నాసా హెచ్చరిక.. భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం! | The Asteroid, 2 times The Size of the Empire State Building Set to Cross Earth | Sakshi
Sakshi News home page

నాసా హెచ్చరిక.. భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం!

Published Tue, Jan 4 2022 9:15 PM | Last Updated on Tue, Jan 4 2022 9:27 PM

The Asteroid, 2 times The Size of the Empire State Building Set to Cross Earth - Sakshi

ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు ఎత్తు ఉన్న ఓ గ్రహాశకలం భూకక్ష్య వైపుగా దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం ఎత్తు న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండనుంది. ఈ గ్రహశకలానికి (7482) 1994 పీసీగా నామకరణం చేశారు. ఈ గ్రహశకలాన్ని ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. నాసా తాజా సమాచారం ప్రకారం.. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
 
ఈ గ్రహశకలం దాని పరిమాణం(సుమారు 3,280 అడుగులు) ఎక్కువగా ఉండటం, భూమికి దగ్గరగా వెళ్ళడం వల్ల నాసా దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగా గుర్తుంచింది. ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్లు (సెకనుకు 19.56 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది. భూమి నుంచి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్లు నాసా తెలిపింది. దీని వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గ్రహాశకలంతో (7482) 1994 పీసీ1 పాటు అనేక ఇతర గ్రహశకలాలు కూడా జనవరి నెలలో భూమిని దాటే అవకాశం ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) భూమికి దగ్గరగా 5 గ్రహశకలాలు వస్తున్నాయని నివేదించింది. 

  • 2014 వైఈ15: ఇది 7 మీటర్ల వ్యాసం గల తోకచుక్క జనవరి 6న భూమికి 4.6 మిలియన్ మైళ్ల(7.4 మిలియన్ కిలోమీటర్లు) దూరం నుంచి వెళ్తుంది.
  • 2020 ఎపీ1: ఈ గ్రహశకలం కేవలం 13 అడుగుల(4 మీ) వ్యాసం మాత్రమే ఉంటుంది. ఇది భూమికి జనవరి 7న 1.08 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్తుంది.
  • 2013 వైడీ48 గ్రహశకలం: ఈ నెలలో భూమికి దగ్గరగా వచ్చే అతిపెద్ద గ్రహశకలాల్లో ఇది ఒకటి. జనవరి 11న భూమికి 3.48 మిలియన్ మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. నాసా ప్రకారం, ఇది సుమారు 340 అడుగుల(104 మీ) వెడల్పు ఉంది, ఇది బిగ్ బెన్ కంటే పెద్దదిగా చేస్తుంది. 

గ్రహాల గురుత్వాకర్షణ పుల్ ద్వారా గ్రహశకలాల కక్ష్య మార్గాలు కొన్ని సార్లు ప్రభావితమవుతాయి. ఇవి వాటి మార్గాలను మార్చడానికి కారణమవుతాయి. అందువల్లే, ఈ శకలాలు గతంలో భూమిని గుద్దుకోవడం లేదా భూమిని రాసుకుంటూ దూసుకుపోవడం జరిగింది అని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement