ఉమేశ్‌కు సహచరుల అభినందన
ఎరుపు అయితేనేమి, అది గులాబీ అయితేనేమి... బంతి రంగు మారిందే తప్ప భారత బౌలింగ్ పదునులో మాత్రం ఎలాంటి తేడా లేదు... గత కొన్నేళ్లుగా జట్టు చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మన బౌలర్లు మరోసారి తమ సత్తా చాటుతూ ప్రత్యర్థిని పడగొట్టారు. భారీ స్కోరు సాధించలేకపోయిన టీమిండియా బాధను తీరుస్తూ ఆ్రస్టేలియాను వారి సొంత మైదానంలోనే కుప్పకూల్చి సిరీస్‌లో శుభారంభానికి బాటలు వేశారు. ముందుగా బుమ్రా వేట మొదలు పెట్టగా, అశ్విన్ మాయకు ఆసీస్ మిడిలార్డర్ వద్ద జవాబు లేకపోయింది. వికెట్ పడగొట్టకపోయినా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి పడేసిన షమీ, కీలక సమయంలో వికెట్లు తీసిన ఉమేశ్ రెండో రోజు భారత్ హీరోలుగా నిలిచారు. కొంత అదృష్టం కలిసి రావడంతోపాటు కెపె్టన్ పైన్ పోరాడటంతో కంగారూలు చివరకు కాస్త మెరుగైన స్థితిలో ముగించగలిగారు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 53 పరుగుల కీలక ఆధిక్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మూడో రోజు కోహ్లి సేన భారీ స్కోరుగా మలచగలిగితే ఇదే అడిలైడ్‌లో రెండేళ్ల క్రితంనాటి ఫలితాన్ని పునరావృతం చేయడం మన జట్టుకు కష్టం కాకపోవచ్చు.
అడిలైడ్: తొలి టెస్టులో బౌలర్ల ప్రదర్శన భారత్‌ను ఆధిక్యంలో నిలబెట్టింది. మన బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన ఆ్రస్టేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ టిమ్ పైన్ (99 బంతుల్లో 73 నాటౌట్; 10 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, మార్నస్ లబ్‌షేన్ (119 బంతుల్లో 47; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అశ్విన్ 4 వికెట్లతో చెలరేగగా... ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... పృథ్వీ షా (4) వికెట్ చేజార్చుకొని 9 పరుగులు చేసింది. మయాంక్ (5 బ్యాటింగ్)... బుమ్రా (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 233/6తో ఆట కొనసాగించిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు జట్టు మరో 11 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. ఫలితంగా 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ లభించింది.
4.1 ఓవర్లలోనే...
రెండో రోజు మరిన్ని పరుగులు జోడించి స్కోరును కనీసం 300 వరకు చేర్చాలనుకున్న భారత్ కోరిక నెరవేరలేదు. 4.1 ఓవర్ల వ్యవధిలోనే జట్టు మిగిలిన 4 వికెట్లూ కోల్పోయింది. అశ్విన్ (15), సాహా (9) తమ ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగును కూడా జోడించలేకపోయారు. ఆ వెంటనే ఉమేశ్ (6), షమీ (0) కూడా అవుట్ కావడంతో భారత్ కథ ముగిసింది. మొత్తంగా కోహ్లి రనౌట్ నుంచి చూస్తే 56 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది.
బ్యాట్స్‌మెన్ తడబాటు...
ఆ్రస్టేలియా కూడా తమ తొలి ఇన్నింగ్స్‌ను అతి జాగ్రత్తగా ప్రారంభించింది. ఒక్క పరుగు రాకపోయినా... పింక్ బంతిని ఎదుర్కొని క్రీజ్‌లో నిలిస్తే చాలనే ధోరణితో ఓపెనర్లు ఆడారు. 150 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల కెరీర్‌లో ఒక్కసారి కూడా ఓపెనింగ్ చేయని మాథ్యూ వేడ్ (51 బంతుల్లో 8), పేలవ ఫామ్‌లో ఉన్నా మరో ప్రత్యామ్నాయం లేక అవకాశం దక్కించుకున్న జో బర్న్స్ (41 బంతుల్లో 8) తమ వికెట్ కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. తొలి నాలుగు ఓవర్లు మెయిడిన్లుగా ముగిసిన తర్వాత ఐదో ఓవర్ నాలుగో బంతికి తొలి పరుగు రాగా... 14 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 16 మాత్రమే! అయితే ఎక్కువ సేపు ఈ ఒత్తిడిని అధిగమించలేకపోయిన వీరిద్దరు బుమ్రా వరుస ఓవర్లలో వికెట్ల ముందు దొరికిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్‌కు ప్రాణంలాంటి ఇద్దరు బ్యాట్స్‌మెన్ లబ్õÙన్, స్టీవ్ స్మిత్ (29 బంతుల్లో 1)లపై జట్టును ఆదుకోవాల్సిన భారం పడింది. అయితే వీరిద్దరు కూడా వికెట్ మీద నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పరుగులు రావడం గగనంగా మారింది. ముఖ్యంగా క్రీజ్‌లో ఉన్నంత సేపు స్మిత్ బాగా ఇబ్బంది పడటం ఆశ్చర్యం కలిగించింది.
అశ్విన్ సూపర్...
ఆసీస్ గడ్డపై రికార్డు బాగా లేకపోయినా అనుభవజు్ఞడనే కారణంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ అశ్విన్ తన సత్తా ప్రదర్శించాడు. మిడిలార్డర్‌ను కూల్చిన అతని స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతని తొలి ఓవర్లోనే నేరుగా వచ్చిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన స్మిత్ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. అశ్విన్ సంబరాలు ఈ వికెట్ విలువేమిటో చూపించాయి. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ (7) అశ్విన్‌కే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా... అశ్విన్ బౌలింగ్‌లోనే కోహ్లికి క్యాచ్ ఇచ్చి అరంగేట్రం ఆటగాడు గ్రీన్ (11) నిష్క్రమించాడు. ఆ తర్వాత ఉమేశ్ వంతు వచి్చంది. అతని బౌలింగ్‌లో తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడలేక లబ్‌షేన్ ఎల్బీడబ్ల్యూ కాగా, అదే ఓవర్లో కమిన్స్ (0) కూడా అవుటయ్యాడు.
ఆదుకున్న కెప్టెన్...
ఆ్రస్టేలియా స్కోరు 111/7 చూస్తే భారత్‌కు వందకు పైగా ఆధిక్యం ఖాయమనిపించింది. అయితే కెపె్టన్ పైన్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో తన జట్టును కొంత వరకు కాపాడగలిగాడు. పరిస్థితిని గమనించి ఎదురుదాడికి దిగిన అతను చక్కటి బౌండరీలతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 68 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. సహచరులు స్టార్క్ (15), లయన్ (10), హాజల్‌వుడ్ (8) భారీగా పరుగులు చేయకపోయినా కెపె్టన్‌గా అండగా నిలిచారు. ఫలితంగా కెప్టెన్ భాగస్వామ్యంలో ఆ్రస్టేలియా చివరి మూడు వికెట్లకు 80 పరుగులు జోడించడం విశేషం. చివరకు ఉమేశ్ బౌలింగ్‌లో పుజారా గాల్లోకి ఎగిరి పట్టిన చక్కటి క్యాచ్‌కు హాజల్‌వుడ్ అవుట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
క్యాచ్‌లు నేలపాలు...
మైదానంలో భారత జట్టు పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన తొలి టెస్టులోనూ కొనసాగించింది. రెండో రోజు మూడు సునాయాస క్యాచ్‌లు మన ఆటగాళ్లు జారవిడిచారు. వీటిని అందుకొని ఉంటే ఆసీస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. షమీ బౌలింగ్‌లో లబ్షేన్ (అతని స్కోరు 16) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద తప్పుడు అంచనాతో పరుగెత్తుతూ పట్టబోయి బుమ్రా వదిలేశాడు. ఆ తర్వాత రెండు సార్లు బుమ్రా బౌలింగ్‌లోనే లబ్షేన్ (స్కోరు 21) క్యాచ్‌ను స్క్వేర్‌లెగ్‌లో పృథ్వీ షా... పైన్ (స్కోరు 26) ఇచ్చిన క్యాచ్‌ను స్క్వేర్‌లెగ్‌లో మయాంక్ పట్టలేకపోయారు. వీటికి తోడు చివర్లో స్టార్క్ (స్కోరు 12) కష్టసాధ్యమైన క్యాచ్‌ను వెనక్కి వెళుతూ పట్టే ప్రయత్నంలో సాహా విఫలమయ్యాడు. అయితే దీని ప్రభావం పెద్దగా పడలేదు.
తొలి సెషన్; ఓవర్లు: 4.1, పరుగులు: 11, వికెట్లు: 4 (భారత్)
ఓవర్లు: 19, పరుగులు: 35, వికెట్లు: 2 (ఆసీస్)
రెండో సెషన్ ఓవర్లు: 29, పరుగులు: 57, వికెట్లు: 3 (ఆసీస్)
మూడో సెషన్ ఓవర్లు: 24.1, పరుగులు: 99, వికెట్లు: 5 (ఆసీస్)
ఓవర్లు: 6, పరుగులు: 9, వికెట్లు: 1 (భారత్)
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 8, బర్న్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 8, లబ్‌షేన్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 47, స్మిత్ (సి) రహానే (బి) అశ్విన్ 1, హెడ్ (సి అండ్ బి) అశ్విన్ 7, గ్రీన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 11, పైన్ (నాటౌట్) 73, కమిన్స్ (సి) రహానే (బి) ఉమేశ్ 0, స్టార్క్ (రనౌట్) 15, లయన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 10, హాజల్‌వుడ్ (సి) పుజారా (బి) ఉమేశ్ 8, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (72.1 ఓవర్లలో ఆలౌట్) 191.
వికెట్ల పతనం: 1–16, 2–29, 3–45, 4–65, 5–79, 6–111, 7–111, 8–139, 9–167, 10–191. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 16.1–5–40–3, జస్‌ప్రీత్ బుమ్రా 21–7–52–2, మొహమ్మద్ షమీ 17–4–41–0, అశ్విన్ 18–3–55–4.
భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) కమిన్స్ 4, మయాంక్ (బ్యాటింగ్) 5, బుమ్రా (బ్యాటింగ్) 0, మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టానికి) 9. వికెట్ల పతనం: 1–7. బౌలింగ్: స్టార్క్ 3–1–3–0, కమిన్స్ 3–2–6–1.
Comments
Please login to add a commentAdd a comment