న్యూయార్క్ : టెక్ దిగ్గజం ఆపిల్ అమెరికాలో భారీ పెట్టుబడులు, ఉద్యోగాలను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. నూతన పన్ను చట్టం నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో 35,000 కోట్ల డాలర్లను అమెరికాలో వెచ్చిస్తామని, 20,000 ఉద్యోగాలను కల్పిస్తామని కంపెనీ వెల్లడించింది. యూఎస్‌లో మరో క్యాంపస్‌ను ప్రారంభిస్తామని పేర్కొంది. 3800 కోట్ల డాలర్లను పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తామని అంచనా వేసింది.
అమెరికాలోని డేటా సెంటర్లపై భారీగా ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. మరోవైపు ఇన్నోవేషన్ ఫండ్ కింద గత ఏడాది కంపెనీ సీఈవో టిమ్ కుక్ రూ 6500 కోట్లు ప్రకటించగా..తాజాగా దీన్ని రూ 30,000 కోట్లకు పెంచుతామని తెలిపింది. ప్రత్యక్ష ఉపాధితో పాటు సరఫరాదారులు, యాప్ బిజినెస్ ద్వారా వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆపిల్ పేర్కొంది. నూతన క్యాంపస్ కస్టమర్ సపోర్ట్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment