asteroid
-
భూమివైపు దూసుకొస్తున్న ఐదు భారీ గ్రహశకలాలు
అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అంతరిక్ష పరిశోధనలు సాగిస్తుంటుంది. ఈ నేపధ్యంలో ఖగోళంలో జరిగే దృగ్విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటుంది.తాజాగా నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఐదు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. ఈ ఖగోళ శకలాలు 2024, డిసెంబరు 11న భూమిని దాటుతాయని తెలిపింది. వీటివలన భూమికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని నాసా తెలిపింది. నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై అధ్యయనం చేసేందుకు ఇది సదవకాశంగా భావిస్తున్నారు. ఆ గ్రహశకలాల వివరాలను శాస్త్రవేత్తలు తెలియజేశారు.గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3.. ఈ సమూహంలో అతిపెద్దది. దాదాపు 811 అడుగుల ఎత్తు కలిగిన ఇది విమానం సైజును పోలి ఉంటుంది. ఇది 4 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటనుంది. శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం నిర్మాణాన్ని, కదలికలను అధ్యయనం చేయనున్నారు.గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11.. ఎక్స్‌యూ 3 కంటే కొంచెం చిన్నది. 71 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది భూమికి 2.112 మిలియన్ మైళ్లు దూరం నుంచి దాటనుంది.గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11 ఈ సమూహంలో అతి చిన్నది. కేవలం 20 అడుగుల పరిమాణంతో, 7,35,000 మైళ్ల దూరం నుంచి భూమిని దాటుతుంది. దీని పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ, దీని పరిశోధనలో అనేక విషయాలు వెల్లడికానున్నాయి.గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1 పరిమాణంలో ఒక బస్సును పోలి ఉంటుంది. 31 అడుగుల పరిమాణంతో, ఇది భూమికి 1.16 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14 వెడల్పు 86 అడుగులు. ఇది 4.3 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటుతుంది. నాసా తన ప్రయోగశాల నుండి ఈ గ్రహశకలాలను పర్యవేక్షిస్తోంది. శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక.. -
ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం
ఏకంగా 70 అంతస్తుల భవనం అంత ఎత్తున్న భారీ గ్రహశకలం ఈ నెల 28న భూమికి సమీపానికి రాబోతోంది. సైంటిస్టులు దీనికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ అని పేరుపెట్టారు. ఈ నెల 28న ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్(జేపీఎల్) తొలుత గుర్తించింది. ఇది భూమికి అతి సమీపంలోకి.. అంటే 3.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 9 రెట్లు అధికం. సమీపం నుంచి దూసుకెళ్లే ఈ అస్టరాయిడ్ వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రహ శకలాలలపై మరిన్ని పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది సెకన్‌కు 9.43 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని, సమీపం నుంచే క్షుణ్నంగా పరిశీలించవచ్చని అంటున్నారు. ఇదొక అరుదైన అవకాశమని చెబుతున్నారు. భవిష్యత్తులో భూమికి సమీపంలోకి రాబోయే గ్రహ శకలాలు, వాటి నుంచి వాటిల్లే ముప్పు, ఆ ముప్పు తప్పించే మార్గాలపై అధ్యయనానికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ రాకను ఉపయోగించుకుంటామని సైంటిస్టులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Space Rock: నెలల శిలరేడు!
ఇప్పటిదాకా అది కేవలం ఒక అంతరిక్ష శిలే. కానీ త్వరలో ఓ రెండు నెలల పాటు తాత్కాలికంగా ‘చందమామ’ హోదా పొందనుంది! ఎవరా బుల్లి చంద్రుడు? ఏమిటా విశేషాలు? చూద్దాం రండి... భూ కక్ష్యను సమీపిస్తున్న ఒక బుల్లి గ్రహశకలాన్ని సైంటిస్టులు తాజాగా గమనించారు. అది ఇంకొద్ది రోజుల్లో తాత్కాలికంగా భూమ్యాకర్షణ శక్తికి లోనవనుంది. సెప్టెంబర్ 29 నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశించి మన గ్రహం చుట్టూ పరిభ్రమించడం మొదలు పెడుతుంది. దాని చక్కర్లు నవంబర్ 25 దాకా కొనసాగుతాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు వివరించారు. ఆ మీదట తిరిగి సౌర కక్ష్యలోకి ప్రవేశించి ఎప్పట్లా సూర్యుని చుట్టూ తిరుగుతుంది.దక్షిణాఫ్రికాలోని నాసా అబ్జర్వేటరీ ద్వారా సైంటిస్టులు దీన్ని గత ఆగస్టు 7న గమనించారు. దీని వ్యాసం 37 అడుగులని అంచనా వేసినా 16 నుంచి 138 అడుగుల దాకా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బుల్లి తాత్కాలిక చంద్రున్ని 2024పీటీ5గా పిలుస్తున్నారు. భూ కక్ష్యలోకి దాని రాకపోకలను గురించిన సమాచారం అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాజా సంచికలో ప్రచురితమైంది. ఆ ప్రమాదమేమీ లేనట్టే... 65 అడుగుల వ్యాసంతో కూడిన ఇలాంటి గ్రహశకలమే ఒకటి 2013లో పెద్ద భయోత్పాతమే సృష్టించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి రష్యాలో చెలియాబిన్స్క్ ప్రాంతంలో ఒక్క ఉదుటున పేలిపోయింది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో హిరోíÙమాపై ప్రయోగించిన తొలి అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువ శక్తిని, సూర్యున్ని తలదన్నేంతటి ప్రకాశాన్ని విడుదల చేసింది. దాని తాలూకు శకలాలు శరవేగంగా వచ్చి పడటంతో చెలియాబిన్స్్కలో ఏకంగా 7,000 పై చిలుకు భవనాలు భారీగా దెబ్బ తిన్నాయి. 1,000 మందికి పైగా గాయపడ్డారు. కానీ 29న భూ కక్ష్యలోకి ప్రవేశించనున్న 2024పీటీ5తో మాత్రం ప్రస్తుతం గానీ, కొద్ది దశాబ్దాల తర్వాత గానీ అలాంటి ముప్పేమీ ఉండబోదని సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు. నవంబర్ 25న మన కక్ష్యను వీడిన మీదట అది చూస్తుండగానే భూమికి 42 లక్షల కిలోమీటర్ల దూరానికి లంఘించి సౌర కక్ష్యలోకి వెళ్లిపోనుందట. అనంతరం మళ్లీ 2055లో, ఆ తర్వాత 2084లోనూ ఈ బుల్లి జాబిల్లి భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుందట. ఆ రెండుసార్లూ కొద్ది రోజుల పాటు మాత్రమే చక్కర్లు కొట్టి తన మాతృ కక్ష్యలోకి వెళ్లిపోతుందని సైంటిస్టులు వివరించారు. ప్రతి పదేళ్లలో ఒకట్రెండుసార్లు... ఇలాంటి బుల్లి చంద్రులు భూమిని పలకరించడం అరుదేమీ కాదు. 2020 ఫిబ్రవరిలో 2020సీడీ3 అనే గ్రహశకలం ఇలాగే రెండు నెలల పాటు భూ కక్ష్యలోకి చొచ్చుకొచి్చంది. రెండు నెలల పాటు ప్రదక్షిణం చేసిన మీదట గుడ్‌బై చెప్పి వెళ్లిపోయింది. దశాబ్దానికి రెండు మూడుసార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయట. కొద్ది రోజులు, వారాలు, మహా అయితే ఒకట్రెండు నెలలు కక్ష్యలో ప్రయాణించిన మీదట అవిఇలా పలాయనం చిత్తగిస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం భూ కక్ష్యలోకి వచ్చిన మీదట కనీసం ఒకట్రెండు ప్రదక్షిణలైనా పూర్తి చేస్తాయి.అంటే ఒకట్రెండేళ్లపాటు భూ కక్ష్యలోనే కొనసాగుతాయి. అయితే ఇలాంటి ఉదంతాలు అరుదు. మహా అయితే 10 నుంచి 20 ఏళ్లలో ఒకసారి జరిగితే గొప్పే. అయితే, ‘‘ఏ సమయంలో చూసినా భూ కక్ష్యలో అత్యంత చిన్న గ్రహశకలాలు తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే అవి మరీ పళ్లాలంత చిన్నవిగా ఉంటాయి గనుక వాటి ఉనికిని గుర్తించడం దాదాపుగా అసాధ్యం’’ అని సౌరవ్యవస్థ నిపుణుడు రాబర్ట్ జేడిక్ తెలిపారు. అంతేకాదు, ‘‘2024పీటీ5 కనీసం 10 మీటర్ల కంటే పొడవుంటుందని దాదాపుగా తేలిపోయింది. కనుక ఇప్పటిదాకా సైంటిస్టుల దృష్టికి వచి్చన ‘తాత్కాలిక చందమామ’ల్లో ఇదే అతి పెద్దది’’ అని వివరించారు. అంత ఈజీ కాదు...గ్రహశకలాలు ఇలా తాత్కాలికంగా ఉపగ్రహం అవతారమెత్తడం అంత సులువు కాదు. అందుకు చాలా విషయాలు కలిసి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా భూమ్యాకర్షణ శక్తికి ఆకర్షితమయ్యేందుకు అవసరమైనంత వేగంతో, అవసరమైన దిశలో ప్రయాణిస్తూ ఉండాలి. అంతేగాక భూ కక్ష్యకు దగ్గరవుతున్న కొద్దీ దాని వేగం కాస్త నెమ్మదిస్తూ రావాలి. ఇవన్నీ జరిగితే సదరు గ్రహశకలం దాని పరిమాణం, బరువుతో నిమిత్త లేకుండా భూ కక్ష్యలోకి వచ్చేస్తుంది. సాధారణంగా గంటకు 3,600 కి.మీ. వేగంతో భూమికి 45 లక్షల కిలోమీటర్ల భూమి సమీపానికి వచ్చే గ్రహశకలాలు ఇలా భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంటాయి.‘అర్జున’ పథం నుంచి...తాజాగా మనల్ని పలకరించనున్న 2024పీటీ5 గ్రహశకలం ఎక్కణ్నుంచి వస్తోందో తెలుసా? ‘అర్జున’ గ్రహశకల పథం నుంచి! అది అసంఖ్యాకమైన బుల్లి బుల్లి గ్రహశకలాలకు నిలయం. భూమి మాదిరిగానే అవి కూడా సూర్యుని చుట్టూ తమ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటాయి. ఇవేగాక అంగారకునికి, బృహస్పతికి మధ్యనుండే ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు బుల్లి చంద్రులు వచ్చి భూమిని పలకరిస్తుంటాయి. 2024పీటీ5ను నిశితంగా పరిశీలించి వీలైనంత విస్తారంగా డేటాను సేకరించేందుకు సైంటిస్టులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్పెయిన్‌లోని కానరీ ద్వీపంలో ఉన్న రెండు భారీ టెలిస్కోపులను రెండు నెలల పాటు పూర్తిగా ఈ పని మీదే ఉండనున్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలం
-
‘అదే జరిగితే మానవజాతి అంతం!’
న్యూఢిల్లీ: గ్రహశకలం. అత్యంత వేగంగా అంతరిక్షంలో పయనించే ఈ ఖగోళ అద్భుతాన్ని దూరం నుంచి చూసేందుకు అందరూ ఇష్టపడతారు. దూరం నుంచి దూసుకెళ్తుంటే ఆశ్చర్యం కల్గించే ఆస్టరాయిడ్ ఒకవేళ భూమికి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా సాక్షిభూతంగా నిల్చింది. 1908 జూన్ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు ధాటికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2,200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అయితే 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. 370 మీటర్ల వెడల్పున్న అపోఫిస్ ఆస్టరాయిడ్ తన కక్ష్యలో దూసుకెళ్తూ 2036లోనూ భూమి సమీపానికి రానుంది. 10 కి.మీ.ల వెడల్పాటి ఆస్టరాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణంధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదముందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్థానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి. భారత్ సైతం తన వంతు కృషిచేస్తోందని సోమ్‌నాథ్ చెప్పారు. రెండేళ్ల క్రితం డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా ఆనాడు ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ఆనాడు ప్రపంచదేశాలు కీర్తించాయి. -
SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమయ్యాయి. ఇలా చేశారు... గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది... ► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్‌ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు. ► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది! ► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది. ► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్‌లో ఉన్నాయి. ► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి... గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు. ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది. ఏమిటీ గ్రహశకలాలు... ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట. గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రహశకలాలకు ‘గాలం’!
గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం చేయడం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. దీనికోసమే గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చంద్రుడు, ఇటోకవా అనే గ్రహశకలం నుంచి మాత్రమే నమూనాలు సేకరించగలిగారు. అంతరిక్షంలో సుదూర తీరాలకు ప్రయాణించి గ్రహాలపై, గ్రహశకలాలపై వ్యోమనౌకలను దింపి అక్కడి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. క్యూరియాసిటీ లాంటి రోవర్లు గ్రహాలపై దిగి మట్టిని విశ్లేషించి సమాచారం పంపగలిగినా మనిషి నేరుగా చేసే పరీక్షలకు, యంత్రాలు చేసే పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆశించినంత పురోగతి సాధ్యం కాలేదు. అయితే.. గ్రహశకలాలకు ‘గాలం’ వేసి వాటి నుంచి నమూనాలు సేకరించే పనిని సులభం చేసే ఓ అద్భుత స్పేస్ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన రాబర్ట్ వింగ్లీ బృందం అభివృద్ధిపరుస్తోంది. ఖగోళ వస్తువుల నుంచి నమూనాల సేకరణను కొత్తపుంతలు తొక్కించనుందని భావిస్తున్న ఈ అంతరిక్ష ‘గాలం’ సంగతేంటో ఇప్పుడు చూద్దాం... ఈటెలు రువ్వి... నమూనాలు సేకరించి.. చేపలు పట్టడానికి గాలం ఉపయోగిస్తారు. తిమింగలాలు పట్టేందుకు ఈటెల్లాంటి పెద్ద గాలాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే చేపలకు కొక్కెంలాంటి గాలం వేస్తారు. తిమింగలాలకు ఈటెలాంటి హార్పూన్ (తెలుగులో పంట్రకోల, రువ్వుటీటె అంటారు)లను యంత్రాల సాయంతో వేగంగా వదులుతారు. ముందు భాగం బాణంలా ఉండే ఈ హార్పూన్ తిమింగలాల శరీరంలోకి దిగిన తర్వాత చిక్కుకుపోతుంది. దీంతో హార్పూన్‌ను బలమైన తాడుతో మోటార్ల సాయంతో వెనక్కి లాగుతూ తిమింగలాలను ఓడ దగ్గరికి తీసుకొస్తారు. మరి ఈ ఐడియాను అంతరిక్షంలో ఎలా ఉపయోగిస్తారనే విషయానికొస్తే రాకెట్ మాదిరిగా మొనదేలిన కవచంతో ఉన్న హార్పూన్లను వ్యోమనౌకల ద్వారా పంపుతారు. హార్పూన్‌ను వ్యోమనౌకకు మైళ్లకొద్ది పొడవుండే దృఢమైన తాడుతో కడతారు. చంద్రుడు లేదా ఓ గ్రహ శకలం సమీపంలోకి వ్యోమనౌక వెళ్లిన తర్వాత హార్పూన్ బలంగా విడుదలవుతుంది. దీంతో సెకనుకు ఒక కి.మీ. వేగంతో హార్పూన్ దూసుకుపోయి ఆ ఖగోళ వస్తువు ఉపరితలంలోకి దిగబడిపోతుంది. హార్పూన్ నేలలోకి దిగిపోగానే దాని కవచం విడిపోతుంది. ఇంకేం.. లోపల ఉండే డబ్బాలోకి కొన్ని కిలోల వరకూ మట్టి, రాళ్లు చేరిపోతాయి. శాంపిల్‌తో కూడిన హార్పూన్‌ను తాడు సాయంతో వ్యోమనౌక వెనక్కి లాక్కుని భూమికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. నాసా శాస్త్రవేత్తలు ఈ స్పేస్ హార్పూన్ని బ్లాక్‌రాక్ ఎడారిలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోనూ హార్పూన్ల ప్రయోగానికి వీరు సిద్ధమవుతున్నారు. ప్రయోజనాలు చాలానే... స్పేస్ హార్పూన్లతో గ్రహశకలంపై వేర్వేరు చోట్ల శాంపిళ్లను సేకరించవచ్చు. వ్యోమనౌకను దింపాల్సిన అవసరం లేనందున ఇంధనం బాగా ఆదా అవుతుంది. గ్రహాల ఉపరితలంపై కొన్ని మీటర్ల లోతు నుంచీ నమూనాలు సేకరించొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. విఫలమైన ఉపగ్రహాలకు చెందిన శకలాలు ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మనం పంపే ఉపగ్రహాలకు ముప్పు తెస్తున్నాయి. అలాంటి శకలాలపైకి హార్పూన్లను వదిలి, అవి గుచ్చుకున్నాక.. శకలాలను భూవాతావరణంలోకి ఈడ్చుకొచ్చి మండించొచ్చని అంటున్నారు. అలాగే.. భూమిపై అగ్నిపర్వతాల బిలాల నుంచి, అణు ప్రమాదాలు జరిగి రేడియోధార్మికత తీవ్రంగా ఉన్న చోటు నుంచి, ఇతర ప్రతికూలమైన ప్రదేశాల్లో ఆకాశం నుంచే శాంపిళ్లను సేకరించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: 2023లో ఎవరెస్టును ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి? -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్‌కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షం టూ భూలోకం.. ఏం గుట్టు విప్పుతుందో?
వాషింగ్టన్: అల్లంత దూరాన అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమి మీదికి తీసుకొచ్చింది. ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్ క్యాప్సూల్ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక భూభాగంలో దిగింది. నమూనాను సోమవారం హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అనంతరం వాటిమీద పరీక్షలు, పరిశోధనలు చేస్తారు. అక్కడ గతంలో తెచ్చిన చంద్ర శిలలున్నాయి. వాటిని 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుని మీదికి వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తీసుకొచ్చారు. తాజా క్యాప్సూల్ లో కనీసం పావు కేజీ పరిమాణంలో ఆస్టరాయిడ్ తాలూకు శకలాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి అవి మరింతగా ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా జపాన్ ఒక్కటే ఆస్టరాయిడ్ శకలాలను భూమికి తెచ్చింది. Today's #OSIRISREx asteroid sample landing isn't just the end of a 7-year, 3.9-billion-mile journey through space. It takes us 4.5 billion years back in time. These rocks will help us understand the origin of organics and water that may have seeded life on Earth.… pic.twitter.com/sHLRrnWqAg — NASA (@NASA) September 24, 2023 ఏడేళ్ల ప్రయత్నం... ఆస్టరాయిడ్లపై పరిశోధన నిమిత్తం నాసా 2016లో 100 కోట్ల డాలర్ల ఖర్చుతో ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. రెండేళ్ల అనంతరం అది బెన్నూగా పిలిచే ఆస్టరాయిడ్ ఉపరితలంపై దిగింది. 2020లో దాని మీదినుంచి స్వల్ప పరిమాణంలో శకలాలను ఒక క్యాప్సూల్ లోకి సేకరించి వెనుదిరిగింది. అప్పటికే అది కోట్లాది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న బెన్నూ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమికి 8.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది 2182 సంవత్సరంలో భూమికి అతి సమీపంగా వస్తుందని, అప్పుడది బహుశా మనను ఢీకొనే ప్రమాదమూ లేకపోలేదని అంచనా. ఓసిరిస్ ఎక్స్ ప్రస్తుతం అపోఫిస్‌గా పిలిచే మరో ఆస్టరాయిడ్ వైపు పయనిస్తోంది. బెన్నూ రైట్ ఛాయిస్ సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. దీన్ని శోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చు. బెన్నూ.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్ తరగతి గ్రహశకలం. ఇలాంటి ఖగోళ వస్తువులు గ్రహాల నిర్మాణంలో ‘ఇటుకల్లా’ పనిచేసి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దీనిపై సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఖగోళశాస్త్రంలో నేడున్న అతిపెద్ద ప్రశ్న.. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి? వందల కోట్ల ఏళ్ల కిందట బెన్ను వంటి గ్రహశకలాలు వీటిని భూమికి చేరవేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గుట్టును ఒసైరిస్-రెక్స్ నమూనాలు విప్పే అవకాశం ఉంది. చాలా గ్రహశకలాలు.. అంగారకుడు, గురుడు మధ్య ఉన్న గ్రహశకల వలయంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బెన్నూ మాత్రం ఆరేళ్లకోసారి భూమికి చేరువగా వచ్చి వెళుతుంటుంది. అందువల్ల ఆ గ్రహశకలం వద్దకు వ్యోమనౌకను పంపి, భూమికి తిరిగి రప్పించడం చాలా సులువు. ఉత్కంఠ ప్రయాణంలో.. రోదసిలో దాదాపు మూడేళ్ల ప్రయాణం తర్వాత ఒసైరిస్-రెక్స్.. భూమికి చేరువైంది. భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఈ వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్సూల్ విడిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. గాలి రాపిడి వల్ల చెలరేగిన 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఉష్ణ రక్షణ కవచం సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో అది సురక్షితంగా దిగింది. హెలికాప్టర్లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి, సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్‌లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలు కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్-రెక్స్.. తన ఏడేళ్ల ప్రస్థానంలో.. సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. -
అమెరికా నుంచి భారత్ వరకు ముంచుకొస్తున్న ప్రమాదం.. నాసా హెచ్చరిక!
2046వ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజును గ్రాండ్‌గా సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, విరమించుకోండి.. మీరు విన్నది నిజమే.. ఎందుకంటే.. ఆ రోజున ఓ గ్రహ శకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందట. అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ఈ మేరకు హెచ్చరించింది. మరి ఏమిటా గ్రహశకలం? ఎక్కడ పడే అవకాశముంది? ఎంత నష్టం జరుగుతుందనే వివరాలు మీకోసం.. ఒక భారీ గ్రహశకలం.. దాదాపు ఆరు కోట్ల ఏళ్ల కింద భూమిని ఢీకొడితే డైనోసార్లు సహా 90శాతానికిపైగా జీవరాశి తుడిచిపెట్టుకుపోయింది. తర్వాత మరికొన్ని గ్రహశకలాలు వాటి స్థాయిలో విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడూ అలాంటి ప్రమాదం ముంచుకు వస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది. 2046 ఫిబ్ర వరి 14న సాయంత్రం 4.44 గంటల (ఈస్టర్న్ టైం)కు ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని పేర్కొంది (భారత కాలమానం ప్రకారం.. ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3.14 గంటలకు). ఇటలీలోని పీసా టవర్(186 అడుగులు)కు కాస్త దగ్గరగా 165 అడుగుల పరిమాణంలో ఈ గ్రహ శకలం ఉందని తెలిపింది. కొన్ని వారాలుగా పరిశీలించాక.. ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలాన్ని కొన్నివారాల క్రితమే గుర్తించారు. దాని ప్రయాణమార్గం, వేగం, ఇతర అంశాలను పరిశీలించిన ఓ ఇటాలియన్ ఆస్ట్రానమర్.. భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసాను అలర్ట్ చేశారు. తొలుత 1,200 చాన్సుల్లో ఒకసారి అది ఢీకొట్టవచ్చని భావించారు. నిశితంగా పరిశీలించాక.. 710 చాన్సుల్లో ఒకసారికి, తర్వాత 560 చాన్సుల్లో ఒకసారికి మార్చారు. అంటే ప్రమాద అవకాశం మరింత పెరుగుతోందన్న మాట. అమెరికా నుంచి భారత్ దాకా.. ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం దాకా ఎక్కడైనా పడొచ్చని నాసా అంచనా వేసింది. అమెరికాలోని హవాయి, లాస్ ఏంజిలిస్, వాషింగ్టన్ వంటి నగరాలూ ఈ మార్గంలో ఉన్నాయని పేర్కొంది. నాసా అంచనా వేసిన మ్యాప్ ప్రకారం.. తర్వాతి స్థానాల్లో ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ థాయ్‌లాండ్, ఇండియా, గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే.. వీటికి ప్రమాదం తక్కువ. టొరినో స్కేల్‌పై లెవల్-1 వద్ద.. భూకంపాలను రిక్టర్ స్కేల్‌తో కొలిచినట్టే.. గ్రహశకలాలు ఢీకొట్టే ప్రమాదాన్ని టొరినో స్కేల్‌తో కొలుస్తారు. దాని పరిమాణం, వేగం, భూమికి ఎంత దగ్గరగా ప్రయాణిస్తుందనే అంశాల ఆధారంగా లెవల్ రేటింగ్ ఇస్తారు. ‘2023డీడబ్ల్యూ’తో ప్రమాదాన్ని లెవల్–1 వద్ద సూచించారు. మరింత కచి్చతమైన పరిశీలన తర్వాత స్థాయిని పెంచుతారు. లెవల్–3 దాటితే ప్రజల కు హెచ్చరికలు జారీ చేస్తారు. అంతుకుముందుతో పోలిస్తే.. 1908లో దాదాపు 160 అడుగుల గ్రహశకలం రష్యాలోని సైబీరియా గగనతలంలో ఐదారు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయింది. దీని ధాటికి సుమారు 2వేల చదరపు కిలోమీటర్లలో అడవి, జీవజాలం నాశనమైంది. జనావాసాలకు దూరంగా జరగడంతో మరణాలు నమోదు కాలేదు. కానీ ఆ పేలుడు తీవ్రత జపాన్‌లోని హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే వెయ్యి రెట్లు ఎక్కువని, నేరుగా భూమిని ఢీకొని ఉంటే భారీ విధ్వంసం జరిగేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. - ఇప్పుడు ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం జనావాసాలు ఉన్నచోట ఢీకొంటే.. ఒక పెద్ద నగరమంత వైశాల్యంలో అంతా నామరూపాలు లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ We've been tracking a new asteroid named 2023 DW that has a very small chance of impacting Earth in 2046. Often when new objects are first discovered, it takes several weeks of data to reduce the uncertainties and adequately predict their orbits years into the future. (1/2) pic.twitter.com/SaLC0AUSdP — NASA Asteroid Watch (@AsteroidWatch) March 7, 2023 -
అత్యంత వేగంగా భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఇదే తొలిసారి!
కేప్ కెనావెరల్ (వాషింగ్టన్): బుల్లి గ్రహశకలమొకటి భూమికేసి అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ఆ క్రమంలో మనకు అత్యంత సమీపానికి రానుందట. ఎంత దగ్గరికంటే, దక్షిణ అమెరికా దక్షిణాగ్రానికి ఏకంగా 3,600 కిలోమీటర్ల సమీపానికి! అంటే అంతరిక్షంలో తిరుగుతున్న మన సమాచార ఉపగ్రహాల కంటే కూడా భూమికి పదింతలు సమీపానికి వచ్చి పడుతుందన్నమాట!! ఇది జరిగేదెప్పుడో తెలుసా? శుక్రవారం ఉదయం 5 గంటలకు 57 నిమిషాలకు! అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం దాదాపుగా లేనట్టేనని నాసా చెబుతోంది. ‘‘ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల దాని మార్గం బాగా మారిపోతుంది. ఒకవేళ అది భూ వాతావరణంలోకి ప్రవేశించినా దాదాపుగా గాల్లోనే మండిపోతుంది’’ అంటోంది. మహా అయితే దాని ముక్కలు ప్రమాదరహితంగా భూమిపై పడితే పడొచ్చట. ఓ గ్రహశకలం భూమికి ఇంత సమీపానికి రావడం మనకు తెలిసి ఇదే తొలిసారని నాసా చెబుతోంది. -
హిమగర్భంలో భారీ ఉల్క
న్యూఢిల్లీ: అంటార్కిటికాలో దట్టమైన మంచు గర్భంలో 7.6 కిలోల బరువైన ఉల్కను అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వెలికితీసింది. మంచు ఖండంలో ఇంతటి భారీ ఉల్క దొరకడం అత్యంత అరుదైన విషయమని పేర్కొంది. గత డిసెంబర్ 11 నుంచి నెల రోజుల పాటు జరిపిన అన్వేషణలో మరిన్ని చిన్న సైజు ఉల్కలు కూడా దొరికాయి. శాటిలైట్ ఇమేజీలు, జీపీఎస్ సాయంతో వీటి జాడను కనిపెట్టారు. ‘‘ఇవి బహుశా ఏదో ఆస్టిరాయిడ్ నుంచి రాలి పడి ఉంటాయి. వేలాది ఏళ్లుగా మంచు గర్భంలో ఉండిపోయాయి. వీటిని పరిశోధన నిమిత్తం బ్రెసెల్స్కు పంపాం. అందులో భూమి ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. -
Asteroid: మిస్సైల్ కంటే వేగంగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
వాషింగ్టన్: భూమికి సమీపంగా రోజూ ఎన్నో గ్రహశకలాలు వెళ్తుంటాయి. కొత్తవాటిన్నెంటినో గుర్తిస్తుంటారు కూడా. అయితే.. భూమికి అత్యంత సమీపంగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లను మాత్రం తేలికగా తీసుకోవద్దని సైంటిస్టులు చెబుతుంటారు. ఎందుకంటే వాటిలో ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి కాబట్టి. అలాగే.. ఇప్పుడూ భూమికి సమీపంగా వస్తున్న ఓ భారీ గ్రహశకలం విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని నాసా హెచ్చరిస్తోంది. ఆస్టరాయిడ్ 2022 వైజీ5.. భూమి వైపు దూసుకొస్తోందట. డిసెంబర్ 30వ తేదీన ఇది భూమికి సమీపంగా.. 3.1 మిలియన్ కిలోమీటర్ల దూరంతో ఇది ప్రయాణించనుందట. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమేనని నాసా హెచ్చరిస్తోంది. గంటకు 51,246 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోందని, ఈ వేగం ఒక హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయాణ వేగం కంటే ఐదు రేట్లు ఎక్కువని నాసా ప్రకటించింది. అయితే దీని వల్ల జరిగే నష్టతీవ్రత గురించి మాత్రం నాసా స్పష్టత ఇవ్వలేదు. విశేషం ఏంటంటే.. ఆస్టరాయిడ్ 2022 వైజీ5ను డిసెంబర్ 24 తేదీనే గుర్తించింది నాసా. ఇది అపోలో గ్రూప్ గ్రహశకలాలకు చెందిందని, సూర్యుడికి గరిష్టంగా 398 మిలియన్ కిలోమీటర్ల దూరం, కనిష్టంగా 119 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. 829 రోజులకు సూర్యుడి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేసుకుంటుందని ప్రకటించింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చే గ్రహశకలాలు, అందునా భూమిని ఢీ కొట్టే సంభావ్యత ఉన్న వాటిని దారి మళ్లించడం, లేదంటే అంతరిక్షంలోనే నాశనం చేసే ఉద్దేశ్యంతో ‘డార్ట్’ పేరిట ప్రయోగం చేపట్టి.. విజయం సాధించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. అయితే.. ముందస్తు హెచ్చరికలు, సమయం ఉంటేనే దూసుకొచ్చే వాటిని ఢీ కొట్టడానికి స్పేస్షిప్లను ప్రయోగించడానికి వీలవుతుంది. డార్ట్ బరువు 570 కేజీలు ఉంటుంది. వాస్తవానికి గ్రహశకలాలను, భూమి వైపు దూసుకొచ్చే మరేయితర వస్తువులను నాశనం చేయడం డార్ట్ ఉద్దేశం కాదు.. కేవలం దారి మళ్లించడం మాత్రమే లక్ష్యం. కానీ, ప్రయోగంలో శకలాలు నాశనం అవ్వొచ్చని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. మరోవైపు చైనా కూడా గ్రహశకలాలను నుంచి తమ భూభాగాల్ని, ఉపగ్రహాల్ని.. అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని రక్షించుకునేందుకు సొంతంగా ఇలాంటి రక్షణ వ్యవస్థను సిద్ధంగా చేసుకుంటోంది. 2025లో ప్రయోగాత్మకంగా గ్రహశకలాల మళ్లింపును పరీక్షించాలని భావిస్తోంది. -
అపూర్వ విజయమది
భూమిపైకి దూసుకొచ్చే ప్రమాదమున్న గ్రహశకలాలను అంతరిక్షంలోనే ఢీకొట్టి దారి మళ్లించడం ద్వారా మనకు ముప్పు తప్పించే లక్ష్యంతో సెప్టెంబర్‌లో నాసా చేపట్టిన చరిత్రాత్మక డార్ట్ (డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్టన్) ప్రయోగం దిగ్విజయం కావడం తెలిసిందే. ఇందులో భాగంగా భూమికి ఏకంగా 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో డిడిమోస్ అనే పెద్ద గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తున్న డైమోర్ఫస్ అనే బుల్లి శకలాన్ని 570 కిలోల బరువున్న డార్ట్ ఉపగ్రహం గంటకు ఏకంగా 22,500 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ఆ ప్రయోగ ఫలితాలపై పలు కోణాల్లో అధ్యయనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కీలక విషయాలు తాజాగా వెలుగు చూశాయి. ప్రయోగం ద్వారా డైమోర్ఫస్ కక్ష్యను మార్చడం సైంటిస్టుల ప్రధాన లక్ష్యం. అది వారు ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా నెరవేరిందని తాజాగా తేలింది. డిడిమోస్ చుట్టూ దాని పరిభ్రమణ కాలం ఏకంగా 32 నిమిషాల మేరకు తగ్గిందని వెల్లడైంది. ‘‘అందుకే డార్ట్ ప్రయోగం మామూలు విజయం కాదు. ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ ఫలితమిచ్చింది’’ అని నాసా సైంటిస్టులు సంబరంగా చెబుతున్నారు. అంతేకాదు, డార్ట్ ఢీకొన్నప్పుడు దాని ఊహాతీత వేగపు ధాటికి డైమోర్ఫస్ నుంచి కనీసం 10 లక్షల కిలోల బరువైన ఉపరితల పదార్థాలు ముక్కచెక్కలుగా అంతరిక్షంలో దూసుకెళ్లాయట. అంతరిక్షంలో ఇలా ఒక వస్తువు ఢీకొనే వేగం వల్ల రెండో వస్తువుపై పడే ఒత్తిడిని ద్రవ్యవేగపు మార్పిడిగా పేర్కొంటారు. ‘‘డార్ట్ ప్రయోగం వల్ల జరిగిన ద్రవ్యవేగపు మార్పిడిని ‘బెటా’గా పిలుస్తాం. అర టన్ను బరువున్న ఏ వస్తువైనా గ్రహశకలం ఆకర్షణ శక్తికి లోబడి దానికేసి దూసుకెళ్తే జరిగే దానికంటే డార్ట్ ప్రయోగం వల్ల 3.6 రెట్లు ఎక్కువగా ద్రవ్యవేగపు మార్పిడి జరిగింది. డార్ట్ ప్రయాణించిన గంటకు 22,500 కిలోమీటర్ల వేగమే ఇందుకు కారణం’’ అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్‌కు చెందిన డార్ట్ మిషన్ సైంటిస్టు డాక్టర్ ఆండీ చెంగ్ వివరించారు. ‘‘ఈ ద్రవ్యవేగపు మార్పిడి ఎంత ఎక్కువగా ఉంటే గ్రహశకలాన్ని అంతగా దారి మళ్లించడం వీలవుతుంది. భూమిని నిజంగానే గ్రహశకలాల బారినుంచి కాపాడాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు ఇది చాలా కీలకంగా మారగలదు. డార్ట్ ప్రయోగం ద్వారా మనకు అందుబాటులోకి వచ్చిన అతి కీలక సమాచారమిది’’ అని ఆయన చెప్పారు. ‘‘అందుకే డార్ట్ ప్రయోగాన్ని ఊహకు కూడా అందనంతటి గొప్ప విజయంగా చెప్పాలి. దీనివల్ల గ్రహ శకలాల ముప్పును తప్పించేంత సామర్థ్యం మనకు ఇప్పటికిప్పుడే సమకూరిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ దిశగా మనం వేసిన అతి పెద్ద ముందడుగుగా మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు’’ అని నాసా డార్ట్ ప్రోగ్రాంలో కీలకంగా పని చేసిన సైంటిస్టు డాక్టర్ టామ్ స్టాట్లర్ చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా దీనిపై స్పందించారు. 2022లో నాసా సాధించిన మూడు ఘన విజయా ల్లో డార్ట్ ప్రయోగం ఒకటంటూ ప్రశంసించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హంతక శకలం
శాంటియాగో: గ్రహాల పాలిట ప్రాణాంతకమైనదిగా భావిస్తున్న గ్రహశకలం ఒకటి మన సౌరవ్యవస్థలో చక్కర్లు కొడుతోంది. దాదాపు మైలు వెడల్పున్న దీన్ని 2022 ఏపీ7గా పిలుస్తున్నారు. ఈ గ్రహశకలం ఏదో ఒక రోజు భూమిని ఢీకొట్టొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని కక్ష్య ఏదో దాన్ని ఒకనాడు భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయట. ఇది దీర్ఘవృత్తాకారంగా భ్రమిస్తున్నందువల్ల భూమికి ఏకంగా 30 లక్షల కిలోమీటర్ల సమీపానికి కూడా రాగలదట! అంతరిక్షంలో పెద్దగా లెక్కలోకే రాని దూరమిది. గత మార్చిలో 2022 ఏపీ7 భూమికి 1.3 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. మరో ఐదేళ్లపాటు ఇంతకంటే సమీపానికి వచ్చే అవకాశమైతే లేదంటున్నారు. గత ఎనిమిదేళ్లలో మన కంటబడ్డ ప్రమాదకర శకలాల్లో ఇదే అతి పెద్దది. అంతేకాదు, చిలీలోని అబ్జర్వేటరీ నుంచి సౌరవ్యవస్థలో తాజాగా కనిపెట్టిన మూడు గ్రహశకలాల్లో ఇదే పెద్దది. మిగతా రెండు అర మైలు, పావు మైలు వెడల్పున్నాయి. వీటి గురించి ఆస్ట్రనామికల్ జర్నల్‌లో వ్యాసం ప్రచురితమైంది. భూమికి 1.3 ఆస్ట్రనామికల్ యూనిట్స్, అంటే 12.1 కోట్ల మైళ్ల కంటే సమీపానికి వస్తే వాటిని నియర్ ఎర్త్ ఆస్టిరాయిడ్స్ అంటాం. -
Planet killer: భూమి వైపుగా ప్రమాదకరమైన గ్రహశకలం!
భూమి వైపుగా దూసుకొచ్చే గ్రహశకలాలను.. అంతరిక్షంలో ఉండగానే స్పేస్ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీ కొట్టించడం.. తద్వారా కుదిరితే కక్ష్య వేగం తగ్గించి దారిమళ్లించడం.. లేదంటే పూర్తిగా నాశనం చేయడం.. అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ నాసాకు ఇప్పుడు లక్ష్యాలుగా మారాయి. ఈ క్రమంలో.. డార్ట్(డబుల్ ఆస్టారాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్) మిషన్ తెర మీదకు వచ్చింది కూడా. అయితే డార్ట్ మిషన్‌కు కూడా అంతుచిక్కకుండా ఓ గ్రహ శకలం.. భూమి వైపుగా దూసుకొస్తే ఎలా ఉంటుంది?.. ఈమధ్య.. ఓ నెల కిందట నాసా అంతరిక్ష లోతుల్లో ఓ ఆస్టరాయిడ్‌ను స్పేస్ క్రాఫ్ట్తో ఢీ కొట్టించడం ద్వారా విజయవంతంగా దారి మళ్లించింది. ఈలోపే మరో పిడుగు లాంటి వార్తను వెల్లడించింది నాసా. భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉన్న మరో మూడు గ్రహశకలాలను గుర్తించిందట. అంతేకాదు.. సౌరవ్యవస్థ లోపలే అవి దాక్కుని ఉన్నాయని, వాటి గమనాన్ని అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని నాసా ప్రకటించింది. ఈ మేరకు చిలీలోని సెర్రో టోలోలో ఇంటర్ అమెరికన్ అబ్జర్వేటరీ వద్ద టెలిస్కోప్‌కు అమర్చిన డార్క్ ఎనర్జీ కెమెరా ద్వారా ఈ మూడు గ్రహశకలాలను గుర్తించగలిగింది నాసా బృందం. మూడు గ్రహశకలాల్లో రెండు.. కిలోమీటర్ వెడల్పుతో ఉన్నాయి. మూడవది మాత్రం ఒకటిన్నర కిలోమీటర్ వెడల్పుతో ఉండి.. భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా స్పష్టం చేసింది. అయితే.. సౌర వ్యవస్థ లోపలి భాగంలో అదీ భూమి, శుక్ర గ్రహం అర్బిట్ల మధ్య ఈ మూడు గ్రహ శకలాలు గుర్తించామని, సూర్య కాంతి కారణంగా వీటి గమనాన్ని గుర్తించడం కష్టతరంగా మారిందని నాసా బృందం తెలిపింది. వీటిని 2022 AP7, 2021 LJ4, 2021 PH27గా వ్యవహరిస్తున్నారు. ఇందులో 2022 ఏపీ7 ఒకటిన్నర కిలోమీటర్ వెడల్పుతో కిల్లర్ ప్లానెట్‌గా గుర్తింపు దక్కించుకుంది. సాధారణంగా కిలోమీటర్ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడ్స్‌ను కిల్లర్ ప్లానెట్గానే వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఇవి చేసే డ్యామేజ్ ఎక్కువ. అందుకే ఆ పేరు వచ్చింది. అయితే.. గత ఎనిమిదేళ్లలో ఇంత ప్రమాదరకమైన గ్రహశకలాన్ని గుర్తించడం మళ్లీ ఇదే. ఇది ఏదో ఒకరోజు ఇది కచ్చితంగా భూ కక్ష్యలోకి అడుగుపెడుతుందని.. భూమిని కచ్చితంగా ఢీకొట్టి తీరుతుందని అంచనా వేస్తున్నారు నాసా సైంటిస్టులు. మిగతా 2021 ఎల్జే4, 2021 పీహెచ్27 మాత్రం భూమార్గానికి దూరంగానే వెళ్లనున్నాయి. అయితే ప్రమాదకరమైన ఆ గ్రహశకలాన్ని దారి మళ్లించడం, నాశనం చేయడం గురించి ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయడం కుదరదని నాసా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు, కానీ.. -
డిడిమోస్ ఢీ! గ్రహశకలానికి తోకలు! గుర్తించిన హబుల్ టెలిస్కోప్
గ్రహశకలాల కక్ష్యను మార్చి భూమికి వాటి ముప్పును తప్పించే లక్ష్యంతో నాసా నెల క్రితం డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ (డార్ట్) ఉపగ్రహంతో డిడిమోస్ గ్రహశకలాన్ని విజయవంతంగా ఢీకొట్టించడం తెలిసిందే. ఫలితంగా డిడిమోస్ నుంచి బయటికి పొడుచుకొచ్చిన రెండు తోకలను హబుల్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దానిచుట్టూ కమ్ముకున్న ధూళి మేఘాలను కూడా గమనించింది. తోకలు పుట్టుకు రావడం అనూహ్యమని నాసా అంటోంది. వీటితో గ్రహశకలానికి ఏం సంబంధమో తేల్చే పనిలో ఉన్నట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. డార్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్యలో డిడిమోస్ తిరిగే వేగంలో 32 నిమిషాల మేరకు మార్పు వచ్చినట్టు తేలింది! ఇలా మొత్తం 18 విశేషాలను హబుల్ ఇప్పటికి గుర్తించింది. -
NASA DART Mission: అసాధారణ విజయం
తోకచుక్కలు, ఉల్కలు, గ్రహశకలాలు వగైరాల నుంచి భూగోళాన్ని రక్షించే ప్రయత్నంలో పడిన తొలి అడుగు మంగళవారం విజయవంతం కావడం శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు, ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తి గలవారందరికీ ఉత్సాహాన్నిచ్చింది. గత నవంబర్‌లో నాసా శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్ (డార్ట్) పేరుతో ప్రయోగించిన ఉపగ్రహం అందించిన విజయం అసాధారణమైంది. అది అంతరిక్షంలో పది నెలలు ప్రయాణించడం, శాస్త్రవేత్తల ఆదేశాలకు అనుగుణంగా నిర్దేశిత కక్ష్యలో, నిర్దేశిత వేగంతో మునుముందుకు దూసుకుపోవడం, కాస్తయినా తేడా రాకుండా అత్యంత కచ్చితంగా వారు చెప్పిన చోటే, చెప్పిన సమయానికే డైమార్ఫస్ అనే ఫుట్‌బాల్ గ్రౌండంత సైజున్న ఒక గ్రహశకలాన్ని ఢీకొట్టడం ఖగోళ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది. డిడిమోస్ అనే మరో గ్రహశకలం చుట్టూ ఈ డైమార్ఫస్ పరిభ్రమిస్తోంది. ఈ జంట శకలాల్లో సరిగ్గా డైమార్ఫస్‌ని శాస్త్రవేత్తలు లక్ష్యంగా చేసుకున్నారు. అంతరిక్షం నుంచి భూగోళానికి రాగల ముప్పు గురించిన భయాందోళనలు ఈనాటివి కాదు. 1908లో సైబీరియాలో చోటుచేసుకున్న ఘటన ప్రపంచ ప్రజానీకాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. అక్కడి అటవీ ప్రాంతంలో గ్రహశకలం భూమిని ఢీకొట్టడం, పెను విస్ఫోటనం సంభవించి క్షణకాలంలో 10 కిలోమీటర్ల మేర సర్వనాశనం కావడం మానవాళి మస్తిష్కంలో నమోదైన తొట్ట తొలి ఖగోళ సంబంధ భయానక ఉదంతం. మన పుడమికి ఎప్పటికైనా ముప్పుంటుందన్న ఆందోళనకు అంకురార్పణ పడింది అప్పుడే. ఆ తర్వాత ఏమంత చెప్పుకోదగ్గ ఉదంతాలు లేవు. కానీ 2013 ఫిబ్రవరిలో రష్యాలోనే యురల్ పర్వతశ్రేణి ప్రాంత పట్టణాలు ఆరింటిని చెల్యాబిన్స్క్ గ్రహశకలం వణికించింది. కేవలం 66 అడుగుల నిడివున్న ఈ గ్రహశకలం భూవాతావరణంలోకి ప్రవేశించగానే విచ్ఛిన్నమై, ఉల్కాపాతంగా ముట్టడించడంతో ఆ పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. గంటకు 69,000 కిలోమీటర్ల వేగంతో ఆ గ్రహశకలం వచ్చిందని అప్పట్లో శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమేమంటే అదే రోజు 2012 డీఏ 14 పేరుగల మరో గ్రహశకలం రాక కోసం నిరీక్షిస్తున్న శాస్త్రవేత్తలకు పిలవని పేరంటంలా వచ్చిపడిన ఈ గ్రహశకలం ఊపిరాడకుండా చేసింది. ఈ ఉల్కాపాతంలో పౌరులెవరూ మరణించకపోయినా దాని పెనుగర్జన ధాటికి ఇళ్ల కిటికీ అద్దాలు పగిలి 1,500 మంది గాయపడ్డారు. ఆరు పట్టణాల్లోనూ 7,200 ఇళ్లు దెబ్బతిన్నాయి. తోకచుక్కలూ, గ్రహశకలాల తాకిడికి గురికాని గ్రహాలు ఈ విశాల విశ్వంలో లేనేలేవు. అవి పెను విధ్వంసకారులే కావొచ్చుగానీ... కేవలం వాటి పుణ్యానే ఈ పుడమి తల్లి ఒడిలో జీవరాశి పురుడు పోసుకుంది. తోకచుక్కలో, పెను గ్రహశకలాలో తమ వెంట మోసుకొచ్చిన కీలకమైన కర్బన మిశ్రమాలూ, నీరూ జీవరాశి పుట్టుకకూ, వాటి అభివృద్ధికీ కారణమని శాస్త్రవేత్తలు చెబుతారు. దాదాపు 400 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ పరిణామమే విశ్వంలో భూగోళానికి విలక్షణత తీసుకొచ్చింది. ఇదే మాదిరి ఉదంతం ఈ విశాల విశ్వంలో మరోచోట జరిగే అవకాశం లేకపోలేదన్న అంచనాతో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. వారి అంచనా నిరాధారమైంది కాదు. మన పాలపుంత లోనే దాదాపు 4,000 కోట్ల నక్షత్రాలున్నాయంటారు. ఇలాంటి తారామండలాలు ఈ విశ్వంలో వంద కోట్లు ఉంటాయని ఒక అంచనా. కనుక అచ్చం భూమిపై చోటుచేసుకున్న పరిణామం వంటిదే మరోచోట జరగకపోవచ్చని చెప్పడానికి లేదు. లక్షలాది నక్షత్రాలు, గ్రహాలు పరిభ్రమిస్తున్నప్పుడు వాటి నుంచి వెలువడే ధూళి కణాలు మేఘాలై, ఆ మేఘాలు కాస్తా కోట్ల సంవత్సరాల్లో గ్రహాలుగా రూపాంతరం చెందడం సాధారణం. ఆ క్రమంలో కొన్ని శకలాలు విడివడి ఇతర గ్రహాలకు ముప్పు తెస్తూ ఉంటాయి. గురు గ్రహానికీ, అంగారకుడికీ మధ్య ఇలాంటివి అసంఖ్యాకం. ఆ కోణంలో మన భూగోళం సురక్షితమనే చెప్పాలి. అయితే ఇటీవల మనవైపుగా వచ్చిన గ్రహశకలాలు సంఖ్యాపరంగా కాస్త ఎక్కువే. అవి భూమికి లక్షలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నా శాస్త్రవేత్తల దృష్టిలో సమీపం నుంచి పోయే గ్రహశకలాల కిందే లెక్క. భూకక్ష్యకు నాలుగున్నర కోట్ల కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే గ్రహశకలాలను భూమికి సమీపంగా పోతున్నవాటిగా పరిగణిస్తారు. మన సౌర కుటుంబంలో మొత్తం ఆరు లక్షల గ్రహ శకలాలున్నాయని ఒక లెక్క. అందులో కనీసం 20,000 భూ సమీప వస్తువులు (నియో)–అంటే గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే అందులో భూమికి ముప్పు తెచ్చిపెట్టేవి అతి తక్కువ. అయినా కూడా ఏమరుపాటు పనికిరాదన్నది వారి హెచ్చరిక. టెక్సాస్ నగరం నిడివిలో ఉండి భూగోళాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న గ్రహశకలంపై కొన్నేళ్లక్రితం వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఆర్మెగెడాన్’ను ఎవరూ మరిచిపోరు. శాస్త్రవేత్తలు సమష్టిగా కృషిచేసి ఆ గ్రహశకలం గర్భంలో అణుబాంబును ఉంచి దాన్ని పేల్చేయడం ఆ సినిమా ఇతివృత్తం. ఇప్పుడు డార్ట్ ప్రయోగం ఒక రకంగా అటువంటిదే. ఉపగ్రహాన్ని ఢీకొట్టించి దాని కక్ష్యను 1 శాతం తగ్గిస్తే దాని పరిభ్రమణ కాలాన్ని పది నిమిషాలు కుదించవచ్చని, దాంతో కక్ష్య స్వల్పంగా మారవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవంగా ఏం జరిగిందో తెలియడానికి మరికొన్ని వారాలు పడు తుంది. ఈ ప్రయోగం మున్ముందు మరిన్ని విజయాలకు బాటలు పరుస్తుందని, భవిష్యత్తులో ధూర్త శకలాలను దారిమళ్లించి పుడమి తల్లిని రక్షించుకోవడం సాధ్యమేనని ఆశించాలి. -
NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!
వాషింగ్టన్: అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. ఇందుకోసం 10 నెలల క్రితం ప్రయోగించిన 570 కిలోల ఉపగ్రహం లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమోర్ఫస్ అనే బుల్లి గ్రహశకలాన్ని ముందుగా నిర్దేశించిన మేరకు మంగళవారం తెల్లవారుజామున గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. దాంతో నాసా ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలంతా పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ సందడి చేశారు. అన్ని అంచనాలనూ అధిగమిస్తూ ప్రయోగం దిగ్విజయంగా ముగిసిందని నాసా ప్రకటించింది. అంతరిక్షంలో అతి చిన్న శకలాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఉపగ్రహాలను సంధించగలమని రుజువైందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బచెన్ అన్నారు. కెనైటిక్ ఇంపాక్ట్ టెక్నిక్ సాయంతో జరిగిన ఈ ప్రయోగం భూగోళ పరిరక్షణలో అతి పెద్ద ముందడుగని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. ‘‘నిన్నామొన్నటిదాకా శాస్త్ర సాంకేతిక కల్పనగా తోచిన విషయం ఒక్కసారిగా వాస్తవ రూపు దాల్చింది. నమ్మకశ్యం కానంతటి ఘనత ఇది. భావి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని కాపాడుకోవడానికి ఒక చక్కని దారి దొరికినట్టే’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రభావం తేలేందుకు మరికాస్త సమయం... డిడిమోస్ అనే మరో చిన్న గ్రహశకలం చుట్టూ డైమోర్ఫస్ తిరుగుతోంది. దాని వేగాన్ని తగ్గించడం ద్వారా కక్ష్యలో కొద్దిపాటి మార్పు తీసుకురావడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం. అది నెరవేరిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి శక్తిమంతమైన టెలిస్కోప్‌ల ద్వారా నాసా బృందం డైమోర్పస్ను కొద్ది వారాల పాటు నిరంతరం గమనిస్తుంది. డార్ట్‌క్రాఫ్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్య కనీసం ఒక్క శాతం కుంచించుకుపోతుందని అంచనా వేస్తోంది. ఆ లెక్కన డిడిమోస్ చుట్టూ అది పరిభ్రమించే సమయం 10 నిమిషాల దాకా తగ్గాలి. డిడిమోస్ జోలికి వెళ్లకుండా డైమోర్ఫైస్ను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టడం మామూలు విజయం కాదని థామస్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక డ్రాకో నావిగేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నియో... డార్ట్ వారసుడు డార్ట్ ప్రయోగం సఫలమవడంతో భూమికి అంతరిక్ష ముప్పును పసిగట్టి నివారించే ప్రయోగాల పరంపరలో తదుపరి దశకు నాసా తెర తీస్తోంది. డార్ట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా నియర్ అర్త్ ఆబ్జెక్ట్ (నియో) సర్వేయర్ పేరుతో రెండో దశ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్‌ను రూపొందిస్తోంది. దీన్ని త్వరలో పట్టాలపైకి ఎక్కించనున్నట్టు నాసా ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ ప్రకటించారు. భూమికి సమీపంలో ఉన్న ప్రమాదకర గ్రహశకలాలను కనిపెట్టి వాటితో భవిష్యత్తులో ముప్పు రాకుండా ముందే జాగ్రత్త పడటం దీని లక్ష్యమన్నారు. డైమోర్ఫస్‌ను ఉపగ్రహం ఢీకొట్టేందుకు కేవలం 43 సెకన్ల ముందు తీసిన ఫొటో -
అంతరిక్షంలో... ఆర్మగెడాన్!
1998లో వచ్చిన సూపర్‌హిట్ హాలీవుడ్ మూవీ ఆర్మగెడాన్ గుర్తుందా? భూమిని ఢీకొట్టేందుకు శరవేగంగా దూసుకొచ్చే గ్రహశకలం బారి నుంచి మానవాళిని కాపాడే ఇతివృత్తంతో రూపొందింది. అంతరిక్షంలో సోమవారం అచ్చంగా అలాంటి ప్రమాదమే ఒకటి జరగనుంది. కాకపోతే రివర్సులో! ఏడాది క్రితం నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఒకటి గంటకు ఏకంగా 24 వేల కిలోమీటర్ల వేగంతో ఓ గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది! కాకపోతే, భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో జరగనున్న ఈ ప్రమాదం యాదృచ్చికం కాదు. నాసా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే! అంతరిక్ష రక్షణ పరీక్షల్లో భాగంగా డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) పేరుతో నాసా తొలిసారిగా ఇలాంటి ప్రయోగానికి తెర తీసింది. ఈ ప్రయోగం అనుకున్నట్టుగా సఫలమైతే ఎప్పుడైనా గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు ఎదురైతే దాన్ని తప్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది. 32.5 కోట్ల డాలర్ల ఖర్చుతో దాదాపు ఏడాది క్రితం నాసా ఈ డార్ట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా గత నవంబర్‌లో డార్ట్‌క్రాఫ్ట్ పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అది సోమవారం (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4.44 గంటలకు) డైమోర్ఫస్ అనే ఓ బుల్లి గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది. ఇది తనకన్నా పెద్దదైన డిడిమోస్ అనే గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ రెండు శకలాలూ సోమవారం భూమికి అత్యంత సమీపానికి, అంటే 108 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి రానున్నాయి. అందుకే ఈ ముహూర్తాన్ని నాసా ఎంచుకుంది. ఈ ప్రయోగాన్ని నాసా యూట్యూబ్ చానళ్లో లైవ్‌లో చూడొచ్చు కూడా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఉపగ్రహం ఢీకొన్నాక గ్రహశకలం కాంతిలో వచ్చే మార్పులను స్పష్టంగా చూడొచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏం జరగనుంది? ► డైమోర్ఫస్ కేవలం 525 అడుగుల వెడల్పున్న బుల్లి గ్రహశకలం. ► డార్ట్‌క్రాఫ్ట్ గంటకు 24 వేల కి.మీ. బ్రహ్మాండమైన వేగంతో వెళ్లి దాన్ని ఢీకొంటుంది. ► తద్వారా డైమోర్ఫస్ తాలూకు వేగాన్ని కాస్త తగ్గించి దాని కక్ష్యలో కొద్దిగా మార్చడం ఈ ప్రయోగం ప్రధానోద్దేశం! ► డైమోర్ఫస్ కక్ష్యలో చోటుచేసుకునే మార్పును శక్తిమంతమైన టెలిస్కోపుల ద్వారా పరిశీలిస్తారు. ► డైమోర్ఫస్ ప్రస్తుతం డిడిమోస్ గ్రహశకలం చుట్టూ 11 గంటల 55 సెకన్లకు ఒకసారి చొప్పున తిరుగుతోంది. ► డార్ట్‌క్రాఫ్ట్ ఢీకొట్టి ఆ వేగంలో కనీసం 73 సెకన్ల మార్పయినా వస్తే ప్రయోగం సక్సెస్ అయినట్టు. లాభమేమిటి? ► భూమిని ఢీకొట్టగల గ్రహశకలాల వంటివాటిని ముందే గుర్తించే పరిజ్ఞానం ఇప్పటికే మనకు అందుబాటులో ఉంది. ఈ ప్రయోగం గనుక విజయవంతమైతే అలాంటి వాటిని ముందే ఏ డార్ట్క్రాఫ్ట్తోనో ఢీకొట్టించడం ద్వారా వాటి ప్రయాణ మార్గాన్ని మార్చవచ్చు. తద్వారా భూమి అంతరించిపోగల పెను ప్రమాదాన్ని తప్పించవచ్చు. ► నాసా నిర్వచనం ప్రకారం 460 అడుగుల కంటే పెద్దదైన అంతరిక్ష శకలం ఏదైనా భూమికి 46 లక్షల మైళ్ల కంటే సమీపానికి వస్తే దానితో భూమికి డేంజరని భావిస్తారు. ► భూమికి సమీపంలో ఇప్పటిదాకా 27 వేలకు పైగా గ్రహశకలాలను గుర్తించారు. కానీ ప్రస్తుతానికైతే వీటిలో మనకు ప్రమాదకరమైనవి లేవు. ► చివరగా, ఈ ప్రయోగంతో భూమికి వచ్చిన ముప్పేమీ లేదని నాసా భరోసా ఇస్తోంది! – సాక్షి, నేషనల్‌డెస్క్ -
ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే?
అంతరిక్షం గురించి మనకి తెలిసింది తక్కువ తెలియాల్సిందే ఎక్కువే ఉందని, ఈ విశ్వంలో మనకు తెలయని అద్భుతాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అందులో కొన్ని మాత్రం అప్పుడుప్పుడు ఆకాశంలో తళుక్కున మెరుస్తూ మనకి దర్శనమిస్తుంటాయి. ఇటీవల ఓ నగరాన ఆకాశంలో అలాంటి అద్భుతమే ఆవిష్కృతమైంది. ఈ ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూలై 7న శాంటియాగో నగరం ఉదయం 5 గంటల సమయంలో .. అకస్మాత్తుగా అంతరిక్షం నుంచి భూ వాతావారణంలోకి ఓ ఉల్క వచ్చింది. ఇంకేముంది అది అలా ప్రవేశించిందో లేదో భగ్గున మండి ముక్కలై ఆ విస్పోటం చెందింది. దీంతో చీకటిగా ఉన్న ఆ ప్రాంతమంతా తెల్లారకుండానే పట్టపగలులా మారింది. ఇలా ఉల్క పేలినప్పుడు ఏదో పెద్ద మెరుపు మెరిసినట్లు చప్పుడు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనను కన్సెప్షన్ యూనివర్సిటీ స్కాలర్ ధ్రువీకరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటన జరిగిన రోజే న్యూజిల్యాండ్ రాజధాని వెల్లింగ్టన్ ఆకాశంలో ఏదో వస్తువు భగ్గున మండిపోయింది. ఒకే రోజు రెండు దేశాల్లో ఇలా జరగడంతో కొందరు భయబాంత్రులకు గురికాగా మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఏదైమైనా శాస్త్రవేత్తలు ఈ వేర్వేరు వింత ఘటనలకు గల కారణాలపై అధ్యయనాలు మొదలుపెట్టారు. -
నాసా అలర్ట్.. భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం!
ప్రపంచంలోని అతిపెద్ద భవనం బుర్జ్ ఖలీఫా కంటే పెద్దదిగా ఉన్న ఒక గ్రహాశకలం భూమి వైపు దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది. ఈ గ్రహశకలానికి (7482) 1994 పీసీ1గా నామకరణం చేశారు. నాసా పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనుంది. నాసా 1994 పీసీ1 గ్రహశకలాన్ని ప్రమాదకరమైన గ్రహశకలంగా వర్గీకరించింది. దీనిని మొదట ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్లు (సెకనుకు 19.56 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది. భూమి నుంచి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్లు నాసా తెలిపింది. దీని వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలం 1 కి.మీ వ్యాసం కలిగి ఉంది. గ్రహాశకలంతో (7482) 1994 పీసీ1 పాటు అనేక ఇతర గ్రహశకలాలు కూడా జనవరి నెలలో భూమిని దాటే అవకాశం ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) భూమికి దగ్గరగా 5 గ్రహశకలాలు వస్తున్నాయని నివేదించింది. ఈ పెద్ద గ్రహశకలాన్ని రేపు టెలిస్కోప్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే, నాసా దీనిని ట్రాక్ చేయడానికి ఒక లింకు కూడా ట్విటర్ వేదికగా షేర్ చేసింది. Near-Earth #asteroid 1994 PC1 (~1 km wide) is very well known and has been studied for decades by our #PlanetaryDefense experts. Rest assured, 1994 PC1 will safely fly past our planet 1.2 million miles away next Tues., Jan. 18. Track it yourself here: https://t.co/JMAPWiirZh pic.twitter.com/35pgUb1anq — NASA Asteroid Watch (@AsteroidWatch) January 12, 2022 (చదవండి: కేంద్ర బడ్జెట్లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..!) -
నాసా హెచ్చరిక.. భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం!
ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు ఎత్తు ఉన్న ఓ గ్రహాశకలం భూకక్ష్య వైపుగా దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం ఎత్తు న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండనుంది. ఈ గ్రహశకలానికి (7482) 1994 పీసీగా నామకరణం చేశారు. ఈ గ్రహశకలాన్ని ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. నాసా తాజా సమాచారం ప్రకారం.. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహశకలం దాని పరిమాణం(సుమారు 3,280 అడుగులు) ఎక్కువగా ఉండటం, భూమికి దగ్గరగా వెళ్ళడం వల్ల నాసా దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగా గుర్తుంచింది. ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్లు (సెకనుకు 19.56 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది. భూమి నుంచి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్లు నాసా తెలిపింది. దీని వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గ్రహాశకలంతో (7482) 1994 పీసీ1 పాటు అనేక ఇతర గ్రహశకలాలు కూడా జనవరి నెలలో భూమిని దాటే అవకాశం ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) భూమికి దగ్గరగా 5 గ్రహశకలాలు వస్తున్నాయని నివేదించింది. 2014 వైఈ15: ఇది 7 మీటర్ల వ్యాసం గల తోకచుక్క జనవరి 6న భూమికి 4.6 మిలియన్ మైళ్ల(7.4 మిలియన్ కిలోమీటర్లు) దూరం నుంచి వెళ్తుంది. 2020 ఎపీ1: ఈ గ్రహశకలం కేవలం 13 అడుగుల(4 మీ) వ్యాసం మాత్రమే ఉంటుంది. ఇది భూమికి జనవరి 7న 1.08 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. 2013 వైడీ48 గ్రహశకలం: ఈ నెలలో భూమికి దగ్గరగా వచ్చే అతిపెద్ద గ్రహశకలాల్లో ఇది ఒకటి. జనవరి 11న భూమికి 3.48 మిలియన్ మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. నాసా ప్రకారం, ఇది సుమారు 340 అడుగుల(104 మీ) వెడల్పు ఉంది, ఇది బిగ్ బెన్ కంటే పెద్దదిగా చేస్తుంది. గ్రహాల గురుత్వాకర్షణ పుల్ ద్వారా గ్రహశకలాల కక్ష్య మార్గాలు కొన్ని సార్లు ప్రభావితమవుతాయి. ఇవి వాటి మార్గాలను మార్చడానికి కారణమవుతాయి. అందువల్లే, ఈ శకలాలు గతంలో భూమిని గుద్దుకోవడం లేదా భూమిని రాసుకుంటూ దూసుకుపోవడం జరిగింది అని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు. -
తాజ్‌మహల్ సైజులో గ్రహశకలం..! భూమి వైపుగా..!
A Massive Asteroid Rushing Towards Earth Orbital Path NASA Warns: తాజ్‌మహల్ సైజులో ఉన్న ఓ గ్రహాశకలం భూకక్ష్య వైపుగా దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఈ గ్రహశకల పరిమాణం లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది. ఈ గ్రహశకలం తాజ్ మహల్‌తో పోల్చినట్లయితే సుమారు 240 అడుగుల ఎత్తును కల్గి ఉంది. ఈ గ్రహశకలానికి 1994 డబ్ల్యూ ఆర్12గా నామకరణం చేశారు. ఈ గ్రహశకలాన్ని పాలోమార్ అబ్జర్వేటరీలో 1994లో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త కరోలిన్ ఎస్. షూమేకర్ కనుగొన్నారు. భూమికి ఏమైనా నష్టం ఉందా..! 1994డబ్ల్యూఆర్12 గ్రహశకలం నుంచి ఏలాంటి ముప్పు లేదని నాసా పేర్కొంది. 1994లో ఈ గ్రహశకలాన్ని గుర్తించినప్పుడు భూమి నుంచి సుమారు 3.8 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఇది సోమవారం నవంబర్ 29న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒకవేళ భూమిని ఢీకొడితే..! ఈ గ్రహశకలం నుంచి ఏలాంటి ముప్పు లేనప్పటీకి ఒకవేళ భూమిని ఢీ కొడితే సుమారు 77 మెగాటన్నుల టీఎన్టీను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ నగరం హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే 3,333 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేయనుంది. చదవండి: నాసా డార్ట్ ప్రయోగం.. ఎలన్ మస్క్ ఆసక్తికర రీట్వీట్ -
డైనోసార్ల అంతానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే!
విషయం ఎలాంటిదైనా తనకు లాభం చేకూరేది అయితే చాలానుకునే తత్వం ఎలన్ మస్క్‌ది. ఈ అపరకుబేరుడు స్పేస్ఎక్స్ కోసం అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డార్ట్ ప్రయోగంపై స్పందించాడు. భూగ్రహం వైపు దూసుకొస్తున్న అతిపెద్ద ఆస్టరాయిడ్ ఒకదానిని స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీకొట్టించాలన్న ప్రయత్నమే డార్ట్. భారత కాలమాన ప్రకారం.. బుధవారం ఉదయం ఎలన్ మస్క్ Elon musk కే చెందిన స్పేస్ఎక్స్ ఫాల్కన్9 రాకెట్ ద్వారా స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపించింది నాసా. అయితే ఈ ప్రయోగంపై మస్క్ తన స్టయిల్లో స్పందించాడు. Avenge the dinosaurs!! https://t.co/knL2pFLGzF — Elon Musk (@elonmusk) November 25, 2021 ‘డైనోసార్ల ప్రతీకారం తీర్చుకోండి’ అంటూ నాసా ట్వీట్‌కు బదులిచ్చాడు ఎలన్ మస్క్. బిలియన్ల సంవత్సరాల క్రితం మెసోజోయిక్ Mesozoic Era యుగంలో ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టి డైనోసార్లు అంతరించిన విషయం తెలిసిందే కదా!. ఇప్పుడు ఆస్టరాయిడ్లను నాశనం చేసి డైనోసార్లకు బదులు ప్రతీకారం తీర్చుకోండనే ఉద్దేశంతో మస్క్ ట్వీటేశాడన్నమాట. ఈ ట్వీట్‌కు మస్క్ ఫాలోవర్స్ నుంచి హ్యూమర్‌తో కూడిన రిప్లైలు వస్తున్నాయి. చదవండి: రష్యా ఉల్కాపాత వినాశనం గుర్తుందా?.. డార్ట్ అందుకే! ఇదిలా ఉంటే డార్ట్ తన పని పూర్తి చేయడానికి ఏడాది.. అంతకంటే ఎక్కువ టైం పట్టొచ్చు. ఒకవేళ అనుకున్నట్లు ఆస్టరాయిడ్ గనుక నాశనం అయితే.. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్లను, ఉల్కలను డార్ట్ లాంటి మరిన్ని ప్రయోగాలతో దారి మళ్లించడమో, నాశనం చేయడమో చేస్తుంది నాసా. చదవండి: పిరికి డైనోసార్లు.. పక్కా వెజిటేరియన్!