కబ్జాదారులకే పోలీసులు కొమ్ము కాశారని ఆవేదన
పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో
గతంలో ఇదే విషయమై మృతుడి సోదరుడు బలవన్మరణం
ఖమ్మం రూరల్: భూమి కబ్జా చేశారనే ఆవేదన కు తోడు పోలీసులు సైతం కబ్జాదారులకే కొ మ్ము కాస్తున్నారనే ఆక్రందనతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం జాన్‌బాద్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి(50)కి అర ఎకరం, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో 25 గుంటలకు సంబంధించి వివాదం నెలకొనగా.. అదే గ్రామానికి చెందిన జాటోతు వీరన్న ఆక్రమించాడని వెంకటరెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ వెంకటరెడ్డి ఈనెల 4న పురుగు మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవా రుజామున మృతి చెందాడు.
సెల్ఫీ వీడియోలో ఏముందంటే...
వెంకటరెడ్డి ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు. ‘మా భూమి ఆక్రమించుకుని జాటోతు వీరన్న సాగు చేస్తుండగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పోలీసులు ఆయన వద్ద లంచం తీసుకుని మమ్మల్నే ఇబ్బందిపెడుతున్నారు. మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి ప్రోద్బలంతో జాటోతు వీరన్నతోపాటు సురేష్, దేవిక, చిన్ని, ఉపేందర్ మమ్మల్ని వేధిస్తున్నారు. వారం క్రితం ప్రైవేట్ కేసు వేయించినా మాకు న్యాయం జరగ లేదు’అని వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇదే భూవివాదంలో వెంకటరెడ్డి సోదరుడు ఏలేటి భూపాల్‌రెడ్డి కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. కాగా, వెంకటరెడ్డి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు జాటోతు వీరన్న, మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి, సురే‹Ù, దేవిక, చిన్ని, ఉపేందర్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment