ఫించ్ సెంచరీ చేసినా ఆసీస్ ఓటమి
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలతో కుదేలయిన కుక్ సేనకు ఎట్టకేలకు ఒక విజయం దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 57 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. బెల్ 55, స్టోక్స్ 70, బుట్లర్ 71, మోర్గాన్ 33, కుక్ 44 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ 4 వికెట్లు నేలకూల్చాడు.
317 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటయింది. ఫించ్ ఒక్కడే(108) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 4, బ్రెస్నన్ 3, బ్రాడ్ 2 వికెట్లు తీశారు. బొపారా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్టోక్స్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్ ను ఆసీస్ ఇప్పటికే గెల్చుకుంది.