‘లోపలి మట్టి’ని సేకరించి పెట్టుకున్నారా? | "The interior of the soil, 'Are you collect? | Sakshi
Sakshi News home page

‘లోపలి మట్టి’ని సేకరించి పెట్టుకున్నారా?

Published Mon, Jun 16 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

‘లోపలి మట్టి’ని సేకరించి పెట్టుకున్నారా?

‘లోపలి మట్టి’ని సేకరించి పెట్టుకున్నారా?

భూమి లోపలి మట్టిని తవ్వి ఎండబెట్టి, ఆ పొడి మట్టినే ఎరువుగా వినియోగిస్తూ.. సికింద్రాబాద్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట రెడ్డి (98480 90576) వరి, గోధుమ, ద్రాక్ష పంటలను పండిస్తున్నారు. ఈ పద్ధతిపై ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ శీర్షికన ఏప్రిల్ 7న ‘సాగుబడి’లో  కథనం ప్రచురి తమైన సంగతి తెలిసిందే.  ఆయన ఇలా చెబుతున్నారు: ‘ఖరీఫ్‌లో మీరూ ఈ పద్ధతిలో పంటలు పండించాలనుకుంటే.. గుంత తవ్వి (పైన అడుగు లోతు మట్టి వద్దు) లోపలి మట్టిని తీసి..

తేమ పూర్తిగా ఆరిపోయే వరకు ఎండ బెట్టండి. మట్టి ఈ క్రమంలో వాతావరణంలోని నత్రజనిని గ్రహిస్తుంది. దాన్ని తడవకుండా గోదాములో/ ఆరుబయట కుప్ప చేసి టార్పాలిన్ షీట్/ గడ్డి/ తాటికమ్మలు వంటివి కప్పి నిల్వ చేసి వాడుకోవచ్చు. ఎకరా వరి సాగుకు 20-30 టన్నుల ‘మట్టి ఎరువు’ అవసరం ఉంటుంది.’
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement