సిడ్నీ : క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా మైదానంలోకి అడుగుపెట్టింది. కరోనా తెచ్చిన విరామం తర్వాత కోహ్లి సేన తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు రంగంలోకి దిగింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేడు ప్రారంభమైంది. సిడ్నీ మైదానం వేదికగా భారత్-ఆసీస్ మధ్య తొలి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు.
తొలి వన్డే అప్‌డేట్స్ :
- తొలి వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. భారత్ బౌలర్లను ఉచకోత కోత్తూ ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ బౌండరీల మోత మోగించారు. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్ల ధాటికి సిడ్నీలో పరుగుల వరద పారింది. కెప్టెన్ ఫించ్ సెంచరీ (114)తో చెలరేగగా.. స్మిత్ 66 బంతుల్లో 105 మెరుపులు మెరిపించాడు. వార్నర్ 69, మ్యాక్స్‌వెల్ 45 పరుగులతో రాణించారు. భారత్ ముందు 375 పరులు భారీ లక్ష్యాన్ని ఉంచారు.
- తొలి వన్డేలో భారీ స్కోర్ దిశగా ఆసీస్ ఇన్సింగ్స్ కొనసాగుతోంది. బ్యాటింగ్ పిచ్‌పై కంగారూ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓపెనర్ ఫించ్ అద్భుతమైన శతకం (114 ఔట్) చెలరేగగా.. స్మిత్ (73 బ్యాటింగ్) ధాటిగా ఆడుతున్నాడు. 42 ఓవర్లు ముగిసే లోపు ఆసీస్ మూడు కోల్పోయి 293 పరుగుల చేసింది. ప్రస్తుతం స్మిత్, మ్యాక్స్‌వెల్ (17) క్రిజ్‌లో ఉన్నారు.
39 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 252 పరుగుల చేసింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ భారీ శతకం బాదాడు. 119 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. మరోవైపు స్మిత్ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని ప్రస్తుతం 63 పరుగులు సాధించాడు.
-
156 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 69 (76 బంతుల్లో) ఔట్ అయ్యాడు. షమీ బౌలింగ్ కిపర్ క్యాచ్ ద్వారా వార్నర్ వికెట్ సమర్పించుకున్నాడు..
-
ఓ వికెట్ నష్టానికి 28 ఓవర్లలో ఆసీస్ 156 పరుగులు చేసింది. క్రిజ్‌లో ఫించ్‌తో పాటు స్మిత్ ఉన్నాడు.
- 24 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 131 పరుగుల చేసింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ దూసుకుడుగా ఆడుతూ.. ఆఫ్‌సెంచరీ సాధించారు. ఫించ్ 62 బంతుల్లో 56 పరుగులు చేయగా.. వార్నర్ 70 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. ఇద్దరు ఆటగాళ్లు బౌండరీలు కొడుతూ మరింత దూకుడు పెంచారు.
- తొలి వన్డేలో ఆసీస్ ఓపెనర్లు జోరుమీద ఆడుతున్నారు. భారత బౌలర్లను ధాటికి ఎదుర్కుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు 16 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 82 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ 59 బంతుల్లో 40 పరుగులు చేయగా.. వార్నర్ 41 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. ఫించ్ దూకుడుగా ఆడుతూ బౌండరీలు సాధిస్తున్నాడు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ నిబంధనల నడుమ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఐపీఎల్‌లో రాణించి భారత ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో చోటుదక్కింది. మయాంక్ అగర్వాల్‌తో పాటు పేసర్ నవదీప్ సైనీ సైతం తుది జట్టులో చోటుదక్కించుకున్నారు. ధావన్‌తో కలిసి మయాంక్ ఇన్సింగ్స్‌ను ప్రారంభినున్నాడు. 1992 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలిన (రెట్రో) డ్రెస్‌లతోనే బరిలోకి దిగటం ఆకర్షణీయాంశం. సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కాగా ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించి.. భుజాలకు నలుపు రంగు బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు.
భారత జట్టు : శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, వీరాట్ కోహ్లీ (కెప్టెన్) శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, హర్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ, నవదీప్ శైనీ, యజ్వేంద్ర చహల్, బూమ్రా
ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్ పించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, లబ్‌షేన్, మాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, స్టార్క్, ఆడం జంసా, హెజల్‌వుడ్
Comments
Please login to add a commentAdd a comment