ఖమ్మం జిల్లాలో శనివారం కలకలం రేగింది.
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో శనివారం కలకలం రేగింది. స్థానికంగా ఇన్న రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
కల్లూరు మండలానికి చెందిన కాశీ విశ్వనాథ్, ఆయన కుమారులు జయంత్, అజయ్ గా నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాశీ విశ్వనాథ్ హోంగార్డుగా పని చేస్తున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.