Australia Cricket Team
-
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కంగారులు ఊదిపడేశారు. కేవలం 9.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఆసీస్ చేధించింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెడ్.. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.దక్షిణాఫ్రికా వరల్డ్ రికార్డు బద్దలు..ఇక ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి ఏకంగా 113 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టు ఆసీస్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది.గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో సఫారీలు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ ఆల్‌టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. -
ఒక్క అడుగు... ఒకే ఒక్క అడుగు!
అవును. 2023 ప్రపంచ వన్డే క్రికెట్ కప్‌కూ, భారత క్రికెట్ జట్టుకూ మధ్య మిగిలిన దూరం ఇక ఒకే ఒక్క అడుగు. 2011లో ఆఖరుసారిగా కప్ గెలిచిన తర్వాత మళ్ళీ పన్నెండేళ్ళకు తొలిసారిగా భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడం అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపుతోంది. లక్ష్యం చాలా చేరువగా కనిపిస్తుండడంతో అందరిలో ఆశలు రేపుతోంది. బుధవారం ముంబయ్‌లోని వాంఖెడే స్టేడియమ్లో భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక దశ వరకు పోటాపోటీగా సాగిన తొలి సెమీ ఫైనల్లో మన జట్టు విజయం సాధించిన తీరు మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో అప్రతిహతంగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ఆదివారంఅహ్మదాబాద్‌లో మరొక్కసారి చేసే ఫైనల్ ఇంద్రజాలానికై అందరూ ఎదురుచూస్తున్నారు. 2011లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచి చూస్తే గడచిన 2015, 2019 టోర్నీల్లో కన్నా ఈసారే భారత జట్టు విజయావకాశాలు మెరుగ్గా, అధికంగా ఉన్నాయని మొదటి నుంచి క్రికెట్ పండితుల మాట. నిరుడు టీ–20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నుంచి అవమానకరమైన రీతిలో వెనుదిరిగిన జట్టు ఏడాది తిరిగేసరికల్లా ఇంత బలమైన జట్టుగా రూపొందడం ఒక రకంగా అనూహ్యమే. ఆ ఘోర ఓటమి తర్వాత జట్టును పటిష్ఠంగా తీర్చిదిద్దడం వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుదల, కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి, ఆటగాళ్ళ నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. మునుపటి రెండు కప్‌ల కన్నా ఈసారి భారత జట్టు మరింత స్థిరంగా, నిలకడగా కనిపిస్తోంది. ఆటగాళ్ళందరూ కలసి కట్టుగా సాగుతూ, వ్యక్తులుగా కన్నా ఒక జట్టుగా ప్రతిభా ప్రదర్శన చేయడం కలిసొస్తోంది. జట్టు సారథిగా రోహిత్ శర్మ ఆ విషయంలో అందరికీ ఆదర్శమయ్యాడు. ఈ టోర్నీలో కనీసం 3 సందర్భాల్లో వ్యక్తిగత మైలురాళ్ళకు దగ్గర ఉన్నా, దాని కన్నా జట్టు ప్రయోజనాల కోసం వేగంగా పరుగులు చేయడం మీదే దృష్టి పెట్టి, ఆ క్రమంలో ఔటవడమే అందుకు ఉదాహరణ. ఓపెనర్‌గా పరుగుల వరదతో ప్రత్యర్థి బౌలర్ల మానసిక స్థైర్యాన్ని చిత్తు చేసి, భారీ ఇన్నింగ్స్‌కు ఆయన పునాది వేస్తూ వస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శతకాలేమీ సాధించకపోయి ఉండవచ్చు. 124.15 స్ట్రైకింగ్ రేట్‌తో 550 పరుగులు చేసి, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నిలవడం విశేషం. సాధారణంగా వ్యక్తిగత విజయాలు, ప్రతిష్ఠను ఆశించే, ఆరాధించే చోట ఇది అసాధారణం. జట్టులో ఎవరి పాత్ర వారికి నిర్దిష్టంగా నిర్వచించడంలోనూ తెలివైన వ్యూహం, లక్ష్యంపై గురి కనిపిస్తున్నాయి. బుధవారం నాటి సెమీస్ అందుకు మంచి ఉదాహరణ. ఓపెనర్లు వేసిన పునాదిని పటిష్ఠం చేయడంలో కోహ్లీ, శరవేగంతో పరుగుల వరద పారించడంలో శ్రేయాస్ అయ్యర్, కొనసాగింపుగా రాహుల్, బౌలింగ్‌లో ప్రత్యర్థుల భాగస్వామ్యాన్ని ఛేదించడానికి పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌ల త్రయం, స్పిన్నర్లుగా కుల్దీప్, జడేజాలు సమర్థంగా పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండడం విశేషం. శుభ్‌మన్ గిల్ లాంటి వారి పాత్ర తక్కువేమీ కాదు. బ్యాటింగ్‌లో కోహ్లీ, శ్రేయాస్‌లు వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతు న్నారు. సెమీస్‌లోనే వన్డేల్లో శతకాల అర్ధ సెంచరీ పూర్తి చేసి, బ్యాట్స్మన్ల కింగ్ కోహ్లీ అయ్యాడు. ఆరాధ్య దైవమైన సచిన్ చూస్తుండగా, అతని రికార్డును అధిగమిస్తూ ఈ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈసారి భారత బౌలర్ల అమోఘ ప్రతిభా ప్రదర్శన మళ్ళీ 1983 నాటి కపిల్ డెవిల్స్‌ను తలపిస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో మొదటి 4 మ్యాచ్‌ల తర్వాత ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన పేస్‌బౌలర్ షమీ ఇప్పటికే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టి, వికెట్ల వేటగాడిగా నిలిచాడు. వికెట్లలో అర్ధశతకం పూర్తిచేశాడు. ప్రపంచ కప్ చరిత్రలో మరి ఏ ఇతర భారతీయ ఆటగాడికీ లేని రీతిలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, నంబర్ 1గా నిలిచాడు. లయ తప్పకుండా, పిచ్ మీద వికెట్ల గురి తప్పకుండా, పరుగు వేగం తగ్గకుండా ప్రత్యర్థులపై పులిలా విరుచుకుపడుతున్న షమి ఈ భారత జట్టు అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం. ఈ 19న జరిగే ఫైనల్లో షమీ ఇలాగే విజృంభిస్తే మనం కప్పు కొట్టడం కష్టమేమీ కాదు. గురువారం నాటి రెండో సెమీఫైనల్లో ఎప్పటిలానే సెమీస్ శాపం తప్పించుకోలేక సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో తడబడింది. ఈ టోర్నీలో మొదట తడబడినా తర్వాత నిలబడిన ఆస్ట్రేలియా ఆఖరికి తక్కువ పరుగుల లక్ష్యాన్ని సైతం శ్రమించి, గెలిచింది. ఓడితేనేం పోరాటస్ఫూర్తిలో సౌతాఫ్రికా జనం మనసు గెలిచింది. అయిదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ప్రయోగం చేస్తున్న భారత్, అయిదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన బలమైన ఆసీస్‌తో మహాయుద్ధానికి సమస్త శక్తియుక్తులూ కేంద్రీకరించాలి. అయితే, ఇప్పటికే భారత టాప్ 5 బ్యాట్స్మన్లు 65.8 సగటుతో 2570 పరుగులు సాధించారు. 2007 నాటి ఆసీస్ జట్టు బ్యాట్స్మన్ల సగటు కన్నా ఇది ఎక్కువ. అలాగే ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆసీస్ ఆటను గమనిస్తే ఆ జట్టు మరీ అజేయమైనదేం కాదనీ అర్థమవుతుంది. అందుకే, వరల్డ్ కప్ వేదికపై 1983లో అనామకంగా వెళ్ళి అద్భుతం చేసిన∙కపిల్ సేన, 2011లో ఒత్తిడిని తట్టుకొని అంచనాలందుకున్న ధోనీ అండ్ కో తర్వాత ముచ్చటగా మూడోసారి ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ టీమ్ ఆ ఘనత సాధిస్తే ఆశ్చర్యం లేదు. పుష్కరకాలం నిరీక్షణ ఫలిస్తే శతకోటి భారతీయులకు అంతకన్నా ఆనందమూ లేదు. అనూహ్య ఘటనలు జరిగితే తప్ప ఆతిథ్య దేశమైన మనమే ఈ ఆదివారం ఐసీసీ వరల్డ్ కప్ అందుకోవచ్చు. ఎందుకంటే– ప్రతిసారి కన్నా భిన్నంగా ఈసారి మనది వట్టి ఆశ, అభిమానుల ప్రార్థన కాదు... అంతకు మించిన ప్రతిభా ప్రదర్శన, ఆత్మవిశ్వాస ప్రకటన! -
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డచ్తో మ్యాచ్‌లో ఆసీస్ తమ జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్‌రౌండర్ స్టోయినిష్ స్ధానంలో కామెరూన్ గ్రీన్ తుది జట్టులోకి వచ్చాడు. నెదర్లాండ్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా చదవండి: World Cup 2023: అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. పాకిస్తాన్ కెప్టెన్‌పై వేటు! -
స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు భారీ షాక్
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులు ఆసీస్ నెగ్గితే.. మూడు, ఐదో టెస్టు ఇంగ్లండ్ నెగ్గింది. ఇక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఐదోటెస్టు గెలిచిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పట్టికలో పాయింట్ల పరంగా ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచింది. ఇరుజట్లు ఐదు టెస్టుల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో నిలిచాయి. ఈ లెక్కన ఇరుజట్లు 26 పాయింట్లు(43.33 పర్సంటేజీ పాయింట్స్)తో పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్‌కు ఈ మురిపెం ఒక్కరోజుకే పరిమితమైంది. తాజాగా బుధవారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ఐసీసీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదుటెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు ఇరుజట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లలోనూ భారీ కోత పడింది. ఆస్ట్రేలియా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. టెస్టుల్లో ఒకరోజుకు ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లు వేయాల్సి ఉంటుంది(ఇరుజట్లు లేదా ఒకే జట్టు). అయితే ఆసీస్ నాలుగో టెస్టులో నిర్ణీత సమయంలోగా 10 ఓవర్లు తక్కువగా వేసినందుకు గానూ ఒక్క షార్ట్ ఓవర్ కింద ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఓవర్‌కు 5శాతం చొప్పున జరిమానాతో పాటు ఒక డబ్ల్యూటీసీ పాయింట్ కోత విధిస్తారు. ఈ లెక్కన ఆసీస్ 10 ఓవర్లు చొప్పున 10 డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోయింది. ఇక మ్యాచ్‌లో ఆటగాళ్లకు 50శాతం జరిమానా విధించారు. ఇక ఇంగ్లండ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. యాషెస్‌లో జరిగిన ఐదు టెస్టుల్లో ఏకంగా నాలుగు టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ఇంగ్లండ్‌కు గట్టి దెబ్బపడింది. తొలి టెస్టుల్లో రెండు ఓవర్లు, రెండో టెస్టులో తొమ్మిది ఓవర్లు, నాలుగో టెస్టులో మూడు ఓవర్లు, ఇక చివరి టెస్టులో ఐదు ఓవర్లు.. మొత్తంగా 19 ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ఒక ఓవర్ చొప్పున ఇంగ్లండ్‌కు 19 ఓవర్లకు 19 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడ్డాయి. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ జరిమానా పడింది. తొలి టెస్టులో 10 శాతం, రెండో టెస్టులో 45 శాతం, నాలుగో టెస్టులో 15శాతం, చివరి టెస్టులో 25శాతం జరిమానా విధించారు. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే డబ్ల్యూటీసీ పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకోవడం విశేషం. 19 పాయింట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ప్రస్తుతం 13 పాయింట్లు(15 పర్సంటేజీ పాయింట్స్)తో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక 10 పాయింట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 30 పర్సంటేజీ పాయింట్స్‌తో మూడో స్థానంలో ఉన్నప్పటికి భారీగా పాయింట్లు కోల్పోవడం ఆ జట్టుకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక టీమిండియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఓటమి పాలైన విండీస్ 16.67 పర్సంటేజీ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. The latest points table of WTC 2023-25: 1. Pakistan - 100% 2. India - 66.67% 3. Australia - 30% 4. West Indies - 16.67% 5. England - 15% pic.twitter.com/gaoojRbIUi — CricketMAN2 (@ImTanujSingh) August 2, 2023 🚨 Points Deduction 🚨 Due to slow over-rates during the Ashes series, England lost 19 points and Australia lost 10 points in the WTC points table. 🏴🇦🇺#WTC #Ashes #ENGvAUS pic.twitter.com/wdFXbSgDhu — Sportskeeda (@Sportskeeda) August 2, 2023 చదవండి: R Ashwin: 'టీమిండియా బజ్‌బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి' -
ఆస్ట్రేలియా చరిత్ర.. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా
డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 444 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీసం డ్రాకు కూడా ప్రయత్నించకుండానే 234 పరుగులకు ఆలౌట్ అయింది తొలి సెషన్‌లోపే ఆసీస్ బౌలర్ల ధాటికి తోక ముడిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గిల్ క్యాచ్ విషయంలో చేసిన పొరపాటు మినహా మిగతా అన్ని విషయాల్లో పక్కా ప్లాన్‌తో ఆడిన ఆస్ట్రేలియా పరిపూర్ణ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే, టి20 వరల్డ్‌కప్స్‌తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలు నెగ్గిన ఆస్ట్రేలియా తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. తాజా డబ్ల్యూటీసీ టైటిల్‌తో కలిసి ఇప్పటివరకు ఆసీస్ తొమ్మిది ఐసీసీ టైటిల్స్ నెగ్గడం విశేషం. అందులో వన్డే వరల్డ్‌కప్‌ను ఐదుసార్లు(1987, 1999, 2003, 2007, 2015), ఒక టి20 వరల్డ్‌కప్(2021), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండుసార్లు (2006, 2009)లో గెలుచుకున్న ఆస్ట్రేలియా తాజాగా 2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గి ఐసీసీ అన్ని మేజర్ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ✅ICC ODI World Cup ✅ICC Champions Trophy ✅ICC T20 World Cup ✅ICC World Test Championship Australia becomes the first team to win all ICC trophies 👏 Their 9th ICC title🤯 pic.twitter.com/yQLXJFFtTu — CricTracker (@Cricketracker) June 11, 2023 చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!'
క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా శాసించిందన్న మాట అందరికి తెలిసిందే. 1990 దశకం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఏకచత్రాధిపత్యంతో ఏలింది. ఈ రెండు దశాబ్దాల్లో కంగారూలు మూడు వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే, టెస్టుల్లో చాలాకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగారు. భయమంటే ఏంటో ఎరుగని జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియా కూడా దాసోమయ్యింది. 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ అందుకు చక్కటి ఉదాహరణ. స్టీవా, రికీ పాంటింగ్, మార్క్ వా, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైకెల్ బెవాన్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, మైకెల్ క్లార్క్, జాసన్ గిలెస్పీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. జట్టుగా ఎంత బలంగా ఉంటుందో.. ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ అంతే పట్టుదలగా ఉండేది. ఒక దశలో కంగారూలతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు కంగారు పడే పరిస్థితి ఉండేది. అయితే ఇన్ని ఘనతలున్నా కంగారూలకు చీటింగ్ అనేది పర్యాయపదంగా ఉండిపోయింది. ఆస్ట్రేలియా ఎన్నో గొప్ప మ్యాచ్‌లు గెలిచినా కొన్నిసార్లు ఆ జట్టు చీటింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లే ఎక్కువగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా క్యాచ్ ఔట్ల విషయంలో ఆసీస్ ఆటగాళ్లు చేసిన చీటింగ్‌లు ఏ జట్టు చేయలేదని చెప్పొచ్చు. బాల్ టాంపరింగ్ నుంచి సాండ్ పేపర్ ఉదంతం వరకు అన్ని ఆస్ట్రేలియా ఖాతా నుంచి వచ్చినవే. అందుకే చీటింగ్ అనే పదం కంగారూల బ్లడ్‌లోనే ఉందంటారు క్రికెట్ అభిమానులు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరోసారి చీటింగ్‌ను బయటపెట్టింది. 444 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు గిల్, రోహిత్‌లు శుభారంభం అందించారు. 41 పరుగులు జోడించిన అనంతరం స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్ ఆడే యత్నంలో శుబ్‌మన్ గిల్ స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్‌లో చెప్పి బిగ్ స్ర్కీన్‌పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయం రోహిత్, గిల్‌తో పాటు సగటు అభిమానిని ఆశ్చర్యపరిచింది. గతంలోనూ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మైకెల్ క్కార్ల్ కెప్టెన్లుగా ఉన్నప్పుడు ఇలాంటి చీటింగ్‌లు చాలానే జరిగాయి. అంపైర్లు కూడా ఆసీస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఫలితాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. అయితే సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఉండి కూడా ఎందుకు ఉపయోగించడం లేదని అభిమానుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) Always winning with cheating #notout pic.twitter.com/H2m939vqCD — Milind Joshi (@MilindJ03022606) June 10, 2023 Cheating is in Australian cricket team DNA. pic.twitter.com/fqXsPxulBQ — SAVAGE (@Freakvillliers) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
Ind Vs Aus: బ్రిస్బేన్ టు నాగ్‌పూర్...
జనవరి 19, 2021... బ్రిస్బేన్‌లోని ‘గాబా’ మైదానం... భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోయే దృశ్యం ఆవిష్కృతమైంది... 33 ఏళ్లుగా ఆస్ట్రేలియా ఓటమి ఎరుగని వేదికపై టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఒకదశలో పూర్తి ఫిట్‌గా ఉన్న 11 మందిని ఎంచుకోవడమే అసాధ్యం మారిన స్థితిలో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన మన జట్టు సంచలన ప్రదర్శనతో విజయంతో పాటు సిరీస్‌నూ సొంతం చేసుకుంది. రెండేళ్ల తర్వాత నాటి అవమానభారాన్ని మోస్తూ ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో అడుగు పెట్టింది. అయితే మనకు అనుకూలమైన పిచ్‌లు, వాతావరణం, స్పిన్ బలగం... ఇలా అన్నీ టీమిండియా పక్షానే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఆసీస్ బృందం తమ దేశంలో గత సిరీస్‌లో భారత్ ప్రదర్శించిన స్ఫూర్తిదాయక ప్రదర్శనను చూపించగలదా? లేక ఎప్పటిలాగే తలవంచి నిష్క్రమిస్తుందా? స్వదేశంలో అత్యద్భుత రికార్డు ఉన్న భారత్ ప్రత్యర్థిపై ఏ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించగలదో వేచి చూడాలి. – సాక్షి క్రీడా విభాగం గత రెండు దశాబ్దాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. 2001 కోల్‌కతా నుంచి 2021 బ్రిస్బేన్ వరకు విజయం ఎవరిదైనా ఆసక్తికర మలుపు, ఉత్కంఠ నిండిన క్షణాలతో ఇరు దేశాల అభిమానులను అలరించాయి. ఎన్నో హోరాహోరీ సమరాలు, రికార్డులు, ఘనతలు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని ప్రపంచ క్రికెట్లో అన్నింటికంటే అత్యుత్తమ టెస్టు పోరుగా మార్చేశాయి. ‘భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం యాషెస్కంటే ఎక్కువ’ అని స్టీవ్ స్మిత్ నేరుగా చెప్పడం ఈ సిరీస్ ప్రాధాన్యతను చూపిస్తోంది. ఇరు జట్ల బలాబలాలు, జట్టులో ప్రస్తుతం ఆడుతున్న సభ్యులను బట్టి చూస్తే గత మూడు సిరీస్‌లు భారత్ ఆధిపత్యంపై స్పష్టతనిస్తాయి. 2016–17లో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న భారత్... ఆ తర్వాత ఆస్ట్రేలియాలో వరుసగా 2018–19లో 2–1తోనే, ఆపై 2020–21లో 2–1తో సిరీస్‌లను సొంతం చేసుకుంది. రేపటి నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌తో నాలుగు టెస్టుల కీలక సమరానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో సాగబోయే ఆసక్తికర ముఖాముఖీలను చూస్తే... ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్, కోహ్లి ► భారత గడ్డపై ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ నాథన్ లయన్‌కు మంచి రికార్డే ఉంది. అతను 7 టెస్టుల్లో 30.58 సగటుతో 34 వికెట్లు తీశాడు. తొలి పర్యటనకంటే రెండోసారి అతని ప్రదర్శన మెరుగైంది. మరోవైపు ఆస్ట్రేలియాలో కోహ్లి, పుజారా లపై పేలవ ప్రదర్శన కనబర్చిన లయన్, భారత్‌లో మాత్రం కోహ్లిని 4 సార్లు, పుజారాను 5 సార్లు అవుట్ చేశాడు. ► ఆస్ట్రేలియాలో ఏకంగా 54 సగటుతో 1352 పరుగులు చేసి చెలరేగిపోయిన కోహ్లి... భారత్‌లో మాత్రం అదే ఆసీస్‌పై 33 సగటుతో 330 పరుగులే చేశాడు. ► స్వదేశంలో ఆసీస్‌తో ఆడిన 8 టెస్టుల్లో అశ్విన్ 50 వికెట్లు తీశాడు. ఇప్పుడూ అతనే జట్టుకు కీలకం. వార్నర్‌నే అశ్విన్ 10 సార్లు అవుట్ చేశాడు. జడేజా బౌలింగ్‌లో నూ తీవ్రంగా ఇబ్బంది పడిన వార్నర్ 4 సార్లు అవుటయ్యాడు. ► ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆట ఈ సిరీస్‌లో నిర్ణాయకంగా మారనుంది. భారత గడ్డపై అశ్విన్ బౌలింగ్‌లో ఏకంగా 57 సగటుతో స్మిత్ పరుగులు సాధించాడు. జడేజా బౌలింగ్‌లోనూ 38 సగటుతో పరుగులు చేసిన స్మిత్ వీరిద్దరిని సమర్థంగా ఎదుర్కొంటే కంగారూ బృందం పైచేయి సాధించవచ్చు. గత సిరీస్‌లో ఏం జరిగిందంటే... తొలి టెస్టు (పుణే): తాము విసిరిన స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న భారత్ 333 పరుగులతో ఓడింది. ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌లలో 260, 285 పరుగులు చేయగా... లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ (12/70) ధాటికి భారత్ 105, 107 పరుగులకే ఆలౌటైంది. రెండో టెస్టు (బెంగళూరు): భారత్ 75 పరుగులతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 87 పరుగుల ఆధిక్యం లభించినా... రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. మూడో టెస్టు (రాంచీ): భారీ స్కోర్లు నమోదైన ఈ టెస్టు (భారత్ 603/9; ఆస్ట్రేలియా 451, 204/6) ‘డ్రా’గా ముగిసింది. భారత్‌కు చివర్లో గెలుపు అవకాశం వచ్చినా ఆసీస్ బతికిపోయింది. నాలుగో టెస్టు (ధర్మశాల): 8 వికెట్లతో భారత్ విజయం. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 32 పరుగుల స్వల్ప ఆధిక్యమే లభించినా... రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 137 పరుగులకే కుప్పకూల్చి జట్టు సునాయాస విజయాన్నందుకుంది. -
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 శుక్రవారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో అయితే స్టోయినిస్ మాత్రం గోల్డ్ కోస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టుతో వెళ్లకుండా పెర్త్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. పెర్త్ వేదికగా ఆదివారం(ఆక్టోబర్ 9)న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌కు స్టోయినిస్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీమిండియాతో టీ20 సిరీస్‌కు దూరమైన ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్.. విండీస్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చారు. ఇక స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ మెగా ఈవెంట్లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్22న న్యూజిలాండ్‌తో తలపడనుంది. వెస్టిండీస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాత్త్ వేడ్ , డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. చదవండి: రోహిత్, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే! -
సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్ వీడియో ట్వీట్
ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) హఠాన్మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేర్‌వార్న్ ఆకస్మిక మృతి ఘటనను మరువకముందే సైమండ్స్ మరణవార్త కలచివేస్తోంది. క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈక్రమంలోనే సైమోకు నివాళి అర్పించిన ఐసీసీ 2003 ప్రపంచకప్‌లో ఆయన విధ్వంసక బ్యాటింగ్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. చదవండి👉🏾 ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం బౌండరీల వరద! 2003 దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌ను పాంటింగ్ సారథ్యంలో ఆస్ట్రేలియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచుల్లో జట్టు విజయంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తమ తొలిమ్యాచ్‌లోనే పాంటింగ్ సేన 82 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. 2 సిక్సర్లు, 18 ఫోర్లతో వీరవిహారం చేసిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సైమండ్స్ 125 బంతుల్లో 143 (నాటౌట్) పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఛేదనలో ఎంతమాత్రం సఫలీకృతం కాలేదు. 44.3 ఓవర్లకే పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చదవండి👉🏻 IPL 2022: సన్‌రైజర్స్ ఢమాల్ As we mourn the loss of former Australian all-rounder Andrew Symonds, we take a look back to his tremendous 143* against Pakistan at the 2003 World Cup.#RIPRoy pic.twitter.com/oyoH7idzkb — ICC (@ICC) May 15, 2022 -
మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా
కూలిడ్జ్ (ఆంటిగ్వా): గత రెండు అండర్–19 ప్రపంచకప్‌లలో భారత్, ఆస్ట్రేలియా రెండుసార్లు నాకౌట్ మ్యాచ్‌లలో తలపడగా రెండు సార్లూ భారత్‌నే విజయం వరించింది. 2018 ఫైనల్లో పృథ్వీ షా నాయకత్వంలోని జట్టు ఆసీస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకోగా... 2020 క్వార్టర్ ఫైనల్లో మన చేతుల్లో కంగారూలకు పరాజయం ఎదురైంది. ఈసారి సెమీఫైనల్లో ఈ రెండు టీమ్‌లు తలపడబోతున్నాయి. నేడు జరిగే ఈ కీలక పోరులో గెలిచి ముందంజ వేస్తే భారత్ వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగు పెట్టినట్లవు తుంది. అయితే మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఈ పోరులో సునాయాసంగా తలవంచుతుందా లేక గత మ్యాచ్‌లకు ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. తాజా ఫామ్ ప్రకారం చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. -
భారత మహిళల రికార్డు ఛేజింగ్.... ఆసీస్ విజయాలకు బ్రేక్
Australia Women vs India Women: ఆస్ట్రేలియాతో జరిగన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా వైట్‌వాష్ పరాభవాన్ని తప్పించుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం 265పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇన్నింగ్స్ 10 ఓవర్లో ఫామ్‌లో ఉన్న మంధాన వికెట్‌ను భారత్ కోల్పోయింది. ఆనంతరం క్రీజులోకి వచ్చిన యస్తిక భాటియా, షఫాలీ వర్మ కలిసి 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యస్తిక భాటియా(69 బంతుల్లో 9 ఫోర్లతో 64), షెఫాలీ వర్మ(91 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో చేలరేగారు. ఈ భాగస్వామ్యం భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో స్నేహ్ రాణా కాసేపు అలరించడంతో టీమిండియా లక్ష్యాన్ని సూనయాసంగా చేధించింది. కాగా భారత మహిళలకు వన్డేల్లో ఇదే అత్యధిక చేజింగ్ కావడం విశేషం. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ ఉమెన్‌లో ఆశ్లే గార్డ్నర్(67), బెత్ మూనీ (52) హాఫ్ సెంచరీలతో చేలరేగగా.. తహిలా మెక్‌గ్రాత్ (47), అలిసా హీలీ( 35) రాణించారు. భారత బౌలర్లలో జూలన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. స్నేహ్ రాణా ఒక వికెట్ సాధించింది. చదవండి: Mohammad Hafeez: పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్‌కు అస్వస్థత.. -
మన బంతి మెరిసింది
ఎరుపు అయితేనేమి, అది గులాబీ అయితేనేమి... బంతి రంగు మారిందే తప్ప భారత బౌలింగ్ పదునులో మాత్రం ఎలాంటి తేడా లేదు... గత కొన్నేళ్లుగా జట్టు చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మన బౌలర్లు మరోసారి తమ సత్తా చాటుతూ ప్రత్యర్థిని పడగొట్టారు. భారీ స్కోరు సాధించలేకపోయిన టీమిండియా బాధను తీరుస్తూ ఆ్రస్టేలియాను వారి సొంత మైదానంలోనే కుప్పకూల్చి సిరీస్‌లో శుభారంభానికి బాటలు వేశారు. ముందుగా బుమ్రా వేట మొదలు పెట్టగా, అశ్విన్ మాయకు ఆసీస్ మిడిలార్డర్ వద్ద జవాబు లేకపోయింది. వికెట్ పడగొట్టకపోయినా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి పడేసిన షమీ, కీలక సమయంలో వికెట్లు తీసిన ఉమేశ్ రెండో రోజు భారత్ హీరోలుగా నిలిచారు. కొంత అదృష్టం కలిసి రావడంతోపాటు కెపె్టన్ పైన్ పోరాడటంతో కంగారూలు చివరకు కాస్త మెరుగైన స్థితిలో ముగించగలిగారు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 53 పరుగుల కీలక ఆధిక్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మూడో రోజు కోహ్లి సేన భారీ స్కోరుగా మలచగలిగితే ఇదే అడిలైడ్‌లో రెండేళ్ల క్రితంనాటి ఫలితాన్ని పునరావృతం చేయడం మన జట్టుకు కష్టం కాకపోవచ్చు. అడిలైడ్: తొలి టెస్టులో బౌలర్ల ప్రదర్శన భారత్‌ను ఆధిక్యంలో నిలబెట్టింది. మన బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన ఆ్రస్టేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ టిమ్ పైన్ (99 బంతుల్లో 73 నాటౌట్; 10 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, మార్నస్ లబ్‌షేన్ (119 బంతుల్లో 47; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అశ్విన్ 4 వికెట్లతో చెలరేగగా... ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... పృథ్వీ షా (4) వికెట్ చేజార్చుకొని 9 పరుగులు చేసింది. మయాంక్ (5 బ్యాటింగ్)... బుమ్రా (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 233/6తో ఆట కొనసాగించిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు జట్టు మరో 11 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. ఫలితంగా 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ లభించింది. 4.1 ఓవర్లలోనే... రెండో రోజు మరిన్ని పరుగులు జోడించి స్కోరును కనీసం 300 వరకు చేర్చాలనుకున్న భారత్ కోరిక నెరవేరలేదు. 4.1 ఓవర్ల వ్యవధిలోనే జట్టు మిగిలిన 4 వికెట్లూ కోల్పోయింది. అశ్విన్ (15), సాహా (9) తమ ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగును కూడా జోడించలేకపోయారు. ఆ వెంటనే ఉమేశ్ (6), షమీ (0) కూడా అవుట్ కావడంతో భారత్ కథ ముగిసింది. మొత్తంగా కోహ్లి రనౌట్ నుంచి చూస్తే 56 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ తడబాటు... ఆ్రస్టేలియా కూడా తమ తొలి ఇన్నింగ్స్‌ను అతి జాగ్రత్తగా ప్రారంభించింది. ఒక్క పరుగు రాకపోయినా... పింక్ బంతిని ఎదుర్కొని క్రీజ్‌లో నిలిస్తే చాలనే ధోరణితో ఓపెనర్లు ఆడారు. 150 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల కెరీర్లో ఒక్కసారి కూడా ఓపెనింగ్ చేయని మాథ్యూ వేడ్ (51 బంతుల్లో 8), పేలవ ఫామ్‌లో ఉన్నా మరో ప్రత్యామ్నాయం లేక అవకాశం దక్కించుకున్న జో బర్న్స్ (41 బంతుల్లో 8) తమ వికెట్ కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. తొలి నాలుగు ఓవర్లు మెయిడిన్లుగా ముగిసిన తర్వాత ఐదో ఓవర్ నాలుగో బంతికి తొలి పరుగు రాగా... 14 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 16 మాత్రమే! అయితే ఎక్కువ సేపు ఈ ఒత్తిడిని అధిగమించలేకపోయిన వీరిద్దరు బుమ్రా వరుస ఓవర్లలో వికెట్ల ముందు దొరికిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్‌కు ప్రాణంలాంటి ఇద్దరు బ్యాట్స్‌మెన్ లబ్õÙన్, స్టీవ్ స్మిత్ (29 బంతుల్లో 1)లపై జట్టును ఆదుకోవాల్సిన భారం పడింది. అయితే వీరిద్దరు కూడా వికెట్ మీద నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పరుగులు రావడం గగనంగా మారింది. ముఖ్యంగా క్రీజ్‌లో ఉన్నంత సేపు స్మిత్ బాగా ఇబ్బంది పడటం ఆశ్చర్యం కలిగించింది. అశ్విన్ సూపర్... ఆసీస్ గడ్డపై రికార్డు బాగా లేకపోయినా అనుభవజు్ఞడనే కారణంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ అశ్విన్ తన సత్తా ప్రదర్శించాడు. మిడిలార్డర్‌ను కూల్చిన అతని స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతని తొలి ఓవర్లోనే నేరుగా వచ్చిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన స్మిత్ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. అశ్విన్ సంబరాలు ఈ వికెట్ విలువేమిటో చూపించాయి. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ (7) అశ్విన్‌కే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా... అశ్విన్ బౌలింగ్‌లోనే కోహ్లికి క్యాచ్ ఇచ్చి అరంగేట్రం ఆటగాడు గ్రీన్ (11) నిష్క్రమించాడు. ఆ తర్వాత ఉమేశ్ వంతు వచి్చంది. అతని బౌలింగ్‌లో తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడలేక లబ్‌షేన్ ఎల్బీడబ్ల్యూ కాగా, అదే ఓవర్లో కమిన్స్ (0) కూడా అవుటయ్యాడు. ఆదుకున్న కెప్టెన్... ఆ్రస్టేలియా స్కోరు 111/7 చూస్తే భారత్‌కు వందకు పైగా ఆధిక్యం ఖాయమనిపించింది. అయితే కెపె్టన్ పైన్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో తన జట్టును కొంత వరకు కాపాడగలిగాడు. పరిస్థితిని గమనించి ఎదురుదాడికి దిగిన అతను చక్కటి బౌండరీలతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 68 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. సహచరులు స్టార్క్ (15), లయన్ (10), హాజల్‌వుడ్ (8) భారీగా పరుగులు చేయకపోయినా కెపె్టన్‌గా అండగా నిలిచారు. ఫలితంగా కెప్టెన్ భాగస్వామ్యంలో ఆ్రస్టేలియా చివరి మూడు వికెట్లకు 80 పరుగులు జోడించడం విశేషం. చివరకు ఉమేశ్ బౌలింగ్‌లో పుజారా గాల్లోకి ఎగిరి పట్టిన చక్కటి క్యాచ్‌కు హాజల్‌వుడ్ అవుట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. క్యాచ్‌లు నేలపాలు... మైదానంలో భారత జట్టు పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన తొలి టెస్టులోనూ కొనసాగించింది. రెండో రోజు మూడు సునాయాస క్యాచ్‌లు మన ఆటగాళ్లు జారవిడిచారు. వీటిని అందుకొని ఉంటే ఆసీస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. షమీ బౌలింగ్‌లో లబ్‌షేన్ (అతని స్కోరు 16) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద తప్పుడు అంచనాతో పరుగెత్తుతూ పట్టబోయి బుమ్రా వదిలేశాడు. ఆ తర్వాత రెండు సార్లు బుమ్రా బౌలింగ్‌లోనే లబ్‌షేన్ (స్కోరు 21) క్యాచ్‌ను స్క్వేర్‌లెగ్‌లో పృథ్వీ షా... పైన్ (స్కోరు 26) ఇచ్చిన క్యాచ్‌ను స్క్వేర్‌లెగ్‌లో మయాంక్ పట్టలేకపోయారు. వీటికి తోడు చివర్లో స్టార్క్ (స్కోరు 12) కష్టసాధ్యమైన క్యాచ్‌ను వెనక్కి వెళుతూ పట్టే ప్రయత్నంలో సాహా విఫలమయ్యాడు. అయితే దీని ప్రభావం పెద్దగా పడలేదు. తొలి సెషన్; ఓవర్లు: 4.1, పరుగులు: 11, వికెట్లు: 4 (భారత్) ఓవర్లు: 19, పరుగులు: 35, వికెట్లు: 2 (ఆసీస్) రెండో సెషన్ ఓవర్లు: 29, పరుగులు: 57, వికెట్లు: 3 (ఆసీస్) మూడో సెషన్ ఓవర్లు: 24.1, పరుగులు: 99, వికెట్లు: 5 (ఆసీస్) ఓవర్లు: 6, పరుగులు: 9, వికెట్లు: 1 (భారత్) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 8, బర్న్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 8, లబ్‌షేన్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 47, స్మిత్ (సి) రహానే (బి) అశ్విన్ 1, హెడ్ (సి అండ్ బి) అశ్విన్ 7, గ్రీన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 11, పైన్ (నాటౌట్) 73, కమిన్స్ (సి) రహానే (బి) ఉమేశ్ 0, స్టార్క్ (రనౌట్) 15, లయన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 10, హాజల్‌వుడ్ (సి) పుజారా (బి) ఉమేశ్ 8, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (72.1 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–16, 2–29, 3–45, 4–65, 5–79, 6–111, 7–111, 8–139, 9–167, 10–191. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 16.1–5–40–3, జస్ప్రీత్ బుమ్రా 21–7–52–2, మొహమ్మద్ షమీ 17–4–41–0, అశ్విన్ 18–3–55–4. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) కమిన్స్ 4, మయాంక్ (బ్యాటింగ్) 5, బుమ్రా (బ్యాటింగ్) 0, మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టానికి) 9. వికెట్ల పతనం: 1–7. బౌలింగ్: స్టార్క్ 3–1–3–0, కమిన్స్ 3–2–6–1. -
వరల్డ్ కప్ ఫేవరెట్ ఆ టీమే..!
సిడ్నీ: క్రికెట్ ప్రపంచ కప్ మహాసంగ్రామం ఆరంభమవడానికి కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని దేశాల జట్లు తుది ఎలెవెన్‌పై కసరత్తులు చేస్తోండగా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మాత్రం తమ ఫేవరెట్ జట్లు ఫలానా అని వెల్లడిస్తున్నారు. నిన్నటికి నిన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసీర్ హుస్సేన్ ఇండియానే అత్యంత ప్రమాదకర జట్టని, దానికే కప్ గెలిచే అవకాశాలు ఎక్కువ అని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జాబితాలో మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియాకు రెండు సార్లు వరల్డ్ కప్ అందించిన రికీ పాంటింగ్ చేరారు. ఈ సారి వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ అని పంటర్ పేర్కొన్నారు. అలాగే ఈ వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదవడానికి కూడా అవకాశాలున్నాయని, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టీంలు ఆ కోవలోకి వస్తాయని ఆయన అన్నారు. ‘బలమైన బ్యాటింగ్ లైనప్‌తో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. గత కొంత కాలంగా మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లండ్ టీం అంచనాలకు మించి రాణిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు సానుకూల అంశం. అదే విధంగా 7వ నెంబర్ వరకు దాటిగా బ్యాటింగ్ చేయడం కలిసొచ్చే అంశం. అయితే ఇండియా, ఆస్ట్రేలియా రూపంలో ఇంగ్లండ్ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనవలసి ఉంది’అని ఈ మాజీ సారధి జోస్యం చెప్పాడు. మే 30వ తేదీ నుంచి వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
పద పద 'పది' వైపు...
గత జులైలో వెస్టిండీస్ చేతిలో నాలుగో వన్డేలో పరాజయం తర్వాత భారత్ మళ్లీ ఓడలేదు. విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాలపై కలిపి వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ ఏడాది జనవరి తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. విదేశీ గడ్డపై ఆడిన గత 11 వన్డేల్లో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. అద్భుత ఫామ్‌తో మన జట్టులో ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగుతుంటే... అటు కంగారూలు గెలవటం ఎలాగో మరచిపోయి బేలగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా పదో వన్డేలో విజయం సాధించి భారత్ తరఫున కొత్త రికార్డు నెలకొల్పాలని కోహ్లి సేన భావిస్తుండగా... సిరీస్ కోల్పోయాక పరువు కాపాడుకునే ప్రయత్నంలో స్మిత్ బృందం మరో పోరుకు సిద్ధమైంది. బెంగళూరు: భారత క్రికెట్ జట్టు ఇప్పటి వరకు 925 వన్డేలు ఆడింది. కానీ ఎప్పుడూ వరుసగా పది మ్యాచ్‌లు గెలవలేదు. బంగ్లాదేశ్, జింబాబ్వే మినహా అగ్రశ్రేణి జట్లన్నీ ఈ ఫీట్‌ను కనీసం ఒక్కసారి అయినా నమోదు చేశాయి. ఆస్ట్రేలియా అయితే ఏకంగా ఆరు సార్లు వరుసగా పది మ్యాచ్‌లలో విజయం సాధించింది. భారత్ మాత్రమే ఈ ఘనత విషయంలో వెనుకబడి ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరే అవకాశం టీమిండియా ముందు నిలిచింది. ఆస్ట్రేలియాతో నేడు జరిగే నాలుగో వన్డేలో ఈ రికార్డు సృష్టించాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది. సిరీస్‌ను 3–0తో ఇప్పటికే భారత్ సొంతం చేసుకోగా... కనీసం ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి కాస్త పరువు దక్కించుకోవాలని ఆసీస్ భావిస్తోంది. మార్పులు ఉంటాయా! సిరీస్‌ను గెలుచుకున్నా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదాసీనత ప్రదర్శించరాదన్నది కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి నుంచి చెప్పే మాట. శ్రీలంకతో సిరీస్‌లో కూడా జట్టు అంతే పట్టుదల ప్రదర్శించి క్లీన్‌స్వీప్ చేసింది. కాబట్టి ఆసీస్‌కు కూడా శూన్యహస్తం చూపిం చాలన్నదే భారత్ లక్ష్యం. కాబట్టి వరుస విజయాలు అందించిన కూర్పును మార్చే ప్రయత్నం మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. టాప్–3 రోహిత్, రహానే, కోహ్లి చక్కటి ఫామ్‌లో ఉండగా... ధోని, హార్దిక్ పాండ్యా లోయర్ ఆర్డర్లో సత్తా చూపిస్తున్నారు. ముఖ్యంగా పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత జట్టుకు విలువైన ఆస్తిగా మారింది. పేసర్లు భువనేశ్వర్, బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. చివరి ఓవర్లలో వీరిద్దరూ ప్రమాదకరమైన జోడీ అని స్వయంగా ఆసీస్ కెప్టెన్ కితాబిచ్చారు. మరోసారి ఈ జంట తమ కచ్చితత్వంతో ప్రత్యర్థిని కట్టిపడేయగలదు. ఇక ఇద్దరు స్పిన్నర్లు చహల్, కుల్దీప్లను ఎదుర్కోవడం ఆసీస్ వల్ల కావడం లేదు. వీరిద్దరు కలిపి సిరీస్‌లో 13 వికెట్లు పడగొట్టారు. అక్షర్ తిరిగి జట్టులోకి వచ్చినా అతనికి అవకాశం కష్టమే. అయితే మిడిలార్డర్లో ఒక్క స్థానం విషయంలో మాత్రం మార్పుకు అవకాశం ఉంది. స్థానిక ఆటగాడు కేఎల్ రాహుల్‌ను ఆడించాలని భావిస్తే అతని కర్ణాటక సహచరుడు మనీశ్ పాండే లేదా కేదార్ జాదవ్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే తుది జట్టులో ఎవరున్నా జోరు మాత్రం తగ్గించరాదని భారత్ భావిస్తోంది. గెలిపించేది ఎవరు? ఫించ్ సెంచరీ కొట్టాడు, స్మిత్ బాగా ఆడాడు, వార్నర్ కూడా ఆకట్టుకున్నాడు. అయినా సరే ఆస్ట్రేలియా మాత్రం ఇండోర్‌లో గెలవలేకపోయింది. ఆ జట్టు నమ్ముకున్న ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మన్ సమష్టిగా రాణించినా విజయం మాత్రం జట్టు దరి చేరలేదు. ఈ స్థితిలో అసలు ఎలాంటి వ్యూహం అనుసరించాలనేదానిపైనే ఆస్ట్రేలియా గందరగోళంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ పిచ్‌పై కనీసం 300 పరుగులు కూడా చేయలేని ఆ జట్టు విజయాన్ని కోరుకోవడం అత్యాశే అవుతుంది. అయితే ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టును బాగా దెబ్బ తీస్తోంది. హెడ్, స్టొయినిస్, హ్యాండ్స్కోంబ్ జట్టుకు ఉపయోగపడలేకపోతున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోలేని బలహీనతను ఆసీస్ అధిగమించలేకపోతోంది. గత మ్యాచ్‌లో ఎదురుదాడికి ప్రయత్నం చేసినా అది ఎక్కువ సేపు సాధ్యం కాలేదు. అన్నింటికి మించి హిట్టర్ మ్యాక్స్‌వెల్ ఘోర వైఫల్యం కంగారూల పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చింది. కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏమాత్రం ఆలోచన లేకుండా గుడ్డిగా బ్యాట్ ఊపేస్తున్న అతని శైలి ఆసీస్‌ను నష్టపరిచింది. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో అతను చహల్ బౌలింగ్‌లోనే అవుట్ కాగా... అందులో రెండుసార్లు ఒకే తరహాలో వైడ్ బంతులకు స్టంపౌటయ్యాడు. బౌలింగ్‌లో కూల్టర్‌నీల్ మాత్రమే ఫర్వాలేదనిపిస్తుండగా... మిగతా వారంతా విఫలమయ్యారు. లెగ్‌స్పిన్నర్ జంపా ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపిస్తాడా అనేది చూడాలి. ప్రస్తుత స్థితిలో ఆస్ట్రేలియా విజయం కోసం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. ►100 వార్నర్‌కు ఇది 100వ వన్డే ► 42 ఐపీఎల్లో విరాట్ కోహ్లికి ఈ మైదానంలో తిరుగులేని రికార్డు ఉన్నా... అంతర్జాతీయ వన్డేల్లో ఇక్కడ అతని ప్రదర్శన పేలవం. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి అతను మొత్తం 42 పరుగులు (0, 8, 34, 0) మాత్రమే చేశాడు. పిచ్, వాతావరణం చిన్నస్వామి స్టేడియం పిచ్‌లో మార్పుల అనంతరం ఇక్కడ తక్కువ స్కోర్లు నమోదవుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత ఇక్కడ అంతర్జాతీయ వన్డే జరుగుతోంది కాబట్టి వికెట్ స్పందించే తీరుపై ఇంకా స్పష్టత లేదు. 2013లో ఈ మైదానంలో ఆఖరి వన్డే జరిగింది. అదే మ్యాచ్‌లో ఆసీస్‌పై రోహిత్ 209 పరుగులు చేశాడు. గురువారం నగరంలో వర్ష సూచన ఉంది. మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, రోహిత్, మనీశ్ పాండే/రాహుల్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, హెడ్, స్టొయినిస్, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్‌వెల్, కూల్టర్ నీల్, రిచర్డ్సన్, కమిన్స్/ఫాల్క్‌నర్, జంపా. -
టెస్టులు ఇక చాలు: వాట్సన్
ఆస్ట్రేలియా టెస్టు జట్టులో మరో వికెట్ పడింది. టెస్ట్ కెప్టెన్ మైకెల్ క్లార్క్ తర్వాత టీమ్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ టెస్టులకు గుడ్ బై చెప్పాడు. యాషెస్ సిరీస్ ముగిసిన వెంటనే మైకేల్ క్లార్క్ టెస్టుల నుంచి తప్పుకోగా... తాజాగా తాను కూడా టెస్టుల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు వాట్సన్ తెలిపాడు. ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డే సందర్భంగా గాయపడిన వాట్సన్... అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఇటీవల కాలంలో వరస గాయాలు.. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వాట్సన్.. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడానికి ఇదే సరైన సమయమని అన్నాడు. చిరకాల ప్రత్యర్ధులతో యాషెస్ సిరీస్ లోనూ వాట్సన్ ప్రదర్శన పేవలంగానే సాగింది. తొలి మ్యాచ్ లో ఆడిన ఈ 34ఏళ్ల ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఆ మ్యాచ్ లో కేవలం తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగులు, రెండో ఇన్సింగ్స్ లో 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ లో ఒక్క వికెట్ కూడా తీయ లేక పోయాడు. ఈ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్ మెంట్ మిగతా సిరీస్ కు వాట్సన్ ను పక్కన పెట్టింది. తాజాగా వన్డే సిరీస్ లో గాయపడ్డ వాట్సన్ పూర్తి సిరీస్ కు దూరం కానున్నాడు. రిటైర్మెంట్ గురించి ఉద్వేగంగా మాట్లాడిన వాట్సన్ ఐదు రోజుల ఫార్మెట్ నుంచి తప్పుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకొచ్చాడు. తనలో టెస్ట్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఇక ఎంత మాత్రం లేదని అన్నాడు. శారీరకంగా, మానసికంగా, సాంకేతికంగా.. టెస్ట్ల్ లు ఆడే సత్తా తనలో లేదని చెప్పుకొచ్చాడు. టెస్ట్ ల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తనకు, తన కుటుంబానికే కాక.. ఆస్ట్రేలియా టీమ్ కు కూడా మంచిదని వివరించాడు. ఆస్ట్రేలియా తరఫున సిడ్నీలో పాకిస్తాన్ పై 2005 జూన్ లో టెస్ట్ ఆరంగేట్రం చేసిన వాట్సన్ తన కెరీర్ లో 59 టెస్టులు ఆడాడు. ఒక టెస్ట్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2009 యాషెస్ సిరీస్ లో రాణించిన వాట్సన్ 59 టెస్ట్ లు 35.19 యావరేజ్ తో 3,731 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ లో 33.68 యావరేజ్ తో 75 వికెట్లు తీశాడు. కెరీర్ ఆరంభంలోనూ... చివరి రోజుల్లోనూ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా వ్యవహరించిన ఈ ఆసిస్ ఆల్ రౌండర్ ఓపెనింగ్ పొజిషన్ ను బాగా ఎంజాయ్ చేశాడు. ఓపెనర్ గా 29 మ్యాచ్ లు ఆడిన వాట్సన్ 55.12 యావరేజ్ తో 2,049 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. గత కొంత కాలంగా వరస గాయాలతో ఇబ్బంది పడుతున్న వాట్సన్ ఇక పొట్టి ఫార్మాట్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగటం తన కెరీర్ కి మంచిదని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. వన్డేలు, టీ20లకు పరిమితం కావడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం ఎంతో భావోద్వేగాలతో కూడుకున్నదని చెప్పాడు. -
ఫించ్ విజృంభణ, ఆస్ట్రేలియా గెలుపు
మిర్పూర్: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఊరట విజయం లభించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సెమీస్ చేరలేకపోయిన ఆసీస్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 17.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఫించ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. వార్నర్ 48, వైట్ 18, బెయిలీ 11 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. షకీబ్ అల్ హుస్సేన్(66), ముష్ఫికర్ రహీం(47) రాణించారు. ఫించ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు
హొబర్ట్: టెస్ట్, వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఉతికి ఆరేసిన ఆస్ట్రేలియా టీ20లోనూ సత్తా చూపుతోంది. ఓవల్ మైదానంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లీషు జట్టును 13 పరుగులతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. వైట్(75), ఫించ్(52) అర్థ సెంచరీలతో చెలరేగారు. మ్యాక్స్‌వెల్ 20, బెయిలీ 14, లియాన్ 33 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, డెర్న్‌బ్యాచ్, బొపారా, రైట్ తలో వికెట్ తీశారు. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. రవి బొపారా అర్థ సెంచరీలో చెలరేగినా విజయాన్ని అందించలేకపోయాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రూట్ 32, హేల్స్ 22 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నైల్ 4, హెన్రీక్స్ 2 వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్‌వెల్, ముయిర్‌హెడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. వైట్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
ఫించ్ సెంచరీ చేసినా ఆసీస్ ఓటమి
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలతో కుదేలయిన కుక్ సేనకు ఎట్టకేలకు ఒక విజయం దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 57 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. బెల్ 55, స్టోక్స్ 70, బుట్లర్ 71, మోర్గాన్ 33, కుక్ 44 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ 4 వికెట్లు నేలకూల్చాడు. 317 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటయింది. ఫించ్ ఒక్కడే(108) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 4, బ్రెస్నన్ 3, బ్రాడ్ 2 వికెట్లు తీశారు. బొపారా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్టోక్స్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్ ను ఆసీస్ ఇప్పటికే గెల్చుకుంది. -
హారిస్ మ్యాజిక్; ఆసీస్ విన్
సిడ్నీ: యాషెస్ సిరీస్ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరి టెస్టులో ఇంగ్లండ్‌ను 281 పరుగులతో చిత్తు చేసి సంపూర్ణ విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 448 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 166 పరుగులకే కుప్పకూలింది. 31.4 ఓవర్లలో చాప చుట్టేసింది. 52 నిమిషాల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి బొక్కబోర్లా పడింది. ఆసీస్ బౌలర్ హారిస్ మ్యాజిక్కు ఇంగ్లీషు ఆటగాళ్లు దాసోసమయ్యారు. కార్‌బెరీ(43), బెల్(16), స్టోక్స్(32), బ్రాడ్(42) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇద్దరు డకౌటయ్యారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. హారిస్ 5 వికెట్లు పడగొట్టాడు. జాన్సన్ 3, లియాన్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు 140/4 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 276 పరుగులకు ఆలౌటయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 326, ఇంగ్లండ్ 155 పరుగులు చేశాయి. హారిస్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కించుకున్నారు. -
స్టోక్స్ 'సిక్సర్'... స్మిత్ సెంచరీ
సిడ్నీ: యాషెస్ సిరీస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటయింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 76 ఓవర్లలో 326 పరుగులు చేసింది. స్మిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు.154 బంతుల్లో 17 ఫోర్లు, సిక్సర్‌తో 115 పరుగులు చేశాడు. హాడిన్(75) అర్థ సెంచరీతో రాణించాడు. వాట్సన్ 43, హరీస్ 22, రోజర్స్ 11, వార్నర్ 16, క్లార్క్ 10, జాన్సన్ 12 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఏకంగా 6 వికెట్లు నేలకూల్చాడు. బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆండర్సన్, బోర్త్విక్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 6 పరుగులకే వికెట్ నష్టపోయింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8/1 స్కోరుతో ఉంది. -
రోజర్స్ సెంచరీ; ఆసీస్ విక్టరీ
మెల్బోర్న్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. తాజాగా జరిగిన నాలుగు టెస్టులోనూ ఆసీస్ విజయం సాధించి సిరీస్‌లో 4-0 ఆధిక్యం సాధించింది. నాలుగో టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియడం విశేషం. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని క్లార్క్ సేన 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 30 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ కేవలం 2 వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. రోజర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. 155 బంతుల్లో 13 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. వాట్సన్ అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లోనే 11 ఫోర్లతో 83 పరుగులు పిండుకున్నాడు. వార్నర్ 25 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, పనేసర్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 255, రెండో ఇన్నింగ్స్‌లో 179 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటయింది. మొత్తం 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.