austrelia
-
నాసా హెచ్చరిక.. భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం!
ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు ఎత్తు ఉన్న ఓ గ్రహాశకలం భూకక్ష్య వైపుగా దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం ఎత్తు న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండనుంది. ఈ గ్రహశకలానికి (7482) 1994 పీసీగా నామకరణం చేశారు. ఈ గ్రహశకలాన్ని ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. నాసా తాజా సమాచారం ప్రకారం.. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహశకలం దాని పరిమాణం(సుమారు 3,280 అడుగులు) ఎక్కువగా ఉండటం, భూమికి దగ్గరగా వెళ్ళడం వల్ల నాసా దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగా గుర్తుంచింది. ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్లు (సెకనుకు 19.56 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది. భూమి నుంచి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్లు నాసా తెలిపింది. దీని వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గ్రహాశకలంతో (7482) 1994 పీసీ1 పాటు అనేక ఇతర గ్రహశకలాలు కూడా జనవరి నెలలో భూమిని దాటే అవకాశం ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) భూమికి దగ్గరగా 5 గ్రహశకలాలు వస్తున్నాయని నివేదించింది. 2014 వైఈ15: ఇది 7 మీటర్ల వ్యాసం గల తోకచుక్క జనవరి 6న భూమికి 4.6 మిలియన్ మైళ్ల(7.4 మిలియన్ కిలోమీటర్లు) దూరం నుంచి వెళ్తుంది. 2020 ఎపీ1: ఈ గ్రహశకలం కేవలం 13 అడుగుల(4 మీ) వ్యాసం మాత్రమే ఉంటుంది. ఇది భూమికి జనవరి 7న 1.08 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. 2013 వైడీ48 గ్రహశకలం: ఈ నెలలో భూమికి దగ్గరగా వచ్చే అతిపెద్ద గ్రహశకలాల్లో ఇది ఒకటి. జనవరి 11న భూమికి 3.48 మిలియన్ మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. నాసా ప్రకారం, ఇది సుమారు 340 అడుగుల(104 మీ) వెడల్పు ఉంది, ఇది బిగ్ బెన్ కంటే పెద్దదిగా చేస్తుంది. గ్రహాల గురుత్వాకర్షణ పుల్ ద్వారా గ్రహశకలాల కక్ష్య మార్గాలు కొన్ని సార్లు ప్రభావితమవుతాయి. ఇవి వాటి మార్గాలను మార్చడానికి కారణమవుతాయి. అందువల్లే, ఈ శకలాలు గతంలో భూమిని గుద్దుకోవడం లేదా భూమిని రాసుకుంటూ దూసుకుపోవడం జరిగింది అని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు. -
రాధిక మంగిపూడి 'భారతీయ తత్త్వ శతకము'ను ఆవిష్కరించిన డాక్టర్ మేడసాని మోహన్
ఆధ్యాత్మిక విలువలకు నెలవైన ప్రాచీన భారతీయ దర్శనంలోని తాత్త్విక ఆలోచనలు, తత్త్వశాస్త్ర సారం ఇతివృత్తంగా భారతీయతత్త్వ శతకం పుస్తకాన్ని రచించినట్లు శతక కవయిత్రి రాధిక మంగిపూడి చెప్పారు. రాధిక మంగిపూడి రాసిన ‘భారతీయ తత్త్వ శతకము’ పుస్తకాన్ని ‘తటవర్తి గురుకులం’ ఆస్ట్రేలియా శాఖ ప్రచురించింది. ‘సింగపూర్ తెలుగు టీవీ’ వారి సాంకేతిక సహకారంతో ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అద్వితీయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వీడియో సందేశం ద్వారా ఆశీస్సులు అందించగా.. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ సినీకవి రచయిత భువనచంద్ర, కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి గౌరవ అతిథులుగా పాల్గొని ఈ పుస్తక విశిష్టతను మెచ్చుకున్నారు. 18 రోజులలో ఈ శతకాన్ని పూర్తి చేసిన రచయిత్రి రాధికకు ఆశీస్సులు తెలియజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేసిన డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ.. "మధువచోరూఢి రాధికా మంగిపూడి" అంటూ ఆశువుగా పద్య రూపంలో ఆమెకు ఆశీస్సులు అందించారు. తొలి పుస్తక ప్రతిని విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలోని అమ్మవారి చరణాలకు అర్పించి అంతర్జాలం లోనే అందరికీ అమ్మవారి దర్శనం కల్పించారు. "తమ గురుకులం నిర్వహిస్తున్న 'కావ్య గురుదక్షిణ' కార్యక్రమ పరంపరలో భాగంగా, రాధిక ఈ శతకాన్ని తాను చదువుకున్న విజయనగరం విద్యాసంస్థలకు, చిన్ననాటి గురువులకు అంకితం చేయడం, ఆ గురువుల సమక్షంలోనే ఈ ఆవిష్కరణ గావించడం ఎంతో ప్రశంసనీయమని" 'తటవర్తి గురుకులం' అధ్యక్షులు తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. శతక కవయిత్రి రాధిక మంగిపూడి మాట్లాడుతూ "ఆధ్యాత్మిక విలువలకు నెలవు అయిన ప్రాచీన భారతీయ దర్శనంలోని తాత్త్విక ఆలోచనలను, తత్త్వశాస్త్ర సారాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ శతకాన్ని రచించే ప్రయత్నం చేశానని, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తన రచనను దీవించి 'ముందు మాట' రూపంలో ఆశీస్సులు అందించడం, కవిపండితులు డా. మేడసాని మోహన్ వంటి పంచసహస్రావధాని చేతుల మీదుగా తన పుస్తకం ఆవిష్కరించబడడం తన పురాకృత పుణ్యంగా, భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నానని" ఆనందం వ్యక్తం చేసి అతిథులకు, గురువులకు, నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. న్యూజిలాండ్ నుండి సంగీత భారతి పాఠశాల అధ్యక్షులు మల్లెల గోవర్ధన్ గారు, వారి విద్యార్థినులు విచ్చేసి శతకంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ సంస్థ అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్న కుమార్, అమెరికా నుండి శతకం డిజైనింగ్ చేసిన "స్వర మీడియా" సంస్థ అధ్యక్షులు యక్కలి రాజేష్, రాచకొండ శాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్త్వశాస్త్ర విభాగాధిపతి డా. వానపల్లి వెంకట్రావు, ఆస్ట్రేలియా నుండి డా. చింతలపాటి, న్యూజిలాండ్ నుండి తంగిరాల నాగలక్ష్మి, హాంగ్ కాంగ్ నుండి జయ పీసపాటి మలేషియా నుండి డాక్టర్ వెంకట ప్రతాప్, కాకినాడ నుండి డా. దీక్షితులు మరియు వివిధ దేశాల తెలుగు సాహిత్యాభిమానులు, రాధిక కుటుంబ సభ్యులు, గురువులు శ్రేయోభిలాషులు, ఈ కార్యక్రమంలో పాల్గొని రాధికకు అభినందనలు తెలియజేశారు. సింగపూర్ నుండి గుంటూరు వెంకటేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని నడిపించగా గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరించారు. -
విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..!
మన దేశం విడిచి వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ పోతుంది. 2017 నుంచి 2021 వరకు 6,08,162 మంది విదేశీ పౌరసత్వం కోసం తమ పౌరసత్వాన్ని భారతీయ వదులుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపింది. భారతదేశ పౌరులు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల పౌరసత్వాన్ని పొందారని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అన్ని దేశాలలో 2019 తర్వాత పౌరసత్వాలు ఇచ్చే సంఖ్య తగ్గిందని డేటా చూస్తే తెలుస్తుంది. ఐదేళ్లలో 24 మందికి పాకిస్తాన్ పౌరసత్వం గత ఐదేళ్లలో అత్యధిక సంఖ్యలో 2,56,476 మంది భారతీయ ప్రజలకు అమెరికా విదేశీ పౌరసత్వాన్ని అందించింది. 2020-21లో అమెరికా దేశం 86,387 మంది భారతీయులకు పౌరసత్వాలను అందించింది. అమెరికా 2019లో 61,683 మందికి పౌరసత్వాన్ని ఇచ్చింది. ఈ మహమ్మారి కారణంగా 2020లో ఆ సంఖ్యను 30,828కి తగ్గించింది, కానీ ఆ తర్వాత 2021లో 55,559 మందికి ఇచ్చింది. ముఖ్యంగా, గత ఐదేళ్లలో పాకిస్తాన్ దేశ పౌరసత్వం కోసం భారత దేశ పౌరసత్వాన్ని త్యజించిన వారు కేవలం 24 మంది మాత్రమే ఉన్నారని ఎంఈఏ తెలిపింది. (చదవండి: Sudha Murthy : అప్పట్లో జీన్స్, టీషర్ట్స్‌లో వెళ్లేదాన్ని.. కానీ ఆ తర్వాత..!) 2017-21 వరకు 91,429 మంది భారతీయ పౌరులకు కెనడియన్ పౌరసత్వం లభించింది. ఇందులో 2020-21లోనే కెనడా 28,962 మంది భారత జాతీయులకు తమ దేశ పౌరసత్వాలను అందించింది. కెనడా 2019లో 25,381 పౌరసత్వాన్ని ఇచ్చింది, ఇది మహమ్మారి కారణంగా 2020లో 17,093 కు తగ్గింది, 2021లో 11,869కు తగ్గింది. ఆస్ట్రేలియా 2017-21 మధ్య భారత జాతీయులకు 86,933 పౌరసత్వాన్ని ఇచ్చింది. 2019లో ఆ దేశం 21,340 మన దేశ పౌరులకు పౌరసత్వాన్ని ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా 2020లో ఇది 13,518కు తగ్గింది. 2021లో ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం 14,416 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. అలాగే, ఇంగ్లాండ్ కూడా అత్యధిక మందికి ఎక్కువ పౌరసత్వాలను ఇచ్చింది. 2017 నుంచి 66,193 మంది భారతీయులు బ్రిటిష్ పౌరసత్వాన్ని స్వీకరించారు. 2020-21లో ఇంగ్లాండు 15,788 పౌరసత్వాన్ని ఇచ్చింది. 2 శాతం మిలియనీర్లు విదేశాలకు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నుంచి సేకరించిన డేటా ప్రకారం.. భారతదేశంలోని రెండు శాతం మిలియనీర్లు 2020లో విదేశాలకు వలస వెళ్లారు. అధిక సంపాదన గల చైనా కుటుంబాలు(16,000) ఎక్కువగా విదేశాలకు వలస వెళ్తున్నట్లు ఈ డేటా పేర్కొంది. ఈ జాబితాలో 7,000 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత కారణాల వల్ల వారు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వం తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అందించదు, అందుకోసమే ఇతర దేశాలలో పౌరసత్వం కోరుకునే ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవాలి. (చదవండి: కళ్లుచెదిరే లాభం.. 6 నెలల్లో లక్షకు రూ.30 లక్షలు!) -
Australia: దొంగను చంపి..శవంతో 15 ఏళ్లు సహవాసం
ఆస్ట్రేలియా(సిడ్నీ): ఇంట్లో దొంగచొరబడితే ఏం చేస్తాం?..నాలుగు తగిలించి పోలీసులకు అప్పగిస్తాం. అయితే ఓ వ్యక్తి మాత్రం దొంగను చంపి 15 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. 2002 ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన షేన్ స్నెల్‌మన్ దొంగతనానికి వెళ్లగా.. బ్రూస్ రాబర్ట్స్ అనే వ్యక్తి అతడ్ని కాల్చి చంపాడు. దొంగ శవాన్ని 15 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా 70కి పైగా ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించాడు. అయితే ఈ విషయం పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఏబీసీ ద్యారా తెలిసినట్లు "కరోనర్ కోర్టు" తెలిపింది. ఈ కోర్టు మిస్టరీ మరణాలపై విచారణకు ఆదేశాలను జారీ చేస్తుంది. అయితే 2017లో రాబర్ట్స్ హీటర్‌పై పడి మరణించగా..ఇరుగు పొరుగువారు అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత ఓ వ్యక్తి ఆ ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లగా...స్నెల్మాన్ అవశేషాలు లభించాయి. కాగా, రాబర్ట్స్ తన ఇంటిని ఎప్పుడూ విడిచి వెళ్లేవాడు కాదని, ఆ ఇంట్లో డజనుకు పైగా తుపాకీలు లభించాయని అక్కడి వారు పోలీసులకు తెలిపారు. (చదవండి: USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు) -
ఆస్ట్రేలియా-ఫేస్‌బుక్‌ల మధ్య డీల్ కుదిరింది
కాన్బెరా: గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఫేస్‌బుక్‌కు నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వీరి మధ్య సంధి కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా న్యూస్ ఏజెన్సీలకు చెందిన వార్తలపై నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు ఫేస్బుక్ పేర్కొంది. త్వరలో మళ్లీ తమ సైట్లో వార్తలు పునరుద్ధరిస్తామని ప్రకటించింది. గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలలో వార్తలు షేర్ చేస్తున్నందుకు వార్తాసంస్థలకు ఆ సంస్థలు డబ్బులు చెల్లించాలన్న చట్టం తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఫేస్బుక్ ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. ఫేస్బుక్ వార్తలు నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఇక తప్పని పరిస్థితులలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారి ఫ్రైడెన్‌బర్గ్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఫేస్బుక్ కూడా న్యూస్ పేజీలపై విధించిన నిషేధం తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఈస్టన్ తెలిపారు. ఇదిలా ఉంటే గూగుల్ మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియాలోని చిన్న చిన్న సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం న్యూస్ షోకేస్ అనే ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి వార్తా సంస్థలు పోస్ట్ చేసే వార్తలన్నీ అందులో కనిపించేలా కొత్త విధానాలను రూపొందించినట్లు సమాచారం. చదవండి: ఆస్ట్రేలియాకు మైక్రోసాఫ్ట్ మద్దతు..గూగుల్ వైదొలిగేనా? డీహెచ్ఎఫ్ఎల్లో బయటపడ్డ మరో భారీ మోసం -
ఆస్ట్రేలియాకు మైక్రోసాఫ్ట్ మద్దతు..గూగుల్ వైదొలిగేనా?
వార్తా సంస్థలకు సంబంధించి ఆస్ట్రేలియా తీసుకొచ్చిన కొత్త చట్టం కారణంగా ఆస్ట్రేలియా-గూగుల్ మధ్య నెలకొన్న వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఆస్ట్రేలియా రూపొందించిన ఈ చట్టాన్ని సమర్థిస్తున్నామంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఫేసుబుక్, గూగుల్‌కు ఊహించని షాకిచ్చారు. ఫేస్బుక్, గూగుల్ వ్యతిరేకిస్తున్న చట్టానికి మద్దతు తెలుపుతూ మైక్రోసాఫ్ట్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ ఒక లేఖలో వార్తల కంటెంట్ కోసం డబ్బులు చెల్లిస్తే స్వతంత్ర జర్నలిజానికి అవకాశం కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ తమ ప్రత్యర్థి గూగుల్ మాదిరిగా కాకుండా "కొత్త చట్టానికి సైన్ అప్" చేయడానికి సిద్ధంగా ఉందని, ఆస్ట్రేలియన్ మార్కెట్లో తమ వాటా పెరిగితే వార్తా ప్లాట్‌ఫారమ్‌లతో ఆదాయాన్ని పంచుకుంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశంలో 5 శాతం కన్నా తక్కువ మార్కెట్ వాటాను బింగ్ కలిగి ఉంది. దాదాపు ఒక నెల క్రితం గూగుల్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ మెల్ సిల్వా ఈ చట్టం పనికిరానిదని, ఇది అమలు చేయబడితే ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్ సేవలు నిలిపివేస్తామని ఆస్ట్రేలియన్ సెనేట్‌కు తెలిపింది. వార్తల లింకులను తన సెర్చ్ ఫలితాల్లో చూపించడం ద్వారా గూగుల్, ఫేస్‌బుక్‌లు వినియోగదారులను ఆకర్షిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ కారణంగానే.. వాటి ఆదాయంలో కొంత మొత్తాన్ని మీడియా సంస్థలతో పంచుకోవాలని స్పష్టం చేస్తోంది. అలాగే ఫేస్బుక్ ఆస్ట్రేలియన్ ప్రజలకు అంతర్జాతీయ వార్తలను చూడటం నిలిపివేసింది. ఆస్ట్రేలియా సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్ వాటా ఏకంగా 93 శాతం. దీంతో..ఆస్ట్రేలియా నుంచి గూగుల్ వైదొలగితే ఏం జరుగుతుందనే అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లతో కలిసి ఆస్ట్రేలియా ప్రధాని మాట్లాడినట్లు స్మిత్ తెలిపారు. చదవండి: మిర్చీ బజ్జీ.. ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు! గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్ -
ఈ ‘బనాన గర్ల్’ డైటేమిటంటే....
ఆమె అసలు పేరు లియాన్నె ర్యాట్‌క్లిఫ్. పాతికేళ్ల వయస్సులో అందరిలాగే ఆమె బొద్దుగా ఉండేది. ఇప్పుడు 40 ఏళ్ల వయస్సులో సన్నని నడుముపైన చెంచాడు కొవ్వు కూడా లేకుండా ముద్దుగా తయారయింది. అప్పుడు ఇష్టంగా మూడు పూటలు మాంసాహారం తినేది. ఇప్పుడు అంతకంటే ఇష్టంగా శాఖాహారమే తింటోంది. అది కూడా వండి వడ్డించిన ఆహారం కాకుండా పండ్లు, పచ్చి కాయగూరలనే తింటోంది. దాదాపు 14 ఏళ్లుగా ఆమె తీసుకుంటున్న డైట్ ఇదే! అందుకే ఆమె అప్పటికి, ఇప్పటికి 18 కిలోలు తగ్గారట. ర్యాట్క్లిప్ ప్రతిరోజు ఉదయం అల్పాహారం కింద సగం పుచ్చకాయ తింటుంది. మధ్యాహ్నం లంచ్ కింద నాలుగు అరటి పండ్ల ముక్కలు, ఓ బొప్పాయి కాయ, రెండు అంజిరా పండ్లను పోలిన టర్కీ పండ్ల ముక్కలను పాలులేకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఐస్ క్రీమ్‌తో కలిపి తింటుంది. అప్పుడప్పుడు పీనట్ బటర్‌తో ఈ పండ్ల ముక్కలను కలుపుకొంటుంది. ఇక రాత్రి పూట వివిధ రకాల కూరగాయ ముక్కలను కొబ్బరి చట్నీలో అద్దుకొని తింటుంది. ఆమె రోజు తినే ఆహారం మొత్తం కలసి 2,700 కాలరీలు మాత్రమే. అరటి పండులా పై నుంచి కింది వరకు ఒకే తీరుగా ఉంటుందనో లేక రోజూ అరటి పండ్లు తింటుందనో సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు ఆమెను ‘బనాన గర్ల్’ అని పిలుస్తున్నారు. ర్యాట్క్లిప్కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో జన్మించిన బనాన గర్ల్ సెప్టెంబర్ 19వ తేదీన తన 40వ పుట్టిన రోజు జరుపుకొని ఆ సందర్భంగా తన ఆహార అలవాట్లకు సంబంధించి తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నేటి వరకు దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. మాంసహారిగా బతికిన తాను శాకాహారిగా ఎలా మారిందో కూడా బనాన గర్ల్ వివరించారు. ‘చచ్చిన జంతువులను తినడమంటే వాటిని పాతి పెట్టడమే గదా! అంటే మన కడుపును శ్మశానంగా మార్చడమే గదా! అందుకని శాకాహారిగా మారాను. మాంసాహారంలో లభించే ప్రోటీన్లు శాకాహారంలో కూడా ఉంటాయని ఆమె చెప్పారు. ‘అదంతా సరేగానీ, మీరు తీసుకుంటున్న ఆహారంలో ఎక్కువగా సుగరే ఉంటుంది. సుగర్ ఎక్కువగా తింటూ శరీరాన్ని ఇలా ఎండ పెట్టుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ఆమెకు చురకలంటిస్తోన్న వారు లేకపోలేదు. -
తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లండ్
లండన్: కొంత ప్రతిఘటన ఎదుర్కొన్నా సిరీస్ ట్రోఫీని నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా... ఇప్పుడు యాషెస్‌ను పూర్తి ఆధిక్యంతో కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇదే సమయంలో గురువారం నుంచి ఆరంభమయ్యే చివరిదైన ఐదో టెస్టు ఇంగ్లండ్‌కు ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం 1–2తో వెనుకబడి ఉన్న ఆతిథ్య జట్టు ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. జోరు మీదున్న కంగారూలను ముఖ్యంగా మాజీ కెపె్టన్ స్టీవ్ స్మిత్‌ను నిలువరిస్తేనే ఇంగ్లండ్ కోరిక నెరవేరే వీలుంది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్‌పై వేటు వేసి ఆల్‌రౌండర్ స్యామ్ కరన్‌కు చోటిచి్చంది. ఓవర్టన్ను తప్పించి క్రిస్ వోక్స్‌ను తీసుకుంది. ఆసీస్ సైతం బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్‌ను పక్కనపెట్టి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను ఆడించనుంది. ఎడంచేతి వాటం పేసర్ స్టార్క్ స్థానంలో సిడిల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టెస్టులోనూ విజయం సాధిస్తే 2001 తర్వాత ఆ్రస్టేలియా... ఇంగ్లండ్ గడ్డపై యాషెస్‌ను గెలిచినట్లవుతుంది. స్మిత్ వీరగాథ; వార్నర్, రూట్ వైఫల్యాల బాధ పరుగులు 671... సగటు 134.20... ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్మిత్ ప్రదర్శన ఇది. ఇదే ఊపులో అతడు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి సైతం ఎగబాకాడు. సిరీస్‌లో రెండు జట్ల మధ్య ప్రధాన తేడా స్మిత్ అని దీంతోనే తెలిసిపోతోంది. తోడుగా లబషేన్, అడపాదడపా వేడ్, కెపె్టన్ పైన్, లోయరార్డర్ రాణిస్తుండటంతో ఆసీస్ గట్టెక్కుతోంది. ఓపెనర్ వార్నర్ (మొత్తం 79 పరుగులు) అధ్వాన ఫామ్ నుంచి బయటపడితే వారి బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది. సిరీస్‌లో ఉమ్మడిగా 42 వికెట్లు పడగొట్టిన కమిన్స్–హాజల్‌వుడ్ పేస్ ద్వయాన్ని ఎదుర్కొనాలంటే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు శక్తికి మించి పోరాడక తప్పేలా లేదు. జట్టుకు మూలస్తంభమైన కెప్టెన్ రూట్ పరుగులు సాధిస్తే మిగతావారిలోనూ ఆత్మవిశ్వాసం వస్తుంది. అయితే, అతడే ఫామ్ వెదుకులాటలో ఉండటం ఇంగ్లండ్‌ను దెబ్బతీస్తోంది. గాయంతో బాధపడుతున్న స్టోక్స్ బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. కరన్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ చేరిక జట్టు రాతను మార్చే వీలుంది. పేసర్లు బ్రాడ్, ఆర్చర్ మరింత పకడ్బందీగా బంతులేసి... బ్యాటింగ్‌లో బట్లర్, బెయిర్‌స్టో విలువైన ఇన్నింగ్స్ ఆడితేనే ఇంగ్లండ్‌కు గెలుపు అవకాశాలుంటాయి. లేదంటే ఐదేళ్ల తర్వాత స్వదేశంలో ప్రత్యర్థి జట్టుకు సిరీస్‌కు కోల్పోతుంది. 2014లో ఆ జట్టు శ్రీలంక చేతిలో 1–0తో పరాజయం పాలైంది. -
మంచి మనసు చాటుకున్న వార్నర్
లండన్ : ప్రపంచ కప్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తున్న తీరుకు క్రీడాభిమానులు ఫిదా అవుతున్నారు. గతంలో ఓ మ్యాచ్‌లో తనకు లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను బుల్లి ఫ్యాన్‌కు ఇచ్చి ఔదార్యం చాటుకున్న వార్నర్.. తాజాగా తన వల్ల గాయపడిన బౌలర్ ప్లాహాకు సారీ చెప్పి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఆసీస్ క్రికెటర్లకు 23 ఏళ్ల జే కిషన్ ప్లాహా అనే భారత సంతతికి చెందిన ఇంగ్లండ్ ఆటగాడు బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వార్నర్‌కి కూడా బంతులు వేశాడు. ఈ క్రమంలో ఓ బంతిని వార్నర్ బలంగా బాదడంతో అది ప్లాహాకు తగిలింది. దీంతో అతడు స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఆస్ట్రేలియా ఫిజీషియన్స్, డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి ప్లాహను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తనని చూడటానికి ఆసీస్ ఆటగాళ్లు ఆస్పత్రికి వచ్చారని ప్లాహా తెలిపాడు. వార్నర్ తన కొట్టిన షాట్‌కు సారీ చెబుతూ.. ఆత్మీయంగా కౌగిలించుకున్నాడని అతడు చెప్పాడు. దీంతో పాటు కంగారూ ఆటగాళ్లంతా ఆటోగ్రాఫ్స్ చేసిన ఆస్ట్రేలియా టీం జెర్సీని తనకు బహుమతిగా ఇచ్చారన్నాడు. తన కుటుంబ సభ్యులతో ప్రపంచ కప్ మ్యాచ్‌లు చూడటానికి టికెట్లు కూడా ఇచ్చారని చెప్పాడు. వార్నర్ స్పందించిన తీరును తన జీవితంలో మరిచిపోలేని సందర్భంగా ప్లాహా పేర్కొన్నాడు. ఈ ఘటనలతో ప్రపంచకప్‌లో ప్లాహా పేరు మారుమోగుతోంది. అదే విధంగా వార్నర్ స్పందించిన తీరుకు సగటు క్రీడా అభిమానులు ఫిదా అవుతున్నారు. -
ఆస్ట్రేలియాకు మరోసారి వరుణుడు
-
ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు అదృష్టం కలిసిరావడం లేదు. వరుణుడు మరోసారి కంగారులను దెబ్బతీశాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు సునాయసంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కుండపోతగా కురిసిన వర్షంతో ఈ మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గెలిచే మ్యాచ్‌లోనూ చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వరుణుడు విరుచుకుపడటంతో ఆ మ్యాచ్ కూడా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అప్పుడు కూడా ఒక పాయింట్‌తో ఆసీస్ సరిపెట్టుకుంది. ప్రస్తుతం రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండుపాయింట్లతో ఉన్న కంగారులు.. సెమీఫైనల్లో అడుగుపెట్టాలంటే ఇంగ్లండ్‌తో జరగనున్న తమ చివరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరోవైపు వర్షం బంగ్లాదేశ్‌కు కలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కనుక ఓడి ఉంటే ఆ జట్టు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకునేది. వర్షం మింగేసిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 182 పరుగులకే కుప్పకూలింది. పేసర్ మిషెల్ స్టార్క్ (4/29) డెత్ ఓవర్లలో చేసిన మాయాజాలానికి ఆ జట్టు కుదేలైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (114 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకునే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 182 పరుగులకు కుప్పకూలింది. షకీబ్ (48 బంతుల్లో 29; 2 ఫోర్లు), మిరాజ్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. జంపాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన అనంతరం వర్షం ఆటంకంతో మ్యాచ్ ఆగింది. క్రీజులో వార్నర్ (44 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు), స్మిత్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) ఉన్నారు. మరో నాలుగు ఓవర్లు మ్యాచ్ కొనసాగి ఉంటే ఈ మ్యాచ్‌లో విజయం ఆసీస్‌ను వరించేది. కనీసం 20 ఓవర్లు ఆడితే.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అప్పటికే దూకుడు మీద ఉన్న ఆస్ట్రేలియాకు విజయం లభించేది. కానీ వరుణుడు ఎంతకు తెరిపినివ్వకపోవడంతో ఎంపైర్లు ఇక మ్యాచ్ జరగడం వీలుకాదని తేల్చేసి..చేరో పాయింట్ పంచారు. -
ఆదివాసిల 'న్యూడ్' ఫొటో పోస్టు చేశారని!
సిడ్నీ: ఆదివాసి స్త్రీవాదం గురించి ఓ ఆర్టికల్‌ను ఫేస్బుక్లో షేర్ చేసిన నెటిజన్లకు చేదు అనుభవం ఎదురైంది. సంప్రదాయకరీతిలో ఛాతి మీద దుస్తులు లేని ఇద్దరు ఆదివాసి మహిళల ఫొటో ఈ ఆర్టికల్‌లో ఉండటంతో, దీనిని నగ్నచిత్రంగా భావిస్తూ ఫేస్బుక్ వారి ఖాతాలను సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీవాద రచయిత్రి సెలెస్టీ లిడిల్ ఇటీవల ఆస్ట్రేలియాలోని క్వీన్ విక్టోరియా మహిళల కేంద్రంలో ఉపన్యసించారు. ఆదివాసి స్త్రీవాదం గురించి ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలతోపాటు.. ఇద్దరు ఆదివాసి మహిళ ఫొటోను కొందరు నెటిజన్లు ఫేస్బుక్లో షేర్ చేసుకున్నారు. ఈ పోస్టులో ఇద్దరు మహిళలున్న ఫొటో పెట్టారు. ఈ ఫొటోలో ఇద్దరు ఆదివాసి మహిళల తమ సంప్రదాయక దుస్తుల్లో శరీరంగా రంగులు వేసుకొని కనిపిస్తారు. అయితే, ఆ మహిళలు ఛాతిమీద ఎలాంటి దుస్తులు వేసుకోలేదన్న కారణంతో ఈ ఆర్టికల్‌ను షేర్ చేసుకున్న నెటిజన్లకు ఫేస్బుక్ షాకిచ్చింది. ఆదివాసి మహిళల స్త్రీవాద దృక్పథం, మూలవాసి హక్కుల గురించి తాను ప్రసంగించానని రచయిత్రి లిడిల్ పేర్కొన్నారు. గతంలోనూ ఈ విషయంలో ఫేస్బుక్ ఇదేతరహాలో వ్యవహరించిందని, సంప్రదాయక వేడుకలో బాడీపెయింట్ వేసుకున్న ఆదివాసి మహిళలను చూపించారన్న కారణంతో ఓ టీవీ షో ట్రైలర్‌ను కూడా ఫేస్బుక్ ఇలాగే తమ సైట్ నుంచి తొలగించిందని చెప్పారు. ఆదివాసి మహిళల ఆర్టికల్ షేర్ చేసుకున్నందుకు నెటిజన్ల ఖాతాలను ఫేస్బుక్ రద్దు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ది మూర్ఖమైన నిర్ణయమని మండిపడుతున్నారు.