మన దేశం విడిచి వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ పోతుంది. 2017 నుంచి 2021 వరకు 6,08,162 మంది విదేశీ పౌరసత్వం కోసం తమ పౌరసత్వాన్ని భారతీయ వదులుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపింది. భారతదేశ పౌరులు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల పౌరసత్వాన్ని పొందారని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అన్ని దేశాలలో 2019 తర్వాత పౌరసత్వాలు ఇచ్చే సంఖ్య తగ్గిందని డేటా చూస్తే తెలుస్తుంది.
ఐదేళ్లలో 24 మందికి పాకిస్తాన్ పౌరసత్వం
గత ఐదేళ్లలో అత్యధిక సంఖ్యలో 2,56,476 మంది భారతీయ ప్రజలకు అమెరికా విదేశీ పౌరసత్వాన్ని అందించింది. 2020-21లో అమెరికా దేశం 86,387 మంది భారతీయులకు పౌరసత్వాలను అందించింది. అమెరికా 2019లో 61,683 మందికి పౌరసత్వాన్ని ఇచ్చింది. ఈ మహమ్మారి కారణంగా 2020లో ఆ సంఖ్యను 30,828కి తగ్గించింది, కానీ ఆ తర్వాత 2021లో 55,559 మందికి ఇచ్చింది. ముఖ్యంగా, గత ఐదేళ్లలో పాకిస్తాన్ దేశ పౌరసత్వం కోసం భారత దేశ పౌరసత్వాన్ని త్యజించిన వారు కేవలం 24 మంది మాత్రమే ఉన్నారని ఎంఈఏ తెలిపింది.
(చదవండి: Sudha Murthy : అప్పట్లో జీన్స్, టీషర్ట్స్‌లో వెళ్లేదాన్ని.. కానీ ఆ తర్వాత..!)
2017-21 వరకు 91,429 మంది భారతీయ పౌరులకు కెనడియన్ పౌరసత్వం లభించింది. ఇందులో 2020-21లోనే కెనడా 28,962 మంది భారత జాతీయులకు తమ దేశ పౌరసత్వాలను అందించింది. కెనడా 2019లో 25,381 పౌరసత్వాన్ని ఇచ్చింది, ఇది మహమ్మారి కారణంగా 2020లో 17,093 కు తగ్గింది, 2021లో 11,869కు తగ్గింది. ఆస్ట్రేలియా 2017-21 మధ్య భారత జాతీయులకు 86,933 పౌరసత్వాన్ని ఇచ్చింది. 2019లో ఆ దేశం 21,340 మన దేశ పౌరులకు పౌరసత్వాన్ని ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా 2020లో ఇది 13,518కు తగ్గింది. 2021లో ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం 14,416 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. అలాగే, ఇంగ్లాండ్ కూడా అత్యధిక మందికి ఎక్కువ పౌరసత్వాలను ఇచ్చింది. 2017 నుంచి 66,193 మంది భారతీయులు బ్రిటిష్ పౌరసత్వాన్ని స్వీకరించారు. 2020-21లో ఇంగ్లాండు 15,788 పౌరసత్వాన్ని ఇచ్చింది.
2 శాతం మిలియనీర్లు విదేశాలకు
గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నుంచి సేకరించిన డేటా ప్రకారం.. భారతదేశంలోని రెండు శాతం మిలియనీర్లు 2020లో విదేశాలకు వలస వెళ్లారు. అధిక సంపాదన గల చైనా కుటుంబాలు(16,000) ఎక్కువగా విదేశాలకు వలస వెళ్తున్నట్లు ఈ డేటా పేర్కొంది. ఈ జాబితాలో 7,000 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత కారణాల వల్ల వారు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వం తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అందించదు, అందుకోసమే ఇతర దేశాలలో పౌరసత్వం కోరుకునే ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment