australia vs india
-
India vs Australia: భారత్ సెమీస్ ఆశలకు దెబ్బ!
షార్జా: భారత మహిళల ముందున్న లక్ష్యం 152...అసాధ్యమేమీ కాదు కానీ 47 పరుగులకే టాపార్డర్ అవుట్! ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (47 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు), దీప్తిశర్మ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు) భాగస్వామ్యం ఆశలు రేపింది. 25 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన దశలో దీప్తి అవుటవడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 40; 5 ఫోర్లు), కెపె్టన్ తాహ్లియా మెక్‌గ్రాత్ (26 బంతుల్లో 32; 4 ఫోర్లు), ఎలైస్ పెరీ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం భారత అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. రాణించిన గ్రేస్ హారిస్ భారత సీమర్ రేణుక ఆరంభ ఓవర్లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ 17 పరుగుల వద్దే వరుస బంతుల్లో బెత్ మూని (2), జార్జియా (0) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ గ్రేస్ హారిస్, కెపె్టన్ తాహ్లియా కుదురుగా ఆడటంతో 10 ఓవర్లలో జట్టు 65/2 స్కోరు చేసింది. ఆష్లే గార్డ్నర్ (6) విఫలం కాగా, ఎలైస్ పెరీ ధాటిగా ఆడింది.హర్మన్ పోరాడినా... షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్ (16) విఫలం అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ నడిపించారు. జట్టు స్కోరును 15.1 ఓవర్లలో వందకు చేర్చారు. అయితే భారీ షాట్‌కు యతి్నంచిన దీప్తిశర్మ బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో నాలుగో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా...4 పరుగుల చేసిన భారత్ 4 వికెట్లు చేజార్చుకుంది. పాక్ గెలిస్తేనే... ‘ఎ’ గ్రూప్ నుంచి ఆసీస్ సెమీస్ చేరగా...భారత్, కివీస్ మధ్య రెండో స్థానం కోసం పోటీ ఉంది. నేడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణంతో పని లేకుండా మూడు విజయాలతో ఆ జట్టుకు ముందుకు వెళ్లి భారత్ ని్రష్కమిస్తుంది. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత కూడా భారత్ రన్‌రేట్ కివీస్కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాక్ చేతిలో ఆ జట్టు ఓడిపోతే చాలు. అయితే బలహీనమైన పాక్‌పై కివీస్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా మహిళల ఇన్నింగ్స్: హారిస్ (సి) స్మృతి (బి) దీప్తిశర్మ 40; బెత్ మూని (సి) రాధ (బి) రేణుక 2; జార్జియా (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 0; తాహ్లియా (స్టంప్డ్) రిచా (బి) రాధ 32; పెర్రీ (సి) సబ్–సజన (బి) దీప్తిశర్మ 32; ఆష్లే గార్డ్నెర్ (సి) రాధ (బి) పూజ 6; లిచ్‌ఫీల్డ్ నాటౌట్ 15; అనాబెల్ (బి) శ్రేయాంక 10; సోఫీ రనౌట్ 0; మేగన్ షట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–17, 2–17, 3–79, 4–92, 5–101, 6–134, 7–145, 8–145. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–24–2, శ్రేయాంక 4–0–32–1, పూజ వస్త్రకర్ 3–0–22–1, అరుంధతీ రెడ్డి 3–0–24–0, దీప్తిశర్మ 4–0–28–2, రాధా యాదవ్ 2–0–14–1. భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) అనాబెల్ (బి) ఆష్లే గార్డ్నర్ 20; స్మృతి మంధాన (ఎల్బీడబ్ల్యూ) (బి) సోఫి 6; జెమీమా (సి) గార్డ్నర్ (బి) మేగన్ షటల్ 16; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 54; దీప్తిశర్మ (సి) జార్జియా (బి) సోఫీ 29; రిచా ఘోష్ రనౌట్ 1; పూజ (బి) అనాబెల్ 9; అరుంధతి రనౌట్ 0; శ్రేయాంక రనౌట్ 0; రాధ (ఎల్బీడబ్ల్యూ) (బి) అనాబెల్ 0; రేణుక నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–26, 2–39, 3–47, 4–110, 5–111, 6–139, 7–139, 8–141, 9–141. బౌలింగ్: మేగన్ షట్ 4–0–25–1, ఆష్లే గార్డ్నర్ 4–0–32–1, అనాబెల్ 4–0–22–2, సోఫి మోలినెక్స్ 4–0–32–2, జార్జియా 3–0–22–0, డార్సిబ్రౌన్ 1–0–8–0. -
భారత్‌తో టెస్టు సిరీస్.. ఆసీస్ కెప్టెన్ కీలక నిర్ణయం!
ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది ఓసారి జరిగే ఈ సిరిస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.యాషెస్ సిరీస్ తర్వాత ఆత్యధిక ఫాలోయింగ్ ఉండే సిరీస్ ఇదే. ఈసారి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 1991-92లో ఆసీస్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగింది. గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు ఈసారి భారత్‌పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది.కమ్మిన్స్ కీలక నిర్ణయం..ఈ క్రమంలో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని కమ్మిన్స్ ఎనిమిది వారాల పాటు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.తొలుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమయ్యేందుకు దేశీవాళీ క్రికెట్లో కమ్మిన్స్ ఆడనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతుండడంతో దేశీవాళీ టోర్నీకు దూరంగా ఉండాలని కమ్మిన్స్ భావిస్తున్నాడు."దాదాపుగా 18 నెలల (ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్) నుంచి కంటిన్యూగా బౌలింగ్ చేస్తున్నాను. బాగా ఆలిసిపోయాను. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏడు నుంచి ఎనిమిది వారాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. తద్వారా నా శరీరానికి పూర్తి విశ్రాంతి లభిస్తుంది. అయితే జిమ్‌లో మాత్రం నా సాధనను నేను కొనసాగిస్తాను. ఇప్పటివరకు నా కెరీర్లో గెలవని ట్రోఫీ ఎదైనా ఉందంటే అది బీజీటీనే. నేనే కాదు జట్టులో చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ ట్రోఫీని ముద్దాడలేదని" ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు
అమితాబ్ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్ చూడకండి సార్’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు. న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్ చూద్దామా.. ‘జులాయి’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం పబ్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్‌ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్ కొట్టాడు. సెంటిమెంట్‌గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్. మనవాళ్ల సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి. 1970ల నుంచి క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్‌లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని. నేను ఆ తర్వాత మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్ పడింది. అందుకని మ్యాచ్ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్ హరీ’... ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్ టెలికాస్ట్‌లు మొదలయ్యాయి. ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్‌లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్‌గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’... అయితే ప్రతి గ్రూప్‌లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్ అయినా క్రికెట్ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్ చూడ్డానికి ఎగ్జయిట్ అవుతుంటే ఇండియా ఢమాల్ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్‌లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ. అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్ సీట్లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్. అక్కడే కూచునేవాణ్ణి. బార్వాళ్లు కూడా నా సీట్ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్లో మందైపోతే వికెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్ నిషా అభిమాని. అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. టెస్ట్ మేచ్‌ల రోజుల్లో బాగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్ చేయకుండా మేచ్ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్ తెలిపాడు. ‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్ శ్రీశాంత్ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్ చెప్పాడు. సునీల్ గవాస్కర్‌కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్ ఇచ్చి సున్నాకు ఔట్ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌కు చేతిలో ఉన్న బ్యాట్‌ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్ హ్యాండిల్‌ని తిప్పడం కనిపిస్తుంది. మొహిందర్ అమర్నాథ్ ఎర్ర కర్చీఫ్‌ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్‌కు ముందు ఎడమ కాలు ప్యాడ్ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్ ఖాన్ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్ అశ్విన్ అయితే ఒకే బ్యాగ్‌ను అన్ని మ్యాచ్‌లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్. ఇక అజారుద్దీన్ తావీజ్ లేకుండా మ్యాచ్ ఆడడు. 1987 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మీద కపిల్ దేవ్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఇండియన్ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్ రూమ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్ దేవ్ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్ మేనేజర్ మాన్ సింగ్ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ను పాస్‌కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్‌కు తాను మేచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. మరోవైపు ఫైనల్స్‌కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్ కప్ పోటీల్లో హోస్ట్ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్. మరోవైపు 2019 వరల్డ్ కప్ సమయంలో చంద్రయాన్–2 ఫెయిల్ అయ్యింది. ఇండియా కప్ కోల్పోయింది. 2023లో చంద్రయాన్ –3 సక్సెస్ అయ్యింది. అంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామని ఒక సెంటిమెంట్. కాని ఆట ఎప్పుడూ టీమ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈసారి భారత్ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం. -
ICC World Cup 2023: అంతిమ సమరం కోసం...
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడేందుకు భారత క్రికెట్ జట్టు గురువారం అహ్మదాబాద్ నగరానికి చేరుకుంది. విమానాశ్రయంలో భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడుతుంది. ఫైనల్ వేదికపై ఎయిర్ షో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎయిర్ షో నిర్వహించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు, లక్ష మంది ప్రేక్షకులు విచ్చేసే మ్యాచ్ వేదికపై ఐఏఎఫ్‌కు చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎయిర్ షోతో మ్యాచ్‌కు ముందే కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ను నేడు, రేపు స్టేడియంపై చేస్తారని గుజరాత్‌కు చెందిన డిఫెన్స్ ప్రొ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వైమానిక విన్యాసాలతో అలరించడం సూర్యకిరణ్ టీమ్‌కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఎయిర్ షోలు ఈ జట్టే చేస్తుంది. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు నింగిలో తమ వైమానిక విన్యాసంతో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేస్తాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. వికెట్ కీపర్‌గా భరత్! కిషన్‌కు నోఛాన్స్
జూన్ 7 నుంచి లండన్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా ఈ పోరులో తలపడుతున్నాయి. ఇక ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచులో గెలిచి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవాలని రెండు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే లండన్‌కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఎంపిక చేశాడు. తన ఎంపిక చేసిన జట్టుతో ఆడితే భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందని గవాస్కర్ థీమా వ్యక్తం చేశాడు. అందరూ ఊహించిన విధంగానే గవాస్కర్ తన జట్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటిచ్చాడు. లిటిల్‌మాస్టర్ ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చాడు. అదే విధంగా పుజారా మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, అజింక్య రహానె ఐదో స్థానంలో బ్యాటింగ్ వస్తే బాగుంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్‌గా కిషన్‌ను కాదని భరత్ వైపే సన్నీ మొగ్గుచూపాడు. భరత్‌కు ఆరో స్ధానంలో చోటు ఇచ్చాడు. ఇక స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌కు అతడు అవకాశమిచ్చాడు. చివరగా ఫాస్ట్ బౌలర్ల విభాగంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్లకు గవాస్కర్ ఛాన్స్ ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సునీల్ గవాస్కర్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం -
పోటీలో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే!
మెకాయ్: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సి స్థితిలో మిథాలీ రాజ్ సారథ్యంలోని టీమిండియా నేడు జరిగే రెండో వన్డే (డే–నైట్)లో బరిలోకి దిగనుంది. చేతి బొటన వేలి గాయంతో రెండో వన్డేకు కూడా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరమైంది. కొంతకాలంగా టీమ్ బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ మిథాలీ రాజ్ మాత్రమే మోస్తోంది. ఇకనైనా ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన తమ పేలవ ఫామ్‌కు ఫుల్స్టాప్ పెట్టి పరుగులు సాధించాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో మరోసారి జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్‌లు కీలకం కానున్నారు. 2018 నుంచి వన్డేల్లో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ అంచనాలకు మించి ఆడాల్సి ఉంది. కాగా తొలి వన్డేలో ఆసీస్ 9 వికెట్ల తేడాతో మిథాలీ సేనపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup 2021: అలా జరిగితే అఫ్గాన్ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్ -
Australia Tour: టీమిండియా వుమెన్స్‌లో కొత్తగా ముగ్గురికి చోటు
న్యూఢిల్లీ: త్వరలో ఆ్రస్టేలియా పర్యటనకు వెళ్లే మహిళల జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు మీడియం పేసర్ మేఘనా సింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యస్తిక భాటియా ఎంపిక కాగా...టి20ల్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రేణుకా సింగ్‌కు తొలి అవకాశం దక్కింది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన అరుంధతీ రెడ్డిని టెస్టు, వన్డే జట్టునుంచి తప్పించి టి20ల్లో మాత్రం కొనసాగించారు. మిథాలీరాజ్ సారథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టు ఏకైక (డే అండ్ నైట్) టెస్టు, 3 వన్డేలు, 3 టి20లు ఆడుతుంది. చదవండి: Finn Allen: వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత క్రికెటర్‌కు కరోనా పాజిటివ్ -
మన బంతి మెరిసింది
ఎరుపు అయితేనేమి, అది గులాబీ అయితేనేమి... బంతి రంగు మారిందే తప్ప భారత బౌలింగ్ పదునులో మాత్రం ఎలాంటి తేడా లేదు... గత కొన్నేళ్లుగా జట్టు చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మన బౌలర్లు మరోసారి తమ సత్తా చాటుతూ ప్రత్యర్థిని పడగొట్టారు. భారీ స్కోరు సాధించలేకపోయిన టీమిండియా బాధను తీరుస్తూ ఆ్రస్టేలియాను వారి సొంత మైదానంలోనే కుప్పకూల్చి సిరీస్‌లో శుభారంభానికి బాటలు వేశారు. ముందుగా బుమ్రా వేట మొదలు పెట్టగా, అశ్విన్ మాయకు ఆసీస్ మిడిలార్డర్ వద్ద జవాబు లేకపోయింది. వికెట్ పడగొట్టకపోయినా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి పడేసిన షమీ, కీలక సమయంలో వికెట్లు తీసిన ఉమేశ్ రెండో రోజు భారత్ హీరోలుగా నిలిచారు. కొంత అదృష్టం కలిసి రావడంతోపాటు కెపె్టన్ పైన్ పోరాడటంతో కంగారూలు చివరకు కాస్త మెరుగైన స్థితిలో ముగించగలిగారు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 53 పరుగుల కీలక ఆధిక్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మూడో రోజు కోహ్లి సేన భారీ స్కోరుగా మలచగలిగితే ఇదే అడిలైడ్‌లో రెండేళ్ల క్రితంనాటి ఫలితాన్ని పునరావృతం చేయడం మన జట్టుకు కష్టం కాకపోవచ్చు. అడిలైడ్: తొలి టెస్టులో బౌలర్ల ప్రదర్శన భారత్‌ను ఆధిక్యంలో నిలబెట్టింది. మన బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన ఆ్రస్టేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ టిమ్ పైన్ (99 బంతుల్లో 73 నాటౌట్; 10 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, మార్నస్ లబ్‌షేన్ (119 బంతుల్లో 47; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అశ్విన్ 4 వికెట్లతో చెలరేగగా... ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... పృథ్వీ షా (4) వికెట్ చేజార్చుకొని 9 పరుగులు చేసింది. మయాంక్ (5 బ్యాటింగ్)... బుమ్రా (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 233/6తో ఆట కొనసాగించిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు జట్టు మరో 11 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. ఫలితంగా 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ లభించింది. 4.1 ఓవర్లలోనే... రెండో రోజు మరిన్ని పరుగులు జోడించి స్కోరును కనీసం 300 వరకు చేర్చాలనుకున్న భారత్ కోరిక నెరవేరలేదు. 4.1 ఓవర్ల వ్యవధిలోనే జట్టు మిగిలిన 4 వికెట్లూ కోల్పోయింది. అశ్విన్ (15), సాహా (9) తమ ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగును కూడా జోడించలేకపోయారు. ఆ వెంటనే ఉమేశ్ (6), షమీ (0) కూడా అవుట్ కావడంతో భారత్ కథ ముగిసింది. మొత్తంగా కోహ్లి రనౌట్ నుంచి చూస్తే 56 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ తడబాటు... ఆ్రస్టేలియా కూడా తమ తొలి ఇన్నింగ్స్‌ను అతి జాగ్రత్తగా ప్రారంభించింది. ఒక్క పరుగు రాకపోయినా... పింక్ బంతిని ఎదుర్కొని క్రీజ్‌లో నిలిస్తే చాలనే ధోరణితో ఓపెనర్లు ఆడారు. 150 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల కెరీర్లో ఒక్కసారి కూడా ఓపెనింగ్ చేయని మాథ్యూ వేడ్ (51 బంతుల్లో 8), పేలవ ఫామ్‌లో ఉన్నా మరో ప్రత్యామ్నాయం లేక అవకాశం దక్కించుకున్న జో బర్న్స్ (41 బంతుల్లో 8) తమ వికెట్ కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. తొలి నాలుగు ఓవర్లు మెయిడిన్లుగా ముగిసిన తర్వాత ఐదో ఓవర్ నాలుగో బంతికి తొలి పరుగు రాగా... 14 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 16 మాత్రమే! అయితే ఎక్కువ సేపు ఈ ఒత్తిడిని అధిగమించలేకపోయిన వీరిద్దరు బుమ్రా వరుస ఓవర్లలో వికెట్ల ముందు దొరికిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్‌కు ప్రాణంలాంటి ఇద్దరు బ్యాట్స్‌మెన్ లబ్õÙన్, స్టీవ్ స్మిత్ (29 బంతుల్లో 1)లపై జట్టును ఆదుకోవాల్సిన భారం పడింది. అయితే వీరిద్దరు కూడా వికెట్ మీద నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పరుగులు రావడం గగనంగా మారింది. ముఖ్యంగా క్రీజ్‌లో ఉన్నంత సేపు స్మిత్ బాగా ఇబ్బంది పడటం ఆశ్చర్యం కలిగించింది. అశ్విన్ సూపర్... ఆసీస్ గడ్డపై రికార్డు బాగా లేకపోయినా అనుభవజు్ఞడనే కారణంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ అశ్విన్ తన సత్తా ప్రదర్శించాడు. మిడిలార్డర్‌ను కూల్చిన అతని స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతని తొలి ఓవర్లోనే నేరుగా వచ్చిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన స్మిత్ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. అశ్విన్ సంబరాలు ఈ వికెట్ విలువేమిటో చూపించాయి. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ (7) అశ్విన్‌కే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా... అశ్విన్ బౌలింగ్‌లోనే కోహ్లికి క్యాచ్ ఇచ్చి అరంగేట్రం ఆటగాడు గ్రీన్ (11) నిష్క్రమించాడు. ఆ తర్వాత ఉమేశ్ వంతు వచి్చంది. అతని బౌలింగ్‌లో తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడలేక లబ్‌షేన్ ఎల్బీడబ్ల్యూ కాగా, అదే ఓవర్లో కమిన్స్ (0) కూడా అవుటయ్యాడు. ఆదుకున్న కెప్టెన్... ఆ్రస్టేలియా స్కోరు 111/7 చూస్తే భారత్‌కు వందకు పైగా ఆధిక్యం ఖాయమనిపించింది. అయితే కెపె్టన్ పైన్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో తన జట్టును కొంత వరకు కాపాడగలిగాడు. పరిస్థితిని గమనించి ఎదురుదాడికి దిగిన అతను చక్కటి బౌండరీలతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 68 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. సహచరులు స్టార్క్ (15), లయన్ (10), హాజల్‌వుడ్ (8) భారీగా పరుగులు చేయకపోయినా కెపె్టన్‌గా అండగా నిలిచారు. ఫలితంగా కెప్టెన్ భాగస్వామ్యంలో ఆ్రస్టేలియా చివరి మూడు వికెట్లకు 80 పరుగులు జోడించడం విశేషం. చివరకు ఉమేశ్ బౌలింగ్‌లో పుజారా గాల్లోకి ఎగిరి పట్టిన చక్కటి క్యాచ్‌కు హాజల్‌వుడ్ అవుట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. క్యాచ్‌లు నేలపాలు... మైదానంలో భారత జట్టు పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన తొలి టెస్టులోనూ కొనసాగించింది. రెండో రోజు మూడు సునాయాస క్యాచ్‌లు మన ఆటగాళ్లు జారవిడిచారు. వీటిని అందుకొని ఉంటే ఆసీస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. షమీ బౌలింగ్‌లో లబ్‌షేన్ (అతని స్కోరు 16) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద తప్పుడు అంచనాతో పరుగెత్తుతూ పట్టబోయి బుమ్రా వదిలేశాడు. ఆ తర్వాత రెండు సార్లు బుమ్రా బౌలింగ్‌లోనే లబ్‌షేన్ (స్కోరు 21) క్యాచ్‌ను స్క్వేర్‌లెగ్‌లో పృథ్వీ షా... పైన్ (స్కోరు 26) ఇచ్చిన క్యాచ్‌ను స్క్వేర్‌లెగ్‌లో మయాంక్ పట్టలేకపోయారు. వీటికి తోడు చివర్లో స్టార్క్ (స్కోరు 12) కష్టసాధ్యమైన క్యాచ్‌ను వెనక్కి వెళుతూ పట్టే ప్రయత్నంలో సాహా విఫలమయ్యాడు. అయితే దీని ప్రభావం పెద్దగా పడలేదు. తొలి సెషన్; ఓవర్లు: 4.1, పరుగులు: 11, వికెట్లు: 4 (భారత్) ఓవర్లు: 19, పరుగులు: 35, వికెట్లు: 2 (ఆసీస్) రెండో సెషన్ ఓవర్లు: 29, పరుగులు: 57, వికెట్లు: 3 (ఆసీస్) మూడో సెషన్ ఓవర్లు: 24.1, పరుగులు: 99, వికెట్లు: 5 (ఆసీస్) ఓవర్లు: 6, పరుగులు: 9, వికెట్లు: 1 (భారత్) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 8, బర్న్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 8, లబ్‌షేన్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 47, స్మిత్ (సి) రహానే (బి) అశ్విన్ 1, హెడ్ (సి అండ్ బి) అశ్విన్ 7, గ్రీన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 11, పైన్ (నాటౌట్) 73, కమిన్స్ (సి) రహానే (బి) ఉమేశ్ 0, స్టార్క్ (రనౌట్) 15, లయన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 10, హాజల్‌వుడ్ (సి) పుజారా (బి) ఉమేశ్ 8, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (72.1 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–16, 2–29, 3–45, 4–65, 5–79, 6–111, 7–111, 8–139, 9–167, 10–191. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 16.1–5–40–3, జస్ప్రీత్ బుమ్రా 21–7–52–2, మొహమ్మద్ షమీ 17–4–41–0, అశ్విన్ 18–3–55–4. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) కమిన్స్ 4, మయాంక్ (బ్యాటింగ్) 5, బుమ్రా (బ్యాటింగ్) 0, మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టానికి) 9. వికెట్ల పతనం: 1–7. బౌలింగ్: స్టార్క్ 3–1–3–0, కమిన్స్ 3–2–6–1. -
టీమిండియాకు మరో షాక్
సిడ్నీ : ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో ఓటమి పాలైన టీమిండియాకు మరో షాక్ తగిలింది. సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో భారత జట్టు నిర్ధిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తెలిపాడు. ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్కర్, గెరార్డ్ అబూద్ స్లో ఓవర్ రేట్ విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో భారత జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ రిఫరీ జరిమానా విధించాడు. ఐసీసీ నిబంధనలో భాగంగా ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఆసీస్ టూర్లో విరాట్ కోహ్లి సేనకు జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇంతకముందు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. (చదవండి : త్యాగి బౌన్సర్.. ఆసీస్‌కే ఎందుకిలా?) కాగా మూడో టీ20లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మన్లలో మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్ రాణించారు. అనంతరం 187 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయగలిగింది. కాగా ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి డే నైట్ టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి జరగనుంది. (చదవండి : వైరల్ : తండ్రిపై స్టోక్స్ ఉద్వేగభరిత పోస్ట్) -
వారెవ్వా శామ్సన్.. వాట్ ఏ ఫీల్డింగ్
సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో సంజూ శామ్సన్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 13వ ఓవర్లో మాథ్యూ వేడ్ భారీ షాట్ ఆడాడు. దాన్ని అందరూ సిక్స్‌గానే భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద అప్పటికే కాచుకు కూర్చున్న శామ్సన్ దాదాపు అందుకున్నంత ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బౌండరీ లైన్‌ను దాటేయడంతో బంతిని నెట్టేశాడు. దీంతో సిక్స్ రావాల్సిన చోట కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఒకవేళ శామ్సన్ ఈ క్యాచ్ పట్టి ఉంటే మాత్రం అద్బుత క్యాచ్‌గా మిగిలిపోయేది. ఇప్పటివరకు ఆసీస్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ 73 పరుగులు, మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
ఆసీస్‌కు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఏంచుకుంది. కాగా మూడు వన్డేల సిరీస్‌ను 2- 1 తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి టీ 20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వశం చేసుకోవాలని భావిస్తోంది. కాగా ఆసీస్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో గెలుపు ద్వారా ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా తొలి టి 20లో ప్రతాపం చూపింది. కోహ్లి సేన ఆఖరిదాకా లాక్కెళ్లకుండా రెండో మ్యాచ్‌లోనే పొట్టి సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండో టి20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్ విజయాల జోరులో ఉంటే... ఆస్ట్రేలియాను గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే డేవిడ్ వార్నర్ టీ20 సిరీస్‌కు దూరం కాగా, అరోన్ ఫించ్ సైతం రెండో టీ20కి దూరమయ్యాడు. గాయం కారణంగా ఫించ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో ఆసీస్ కెప్టెన్‌గా మాథ్యూ వేడ్ వ్యవహరిస్తున్నాడు. దాంతో పాటు హజల్‌వుడ్, స్టార్క్‌లు కూడా రెండో టీ20కి అందుబాటులో లేరు. ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం కావడం ఆసీస్‌ను కలవర పరుస్తోంది. వీరి ముగ్గురు స్థానాల్లో సామ్స్, స్టోయినిస్, అండ్రూ టైలు తుది జట్టులోకి వచ్చారు. ఇక టీమిండియా విషయానికొస్తే గాయపడ్డ జడేజా స్థానంలో చహల్ తుది జట్టులోకి రాగా, మనీష్ పాండే స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకున్నారు. కాగా ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో అతని స్థానంలో మాథ్యూ వేడ్ నాయకత్వం వహించనుండగా.. స్టార్క్ స్థానంలో డేనియల్ సామ్స్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు : భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, చహల్ ఆస్ట్రేలియా: డార్సీ షార్ట్, వేడ్(కెప్టెన్), స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, అబాట్, స్వెప్సన్, జంపా, స్టోయినిస్, అండ్రూ టై,డేనియల్ సామ్స్ -
కోహ్లికి మాత్రం రూల్స్ వర్తించవా?
ఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీరుపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు చేశాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లి జట్టులో పలు మార్పులు చేశాడు. ఈ మార్పులపై కోహ్లిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఫామ్‌లో ఉన్న బుమ్రాతో పాటు శ్రేయాస్ అయ్యర్, స్నిన్నర్ చహల్‌లను కాదని మనీష్ పాండే, సంజూ శాంసన్, దీపక్ చాహర్‌లను తుది జట్టులోకి తీసుకున్నాడు. ఏ కారణంతో శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేశాడో కోహ్లి చెప్పాలని సెహ్వాగ్ ప్రశ్నించాడు. కాగా నిన్న జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన మనీశ్ పాండే 2 పరుగులకే ఔటవ్వగా.. సంజు శాంసన్ 23 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. సోనీ టీవికి ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్ ఈ వాఖ్యలు చేశాడు. 'నిజానికి బుమ్రా వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా చివరి వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. అలాంటి బుమ్రాను కోహ్లి ఎందుకు పక్కనపెట్టాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ తాను చివరిగా ఆడిన టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత నెం.4 బ్యాట్స్‌మెన్ గురించి చాలా చర్చ జరిగింది. దాంతో.. ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి అవకాశమివ్వగా అతను వన్డే, టీ20ల్లో నిలకడగా రాణించి ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకొనే పనిలో ఉన్నాడు. (చదవండి : 'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు') కానీ తాజాగా తొలి టీ20లో అయ్యర్‌పై వేటు పడడం వెనుక కోహ్లి అంతర్యం ఏమిటో అర్థం కాలేదు. నన్నెందుకు తీశావు అని కోహ్లిని అడిగే ధైర్యం అయ్యర్‌కు ఉండదు.. ఎందుకంటే కోహ్లి టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోహ్లి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. టీమిండియాలో ఉన్న ఆటగాళ్లందరికి రూల్స్ అందరికీ వర్తిస్తాయి.. ఒక్క విరాట్ కోహ్లీకి తప్ప. ఎందుకు అతని విషయంలో మాత్రం నిబంధనల్ని పట్టించుకోరు. అతనికి నచ్చినట్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తాడు.. ఆటగాళ్లపై వేటు వేస్తాడు.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశాలిస్తుంటాడు. ఇలా చేయడం తప్పు. కోహ్లి తన పద్దతిని మార్చుకుంటే మంచిది' అని సెహ్వాగ్ సూచించాడు. (చదవండి : నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా) -
'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు'
ఢిల్లీ : ఆసీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన యజ్వేంద్ర చహల్ మూడు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. టీమిండియా గెలిచినదానికంటే కాంకషన్ పద్దతిలో ఆటగాడిని తీసుకొచ్చి గెలిచిదంటూ ఆసీస్ జట్టు ఆరోపణలు చేసింది. అయితే టీమిండియా తీసుకున్న కాంకషన్ నిర్ణయం కరెక్టేనా అన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్’ రైటా... రాంగా!) 'టీమిండియా కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌పై తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. బ్యాటింగ్ సమయంలో స్టార్క్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే నొప్పి వస్తుందని చెప్పలేం.. గాయం నొప్పి తెలియడానికి గంట పట్టొచ్చు.. ఒక్కసారి 24 గంటలు కావొచ్చు. ఆ సమయంలో జడేజాకు నొప్పి తెలియలేదు.. ఫిజియో రాకపోయినా బ్యాటింగ్ చేశాడు. కానీ ఇన్నింగ్స్ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే హెల్మట్ తీసిన జడేజాకు నొప్పి తెలిసినట్లుంది. అందుకే ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో అతను ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్ సమయంలో ఎవరైనా ఆటగాడు గాయపడితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద వేరొక ఆటగాడిని బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కు అనుమతించొచ్చని ఐసీసీ నిబంధనల్లో ఉంది. దానినే టీమిండియా ఆచరించింది. జడేజా స్థానంలో చహల్‌ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఆడించింది. చహల్ మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు కాబట్టి ఇప్పుడు కాంకషన్ పదం ఆసీస్‌కు వివాదంలా కనిపిస్తుంది. అదే ఒకవేళ టీమిండియా ఓడిపోయుంటే ఆసీస్ ఇలానే వివాదం చేసేదా.. అయినా కాంకషన్ నిర్ణయంపై ఆసీస్‌కు మాట్లాడే అర్హత లేదు, ఎందుకంటే కాంకషన్‌ను మొదట ఉపయోగించిదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఇదే ఆసీస్ గాయపడిన స్మిత్ స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఆడించింది. ఆ మ్యాచ్‌లో లబుషేన్ రాణించడమే గాక జట్టును గెలిపించాడు.నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా తలకు చాలాసార్లు గాయాలు అయ్యాయి.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ మా రోజుల్లో ఇలాంటి రూల్స్ లేకపోవడంతో 10 మందితోనే ఆటను కొనసాగించేవారు. అయినా మ్యాచ్ రిఫరీ బూన్ తన విచక్షణాధికారంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కాంకషన్‌పై ఆసీస్ ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్) -
టీమిండియాకు ఓదార్పు విజయం
-
టీమిండియాకు ఓదార్పు విజయం
కాన్బెర్రా : ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు ఓదార్పు విజయం దక్కింది. 303 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటింగ్‌లో ఆరోన్ ఫించ్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 59 పరగులతో రాణించాడు. ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీలు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ధాటిగా ఆడిన మ్యాక్స్‌వెల్ అర్థసెంచరీ సాధించడంతో ఆసీస్ మళ్లీ గెలుపు దిశగా పయనించింది. (చదవండి : క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ అసంతృప్తి) అయితే 38 పరుగులు చేసిన క్యారీ రనౌట్‌గా వెనుదిరిగినా.. మ్యాక్స్‌వెల్ ఉండడంతో ఆసీస్ గెలుపుపై ధీమాతో ఉంది. కానీ జట్టు స్కోరు 268 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది. ఆ తర్వాత కాసేపటికే 28 పరుగులు చేసిన ఆస్టన్ అగర్ అవుట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇక బౌలింగ్‌లో శార్ధూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, తొలి మ్యాచ్ ఆడిన నటరాజన్ 2 వికెట్లు, బుమ్రా, జడేజా, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా 92 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జడేజా 66, కోహ్లి 63 పరుగులతో రాణించారు. పాండ్యా, జడేజాలు కలిసి ఆరో వికెట్‌కు 150 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం టీమిండియా ఇన్నింగ్స్‌లో హైలెట్‌గా నిలిచింది. కాగా ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడిన భారత్ సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 డిసెండర్ 4 శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనుంది. (చదవండి : 21 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు) -
ఆ రికార్డుకు 23 పరుగుల దూరంలో కోహ్లి
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బౌలర్ల వైఫల్యంతో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించేసింది. బ్యాట్స్‌మన్ సమిష్టి ఆటతీరు బాగానే ఉన్నా.. బౌలింగ్ కూర్పు సమస్యగా మారింది. యార్కర్ల కింగ్ నటరాజన్‌కు అవకాశం ఇవ్వకుండా సైనీని ఆడించడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. కేవలం బౌలర్ల వైఫల్యం కారణాలే టీమిండియా సిరీస్ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. (చదవండి : ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం) ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో వన్డేలో మరో 23 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలుస్తాడు. ఈ క్రమంలో కోహ్లి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్‌కు ఈ ఘనతను అందుకోవడానికి 309 మ్యాచ్‌ల్లో 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. కానీ కోహ్లి ఆ 23 పరుగులు చేస్తే 242వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు. ఇక మొత్తంగా చూసుకుంటే వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన వారిలో కోహ్లి ఆరో ప్లేయర్‌గా నిలవనున్నాడు. ఇంతకు ముందు సచిన్‌తోపాటు రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేల జయవర్దనె కూడా వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన జాబితాలో ఉన్నారు. అంతేగాక కోహ్లి ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా సచిన్ (9 సెంచరీలు) సరసన నిలవనున్నాడు. -
రెండో వన్డేలో భారత్ ఓటమి
-
తొలి వన్డేలో టీమిండియా ఓటమి
-
తొలి వన్డే: భారత్ ముందు భారీ టార్గెట్
సిడ్నీ : క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా మైదానంలోకి అడుగుపెట్టింది. కరోనా తెచ్చిన విరామం తర్వాత కోహ్లి సేన తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు రంగంలోకి దిగింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేడు ప్రారంభమైంది. సిడ్నీ మైదానం వేదికగా భారత్-ఆసీస్ మధ్య తొలి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. తొలి వన్డే అప్డేట్స్ : తొలి వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. భారత్ బౌలర్లను ఉచకోత కోత్తూ ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ బౌండరీల మోత మోగించారు. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్ల ధాటికి సిడ్నీలో పరుగుల వరద పారింది. కెప్టెన్ ఫించ్ సెంచరీ (114)తో చెలరేగగా.. స్మిత్ 66 బంతుల్లో 105 మెరుపులు మెరిపించాడు. వార్నర్ 69, మ్యాక్స్‌వెల్ 45 పరుగులతో రాణించారు. భారత్ ముందు 375 పరులు భారీ లక్ష్యాన్ని ఉంచారు. తొలి వన్డేలో భారీ స్కోర్ దిశగా ఆసీస్ ఇన్సింగ్స్ కొనసాగుతోంది. బ్యాటింగ్ పిచ్‌పై కంగారూ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓపెనర్ ఫించ్ అద్భుతమైన శతకం (114 ఔట్) చెలరేగగా.. స్మిత్ (73 బ్యాటింగ్) ధాటిగా ఆడుతున్నాడు. 42 ఓవర్లు ముగిసే లోపు ఆసీస్ మూడు కోల్పోయి 293 పరుగుల చేసింది. ప్రస్తుతం స్మిత్, మ్యాక్స్‌వెల్ (17) క్రిజ్‌లో ఉన్నారు. 39 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 252 పరుగుల చేసింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ భారీ శతకం బాదాడు. 119 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. మరోవైపు స్మిత్ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని ప్రస్తుతం 63 పరుగులు సాధించాడు. 156 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 69 (76 బంతుల్లో) ఔట్ అయ్యాడు. షమీ బౌలింగ్ కిపర్ క్యాచ్ ద్వారా వార్నర్ వికెట్ సమర్పించుకున్నాడు.. ఓ వికెట్ నష్టానికి 28 ఓవర్లలో ఆసీస్ 156 పరుగులు చేసింది. క్రిజ్‌లో ఫించ్‌తో పాటు స్మిత్ ఉన్నాడు. 24 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 131 పరుగుల చేసింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ దూసుకుడుగా ఆడుతూ.. ఆఫ్‌సెంచరీ సాధించారు. ఫించ్ 62 బంతుల్లో 56 పరుగులు చేయగా.. వార్నర్ 70 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. ఇద్దరు ఆటగాళ్లు బౌండరీలు కొడుతూ మరింత దూకుడు పెంచారు. తొలి వన్డేలో ఆసీస్ ఓపెనర్లు జోరుమీద ఆడుతున్నారు. భారత బౌలర్లను ధాటికి ఎదుర్కుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు 16 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 82 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ 59 బంతుల్లో 40 పరుగులు చేయగా.. వార్నర్ 41 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. ఫించ్ దూకుడుగా ఆడుతూ బౌండరీలు సాధిస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ నిబంధనల నడుమ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఐపీఎల్లో రాణించి భారత ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో చోటుదక్కింది. మయాంక్ అగర్వాల్‌తో పాటు పేసర్ నవదీప్ సైనీ సైతం తుది జట్టులో చోటుదక్కించుకున్నారు. ధావన్‌తో కలిసి మయాంక్ ఇన్సింగ్స్‌ను ప్రారంభినున్నాడు. 1992 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలిన (రెట్రో) డ్రెస్‌లతోనే బరిలోకి దిగటం ఆకర్షణీయాంశం. సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కాగా ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించి.. భుజాలకు నలుపు రంగు బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. భారత జట్టు : శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, వీరాట్ కోహ్లీ (కెప్టెన్) శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, హర్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ, నవదీప్ శైనీ, యజ్వేంద్ర చహల్, బూమ్రా ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్ పించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, లబ్‌షేన్, మాక్స్వెల్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, స్టార్క్, ఆడం జంసా, హెజల్‌వుడ్ -
289 రోజుల తర్వాత...
భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. టీమిండియా ఎప్పుడెప్పుడా మైదానంలోకి దిగుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నేటినుంచి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను ఆస్వాదించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఐపీఎల్ కావాల్సినంత వినోదం పంచినా... జాతీయ జట్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఉండే లెక్కే వేరు... కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం తల్లడిల్లిపోవడంతో ఆగిపోయిన భారత జట్టు ఆట ఇప్పుడు ఆసీస్ గడ్డపై మళ్లీ మొదలు కానుంది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్ ఆడిన అనంతరం సుమారు తొమ్మిదిన్నర నెలల తర్వాత టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ కోసం మళ్లీ మైదానంలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా జట్టును వారి వేదికపైనే వన్డేలో ‘ఢీ’కొడుతోంది. అన్నింటికి మించి కోవిడ్–19 తర్వాత తొలిసారి ఈ మ్యాచ్‌తోనే మైదానంలోకి ప్రేక్షకులను అనుమతిస్తుండటం విశేషం. సిడ్నీ: కరోనా వైరస్ తెచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి సేన తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. రాబోయే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ, వచ్చే రెండేళ్లలో జరిగే రెండు టి20 ప్రపంచ కప్‌ల నేపథ్యంలో వన్డే పోరుకు ప్రాధాన్యత తక్కువగా కనిపిస్తున్నా... రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగే పోరు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే. కొత్తగా మొదలైన ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో ఈ సిరీస్ కూడా భాగం. సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేడియంలోకి 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. మరోవైపు 1992 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలిన (రెట్రో) డ్రెస్‌లతోనే బరిలోకి దిగుతుండటం ఆకర్షణీయాంశం. మయాంక్‌కు అవకాశం భారత జట్టు ఆడిన ఆఖరి వన్డే తుది జట్టును చూస్తే రెండు మార్పులు ఖాయమయ్యాయి. వన్డేల్లో చోటు కోల్పోయిన పృథ్వీ షా స్థానంలో సీనియర్ శిఖర్ ధావన్ ఓపెనర్‌గా రానున్నాడు. అతనికి జోడీగా మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగుతాడు. మరో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉన్నా... మయాంక్ దూకుడైన శైలి అతనికి అవకాశం కల్పించవచ్చు. తర్వాతి స్థానాల్లో కోహ్లి, అయ్యర్లు భారత బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉండగా... ఐదో స్థానంలో రాహుల్ ఖాయం. కాబట్టి వికెట్ కీపర్‌గా కూడా అతనే బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఆరో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే బదులుగా హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్లో ఒక్క బంతి కూడా బౌలింగ్ చేయని పాండ్యాను ఆల్‌రౌండర్‌గా ఆడించాలా లేక పాండేను కొనసాగించాలా అనే విషయంలో టీమ్ మేనేజ్మెంట్కు ఇంకా స్పష్టత రాలేదు. పైగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత హార్దిక్ ఇప్పటి వరకు మరో వన్డే మ్యాచ్ ఆడలేదు. పేసర్లుగా బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో పేసర్ స్థానం కోసం శార్దుల్, సైనీ మధ్య పోటీ ఉంది. భారత జట్టు తాము ఆడిన చివరి వన్డే సిరీస్‌లో (న్యూజిలాండ్ చేతిలో) 0–3తో ఓటమి పాలైంది. ఐపీఎల్లో ఆడినా... చాలా రోజుల తర్వాత ఆడుతున్న వన్డే ఫార్మాట్‌కు అనుగుణంగా మారి మన ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారనేది ఆసక్తికరం. స్మిత్ పునరాగమనం సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఎప్పుడైనా బలమైన జట్టే. ఇప్పుడు మళ్లీ కంగారూలు సమష్టిగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్ కంటే ముందు ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై ఆస్ట్రేలియా 2–1తో ఓడించి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. టెస్టుల్లో ‘కన్కషన్’కు గురైన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఆ మూడు వన్డేల్లోనూ ఆడలేదు. అతను ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో ఘోరంగా విఫలమైనా జాతీయ జట్టు తరఫున మ్యాక్స్‌వెల్ ఆటను తక్కువగా అంచనా వేయలేం. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కూడా అతను రెండు అద్భుత ఇన్నింగ్స్‌లు (59 బంతుల్లో 77 – 90 బంతుల్లో 108) ఆడాడు. కాబట్టి ఏడో స్థానంలో వచ్చే మ్యాక్స్‌వెల్ వరకు ఆసీస్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. వార్నర్, కొత్త కెరటం లబ్‌షేన్‌లతో పాటు ఐపీఎల్లో అదరగొట్టిన స్టొయినిస్ జట్టు బలం. పేస్ త్రయం స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌లను ఎదుర్కోవడం భారత జట్టుకు అంత సులువు కాదు. అయితే గత పర్యటనలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల్లోనూ భారత్ నెగ్గడం విశేషం. ‘ముగిసిన సాఫ్ట్ క్వారంటైన్’ సిడ్నీలో భారత క్రికెటర్లకు కాస్త ఊరట లభించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ ముగియడంతో గురువారం జట్టు సభ్యులంతా మరో హోటల్లోకి మారారు. ‘సాఫ్ట్ క్వారంటైన్’ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా మైదానంలో కలిసి ప్రాక్టీస్ చేయడం మినహా హోటల్లో కూడా మరొకరిని కలవరాదు. ఎవరి గదుల్లో వారు ఒంటరి పక్షుల్లా ఉండాల్సిందే. ఇప్పుడు వీరికి కొన్ని సడలింపులు లభిస్తాయి. కొత్త హోటల్లో కూడా బయో సెక్యూర్ బబుల్‌లోనే ఉన్నా సహచర క్రికెటర్లతో కలిసి మాట్లాడుకునేందుకు, కలిసి భోజనం చేసేందుకు అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, మయాంక్, అయ్యర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, బుమ్రా, శార్దుల్/సైనీ, చహల్. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, స్టొయినిస్, క్యారీ, మ్యాక్స్‌వెల్, కమిన్స్, స్టార్క్, జంపా, హాజల్‌వుడ్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. గత 7 వన్డేల్లో 6 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు. సిడ్నీ మైదానంలో భారత జట్టు ఆస్ట్రేలియాపై 2 మ్యాచ్‌లు గెలిచి 14 ఓడింది. ఇక్కడ ఆడిన 5 మ్యాచ్‌లలో కలిపి కోహ్లి మొత్తం 36 పరుగులే చేశాడు. ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించడంతో పాటు భుజాలకు నలుపు రంగు బ్యాండ్లు ధరించి బరిలోకి దిగుతారు. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేం భావిస్తున్నాం. ఆస్ట్రేలియాలాంటి చోట ఆడాలని వారెంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తమ సత్తా చాటేందుకు, స్థాయిని పెంచుకునేందుకు వారికి ఇది సరైన వేదిక. బుమ్రా, షమీలకు తగినంత విశ్రాంతి ఇవ్వాలనేది టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన. వారి స్థానాల్లో కుర్రాళ్లు ఆడతారు. ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయం. అయితే వారిని ఓడించేందుకు మాకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రేరణా అవసరం లేదు. మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. టూర్లో శుభారంభం చేస్తే మంచిదే కానీ అదే సర్వస్వం కాదు. ప్రతీ మ్యాచ్ మాకు కీలకమే. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
‘ఏంటిది కోహ్లి.. ధోనిలా ఆలోచించలేవా?!’
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేమీ కాదని, అయితే అదే సమయంలో జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలంటూ హితవు పలుకుతున్నారు. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తండ్రి చనిపోయినప్పటికీ ఒంటి చేత్తో జట్టును గెలిపించిన గొప్ప ఆటగాడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందంటున్నారు. కోహ్లి వంటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అందుబాటులో లేకుంటే ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఓటమి తప్పదంటూ జోస్యం చెబుతున్నారు. కాగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నట్లు బీసీసీఐ వెల్లడించిన విషయం విదితమే. కోహ్లి సతీమణి, నటి అనుష్క శర్మ డెలివరీ తేదీ జనవరిలో ఉండటంతో, ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు అతడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అతడి అభ్యర్థనను మన్నించిన బీసీసీఐ పెటర్నటీ లీవ్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనితో పోలిక తెచ్చిన నెటిజన్లు, కోహ్లి వ్యవహారశైలిని విమర్శిస్తున్నారు. దేశం తరఫున ఆడటం కంటే వ్యక్తిగత విషయాలకే కోహ్లి ప్రాధాన్యం ఇస్తున్నాడని, కానీ ధోని మాత్రం జీవా(ధోని కూతురు) జన్మించిన సమయంలో భార్యాపిల్లలను వదిలి జట్టును ముందుకు నడిపించడంపై దృష్టి సారించాడని పేర్కొంటున్నారు. కాగా 2015 ప్రపంచకప్ టోర్నీ జరుగుతున్న సమయంలో ధోని సతీమణి సాక్షి జీవాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్ వార్మప్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు(ఫిబ్రవరి 6న) జీవా జన్మించింది. ఆ సమయంలో.. ఇండియాలో ఉండకపోవడం వల్లే మీరు మీ తొలి సంతానానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలకు దూరమవుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అదేం లేదు. ప్రస్తుతం నేను దేశం తరఫున జాతీయ జట్టును ముందుకు నడిపించే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను. వేరే విషయాల గురించి అంతగా ఆలోచించడం లేదు. ప్రపంచకప్ ఆడటం చాలా ముఖ్యం’’ అంటూ సమాధానమిచ్చాడు. (చదవండి: టెస్టు జట్టులోకి రోహిత్ శర్మ ఎంపిక) ఇక కోహ్లి సెలవు తీసుకున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న నెటిజన్లు.. ‘‘ తన తండ్రి చనిపోయినపుడు కూడా జట్టును గెలిపించేందుకు బాధను పంటిబిగువన భరించిన కోహ్లి, ఇప్పుడు మాత్రం ఎందుకో అలా ఆలోచించలేకపోతున్నాడు. అతడి నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. ధోని మాత్రం ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. జీవాను చూసేందుకు ఇండియాకు రాలేదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ హర్షా బోగ్లే.. ‘‘బాగుంది.. ఇదొక పెద్ద వార్తే. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు తర్వాత, తన బిడ్డను చూసుకునేందుకు కోహ్లి ఇండియాకు వస్తున్నాడు. మోడర్న్ ప్లేయర్‌కి ప్రొఫెషన్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ముఖ్యమే. అయితే కోహ్లి లేకుంటే జట్టు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’అని ట్వీట్ చేశాడు. అయితే కోహ్లి అభిమానులు మాత్రం అతడి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కాబోయే తల్లిదండ్రులకు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నారు. మూడు టెస్టులకు దూరం రెండు నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలుత మూడు వన్డే మ్యాచ్‌లు (నవంబర్ 27, 29, డిసెంబర్ 2) ఆడుతుంది. అనంతరం మూడు టి20 మ్యాచ్‌ల్లో (డిసెంబర్ 4, 6, 8) బరిలోకి దిగుతుంది. అనంతరం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్ 17 నుంచి 21 వరకు డే–నైట్‌గా జరుగుతుంది. ఈ మ్యాచ్ ముగిశాకే కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు. మెల్బోర్న్లో జరిగే రెండో టెస్టు (26 నుంచి 30) సహా సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు కోహ్లి దూరమవుతాడు. Well, well...this is huge news. Kohli to return after the 1st test in Australia to be there for the birth of his child. For the modern player, there is more to life than just his profession. But for the Indian team, the tour just got tougher. — Harsha Bhogle (@bhogleharsha) November 9, 2020 kabhi bolta hain country comes first aur kabhi imp tour chorke chaley jaate hai. Dad k guzar jane k baad Kohli scored 90 odd runs the next day... & mny such players did the same. I remember Dhoni nvr took a leave when Ziva ws born. — Santy (@Bungomacha) November 9, 2020 Just heard Kohli won't take part in 3 of 4 test matches against the aussies due to 'Paternity leave'. We will play without our best test batsman. Then we had dhoni who didn't come back to India during the 2015 wc when ziva was born. Priorities matter. #INDvAUS #INDvsAUS — Varun Garg 🇮🇳 (@IamV_Garg) November 9, 2020 -
‘తుఫాన్ ఇన్నింగ్స్’ చూపించాడు
-
‘తుఫాన్ ఇన్నింగ్స్’ చూపించాడు
ముంబై : క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు అభిమానులకు గుర్తుండిపోతాయనడంలో సందేహం అవసరం లేదు. మరీ అలాంటి మ్యాచ్‌లో తమ ఆరాధ్య క్రికెటర్ చెలరేగి ఆడాడంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయని చెప్పొచ్చు. అలాంటి ఇన్నింగ్స్నే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరిగ్గా 22ఏళ్ల క్రితం(ఏప్రిల్ 22, 1998లో) షార్జా కప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చూపించాడు. ఇప్పటివరకు సచిన్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ మ్యాచ్‌లో సచిన్ 131 బంతుల్లో 143 పరగులు చేశాడు. ఇన్నింగ్స్‌లో మొత్తం 9ఫోర్లు ,4 సిక్సర్లు ఉన్నాయి. ('బ్రెట్ లీ బ్యాటింగ్ అంటే భయపడేవాడు') సాధారణంగా చూస్తే ఇది మాములుగానే కనిపిస్తుంది కానీ.. జట్టును ఫైనల్ చేర్చాలన్న తపన సచిన్ ఇన్నింగ్స్‌లో స్ఫష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా ఫైనల్‌కు చేరుకుంది. అదెలాగో తెలుసుకోవాలంటే మళ్లీ ఒకసారి ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకోవాల్సిందే. 1998 ఏప్రిల్ నెలలో కోకకోలా కప్‌ను దుబాయ్ వేదికగా షార్జాలో నిర్వహించారు. ఈ సిరీస్‌లో భారత్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా పాల్గొనగా, మ్యాచ్‌లన్నీ డే అండ్ నైట్ పద్దతిలోనే జరిగాయి. ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఏంచుకొంది. ఆసీస్ ఆటగాడు మైఖేల్ బెవాన్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కాకుండా ఇండియా ఫైనల్‌కు చేరుకోవాలంటే 46ఓవర్లలో 254 పరుగులు చేయాలి.. అయితే ఇసుకతుఫానుతో మ్యాచ్‌కు 25 నిమిషాల పాటు అంతరాయం కలగడంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 276కు కుదించారు.ఆటకు అంతరాయం కలగడంతో 46 ఓవర్లలో 237 పరుగులు చేస్తే టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక్కడే సచిన్ టెండూల్కర్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు షేన్ వార్న్, డామియన్ ప్లెమింగ్, మైఖెల్ కాస్ప్రోవిచ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 131 బంతులెదుర్కొన్న సచిన్ 9 ఫోర్లు , 4 సిక్స్‌ల సాయంతో 143 పరుగులు చేసి జట్టు స్కోరు 242 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఒకదశలో సచిన్ బ్యాటింగ్ ముందు లక్ష్యం చాలా చిన్నదిగా అనిపించింది. అయితే సచిన్ ఓటయ్యాక ఒత్తిడికి తలొగ్గిన భారత్ 46 ఓవర్లలో 250 పరుగులు చేసింది.(' స్వీట్హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం') అయితే ఫైనల్‌కు చేరుకోవాలంటే చేయాల్సిన పరుగులు అప్పటికే పూర్తి చేయడంతో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ మరోసారి సెంచరీతో మెరవడంతో భారత జట్టు కోకకోలా కప్‌ను ఎగరేసుకపోయింది. ప్లేయర్ ఆఫ్ ది సరీస్గా సచిన్ నిలవడం విశేషం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సచిన్ వల్ల తనకు నిద్రలేని రాత్రులు గడిచాయని ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ ఈ సిరీస్ తర్వాత పేర్కొన్నాడు. -
'ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు'
ముంబై : 2008 ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందానని భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అప్పటి జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం తాను పోటీలోనే ఉన్నానని తెలిపాడు. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న తనను జట్టులోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్‌తో మంగళవారం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పార్థివ్ మాట్లాడాడు. ('అక్రమ్ అలా చేసుంటే అప్పుడే చంపేవాడిని') 'సరైన సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడం చాలా ముఖ్యం. 2008 ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఎంపిక చేసే సమయంలో మొదటి వికెట్ కీపర్‌గా ధోనీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో నేను రెండో వికెట్ కీపర్ స్థానానికి పోటీలో నిలిచా. అయితే ఆ సమయంలో ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. అప్పటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. నాకు కాల్ చేసి.. నువ్వు మంచి ప్రదర్శన చేస్తున్నావు.. ఇలాగే కొనసాగించు అన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం నిన్ను ఎంపిక చేయడం లేదని పేర్కొన్నారని ' పార్థివ్ తెలిపాడు. 2008లో ఆసీస్ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. అయితే ఈ సిరీస్ మొత్తం వివాదాల నడుమే కొనసాగింది. సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో హర్బజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం క్రికెట్ ప్రేమికులెవరు అంత తొందరగా మరిచిపోలేరు. 2002లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన పార్థివ్ పటేల్ తన కెరీర్లో 25 టెస్టులు, 38 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పిన్నవయస్కుడిగా (17ఏండ్ల 153రోజులు) వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు పాకిస్తాన్ వికెట్ కీపర్ హనీఫ్ మహ్మద్(17 ఏళ్ల 300 రోజులు) పేరిట ఉండేది. ('నా తమ్ముడు అప్పుడు.. ఇప్పుడు ఏం మారలేదు') -
కలవరపాటుకు గురైన డేవిడ్ వార్నర్..!
ముంబై : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ గాలిపటం ఆటకు అంతరాయం కలిగించింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 50 వ ఓవర్ మొదలవుతుందనగా గాలిపటం మైదానంలో పడింది. స్పైడర్కెమెరాకు చిక్కుకుంది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ దానిని చూసి కాస్త కలవరపాటుకు గురయ్యాడు. గాలిపటాన్ని తొలగించేందుకు సంశయించాడు. దాంతో క్రీజులో ఉన్న జస్ప్రీత్ బుమ్రా గాలిపటం దారాన్ని తెంచి కెమెరా నుంచి తీసేశాడు. ఈక్రమంలో అది ఏ పేద పిల్లాడి గాలిపటమోనని, దానిని చించొద్దని బుమ్రాతో అన్నాడట. ఇదే విషయాన్ని పోస్ట్ మ్యాచ్ మీడియా సమావేశం అనంతరం వార్నర్ చెప్పాడు. (చదవండి : బుమ్రా బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం : వార్నర్) ‘గాలి పటాల పండుగ జరుగుతోందని విన్నాను. చాలా వింతగా అనిపించింది. స్పైడర్క్యామ్లో చిక్కుకున్న గాలిపటాన్ని చూసి కంగారు పడ్డా. అది ప్రమాదకరమైందేమోనని భావించా. క్రీజులో ఉన్న బుమ్రా వెంటనే దారాన్ని తెంచి తొలగించాడు. అయితే, బుమ్రా దానిని తొలగిస్తున్న సమయంలో.. అది ఏ పేద పిల్లాడి గాలిపటం కావొచ్చునని.. చించొద్దని చెప్పా. ఈ ఘటన కొత్తగా అనిపించింది’అని వార్నర్ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘరో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్‌కాగా.. వికెట్ నష్టపోకుండా ఆసిస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయారు. (చదవండి : పది వికెట్ల పరాభవం)