Sidney
-
సిడ్నీలో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. సిడ్నీలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు, జగనన్న అభిమానులు, పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు. వైసీపీ నాయకులు గాయం శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి అంక్కిరెడ్డిపల్లి, శ్రీనివాస్ బేతంశెట్టి, అమరనాథ్ రెడ్డి , శిరీష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం
ఇటీవల కాలంలో టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా విమాన ప్రయాణాల్లో జరుగుతున్న వరుస ఘటనలు ఆ సంస్థ కీర్తి ప్రతిష్టల్ని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా, జులై 9న సిడ్నీ నుండి ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి ఎయిరిండియా సిబ్బందిపై దాడి చేశాడు. ఆపై దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. సిడ్నీ నుంచి ఓ ఎయిరిండియా విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే, ఆకాశంలో ఉండగా విమానంలోని ఓ ప్రయాణికుడు ఎకానమీ క్లాసులో తాను కూర్చున్న సీటు సరిగ్గా లేదని, బిజినెస్ క్లాస్‌లో సీటు కేటాయించాలని సిబ్బందిపై దౌర్జన్యం చేశాడు. ప్రయాణికుడి అసౌకర్యాన్ని చింతిస్తూ విమాన సిబ్బంది సీటు 30-సీలో కూర్చోవచ్చని తెలిపారు. కానీ, అవేం పట్టించుకోని ప్రయాణికుడు..రో నెంబర్ 25 కూర్చున్నాడు. పైగా పక్కనే ఉన్న మరో ప్రయాణికుడితో గొడవపడ్డాడు. అయితే, ఈ గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించిన ఉన్నతాధికారిపై దాడి చేశాడు. మెడపట్టుకుని విరిచే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విమానంలో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్యాసింజర్‌ను ఐదుగురు క్యాబిన్ సిబ్బంది కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అత్యవసర సమయాల్లో ప్రమాదాల నుంచి బయట పడేందుకు ఉపయోగించే ఎక్విప్మెంట్స్ ఉన్న రూమ్‌లో చొరబడడంతో కలకలం రేగింది. అయితే ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణికుడిని ఎయిరిండియా భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో తాను తప్పు చేసినట్లు నిందితుడు రాత పూర్వకంగా తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో జూలై 9, 2023న సిడ్నీ-ఢిల్లీకి ప్రయాణిస్తున్న AI-301 విమానంలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు సదరు ప్యాసింజర్ రాతపూర్వకంగా క్షమాణలు చెప్పినట్లు తెలిపింది. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ మాట్లాడుతూ.. ఎయిర్‌లైన్స్ నిబంధల తీవ్రతను బట్టి సదరు ప్యాసింజర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చదవండి : కాక్‌పిట్‌లో స్నేహితురాలు, పైలెట్ లైసెన్స్ క్యాన్సిల్ -
ఆస్ట్రేలియాలో అరెస్టైన లంక క్రికెటర్‌కు ఎదురుదెబ్బలు! కొత్తేం కాదు
ICC Mens T20 World Cup 2022- Danushka Gunathilaka: అత్యాచార కేసులో అరెస్టైన లంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు శ్రీలంక బోర్డు షాకిచ్చిది. ఇకపై ఏ ఫార్మాట్లో కూడా క్రికెట్ ఆడే అవకాశం లేకుండా అతడిపై నిషేధం విధించింది. లంక బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆడేందుకు గుణతిలక ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబరు 2న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు 31 ఏళ్ల గుణతిలకను ఆదివారం అరెస్టు చేశారు. లైంగిక దాడి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. బెయిల్ నిరాకరణ ఈ ఘటన నేపథ్యంలో సోమవారం అతడిని సిడ్నీ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం గుణతిలకకు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో లంక బోర్డు సైతం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అతడిపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. అత్యాచార ఆరోపణలతో అరెస్టైన అతడు దోషిగా తేలితే మరింత కఠినచర్యలు ఉంటాయని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా ఆస్ట్రేలియా పోలీసులు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తామని, కావాల్సిన సమాచారం అందిస్తామని వెల్లడించింది. వివాదాస్పద క్రికెటర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గుణతిలకకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. అనుచిత ప్రవర్తన, సమాచారం ఇవ్వకుండా ట్రెయినింగ్ సెషన్‌కు గైర్హాజరు కావడంతో 2017లో 6 వన్డేల సస్పెన్షన్ వేటు పడింది. 2018లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆరు నెలలు నిషేధం ఎదుర్కొన్నాడు. కరోనా నేపథ్యంలో.. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ నుంచి వచ్చి ఏడాది పాటు సస్పెండ్ అయ్యాడు. అయితే, తర్వాత నిషేధాన్ని ఆరు నెలలకు తగ్గించారు. చదవండి: ఆసీస్‌కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు! T20 WC 2022: టీమిండియాదే వరల్డ్‌కప్.. రోహిత్ సాధ్యం చేస్తాడు.. అలా జరుగుతుందంతే..! -
WC 2022: సెమీ ఫైనల్ జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర వివరాలు
ICC T20 World Cup 2022- Semi Final Schedule: టీ20 ప్రపంచకప్-2022 తుది అంకానికి చేరుకుంది. సూపర్-12లో భాగంగా ఆదివారం (నవంబరు 6) నాటి ఆఖరి మ్యాచ్‌ల ఫలితాలతో గ్రూప్-2 సెమీస్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో పటిష్ట జట్టుగా పేరొందిన సౌతాఫ్రికాను ‘పసికూన’ నెదర్లాండ్స్ మట్టికరిపించగా.. టీమిండియా నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. తర్వాతి మ్యాచ్‌లో సెమీస్ అర్హత కోసం పాకిస్తాన్- బంగ్లాదేశ్ పోటీపడగా.. బాబర్ బృందానిదే పైచేయి అయ్యింది. దీంతో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాటు పాకిస్తాన్ కూడా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. 🇮🇳 & 🇵🇰 - 2 Asian giants from Group 2 qualify for the Semi-Finals of the ICC Men's #T20WorldCup2022! How do you think they’ll do in the semis? 😉#BelieveInBlue pic.twitter.com/ngOxm0Wjdt — Star Sports (@StarSportsIndia) November 6, 2022 ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్‌ను తేలికగా తీసుకోని రోహిత్ సేన ఘన విజయంతో సూపర్-12ను ముగించింది. క్రెయిగ్ ఎర్విన్ బృందంపై 71 పరుగుల తేడాతో గెలుపొంది గ్రూప్-2 టాపర్‌గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా భారత మిడిలార్డర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగతంగా పలు రికార్డులు సృష్టించారు కూడా! ఇక గ్రూప్-1 విషయానికొస్తే.. న్యూజిలాండ్.. ఐర్లాండ్‌ను ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా.. ఇంగ్లండ్- శ్రీలంక మ్యాచ్ ఫలితంపై ఆధారపడ్డ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు నిరాశే మిగిలింది. శ్రీలంకను బట్లర్ బృందం చిత్తు చేయడంతో ఆతిథ్య ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. లంకపై విజయంతో ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించింది. Ladies and gentlemen, here are our first two semi-finalists of the ICC Men's #T20WorldCup 2022! Any surprise in there for you in the Super 12 Group 1 Final standings? pic.twitter.com/cNZEuYl82r — Star Sports (@StarSportsIndia) November 5, 2022 ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో సెమీఫైనల్లో ఎవరితో ఎవరు తలపడనున్నారో ఖరారైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, మ్యాచ్ వేదికలు, ఆరంభ సమయం, ఫైనల్ వేదిక తదితర వివరాలు తెలుసుకుందాం. మొదటి సెమీ ఫైనల్ నవంబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ వేదిక: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ సమయం: మధ్యాహ్నం గం. 1:30 నుంచి జట్లు: న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్. పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, హైదర్ అలీ రెండో సెమీ ఫైనల్ నవంబర్ 10: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వేదిక: అడిలైడ్ ఓవల్, అడిలైడ్ సమయం: మధ్యాహ్నం గం. 1:30 నుంచి జట్లు భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, దీపక్ హుడా. ఇంగ్లండ్: అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, టైమల్ మిల్స్, ఫిలిప్ సాల్ట్ లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్–1 చానెల్లో టీవీలో ప్రత్యక్ష ప్రసారం డిజిటల్లో డిస్నీ+హాట్‌స్టార్ వివిధ దేశాల్లో ప్రసారం చేసే చానెల్స్ ►భారత్‌లో- స్టార్ స్పోర్ట్స్ చానెల్స్ ►పాకిస్తాన్లో- పీటీవీ స్పోర్ట్స్, టెన్ స్పోర్ట్స్ ►ఆస్ట్రేలియా- కాయో స్పోర్ట్స్, ఫాక్స్టెల్ ►న్యూజిలాండ్- స్కై స్పోర్ట్స్ ►సౌతాఫ్రికా- సూపర్‌స్పోర్ట్ ►యునైటెడ్ కింగ్డం- స్కై స్పోర్ట్ ►అమెరికా- విల్లో టీవీ, విల్లో ఎక్స్ట్రా టీవీ ►కెనడా- విల్లో టీవీ ►యూఏఈ- మధ్య ప్రాచ్య దేశాలు- బీఇన్(BeIN) స్పోర్స్ ►హాంకాంగ్, మలేషియా, సింగపూర్- ఆస్ట్రో క్రికెట్ ఫైనల్: నవంబరు 13, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చదవండి: WC 2022: ఈసారి వర్షం కాదు.. ఇదంతా స్వయంకృతమే! ఆ ట్యాగ్ మాకు కొత్తేమీ కాదు! ఇకపై T20 WC 2022: నెదర్లాండ్స్ సంచలనం.. బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి మేటి జట్లతో పాటు నేరుగా View this post on Instagram A post shared by ICC (@icc) -
పాక్‌తో అయినా.. పసికూనతో అయినా నీ ఆట తీరు మారదా? అదేం కాదు!
ICC Mens T20 World Cup 2022 - India vs Netherlands: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అతడు పూర్తిగా నిరాశపరిచాడు. పసికూనతో సిడ్నీ మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సిడ్నీ మ్యాచ్‌లో.. డచ్ బౌలర్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోరులోనూ రాహుల్ వైఫల్యం(4 పరుగులు) చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి విఫలం కావడంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. రాహుల్‌ను తప్పించి ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘‘కనీసం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనైనా రాణిస్తావు అనుకుంటే.. ఇలా చేశావేంటి?’’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. నెదర్లాండ్స్‌పై వరల్డ్ రికార్డంటూ.. ‘‘ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. నెదర్లాండ్స్ అయినా ఇంత నిలకడగా విఫలమయ్యే ఆటగాడు మరొకరు ఉండరు. ఒక్కసారి పరుగులు తీయొద్దని ఫిక్స్ అయితే.. ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా రాహుల్ భయ్యా ఆట తీరు ఇలాగే ఉంటుంది మరి!’’ అని సెటైర్లు వేస్తున్నారు. ‘‘అలా ఓపెనింగ్ చేశాడో లేదో ఇలా ముగిసిపోయింది. నెదర్లాండ్స్‌పై రాహుల్ వరల్డ్ రికార్డు ఇదీ! అయినా మనోడు ఐపీఎల్లో బాగా ఆడతాడులే!’’ అంటూ ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు. అదేం కాదు! కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో రాహుల్ నెట్స్‌లో తీవ్ర సాధన చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎల్బీడబ్ల్యూ విషయంలో రాహుల్‌కు అన్యాయం జరిగిందని.. రివ్యూకి వెళ్లి ఉంటే ఫలితం వేరేలా ఉండేందంటూ అతడి ఫ్యాన్స్ అంటున్నారు. చదవండి: మరీ ఇంత దారుణ వైఫల్యమా? నీలాంటి ‘కెప్టెన్’ ఈ భూమ్మీద మరొకరు ఉండరు! మ్యాచ్ గెలిచినా.. టీ20 వరల్డ్‌కప్‌ల్లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువాహిని సాహితీ సదస్సు
సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువాహిని మూడవ సాహితీ సదస్సు అంతర్జాలంలో విజయవంతంగా ముగిసింది. ఐదు గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన సాహితీ సదస్సులో ముఖ్య అతిథులుగా వంగూరి చిట్టెన్ రాజు, ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి, డా. మూర్తి జొన్నలగడ్డ, రత్నకుమార్ కవుటూరి, సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మధు బైరెడ్డి ఇంకా పలువురు తెలుగువారు పాల్గొన్నారు. ఈ సాహితీ సదస్సులోనే పెయ్యేటి శ్రీదేవి కథల సంపుటి ''పిల్లలరాజ్యం' సామవేదం షణ్ముఖశర్మ అంతర్జాలంలో ఆవిష్కరించారు. శ్రీదేవి కథలపుస్తకంపై భువనచంద్ర, డా. కె.వి. కృష్ణకుమారి తమ అభిప్రాయాలను తెలిపారు. గతంలో వెలువడిన 'బియ్యంలో రాళ్ళు' 'పిల్లలరాజ్యం' ఇంటింట ఉండాల్సిన కథా పుస్తకాలని సామవేదం షణ్ముఖశర్మ అభిప్రాయపడ్డారు. పిల్లలరాజ్యం కథలపుస్తకం అంతర్జాతీయంగా మూడు దేశాలలో జూమ్ వేదికగా ఆవిష్కరణ కార్యక్రమం రూపొందించటం జరిగిందని తెలుగు వాహిని కన్వీనర్ విజయ గొల్లపూడి తెలిపారు. భారత్‌లో పిల్లలరాజ్యం కథల సంపుటిని సుధామ ఆవిష్కరించారు. పుస్తక పరిచయం గంటి భానుమతి చేయగా.. పెయ్యేటి శ్రీదేవితో ఆత్మీయ అనుబంధం గురించి పొత్తూరి విజయలక్ష్మి తెలిపారు. సిడ్నీలో మొదటి తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దుర్వాసుల మూర్తి, పలువురు ప్రముఖులు పెయ్యేటి శ్రీదేవి కథ శైలి, సునిశిత పరిశీలనా శక్తి, సామాజిక భాద్యతను కలిగిన చక్కని కథలని కొనియాడారు. తెలుగు వన్ గ్రూప్ అధినేత రవిశంకర్ కంఠమవేని శ్రీదేవి కథలు నాటికలుగా ప్రసారమయ్యాయని గుర్తుచేశారు. కుమార్తెలు విజయ గొల్లపూడి ఆస్ట్రేలియా నుంచి, కాంతి కలిగొట్ల అమెరికా నుంచి ఇంకా శ్రీదేవి భర్త పెయ్యేటి రంగారావు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత్రులు సంధ్య గొల్లమూడి, తమిరిశ జానకి, భావరాజు పద్మిని, బంధుమిత్ర సన్నిహితులు పాల్గొన్నారు. 26న జరగనున్నకెనడా అమెరికా సాహితీసదస్సులో కూడా పిల్లలరాజ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని కాంతి కలిగొట్ల తెలిపారు. -
ఆరువారాల లాక్డౌన్, అయినా లొంగని డెల్టా వేరియంట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా శరవేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్‌తో సిడ్ని నగరం విలవిలలాడుతోంది. ఆరు వారాల కఠిన లాక్డౌన్ తర్వాత కూడా రికార్డు స్థాయిల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని అతిపెద్ద నగరం సిడ్నీలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 291కి పెరిగింది. అంతేకాదు పరిస్థితి మరింత దిగజారవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుత ధోరణి ప్రకారం రోజువారీ కేసు సంఖ్య మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రీమియర్ గ్లాడిస్ బెరెజిక్లియన్ శుక్రవారం ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని మూడు అతిపెద్ద నగరాలతో సహాఇతర ప్రాంతాల్లో కూడా కరోనా మహమ్మారి విధ్వంసం కారణంగా దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది లాక్డౌన్లో ఉన్నారు. ఉత్తరాన ఉన్న క్వీన్స్‌ల్యాండ్, పశ్చిమ ఆస్ట్రేలియాలలో కూడా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా క్వీన్స్‌లాండ్‌లో10, మెల్బోర్న్లో విక్టోరియాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. సిడ్నీ, మెల్బోర్న్, బ్నిస్బేన్ నగరాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆగస్టు 28 వరకు సిడ్నీ లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ఒక్క సిడ్నీ నగరంలోనే దాదాపు 50లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. -
Australia: దొంగను చంపి..శవంతో 15 ఏళ్లు సహవాసం
ఆస్ట్రేలియా(సిడ్నీ): ఇంట్లో దొంగచొరబడితే ఏం చేస్తాం?..నాలుగు తగిలించి పోలీసులకు అప్పగిస్తాం. అయితే ఓ వ్యక్తి మాత్రం దొంగను చంపి 15 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. 2002 ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన షేన్ స్నెల్‌మన్ దొంగతనానికి వెళ్లగా.. బ్రూస్ రాబర్ట్స్ అనే వ్యక్తి అతడ్ని కాల్చి చంపాడు. దొంగ శవాన్ని 15 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా 70కి పైగా ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించాడు. అయితే ఈ విషయం పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఏబీసీ ద్యారా తెలిసినట్లు "కరోనర్ కోర్టు" తెలిపింది. ఈ కోర్టు మిస్టరీ మరణాలపై విచారణకు ఆదేశాలను జారీ చేస్తుంది. అయితే 2017లో రాబర్ట్స్ హీటర్‌పై పడి మరణించగా..ఇరుగు పొరుగువారు అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత ఓ వ్యక్తి ఆ ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లగా...స్నెల్మాన్ అవశేషాలు లభించాయి. కాగా, రాబర్ట్స్ తన ఇంటిని ఎప్పుడూ విడిచి వెళ్లేవాడు కాదని, ఆ ఇంట్లో డజనుకు పైగా తుపాకీలు లభించాయని అక్కడి వారు పోలీసులకు తెలిపారు. (చదవండి: USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు) -
అక్కడ స్థలం కొంటే ఇల్లు కట్టాల్సిందే..
ఇంటి ముందు మొక్కలు నవ్వుతుంటాయి. ఇంటి మీద జాతీయ పతాకం ఎగురుతుంటుంది. దేశాధ్యక్షుడు తన కారు తానే నడుపుకుంటాడు. చట్టసభల ప్రతినిధులు రైల్లో ప్రయాణిస్తుంటారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అలాగే... పెచ్చుమీరని ప్రభుత్వ ఆంక్షలూ ఉన్నాయి. మహాత్మాగాంధీ, దలైలామా, క్వీన్ రెండవ ఎలిజబెత్లను ఒకే చోట చూసే అవకాశం వచ్చింది. వాళ్ల పక్కనే షారూక్ ఖాన్, కరీనా కపూర్లను కూడా. ఇదంతా ఆస్ట్రేలియాలో అతి పెద్ద నగరం సిడ్నీలో. వేదిక పేరు మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం. సిడ్నీలో మరో అద్భుతమైన ప్రదేశం డార్లింగ్ హార్బర్లోని సీలైఫ్ అక్వేరియం. సీ లైఫ్ అక్వేరియంలో గాజు ట్యూబ్‌లో మనం ఉంటాం. జలచరాలు సముద్రంలో ఉంటాయి. ఇందులో నడుస్తూ మన పక్క నుంచి, తల మీద నుంచి పరుగులు తీసే జలచరాలను చూడడం గమ్మత్తుగా ఉంటుంది. ఇక సోమర్స్బే వాటర్ ఫాల్స్, వాటమొల్లా బీచ్‌ల పర్యటనతోపాటు ఆస్ట్రేలియాలో ఉన్న పది నెలల కాలంలో మురుగన్ టెంపుల్, రామలింగేశ్వర ఆలయం, అయ్యప్ప, సాయిబాబా, ఇస్కాన్ ఆలయం, మహంకాళి ఆలయాలను కూడా చూశాను. ఇవన్నీ ఇచ్చిన సంతృప్తికంటే కమ్యూనిటీ గార్డెన్ డెవలప్మెంట్ కోసం పని చేయడం ఎక్కువ సంతోషాన్నిచ్చింది. మొక్కలంటే ప్రాణం... సిడ్నీకి సమీపంలోని వెంట్ వర్త్ విల్లీలో మా అమ్మాయి దగ్గర పది నెలలున్నాం. అక్కడి ప్రజలు శ్రమజీవులు, కష్టపడి పని చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. రోజూ విధిగా గార్డెనింగ్ కోసం రెండు గంటలు కేటాయిస్తారు. ప్రతి ఇంటి ముందు పూలచెట్లు, క్రీపర్లు అల్లుకుని ఉంటాయి. దేశభక్తి కూడా ఎక్కువ. ఇంటి మీద వాళ్ల జాతీయ పతాకం ఉంటుంది. ప్రకృతిని ప్రేమిస్తారు. సహజ వనరులను మితంగా ఖర్చు చేస్తారు. మినరల్స్, భూగర్భ జలాలను భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించాలనే ఆశయం వారిది. నీటి కోసం బోర్ వేయరు, చెరువులు, నదుల నీటినే వాడతారు. స్థలం కొంటే ఇల్లు కట్టాల్సిందే... మనుషులు అత్యాశకు పోనివ్వకుండా నిజాయితీగా జీవించడానికి ఆస్ట్రేలియా నిబంధనలు కూడా కారణమే. అక్కడ ఎవరైనా ఇళ్ల స్థలం కొన్నారంటే తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ ధోరణిలో స్థలం కొని తరాల పాటు ఉంచుకోవడాన్ని ప్రభుత్వం ఒప్పుకోదు. దాంతో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటేనే స్థలం కొంటారు. భూమి అందుబాటు ధరలో ఉంటుంది. కమ్యూనిటీ గార్డెన్.. కాలనీల్లో కమ్యూనిటీ గార్డెన్ పెంపకం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. మడులు లీజ్కిస్తారు. ఒక్కొక్క మడికి ఏడాదికి ముప్పై డాలర్లు చెల్లించాలి. కూరగాయల మొక్కల విత్తనాలు, ఎరువులు, మందులు ఇస్తారు. ఆ పండించిన కూరగాయలు నేలను లీజుకు తీసుకున్న వాళ్లకే చెందుతాయి. విజిటింగ్ వీసా మీద వెళ్లిన వాళ్లు గార్డెనింగ్ సోషల్ సర్వీస్ చేయవచ్చు. అలా పది నెలల పాటు గార్డెన్ పని చేశాం. నా సర్వీస్‌కు మెచ్చి వెంట్ వర్త్ విల్లే చీఫ్ మిసెస్ రాబిన్ ప్రశంసా పత్రం ఇచ్చారు. లైబ్రరీలో తెలుగు పుస్తకాలు... వెంట్వర్త్ విల్లీలో ఉన్న కమ్యూనిటీ లైబ్రరీని చూశాం. అందులో ఇరవై మూడు భాషల పుస్తకాలున్నాయి. భారతీయ భాషల్లో పంజాబీ, మరాఠి, హిందీ, తమిళ్, గుజరాతీ భాషల్లో పుస్తకాలున్నాయి. తెలుగు పుస్తకాలు కనిపించకపోవడంతో బాధనిపించింది. అక్కడ విచారిస్తే లైబ్రరీ సభ్యత్వం ఉన్న వాళ్లు రిక్వెస్ట్ చేస్తే పరిగణనలోకి తీసుకుంటారని తెలిసింది. అక్కడ పర్మినెంట్ వీసాలోనూ, సిటిజన్షిప్తోనూ నివసిస్తున్న యాభై మంది తెలుగు వాళ్ల చేత సంతకాలు చేయించి, మా అల్లుడి చేత రిక్వెస్ట్ లెటర్ పెట్టించగలిగాం. ఆ ప్రయత్నంతో లైబ్రరీలో తెలుగు పుస్తకాలు కూడా వచ్చాయి. అక్కడ ఉన్న పది నెలల కాలంలో సాధించిన విజయాలివి. ఆస్ట్రేలియా ట్రిప్ ప్రభావం మా మీద హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది. ప్రతినిధులు లోకల్ ట్రైన్లో ఆస్ట్రేలియాలో రైళ్లలో ఒక్కోసారి రైలు మొత్తానికి ముగ్గురు ప్రయాణిస్తున్న దృశ్యాన్ని కూడా చూశాం. బస్సులు కూడా అంతే. సామాన్యులకు సర్వీస్‌లన్నింటినీ అందుబాటులో ఉంచాలనేది అక్కడి ప్రభుత్వ నియమం. చట్టసభల ప్రతినిధులు కూడా లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. ఎటువంటి హడావుడి లేకుండా ప్రెసిడెంట్ తన కారును తాను నడుపుకుని పోవడం అక్కడ సర్వసాధారణం. గన్ కల్చర్ లేకపోవడంతో ఎటువంటి భయమూ ఉండదు. ఇక్కడ జీవన వ్యయం చాలా ఎక్కువ. ఎకానమీ సమానంగా పంపిణీ జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా సంపాదనలో తేడా ఉండదు. అందుకే ఎవరికీ ఎవరి మీద ఆసూయ పెరగదు. నిస్వార్థంగా, నిజాయితీగా ఉంటారు. తరతరాల కోసం కూడబెట్టాలనే ఆలోచన ఉండదు. ఇక్కడ భవిష్యత్తు కోసం కూడ బెట్టేది వ్యక్తిగత ఆస్థులను కాదు. ప్రకృతి వనరులను నిల్వ చేస్తారు. ఈ ఆలోచన గొప్పగా అనిపించింది. మనుషులు నిస్వార్థంగా జీవించడానికి ఇవన్నీ కారణాలే. సౌకర్యాల కల్పనలో ఎంత ఉదారంగా ఉంటుందో, నిబంధనలను ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం అంతే కచ్చితంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం మితిమీరిన స్వేచ్ఛకు దారి తీయడం లేదు. అక్షరాలా అమలవుతోందనిపిస్తుంది. – చైతన్యమాధవుని అశోక్ రాజు, వీణారాణి -
ఫేస్బుక్ వివాదం: మోదీతో ఆస్ట్రేలియా చర్చలు
సిడ్ని: గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు.. వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్బుక్ సంచలనాత్మక తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్‌లోని ఫేస్బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. దీనిపై ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా పైకి మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నప్పటికీ చర్చలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరిపింది. దీనిపై ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని వివరించారు. అదే సమయంలో ఫేస్‌బుక్‌కు సైతం చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ యథాస్థితిని తీసుకొచ్చేందుకు ఫేస్బుక్ యాజమాన్యం త్వరతగతిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ తరహా యుద్ధం సరైనది కాదని పేర్కొన్నారు. కాగా, ‘ఫేస్బుక్ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. కాగా, ఆసీస్ మీడియా అవుట్ లేట్లను, కొత్తకంటెంట్ను కనబడకుండా నిరోధించారని ఫేస్బుక్ కోశాధికారి ఫైడెన్బర్గ్ తెలిపారు. ఆసీస్ ప్రధాని బెదిరింపు ధోరణిని మానుకోవాలని కూడా కోరారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆసీస్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఆసీస్ కంటేంట్‌ను నిలిపడం కన్నావేరే మార్గం కనిపించలేదని అన్నారు. ఇప్పటికే భారత ప్రధాని మోదీతోను, కెనెడాకు చెందిన జెస్టిస్ ట్రూడోతో చర్చించామని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. కాగా , నిషేధం విధించినప్పటి నుంచి స్వదేశీ, విదేశీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ తెలిపారు. ఫేస్బుక్ నిషేధ ప్రభావంను ఇంకా ప్రజలు పూర్తిగా ఎదుర్కొలేదని అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మిల్లర్ కోరారు. ఇక్కడ చదవండి: ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా -
ఓపెనర్‌గానే రోహిత్ శర్మ!
సిడ్నీ: ఫిట్నెస్ సంతరించుకొని... క్వారంటైన్ పూర్తి చేసుకున్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు తుదిజట్టులో స్థానం ఖరారైంది. సిడ్నీలో గురువారం మొదలయ్యే మూడో టెస్టులో రోహిత్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయమైంది. ఆతిథ్య బౌలర్లను ఎదుర్కోవడంలో తంటాలు పడుతున్న మయాంక్ అగర్వాల్‌ను సిడ్నీ టెస్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టాపార్డర్‌లోనే ‘హిట్‌మ్యాన్’ దిగనుండటంతో ఇప్పుడు ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదు. గాయంతో సిరీస్ నుంచి వైదొలిగిన పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, నటరాజన్‌లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. టీమ్ మేనేజ్మెంట్ జట్టు కూర్పు కోసం తుది కసరత్తు చేస్తోంది. తాత్కాలిక సారథి రహానే ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్‌ల సమతూకంపై దృష్టి పెట్టాడు. ప్రధానంగా సీనియర్ సీమర్లు లేని బౌలింగ్ లైనప్‌పై అతను సమాలోచనలు చేస్తున్నాడు. ఇదివరకే షమీ దూరమయ్యాడు. ఇప్పుడేమో ఉమేశ్ లేడు. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా, సిరాజ్‌లకు తోడుగా తుది జట్టులో మూడో పేసర్‌గా శార్దుల్, సైనీ, కొత్త పేసర్ నటరాజన్‌లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతోంది. వాతావరణం మేఘావృతమై ఉండటంతో పిచ్‌పై కవర్ని కప్పి ఉంచారు. బహుశా పిచ్ పరిశీలించాకే మూడో పేసర్ ఎవరో ఖరారు చేసే అవకాశముంది. మంగళవారం జరిగిన నెట్ సెషన్లో రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. అతను పేసర్లు, స్పిన్నర్లను ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్నాడు. గాయంతో స్వదేశానికి రాహుల్ ఈ సిరీస్‌లో గాయాలు... ఇరు జట్ల ఆటగాళ్లతో ఆడుకుంటున్నాయి. భారత శిబిరంలో ఇప్పటికే సీనియర్ సీమర్లు షమీ, ఉమేశ్ యాదవ్‌లు టెస్టు సిరీస్‌కు దూరం కాగా, ఈ జాబితాలో ఇప్పుడు బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ కూడా చేరాడు. ప్రాక్టీస్ సెషన్లో అతని ఎడంచేతి మణికట్టు బెణికింది. గాయం తీవ్రత దృష్ట్యా అతను మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని జట్టు వర్గాలు తెలిపాయి. ‘శనివారం మెల్బోర్న్లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా రాహుల్ ఎడంచేతి మణికట్టు బెణికింది. అతను పూర్తిగా కోలుకునేందుకు సుమారు మూడు వారాల సమయం పడుతుంది. అందువల్లే మిగతా మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు’ అని బీసీసీఐ తెలిపింది. మంగళవారం అతను స్వదేశానికి పయనమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అతనిప్పుడు పునరావాస శిబిరంలో పాల్గొంటాడు. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ తో జరిగే సిరీస్‌కల్లా రాహుల్ కోలుకుంటాడా లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. వార్నర్ రెడీ! ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సిడ్నీ టెస్టుకు సిద్ధమయ్యాడని జట్టు కోచ్ లాంగర్ చెప్పుకొచ్చాడు. గజ్జల్లో గాయంతో టి20లతో పాటు అతను తొలి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. అతని ఫిట్‌నెస్‌పై కోచ్... మీడియాతో వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడుతూ ‘వార్నర్ ఆడతాడని చాలా ఆశాభావంతో ఉన్నాం. ఎంతైనా అతను యోధుడు కదా! ఎందుకంటే జట్టు కోసం సంసిద్ధంగా ఉండేందుకు అతను ఏదైనా చేస్తా డని మొదటినుంచి నేను చెబుతున్నా. అన్నట్లే అతను ట్రాక్‌లో పడ్డాడు. టచ్‌లోకి వచ్చాడు. ఆడేందుకు అంకితభావంతో కృషిచేశాడు. ఈ పోటాపోటీ టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నెట్ సెషన్స్ పూర్తయ్యాక అతనిపై తుది నిర్ణ యం తీసుకుంటాం. తొందరపడి అతన్ని రిస్క్‌లోకి నెట్టం. అంతా ఆలోచించే జట్టును ఖరారు చేస్తాం’ అని అన్నాడు. భారత్ ‘ఎ’తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తలకు బంతి తగిలి కన్‌కషన్‌కు గురైన యువ బ్యాట్స్‌మన్ పకోవ్‌స్కీ కూడా కోలుకున్నాడని కోచ్ చెప్పా డు. దీంతో టెస్టుల్లో పకోవ్‌స్కీ అరంగేట్రం చేయనున్నాడు. -
ఆసీస్‌తో భారత్ రెండో వన్డే..
సిడ్నీ : భారత్ బ్యాటింగ్.. లైవ్ అప్డేట్స్ • ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఎదురీదుతుంది. ఇప్పటివరకు 38 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 46, పాండ్యా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కెప్టెన్ కోహ్లి సిడ్నీ గ్రౌండ్లో తొలిసారి ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేసిన కోహ్లి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో హెన్రిక్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో అవుట్‌గా వెనుదిరిగాడు. • 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 60 పరుగులకే ఓపెనర్లను కోల్పోయినా కెప్టెన్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడారు. ప్రస్తుతం 23ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కాగా 38 పరుగులు చేసిన అయ్యర్ హెన్రిక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 153 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కాగా కెప్టెన్ కోహ్లి 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. • సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా లక్ష్యచేధనలో తడబడుతున్నట్లుగా అనిపిస్తోంది. 390 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధవన్,మయాంక్ అగర్వాల్‌లు శుభారంభం అందించారు. 5 ఓవర్లోలనే భారత్ 50 పరుగులు దాటింది. మంచి టచ్‌లో కనిపించిన శిఖర్ ధవన్ హాజల్‌వుడ్ బౌలింగ్‌లో 30 పరుగుల వద్ద స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 58 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే 28 పరుగులు చేసిన మయాంక్ కూడా కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరడంతో 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి 3, అయ్యర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బ్యాటింగ్.. 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆసీస్ 389 పరుగులు సాధించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌లో స్మిత్ సెంచరీ (104)తో చెలరేగగా.. వార్నర్ (83) లబ్‌షేన్ 70, మ్యాక్స్‌వెల్ 29 బంతుల్లో 63, ఫించ్ 60 పరుగులతో చెలరేగారు. భారత్ ముందు 390 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. టీమిండియా బౌలర్లు మరోసారి ధారాళంగా పరుగులు సమర్పించారు. కాగా ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియాపై 389 పరుగులు అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో చేసిన 374 పరుగుల రికార్డును ఆసీస్ తాజాగా సవరించింది. అంతేకాదు ఆసీస్ చివరి 15 ఓవర్లలో టీమిండియా బౌలర్ల నుంచి 159 పరుగులు పిండుకుంది. భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ మరోసారి భారీ స్కోరు దశగా పయనిస్తోంది. మొదటి వన్డేలో 374 పరుగులు సాధించిన ఆసీస్ రెండో వన్డేలోనూ అదే స్థాయిలో అదరగొడుతుంది. ఇప్పటివరకు 43 ఓవర్లలో ఆస్ట్రేలియా మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 307 పరుగులు దాటింది. లబుషేన్ 44, మ్యాక్స్‌వెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా ఏడు ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో భారీ స్కోరుపై కన్నేసినట్లు కనిపిస్తోంది. కాగా అంతకముందు దాటిగా ఆడిన స్మిత్ వరుసగా రెండో సెంచరీతో మెరిశాడు. ఇప్పటికే మొదటి వన్డేలో సెంచరీ సాధించిన స్మిత్ ఈ మ్యాచ్‌లో మరింత దూకుడు ప్రదర్శించాడు. కేవలం 64 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసిన స్మిత్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ 292 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తొలి వన్డేలో భారీ సాధించిన కంగరూ ఆటగాళ్లు.. రెండోవన్డేలోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. 33 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి ఆసీస్ 213 పరుగులు సాధించింది. క్రిజ్‌లో స్మిత్ 48, లబుషేన్ 14 ఆడుతున్నాడు. జోరు మీద ఉన్న ఆసీస్ ఓపెనర్ల జోరుకు భారత పేసర్ షమీ బ్రేక్ వేశాడు. 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫించ్‌ను ఔట్ చేసి భారత్‌కు తుది వికెట్‌ను అందించాడు. దీంతో 152 పరుగులకు ఆసీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. సెంచరీ దిశగా దూకుడుగా ఆడుతున్న వార్నర్ సైతం వెంటనే రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 27 ఓవర్లుకు రెండు వికెట్ల నష్టానికి ఆసీస్ 166 పరుగులు సాధించింది. క్రిజ్‌లో స్మిత్‌తో పాటు లబుషేన్ ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన ఆసీస్ ఓపెనర్లు రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఒక్క వికెట్ నష్టపోకుండా 97 పరుగుల రాబట్టారు. ఫించ్ 45 బంతుల్లో 37 పరుగులు, వార్నర్ 50 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. వార్నర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆఫ్‌సెంచరీ సాధించాడు. తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 40 పరుగులు సాధించింది. ఓపెనర్లు వార్నర్ 24 బంతుల్లో 29 పరుగులు, ఫించ్ 17 బంతుల్లో 10 పరుగులు క్రిజ్‌లో ఉన్నారు భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచి ఆసీస్ మరోసారి బ్యాటింగ్ వైపే మొగ్గుచూపింది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆసీస్ భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. సిరీస్‌పై పట్టు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా నెగ్గాలి. మరోవైపు తొలి మ్యాచ్ విజయంతో ఆసీస్ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ధీమాతో ఉంది. ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. (గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవం) భారత్ తుదిజట్టు : శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హర్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ, షమీ, బుమ్రా, చహల్ ఆసీస్ తుది జట్టు : ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్మిత్, మార్నస్ లబుషేన్, స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, కేరీ, మోయిసెస్ హెన్రిక్యూస్, కమిన్స్, స్టార్క్, జంపా, హెజల్‌వుడ్ -
తొలి వన్డే: భారత్ ముందు భారీ టార్గెట్
సిడ్నీ : క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా మైదానంలోకి అడుగుపెట్టింది. కరోనా తెచ్చిన విరామం తర్వాత కోహ్లి సేన తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు రంగంలోకి దిగింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేడు ప్రారంభమైంది. సిడ్నీ మైదానం వేదికగా భారత్-ఆసీస్ మధ్య తొలి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. తొలి వన్డే అప్డేట్స్ : తొలి వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. భారత్ బౌలర్లను ఉచకోత కోత్తూ ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ బౌండరీల మోత మోగించారు. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్ల ధాటికి సిడ్నీలో పరుగుల వరద పారింది. కెప్టెన్ ఫించ్ సెంచరీ (114)తో చెలరేగగా.. స్మిత్ 66 బంతుల్లో 105 మెరుపులు మెరిపించాడు. వార్నర్ 69, మ్యాక్స్‌వెల్ 45 పరుగులతో రాణించారు. భారత్ ముందు 375 పరులు భారీ లక్ష్యాన్ని ఉంచారు. తొలి వన్డేలో భారీ స్కోర్ దిశగా ఆసీస్ ఇన్సింగ్స్ కొనసాగుతోంది. బ్యాటింగ్ పిచ్‌పై కంగారూ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓపెనర్ ఫించ్ అద్భుతమైన శతకం (114 ఔట్) చెలరేగగా.. స్మిత్ (73 బ్యాటింగ్) ధాటిగా ఆడుతున్నాడు. 42 ఓవర్లు ముగిసే లోపు ఆసీస్ మూడు కోల్పోయి 293 పరుగుల చేసింది. ప్రస్తుతం స్మిత్, మ్యాక్స్‌వెల్ (17) క్రిజ్‌లో ఉన్నారు. 39 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 252 పరుగుల చేసింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ భారీ శతకం బాదాడు. 119 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. మరోవైపు స్మిత్ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని ప్రస్తుతం 63 పరుగులు సాధించాడు. 156 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 69 (76 బంతుల్లో) ఔట్ అయ్యాడు. షమీ బౌలింగ్ కిపర్ క్యాచ్ ద్వారా వార్నర్ వికెట్ సమర్పించుకున్నాడు.. ఓ వికెట్ నష్టానికి 28 ఓవర్లలో ఆసీస్ 156 పరుగులు చేసింది. క్రిజ్‌లో ఫించ్‌తో పాటు స్మిత్ ఉన్నాడు. 24 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 131 పరుగుల చేసింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ దూసుకుడుగా ఆడుతూ.. ఆఫ్‌సెంచరీ సాధించారు. ఫించ్ 62 బంతుల్లో 56 పరుగులు చేయగా.. వార్నర్ 70 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. ఇద్దరు ఆటగాళ్లు బౌండరీలు కొడుతూ మరింత దూకుడు పెంచారు. తొలి వన్డేలో ఆసీస్ ఓపెనర్లు జోరుమీద ఆడుతున్నారు. భారత బౌలర్లను ధాటికి ఎదుర్కుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు 16 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 82 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ 59 బంతుల్లో 40 పరుగులు చేయగా.. వార్నర్ 41 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. ఫించ్ దూకుడుగా ఆడుతూ బౌండరీలు సాధిస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ నిబంధనల నడుమ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఐపీఎల్లో రాణించి భారత ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో చోటుదక్కింది. మయాంక్ అగర్వాల్‌తో పాటు పేసర్ నవదీప్ సైనీ సైతం తుది జట్టులో చోటుదక్కించుకున్నారు. ధావన్‌తో కలిసి మయాంక్ ఇన్సింగ్స్‌ను ప్రారంభినున్నాడు. 1992 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలిన (రెట్రో) డ్రెస్‌లతోనే బరిలోకి దిగటం ఆకర్షణీయాంశం. సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కాగా ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించి.. భుజాలకు నలుపు రంగు బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. భారత జట్టు : శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, వీరాట్ కోహ్లీ (కెప్టెన్) శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, హర్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ, నవదీప్ శైనీ, యజ్వేంద్ర చహల్, బూమ్రా ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్ పించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, లబ్‌షేన్, మాక్స్వెల్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, స్టార్క్, ఆడం జంసా, హెజల్‌వుడ్ -
భారత్–ఆసీస్ పోరుపై అమితాసక్తి
సిడ్నీ : భారత్–ఆస్ట్రేలియా మధ్య జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వన్డే, టి20ల కోసం జరిగిన టికెట్ల కొనుగోలు దీనిని నిరూపించింది. ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల కోసం అందుబాటులో ఉంచిన టికెట్లు మొత్తం దాదాపుగా అమ్ముడుపోయాయి. ఈ ఆరు మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ కోసం మాత్రం ఇంకా టికెట్లు మిగిలి ఉన్నాయి. కరోనా కారణంగా ఈ మ్యాచ్‌లు జరిగే సిడ్నీ, కాన్బెర్రా వేదికల్లో స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సిడ్నీ మైదానం ఉన్న న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో గత రెండు వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రేక్షకుల సంఖ్యను పెంచే ఆలోచన కూడా ఉంది. సాధారణంగా సిడ్నీలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా...పెద్ద సంఖ్యలో భారత అభిమానులు హాజరవుతారు. (భారత్ కంటే ఆస్ట్రేలియా మెరుగు) -
మహిళపై సింహాల దాడి
సిడ్నీ: ఆస్ట్రేలియా జూలో పని చేసే మహిళపై రెండు సింహాలు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జూ ఆవరణను శుభ్రపరుస్తుండగా సింహాలు దాడి చేయడంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం... పారామెడిక్స్ న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యు) రాష్ట్రంలోని షోల్హావెన్ జూ లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి మూసివేశారు. ఈ నేపథ్యంలో జూ ఆవరణను బాధితురాలు శుభ్రం చేస్తుండగా సింహాలు ఆమెపై దాడి చేశాయి. ఇది గమనించిన ఇతర జూ సిబ్బంది సింహాలను గుహలోకి తరిమి ఆమెను రక్షించారు. అయితే అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనలో బాధితురాలి మెడ, తల భాగంలో గాయలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. దీనిపై బాధిత మహిళ మాట్లాడుతూ.. ‘‘నేను గత కొంతకాలంగా జూలో పనిచేస్తున్నా. ఇలాంటి ఘటన జూలో ఎప్పుడు జరగలేదు. ఇది చాలా భయంకరమైనది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జూ వద్ద హై అలర్ట్ ప్రకటించామని, ఘటనపై జూ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని పోలీసులు తెలిపారు. -
కరోనా భయం: రైళ్లో వాగ్వాదం..
-
‘ఇంత చెత్తగా ఎలా ప్రవర్తిస్తున్నావు’
ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటిదాకా ఈ మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో.. పలు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించడం.. బహిరంగ ప్రదేశాల్లో సంచరించాల్సి వచ్చినపుడు మాస్కులు ధరించడం సహా ఇతర చిట్కాలు పాటిస్తూ తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఓ ఆస్ట్రేలియా మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. తన ప్రవర్తనతో తోటి ప్రయాణికుడిని ఇబ్బందుల పాలుజేసింది. (‘కోవిడ్’పై ట్రంప్ ట్వీట్.. కీలక నిర్ణయం!) అసలేం జరిగిందంటే... సిడ్నీలో ఇంటర్సిటీ వీ- సెట్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో సదరు మహిళకు ఓ వ్యక్తి ఎదురుగా కూర్చున్నాడు. ఈ క్రమంలో అదే పనిగా ఆమె దగ్గుతుండటంతో.. నోటికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆమె.. ‘‘నేనేమీ నోరు తెరవలేదు. లోలోపలే దగ్గుతున్నా. నీకేమైంది. నువ్వు పనికిమాలిన వాడివి’’అంటూ అతడికి దగ్గరగా వెళ్లి మరీ దగ్గింది. ఆమె చర్యతో ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి.. ‘‘ఇంత చెత్తగా ఎలా ప్రవర్తిస్తున్నావు’’ అంటూ మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు దాదాపు 100 మంది కరోనా బారిన పడ్డారు. ముగ్గురికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.(వాటి కారణంగానే కోవిడ్ వ్యాప్తి!) టాయిలెట్ పేపర్ కోసం కొట్టుకున్న మహిళలు -
నాలుగో ప్రయత్నం ఫలిస్తుందా..!
మహిళల టి20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. మూడుసార్లు సెమీఫైనల్‌కే పరిమితమైంది. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో ఆ గీత దాటాలని పట్టుదలగా ఉంది. తాజా ఫామ్, టోర్నీలో అజేయ ప్రదర్శన అందుకు కావాల్సిన స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఇది హర్మన్ సేనపై ఉన్న అంచనాలకు సంబంధించి ఒక పార్శ్వం. కానీ అటువైపు చూస్తే ప్రత్యర్థి ఇంగ్లండ్... టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన ఐదు సార్లూ భారత్‌కు పరాజయమే ఎదురైంది. 2018 టోర్నీ సెమీఫైనల్లో కూడా ఇదే జట్టు చేతిలో మన టీమ్ ఓడింది. అప్పుడు కూడా సరిగ్గా ఇలాగే లీగ్ దశలో నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌లోనే వెనుదిరిగింది. ఇప్పుడు గత రికార్డును మన అమ్మాయిలు సవరిస్తారా, లెక్క సరి చేస్తారా వేచి చూడాలి. సిడ్నీ: లీగ్ దశలో నాలుగు వరుస విజయాలతో సత్తా చాటిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో అసలు పోరుకు సన్నద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఓటమి లేకుండా అజేయంగా నిలవగా... ఇంగ్లండ్ మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ముఖాముఖీ పోరులో మాత్రం మన ప్రత్యర్థిదే పైచేయి. అయితే ఎక్కువ మంది యువ ప్లేయర్లతో నిండిన మన జట్టు తాజా ఫామ్ మాత్రం ఫైనల్ చేరడంపై ఆశలు రేపుతోంది. హర్మన్ ఫామ్‌తో ఇబ్బంది! లీగ్ దశలో భారత జట్టు వరుస విజయాల్లో 16 ఏళ్ల షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. బుధవారం ప్రకటించిన తాజా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కూడా మారిన షఫాలీ 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 161 పరుగులు చేసింది. అదీ 166 స్ట్రయిక్ రేట్‌తో కావడం విశేషం. మరోసారి షఫాలీ ఇచ్చే ఆరంభం జట్టుకు కీలకం కానుంది. జెమీమా రోడ్రిగ్స్ (85 పరుగులు), దీప్తి శర్మ (83 పరుగులు) కొంత వరకు ఫర్వాలేదనిపించారు కానీ తొలి స్థానంలో ఉన్న షఫాలీకి వీరిద్దరికి మధ్య పరుగుల్లో చాలా అంతరం ఉంది. అయితే అన్నింటికి మించి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇద్దరు టాప్ బ్యాటర్లు స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ల ఆట. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా ఆడిన అనుభవంతో స్మృతి ఈసారి వరల్డ్ కప్‌లో భారత్‌ను నడిపిస్తుందని భావిస్తే ఆమె పూర్తిగా నిరాశపర్చింది. 3 మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులే చేసింది. ఇక హర్మన్ కౌర్ మరీ ఘోరం. అటు వన్డేలు, ఇటు టి20ల్లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన హర్మన్ ఈ మెగా టోర్నీలో పూర్తిగా చేతులెత్తేసింది. ఆమె వరుసగా 2, 8, 1, 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీఫైనల్లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. కేవలం షఫాలీ బ్యాటింగ్‌పైనే ఆధారపడితే కీలక మ్యాచ్‌లో భారత్‌కు ఎదురు దెబ్బ తగలవచ్చు. బౌలింగ్‌లో స్పిన్నర్లే భారత్‌కు బలం. తుది జట్టులో శిఖా పాండే రూపంలో ఏకైక పేసర్ ఉన్నా విభిన్న శైలి గల స్పిన్నర్లే ఆటను శాసిస్తున్నారు. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్, లెఫ్టార్మ్ స్పిన్నర్లు రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మలతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పూనమ్ స్పిన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనిగా మారింది. శిఖా పాండే కూడా చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఈ ఐదుగురు బౌలర్ల ఎకానమీ ప్రపంచకప్‌లో 6 దాటకపోవడం విశేషం. గాయాల సమస్య లేదు కాబట్టి శ్రీలంకతో చివరి లీగ్ ఆడిన తుది జట్టునే మార్పుల్లేకుండా భారత్ కొనసాగించనుంది. 2018 ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిన జట్టులో ఆడిన ఏడుగురు ప్లేయర్లు ఇప్పుడు భారత జట్టు తరఫున మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జోరు మీదున్న సివెర్.. వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను సెమీఫైనల్ చేర్చడంలో ఇద్దరు బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. నటాలీ సివెర్ 4 మ్యాచ్‌లలో కలిపి 202 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆమెకు కెప్టెన్ హెథర్ నైట్ (193)నుంచి మంచి సహకారం లభించింది. నైట్ ఖాతాలో ఒక శతకం కూడా ఉండటం విశేషం. మరోసారి ఇంగ్లండ్ జట్టు ఈ ఇద్దరి బ్యాటింగ్‌పైనే ఆధారపడుతోంది. వీరిని నిలువరించగలిగితేనే ప్రత్యర్థి పని సులువవుతుంది. అమీ జోన్స్, డానియెలా వ్యాట్ వరుసగా విఫలమవుతున్నారు. అయితే ఇంగ్లండ్ కూడా తమ బౌలింగ్‌ను బాగా నమ్ముకుంది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఎకెల్‌స్టోన్ పాత్ర మరోసారి కీలకం కానుంది. ఈ బౌలర్ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 3.23 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. ష్రబ్సోల్ కూడా 8 వికెట్లతో అండగా నిలవగా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సారా గ్లెన్ కట్టడి చేసింది. ఈ నేపథ్యంలో సెమీస్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. వర్షం పడితే ఫైనల్‌కు భారత్.. రిజర్వ్ డే అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే ఉంచాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసి పుచ్చింది. స్థానిక వాతావరణ శాఖ సూచన ప్రకారం గురువారం రోజంతా వర్ష సూచన ఉంది. దాంతో కీలకమైన పోరు కాబట్టి రిజర్వ్ డే ఉంటే బాగుంటుందని సీఏ భావించింది. ‘టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్ డే ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పుడు కుదరదు’ అని ఐసీసీ తేల్చి చెప్పింది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. కనీసం ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంటేనే మ్యాచ్ కొనసాగిస్తారు. అంతకంటే తక్కువ ఓవర్లే సాధ్యమైతే మ్యాచ్ రద్దయినట్లే. ఇదే జరిగితే గ్రూప్‌లో పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంటాయి. రెండో సెమీస్ కూడా.. తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరుగుతుంది. గ్రూప్ ‘బి’లో సఫారీ జట్టు అజేయంగా నిలవగా... ఆసీస్ మాత్రం భారత్ చేతిలో ఓడింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), షఫాలీ, స్మృతి, జెమీమా, దీప్తి, వేద, తానియా, శిఖా పాండే, రాధ, పూనమ్, రాజేశ్వరి. ఇంగ్లండ్: హెథర్ నైట్ (కెప్టెన్), వ్యాట్, బీమాంట్, సివెర్, విల్సన్, అమీ జోన్స్, బ్రంట్, ష్రబ్సోల్, మ్యాడీ విలియర్స్, ఎకెల్‌స్టోన్, సారా గ్లెన్. పిచ్, వాతావరణం స్పిన్‌కు అనుకూలం. వర్షం పడితే పిచ్ స్వభావంలో మార్పు రావచ్చు. మ్యాచ్ సమయంలో వర్ష సూచన ఉంది. ఆటకు అంతరాయం కలిగించడం ఖాయం. 4 - భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 19 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 4 గెలిచి, 15 ఓడింది. ఇటీవల ముక్కోణపు టోర్నీలో భాగంగా రెండు సార్లు తలపడగా, ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గాయి. -
దారుణం: గర్భవతిపై పిడిగుద్దులతో దాడి..
సిడ్నీ : గర్భవతి అని కూడా చూడకుండా ఓ వ్యక్తి మహిళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇష్టారీతిన ఆమెను కొట్టి.. కిందపడేసి తన్నాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును కలిచి వేస్తున్నాయి. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని ఓ కేఫ్‌లో ముగ్గురు మహిళలు ముఖానికి స్కార్ప్ ధరించి కూర్చుని ఉండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఒక్కసారిగా అందులోని ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. 38 వారాల గర్భవతిగా ఉన్న ఆమెపై ఆవేశంతో చేతితో పిడిగుద్దులు కురిపించి, ఆపై కాలితో తన్ని కింద పడేశాడు. ఘటనాస్థలిలో ఉన్న వారు దుండగుడిని ఆపినప్పటికీ.. అతడు రెచ్చిపోయాడు. ఈ దాడిలో సదరు మహిళ కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మహిళను శారీరకంగా హింసించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. అంతేగాక ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు నిందితుడికి కనీసం బెయిల్ కూడా మంజూరు చేయలేమని పోలీసులు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్స్ (ఏఎఫ్‌ఐసీ) దీనిపై స్పందిస్తూ... ఈ ఘటనకు ముందు బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఇస్లామిక్ మతానికి వ్యతిరేకంగా ప్రసంగించిందని, అందుకే ఆమెపై కోపం పెంచుకున్న నిందితుడు ఇలా ప్రవర్తించాడని తెలిపారు. ఇది జాత్యంహకారంతో చేసిన చర్య అని, సమాజంలో ఇలాంటి దాడులను ఆపకపోతే ఇలాంటివారు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అన్నారు. కాగా ఆస్ట్రేలియాలో ఓ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనల ప్రకారం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్న ప్రతి 113 మందిలో 96 మంది ముఖానికి స్కార్ఫ్ ధరించి ఉన్నవారేనని వేధించింది. చదవండి : డ్యాన్స్ టీచర్ వల్ల మైనర్ బాలుడికి హెచ్ఐవీ -
ఆస్ట్రేలియా పర్యటనలో వైవీ సుబ్బారెడ్డి
సిడ్నీ: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని సుబ్బారెడ్డి దంపతులు సందర్శించారు. అనంతరం ఆయన ఆసీస్ డిప్యూటీ హైకమిషనర్‌తో, భారత డిప్యూటీ హై కమిషనర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆస్ట్రేలియా పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. తర్వాత సిడ్నీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. -
సిడ్నీలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
-
వేశ్యని చంపి.. వీధుల్లో హల్ చల్
సిడ్నీ : 21 ఏళ్ల ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. కనపడిన వారిపై ఇష్టమొచ్చినట్లు కత్తితో దాడి చేశాడు. దారుణంగా ఓ వేశ్యను చంపటమే కాకుండా కత్తితో రోడ్లపైకి వచ్చి హల్చల్ చేశాడు. ఈ సంఘటన మంగళవారం సిడ్నీ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. మెర్ట్ నే అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం సమయంలో యార్క్ స్ట్రీట్ గుండా కత్తితో సంచరిస్తూ కనపడిన వారిపై దాడికి దిగాడు. 24 ఏళ్ల ఓ వేశ్యపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. అనంతరం గట్టిగా అరుస్తూ అక్కడి వీధులు మొత్తం చక్కర్లు కొట్టాడు. చక్కగా అక్కడ ఓ సెల్ఫీ తీసుకుని రోడ్డుపై వెళుతున్న కార్లపైకి ఎగబడ్డాడు. కారుపైకి ఎక్కిన మెర్ట్ కత్తిని పైకి చూపిస్తూ గట్టిగా అరవటం మొదలుపెట్డాడు. దీంతో అక్కడివారు పోలీసులకు సమాచారం అందించారు. కుర్చీలు, ఇతర వస్తువుల సహాయంతో అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. -
36 ఏళ్ల క్రితం భార్య అదృశ్యం.. 70 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
సిడ్నీ : ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించిన వివాహిత అదృశ్యం కేసులో ముప్పై ఆరేళ్ల తర్వాత పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జరిగిన జాప్యానికి క్షమాపణ కోరుతూ న్యూసౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మిక్ ఫుల్లర్ ప్రకటన విడుదల చేశారు. వివరాలు... క్రిస్ డాసన్, లినెట్టి అనే దంపతులు సిడ్నీలో జీవించేవారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 1982లో అకస్మాత్తుగా లినెట్టి కనిపించకుండా పోయింది. ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా క్రిస్‌ను విచారించగా.. లినెట్టి అదృశ్యంతో తనకు సంబంధం లేదని, మత ప్రచార సంస్థతో కలిసి ఆమె వెళ్లిపోయిందని అతడు చెప్పినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. అయితే ఇంతవరకు లినెట్టి జాడ తెలియక పోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 70 ఏళ్ల క్రిస్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినితో సంబంధం.. వివాహం స్కూలు టీచరుగా పనిచేసే సమయంలో తన విద్యార్థినులతో క్రిస్‌కు వివాహేతర సంబంధాలు ఉండేవనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా లినెట్టి కనిపించకుండా పోయిన కొద్ది కాలానికే తన స్టూడెంట్ను క్రిస్ పెళ్లాడాడు. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాలు, రెండో పెళ్లికి అడ్డుగా ఉందన్న కారణంగానే క్రిస్.. లినెట్టిని చంపి ఉంటాడని పోలీసులు భావించారు. కానీ ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలను సేకరించలేకపోయారు. దీంతో అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే లినెట్టి అదృశ్యానికి సంబంధించిన వార్తలు పోడ్‌క్యాస్ట్‌ల రూపంలో వైరల్‌గా మారడంతో.. ‘ద టీచర్స్ పెట్’ గా క్రిస్ స్టోరీ ప్రాచుర్యం పొందింది. దీంతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో 2018లో కేసును తిరిగదోడిన పోలీసులు మరోసారి క్రిస్ ఇంటిని సోదా చేశారు. అయితే ఇప్పుడు కూడా లినెట్టి అదృశ్యానికి సంబంధించిన ఆధారాలేవీ దొరకలేదు గానీ, తమ డిటెక్టివ్ బృందం ఆ పనిలో నిమగ్నమైందని పోలీసులు తెలిపారు. కాగా ఈ విషయమై లినెట్టి సోదరుడు మాట్లాడుతూ.. ఇప్పటికైనా తన సోదరికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
మగాళ్లు బలంగా ఉండాలంటే హైహీల్స్ వేసుకోవాలట..!
సిడ్నీ : మగాళ్లు ఏంటి? హైహీల్స్ వేసుకోవడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా.. అందరిలాగా ఆలోచిస్తే కిక్కేముందనుకున్నాడో ఏమో ఓ మహాశయుడు ఇలాగే వెరైటీగా ఆఫీస్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. మహిళలు ధరించే హైహిల్స్ వేసుకొని ఆఫీస్‌కు వెళుతున్నాడు. ఇదేంటి అని పక్కవాళ్లు నవ్వుకున్నా.. తోటి ఉద్యోగులు ఎద్దేవా చేసినా అతను వెరవలేదు. అంతేకాదు.. హైహిల్స్ కంటే మహిళలాగా పురుషులు కూడా శక్తిమంతంగా తయరు కావొచ్చునని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన యాష్లే మాక్స్వెల్-లామ్.. ఇలా ఆడవాళ్లు ధరించే హైహీల్స్ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇతడు కొన్నేళ్ల కిందటి వరకు అందరిలాగే మామూలుగా పురుషుల షూస్ వేసుకొని ఆఫీస్‌కు వెళ్లేవాడు. అయితే, తన ఆఫీసులో పనిచేసే ఓ మహిళా సహోద్యోగి.. ఆమె శక్తివంతంగా ఉండడానికి కారణం హైహీల్సేనని చెప్పింది. కావాలంటే వేసుకుని చూడమని సలహా ఇచ్చింది. ఆ సలహా నచ్చడంతో లామ్.. లైఫ్‌స్టైలే మారిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడికివెళ్లినా.. అందరి చూపు అతని వేసుకునే చెప్పులపైనే ఉంటుంది. అతను హైహీల్స్ ధరించడం..చూసేవారికి వింతగా తోచినా.. ఇవి ధరించడం వల్ల చాలా హుందాగా, శక్తిమంతంగా ఉన్నానని నిర్మోహమాటంగా చెప్తున్నాడు. అనుమానం ఉంటే మీరు కూడా ధరించండని సలహా ఇస్తున్నాడు. -
ఎయిర్పోర్ట్ ఉద్యోగి క్రిస్మస్ విషెస్