Cook Team
-
ఆపిల్‌లో 20వేల ఉద్యోగాలు...
న్యూయార్క్ : టెక్ దిగ్గజం ఆపిల్ అమెరికాలో భారీ పెట్టుబడులు, ఉద్యోగాలను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. నూతన పన్ను చట్టం నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో 35,000 కోట్ల డాలర్లను అమెరికాలో వెచ్చిస్తామని, 20,000 ఉద్యోగాలను కల్పిస్తామని కంపెనీ వెల్లడించింది. యూఎస్‌లో మరో క్యాంపస్‌ను ప్రారంభిస్తామని పేర్కొంది. 3800 కోట్ల డాలర్లను పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తామని అంచనా వేసింది. అమెరికాలోని డేటా సెంటర్లపై భారీగా ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. మరోవైపు ఇన్నోవేషన్ ఫండ్ కింద గత ఏడాది కంపెనీ సీఈవో టిమ్ కుక్ రూ 6500 కోట్లు ప్రకటించగా..తాజాగా దీన్ని రూ 30,000 కోట్లకు పెంచుతామని తెలిపింది. ప్రత్యక్ష ఉపాధితో పాటు సరఫరాదారులు, యాప్ బిజినెస్ ద్వారా వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆపిల్ పేర్కొంది. నూతన క్యాంపస్ కస్టమర్ సపోర్ట్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపింది. -
విండీస్ లక్ష్యం 192
బ్రిడ్జిటౌన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు విజయం వైపు పయనిస్తోంది. కుక్ సేన విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ మూడో రోజు ఆదివారం కడపటి వార్తలందేసరికి 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో బ్రేవో (15), శామ్యూల్స్ (12) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 42.1 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. టేలర్, హోల్డర్, పెరుమాళ్ మూడేసి వికెట్లు తీశారు. -
ఫించ్ సెంచరీ చేసినా ఆసీస్ ఓటమి
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలతో కుదేలయిన కుక్ సేనకు ఎట్టకేలకు ఒక విజయం దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 57 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. బెల్ 55, స్టోక్స్ 70, బుట్లర్ 71, మోర్గాన్ 33, కుక్ 44 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ 4 వికెట్లు నేలకూల్చాడు. 317 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటయింది. ఫించ్ ఒక్కడే(108) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 4, బ్రెస్నన్ 3, బ్రాడ్ 2 వికెట్లు తీశారు. బొపారా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్టోక్స్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్ ను ఆసీస్ ఇప్పటికే గెల్చుకుంది.