venkata reddy
-
KSR Live Show: ఇసుక మాఫియా.. మద్యం మాఫియా.. ఇంత అరాచక పాలన దేశంలో ఎక్కడ లేదు
-
NDDB చైర్మన్ తో టీటీడీ ఈవో.. షాకింగ్ సీక్రెట్ బట్టబయలు
-
భూ కబ్జాకు రైతు బలి
ఖమ్మం రూరల్: భూమి కబ్జా చేశారనే ఆవేదన కు తోడు పోలీసులు సైతం కబ్జాదారులకే కొ మ్ము కాస్తున్నారనే ఆక్రందనతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి(50)కి అర ఎకరం, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో 25 గుంటలకు సంబంధించి వివాదం నెలకొనగా.. అదే గ్రామానికి చెందిన జాటోతు వీరన్న ఆక్రమించాడని వెంకటరెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ వెంకటరెడ్డి ఈనెల 4న పురుగు మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవా రుజామున మృతి చెందాడు. సెల్ఫీ వీడియోలో ఏముందంటే... వెంకటరెడ్డి ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు. ‘మా భూమి ఆక్రమించుకుని జాటోతు వీరన్న సాగు చేస్తుండగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పోలీసులు ఆయన వద్ద లంచం తీసుకుని మమ్మల్నే ఇబ్బందిపెడుతున్నారు. మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి ప్రోద్బలంతో జాటోతు వీరన్నతోపాటు సురేష్, దేవిక, చిన్ని, ఉపేందర్ మమ్మల్ని వేధిస్తున్నారు. వారం క్రితం ప్రైవేట్ కేసు వేయించినా మాకు న్యాయం జరగ లేదు’అని వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇదే భూవివాదంలో వెంకటరెడ్డి సోదరుడు ఏలేటి భూపాల్‌రెడ్డి కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. కాగా, వెంకటరెడ్డి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు జాటోతు వీరన్న, మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి, సురే‹Ù, దేవిక, చిన్ని, ఉపేందర్‌పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రామారావు తెలిపారు. -
ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై చెంప చెళ్లుమనిపించిన రైతు..
-
టీడీపీ దాడిలో గాయపడిన వెంకటరెడ్డి కన్నుమూత
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు, జేసీఎస్ కన్వినర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు శుక్రవారం తెలిపారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను టీడీపీకి చెందినవారు దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. కిందపడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ ఆళ్ల అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చయినా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు. వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు హేమంత్, కుమార్తెలను పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ ఈదులమూడి డేవిడ్‌రాజు, పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, జేసీఎస్ నియోజకవర్గ కనీ్వనర్ మున్నంగి వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు రాజారెడ్డి, భూపతి కిషోర్‌నాయుడు తదితరులు ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల అదుపులో నిందితులు కుంచనపల్లిలో గురువారం రాత్రి ఈ దాడులకు తెగబడిన నిందితులు టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం తెల్లవారుజామున మహానాడుకు చెందిన ఓ మాజీ రౌడీషీటర్ తన కొడుకైన రౌడీషీటర్‌ను, కొందరు యువకులను తీసుకుని వచ్చారు. ఇదే క్రమంలో వెంకటరెడ్డిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆ వాహనంపైన వెనుక కూర్చున్న ప్రకాశం జిల్లా పొదిలి మండలం బచ్చలకుర్రపాడుకు చెందిన యువకుడు, ప్రస్తుతం మహానాడులో నివాసముంటున్న మాదల గురువర్ధన్‌ను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపట్టారు. ఆ వాహనాన్ని, గురువర్ధన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గురువర్ధన్‌ను, ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారని తెలియడంతో దాడిలో పాల్గొన్న యువకుల తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో మంతనాలు జరిపారు. పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో వెంకటరెడ్డిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన బొమ్మలబోయిన ఈశ్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తరువాత తమ అనుకూల మీడియాలో వైఎస్సార్సీపీకి, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వారు తమ కార్యకర్తలే కాదంటూనే.. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతున్న వారిని వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారని, బైక్ బ్రేక్ ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం చేయసాగారు. వెంకటరెడ్డిని వెనుక నుంచి బైక్‌తో ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. -
ఎవరి కోసం యాత్ర చేశారో నారా లోకేశ్‌కే తెలీదు: వెంకట్ రెడ్డి
-
కనీస జ్ఞానం లేకుండా రాస్తే ఎలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఇసుక గనులపై దురుద్దేశ్యంతో ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై ఆ పత్రిక ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంఓనా?’’ అంటూ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. అనుమతుల్లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థంలేని రాతలు రాయడంపై ఆయన మండిపడ్డారు. నిజానికి.. ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం ఒక పారదర్శక విధానాన్ని అమలుచేస్తోందని, దానిపై అపోహలు కలిగించేలా ఇసుక తవ్వకాలు చేసే వారు సీఎంఓ పేరు చెబుతున్నారంటూ పొంతనలేని అంశాలతో అసత్య కథనాన్ని వండివార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మళ్లీ టెండర్లు అయ్యేవరకూ జేపీనే.. గతంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు టెండర్లు నిర్వహించామని.. ఈ టెండర్లలో జేపీ సంస్థ సక్సెస్ఫుల్ బిడ్డర్‌గా ఎంపికైన విషయాన్ని వెంకటరెడ్డి గుర్తుచేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గత రెండేళ్లుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తుందన్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, అప్పటివరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయని, గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినా అవే తప్పుడు కథనాలను ప్రచురించడం ఈనాడు దురుద్దేశ్యాన్ని తెలియజేస్తోందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అభూతకల్పనలతో రాయొచ్చా?.. ఇక వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయినందున ఎండాకాలంలో జేపి సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్‌లలో నిల్వచేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే, తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సిద్ధమవుతోందని, దీన్ని వక్రీకరిస్తూ బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంఓ నుంచి తమకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు అభూత కల్పనలతో కథనాన్ని ప్రచురించడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ప్రశ్నించారు. ఇసుక ఆపరేషన్స్‌కు గనుల శాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయని.. మైనింగ్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలుసునన్నారు. అటువంటిది సీఎంఓ అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎవరైనా ఎలా చెబుతారని, ఒక్క ఈనాడుకు మాత్రమే ఇలా చెబుతున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక అంశంపై రాసే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అసత్య కథనాలను ప్రచురించడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలోని అక్రమాలు ఈనాడుకు కనిపించలేదా? గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్దఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకున్న రోజుల్లో ఈనాడుకు ఆ అక్రమాలు కనిపించలేదా అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో, వర్షాకాలంలోనూ ఇసుక కొరతలేకుండా ఇసుకను అందిస్తుంటే ఈనాడు తట్టుకోలేక తప్పుడు వార్తలను వండివారుస్తోందన్నారు. నిజానికి.. ఎలాంటి విమర్శలకు అవకాశంలేకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీరత్నగా గుర్తింపు పొందిన ఎంఎస్టీసీ ద్వారా ఇసుక టెండర్లు నిర్వహిస్తున్నామని.. ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశముందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలిలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయని.. జిల్లాకో ఇన్చార్జిని నియమించారంటూ ఈనాడు అబద్ధాలను పోగేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించిందన్నారు. ఇకనైనా ఇటువంటి తప్పుడు కథనాలను మానుకోకపోతే ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఇసుక టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూ పరిధిలోకి రావు
సాక్షి, అమరావతి: ఇసుక టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూ పరిధిలోకి రావని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇసుక టెండర్లపై న్యాయ సమీక్ష ఏదంటూ ఈనాడు పత్రికలో రాసిన కథనం పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడుకున్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ వక్రీకరణ వార్తను ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చే శారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూకు సంబంధించిన నిబంధనలు అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్లో ఉన్నాయని, కనీసం వాటిని పరి శీలించకుండా ఈనాడు కథనాలు రాయడం బాధ్యాతా రాహిత్యమని పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. రూ.100 కోట్లు దాటితేనే.. ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లకుపైగా వ్యయం చేస్తే.. అలాంటి ప్రాజెక్టులకు నిర్వహించే టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఆమోదం తీసుకోవాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. తాజాగా గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఆ టెండర్ల ప్రక్రియకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు కోరలేదంటూ ఈనాడు అవగాహనా రాహిత్యంతో వార్త రాసిందన్నారు. ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేయడం కోసమే ఈ కథనం రాశారని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం కాంట్రాక్టింగ్ ఏజెన్సీని టెండర్ల ద్వారా ప్రభుత్వం ఎంపిక చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చేసే వ్య యం చాలా స్వల్పమని తెలిపారు. ఈ టెండర్లలో ఎంపికైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఇసుక తవ్వకాలు, విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. ఆ సంస్థ ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తానికి ఇసుకను వినియోగదారులకు విక్రయించి, టెండర్లలో ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తానని కోట్ చేసిందో ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని వివరించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం రూ.100 కోట్ల మేర ఎక్కడ వ్యయం చేస్తోందని ప్రశ్నించారు. అలాంటప్పుడు న్యాయసమీక్షకు పంపలేదని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. బీచ్ శాండ్‌లో ఏపీఎండీసీ చెల్లింపులు జరుపుతుంది కాబట్టే ప్రివ్యూకి బీచ్ శాండ్ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఇసుక టెండర్లను పంపలేదంటూ బోడిగుండుకు, మోకాలికి ముడి వేసేలా కథనంలో వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. బీచ్ శాండ్ ఆపరేషన్స్ చేసే కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఏపీఎండీసీ రూ.100 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండటం వల్లే ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపామని తెలిపారు. కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు చేయడం లేదని వెల్లడించారు. దీనిని అర్థం చేసుకోకుండా సందేహాలు అంటూ ఈనాడు పత్రిక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. -
సర్వేలకు మించి వైఎస్ఆర్ సీపీ విజయం ఖాయం...!
-
ఏయ్.. మిమ్మల్ని కూడా ఎర్రబుక్కులో చేరుస్తా..
-
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుపై వైసీపీ వీపీ కారుమూరి వెంకట రెడ్డి కామెంట్స్
-
ఏ కేసును ధైర్యంగా ఎదుర్కోలేని వ్యక్తి చంద్రబాబు
-
ఇసుక తవ్వకాలపై నిషేధం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేధం లేదని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీ పరీవాహక ప్రాంతాల్లో బి–2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరీలో 18 ఓపెన్ ఇసుక రీచ్‌లకు ఇచ్చిన అనుమతులను మాత్రమే కోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేశామని తెలిపారు. మళ్ళీ అన్ని పర్యావరణ అనుమతులను ఆ సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఆ 18 రీచ్‌ల్లో తవ్వకాలు జరపవచ్చని తెలిపారు. పర్యావరణానికి విఘాతం కలిగించారంటూ ఈ రీచ్‌లపై ఎన్జీటీ విధించిన జరిమానాపైనా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో బి1, బి2 కేటగిరీల్లో ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులను కూడా పర్యావరణ శాఖ పునఃసమీక్షించాలని కోర్టు సూచించిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని, పర్యావరణానికి విఘాతం కలగకుండా అన్ని అనుమతులు ఉన్న రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడకుండా, భవన నిర్మాణ రంగానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని చోట్లా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ వాస్తవాలను విస్మరించి, ప్రభుత్వంపై తప్పుడు వార్తలను ప్రచురించడమే పనిగా పెట్టుకున్న ఈనాడు దినపత్రిక ఇష్టారాజ్యంగా వక్రీకరణలతో అర్థంలేని రాతలు రాయడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే దందా అంటూ ఇసుక ఆపరేషన్స్‌పై మళ్ళీ, మళ్ళీ తప్పుడు ఆరోపణలతో వార్తా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు. పర్యావరణ శాఖ నుంచి అన్ని అనుమతులు లభించిన రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నామని వెంకటరెడ్డి వివరించారు. -
టీడీపీ పట్టాభి, అయ్యన్నపాత్రుడిపై కారుమూరి ఫైర్..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్‌రెడ్డి. రాజకీయాల కోసం టీడీపీ నేతలు దిగజారిపోయారి ఎద్దేవా చేశారు. తన పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పమంటున్నామని ప్రశ్నించారు. కాగా, కారుమూరి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు నోరు తెరిస్తే బూతులు తప్ప ఏం మాట్లాడటం లేదు. ఇలాంటి నీచ రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు?. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో చెప్పాలి. మా ప్రభుత్వ పాలనలో మేం చేశామో మేం చెబుతాం. మీ నైతిక పొత్తుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేదు. పట్టాభి, అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టించడం చంద్రబాబు అలవాటే. నోరు అదుపులో పెట్టుకొండి.. మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను. ఒళ్లు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొండి. మీ మాదిరిగా మేము మాట్లాడితే, ఒక్కరోజు కూడా మీరుండ లేరు. మాకు సంస్కారం ఉంది. అదే మాకు మా నాయకుడు నేర్పారు. మేము రాజకీయాల్లో ఫెయిర్‌గా ఉన్నాం. ఓడినా వెనక్కు తగ్గలేదు. ప్రజల్లో ఉన్నాం. అఖండ మెజారిటీతో గెల్చాం. మళ్లీ 2024లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కచ్చితంగా మళ్లీ ఘన విజయం సాధిస్తాం. ప్రజలే బుద్ధి చెబుతారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విలువలు, విశ్వసనీయత, ప్రజలను నమ్ముకున్నారు. మీ మాదిరిగా పొత్తులు, అనైతిక రాజకీయాలు చేయబోం. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఏం చేసినా, ఎన్ని బూతులు తిట్టించినా మీ సంస్కారానికి వదిలేస్తున్నాం. మళ్లీ మా విజయాన్ని ఆపలేరు. అంతేకానీ, ఈ తరహాలో విమర్శలు, మీ అనుకూల పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటే, ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. పాలిటిక్స్‌లో క్లియర్‌గా ఉండండి. ఓపెన్‌గా రండి అంటూ సవాల్ విసిరారు. -
తప్పుడు రాతలెందుకో.. చెప్పవే ‘సిలికా’
సాక్షి, అమరావతి: తప్పుడు కథనాల్లో ఈనాడుది అందె వేసిన చేయి. అదే కోవలో సిలికా శాండ్ విక్రయాలపై మరో కట్టు కథనం ప్రచురించింది. గనుల శాఖకు సంబంధం లేని విషయాలను ఆ శాఖకు ముడిపెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. పరస్పర విరుద్ధ వాదనలతో కథనాన్ని అల్లింది. ఈనాడు కథనమంతా పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని గనుల శాఖ స్పష్టం చేసింది. సిలికా శాండ్ మైనింగ్‌పై అసలు వాస్తవాలను ఆ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వివరించారు. అసత్యాలు, వక్రీకరణలతో ప్రభుత్వంపై బురదచల్లేలా ఈ కథనం ఉందని చెప్పారు. సిలికా శాండ్ మైనింగ్, రవాణా, విక్రయాలు, జీఎస్టీ చెల్లింపులపై ఆ కథనంలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. గనుల శాఖ నలుగురికే అనుకూలంగా ఉందన్న ఆరోపణా అసత్యమని చెప్పారు. ఆ నలుగురికే అనుకూలంగా ఉంటే ఇటీవల కొత్తగా 11 మందికి ఎలా లీజులు జారీ చేస్తామని ప్రశ్నించారు. ఈ అంశంపై సోమవారం ఆయన మీడియాతో చెప్పిన వివరాలు.. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే.. సిలికా శాండ్ లీజు అనుమతులు, చెల్లింపులు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. సిలికా శాండ్‌కు లీజుదారుల నుంచి సీనరేజీ, డీఎంఎఫ్, మెరిట్, కన్సిడరేషన్ మొత్తాలను గనుల శాఖ ఆన్లైన్లోనే స్వీకరిస్తుంది. అన్ని అనుమతులున్న లీజుదారులకు రవాణా పత్రాలను కూడా ఆన్లైన్లోనే జారీ చేస్తుంది. లీజుదారులు మైనింగ్ చేసిన మెటీరియల్‌ను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా> బహిరంగ మార్కెట్లో ఎవరికైనా అమ్ముకోవచ్చు. లీజుదారులు వారికి అనుకూలమైన సంస్థలకే మినరల్‌ను విక్రయించుకుంటారు. ఇందులో గనుల శాఖ ప్రమేయం ఉండదు. ఒత్తిడి చేసే అవకాశమే ఉండదు. నష్టం వచ్చేలా ఎవరైనా వ్యాపారం చేస్తారా? వ్యాపార రంగంలో విస్తరించి ఉన్న ఈనాడు సంస్థకు ఈ విషయం తెలియదా? ఆసక్తి ఉంటే ఈనాడు యాజమాన్యం కూడా నిబంధనల ప్రకారం సిలికా శాండ్ లీజులు పొందవచ్చు, అలాగే లీజుదారుల నుంచి శాండ్‌ను కొనుక్కోవచ్చు. నిబంధనల ప్రకారం అవసరమైన సహకారాన్ని అందిస్తాం. నిష్పాక్షికతకు నిదర్శనమిది కేవలం నలుగురు డీలర్లకే మేలు చేకూర్చేలా, లీజుదారులు సిలికా శాండ్‌ను వారికి మాత్రమే విక్రయించేలా గనుల శాఖ జరిమానాల పేరుతో వారిపై ఒత్తిడి తెచ్చిందనడం పూర్తిగా నిరాధారం. ఇటీవల గనుల శాఖ కొత్తగా 11 మందికి సిలికా శాండ్ మైనింగ్ లీజులు జారీ చేసింది. నిజంగా ఆ నలుగురికే మేలు చేసే ఉద్దేశం ఉంటే ఈ లీజులు వారే దక్కించుకొని ఉండే వారు. కొత్త వారికి అవకాశం లభించేదా? గనుల శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించబట్టే కొత్త వారికి లీజులు లభించాయి. గనుల శాఖకేం సంబంధం? లీజుదారులు డీలర్లకు విక్రయిస్తున్న సిలికా శాండ్‌కు సగం మొత్తాన్ని ఆన్లైన్లో, మిగిలిన దాన్ని నగదుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై గనుల శాఖకు ఎటువంటి బాధ్యత ఉండదు. లీజుదారులు, విక్రయదారుల మధ్య జరిగే లావాదేవీల్లో గనుల శాఖ జోక్యం చేసుకోదు. నిబంధనల ప్రకారమే లీజుదారులు జీఎస్టీ చెల్లింపులు చేస్తున్నారు. ఏడాదికి సగటున 20 లక్షల టన్నులు సిలికా శాండ్ విక్రయిస్తున్నారు. దానిలో సగం మాత్రమే ఆన్లైన్లో స్వీకరిస్తూ, దానికి మాత్రమే జీఎస్టీ చెల్లిస్తున్నారంటూ చేసిన ఆరోపణకు ఆధారాలున్నాయా? పరస్పర విరుద్ధ వాదనలేమిటి? సిలికా శాండ్ మైనింగ్‌లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూనే, మరోవైపు గనుల శాఖ జరిమానాలు విధించిందని, ఆ తర్వాత వాటిని సర్దుబాటు చేసిందని పరస్పరం విరుద్ధంగా రాస్తున్నారు. జిల్లా స్థాయిలో విజిలెన్స్ స్క్వాడ్, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్ట్‌లు, కీలక ప్రాంతాల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా సిలికా శాండ్ మైనింగ్‌లో అక్రమాలను గనుల శాఖ పూర్తి స్థాయిలో నియంత్రిస్తోంది. ఆరోపణలు వచ్చిన చోట తనిఖీలు చేసి, జరిమానాలు విధిస్తున్నాం. ఈ జరిమానాలపై లీజుదారులు రివిజన్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇది అన్ని మినరల్స్ మైనింగ్‌లోనూ సర్వసాధారణంగా జరుగుతుంది. అథారిటీ ఆ జరిమానాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. కేవలం ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు జరిమానాలను సర్దుబాటు చేశారని రాయడం తప్పు. తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని 1150.975 హెక్టార్లలో 73 సిలికా శాండ్ లీజులున్నాయి. శుద్ధి చేయని సిలికా శాండ్‌ను టన్ను రూ.700 కి విక్రయిస్తారు. శుద్ధి చేసిన ఇసుకను దానికి అయిన వ్యయాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. శుద్ధి చేయని ఇసుకకు లీజుదారులు టన్నుకు రూ.100 సీనరేజీ, కన్సిడరేషన్ కింద రూ.212, డీఎంఎఫ్ కింద రూ.30, మెరిట్ కింద రూ.2 కలిపి రూ.346 ప్రభుత్వానికి చెల్లించాలి. కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నాం సిలికా శాండ్ మైనింగ్‌పై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నాం. 2019లో 73 లీజులను గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి ఉల్లంఘనలు గుర్తించి 61 లీజులకు జరిమానా విధించారు. వారిలో 52 మంది లీజుదారులు రివిజన్ అథారిటీకి అప్పీల్ చేసుకున్నారు. అథారిటీ వాటిని సమీక్షించి పరిష్కరించింది. సిలికా శాండ్ మైనింగ్, రవాణాపై మూడంచెల నిఘా వ్యవస్థ కొనసాగుతోంది. ఇంటర్నల్ బృందాలు, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ తనిఖీలు, జిల్లా విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. ఆకస్మిక తనిఖీల ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతి జిల్లా మోమిడి, బల్లవోలు, వేల్లపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూముల్లో అక్రమ సిలికా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అవాస్తవం. తిరుపతి జిల్లా తడ మండలం బీవీ పాలెం వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంగా నిఘా బృందాలు ఎప్పటికప్పుడు సిలికా శాండ్ మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. సిలికా శాండ్ మైనింగ్‌లో లీజుదారులది ప్రేక్షక పాత్రని, వందల కోట్ల దందా జరుగుతోందని, కొందరు పెద్దలకు ఈ మొత్తాలు చేరుతున్నాయంటూ ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ఈనాడులో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని ఖండిస్తున్నాం. నిబంధనల ప్రకారమే మైనింగ్, విక్రయాలు, రవాణా జరుగుతుంటే, అక్రమాలు, పెద్దల పాత్రంటూ ఊహాత్మక అంశాలను జోడించి, అసత్య కథనాలు రాయడం మానుకోవాలి. -
అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్, రవాణా జరుగుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సీఎం వైఎస్ జగన్ విజిలెన్స్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమ మైనింగ్, రవాణాను అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2014–19 మధ్య అక్రమ మైనింగ్‌పై 424 కేసులు నమోదవగా, 2019–22 మధ్యలో 643 కేసులు నమోదైనట్లు చెప్పారు. అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం అటవీ భూములు, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించినట్లు తెలిపారు. ద్రవిడ విశ్వ విద్యాలయం భూముల్లో 131 గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో 2014 నుంచి 2019 వరకు అక్రమ మైనింగ్‌పై కేవలం 38 కేసులు నమోదు చేయగా, 2019 నుంచి 2023 వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం వల్ల 96 కేసులు నమోదయ్యాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు 2014–19 మధ్య కాలంలో బినామీల ద్వారా పెద్ద ఎత్తున లేటరైట్ అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దానిపైనా చర్యలు తీసుకుని జరిమానా విధించామన్నారు. సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పలు సంస్కరణల వల్ల మైనింగ్ ఆదాయం భారీగా పెరిగిందన్నారు. 2018–19 ఆరి్థక సంవత్సరంలో వార్షిక మైనింగ్ రెవెన్యూ రూ.1,950 కోట్లు కాగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.4,756 కోట్లకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో గ్రావెల్, రోడ్ మెటల్ మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని కొందరు పనికట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో 41.62 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ.12.62 కోట్ల మైనింగ్ ఆదాయం లభించిందని చెప్పారు. 2019–22 వరకు రాష్ట్రంలో 1.25 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 65.24 కోట్ల ఆదాయం లభించిందన్నారు. గత ప్రభుత్వం కంటె ఈ ప్రభుత్వంలో మూడేళ్ళలోనే నాలుగు రెట్లు అధికంగా ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. -
‘సుల్యారీ’లో 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
సాక్షి, అమరావతి : ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలోని సుల్యారీ బొగ్గు గని నుంచి తొలి ఏడాదిలోనే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది. ప్రారంభమైన తొలి ఏడాదిలోనే ఇంత బొగ్గు తవ్వడం శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీఎండీసీ జాతీయ స్థాయి మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా మారుతోందనడానికి ఇది నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ సంస్థలు, కేంద్ర మైనింగ్ సంస్థలతో పోలిస్తే మైనింగ్ పురోగతిలో ఏపీఎండీసీ ముందంజలో ఉందని అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ బొగ్గు గనిలో 2021, ఏప్రిల్ నెలలో బొగ్గు తవ్వకాలను ఏపీఎండీసీ లాంఛనంగా ప్రారంభించింది. స్థానికంగా నెలకొన్న ఇబ్బందులు, కోర్టు కేసులన్నింటినీ పరిష్కరించుకుని 2022, మార్చి నుంచి పూర్తిస్థాయిలో తవ్వకాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది మార్చి నాటికి 1.9 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. దీనిద్వారా రూ.483.5 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లోనే 8 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,624 కోట్ల రెవెన్యూ సాధించాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకుని పనిచేస్తోంది. సుల్యారీ బొగ్గు గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును దాదాపు 22 సంవత్సరాలపాటు వెలికితీసేందుకు అవకాశం ఉంది. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఏపీఎండీసీ ముందుకెళుతోంది. అలాగే ఝార్ఖండ్‌లోని బ్రహ్మదియా గనిలో కూడా కోకింగ్ కోల్ మైనింగ్‌ను ఈ సంవత్సరం జూలైలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం ముందుచూపు నిర్ణయాలే కారణం రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలైన మొదటి ఏడాదే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఆయన దూరదృష్టం కారణం. ఈ బొగ్గు గని ద్వారా మున్ముందు మంచి ఫలితాలు రానున్నాయి. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాం. సుల్యారీ బొగ్గు గనుల తవ్వకాల ద్వారా ఏపీఎండీసీ జాతీయ స్థాయిలో పరిధిని విస్తరించుకోవడంతోపాటు సత్తా చాటుకుంది. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
బీఆర్ఎస్ మీటింగ్‌లో అన్నం గిన్నె మోసిన ఎస్సై
హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సై వెంకటరెడ్డి అన్నం గిన్నె మోస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవు తోంది. హుజూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వెంకటరెడ్డి బందోబస్తు కోసం వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి అన్నం గిన్నెను మోయడం చర్చనీయాంశమైంది. ‘అక్కడ చాలామంది కార్యకర్తలు ఉన్నా కూడా ఓ ఎస్సై ఇలా ప్రవర్తించడం విస్మయానికి గురిచేసిందని, హుజూర్‌నగర్‌లో పోలీసులు చివరికి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లలో అన్నం గిన్నెలు మోసే స్థితికి దిగజారారు, ఇంకా ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందా’అంటూ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సామాజిక మాధ్యమాలలో కామెంట్ పోస్టు చేశారు. ఈ విషయమై సదరు ఎస్సై వివరణ ఇస్తూ..భోజనం కోసం కార్యకర్తల మధ్య గొడవ జరుగుతుండగా వారిని అదుపు చేయడం కోసమే అన్నం గిన్నెను పక్కకు జరిపామని చెప్పారు. -
సీనరేజి వసూళ్లపై వక్రభాష్యం
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురదచల్లే ఉద్దేశంతోనే ‘ఖనిజాల సీనరేజి వసూళ్లు ప్రైవేటుపరం’ అంటూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచేలా పూర్తి అవాస్తవాలతో అందులోని రాతలు ఉన్నాయంటూ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అవినీతి, అలసత్వాన్ని పూర్తిగా తొలగించాలనే మంచి ఉద్దేశంతో పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గనుల శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలతో రాష్ట్రంలో మైనింగ్ కార్యక్రమాలు పెరిగాయన్నారు. తద్వారా అటు ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ, ఇటు పరిశ్రమలకు అవసరమైన ఖనిజాల లభ్యత, పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఆ ప్రకటనలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. అధ్యయనం తరువాతే.. ఇతర రాష్ట్రాలు చిన్నతరహా ఖనిజాల సీనరేజి వసూళ్లను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా మైనింగ్ రెవెన్యూలో స్థిరత్వం, పురోగతి సాధిస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వం ఇచి్చన ఆదేశాలతో గనుల శాఖకు చెందిన మైనింగ్ అధికారులు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి ఈ విధానాన్ని అధ్యయనం చేశారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని నివేదించడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీనరేజి వసూళ్ల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువమంది టెండర్లలో పాల్గొనేలా నిబంధనలను సరళతరం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని మైనింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్–2017కు అనుగుణంగానే ప్రభుత్వం రిజర్వు ధర, సరళమైన నిబంధనలను అమలులోకి తెస్తూ టెండర్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనలతో నిర్వహించిన టెండర్లలో 5 జిల్లాలకు టెండర్లు ఖరారయ్యాయి. మొదట సాంకేతిక బిడ్‌ను పరిశీలించి అందులో అర్హులైన వారిని మాత్రమే ఫైనాన్షియల్ బిడ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నాం. కోట్ చేసిన వాటిలో అధిక మొత్తం నుంచి ఆక్షన్ ప్రారంభమవుతుంది. అంతకంటే ఎక్కువ ఎవరైతే కోట్ చేస్తారో వారికే టెండర్ దక్కుతుంది. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తుంటే ‘ఈనాడు’ పనిగట్టుకుని అబద్ధాలతో ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టెండర్లలో ‘ఈనాడు’ పాల్గొనవచ్చు టెండర్లలో బిడ్లు దాఖలు చేసిన సంస్థల అర్హతలను మాత్రమే గనుల శాఖ పరిశీలిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈనాడు పత్రికకు కనీసం ఈ విషయం తెలియకపోవడం బాధాకరం. ఆసక్తి ఉంటే ఈ టెండర్లలో ఈనాడు సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొనవచ్చు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం . రాష్ట్రంలో ఖనిజాలను రవాణా చేసే వాహనాలను ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పర్యవేక్షిస్తూ సీనరేజి వసూళ్లలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ పెరుగుతుంది. మైనింగ్‌పై పటిష్ట పర్యవేక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్ బృందాన్ని నియమించేలా ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇంత మంచి విధానాన్ని అమలు చేస్తుంటే అవగాహన లేకుండా ఈనాడు పత్రిక వక్రీకరణ కథనాలను ప్రచురించడం సరికాదు. -
‘లోకేష్ యువగళం.. యువగంగాళంలా మారిపోయింది’
సాక్షి, అమరావతి: విభజన చట్టానికి చంద్రబాబు వక్రభాష్యం చెబుతున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శివరామకృష్ణన్, శ్రీకృష్ణ, బూస్టన్ కమిటీలు వికేంద్రీకరణే అవసరమన్నాయన్నారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానికే లేదంటున్నాడు చంద్రబాబు. మరి అమరావతిని నిర్ణయించే అధికారం మీకు ఎవరిచ్చారు? అని వెంకటరెడ్డి ప్రశ్నించారు. ‘‘లోకేష్ యువగళం.. యువగంగాళంలా మారిపోయింది. లోకేష్ పాదయాత్ర కామెడీగా మారింది. లోకేష్ అడ్డదారిలో వచ్చి మంత్రి పదవులు సాధించాడు. మళ్లీ గెలవలేక పారిపోయాడు. పాదయాత్ర అంటే అదొక ఫీలింగ్. పేదలను అక్కున చేర్చుకోవటం, వారి సాధక బాధకాలు అర్థం చేసుకోవాలి. అడ్డదారిలో తిరిగే లోకేష్‌కి అవేమీ తెలియవు. చంద్రబాబు చేసినన్ని బ్రోకర్ పనులు మరెవరూ చేయలేదు’’ అంటూ వెంకటరెడ్డి దుయ్యబట్టారు. చదవండి: నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’ -
ఏపీఎండీసీ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ను మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) సహకారంతో ఈ సంస్థను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకోసం అస్కీతో ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. సోమవారం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వీజీ వెంకటరెడ్డి, సలహాదారు డీఎల్ఆర్ ప్రసాద్ హైదరాబాద్‌లోని అస్కీ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం పునర్వ్యవస్థీకరణ ఒప్పందంపై ఏపీఎండీసీ తరఫున వీజీ వెంకటరెడ్డి, అస్కీ నుంచి రిజిస్ట్రార్ ఓపీ సింగ్, ప్రొఫెసర్ హర్ష శర్మ సంతకాలు చేశారు. ఏపీఎండీసీ నిర్వహణ సామర్థ్యం, ఉద్యోగుల నైపుణ్యాలను మరింత పెంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల ప్రకారం ఈ ఒప్పందం జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు. ఒప్పందంలో భాగంగా అస్కీ ఏపీఎండీసీ పనితీరును అధ్యయనం చేసి 3 నెలల్లో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. కార్పొరేట్ సంస్థలకు దీటుగా వార్షిక లక్ష్యాల సాధన, అధికారులు, ఉద్యోగుల పనితీరు, కెరీర్ ప్రోగ్రెషన్ ప్రణాళికను అమలు చేయడంపై విధి విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సీఎం జగన్ నిర్ణయాలతో ఇప్పటికే బలమైన సంస్థగా ఏపీఎండీసీ సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో ఏపీఎండీసీ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బలమైన సంస్థగా ఎదిగింది. పారదర్శక విధానాలు అవలంబిస్తూ, జాతీయ స్థాయిలో కోల్ ఇండియా, సింగరేణి వంటి సంస్థలతో పోటీ పడి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థగా అరుదైన గుర్తింపును అందుకుంది. బెరైటీస్ ఉత్పత్తి, విక్రయాల్లో మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. గ్రానైట్, బాల్ క్లే, కాల్సైట్, సిలికాశాండ్ వంటి ఖనిజాల ఉత్పత్తిలోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీలో బొగ్గు గనులను నిర్వహిస్తోంది. త్వరలో జార్ఖండ్‌లోని బ్రహ్మదియాలో కోకింగ్ కోల్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ పురోగతిని శాస్త్రీయంగా మదింపు చేసి, అధికారులు, ఉద్యోగుల వృత్తి నైపుణ్యాలు, మార్కెటింగ్ వ్యూహాలు, జాతీయ – అంతర్జాతీయ దృక్పథం, మార్కెటింగ్ ఎత్తుగడలను సరైన విధానంలో అనుసరించేందుకు అస్కీ సహకారం తీసుకోనుంది. ఏపీఎండీసీ పునర్వ్యవస్థీకరణతో సంస్థ రూపురేఖలు మారతాయని, సంస్థాగత సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని వీసీ, ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. -
సీఎం జగన్ పోర్టుల నిర్మాణానికి అత్యంత ప్రధాన్యం ఇస్తున్నారు: వెంకటరెడ్డి
-
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి పతకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్ సేవా పతకం(ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్–పీపీఎం) లభించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల వేళ కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఉత్తమ సేవలు–2020 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది. ఈ పతకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందజేయనున్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్న సంగతి తెల్సిందే. రాజేంద్రనాథ్‌రెడ్డి గతంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌తోపాటు పలు హోదాల్లో విధులు నిర్వహించారు. వెంకటరెడ్డికి ఐపీఎం రిటైర్డ్ ఏఎస్పీ నల్లమిల్లి వెంకటరెడ్డి తన సర్వీస్ కాలంలో అందించిన ఉత్తమ సేవలకు కేంద్ర హోం శాఖ ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) ప్రకటించింది. సబ్ ఇన్స్పెక్టర్ 1989 బ్యాచ్‌కు చెందిన వెంకటరెడ్డి పోలీస్ శాఖలో విశిష్టమైన సేవలందించారు. సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీగా అనేక హోదాల్లో విధులు నిర్వర్తించిన ఆయన పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసుకున్నారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో గతేడాది ఆయన అందించిన సేవలకు కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వెంకటరెడ్డి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. -
బీచ్ శాండ్ మైనింగ్ ఎక్కడాలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తాజాగా వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మైనింగ్ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2019 నుంచి ఎక్కడా బీచ్ శాండ్ మైనింగ్ జరగడంలేదని స్పష్టంచేశారు. అసలు మైనింగ్ ఆపరేషన్స్ జరగనప్పుడు మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2019కి ముందు రెండు ప్రైవేటు సంస్థలు బీచ్ శాండ్ మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాయని.. 2019లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో హెవీ మినరల్ బీచ్ శాండ్ మైనింగ్ పూర్తిగా నిలిపివేశామన్నారు. ఇటీవల బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర గనుల శాఖను అణు ఇంధన శాఖ కోరిందని తెలిపారు. ఐబీఎం విచారణలో ఆ సంస్థలు మైనింగ్ నిర్వహించిన కాలంలో ఏవైనా అక్రమాలకు పాల్పడి ఉంటే అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. అక్రమాలు వాస్తవమని నిర్ధారణ జరిగితే బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆ రెండింటి అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు ఇక బీచ్ శాండ్ మైనింగ్ కోసం గత ఏడాది కేంద్ర అణుశక్తి సంస్థ (డీఏఈ)కు ఏపీఎండీసీ 16 ప్రతిపాదనలను సమర్పించిందని వెంకటరెడ్డి తెలిపారు. దానిలో విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో 90.15 హెక్టార్లు, కృష్ణాజిల్లా మచిలీపట్నం తీరప్రాంతంలో 1,978.471 హెక్టార్లలో రెండు బీచ్ శాండ్ డిపాజిట్లకు ఏపీఎండీసీని ప్రాస్పెక్టివ్ లెస్సీగా డీఏఈ నియమించిందని తెలిపారు. ఇక్కడ మైనింగ్ జరిపేందుకు అనుమతుల కోసం ఏపీఎండీసీ దరఖాస్తు చేసుకుందన్నారు. అయితే, ఆ అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంవల్ల కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బ్లాక్‌లలో ఇప్పటివరకు ఎటువంటి మైనింగ్ ప్రారంభం కాలేదని ఆయన స్పష్టంచేశారు. హెవీ మినరల్ బీచ్ శాండ్‌లో మొనాజైట్ అవశేషాలు జీరో శాతం మాత్రమే ఉండాలని, అంతకుమించి ఉన్నట్లు నిర్ధారణ అయితే సదరు మైనింగ్ లీజులను రద్దుచేయాలంటూ కేంద్రం 2019 మార్చి ఒకటిన మెమో ద్వారా రాష్ట్రానికి ఆదేశాలు ఇచ్చిందన్నారు. దాని ప్రకారం మన రాష్ట్రంలోని బీచ్ శాండ్‌లో మొనాజైట్ శాతం కేంద్రం నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఉన్నందున అన్ని బీచ్ శాండ్ లీజులను గనుల శాఖ రద్దుచేసిందని వెంకటరెడ్డి ఆ ప్రకటనలో వివరించారు. కేంద్రానికి ఏపీ సమగ్ర వివరణ ఇక బీచ్ శాండ్ మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా వ్యక్తంచేసిన సందేహాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12న కేంద్ర అణు ఇంధన శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ జరుగుతోందని, దాని ద్వారా పర్యావరణానికి నష్టం, మైనింగ్ చట్టాలకు విఘాతం, మొనాజైట్ అక్రమ రవాణా జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్రానికి సమర్పించిన నివేదికలోనే స్పష్టంచేసిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
మద్యంపై చంద్రబాబు తప్పుడు విమర్శలు: కారుమూరి వెంకటరెడ్డి
సాక్షి, తాడేపల్లి: మద్యంపై చంద్రబాబు నాయుడు తప్పుడు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు.అవాస్తవ ఆరోపణలతో ప్రభుత్వంపై బురదజల్తె ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఆదివారం మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్రానికి ఆదాయం రాకూడదన్న ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క లిక్కర్ బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. బ్రాండ్లన్ని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవే అని చెప్పారు. మద్యం కంపెనీలన్నీ టీడీపీ నాయకులవే అని దుయ్యబట్టారు.