ఆస్టరాయిడ్ ఢీ కొడితే ఏం జరుగుతుంది?.. సర్వం నాశనం అవుతుంది. ఈ భూమ్మీద డైనోసార్ల అంతానికి కారణం ఇదేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవాళి ఎలాంటి విపత్తునైనా(సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని) ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో భూమి వైపు దూసుకొస్తున్న ఓ భారీ గ్రహశకలాన్ని నాశనం చేసేందుకు నాసా అదిరిపోయే స్కెచ్ అమలు చేయబోతోంది.
సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాల్ని నాశనం చేసేందుకు న్యూక్లియర్ వెపన్స్‌ను ఉపయోగిస్తుంటారు. అప్పుడు అవి ఆకాశంలోనే నాశనం అవుతాయి. ఒక్కోసారి అవి సముద్రంలో పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా ప్రాంతంలో పడి తక్కువ మోతాదులో డ్యామేజ్ చేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులకు వీలులేని ఆస్టరాయిడ్‌ల సంగతి ఏంటి?.. అవి గమనం మార్చుకోవాలనే ప్రార్థిస్తుంటారు అంతా. అయితే ఓ భారీ గ్రహశకలం ఇప్పుడు భూమి దిశగా దూసుకువస్తోంది. అందుకే స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీ కొట్టించి నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA.
డిడైమోస్(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్) చుట్టూరా తిరిగే డైమోర్‌ఫోస్(బుల్లి చందమామగా అభివర్ణిస్తుంటారు)ను నాశనం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ మిషన్‌కు నాసా పెట్టిన పేరు డార్ట్(Double Asteroid Redirection Test mission). నవంబర్ 24న స్పేస్‌ఎక్స్ రాకెట్ ఫాల్కన్ 9 ద్వారా ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను గ్రహశకలం మీదకు ప్రయోగించి నాశనం చేయాలన్నది నాసా ప్లాన్. NASA's First Planetary Defense Mission 2022 లేదంటే 2023 మధ్యకల్లా పూర్తవ్వొచ్చని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
asteroid deflection technology ద్వారా భూమిని కాపాడాలనే నాసా ప్రయత్నం గురించి పలువురికి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ టార్గెట్ రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే స్పేస్‌క్రాఫ్ట్ గురితప్పదని, గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాత అది నాశనం కాకపోయినా.. కనీసం గమనాన్నైనా మళ్లిస్తుందనేది నాసా సైంటిస్టులు చెబుతున్న మాట. ఈ ‘ఆస్టరాయిడ్ మూన్’ను స్పేస్‌వాచ్ ప్రాజెక్టులో భాగంగా 1996లో ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన జోయ్ మోంటనీ మొదటగా గుర్తించారు.
☄️ #PlanetaryDefense at @NASA entails finding, tracking, and characterizing near-Earth #asteroids and objects. Here’s what we've found thus far. Our #DARTMission, launching this November, will also be our first test for planetary defense.
— NASA Asteroid Watch (@AsteroidWatch) October 1, 2021
Learn more at https://t.co/1wL4ifObpp pic.twitter.com/8JryeeWQjG
ఇది భూమిని కచ్చితంగా ఎప్పుడు ఢీ కొడుతుందో తెలియనప్పటికీ.. అది చేసే డ్యామేజ్ మాత్రం భారీ స్థాయిలో ఉంటుందనే సైంటిస్టులు భావిస్తున్నారు. అందుకే దాన్ని అంతరిక్షంలోనే నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తుంటారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్‌ను గుర్తించిన నాసా.. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా ప్రకటించింది.
ఇది చదవండి: ఎనిమిదేళ్లకే పరిశోధన.. రికార్డుల్లోకి ఎక్కిన బుల్లి సైంటిస్ట్
Comments
Please login to add a commentAdd a comment