ఆస్ట్రేలియా(సిడ్నీ): ఇంట్లో దొంగచొరబడితే ఏం చేస్తాం?..నాలుగు తగిలించి పోలీసులకు అప్పగిస్తాం. అయితే ఓ వ్యక్తి మాత్రం దొంగను చంపి 15 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. 2002 ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన షేన్ స్నెల్‌మన్ దొంగతనానికి వెళ్లగా.. బ్రూస్ రాబర్ట్స్ అనే వ్యక్తి అతడ్ని కాల్చి చంపాడు. దొంగ శవాన్ని 15 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా 70కి పైగా ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించాడు. అయితే ఈ విషయం పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఏబీసీ ద్యారా తెలిసినట్లు "కరోనర్ కోర్టు" తెలిపింది. ఈ కోర్టు మిస్టరీ మరణాలపై విచారణకు ఆదేశాలను జారీ చేస్తుంది.
అయితే 2017లో రాబర్ట్స్ హీటర్‌పై పడి మరణించగా..ఇరుగు పొరుగువారు అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత ఓ వ్యక్తి ఆ ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లగా...స్నెల్మాన్ అవశేషాలు లభించాయి. కాగా, రాబర్ట్స్ తన ఇంటిని ఎప్పుడూ విడిచి వెళ్లేవాడు కాదని, ఆ ఇంట్లో డజనుకు పైగా తుపాకీలు లభించాయని అక్కడి వారు పోలీసులకు తెలిపారు.
(చదవండి: USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు)
Comments
Please login to add a commentAdd a comment