అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అంతరిక్ష పరిశోధనలు సాగిస్తుంటుంది. ఈ నేపధ్యంలో ఖగోళంలో జరిగే దృగ్విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటుంది.
తాజాగా నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఐదు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. ఈ ఖగోళ శకలాలు 2024, డిసెంబరు 11న భూమిని దాటుతాయని తెలిపింది. వీటివలన భూమికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని నాసా తెలిపింది. నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై అధ్యయనం చేసేందుకు ఇది సదవకాశంగా భావిస్తున్నారు. ఆ గ్రహశకలాల వివరాలను శాస్త్రవేత్తలు తెలియజేశారు.
గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3
గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3.. ఈ సమూహంలో అతిపెద్దది. దాదాపు 811 అడుగుల ఎత్తు కలిగిన ఇది విమానం సైజును పోలి ఉంటుంది. ఇది 4 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటనుంది. శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం నిర్మాణాన్ని, కదలికలను అధ్యయనం చేయనున్నారు.
గ్రహశకలం 2024 ఎక్స్‌జెడ్ 11
గ్రహశకలం 2024 ఎక్స్‌జెడ్ 11.. ఎక్స్‌యూ 3 కంటే కొంచెం చిన్నది. 71 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది భూమికి 2.112 మిలియన్ మైళ్లు దూరం నుంచి దాటనుంది.
గ్రహశకలం 2024 ఎక్స్‌ఎల్ 11
గ్రహశకలం 2024 ఎక్స్‌ఎల్ 11 ఈ సమూహంలో అతి చిన్నది. కేవలం 20 అడుగుల పరిమాణంతో, 7,35,000 మైళ్ల దూరం నుంచి భూమిని దాటుతుంది. దీని పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ, దీని పరిశోధనలో అనేక విషయాలు వెల్లడికానున్నాయి.
గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1
గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1 పరిమాణంలో ఒక బస్సును పోలి ఉంటుంది. 31 అడుగుల పరిమాణంతో, ఇది భూమికి 1.16 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.
గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14
గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14 వెడల్పు 86 అడుగులు. ఇది 4.3 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటుతుంది. నాసా తన ప్రయోగశాల నుండి ఈ గ్రహశకలాలను పర్యవేక్షిస్తోంది. శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం సాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక..
Comments
Please login to add a commentAdd a comment