాఫిక్ పోలీస్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆదివారమవడంతో పెద్ద కూతురు ఇంటి వద్దనే ఉంది. ఇద్దరు పిల్లలతో ఉదయం నుంచి సరదాగా గడిపాడు. మధ్యాహ్న భోజనానంతరం రెండు గంటల సమయంలో డ్యూటీకని తన ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. పది నిముషాల్లో వీవీపాలెం గ్రామ సమీపంలోకి వచ్చాడు. అక్కడ, ఖమ్మం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య, కూతురు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వెంకటరమణ మృతితో తోటి హోంగార్డులు, పోలీసులు విషాదంలో మునిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి ఎస్ఐ గోపి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీపీ, ఏసీపీ సందర్శన వెంకటరమణ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏఆర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ సీఐ నరేష్‌రెడ్డి, ఖమ్మం రూరల్ సీఐ తిరుపతిరెడ్డి సందర్శించారు. విచారం వ్యక్తం చేశారు. విలేకరులతో సీపీ మాట్లాడుతూ.. హోంగార్డ్ వెంకటరమణ కుటుంబాన్ని పోలీస్ శాఖ నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఎగిరిపడిన హెల్మెట్ ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు వెంకటరమణ హెల్మెట్ ధరించాడు. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో హెల్మెట్ ఎగిరిపడింది. నేత్రాలు దానం ఇంతటి విషాదంలోనూ వెంకటరమణ కుటుంబీకులు ఔదార్యం చాటుకున్నారు. తమ ఇంటి పెద్ద కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం అతడి తండ్రి నాగయ్యను, కుటుంబీకులను ట్రాఫిక్ సీఐ పి.నరేష్‌రెడ్డి ఒప్పించారు. కొణిజర్లలో విషాద ఛాయలు కొణిజర్ల: కొణిజర్ల ఎస్సీ కాలనీకి చెందిన హోంగార్డ్ గొడ్డుగొర్ల వెంకటరమణ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. పదేళ్ల నుంచి హోంగార్డుగా పనిచేస్తున్న వెంకటరమణకు సౌమ్యుడిగా గ్రామంలో మంచి పేరుంది. తల్లిదండ్రులైన నాగయ్య–వరాలు దంపతులకు ఇతడు ఒక్కగానొక్క కొడుకు. తామిద్దరిని, భార్యాపిల్లలను వదిలేసి, అప్పుడే వెళ్లిపోయావా.. అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘‘రోజూ నన్ను చూడనిదే అన్నం కూడా తినడు’’ అంటూ, భార్య సంధ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇద్దరు పిల్లల్లో కావ్యాంజలి.. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. చిన్న పాప వయసు మూడేళ్లు. -
'హోంగార్డులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు'
కామారెడ్డి: హోంగార్డులు బలవన్మరణాలకు పాల్పడవద్దని వారికి బీజేపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు జిల్లాలోని ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు శివ అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డులను పర్మినెంట్ చేసేవరకు పోరాటం ఆపేది లేదన్నారు. దీనికి సంబంధించి ఇటీవల నగరంలోని బషీర్‌బాగ్‌లో జరిగిన ఆందోళనలో పాల్గొంటే పోలీసులు తనను అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. -
మైనర్ బాలికపై హోంగార్డు అత్యాచారం..
♦ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ♦ హోంగార్డుపై నిర్భయ, అట్రాసిటీ తదితర పలు కేసులు నమోదు మండపేట: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రక్షించాల్సిన ఓ పోలీసే మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జిల్లాలోని మండపేటలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిందితునితోపాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు మహిళలపైనా కేసులు నమోదు చేశారు. కె గంగవరం మండలం పామర్రు గ్రామానికి చెందిన పంపన రామకృష్ణ మండపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. విజయనగరం జిల్లా కురిపెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల దళిత బాలిక ఈ నెల 8వ తేదీన మండలంలోని ఏడిదలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు రాత్రి ఏడు గంటల సమయంలో మండపేటకు చేరుకుంది. అప్పటికే మండపేట బస్టాండులో ఉన్న సత్య, కృష్ణవేణి అనే ఇద్దరు మహిళలు బాలిక వద్దకు వచ్చి ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్లలేవని, రాత్రికి తమ ఇంటి వద్ద ఉండి ఉదయాన్నే వెళ్లిపోదువుగానంటూ నమ్మించి పార్థసారథి నగర్‌లోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఏసమ్మ అనే మహిళ ఇద్దరు యువకులను వెంటబెట్టుకుని తీసుకువచ్చి వారితో వెళ్లమని బలవంతం చేసింది. తర్వాత కొద్దిసేపటికి హోంగార్డు రామకృష్ణ వారి ఇంటికి చేరుకున్నాడు. సత్య అనే మహిళతో కలిసి బలవంతంగా బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. తర్వాత ఇంటికి తీసుకువచ్చి రెండు రోజులుపాటు బాలికను ఇంట్లోనే నిర్బంధించారు. ఆమె ఏడుపు విని పక్కంటి వారు తలుపుతీయడంతో తప్పించుకొని జరిగిన సంఘటనను బంధువులకు తెలిపింది. ఈ విషయాన్ని చర్చి ఫాదర్ ప్రేమ్ కుమార్‌కు తెలిపి ఆయన సహకారంతో ఆదివారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ గీతా రామ కృష్ణ ప్రధాన నిందితునిగా ఉన్న రామకృష్ణపై అత్యాచారం, నిర్భయ, అట్రాసిటీ తదితర కేసులు నమోదు చేశారు. బాలికను నమ్మించి వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించిన సత్య, కృష్ణవేణి, ఏసమ్మలపైన కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షలు నిమిత్తం బాలికను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నట్టు పట్టణ పోలీసులు తెలిపారు. -
హోంగార్డు ఆత్మహత్య
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లంతకుంట పోలీసు స్టేషన్లో అనుముల సంతోష్(30) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఉచ్చు బిగుస్తోంది..!
► హోంగార్డుపై దాడి ఘటన.. దర్యాప్తులో మలుపు ► దాడి దృశ్యాలు బయటకు వెళ్లడంపై విచారణ ► కంట్రోల్ రూమ్ మహిళా కానిస్టేబుల్‌పై వేటుపడే అవకాశం ► దాడి చేసిన మనోజ్‌కుమార్ గతంలో రౌడీషీటర్ ► రౌడీషీట్ తొలగింపుపై అనుమానాలు ► కీలకంగా మారిన ఎస్బీ హెడ్ కానిస్టేబుల్? కర్నూలు: హోంగార్డు హుసేన్‌పై దాడి ఘటనలో నిందితులైన స్పెషల్ పార్టీ పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాడి చేసిన కానిస్టేబుల్ మనోజ్ కుమార్‌పై గతంలో రౌడీషీట్ ఉండడం..అది తొలగిపోవడం.. అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఉన్నతాధికారులు ఉన్న జిల్లా కేంద్రంలోనే పోలీసు సిబ్బంది అదుపు తప్పి ప్రవర్తించడంపై రాష్ట్రస్థాయి అధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ నుంచి వాట్సాప్‌కు వైరల్ కావడానికి కారకులెవరన్న విషయంపై ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులు విచారణ జరిపారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పైఅంతస్థులో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ఉంది. రాత్రింబవళ్లు అక్కడ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తుంటారు. హోంగార్డుపై దాడి సంఘటన జరిగిన రోజు కంట్రోల్ రూమ్‌లో మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉన్నట్లు విచారణలో తేలింది. దాడి దృశ్యాలు ఎవరి వాట్సాప్ ద్వారా బయటకు వెళ్లాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో మహిళా కానిస్టేబుల్‌పై కూడా వేటుపడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఎవరి పాత్ర ఎంత...? స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దారితప్పిన ఘటన వెలుగు చూడటంతో పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. మనోజ్‌కుమార్ సోదరుల వ్యక్తిగత ప్రవర్తన విషయంలో విచారణ జరిపి రిపోర్టు వారికి అనుకూలంగా ఇచ్చేందుకు భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు రావడంతో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు శాఖాపరమైన విచారణ మొదలయ్యింది. మనోజ్కుమార్పై ఉన్న రౌడీషీట్ తొలగింపులో ఎవరి పాత్ర ఎంత అన్నదానిపై ఆరా తీస్తున్నారు. సమస్యాత్మక వ్యక్తులపై రౌడీషీట్ తొలగించేటప్పుడు శాఖాపరంగా పలురకాలుగా విచారణ జరిపి తొలగింపునకు రెకమెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సబ్ డివిజన్ స్థాయి అధికారులు రౌడీషీటు తొలగిస్తారు. మనోజ్‌కుమార్ రౌడీషీట్ తొలగించినప్పుడు టౌన్ డీఎస్పీ ఎవరున్నారు, స్పెషల్ బ్రాంచ్ విభాగానికి డీఎస్పీ ఎవరున్నారు? నాల్గో పట్టణ సీఐగా ఎవరున్నారు? రౌడీషీట్ తొలగింపునకు ఎవరు రికమెండ్ చేశారు? ఏ స్థాయిలో విచారణ జరిగింది?అనే విషయాలపై శాఖాపరమైన విచారణలో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్ పనితీరుపై ఫిర్యాదుల వెల్లువ... స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ మనోజ్కుమార్పై ఉన్న రౌడీషీట్ తొలగింపులో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ పాత్ర కీలకం. హోంగార్డుపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన పాత్రపై కూడా విచారణ షురూ అయింది. పొరుగు జిల్లాకు చెందిన ఈయన సాధారణ కుటుంబం నుంచి వచ్చి జిల్లా పోలీసు శాఖలో ఉద్యోగం పొంది అనతికాలంలోనే కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారన్న ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ బ్రాంచ్ విధుల్లో చేరకముందు రైల్వేలో పనిచేసేటప్పుడు మట్కా, పేకాటరాయుళ్లకు అప్పులు ఇచ్చి భారీ మొత్తంలో వడ్డీలు వసూలు చేసేవారని ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. మహారాష్ట్రలోని ఓ మెడికల్ కళాశాలలో ఈయన కుమారుడు ఎంబీబీఎస్ చదవడానికి అర కోటి రూపాయలు డొనేషన్ చెల్లించారు. అయితే కళాశాల నిర్వాహకులు డొనేషన్ తీసుకుని మోసం చేశారంటూ మూడేళ్ల క్రితం స్వయాన ఆయనే నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదయ్యింది. మళ్లీ అరకోటి రూపాయలు చెల్లించి కుమారుడిని మరో కళాశాలలో చదివిస్తున్న విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో కోటి రూపాయలు డొనేషన్ చెల్లించే ఆదాయం ఆయనకు ఎక్కడిదన్న చర్చ జరుగుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత ప్రవర్తనపై నివేదికలు, పాస్‌పోర్టుల విచారణ తదితర విషయాల్లో ముడుపులు దండుకుని భారీగా ఆర్జించాడన్న ఫిర్యాదులు వె ల్లువెత్తిన నేపథ్యంలో హోంగార్డు దాడి ఘటన వెలుగు చూడటంతో విచారణ వేగవంతమయ్యింది. -
స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
కర్నూలు: నగరంలోని రాజ్‌విహార్ సెంటర్లో ట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డు హుస్సేన్‌పై దాడికి పాల్పడిన స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. గురువారం సాయంత్రం హోంగార్డు హుస్సేన్ రాజ్‌విహార్ సెంటర్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుండగా స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు మనోజ్, అతని తమ్ముడు మణికుమార్ ద్విచక్ర వాహనంపై రాజ్‌విహార్ చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా రోడ్డుపై వాహనాన్ని నిలుపుకుని ఫోన్లో మాట్లాడుతుండగా సైడ్‌కు వెళ్లండంటూ హోంగార్డు చెప్పాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించినందుకు కోపోద్రిక్తుడైన మనోజ్‌కుమార్ సోదరులు హోంగార్డు హుస్సేన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను ‘ఫూలీసులు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎస్పీ ఆకె రవికృష్ణ స్పందించారు. శుక్రవారం ఉదయం హోంగార్డు హుస్సేన్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి విచారించారు. ఆ తర్వాత కానిస్టేబుళ్లు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని రెండవ పట్టణ సీఐ డేగల ప్రభాకర్‌ను ఆదేశించారు. రాజ్‌విహార్ సెంటర్లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఫుటేజీలను కూడా సేకరించాలన్నారు. అలాగే మనోజ్‌కుమార్ సోదరులు పోలీస్ శాఖలో చేరకముందు ప్రవర్తన ఎలా ఉండేది.. వారిపై ఎన్ని కేసులు ఉన్నాయనే విషయాలపైనా పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. వీరిపై రౌడీషీట్లు నమోదై ఉంటే ఉద్యోగంలో చేరేటప్పుడు స్పెషల్ బ్రాంచ్ ఉద్యోగులు ఎందుకు తప్పుడు నివేదిక ఇచ్చారనే విషయంపైనా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం. -
ఫూలీసులు
► హోంగార్డుపై స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్ల దాడి ► ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ ► వాట్సాప్‌లో దాడి దృశ్యాలు క్రమశిక్షణకు మారుపేరు పోలీసు శాఖ. పది మందికి మంచీ చెడు చెప్పాల్సిన ఆ పోలీసులే బజారుకెక్కితే. వీధి రౌడీల్లా పోట్లాడుకుంటే. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వీరే ముష్టి ఘాతాలు కురిపించుకుంటే.. జనం ముక్కున వేలేసుకుని వినోదం చూడాల్సిందే. అందులోనూ ఒకే శాఖకు చెందిన ఉద్యోగులే ఇలా చేయడం మరింత చర్చనీయాంశం. అది కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించమని విధుల్లోని మరో పోలీసు శాఖ ఉద్యోగి చెప్పడంతోనే ఇంతలా గొడవ పడ్డారంటే సామాన్యుల పట్ల వీరి తీరు ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది. కర్నూలు: నగరంలోని రాజ్‌విహార్ సెంటర్లో ట్రాఫిక్ విధుల్లోని హోంగార్డు హుసేన్‌పై తోటి పోలీసులే దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బుధవారం సాయంత్రం హోంగార్డు హుసేన్ రాజ్‌విహార్ సెంటర్లో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తుండగా స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు(సివిల్) మనోజ్, అతని తమ్ముడు మణికుమార్ ద్విచక్ర వాహనంపై రెడ్ సిగ్నల్ పడినప్పటికీ దాటి వెళ్తుండగా అడ్డుకున్నాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించగా డ్రస్‌లో ఉన్న మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు హుసేన్‌కు మద్దతుగా నిలవడంతో ఘటన ఉద్రిక్తంగా మారింది. దాడికి సంబంధించిన సెల్‌ఫోన్ దృశ్యాలు ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్ అయ్యాయి. హోంగార్డ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయరత్నంతో పాటు ట్రాఫిక్ కానిస్టేబుళ్లంతా మూకుమ్మడిగా రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ చేరుకుని దాడిపై ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ ఘటనపై తీవ్ర మనస్థాపంతో ఉన్నారు. ఈ పంచాయితీ ప్రస్తుతం ఎస్పీ వద్దకు చేరింది. మనోజ్, మణికుమార్ స్వయానా సోదరులు. వీరి తండ్రి డేవిడ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం వీరు శరీన్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఉద్యోగం రాకముందు మనోజ్‌పై నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉన్నట్లు సమాచారం. దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడుతుండటంతో అప్పట్లో వీరిపై రెండు, నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు సమాచారం. 2011లో పోలీసు శాఖలో విధుల్లో చేరినప్పటి నుంచి వీరు స్పెషల్ పార్టీలో పనిచేస్తున్నారు. మరి తాజా పంచాయితీ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. -
కోర్టు ఎదుట హోంగార్డు ఆత్మహత్యాయత్నం
-
కోర్టు ఎదుట హోంగార్డు ఆత్మహత్యాయత్నం
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సివిల్ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ మంగళవారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏడు సంవత్సరాలుగా హోంగార్డులకు పోస్టింగ్ ఇవ్వలేదని, విధుల్లోకి తీసుకోకుండా పోలీసు విభాగం అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ హోంగార్డుల సంఘం అధ్యక్షుడు నారాయణ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. సివిల్ కోర్టు ప్రారంభమైన కాసేపటికి ముఖద్వారం వద్దకు వెళ్ళిన ఆయన కత్తితో చేతిని కోసుకున్నాడు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని వారించి బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. టూ టౌన్ ఎస్ఐ స్వామి, వన్ టౌన్ ఎస్ఐ గౌడ్ హుటాహుటిన కోర్టువద్దకు చేరుకుని హోంగార్డు నారాయణకు నచ్చజెప్పారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమకు న్యాయం చేయలేదని, ఆత్మహత్య తప్ప తమకు శరణ్యంలేదని ఆయన పేర్కొన్నాడు. -
హోంగార్డ్,జర్నలిస్ట్ బాహాబాహీ
-
భద్రత గాలికి..
వేతనాలు లేక మక్కా, రాయల్ మసీదు సిబ్బంది అవస్థలు సగం మంది హోంగార్డులు మాతృ విభాగానికి ప్రశ్నార్థకంగా మారిన మక్కా మసీదు భద్రత సిటీబ్యూరో: చారిత్రక మక్కా, పబ్టిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదు సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. నగరంలో ప్రముఖమైన ఈ రెండు మసీదులు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏటా బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తున్నా మక్కా, రాయల్ మసీదుల సిబ్బందికీ గత రెండేళ్లుగా సకాలంలో వేతనాలు అందడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సిబ్బందికి ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్న అధికారులు తమపై చిన్న చూపు చూడటం దారుమని వారు పేర్కొన్నారు. ప్రతి నెల వేతనాలు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నామని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని, పిల్లలను చదివించుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. మాతృ విభాగానికి హోంగార్డులు ఇదిలా ఉండగా మక్కా, రాయల్ మసీదుల్లో 24 మంది హోం గార్డులు బందోబస్తు విధులు నిర్వహిస్తుంటారు. గతంలో మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్లను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం మక్కా మసీదులో 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందుకుగాను ప్రత్యేకంగా హోంగార్డులను నియమించారు మక్కా, రామల్ మసీదులో మొత్తం 24 మంది సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారు.అయితే గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారిలో 11 మంది మాతృ విభాగానికి వెళ్లి పోయినట్లు మక్కా, రాయల్ మసీదు పర్యవేక్షకుడు ఖాద్రీ తెలిపారు. దీంతో మిగిలిన 13 మందితో మక్కా మసీదులో 6–7 మంది చొప్పున బందోబస్తును కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సెక్యూరిటీ ప్రశ్నార్థకం మక్కా మసీదును సందర్శించడానికి రోజు వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. శుక్రవారం, అదివారం, సెలవు దినాల్లో వీరి సంఖ్య భారీగా ఉంటోంది. గతంలో 24 మంది హోంగార్డులు బందోబస్తులో పాల్గొంటుండగా, ప్రస్తుతం కేవలం 13 మందితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. గతంలో సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే బాంబు పేలుడు ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలో వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మక్కా, రాయల్ మసీదు సిబ్బందికి, హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని, బందోబస్తును కట్టుదిట్టం చేయాలని పలువురు ధార్మిక, మైనార్టీ స్వచ్చంధ సంస్థలు ప్రతినిధులు కోరుతున్నారు. -
వేతన వెతలు
పోలీస్ సంక్షోభం =హోంగార్డులకు మూడు నెలలుగా అందని జీతం =బడ్జెట్ ఉన్నా మంజూరు చేయని అధికారులు =దయనీయ పరిస్థితిలో చిరు ఉద్యోగులు అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న శివ(పేరు మార్చాం) అనే హోంగార్డుకు నెలసరి వేతనం రూ.12 వేలు. ఇంటి అద్దెకు రూ. 4 వేలు, ఇంటి సరుకులు రూ. 3 వేలు, కరెంట్, పాల బిల్లు రూ. 900, డిష్ బిల్లులు, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.5 వేలు ఖర్చు అవుతోంది. ప్రతినెలా వచ్చే ఈ జీతంపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం మూడు నెలలుగా వేతనాలు అందలేదు. కుటుంబ పోషణకు అవసరమైన డబ్బును వడ్డీకి తెచ్చుకోవాల్సి వస్తోంది. రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. కేవలం ఒక్క శివ మాత్రమే కాదు జిల్లాలోని 961 మంది హోంగార్డూలదీ ఇదే పరిస్థితి. ‘అనంత’లోనే ఈ పరిస్థితి పొరుగున ఉన్న వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లోని హోంగార్డులకు 5,6 తేదీల్లో జీతాలు అకౌంట్లో జమ అవుతుండగా, జిల్లాలో మాత్రం వేతనాల చెల్లింపులు గందరగోళంగా మారాయి. జిల్లాలో హోంగార్డులకు వేతనాలు ఎప్పుడు ఇస్తారోకూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం మూడు నెలలుగా వేతనాలు అందలేదు. కనీసం ఉన్నతాధికారులకు విన్నవించుకునే సాహసం కూడా చేయలేని పరిస్థితిలో హోంగార్డులు బతుకీడిస్తున్నారు. ఒకవేâýæ వినతిపత్రం ఇస్తే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులకు గురవుతామో అనే భయాందోళన వారిలో వ్యక్తమవుతోంది. మానసిక క్షోభను అనుభవిస్తున్న హోంగార్డులు : పొరుగున ఉన్న తెలంగాణలో హోంగార్డుల సంక్షేమానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. హోంగార్డుల పేరును మార్చి స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్(ఎస్పీఏలు)గా మార్చారు. బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ కలిపి రూ.19,884 ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం రూ. 12 వేలు మాత్రమే వస్తోంది. అది కూడా సక్రమంగా రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కుటుంబాలు కూడా సక్రమంగా గడవని పరిస్థితి నెలకొంది. కేవలం హోంగార్డులే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టని పోలీసు సంక్షేమం జిల్లాలో హోంగార్డులు అవస్థలు పడుతున్నా పోలీసులు అధికారుల సంఘం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులంటే కేవలం కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు ఆపై స్థాయి అధికారులు మాత్రమేనా అని హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖులు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా ఒళ్లు హూనం అయ్యే లా పనిచేస్తోంది హోంగార్డులేనన్న విషయం ఉన్నతాధికారులకు తెలియదా? అని మండిపడుతున్నారు. పోలీసు అధికార సంక్షేమ సంఘంలో తమకు ఓటు లేదనే సంఘం నేతలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని హోంగార్డులు వాపోతున్నారు. బడ్జెట్ రాలేదు : బడ్జెట్ రాకపోవడంతో హోంగార్డుల జీతాలు ఆగాయి. త్వరలో బడ్జెట్ వస్తుంది. మూడు నెలలవి కలిపి ఒకేసారి చెల్లిస్తాం. – చిన్నికృష్ణ, ఏఆర్ డీఎస్పీ -
హోంగార్డులు సంక్షేమానికి కృషి
- ఎస్పీ ఆకే రవికృష్ణ - ముగిసిన శిక్షణ తరగతులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. దిన్నెదేవరపాడు సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో హోంగార్డులకు నిర్వహిస్తున్న వారం రోజుల శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. అన్ని సబ్డివిజన్లకు సంబంధించిన హోంగార్డులకు ఇండోర్, అవుట్డోర్ తరగతుల్లో శిక్షణ ఇచ్చారు. చివరిరోజు ఎస్పీ హోంగార్డులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం హోంగార్డుల పరేడ్‌ను వీక్షించారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శివరామ్ప్రసాదు, ఓఎస్డీ రవిప్రకాష్, హోంగార్డు కమాండెంట్ చంద్రమౌళి, డీఎస్పీలు కృష్ణమోహన్, మురళీధర్, ట్రాఫిక్ ఆర్ఐ ఏడుకొండలు, ఆర్ఎస్ఐ రంగనాథ్‌బాబు, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. -
హోంగార్డుల సమస్యలు కొలిక్కి!
-
హోంగార్డుల సమస్యలు కొలిక్కి!
సీఎంతో సుదీర్ఘంగా చర్చించిన హోంమంత్రి, డీజీపీ పెండింగ్ సమస్యలపై త్వరలోనే ప్రకటన సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన కోసం హోంగార్డులు కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌తో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ,, ఐజీ (హోంగార్డ్స్) బాల నాగాదేవీ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే హోంగార్డుల డిమాండ్లన్నీ ఒకేసారి చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుందని, మొదటి దఫాలో భాగంగా వేతన పెంపుపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నాయి. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న 21 వేల మంది హోంగార్డులకు హెల్త్‌కార్డులు అందించే ఆలోచన కూడా ఉన్నట్టు వివరించాయి. బస్ పాస్‌ల సౌకర్యం కల్పించాలని ఆర్టీసీకి త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం నుంచి అసెంబ్లీ పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో డీజీపీతో సీఎం కేసీఆర్ చర్చించడంతో హోంగార్డులకు తీపి కబురు అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. హోంగార్డుల డిమాండ్లు... మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని కానిస్టేబుళ్లుగా మార్చాలి. కానిస్టేబుల్ నియామకాల్లో ఇన్‌సర్వీస్‌లో ఉన్న హోంగార్డులను శిక్షణకు పంపాలి. డెప్యుటేషన్‌లో ఉన్న హోంగార్డులను అదే విభాగంలో క్రమబద్ధీకరించాలి. హోంగార్డు బెటాలియన్ ఏర్పాటు చేయాలి. కనీసం వేతనం రూ. 25 వేలకు పెంచాలి. ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలి. వేతనంతో కూడిన సాధారణ, మెడికల్ సెలవులు, బస్‌పాస్‌లు అందించాలి. డెప్యుటేషన్, ట్రావెలింగ్, డెయిలీ అలవె న్సులు, మెటర్నిటీ సెలవులు ఇవ్వాలి. పదవీ విరమణ, సాధారణ మరణం పొం దిన వారికి రూ. 10 లక్షలు అందించాలి. -
వాహనం ఢీకొని హోంగార్డు మృతి
నల్లచెరువు : ప్యాయలవాండ్లపల్లి బస్ స్టాప్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఓ వాహనం ఢీకొనడంతో హోంగార్డు గోపాల్‌నాయక్ (40) అక్కడిక్కడే మృతి చెందాడు. నల్లచెరువు పోలీస్‌స్టేషన్‌లో విధులు ముగించుకుని స్వగ్రామమైన బాలేపల్లితండాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గోపాల్‌నాయక్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
లవర్స్ టార్గెట్‌గా దోపిడీ చేస్తున్న హోంగార్డు
-
ప్రేమికులను బెదిరిస్తున్న హోంగార్డు అరెస్టు
హైదరాబాద్: ప్రేమ జంటలను బెదిరిస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డును, అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సురేష్, అతడి స్నేహితుడు శ్రీనివాస్ కొంతకాలంగా గుర్రంగూడ ప్రాంతంలో జంటలుగా తిరిగే యువతీ యువకులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఆరు తులాల బంగారు గొలుసుతో పాటు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వారిని రిమాండ్‌కు తరలించారు. -
హోంగార్డుల సేవలు అమోఘం
వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోవడం బాధాకరం – హోంగార్డ్స్ 54వ వ్యవస్థాపక దినోత్సవంలో ఎస్పీ కర్నూలు : పోలీస్‌శాఖలో హోంగార్డుల సేవలు అమోఘమైనవని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. హోంగార్డుల 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎస్పీ అతిథిగా హాజరై సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోవడం చాలా బాధాకరమని చెప్పారు. పోలీసు శాఖలో చేరినప్పటినుంచి హోంగార్డు కుటుంబాలను చాలా దగ్గరగా చూశానని, చాలా మంది ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. తక్కువ జీతాలకు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశమున్న ప్రతిచోటా హోంగార్డు సమస్యలను పైఅధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలను బాగా చదివించుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించుకునేలా చూడాలన్నారు. బందోబస్తులకు వెళ్లిన సమయంలో టీఏ, డీఏ అలవెన్సుల సమస్యల గురించి హోంగార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్ చంద్రమౌళి ఎస్పీ దృష్టికి తెచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హోంగార్డు శామ్యూల్ రక్షక దళమా... గృహ రక్షక దళమా... అనే పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. చివరగా హోంగార్డులందరూ కలసి ఎస్పీకి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు బాబుప్రసాద్, కృష్ణమోహన్, ఆర్ఐ రంగముని, ఆర్ఎస్ఐ రంగనాథ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.ఉమామహేశ్వరరావు, హోంగార్డ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయరత్నం, కోశాధికారి మహమ్మద్ రఫి, సభ్యులు రాజేష్, రఘు, సురేష్, బాలకృష్ణ, రామయ్య, మునుస్వామి, నాగవేణి తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డ్స్ సేవలు ఎనలేనివి
విజయవాడ(లబ్బీపేట) సమాజానికి హోంగార్డులు అందిస్తున్న సేవలు ఎనలేనివని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు శాఖలో వివిధ విభాగాలతోపాటు, పలు శాఖల్లో డిప్యూటేషన్‌పై ఉన్న వారు సమర్థంగా సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. 54వ హోంగార్డ్స్ ఫౌండేషన్ డే, హోంగార్డ్స్ రైసింగ్ డే సెలబ్రేషన్స్ మంగళవారం మహాత్మాగాంధీ రోడ్డులోని సిటీ ఆర్మ్డ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. సీపీ గౌతమ్ సవాంగ్ తొలుత హాంగార్డ్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డ్స్ కవాతు నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతోపాటు, హోంగార్డులు కృషి ఎనలేనిదన్నారు. నగర కమిషనరేట్ పరిధిలో 1078 మంది హోంగార్డులు వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హోంగార్డుల సంక్షేమం కోసం ప్రతినెలా రూ.20 సేకరిస్తున్నామని, వాటిలో రూ.10 సెంట్రల్ఫండ్కు, రూ.10 హోంగార్డ్స్ వెల్ఫేర్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. పలువురికి ఆర్థిక సాయం నగరంలో పనిచేస్తున్న హోంగార్డులు ఒకరోజు వేతనాన్ని సేకరించి పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల పదవీ విరమణ చేసిన హోంగార్డులు ఎం.మోహనరావుకు రూ.34 వేలు, ఎం.ప్రభాకరరావుకు రూ.38,650, కె.శ్యామ్‌బాబుకు రూ.39,600 అందజేశారు. ఇటీవల మృతి చెందిన హోంగారు కె.రాము కుటుంబానికి రూ.3.69 లక్షలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ హరికుమార్, డీసీపీ అడ్మినిస్ట్రేషన్ అశోక్‌కుమార్‌లతోపాటు, హోంగార్డ్స్ కమాండెంట్, పలువురు ఏసీపీలు, అధికారులు పాల్గొన్నారు. హోంగార్డులకు నిర్వహించిన క్రీడల్లో విజేతలకు సీపీ బహుమతులు అందజేశారు. -
వ్యక్తిపై హోంగార్డు కత్తితో దాడి
వేటపాలెం: వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై వీర వసంతరావు అనే హోంగార్డు కత్తితో దాడి చేశాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయ్పేటలోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ముందు వేటపాలెం-చీరాల రోడ్డులో నేటి ఉదయం ఈ ఘటన జరిగింది. వెంకటేశ్వర్లు, వసంతరావుల స్వగ్రామం యాదవపాలెం. వెంకటేశ్వర్లు తన భార్యతో కలిసి బైక్‌పై స్వగ్రామం నుంచి చీరాలకు పూలు అమ్మడానికి వెళ్తున్నాడు. దారి మధ్యలో వెంకటేశ్వర్లును కలిసిన వసంతరావు చిట్టీ డబ్బుల విషయం అడిగాడు. వీరిద్దరి మధ్య చిట్టీ డబ్బుల విషయంలో భిన్న అభిప్రాయాలు రావడంతో హోంగార్డు వసంతరావు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం పెద్దమనసుతో ఆలోచించాలి
‘హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి’ సాక్షి, హైదరాబాద్: హోంగార్డుల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేస్తున్న హోంగార్డులను ఉద్యోగాల నుంచి తొల గించాలని చూస్తే మాత్రం అది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు అవుతుందన్నారు. ఈ మేరకు కేసీఆర్‌కు సోమవారం లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా.. హామీలు పూర్తిగా అమలుకాక హోంగార్డులు నిరాశ, నిస్పృహలకులోనై ఆందోళనకు దిగారన్నారు. పోలీసులతో సమానంగా వారు విధులు నిర్వహిస్తున్నా నెల జీతం బదులు దినసరి వేతనం ఇస్తున్నార న్నారు. -
ఎస్ఐ హోంగార్డుపై సైకో దాడి
-
పరిష్కరించకుంటే మేమూ ఆందోళనలోకి
హోంగార్డుల సమస్యలపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: హోంగార్డుల సమస్యలను వారంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తామూ ఉద్యమంలో భాగస్వాములమై ఆందోళన తీవ్రం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. వారి డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని, రెండు రాష్ట్రాల సమస్య కాబట్టి ఈ విషయమై గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు లేఖలు రాస్తామన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో 9 వేలమంది హోంగార్డులకు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలిచ్చారని, అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అర్హతగల వారిని పర్మినెంట్ చేయాలన్నారు. -
‘ఆ హోంగార్డు’లకు షోకాజ్ నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: సమ్మె నేపథ్యంలో అభ్యంతరకరంగా వ్యవహరించిన హోంగార్డులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గురువారం ఇక్కడ ఇందిరాపార్క్ వద్ద ధర్నా, సచివాలయ ముట్టడికి యత్నం సహా మరికొన్ని నిరసనలకు హోంగార్డులు దిగారు. ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో పరిస్థితి లాఠీచార్జ్ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి నగరంలోని ఐదు పోలీసుస్టేషన్లలో క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యారుు. వీటికి బాధ్యుల్ని గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన చిత్రాలను, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా నిరసనల్లో చురుగ్గా పాల్గొన్న, అభ్యంతరకరంగా వ్యవహరించిన హోంగార్డుల్ని గుర్తిస్తున్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇలా విభాగాలవారీగా ఉన్నతాధికారులు ఈ నోటీసులు తయారు చేస్తున్నారు. వీటిని సంబంధిత హోంగార్డులకు అందించి వారంలోగా సమాధానం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేయనున్నారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకొంటారు. -
బానిసలుగా చూస్తుండటం వల్లే..
హైదరాబాద్: హోం గార్డులు తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారని , కనీస మర్యాద, వేతనం లేకుండా బానిసలుగా చూస్తుండటం వల్లే వారిప్పుడు తిరగబడుతున్నారని బీజేఎల్పీనేత కిషన్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వం హోంగార్డుల శ్రమను దోచుకుంటున్నదని విమర్శించారు. జీవితాంతం శ్రమించినా పదవీ విరమణ సమయంలో ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదన్నారు. వేతనంతో కూడిన సెలవులు ఇవ్వటం లేదని తెలిపారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వివక్ష కొనసాగుతోందన్నారు. పోలీసు వ్యవస్థతో మమేకమై పనిచేస్తున్న హోంగార్డుల సమస్యలు ప్రభుత్వాలు సానుభూతితో పరిశీలించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న హోంగార్డులకు నోటీసులిచ్చి వారిని మరింత క్షోభకు గురిచేయ్యొద్దన్నారు. వారం రోజుల్లో హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే తానే స్వయంగా ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఈ విషయంపై గవర్నర్, ఇద్దరు సీఎం, ఇద్దరు సీఎస్, డీజీపీలకు లేఖలు రాస్తానని తెలిపారు. -
సచివాలయ ముట్టడికి హోంగార్డుల యత్నం
-
సచివాలయ ముట్టడికి హోంగార్డుల యత్నం
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమబాట పట్టిన హోంగార్డులు గురువారం సచివాలయ ముట్టడికి యత్నించారు. సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో.. హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్కు నుంచి ర్యాలీగా వచ్చిన హోంగార్డులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోంగార్డులను అడ్డుకున్నారు. -
తెలంగాణ సిఎస్‌ను కలిసిన హోంగార్డులు
-
ఇందిరా పార్క్ వద్ద హోంగార్డుల ఆందోళన
హైదరాబాద్: హోం గార్డులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఇందిరా పార్క్ వద్ద హోంగార్డులు గురువారం ఆందోళనకు దిగారు. కానిస్టేబుళ్లతో పాటు సమానంగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారమవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం హోం గార్డులను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. లేకపోతే తమ ఆందోళలను భవిష్యత్ లో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
హోంగార్డుల ఆందోళన
-
పోలీసులకే టోపీ పెట్టిన ప్రభుత్వం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా హోంగార్డులకు, పోలీసులకు కూడా ప్రభుత్వం టోపీ పెట్టిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆందోళన సందర్భంగా గాయపడిన హోంగార్డులను మంగళవారం పరామర్శించిన ఆయన... పోలీసులకు జీతాలు పెంచుతామని, 8 గంటల పని వేళ లు ఉంటాయని, వారాంతపు సెలవులు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇంకా హక్కుల కోసం కాళ్లు పట్టుకోకుండా.. కేసీఆర్ వెళ్లే దారిలో ట్రాఫిక్ సిగ్నళ్లను తీసేసి, ట్రాఫిక్ జామ్ చేయాలని పిలుపునిచ్చారు. -
కదం తొక్కిన హోంగార్డులు
- గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా - ఆస్పత్రి భవనం పెకైక్కి దూకుతామంటూ బెదిరింపు - సీఎం కేసీఆర్ అపారుుంట్మెంట్తో ధర్నా విరమణ హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వేదికగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ హోంగార్డులు కదం తొక్కారు. ఆస్పత్రి ప్రాంగణంలో బైఠారుుంచి ధర్నా చేపట్టారు. కొంతమంది హోంగార్డులు ఆస్పత్రి భవనం పెకైక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంగార్డులను రెగ్యులరైజ్ చేసి ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా హోంగార్డు అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు సకినాల సత్యనారాయణ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి విదితమే. అయితే సత్యనారాయణ ఆరోగ్యం విషమించడంతో మంగళవారం వేకువజామున పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు మృతి అంటూ వెబ్సైట్లలో హల్చల్ హోంగార్డుల దీక్షను భగ్నం చేసిన క్రమంలో ఘటన స్థలంలో ఉన్న తిరుమలగిరి ట్రాఫిక్ హోంగార్డు రమేశ్ అలియాస్ కృష్ణ (25)కు స్వల్ప గాయమైంది. దీంతో రమేశ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. అయితే రమేష్ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడనే వార్త సామాజిక వెబ్సైట్లలో హల్చల్ చేసింది. దీంతో నగరంలోని హోంగార్డులు మంగళవారం ఉదయం పెద్దసంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. వాస్తవం తెలుసుకున్న అనంతరం ధర్నా చేయాలని నిర్ణయించుకుని, ఆస్పత్రి ప్రాంగణంలో బైఠారుుంచారు. ఆస్పత్రి భవనం పెకైక్కిన హోంగార్డులు... తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకారులు భాస్కర్‌నాయక్, ఉపేందర్, కుమార్ ఆస్పత్రి ప్రధాన భవనం పెకైక్కి దూకుతామంటూ బెదిరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను నచ్చజెప్పి కిందికి దించారు. హోంగార్డుల ఆందోళన విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ రెండు రోజుల తర్వాత చర్చలకు రావాలని ఆహ్వానించారు. దీంతో హోంగార్డులు ఆందోళన విరమించారు. మరోవైపు సకినాల సత్యనారాయణ దీక్షను భగ్నం చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆస్పత్రి ఓపీ బ్లాక్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద కూడా బలగాలను మోహరించారు. నారాయణకు చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. సాయంత్రానికి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో నారాయణను డిశ్చార్జి చేశారు. -
'నాయిని నెత్తిన టోపీ.. కేసీఆర్ చేతిలో లాఠీ'
హైదరాబాద్: ఎన్నికల సమయంలో హామీలను ఇచ్చి హోంగార్డులకు, పోలీసులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టోపీ పెట్టారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న హోంగార్డుల అరెస్టు ఘటనలో గాయపడిన కొందరిని ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న హోంగార్డులను పోలీసులతో కొట్టించి, బూట్లతో తన్నించి అమానుషంగా అరెస్టులు చేయడం దారుణమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ అన్ని అధికారాలను తన వద్దే పెట్టుకున్నాడని ఆరోపించారు. హోంమంత్రి నాయిని నెత్తిపై టోపీ పెట్టి, లాఠీ మాత్రం కేసీఆర్ చేతిలో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ధర్నాలు ఉండవని, బంద్‌లు, ఉద్యమాలు, పోలీసుల బూట్ల చప్పుడు, లాఠీ చార్జీలు కనిపించవని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేమిటని ఎద్దేవా చేశారు. ఉన్నతాధికారులకు, నాయకులకు సేవ చేస్తున్న హోంగార్డులపై విచక్షణారహితంగా దాడి చేయడానికి పోలీసులకు, ప్రభుత్వానికి చేతులు ఎలా వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'సీఎం ఇంట్లోనే కొడుకు కేటీఆర్ కు మంత్రి పదవి, కూతురు కవిత ఎంపీగా, మేనల్లుడు హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చినా ఎవరూ అడగలేదు. అడ్డమైన గొడ్డుచాకిరీ చేస్తున్న హోంగార్డుల ఉద్యోగాలు పర్మినెంటు చేయాలంటే మాత్రం తప్పు వచ్చిందా! పోలీసు బూట్లతో తొక్కించి, లాఠీలతో కొట్టేటంత పెద్ద తప్పా’ అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పోలీసులకు జీతాలు పెంచుతామని, 8 గంటల పనివేళలు ఉంటాయని, వారాంతపు సెలవులు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఏమైనా అమలుచేశారా అని రేవంత్ ప్రశ్నించారు. ఇంకా హక్కులకోసం కాళ్లు పట్టుకోకుండా సీఎం కేసీఆర్ నడిచే దారిలో ట్రాఫిక్ సిగ్నళ్లను తీసేసి, ట్రాఫిక్‌ను జామ్ చేయాలని పిలుపునిచ్చారు. హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రేవంత్ హెచ్చరించారు. -
హోంగార్డుల ఆందోళన: గాంధీ వద్ద ఉద్రిక్తత
-
'ఎమ్మెల్యేగా పోటీ చేసిన హోంగార్డే కారణం'
హైదరాబాద్: వలంటరీగా సేవలందిస్తున్న హోంగార్డులను పర్మినెంట్ చేసే విషయమై సీఎం కేసీఆర్ సానుకూలంగానే ఉన్నారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. హోంగార్డుల వేతనాన్ని రూ. తొమ్మిది వేల నుంచి 12 వేలకు పెంచడంతో పాటు వారికి డ్రెస్సులు, బస్సుపాస్‌లను కూడా ప్రభుత్వమే అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హోంగార్డులకు ప్రమాదం సంభవిస్తే రూ. 5 లక్షల పరిహారమే అందేలా ఇన్సూరెన్స్ కవరేజీ వర్తింపచేశామని తెలిపారు. గతంలో హోంగార్డుగా పనిచేసి డిస్మిస్ అయి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీచేసిన ఓ హోంగార్డు ఆందోళనకు దిగి అనవసర రాద్దాంతం చేసి పత్రికల్లో వార్తల్లో వ్యక్తిగా నిలవాలనుకుంటున్నాడని అన్నారు. అందరూ హోంగార్డులు సంతోషంగానే ఉన్నారని, ఎవరి విధులు వారు సక్రమంగానే నిర్వర్తిస్తున్నారని హోంమంత్రి వివరించారు. సరైన సమయం వచ్చినప్పుడు హోంగార్డులను పర్మినెంట్ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. -
హోంగార్డుల ఆందోళన: గాంధీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: హోంగార్డుల ఆందోళనలతో గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీక్ష చేపట్టిన హోంగార్డులను మంగళవారం వేకువజామున పోలీసులు బలవంతంగా గాంధీ ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. అయితే, వారు ఆందోళనను విరమించలేదు. డిమాండ్లు సాధించేదాకా దీక్షలు కొనసాగిస్తామని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. అక్కడికి మిగతా హోంగార్డులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న నార్త్‌జోన్ డీసీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీలను చుట్టుముట్టి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే కిందికి దూకుతామని ముగ్గురు హోమ్‌గార్డులు గాంధీ ఆస్పత్రి ప్రదాన భవనంపైకి ఎక్కారు. ప్రభుత్వం తమ డిమాండ్లు ఆమోదించకపోతే కిందికి దూకేస్తామని వారు బెదిరిస్తున్నారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. హోమ్‌గార్డు సంఘాలకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారని, ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదిస్తే కిందికి దిగుతామని లేకపోతే దూకేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. పోలీసులు పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు డాబా తలుపు వేసి గడియపెట్టుకున్నారు. ముగ్గురు హోంగార్డులు గాంధీ ఆస్పత్రి పైకి ఎక్కడంతో ఆస్పత్రి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
దీక్ష భగ్నం.. హోంగార్డు ఆత్మహత్యాయత్నం
-
దీక్ష భగ్నం.. హోంగార్డు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: అంబర్‌పేటలో హోంగార్డుల దీక్షను అర్థరాత్రి పోలీసులు భగ్నం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హోంగార్డుల అసోసియేషన్ తెలంగాణ చైర్మన్ సకినాల నారాయణ ఆధ్వర్యంలో రెండు రోజులుగా హోంగార్డులు అమరణ నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు దీక్షను భగ్నం చేయడంతో మనస్తాపం చెందిన హోంగార్డు రమేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులకు, హోంగార్డులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అరెస్టైన హోంగార్డులు, ఓయూ, అంబర్‌పేట పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు సమాచారం. -
తిలక్‌నగర్‌లో హోంగార్డుల ఆందోళన
-
హోంగార్డుల ఆకస్మిక ఆందోళన
► సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ► సంక్షేమ సంఘం చైర్మన్ దీక్ష హైదరాబాద్: హోంగార్డులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆకస్మిక ఆందోళనకు దిగారు. ఆల్ ఇం డియా హోంగార్డ్స్ సంక్షేమ సంఘం తెలంగాణ చైర్మన్ సకినాల నారాయణ.. ఆదివారం ఉదయం హైదరాబాద్ అంబర్‌పేటలోని సంఘం కార్యాలయం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. ఆయన దీక్షకు హోంగార్డులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. దీక్ష వద్దకు చేరుకున్న హోంగార్డులు సమస్యను వివరిస్తూ గవర్నర్‌కు పోస్టుకార్డులు రాసి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆం దోళన నిర్వహించారు. ఇటీవల పుష్కరాల సమయం లో ఛత్రినాక పోలీసుస్టేషన్లో పనిచేసే హోంగార్డు ఇబ్రహీంపాషా కనిపించకుండా పోరుునా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆందోళనకారులకు పోలీసులు సూచించినా.. వారు దీక్షలు, ఆందోళనను విరమించలేదు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ స్వయంగా చెబితేనే దీక్ష విరమిస్తానని నారాయణ స్పష్టం చేశారు. రాత్రి వరకు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా హోంగార్డుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కాగా, 2003లోపు హోం గార్డుగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని, 2004 నుంచి హోంగార్డుగా పని చేస్తున్న వారికి కానిస్టేబుల్ బేసిక్ వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు. -
తిలక్‌నగర్‌లో హోంగార్డుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని తిలక్‌నగర్‌లో హోంగార్డులు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. స్థానిక హోంగార్డుల కార్యాలయంలో ఆ సంఘం చైర్మన్ సకినాల నారాయణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చేపట్టిన ఈ ఆందోళనలో సుమారు 200 మంది హోంగార్డులు పాల్గొన్నారు. -
దూసుకెళ్లిన లారీ: హోంగార్డ్ మృతి
-
దూసుకెళ్లిన లారీ: హోంగార్డ్ మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద తనిఖీ చేస్తున్న హోంగార్డ్ అహ్మద్పైకి శనివారం లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే లారీ మాత్రం ఆగకుండా వెళ్లి పోయింది. దీంతో అక్కడే సహాచర పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనకు బాధ్యుడైన లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అలాగే అహ్మద్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా హోంగార్డును ఢీకొట్టిన బస్సు
హైదరాబాద్: విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా హోంగార్డును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన నగరంలోని జగద్గిరిగుట్ట బస్లాండ్లో సోమవారం చోటు చేసుకుంది. బస్టాండ్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా హోంగార్డును జగద్గిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు వెనుక చక్రాలు హోంగార్డు కాళ్ల పై నుంచి వెళ్లడంతో..ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
హోంగార్డు గుండెపోటుతో మృతి
నిడదవోలు : విధి నిర్వాహణలో ఉన్న ఓ హోంగార్డ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న వి. రాంబాబు (50) విధులు నిర్వర్తిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న సహచర సిబ్బంది వెంటనే స్పందించి... అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రాంబాబు గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు. రాంబాబు మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. -
కిరోసిన్ తాగిన హోంగార్డు..
మెదక్ : మెదక్ జిల్లా సిద్ధిపేటలో హోంగార్డు అన్వర్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. శుక్రవారం రాత్రి అతడు కిరోసిన్ తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు వెంటనే స్పందించి... అతడిని సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అన్వర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అన్వర్ ఆత్మహత్యయత్నంపై సమాచారం అందుకున్న డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని అతడిని పరామర్శించారు. ట్రాఫిక్ ఎస్ఐ వేధింపుల కారణంగానే అన్వర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. -
సంగం హోంగార్డుకు ప్రశంసలు
సంగం : కష్ణా పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న సంగంకు చెందిన మహిళా హోంగార్డ్ వినీల బుధవారం మూగబాలుడి ప్రాణాలు కాపాడి పోలీసు రివార్డు ప్రజల ప్రశంసలు పొందారు. కష్ణా పుష్కరాల సందర్భంగా సంగం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు వినీలను గుంటూరు జిల్లాలోని సీతానగర్ఘాట్ విధుల నిమిత్తం నియమించారు. బుధవారం గుడివాడకు చెందిన మురళీ (7) అనే మూగ బాలుడు కష్ణా నదిలో స్నానం చేస్తూ లోతుకి వెళ్లి మునిగిపోయాడు. ఇది గమనించిన వినీల నదిలోకి దూకి మురళీ ప్రాణాలను కాపాడింది. విషయం తెలిసుక్ను డీజీపీ నందూరి సాంబశివరావు ఆదేశాలతో గుంటూరు ఎస్పీ త్రిపాఠి వినీలకు నగదు రివార్డు అందజేశారు. -
హోంగార్డు నిజాయితీ
రాజోలు : తనకు లభించిన పర్సును నిజాయితీగా సంబంధిత వ్యక్తికి అప్పగించిన హోంగార్డును పలువురు ప్రశంసించారు. వివరాల్లోకి వెళితే.. రాజోలు సీఐ జీవీ కృష్ణారావు జీపు డ్రైవర్ సురేష్ హైదరాబాద్ ఏసీబీ కార్యాలయ ఏఓ డ్రైవర్‌గా 10 రోజుల పాటు విధి నిర్వహణకు వెళ్లాడు. ఈనెల 12వ తేదీన అక్కడ సురేష్ తన రూమ్‌కు వెళ్తుండగా ఓ పర్సు దొరికింది. అందులో రూ. 9 వేలు, మూడు ఏటీఎం కార్డులు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, బస్సు పాస్ ఉన్నాయి. ఈ విషయాన్ని వెంటనే సురేష్ సీఐ కృష్ణారావుకు తెలిపారు. బస్‌పాస్‌లో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా పర్సు పోగొట్టుకున్న వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అశోక్‌కుమార్‌గా గుర్తించి ఆయనకు సురేష్ ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆయన రాకపోవడంతో సురేష్ రాజోలు వచ్చేశారు. పలుమార్లు ఫోన్ చేయగా అశోక్‌కుమార్ హైదరాబాద్ నుంచి శనివారం రాజోలు రాగా సీఐ కృష్ణారావు సమక్షంలో పర్సుతోపాటు నగదు, ఏటీఎం కార్డులు అందజేశారు. హోంగార్డు సురేష్ నిజాయితీని పలువురు ప్రశంసించారు. -
‘ఆర్డర్లీ’ వ్యవహారంలో కుట్ర : ఎస్పీ
ఎస్పీ నవీన్ కుమార్ తాండూరు: జిల్లా పోలీసు శాఖలో సంచలనం కలిగించిన హోంగార్డుల ఆర్డర్లీ వ్యవహారంపై ఎస్పీ డా.బీ.నవీన్ కుమార్ స్పందించారు. బుధవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు తాండూరు విచ్చేసిన ఎస్పీ.. స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తనపై కుట్ర జరిగిందన్నారు. నవాబుపేట, తాండూరు, యాలాల, వికారాబాద్ డీటీసీకి చెందిన నలగురు హోంగార్డులు ఒక పథకం ప్రకారం జిల్లా ఎస్పీ కార్యాయానికి వచ్చి కార్యాలయం వెనుక భాగంలో ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు విడుదల చేసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. ఈ నలుగురు హోంగార్డులకు జిల్లా ఎస్పీ కార్యాలయం, రెసిడెన్సీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో డీఐజీ ఆధ్వర్యంలో ఉన్నతస్థారుు విచారణ జరుగుతోందని, అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. సదరు నలుగురు హోంగార్డులపై విచారణ అనంతరం తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సిన్సియర్‌గా పని చేసే పోలీసు అధికారులకు ఇబ్బందులు తప్పవన్నారు. పోలీసు శాఖలో పని చేయడం కత్తిమీద సాములాంటిదని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సవాలుగా తీసుకుంటూ ముందుకుసాగుతానని స్పష్టం చేశారు. ఎస్పీ జిల్లా పోలీసు కుటుంబానికి పెద్ద (హెడ్) అని అన్నారు. కుటుంబ పెద్ద తన పిల్లలను ఎలాచూసుకుంటారో పోలీసు కుటుంబాన్ని తాను అలా ముందుకు నడిపించడానికి పాటుపడుతున్నట్టు చెప్పారు. పోలీసులు సరిగా విధులు నిర్వర్తించేలావారికి మార్గనిర్దేశం చేయడమే తన లక్ష్యమన్నారు. ఏ కేటగిరి హోంగార్డులు రెగ్యులర్ పోలీసుల మాదిరిగానే పెట్రోలింగ్, గార్డు తదితర డ్యూటీలు, బీ కేటగిరిలో హోంగార్డులు కార్పెంటర్, బార్బర్, కుకింగ్, ఎలక్టిష్రీయన్ తదితర స్కిల్డు పనులు చేస్తారన్నారు. వీరు జిల్లాలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. వికారాబాద్ సమీపంలోని ధన్నారం వద్ద హౌసింగ్ సొసైటీలో కొందరి పోలీసుల ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ చందనదీప్తి పాల్గొన్నారు. -
ఖాకీల్లో కలవరం
-
ఖాకీల్లో కలవరం
* ఎస్పీ ఇంట్లో ఆర్డర్లీ విధానంపై కదలిక * పోలీస్ బాస్ అరాచకాలను ఎండగట్టిన హోంగార్డులు * హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్‌తో పోలీసుల్లో అలజడి సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పోలీస్ విభాగంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అనూహ్యంగా కొందరు హోంగార్డులు మీడియా ముందుకు వచ్చి ఎస్పీ అరాచకాలను ఎండగట్టారు. క్యాంపు కార్యాలయంలో, వ్యక్తిగత వ్యవహారాల్లోనూ హోంగార్డులతో చాకిరీ చేయించుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తంతు జిల్లా పోలీస్వర్గాలను ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. పోలీస్ బాస్‌పై హోంగార్డుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆ శాఖలో గందరగోళం నెలకొంది. హెడ్‌కానిస్టేబుల్‌పై వేటు.. ఇదిలా ఉండగా బంట్వారం పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను ఎస్పీ నవీన్‌కుమార్ ఆదివారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హోంగార్డుల మీడియా సమావేశం జరిగిన కొద్ది సమయంలోనే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు రావడం గమనార్హం. మహేష్ గతంలో ఎస్పీ కార్యాలయంలో సీసీగా పనిచేశారు. అప్పట్లో పెట్రోల్, డీజిల్ వినియోగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే అకస్మాత్తుగా మహేష్‌పై సస్సెన్షన్ వేటు వేయడం పోలీస్ అధికారుల్లో చర్చనీయాంశమైంది. హోంగార్డులను వ్యక్తిగత పనులకు వాడుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో మహేష్ పోస్టు చేశాడనే ప్రచారం సాగుతోంది. ఈ చర్యలపై ఎస్పీ నవీన్ ఆగ్రహించి సస్పెండ్ చేసినట్లు సర్వత్రా గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. -
వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్
రంగారెడ్డి: రంగారెడ్డి ఎస్పీ నవీన్‌కుమార్ ఇంట్లో 'హోమ్‌గార్డుల వెట్టిచాకిరి' కేసు కొత్త మలుపు తిరిగింది. హోమ్‌గార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్లు వస్తుంటే...కానిస్టేబుల్ మహేశ్నే ఎస్పీ సస్పెండ్ చేశారు. అధికారిక సమాచారాన్ని లీక్ చేశారని సస్పెన్షన్ వేటు వేసినట్టు వెల్లడించారు. గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్చల్ చేయడంతో పోలీస్‌వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే హోంగార్డులు తన ఇంట్లో పని చేసిన వ్యవహారంలో కుట్రజరిగిందని మహేశ్ అనే కానిస్టేబుల్ పథకం ప్రకారం ఈ పని చేశాడని ఎస్పీ నవీన్ కుమార్ తెలిపారు. దీని పై విచారణ కూడా చేయిస్తామన్నారు. ఇంతలోనే మహేశ్ పై వేటు పడటం గమనార్హం. -
వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్
-
"ఆ ఎస్పీని సస్పెండ్ చేయాలి"
హోమ్‌గార్డుల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని హోమ్‌గార్డుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్న సంవత్సరాలైనా పోలీస్ వ్యవస్థలో ఇంకా వెట్టిచాకిరీ కొనసాగడం దారుణమన్నారు. ఎస్పీ నిర్వాకంపై రాష్ట్ర హోమ్ మంత్రికి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.