Earth
-
ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది?
ప్రపంచంలో అత్యంత ఖరీదైంది అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్లాటినం, వజ్రాలు, బంగారం వగైరా గుర్తొస్తాయి. కానీ వీటన్నింటికి మించి షాకింగ్ ధర పలికే వస్తువు ఒకటి ఉంది. దాని పేరు ఎప్పుడైనా విన్నారా? అంత రేటు పలకడానికి గల కారణాలు ఏంటి? భూమిలో పుడుతుందా? లేకపోతే ల్యాబ్‌లో తయారువుతుందా? తెలుసుకుందాం.ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం పేరు యాంటీమాటర్ (Antimatter) దీని ఒక్కో గ్రాము ధర వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఏదో ఒకటీ, రెండు వేలు, కాదు, కోట్లు అంతకన్నా కాదు. ఏకంగా రూ. 53 వేల కోట్లు (62 ట్రిలియన్ డాలర్లు). ఒక్క గ్రాములో అతి తక్కువ పరిమాణంలో తయారీకి లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. మిగతా ఖరీదైన పదార్థాల్లా దీనిని భూమి నుంచి తవ్వి తీయడానికి కుదరదు. దానిని సృష్టించడం, నిల్వ చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకొని ఉంటుంది. దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.. ఇది అందుబాటులోకి వస్తే అంతులేని శక్తి ఉత్పత్తికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.బంగారం, వజ్రాలు లేదా అరుదైన లోహాల మాదిరిగా కాకుండా, యాంటీమ్యాటర్‌ను భూమి నుండి తవ్వలేరు. దీనికి బదులుగా దీనిని అత్యంత నియంత్రిత వాతావరణంలో అణువు ,అణువును కలుపుతూ అత్యంత జాగ్రత్తగా తయారు చేయాలి. ఈ ప్రక్రియలో ఒక గ్రాములో కొంత భాగాన్ని సేకరించడానికి కూడా బిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. విశ్వంలోని ఆటమ్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, సబ్ ఆటమిక్ కణాలతో కూడిన ‘మ్యాటర్’తో ఆవిర్భవించింది. ప్రతి మ్యాటర్ కణాలకు ప్రతిబింబం లాంటి (Mirror image) యాంటీమ్యాటర్ కణాలు ఉంటాయి. మ్యాటర్ కణాలకు పాజిటివ్ ఛార్జ్ ఉంటే, యాంటీమ్యాటర్ కణాలకు నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. దీని తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్క గ్రాములో పదోవంతు తయారు చేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఫలితంగా ఒక్క గ్రాము యాంటీమ్యాటర్ తయారీకి రూ.53 వేల కోట్లు ఖర్చవుతుందని 1999లో నాసా శాస్త్రవేత్త హరోల్డ్ గెర్రిష్ అంచనా వేశారు. స్విట్జర్లాండ్‌లోని ది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లిర్ రీసెర్చ్(CERN)లోని కణ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైఖేల్ డోజర్ యాంటీమాటర్ నానోగ్రామ్లో 100వ వంతు భాగం తయారీకి దాదాపు ఒక కిలోగ్రాము బంగారం రేటు అంత ఖర్చవుతుందన్నారు.సాధారణ పదార్థంతో దాని పరస్పర చర్య అనేది ప్రధానమైన ఛాలెంజ్. ఎందుకంటే పదార్థం, యాంటీమ్యాటర్ కలిసినపుడు భారీ పేలుడు సంభవిస్తుంది. ఇలా ఒకదానికొకటి నాశనం చేసుకుంటాయి. ఈ సమయంలో అపారమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే తయారైన వెంటనే ఇది అదృశ్యమైపోతుందని నమ్ముతున్నారు. అందుకే యాంటీమ్యాటర్‌ను భద్రపర్చడం, దీనిపై అధ్యయనం చేయడం చాలా కష్టతరం. తయారీ తరువాత దీన్ని శూన్యంలో ఉంచాలి, సూపర్ కూల్డ్ అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి భద్రం చేయాలి. మ్యాటర్‌తో కలవకుండా యాంటీమ్యాటర్‌ను భద్రపరిచే ప్రయత్నాలు సాగాలి. ఇది కేవలం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్షేత్రాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెర్న్ ఇప్పుడు యాంటీమ్యాటర్ తయారీకి ప్రయత్నిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నియంత్రిత వాతావరణంలో దీనిని ఉత్పత్తి చేయడానికి, శాస్త్రవేత్తలు అపారమైన శక్తిని ఉపయోగించనున్నారు. CERNలో, పరిశోధకులు శక్తివంతమైన కణ యాక్సిలరేటర్లను ఉపయోగించి ప్రోటాన్లను ఇరిడియం లక్ష్యంతో ఢీకొట్టే ముందు అధిక వేగంతో ముందుకు నడిపిస్తారు. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)యాంటీ మ్యాటర్‌పై అధ్యయనాలుయాంటీ మ్యాటర్ అంతులేని శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అంతరిక్ష పరిశోధనలకు దీనిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యాంటీమాటర్ ఉత్పత్తిలో ఉన్న కష్టం, ఖర్చును దృష్టిలో ఉంచుకుని, శాస్త్రవేత్తలు ఈ అంతుచిక్కని పదార్ధంపై తీవ్ర పరిశోధనలను కొనసాగిస్తున్నారు.విశ్వం ప్రారంభంలో సమాన మొత్తంలో పదార్థం, యాంటీమాటర్ సృష్టించబడ్డాయని శాస్త్రవేత్తలు విశ్వాసం. అవి ఒకదానికొకటి పూర్తిగా నాశనం చేసుకుని ఉండి ఉంటే, ఎలాంటి మ్యాటర్ మిగిలి ఉండకపోతే నేడు మనం చూస్తున్న గెలాక్సీలు, నక్షత్రాలు , గ్రహాలు ఎలా ఉండేవి అనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ మనకు కనిపించకుండా యాంటీమ్యాటర్ గెలాక్సీలు దాగి ఉన్నాయా? దీన్ని అర్థం చేసుకోవడానికే ఈ పరిశోధనలు. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం -
మీ వాటా బంగారం.. మూడు తులాలు!
పసిడి ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో అని భారంగానే నడుస్తోంది. అయితే.. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ఎంత బంగారం ఉందో మీకు తెలుసా?. కేవలం 2, 44,000 మెట్రిక్ టన్నులు మాత్రమే!. అవును.. ఈ భూమ్మీద బంగారు గనుల నుంచి 244,000 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే గనుల నుంచి బయటకు వెలికి తీయబడింది. ఇందులో ఎక్కువగా.. చైనా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి వెలికి తీసిందే. అయితే.. ఇంత బంగారాన్ని ఒకవేళ భూమ్మీద ఉన్న మనుషులందరికీ పంచగలిగితే!.. భూమ్మీద అధికారికంగా ఇప్పుడున్న ప్రతీ మనిషికి బంగారం గనుక పంచితే(Gold Distribution On Earth).. దాదాపు 30 గ్రాముల(ట్రాయ్ ఔన్స్) దాకా పంచొచ్చట. ప్రపంచ జనాభా.. 816 కోట్లుగా ఓ అంచనా వేసుకుంటే.. ఈ బంగారం ఇలా సరిపోతుందని విజువల్ క్యాపిటలిస్ట్కు చెందిన వోరోనోయి యాప్ లెక్కకట్టి తేల్చింది. 👉అయితే.. అత్యధిక బంగారు నిల్వలు(Gold Reserves) ఉన్నది మాత్రం అమెరికాలో. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఆ తర్వాతి ప్లేస్‌లో ఉన్న చైనా.. తన నిల్వలను క్రమంగా పెంచుకుంటూ పోతోంది. బంగారు నిల్వల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. 👉ఒకప్పుడు బంగారం ఉత్పత్తి(Gold Production) అంటే.. దక్షిణాఫ్రికా పేరు ప్రముఖంగా వినిపించేది. 1900-1970 మధ్య ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసిన దేశంగా నిలిచిందది. ఒకానొక టైంలో ఏడాదికి 1,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రారాజుగా వెలుగొంది. అయితే.. ఇప్పుడు బంగారం ఉత్పత్తిలో చైనా అద్భుతాలు సృష్టిస్తోంది. 👉అమెరికా, ఆస్ట్రేలియా తరహాలో భారీ బంగారు గనులు లేకపోయినా ఉన్న గనుల నుంచే అత్యధికంగా బంగారాన్ని వెలికి తీస్తోంది. కిందటి ఏడాదిలో రికార్డు స్థాయిలో 380 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బయటకు తీసి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ట్రంప్‌కు గిఫ్ట్‌గా.. భూమ్మీద నరకం..?
ఎల్ సాల్వడార్ మహా కారాగారం... ప్రపంచంలోనే అత్యంత అధ్వాన జైలుగా ‘అప్రసిద్ధి’. ఖైదీలు ఈ జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడం అసంభవం. 60 ఏళ్లు మొదలుకొని వెయ్యేళ్లకు పైగా కారాగారవాస శిక్షలు పడిన ఖైదీలు ఇక్కడ ఉంటారు. వెయ్యి మంది అధికారులు, 600 మంది సైనికులు, 250 మంది పోలీసులు ఈ జైలును పర్యవేక్షిస్తుంటారు. స్టీలుతో పెట్టెల్లా తయారుచేసిన బోనుల్లాంటి నాలుగు అరల పడకల్లో (మెటల్ బంక్ బెడ్స్) ఖైదీలు దాదాపు రోజంతా మోకాళ్లపై వంగి కూర్చోవాలి లేదా చతికిలబడి కూర్చోవాలి. పరుపులు ఉండవు. వారు గుసగుసలాడుకోవాల్సిందే తప్ప పెద్దగా మాట్లాడుకునేందుకు అనుమతించరు. భోజనంగా మూడు పూటలా వరి అన్నం, బీన్స్, పాస్టా, ఉడికించిన గుడ్డు పెడతారు. మాంసం వడ్డించరు.ఎల్ సాల్వడార్లో 1990వ దశకం చివర్లో ఎంఎస్-13, బారియో 18 అనే రెండు గ్యాంగులు మాదకద్రవ్యాల వ్యాప్తి, బలవంతపు వసూళ్లతో చెలరేగాయి. పరస్పరం ప్రత్యర్థులైన ఈ రెండు ముఠాలు దేశాన్ని వణికించాయి. అయినా ప్రస్తుతం జైల్లో మాత్రం ఈ రెండు గ్రూపుల సభ్యుల్ని కలిపే ఉంచుతున్నారు. గ్వాంటనామో బే కారాగారం కంటే ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. శిక్షాకాలం ముగిసినా ఖైదీలను సమాజంలోకి విడిచిపెట్టరు. వారు బయటి ప్రపంచాన్ని చూసే అవకాశమే లేదు. ఒకరకంగా చెప్పాలంటే వారు జీవచ్ఛవాలు! తమ దేశంలో హింసకు పాల్పడే ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన అనైతికమని, న్యాయసమ్మతం కాదని ఆయన రాజకీయ విరోధులు విమర్శిస్తున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రశాంత నియంత’ (వరల్డ్స్ కూలెస్ట్ డిక్టేటర్) గా తనను తాను అభివర్ణించుకునే ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకేలే మాత్రం తమ జైలు సేవలకు ప్రతిగా అమెరికా అందించే ‘ఆఫర్’ కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. ఇంతకీ అమెరికా ఆఫర్ ఏమిటి? ఏ రూపంలో? ఎంత? వివరాలు బయటికి రాలేదు! -
గిరగిరా తిరుగుతున్న భూమి
-
రూ. 31 లక్షలు ఖర్చుపెట్టి మరీ యూట్యూబర్ ప్రయోగం : ఎందుకో ఊహించలేరు
భూమి ఫ్లాట్‌గా ఉందని నిరూపించడానికి యూట్యూబర్ అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా రూ. 31 లక్షలతో యాత్ర చేశాడు. చివరికి ఏమైంది? ఆసక్తిగా ఉంది కదూ. పదండి అసలేమైందో ఈ కథనంలో తెలుసుకుందాం.భూమి బల్లపరుపుగా లేదా ఫ్లాట్‌గా ఉంటుందని గట్టిగా వాదన ఇప్పటిది కాదు. అయితే ఫ్లాట్‌గా ఉంటుందని గట్టిగా నమ్మేవాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఫ్లాట్ ఎర్త్ సిద్ధాంతాలపై పేరుగాంచిన యూట్యూబర్ జెరన్ కాంపనెల్లా (Jeron Campanella) భూమి ఆకారం గుండ్రంగా లేదు అని తేల్చాలను కున్నాడు. తన వాదనలను ధృవీకరించడానికి అంటార్కిటికాకు రూ. 31.4 లక్షల (37,000 డాలర్లు) ఖర్చుతో కూడిన యాత్ర చేశాడు.NEW: Flat Earther travels all the way to Antarctica to prove that the Earth is flat only to find out that it's not.Lmao.Flat Earth YouTuber Jeran Campanella went on a $35,000 trip to prove that there was "no 24-hour sun.""Sometimes you are wrong in life and I thought there… pic.twitter.com/8jvLWawB2J— Collin Rugg (@CollinRugg) December 18, 2024తన ప్రయాణానికి ముందు, కాంపనెల్లా అంటార్కిటికాలో ఉదయాస్తమాలు లేకుండా సూర్యుడు 24 గంటలూ ఉంటాడనే సిద్ధాంతాన్ని నమ్మలేదు. దక్షిణ ఖండానికి అతని పర్యటన ఈ నమ్మకాలను బద్దలు కొట్టింది.కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలో తన నమ్మకాన్ని పరీక్షించడానికి కాలిఫోర్నియా(California) నుంచి దాదాపు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి అంటార్కిటాకు చేరాడు. అక్కడ మిడ్నైట్ సన్ని చూసి షాక్ అయ్యాడు. “అంటార్కిటికా ఓ మంచు గోడ, సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, అస్తమిస్తాడు” అన్న తన నమ్మకం నిజంకాదని తేల్చుకున్నాడు. "కొన్నిసార్లు జీవితంలో తప్పు చేస్తాం," అంటూ కాంపనెల్లా తన పర్యటన తర్వాత ఒక వీడియోను షేర్ చేశాడు. తన తప్పును అంగీకరిస్తూ, ఫ్యాన్స్‌కు వివరణ ఇచ్చాడు "ఇలా చెప్పినందుకు నన్ను షిల్ అని పిలుస్తారని నాకు తెలుసు. అయినా నష్టంలేదు, నిజాయితీగా ఉండటం ముఖ్యం" అంటూ అసలు విషయాన్ని అంగీకరించాడు.ట్విస్ట్ ఏంటంటే...తన ఫ్లాట్ ఎర్త్ మ్యాప్ తప్పని తేలిందని అంగీకరించిన కాంపనెల్లా చేసిన మరో ప్రయోగం కూడా ఉంది. కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలోని ‘ది ఫైనల్ ఎక్స్పెరిమెంట్’ అనే కార్యక్రమంలో భాగమే ఈ పర్యటన. భూమి ఫ్లాట్‌గా ఉందని నమ్మే నలుగురు మిడ్నైట్ సన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అంటార్కిటికాకు వెళ్లారు. చివరికి భూమి గోళాకారమని శాస్త్రీయంగా నిరూపించారు. ‘‘ఈ ప్రయోగంతో భూమి ఫ్లాట్‌గా ఉందనే వాదనకు ముగింపు పలకవచ్చు”అని డఫీ ధీమాగా చెప్పారు. దీంతో భూమి ఆకారాన్ని దాచడానికి ఎవరినీ అనుమతించరని ప్రచారంలో ఉన్న వాదనలకు కూడా చెక్‌పడింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా అంటార్కిటికాను సందర్శించవచ్చని తేలింది.భూమి గోళాకారంలో అనడానికి నిదర్శనంగా అంటార్కిటికాలో దక్షిణ వేసవిలో సూర్యుడు అస్తమించడు. ఇక్కడ వేసవిలో సూర్యుడు 24 గంటలూ కనిపిస్తాడు. ఈ దృగ్విషయం, ధ్రువ ప్రాంతాలకు ప్రత్యేకమైనది. కాగా గతంలో భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందని నమ్మే ఓ అమెరికన్ పైలట్ తన అభిప్రాయం నిజమని నిరూపిస్తానంటూ ఈ రాకెట్ ప్రయోగం చేపట్టిన సంగతి గుర్తుందా? సొంతంగా తయారు చేసిన ఆవిరితో ప్రయాణించే రాకెట్ ద్వారా యాత్ర చేపట్టాడు. కానీ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో 64 ఏళ్ల 'మ్యాడ్' మైక్ హ్యూజ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. -
16గంటల.. సుదీర్ఘరాత్రి
తిరుపతి సిటీ: సాధారణంగా శీతాకాలంలో పగలు తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. ఏటా వేసవిలో భూమి సూర్యుడికి దగ్గరగా, శీతాకాలంలో భూమి సూర్యుడికి దూరంగా కక్ష్య దిశలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఏర్పడే ప్రక్రియనే వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అంటారు. ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్ 21న వింత చూడబోతున్నాం. ఆ రోజు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడనుంది. ఏకంగా 16 గంటల పాటు రాత్రి సమయం, 8గంటల పాటు పగలు సమయం మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాల అయనాంతం (వింటర్ సోల్స్టైస్) అంటారు. సూర్యుడికి సుదూరంగా భూమి శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఆ రోజున భూమి ధ్రువం వద్ద 23.5 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024లో అత్యంత తక్కువ సమయం పగలు ఉంటుంది. దీంతో సూర్యకాంతి 8 గంటలు, చంద్రుడి కాంతి 16 గంటల వరకు ఉంటుంది. భూమి తన అక్ష్యం వైపు తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి, సూర్యుడి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడే దానినే అయనాంతరం అంటారు. సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉండే రెండు బింధువులను అయనాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో పొడవైన రోజు (వేసవి కాలపు అయనాంతం), అతి తక్కువ రోజు (శీతాకాలపు అయనాంతం) వస్తుంది. ఇది ఏటా రెండుసార్లు జరిగే ఘట్టం. సంవత్సరం పొడవునా, ఉత్తర లేదా దక్షిణ అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. వేసవి కాలపు అయనాంతం అనేది అత్యంత పొడవైన రోజు. అయనాంతంపై ప్రగాఢ నమ్మకాలు శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలో పలురకాల నమ్మకాలను ప్రజలు పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధమతంలోని యన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర భారత్‌లో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పుష్య మాస పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇదో వింత అనుభూతి భూ భ్రమణంలో భాగంగా సూర్యుడు, భూమి మధ్య దూరం ఏడాదిలో ఒక్కసారి పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. వేసవిలో సూర్యుడికి దగ్గరగానూ, శీతాకాలంలో సూర్యుడికి దూరంగా భూభ్రమణం జరుగుతుంటుంది. భూమి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేసవి అయనాంతంగానూ, సూర్యుడికి సుదూరంగా భూభ్రమణం జరిగినప్పుడు శీతాకాలపు అయనాంతంగా పేర్కొంటారు. – నెహ్రూ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, రీజినల్ సైన్స్ సెంటర్21న తగ్గనున్న ఉష్ణోగ్రతలు శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటుంది. అయితే, కచి్చతంగా డిసెంబర్ 20 నుంచి 23 తేదీలలోపు మాత్రమే వస్తుంటుంది. ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో సూర్యకిరణాలు అలస్యంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలలో మార్పులు సంభవించి, దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. -
భూమివైపు దూసుకొస్తున్న ఐదు భారీ గ్రహశకలాలు
అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అంతరిక్ష పరిశోధనలు సాగిస్తుంటుంది. ఈ నేపధ్యంలో ఖగోళంలో జరిగే దృగ్విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటుంది.తాజాగా నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఐదు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. ఈ ఖగోళ శకలాలు 2024, డిసెంబరు 11న భూమిని దాటుతాయని తెలిపింది. వీటివలన భూమికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని నాసా తెలిపింది. నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై అధ్యయనం చేసేందుకు ఇది సదవకాశంగా భావిస్తున్నారు. ఆ గ్రహశకలాల వివరాలను శాస్త్రవేత్తలు తెలియజేశారు.గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3.. ఈ సమూహంలో అతిపెద్దది. దాదాపు 811 అడుగుల ఎత్తు కలిగిన ఇది విమానం సైజును పోలి ఉంటుంది. ఇది 4 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటనుంది. శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం నిర్మాణాన్ని, కదలికలను అధ్యయనం చేయనున్నారు.గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11.. ఎక్స్‌యూ 3 కంటే కొంచెం చిన్నది. 71 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది భూమికి 2.112 మిలియన్ మైళ్లు దూరం నుంచి దాటనుంది.గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11 ఈ సమూహంలో అతి చిన్నది. కేవలం 20 అడుగుల పరిమాణంతో, 7,35,000 మైళ్ల దూరం నుంచి భూమిని దాటుతుంది. దీని పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ, దీని పరిశోధనలో అనేక విషయాలు వెల్లడికానున్నాయి.గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1 పరిమాణంలో ఒక బస్సును పోలి ఉంటుంది. 31 అడుగుల పరిమాణంతో, ఇది భూమికి 1.16 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14 వెడల్పు 86 అడుగులు. ఇది 4.3 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటుతుంది. నాసా తన ప్రయోగశాల నుండి ఈ గ్రహశకలాలను పర్యవేక్షిస్తోంది. శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక.. -
చంద్రుడు మన మామ కాదా?
‘చందమామ రావే.. జాబిల్లి రావే..’, ‘మామా.. చందమామా..’ అని పాటలున్నాయి. ‘కార్తీక పున్నమి వేళలోనా..’ అంటూ గీతాలూ ఉన్నాయి.. చంద్రుడి వెన్నెల తగలగానే రూపమే మారిపోయే జానపద కథలు మరెన్నో ఉన్నాయి.. ఏ దేశం, ఏ సంస్కృతి అనే తేడా లేకుండా చంద్రుడు మనందరికీ అంత దగ్గరైపోయాడు. కానీ చంద్రుడు మనవాడు కాదని, అంతరిక్షంలో తిరుగుతూ ఉంటే.. భూమి లాగేసి పట్టేసుకుందని శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు. దీన్ని బలపర్చే పలు ఆధారాలనూ చూపుతున్నారు. చంద్రుడు ఎక్కడివాడు? భూమికి ఎలా దొరికిపోయాడు? ఆ సిద్ధాంతం ఏం చెబుతోంది? దానికి ప్రాతిపదిక ఏమిటనే వివరాలు తెలుసుకుందామా..భూమి నుంచి ఏర్పడిందనే అంచనాతో..చందమామ మన భూమి నుంచే ఏర్పడిందనేది ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతం. దాని ప్రకారం.. సూర్యుడు, ఇతర గ్రహాలు ఏర్పడిన కొత్తలో.. అంగారకుడి పరిమాణంలో ఉన్న ‘థియా’అనే గ్రహం భూమిని ఢీకొట్టిందని, అప్పుడు భూమి నుంచి అంతరిక్షంలోకి విసిరివేయబడిన శకలాలు ఒకచోట చేరి చంద్రుడు రూపుదిద్దుకున్నాడు. భూమి గురుత్వాకర్షణ వల్ల గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిద్ధాంతాన్ని అందరూ విశ్వసిస్తున్నా.. ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. ఓ ‘బైనరీ గ్రహాల జంట’లో భాగమైన చంద్రుడిని భూమి లాగేసుకుని ఉంటుందని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా?చందమామ మిస్టరీలు ఎన్నో..నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపై నుంచి తెచ్చిన సుమారు 363 కిలోల రాళ్లు, మట్టిపై పరిశోధనలు చేశారు. ఆ రాళ్లు, మట్టిలో ఉన్న రసాయన సమ్మేళనాలలో కొన్ని భూమ్మీది తరహాలోనే ఉండగా.. మరికొన్ని చాలా విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. భూమి నుంచే చంద్రుడు ఏర్పడితే.. ఆ రసాయన సమ్మేళనాలు ఎక్కడివనే సందేహాలు ఉన్నాయి. మరో గ్రహం భూమిని ఢీకొట్టడంతో అంతరిక్షంలోకి ఎగిసిపడిన పదార్థాలన్నీ కాలక్రమేణా ఒకచోటికి చేరి చంద్రుడు ఏర్పడినట్టు పాత సిద్ధాంతం చెబుతోంది. కానీ అలా ఎగసిపడిన పదార్థాలు.. శని చుట్టూ ఉన్న వలయాల తరహాలో భూమి మధ్య భాగానికి ఎగువన (భూమధ్య రేఖ ప్రాంతంలో) కేంద్రీకృతం కావాలని... అవన్నీ కలిసిపోయినప్పుడు చంద్రుడు కూడా భూ మధ్య రేఖకు ఎగువనే ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చంద్రుడు భూమధ్య రేఖ కన్నా ఏడు డిగ్రీలు ఎగువన, వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తున్నాడు. మరో తోడు నుంచి చంద్రుడిని లాగేసుకుని.. సౌర కుటుంబంలో, అంతరిక్షంలో అక్కడక్కడా ‘బైనరీ’ వ్యవస్థలు ఉంటాయి. అంటే కొంచెం అటూ ఇటుగా సమాన పరిమాణం ఉన్న ఖగోళ పదార్థాలు (ఆస్టరాయిడ్లు, గ్రహాల వంటివి..) రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఆ రెండూ కలసి.. ఏదైనా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అలాంటి బైనరీ వ్యవస్థలో చంద్రుడు భాగమని కొత్త సిద్ధాంతం చెబుతోంది. ఆ బైనరీ మరుగుజ్జు గ్రహాలు భూమికి సమీ పం నుంచి వెళ్లినప్పుడు.. అందులోని చంద్రుడిని భూమి గురుత్వాకర్షణ శక్తితో లాగేసుకుందని, రెండో మరుగుజ్జు గ్రహం అంతరిక్షంలోకి విసిరివేయబడిందని పేర్కొంటోంది. అలా లాగేసుకోవడం సాధ్యమేనా? విశ్వంలో బైనరీ వ్యవస్థలు ఉండటం, అప్పుడప్పుడూ అలాంటి వాటిలోంచి ఒకదానిని పెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటివి లాక్కోవడం సాధారణమేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. దీనికి ‘బైనరీ ఎక్సే్ఛంజ్ క్యాప్చర్’గా పేరుపెట్టారు. ఇలా బైనరీ వ్యవస్థ నుంచి ఒకదాన్ని లాక్కున్నప్పుడు.. రెండో గ్రహం/ఆస్టరాయిడ్ వేగంగా విసిరివేసినట్టుగా వెళ్లిపోతుంది.నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్.. అలా లాగేసుకున్నదే! మన సౌర కుటుంబంలోనే అలాంటివి ఎన్నోసార్లు జరిగాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డారెన్ విలియమ్స్ తెలిపారు. ‘‘ఉదాహరణకు నెప్ట్యూన్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో అతిపెద్దదైన ‘ట్రిటాన్’కూడా ఒకప్పుడు బైనరీ వ్యవస్థలో భాగమే. నెప్ట్యూన్ తనకు దగ్గరగా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు.. ట్రిటాన్ను లాగేసుకుందని ఇప్పటికే గుర్తించారు. అంతేకాదు ట్రిటాన్ ఉపగ్రహం నెప్ట్యూన్ చుట్టూ.. దాని మధ్యరేఖ ఎగువన కాకుండా, 67 డిగ్రీలు వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. మన చంద్రుడు కూడా అలా వంపు తిరిగిన కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నాడు. చంద్రుడిని భూమి లాగేసుకుందనే దానికి ఇదొక ఆధారం..’’అని డారెన్ విలియమ్స్ వెల్లడించారు. కొత్త సిద్ధాంతం సందేహాలను తీర్చుతోందా? ‘‘బైనరీ వ్యవస్థ నుంచి లాగేసుకున్న గ్రహాలు/ ఆస్టరాయిడ్లు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగాలి.. లాక్కున్న గ్రహం నుంచి మెల్లగా దూరంకావాలి.. అనే రూల్స్ కూడా ఉన్నాయి. వాటిని మా సిద్ధాంతం బలపరుస్తోంది..’’అని శాస్త్రవేత్త విలియమ్స్ తెలిపారు.మొదట్లో చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరిగేవాడని.. అయితే భూమి టైడల్ ఫోర్స్ వల్ల మెల్లగా వృత్తాకార కక్ష్యకు చేరాడని వివరించారు. ఆ ఫోర్స్ వల్లే చంద్రుడి ఒకవైపు భాగం ఎప్పుడూ భూమివైపే ఉండేలా..‘టైడల్ లాక్’అయిందని తెలిపారు. అంతేకాదు చంద్రుడు సగటున ఏటా మూడు సెంటీమీటర్ల మేర భూమి నుంచి దూరంగా జరుగుతున్నాడని గుర్తు చేశారు. ఎవరేం సిద్ధాంతాలు తెస్తేనేం? ఎప్పుడో కోట్ల ఏళ్లనాటి మాట అది. ఏది కరెక్టో, ఏదికాదో కాదుగానీ.. మనుషులు పుట్టేనాటికే చంద్రుడు ఇక్కడే ఉన్నాడు. అంటే మన మామ చందమామే!– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం
ఏకంగా 70 అంతస్తుల భవనం అంత ఎత్తున్న భారీ గ్రహశకలం ఈ నెల 28న భూమికి సమీపానికి రాబోతోంది. సైంటిస్టులు దీనికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ అని పేరుపెట్టారు. ఈ నెల 28న ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్(జేపీఎల్) తొలుత గుర్తించింది. ఇది భూమికి అతి సమీపంలోకి.. అంటే 3.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 9 రెట్లు అధికం. సమీపం నుంచి దూసుకెళ్లే ఈ అస్టరాయిడ్ వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రహ శకలాలలపై మరిన్ని పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది సెకన్‌కు 9.43 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని, సమీపం నుంచే క్షుణ్నంగా పరిశీలించవచ్చని అంటున్నారు. ఇదొక అరుదైన అవకాశమని చెబుతున్నారు. భవిష్యత్తులో భూమికి సమీపంలోకి రాబోయే గ్రహ శకలాలు, వాటి నుంచి వాటిల్లే ముప్పు, ఆ ముప్పు తప్పించే మార్గాలపై అధ్యయనానికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ రాకను ఉపయోగించుకుంటామని సైంటిస్టులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపు భూమిని తాకనున్న సౌర జ్వాలలు!
సౌరప్రకోపం భూమిని అల్లాడించనుంది. సూర్యుని కొంతకాలంగా అల్లకల్లోలంగా ఏఆర్3842 సన్‌స్పాట్ మరోసారి బద్దలైంది. ఎక్స్9.1 కేటగిరీలోకి వచ్చే అత్యంత అత్యంత శక్తిమంతమైన సోలార్ ఫ్లేర్‌కు దారితీసింది. దీని దెబ్బకు భూమి ఎగువ వాతావరణమంతా పూర్తిగా అయోనీకరణం చెందింది! ఈ పేలుడు ధాటికి పుట్టుకొచి్చన శక్తిమంతమైన సౌర జ్వాలలు ఆదివారం భూమిని గట్టిగా తాకనున్నాయి. ఇప్పటికే సూర్యునిలో సంభవించిన కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) దీనికి తోడవనుంది. ఫలితంగా భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడి, పెద్దపెట్టున విడుదలయ్యే రేడియేషన్ ప్రపంచమంతటా ప్రభావం చూపనుంది. దెబ్బకు ఉపగ్రహాలతో పాటు పలు దేశాల్లో పవర్ గ్రిడ్లతో పాటు నావిగేషన్ వ్యవస్థలు కూడా మొరాయించే ప్రమాదముంది. ముఖ్యంగా ఆఫ్రికాతో పాటు అట్లాంటిక్ దక్షిణ ప్రాంతంలోని పలు దేశాల్లో షార్ట్వేవ్ రేడియో బ్లాకౌట్లు సంభవించవచ్చని సైంటిస్టులు హెచ్చరించారు. రేడియో ఆపరేటర్లకు కనీసం అరగంటకు సిగ్నల్స్ అందబోవని వివరించారు. వీటివల్ల అరోరాలు (కాంతి వల యాలు) ఏర్పడనున్నాయి. కొంతకాలంగా ఉగ్ర రూపు సూర్యుడు ప్రస్తుతం తన 25వ సౌరచక్రం మధ్యలో ఉన్నాడు. దాంతో కొంతకాలంగా ఉగ్రరూపు దాలుస్తున్నాడు. సోలార్ మాగ్జిమంగా పేర్కొనే ఈ పరిస్థితులు ఊహించిన దానికంటే ముందే సంభవిస్తున్నట్టు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంసూర్యునిపై నిరంతర పేలుళ్లకు, సన్‌స్పాట్స్‌కు, సీఎంఈలకు దారి తీస్తుంది. ఇవి భూమిపై పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తప్పును సరిదిద్దుకునే మార్గాలు..!
పర్యావరణం సమతుల్యత కోల్పోయింది. కాదు... పర్యావరణాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేశాం. మన పనుల ద్వారా భూ ఆవరణాన్ని కాలుష్య కాసారంగా మార్చాం. ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాం. ఈ పూట గడిస్తే చాలు అన్న ట్లుగా వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నాం. ప్రకృతి మాత మూలుగను పీల్చేస్తున్నాం. వెరసి... జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడుకోవాల్సిన పర్యా వరణ వనరుల బడ్జెట్‌ను పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో తెగ వాడేసుకుంటున్నాం.అవసరాలు తీర్చుకోవటానికి కాకుండా అత్యా శకు పోయి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను ఆగస్టు 1 నాటికే పూర్తిగా కాజేసి... ఆ తర్వాత ప్రతి క్షణం ప్రకృతి మాత మూలుగను అదే పనిగా పీల్చేస్తున్నాం. దాంతో, తిరిగి తిప్పుకోలేని స్థితికి చేరిన భూగోళం గతి తప్పి సమతుల్యతను కోల్పోయింది. మొన్నటి వరకు గతమెన్నడూ ఎరుగనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడేమో అతి భారీ కుండపోత వర్షాలు, భీకర వరదలు; ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం కావటం... ఐక్య రాజ్యసమితి ప్రకటించి నట్లు ఇవన్నీ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’కి ప్రత్యక్ష నిదర్శనాలు. భూగోళం గతమెన్నడూ లేనంత ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశా ల్లోనూ గత 13 నెలలు అత్యంత అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. భూతాపాన్ని పెంచ టంలో, భూగోళం ఆరోగ్యాన్ని క్షీణింప జేయటంలో వ్యవసాయం, ఆహార సరఫరా రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని గణాంకాలు చెబు తున్నాయి. మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తోంది. మనం పండిస్తున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ భారీగా తగ్గి పోయాయి. భూగోళం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా క్షీణింపజేయటంలో పారిశ్రామిక వ్యవసాయ–ఆహార వ్యవస్థల పాత్ర చాలా ఉంది.2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం...క్లైమేట్ ఛేంజ్‌పై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన స్టాక్‌హోం రెజిలి యన్స్ సెంటర్ (ఎస్ఆర్సీ) సమాచారం ప్రకారం... ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగ తీరును బట్టి, భూతాపోన్నతిని బట్టి... భూగోళం ఆరోగ్యాన్ని 9 అంశాల ప్రాతిపదికగా అంచనా వేస్తారు. ఈ 9 అంశాల్లో ఆరింటిలో 2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం. ము ఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ఆరింటిలో ఐదింటికి కారణం వ్యవసాయం, ఆహార వ్యవస్థలేనని ఎస్ఆర్సీ తేల్చి చెప్పింది.నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నావెల్ ఎన్టిటీస్, నత్రజని/ఫాస్ఫరస్ వంటి రసాయనాల వాడకం... ఈ ఐదు అంశాల్లో పరిస్థితి విషమించటడానికి ఒకానొక మూల కారణం ముఖ్యంగా రసా యనిక/పారిశ్రామిక వ్యవసాయం, ఆహార వ్యవస్థ లేనని ఎస్ఆర్సీ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమిలో 40 శాతం ఇప్పటికే సాగు యోగ్యం కాకుండాపోయి బంజరుగా మిగిలిపోయింది.ఈ ఖాళీ భూముల నుంచి, పంట లేని పొలాల నుంచి రీ రేడియేషన్ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి వాతావరణంలోకి పరావర్తనం చెందటం భూతాపోన్నతికి దోహదం చేస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తు సరఫరా వ్యవస్థ చివరి గొలుసు వరకు (అగ్రీఫుడ్ సిస్టమ్స్) వెలువడే కర్బన ఉద్గారాలు క్లైమేట్ ఛేంజ్‌కు 34 శాతం మేరకు కారణభూతాలని గుర్తించాలి. తిరిగి ప్రాణశక్తిని పుంజుకొని సమతుల్యతను సంతరించుకోవడంలో భూగో ళానికి తోడుగా ఉండటానికి మార్గాలేవీ లేవా? తప్పకుండా ఉన్నాయన్నది నిపు ణులు చెబుతున్న గుడ్ న్యూస్. వాటిల్లో ఒకటేమిటంటే... పునరుజ్జీవన (ప్రకృతి/సేంద్రియ) వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తేవటం! తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే క్లైమేట్ సంక్షోభం నుంచి చాలా వరకు బయట పడొచ్చని సుసంపన్న అనుభవాలే తెలియజెబు తున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్, 86397 38658ఇవి చదవండి: నిదానమే.. ప్రధానం! -
Space Rock: నెలల శిలరేడు!
ఇప్పటిదాకా అది కేవలం ఒక అంతరిక్ష శిలే. కానీ త్వరలో ఓ రెండు నెలల పాటు తాత్కాలికంగా ‘చందమామ’ హోదా పొందనుంది! ఎవరా బుల్లి చంద్రుడు? ఏమిటా విశేషాలు? చూద్దాం రండి... భూ కక్ష్యను సమీపిస్తున్న ఒక బుల్లి గ్రహశకలాన్ని సైంటిస్టులు తాజాగా గమనించారు. అది ఇంకొద్ది రోజుల్లో తాత్కాలికంగా భూమ్యాకర్షణ శక్తికి లోనవనుంది. సెప్టెంబర్ 29 నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశించి మన గ్రహం చుట్టూ పరిభ్రమించడం మొదలు పెడుతుంది. దాని చక్కర్లు నవంబర్ 25 దాకా కొనసాగుతాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు వివరించారు. ఆ మీదట తిరిగి సౌర కక్ష్యలోకి ప్రవేశించి ఎప్పట్లా సూర్యుని చుట్టూ తిరుగుతుంది.దక్షిణాఫ్రికాలోని నాసా అబ్జర్వేటరీ ద్వారా సైంటిస్టులు దీన్ని గత ఆగస్టు 7న గమనించారు. దీని వ్యాసం 37 అడుగులని అంచనా వేసినా 16 నుంచి 138 అడుగుల దాకా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బుల్లి తాత్కాలిక చంద్రున్ని 2024పీటీ5గా పిలుస్తున్నారు. భూ కక్ష్యలోకి దాని రాకపోకలను గురించిన సమాచారం అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాజా సంచికలో ప్రచురితమైంది. ఆ ప్రమాదమేమీ లేనట్టే... 65 అడుగుల వ్యాసంతో కూడిన ఇలాంటి గ్రహశకలమే ఒకటి 2013లో పెద్ద భయోత్పాతమే సృష్టించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి రష్యాలో చెలియాబిన్స్క్ ప్రాంతంలో ఒక్క ఉదుటున పేలిపోయింది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో హిరోíÙమాపై ప్రయోగించిన తొలి అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువ శక్తిని, సూర్యున్ని తలదన్నేంతటి ప్రకాశాన్ని విడుదల చేసింది. దాని తాలూకు శకలాలు శరవేగంగా వచ్చి పడటంతో చెలియాబిన్స్్కలో ఏకంగా 7,000 పై చిలుకు భవనాలు భారీగా దెబ్బ తిన్నాయి. 1,000 మందికి పైగా గాయపడ్డారు. కానీ 29న భూ కక్ష్యలోకి ప్రవేశించనున్న 2024పీటీ5తో మాత్రం ప్రస్తుతం గానీ, కొద్ది దశాబ్దాల తర్వాత గానీ అలాంటి ముప్పేమీ ఉండబోదని సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు. నవంబర్ 25న మన కక్ష్యను వీడిన మీదట అది చూస్తుండగానే భూమికి 42 లక్షల కిలోమీటర్ల దూరానికి లంఘించి సౌర కక్ష్యలోకి వెళ్లిపోనుందట. అనంతరం మళ్లీ 2055లో, ఆ తర్వాత 2084లోనూ ఈ బుల్లి జాబిల్లి భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుందట. ఆ రెండుసార్లూ కొద్ది రోజుల పాటు మాత్రమే చక్కర్లు కొట్టి తన మాతృ కక్ష్యలోకి వెళ్లిపోతుందని సైంటిస్టులు వివరించారు. ప్రతి పదేళ్లలో ఒకట్రెండుసార్లు... ఇలాంటి బుల్లి చంద్రులు భూమిని పలకరించడం అరుదేమీ కాదు. 2020 ఫిబ్రవరిలో 2020సీడీ3 అనే గ్రహశకలం ఇలాగే రెండు నెలల పాటు భూ కక్ష్యలోకి చొచ్చుకొచి్చంది. రెండు నెలల పాటు ప్రదక్షిణం చేసిన మీదట గుడ్‌బై చెప్పి వెళ్లిపోయింది. దశాబ్దానికి రెండు మూడుసార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయట. కొద్ది రోజులు, వారాలు, మహా అయితే ఒకట్రెండు నెలలు కక్ష్యలో ప్రయాణించిన మీదట అవిఇలా పలాయనం చిత్తగిస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం భూ కక్ష్యలోకి వచ్చిన మీదట కనీసం ఒకట్రెండు ప్రదక్షిణలైనా పూర్తి చేస్తాయి.అంటే ఒకట్రెండేళ్లపాటు భూ కక్ష్యలోనే కొనసాగుతాయి. అయితే ఇలాంటి ఉదంతాలు అరుదు. మహా అయితే 10 నుంచి 20 ఏళ్లలో ఒకసారి జరిగితే గొప్పే. అయితే, ‘‘ఏ సమయంలో చూసినా భూ కక్ష్యలో అత్యంత చిన్న గ్రహశకలాలు తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే అవి మరీ పళ్లాలంత చిన్నవిగా ఉంటాయి గనుక వాటి ఉనికిని గుర్తించడం దాదాపుగా అసాధ్యం’’ అని సౌరవ్యవస్థ నిపుణుడు రాబర్ట్ జేడిక్ తెలిపారు. అంతేకాదు, ‘‘2024పీటీ5 కనీసం 10 మీటర్ల కంటే పొడవుంటుందని దాదాపుగా తేలిపోయింది. కనుక ఇప్పటిదాకా సైంటిస్టుల దృష్టికి వచి్చన ‘తాత్కాలిక చందమామ’ల్లో ఇదే అతి పెద్దది’’ అని వివరించారు. అంత ఈజీ కాదు...గ్రహశకలాలు ఇలా తాత్కాలికంగా ఉపగ్రహం అవతారమెత్తడం అంత సులువు కాదు. అందుకు చాలా విషయాలు కలిసి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా భూమ్యాకర్షణ శక్తికి ఆకర్షితమయ్యేందుకు అవసరమైనంత వేగంతో, అవసరమైన దిశలో ప్రయాణిస్తూ ఉండాలి. అంతేగాక భూ కక్ష్యకు దగ్గరవుతున్న కొద్దీ దాని వేగం కాస్త నెమ్మదిస్తూ రావాలి. ఇవన్నీ జరిగితే సదరు గ్రహశకలం దాని పరిమాణం, బరువుతో నిమిత్త లేకుండా భూ కక్ష్యలోకి వచ్చేస్తుంది. సాధారణంగా గంటకు 3,600 కి.మీ. వేగంతో భూమికి 45 లక్షల కిలోమీటర్ల భూమి సమీపానికి వచ్చే గ్రహశకలాలు ఇలా భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంటాయి.‘అర్జున’ పథం నుంచి...తాజాగా మనల్ని పలకరించనున్న 2024పీటీ5 గ్రహశకలం ఎక్కణ్నుంచి వస్తోందో తెలుసా? ‘అర్జున’ గ్రహశకల పథం నుంచి! అది అసంఖ్యాకమైన బుల్లి బుల్లి గ్రహశకలాలకు నిలయం. భూమి మాదిరిగానే అవి కూడా సూర్యుని చుట్టూ తమ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటాయి. ఇవేగాక అంగారకునికి, బృహస్పతికి మధ్యనుండే ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు బుల్లి చంద్రులు వచ్చి భూమిని పలకరిస్తుంటాయి. 2024పీటీ5ను నిశితంగా పరిశీలించి వీలైనంత విస్తారంగా డేటాను సేకరించేందుకు సైంటిస్టులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్పెయిన్‌లోని కానరీ ద్వీపంలో ఉన్న రెండు భారీ టెలిస్కోపులను రెండు నెలల పాటు పూర్తిగా ఈ పని మీదే ఉండనున్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వరి అంటే ఆహారం మాత్రమే కాదు, మన కరెన్సీ కూడా!
‘అన్నం గురించి చెప్పండి’ అని అడిగితే... ‘రోజూ తింటాం’ అనేవాళ్లే ఎక్కువ. ‘మీకు తెలిసిన వరివంగడాల గురించి చెప్పండి’ అని అడిగితే... ఒకటి, రెండు మాత్రమే చెప్పేవాళ్లు ఎక్కువ. అంతేనా! ‘కాదు... ఎంతో ఉంది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ వినయ్ వారణాసి. భారతీయ సంస్కృతిలో అన్నం, సంప్రదాయ వరి ధాన్యాల ప్రాముఖ్యతను చెబుతున్న వినయ్ ప్రసంగాలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి.మనం ఎప్పుడూ వినని కొత్త కథలు కాదు. అయితే వాటిని కొత్తగా ఎలా చెప్పవచ్చో వినయ్ ప్రసంగాలు వింటే అర్థం అవుతుంది. అన్నంతో సంబంధం ఉన్న వివిధ ఆచారాలు, వాటి పట్ల రుషులకు ఉన్న భక్తి, మనిషి జీవితాన్ని నిలబెట్టడంలో దాని విలువైన పాత్ర, దైవత్వానికి దాని ప్రతీకాత్మక సంబంధం గురించి వివరిస్తాడు. అన్నదానం చేసే ప్రక్రియను పౌరాణిక కథల ద్వారా చెబుతాడు. ‘మన దేశంలో బియ్యం అనేది సామాజిక, ఆర్థిక కరెన్సీ’ అంటున్న వినయ్ ‘స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్’ అనే సంస్థతో కలిసి బడులను నుంచి వ్యవసాయ కళాశాలల వరకు వరి ధాన్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.‘ఎన్నో రకాల వరి వంగడాలను పునరుద్ధరించడంపై మేము దృష్టి సారించాం. ప్రతి దానికి దాని ప్రత్యేకమైన ఆకృతి. రంగు, వాసనకు పేరు ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు కన్యాకుమారిలో కనిపించే అనికొంబస్ ఇప్పుడు అంతరించిపోయింది. అనేక దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి’ అంటుంది ‘స్పిరిట్ ఆఫ్ ఎర్త్’ ఫౌండర్ షీలా బాలాజి. ప్రాచీన వరి వంగడాల పునర్జీవానికి వాటి గురించి అవగాహన కలిగించడం అనేది కీలకం.హైబ్రిడ్ వరి వంగడాల వైపు ఎక్కువగా దృష్టి సారించడం వల్ల అనేక సంప్రదాయ వరి రకాలు క్షీణించాయి. ఎక్కువమంది ఈ పురాతన రకాలపై ఆసక్తి చూపితే సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ మన వ్యవసాయ వైవిధ్యాన్ని కాపాడుతుంది. దీనికి అవగాహన కల్పించడం అవసరం. ఆ పనిని సగర్వంగా భుజాల కెత్తుకున్నాడు వినయ్ వారణాసి.ఇక వినయ్ మల్టీ టాలెంట్ విషయానికి వస్తే... ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ మాత్రమే కాదు ఆర్కిటెక్ట్, డిజైన్ రిసెర్చర్, క్లాసిక్ మ్యూజిక్ లిరిసిస్ట్, డిజైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘అన్బైండ్’ ఫౌండర్. -
వచ్చేస్తోంది మార్స్ ట్రాన్స్ఫర్ విండో!
మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. ఏమిటీ ట్రాన్స్ఫర్ విండో? ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. వీటన్నింటికీ మించి ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 2026 విండోపై స్పేస్ ఎక్స్ కన్ను ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్íÙప్’ మిషన్ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Polaris Dawn: తిరిగొచ్చిన స్పేస్‌వాకర్లు
స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్‌వాక్ ప్రాజెక్టు ‘పొలారిస్ డాన్’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్‌మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్ బీచ్ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇసాక్మాన్తోపాటు ఇద్దరు స్పేస్ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్‌ఫోర్స్ థండర్బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్‌మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్ రంగంలో స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్‌మాన్ నిలిచారు. ఆయన, గిలిస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి స్పేస్ఎక్స్ నూతన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. గిలిస్ అంతరిక్షం నుంచే సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా స్టార్‌వార్స్ థీమ్ సాంగ్‌కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే. – కేప్ కనావరెల్ -
వింత శబ్దాల మిస్టరీ వీడింది
సరిగ్గా ఏడాది క్రితం ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ప్రపంచమంతటా 9 రోజులపాటు తరచుగా వినిపించిన వింత శబ్దాల రహస్యం వీడిపోయింది. ఈ శబ్దాలకు భూప్రకంపనలు కారణం కాదని పరిశోధకులు తేల్చారు. గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతం డిక్సన్ ఫోర్డ్లో భారీగా మంచు చరియలు విరిగిపడడం వల్ల భూమి స్వల్పంగా కంపించడంతో ఉత్పత్తి అయిన శబ్దాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధకులు 2023 సెపె్టంబర్లో రహస్య శబ్ద సంకేతాలను గుర్తించారు. గతంలో ఇలాంటి సంకేతాలు ఎన్నడూ కనిపెట్టలేదు. ఇవి సాధారణ భూప్రకంపనల్లాంటివి కాకపోవడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఒకే వైబ్రేషన్ ప్రీక్వెన్సీతో శబ్దాలు వినిపించాయి. దీనిపై అధ్యయనం కొనసాగించి, గుట్టు విప్పారు. డిక్సన్ ఫోర్డ్లో మంచు కొండల నుంచి విరిగిపడిన మంచు, రాళ్లతో 10 వేల ఒలింపిక్ ఈత కొలనులు నింపవచ్చని తెలిపారు. మంచు చరియల వల్ల మెగా సునామీ సంభవించి, సముద్రంలో 200 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయని చెప్పారు. లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే రెండు రెట్ల ఎత్తుకు అలలు ఎగిశాయని వెల్లడించారు. భారీ అలల ప్రభావం ఏకంగా 9 రోజులపాటు కొనసాగిందని అన్నారు. దీనికారణంగానే వింత శబ్దాలు వినిపించినట్లు స్పష్టంచేశారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రీన్లాండ్లో మంచు కరుగుతోంది. సముద్రంలో దశాబ్దాలపాటు స్థిరంగా నిలిచి ఉన్న భారీ మంచు పర్వతాలు సైతం చిక్కిపోతున్నాయి. అవి బలహీనపడి, మంచు ముక్కలు జారిపడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాల్లో పదుల మీటర్ల పరిమాణంలో చిక్కిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ ధ్రువ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడం, సునామీలు ఇక సాధారణ అంశంగా మారిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కడం ఇంకా కొనసాగితే అవాంఛనీయ పరిణామాలు సంభవించడం తథ్యమని పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు ఖాళీగా స్టార్‌లైనర్ తిరుగుప్రయాణం
కేప్‌కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్‌లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్‌లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్‌సాండ్స్ మిసై్పల్ రేంజ్లో దిగుతుంది. బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్‌కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. పలు పరీక్షల అనంతరం స్టార్‌లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్‌ను ఐఎస్ఎస్కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్‌లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్ఎస్లో డ్రాగన్ పార్కింగ్‌కు వీలుగా శుక్రవారం స్టార్‌లైనర్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు. -
సునీత రాక ఫిబ్రవరిలోనే!
కేప్‌కనావెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ సురక్షితం కాదని నాసా తేల్చిచెప్పింది. వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని శనివారం పేర్కొంది. ఆ రిస్క్ తీసుకోరాదని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్సూల్‌లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది.పలు వైఫల్యాల తర్వాత బోయింగ్ స్టార్‌లైనర్ గత జూన్‌లో సునీత, విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి చేర్చడం తెలిసిందే. థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీకేజీ తదితర సమస్యల నడుమ అతికష్టమ్మీద∙స్టార్‌లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వారం కోసమని వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రమాణమంటే ఎనిమిది నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే గడపనున్నారు. స్టార్‌లైనర్‌కు మరమ్మతులు చేయడానికి బోయింగ్ ఇంజనీర్లతో కలిసి నాసా తీవ్రంగా శ్రమించింది. మూడునెలల ప్రయత్నాల అనంతరం.. మానవసహిత తిరుగు ప్రమాణానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని తేల్చేసింది. అది ఒకటి, రెండు వారాల్లో ఐఎస్ఎస్ నుంచి విడివడి ఆటోపైలెట్ మోడ్‌లో ఖాళీగా భూమికి తిరిగి రానుంది. తమ విమానాల భద్రతపై ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న బోయింగ్‌కు స్టార్‌లైనర్ వైఫల్యం గట్టి ఎదురుదెబ్బే.స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలోనే ఉంది. మార్చి నుంచి ఐఎస్ఎస్లో ఉన్న నలుగురు వ్యోమగాములను తీసుకుని సెపె్టంబరు నెలాఖరులో భూమికి తిరిగివస్తుంది. అత్యవసరమైతే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం సురక్షితం కాదని నాసా తెలిపింది. రష్యాకు చెందిన సోయుజ్ క్యాప్సూల్ కూడా ఐఎస్ఎస్లోనే ఉన్నా అందులోనూ ముగ్గురికే చోటుంది. ఏడాదిగా ఐఎస్ఎస్లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు అందులో తిరిగొస్తారు. డ్రాగన్ సెపె్టంబరులో ఇద్దరు వ్యోమగాములతో ఐఎస్ఎఐస్కు వెళ్తుంది. తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను కూడా తీసుకొస్తుంది. -
ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం!
మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్ -
భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలం
-
భూమి రెండో పొర నుంచి... రాళ్ల నమూనా!
బ్రిటన్ భూ భౌతిక శాస్త్రవేత్తలు అత్యంత అరుదైన ఘనత సాధించారు. భూమి రెండో పొర అయిన మ్యాంటల్ (ప్రవారం) నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాలను సేకరించగలిగారు. అట్లాంటిక్ మహాసముద్ర గర్భం నుంచి ఏకంగా 1,268 మీటర్ల మేర లోపలికి తవ్వి మరీ వాటిని వెలికితీశారు! భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించిన శిల నమూనా ఇదే!! భూ ప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్ చేయగలగడమూ ఇదే మొదటిసారి. మహాసముద్రాల్లో డ్రిల్లింగ్ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డున్న నౌక జోయిడిస్ రిజల్యూషన్ సాయంతో ఈ ఘనత సాధించారు. భూమి పుట్టుకకు సంబంధించిన ఇప్పటిదాకా మనకందని పలు కీలక రహస్యాల గుట్టు విప్పడంలో ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకంతగా తెలియని భూ ప్రవారం తాలూకు కూర్పు, అక్కడ నిత్యం జరిగే కీలక రసాయనిక ప్రక్రియల గురించి విలువైన సమాచారం కూడా తెలుస్తోందట. అతి పెద్ద ముందడుగు భూమి ప్రధానంగా మూడు పొరలుగా ఉంటుంది. బాహ్య పొరను పటలం అంటారు. రెండో పొర రాళ్లమయమైన ప్రవారం కాగా అత్యంత లోపలి భాగమైన కేంద్రమండలం మూడో పొర. భూమి మొత్తం పరిమాణంలో ప్రవారం వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో దాగున్న అట్లాంటిస్ పర్వత శ్రేణి నుంచి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ తాజా నమూనాలను సేకరించగలిగారు. భూ ప్రవార శిలా ఖండాలు సముద్ర జలాలతో ఎలా ప్రతిచర్య చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి తాజా నమూనాల విశ్లేషణ బాగా దోహదపడిందట. వందలాది కోట్ల ఏళ్ల కింద భూమిపై తొలిసారిగా జీవం ఎలా పురుడు పోసుకుందో తెలుసుకునే క్రమంలో ఈ తాజా వివరాలను అతి పెద్ద ముందడుగుగా సైంటిస్టులు అభివర్ణిస్తుండటం విశేషం. సేకరణ అంత ఈజీ కాదు...భూ ప్రవార శిలలు మానవాళికి ఇప్పటిదాకా అందరానివిగానే ఉండిపోయాయి. అందుకు కారణం లేకపోలేదు. భూ పలకలు పరస్పరం కలిసే చోట్ల, అదీ సముద్ర గర్భంలో మాత్రమే వాటిని సేకరించే వీలుంది. దాంతో సైంటిస్టులు అదే మార్గంలో ప్రయత్నించి ఫలితం సాధించారు. మహాసముద్ర గర్భంలో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్కు అతి సమీపంలో ఉన్న అట్లాంటిస్ పర్వతశ్రేణి వద్ద ప్రవార శిలలు మనకు గట్టి ప్రయత్నంతో అందేంతటి లోతులోనే ఉంటాయన్న అంచనాతో రంగంలోకి దిగారు. 2024 ఏప్రిల్ నుంచి జోయిడిస్ ఇదే పనిలో గడిపింది. చివరికి జూన్ నాటికి రికార్డు స్థాయి లోతు దాకా డ్రిల్లింగ్ చేసి 886 అడుగుల పొడవున్న శిలా నమూనాను వెతికి తీయగలిగారు. ఈ క్రమంలో సముద్రగర్భం నుంచి 200 మీటర్ల లోతుకు తవ్విన గత రికార్డు తుడిచిపెట్టుకుని పోయింది. పైగా నాటి ప్రయత్నంలో పెద్దగా ప్రవార శిలలేవీ చిక్కలేదు కూడా. కనుక ఎలా చూసినా తాజా నమూనాల వెలికితీత అన్ని రికార్డులనూ బద్దలు కొట్టిందని కార్డిఫ్ వర్సిటీ జియాలజిస్టు, ఈ అధ్యయన సారథి జొహాన్ లీసెన్‌బర్గ్ చెప్పారు. ‘‘ప్రవార శిలను పరిశీలించిన మీదట విలువైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలోని ఖనిజ మూలకాలు వివిధ ఉష్ణోగ్రతల వద్ద సముద్ర జలంతో పలు రకాలుగా ప్రతి చర్య జరుపుతున్నట్టు తేలింది. ఫలితంగా సూక్ష్మజీవజాల ఉనికికి అతి కీలకమైన మీథేన్ వంటి నమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా వీలైనన్ని ఉష్ణోగ్రతల వద్ద వాటిని విశ్లేషించిన మీదట భూమిపై జీవావిర్భావం తాలూకు రహస్యాలెన్నో విడిపోయే అవకాశముంది’’ అని ఆయన వివరించారు. ఈ పరిశోధన వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఎస్ఎస్ నుంచి త్వరలో సునీత రాక!
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమికి తిరుగుపయనంపై ఆశలు ఇంకాస్త చిగురించాయి. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేర్చాక స్టార్‌లైనర్‌లోని రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థలోని కొన్ని థ్రస్టర్లు మొరాయించిన విషయం విదితమే. నౌకను శూన్యంలో సరైన దిశలో తిప్పేందుకు చిన్నపాటి ఇంజన్లవంటి థ్రస్టర్లు అత్యంత కీలకం. హీలియం సైతం లీక్ అవుతుండటంతో సునీత, విల్మోర్ల తిరుగుప్రయాణాన్ని వాయిదావేసి రిపేర్ల పనిపట్టడం తెల్సిందే. తాజాగా థ్రస్టర్లను ఒకదాని తర్వాత మరొకటి ఇలా 27 థ్రస్టర్లను మండించి వాటి పనితీరును పరిశీలించారు. 97–02 శాతం ఖచి్చతత్వంతో అవి పనిచేశాయని హాట్ ఫైర్ పరీక్షకు నాయకత్వం వహించిన ఫ్లైట్ డైరెక్టర్ కోలోయి మెహరింగ్ చెప్పారు. ఈ పరీక్ష జరిపినంతసేపు హీలియం వ్యవస్థలు సవ్యంగానే పనిచేశాయని మెహరింగ్ ప్రకటించారు. ఈ ఫలితాలను వచ్చేవారు సమీక్షించనున్నారు. ఐఎస్ఎస్ను ఏ రోజున భూమికి తిరుగుపయనం మొదలెట్టాలనే విషయాన్ని వచ్చేవారం సమీక్షలో చర్చించనున్నారు. -
ఈ యువరైతుకి.. అరుదైన ఘనత!
సిద్ధేశ్ సాకోర్ (28)... ఒక మారుమూల గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివారు. అయినప్పటికీ, తన తండ్రి వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతుల ఆదాయాలు పెంచటం కోసం స్వగ్రామంలోనే ఉంటూ తన వంతుగా ఏదైనా చెయ్యాలన్నదే తపనంతా! ఈ తపనకు తోడైన ఆచరణే సిద్ధేశ్కి గత నెలలో ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! దాని పేరే.. భూమి హీరో!ఐక్యరాజ్య సమితికి చెందిన కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ గత నెల 17న బ్రెజిల్లో భూమి పరిరక్షణ కృషిలో క్రియాశీలపాత్ర నిర్వహిస్తున్న పది మంది యువతకు భూమి హీరో పురస్కారాలు అందించింది. ఈ పురస్కార విజేతల్లో సిద్ధేశ్ ఒకరు. మన దేశం నుంచి ఈయనొక్కరికే ఈ గుర్తింపు దక్కింది. ఆయన ప్రయాణం ఆసక్తిదాయకం.. స్ఫూర్తిదాయకం..అతనిది మహారాష్ట్ర పుణే జిల్లా షిరూర్ తాలూకా ధామరి గ్రామం. పేద వ్యవసాయ కుటుంబంలో పెరిగిన సిద్ధేశ్ కరువు పీడిత మెట్ట ్రపాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. తాను వ్యవసాయం చేసి మార్పు తేవాలనుకున్నాడు. కొడుకు వ్యవసాయం చేయటం తండ్రికి ఇష్టం లేదు. కుటుంబ పొలాన్ని ఇవ్వనన్నాడు తండ్రి. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదవమన్నాడు. ఆ ప్రకారంగానే డిగ్రీ చదివిన సిద్ధేశ్ ఆ తర్వాత తమ జిల్లాలోనే గల విజ్ఞానాశ్రమంలో చేరి అనేక చిన్న యంత్రాలను ఆవిష్కరించాడు.వంటింటి వ్యర్థాలతో తక్కువ సమయంలో కంపోస్టు ఎరువు తయారు చేసే యంత్రాలను రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈలోగా కరోనాతో తండ్రి చనిపోయారు. అప్పటికి తండ్రి బ్యాంకు ఖాతాలో రూ. 3వేలు నిల్వ ఉందని చెబుతూ.. ఇదీ చిన్న రైతుల దుస్థితి అంటారాయన. భూములను సారవంతం చేసుకుంటూ రైతుల ఆదాయం పెంచే పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయంతో రైతుల తలరాత మార్చవచ్చని సిద్ధేశ్ బలంగా నమ్మాడు.ఐదెకరాల్లోపు వర్షాధార వ్యవసాయం చేసే రైతులు తగినంత ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆదాయం ఎందుకు రావటం లేదు? వారి భూములు అతిగా రసాయనాలు వాడటం వల్ల నిస్సారమైపోతున్నాయి. సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువగానే ఉంది. ఆ నేలల్లో అరకొర దిగుబడులు రావటం, గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల బడుగు రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ వెతలన్నిటికీ మూలం సాగు భూమి అతిగా నిస్సారమైపోవటం అని గ్రహించిన సిద్ధేశ్ స్వగ్రామంలోనే ఉండి, వారసత్వ చిన్నకమతంలో పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. తోటి రైతులను కూడా ఆ దిశగా నడిపించే పనిని ్రపారంభించారు. ‘ఆగ్రో రేంజర్స్’ అనే లాభాపేక్ష లేని సంస్థను ఐదేళ్ల క్రితం స్థాపించాడు.సీజనల్ పంటలపైనే ఆధారపడకుండా చిన్న కమతాల రైతులు కూడా కొంత మేరకు పండ్ల తోటలు పండించుకుంటూ.. రసాయన వ్యవసాయం నుంచి స్థిరమైన సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఆగ్రో రేంజర్స్ రైతులకు మద్దతు ఇస్తోంది. బహుళ పంటలు పండించే పండ్ల చెట్ల ఆధారిత ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను ఆగ్రో రేంజర్స్ అభివృద్ధి చేసింది. ఇది రైతులకు స్థిరంగా ఆదాయం వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది.గత 5 సంవత్సరాలుగా సిద్ధేశ్ బృందం 1,200 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. 23 గ్రామాల్లో వందకు పైగా ఎకరాల్లో రీజనరేటివ్ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను క్షేత్రస్థాయిలో అమల్లోకి తేగలిగారు. రెండు, మూడు సంస్థల్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా, అనేక సంస్థల ఆర్థిక తోడ్పాటుతో ఆగ్రోరేంజర్స్ బృందం లోపాలను సరిదిద్దుకొని పురోగమిస్తోంది.రైతులు శిక్షణ తీసుకున్నప్పటికీ సాగు పద్ధతి మార్చుకోవటానికి ముందుకు రాకపోవటాన్ని గమనించి.. పండ్ల మొక్కలను, డ్రిప్ లేటరల్స్తో పాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వటంతో మార్పు క్రమంగా వస్తోందని సిద్ధేశ్ తెలిపారు. వారికి ఎప్పుడు ఏమి అవసరమైతే అది చెబుతూ ముందుకు తీసుకువెళ్తే ఒక్కసారి ఈ పద్ధతి వల్ల ఆదాయం పెరిగితే ఇక వారికి నమ్మకం కుదురుతుంది. నేల క్షీణతను, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే దిశగా పునరుజ్జీవ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనా సాగు పద్ధతిని చిన్న, సన్నకారు రైతులకు అందించే కృషిలో గ్రామీణ యువతను విరివిగా భాగస్వామ్యం చేయాలని సిద్ధేశ్ ఆశిస్తున్నారు.పుణేలోని లఖేవాడికి చెందిన రైతు జలంధర్ చేమాజీ మావ్లే మాటల్లో చె΄్పాలంటే.. ‘భూతాపం పెరిగిపోవటం అనే సమస్యను ఎదుర్కోవడానికి, సాధ్యమైనంత ఎక్కువ చెట్లను పెంచటం ఉత్తమం. అందువల్ల, పండ్ల మొక్కలు, బిందు సేద్యం, విలువైన పాఠాలతో నాకు సహాయం చేసిన ఆగ్రో రేంజర్స్ బృందంతో నేను కనెక్ట్ అయ్యాను. ఇది వాతావరణ మార్పుపై పోరాటంలో మాత్రమే కాదు. నాకు స్థిరమైన ఆదాయం కూడా వస్తోంది. రెండు ఎకరాల భూమి గతంలో పండ్ల మొక్కలు నాటాను. ఈ సంవత్సరం మరో మూడు ఎకరాల భూమి కోసం ప్లాన్ చేస్తున్నాను’.ఇవి చదవండి: కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల! -
‘అదే జరిగితే మానవజాతి అంతం!’
న్యూఢిల్లీ: గ్రహశకలం. అత్యంత వేగంగా అంతరిక్షంలో పయనించే ఈ ఖగోళ అద్భుతాన్ని దూరం నుంచి చూసేందుకు అందరూ ఇష్టపడతారు. దూరం నుంచి దూసుకెళ్తుంటే ఆశ్చర్యం కల్గించే ఆస్టరాయిడ్ ఒకవేళ భూమికి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా సాక్షిభూతంగా నిల్చింది. 1908 జూన్ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు ధాటికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2,200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అయితే 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. 370 మీటర్ల వెడల్పున్న అపోఫిస్ ఆస్టరాయిడ్ తన కక్ష్యలో దూసుకెళ్తూ 2036లోనూ భూమి సమీపానికి రానుంది. 10 కి.మీ.ల వెడల్పాటి ఆస్టరాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణంధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదముందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్థానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి. భారత్ సైతం తన వంతు కృషిచేస్తోందని సోమ్‌నాథ్ చెప్పారు. రెండేళ్ల క్రితం డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా ఆనాడు ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ఆనాడు ప్రపంచదేశాలు కీర్తించాయి. -
Sagubadi: కాల్చొద్దు.. కలియదున్నండి!
వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులు కోతలు పూర్తయ్యాక వాటి అవశేషాలు(వ్యర్థాలు) కాల్చకుండా నేలలో కలియదున్నాలని మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ ఎస్.మాలతి, పంట ఉత్పత్తి శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ అన్నదాతలకు సూచిస్తున్నారు. దేశంలో ఏటా 500 నుంచి 600 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు (వరి, పత్తి, మొక్కజొన్న అవశేషాలు) మిగులుతోంది.ఇందులో 20 నుంచి 30% రైతులు వాటికి నిప్పు పెట్టి బూడిద చేస్తున్నారు. అలా చేయడం వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని తెలిపారు. ప్రధానంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధికంగా కాల్చడం వల్ల ఢిల్లీ వంటి పక్క రాష్ట్రాల్లో విపరీతమైన గాలి కాలుష్యం అవడం జరుగుతోందని గుర్తు చేశారు. ఇక్కడ ప్రధాన సమస్య వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు దినుసు పంటలను కాల్చి వే యడమని, తెలంగాణలో సగటున 30 నుంచి 40% వరి, 90 నుంచి 95% పత్తి అవశేషాలకు నిప్పు పెట్టి కాల్చి బూడిద చేయడం జరుగుతుందన్నారు.అవశేషాలను కాల్చడానికి ప్రధాన కారణాలు..మొదటి, రెండో పంట మధ్య తక్కువ వ్యవధి.అవశేషాలు కుళ్లడానికి అధిక సమయం.కాల్చడం వల్ల కలిగే సమస్యలు..పర్యావరణ కాలుష్య కారకాలైన సీఓ, సీఓ–2, ఎన్–2ఓ, ఎస్ఓ–2 విడుదలవ్వడం.గాలి నాణ్యత తగ్గడం, భూసారం క్షీణించడం, నత్రజని కర్బన స్థాయి తగ్గడం ఉపయోగకర సూక్ష్మజీవులు కీటకాలు చనిపోవడం.5.5 కిలోల నత్రజనితోపాటు 2.3 కిలోల భాస్వరం 25 కిలోల పొటాషియం 1.2 కిలోల సల్ఫర్ నష్టం వాటిల్లుతుంది.పంట అవశేషాల ఉపయోగాలు..పశువులకు మేతగా ఉపయోగించడం, వంట చెరుకుగా వాడుకోవడం.సేంద్రియ వ్యవసాయంలో కంపోస్టింగ్, పుట్టగొడుగుల సాగు కోసం ఉపయోగించవచ్చు.అవశేషాల నుంచి బయోఇథనాల్ ప్యాకింగ్ మెటీరియల్ కోసం ఉపయోగపడటం.నేలలో కలియదున్నడం ద్వారా కర్బన స్థాయి పెరగడం, గాలిప్రసారం, భూభౌతిక లక్షణాలు పెరుగుతాయి.నేల మీద మల్చ్‌గా ఉపయోగించవచ్చు.నేలలో కలియదున్నితే..నత్రజని 1.2 నుంచి 2 కిలోల వరకు, భాస్వరం 1 నుంచి 1.6 కిలోల వరకు, 12 నుంచి 13.6 కిలోల వరకు నేలకు అందజేయవచ్చు.బయోచార్ తయారు చేసుకోవడం..పంట అవశేషాలను ట్రాక్టర్ బెల్లర్ సహాయంతో వరిగడ్డిని చుట్టలుగా చుట్టుకోవచ్చు.గడ్డి త్వరగా కుళ్లడానికి వ్యర్థ డికంపోజర్ లేదా పూసా డికంపోజర్, పీజేటీఎస్ఏయూ కన్సార్టియం ద్వారా త్వరగా కుళ్లబెట్టవచ్చు. -
మే 2న సూర్యుడిపై అత్యంత శక్తివంతమైన విస్ఫోటనం
-
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. -
‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు గాను జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగంలో భాగంగా ఇన్శాట్-3డీఎస్లోని 6-ఛానల్ ఇమేజర్, 19-ఛానల్ ఇమేజర్ భూ చిత్రాలను తీసింది. ఆ చిత్రాల సాయంతో దేశ వాతావరణ పర్యవేక్షణ, అంచనా సామర్థ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.ఇన్శాట్-డీఎస్ తీసిన చిత్రాలు వాతావరణ అంచనా, వాతావరణ పర్యవేక్షణ, వాతావరణ పరిశోధనల కోసం కీలకమైన డేటాను అందించడానికి ఉపయోగపడతాయని ఇస్త్రో ప్రకటించింది. 6-ఛానల్ ఇమేజర్ భూమి ఉపరితలం, వాతావరణ చిత్రాలను ఒడిసిపట్టింది. ఈ చిత్రాల సాయంతో భూమి ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష ఆరోగ్యం, నీటి ఆవిరి పంపిణీ వంటి వివిధ వాతావరణ, ఉపరితలాల సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. 19-ఛానల్ ద్వారా సేకరించే చిత్రాల సాయంతో భూమి వాతావరణం ద్వారా విడుదలయ్యే రేడియేషన్‌ను వివిధ వాతావరణ భాగాలు, నీటి ఆవిరి, ఓజోన్, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువుల వంటి లక్షణాల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి తెలుసుకునేందుకు సహా పడతాయి. -
భూమి అంతానికి నాలుగు కారణాలు!
పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదని అంటారు. ఈ సృష్టిలో ఉద్భవించిన భూమి కూడా ఏదో ఒకరోజు అంతమవుతుందని చెబుతుంటారు. మరి భూమి ఎప్పుడు అంతమవుతుంది? ప్రస్తుతం భూమిపై నెలకొన్ని విపత్కర వాతావరణ పరిస్థితులు భూమి అంతానికి దారి తీస్తున్నాయా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ‘సూపర్ ఖండం’తో పెనుముప్పు గడచిన 500 మిలియన్ సంవత్సరాలలో మన గ్రహం లెక్కలేనన్నిసార్లు భారీ ప్రళయాలను చవిచూసింది. ఆయా ప్రళయకాలాల్లో భూమిపై ఉన్న జాతులలో 90 శాతం జాతులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ ప్రళయాలు ‘సూపర్ కాంటినెంట్’ ఏర్పడేందుకు దారితీస్తున్నాయి. రాబోయే 250 మిలియన్ సంవత్సరాలలో భూ ఖండాలు మళ్లీ కలిసి ‘పంగియా అల్టిమా’ అని పేరుతో ‘సూపర్ ఖండం’గా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉంటుంది. అలాగే ఇది అత్యంత వేడి ఖండంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్శిటీ, యూఎస్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ‘పాంగియా అల్టిమా’ పరిస్థితులు క్షీరదాల మనుగడకు ప్రతికూలంగా మారనున్నాయి. మనుగడ కోసం పోరాటంలో.. అమరత్వం అనేది కథల వరకే పరిమితం. అంతరించిపోవడం అనేది కాదనలేని సత్యం. జీవ పరిణామక్రమంలో వివిధ జాతుల మనుగడ కోసం ఒత్తిళ్లు పెరుగుతాయి. జన్యు ఉత్పరివర్తనలు సంభవించినప్పుడు పలు సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఉత్పరివర్తనలు ఒక నిర్దిష్ట సమయంలో జీవిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, మనుగడ సాగించడానికి ప్రయోజనకరంగానే ఉంటాయి. ఆ జన్యువులు తరువాతి తరానికి తరలే అవకాశం ఉంది. వైవిధ్యం, అనుకూలత అనేవి జీవులు జీవించడానికి కావాల్సిన లక్షణాలు. తక్కువ వైవిధ్యం, అననకూల పరిస్థితులు ఉన్పప్పుడు మానవ జనాభా అంతరించిపోయే అవకాశం ఉంది. పరిమిత వనరుల మధ్య.. భూమిపై వనరులు పరిమితం అవుతుండటానికి తోడు అణు, రసాయన, జీవ ఆయుధాలు, అంతుచిక్కని వ్యాధులు మొదలైనవి మానవ మనుగడకు ముప్పుగా మారనున్నాయి. ఇదేవిధంగా భారీ గ్రహశకలాల దాడి కూడా భూమి అంతరించిపోయేందుకు కారణం కావచ్చు. అలాంటి సంఘటన సంభవించినా, సంభవించకున్నా ఏదో రూపంలో మానవాళికి ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. భౌగోళిక, ఖగోళ పరిశోధన ఫలితాల ప్రకారం చూస్తే, ఈ విపత్తు సమీపంలోనే ఉందనే అంచనాలున్నాయి. వేడెక్కుతున్న మహాసముద్రాలు వేడెక్కుతున్న వాతావరణం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. ఇవి భూమి మనుగడకు మప్పుగా పరిణమిస్తున్నాయి. అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో 580 అమెరికన్, 216 సెంట్రల్ యూరోపియన్ నదుల డేటాతో వర్షపాతం, నేల రకం, సూర్యకాంతి తదితర అంశాలను పరిశీలించారు. భవిష్యత్తులో నదులలో ఆక్సిజన్ తగ్గే ఆక్సిజన్ రేటు జీవ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించనుంది. అధ్యయనంలోని శాంపిల్స్ రాబోయే 70 సంవత్సరాలను అంచనా వేశాయి. తక్కువ ఆక్సిజన్ కారణంగా కొన్ని జాతుల చేపలు పూర్తిగా అదృశ్యమవుతాయి. దీని వల్ల జల వైవిధ్యానికి భారీ నష్టం వాటిల్లుతుంది. మానవులతో సహా అనేక జాతుల మనుగడకు ఇది పెను ముప్పుగా పరిణమించనుంది. -
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ... తొలిసారి ఈ నెల 18న కనిపించింది... భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది.... వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24-26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఇంతింతై అన్నట్టు... ఆ మచ్చ సైజు అమాంతంగా 25% పెరిగిపోయింది. .. తొమ్మిదిన్నర భూగ్రహాల వైశాల్యానికి సరిపోయేంతగా ఆ సన్ స్పాట్ విస్తరించింది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఇదే అతి పెద్ద మచ్చగా అవతరించింది. దీని పేరు ‘ఏఆర్3590’. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. సూర్యుడిపై క్రియాశీల ప్రాంతం. భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా సన్ స్పాట్ ఏఆర్3590 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే సూర్యుడి అంతర్గత స్వరూపంలో గణనీయ మార్పులు వస్తున్నాయి. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం... భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతం. లోలోన సూరీడు బాగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సన్ స్పాట్స్ ద్యోతకమవుతాయి. తమ పరిసర ప్రాంతాలతో పోలిస్తే వీటిలో ఉష్ణోగ్రతలు తక్కువ. Photo Credits: thesuntoday అయినప్పటికీ ఈ మచ్చల్లో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య మాత్రం 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. మానవాళిని ఇబ్బంది పెట్టకుండా 24వ సౌరచక్రం ప్రశాంతంగా పూర్తయింది. 25వదీ సాఫీగా అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. కానీ తమ అంచనాలను మించి శక్తిమంతంగా కనిపిస్తున్న ఈ 25వ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరుగుతుండటం, తీవ్ర సౌర తుపాన్లు చోటుచేసుకోవడం గమనిస్తుంటే సూర్యుడు తన తాజా 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను వేగంగా సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే, బహుశా 2024 జూన్ మాసం ముగిసేలోపే ‘చండ మార్తాండ’ (సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్ఠం) దశ సంభవిస్తుందని శాస్త్రవేత్తల అంచనా. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచ్చిపెడుతుందోనని వారు కలవరపడుతున్నారు. ఈ ఉగ్ర రూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. విశేషమేంటంటే... సోలార్ మాగ్జిమమ్ లేదా ‘పీక్ స్టేజి’ సమాప్తమైందనే సంగతి... అది ముగిసిన ఆరు నెలల దాకా శాస్త్రవేత్తలకు తెలియదు! Photo Courtesy: NASA/SDO, AIA, EVE, HMI Science Teams ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోపల్లోపల తీవ్రంగా ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. ఇవే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్). ఈ జాజ్వల్యమాన ధగధగలు సూర్యుడిపై ప్రకాశవంతంగా గోచరిస్తాయి. సోలార్ ఫ్లేర్ ప్రక్రియ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగవచ్చు. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో ఐదు రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. బలహీనపు A, B సౌరజ్వాలల ప్రభావం స్వల్పం. సన్ స్పాట్ ఏఆర్3590 ఫిబ్రవరి నెల 21న రెండు X రకం సౌరజ్వాలలను వెదజల్లింది. X1.7 తీవ్రతతో ఓసారి, X1.8 తీవ్రతతోమరోసారి రెండు సౌరజ్వాలలను భూమి దిశగా ఎగజిమ్మింది. మర్నాడు 22వ తేదీన X6.3 తీవ్రతతో ఇంకో సౌరజ్వాలను వదిలింది. 2017లో X8.2 తీవ్రతతో విడుదలైన సోలార్ ఫ్లేర్ తర్వాత గత ఆరేళ్ల కాలంలో జనించిన అతి తీవ్ర ఫ్లేర్ ఇదే. పై 3 ఫ్లేర్స్ తర్వాత రెండు బలహీన M క్లాస్ జ్వాలలను కూడా సన్ స్పాట్ ఏఆర్3590 వెలువరించింది. ఈ మచ్చలోని అస్థిర బీటా-గామా-డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో భూమికి ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మార్పిడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం గిర్రున తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ఠ స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. రెండు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం మారతాయి. అటుదిటు, ఇటుదటు అవుతాయి. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మార్పిడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్లగా సౌర కనిష్ఠం లేదా సోలామ్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్.. సౌర తుపాన్లు! ‘కరోనా’ అనేది అత్యంత వేడితో కూడిన సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండివుండే సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు... భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ-పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా ఉపగ్రహాల్ని స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి శలభాల్లా మాడిపోతాయి. పిట్టల్లా రాలి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. ఇక వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపలి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేంద్రంలోని సురక్షిత స్థానాల్లోకి వెళ్లిపోతారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా... భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎలక్ట్రాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి చొచ్చుకొచ్చే సౌర ధార్మికత కూడా అదే కాంతి వేగంతో భూమిని తాకుతుంది. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15-18 గంటల్లో భూమిని చేరుతుంది. కారింగ్టన్ ఈవెంట్... అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెప్టెంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరిగిపోవతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్ సమీపంలోని రెడ్ హిల్ పట్టణానికి చెందిన ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ కూడా వారిలో ఒకరు. 1859 సెప్టెంబరు 1న సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ సూర్యుడి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 17.6 గంటల్లో ప్రయాణించి భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపానుకు టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై అధిక విద్యుత్ ప్రసారమై టెక్నీషియన్లు కరెంటు షాక్ కు గురవగా ఇంకొన్ని చోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్ఛతో పోలిస్తే నేటి ఏఆర్3590 సన్ స్పాట్ సైజు 60%గా ఉంది. గ్రహణాల సమయంలో సూర్యుడిని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు మన చెంత ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. :::జమ్ముల శ్రీకాంత్ -
NASA: సౌర రేడియేషన్‌తో పెనుముప్పు
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్‌ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ దాకా డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు. రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్లో అధికంగా సోలార్ రేడియేషన్‌ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్‌కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్‌కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కూల్ ఎర్త్’ పేరుతో భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రవేత్తలు!
ప్రపంచవ్యాప్తంగా భూతాపం ప్రభావం చూపుతోంది. కొన్నేళ్లుగా చాలాప్రాంతాల్లో వేసవులు మరింతగా నిప్పులు చెరుగుతున్నాయి. శీతకాలాలు నులివెచ్చగా మారుతున్నాయి. భూతాపం నియంత్రణ లేకుండా పెరుగుతూపోతే, భవిష్యత్తులో భూమ్మీద జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. పరిస్థితి ఆ స్థాయికి దిగజారిపోక ముందే భూతాపాన్ని అదుపులోకి తేవడానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా నిర్విరామంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎండ ధాటిని తగ్గించడానికి ఏకంగా పుడమికే గొడుగు పట్టడానికి సన్నాహాలు ప్రారంభించారు. శాస్త్రవేత్తలు పుడమికి గొడుగు పట్టగలిగితే, దాని ఫలితంగా భూమ్మీద వేడి తీవ్రత చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. వేసవి తీవ్రత భరించగలిగే స్థాయికి పరిమితమవుతుంది. పుడమికి గొడుగు పట్టడంతో పాటు భూతాపాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు మరికొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంత త్వరగా ఫలిస్తే, రానున్న వేసవులు అంత త్వరగా చల్లబడే అవకాశాలు ఉంటాయని ఆశించవచ్చు. భూతాపం తగ్గించడానికి ప్రస్తుతం శాస్త్రవేత్తలు సాగిస్తున్న వినూత్న, విలక్షణ ప్రయోగాలపై ఒక విహంగవీక్షణం... భూతాపం పెరుగుదలకు గల కారణాలను శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలను నియంత్రణలోకి తీసుకొస్తే భూతాపం అదుపులోకి వస్తుందని వారి అంచనా. అయితే, భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలను నియంత్రణలోకి తీసుకురావడమే పెను సవాలుగా నిలుస్తోంది. విచ్చలవిడిగా వాతావరణంలోకి చేరుతున్న కర్బన ఉద్గారాలు, అడవుల నరికివేత, వాహనాల వినియోగంలో పెరుగుదల, వనరుల అతి వినియోగం వంటివి భూతాపం పెరుగుదలకు దారి తీస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా, సాధ్యం కావడంలేదు సరికదా, ఇవన్నీ నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ఏకంగా పుడమికి గొడుగు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మన తల మీద గొడుగు నీడ ఉంటే, ఎండ వేడి తీవ్రత నేరుగా నెత్తిమీద పడకుండా ఉన్నట్లే, అంతరిక్షం నుంచి భూమికి గొడుగు పడితే, దాని నీడ వల్ల భూమ్మీద వేడి తీవ్రత గణనీయంగా తగ్గి, మనుషులకు వేసవి కష్టాలు కొంతవరకైనా తీరగలవని అంచనా వేస్తున్నారు.గొడుగు నీడతో పుడమికి చల్లదనం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద ఒక చదరపు మైలు (2.589 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలో నీడ కల్పించగలిగితే, రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 2.7 డిగ్రీల ఫారెన్‌హీట్ (–16.27 డిగ్రీల సెల్సియస్) మేరకు ఉష్ణోగ్రతను తగ్గించగలమని ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుడమికి గొడుగు పట్టే ప్రయత్నంలో తొలుత ప్రయోగాత్మకంగా వంద చదరపు అడుగుల నమూనాను అంతరిక్షంలోకి పంపాలని ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. దీనికి 20 మిలియన్ డాలర్లు (రూ.166.17) కోట్లు ఖర్చు కాగలవని, 2027 నాటికి వంద చదరపు అడుగుల నమూనా గొడుగును అంతరిక్షంలోకి పంపగలమని వారు చెబుతున్నారు. ధరిత్రీ ఛత్రవిలాసం ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు ఈ గొడుగు వివరాలను మీడియాకు వెల్లడించారు. భూతాపాన్ని తగ్గించే దిశగా భూమికి శాశ్వతమైన నీడ కల్పించాలని వారు భావిస్తున్నారు. ‘కూల్ ఎర్త్’ ప్రాజెక్ట్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగంలో భాగంగా తొలుత చేపట్టనున్న వంద చదరపు అడుగుల నమూనా గొడుగు ప్రయోగం విజయవంతమైతే, ఆ తర్వాత త్వరలోనే దాదాపు అర్జెంటీనా దేశం విస్తీర్ణంతో సమానమైన (దాదాపు 27.8 లక్షల చదరపు కిలోమీటర్లు) అతిపెద్ద గొడుగును అంతరిక్షంలోకి పంపి, అక్కడి నుంచి భూమికి శాశ్వతంగా నీడ కల్పించాలనుకుంటున్నారు. దీనికయ్యే ఖర్చు కొన్ని లక్షల కోట్ల డాలర్ల మేరకు ఉండవచ్చని వారి అంచనా. ‘అంతరిక్షంలో ఇలాంటి భారీ నిర్మాణాలను ఏర్పాటు చేయాలంటే, అందుకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి ప్రయోగాల కోసం రక్షణ శాఖ బడ్జెట్ నుంచి, అంతర్జాతీయ సహకారం నుంచి నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయోగానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 3 మిలియన్ డాలర్లు (రూ.24.92 కోట్లు) ఇప్పటికే ఇచ్చారు. భూమిపై సూర్యకాంతి తక్కువగా పడేలా చేసే ప్రయోగాలకు బాసటగా ఉంటామని గత ఏడాది అమెరికా అధ్యక్షుడు కూడా ప్రకటించారు’ అని ఇజ్రాయెలీ శాస్త్రవేత్త అవీ లోయబ్ తెలిపారు. అంతరిక్షంలోకి ఎలా చేరవేస్తారంటే.. ఈ గొడుగును సౌరశక్తితో పనిచేసే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి చేరవేస్తారు. తక్కువ బరువు కలిగిన ‘సోలార్ సెయిల్స్’తో రూపొందిన ఈ గొడుగును మొదటి ల్యాగ్రేంజ్ పాయింట్ (ఎల్1) వద్ద నిలిచేలా చేస్తారు. ఈ ప్రదేశంలో భూమి, సూర్యుడి ఆకర్షణ వికర్షణ శక్తులు గరిష్ఠ స్థాయిలో ప్రభావం చూపుతాయి. ఈ ప్రదేశంలో గొడుగును నిలిపి ఉంచడం ద్వారా భూమి ఉపరితలంపై ఎక్కువభాగంలో నీడ పడుతుంది. భూమి నుంచి ఈ ఎల్1 పాయింట్ 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి భూమి ఉపరితలంపై ఎక్కువ ప్రదేశంలో నిరంతరాయంగా పలచని నీడ పడుతుండటం వల్ల భూతాపం గణనీయంగా తగ్గుతుంది. ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు ప్రస్తుత అంచనాల మేరకు ఈ గొడుగును సకాలంలో అంతరిక్షంలోకి పంపకుంటే మాత్రం ఈ ప్రాజెక్టు ఖర్చు ఊహాతీతంగా పెరిగే ప్రమాదం ఉందని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ‘ఇప్పటికి అనుకుంటున్న సమయంలోగా ఈ భారీ గొడుగును అంతరిక్షంలోకి పంపకుంటే, ఈ ప్రాజెక్టు ఖర్చు చుక్కలను తాకే అవకాశం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగా మారే అవకాశం కూడా ఉంది’ అని ఫ్రాన్స్‌లోని యూరోపియన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ ఇన్ సైంటిఫిక్ కంప్యూటింగ్‌కు చెందిన పరిశోధకురాలు సూజన్ బోయెర్ వ్యాఖ్యానించారు. ఈ భారీ ప్రయోగానికి జరిగే ఖర్చు గురించి మాత్రమే కాదు, ఈ అంశంలో శాస్త్రవేత్తలకు మరికొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఈ గొడుగును అంతరిక్షంలో ఎల్1 పాయింట్ వద్ద సుదీర్ఘకాలం స్థిర కక్ష్యలో నిలిపి ఉంచడం ఎంతవరకు సాధ్యమనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతరిక్షంలో అదుపు తప్పే గ్రహశకలాలు తాకినా, సౌర తుఫానులు చెలరేగినా ఈ గొడుగు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని, అప్పుడు లక్షల కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రయోగం వృథా అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. సముద్రాల్లో నాచు పెంపకం.. భూతాపం పెరుగుదల భూభాగానికి మాత్రమే పరిమితం కావడం లేదు. భూతాపం ప్రభావానికి సముద్రాలు కూడా వేడెక్కుతున్నాయి. సముద్రాలలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుదల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని గుర్తించిన శాస్త్రవేత్తలు సముద్రాలను చల్లబరచేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే సముద్రాల ఉపరితల వాతావరణంలోకి మితిమీరి చేరిన కార్బన్ డయాక్సైడ్ను తొలగించడానికి ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ వంటి ప్రక్రియలను ప్రారంభించారు. ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ భారీ స్థాయిలో చేపట్టే జియోఇంజినీరింగ్ ప్రక్రియ. ఇందులో సముద్రాల ఉపరితలంపై సూర్యరశ్మి నేరుగా సోకే పొరలలో సముద్రపు నాచు పెరిగేలా చేస్తారు. సముద్రపు నాచు తన పోషకాల కోసం జరిపే కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా పరిసరాల్లోని వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసుకుంటుంది. సముద్ర ఉపరితల పరిసరాల్లోని వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఈ పద్ధతిలో గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా సముద్రాల ఉపరితలం చల్లబడి, సముద్రంలో బతికే చిన్నా పెద్దా జలచరాలు సురక్షితంగా మనుగడ సాగించగలుగుతాయి. సముద్రంలో నాచు త్వరగా పెరగడానికి నైట్రోజన్, ఐరన్ వంటి పోషకాలు అవసరమవుతాయి. ఈ పోషకాలను నేరుగా సముద్రం ఉపరితలంపై చల్లడం ద్వారా సముద్రపు నాచు త్వరగా, ఎక్కువగా పెరిగేలా చేస్తారు. ఇదంతా ఒకరకంగా మొక్కలకు ఎరువు వేసే ప్రక్రియలాంటిదే! కాబట్టి ఈ ప్రక్రియను ‘ఓషన్ ఫర్టిలైజేషన్’ అని, ‘ఓషన్ నరిష్మెంట్’ అని అంటున్నారు. సముద్రాల ఉపరితలంలో నాచు పెంచడం ద్వారా భూతాపాన్ని తగ్గించే ఈ ప్రయత్నంలో కొన్ని లాభాలు ఉన్నా, కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రాల ఉపరితలంపై నాచు పెంచడంలో ఎలాంటి రసాయనాల వినియోగం జరగదు. అందువల్ల ఇది చాలావరకు సురక్షితమైన పద్ధతి. ఈ ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి లేదా సముద్రంలోకి కాలుష్యాలు విడుదలయ్యే సమస్య ఉండదు. దీని వల్ల సముద్రజలాల ఆమ్లీకరణ గాఢత కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రక్రియ నేరుగా వాతావరణంపై తక్షణ ప్రభావం చూపదు. కాకుంటే, భూతాపం పెరుగుదలలో ఉధృతిని నిదానంగా తగ్గిస్తుంది. అయితే, సముద్రాల ఉపరితలంపై నాచును మోతాదుకు మించి పెంచినట్లయితే, సముద్రంలో జీవించే జలచరాల సహజమైన ఆహారచక్రం గతి తప్పి, కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో నాచు మితిమీరి పెరిగితే, కొన్ని రకాల చేపలు తదితర జలచరాల జనాభా గణనీయంగా క్షీణించే ప్రమాదం కూడా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఏళ్లనాటి ఆలోచన ఆకాశం నుంచి భూమికి గొడుగు పట్టాలనే ఆలోచన ఈనాటిది కాదు. శాస్త్రవేత్తలు 1923 నుంచి ఈ దిశగా ఆలోచనలు చేస్తూ వస్తున్నారు. జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెర్మన్ ఓబెర్త్ ఈ దిశగా తన ప్రయోగాల్లో కొంత ముందంజ కూడా వేశారు. అంతరిక్ష కక్ష్యలోకి 100–300 కిలోమీటర్ల వ్యాసం పరిధిలో భారీ అద్దాలను పంపడం ద్వారా భూమ్మీద పడే సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందేలా చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని ఓబెర్త్ ప్రతిపాదించాడు. సూర్యకాంతిని నిరోధించడం ద్వారా భూతాపాన్ని తగ్గించే దిశగా ఆయన 1923 నుంచి 1978 వరకు విస్తృతంగా పరిశోధనలు సాగించాడు. భూమికి సూర్యడికి మధ్యన ఒక డిస్క్లాంటిది అంతరిక్షంలో ఏర్పాటు చేయడం ద్వారా భూమ్మీద పడే సూర్యరశ్మి వేడిని తగ్గించగలమని 1989లో మరికొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఈ డిస్క్‌కు సౌర ఫలకాలను అమర్చినట్లయితే, వాటి నుంచి అపరిమితంగా సౌర విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచన చేశారు. అయితే, ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇవి జరిగిన చాలాకాలం తర్వాత రెండేళ్ల కిందట మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అలివీయా బోర్గ్, ఆండ్రూస్ హీన్లు ఈ దిశగా మరో కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. స్పేస్ఎక్స్ షిప్ వంటి వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి అతిసన్నని పాలిమర్ నానో బుడగలతో కూడిన అతిపలుచని ఫిల్మ్‌ను పంపి, సూర్యడికి భూమికి మధ్య తెరలా ఏర్పాటు చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని వారు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనకు కార్యాచరణ దిశగా అడుగులు ముందుకు పడలేదు. కార్బన్ క్యాప్చరింగ్.. భూతాపం పెరుగుదలకు అతిపెద్ద కారణం కర్బన ఉద్గారాల పెరుగుదల. కార్బన్ కణాలు వాతావరణంలోకి మోతాదుకు మించి చేరడం వల్ల భూతాపం గణనీయంగా పెరుగుతోంది. వాతావరణంలో కలిసే కర్బన కణాలను యంత్రాల ద్వారా పీల్చేసి, సేకరించే పద్ధతికి శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఈ సాంకేతికతను ‘కార్బన్ క్యాప్చరింగ్ టెక్నాలజీ’ అంటున్నారు. పారిశ్రామిక కర్మాగారాలు ఎక్కువగా ఉండేచోట వాటి నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువుల నుంచి కార్బన్ కణాలను పీల్చివేయడానికి భారీ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ యంత్రాలు గాలిలోకి కార్బన్ కణాలు చేరకుండా నిరోధిస్తాయి. గాలి నుంచి పీల్చేసిన కార్బన్ కణాలను ఈ యంత్రాలు ఘనరూపంలో బంధించి ఉంచుతాయి. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి యంత్రాలను నెలకొల్పారు. ఇవి గాలిలో కలిసే కార్బన్ కణాలను దాదాపు 90 శాతం వరకు పీల్చుకోగలవు. వీటిని ‘పైరోజెనిక్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్’ గా వ్యవహరిస్తున్నారు. యంత్రాల ద్వారా పీల్చి సేకరించిన కార్బన్‌ను పైపులైన్ల ద్వారా కార్బన్‌ను నేరుగా ఉపయోగించుకునే పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2020 నాటికి ప్రపంచంలోని వివిధ దేశాల్లో నెలకొల్పిన కార్బన్ క్యాప్చరింగ్ యంత్రాలు ఏడాది 5 కోట్ల టన్నుల కార్బన్‌ను గాలి నుంచి తొలగించగలుగుతున్నాయి. పగడపు దిబ్బల పరిరక్షణ.. సముద్రాలు సైతం వేడెక్కేస్థాయికి భూతాపం చేరడం వల్ల విలువైన పగడపుదిబ్బలు వేగంగా క్షీణించే పరిస్థితి ఏర్పడింది. పగడపుదిబ్బలు అంతరించిపోయే పరిస్థితిని నివారించడానికి శాస్త్రవేత్తలు 1998 నుంచి ముమ్మరంగా ప్రయత్నాలను ప్రారంభించారు. పగడపుదిబ్బల పరిరక్షణ కోసం ఒకవైపు శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా, గడచిన పదిహేనేళ్లలో ముప్పయి శాతం పగడపుదిబ్బలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రానున్న రెండేళ్లలో మరో ఆరు శాతం పగడపుదిబ్బలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్రాల అడుగున ఉండే పగడపుదిబ్బలు గొప్ప జీవవైవిధ్యానికి నెలవులు. పగడపుదిబ్బలను ఆవాసంగా చేసుకుని, నాలుగువేలకు పైగా మత్స్యజాతులు, ఎనిమిదివందలకు పైగా పగడపుజీవులు, వాటితో పాటే ఎనబైలక్షలకు పైగా వృక్షజాతులు మనుగడ సాగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున మూడు కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ సముద్రగర్భంలోకి చేరుతోంది. మితిమీరిన కార్బన్ డయాక్సైడ్ సముద్రగర్భంలోకి చేరడం వల్ల సముద్రజలాల ఆమ్లీకరణ జరిగి, పగడపుదిబ్బలు శరవేగంగా క్షీణించిపోతున్నాయి. సముద్రాల అడుగున ఉండే పగడపుదిబ్బలు నశిస్తే, మానవాళికి వాటిల్లే నష్టమేమిటనుకుంటే పొరపాటేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగడపుదిబ్బలు అంతరించడం వల్ల జీవవైవిధ్యానికి, పర్యావరణానికి జరిగే నష్టం ఫలితంగా 2030 నాటికి పదికోట్ల మంది మనుషులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మానవాళికి వాటిల్లబోయే ఈ ముప్పును అరికట్టడానికే శాస్త్రవేత్తలు పగడపుదిబ్బలను చల్లబరచడానికి ‘సీ వాటర్ ఎయిర్‌కండిషనింగ్’ వంటి పద్ధతుల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం భారీ యంత్రాలను ఉపయోగించి, వేడెక్కిన సముద్రజలాలను పైపుల ద్వారా పైకి తీసుకొచ్చి, ఆ నీటిని చల్లబరిచి తిరిగి సముద్రంలోకి పంపుతుండటం వల్ల కొంతవరకు పగడపుదిబ్బలను చల్లబరచగలుగుతున్నారు. పగడపుదిబ్బలను చల్లబరచిన ప్రదేశాల్లో అక్కడి పగడాల రంగులో గాఢత పెరగడం వంటి గుణాత్మకమైన మార్పులను సాధించగలుగుతున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు మరింత ముమ్మరంగా సాగితేనే పగడపుదిబ్బలు పదికాలాల పాటు సురక్షితంగా ఉండగలవు. వాటితో పాటే మనుషులు కూడా పదిలంగా మనుగడ సాగించగలరు. (చదవండి: థింక్ ట్యూన్ అప్!) -
NASA: మెరుస్తున్న భూమి.. అందమైన చిత్రాలు తీసిన ఐఎమ్ వన్
కాలిఫోర్నియా: చంద్రునిపైకి నాసా పంపిన ఇంట్యూటివ్ మెషిన్(ఐఎమ్ వన్) నింగి నుంచి భూగోళం అద్భుతమైన చిత్రాలను తీసింది. ఈ చిత్రాల్లో భూమి వజ్రంలా మెరిసిపోతుండటం విశేషం. స్పేస్ ఎక్స్ రాకెట్ నుంచి వేరుపడి రెండో దశ ప్రయాణం ప్రారంభించన వెంటనే ఐఎమ్ వన్ భూమి అందమైన చిత్రాలను కెమెరాలో బంధించింది. ఈ నెల తొమ్మిదో తేదీన కేప్కెనరావల్లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో ఐఎమ్ వన్ నోవా సి ల్యాండర్‌ను నింగిలోకి పంపారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న నోవా సీ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెడుతుంది. నాసా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వాణిజ్య పరంగా కస్టమర్ల కోసం చేపట్టిన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్(సీఎల్పీఎస్) కింద నోవా సి ల్యాండర్ చంద్రునిపై ప్రయోగాలు చేయనుంది. ఈ దశాబ్దం చివర్లో చంద్రునిపైకి వ్యోమగాములను(నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్) పంపేందుకుగాను అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఐఎమ్ వన్ వ్యోమనౌకలో నాసా ఆరు పేలోడ్లను అమర్చింది. ఇది చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయితే 1972 తర్వాత అమెరికా వ్యోమగాములతో సహా చంద్రునిపైకి పంపిన అపోలో మిషన్ తర్వాత రెండో మిషన్‌గా చరిత్రకెక్కనుంది. ఇదీ చదవండి.. పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది -
ISRO: సముద్రంలోకి కార్టోశాట్–2
బెంగళూరు: పాత ఉపగ్రహాలతో ఆయా కక్ష్యల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూవాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శుక్రవారం ప్రకటించింది. పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజీలు తీసేందుకు 2007 జనవరి పదో తేదీన 680 కేజీల ఇస్రో కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో విజయవంతంగా పంపింది. ఇది 2019 ఏడాదిదాకా పనిచేసింది. తర్వాత కక్ష్య తగ్గించుకుంటూ క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి అత్యంత వేగంగా తిరుగుతూ మండి, ధ్వంసమై అతి చిన్న ముక్కలుగా మారిపోనుంది. అలా కావడానికి సాధారణంగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు ఉపగ్రహాలుండే కక్ష్యల్లో అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ముందుగానే దీనిని భూవాతావరణంలోకి రప్పించారు. -
Copernicus Climate Change Service: ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల
న్యూఢిల్లీ: కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు (సీ3ఎస్) గురువారం వెల్లడించింది. 1850–1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850–1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతోపాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల భూఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వసు స్పష్టం చేసింది. -
వామ్మో 2023!
భూతాపం విషయంలో 2023 కనీవినీ ఎరగని రికార్డు సృష్టించింది. అత్యంత వేడిమి డిసెంబర్ నెల ముగియక ముందే 2023 రికార్డులకెక్కడం తెలిసిందే. అయితే చరిత్రలో ఇప్పటిదాకా అత్యధికంగా 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైన ఏడాదిగా 2023 నిలిచింది! 2016 నాటి రికార్డు కంటే ఇది ఏకంగా 0.17 డిగ్రీలు అధికం! అదే 1991–2020 మధ్య 20 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏకంగా 0.6 డిగ్రీలు ఎక్కువ!! గతేడాదికి సంబంధించిన ఉష్ణోగ్రతల గణాంకాలను క్షుణ్నంగా విశ్లేషించిన మీదట యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పేర్కొంది. అంతేకాదు, 2023 రెండో అర్ధ భాగంలో దాదాపుగా ప్రతి రోజూ ఎండ తీవ్రతలో కొత్త రికార్డులు నెలకొల్పినట్టు తేల్చింది! ఇది నిజంగా భయానక పరిణామమేనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2023 నవంబర్ 17. భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైన తేదీ! మానవ చరిత్రలో ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచీ అత్యధిక పెరుగుదల అదే! అలా మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్ 17న నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. దాంతో పర్యావరణవేత్తల్లో గగ్గోలు మొదలైంది. కానీ 2023 రెండో భాగంలో, అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి రోజూ ఎండలు కనీవినీ ఎరగని రీతిలో ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్ తాజా నివేదిక తేల్చింది. పైగా 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవడమూ భయపెట్టే పరిణామమే. భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను పారిశ్రామికీకరణనాటి తొలినాళ్లతో, అంటే 1850–1900 సంవత్సరాల మధ్య కాలపు సగటుతో పోల్చి చెబుతారు. అప్పటితో పోలిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల కంటే దిగువకు కట్టడి చేయాలన్నది 2015 నాటి పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా చేసుకున్న తీర్మానం. కానీ 2023లో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల దాదాపుగా ఆ లక్ష్మణరేఖను తాకింది. 1850తో పోలిస్తే గతేడాది ప్రతి రోజూ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది! 2015లో తొలిసారిగా ఒక్క రోజు ఇలా 1 డిగ్రీ పెరుగుదల నమోదైతేనే ప్రపంచమంతా విస్మయపడింది. అది కాస్తా కేవలం ఏడేళ్లకే రోజువారీ పరిణామంగా మారిపోయింది. పైగా సగటు పెరుగుదలే దాదాపుగా 1.5 డిగ్రీలను తాకేసింది. గ్లోబల్ వారి్మంగ్ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోందనేందుకు ఇంతకు మించిన తార్కాణం అవసరం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 2024లో ఉష్ణోగ్రత సరికొత్త రికార్డులు సృష్టించి భూగోళాన్ని మరింత వినాశనం దిశగా నెట్టడం ఖాయమని తాజా నివేదికలో కోపర్నికస్ కూడా అంచనా వేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లోపే సగటు భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటేస్తే ఆశ్చర్యం లేదని అది అభిప్రాయపడింది. అదే జరిగితే భూమిపై కీలక పర్యావరణ వ్యవస్థల్లో చాలావరకు అంతటి తాపాన్ని తట్టుకోలేవు. అప్పుడిక ప్రపంచంలో ఒకవైపు తీవ్ర కరువులు, కార్చిచ్చులు, మరోవైపు భయంకరమైన తుపాన్లు నిత్య సమస్యలుగా మారిపోతాయి. గతేడాది అమెరికా, కెనడా, హవాయి, దక్షిణ యూరోప్‌ల్లో నిత్యం కార్చిచ్చులు చెలరేగడం, పలు దేశాలు కనీవినీ ఎరగని వరదలతో, గడ్డకట్టించే చలి పరిస్థితులతో అతలాకుతలం కావడం తెలిసిందే. వాతావరణ మార్పులు, ఎల్ నినో... 2023 ఇంతగా మండిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని కోపర్నికస్ నివేదిక స్పష్టం చేసింది. దానికి తోడు గతేడాది జూలైకల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్ నినో (కరువు) పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చినట్టు వివరించింది. ఫలితంగా పసిఫిక్ మొదలుకుని ప్రతి మహాసముద్రమూ ఎప్పుడూ లేనంతగా వేడెక్కినట్టు పేర్కొంది. 1991–2020 సగటుతో పోలిస్తే 2023లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఏకంగా 0.44 డిగ్రీలుగా నమోదైంది! దాంతో మంచు ప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటికాలపై దీని ప్రభావం విపరీతంగా పడటం మొదలైంది. అక్కడి మంచు ఎన్నడూ లేనంతగా కొన్నాళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. ఈ దెబ్బకు సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత మహా నగరాలు చాలావరకు నీట మునుగుతాయి. అదే జరిగితే ప్రపంచంలో కనీసం మూడో వంతు జనాభా నిర్వాసితులుగా మారతారని అంచనా. ఊహించుకోవడానికే భయం కలిగే ఇలాంటి పరిణామాలెన్నో అతి త్వరలో జరిగేలా కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. -
అక్కాచెల్లెళ్ల హెల్త్ఫుల్ సప్లిమెంట్స్!
‘‘మన నేల సుసంపన్నం... పోషకాలన్నీ ఉన్నాయి. కానీ... పోషకాహారలోపంతో బాధపడుతోంది మనదేశం. ఆరోగ్యాభిలాషులుగా మేము హెల్దీ లివింగ్ కోసం ఉద్యమించాం. మొక్కలతో పోషకాలందించాలనే సంకల్పాన్ని చేబూనాం. భూమి... మొక్క మనకు సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. అందుకే మా ప్రయోగాలకు ఎర్త్ ఫుల్ అని పేరు పెట్టాం’’ తమను తాము బ్లాగ్‌లో ఇలా పరిచయం చేసుకున్నారీ అక్కాచెల్లెళ్లు. వాళ్ల పేర్లు సుధ, వేద. ఇద్దరూ ఐఐటీ ఖరగ్‌పూర్ ఇంజనీర్లు. కెరీర్లో కొత్త మలుపు గురించి సాక్షితో పంచుకున్నారిద్దరూ". ‘‘మా నాన్న సొంతూరు విజయవాడ దగ్గర మానికొండ. నాన్న వ్యాపార రీత్యా ఒడిశా, వైజాగ్, హైదరాబాద్‌లో పెరిగాం. అమ్మ ఏజీ ఎమ్మెస్సీ చదివింది. మమ్మల్ని ఐఐటీలో ఇంజనీరింగ్ చేయించాలనే సంకల్పం అమ్మదే. కోచింగ్‌కి చుక్కారామయ్య గారి ఇన్స్టిట్యూట్లో చేర్చడం కోసమే హైదరాబాద్‌లో నల్లకుంటలో ఉండేవాళ్లం. నేను కెమికల్, చెల్లి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశాం. నాకు ఐటీసీ లిమిటెడ్‌లో ఉద్యోగం. హరిద్వార్‌లో పోస్టింగ్. దాదాపు ఆరువందల మంది ఉద్యోగుల్లో ఒక్క అమ్మాయిని. అర్బన్ టచ్‌లో ఉద్యోగం చేసేటప్పుడు సొంత స్టార్టప్ ఆలోచన వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చి ఎంబీఏ చేసి ఊబెర్లో లాంచింగ్ సమయంలో ఉద్యోగం చేశాను. ఇక వేద విషయానికి వస్తే... బ్యాంకింగ్‌రంగంలో ముంబయి, లండన్లలో చేసింది. సివిల్స్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూ మూడేళ్లు ప్రయత్నించింది. తనకు బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ. మీషో స్టార్టప్ కోసం బెంగళూరులో ఉద్యోగం చేసింది. ఈ సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. వేద ఇంటి నుంచి పని చేయడానికి హైదరాబాద్‌కి వచ్చింది. ఇద్దరమూ ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఆ సమయంలో బర్నింగ్ టాపిక్ ఆరోగ్యమే. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి వ్యాధినిరోధక శక్తి సమృద్ధిగా ఉండాల్సిన అవసరం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది. ఆహారం ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని పొందడం గురించి డాక్టర్లు చెబుతున్నారు. కానీ పరిపూర్ణమైన పరిష్కారం అందుబాటులో లేదప్పటకి. మనకు తెలిసింది... మంచి ఆహారం తీసుకోవడం, అనారోగ్యం వస్తే ఔషధాలు తీసుకోవడం మాత్రమే. ఈ రెండింటికీ మధ్య ఫుడ్ సప్లిమెంట్ అనే మరొక ప్రత్యామ్నాయం ఉందని మనదేశంలో అవగాహన చాలా తక్కువ. మేము ఆ చైతన్యం కోసమే పని చేస్తున్నాం’’ అన్నారు సుధ. సీట్లో కూర్చోవడం నుంచి మొదలు... ‘‘మేమిద్దరం కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేశాం. పనిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి విపరీతంగా శ్రమించేవాళ్లం. ఆఫీస్ వర్క్‌లో దేహకదలికలు తగినంత ఉండవు. యాసిడ్ రిఫ్లక్స్‌తో సమస్యలు జీర్ణవ్యవస్థ నుంచి మొదలవుతాయి. బ్యాక్ పెయిన్ వరకు వెళ్తుంది. ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసేటప్పటికే దేహం శక్తిని కోల్పోయి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ దేహానికి కావల్సినంత శక్తి అందడం లేదని అర్థమవుతుంది. అనారోగ్యం ఏమిట’ని ప్రశ్నిస్తే ఫలానా అని ఏమి చెప్పాలో అర్థం కాదు. డాక్టర్ సూచన మేరకు ఐరన్, క్యాల్షియమ్, ప్రొటీన్, విటమిన్లతోపాటు మైక్రో న్యూట్రియెంట్స్‌తో కూడిన మందులు వాడుతాం. మందులు ఆపేసిన రెండు వారాలకు మనతో స్నేహం చేయడానికి తిరిగి నీరసం, నిస్సత్తువలు దరి చేరతాయి. మా జనరేషన్ మాత్రమే కాదు, కొంచెం అటూ ఇటూగా సమాజంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇంట్లో దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్న మా నాన్నను చూస్తున్నాం. బలహీనమవుతున్న దేహం మనం అనుసరిస్తున్న డైలీ రొటీన్ ఆరోగ్యానికీ– అనారోగ్యానికీ మధ్య ఉండాల్సిన రక్షణరేఖ చెరిపేసిందనిపించింది. ముఖ్యంగా ఇండియన్ ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలైతే మరీ విడ్డూరం. అనారోగ్యమేమీ ఉండదు. నడవాలంటే మోకాళ్లు నొప్పులు, కూర్చోవాలంటే వెన్నునొప్పి, బరువు ఎత్తితే భుజం నొప్పి, త్వరగా అలసిపోవడం, నీరసం. నిజానికి ఇవేవీ అనారోగ్యాలు కావు. మనం దేహానికి అవసరమైన పోషకాలందకపోవడం వల్లనే అని మా అధ్యయనంలో తెలుసుకున్నాం. పాశ్చాత్య దేశాల్లో అయితే రోజూ ఆహారంతోపాటు ఫుడ్ సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. నిజానికి మన దేహానికి అవసరమైన పోషకాలన్నింటినీ ఆహారం ద్వారా అందించడం అంత సులువైన పనేమీ కాదు, పోషకాహార పట్టిక, న్యూట్రిషనిస్టుల సూచన ప్రకారం ఒక మనిషికి ఒక రోజుకు అవసరమైనంత ఐరన్ ఆహారం ద్వారా అందాలంటే తొమ్మిది కప్పుల పాలకూర తినాలి. మా రీసెర్చ్‌లో తెలుసుకున్న విషయాలతోనే సమాజం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికింది. అదే మా స్టార్టప్ అయింది. మా ఎర్త్ఫుల్ బోర్డ్ సభ్యులుగా డాక్టర్, న్యూట్రిషనిస్ట్, ఫుడ్ ఎక్స్‌పర్ట్‌లున్నారు. ఆకు నుంచి గింజ వరకు... ప్రకృతి మనకు అవసరమైన అన్నింటినీ సమగ్రంగా, సమతూకంగా ఇచ్చింది. కానీ మనమే లైఫ్‌స్టయిల్‌ని పక్కదారి పట్టించుకున్నాం. జామపండుని కొరికి తినాలంటే దంతాలు సహకరించవు. దాంతో గింజలను వదిలేయడమో లేదా రెడీమేడ్ జ్యూస్‌లు తాగడమో చేస్తున్నాం. దాంతో గింజల ద్వారా అందాల్సిన పోషకాలను కోల్పోతున్నాం. జామ ఆకులో జింక్ ఉంటుందని తెలిసినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇలాంటి వాటిని సులువైన రూపంలో అందించడమే మా ప్రయత్నం. అలాగే ఆరోగ్యం పట్ల చైతన్యవంతం చేయడం కూడా. వ్యాపారం అంటే డబ్బు సంపాదన కోసం మాత్రమే కాకూడదు. సామాజిక బాధ్యత ఉండాలి. అలాగే నైతిక విలువలతో కూడినదై ఉండాలి. సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంలో మా కృషి ఉంటోందంటే కలిగే సంతృప్తిని మాటల్లో వివరించలేం. బాక్స్ మార్కెట్ మా వెంట వస్తోంది! భూమ్మీద జీవించాల్సిన మనిషి కోసం భూమి అన్నింటినీ మొక్కల రూపంలో ఇచ్చింది. వాటిని తెలుసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ‘భూమి నుంచి ఉద్భవించిన మొక్కల ఆధారంగా ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నాం, మొక్కల్లో మనకు అవసరమైనవన్నీ ఉన్నాయ’ని చెప్పాలనే ఉద్దేశంతో మా స్టార్టప్‌కి ఎర్త్ఫుల్ అని పెట్టాం. ఈ స్టార్టప్ కోసం చేసిన హోమ్ వర్క్ చిన్నది కాదు. ఈ జర్నీలో మేము ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్తేజితులమవుతున్నాం. తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు బ్లాగ్‌లో, ఎఫ్బీలో షేర్ చేసుకుంటూ ఉండడంతో స్టార్టప్ ప్రారంభించేటప్పటికే మాకు ఫాలోయింగ్ బాగా వచ్చేసింది. దాంతో మార్కెటింగ్ కోసం ప్రయాస పడాల్సిన అవసరం లేకపోయింది. అవుట్లెట్లే స్వయంగా మా ఉత్పత్తులను అడుగుతున్నాయి. కానీ మా ఉత్పత్తులు కమర్షియల్ కావడం మాకిష్టం లేదు’’ – సుధ, వేద, ఫౌండర్స్, ఎర్త్ఫుల్ , హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!) -
fact check: మేలెంచినా కీడెంచుతారా!?
సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపాటిగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా? రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది. ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..! పేదలకు మేలు జరుగుతుంది.. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ రుసుం, డీఎంఎఫ్, మెరిట్ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు.. ప్రతి ఖరీఫ్ సీజన్‌కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు. ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది? ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది. ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీలు, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
పారిస్ ఒప్పందానికి చిల్లు? భయపెడుతున్న భూతాపం!
ప్రపంచ మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ రోజురోజుకు పెరిగిపోతున్న భూతాపం. దీనిని నియంత్రించే లక్ష్యంతో 2015లో 200 దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని ప్రకారం అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు ఈ దేశాలన్నీ తగిన చర్యలు చేపట్టాలి. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంట్రీగ్రేడ్‌ల కన్నా తక్కువకు నియంత్రించాలి. అప్పుడే విపత్కర వాతావరణ ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చని పారిస్ ఒప్పందంలో తీర్మానించారు. అయితే ఇది విఫలమయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023 నవంబరు 17న నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోజు భూ ఉపరితల ఉష్ణోగ్రత పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యింది. ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇదే రికార్డుగా నిలిచింది. ఇది అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన గాలి ఉష్ణోగ్రత, సముద్ర ఉష్ణోగ్రత, అంటార్కిటిక్ సముద్రపు మంచు విస్తీర్ణం మొదలైనవి భూతాపం పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. గత జూలైలోనూ భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. సెప్టెంబర్ నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నాయని మరో నివేదిక పేర్కొంది. భూతాపం నియంత్రణకు అన్ని దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడం, అటవీ రక్షణ పెంపుదల, మొక్కల ఆధారిత ఆహారాలవైపు మళ్లడం, కొత్త బొగ్గు ప్రాజెక్టులను ఎత్తివేయడం, చమురు, గ్యాస్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి ప్రయత్నాలను తప్పనిసరిగా చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉష్ణోగ్రతలను లక్ష్యం మేరకు నియంత్రించలేకపోతే అత్యంత దారుణమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే సముద్ర మట్టాలు 10 సెంటీమీటర్లు పెరిగి, చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పరిమితం చేయగలిగితే కనీసం కోటి మందిని ఈ ముప్పు నుంచి బయటపడేయచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారతీయలు పాక్‌లో వ్యాపారం చేయవచ్చా? -
Chandrayaan-3: ఆ శకలంతో ఎటువంటి ప్రమాదం లేదు: ఇస్రో
బెంగళూరు: చంద్రయాన్–3 అంతరిక్ష నౌకను జూలై 14న నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడంలో కీలకమైన క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్‌లోని ఒక భాగం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని ఇస్రో తెలిపింది. ఎల్వీఎం–3 ఎం4కు చెందిన ఈ శకలం బుధవారం మధ్యాహ్నం 2.42 సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు గుర్తించామని గురువారం ఇస్రో వివరించింది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ఇది ఉత్తర పసిఫిక్ సముద్రంలో పడే అవకాశాలున్నాయని తెలిపింది. భారత గగనతలంలోకి ప్రవేశించే అవకాశాల్లేవని ఒక ప్రకటనలో ఇస్రో స్పష్టం చేసింది. -
సౌర కుటుంబానికి అవతల.. సప్త గ్రహ కుటుంబం!
నిన్న మొన్నటివరకూ సౌర కుటుంబానికి అవతల ఇంకో గ్రహం ఉందంటేనే నమ్మేవారు కాదు. కానీ. ఇప్పుడు ఇలాంటి ఎక్సోప్లానెట్లు కొన్ని వేలు ఉన్నాయన్న విషయం సుస్పష్టమైంది. మరి.. ఇన్ని వేల గ్రహాల్లో భూమిని పోలినవి? మన సౌరకుటుంబం మాదిరిగా ఉన్నవి ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నకూ సమాధానం అవుననే. కాకపోతే తాజాగా ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. అదేమిటో తెలుసా? సప్త గ్రహ కుటుంబం! భూమికి కొన్ని రెట్లు ఎక్కువ పరిమాణమున్న ఏడు గ్రహాలు ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూంటాయి ఇందులో! సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలున్నాయన్నది కాసేపు పక్కనబెడదాం. విశ్వం మొత్తమ్మీద ఎన్ని ఉన్నాయంటే కచ్చితమైన సమాధానమైతే తెలియదు. కానీ.. ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా మన గ్రహ వ్యవస్థకు ఆవల గ్రహాలెన్ని ఉన్నాయి? వాటిల్లో భూమిని పోలినవి ఎన్ని? జీవించే పరిస్థితులు ఉన్నవాటి సంఖ్య ఎంత? మాతృనక్షత్రానికి (మనకు సూర్యుడు) ఎంత దూరంలో గ్రహాలు తిరుగుతున్నాయి? అన్న అనేక అంశాలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2009లో కెప్లర్ మిషన్‌ను ప్రయోగించింది. అంతరిక్షంలో ఉంటూ మన పాలపుంతలో భూమి సైజున్న గ్రహాలు ఎన్ని ఉన్నాయో చూడటం ఈ టెలిస్కోపు లక్ష్యం. తొమ్మిదేళ్లపాటు ఈ టెలిస్కోపు అంతరిక్షంలోని ఓ చిన్న భాగాన్ని మాత్రమే పరిశీలించి మన పాలపుంతలోనే కనీసం కొన్ని వందల కోట్ల ఎక్సోప్లానెట్లు ఉన్నాయని తేల్చింది. 2009 మార్చి ఆరవ తేదీన నింగికి ఎగిసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ కెప్లర్ టెలిస్కోపు వీటిల్లో ఐదు వేలకుపైగా గ్రహాలను గుర్తించింది కూడా! ట్రాపిస్ట్-1లోనూ ఏడు గ్రహాలు... కెప్లర్ గుర్తించి అనేకానేక గ్రహ వ్యవస్థల్లో ట్రాపిస్ట్-1 ఒకటి. భూమికి సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుందీ వ్యవస్థ. ఓ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం (మన సూర్యుడి సైజులో 0.8 - 0.6 శాతం సైజు మాత్రమే ఉండే నక్షత్రాలు) చుట్టూ భూమి సైజున ఏడు గ్రహాలతో ఏర్పడింది ఇది. ఈ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలు మన సూర్యుడి మాదిరి అంత ప్రకాశవంతంగా ఏమీ ఉండవు. మన పాలపుంతలో అనేక రకాల నక్షత్రాలు ఉన్నా ఈ రెడ్ డ్వార్ఫ్ రకంవి ఎక్కువగా ఉన్నాయని అంచనా. ట్రాపిస్ట్-1లోని ఏడు గ్రహాల్లోనూ నీళ్లు ఉండేందుకు అవకాశం ఉందని నాసా చెబుతోంది. స్పీట్జర్, కెప్లర్, హబుల్.. తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపుల సాయంతో ఈ గ్రహ వ్యవస్థను ఇప్పటికే క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తాజాగా ఇంకో సప్తగ్రహ వ్యవస్థ... కెప్లర్ టెలిస్కోపు ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉండగా... తాజాగా దీనిద్వారా ఇంకో సప్తగ్రహ వ్యవస్థ గురించి తెలిసింది. కాకపోతే ఇందులో ట్రాపిస్ట్-1లో మాదిరిగా భూమి కంటే పెద్ద సైజున్న గ్రహాలు ఉండటం విశేషం. ఈ సరికొత్త గ్రహ వ్యవస్థను ‘కెప్లర్-385’ అని పిలుస్తున్నారు. భూమికి సుమారు వెయ్యి కాంతి సంత్సరాల దూరంలో ఉందీ వ్యవస్థ. భూమి సైజు కంటే 1.3 రెట్ల నుంచి 2.5 రెట్లు ఎక్కువ సైజుండే గ్రహాలను సూపర్ ఎర్త్‌లతో కూడి ఉంది ఇది. ఈ గ్రహాలకు... దాని మాతృ నక్షత్రానికి మధ్య ఉన్న దూరం మన సూర్యుడికి, బుధ గ్రహానికి మధ్య ఉన్నంత దూరం! చదవండి: ఉపన్యాసం వద్దు.. ట్రంప్‌పై న్యాయమూర్తి ఆగ్రహం -
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది?
వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు. సంవత్సరంలో చివరిసారిగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సంభవించే ప్రతీసారీ ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరగనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడనుంది. అక్టోబరు 14న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది కంకణాకృతి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సమయంలో కొన్నిసార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుని వెనుక దాక్కుంటాడు. కొన్నిసార్లు మెరుస్తున్న ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. సూర్యుని ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు చంద్రుని బ్లాక్ డిస్క్ చుట్టూ ఉండే రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. దీనినే యాన్యులస్ అంటారు. సాధారణ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. అయితే వార్షిక సూర్యగ్రహణంలో, చంద్రుడు.. భూమి కక్ష్యలో దానికి దూరంగా ఉంటాడు. ఈ కారణంగా చంద్రుడు ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా కనిపిస్తూ, సూర్యుడిని అడ్డుకుంటాడు. అంటే సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. ఈ స్థితిలో సూర్యుని స్థానంలో అగ్ని వలయం కనిపిస్తుంది. కాగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో రాత్రి సమయంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి, సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారతదేశ ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణాన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు చూడవచ్చు. అమెరికాలో, ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌లలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు! -
‘మార్స్ ’ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది?
మార్స్ అంటే అంగారక గ్రహం. ఇది ఎర్రగా కనిపించడం వెనుక అనేక కారణాలున్నాయి. వీటిలో మొదటిది దాని ఉపరితలం నిర్మాణంతో ముడిపడి ఉంది. కాగా ఐరన్ ఆక్సైడ్ ఉనికిని రస్ట్ అని అంటారు. ఆక్సిజన్‌తో పాటు తేమకు చేరువైనప్పుడు భూమిపై ఉన్న ఇనుప వస్తువులు తుప్పు పడతాయి. ఇదేవిధంగా మార్స్‌పై ఇనుము ఆక్సీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అంగారక గ్రహం నేల, రాళ్ళకు విలక్షణమైన ఎరుపు రంగు సంతరించుకుంటుంది. భూమితో పోలిస్తే మార్స్ బలహీనమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అక్కడి వాతావరణం కార్బన్ డయాక్సైడ్తో కూడి ఉంటుంది. ఈ బలహీన వాతావరణంలో సూర్యరశ్మి భిన్నంగా వెలువడుతుంది. సూర్యరశ్మి అంగారకుని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రేలీ స్కాటరింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీని వలన కాంతిలోని తక్కువ తరంగదైర్ఘ్యాలు (నీలం, ఆకుపచ్చ వంటివి) ఎక్కువ వెదజల్లుతాయి. ఎక్కువ తరంగదైర్ఘ్యాలు (ఎరుపు, నారింజ వంటివి) ప్రబలంగా మారతాయి. ఇదే అక్కడి ఎరుపు రంగుకు కారణం. మార్స్ చరిత్రలో గణనీయమైన అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగాయి. ఈ విస్ఫోటనాల సమయంలో విడుదలయ్యే అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు కూడా గ్రహం రంగుకు దోహదం చేస్తాయి. అంగారక గ్రహంపై ఉన్న కొన్ని అగ్నిపర్వత పదార్థాలు, వాతావరణం మారినప్పుడు ఎరుపు రంగును ఉత్పత్తి చేస్తాయి. అంగారక గ్రహంపై భారీగా దుమ్ము తుఫానులు చోటుచేసుకుంటాయి. సూక్ష్మ ధూళి కణాలతో నిండిన ఈ తుఫానులు, సూర్యరశ్మి వెదజల్లినప్పుడు మార్స్కున్న ఎరుపు రూపాన్ని మరింత వృద్ధి చేస్తాయి. ఈ రంగు ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రేమికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంగారక గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు కూడా అక్కడి ఎరుపురంగు దోహదపడుతుంది. ఇది కూడా చదవండి: దోమలను ఎవరు ఇష్టంగా తింటారు? -
375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది?
మనిషి భూమి నలుచెరగులా తిరిగాడని, ఇక చూడాల్సినది ఏమీ లేదని అనుకుంటే అది తప్పే అవుతుంది. నేటికీ భూమిపై అన్వేషించేందుకు చాలా రహస్యాలు దాగివున్నాయి. 375 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే శాస్త్రవేత్తలు భూమికి గల 8వ ఖండం అయిన జిలాండియాను కనుగొన్నారు. ఈ ఖండం చాలా పెద్దది. పలు చిన్న దేశాలకు ఇందులో వసతి కల్పించవచ్చు. ఈ ఖండానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఏళ్లుగా దాగున్న ఖండం అని చెబుతారు. 2017 సంవత్సరం వరకు ఈ ఖండం గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ ఏడాది కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి ప్రస్తావించడంతో ప్రపంచం దృష్టి ఈ ఖండంవైపు మళ్లింది. ఈ 8వ ఖండం 49 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని పలు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. దీని ఉనికి విషయానికొస్తే ఈ ఖండం దాదాపు 55 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఖండంలోని 94 శాతం భూభాగం నీటిలో మునిగిపోయింది. 6 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఇది న్యూజిలాండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఖండం చాలా ప్రత్యేకమైనది. అగ్నిపర్వత శిలలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే జంతువులు, జీవులు ప్రపంచంలోని ఇతర జీవులకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ ఖండంలో దాగున్న రహస్యాలను వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత్‌లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత! -
డార్క్ ఎర్త్ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు?
మనిషి అంతరిక్షంలోకి వెళ్లడంలో విజయం సాధించాడు. శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే భూమిపైగల అనేక రహస్యాల చిక్కుముడులు నేటికీ వీడటం లేదు. వాటి గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా, బ్రెజిల్ పరిశోధకులు అమెజాన్‌లో డార్క్ ఎర్త్‌ను కనుగొన్నారు. డార్క్ ఎర్త్ పేరుతో సారవంతమైన భూమిని రూపొందించేందుకు పురాతన అమెజోనియన్లు ప్రయత్నించారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇటీవలి కాలంలో చేపడుతున్న వాతావరణ మార్పు ఉపశమన ప్రయత్నాలపై ఎంతో ప్రభావం చూపనుంది. పచ్చని వృక్షసంపద, వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన అమెజాన్‌లోని ఈ డార్క్ ఎర్త్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పురాతన మానవ స్థావరాల చుట్టూ ఉన్న నల్లని, సారవంతమైన మట్టిని పురావస్తు శాస్త్రవేత్తలు డార్క్ ఎర్త్ అని పిలుస్తారు. ఈ నేలను ఉద్దేశపూర్వకంగా తయారు చేశారా లేక ఇది పురాతన సంస్కృతుల ప్రతిబింబమా అనేది స్పష్టంగా తొలుత తెలియరాలేదు. ఈ పరిశోధనా బృందం.. మట్టి విశ్లేషణ, ఎథ్నోగ్రాఫిక్ ప్రతిస్పందనలు, ఆధునిక స్వదేశీ కమ్యూనిటీల సాయంతో పలు వివరాలు సేకరించి, డార్క్ ఎర్త్‌ను పురాతన అమెజోనియన్లు ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారని నిరూపించారు. డార్క్ ఎర్త్‌ను తయారు చేయడంలో నాటి ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారని, దానిని మానవ జనాభా నివాసానికి అనువైన ప్రదేశంగా మార్చడానికి, వాతావరణాన్ని ఎంతో చొరవతో సవరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంఐటీకి చెందిన ఎర్త్, అట్మాస్ఫియరిక్ ప్రొఫెసర్ టేలర్ పెర్రోన్ మాట్లాడుతూ డార్క్ ఎర్త్‌లో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ భూమిలో భారీ మొత్తంలో నిల్వఅయిన కార్బన్ ఉంది. ఇది వేల సంవత్సరాలుగా ఈ భూమిలో పేరుకుపోయింది. తరతరాల ప్రజలు తమ ఆహార వ్యర్థాలు, బొగ్గు, చెత్తతో ఈ మట్టిని సారవంతం చేశారన్నారు. సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమైన నివేదికను ఆగ్నేయ అమెజాన్‌లోని ఎగువ జింగు నది పరీవాహక ప్రాంతంలోని క్యూకురో ప్రాంతం నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. పరిశోధకులు మట్టి నిర్వహణలో క్యూకురో పద్ధతులను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించారు. చెత్త, ఆహార స్క్రాప్‌ల కుప్పలు కంపోస్ట్ ఎరువు కుప్పల మాదిరిగానే ఉంటాయి. ఇవి కుళ్ళిపోయి మట్టిలో కలిసి, సారవంతమైన నేలను ఏర్పరుస్తాయి. ఈ డార్క్ఎర్త్ అభ్యాసాలను డాక్యుమెంట్ చేయడానికి పరిశోధకులు గ్రామస్తులతో ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు. గ్రామస్తులు ఈడార్క్ ఎర్త్‌ను ఇగెపె అని పిలుస్తారు. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సారవంతమైన మట్టి రూపకల్పనకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇది కూడా చదవండి: పాక్‌లో మాజీ ప్రధానుల అరెస్ట్ ఎందుకు? ఏఏ కేసులలో అరెస్ట్ అయ్యారు? -
ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది?
మానవులు భూమిపై అనేక విపత్తులను చవిచూశారు. ప్రతి సంవత్సరం లెక్కలేనంత జనాభా.. భూకంపాలు, వరదలకు బలవుతూవస్తోంది. ఇటీవలి కరోనా విధ్వంసం లక్షలాదిమంది ప్రాణాలను బలిగొంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న విధ్వంసం గురించి విన్నప్పుడు ఎవరికైనా సరే కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. నాటి ఆ విపత్తు తీవ్రతకు ఈ భూమండలంపై కేవలం 1,280 మంది మాత్రమే మిగిలారు. ఈ పెను విపత్తు ఎప్పుడు సంభవించింది? మనం చెప్పుకోబోతున్న ఈ సంఘటన తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. అంతటి విపత్తులో తమను తాము రక్షించుకోగలిగిన 1,280 మంది మాత్రమే మిగిలారు. వారి కారణంగానే ఈ రోజు ఈ భూమిపై ఎనిమిది బిలియన్ల మంది ప్రజలు జీవించి ఉన్నారని చెబుతారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం జర్మన్ న్యూస్ వెబ్సైట్ డీడబ్ల్యు తెలిపిన వివరాల ప్రకారం మనిషి పూర్వీకులు ఒకప్పుడు విపత్తులకు చాలా దగ్గరగా ఉండేవారు. ఈ విషయాన్ని జన్యు విశ్లేషణ ఆధారంగా జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. మానవ జనాభా దాదాపు అంతరించిపోయిన కాలం ఒకప్పుడు ఏర్పడిందని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిశోధన రెండు లక్షల సంవత్సరాల క్రితం దొరికిన ఆదిమ మానవుల అవశేషాలపై జరిగింది. ఈ పరిశోధన ఎవరు సాగించారంటే.. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఈ పరిశోధన చేసింది. తొమ్మిది లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం భూమిపై తలెత్తిన ఆ విపత్తు అనంతరం భూమిపై కేవలం 1280 మంది మాత్రమే మిగిలారని పరిశోధకులు కంప్యూటర్ మోడలింగ్ ద్వారా కనుగొన్నారు. నాటి భీకర విపత్తులో 98.7 శాతం మానవ జనాభా నాశనమైందని ఈ పరిశోధన నిర్వహించిన ప్రధాన పరిశోధకుడు హైపెంగ్ లీ వివరించారు. ఇంతకీ నాడు భూమిపై ఏమి జరిగింది? ఈ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం మంచు యుగంలో భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గడం వల్ల ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఈ మంచు యుగంలో మానవులు దాదాపు అంతరించిపోయారు. అయితే అంతటి దుర్భర పరిస్థితిలోనూ తమను తాము రక్షించుకోవడంలో కొందరు మానవులు విజయం సాధించారు. ఈ మానవులే తదుపరి మానవ నాగరికత అభివృద్ధికి కారణమయ్యారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: తల తీయడం మొదలు తుపాకీతో కాల్చడం వరకూ.. ఏ దేశంలో ఎటువంటి మరణశిక్ష? -
ఆదిత్య ఎల్1.. అసలు కథ షురూ
సూర్యుని పై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ లో మరో కీలక ఘట్టం నమోదైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సూర్యుడిని చేరుకునేందుకు ఐదో సారి భూ కక్ష్యను పెంపును ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఆదిత్య ఎల్ -1 భూప్రదక్షిణ దశ ముగించుకుని.. సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.ఇక ఇక్కడి నుంచి అసలు ఉత్కంఠ మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాహన నౌక లగ్రాంజ్ పాయంట్ 1 దిశగా దూసుకెళ్లడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలో వెళ్లేలా విన్యాసం చేశారు. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ కేంద్రంగా ఇస్రో ఆపరేట్ చేస్తుంది. అదేవిధంగా మారిషస్, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు భూ కక్ష్య పెంపును సమీక్షించాయి. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 శాటిలైట్ 256 కి.మీ x 121973 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాటిలైట్ సూర్యుడి వైపు ప్రయాణించి.. నిర్దేశిత ఎల్-1 పాయింట్ కు చేరాలంటే మరో నాలుగు నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. డేటా సేకరణ ప్రారంభం సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్ -1 (Aditya-L1) ప్రయోగించింది. అయితే ఇది శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది. Aditya-L1 Mission: Aditya-L1 has commenced collecting scientific data. The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth. This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri — ISRO (@isro) September 18, 2023 -
ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
వాషింగ్టన్: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక 'మెసెంజర్'. నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు. 'మెసెంజర్' 'అడ్వెంచర్' ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక 'మెసెంజర్' తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా వజ్రమేనా.. ఈ ఫోటో కింద నాసా రాస్తూ.. వారు నన్ను మిస్టర్ ఫారన్‌హీట్ అని పిలుస్తారు. సైజులో భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జూ. సూర్యుడు.. వాతావరణానికి బదులుగా బుధుడిపై చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం లేకపోవడం, సూర్యునికి అత్యంత చేరువగా ఉండటంతో పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని ఉపరితలాన్ని పరీక్షించేందుకు వీలుగా నీలి రంగు వర్ణాల ఉపరితలాన్ని అక్కడక్కడా గుంతలు ఉండటాన్ని మనం గమనించవచ్చని రాసింది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఇది కూడా చదవండి: ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం -
చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది?
చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో లేదు. అక్కడి టెక్టోనిక్ ప్లేట్లు భూమి టెక్టోనిక్ ప్లేట్ల మాదిరిగా చురుకుగా లేవు. చంద్రునిపై భూకంపాలు వస్తుంటాయి. ఇటీవల చంద్రునిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్ అక్కడి భూకంప కార్యకలాపాల సంకేతాలను కనుగొంది. చంద్రునిపై వచ్చే భూకంపాలు భూమికి వచ్చే భూకంపాల కంటే శక్తివంతంగా ఉంటాయని, ఒక్కోసారి వాటి తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై వివిధ రకాల సాధనాలు భూకంపాల గురించిన సమాచారాన్ని అందిస్తాయి. అయితే చంద్రునిపై అపోలో 17లోని వ్యోమగాములు అక్కడ భూకంప కార్యకలాపాలను సంగ్రహించే ప్రదేశాలలో సీస్మోమీటర్లను విడిచిపెట్టారు. చంద్రునిపై ఈ సీస్మోమీటర్లు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చురుకుగా ఉన్నాయి. అయితే అవి ఆ సమయంలో 12 వేల భూకంపాల గురించిన సమాచారాన్ని అందించాయి. చంద్రునిపై నాలుగు రకాల భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటి లోతైన భూకంపం, మరొకటి తేలికపాటి లేదా నిస్సార భూకంపం, మూడవది ఉల్కా భూకంపం. నాల్గవది థర్మల్ భూకంపం. లోతైన భూకంపాలు లోతైన భూకంపాలు చంద్రునిపై అత్యంత సాధారణ తరహా భూకంపాలు. ఇవి చంద్రుని ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల వరకు ఉద్భవించాయి. భూమిపైనున్న మహాసముద్రాలను చంద్రుడు ప్రభావితం చేసిన విధంగా, చంద్రుని లోతైన రాతి కోర్‌పై భూమి ఎక్కువగా ప్రభావితం అవుతుందని, ఇది భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కా భూకంపం చంద్రునిపై ఉల్కలు పరస్పరం ఢీకొనడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇదేకాకుండా చంద్రుని ఉపరితలంపై మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగానూ చంద్రునిపై ఉష్ణ భూకంపాలు సంభవిస్తాయి. రెండు వారాల పాటు చంద్రునిపై చీకటి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత -115 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుంది. పగటిపూట +121 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుంది. ఈ హెచ్చుతగ్గుల కారణంగా భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. తేలికపాటి భూకంపం చంద్రునిపై సంభవించే తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 కంటే ఎక్కువగా ఉంది. చంద్రుని లోపలున్న టెక్టోనిక్ ప్లేట్, ఇటీవల ఏర్పడిన పెద్ద బిలం మధ్య పరస్పర చర్య ఈ భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలు ఎంతసేపు ఉంటాయి? భూమిపై భూకంపాలు 10 నుండి 30 సెకన్ల వరకు ఉంటాయి. కొన్ని రెండు నిమిషాల పాటు ఉంటాయి. మరికొన్ని పది నిమిషాల పాటు ఉంటాయి. భూమితో పోలిస్తే చంద్రుని దృఢత్వం అధికం. అందుకే అక్కడ ప్రకంపనలు పది నిమిషాలకు పైగా ఉంటాయి. కొన్ని గంటలపాటు కూడా ప్రభావం చూపిస్తాయి. భవిష్యత్తులో అక్కడ కాలనీ నిర్మించడానికి చంద్రునిపై భూకంపాల అధ్యయనం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో మరిన్ని మిషన్లు అక్కడ వివిధ పరికరాలను అమర్చర్చి భూకంపాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకుంటాయి. నాసా సమీప భవిష్యత్తులో చంద్రునిపై అనేక సీస్మోమీటర్లను వ్యవస్థాపించే ప్రణాళికను రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు? -
ఆదిత్య L1 సెల్ఫీ...ఒకే ఫ్రేమ్ లో భూమి-చంద్రుడు..
-
వాహ్ ఆదిత్య.. సెల్ఫీ అద్భుతం
బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) విన్యాసాలు షురూ చేశాడు. ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది కూడా. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్1. అందుకు ఇంకా 4 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తొలి 16 రోజులు భూకక్ష్యల్లోనే చక్కర్లు కొడుతుంది. అలా.. చక్కర్లు కొడుతూ.. ఆదిత్య ఎల్1 అద్భుతమైన ఫొటోలను తీసింది. ఎల్1 మిషన్ కనిపించేలా సెల్ఫీ తీసుకోవడంతో పాటు ఒకే ఫొటోలో భూమి, సుదూరాన ఉన్న చంద్రుడు ఫొటోల్ని కూడా బంధించింది. సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది. ‘‘ ఆదిత్య-ఎల్1 మిషన్: చూస్తోంది!. సూర్యుడు-భూమి ఎల్1 పాయింట్ లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 ఒక సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి చిత్రాలు కూడా తీసింది’’ అంటూ ఇస్రో ఒక వీడియోను షేర్ చేసింది. Aditya-L1 Mission: 👀Onlooker! Aditya-L1, destined for the Sun-Earth L1 point, takes a selfie and images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy — ISRO (@isro) September 7, 2023 ఆదిత్య ఎల్1 మిషన్ శాటిలైట్ జీవితకాలం ఐదేళ్లు కాగా ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా.. సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయాలనుకుంటోంది ఇస్రో. -
కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి
సాక్షి, మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో పిడుగుపాటుకు భూమి కుంగిపోయింది. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిమ్మ చీకట్లో అకస్మాత్తుగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సమీపంలో ప్రధాన రహదారి పక్కన పిడుగులు పడ్డాయి. సోమవారం ఉదయం లేచి చూసేసరికి పిడుగు పడిన చోట భూమి కుంగిపోయిందని ఆ గ్రామ సర్పంచ్ రామశివ సుబ్రహ్మణ్యం చెప్పారు. చదవండి: ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు -
చంద్రునిపై వీరవల్లి వాసికి 2 ఎకరాల భూమి
హనుమాన్ జంక్షన్ రూరల్: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్ఆర్ఐ బొడ్డు జగన్నాథరావు చంద్రుడిపై రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌కు ఉద్యోగరీత్యా వెళ్లిన ఆయన 2005లో ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ గురించి తెలుసుకున్నారు. చంద్రునిపై భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్క్లెయిమ్ డీడ్‌ను ఈ సంస్ధ నిర్వహిస్తోంది. చంద్రునిపై ప్రయోగాలు, చంద్ర మండల ప్రదేశాలపై అన్వేషణ, అభివృద్ధి, పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయంగా క్రౌడ్ ఫండింగ్ చేపట్టేందుకు లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఏర్పడింది. దీంతో న్యూయార్క్‌లోని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన బొడ్డు జగన్నాథరావు తన కుమార్తెలు మానస, కార్తీక పేరిట చెరో ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేశారు. చంద్రునిపై ఏయే అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భూమి కొనుగోలు చేశారో సవివరంగా లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఇచ్చిన రిజిస్ట్రేషన్క్లెయిమ్ డీడ్‌పై స్పష్టంగా పేర్కొన్నారు. ల్యాండ్ పార్శిల్ నంబర్లు, చంద్రునిపై అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు గుర్తించిన ప్రాంతాల పేర్లను కూ డా ఇందులో ముద్రించారు. దీంతోపాటు చంద్రునిపై ఉపరితలం వీడియో సీడీ, కొనుగోలు చేసిన ల్యాండ్ మ్యాప్‌ను జగన్నాథరావుకు ఇచ్చారు. తాజాగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్–3 విజయవంతం కావటం, పలు అంతర్జాతీయ సంస్ధలు కూడా చంద్ర మండలంపైకి మానవుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం సంతోషకరమని జగన్నాథరావు అంటున్నారు. -
రాఖీ కట్టేందుకే విక్రమ్‌ని పంపించాం! ఏం గిప్ట్ ఇస్తున్నావ్ మామా!
చందమామ రావే... జాబిల్లి రావే... అని పాలబువ్వ తిన్నన్ని రోజులూ పాడుతూనే ఉన్నాం. నీ పాట పాడుతూ, నువ్వు వస్తావని నమ్ముతూనే పెరిగాం. పెద్దయిన తర్వాత రావోయి చందమామా అని పిలిచాం. వస్తాడు నా రాజు ఈ రోజు అని దొంగచూపులు, బెంగచూపులు చూశాం. నెలవంక కోసం ఆకాశంలో వెతికాం. పున్నమి రోజు నీ వెన్నెల కోసం ఎదురుచూస్తుంటాం. మా చిన్నప్పుడు మా అమ్మ ‘నిన్ను అంతగా పిలిచింది’ ఎన్ని తరాలు పిలిచినా, ఎన్ని తరాల అమ్మలు పిలిచినా నువ్వు రాలేదు. అందుకే మేమే నీ దగ్గరకు వచ్చేశాం. అమ్మలందరికీ అమ్మ మా భూమాత. భూమి తల్లి తన ప్రతినిధిగా నీ దగ్గరకు విక్రమ్‌ని పంపించింది చూశావు కదా! అమ్మకు తమ్ముడంటే చాలా ఇష్టం మామా! రక్షాబంధన్ పండుగకు నీకు రాఖీ కట్టడానికే విక్రమ్‌ని పంపించింది చూడు! మరి!!! రక్షాబంధన్ కట్టించుకున్న నువ్వు... అమ్మకు బహుమతి ఏమిస్తున్నావ్ చందమామా! ఈ రోజు శ్రావణమాసం, పున్నమి రోజు. రక్షాబంధన్ వేడుక చేసుకుంటున్నాం. ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. అన్నదమ్ముల శ్రేయస్సు కోరుతూ అక్కచెల్లెళ్లు భగవంతుడికి పూజ చేసి, తీపి వంటకాలను నివేదన చేస్తారు. పూజలో ఉంచిన రక్షాబంధనాన్ని అన్నదమ్ముల ముంజేతికి కట్టి ‘ఇది నీకు రక్ష, నువ్వు నాకు రక్ష’ అని మమతలు పూయిస్తారు. పురాణకాలంలో యమున తన సోదరుడు యముడికి రాఖీ కట్టింది. శ్రీకృష్ణుడికి వరుసకు చెల్లెలైన ద్రౌపది రాఖీ కట్టింది. చరిత్రకాలంలో రాణి కర్ణావతి చక్రవర్తి హుమయూన్‌కి రాఖీ పంపింది. ఈ కథనాలను చదువుకున్నాం. రాఖీ మీద వచ్చిన సినిమాలను చూశాం. సినిమాలో హీరోకి అక్క పాత్ర కట్టినంత అందమైన రాఖీని చూసినప్పుడు ఈ సారి రక్షాబంధన్‌కి తన తమ్ముడికి కూడా అలాంటి అందమైన రాఖీనే కట్టాలని ప్రతి అక్కా ఉవ్విళ్లూరుతుంది. అలా వచ్చినవే రకరకాల రాఖీలు. ముత్యాలను పోలిన తెల్లటి పూసలతో అల్లిన రాఖీలు, కెంపుల వంటి రాళ్లు పొదిగిన రాఖీలు, తెల్లటి రాళ్లు, పచ్చటి చమ్కీలతో మెరిసే రాఖీలు, రంగురంగు పూసల రాఖీలు, మువ్వల రాఖీలు రూపుదిద్దుకున్నాయి. ఎకో ఫ్రెండ్లీగా మట్టి రాఖీలు మణికట్టును ఆకట్టుకున్నాయి. బంగారు, వెండి రాఖీలు రాజ్యమేలాయి. ఈ ఏడాది మాత్రం రాఖీల్లో చందమామ హీరో అయ్యాడు. రాఖీల మీద రాకింగ్ చేస్తున్నాడు. ఇక మేమైతే ఈ ఏడాది నీ రాఖీలతో పండుగ చేసుకుంటున్నాం. అమ్మాయిల చెవులు పట్టుకుని ఉయ్యాలలూగిన చాంద్‌బాలీలు ఇప్పుడు అబ్బాయిల మణికట్టు మీద మకుటాయమానంగా మెరుస్తున్నాయి. అర్ధవలయాకారంలో నువ్వు ముంజేతి మీద ఉంటే ప్రతి అబ్బాయీ ‘మా అక్క కట్టింది చూడు’ అని ప్రియురాలికి చూపించుకుంటూ తామే చందమామ అయినట్లు మురిసిపోతున్నారు... మెరిసిపోతున్నారు నీ మేనల్లుళ్లు. (చదవండి: తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!) -
ఆకాశంలో అద్భుతం.. నేటి సాయంత్రం సూపర్ బ్లూ మూన్ దర్శనం
నేడు(ఆగస్టు 30) ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. రోజులా కాకుండా ఇవాళ చంద్రుడు పెద్దగా, కాంతివంతంగా దర్శనం ఇవ్వబోతున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఈ అద్భుతం జరగనుంది. నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించనున్నాడు. కాగా బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో కాకుండా నారింజ రంగులో దర్శనమివ్వనున్నాడు. అయితే ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. సాధారణంగా ఏడాదిలో రెండు లేదామూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతూవుంటాయి. స్పేస్.కామ్ ప్రకారం.. ఈ సూపర్ బ్లూ మూన్ బుధవారం రాత్రి 7.10 గంటలకు కనిపించనుంది. నాసా తెలిపిన దాని మేరకు రెండు గంటల తర్వాత ఇది అత్యంత ప్రకాశవంతంగా పెద్దదిగా కనిపించనుంది. గురువారం ఉదయం 6.46 గంటలకు అస్తమించనుంది. అయితే బయట వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో ఈ మూన్ అందంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలోని ప్రజలు తెల్లవారుజామున దీనిని చూడటం మంచిదని అంటున్నారు. చదవండి: ఆ అధికారం ఉందా?.. జమ్ము విభజనపై సుప్రీం బ్లూ మూన్ అంటే..? బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్‌లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడబోయే బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు. అరుదుగా బ్లూ మూన్ బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలపింది.. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్ కనపించనుందట.. మరొకటి మార్చిలో దర్శనమివ్వనుంది. అంటే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
గ్రావిటీ హోల్లో భూ ఆవిర్భావ నమూనా?
నేటికీ భూమి మూలం ఏమిటనేది శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. భూమి చరిత్ర ఏమిటి? అది ఎలా పుట్టింది? దీనిపై జీవం ఎలా మొదలైంది?.. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు. అయితే ఇప్పుడు గ్రావిటీ హోల్ దీనికి సరైన సమాధానం చెప్పనున్నది. దీని సాయంతో శాస్త్రవేత్తలు భూమి ఆవిర్భావానికి గల కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలో ఏమి తేలింది? ఇటీవల బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ఒక పరిశోధనను నిర్వహించాయి. హిందూ మహాసముద్రంలో గ్రావిటీ హోల్ ఉందన్న విషయాన్ని వారు గుర్తించారు. ఈ గురుత్వాకర్షణ కేంద్రం ఒక పురాతన సముద్ర అవశేషం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షల సంవత్సరాల క్రితమే ఈ సముద్రం భూమి నుండి కనుమరుగైంది. ఈ పరిశోధన భూ ఆవిర్భావ రహస్యాల పొరలను తెరిచింది. దీని సాయంతో రానున్న కాలంలో వీటి ఆధారంగా భూమి మూలానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గురుత్వాకర్షణ రంధ్రం ఎంత లోతున ఉంది? పరిశోధకులు ఈ గురుత్వాకర్షణ రంధ్రంనకు ఐఓజీఎల్ అనే పేరు పెట్టారు. ఇది హిందూ మహాసముద్రంలో సుమారు రెండు మిలియన్ చదరపు మైళ్ల మేరకు విస్తరించి ఉంది. ఇక దీనిలోతు విషయానికి వస్తే ఇది భూమి క్రస్ట్ కింద 600 మైళ్లకు మించిన లోతున ఉంది. ఈ ఐఓజీఎల్ ఏనాడో అదృశ్యమైన టెథిస్ మహాసముద్రంలోని ఒక భాగమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమి లోతుల్లో మునిగిపోయివుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా గోండ్వానా, లారాసియా ఖండాలను టెథిస్ మహాసముద్రం వేరుచేసిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం.. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ గురుత్వాకర్షణ రంధ్రం సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుందని, ఇది రాబోయే కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరగడం వెనుక గురుత్వాకర్షణ శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి గుండా వెళుతున్నప్పుడు ఈ గ్రావిటీ హోల్ ఏర్పడివుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గురుత్వాకర్షణ రంధ్రంపై జరిగిన పరిశోధన వివరాలు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం!
ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లేముందు వందసార్లు ఆలోచించాల్సి వస్తుంటుంది. నిజానికి ఈ భూమి మీద చాలామేరకు పచ్చదనం, జీవం కనిపిస్తుండగా, ఆ ప్రాంతంలో చావు, నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం భూమిపై అత్యంత విషపూరితమైన ప్రాంతంగా పేరొందింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ఏ ఎడారిలోనే లేదు. ఫ్రాన్స్‌లోని పట్టణ ప్రాంతానికి కొంచెం దూరంలో ఉంది. ఒకప్పుడు మనుషులతో సందడిగా ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రదేశంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషపూరిత ప్రదేశం ఎక్కడుంది? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషపూరిత ప్రదేశాన్ని జోన్ రోగ్ అని అంటారు. కొందరు ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఫ్రాన్స్‌లో ఉంది. గడచిన వంద సంవత్సరాలుగా ఈ ప్రదేశాన్ని ఎవరూ సందర్శించలేదు. ఇక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వం నిషేధించింది. నిజానికి ఈ ప్రాంతపు మట్టిలోనే కాదు ఇక్కడి నీటిలోనూ పూర్తిగా విషం నిండివుంది. ఇక్కడి పదార్థం ఏదైనా మనిషి, లేదా మరో జీవి నోటిలోకి వెళితే మరణం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రదేశం విషపూరితంగా ఎలా మారింది? మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రదేశం జనం సందడితో ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒకప్పుడు మానవ నివాసాలు ఉండేవి. అయితే ఈ ప్రదేశం ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైంది. ఇక్కడ లెక్కకు మించిన బాంబులు ప్రయోగించారు. ఈ ప్రాంతంలో రసాయన దాడులు జరిగాయి. ఇక్కడి గాలి కూడా విషపూరితమే. కొంతకాలం క్రితం ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం ఇక్కడికి వెళ్లారు. ఇక్కడి మట్టిలోనే కాదు నీళ్లలో కూడా ఆర్సెనిక్ అధికమోతాదులో ఉందని తేలింది. దీనిలోని ఒక్క రేణువైనా ఏ జీవి నోటిలోకి వెళ్లినా మరణం ఖాయమని వారు తమ పరిశోధనలో గుర్తించారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. -
భూమికోసం తల్లిని చంపిన తనయుడు
కరీంనగర్: కన్న కొడుకే కాలయముడయ్యాడు. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లి తమ్మనవేణి కనుకవ్వ(60)ను భూమికోసం దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తమ్మనవేణి కనుకవ్వ(60)కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు వినోద్ ఉన్నాడు. భర్త గతంలోనే చనిపోవడంతో అన్నీతానై పిల్లలను సాకి ప్రయోజకులను చేసింది. కూతుళ్లు, కుమారుడి వివాహలు చేసింది. భర్త తరఫున వచ్చిన ఎకరం భూమిని తన కొడుకు వినోద్ పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. తనతల్లిగారి తరఫున వచ్చిన రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ చిన్నకూతురుతో కలిసి ఉంటోంది. కొద్దిరోజులుగా తల్లిగారిల్లు రేణికుంటలో ఒక్కతే అద్దెకు ఉంటోంది. రెండెకరాలపై కన్నేసిన కొడుకు.. తండ్రి తరఫున వచ్చిన ఎకరం తీసుకున్న కొడుకు వినోద్.. కనుకవ్వ పుట్టింటివారు ఇచ్చిన భూమి కూడా తనకే కావాలని రెండేళ్లుగా గొడవ పడుతున్నాడు. అది కూతుళ్లకు ఇస్తుందనే అనుమానంతో గతేడాది పంటలు వేయకుండా అడ్డుకున్నాడు. అయినా తల్లి భూమి రిజిస్ట్రేషన్ చేయలదు. దీంతో ఈ ఏడాది బలవంతంగా భూమి లాక్కుని, కౌలుకు ఇచ్చాడు. దీంతో గొడవలు పెద్దవయ్యాయి. గండ్లు పూడ్చేందుకు వెళ్లి.. ఇటీవల కురిసిన వర్షాలకు వరద పోటెత్తడంతో జంగపల్లి శివారులోని వ్యవసాయ భూమిలో గండ్లుపడ్డాయి. వాటిని పూడ్చేందుకు వినోద్ బుధవారం ఉదయం వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న కనుకవ్వ కూడా పొలం వద్దకు వెళ్లింది. తన భూమిలో ఎందుకు సాగు చేస్తున్నావని కొడుకును అడిగింది. ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆవేశానికి లోనైన వినోద్.. తన చేతిలోని పారతో తల్లి తలపై బలంగా కొట్టాడు. దీంతో కనుకవ్వ తీవ్రగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. కూతుళ్లు ఇచ్చిన సమాచారం మేరకు తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎల్ఎండీ, గన్నేరువరం ఎస్సైలు ప్రమోద్‌రెడ్డి, నర్సింహారావు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన!
ఇతర గ్రహాల నుండి వచ్చిన మనుషులు మన భూమిపై నివసిస్తున్నారా? గ్రహాంతరవాసుల ఉనికి గురించి ఎప్పటికప్పుడు అనేక వాదనలు వినిపిస్తుంటాయి. అమెరికాకు చెందిన కొందరితో గ్రహాంతరవాసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా అంటుంటారు. అయితే ఈ వాదనకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాలేదు. రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను దాచిపెట్టి.. తాజాగా అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి గ్రహాంతరవాసులకు సంబంధించిన మరో వాదన వినిపించారు. ఇది మరోసారి గ్రహాంతరవాసుల ఉనికికి ఆజ్యం పోస్తున్నది. రిటైర్డ్ మేజర్ డేవిడ్ గ్రుష్.. కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ఎగిరే వస్తువులను కనుగొనడానికి రూపొందించిన రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారు. అయితే పెంటగాన్.. గ్రుష్ వాదనలను కొట్టివేసింది. కాగా ఎగిరే వస్తువుల విషయంలో అమెరికా అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినా(యూఏపీ) అనే పదాన్ని ఉపయోగిస్తుందని గ్రుష్.. హౌస్ ఓవర్‌సైట్ సబ్‌కమిటీకి తెలిపారు. ఇది రహస్యమైన విమానాలు, వస్తువులు, చిన్న ఆకుపచ్చ మనుషుల అధ్యయనం గురించి తెలియజేస్తుంది. ‘అది జాతీయ భద్రతా అంశం’ ఇటీవల డెమొక్రాట్లు,రిపబ్లికన్లు యూఏపీని జాతీయ భద్రతా అంశంగా నొక్కిచెప్పారు. టాస్క్‌ఫోర్స్ మిషన్‌కు సంబంధించిన అన్ని అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్‌లను మూఏపీ సాయంతో గుర్తించాలని ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ అధిపతి తనను 2019లో కోరినట్లు గ్రుష్ వివరించారు. ఆ సమయంలో గ్రుష్ జాతీయ నిఘా కార్యాలయానికి పలు వివరాలు అందజేశారు. ఈ సమయంలో బహుళ-దశాబ్దాల యూఏపీ క్రాష్ ఆవిష్కరణ గురించి తనకు తెలియజేశారని, దానిపై రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడం గురించి కూడా సమాచారం ఉందని గ్రుష్ చెప్పారు. అయితే అప్పట్లో తాను దీని గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించాననన్నారు. ‘గ్రహాంతరవాసుల గురించి యూఎస్‌కు తెలుసు’ ఇతర గ్రహాలపై జీవం గురించి యూఎస్ ప్రభుత్వం దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని అడిగిన ప్రశ్నకు, 1930ల నుండి మానవేతర కార్యకలాపాలు లేదా గ్రహాంతరవాసుల గురించి యూఎస్‌కు తెలుసని ఆయన అన్నారు. అయితే గ్రుష్ చేసిన ఈ వాదనలను పెంటగాన్ ఖండించింది. డిఫెన్స్ డిపార్ట్మెంట్కు చెందిన స్యూ గోఫ్ ఒక ప్రకటనలో గ్రుష్ వాదనలు సరైనవని నిరూపించడానికి దర్యాప్తు సమయంలో ఎటువంటి సమాచారం లభ్యం కాలేదన్నారు. మరొక గ్రహంపై జీవి ఉనికి, రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నకు సంబంధించిన వివరాలు యూఎస్ దగ్గర లేవని పేర్కొంది. ఇది కూడా చదవండి: పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే -
600 మిలియన్ల ఏళ్ల నాటి సముద్రం..భూమి పుట్టుకకు ముందు..
భూమిగా ఏర్పడటానికి ముందు అగ్ని గోళంలో ఉండేదని క్రమేణ ఘనీభవించిన మంచులా ఉందని ఆ తర్వాత విస్పోటనం చెంది భూమిగా ఏర్పడిందని తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న సముద్రాల ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), జపాన్‌లోని నీగాట యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అందుకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించారు. భూమి చరిత్రకు సంబంధించిన ఆక్సిజనేషన్ ఏర్పడుటకు దారితీసిన సంఘటనలను గురించి తమ అధ్యయనంలో వెల్లడించారు. శాస్త్రవేత్తలు సుమారు 700 నుంచి 500 మిలియన్ల సంవత్సరాల క్రితం స్నోబాల్ ఎర్త్ గ్లేసియోషన్ అని పిలిచే మందపాటి మంచు పలకలు భూమిని కంపి ఉంచినట్లు విశ్వసిస్తారు. భూమిపై ఉన్న వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుదలను రెండొవ ఆక్సిజనేషన్ ఈవెంట్‌గా పిలుస్తారు. భూమి ప్రారంభక్రమంలో ఈ ఆక్సిజన్ రకరకాలుగా మార్పు చెంది చివరికి జీవనానికి ఉపయోగపడే విధంగా రూపాంతరం చెందింది. భూమి పుట్టుకకు ముందు ఉన్న ఉనికి కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించిన శిలాజాలు, సముద్రాలు మాయమవ్వడంతో అదోక అంతుపట్టిని మిస్టరిలా ఉండిపోయింది. ప్రస్తుతం హిమలయాల్లో అటువంటి సముద్ర ఫలకాలకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించడంతో ఆ విషయాలను కనుగొనవచ్చు అనే కొత్త ఆశ పరిశోధకుల్లో చిగురించడం ప్రారంభమైంది. శాస్త్రవేత్తల బృందం కనుగొన్న నీటి బిందువు స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ సమయానికి చెందినదని, కాల్షియంను కోల్పోయినట్లు గుర్తించారు. మహాసముద్రాల్లో ప్రవహం లేదు గనుక కాల్షియం అవక్షేపం ఉండదని, దానిలో నెమ్మదిగా మెగ్నిషియం పెరుతుందని అన్నారు. అందువల్లే ఈ మహాసముద్రం ఘనీభవించినప్పుడూ ఏర్పడిన మెగ్నిషియంను వాటి రంధ్రాల్లో బంధించిందని పరిశోధకులు చెబుతున్నారు. కాల్షియం లేమి పోషకాహర లోపానికి దారితీస్తుంది. ఈ పరిస్థితి కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడే సైనో బాక్టీరియాకు అనుకూలంగా మారింది. దీంతో వాతావరణంలో ఎక్కువ ఆక్సిజన్ బయటకు పంపడం జరిగిందని తెలిపారు. వాతావరణంలో ఆక్సిజన్ పెరిగినప్పుడల్లా జీవసంబంధమైన రేడియేషన్ ఉంటుంది అని శాస్త్రవేత్త ఆర్య చెప్పారు. దీనికోసం శాస్త్రవేత్లల బృందం పశ్చిమ కుమావోన్ హిమాలయాలలో అమృత్పుర్ నుంచి మిలామ్ హిమనీనాదం వరకు, అలాగే డెహ్రుడూన్ నుంచి గంగోత్రి వరకు అదృశ్యమైన సముద్రల ఉనికి కోసం అన్వేషించారు. ఈ నిక్షేపాలు పురాతన సముద్రపునీటి ఉనికిని వెల్లడించాయి. ఇది భూమి చరిత్రకు సంబంధించి మహా సముద్రాల ఉనికి వాటి పరిణామక్రమానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!) -
చందమామకు ఎవరు దగ్గర?
గోరుముద్దలు తింటున్నప్పుడే ఆకాశంలో చందమామను అందుకోవాలన్న ఆరాటం మనిషిది. అలా అందుకోవాలంటే దగ్గరవ్వాలి. అందుకే అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్ షిప్పులతో ప్రయాణాలు. అలాగాకుండా భూమ్మీద నుంచే చూస్తే.. చందమామ ఎవరికి దగ్గరో తెలుసా? ఏయే దేశాల వారికి దగ్గరగా ఉంటాడో తెలుసా? అసలు అంతరిక్షానికి భూమ్మీద దగ్గరి ప్రాంతమేంటో ఐడియా ఉందా? చందమామపైకి ఇస్రో తాజా ప్రయోగం నేపథ్యంలో ఈ వింతైన విశేషాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఎవరెస్ట్ ఎత్తయినదే.. అయినా.. భూమ్మీద ఏ ప్రాంతం చంద్రుడికి దగ్గరగా ఉంటుందనే ప్రశ్నకు.. ఎవరెస్ట్ శిఖరమే అయి ఉంటుందని చాలా మంది అంచనా వేస్తుంటారు. ఎందుకంటే భూమిపై ఎత్తయిన ప్రాంతం అదేకదా అంటారు. కానీ ఇది కొంత వరకే నిజం.. హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరం భూమి ఉపరితలంపైన మాత్రమే ఎత్తయినవి. భూమి మధ్యభాగం నుంచి చూస్తే.. ఎవరెస్ట్ కన్నా ఎత్తయిన ప్రాంతాలూ ఉన్నాయి మరి. అవే చందమామకు, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయి. భూమి ఆకృతి ఎఫెక్ట్ మన భూమి అచ్చంగా గోళాకారంలో ఉండదు. ధ్రువ ప్రాంతాల వద్ద కాస్త నొక్కినట్టుగా, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉబ్బెత్తుగా.. కాస్త దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. భూమి భ్రమణ వేగం, సూర్యుడి గురుత్వాకర్షణ వంటివే దీనికి కారణం. ఈ కారణం వల్లే భూమి మధ్యభాగం నుంచి చూస్తే.. ధ్రువ ప్రాంతాలు దగ్గరగా, భూమధ్యరేఖ ప్రాంతాలు దూరంగా ఉంటాయి. దీనికితోడు భూమిపైపొరల్లోని హెచ్చుతగ్గులు కూడా భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ. చంద్రుడికి దగ్గరున్నది ‘మౌంట్ చింబోరాజో’ స్పేస్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతం ఏదన్న దానిపై అమెరికాకు చెందిన జోసెఫ్ సెన్నె అనే ఇంజనీర్, న్యూయార్క్‌లోని హెడెన్ ప్లానెటోరియం డైరెక్టర్ నీల్ డెగ్రాస్ టైసన్ కలసి అధ్యయనం చేశారు. లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఈక్వెడార్ దేశం పరిధిలోకి వచ్చే ‘మౌంట్ చింబోరాజో’శిఖరం చంద్రుడికి దగ్గర అని తేల్చారు. దక్షిణ అమెరికా ఖండంలో సుమారు ఏడు దేశాల్లో ఆండీస్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అందులో భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ఈక్వెడార్ పరిధిలో ‘మౌంట్ చింబోరాజో’శిఖరం ఉంది. ఎవరెస్ట్ ఎత్తు సముద్ర మట్టం నుంచి 8,848 మీటర్లు, అదే చింబోరాజో శిఖరం ఎత్తు 6,268 మీటర్లు మాత్రమే. కానీ ఎవరెస్ట్‌తో పోలిస్తే.. చింబోరాజో చంద్రుడికి 2.4 కిలోమీటర్లు సమీపంలో ఉన్నట్టేనని నిపుణులు లెక్క తేల్చారు. ఈ దేశాలు కూడా ‘స్పేస్’కు దగ్గర చిన్న ప్రాంతాల వారీగా కాకుండా దేశాల వారీగా చూస్తే.. ఈక్వెడార్, కెన్యా, టాంజానియా, ఇండోనేసియా వంటివి భూమ్మీద మిగతా దేశాల కన్నా చంద్రుడికి, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరిగ్గా భూమి మధ్య నుంచి చూస్తే.. భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ప్రాంతం ఉబ్బెత్తుగా ఉంటుందని, ఈ దేశాలన్నీ ఆ ప్రాంతంలోనే ఉన్నాయని వివరిస్తున్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాలతో పోలిస్తే.. ఈ దేశాల్లోని జనం చంద్రుడికి సుమారు 21 కిలోమీటర్లు (13 మైళ్లు) దగ్గరగా ఉన్నట్టేనని పేర్కొంటున్నారు. ♦ భూమిపై సముద్ర మట్టం కంటే పైన భాగాల్లో అత్యంత ఎత్తయినది ‘ఎవరెస్ట్’శిఖరమే అన్నది సుస్పష్టం. కానీ సముద్రాలు, భూభాగాలు అన్నింటినీ కలిపి చూస్తే.. భూమ్మీద అతి ఎత్తయిన శిఖరం అమెరికాలోని హవాయ్ దీవుల్లో భాగమైన ‘మౌనాకీ’అగ్నిపర్వత శిఖరమే. ♦ సముద్ర మట్టంపైన మౌనాకీ ఎత్తు 4,205 మీటర్లే. కానీ సముద్రం లోపల మరో 6,000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. అంటే సముద్ర గర్భం నుంచీ చూస్తే.. మౌనాకీ మొత్తం ఎత్తు 10,205 మీటర్లపైనే. అంటే ఎవరెస్ట్ కన్నా సుమారు 1,350 మీటర్లు ఎత్తు ఎక్కువ. -
1950 నుంచే పెనుముప్పు శకం ఆరంభం
భూగోళంపై గతంలో ఎన్నడూ కనిపించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. కాలుష్యం, భూతాపం, వాతావరణ మార్పులు పెరిగిపోతున్నాయి. రుతువులు గతి తప్పుతున్నాయి. ఒకవైపు భీకర వర్షాలు, వరదలు, మరోవైపు నిప్పులు కక్కే ఎండలు సర్వసాధారణంగా మారాయి. మొత్తం పుడమి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే, మానవుల నిర్వాకం వల్ల భూమిపై అవాంఛనీయ ఈ పరిణామం ఎప్పుడు మొదలైందో తెలుసా? 1950 నుంచి 1954 మధ్య మొదలైందని ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు గుర్తించారు. భూమాతను ప్రమాదంలోకి నెట్టివేసే కొత్త శకానికి అదొక ఆరంభమని అంటున్నారు. ఈ పరిణామానికి ఆంథ్రోపొసీన్ అని నామకరణం చేశారు. మనిషి, నూతన అనే అర్థాలున్న గ్రీక్ పదాలతో ఈ కొత్త పదం ఏర్పడింది. మొదట దీనిని 2000 సంవత్సరంలో పాల్ క్రట్జెన్, యూగీన్ స్టార్మర్ అనే శాస్త్రవేత్తలు ఉపయోగించారు. దీనిని ప్రస్తుత ‘జియోలాజికల్ టైమ్ ఇంటర్వెల్’గా పరిగణిస్తున్నారు. ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు ఇంకా ఏం చెప్పారంటే.. ► ఆంథ్రోపొసీన్లో భాగమైన పరిణామాలు, మార్పులు 1,000 లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► ఇవి మొత్తం భూమి ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ప్రభావం భూమిపై శాశ్వతంగా ఉంటుంది. ► శిలాజ ఇంధనాల వాడకం, అణ్వాయుధాలను ఉపయోగించడం, పొలాల్లో రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగం, భూమితోపాటు నదులు, చెరువుల్లో ప్లాస్లిక్ వ్యర్థాలు పెరగడం వంటివి ఆంథ్రోపొసీన్‌కు కారణమవుతున్నాయి. ► మానవుల చర్యల భూమికి జరుగుతున్న నష్టం అనూహ్యంగానే ఉందని, ఈ నష్టం రానురాను మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన జియాలజిస్ట్ కోలిన్ వాటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ► సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం బలమైన గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఇప్పుడు మానవ చర్యలు సైతం అదే కేటగిరీకి సమానంగా ఉన్నాయి. 1950వ దశకం తర్వాత భూగోళంపై ఎన్నో రకాల జీవులు అంతరించిపోయాయి. ► గ్రహ శకలాలు ఢీకొట్టడం అనేది ఒక కొత్త శకానికి దారితీసింది. మనుషుల కార్యకలాపాలు కూడా భూమిపై కొత్త శకానికి నాంది పలికాయి. ► ఇప్పటికైనా మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్.. మన భవిష్యత్తు ఇలాగేనేమో (ఫొటోలు)
-
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్. సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలా మందికి తెలియదు. మరి అదెక్కడుంది? ఆ ప్రాంత విశేషాలేమిటి వంటివి చూద్దామా ..! ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని 'సీత సమాహిత్ స్థల్' అని 'సీత మారి' అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో చూడటానికి ఒకేఒక గుడి ఉన్నది. ఆ గడ్డిని పశువులు కూడా తినేవి కావు బహుశా ..! దీన్ని చూస్తే గుడి అని అనిపించదేమో! ... స్మారకం అనాలేమో ..!! తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు 'సీతా కేశ వాటిక' ను పాడు చెయకుండ అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసము ఉన్నది ఇక్కడే. ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమను చూస్తుంటే ... ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సీతా సమాహిత్ స్థల్ చేరుకొను మార్గం సీతా సమాహిత్ స్థల్ కి బస్సు మార్గం చక్కగా ఉంటుంది. అలహాబాద్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో, వారణాసి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్య క్షేత్రం. రైళ్లలో వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి (ఏది దగ్గర అనుకుంటే అది) రైల్వే స్టేషన్లో దిగి సీతా సమాహిత్ స్థల్ చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి విమానాశ్రయాలకు చేరుకొని క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు. (చదవండి: కలియుగ శ్రవణుడిలా..తల్లిని భుజాలపై మోస్తూ..) -
అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే..
అంతరిక్షయాత్రలు, వ్యోమగాముల గురించిన కథనాలు చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుంటాయి. అలాంటి వ్యోమగాములలో ఒకరే వాల్దిమిర్ మిఖాయిలోచివ్ కొమారోవ్. రష్యా వ్యోమగామి అయిన ఈయన అంతరిక్షయాత్రలోనే కన్నుమూసిన తొలివ్యక్తి. 1967, ఏప్రిల్ 24న తన రెండవ అంతరిక్షయానం నుంచి తిరిగివస్తున్న సందర్బంలో స్పేస్‌క్రాఫ్ట్ దుర్ఘటనలో కన్నుమూశారు. సోవియట్ టెస్ట్ పైలెట్, ఎయిర్‌ఫోర్స్ ఇంజినీరు, కాస్మోనాట్ అయిన వ్లాదిమిర్ 1964లో అధిక సిబ్బందిని మోసుకువెళ్లే మొదటి వ్యోమనౌక వోస్కోడ్ -1కు.. సారధ్య బాధ్యతలు నిర్వహించారు. కొమారోవ్ ముగ్గురు సభ్యుల అంతరిక్ష నౌక వోస్కోడ్ను 16 సార్లు భూ మండలం చుట్టూ నడిపారు. సోయుజ్- 1కు సోలో పైలట్‌గా ఎంపికైనప్పుడు అతను రెండుసార్లు అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యోమగామిగా నిలిచారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవం, అంతరిక్షయానంలో శిక్షణ పొందిన 18 మందిలో ఒకరైన కొమారోవ్ 1964 అక్టోబరు 12న అంతరిక్షయానంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. రష్యా సమాచార సంస్థ టీఏఎస్ఎస్ తెలిపిన వివరాల ప్రకారం సోయుజ్-1కు సంబంధించిన కక్ష్య విన్యాసాలు,సిస్టమ్ పరీక్షలతో కూడిన విమాన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. దీని తరువాత 1967 ఏప్రిల్ 24న ఈ అంతరిక్షనౌకను భూమికి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోయుజ్-I 23,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు, ఒక పారాచూట్‌ని వినియోగించాల్సి ఉంది. ఇది కొమరోవ్ను సురక్షితంగా భూమిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఈలోపు పారాచూట్ లైన్ చిక్కుకుపోయింది. ఆ సమయంలో బ్యాకప్ పారాచూట్ లేదు. పారాచూట్ తెరుచుకోవడంలో విఫలం కావడంతో విమానం 4.5 మైళ్లు (7.24 కిమీ) ఎత్తునుంచి భూమి మీద పడిపోయింది. ది గార్డియన్ వెలువరించిన రిపోర్టు ప్రకారం ఈ ఘటనపై రష్యా స్పందిస్తూ ‘ప్రాథమిక నివేదికల ప్రకారం పారాచూట్‌లోని ప్రధాన భాగం ఏడు కిలోమీటర్ల ఎత్తులో తెరుచుకున్న సమయంలో పారాచూట్ పట్టీలు ముడుచుకుపోయాయి. ఇంతలో వ్యోమనౌక వేగంగా భూమిపై పడిపోయింది. ఈ దుర్ఘటన కొమరోవ్ మరణానికి దారితీసింది’ అని పేర్కొంది. సోయుజ్-1 మునుపటి రష్యన్ క్రాఫ్ట్ కంటే అధిక బరువు కలిగి ఉందని, ఇందులో సాధారణం కన్నా రక్షణ మార్జిన్లు తక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. -
56 కి.మీ. మేర నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటూ..
భూమిపై అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే వాతావరణ మార్పులు కూడా సకల జీవజాతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలో విస్తృతంగా భూమికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. నిపుణులు కూడా దీనిని పకృతి వైపరీత్యంగా పేర్కొంటున్నారు. గత మార్చినెలలో ఆఫ్రికాలో భూమి పగుళ్లు విస్తృతంగా కనిపించాయి. అలా పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో భూమి రెండుగా చీలిపోయి, స్థానికులను భయకంపితులను చేస్తోంది. ఈ పగుళ్లు ఏకంగా 56 కిలోమీటర్ల మేరకు ఉండటం విశేషం. ఈ పగుళ్లు జూన్ నాటికి మరింత విస్తరించాయి. ఇవి మరింతగా కొనసాగుతున్నాయి. లండన్‌కు చెందిన జియోలాజికల్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఎర్ర సముద్రం మొదలుకొని మోజాంబిక్ వరకూ సుమారు 35 కిలోమీటర్ల మేరకు పొడవైన పర్వతశ్రేణులున్నాయి. ఈ ప్రాంతంలో త్వరగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవేళ ఇవే పరిస్థితులు కొనసాగితే ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోయి, మధ్య నుంచి మహాసాగరం ఏర్పడనుంది. దీనిపై అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు టెక్టోనిక్ ప్లేట్లను అధ్యయనం చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులపై నాసా కూడా దృష్టి సారించింది. దీనిపై నాసాకు చెందిన అర్త్ అబ్జర్వేటరీ వివరాలు వెల్లడిస్తూ ఈస్ట్ ఆఫ్రికాలోని సోమాలియా టెక్టోనిక్ ప్లేట్ న్యూబియాన్ టెక్టోనిక్ ప్లేట్‌కు తూర్పు దిశగా బలంగా కదులుతోంది. ఆఫ్రికాలో చోటుచేసుకున్న పరిణామాలపై జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ కూడా పరిశోధనలు సాగిస్తోంది.ఇథియోపియాలో భూమి వై ఆకారంలో చీలిపోతోందని తెలిపింది. కాలిపోర్నియా యూనివర్శిటీకిచెందిన ప్రొఫెసర్ అమెరిటస్ కెన్ మాట్లాడుతూ ప్రస్తుతం భూమి పగుళ్ల ప్రక్రియ నెమ్మదిగా జరగుతున్నదని, భవిష్యత్‌లో పెనుముప్పు తప్పదన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేమన్నారు. ఇది కూడా చదవండి: మురికి బెడ్‌షీట్‌తో హఠాత్ అగ్నిప్రమాదాలు.. హెచ్చరించిన ఫైర్ ఫైటర్స్! -
భూమికి డేంజర్ బెల్స్.. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే
భూమి ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు, వాటికి కారణాలు తదితరాలపై 40 మంది ప్రముఖ అంతర్జాతీయ ప్రకృతి, సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన ఎర్త్ కమిషన్ బృందం తాజాగా అధ్యయనం నిర్వహించింది. అందులో తేలిన ఆందోళనకర అంశాలతో కూడిన నివేదిక జర్నల్ నేచర్‌లో పబ్లిషైంది. మానవ ఆధిపత్య యుగం (ఆంత్రోపొసీన్) క్రమంగా భూమి తాలూకు కీలక వ్యవస్థల స్థిరత్వాన్ని సమూలంగా కదిలించి వేస్తోందని హెచ్చరించింది. నివేదికలో వెల్లడించిన అంశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి... మితిమీరిన వనరుల దోపిడీ. లెక్కలేని నిర్లక్ష్యం. ఇంకా అనేకానేక స్వయంకృతాపరాధాలతో భూమిని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. పుట్టింది మొదలు గిట్టి మట్టిలో కలిసేదాకా నిత్యం సకలం సమకూర్చే ఆధారాన్నే మొదలంటా నరికేసుకుంటున్నాం. భావి తరాలనే గాక భూమిపై ఉన్న సకల జీవరాశులనూ పెను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నాం. గ్లోబల్ వార్మింగ్, కరువు, పెను వరదల వంటి ఉత్పాతాల రూపంలో భూమి చేస్తున్న ఆక్రందనను ఇకనైనా చెవిన పెట్టకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేందుకు ఇంకెంతో కాలం పట్టదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. ఫలితంగా భూమికి డేంజర్ బెల్స్ చెవులు బద్దలయ్యే స్థాయిలో మోగుతున్నాయని సైంటిస్టులు తాజాగా తేల్చారు. భూమి తాలూకు ఎనిమిది రకాల భద్రతా పరిమితుల్లో ఏకంగా ఏడింటిని ఎప్పుడో దాటేశామని వారు వెల్లడించారు... ప్రతి ఖండంలోనూ.. సమతుల్యత పూర్తిగా దెబ్బ తిని అతి సమస్యాత్మకంగా మారిన పలు ప్రాంతాలను అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ ఎక్కడపడితే అక్కడ ఇలాంటి హాట్స్పాట్లు ఉండటం కలవరపరిచే అంశమేనని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిలో చాలా ప్రాంతాల్లో వాతావరణ మార్పులే సమస్యకు ప్రధాన కారణమని తేలింది. ‘‘ముఖ్యంగా ఆసియాలో పర్వత ప్రాంతాలతో సమాహారమైన హై మౌంటేన్ క్రయోస్పియర్ శరవేగంగా మార్పుచేర్పులకు లోనవుతోంది. హిమానీ నదాల కరుగుదల మొదలుకుని జరగకూడని ప్రతికూల పరిణామాలన్నీ భయపెట్టే వేగంతో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అతి త్వరగా ఆ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా పెను కుదుపులకు లోనవడం ఖాయం’’ అని సహ అధ్యయనకర్త ప్రొఫెసర్ క్రిస్టీ ఎబి హెచ్చరించారు. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే... భూమి భద్రతకు సంబంధించి స్థూలంగా 8 రకాల సూచీలను కీలకంగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. వీటిలో మూడు కంటే ఎక్కువ సూచీలు ఆమోదిత పరిమితి దాటితే భూమికి ముప్పు తప్పదని భావిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా 7 సూచీలు ఆమోదిత పరిమితిని ఎప్పుడో దాటేసి ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్టు ఎర్త్ కమిషన్ అధ్యయనం తేల్చడం అందరినీ భయపెడుతోంది... ఏం చేయాలి ► పర్యావరణపరంగా సురక్షిత స్థాయిని భూమి ఎప్పుడో దాటేసింది. రోజురోజుకూ మరింత ప్రమాదం దిశగా వెళ్తోంది. ► భూమిపై వాసయోగ్యతను నిర్ధారించే జీవ భౌతిక వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దే పని తక్షణం మొదలు పెట్టాలి. ► అప్పుడు బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి కీలక వనరుల లోటును భూమి తనంత తానుగా భర్తీ చేసుకోగలదు. ‘‘భూమికి గనక మనిషికి చేసినట్టే ఇప్పటికిప్పుడు వార్షిక హెల్త్ చెకప్ చేయిస్తే ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయిందంటూ రిపోర్టు వస్తుంది. కీలక అవయవాలన్నీ దాదాపుగా మూలకు పడుతున్నాయని తేలుతుంది’’ – క్రిస్టీ ఎబి, సహ అధ్యయనకర్త, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో క్లైమేట్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ‘‘భూ స్థిరత్వాన్ని ఆమోదనీయ స్థాయికి తీసుకొచ్చేందుకు దేశాలన్నీ కలసికట్టుగా తక్షణం ఓ భారీ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భూమి ఏమాత్రమూ ఆవాసయోగ్యం కాకుండా పోయేందుకు ఇంకెంతో కాలం పట్టదు!’’ – ప్రొఫెసర్ జొయీతా గుప్తా, అధ్యయనంలో కీలక భాగస్వామి డేంజర్ హాట్ స్పాట్స్‌కు నిలయాలు ► తూర్పు యూరప్ ► దక్షిణాసియా మధ్యప్రాచ్యం ► ఆగ్నేయాసియా ► ఆఫ్రికాలో పలు ప్రాంతాలు ► బ్రెజిల్లో చాలా ప్రాంతాలు ► అమెరికాలో పలు ప్రాంతాలు ► మెక్సికో చైనా కొసమెరుపు: సూచనల మాటెలా ఉన్నా కీలకమైన అన్ని మౌలిక సూచికలూ పూర్తిగా నేల చూపులు చూస్తున్నాయి. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వనరుల భర్తీ దేవుడెరుగు, భూమి తాలూకు వాసయోగ్యతకే, మరోలా చెప్పాలంటే జీవరాశుల ఉనికికే ఎసరొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్నది సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్న మాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమిపై అసాధారణ నిర్మాణాలు
-
నక్షత్రాలు పేలితే భూమికి ముప్పు!
భూగోళంపై కోట్లాది జీవులు ఉన్నాయి. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవజాలం పుట్టుకొచ్చింది. ఇందుకు ఎన్నో సంఘటనలు దోహదం చేశాయి. భూమిపై జీవుల ఆవిర్భావం, మనుగడకు ఇక్కడి అనుకూల వాతావరణమే కారణం. ధరణిపై వాతావరణం విషతుల్యంగా మారితే జీవులకు ముప్పు తప్పదు. పూర్తిగా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి ప్రమాదమే తలెత్తే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదూరంలోని అంతరిక్షంలో ఉన్న సూపర్నోవాల పేలుడు నుంచి గ్రహాలకు కొత్త ముప్పు పొంచి ఉందని, ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం మన చేతుల్లో లేదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏమిటీ ముప్పు? అంతరిక్షంలో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని సూపర్నోవాగా మారి పేలిపోతుంటాయి. బ్లాస్ట్ వేవ్ సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ఎక్స్–కిరణాలు అధిక మోతాదులో వెలువడుతాయి. ఇవి సమీపంలోని గ్రహాలను చేరుతాయి. ఇందుకు నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టొచ్చు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి దాని పరిధిలోని భూగ్రహాన్ని రక్షించడానికి ఓజోన్ పొర ఆవరించి ఉంది. సూపర్నోవా పేలుడుతో ఉద్గారమయ్యే ఎక్స్–కిరణాలు భూమిని చుట్టూ ఉన్న ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి. ఓజోన్ పొర చాలావరకు తుడిచిపెట్టుకుపోతోంది. దాంతో యూవీ రేడియేషన్ నేరుగా భూగ్రహం ఉపరితలాన్ని ఢీకొడుతుంది. ఫలితంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనే విషవాయువు భూమిపై ఉత్పత్తి అవుతుంది. అది విషపూరితమైన గోధుమ రంగు పొరను భూమి చుట్టూ ఏర్పరుస్తుంది. అప్పుడు వాతావరణం లుప్తమైపోతుంది. జీవులు అంతరించిపోతాయి. ఎలా గుర్తించారు? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్తలు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతోపాటు ఇతర అత్యాధునిక టెలిస్కోప్‌లతో సూపర్‌నోవాలపై అధ్యయనం చేశారు. పేలిపోయే తారల నుంచి ఎక్స్–కిరణాలు వెలువడి, భూమి, ఇతర గ్రహాలను ప్రభావితం చేసే దశ రాబోతుందని, ఈ పరిణామం 100 కాంతి సంవత్సల దూరంలో చోటుచేసుకుంటుందని కనిపెట్టారు. పేలిపోయే నక్షత్రాల నుంచి వాటిల్లే ముప్పు గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగినట్లు గుర్తించారు. 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూపర్నోవాలు పేలిపోతే భూమిలాంటి గ్రహాలకు రేడియేషన్ ముప్పు ఉంటుందని తేల్చారు. 1979సీ, ఎస్ఎన్ 1987ఏ, ఎస్ఎన్ 2010జేఎల్, ఎస్ఎన్ 1994ఐ అనే సూపర్నోవాలను నిశితంగా పరిశీలించారు. అవి ఇప్పట్లో పేలే అవకాశం ఉందా? దానిపై ఓ అంచనాకొచ్చారు. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనట్లే భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్త కానర్ ఓమహోనీ వెల్లడించారు. ఎక్స్–రే డేంజర్ జోన్లో బలమైన సూపర్నోవా ఏదీ లేదని తెలిపారు. భూమికి సమీపంలో గతంలో తారలు పేలిపోయిన దాఖలాలు ఉన్నాయని వెల్లడించారు. 20 లక్షల నుంచి 80 లక్షల సంవత్సరాల క్రితం భూమి నుంచి 65 నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్నోవా ఒకటి పేలిపోయింది. దానికి సంబంధించిన రేడియేషన్ ఇప్పటికీ భూమి వైపునకు దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. సూపర్నోవా నుంచి వెలువడే ఎక్స్–కిరణాలపై మరిన్ని పరిశోధనలు చేయడం నక్షత్రాల జీవితకాలం గురించి అర్థం చేసుకోవడానికే కాదు, ఆస్ట్రోబయాలజీ, పాలియోంటాలజీ, ప్లానెటరీ సైన్సెస్ తదితర రంగాల్లో చిక్కుముడులు విప్ప డానికి ఉపయోగపడ తాయని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్త బ్రియాన్ ఫీల్డ్స్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇతర గ్రహాలపై జీవజాలం.. ఓజోన్ పొర ఆధారం
అనంతమైన విశ్వంలో మనం జీవిస్తున్న ఈ భూగోళంపైనే కాకుండా ఇతర గ్రహాలు, నక్షత్రాలపైనా జీవజాలం ఉందా? ఇప్పుడు లేకపోయినా గతంలో ఎప్పుడైనా ఉండేదా? ఒకవేళ ఉంటే అవి ఎలాంటి జీవులు? ఈ ప్రశ్నలు ఎన్నో శతాబ్దాలుగా భూమిపై మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. సువిశాలమైన విశ్వంలో భూమికి ఆవల జీవుల ఉనికిని కనిపెట్టేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు అలుపెరగకుండా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. మన పాలపుంత(గెలాక్సీ)లో ఇప్పటిదాకా 5,000కుపైగా గ్రహాలను కనిపెట్టారు. వాటిపై జీవులు ఉన్నాయా? అనేది తెలుసుకొనేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఎన్నెన్నో పద్ధతులు అనుసరించారు. ఇతర గ్రహాలపై జీవజాలం ఉన్నట్లు ఇప్పటివరకైతే బలమైన ఆధారాలేవీ లభించలేదు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిపై దృష్టి పెట్టారు. అదేమిటో తెలుసుకోవడం ఆసక్తికరమే. ► మన భూగోళానికి రక్షణ కవచం ఓజోన్ పొర అన్న సంగతి తెలిసిందే. అత్యంత హానికరమైన అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి ఓజోన్ పొర రక్షిస్తోంది. అందుకే భూమిపై కోట్లాది జీవులు నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. ► ఏదైనా గ్రహాన్ని మందపాటి ఓజోన్ పొర ఆవరించి ఉంటే ఆ గ్రహంపై జీవుల ఉనికి సాధ్యమని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే అంశాన్ని సరికొత్త అస్త్రంగా మార్చుకుంటున్నారు. ► ఏదైనా నక్షత్రానికి లోహతత్వం(మెటాలిసిటీ) ఎక్కువగా ఉంటే దాని చుట్టూ ఉన్న గ్రహాలపై రక్షిత ఓజోన్ పొర ఆవరించి ఉంటుందని గుర్తించారు. ► ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ కమ్యూనికేషన్’ పత్రికలో ప్రచురించారు. ► విశ్వ పరిణామ క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న నక్షత్రాలకు లోహతత్వం అధికంగా ఉంటున్నట్లు తేల్చారు. ఇలాంటి నక్షత్ర మండల్లాలోని గ్రహాల చుట్టూ దట్టమై ఓజోన్ పొర ఏర్పడుతుందని, తద్వారా అక్కడ జీవులు ఉద్భవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ► అధిక లోహతత్వం ఉన్న నక్షత్రాల పరిధిలోని గ్రహాలే జీవుల అన్వేషణకు మెరుగైన లక్ష్యాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ► గ్రహాల చుట్టూ రక్షిత ఓజోన్ పొర ఏర్పడాలంటే దానికి సంబంధించిన నక్షత్రానికి ఏయే లక్షణాలు ఉండాలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ► విశ్వంలో గ్రహాలను కలిగిన చాలా నక్షత్రాల ఉష్ణోగ్రత 5,000 నుంచి 6,000 డిగ్రీల సెల్సియస్ ఉంది. మన నక్షత్రమైన సూర్యుడు ఇదే విభాగంలోకి వస్తాడు. ► సూర్యుడి నుంచి వెలువడుతున్న అల్ట్రావయొలెట్ కాంతి(రేడియేషన్) మన భూగ్రహ వాతావరణంపై చూపిస్తున్న సంక్లిష్టమైన ప్రభా వాన్నే ఇతర గ్రహాల వాతావరణంపైనా చూపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అన్నా సపిరో ఒక ప్రకటనలో వెల్లడించారు. ► నక్షత్రాల్లోని లోహతత్వం వాటి నుంచి ఉద్గారమయ్యే అల్ట్రావయెలెట్ కాంతిని ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూవీ రేడియేషన్ నక్షత్రాల సమీపంలో కక్ష్యలో తిరిగే గ్రహాల వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న దానిపై దృష్టి సారించారు. ► మన భూగోళంపై ఉన్న వాతావరణం ఇక్కడి జీవ పరిణామ క్రమాన్ని తెలుసుకొనేందుకు ఉపకరిస్తుందని, ఇదే సూత్రాన్ని ఇతర గ్రహాలకు సైతం వర్తింపజేయవచ్చని సైంటిస్టు జోస్ లెలీవెల్డ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాన దంచికొడితే ఆగమాగమే! మరి 20 లక్షల ఏళ్లపాటు కురిస్తే.. ఏంటి పరిస్థితి?
వాన అంటే అందరికీ ఇష్టమే. అదీ రెండు, మూడు రోజులు పడితే ఓకే.. మరి వారం పాటు దంచికొడితే!? అమ్మో.. అంతా ఆగమాగమే అంటారు కదా! అదే కొన్నేళ్లపాటు వానలు పడితే.. అలా వేలు, లక్షల ఏళ్లపాటు కురుస్తూనే ఉంటే.. వామ్మో అనిపిస్తోందా? కానీ ఇది నిజమేనని, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి అంత వాన ఎక్కడ పడింది? ఎందుకు పడింది? దాని వల్ల ఏం జరిగిందనే సంగతులు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమి పొరలను పరిశీలిస్తుండగా.. 1970వ దశకంలో కొందరు శాస్త్రవేత్తలు భూఉపరితలానికి సంబంధించి పరిశోధనలు చేస్తుండగా.. పురాతన రాళ్లలో అసాధారణమైన బూడిద రంగు పొరలను గమనించారు. అవి సిలికా (ఇసుక), మట్టితో ఏర్పడ్డాయని.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఇలా ఉన్నాయని గుర్తించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి.. సుమారు 23 కోట్ల ఏళ్ల కింద ఆ పొరలు ఏర్పడినట్టు తేల్చారు. అవి ఇసుక, మట్టి తీవ్రస్థాయిలో పీడనానికి గురై ఏర్పడినట్టు నిర్ధారించారు. ఈ పొరల మందం, అవి మొదలై, ముగిసిన సమయాన్ని అంచనా వేసి.. సుమారు 20 లక్షల ఏళ్ల పాటు నిరంతరం వాన కురవడంతో అలా ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా ఒకే ఖండంగా ఉన్నప్పుడు.. 23 కోట్ల ఏళ్ల కింద భూమ్మీద ఖండాలన్నీ కలిసి ఒకే అతిపెద్ద ఖండం ‘పాంజియా’గా ఉండేది. అప్పటిదాకా వానలు తక్కువగా ఉండి.. వేడి వాతావరణం కొనసాగింది. ఆ సమయంలో గ్రహ శకలాలు ఢీకొనడం, భూమి పైపొరలోని టెక్టానిక్ ప్లేట్ల కదలికలు తీవ్రమై అతిభారీ స్థాయిలో అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరిగాయి. వాతావరణంలోకి చేరిన పొగ, దుమ్ము, ధూళి వల్ల ఒక్కసారిగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. సముద్రాల్లో నీరు వేడెక్కి ఆవిరై.. గాలిలో ఆవిరి శాతం (హ్యూమిడిటీ) బాగా పెరిగింది. ఆ గాలులు ‘పాంజియా’ వైపు వీయడం, చల్లబడి వానలు కురవడం మొదలైంది. ఇదిలా 20 లక్షల ఏళ్లపాటు కొనసాగింది. ఈ పరిస్థితులు, తర్వాతి పరిణామాలకు ‘కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్’గా పేరుపెట్టారు. తొలుత నాశనం.. ఆ తర్వాత సృష్టి.. కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ మొదట్లో జీవరాశుల నాశనానికి దారి తీసింది. ఉష్ణోగ్రతలు, విషవాయువులు పెరగడంతో మొక్కలు, చెట్లు, జంతువులకు సమస్యగా మారింది. అగ్నిపర్వతాల నుంచి వెలువడిన విషవాయువులు, దుమ్ము మేఘాల్లో కలిసి ఆమ్ల వర్షాలు (యాసిడ్ రెయిన్స్) కురిశాయి. అటు సముద్రాల్లో నీరు వేడెక్కడం, ఆమ్లత్వం పెరగడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో జలచరాలూ తగ్గిపోయాయి. మొత్తంగా దాదాపు 80శాతానికిపైగా జీవరాశి అంతరించినట్టు అంచనా. అయితే కార్నియన్ ఈవెంట్ చివరిదశకు వచ్చేప్పటికి ఖండాలు విడివడటం మొదలై.. అగ్ని పర్వతాల విస్ఫోటనాలు తగ్గిపోయాయి. భూమ్మీద వేడి తగ్గిపోయింది. వానలు ఒక క్రమానికి పరిమితమై.. జీవానికి అనుకూలమైన, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఇది మొక్కలు, జంతువులు సహా ఎన్నో కొత్త జీవరాశుల పునరుత్థానానికి దారితీసింది. డైనోసార్ల ఆధిపత్యానికి తోడ్పడి.. కార్నియన్ ఈవెంట్ మొదలయ్యే నాటికే డైనోసార్లు, పలు ఇతర జీవరాశుల ఎదుగుదల మొదలైంది. ఈవెంట్ నాటి పరిస్థితులను బాగా తట్టుకోగలిగిన డైనోసార్లు.. ఈవెంట్ తర్వాత బాగా ప్రయోజనం పొందాయి. వాటిలో ఎన్నో ఉప జాతులు ఉద్భవించి జీవరాశిపై ఆధిపత్యం చలాయించాయి. ఇదే సమయంలో జీవ పరిణామం బాగా వేగం పుంజుకుంది. తాబేళ్లు, మొసళ్లు, బల్లులు వంటివాటితోపాటు పాలిచ్చి పెంచే వివిధ రకాల జీవులు (మమ్మాల్స్) అభివృద్ధి చెందాయి. భూమ్మీద ఇప్పుడున్న జీవంలో చాలా వరకు ‘కార్నియన్ ఫ్లూవియల్ ఈవెంట్’ నాటి పరిస్థితులే తోడ్పడ్డాయని భూతత్త్వ, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త అలస్టేర్ రఫెల్, పురాతత్త్వ శాస్త్రవేత్తలు (పేలియోన్విరాన్‌మెంటిస్ట్స్) జకొపో డాల్ కోర్సో, పాల్ విగ్నల్ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలు ఇటీవల న్యూసైంటిస్ట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అక్కడ 20 లక్షల ఏళ్లుగా వానలే లేవు.. ఒకప్పుడు 20 లక్షల ఏళ్లు వాన పడితే.. అసలు గత20 లక్షల ఏళ్లుగా చుక్క వాన పడని ప్రాంత మూ ఒకటుంది తెలుసా.అంటార్కిటికాలో మెక్‌మర్డో డ్రైవ్యాలీగా పిలిచేచోట దాదాపు 20 లక్షల ఏళ్లుగా వాన, మంచు వంటివేవీ కురవలేదని శాస్త్రవేత్తలు గత ఏడాదే నిర్ధారించారు. అతి తక్కువ హ్యూమిడిటీ, డ్రైవ్యాలీకి చుట్టూ ఉన్న పెద్ద కొండలు, గాలులు వీచే దిశ వంటివి దీనికి కారణమని తేల్చారు. -
హిమానీ నదాలు శరవేగంగా కనుమరుగు! విస్మయకర వాస్తవాలు వెలుగులోకి
హిమాలయాల్లో హిమానీ నదులు శరవేగంగా కరిగిపోతున్నాయి. ఎంతగా అంటే, గత 20 ఏళ్లలో కరిగిపోయిన హిమానీ నదాల పరిమాణం ఏకంగా 57 కోట్ల ఏనుగుల బరువుతో సమానమట! అంటే హీనపక్షం 170 కోట్ల టన్నుల పై చిలుకే...! ఈ ప్రమాదకర పరిణామాన్ని పర్యావరణవేత్తలు, సైంటిస్టులు ఆలస్యంగా గుర్తించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే అతి తొందర్లోనే హిమాలయాల్లో పెను మార్పులు చూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు... 2000 నుంచి 2020 మధ్య కేవలం 20 సంవత్సరాల్లో హిమాలయాల్లో ప్రోగ్లేషియల్ సరస్సులు ఏకంగా 47 శాతం పెరిగాయి. సరస్సుల సంఖ్య పెరిగితే మంచిదే కదా అంటారా? కానే కాదు. ఎందుకంటే హిమానీ నదాలు కరిగిపోయి కనుమరుగయ్యే క్రమంలో ఏర్పడే సరస్సులివి! ఇవి ఎంతగా పెరిగితే హిమానీ నదాలు అంతగా కుంచించుకుపోతున్నట్టు అర్థం! ఈ పరిణామామంతా చాలావరకు భూమి పై పొరకు దిగువన జరుగుతుంది గనుక ఇంతకాలం పర్యావరణవేత్తల దృష్టి దీనిపై పడలేదు. కానీ ఈ సరస్సుల సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో ఈ పరిణామంపై వాళ్లు ఇటీవలే దృష్టి సారించారు. హిమాలయాల్లో కరిగిపోతున్న హిమనీ నదాల పరిమాణాన్ని తొలిసారిగా లెక్కగట్టగా ఈ విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌లోని సెయింట్ ఆండ్రూస్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కార్నిగీ మెలన్ వర్సిటీలకు చెందిన రీసెర్చర్ల బృందంలో ఇందులో పాల్గొంది. అధ్యయన ఫలితాలను నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘హిమాలయాల వద్ద భూ ఫలకాలు అత్యంత చురుగ్గా ఉంటాయి. నిత్యం కదలికలకు లోనవుతూ ఉంటాయి. దాంతో హిమానీ నదాల ప్రవాహ మార్గాలు తరచూ మారిపోతున్నాయి’’ అన్నారు. హిమాలయాల్లో 6.5 శాతం తగ్గిన మంచు ♦ తాజా అధ్యయనం పలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైనవి... ♦ కనుమరుగవుతున్న హిమానీ నదాల రూపంలో గ్రేటర్ హిమాలయాలు ఇప్పటికే తమ మొత్తం మంచులో 6.5 శాతాన్ని కోల్పోయాయి. ♦ మధ్య హిమాలయాల్లో హిమానీ నదాల అంతర్థానం చాలా వేగంగా కొనసాగుతోంది. ♦ గాలోంగ్ కో హిమానీ నదం ఇప్పటికే ఏకంగా 65 శాతం కనుమరుగైంది. ♦ హిమాలయాల్లో 2000–2020 మధ్య ప్రోగ్లేషియల్ సరస్సుల సంఖ్యలో 47 శాతం, విస్తీర్ణంలో 33 శాతం, పరిమాణంలో 42 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది ♦ ఇందుకు కారణం హిమాలయాల్లోని హిమానీ నదుల పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 1.7 గిగాటన్నుల మేరకు తగ్గిపోవడమే. అంటే 1.7 లక్షల కోట్ల కిలోలన్నమాట! ఇది భూమిపై ఉన్న మొత్తం ఏనుగుల బరువుకు కనీసం 1,000 రెట్లు ఎక్కువ!! ♦ ఈ ధోరణి 21వ శతాబ్దం పొడవునా కొనసాగుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ♦ ఫలితంగా హిమాలయాల్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా హిమానీ నదాలు ప్రస్తుతం భావిస్తున్న దానికంటే అతి వేగంగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nature Astronomy: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు!
ఆధునిక సాంకేతిక యుగంలో మనషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాల (శాటిలైట్లు)పై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లోనూ వీటి అవసరం పెరిగిపోతోంది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్ బల్బుల వెలుగుతో పుడమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. అధ్యయనం వివరాలను ‘నేచర్ అస్ట్రానమీ’ పత్రికలో ప్రచురించారు. రానున్న రోజుల్లో విపరిణామాలే: భూగోళం చుట్టూ ప్రస్తుతం 8,000కు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూమిపై ప్రతి అంగుళాన్ని కవర్ చేస్తున్నాయి. స్పేక్‌ఎక్స్ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. వన్‌వెబ్ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వీటి సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు విద్యుత్ లైట్ల అవసరం పెరుగుతూనే ఉంది. శాటిలైట్ల నుంచి వెలువడే కాంతి, కరెంటు దీపాల నుంచి కాంతి వల్ల భూమిపై ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటివల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. ‘‘అంతేగాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకూ ఆటంకం కలుగుతోంది. అస్ట్రానామికల్ అబ్జర్వేటరీల పనితీరు మందగిస్తున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రివేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతోంది. అంతేగాక భూమిపై జీవుల అలవాట్లలో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి’’ అని వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకొనే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. పరిష్కారం ఏమిటి? కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. దాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టడం మేలు. ‘‘శాటిలైట్లలో బ్రైట్నెస్ తగ్గించాలి. టెలిస్కోప్ పరికరాల్లోని షట్టర్లను కాసేపు మూసేయడం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చు’’ అని సూచిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే గాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటినుంచి ప్రమాదకర విష వాయవులు వెలువడుతుంటాయి. ఆర్బిటాల్ ట్రాఫిక్ మరో పెను సమస్య. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నూలుపోగు లేకుండా వీధుల్లో హల్చల్.. వేరే గ్రహం నుంచి..
ఓ వ్యక్తి నులుపోగులేకుండా వీధుల్లో హల్చల్ చేశాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. పైగా తాను వేరే గ్రహం నుంచి వచ్చానని చెబుతున్నాడు. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌లో నగ్నంగా ఓ వ్యక్తి వీధుల్లో హల్చల్ చేశాడు. ఓ దుకాణం వద్దకు నగ్నంగా నడుచుకుంటూ వస్తున్న ఆ వ్యక్తిని చూసి.. భయపడిన ఉద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. ఐతే ఆ వ్యక్తి బట్టలు ఎక్కడ వదిలేశానో తెలియదని విచిత్రమైన సమాధానం చెప్పాడు. తన పేరు, పుట్టిన తేది చెప్పేందుకు కూడా నిరాకరించాడు. అతను ఏ రాష్ట్రం నుంచి వచ్చాడని వాకాబు చేసేన, ఐడీ కార్డు గురించి అడిగినా..ఏమి లేవు, తెలియదు అనే బదులిస్తున్నాడు ఆ వ్యక్తి. దీంతో పోలీసులు ఆ వ్యక్తి గురించి ముమ్మరంగా విచారించి..అతను 44 ఏళ్ల జాసన్ స్మిత్‌గా గుర్తించారు. పైగా తాను వేరే గ్రహం నుంచి వస్తున్నట్లు ఏవేవో కథలు చెబుతున్నాడు. ఐతే పోలీసులు అతనిపై బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, అనుచిత ప్రవర్తన వంటి ఆరోపణలు మోపి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: గన్ కల్చర్‌పై విరుచుకుపడ్డ ప్రభుత్వం..ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు..) -
మామా.. చందమామా మరింత దూరమా?
చంద్రునితో భూమికి అవినాభావ సంబంధం. భూమికి ఉపగ్రహమైతే మనకేమో ఏకంగా చంద‘మామ’. భూమిపైనా, మనిషితో పాటు జంతుజాలం మీదా చంద్రుని ప్రభావమూ అంతా ఇంతా కాదు. సముద్రంలో ఆటుపోట్లు మొదలుకుని అనేకానేక విషయాల్లో ఆ ప్రభావం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. భూమిపై ప్రాణం ఆవిర్భావానికి చంద్రుడే కారణమన్న సిద్ధాంతమూ ఉంది. మన రోజువారీ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసే పలు కీలక వాతావరణ వ్యవస్థల్లో కూడా భూమి చుట్టూ చంద్రుని కక్ష్య తాలూకు నిర్మితి కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. అలాంటి చంద్రుడు భూమిపై రోజు తాలూకు నిడివి రోజురోజుకూ పెరిగేందుకు కూడా ప్రధాన కారణమట...! చాలాకాలం క్రితం. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. భూమ్మీద రోజు నిడివి ఎంతుండేదో తెలుసా? ఇప్పుడున్న దాంట్లో దాదాపు సగమే! సరిగ్గా చెప్పాలంటే 13 గంటల కంటే కాస్త తక్కువ!! అప్పట్నుంచీ అది క్రమంగా పెరుగుతూ ఇప్పటికి 24 గంటలకు చేరింది. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉందట! చంద్రుడు క్రమంగా భూమికి దూరంగా జరుగుతుండటమే ఇందుకు కారణమని సైంటిస్టులు తేల్చారు!! భూమికి చంద్రుడు దూరంగా జరుగుతున్న తీరును శాస్త్ర పరిభాషలో ల్యూనార్ రిసెషన్గా పిలుస్తారు. ఇది ఎంతన్నది అపోలో మిషన్లలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లు ఇటీవల దీన్ని కచ్చితంగా లెక్కించారు. చంద్రుడు భూమికి ఏటా 3.8 సెంటీమీటర్ల మేరకు దూరంగా జరుగుతున్నట్టు తేల్చారు. అందువల్లే భూమిపై రోజు నిడివి అత్యంత స్వల్ప పరిమాణంలో పెరుగుతూ వస్తోందట. మహాసముద్రాలతో, అలలతో చంద్రుని సంబంధమే ఇందుకు ప్రధాన కారణమని యూనివర్సిటీ ఆఫ్ లండన్ రాయల్ హోలోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్టాం చెబుతున్నారు. ఆయన భూమి, చంద్రుని మధ్య సంబంధంపై చిరకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ‘‘ఇటు భూమి, అటు చంద్రుడు ఎవరి కక్ష్యలో వారు తిరిగే క్రమంలో చంద్రుని ఆకర్షణ వల్ల మహాసముద్రాల్లో ఆటుపోట్లు (అలల్లో హెచ్చు, తగ్గులు) సంభవిస్తూ ఉంటాయి. సదు అలల ఒత్తిడి భూ భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్ప పరిమాణంలో తగ్గిస్తుంటుంది. అలా తగ్గిన శక్తిని చంద్రుడు తన కోణీయ గతి కారణంగా గ్రహిస్తుంటాడు. తద్వారా చంద్రుడు నిరంతరం హెచ్చు కక్ష్యలోకి మారుతూ ఉంటాడు. మరో మాటల్లో చెప్పాలంటే భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాడన్నమాట’’ అని ఆయన వివరించారు. అప్పట్లో రోజుకు రెండు సూర్యోదయాలు ‘‘అప్పట్లో, అంటే ఓ 350 కోట్ల ఏళ్ల క్రితం ఇప్పటి రోజు నిడివిలో ఏకంగా రెండేసి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు జరిగేవి! ఎందుకంటే రోజుకు 12 గంటలకు అటూ ఇటుగా మాత్రమే ఉండేవి. ఈ నిడివి క్రమంగా పెరుగుతూ వచ్చింది, వస్తోంది’’ అని జర్మనీలోని ఫ్రెడరిక్ షిల్లర్ యూనివర్సిటీ జెనాలో జియోఫిజిసిస్టుగా చేస్తున్న టామ్ ఈలెన్ఫెల్డ్ వివరించారు. మరో విశేషం ఏమిటంటే, భూమికి చంద్రుడు దూరం జరుగుతున్న వేగం కూడా ఎప్పుడూ స్థిరంగా లేదు. అది నిత్యం మారుతూ వస్తోందట. ఉదాహరణకు 60 కోట్ల ఏళ్ల కింద చూసుకుంటే ఆ వేగం ఇప్పటికి రెట్టింపుండేదట. అంటే అప్పుడు చంద్రుడు భూమికి ఏటా సగటున 7 సెంటీమీటర్లు దూరం జరిగేవాడట! అలాగే ఈ వేగంలో భవిష్యత్తులో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని ఈలెన్ఫెల్డ్ చెబుతున్నారు. ‘‘మహాసముద్రాల, ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రపు పరిమాణమే ఇందుకు కారణం కావచ్చు. అది గనక ఇప్పుడున్న దానికంటే కాస్త సన్నగా గానీ, వెడల్పుగా గానీ ఉంటే మూన్ రిసెషన్ వేగంలో పెద్దగా మార్పులుండేవి కావని నా అభిప్రాయం’’ అని చెప్పారాయన. కొసమెరుపు: ఏదెలా ఉన్నా, చంద్రుడు మాత్రం భూమికి ఎప్పటికీ శాశ్వతంగా దూరమైపోడంటూ సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు! ‘‘అలా జరిగేందుకు కనీసం మరో 500 నుంచి 1,000 కోట్ల ఏళ్లు పట్టొచ్చు. కానీ అంతకు చాలాముందే సౌర కుటుంబమంతటికీ మహారాజ పోషకుడైన సూర్యుడే లేకుండా పోతాడు! సూర్యునితో పాటే భూమి, మొత్తం సౌరకుటుంబమే ఆనవాలు లేకుండా పోతాయి’’ అంటూ వారు చమత్కరించారు!! శతాబ్దానికి 1.09 మిల్లీ సెకను పెరుగుతున్న రోజు... చంద్రుడు క్రమంగా దూరం జరుగుతున్న కారణంగా భూమిపై రోజు నిడివి క్రీస్తుశకం 1,600 నుంచి ప్రతి శతాబ్దానికి సగటున 1.09 మిల్లీసెకన్ల మేరకు పెరుగుతూ వస్తోందని తాజా విశ్లేషణలు తేల్చాయి. ఇది 1.78 మిల్లీసెకన్లని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చూట్టానికి మిల్లీసెకన్లే అయినా, 450 కోట్ల భూ పరిణామ క్రమంలో రోజు తాలూకు నిడివిని ఇది ఊహాతీతంగా పెంచిందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడు ఒకప్పుడు భూమికి ఇప్పటికంటే చాలా చాలా దగ్గరగా ఉండేవాడని ఇప్పటికే నిరూపితం కావడమే ఇందుకు రుజువని చెబుతున్నారు. ఉదాహరణకు చంద్రుడు ప్రస్తుతం భూమికి 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల ఏళ్ల కింద ఈ దూరం కేవలం 1,70,000 మైళ్లే ఉండేదని పలు అధ్యయనాల్లో తేలింది! ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉన్నాయి. నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక.. అంతరిక్ష విద్యుత్
సాక్షి, అమరావతి: అంతరిక్షంలోకి మానవుడు అడుగుపెట్టడమంటేనే ఒకప్పుడు అత్యంత అద్భుతంగా భావించేవారు. కానీ విజ్ఞాన ప్రపంచం విశ్వమంతా వ్యాపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అసాధ్యమనుకున్నవాటిని సుసాధ్యం చేస్తూ ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ ఆవిష్కరణే అంతరిక్ష సౌరవిద్యుత్ (స్పేస్ సోలార్ పవర్ – ఎస్ఎస్పీ). నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. భూమి మీద వివిధ పద్ధతుల ద్వారా, అనేక వనరుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం గురించే ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ.. తాజా ఆవిష్కరణ వాటికి విభిన్న విధానం. అంతరిక్షంలో పగలు, రాత్రి, రుతువులు, మేఘాల కవచం వంటి కాలచక్రాలతో సంబంధం లేకుండా నిరంతరం అందుబాటులో ఉండే విద్యుత్‌ను భూమి మీదకు తీసుకొచ్చే పరిశోధనలు 2011లో మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ పరిశోధనల్లో మరో అడుగు ముందుకుపడింది. నాలుగు శాతమే వాడుతున్నాం సౌరవిద్యుత్‌ను 1800 సంవత్సరం చివరి నుంచి వాడడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలోని విద్యుత్‌లో నాలుగు శాతం (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శక్తినివ్వడంతోపాటు) మాత్రమే సౌరవిద్యుత్ ఉత్పత్తి అవుతోంది. బొగ్గు, నీటి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నీటివనరులు ఇప్పటికే చాలావరకు తగ్గిపోగా.. బొగ్గు వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్యమం ప్రపంచ దేశాల్లో మొదలైంది. దీంతో అపారంగా ఉన్న సౌరశక్తిని వాడుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. దీన్లో భాగమే ఈ ప్రయోగం. భవిష్యత్‌లో దీనిద్వారా భూమి మీదకు వైర్లెస్ విధానంలో సౌరవిద్యుత్ ప్రసారం చేయగలమని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. ఏమిటీ ప్రయోగం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమనుకున్న అనేక విషయాలను నేడు శాస్త్రవేత్తలు నిజం చేస్తున్నారు. ఆ కోవలో మొదలైనదే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) స్పేస్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఎస్‌పీపీ). ఇదొక అంతరిక్ష పరిశోధన. ఈ పరిశోధన కోసం గత నెలలో కాలిఫోర్నియా నుంచి స్పేస్ సోలార్ పవర్ డెమాన్స్ట్రేటర్ (ఎస్ఎస్పీడీ)ను అంతరిక్షంలోకి పంపారు. ట్రాన్స్పోర్టర్–6 మిషన్‌లో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా మోమెంటస్ విగోరైడ్ అంతరిక్షనౌక 50 కిలోల బరువున్న ఎస్ఎస్పీడీని అంతరిక్షానికి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా సూర్యరశ్మిని సేకరించి, దాన్ని విద్యుత్తుగా మార్చే మాడ్యులర్ స్పేస్‌క్రాఫ్ట్ సముదాయాన్ని అంతరిక్షంలోకి పంపించారు. ఇది విద్యుత్తును చాలా దూరం వరకు వైర్లెస్ రూపంలో ప్రసారం చేస్తుంది. కొన్ని పరిణామాల అనంతరం చివరికి పవర్ స్టేషన్‌గా ఏర్పడుతుంది. 32 రకాల ఫోటోవోల్టాయిక్‌లు అంతరిక్ష వాతావరణంలోని సౌరకణాలను విద్యుత్‌గా మార్చేందుకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తాయి. మైక్రోవేవ్ పవర్ ట్రాన్స్‌మీటర్ ద్వారా వైర్లెస్ విధానంలో విద్యుత్‌ను ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం ఉంటుంది. ఈ సెటప్ అంతా అంతరిక్షంలో అమర్చగానే భూమిపై ఉన్న కాల్టెక్ బృందం తమ ప్రయోగాలను ప్రారంభించింది. కొన్ని కెమెరాలు ప్రయోగం పురోగతిని పర్యవేక్షిస్తూ, భూమికి సమాచారం పంపిస్తున్నాయి. కొద్దినెలల్లోనే ఎస్ఎస్పీడీ పనితీరుపై పూర్తి అంచనా వేయగలమని ఎస్‌ఎస్‌పీపీ బృందం భావిస్తోంది. -
భూమికి నాలుగు పొరలే కాదు.. ఐదో పొర కూడా! దాని ఆకృతి ఎలా ఉందంటే?
అశోక చక్రానికి కనిపించే మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహమూ ఉన్నట్టుగా, భూమికి మనకిప్పటిదాకా తెలియని ఐదో పొర ఉందట! భూగర్భం తాలూకు మిస్టరీలను ఛేదించేందుకు తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో ఈ విషయం యాదృచ్ఛికంగా వెలుగుచూసిందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి నాలుగు పొరలుంటాయని మనకిప్పటిదాకా తెలుసు.. భూమి తాలూకు ఇన్నర్ కోర్ గుండా భూకంప తరంగాలు ఎంత వేగంతో చొచ్చుకుని సాగిపోతున్నాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గత దశాబ్దకాలంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా రిక్టర్ స్కేల్‌పై ఆరుకు పైగా తీవ్రతతో కూడిన 200కు పైగా భూకంపాల తాలూకు గణాంకాలను వారు లోతుగా విశ్లేషిస్తున్నారు. చివరికి ఈ భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా ప్రయాణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. ఇన్నర్ కోర్ తాలూకు అత్యంత లోతైన భాగాలకు సంబంధించి పలు కొత్త విషయాలు ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూశాయి. మరింత సమాచారం కోసం ఆ తరంగాల ప్రయాణ సమయాల్లో మార్పులను పరిశోధకులు తాజాగా మరింత లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో భూమికి ఇప్పటిదాకా మనకు తెలియని ఐదో పొర ఉందన్న విషయం బయట పడిందని చెబుతున్నారు! ఇది భూమి లోలోతుల్లో ఘనాకృతిలోని లోహపు గోళం మాదిరిగా ఉందని చెప్పారు. ఇన్నర్ కోర్ తాలూకు కేంద్ర స్థానంలో ఇమిడిపోయి ఉన్న ఈ పొరను ప్రస్తుతానికి ‘అత్యంత లోపలి ఇన్నర్ కోర్’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే భూ కేంద్రానికి సంబంధించి మనకెంతో ప్రయోజనకరమైన సమాచారం వెలుగుచూడొచ్చని చెబుతున్నారు. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు. 20 ఏళ్ల కిందే సూత్రీకరించినా.. నిజానికి భూమి లోలోతుల్లో ఇలాంటి ఒక లోహపు గోళం ఉందని 20 ఏళ్ల కిందే సైంటిస్టులు అంచనా వేశారు. బహుశా అది ఇన్నర్ కోర్ తాలూకు లోలోతుల్లో దాగుండవచ్చని సూత్రీకరించినట్టు ఏఎన్‌యూ తాలూకు రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌లో పని చేస్తున్న డాక్టర్ థాన్సన్ వివరించారు. ఇప్పుడు దానికి సంబంధించి తిరుగులేని రుజువులు లభించడం తమను ఆశ్చర్యానందాలకు లోను చేస్తోందన్నారు. మనకిప్పటిదాకా తెలిసిన భూమి తాలూకు నాలుగు పొరలు క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇలా వెలుగు చూసింది భూకంపం సంభవించినప్పుడు దాని తరంగాలు భూ కేంద్రకం గుండా సరిగ్గా భూమి అవతలి వైపు దూసుకెళ్తాయి. అనంతరం వెనుదిరిగి భూకంప కేంద్రం వద్దకు ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో అలస్కాలో సంభవించిన ఓ భూకంపాన్ని పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. దాని తాలూకు తరంగాలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం గుండా భూమి అవతలి వైపునకు చొచ్చుకుపోయి తిరిగి అలస్కాలోని భూకంప కేంద్రం వద్దకు చేరుకున్నాయి. ఈ తరంగాల ప్రయాణ మార్గాన్ని లోతుగా పరిశీలించే క్రమంలో ఇన్నర్ కోర్‌లోని ఐదో లోహపు పొర ఉనికి తొలిసారిగా వెలుగు చూసిందని పరిశోధక బృందం తాజాగా వివరించింది. ‘‘ఈ భూకంప తరంగాల ప్రయాణ ధోరణిని నిశితంగా గమనించాం. అవి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర అంతర్భాగం నుంచి అలస్కా వైపు తిరిగొచ్చే క్రమంలో ఐదు చోట్ల నిర్దిష్ట ప్రతిస్పందనలు వెలువరిస్తూ ప్రయాణించినట్టు తేలింది. అలా ఐదో పొర ఉనికి బయట పడింది. ఇది వాస్తమేనని పలు ఇతర భూకంపాల తాలూకు తరంగాల ప్రయాణ ధోరణులను పరిశీలించిన మీదట నిర్ధారణ అయింది’ అని చెప్పుకొచ్చింది. ఐదో పొర కూర్పు ఇన్నర్ కోర్ లోతుల్లో ఉన్న ఐదో పొర ఇనుము–నికెల్ లోహ మిశ్రమంతో కూడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఇన్నర్ కోర్‌లోని పదార్థాల గుండా భూకంప తరంగాలు ఎలా దూసుకెళ్తాయో, నెమ్మదిస్తాయో వివరంగా తెలుసుకునే అనిసోట్రోఫీ ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్టు వారు వివరించారు. ‘ఈ తరంగాలు భూ కేంద్రం సమీపంలోని పలు ప్రాంతాలను భిన్న కోణాల్లో పదేపదే స్పృశించాయి. ఇన్నర్ కోర్ లోపలి ఘనాకృతి బయటి పొరతో పోలిస్తే భిన్నంగా ఉండొచ్చు. భూమి ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాల వల్ల ఇన్నర్ కోర్లో ఈ ఘనాకృతి రూపుదిద్దుకుని ఉంటుంది’ అని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తొమ్మిదేళ్లుగా చెప్పులు వేసుకోని యువకుడు.. కారణమిదే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చాలా మంది దేవుళ్ల పేరిట నియమ నిష్టలతో దీక్షలు చేస్తుండటం చూస్తూనే ఉంటాం.. కానీ 21 ఏళ్ల యువకుడు పాలడుగు జ్ఞానేశ్వర్ పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో ‘పుడమి’దీక్ష తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షించేందుకు నడుం బిగించిన ఆయన.. భూమాతతో అనుబంధం విడిపోకూడదనే ఉద్దేశంతో తొమ్మిదేళ్లుగా చెప్పులు కూడా వేసుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్టాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్ జువాలజీలో పీజీ చేశారు. జ్ఞానేశ్వర్ కుటుంబానికి మంజీరా తీరానికి సమీపంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్లుగా నదిలో నీరు లేక పొలాలన్నీ బీడువారాయి. దీంతో చలించిపోయిన జ్ఞానేశ్వర్ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం మొదలుపెట్టారు. ధరణి బాగుంటేనే మనం బాగుంటామని, మొక్కలు నాటడంతోనే సరిపోదని, ఉన్న చెట్లను నరకకుండా కాపాడుకుంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని చాటి చెబుతున్నారు. గ్రీన్ సోల్జర్లను ఏర్పాటు చేసుకుని.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు జ్ఞానేశ్వర్ తమ చుట్టుపక్కల ఉన్న సుమారు 35 గ్రామాల్లో హరిత సైన్యాన్ని (గ్రీన్ సోల్జర్స్)ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో పాఠశాల విద్యార్థులను హరిత సైనికులుగా ఏర్పాటు చేసుకున్నాడు. పర్యావరణ పరిపరక్షణ, మొక్కలు నాటడంపై వారికి అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎవరైనా చెట్లు నరికేందుకు ప్రయత్నిస్తే ఆపాలని, వెంటనే తనకు ఫోన్ చేయాలని వారికి చెప్పారు. అలా ఫోన్ చేస్తే ఆ గ్రామానికి వెళ్లి విద్యార్థులతో కలిసి చెట్లను కౌగిలించుకుంటారు. చెట్లు నరకవద్దని కోరుతారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చి చెట్లు నరికి వేయకుండా కట్టడి చేస్తున్నాడు. ఏడాది క్రితం నాగల్గిద్దలో కొందరు పెద్ద చెట్టును నరికివేశారు. ఈ విషయం తెలిసిన జ్ఞానేశ్వర్.. అక్కడికి వెళ్లి మోడువారి వృక్షాన్ని తిరిగి భూమిలో పాతించాడు. కొద్దిరోజుల తర్వాత ఆ చెట్టు మళ్లీ చిగురించడం ఎంతో సంతోషం కలిగించిందని జ్ఞానేశ్వర్ చెబుతున్నారు. ప్రకృతిని కాపాడితేనే మనిషికి మనుగడ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి చాటి చెప్పేందుకే నేను చెప్పులు వేసుకోకుండా దీక్ష చేస్తున్నాను. భూమిపై ఉన్న ఏ ప్రాణి కూడా చెప్పుల్లాంటివి ధరించదు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న మనిషి మాత్రమే చెప్పులు ధరిస్తున్నాడు. భూమికి మనిషికి ఉన్న అనుబంధం ఎన్నటికీ విడదీయలేనిది. పర్యావరణ సమత్యులతను కాపాడితేనే మానవ మనుగడ ఉంటుంది. దీనిని ఆచరణలో చూపేందుకు దీక్ష చేపట్టాను. –జ్ఞానేశ్వర్, పర్యావరణ ఉద్యమకారుడు యాత్రలతో అవగాహన పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జ్ఞానేశ్వర్ తరచూ గ్రామాల్లో హరిత సైనికులతో కలిసి పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేస్తుంటారు. నాగల్గిద్ద, కంగ్టి, మనూర్, నారాయణఖేడ్, న్యాల్కల్ తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లో ఇలా యాత్రలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న జ్ఞానేశ్వర్‌కు ప్రతిష్టాత్మకమైన ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా దక్కింది. చదవండి: అపార్థం చేసుకున్నాం.. గుంజీలు శిక్ష కాదు.. సూపర్ బ్రెయిన్ యోగా..! -
గ్లోబల్ వార్మింగ్‌కు... చంద్రధూళితో చెక్.. తవ్వి తీసి వెదజల్లడమే!
చంద్రుడంటేనే చల్లదనానికి చక్కని ప్రతీక. అందుకే చల్లని రాజా అంటూ చందమామపై సినీ కవులు ఎన్నో పాటలు కూడా కట్టారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నానాటికీ ప్రమాదకరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేసి భూమిని చల్లబరిచేందుకు కూడా చంద్రుడు ఎంతో సాయపడగలడట. అమెరికా సైంటిస్టుల బృందమొకటి ఈ దిశగా వినూత్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. చంద్రధూళిని అంతరిక్షంలోకి వెదజల్లడం! తద్వారా భూమిపై పడే సూర్యరశ్మిని కొద్దిగా మళ్లించడం!! ఆ మేరకు భూమిని చల్లబరచడం..!!! ఏమిటీ ప్రతిపాదన...? చంద్రునిపై ఉన్న ధూళిని భారీ పరిమాణంలో తవ్వి తీయాలి. దాన్ని సూర్యునికేసి వెదజల్లాలి. అది భారీ ధూళి మేఘాల రూపంలో కనీసం ఓ వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో నిలిచి ఉండేలా చూడాలి. అది చెదిరిపోయాక చంద్రునిపై మరో దఫా తవ్వకం. మరో వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో మరిన్ని ధూళి మేఘాలు. ఇలా మొత్తమ్మీద ఏటా ఏకంగా కోటి టన్నుల చంద్ర ధూళిని భూమికి, సూర్యునికి మధ్య మేఘాల రూపంలో వెదజల్లాలన్నది ప్రతిపాదన. ఏమిటి సమస్య? ► చంద్ర ధూళిని అంతరిక్షంలో వెదజల్లడం వినడానికి బానే ఉన్నా అందుకు చాలా సాంకేతికత అవసరం. అంతేగాక సాంకేతిత, రాజకీయ సవాళ్లతోనూ, అంతకుమించి భారీ వ్యయ ప్రయాసలతోనూ కూడిన పని కూడా. ఎందుకంటే... ► అన్నింటికంటే ముందుగా చంద్రునిపై భారీ సైజులో ఓ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధూళిని తవ్వి పోసే పరికరాలు తదితరాలను అక్కడికి చేరేసుకోవాలి. ► గత 50 ఏళ్లలో మనిషి చంద్రునిపై కాలు పెట్టలేదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా ఎంత కష్టమో అర్థమవుతుంది. ► రాజకీయంగా చూస్తే ఈ మొత్తం ప్రయోగానికి ఎవరు సారథ్యం వహించాలి, ఇందులో ఏ దేశం పాత్ర ఎంతమేరకు, ఎలా ఉండాలన్నది మరో పెద్ద ప్రశ్న. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం ఇప్పటికే పెద్ద దేశాల మధ్య పోటీ ఉద్రిక్తతలకు దారితీస్తున్న వేళ కేవలం ఓ పర్యావరణ లక్ష్యసాధన కోసం ఆభిజాత్యాలను పక్కన పెట్టి అవన్నీ ఏ మేరకు కలిసొస్తాయన్నది అనుమానమే. ► అంతరిక్షంలో భూమికి, సూర్యునికి మధ్య ప్రాంతమంతా పలు దేశాలు ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహాలతో నిండిపోయి ఉంది! ► ఇన్ని కష్టాలూ పడి ఒకవేళ విజయవంతమైనా ధూళిని వెదజల్లే ఉపాయం తాత్కాలిక ఫలితాలే ఇస్తుంది తప్ప గ్లోబల్ వార్మింగ్‌కు శాశ్వతంగా అడ్డుకట్టు వేసే స్థాయిలో దీర్ఘకాలికంగా పెద్దగా ప్రయోజనం కన్పించకపోవచ్చని కొందరు సైంటిస్టులు పెదవి విరుస్తున్నారు. చంద్రధూళే ఎందుకు? ► భూమిపై పడే సూర్యరశ్మి పరిమాణాన్ని కొంత మేరకు తగ్గించడం ద్వారా భూమిని చల్లబరచాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా ఉన్నవే. దీన్ని సోలార్ జియో ఇంజనీరింగ్, సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్‌గా పిలుస్తున్నారు. ► భూ వాతావరణపు పై పొరలోకి వాయు కణాలతో కూడిన సన్నని లేయర్‌ను పంపి భూమిపైకి వచ్చే సూర్యరశ్మిని కొద్దిమేరకు అడ్డుకోవాలన్న ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ఇది ఆచరణసాధ్యం కాదని, ఇలా వాతావరణపు పొరలతో చెలగాటమాడితే భూమిపై పలు ప్రాంతాల్లో వర్షపాతం తదితరాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చన్న భయాల నేపథ్యంలో దానిపై ముందడుగు పడలేదు. ► మరికొందరు అంతరిక్షంలో భారీ అద్దాలు, లేదా ఫిల్టర్లను ఉంచాలని సూచించినా అవేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ► అదే చంద్రధూళిని వాడుకోగలిగితే ఇలాంటి సమస్యలేవీ లేకుండానే దిగ్విజయంగా పని పూర్తవుతుందన్నది తాజా యోచన. ► ఎందుకంటే చంద్రుని ఉపరితలంపై అది అపారంగా అందుబాటులో ఉంది. ► గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే చంద్రుని పై నుంచి ధూళి మేఘాలను అంతేగాక భూమి పై నుంచి జరిపే ఏ ప్రయోగంతో పోల్చినా అత్యంత తక్కువ వ్యయ ప్రయాసలతో సులువుగా అంతరిక్షంలోకి తరలించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్