Apple Technology Company
-
యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన తొలి రీటైల్ స్టోర్ గురించి అధికారిక ప్రకటన చేసింది. ముంబైకి చెందిన ఓ ప్రాంతంలో యాపిల్ బీకేసీ పేరుతో ఉన్న ఆ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు వెబ్సైట్లో తెలిపింది. కానీ ప్రారంభ తేదీని వెల్లడించ లేదు. ఇక స్టోర్‌ను దేశంలో అత్యంత ఖరీదైన ప్రాపర్టీలకు నెలవైన ముకేష్ అంబానీకి చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ స్టోర్ ఉండనుంది. అదే ప్రాంతంలో అంతర్జాతీయ బ్యాంకులు సైతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక ముంబై తర్వాత ఢిల్లీలో ఇలా దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యాపిల్ సంస్థ తన రీటైల్ స్టోర్లను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. పలు నివేదికల ప్రకారం.. ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు అడుగుల్లో నిర్మించారు. లాస్ఎంజెల్స్,న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ దేశాల తరహాలోనే ముంబై రీటైల్ స్టోర్ ఉన్నట్లు పేర్కొన్నాయి. ముంబై స్టోర్ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత సాకేత్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఉన్న ఢిల్లీ యాపిల్ రీటైల్ స్టోర్ ప్రారంభం అవుతుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. యాపిల్ రీటైల్ స్టోర్లతో లాభాలేంటీ? టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన ఉత్పత్తులను విక్రయించింది. ఆ అమ్మకాలు ఆన్లైన్లో లేదంటే థర్డ్ పార్టీల స్టోర్ల నుంచి జరుపుతుంది. ఈ క్రమంలోనే రిటైల్ స్టోర్లు తెరవాలని యాపిల్‌కు ఎప్పటి నుంచో ప్రణాళికలు ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. ఇక త్వరలో ప్రారంభానికి సన్నద్దమవుతున్న ముంబై రీటైల్ స్టోర్‌తో కొనుగోలు దారులు యాపిల్ ప్రొడక్ట్‌లను ఆఫ్‌లైన్‌లో థర్డ్ పార్టీ స్టోర్లతో సంబంధం లేకుండా నేరుగా కొనుగోలు చేయొచ్చు. తద్వారా యాపిల్ ఉత్పత్తుల ధరల తగ్గే అవకాశం ఉందనే అంచనా నెలకొంది. చదవండి👉 ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా? -
ఇండియాలో సేల్స్‌పై యాపిల్ తీవ్ర కసరత్తు.. ఏకంగా మేనేజ్మెంట్నే!
భారతదేశంలో తమ ఉనికిని నిరంతరం విస్తరించుకోవడంలో భాగంగా యాపిల్ కంపెనీ తమ నాయకత్వ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపింది. కేవలం మార్కెట్ కోసం మాత్రమే కాకుండా దేశంలో తమ ఉత్పత్తులను తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి కంపెనీ తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, మాజీ ఉపాధ్యక్షుడు హ్యూగ్స్ అస్సేమాన్ పదవీ విరమణ తర్వాత ఇండియా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాలలో ఈ మార్పు వచ్చింది. అస్సేమాన్ స్థానంలో భారత అధినేత ఆశిష్ చౌదరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆశిష్ చౌదరి యాపిల్ ఉత్పత్తుల విక్రయాల అధిపతి మైఖేల్ ఫెంగర్‌కు రిపోర్ట్ చేస్తారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా యాపిల్ విక్రయాలకు బాధ్యత వహించే ఇద్దరు వ్యక్తులలో మైఖేల్ ఫెంగర్ ఒకరు . అయితే ఈయన డౌగ్ బెక్‌తో కలిసి నేరుగా టిమ్ కుక్కి రిపోర్ట్ చేస్తాడు. ప్రపంచ దేశాల్లో యాపిల్‌కు భారత్ ముఖ్యమైన మార్కెట్. కంపెనీ ఇండియా నుంచి ప్రతి సంవత్సరం మంచి ఆదాయాన్ని గడిస్తోంది. (ఇదీ చదవండి: హ్యార్లీ డేవిడ్సన్ కొత్త బైకులు.. మునుపెన్నడూ చూడని కొత్త డిజైన్‌తో) యాపిల్ కంపెనీ మరిన్ని అమ్మకాలను పొందటానికి ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించాలని యోచిస్తోంది. భారత పర్యటన సందర్భంగా టిమ్ కుక్ దేశం ప్రాధాన్యతను గురించి ప్రస్తావించారు. ఆపిల్ కంపెనీకి ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి మూడు ముఖ్యమైన సరఫరాదారులు ఉన్నారు. యాపిల్ సంస్థ భారతదేశంలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్లతో పాటు నాన్-ప్రో వేరియంట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే చైనా మార్కెట్లో విరివిగా ఐఫోన్ల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో చైనాకు ప్రధాన ప్రత్యామ్నాయాన్ని భారతదేశం అందిస్తుందని ఆశిస్తున్నారు. -
బార్లో బాయ్‌ఫ్రెండ్ నిర్వాకం.. కారుతో తొక్కి చంపేసిన ప్రియురాలు
వాషింగ్టన్: యువతీయువకులు ప్రేమలో పడడం షరా మామూలే. అయితే ఇటీవల ట్రెండ్ చూస్తే అదే ప్రేమలో ఎవరో ఒకరు మోసపోవడం కూడా షరా మామూలుగానే మారిందనే చెప్పాలి. అయితే ఈ జాబితాలోని కొందరు మాత్రం ఆ బాధని మర్చిపోలేక నరకయాతన అనుభవిస్తుంటే మరికొందరు మాత్రం ప్రేమలో మోసం చేసిన వాళ్లు తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందేనంటూ ఏదో ఓ రూపంలో వారిపై కక్ష తీర్చుకుంటున్నారు. తాజాగా ఇదే తరహాలో ఓ యువతి ప్రియుడు చేసిన మోసానికి ఏకంగా అతడిని కారుతో తొక్కి చంపింది. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. అమెరికాలో ఉంటున్న ఆండ్రీ స్మిత్, గేలిన్ మోరిస్ ఇద్దరు ప్రేమికులు. అయితే ఇటీవల కొంత కాలంగా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ ప్రవర్తనలో మార్పుని గమనించింది గేలన్. ఆండ్రీ తనను చీటింగ్ చేస్తున్నట్లు ఆమె అనుమానించింది. ఇంకేం క్లారిటీ కోసం ఆపిల్ ఫోన్లోని ఎయిర్ ట్యాగ్ ద్వారా అతడి కదలికలను ట్రాక్ చేసింది. అతను ఓ బార్లో ఉన్నట్లు తెలియడంతో అక్కడి వెళ్లింది. బార్లో తన బాయ్‌ఫ్రెండ్ మరో అమ్మాయితో ఉండడం చూసి కోపంతో ఊగిపోయింది. ఖాళీ వైన్ బాటిల్‌తో ఆమెపై దాడి చేయబోగా స్మిత్ జోక్యం చేసుకున్నాడు. దీంతో బార్ సిబ్బంది ఆ ముగ్గురిని బయటకు పంపారు. కాగా, బార్ బయట స్మిత్‌పై మోరిస్ దాడి చేసింది. అంతటితో ఆగకుండా చేతులు కట్టేసి రోడ్డుపై పడేసింది. అనంతరం కారును అతడి మీదుగా నడిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన స్మిత్‌ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే అతను చనిపోయాడు. దీనికి కారకురాలైన ప్రియురాలు మోరిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పబ్జీ దారుణం.. గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. కోపంతో ఊగిపోయి, తండ్రి పిస్టల్ తీసుకుని -
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. ఆపిల్ సంస్థ ప్రతినిధులు 'ఐఫోన్13 సిరీస్' విడుదల తేదీని ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్ 13 విడుదల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 17 న విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. చైనా సోషల్ మీడియా దిగ్గజం వైబూ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సెప్టెంబర్ లోనే ఐఫోన్ 13ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ తో పాటు సెప్టెంబర్ 30న ఆపిల్ తన సంస్థకు చెందిన మరో నాలుగు కొత్త ప్రాడక్ట్ లను విడుదల చేయనుంది' అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ తో పాటు ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లను సెప్టెంబర్ 17 నుంచి అమ్మకాలు జరపాల్సి ఉండగా..సెప్టెంబర్ తరువాత ఎయిర్ పాడ్స్3 ని విడుదల చేయనుంది. అధికారికంగా ఐఫోన్ 13 విడుదల తేదీ ఎప్పుడనేది కన్ఫాం కాకపోయినప్పటికీ..ఆపిల్ మాత్రం సెప్టెంబర్ 17న విడుదల చేస్తుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఆపిల్ ప్రాడక్ట్ తేదీ విడుదల ఎప్పుడనే అంశంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్ని ఖండించని ఆపిల్ సంబంధిత తేదీల్లోనే విడుదల చేయడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఊతమిచినట్లైంది. చదవండి : ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్ -
ఆపిల్ లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే?!
మీరు ఆపిల్ ప్రాడక్ట్ లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. సెప్టెంబర్ 14, 15 తేదీలలో (అంచనా) ఆపిల్ సంస్థ 'వరల్డ్ డెవలపర్ కాన్ఫిరెన్స్' (wwdc) 2021 ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున కొత్త ప్రాడక్ట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బ్లూమ్ బెర్గ్ కథనం ప్రకారం..ఆపిల్ సంస్థ ప్రతి ఏడాది డెవలపర్ కాన్ఫిరెన్స్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.ఈ ఈవెంట్లో విడుదల చేయబోయే ఉత్పత్తుల గురించి అనౌన్స్ చేస్తుంది. వచ్చే నెలలో జరగనున్న ఈవెంట్లో యాపిల్ వాచ్ 7 సిరీస్, ఐపాడ్ మినీ 6, ఆపిల్ ఎయిర్ పాడ్స్ 3, ఐపాడ్ మినీ 6 విడుదల చేయనున్నట్ల బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. పై ప్రాడక్ట్స్తో పాటు గతేడాది వరల్డ్ డెవలపర్ కాన్ఫిరెన్స్ 2020లో విడుదల కాకుండా ఆగిపోయిన ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఐపాడ్స్‌ను విడుదల చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 13 ఐఫోన్ 13లో కొన్ని ముఖ్యమైన డిజైన్, హార్డ్‌వేర్ లను మార్చనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రిమ్డ్ డౌన్ డిస్ప్లే నాచ్, ఫేస్-ఐడి కాంపోనెంట్లను యాడ్ చేయనుంది. ఫేస్ ఐడి సిస్టమ్‌లో వీఎస్సీఈఎల్ (Vertical-cavity surface-emitting laser) చిప్‌ని జోడించడం, ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ లలో 120 హెచ్ జెడ్ ఎల్టీపీఓ డిస్ ప్లేలు, లార్జ్ సైజ్ బ్యాటరీతో రిలీజ్ చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా. ప్రస్తుతం ఐఫోన్ 12 మోడల్‌కు 512జీబీ స్టోరేజ్‌ను అందిస్తుండగా ఐఫోన్13 ను 1టెరాబైట్ స్టోరేజ్‌తో అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఐఫోన్ 13 వివరాలు అందుబాటులో ఉండగా.. మిగిలిన ప్రాడక్ట్‌ల వివరాలను ఆపిల్ సంస్థ పూర్తి స్థాయిలో రివిల్ చేయలేదు. చదవండి : వాట్సాప్‌లో మరో ఫీచర్, ఇకపై ఐపాడ్లో కూడా -
iOS 15 వచ్చేది ఈ మోడళ్లకే
వెబ్‌డెస్క్: ఆపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో అనేక అప్డేట్స్ వెల్లడయ్యాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఆపిల్ ప్లాట్ఫార్మ్పై రాబోతున్న కొత్త ఫీచర్లు డెవలపర్స్ వెల్లడించారు. 6ఎస్ ఆపై మోడళ్లకే ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 15కి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఆపిల్ 6ఎస్ ఆ తర్వాత రిలీజైన మోడళ్లకు ఐఓఎస్ 15 అప్డేట్ని అందివ్వనుంది. అంతకు ముందు ఉన్న మోడళ్లకు ఈ కొత్త ఓఎస్ లేనట్టే. పెద్దతెరతో వచ్చిన ఆపిల్ 7, ఆపిల్ 8, ఆపిల్ ఎక్స్, ఆపిల్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్ఈ, ఐఫోన్ 12 సిరీస్‌లో వచ్చిన మోడళ్లకు కొత్త ఐఓఎస్ అప్డేట్ రానుంది. అయితే ఐఓఎస్ 15 ఎప్పుడు రిలీజ్ చేసేది ఇంకా తెలియలేదు. న్యూ ఫీచర్స్ ఫేస్‌టైం పేరుతో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండేలా వీడియో కాల్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న అప్లికేషన్లో వాయిస్ క్యాన్సిలేషన్ మరింత మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మెసేజ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకా ప్రభావంతంగా ఉండేలా డెవలపర్స్ కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. ఫోటోలు, వీడియోలు తదితర స్టఫ్‌ని మేసేజ్ చేయడం మరింత సులువు కానుంది. వీటితో పాటు నోటిఫికేషన్స్, కాంటాక్ట్ ఫోటో, ఫోటో ఎడిటింగ్, డీఎన్డీ వంటి అంశాల్లోనూ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. -
ఫాంగ్ స్టాక్స్ పుష్- నాస్డాక్ రికార్డ్
ఒకే రోజు ఏకంగా 60,000 మందికి కరోనా సోకడంతో రోగుల సంఖ్య 30 లక్షలకు చేరినప్పటికీ బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలోనే సాగాయి. ప్రధానంగా టెక్ దిగ్గజాలు అండగా నిలవడంతో నాస్డాక్ 149 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 10,492 వద్ద ముగిసింది. వెరసి మరోసారి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది.ఈ బాటలో ఎస్అండ్పీ 25 పాయింట్లు(0.8 శాతం) బలపడి 3170 వద్ద నిలవగా.. డోజోన్స్ 177 పాయింట్లు(0.7 శాతం) బలపడి 26,067 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌కు ప్రధానంగా టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్ దన్నునిచ్చాయి. ఈకామర్స్‌లో వాల్‌మార్ట్ పోటీకి తెరతీసినప్పటికీ అమెజాన్ మరోసారి సరికొత్త గరిష్టాన్ని తాకగా.. ఎస్అండ్పీ మార్చి కనిష్టం నుంచి 40 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! షేర్ల తీరిలా ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 0.5 శాతం పుంజుకుని 383 డాలర్ల వద్ద రికార్డ్ గరిష్టాన్ని అందుకుంది. అమెజాన్ 0.5 శాతం బలపడి 3095 డాలర్లను తాకింది. ఇక మైక్రోసాఫ్ట్ 0.3 శాతం లాభంతో 213 డాలర్ల వద్ద, అల్ఫాబెట్ 1500 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ఇతర కౌంటర్లలో అల్జెమీర్స్(మతిమరుపు వ్యాధి)కి ప్రయోగాత్మక చికిత్సను అందించేందుకు దరఖాస్తు చేసిన వార్తలతో ఫార్మా కంపెనీ బయోజెన్ ఇంక్ 4.4 శాతం జంప్‌చేసింది. నేషనల్ జనరల్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో బీమా సంస్థ ఆల్స్టేట్ కార్ప్ 5 శాతం పతనమైంది. నేషనల్ జనరల్ మాత్రం 66 శాతం దూసుకెళ్లింది. క్రూయిజర్, ఎయిర్‌లైన్స్ కౌంటర్లు నీరసిస్తున్నప్పటికీ ఫాంగ్ స్టాక్స్ అండగా నిలవడంతో మార్కెట్లు బలపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
పదేళ్లు పన్ను మినహాయింపు!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో అస్తవ్యస్తమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే క్రమంలో... భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం.. 500 మిలియన్ డాలర్లకు పైగా కొత్త పెట్టుబడులు పెట్టే కంపెనీలకు 10 ఏళ్ల పాటు పూర్తిగా పన్ను మినహాయింపులు ఇచ్చే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, భారీ యంత్రాలు, టెలికం పరికరాల ఉత్పత్తి తదితర రంగాలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కింద ఇన్వెస్ట్ చేసే సంస్థలు.. జూన్ 1 నుంచి మూడేళ్లలోగా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. 100 మిలియన్ డాలర్లు.. నాలుగేళ్లు ... ఇక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే రంగాల్లో 100 మిలియన్ డాలర్లు.. ఆపైన ఇన్వెస్ట్ చేసే సంస్థలకు నాలుగేళ్ల పాటు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఆ తర్వాత ఆరేళ్ల పాటు తక్కువ స్థాయిలో 10% కార్పొరేట్ ట్యాక్స్ రేటు వర్తిస్తుంది. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, ఫుట్‌వేర్ తదితర రంగాలు ఈ జాబితాలోకి వస్తాయి. ప్రస్తుతం పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలకు తాజా మినహాయింపులు అదనం. ఈ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమగ్ర అభివృద్ధిపై దృష్టి.. ప్రధానంగా టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, వజ్రాభరణాలు వంటి రంగాలతో పాటు వివిధ పరిశ్రమల సమగ్ర అభివృద్ధిపై కేంద్రం వాణిజ్య శాఖ దృష్టి పెడుతోంది. సేవల రంగానికి చెందిన టూరిజం వంటి విభాగాలను కూడా ఈ జాబితాలో చేర్చడంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మౌలిక సదుపాయాలు, టెస్టింగ్ ల్యాబ్‌లు, పరిశోధన.. అభివృద్ధి కేంద్రాల అప్‌గ్రెడేషన్ కోసం 50 పారిశ్రామిక క్లస్టర్లను వాణిజ్య శాఖ గుర్తించింది. చైనా నుంచి భారత్‌కు కంపెనీలు.. ఎన్నో ఉత్పత్తుల కోసం ప్రపంచదేశాలు చైనాపైనే అధికంగా ఆధారపడడం వల్ల వైరస్ విస్తరణకు దారితీయడంతోపాటు.. సరఫరా పరంగా తీవ్ర ఇబ్బందుల పాలవ్వాల్సి వచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు చైనాపైనే పూర్తిగా ఆధారపడిపోకుండా ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లోనూ తయారీ యూనిట్ల ఏర్పాటుకు మొగ్గుచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చైనాకు దూరమయ్యే ఆలోచనలో ఉన్న ఇన్వెస్టర్లను భారత్ వైపు ఆకర్షించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. భారత్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే సంస్థలకు స్థల సమీకరణను సులభతరం చేయడం, కొత్త ప్లాంట్లకు పన్నుపరమైన రాయితీలివ్వడం తదితర చర్యలు తీసుకుంటోంది. ‘‘ఎన్నో చర్యల దిశగా పనిచేస్తున్నాం. రాష్ట్రాలు భూముల అందుబాటు వివరాలను సిద్ధం చేసి ఇస్తే, వాటిని ఆసక్తిగల ఇన్వెస్టర్ల ముందు ఉంచుతాం’’ అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఓ సీనియర్ అధికారి ఇటీవల తెలిపారు. బహుళజాతి సంస్థలు చైనా నుంచి పూర్తిగా బయటకు వచ్చే ఆలోచనలో లేవని, కాకపోతే ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయని, వారికి భారత్ ఆకర్షణీయ కేంద్రం అవుతుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. నిర్ణీత సమయంలోగా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, సకాలంలో అన్ని అనుమతులను ఇచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర అధికారులను బాధ్యులను చేయాలని ఎగుమతుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ శరద్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. భారత్ వైపు.. యాపిల్ చూపు.. టెక్ దిగ్గజం యాపిల్ కూడా చైనాలోని తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో అయిదో వంతు భాగాన్ని భారత్‌కు మళ్లించాలని యోచిస్తోంది. దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో భారత్ అమలు చేస్తున్న ఉత్పత్తిపరమైన ప్రోత్సాహకాల ప్రయోజనాలు పొందాలని భావిస్తోంది. ప్రస్తుతం యాపిల్ స్మార్ట్ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ సంస్థలు కాంట్రాక్టు ప్రాతిపదికన తయారు చేసి అందిస్తున్నాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే స్మార్ట్ఫోన్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం కోసం భారత్‌లో తయారు చేసేందుకు .. ఈ కాంట్రాక్టర్లను యాపిల్ ఉపయోగించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) లెక్కల ప్రకారం.. గత త్రైమాసికంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ 62.7 శాతం వాటా దక్కించుకుంది. దేశీయంగా రీసెల్లర్స్ ద్వారానే విక్రయిస్తున్న యాపిల్.. సొంతంగా కూడా స్టోర్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 2021 నాటికి తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభిస్తామని ఇటీవలే సంస్థ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్ఫోన్లు తయారవుతున్నాయి. చిన్న వ్యాపారాలు, తయారీకి ప్యాకేజీ దన్ను ... కరోనా కష్టం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో చిన్న పరిశ్రమలకు పన్నుల రూపంలో ప్రయోజనం కల్పించడమే కాకుండా, దేశీయ తయారీ రంగానికి ఊతం కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా ఇబ్బందుల్లో నుంచి ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించడానికి ఇప్పటికే అమెరికా తమ జీడీపీలో 13% ప్యాకేజ్ని ప్రకటించగా, జపాన్ విషయంలో ఇది 21%. మోదీ ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇదే తరహా భారీ ప్యాకేజ్ కిందకు వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్ తనంతట తానుగా నిలదొక్కుకోడానికి దోహదపడే ప్యాకేజ్‌లో ఇప్పటికే కేంద్రం ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ అలాగే ఆర్బీఐ ద్రవ్య, వడ్డీరేట్ల పరమైన ప్రయోజనలు కలిపి ఉన్నాయి. భూ, కార్మిక, ద్రవ్య, న్యాయ పరమైన అంశాలు ప్యాకేజ్‌లో ఇమిడి ఉంటాయని మోదీ తన మంగళవారంనాటి ప్రసంగంలో పేర్కొన్నారు. మొత్తంగా కరోనాను ఎదుర్కొనే విషయంలో మోదీ ప్రకటించిన ప్యాకేజీ సమగ్ర స్వరూపాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి వెల్లడించనున్నారు. -
సోషల్ మీడియాలో కొత్త క్రేజ్.. స్లోఫీ, అంటే?
ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు యువతలో ఉన్న సెల్పీ పిచ్చిన బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. భారీ సెల్పీ కెమెరా, బ్యూటీ మోడ్, ఫేస్ ఫిల్టర్స్, టైమ్ లాప్స్, బోతీ వంటి ప్రీ-లోడెడ్ కెమెరా ఆప్షన్లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో కొత్త ఫీచర్ యూత్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. దాని పేరే స్లోఫీ. అంటే స్లో మోషన్ సెల్ఫీ అన్నమాట. అమెరికా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ తీసుకొచ్చిన తాజా యాపిల్ ఐఫోన్ల 11 సిరీస్‌లోని ఫ్రంట్ కెమెరాలో ఈ ఫీచర్‌ను జోడించింది. ఇది సెప్టెంబర్ 27 నుండి భారతదేశంలో అందుబాటులో ఉంటుంది. స్లోఫీ అనేది ఐఫోన్ సెల్ఫీ కెమెరా ద్వారా తీసుకునే స్లో మోషన్ షార్ట్ వీడియో. ఇది కూడా స్లో మోషన్ వీడియో లానే పనిచేస్తుంది. 120 ఎఫ్పిఎస్ (సెకనుకు ఫ్రేమ్‌లు) క్యాప్చర్ చేస్తుందట. స్లోఫీ కోసం, వినియోగదారులు ముందు కెమెరాలో స్లో-మో మోడ్‌ను ఆన్ చేయాలి, రికార్డ్ బటన్‌పై ప్రెస్‌చేసి తల, చేయి, ముఖంలోని వేగవంతమైన కదలికలను రికార్డు చేయవచ్చు. అయితే, నెటిజన్లు మాత్రం ఈ స్లోపీపై ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో సెటైర్లు పేలుతున్నాయి. 2019లో చెత్త పదాల్లో ఇదొకటి వ్యాఖ్యానింస్తున్నారు. ఫన్నీ వీడియోలను పోస్ట్ చేశారు. కాగా సెప్టెంబర్ 10న యాపిల్ ఐ ఫోన్లు 11 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించిన ప్రత్యేక కార్యక్రమంలో స్లోఫీ ఫీచర్‌ను పరిచయం చేసింది. First SLOFIE, or THE DUMBEST thing Apple has ever come up with..... pic.twitter.com/RasQTkyEQn — Bradley Allen (@BradleyEline10) September 20, 2019 I’m already tired of the slofies I’m yet to see on Twitter and Instagram 💀#AppleEvent pic.twitter.com/ujNiMR3rFQ — AnnaliseKeating'sSon 🇿🇼🇬🇧 (@kayswizz11) September 10, 2019 New slow motion feature available on the front camera... and a new word #Slofies #iPhone11 #AppleEvent pic.twitter.com/8Jqx4YB2DA — Francisco Jeronimo (@fjeronimo) September 10, 2019 -
ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చిన యాపిల్ సీఈవో
కాలిఫోర్నియా : యాపిల్ సీఈవో టిమ్ కుక్ కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంలో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. శుక్రవారం ఉదయం అనూహ్యంగా యాపిల్ ప్రధాన కార్యాలయం, ఐకానిక్ గ్లాస్ క్యూబ్‌లోకి ప్రవేశించారు. దీంతో అభిమానుల సందడి నెలకొంది. కొత్త ఐ ఫోన్ 11 విక్రయాలు సందర్భంగా ఈ స్మార్ట్ఫోను కొనుగోలు చేయడానికి వచ్చిన అభిమానులు టిమ్ కుక్‌తో సెల్ఫీదిగేందుకు క్యూ కట్టారు. అటు కొత్త ఫోన్ కోసం తెల్లవారుజాము నుండి లైన్లో ఉన్న వందలాది మంది కస్టమర్లను టిమ్ పలకరించారు. వారికి హై ఫైలు ఇస్తూ, సెల్పీలు దిగుతూ ఆకట్టుకున్నారు. రెండున్నర సంవత్సరాలుగా మూసివేసిన ఈ ఆఫీసును పూర్తి హంగులతో ఐదవ అవెన్యూ స్టోర్ అసలు 32వేల చదరపు అడుగుల స్థలాన్ని 77వేల చదరపు అడుగులకు రెట్టింపు చేసారు. రెన్బో కలర్స్ దీన్ని అత్యంత సొగుసుగా తీర్చి దిద్దారు. 32 అడుగుల గ్లాస్ క్యూబ్ ను ఈ నెల ప్రారంభంలో తిరిగి ప్రారంభించారు. ఇది 24 గంటలు, 365 రోజులు వినియోగదారులకు అందుబాటులో ఉండే యాపిల్ స్టోర్ ఇదేనట. కాగా ఇటీవల యాపిల్ హెడ్‌క్వార్టర్స్ క్యుపర్టినోలోని స్టీవ్ జాబ్స్ ఆడిటోరియంలో ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ అధునాతన స్మార్ట్ఫోన్లను జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఆడియో, డాల్బీ అట్మోస్ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6.1 లిక్విడ్ రెటినా డిస్ప్లే, స్లో మోషన్ సెల్ఫీలు, ఏ13 బయోనిక్ చిప్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్ 11 ధర 699 డాలర్ల నుంచి ప్రారంభం. Tim Cook arrives at @Apple 5th Ave reopening as iPhone 11s go on sale. Greeted by about 300 customers. After a few selfies, some handshakes he made his way inside. 24-hour store reopens at 8 after being closed for nearly 3 years for renovations. More on @SquawkCNBC pic.twitter.com/aV2Z0WgJLS — Rahel Solomon (@RahelCNBC) September 20, 2019 -
బ్రహ్మాండమైన అప్డేట్స్తో కొత్త ఐఫోన్, ట్రైలర్
సాక్షి, న్యూఢిల్లీ: యాపిల్ మరో ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ల సిరీస్ లాంచింగ్ ముగిసిన వెంటనే తన పాపులర్ మోడల్ యాపిల్ ఐఫోన్ ఎస్ఆ సిరీస్ ఫోన్‌పై లీక్‌లు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతదేశంలో తక్కువ రేటులో 2016లో తీసుకొచ్చిన ఐఫోన్ ఎస్ఈకి కొనసాగింపుగా ఎస్ఈ2ని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఒకటి ఐ ఫోన్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఐఫోన్ఎస్ఈ మాదిరిగానే కొత్త ఐఫోన్ ఎస్ఈ2 ఉన్నప్పటికీ 4.7 డిస్ప్లేతో రానున్న ఈ డివైస్‌లో ఐఫోన్11 సిరీస్‌లో పొందుపర్చిన గార్జియస్ ఫీచర్లను అమర్చింది. యాపిల్‌కు చెందిన అత్యంత ప్రియమైన డిజైన్‌తో పాటు వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫేస్ ఐడి నాచ్ అప్ ఫ్రంట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ లాంటి లేటెస్ట్ స్పెసిఫికేషన్లతో, తక్కువ ధరలో తీసుకురానుంది. 2019 చివర్లో నిర్వహించే ఒక ఈవెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుందని అంచనా. చదవండి : యాపిల్ ఐఫోన్ 11 వచ్చేసింది.. -
ఆపిల్ ఫోన్లు లాంచింగ్ నేడే..
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన మొబైల్ దిగ్గజం ఆపిల్ తన నూతన ఐఫోన్లను రోజు (సెప్టెంబరు 10, మంగళవారం) విడుదల చేయనుంది. స్టాటస్ సింబల్ గా భావించే, అందులోనూ కేంద్ర ప్రభుత్వ కొత్త ఎఫ్‌డీఐ నిబంధనల నేపథ్యంలో అందుబాటు ధరలో లభించనున్న ఈ కొత్త ఐఫోన్ల కోసం ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఆ ఫోన్లకు గాను ఆపిల్ ప్రీ ఆర్డర్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ఈ సారి మూడు కొత్త ఐఫోన్లను ఆపిల్ విడుదల చేస్తుంది. ఈ క్రమంలో లో ఎండ్ ఐ ఫోన్లు ముందుగా అందుబాటులోకి తీసుకురానుంది. తాజా సమాచారం ప్రకారం ఐఫోన్ 11, ఐఫోన్11 ప్రొ, ఐఫోన్ ప్రొ మ్యాక్స్ మోడళ్ళు రానున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు ఐఫోన్ 11, వాచ్‌లను విడుదల చేయనుంది. అంతేకాదు చౌకధరలో ఐఫోన్ ఎక్స్ ఎస్ మోడల్ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. స్పెసిఫికేషన్లపై అంచనాలు ఇలా ఉన్నాయి ఐఫోన్ 11 ఫీచర్లు 6.1 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 3డీ టచ్ ఫార్మాట్ ఏ13 ప్రాసెసర్ 512జీబీ స్టోరేజ్ 12+12 ఎంపీ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 3110 ఎంఏహెచ్ బ్యాటరీ సుమారు ధర: రూ. 53,700 ఐఫోన్ 11 ప్రో ఫీచర్లు 5.8 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే ఏ13 ప్రాసెసర్ 512జీబీ స్టోరేజ్ 12+12+12 ఎంపీ రియర్ కెమరా 12ఎంపీసెల్పీ కెమెరా 3190 ఎంఏహెచ్ బ్యాటరీ సుమారు సుమారు రూ.71,000 ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫీచర్లు 6.5 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే ఏ13 ప్రాసెసర్ 512జీబీ స్టోరేజ్ 12+12+12 ఎంపీ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 3500ఎంఏహెచ్ బ్యాటరీ సుమారు ధర: రూ.78,800 -
అది ఆపిల్ పండు కాదమ్మా.. ఆపిల్ కంపెనీ!
-
అది ఆపిల్ పండు కాదమ్మా.. ఆపిల్ కంపెనీ!
లైవ్ టీవీలో చర్చ నడుస్తోంది. చర్చలో మాట్లాడుతున్న విశ్లేషకుడు యాపిల్ గురించి ఉదాహరణగా చెప్పాడు. ఆపిల్ బిజినెస్ మన దేశ బడ్జెట్ కంటే కూడా ఎన్నోరెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పాడు. దానికి, ‘ఔనౌను.. ఆపిల్ పండ్ల బిజినెల్ చాలా బాగా జరుగుతోందట. ఆపిల్ పండ్లలో ఎన్నో వెరైటీలు కూడా ఉంటాయంటూ ఆ విశ్లేషకుడితోపాటు టీవీ చూస్తున్న జనాలకు షాక్ ఇచ్చింది ఓ టీవీ యాంకర్. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ చానెల్లో చర్చ సందర్భంగా ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. టీవీలో లైవ్ చర్చకు వచ్చిన ప్యానలిస్ట్.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. పాక్ బడ్జెట్ కంటే కూడా యాపిల్ బిజినెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. దీనికి ఆపిల్ అంటే పండు అనుకున్నయాంకర్ ఇచ్చిన బదులు ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో సెటైర్లు, జోకులు వెళ్లువెత్తుతున్నాయి. పాక్ టీవీ చర్చలు ఇలానే కామెడీగా ఉంటాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఆపిల్‌కు షాక్ : డిజైన్ జీనియస్ గుడ్ బై
టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తన అద్భుతమైన డిజైన్లతో ఆపిల్ సంస్థకు తనదైన ముద్రను అందించిన చీఫ్ డిజైన్ ఆఫీసర్ డిజైనర్ జోనాథన్ పాల్ ఐవ్ (జానీ ఐవ్) రాజీనామా చేయనున్నారు. 1992 నుంచి 27 సంవత్సరాలు సంస్థకు విశేష సేవలందించిన జానీ ఐవ్ (52) ఈ ఏడాది చివరి నాటికి కంపెనీని వీడనున్నారు. ముఖ్యంగా తన సొంత డిజైనింగ్ కంపెనీ ప్రారంభించే యోచనలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో 100మంది బాల్డ్మెన్లో ఒకరిగా పేరు గడించిన ఐవ్ ‘లవ్ ఫ్రమ్’ అనే కొత్త సంస్థను లాంచ్ చేయనున్నారు. ఆపిల్ పునరుజ్జీవనంలోనూ, ఉత్పత్తుల డిజైన్లలో కీలక పాత్ర పోషించిన ఏకైన వ్యక్తి ఐవ్ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. 5వేలకు పైగా పేటెంట్లు, బెస్ట్ డిజైనర్‌గా పలు ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతం. ఈవ్ లేకుండా ఆపిల్ పరికరాలను ఊహించుకోవడం అసాధ్య అని ఆపిల్ సీఈవో కుక్ వ్యాఖ్యలే ఐవ్ ప్రతిభకు నిదర్శనం. మరోవైపు యాపిల్ కంపెనీలో ఉద్యోగం నుంచి రాజీనామా చేసినప్పటికీ ఇదే కంపెనీతో కలిసి పలు ప్రాజెక్టులు చేపడతామని ఆపిల్ ప్రకటించింది చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా ఐమాక్, ఐఫోన్, ఆపిల్ పార్క్, ఆపిల్ రీటైల్స్టోర్లను తీర్చిద్దిద్దడంలో అతని పాత్ర అపూర్వమని టిమ్ కుక్ ప్రశంసించారు. ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఓ సందర్భంలో తనకు యాపిల్‌లో ఎవరైనా స్పిరిచ్యువల్ పార్ట్నర్ ఉన్నారా అంటే అది జానీ ఐవ్ మాత్రమేనని వ్యాఖ్యానించారట. అంతేకాదు ఆపిల్ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో ఐవ్ వాయిస్ ఒక పెద్ద మ్యాజిక్ అని బిజినెస్వర్గాల టాక్. తన నిష్క్రమణపై ఐవ్ మాట్లాడుతూ గతంకంటే బలంగా, శక్తివంతంగా, మరింత నైపుణ్యంతో తన సహోద్యోగులతో కూడిన ఆపిల్ డిజైన్ టీం ఉత్తమంగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాబోయే చాలా సంవత్సరాల్లో వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. -
ఆపిల్ మాక్‌బుక్ ప్రో బ్యాటరీ పేలుతుంది..!
శాన్ఫ్రాన్సిస్కో : సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ఇటీవల విడుదల చేసిన మాక్‌బుక్ ప్రో డివైస్‌లు పేలుతున్నాయిట. ఈ నేపథ్యంలోనే మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఆపిల్ కంపెనీ భారీగా రీకాల్ చేస్తోంది. 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యి ప్రమాదానికి గురుకావచ్చనే ఆందోళనతో వాటిని రీకాల్ చేస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభావితమైన 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఉపయోగించడం మానేయాలని ఆపిల్ వినియోగదారులను కోరింది. అలాగే వీటి బ్యాటరీని ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది రెటినా డిస్ప్లే ఉన్న 15-అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లు, ప్రధానంగా సెప్టెంబర్ 2015- ఫిబ్రవరి 2017 మధ్య అమ్ముడైనవి ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందని హెచ్చరించింది. బ్యాటరీ రీప్లేస్మెంట్ వివరాల కోసం ‘ఆపిల్.కామ్/సపోర్ట్ /15-ఇంచ్-మ్యాక్‌బుక్-ప్రో-బ్యాటరీ-రికాల్ ’ సంప్రదించవచ్చని ప్రకటించింది. -
‘ఎలా ఉన్నారు టిమ్ యాపిల్’
వాషింగ్టన్ : జీవితంలో మనం కలవాలనుకున్న ముఖ్యమైన వ్యక్తిని నిజంగా కలిసినప్పుడు ఆనందంతో మాటలు రావు. ఒక వేళ మాట్లాడిన ఆ ఉద్వేగంలో ఏం మాట్లాడతామో మనకే తెలీదు. ఇదే పరిస్థితి ఢిల్లీకి చెందిన పలాశ్ తనేజా అనే కుర్రాడికి ఎదురయ్యింది. ఆ సమయంలో అతడు ఏం చేశాడో ఆ వివరాలు.. యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలవాలనేది పలాశ్ చిరకాల కోరిక. కొన్ని రోజుల క్రితం ఆ కల నిజమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఓ 13 మంది విద్యార్థులను టిమ్ కుక్ ఆహ్వానించారు. వీరిలో పలాశ్ కూడా ఉన్నాడు. ఈ విద్యార్థులతో పాటు యాపిల్ సిబ్బంది కుక్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కుక్ రానే వచ్చారు. అప్పుడు పలాశ్ యాపిల్ సీఈవోను ఉద్దేశిస్తూ.. ‘టిమ్ యాపిల్.. ఎలా ఉన్నారు’ అని ప్రశ్నించాడు. పలాశ్ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కంటే ముందు టిమ్ కుక్‌తో సహా అక్కడున్న సభ్యులంతా ఒక్క సారిగా నవ్వారు. ఆ తర్వాత కుక్ ‘నేను బాగున్నాను. నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడిగావో నేను అర్థం చేసుకోగలను’ అంటూ చిరునవ్వుతో ముందుకు సాగారు. ఇంతకు ఇక్కడ విషయం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో టిమ్ కుక్‌తో సమావేశమయ్యారు. ట్రంప్‌ది అసలే హాఫ్ మైండ్ కదా. దాంతో యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కాస్తా టిమ్ యాపిల్‌గా సంభోందించారు. టిమ్ ఇంటి పేరును.. కంపెనీ లోగోను కలిపి ఇలా పిల్చారన్నమాట. ఈ ప్రయోగం ఏదో బాగుందని భావించిన కుక్ ఆ రోజు నుంచి తన ట్విటర్ పేరును కాస్తా టిమ్ యాపిల్‌గా మార్చుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పలాశ్ టిమ్ కుక్‌ను.. టిమ్ యాపిల్‌గా సంభోదించడం.. దానికి కుక్ నవ్వడం జరిగాయి. ఇక పలాశ్ విషయానికోస్తే.. ఎనిమిదో తరగతి నుంచే అతను కోడింగ్ మీద ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ ఆసక్తే అతనికి టిమ్‌తో సమావేశమయ్యే అవకాశం కల్పించింది. భారత్‌ను నుంచి కేవలం పలాశ్‌కు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సమావేశంలో అతను అతడు కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత ప్రాజెక్టులను తయారు చేసి టిమ్‌కు చూపించారు. ప్రస్తుతం పాఠశాల విద్య పూర్తి చేసిన పలాశ్(18) యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో చేరనున్నాడు. -
పెల్లుబుకిన ఆగ్రహం : ఆపిల్‌కు భారీ షాక్!
బీజింగ్ : చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేను ఎలాగైనా దారికి తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చైనా యువత భారీ షాకిచ్చింది. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియా యూజర్లు, యువత కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ టెక్ దిగ్గజం హువావేకు అక్కడి యూజర్లు మద్దతుగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను నిషేధించాలంటూ పిలుపు నిచ్చారు. ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన హువావే ఉత్పత్తులు, టెక్నాలజీపై ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వంపై అక్కడి యువత మండిపడుతోంది. ట్విటర్, వైబోలాంటి సోషల్ మీడియా వేదికల్లో ఆపిల్ ఉత్పత్తులను బ్యాన్ చేయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోస్టులకు మిలియన్ల కొద్దీ లైకులు, షేర్లు లభిస్తున్నాయి. దీంతో చైనా అంతటా యాంటీ ఆపిల్ ఉద్యమం ఊపందుకుంది. హువావేపై ట్రంప్ సర్కార్ కావాలనే వేధింపులకు పాల్పడుతోందని యూజర్లు మండి పడుతున్నారు. అలాగే ఆపిల్ ఐఫోన్ కొనాలన్న తన ఆలోచనను మార్చుకుని హువావే ఫోన్‌ను కొనుగోలు చేయనున్నామని మరో యూజర్ ప్రకటించారు. మరోవైపు ఈ నిర్ణయం స్వల్పకాలంలో చైనాలో ఆపిల్ అమ్మకాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఆపిల్ తిరస్కరించింది. దీంతో అమెరికా-చైనా ట్రేడ్ వార్ మరింత ముదురుతున్న ఆందోళన నెలకొంది. కాగా హువావేపై ఆంక్షలను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హువావే దూకుడు : 8కే 5జీ స్మార్ట్ టీవీలు
చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ హువావే స్మార్ట్ టీవీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అమెరికా దిగ్గజం యాపిల్ కంపెనీని వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా అవతరించిన హువావే ప్రపంచంలోనే తొలి 5జీ సపోర్ట్ టీవీని ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. హువావే అదిరిపోయే స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకు రానుందని నికాయ్ ఏషియన్ రివ్యూ నివేదించింది. 5జీ సపోర్ట్ ఫీచర్‌తో 8కే స్మార్ట్ టీవీని త్వరలోనే ఆవిష్కరించనుంది. దీని ప్రకారం కంపెనీ తన మేట్ 20ఎక్స్ 5జీ, ఫోల్డబుల్ మేట్ ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ల మాదిరే ఈ టీవీల్లోనూ 5జీ మాడ్యూల్స్‌ను అమర్చనుంది. ఈ అంచనాలు నిజమైతే 5జీ, హైఎండ్ రిజల్యూషన్ డిస్ప్లే, గిగాబిట్ సామర్థ్యంతో వైర్లెస్ స్టాండర్ట్ కేపబుల్ టీవీని ఆవిష్కరించిన కంపెనీగా హువావే చర్రిత సృష్టించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో శాంసంగ్ కంపెనీకి గట్టి పోటీ ఎదురు కానుంది. కాగా ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీల్లో ఒకటైన హువావే అమ్మకాలు 2019 తొలి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 50 శాతం వృద్దిని సాధించి యాపిల్‌ను సైతం వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. -
భారత మార్కెట్ సవాళ్లమయం..
న్యూయార్క్: దీర్ఘకాలికంగా తమకు కీలకమైనదిగా భావిస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా మాత్రం భారత మార్కెట్లో చాలా సవాళ్లున్నాయని ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయడం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి చర్యలతో భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘దీర్ఘకాలికంగా భారత్ మాకు చాలా కీలకమైన మార్కెట్‌గా భావిస్తున్నాం. స్వల్పకాలికంగా మాత్రం ఇక్కడ చాలా సవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే వీటిని అధిగమించడమెలాగన్నది నేర్చుకుంటున్నాం. భారత్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాల్లో కొన్ని మార్పులు చేశాం. ప్రాథమికంగా అవి కాస్త మెరుగైన ఫలితాలే ఇస్తున్నాయి‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కుక్ చెప్పారు. భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ సెగ్మెంట్లో తీవ్రమైన పోటీ కారణంగా గత నెలలో యాపిల్ తమ ఐఫోన్ ఎక్స్ఆర్ రేటును ఏకంగా 22 శాతం తగ్గించింది. అలాగే దేశీయంగా తయారీ కూడా ప్రారంభించిన యాపిల్.. క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. భారత్‌లో రిటైల్ స్టోర్స్ ఏర్పాటు కోసం అనుమతులు పొందేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామని కుక్ తెలిపారు. భారత మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధిపత్యం ఉంటుండటంపై స్పందిస్తూ.. తమ సంస్థ ఎదగడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయనడానికి దీన్ని నిదర్శనంగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. లాభం 16 శాతం డౌన్.. 2019 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో యాపిల్ లాభం 16% క్షీణించింది. 11.56 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అటు ఆదాయం కూడా అయిదు శాతం తగ్గి 58 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
టెక్ జెయింట్ల పోరుకు ఫుల్స్టాప్
అమెరికా టెక్ జెయింట్లు యాపిల్, క్వాల్కామ్ తమ మధ్య ఉన్న వైరానికి ముగింపు పలికాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాయల్టీ చెల్లింపుల యుధ్దానికి ఫుల్స్టాప్ పెట్టాయి. ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరిందని యాపిల్, అమెరికన్ మైక్రోచిప్ తయారీదారు క్వాల్కామ్ సంయుక్తంగా మంగళవారం ప్రకటించాయి. పరస్పర దాఖలు చేసుకున్న అన్ని వ్యాజ్యాలను ఉపసంహరించుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇందుకు ఇరు కంపెనీల మధ్య ఆరు సంవత్సరాల లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ లెసెన్స్‌ను అవసరమైతే మరో రెండేళ్లపాటు విస్తరించుకునే ఆప్షన్‌కు కూడా ఇందులో జోడించాయి. ఈ ఒప్పందం వైర్లెస్ పరిశ్రమకు లబ్ది చేకూరుస్తుందని విశ్లేషకుడు ప్రాటిక్ మూర్హెడ్ వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో కోర్టులో వాదనల చివరి నిమిషంలో యాపిల్, క్వాల్కామ్ ఈ పరిష్కారానికి రావడం విశేషం. గత రెండు సంవత్సరాలుగా, కంపెనీ మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. దీంతో కోట్లాది రూపాయలకు చెల్లింపులనుంచి క్వాల్కామ్ బయటపడింది. దీంతో వాల్‌స్ట్రీట్‌లో క్వాల్కం 23 శాతానికి పైగా పెరిగింది. దాదాపు 20 ఏళ్లలో ఇది ఉత్తమమైన లాభంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. టెక్ దిగ్గజం యాపిల్, చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ మధ్య పేటెంట్, లైసెన్సింగ్ విధానంపై పోరు న్యాయ స్థానానికి చేరింది. 2017 ఆరంభంలో, అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమీషన్ వద్ద క్వాలాకామ్ తమతో సహా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు లైసెన్సుల విక్రయంలో యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ దావా వేసింది. క్వాల్ కామ్ కంపెనీ మోనోపలి చెలాయిస్తోందన్నది యాపిల్ ఆరోపణ. -
గుడ్ న్యూస్ : ఇక తక్కువ ధరలోనే ఐఫోన్ 7
సాక్షి, బెంగళూరు : ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. త్వరలోనే ఇండియాలో తయారైన మరో ఐఫోన్ సరసమైన ధరలో భారతీయ వినియోగదారులకు లభ్యం కానుంది. మేడిన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది దిగ్గజ సంస్థ ఆపిల్. ఇందులో భాగంగా బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్ ఐపోన్ 7ను రూపొందిస్తోంది. ఈ ఫోన్ల అసెంబ్లింగ్ ప్రక్రియ మార్చి నెలలో ప్రారంభమైదని ఆపిల్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. భారతదేశంతో తమ దీర్ఘకాలిక నిబద్ధతను కొనసాగిస్తూ స్థానిక కస్టమర్లకోసం స్థానికంగా ఐఫోన్ 7ని ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆపిల్ ప్రకటించింది. భవిష్యత్తులో మేడిన్ ఇండియా పోర్టిఫోలియోను మరింత విస్తరించనుందని కూడా తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 7 బేసిక్ మోడల్ రూ.39వేలకంటే తక్కువకే అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ మొబైల్స్‌తో పోలిస్తే ఐఫోన్లు ఖరీదు ఎక్కువే. దీనికి తోడు విదేశీ స్మార్ట్ఫోన్లపై దిగుమతి సుంకాన్ని కూడా కేంద్రం భారీగా పెంచింది. ఈ నేపథ్యంలోనే సుంకాల బారి నుంచి తప్పించుకునేందుకు గత ఏడాది నుంచే భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని చేపట్టింది ఆపిల్ సంస్థ. తైవాన్ దిగ్గజం విస్ట్రోన్ సహకారంతో బెంగళూరులోని ప్లాంట్‌లో ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈలను రూపొందించిన సంగతి తెలిసిందే. -
యాపిల్ టీవీ, న్యూస్ యాప్ లాంచ్
కాలిఫోర్నియా: టెక్దిగ్గజం యాపిల్ మరోసారి సంచలనానికి తెర తీసింది. తన సర్వీస్ పోర్టిఫోలియోను మరింత విస్తరించుకుంది. అంచనాలకనుగుణం గానే టీవీ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ను కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆవిష్కరించింది. అంతేకాదు త్వరలనే యాపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకువస్తామని ప్రకటించింది. యాపిల్ టీవీ యాప్‌ను కొత్త డిజైన్‌తో కొత్తగా లాంచ్ చేసింది. దాదాపు 100దేశాల్లో ఐఫోన్, ఐపాడ్, యాపిల్ టీవీ 4కె లో ప్రస్తుతానికి దీని సేవలు అందుబాటులో ఉంటాయి. శాంసంగ్ స్మార్ట్‌టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, ఎల్సీ, సోనీ, రోకూ, విజియో ప్లాట్‌ఫాంలలో కూడా త్వరలోనే లాంచ్ చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఇందులో అన్ని కొత్త మూవీ రిలీజ్లు, లక్షకుపైగా టైటిల్స్‌తో ఐ ట్యూన్స్ మూవీ కాటలాగ్‌ను అందిస్తుంది. అంతేకాదు యూజర్ల పర్సనల్ లైబ్రరినీ బిల్ట్ ఇన్‌గా అందిస్తుంది. యాపిల్ టీవీ ప్లస్ ఇది స్ట్రీమింగ్ ఆన్లైన్ వీడియో సర్వీస్. సబ్స్క్రిప్షన్ ఆధారంగా తన సేవలను అందిస్తుంది. అయితే సబ్స్క్రిప్షన్ వివరాలను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. ఇందులో కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ వీడియో కంటెంట్ ఉంటుంది. దీనికోసం కంపెనీ 34 టీవీ, మూవీ ప్రొడక్షన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యాపిల్ టీవీ ఛానల్స్ సబ్‌స్క్రైబ్ సేవలను కూడా ఆవిష్కరించింది. ఇందులో హెచ్‌బీవో, స్టార్జ్, షోటైమ్, సీబీఎస్ ఆల్ యాక్సెస్, స్మిత్సోనియన్ ఛానల్, ఎపిక్స్, ఎంటీవీ హిట్స్ వంటి పలు పాపులర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటిని సబ్‌స్క్రైబ్ చేసుకొని యాపిల్ టీవీ యాప్‌లో చూడొచ్చు. ఆన్ డిమాండ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నవి. యాపిల్ న్యూస్ యాప్ యాపిల్ న్యూస్ ప్లస్ అనేది కంపెనీ న్యూస్ యాప్. ఇందులో వివిధ మేగజైన్ల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఇదికూడా సబ్స్క్రిప్లన్ ఆధారిత సేవ. వైర్డ్, పాపులర్ సైన్స్, నేషనల్ జాగ్రఫీ అండ్ ఎసెన్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దాదాపు 300 మేగజైన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. యాపిల్ క్రెడిట్ కార్డు సొంతంగా క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తామని యాపిల్ ప్రకటించింది. దీని పేరు యాపిల్ కార్డు. కంపెనీ క్రెడిట్ కార్డు కోసం గోల్డ్‌మన్ శాక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మాస్టర్‌కార్డ్ నెట్వర్క్ ఆధారంగా పని చేస్తుంది. -
యాపిల్ సంచలనం : ప్రపంచంలోనే తొలి గేమింగ్ సర్వీస్
కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి సంచలనానికి తెరతీసింది. తన సర్వీస్ పోర్టిఫోలియోను మరింత విస్తరించుకుంది. అంచనాల కనుగుణంగానే గేమింగ్, న్యూస్, టీవీ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ను కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆవిష్కరించింది. అంతేకాదు త్వరలోనే యాపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకు వస్తామని ప్రకటించింది. ప్రధానంగా యాపిల్ ఆర్కేడ్ పేరుతో వీడియో గేమ్ సర్వీసులను ఆవిష్కరించింది. సబ్స్క్రిప్షన్ ద్వారా పనిచేసే ప్రపంచంలోనే తొలి గేమింగ్ సర్వీసని యాపిల్ ప్రకటించింది. 100కుపైగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇవ్వన్నీ కేవలం యాపిల్ డివైస్‌లకు మాత్రమే ప్రత్యేకం. -
మెకింతోష్ ఎట్ 35
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన తొలి తరం మెకింతోష్ కంప్యూటర్‌కు ఇటీవల 35 ఏళ్లు పూర్తయ్యాయి. లీసా కంప్యూటర్ విఫలం కావడంతో దాని స్థానంలో దీనిని తీసుకొచ్చారు. మోటొరోలా 68000 సీపీయూతో, 8 మెగాహెర్జ్స్ ఫ్రీక్వెన్సీ, కేవలం 128 కేబీ ర్యామ్‌తో ఈ కంప్యూటర్ పనిచేసింది. గరిష్టంగా 400 కేబీ స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఫ్లాపీ డిస్క్ బిల్టిన్‌గా ఇందులో ఉంది. -
ప్రపంచ మార్కెట్లకు యాపిల్ ‘కోత’!
స్టాక్ మార్కెట్ నష్టాలు గురువారం కూడా కొనసాగాయి. యాపిల్ కంపెనీ ఆదాయ అంచనాల తగ్గింపుతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం, ప్రభుత్వం రైతులకు ప్యాకేజీ ఇవ్వనున్నదన్న వార్తల నేపథ్యంలో ద్రవ్యలోటు మరింతగా విస్తరిస్తుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమనడం, డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. 120 పాయింట్లు తగ్గి 10,672 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 378 పాయింట్లు పతనమై 35,514 పాయింట్ల వద్ద ముగిసింది. లోహ, వాహన, బ్యాంక్ షేర్ల నష్టాలు రెండో రోజూ కొనసాగాయి. రైతులకు కేంద్రం ప్యాకేజీ ! యాపిల్ కంపెనీ తన ఆదాయ అంచనాల్లో కోత విధించింది. గత పన్నెండేళ్ల కాలంలో ఈ కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం ఇదే మొదటిసారి. దీంతో అమెరికా మార్కెట్ పతనం కాగా, గురువారం ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఇది మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపించింది. రైతులకు ఒక్కో ఎకరానికి రూ.4,000 వరకూ ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వార్తలు హల్చల్ చేశాయి. ఫలితంగా ఖజానాపై భారీగా భారం పడనున్నదన్న ఆందోళనతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వచ్చే వారం నుంచి కంపెనీల క్యూ3 ఫలితాలు వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు, దేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరపడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ 70ను దాటిపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 524 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 108 పాయింట్లు లాభపడింది. ఆసియా మార్కెట్ల నష్టాలు పెరగడంతో మన మార్కెట్ కూడా నష్టాల్లోకి జారిపోయింది. అమ్మకాలు కొనసాగడంతో ఒక దశలో 416 పాయింట్ల వరకూ నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 524 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 22 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 131 పాయింట్లు పతనమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంబంధిత బ్యాంక్ షేర్లపై ప్రభావం చూపించింది. షేర్ల మార్పిడి నిష్పత్తి సరిగ్గా లేదన్న కారణంగా దేనా బ్యాంక్ 20% పతనమై రూ.14.40 వద్ద, విజయ బ్యాంక్ 7% తగ్గి రూ.47.60 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో పెరిగినప్పటికీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలాంటి మార్పు లేకుండా రూ.119.4 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.27 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం 2 రోజుల్లో రూ.2.66 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఆదాయం తగ్గుతుంది: యాపిల్ చైనా మందగమనం యాపిల్ ఆదాయ అంచనాల కోతకు దారి తీసింది. యాపిల్ ఆదాయ అంచనాల కోత ప్రపంచ మార్కెట్ల నష్టాలకు దారితీసింది. ఐఫోన్లు తయారు చేసే యాపిల్ కంపెనీ ఈ ఏడాది తొలి క్వార్టర్ ఆదాయ అంచనాలను తగ్గించింది. తమ ఆదాయం 9,100 కోట్ల డాలర్ల నుంచి 8,400 కోట్ల డాలర్లకు తగ్గుతుందని యాపిల్ అంచనా వేసింది. చైనా, వర్ధమాన దేశాల్లో ఆర్థిక క్షీణత అంచనాల కంటే అధికంగా ఉండటంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. యాపిల్ కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం గత పన్నెండేళ్లలో ఇదే మొదటిసారి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ గ్యాడ్జెట్ల అమ్మకాలు తగ్గుతాయనే ఆందోళనను యాపిల్ వెలిబుచ్చింది. బుధవారం మార్కెట్ ముగిసిన తర్వాత కోత అంచనాలను యాపిల్ వెల్లడించింది. చైనాకు చెందిన హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాంఝూను కెనడాలో అరెస్ట్‌చేసి అమెరికా తరలించడం చైనాలో ఐఫోన్ అమ్మకాలపై ప్రభావం చూపగలదని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్‌కుక్ పేర్కొన్నారు. జాతీయవాద సెంటిమెంట్‌తో చైనీయులు ఐఫోన్లను కొనడం మానేసే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లకు తాజాగా రాసిన లేఖలో ఆయన తెలిపారు. ఈ కోత ప్రభావం గురువారం నాడు యాపిల్ షేర్‌పై తీవ్రంగానే పడింది. ఈ షేర్ ధర గురువారం ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 11.30) 10% క్షీణించి 142 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది ఈ షేర్ ఆల్ టైమ్ హై, 233 డాలర్లను తాకింది. అప్పటి నుంచి చూస్తే, దాదాపు 40 శాతం పతనమైంది. -
ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, చెన్నై: ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై కన్నేసిన స్మార్ట్‌ఫోన్ మేకర్ ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటికి భారతదేశంలో టాప్ ఎండ్ ఐఫోన్లను తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ పెట్టుబడులను పెట్టనుంది. తైవాన్ ఎలక్ట్రిక్ దిగ్గజం ఫాక్స్‌కాన్ స్థానిక యూనిట్ ద్వారా ఖరీదైన ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయనుంది. ముఖ్యంగా ఐ ఫోన్ ఎక్స్, ఎక్స్ ఎస్, మాక్స్, ఎక్స్ఆర్ లాంటి అతి ఖరీదైన స్మార్ట్ఫోన్లను రూపొందించనుంది. తమిళనాడులో శ్రీపెరంబూర్ ప్లాంట్‌లో ఐఫోన్ ఎక్స్ అసెంబ్లింగ్‌ను సాధ్యమైనంత( వచ్చే ఏడాది ప్రారంభం నుంచి) తొందరగా ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లోనే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో ఈ యాపిల్ ఫోన్ల అసెంబ్లింగ్‌ను మొదలుపెడ్తామని ఫాక్స్‌కాన్ వెల్లడించింది. సుమారు రూ.2500 కోట్ల పెట్టుబడులను ఆపిల్ పెడుతోంది. మరోవైపు కొత్త విస్తరణ నేపధ్యంలో భారీగా ఉద్యోగవకాశాలు లభిస్తాయని తమిళనాడు ప్రభుత్వం ఆశిస్తోంది. సుమారు 25వేలకు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి సంపత్ రాయిటర్స్‌తో చెప్పారు. అయితే ఈ వార్తలపై స్పందించడానికి ఆపిల్ ప్రతినిధి తిరస్కరించారు. కాగా విస్ట్రన్ కార్పోరేషన్ ద్వారా బెంగళూరులో ఐ ఫోన్ ఎస్ఈ, ఆర్ఎస్ మోడల్స్ మాత్రమే దేశంలో ఎసంబుల్డ్ చేస్తోంది ఆపిల్ కంపెనీ. అలాగే చెన్నై ప్లాంట్‌లో గతంలో నోకియా ఫోన్లను తయారు చేసిన ఫాక్స్‌కాన్ ప్రభుత్వంతో వచ్చిన విబేధాల కారణంగా 2014లో ఉత్పత్తిని నిలిపివేసింది. రూ.21 వేల కోట్ల పన్ను వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో తాజాగా ఆ ప్లాంట్‌లో ఆపరేషన్స్ మొదలుపెట్టినట్టు సమాచారం. -
ఆపిల్‌కు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ను మరో దిగ్గజం సంస్థ మైక్రోసాఫ్ట్ వెనక్కి నెట్టి ముందుకు దూసుకు వచ్చింది. మార్కెట్ క్యాప్‌కు సంబంధించిన మైక్రోసాఫ్ట్ అమెరికాలో నెం.1 కంపెనీగా స్థానాన్ని దక్కించుకుంది. తద్వారా ఇటీవల జోరుమీదున్న ఆపిల్‌కు మైక్రోసాఫ్ట్ గట్టి షాక్ ఇచ్చింది. నాలుగు నెలల క్రితం ఆపిల్ షేర్లు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఆగస్టులో 207 డాలర్ల మార్క్‌ను అందుకొని, దాన్ని సాధించిన తొలి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది. అప్పటి నుంచి ఆపిల్ కొత్త రికార్డులను సాధించడం ప్రారంభించింది. ఏడు వారాల క్రితం 231 డాలర్ల షేర్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఆపిల్ షేర్లు బిజినెస్ ఎనలిస్ట్లకు కూడా అర్థం కాని స్థితిలో నిలకడలేమితో కొనసాగుతున్నాయి. ఊహించని పరిణామాలు జరుగుతుండడంతో ఆపిల్‌లో ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడుదారులు సైతం వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చింది. దీంతో ఆపిల్ షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో తీసుకొచ్చిన ఐఫోన్ ఎక్స్ఆర్ సేల్స్‌లో బోల్తా పడ్డాయి. ఈ పరిణామామే ఆపిల్ పతనానికి కారణమని ట్రేడ్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆపిల్ షేర్లు 172.29 డాలర్లకు దిగజారాయి. కొద్ది వారాల సమయంలోనే ఆపిల్ షేర్లు 25 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. దీంతో ఆపిల్ ట్రిలియన్ డాలర్ల కంపెనీ అనేది చేదు కలగానే మిగిలిపోయింది. అంతేకాదదు ఆపిల్ మూలధనం (మార్కెట్ క్యాపిటల్) కూడా భారీ మార్పు చవిచూసింది. ఆపిల్ మూలధనం 746 బిలియన్ డాలర్లకు దిగి రాగా, 753 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో అతిపెద్ద (మార్కెట్ క్యాప్‌లో)సంస్థగా నిలిచింది. అమెజాన్, గూగుల్ సంస్థలు ఆపిల్ కంటే కిందే ఉన్నప్పటికీ, ఆపిల్ షేర్లు ఇప్పటిలాగే పడిపోతుంటే రానున్న రోజుల్లో మరింత దిగజారే అవకాశం ఉంది. -
స్విస్ వాచీల హైటెక్ రూటు!
లగ్జరీకి, ఖచ్చితత్వానికి స్విట్జర్లాండ్ (స్విస్)వాచీలు పెట్టింది పేరు. శతాబ్దాలుగా అనేక సవాళ్లను అధిగమిస్తూ దిగ్గజాలుగా ఎదిగిన స్విస్ వాచీ సంస్థలకు ప్రస్తుతం టెక్ దిగ్గజం యాపిల్ స్మార్ట్‌వాచీల రూపంలో మరో సవాలు ఎదురైంది. ప్రారంభంలో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా.. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్‌వాచీల తయారీపై స్విస్ దిగ్గజాలు కూడా దృష్టి పెడుతున్నాయి. వినూత్న స్మార్ట్, హైబ్రీడ్ వాచీలను రూపొందిస్తున్నాయి. సాంప్రదాయ వాచీలకు హైటెక్ హంగులు అద్దుతున్నాయి. ఇందుకోసం ట్యాగ్ హోయర్, స్వాచ్, ఫాజిల్ వంటి దిగ్గజాలు యాపిల్ పోటీ సంస్థలైన గూగుల్, ఇంటెల్ కార్పొరేషన్‌తో జత కడుతున్నాయి. ఓవైపు సాంప్రదాయ డిజైన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు టెక్నాలజీ ఫీచర్స్‌ను కూడా పొందుపరుస్తూ సొంత స్మార్ట్ వాచీలు, హైబ్రీడ్ వెర్షన్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. న్యూఢిల్లీ: 2015లో యాపిల్ వాచీని తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు అంతర్జాతీయంగా స్విస్ వాచీల అమ్మకాలు తగ్గాయి. మళ్లీ కొన్నాళ్లుగా కాస్త పుంజుకున్నప్పటికీ యాపిల్ గట్టి పోటీనే ఇస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ యూబీఎస్ అంచనాల ప్రకారం వచ్చే ఏడాది యాపిల్ వాచీల అమ్మకాలు 40% పెరిగి 3.3 కోట్లకు చేరనున్నాయి. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలోనే యాపిల్ 88 లక్షల వాచీలను విక్రయించనుందని అంచనా. గణాంకాల ప్రకారం 2016లో మెకానికల్ వాచీల విక్రయాలను స్మార్ట్‌వాచీలు అధిగమించాయి. 2015లో అసలు ఊసే లేని హైబ్రీడ్ వాచీల అమ్మకాలు 2017లో 75 లక్షలుగా నమోదైనట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ నివేదిక పేర్కొంది. 2020 నాటికల్లా ఈ రెండు రకాల వాచీల అమ్మకాల పరిమాణం రెట్టింపవుతుందని సంస్థ అంచనా వేసింది. యాపిల్ సిరీస్ 4 వాచీల ధర 399 డాలర్ల నుంచి ఉంటున్న నేపథ్యంలో పెద్ద సంస్థలతో పోలిస్తే ఆ శ్రేణికి దరిదాపుల్లో తమ వాచీలను విక్రయించే చిన్న స్విస్ సంస్థలే ఎక్కువగా పోటీని ఎదుర్కొనాల్సి వస్తోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. హైబ్రిడ్కి ప్రాధాన్యం.. కొన్ని సంస్థలు స్మార్ట్ వాచీల వైపు మళ్లుతుండగా.. చాలా మటుకు కంపెనీలు హైబ్రిడ్స్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. వీటిలో టచ్ స్క్రీన్లు ఉండవు. ఇవి యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్స్‌కి అనుసంధానమవుతాయి. కాల్స్, మెసేజీల్లాంటివేమైనా వస్తే వైబ్రేషన్, లైట్లు ఆరి వెలగడం వంటి ఫీచర్స్‌తో అలర్ట్ చేస్తాయి. బ్లూటూత్ కనెక్షన్‌తో వాచీలోని పుష్ బటన్స్‌ని ఉపయోగించి.. ఫోన్ కెమెరా, మ్యూజిక్ ఫంక్షన్స్ మొదలైనవాటిని ఆపరేట్ చేయొచ్చు. ట్యాగ్ హోయర్లో అత్యంత చౌకైన వాచీ ధర కూడా 1,200 డాలర్ల పైమాటే. లగ్జరీ స్విస్ వాచీ తయారీ సంస్థలపై యాపిల్ ప్రభావం మరీ అంతగా లేకున్నా.. అవి ముందుగా హైబ్రిడ్ వాచీలతో మొదలుపెట్టి. ఆ తర్వాత పూర్తి స్థాయి స్మార్ట్ వాచీల వైపు మళ్లాలని భావిస్తున్నాయి. వినూత్న ఫీచర్స్‌కు పెద్ద పీట.. స్మార్ట్‌వాచీలను సాధ్యమైనంత వినూత్నంగా తయారు చేసేందుకు స్విస్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ట్యాగ్ హోయర్ ఇటీవలే కనెక్టెడ్ మాడ్యులర్ 41 పేరిట తమ స్మార్ట్‌వాచీలకు అప్‌గ్రేడ్ అందించింది. ఈ వాచీల్లో ఫిట్నెస్ ట్రాకింగ్, జీపీఎస్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అటు మరో సంస్థ హుబ్లో .. ఇతర సంస్థల భాగస్వామ్యంతో లిమిటెడ్ ఎడిషన్ వాచీలను ప్రవేశపెడుతోంది. 2018 సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా బిగ్ బ్యాంగ్ రిఫరీ పేరిట ఇలాంటి వాటిని అందుబాటులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు గేమ్ అలర్ట్‌లు అందించడం తదితర ఫీచర్స్‌తో రూపొందించిన ఈ వాచీలను పరిమిత స్థాయిలో 2,018 మాత్రమే విక్రయించింది. స్వాచ్ గ్రూప్ తమ లేటెస్ట్ వాచీ.. స్వాచ్ బెలామీ 2లో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ఫీచర్‌ను పొందుపర్చింది. అంతేగాకుండా వాచీల కోసం స్వాచ్ ఓఎస్ పేరిట సొంత ఆపరేటింగ్ సిస్టంపై కూడా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఓఎస్‌పై పనిచేసే వాచీలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా హైబ్రిడ్ వాచీల మార్కెట్లో అమెరికాకు చెందిన ఫాజిల్ గ్రూప్ అగ్రగామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి మూడు హైబ్రిడ్ వాచీల్లో ఒకటి ఫాజిల్ గ్రూప్‌దే ఉంటోంది. ఎంపోరియో, అర్మానీ, డీజిల్ వంటి దిగ్గజ బ్రాండ్స్‌తో కలిసి ఈ గ్రూప్ ఈ ఏడాది సుమారు 25 కొత్త వాచీలను ప్రవేశపెట్టింది. వీటిల్లో గుండె కొట్టుకుంటున్న వేగాన్ని తెలిపే ఫీచర్‌తో పాటు గూగుల్ పే టెక్నాలజీ మొదలైనవన్నీ ఉన్నాయి. ఫాజిల్ గ్రూప్ విక్రయించే హైబ్రిడ్ వాచీల్లో అత్యంత చౌకైన మోడల్స్‌లో క్యూ మోడర్న్ పర్సూట్ కూడా ఒకటి. దీని ధర 155 డాలర్లు (సుమారు రూ. 10,850). -
యాపిల్ ఇండియా హెడ్‌గా ఆశిష్ చౌదరి
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తమ భారత విభాగానికి హెడ్‌గా ఆశిష్ చౌదరిని నియమించింది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం నోకియా నెట్‌వర్క్స్‌లో ఆయన చీఫ్ కస్టమర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. మరోవైపు, ఉన్నత స్థాయిలో మార్పులు, చేర్పులు చేపడుతున్నట్లు నోకియా వెల్లడించింది. దాదాపు 15 సంవత్సరాల పాటు కీలక హోదాల్లో పనిచేసిన ఆశిష్ చౌదరి ఈ ఏడాది ఆఖరునాటికి తప్పుకోనున్నట్లు, మరో సంస్థలో లీడర్షిప్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వివరించింది. ఎంటర్ప్రైజ్, టెలికం రంగాల్లో చౌదరికి అంతర్జాతీయ స్థాయిలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. -
ఆపిల్ ఇండియా కొత్త బాస్ ఈయనే
ప్రముఖ టెక్ సంస్థ, ఐ ఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ ఇండియాలో కొత్త బాస్‌గా అశిష్ చౌదరి ఎంపికయ్యారు. నోకియా సంస్థలో చీఫ్ కస్టమర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఉన్న ఆశిష్‌ను ఇండియా ఆపరేషన్స్ హెడ్‌గా నియమించింది ఆపిల్. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. భారతీయ మార్కెట్‌పై కన్నేసిన ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి ఆపిల్ ఇండియా పగ్గాలు అప్పగించారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో నోకియా లీడర్షిప్ టీంలో మార్పులను చేపట్టనుంది. పదిహేనేళ్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత చౌదరి ఈ ఏడాది చివరికి ఆయన కంపెనీని వీడనున్నారని నోకియా మంగళవారం ప్రకటించింది. చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా నోకియా అమ్మకాలు, కార్యకలాపాలకు ప్రపంచవ్యాప్తంగా బాధ్యత వహించిన ఆశిష్ చౌదరి నోకియా పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. వ్యాపార, టెలికాం రంగాల్లో 25 సంవత్సరాల అనుభవం ఆయన సొంతం. కాగా 2018 క్యూ4 లో ఇండియాలో ఆపిల్‌కు డిమాండ్ గణనీయంగా క్షీణించినప్పటికీ భవిష్యత్ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నియామకాన్ని చేపట్టారని మార్కెట్ వర్గాల విశ్లేషణ. -
ఆపిల్ యూజర్లకు గుడ్‌న్యూస్ : అమెజాన్‌తో డీల్
టెక్ దిగ్గజం ఆపిల్, అతిపెద్ద ఈ కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్ కీలక భాగస్వామ్యాన్ని కుదర్చుకున్నాయి. రానున్న హాలిడే షాపింగ్ సీజన్ దృష్ట్యా తమ మధ్య వైరాన్ని సైతం పక్కన బెట్టి మరీ ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ మేరకు నవంబరు 9న అమెజాన్ ఒక ప్రకటన జారీ చేసింది. రానున్న వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫాంలో విక్రయిస్తామని తెలిపింది. దీని ప్రకారం ఐఫోన్ ఎక్స్ఆర్, ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మాక్స్‌లాంటి తాజా ఆపిల్ ఉత్పత్తులతో పాటు ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఆపిల్ టీవీలను అమెజాన్ ద్వారా అందుబాటులోకి తెస్తుంది. ఇప్పటివరకు థర్డ్‌పార్టీ సెల్లర్‌గా మాత్రమే ఆపిల్ ఉత్పత్తులను విక్రయించిన అమెజాన్ తాజా ఒప్పందం ప్రకారం నేరుగా వీటిని అమ్మనుంది. దీంతో 2019, జనవరి 4నుంచి ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ఇతర కంపెనీలు తమ లిస్టింగ్‌లను తొలగించనున్నాయి. అయితే ఇందులో చిన్న మినహాయింపు కూడా ఉంది. ఆపిల్ హోం ప్యాడ్ స్మార్ట్ స్పీకర్ మాత్రం అమెజాన్ సైట్లో లభ్యం కాదు. భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఐఫోన్లు, ఐప్యాడ్లు తదితర ఆపిల్ లేటెస్ట్ ఉత్పత్తులను విక్రయించనున్నట్టు చెప్పింది. విక్రయాలను పెంచుకునే లక్ష్యంతో ఈ డీల్ కుదుర్చుకున్నట్టు ఆపిల్ వెల్లడించింది. ఆపిల్ కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు అమెజాన్‌తో కలిసి పనిచేస్తున్నామని ఆపిల్ ప్రతినిధి నిక్ లీ తెలిపారు. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, మాక్ తదితర తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యూజర్లకు మరో గొప్ప అవకాశాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. -
నేను గే కావడం దేవుడిచ్చిన వరం : యాపిల్ సీఈవో
న్యూయార్క్ : స్వలింగ సంపర్కడి(గే)గా ఉండటం తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని ఐటీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను గే అయినందుకు గర్వపడుతున్నాను. నేను గే అని ప్రపంచానికి తెలిసాక చాలా మంది నాకు ఉత్తరాలు రాసి వారి బాధలు చెప్పుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వారి ఆవేదనను పంచుకున్నారు. నేను గే అని తెలిసాక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి చాలా మంది బయటపడ్డారు. అలాంటి వారిలో ధైర్యం నింపెందుకు నేను ప్రయత్నిస్తున్నాను. స్వలింగ సంపర్కులైనా జీవితంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు.’ అని తెలిపారు. కాగా 2014లో టిమ్‌కుక్ తాను స్వలింగ సంపర్కుడినంటూ బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో పన్నులకు సంబంధించి అమెరికా ప్రధాని డోనాల్డ్ ట్రంప్ పాలసీలను సైతం ప్రస్తావించారు. కార్పోరేట్ పన్ను కోతలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కుక్ ప్రశంసించారు. ఇది అమెరికాలో మరిన్ని పెట్టుబడులకు సహాయపడుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. -
ఆపిల్, అమెజాన్ కంపెనీలపై చైనా గూఢాచార్యం
ఈ మధ్య చైనాకు, అమెరికాకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో సంబంధాలు బలహీనపడ్డాయి. చైనాపై అగ్రరాజ్యం తీవ్ర ఆరోపణలు చేయడం, వాటిని డ్రాగన్ కొట్టిపడేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత రాజుకునేలా, ఓ ఆశ్చర్యకరమైన రిపోర్టు వెలుగులోకి వచ్చింది. అమెరికా అగ్ర కంపెనీలైన ఆపిల్, అమెజాన్ వంటి 20 కంపెనీలపై చైనా గూఢాచార్యం చేస్తుందని ఓ యూఎస్ పబ్లికేషన్ ప్రచురించింది. చైనా ఫ్యాక్టరీలు తయారుచేసిన మదర్‌బోర్డును వాడుతున్న అమెరికా కంపెనీలపై డ్రాగన్ గూఢాచార్యం చేస్తుందట. ఆ మదర్‌బోర్డ్‌లో ఓ మైక్రోచిప్‌ను అమర్చి, అమెజాన్, ఆపిల్ వంటి 28 ఇతర అమెరికా కంపెనీలు, సంస్థల సర్వర్లను చైనా హ్యాక్ చేస్తుందని తాజా రిపోర్టు పేర్కొంది. సూపర్ మైక్రో మదర్ బోర్డుల్లో అమర్చే ఈ చిన్న చిప్‌లు చైనీస్ గూఢాచారులకు అనుమతిస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. దీంతో ఈ మదర్ బోర్డులను వాడే డేటా సెంటర్లు, కంప్యూటర్లలోకి హ్యాకర్లు, గూఢాచారులు చొచ్చుకుపోతున్నట్టు తెలిపింది. 2015లోనే మదర్బోర్డుల్లో ఈ చైనీస్ చిప్‌ను గుర్తించినట్టు పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఎంతో సీక్రెట్‌గా ఉంచి, అమెరికన్ అధికారులు విచారణ జరుపుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మంది అధికారులకు ఈ విషయం తెలుసని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది. చైనా ఫ్యాక్టరీల్లో మదర్‌బోర్డులను తయారు చేసేటప్పుడే ఈ చిప్‌లను అమర్చుతారట. హై-వాల్యు కార్పొరేట్ సీక్రెట్లను, ప్రభుత్వ నెట్‌వర్క్‌ల కీలక డేటా సుదీర్ఘ కాలం పాటు యాక్సస్ చేసుకోవడమే చైనా లక్ష్యమని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు.అయితే మదర్‌బోర్డులో చిప్‌లను అమర్చి, గూఢాచారం చేపడుతుందని తనపై వస్తున్న ఆరోపణలు చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. -
టాప్‌లోకి ఆపిల్, ఫేస్బుక్ పడిపోయింది
ప్రపంచంలో టాప్ బ్రాండుల జాబితాలో స్థానాలన్నీ తారుమారు అయ్యాయి. టాప్ బ్రాండుగా ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చిన సెర్చింజన్ దిగ్గజం రెండో స్థానానికివచ్చేసింది. గూగుల్ స్థానాన్ని ఆపిల్ భర్తీ చేసి టాప్ కొచ్చింది. అదేవిధంగా ఇటీవల డేటా స్కాండల్ సమస్యలతో సతమతమవుతున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది. గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్బ్రాండ్స్‘బెస్ట్ 100 గ్లోబల్ బ్రాండ్స్ 2018’ను జాబితాను ప్రకటించింది. దీనిలో టాప్ బ్రాండుగా ఆపిల్ చోటు దక్కించుకుంది. ఆపిల్ ఇటీవలే 1 ట్రిలియన్ డాలర్ల(రూ.73.7 లక్షల కోట్ల) మార్కెట్ క్యాప్‌ను సొంతం చేసుకున్న తొలి కంపెనీగా నిలిచింది. దీంతో ఆపిల్ బ్రాండు విలువ ఏడాది ఏడాదికి 16 శాతం పెరిగి, 214.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆపిల్ టాప్‌లోకి రావడంతో, గూగుల్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గూగుల్ బ్రాండ్ విలువ 10 శాతం పెరిగి, 155.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఆపిల్, గూగుల్ తర్వాత 56 శాతం వృద్దితో అమెజాన్ మూడో టాప్ బ్రాండుగా చోటు దక్కించుకుంది. అమెజాన్ తర్వాత 92.7 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానాన్ని, 66.3 బిలియన్ డాలర్లతో కోకా కోలా ఐదో స్థానాన్ని, శాంసంగ్ ఆరో స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండల్ ఉదంతంతో ఫేస్బుక్ బ్రాండు విలువ 6 శాతం క్షీణించి, తొమ్మిదో స్థానంలోకి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత దశాబ్దంలో బ్రాండులు చాలా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చాయని, అవి తమ కస్టమర్లను అర్థం చేసుకుంటూ.. వారికి అనుగుణంగా ఎప్పడికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్‌లను అందజేస్తున్నాయని ఇంటర్‌బ్రాండ్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చార్లెస్ ట్రెవిల్ చెప్పారు. తొలిసారి స్పాటిఫై, సుబరు గ్లోబల్ టాప్ 100 బ్రాండ్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఎలోన్ మస్క్‌కు చెందిన టెస్లా గతేడాది టాప్ 100లో ఉంది. కానీ ఈసారి టాప్ 100 రేసులో నిలువలేకపోయింది. దాని బ్రాండు, భవిష్యత్తుపై వివాదాలు నెలకొనడంతో, టెస్లా టాప్ 100లోకి రాలేకపోయింది. బ్రాండెడ్ ప్రొడక్ట్‌ల, సర్వీసుల ఆర్థిక పనితీరు, కొనుగోలు నిర్ణయాలు, బ్రాండ్ పోటీతత్వ బలం, విశ్వసనీయతను సృష్టించే సామర్ధ్యంను ఆధారంగా చేసుకుని ఇంటర్‌బ్రాండ్ ఈ రిపోర్టును విడుదల చేస్తుంది. -
ఆ ఐఫోన్ ధర ఏడు లక్షలు
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవల ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు డివైజ్‌లు ఇప్పటికే భారత్‌తో పాటు పలు దేశాల్లో విక్రయానికి వచ్చాయి. ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఐఫోన్లలో ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ చాలా ఖరీదైనదని మనకు తెలుసు. 512జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1,449 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 1,05,513 రూపాయలు. కానీ ఈ వేరియంట్ ధర ఇప్పుడు ఏడింతలకు పైగా పెరిగి పోయింది. అంటే ఏడు లక్షలకు మించిపోయింది. అలా ఎందుకు అంటే లగ్జరీ రష్యన్ బ్రాండు కేవియర్ తెలిసే ఉంటుంది కదా. ఆ బ్రాండు ఐఫోన్లను కస్టమైజ్డ్ చేసి విక్రయిస్తూ ఉంటుంది. తాజాగా ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌ను కస్టమైజ్డ్ చేస్తోంది. వెనుకవైపు ఎక్కువగా బంగారపు ప్యానల్‌ను అందిస్తోంది. ఈ ప్యానల్ కోసం 150 గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తోంది. ఇలా ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌ను గరిష్టంగా ఐదు బంగారపు మోడిఫికేషన్స్‌లో ఈ లగ్జరీ బ్రాండ్ కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. కేవియర్ కంపెనీ ప్రవేశపెట్టే ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ మోడల్స్‌లో ఒకటి 1ఎంఎం టైటానియంను వాడుతూ రూపొందించింది. అది బుల్లెట్ ప్రూఫ్‌ను కూడా కలిగి ఉంది. దీని ధర 5,500 డాలర్లు. ఇక రెండోది దానికి గ్లాస్‌కు బదులు కార్బన్‌ను వాడింది. దీని ధర 5,200 డాలర్లు. ఇక మూడో మోడల్లో 400 డైమాండ్లను పొందుపరిచింది. వెనుకవైపు ప్యానల్లో ఈ డైమాండ్లను అలకరించింది. దీని ధరే 9,890 డాలర్లు అంటే రూ.7,20,663. నాలుగో వేరియంట్‌ను పూర్తి గోల్డ్ ప్లేటింగ్‌తో 5,960 డాలర్లకు అందిస్తోంది. ఈ మోడల్స్‌ను ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా షిప్పింగ్ చేయనుంది కంపెనీ. వారెంటీ కార్డు, యూఎస్బీ కేబుల్, ఛార్జర్‌తో ఈ ఫోన్‌ను విక్రయిస్తోంది కేవియర్ కంపెనీ. -
12 గంటల వ్యవధిలోనే 2 సార్లు దొంగతనం
-
12 గంటల వ్యవధిలోనే 2 సార్లు బీభత్సం
శాన్ఫ్రాన్సిస్కో : ఒక స్టోర్‌లో ఒకసారి దొంగతనం జరిగింది అంటే.. అది గ్రహపాటునో లేదా అలర్ట్‌గా లేకపోవడం వల్లనో జరిగింది అనుకుంటాం. కానీ అదే స్టోర్‌లో మళ్లీ చోరీ జరిగితే, అది మాత్రం కచ్చితంగా సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వమే అవుతుంది. అమెరికాలో టెక్ దిగ్గజం ఆపిల్ స్టోర్‌లో అదే జరిగింది. ఆపిల్ తన కొత్త ఐఫోన్ 10ఎస్ లాంచ్ ఈవెంట్లో నిమగ్నమై ఉన్న సందర్భంగా.. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌లో 12 గంటల వ్యవధిలో రెండు సార్లు చోరీ జరిగింది. ఈ చోరీలో వేల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. పాలో ఆల్టో పోలీసులు సమాచారం ప్రకారం.. తొలుత శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆపిల్ స్టోర్‌లో దొంగతనం జరిగింది. ఆ సమయంలో ఎనిమిది మంది అనుమానిత వ్యక్తులు డెమోకి ఉంచిన 57 వేల డాలర్ల విలువైన ఐఫోన్లను ఎత్తుకెళ్లారు. దానిలో కొత్త ఐఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఇతర ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ప్రొడక్ట్‌లను దొంగలించిన అనంతరం, వారు పలు వాహనాల్లో పారిపోయారని 9టూ5మ్యాక్ రిపోర్టు చేసింది. వెంటనే ఆదివారం ఉదయమే, మళ్లీ ఆపిల్ స్టోర్ గ్లాస్ డోర్లను బద్దలు కొట్టి మరిన్ని ఉత్పత్తులను దోచుకుపోయారు. మొత్తంగా 12 గంటల వ్యవధిలో పోయిన డివైజ్‌ల విలువ 1,07,00 డాలర్లుగా ఉంటుందని తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఈ చోరీకి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. కేవలం పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌ను మాత్రమే కాకుండా.. కాలిఫోర్నియాలోని మరో స్టోర్ శాంట రోజా ప్లాజా షాపింగ్ సెంటర్‌ను కూడా దుండగులు టార్గెట్ చేశారు. కానీ అక్కడ దొంగలను పోలీసులకు చిక్కారు. గత కొన్నేళ్లుగా ఆపిల్ స్టోర్లను టార్గెట్‌గా చేసుకుని దుండగులు పలు చోరీలకు పాల్పడుతున్నారు. కొత్త ఐఫోన్ల లాంచింగ్ తర్వాత పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌లో ఇప్పటికి రెండు సార్లు దొంగతనం జరిగింది. అది కూడా వెంట వెంటనే. ఆగస్టు, సెప్టెంబర్ మధ్య కాలంలో కూడా ఆరు ఆపిల్ స్టోర్లలో కనీసం తొమ్మిది సార్లు దుండగులు రెచ్చిపోయారు. ఆదివారం శాంట రోజా ప్లాజాలో జరిగిన దొంగతనం కూడా నెల వ్యవధిలోనే రెండోది అని ఫాక్స్ న్యూస్ రిపోర్టు చేసింది. -
నెలకు రూ.4,499 కట్టి, ఐఫోన్ 10ఎస్ పొందండి
టెక్ దిగ్గజం ఆపిల్‌కు భారత్‌లో ఉన్న అధికారిక డిస్ట్రిబ్యూటర్స్‌లో ఇండియాస్టోర్.కామ్ ఒకటి. ఈ అధికారిక వెబ్సైట్లో ఆపిల్ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు లో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎయిర్టెల్, జియో, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా వీటిని విక్రయానికి ఉంచుతుంది ఆపిల్. ఆసక్తి గల కస్టమర్లు ముందస్తుగా ఈ ఫోన్లను బుక్చేసుకోవాలని ఆపిల్ తెలిపింది. ఈ సందర్భంగా ఇండియాస్టోర్.కామ్ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు రూ.4,999 చొప్పున 24 నెలల పాటు చెల్లించి, ఐఫోన్ 10ఎస్(64జీబీ) వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. దీనిపై విధించే వడ్డీరేటు అనంతరం ఐఫోన్ 10ఎస్( జీబీ) ధర రూ.99,900 నుంచి రూ.1,07,976కు పెరుగుతుందని పేర్కొంది. అదేవిధంగా ఐఫోన్ 10ఎస్(256జీబీ) వేరియంట్‌ను కూడా 24 నెలల పాటు నెలకు రూ.5,175 చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. దీనిపై విధించే వడ్డీరేటుతో కూడా ఐఫోన్ 10ఎస్(256జీబీ) వేరియంట్ ధర కూడా రూ.1,14,900 నుంచి రూ.1,24,200కు పెరుగుతుందని తెలిపింది. ఐఫోన్ 10ఎస్(512జీబీ) వేరియంట్ కూడా నెలకు రూ.6,076 చెల్లించడంతో కొనుగోలుదారులకు సొంతమవుతుంది. మిగతా మొత్తాన్ని 24 నెలల్లో చెల్లించాలి. అదేవిధంగా ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ 64జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లను కూడా నెలకు 4,999 రూపాయలు, 5,678 రూపాయలు, 6,587 రూపాయలు చొప్పున 24 నెలల పాటు చెల్లించి తమ సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 28 నుంచి ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లు భారత్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రెండు హ్యాండ్సెట్లను విడుదల చేయడానికి ఇండియాస్టోర్ సైట్ కౌంట్‌డౌన్ కూడా ప్రారంభించింది. 24 నెలల టెన్యూర్‌తో లో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఇండియాస్టోర్.కామ్ అందుబాటులోకి తెచ్చింది. వీటిపై యాక్సిస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు, సిటీ క్రెడిట్ కార్డులు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనుంది. నాన్-ఈఎంఐ లావాదేవీలకు ఐదింతల రివార్డు పాయింట్లు లభిస్తాయి. లావాదేవీ జరిపిన 150 బిజినెస్ గంటల్లో క్యాష్‌బ్యాక్ కొనుగోలుదారులకు అందుతుంది. -
జియోలో కొత్త ఐఫోన్లు
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇటీవల తన కొత్త ఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లను ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐఫోన్లు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా? అంటూ ఆపిల్ అభిమానులు వేచి చూస్తున్నారు. నిన్నటి నుంచి ఈ ఐఫోన్ల ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్లను తమ నెట్‌వర్క్‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. లేటెస్ట్ ఐఫోన్లను కస్టమర్లు www.jio.com, రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లు, మైజియో యాప్‌లలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 28 నుంచి ఈ రెండు డివైజ్‌లు స్టోర్లలో అందుబాటులోకి వస్తున్నాయి. రెండు ఫోన్లలో కూడా జియో తన ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం అడ్వాన్స్డ్ ఈసిమ్ ఫీచర్‌ను అందిస్తుంది. ప్రీపెయిడ్ యూజర్లకు దేశంలో ఈసిమ్ యాక్టివేషన్‌ను అందిస్తున్న ఏకైక ప్రొవైడర్ జియో మాత్రమే. జియో డిజిటల్ లైఫ్‌ను అనుభూతి చెందడానికి ఈ ఐఫోన్ యూజర్లకు డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తుంది. దీనిలో ఒకటి నానో-సిమ్ కాగా, మరొకటి డిజిటల్ ఈసిమ్. ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లలో ఇవే అధునాతనమైనవి. స్మార్ట్‌ఫోన్‌ను కొత్త శిఖరానికి తీసుకెళ్లడానికి ఇవి ఎంతో సహకరించనున్నాయి. ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల సూపర్ రెటినా డిస్ప్లేలను కలిగి ఉన్నాయి. వేగవంతమైన, మెరుగైన డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా 7-నానోమీటర్ చిప్‌ను ఏర్పాటు చేశారు. వేగవంతమైన ఫేస్ ఐడీ, వైడర్ స్టిరియో సౌండ్, లాంగర్ బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెన్స్, బ్యూటిఫుల్ గోల్డ్ ఫిన్నిష్, డౌన్లోడ్ స్పీడును పెంచే గిగాబిట్-క్లాస్ ఎల్‌టీఈను ఈ ఫోన్లు ప్రవేశపెట్టాయి. -
రైతు బిడ్డ రికార్డు !
తిరుపతి రూరల్ : అమ్మ ప్రోత్సాహం....నాన్న తోడ్పాటు...చిన్ననాటి నుంచి ఏదో సాధించాలనే తపన ఆ రైతు బిడ్డను అమెరికాలోని ప్రతిష్టాత్మక ఆపిల్ సంస్థలో చిన్న వయస్సులోనే పెద్ద కొలువులో కూర్చోపెట్టింది. చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన అనంత రవితేజకు ఆపిల్ కంపెనీ శాస్త్రవేత్తగా కొలువు ఇచ్చి ఏడాదికి రూ.1.72 కోట్ల వేతనం అందించేందుకు ముందుకు వచ్చింది. రవితేజ తండ్రి రమేష్‌నాయుడు ఓ సాధారణ రైతు. పుల్లయ్యగారిపల్లెలో మూడు ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటారు. తల్లి నీలిమ పదో తరగతి వరకు చదివింది. వీరికి రవితేజ, శ్రీనివాసరావు సంతానం. బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని తల్లి తపన పడింది. రవితేజను ఇంజినీరుగా, చిన్న కొడుకు శ్రీనివాసరావును డాక్టర్‌గా చదివించింది. రవితేజ ప్రాథమిక విద్య తిరుపతి బాలాజీ కాలనీలోని కేంబ్రిడ్జి స్కూల్, వికాస్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెంగళూరులోని కేఎస్ఐటీ కళాశాలలో ఈసీఈ విభాగంలో 2014లో బీటెక్ పూర్తి చేశారు. అమెరికాలోని న్యూయార్క్ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో రెండేళ్ల ఎంఎస్ కోర్సును తొమ్మిది నెలల్లోనే పూర్తి చేసుకున్నారు. తరువాత ఏడాదికి రూ.1.22 కోట్ల వేతనంతో మొదటి ప్రయత్నంలోనే బ్లూంబర్గ్ కంపెనీలో శాస్త్రవేత్తగా సంవత్సరం పనిచేశారు. అతడి ప్రతిభను గుర్తించిన ఆపిల్ కంపెనీ, ఏడాదికి రూ.1.72 కోట్ల వేతనంతో శాస్త్రవేత్తగా ఉద్యోగం కల్పించింది. అమ్మ ప్రోత్సాహం అనంతం తన ఉన్నతికి అమ్మే స్ఫూర్తి అని, ఆమె విశేషంగా ప్రోత్సహించారని, త్వరలోనే తన తల్లిని అమెరికాకు తీసుకెళతానని రవితేజ తెలిపారు. పదేళ్ల తర్వాత ఇండియాకు వచ్చి కంపెనీ పెట్టి దేశసేవ చేస్తానని తెలిపారు. హార్వర్డ్ వర్సిటీలో ఎంబీఏ...వంద శాతం ఫెలోషిప్ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రతిష్టాత్మక ఆపిల్ కంపెనీలో ఉన్నతోద్యోగం సాధించిన రవితేజ మరో అరుదైన అవకాశం పొందారు. ప్రస్తుతం అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదవడానికి వందశాతం ఫెలోషిప్‌ను సాధించాడు. -
బంపర్ ఆఫర్: ఐఫోన్లపై భారీ తగ్గింపు
2018 కొత్త ఐఫోన్ మోడల్స్... ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ లాంచింగ్ సందర్భంగా, పాత ఐఫోన్ వేరియంట్లపై భారీగా ధరలు తగ్గించింది ఆపిల్. దేశీయ మార్కెట్లోనూ, గ్లోబల్‌గా కూడా వీటి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధర రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ బేస్ వేరియంట్ ధర కూడా 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ కొత్త ధరలను ఆపిల్ తన వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అయితే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. కానీ భారత్‌లో కేవలం ఐఫోన్ ఎస్ఈ నే నిలిపివేసింది. మిగతా మూడు ఐఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ మోడల్ కొత్త ధర పాత ధర ఐఫోన్10 (256 జీబీ) రూ.1,06,900 రూ.1,08,930 ఐఫోన్10 (64 జీబీ) రూ.91,900 రూ.95,390 ఐఫోన్ 8 (64జీబీ) రూ.59,900 రూ.67,940 ఐఫోన్ 8 (256జీబీ) రూ.74,900 రూ.81,500 ఐఫోన్ 8 ప్లస్ (64జీబీ) రూ.69,900 రూ.77,560 ఐఫోన్ 8 ప్లస్ (256జీబీ) రూ.84,900 రూ.91,110 ఐఫోన్ 7 (32జీబీ) రూ.39,900 రూ.52,370 ఐఫోన్ 7 (128జీబీ) రూ.49,900 రూ.61,560 ఐఫోన్ 7 ప్లస్ (32జీబీ) రూ.49,900 రూ.62,840 ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ) రూ.59,900 రూ.72,060 ఐఫోన్ 6ఎస్ (32జీబీ) రూ.29,900 రూ.42,900 ఐఫోన్ 6ఎస్ (128జీబీ) రూ.39,900 రూ.52,100 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ) రూ.34,900 రూ.52,240 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128జీబీ) రూ.44,900 రూ.61,450 -
మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ - 4
-
ఆపిల్ వాచ్ బైపాస్ సర్జరీ చేస్తుందట!!
టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ 12.. ఓ ఐకానిక్’ డే. ఎన్నో రూమర్లు, మరెన్నో లీక్‌ల అనంతరం ఆపిల్ తన సరికొత్త ఐఫోన్లను సెప్టెంబర్ 12 ప్రవేశపెట్టింది. ఐఫోన్లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 4ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్‌ను దీనిలో పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని ఇది లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ తీసుకోవచ్చు. మొట్టమొదటిసారి ఐఫోన్లను డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ సరికొత్త ఆపిల్ ప్రొడక్ట్‌లపై సోషల్ మీడియా మాత్రం జోకులు వేయడం ఆపలేదు. 2018 ఆపిల్ వాచ్ సిరీస్ 4 ఈసీజీ ఫీచర్ ఉంటే, 2019 వాచ్‌లో యాంజియోప్లాస్టీ, 2020 వాచ్‌లో బైపాస్ సర్జరీ, 2021లో అంత్యక్రియల ఏర్పాటు ఫీచర్లు ఉంటాయంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. మనం 2018లో జీవిస్తుంటే, ఆపిల్ ఇంకా 2012లోనే నివసిస్తుందంటూ డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఓ వ్యక్తి ఒక టేబుల్ వద్ద కూర్చుని ఐఫోన్ ఆపిల్ లోగోతో వస్తుందని చెబుతున్న కార్టూన్ గీయగా.. మరోవ్యక్తి, ఆండ్రాయిడ్ ఫోన్ అవే ఫీచర్లతో తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్న పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిందపడిపోవడాన్ని ఆపిల్ వాచ్ సిరీస్ 4 గుర్తిస్తుంది, అవునా..అయితే కొంతమంది రూపాయిని ధరిస్తారు అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Apple watch features 2018 : ECG 2019 : Angioplasty 2020 : Bypass Surgery 2021: Funeral arrangements#AppleEvent — SAGAR (@sagarcasm) September 12, 2018 IPhone fans right now #AppleEvent pic.twitter.com/nuQgOyaMWt — Mask ishan (@Mr_LoLwa) September 12, 2018 We’re all living in 2018 while Apple is living in 2012 #AppleEvent pic.twitter.com/hJnyfbGgbK — 9GAG (@9GAG) September 13, 2018 Android be like : Launch wo kar rahein hain par features humaare hain.#AppleEvent pic.twitter.com/v24iRk4tst — SAGAR (@sagarcasm) September 12, 2018 Reality check. #AppleEvent #iphoneXs pic.twitter.com/tC6wBYFqAc — Godman Chikna (@Madan_Chikna) September 12, 2018 me @ my iPhone 📱 after seeing the new prices #AppleEvent pic.twitter.com/xPJW1iB4vV — Khattak (@Nayapakistan_55) September 12, 2018 Fixed it. #AppleEvent pic.twitter.com/6Y1cHkcrzY — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Samsung fans watching #AppleEvent and realising they can’t even taunt you about dual sim anymore. pic.twitter.com/Ka2nksuv15 — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Me and my broke friends checking the price of the new iPhone. #AppleEvent pic.twitter.com/88a1yUyeDm — Bade Chote (@badechote) September 12, 2018 -
ఆపిల్ ఈవెంట్ : బిగ్ ప్రైస్, బిగ్ స్క్రీన్
కొత్త కొత్త ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆపిల్ లేటెస్ట్ ఈవెంట్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆపిల్ మరో సెప్సేషనల్ ఈవెంట్‌కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో యాపిల్ మూడు కొత్త ఐఫోన్లు లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఎక్స్‌సీ (ఐఫోన్), ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్‌ను ఈ రోజు రాత్రి రిలీజ్ చేయనుందనే అంచనాలు భారీగా హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈసారి ఐఫోన్ల బిగ్ స్క్రీన్, బిగ్ ప్రైస్ తో రానున్నాయని అంచనా. మరోవైపు రెవెన్యూ వృద్ధితో ఆపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లను ( సుమారు 7లక్షల 23వేల కోట్లు రూపాయలు) ను అధిగమించింది. ఐ ఫోన్ ఎక్స్ ప్లస్ లేదా మాక్స్ : టాప్ మోడల్‌గా తీసుకొస్తున్న ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ 6.5 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ అమర్చింది. ధర సుమారు రూ.75,000 ఐఫోన్ ఎక్స్ఎస్ : 6.1 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో రానుంది. దీని ధర సుమారు రూ. 71,000 ఉండనుంది. ఐఫోన్ ఎక్స్‌సీ : 5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్. ఐఫోన్ ఎక్స్‌సీ ధర రూ.57,000గా ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటితో పాటు యాపిల్ ఐప్యాడ్ ప్రో మోడల్స్‌ని కూడా లాంఛ్ చేయనుందట. ఈఈవెంట్లో సరికొత్త మ్యాక్ లైనప్ కూడా లాంఛ్ కానుందని మరో ప్రచారం జరుగుతోంది. మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్‌తో పాటు మ్యాక్ మినీ కూడా ఉండొచ్చు. డిస్ప్లే పెర్ఫామెన్స్‌లో అప్‌గ్రేడ్స్ చాలా ఉంటాయని టెక్ నిపుణులు అంచనా. అలాగే ఆపిల్ వాచ్ సిరీస్‌లో ఫోర్త్ జనరేషన్ వాచ్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ అంచనాలపై ఆపిల్ నుంచి అధికారికి సమాచారం ఏదీ అందుబాటులో లేదు. Round Apple watch finally? pic.twitter.com/vo82LW2dnN — Gissur Simonarson (@GissiSim) August 30, 2018 Top stories: Exclusive look at iPhone XS & Apple Watch Series 4, Apple announces Sept 12 event, more https://t.co/bcOeAkAXXX by @ChanceHMiller pic.twitter.com/CMTWtuhFMP — 9to5Mac (@9to5mac) September 1, 2018 -
ఆపిల్ అభిమానులకు పండుగ : రేపే మూడు ఐఫోన్లు
ఆపిల్ ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఎన్ని మోడళ్లు వస్తున్నా కొత్త మోడల్ కోసం ఎదురుచూస్తుంటారు ఐఫోన్ అభిమానులు. కొత్త మోడల్ ఐఫోన్ విడుదలవుతుంటే చాలు ... అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. గంటల తరబడి లైన్లో నిలబడి మరీ కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటుంటారు. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ ఏడాది కూడా ఆపిల్ మూడు సరికొత్త ఐఫోన్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. అది కూడా రేపే. సెప్టెంబరు 12న అంటే రేపు కూపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో వీటి లాంచింగ్ ఈవెంట్ జరగబోతుంది. ఐఫోన్ 9, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ పేర్లతో ఇవి లాంచ్ కాబోతున్నాయని టాక్. ఐఫోన్ 9 మూడు ఐఫోన్లలో అత్యంత సరసమైనదిగా ఉండనుందని, ఇది 6.1 అంగుళాల ఎల్సీడీ ప్యానల్‌తో రూపొందిందని ఇప్పటికే పలు రిపోర్టు చెప్పాయి. మిగతా రెండు 5.8 అంగుళాల ఓలెడ్, 6.5 అంగుళాల ఓలెడ్ డిస్ప్లేలను కలిగి ఉంటుందని పేర్కొన్నాయి. ఐఫోన్ 9, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌లు రెండు రోమనియన్ వెబ్సైట్ క్విక్‌మొబైల్‌లో సీక్రెట్‌గా ప్రీ-ఆర్డర్‌కు కూడా అందుబాటులోకి వచ్చాయట. ఈసారి లాంచ్ చేయబోయే ఐఫోన్లలో ఒకటి డ్యుయల్ సిమ్‌తో అలరించబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆపిల్ ఐఫోన్లన్నీ సింగిల్ సిమ్‌తోనే పనిచేసేవి. ఈ నేపథ్యంలో ఇతర సంస్థల నుంచి వస్తున్న పోటీ తట్టుకునేందుకు ఆపిల్ కూడా ఒక మోడల్‌ను డ్యుయల్ సిమ్‌తో విడుదల చేయబోతుందని తెలిసింది. మూడు ఐఫోన్లతో పాటు, ఐప్యాడ్ ప్రొ, ఆపిల్ వాచ్ సిరీస్ 4ను కూడా ఈ కంపెనీ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అసలు రేపు జరిగే ఈవెంట్లో ఆపిల్ తన అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తోందో వేచిచూడాలి. -
ఐఫోన్ కంపెనీ విరాళమెంతో తెలుసా?
తిరువనంతపురం : ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ భారీ వరదలతో అతలాకుతలమైంది. వందలాది మంది మరణించగా... లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కకావికలమైన కేరళను కాపాడేందుకు యావత్ భారత దేశం ముందుకొస్తోంది. డబ్బు, నిత్యావసర వస్తు సామాగ్రిని సాయం చేస్తూ అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా దిగ్గజ ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ కూడా కేరళకు ఆర్థికసాయం ప్రకటించింది. రాష్ట్రానికి రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘కేరళలో వరదల పరిస్థితి గురించి తెలిసి మేం ఎంతగానో దిగ్భ్రాంతి చెందాం. కేరళ సీఎం సహాయనిధి, మెర్సీ కార్ప్స్ ఇండియాకు రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నాం. వీటిని అవసరమైన దగ్గర స్కూళ్లను, ఇళ్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగించండి’ అని ఆపిల్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక.. కేరళను ఆదుకునేందుకు ముందుకురావాలని ఆపిల్ తన యూజర్లను ప్రోత్సహిస్తోంది. తన హోమ్ పేజీలో సపోర్ట్ బ్యానర్లను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాక యాప్ స్టోర్, ఐట్యూన్‌లలో మెర్సీ కార్ప్స్కు విరాళాలు అందించేందుకు డొనేట్ బటన్ ఏర్పాటుచేసింది. ఈ బటన్ ద్వారా ఆపిల్ యూజర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో కేరళకు విరాళం ఇవ్వొచ్చని వెల్లడించింది. భారీ ఎత్తున సంభవించిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపిల్ తన ఐట్యూన్స్ స్టోర్, ఆపిల్ స్టోర్ల ద్వారా విరాళాలు సేకరించి, తీవ్రంగా దెబ్బతిన్న వాటికి సాయంగా అందిస్తూ ఉంటుంది. ఆపిల్ కస్టమర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను వాడి 5 డాలర్లు, 10 డాలర్లు, 25 డాలర్లు, 50 డాలర్లు, 100 డాలర్లు, 200 డాలర్లను మెర్సీ కార్ప్స్కు డొనేట్ చేయొచ్చు. కాగ భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు తరలివెళ్తున్నారు. మరోవైపు కేరళను ఆదుకునేందుకు స్వదేశీయులతో పాటు విదేశీయులు సైతం ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటిస్తూ కేరళ ప్రజలకు అండగా ఉంటున్నారు. -
ట్రంప్‌కు లేఖ : దిగ్గజాలు కలవరపాటు
వాషింగ్టన్ : ఆపిల్, జేపీ మోర్గాన్, పెప్సీ వంటి దిగ్గజ కంపెనీలు సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునే హెచ్-1బీ వీసా పాలసీలో ట్రంప్ తీసుకొస్తున్న మార్పులు, దిగ్గజాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇప్పటికే పలుమార్లు ట్రంప్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఆయన నా దారి రహదారి అన్నట్టు ప్రయాణిస్తున్నారు. హెచ్-1బీ వీసా విధానంలో మార్పులపై తాజాగా మరోసారి దిగ్గజ కంపెనీలు ట్రంప్ కార్యాలయానికి తమ గోడును వెల్లబుచ్చుకున్నాయి. ఇమ్మిగ్రేషన్ పాలసీలో ట్రంప్ కార్యాలయం తీసుకుంటున్న మార్పులు.. చాలా ఆందోళకరంగా ఉన్నాయంటూ టాప్ యూఎస్ బిజినెస్ లీడర్లు రాసిన లేఖలో పేర్కొన్నారు. వీరిలో ఆపిల్ ఇంక్ సీఈవో టిమ్ కుక్, జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కంపెనీ జమీ డిమోన్, పెప్సికో ఇంక్ ఇంద్రా నూయీ ఉన్నారు. ఈ లేఖలో అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునే ఇమ్మిగ్రేషన్ విధానం, ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న మార్పులను వీరు ఎక్కువగా ఫోకస్ చేశారు. అస్థిరమైన వలస విధాన నిర్ణయాలు, ఇమ్మిగ్రెంట్ల జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్లను తగ్గించడం వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పులతో అనవసరమైన ఖర్చులు, ఇబ్బందులు పెరుగుతాయే తప్ప, పెద్దగా ప్రయోజనాలేమీ ఉండవని సీఈవోలు చెప్పారు. చట్టాన్ని గౌరవించే వేలమంది జీవితాలను అతలాకుతలం చేయొద్దని వేడుకున్నారు. అమెరికాలో పోటీతత్వానికి ఇది గండికొడుతుందని ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. అమెరికా టాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లందరూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, ఈ లేఖను రూపొందించారని ఫార్చ్యూన్ రిపోర్టు చేసింది. కాగ, హెచ్-1బీ వీసాలపై పరిమితులు తీసుకొస్తున్న ట్రంప్ కార్యాలయం, అత్యంత ప్రతిభావంతులైన విదేశీయులను నియమించుకోవడం తగ్గించేసింది. అయితే విదేశీ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వల్ల అమెరికా బాగా ప్రయోజనం పొందుతుందని, ఇప్పుడు వారిపై ఆంక్షలు విధిస్తే అమెరికాలోఆర్థిక వ్యవస్థకే దెబ్బ అని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు. -
2018 ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది(2018లో) మూడు రకాల ఐఫోన్లను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఎంట్రీ లెవల్ డివైజ్‌ను 6.1 అంగుళాల స్క్రీన్‌లో తీసుకొస్తుండగా.. ఇతర వేరియంట్లను 5.8 అంగుళాలు, 6.46 అంగుళాలలో లాంచ్ చేయబోతుంది. తాజాగా ఈ స్మార్ట్ఫోన్లను ఆపిల్ ఎప్పుడు లాంచ్ చేస్తుందో కూడా తెలిసిపోయింది. ఇద్దరు జర్మన్ టెలికాం ఆపరేటర్లు చెప్పిన సమాచారం ప్రకారం ఆపిల్ ఈ మూడు ఐఫోన్లను సెప్టెంబర్ 12న కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో లాంచ్ చేయనుందని తెలిసింది. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా వెంటనే సెప్టెంబర్ 14నే ప్రారంభం కాబోతున్నాయట. కొత్తగా లాంచ్ అవబోతున్న ఈ డివైజ్‌లు సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని రిపోర్టులు వెల్లడించాయి. ఆపిల్ అప్‌కమింగ్ స్మార్ట్ఫోన్ల గురించి ఇంటర్నెట్లో పలు ఆసక్తికర వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రీమియం వెర్షన్ ఐఫోన్ల పేరు ఐఫోన్ ఎక్స్ఎస్గా, ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్‌గా రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్టైలస్ ఫీచర్ అంటే ఆపిల్ పెన్సిల్ సపోర్టుతో ఈ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయట. స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 9కు పోటీగా కూపర్టినో కంపెనీ వీటిని తీసుకొస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ రెండూ కూడా కంపెనీ ఏ12 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తాయని, 4జీబీ ర్యామ్, ప్రముఖ ఫేస్ఐడీ ఫీచర్‌ను ఇవి కలిగి ఉంటాయని సమాచారం. ధర విషయంలో 5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ మోడల్ 899 డాలర్లుగా.. 6.46 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ వేరియంట్ 999 డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్ వేరియంట్ ధర 650 డాలర్ల నుంచి 800 డాలర్ల మధ్యలో ఉంటుందట. 3జీబీ ర్యామ్‌లో, 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఇది లభ్యమవుతుందని టాక్. -
యాపిల్‌ను భయపెట్టిన 16 ఏళ్ల బాలుడు!
సిడ్నీ: యాపిల్ సంస్థలో పనిచేయాలనే కోరిక ఓ 16 ఏళ్ల బాలుడిని ఆ సంస్థ కంప్యూటర్లను హ్యాక్ చేసేలా చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ టీనేజర్ యాపిల్ కంపెనీ కంప్యూటర్లను హ్యాక్ చేసి ఆ సంస్థను భయపెట్టాడు. అయితే చివరకు దొరికొపోయి శిక్షను అనుభవించేందుకు సిద్దమయ్యాడు. ఇక వినియోగదారుల సమాచారానికి ఎలాంటి నష్టం కలిగించలేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మెల్బోర్న్లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థి అయిన ఈ టీనేజర్ యాపిల్ సంస్థకు వీరాభిమాని. అందులో పనిచేయాలని కలలుగన్నాడు. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. అందులో భద్రపర్చిన 90 జీబీ ఫైళ్లను కూడా డౌన్లోడ్ చేశాడు. ఏడాదిలో పలుమార్లు ఇలా కంప్యూటరైజ్డ్ టన్నెల్స్ అండ్ ఆన్లైన్ బైపాసింగ్ సిస్టం ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. దీన్ని గుర్తించిన సంస్థ ప్రతినిధులు ఆ యువకుడిపై ఎఫ్‌బీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆస్ట్రేలియా పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఇంట్లో తనిఖీలు చేసి ఈ మొత్తం సమాచారాన్ని ‘హాకీ హాక్ హాక్’ పేరుతో ఫోల్డర్‌ను క్రియేట్ చేసి దాచినట్టు తెలిసింది. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో.. వచ్చేనెల న్యాయస్థానం శిక్ష విధించనుంది. మైనర్ కావడంతో అతని పేరును భయట పెట్టలేదు. -
యాపిల్స్ నుంచి మొబైల్స్ వరకూ అన్నీ ప్రియం..
న్యూఢిల్లీ : యాపిల్స్ నుంచి మొబైల్స్ వరకూ ఇక చాలా ఐటెమ్స్ ధరలు భారం కానున్నాయి. గత కొన్నేళ్లుగా వరుసగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కస్టమ్స్ సుంకం తగ్గింపు విధానానికి ప్రస్తుత సర్కార్ చెల్లుచీటీ ఇచ్చింది. గత రెండేళ్లలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని పెంచిన ఉదంతాలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. సర్కార్ తాజా వైఖరితో బాదంపప్పులు, యాపిల్స్ నుంచి సెల్‌ఫోన్ విడిభాగాలు, సోలార్ ప్యానెల్స్ సహా దాదాపు 400 వస్తువులపై కస్టమ్స్ సుంకం పెరగనుంది. ఆసియాన్ దేశాలకు సమానంగా టారిఫ్‌లను తీసుకువచ్చే క్రమంలో నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు వ్యవసాయ, తయారీ ఉత్పత్తులపై సుంకాల పెంపునకు కేంద్రం పూనుకుంటోంది. గతంలో వ్యవసాయేతర ఉత్పత్తులపై అత్యధికంగా 1991-92లో 150 శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని 40 శాతానికి, 1997-98లో 20 శాతానికి, 2007-08లో పది శాతానికి తగ్గించారు. అయితే ఈ విధానానికి స్వస్తిపలికి కస్టమ్స్ సుంకాల పెంపునకు మోదీ సర్కార్ పూనుకుంది. అయితే ఇవి ఎంతమాత్రం రక్షణాత్మక చర్యలు కాదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. అయితే యపిల్స్, బాదం నుంచి 29 అమెరికన్ ఉత్పత్తులపై పెంచిన కస్టమ్స్ సుంకాలు ఈనెల 4 నుంచి అమల్లోకి వచ్చిన క్రమంలో ఇవి డబ్ల్యూటీవో నిర్ధేశించిన రేట్ల కంటే అధికంగా ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరించారు. పన్ను టారిఫ్ పెంపుపై అటు పరిశ్రమ నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం కస్టమ్స్ సుంకాల పెంపుకే మొగ్గుచూపింది. -
నంబర్ వన్ యాపిల్
-
@లక్ష కోట్ల డాలర్లు
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. ప్రపంచ తొలి ట్రిలియన్(లక్ష కోట్ల) డాలర్ల కంపెనీగా అవతరించింది. ఇప్పుడు యాపిల్ మార్కెట్ క్యాప్.. మొత్తం మెక్సికో ఆర్థిక వ్యవస్థకు సమానం. ట్రిలియన్ డాలర్లు అంటే .. అర్జెంటీనా, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర 27 ప్రధాన దేశాల మొత్తం జీడీపీకి సమానం. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.69 లక్షల కోట్లతో సమానం. ఒకప్పుడు దివాళా కోరల్లో చిక్కుకున్న ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ విలువ గల కంపెనీగా నిలిచింది. పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ గమనాన్ని ఐఫోన్ పూర్తిగా మార్చివేసింది. దివాలా స్థితి నుంచి... 1976లో ఒక గ్యారేజ్‌లో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని అరంభించాడు. ఇతర భాగస్వాములతో వచ్చిన విభేదాల వల్ల ఈ కంపెనీ నుంచి 1985లో ఆయన వైదొలగాల్సి వచ్చింది. 1997లో యాపిల్ కంపెనీ దాదాపు దివాలా స్థితికి వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్లో బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీల ధాటికి నిలవలేకపోయింది. దాదాపు మూడో వంతు ఉద్యోగులను తీసేసింది. మూడు నెలల్లో కోలుకోపోతే దివాలా కోసం దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ స్టీవ్ జాబ్స్ యాపిల్‌లో తిరిగి చేరాడు. 1998లో కలర్‌ఫుల్ ఆల్–ఇన్–వన్ డెస్క్‌టాప్ కంప్యూటర్, ఐమ్యాక్ జీ3ని మార్కెట్లోకి తెచ్చింది. ఇది సూపర్‌హిట్ అయింది. తర్వాత 2001లో పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ ఐపాడ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది మ్యూజిక్ డివైజ్‌ల స్వరూపాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఈ కంపెనీ తెచ్చిన ఐఫోన్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన పనే లేకుండా పోయింది. ప్రతి క్వార్టర్లో 4 లక్షలకు పైగా ఐఫోన్లను విక్రయిస్తోంది. 40 ఏళ్లలో 50,000 శాతం పెరిగిన యాపిల్ షేర్.. 2003లో యాపిల్ కంపెనీ షేర్ ధర 1 డాలర్‌గా ఉంది. 2005లో యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చినప్పుడు ఈ షేర్ ధర 17 డాలర్లకు చేరింది. గురువారం ఈ టెక్నాలజీ షేర్ 2.8 శాతం ఎగసి 207.05 డాలర్లను తాకడంతో లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని తాకింది. ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ విలువ గల కంపెనీగా అవతరించింది. కార్యకలాపాలు ఆరంభించిన 42 ఏళ్లకు యాపిల్ కంపెనీ ఈ ఘనత సాధించింది. మంగళవారం వెలువడిన ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1) ఫలితాలు అంచనాలను మించడంతో బుధ, గురు వారాల్లో ఈ షేర్ 9 శాతం ఎగసింది. 1980లో ఈ కంపెనీ ఐపీఓకు వచ్చింది. ఈ 4 దశాబ్దాల్లో ఈ షేర్ 50,000 శాతం పెరగ్గా, ఇదే కాలంలో అమెరికా ఎస్ అండ్ పీ 500 స్టాక్ సూచీ 2,000 శాతం వృద్ధి సాధించింది. యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాకముందు, 2006లొ యాపిల్ అమ్మకాలు 2,000 కోట్ల డాలర్లు, నికర లాభం 200 కోట్ల డాలర్లుగానూ మాత్రమే ఉండేవి. గత ఏడాదికి కంపెనీ అమ్మకాలు 11 రెట్లు పెరిగి 22,900 కోట్ల డాలర్లకు, నికర లాభం 4,840 కోట్ల డాలర్లకు పెరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీలన్నింటిలోనూ అత్యంత లాభదాయకమైన కంపెనీ ఇదే. మరికొన్ని రికార్డ్‌లు.. యాపిల్ షేర్ల సంఖ్య 482.99 కోట్లుగా ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్ క్యాప్కంపెనీగానే కాకుండా యాపిల్ మరికొన్ని రికార్డ్‌లు సాధించింది. ఒక్క క్వార్టర్లో అత్యధిక లాభం (2,000 కోట్లు) సాధించిన తొలి కంపెనీ ఇదే. అత్యధిక నగదు నిల్వలు(28,500 కోట్ల డాలర్లు) ఉన్న కంపెనీ కూడా ఇదే. ఈ మొత్తం విలువ మన టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ(20,000 కోట్ల డాలర్లు) కంటే ఎక్కువ!! -
యాపిల్.. జోష్!
శాన్ఫ్రాన్సిస్కో: యాపిల్ కంపెనీ గత జూన్ క్వార్టర్లో విక్రయించిన ఫోన్ల సంఖ్య కన్నా ఈ జూన్ క్వార్టర్లో విక్రయించిన ఫోన్ల సంఖ్య 1 శాతమే పెరిగినా, ఆదాయం, లాభాలు మాత్రం బాగా పెరిగాయి. ధరలు అధికంగా ఉన్న ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 మోడళ్ల ఫోన్ విక్రయాలే దీనికి కారణమని నిపుణులంటున్నారు. జూన్ క్వార్టర్లో ముగిసిన కాలానికి ఈ కంపెనీ నికర లాభం 32 శాతం వృద్ధితో 1,152 కోట్ల డాలర్లకు పెరిగింది. ఆదాయం 17 శాతం పెరిగి 5,327 కోట్ల డాలర్లకు చేరింది. ఇక సెప్టెంబర్‌తో ముగిసే తర్వాతి క్వార్టర్లో తమ ఆదాయం 6,000 కోట్ల డాలర్ల నుంచి 6,200 కోట్ల డాలర్ల వరకూ పెరగవచ్చని యాపిల్ అంచనా వేస్తోంది. తొలి ట్రిలియన్ డాలర్ల కంపెనీ..! ఫలితాల జోరుతో కంపెనీ షేరు 5 శాతం పెరిగి 200 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్ 206.49 డాలర్లను తాకితే ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్ల మార్కెట్ విలువను చేరిన తొలి కంపెనీగా యాపిల్ అవతరిస్తుంది. మన దేశానికి చెందిన టీసీఎస్, రిలయన్స్‌లు ఇటీవలనే 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీలుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో యాపిల్ షేర్ ఇప్పటిదాకా 18 శాతం ఎగసింది. యాపిల్ దగ్గర 243 బిలియన్ డాలర్ల నగదు ఉందని అంచనా. ఇది టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ కంటే(200 బిలియన్ డాలర్లు) అధికం కావడం విశేషం. -
దాని దూకుడు ముందు శాంసంగ్, ఆపిల్ ఔట్
న్యూఢిల్లీ : ఇన్ని రోజుల భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్(రూ.30,000 ప్లస్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్)లో టాప్ లీడర్లు ఎవరూ అంటే.. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ పేర్లే చెప్పేవారు. కానీ ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టేసి, భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త లీడర్ దూసుకొచ్చింది. అదే చైనీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించిన రిపోర్టులో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్, ఆపిల్‌ను మించిపోయి వన్‌ప్లస్ లీడ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. మొట్టమొదటిసారి వన్‌ప్లస్ కంపెనీ ఈ చోటును దక్కించుకున్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 2018 రెండో క్వార్టర్లో 40 శాతం మార్కెట్ షేరుతో వన్‌ప్లస్ ఈ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 బలమైన అమ్మకాలు.. వన్‌ప్లస్‌ను టాప్ స్థానంలో నిలబెట్టడానికి దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. వన్‌ప్లస్ 6 రికార్డు షిప్మెంట్లను నమోదు చేసినట్టు తెలిపింది. అయితే దిగ్గజ కంపెనీలైన ఆపిల్, శాంసంగ్ షిప్మెంట్లు ఏడాది ఏడాదికి కిందకి పడిపోయినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. 34 శాతం షేరుతో శాంసంగ్ ఈ సెగ్మెంట్లో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్8 కంటే, గెలాక్సీ ఎస్9 షిప్మెంట్లు 25 శాతం పడిపోయాయి. షిప్మెంట్లు పడిపోయినప్పటికీ, ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్9 సిరీస్ ప్రమోషన్లు బలంగానే ఉన్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. మరోవైపు ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ లకు డిమాండ్ ఈ క్వార్టర్లో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆపిల్ మార్కెట్ షేరు భారీగా పడిపోయింది. కేంద్రం డ్యూటీలను పెంచడంతో, ఆపిల్ కూడా తన ప్రొడక్ట్‌లపై ధరలను పెంచింది. దీంతో ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ సిరీస్ షిప్మెంట్లు క్షీణించాయి. ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ షేరు కూడా ప్రీమియం సెగ్మెంట్లో భారీగా పడిపోయి కేవలం 14 శాతం మాత్రమే నమోదైంది. అయితే మొత్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ఈ క్వార్టర్లో వార్షికంగా 19 శాతం పెరిగింది. ఈ సెగ్మెంట్లోకి హువావే(పీ20), వివో(ఎక్స్21), నోకియా హెచ్ఎండీ(నోకియా 8 సిరోకో), ఎల్జీ(వీ30 ప్లస్) స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్తగా వచ్చి చేరాయి. శాంసంగ్, వన్‌ప్లస్, ఆపిల్ టాప్-3 బ్రాండ్లు మొత్తం మార్కెట్ షేరు 88 శాతంగా ఉంది. ఇది ముందు క్వార్టర్లో 95 శాతంగా నమోదైంది. -
సముద్ర గర్భంలో దొరికిన ఐఫోన్ పనిచేస్తుందోచ్!
న్యూఢిల్లీ : మనం పొరపాటున స్మార్ట్‌ఫోన్‌ను నీళ్లలో పడేసినా లేదా కింద పడేసినా.. ఇక దాని పని అంతే. ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఓ మూలన పడేసి, కొత్తది కొనుక్కోవాల్సిందే. కానీ ఆపిల్ ఐఫోన్ల విషయంలో దాన్నే ఆపాదిస్తే, మనం తప్పులో కాలేసినట్టే. ఆపిల్ ఐఫోన్లు ఫర్ఫార్మెన్స్కు మారు పేరుగా నిలుస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 7 ఇదే నిరూపించింది. సముద్ర గర్భంలో నాని నాని ఉన్న ఆపిల్ ఐఫోన్ 7, బయటకి తీస్తే భలే పనిచేస్తుందట. దాని బ్యాటరీ పూర్తిగా నీళ్లలో తడిచిపోయినా కూడా ఇంకా మంచిగా పనిచేస్తూనే ఉందని డిజిటైమ్స్ వెల్లడించింది. అంతేకాక సముద్ర గర్భంలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ సిగ్నల్‌ను కరెక్ట్‌గా అందుకుంటుందని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ కెనడా సందర్శకుడికి చెందిన ఆపిల్ ఐఫోన్ 7 పొరపాటున సముద్రంలోకి పడిపోయింది. ఎంత వెతికినా అతనికి దొరకకపోయే సరికి దానిపై ఆశలు వదిలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరిస్ హార్సీకి ఆ ఫోన్ దొరికింది. ఇంగ్లండ్‌లోని డోర్డల్ డోర్ దగ్గరిలో గల సముద్ర గర్భం నుంచి ఓ వెలుగు రావడం కనిపించింది. అదేమిటా? అని దాని వద్దకు వెళ్లి చూసింది. సముద్ర గర్బంలో వెలుగులు చిందిస్తున్న ఆ వస్తువును చూసి ఆమె షాకైంది. అది ఐఫోన్ 7. టెక్ట్స్ మెసేజ్ రావడంతో, ఆ ఐఫోన్ 7ను వెలుతురును బ్లింక్ అవుతుంది. నీటిలో మునిగి ఉన్న ఆ డివైజ్‌ను హార్సీ బయటకు తీసింది. 48 గంటల పాటు ఆ ఐఫోన్ అక్కడే ఉన్నట్టు తెలిసింది. అంతసేపు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న 84 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఆ ఫోన్ మంచిగా పనిచేస్తుందని తెలిసింది. అంతేకాక సిగ్నల్స్‌ను కూడా అది కరెక్ట్‌గా పొందుతుంది. హార్సీ తనకు దొరికిన ఐఫోన్ 7 ను తన వద్దనే ఉంచుకోకుండా.. ఆ ఫోన్ పోగొట్టుకున్న కెనడియన్‌కు అందచేసింది. ఈ డివైజ్ వాటర్ రెసిస్టెన్స్‌తో ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కేసుతో ఐఫోన్ 7 ఎంత స్ట్రాంట్‌గా పనిచేస్తుందో మరోసారి వెల్లడైంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దీని పనితీరు అద్భుతమని టెక్ విశ్లేషకులు సైతం అంటున్నారు. -
భారత్‌లో ఆపసోపాలు పడుతున్న టెక్ దిగ్గజం
న్యూఢిల్లీ : భారత్‌లో ఐఫోన్లను విక్రయించడానికి టెక్ దిగ్గజం ఆపిల్ ఆపసోపాలు పడుతోంది. ఇటీవల వారాల్లో ముగ్గురు కీలక ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడటంతో ఆపిల్ ఈ క్లిష్టతర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిసింది. భారత్‌లో ఆపిల్, తన వైభవాన్ని కోల్పోతుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు వెల్లడించింది. చైనాలో నెలకొన్న మాదిరి భారత్‌లోనూ పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపింది. ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాతో, ఆపిల్ తన దేశీయ సేల్స్ టీమ్‌ను పునర్వ్యస్థీకరించే పనిలో పడింది. ఆపిల్ ఇండియా నేషనల్ సేల్స్, డిస్ట్రిబ్యూషన్ చీఫ్, కమర్షియల్ ఛానల్స్, మిడ్-మార్కెట్ బిజినెస్ అధినేత, టెలికాం క్యారియర్ సేల్స్ హెడ్ అందరూ కంపెనీని వీడినట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్టు పేర్కొంది. అయితే వీరందరూ ఎందుకు కంపెనీని వీడారో మాత్రం ఇంకా క్లారిటీ తెలియరాలేదు. అయితే భారత్ మార్కెట్లో ఆపిల్ ప్రదర్శనే వీరి రాజీనామాల రియాక్షన్ అని రిపోర్టు చెబుతోంది. ప్రస్తుతం భారత సేల్స్ టీమ్‌ను ఆపిల్ పునర్వ్యస్థీకరిస్తోంది. కాగ, భారత్ రెండింతలు మేర టారిఫ్‌లను పెంచడంతో, ఆపిల్ కంపెనీ సైతం తన ధరలను పెంచేసింది. ఈ ప్రభావంతో భారత్ మార్కెట్లో ఆపిల్ తన షేరును కోల్పోతుంది. ఆపిల్ కిందకి పడిపోతుంటే, చైనీస్ దిగ్గజం షావోమి, కొరియా దిగ్గజం శాంసంగ్‌లు మాత్రం భారత మార్కెట్ షేరును అంతకంతకు పెంచుకుంటూ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. 2018 ప్రథమార్థంలో కూడా ఐఫోన్ ఇండియా విక్రయాలు కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. ఒకవేళ ద్వితీయార్థంలో జంప్ చేసినా.. గతేడాది కంటే తక్కువ విక్రయాలనే నమోదు చేయవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం దేశీయంగా పాత ఐఫోన్ల తయారీ ప్రారంభించింది. ఓ వైపు దేశీయంగా తయారీ చేపట్టినా.. దేశీయ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆపిల్ మరింత కృషిచేయాలని విశ్లేషకులంటున్నారు. -
చైనాకు అమెరికా టెక్ దిగ్గజం సాయం
బీజింగ్ : ఓ వైపు అమెరికాకు, చైనాకు మధ్య ట్రేడ్ వార్ పరిస్థితులు ఉద్రిక్తమవుతే, మరోవైపు అమెరికా టెక్ దిగ్గజాలు చైనాకు సాయం చేస్తున్నాయి. తాజాగా ఆపిల్, చైనాలో 300 మిలియన్ డాలర్ల(రూ.2,054 కోట్ల) క్లీన్ ఎనర్జీ ఫండ్‌ను లాంచ్చేసింది. ఆ దేశంలో 10 లక్షల గృహాలకు విద్యుత్ అందించే లక్ష్యంతో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులలో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఆపిల్ ప్రకటించింది. చైనా ప్రభుత్వం ప్రస్తుతం కాలుష్యం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్య పొగను తగ్గించాలని, దేశం జలమార్గాలను, కలుషిత మట్టిని శుభ్రం చేయాలని స్థానిక, అంతర్జాతీయ కంపెనీలను చైనా ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో కంపెనీలు సైతం ఈ మేరకు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. పెగాట్రోన్ కార్ప్, విస్ట్రోన్ కార్ప్ వంటి 10 మంది సప్లయిర్స్‌తో కలిసి, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల్లో ఈ మొత్తాన్ని ఐఫోన్ తయారీదారి పెట్టుబడిగా పెడుతోంది. కాగ, అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్, బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై దెబ్బకు దెబ్బ మాదిరి టారిఫ్‌ల మోత ప్రపంచంలో ఈ రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు ప్రతికూలంగా మారాయి. ఇరు దేశాలు ప్రశాంతంగా ఉండాలని ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ పిలుపు కూడా ఇచ్చారు. ఆపిల్ సంస్థ తన ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం చైనాకే సరఫరా చేస్తుంది. ఆపిల్‌కు అత్యంత కీలకమైన మార్కెట్లలో చైనా కూడా ఒకటి. అయితే ఇటీవల స్థానిక స్మార్ట్‌ఫోన్ ప్రత్యర్థుల నుంచి ఆపిల్‌కు పెద్ద ఎత్తున్నే సవాళ్లు ఎదురవుతున్నాయి. -
పట్టపగలే...ఆపిల్ స్టోర్‌లో దొంగల బీభత్సం
-
ఆపిల్ స్టోర్‌లో దొంగల బీభత్సం
కాలిఫోర్నియా : పట్టపగలు.. వచ్చే పోయే కస్టమర్లతో కళకళలాడుతుంది. కానీ ఆ స్టోర్‌లో నలుగులు దొంగలు బీభత్సం సృష్టించారు. ఇటు ఉద్యోగులను, అటు కస్టమర్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసి, దాదాపు 19 లక్షల రూపాయల విలువైన ఆపిల్ ఉత్పత్తులను ఆపిల్ స్టోర్ నుంచి కొట్టేశారు. ఆపిల్ స్టోర్‌లో టేబుల్స్‌పై ప్రదర్శనకు ఉంచిన ఛార్జర్లను, ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను ఠక్కుఠక్కున లాగేసుకుని రయ్‌మని సెక్యురిటీ సిబ్బందికి చిక్కకుండా పారిపోయారు. ఈ ఘటన కాలిఫోర్నియా ఫ్రెస్నోలోని ఫ్యాషన్ ఫెయిర్ మాల్లో గల ఆపిల్ స్టోర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో కస్టమర్లు, ఆపిల్ స్టోర్ ఉద్యోగులు కొద్ది సేపటి పాటు ఏం జరుగుతుందో తేల్చుకోలేకపోయారు. నలుగురు దొంగలు చేసిన ఈ హంగామా అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న నలుగురు ఆఫ్రికన్ యువకులు ఫ్రెస్నోలోని ఆపిల్ స్టోర్‌లోకి ప్రవేశించారు. హూడెడ్ స్వీట్షర్ట్లు వేసుకొచ్చిన ఆ దొంగలు ముఖాలు కనిపించకుండా కప్పేసుకున్నారు. స్టోర్‌లోకి ప్రవేశించడమే పలు కౌంటర్ల వద్ద ఉన్న డివైజ్‌లను, టేబుల్స్‌పై ఉన్న కేబుల్స్‌ను, మ్యాక్‌బుక్‌లను చకాచకా లాగేసుకున్నారు. వాటిని తమ చేజిక్కించుకుని వెంటనే అక్కడి నుంచి ఎవరికీ దొరకకుండా పారిపోయారు. పారిపోతున్న వారిని అడ్డుకున్న ఒకతన్ని పక్కకు నెట్టేసి మరీ జంప్ చేశారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తం 26 ఖరీదైన డివైజ్‌లను వారు దొంగలించారని పోలీసులు చెప్పారు. వాటిలో మ్యాక్బుక్లు, ఐఫోన్ 6, 7, 8, ఎక్స్‌లు ఉన్నాయని చెప్పారు. వీరు కస్టమర్లను, ఉద్యోగులను బెదిరించలేదని, ఎలాంటి ఆయుధాలను వీరు కలిగి లేరని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ నలుగురితో మరో దొంగ కూడా ఉన్నారని, అతను మాల్ బయట, వాహనంలో వీరు కోసం వేచిచూస్తున్నాడని తెలిపారు. నలుగురు ఈ డివైజ్‌లు తీసుకుని ఠక్కున బయటికి రాగానే, వాహనంలో జంప్ చేసినట్టు తెలిసింది. జూన్ 21 న కాలిఫోర్నియాలో మరో స్టోర్‌లో కూడా ఇదే మాదిరి చోరి జరిగింది. ఫ్రెస్నో బయట ఆపిల్ స్టోర్లలో కూడా ఇదే మాదిరి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ఘటనలకు, దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
అరకులో యాపిల్ సాగుకు అనుకూల వాతావరణం
-
త్వరలోనే ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈ నిలిపివేత?
టెక్ దిగ్గజం ఆపిల్ మరికొన్ని నెలల్లో తన మెగా హార్డ్‌వేర్ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఆ ఈవెంట్లో గత ఎంతో కాలంగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న కొత్త ఐఫోన్లను కంపెనీ లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్లకు 2018లో భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చే అవకాశాలున్నాయని కూడా టెక్ వర్గాలు అంచనావేస్తున్నాయి. అయితే వీటికి డిమాండ్ భారీ ఎత్తున్న ఉండబోతున్న తరుణంలో, ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్ ఎక్స్‌ను, ఐఫోన్ ఎస్ఈ లను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కొత్తగా విడుదల చేయబోతున్న ఆ మూడు ఐఫోన్లపైనే ఉంచనున్నట్టు పేర్కొంటున్నారు. బ్లూఫిన్ రీసెర్చ్ విడుదల చేసిన ఓ ఇన్వెస్టర్ నోట్లో.. గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్‌గ్రేడ్ లేకపోవడంతో, తాజాగా తీసుకొచ్చే ఐఫోన్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిసింది. ఆపిల్ ఆ మెగా ఈవెంట్లో 5.8 అంగుళాల ఐఫోన్ ఎక్స్ సక్ససర్, 6.5 అంగుళాల ఐఫోన్ ఎక్స్ ప్లస్ మోడల్, అఫార్డబుల్ 6.1 అంగుళాల ఎల్సీడీ ఐఫోన్‌ను లాంచ్ చేస్తుంది. అఫార్డబుల్ ఎల్సీడీ ఐఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్ వస్తుందని చాలా కాలం నుంచే విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2018 మూడు, నాలుగు క్వార్టర్లలో 9.1 కోట్ల యూనిట్ల 2018 ఐఫోన్‌ను తయారు చేస్తుందని బ్లూఫిన్ విశ్లేషకులు చెప్పారు. మరో 9.2 కోట్ల యూనిట్లను 2019 తొలి రెండు క్వార్టర్లలో రూపొందిస్తుందని పేర్కొన్నారు. షిప్మెంట్లను కూడా భారీగానే చేపట్టనుందని తెలిపారు. ఐఫోన్ ఎక్స్ ధర(999 డాలర్లు) మాదిరే ఐఫోన్ ఎక్స్ ప్లస్ ధరను నిర్ణయిస్తుందని, అదేమాదిరి మూడు ఐఫోన్లలో కెల్లా 6.1 అంగుళాల ఎల్సీడీ ఐఫోన్ ధరనే అత్యంత తక్కువగా ఉంచనుందని తెలుస్తోంది. దీని ధర 600 డాలర్ల నుంచి 700 డాలర్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ఇది ఐఫోన్ ఎస్ఈని రీప్లేస్ చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్లను లాంచ్ చేయబోతున్న తరుణంలో, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈలను నిలిపివేయబోతున్నట్టు విశ్లేషకులంటున్నారు. ఒకవేళ ఐఫోన్ ఎక్స్‌ను కనుక ఆపిల్ నిలిపివేస్తే, లాంచ్ అయిన ఏడాదిలో నిలిచిపోయిన ఫోన్ ఇదే అవుతుంది. -
52 కంపెనీలకు డేటా లీక్
వాషింగ్టన్: తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా 52 కంపెనీలతో పంచుకున్నామని, వాటిలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయని ఫేస్బుక్ వెల్లడించింది. సెల్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఖాతాదారుల సమాచారం మార్పిడికి ఫేస్బుక్ ఒప్పందం కుదుర్చుకుందని ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్‌కు శుక్రవారం ఆ కంపెనీ యాజమాన్యం వివరణిచ్చింది. ఏయే కంపెనీలతో యూజర్ల సమాచారాన్ని పంచుకున్నారో వెల్లడిస్తూ దాదాపు 700 పేజీల నివేదికను అమెరికన్ ప్రతినిధుల సభకు చెందిన హౌస్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీకి ఫేస్బుక్ సమర్పించింది. యాపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, శాంసంగ్, అలీబాబా, క్వాల్‌కాం, పాన్‌టెక్ మొదలైన వాటితో పాటు అమెరికా భద్రతకు ముప్పుగా ఆ దేశ నిఘా విభాగం పేర్కొన్న నాలుగు చైనా కంపెనీలు హ్యువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్లు కూడా ఉన్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, అలాగే ఆయా కంపెనీ ఉత్పత్తులతో ఫేస్బుక్ యాప్ అనుంధానం కోసం వివరాలు అందచేశామని ఫేస్బుక్ తెలిపింది.మొత్తం 52 కంపెనీల్లో 38 కంపెనీలతో ఒప్పందాలు ముగిశాయని, జూలైలో మిగిలిన వాటి కాలపరిమితి కూడా ముగుస్తుందని ఫేస్బుక్ తెలిపింది. తాజా వివరాలపై ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ సభ్యుడు ఫ్రాంక్ పల్లోనే స్పందిస్తూ.. ‘ఫేస్బుక్ స్పందన సమాధానాల కంటే మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది’ అని పేర్కొన్నారు. -
ఇక చౌకగా ఐఫోన్ 6ఎస్
ఆపిల్ ఐఫోన్ అంటేనే.. కాస్త ఖరీదెక్కువ. ఆ ఫోన్ చేతిలో ఉందంటే, ఓ స్థాయిగా ఫీలవుతారు. సాధారణ మొబైల్స్‌తో పోలిస్తే ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండటానికి గల కారణం మనదేశంలో అమలవుతున్న అత్యధిక దిగుమతి సుంకాలే. ఈ సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి మెల్లమెల్లగా ఆపిల్ భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని చేపడుతోంది. గతేడాది నుంచే ఆపిల్ భారత్‌లో తన ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడం ప్రారంభించింది. బెంగళూరులో ఈ తయారీ సౌకర్యాన్ని ఏర్పరిచింది. తాజాగా కొత్త ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారత్‌లోనే రూపొందించడం ప్రారంభించిందని తెలిసింది. అదీ కూడా బెంగళూరులోని ఐఫోన్ ఎస్ఈ రూపొందే విస్ట్రోన్ ప్లాంట్‌లోనే ఐఫోన్ 6 ఎస్‌ను ఆపిల్ తయారు చేస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా అమ్ముడుపోతుండటంతో, ఐఫోన్ 6ఎస్ ఉత్పత్తినే ఇక్కడ ప్రారంభించాలని ఆపిల్ నిర్ణయించిందని తెలిసింది. దీంతో ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై దిగుమతి సుంకాలు తగ్గిపోతాయి. ఈ సుంకాలు తగ్గిపోవడంతో, ఐఫోన్ 6ఎస్ చౌకైన ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. మిడ్-రేంజ్ ప్రీమియం సెగ్మెంట్లోకి కొంత షేర్‌ను విస్తరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి. ‘ఐఫోన్ ఎస్ఈ మాదిరి మేడిన్ ఇండియాలో రూపొందుతున్న ఐఫోన్ 6ఎస్‌ను భారత్‌లోనే విక్రయిస్తాం. భారత్‌లో తయారీ సామర్థ్యం పెరిగేంత వరకు ఐఫోన్ 6ఎస్ దిగుమతులు కొనసాగిస్తాం. స్థానిక తయారీ యూనిట్లతో ఎలాంటి ధర కరెక్షన్ ఉండదు. త్వరలోనే మేడిన్ ఇండియా ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్ స్టోర్లలోకి వస్తుంది’ అని ఆపిల్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఐఫోన్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్లు, మొత్తం భారత్‌లో ఐఫోన్ అమ్మకాల్లో మూడో వంతు స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ధరలో స్థిరత్వం, పోటీ కోసం కంపెనీ స్థానికంగా తయారీ యూనిట్లను పెంచుతున్నామని ఆపిల్ వివరించింది. -
7 ఏళ్ల వివాదానికి దిగ్గజాలు స్వస్తి
ఐఫోన్ డిజైన్ విషయంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్న వివాదాన్ని ప్రపంచ స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్ పరిష్కరించుకున్నాయి. ఏడు ఏళ్లుగా సాగుతున్న ఐఫోన్ డిజైన్ పేటెంట్ వివాదానికి స్వస్తి పలికాయి. అమెరికా కోర్టు ఫైలింగ్‌లో ఇరు కంపెనీలు ఈ విషయాన్ని తెలిపాయి. ఐఫోన్ ఫీచర్లు కాఫీ చేసిందన్న కారణంతో సుమారు రూ.3700 కోట్లను శాంసంగ్, ఆపిల్‌కు చెల్లించలాని గత నెలలోనే ఫెడరల్ కోర్టు జ్యూరీ ఆదేశించింది. ఈ ఆదేశాల అనంతరం ఇరు కంపెనీలు తమ సమస్యను పరిష్కరించుకున్నాయి. అయితే ఎంత మొత్తంలో ఈ సెటిల్మెంట్ చేసుకున్నాయో ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో మిగిలి ఉన్న అన్ని వాదనలు, ప్రతికూలతలను కొట్టివేస్తున్నట్టు అమెరికా జిల్లా కోర్టు జడ్జి లూసీ కో తెలిపారు. ఇదే విషయంపై మరోసారి ఎలాంటి న్యాయ చర్యలకు సిద్ధం కాకూడదని చెప్పారు. అంతేకాక ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అటార్నీల ఫీజులు, వ్యయాలను ఇరు పార్టీలే భరించాల్సి ఉంటుందని కో అన్నారు. ఈ కేసు నగదుకు మించిదని ఏఎఫ్‌పీ పేర్కొంది. 2011 నుంచి ఆపిల్, శాంసంగ్‌లకు మధ్య ఈ వివాదం ప్రారంభమైంది. ఈ కాగ, శాంసంగ్‌పై ఆపిల్ నమోదు చేసిన ఫిర్యాదులో ఐఫోన్‌కు చెందిన ఫీచర్లను, డిజైన్‌ను ఇది కాఫీ చేస్తుందని ఆరోపించింది. సుప్రీం కోర్టు అనుమతితో ఈ కేసును జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. -
నిలబడితేనే ఆరోగ్యం..
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయనేది పాత సామెత.. పనిచేయకుండా ఖర్చు చేసేవారిని ఉద్దేశించి పుట్టిన సామెత అది. కానీ కూర్చుని పనిచేస్తే రోగాలన్నీ చుట్టుముడతాయన్నది తాజా సామెత. వైవిధ్యంతో కూడిన నూతన ఆవిష్కరణల కోసం తహతహలాడే యాపిల్ సంస్థ తమ ఉద్యోగులను నిలబడే పనిచేయమంటోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న తమ 175 ఎకరాల క్యాంపస్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్ డెస్క్‌లు అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది దోహదపడుతుందని సంస్థ సీఈవో టిమ్ కుక్ గట్టిగా నమ్ముతున్నారు. ఆఫీసుల్లో ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. అసలు ఎక్కువసేపు కూర్చుని ఉండడమే ‘ఓ కేన్సర్’అని డాక్టర్లు భావిస్తున్నారని ఆయన అంటున్నారు. అందువల్లే స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని తమ ఆంతర్యాన్ని వెల్లడించారు. ఈ పని విధానంలో భాగంగా ఉద్యోగులు తమకు నచ్చిన ఫర్నిచర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. టేబుల్, కుర్చీలు, క్యూబికల్స్తో కూడుకున్న సగటు ఆఫీసు వాతావరణానికి భిన్నంగా వివిధ ఆకృతులు, డిజైన్లలో మార్చుకునేందుకు వీలుగా ఈ డెస్క్‌లను రూపొందించారు. 18, 19 శతాబ్దాల్లోనే.. నిలబడి పనిచేసే ఆలోచన ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నా.. 18, 19వ శతాబ్దాల్లోనే ధనికవర్గం ఈ పద్ధతిని తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఉపయోగించినట్టు చెబుతున్నారు. రోజంతా ఒకేచోట కూర్చుని పనిచేస్తే బద్ధకం ఆవరించడంతో పాటు పనిలో చురుకుదనం లోపిస్తోందని భావించేవారు. అదే నిలబడి పనిచేయడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పేవారు. అలా నిలబడి పనిచేసే విధానాన్ని అమలు చేసినవారిలో ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ, అమెరికా ప్రముఖులు బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జఫర్సన్, ఆ దేశ సుప్రీంకోర్టు జడ్జి అలివర్ వెండెల్ హోమ్స్ జూనియర్, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, ప్రముఖ రచయితలు వర్జీనియా ఉల్ఫ్, అల్బర్ట్ కామూ, ఎర్నెస్ట్ ఎమింగ్వే తదితరులు ఉండటం గమనార్హం. మంచి, చెడూ.. రెండూ ఉన్నాయి.. స్టాండింగ్ డెస్క్‌ల వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కొందరు చెబుతుండగా.. దానితో నష్టాలు కూడా ఉంటాయని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఎక్కువ అధిక గంటల పాటు కూర్చుని పనిచేసినా.. నిలుచుని పనిచేసినా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. - కూర్చుని పనిచేయడం కంటే నిలబడి పనిచేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని అంటున్నారు. గణనీయంగా కాలరీలు ఖర్చవుతాయని.. స్థూలకాయం ముప్పు తగ్గుతుందని పేర్కొంటున్నారు. స్టాండింగ్ డెస్క్ వల్ల ఒక్కో నిమిషానికి 0.7 కేలరీలు ఖర్చు చేయొచ్చని.. ఏడాదికి 30 వేల కేలరీలు కరిగించవచ్చని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఎక్కువగా నిలబడి గడిపితే ఆయుష్షు కూడా పెరుగుతుందంటున్నారు. నిలబడి ఉండడం, అటూ ఇటూ కదలడం వల్ల గుండె జబ్బు ముప్పు తగ్గుతుందని పేర్కొంటున్నారు. స్టాండింగ్ డెస్క్‌ల వద్ద నిలబడి పనిచేస్తే నైపుణ్యాలు పెరుగుతాయని చెబుతున్నారు. - ఇక ఆఫీసు ఉద్యోగులకు ‘నిలబడే పనిచేయడం’ మంచి ప్రత్యామ్నాయంగా ఆమోదించలేమంటోంది ఆస్ట్రేలియాకు చెందిన కుర్టిన్ వర్సిటీ. నిలబడి పనిచేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడడంతో పాటు ఉత్పాదకత తగ్గుతుందని తమ అధ్యయనంలో తేలినట్టు వెల్లడించింది. స్టాండింగ్ డెస్క్‌ల వద్ద రెండు గంటలు పనిచేశాక అసౌకర్యానికి గురయ్యామని.. కండరాలు పట్టేసినట్టు, మోకాలి కింది భాగం వాచినట్టుగా ఉందని చాలా మంది ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. సృజనాత్మకత, మెరుగైన నైపుణ్యాలు అవసరమైన చోట్ల ఈ విధానం అనువుగా ఉండొచ్చని.. మిగతాచోట్ల సరిపోకపోవచ్చని స్పష్టం చేసింది. -
ఐఫోన్ ఇక మరింత సురక్షితం
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కీలక ప్రకటన చేసింది. పాస్వర్డ్ అవసరం లేకుండా ఐఫోన్లలోని సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించేలా ఉన్న సాఫ్ట్వేర్ లోపాన్ని సరిదిద్దనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలోనే ఐవోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు, సమాచార మార్పిడి కోసం వాడుతున్న లైటనింగ్ పోర్ట్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతున్నారని తెలిపింది. త్వరలో తీసుకురానున్న అప్డేట్తో తప్పుడు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే ఐఫోన్ డేటా గంటపాటు నిలిచిపోతుందని వెల్లడించింది. తాజా అప్డేట్ తర్వాత కూడా లైటనింగ్ పోర్ట్‌తో చార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చంది. యాపిల్ తాజా నిర్ణయం ఈ లోపాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఎఫ్‌బీఐ, పోలీసులకు ఇబ్బందికరం కానుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆ యాపిల్స్‌తో ప్రమాదం
సాక్షి, కోల్‌కతా : ప్లాస్టిక్ గుడ్లపై కలకలం రేగిన క్రమంలో తాజాగా మైనం పూతతో వస్తున్న యాపిల్స్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. గతంలో ప్లాస్టిక్ కోడిగుడ్లపై నెలకొన్న ఆందోళనతో కలత చెందిన వినియోగదారులు ప్రస్తుతం యాపిల్స్‌పై మైనం పూతపై సాగుతున్న ప్రచారంతో బెంబేలెత్తుతున్నారు. యాపిల్స్ తాజాగా, నిగనిగలాడేలా కనిపించేందుకు కొందరు వ్యాపారులు షూలు, కార్లను పాలిష్ చేసేందుకు ఉపయోగించే పెట్రోపాన్ పారాఫిన్, మైనంను పండ్ల పైపూతగా వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోల్‌కతాలోని డం డం రోడ్లో ఇలాంటి యాపిల్స్‌ను కొందరు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దుకాణాలపై దాడులు చేసిన పోలీసులు సింతిమోర్ ప్రాంతంలోని ఇద్దరు దుకాణదారులను అరెస్ట్ చేశారు. నగరంలోని అతిపెద్ద హోల్‌సేల్ పండ్ల మార్కెట్ నుంచి ఈ యాపిల్స్ నగరమంతటా సరఫరా అవుతున్నాయని విచారణలో దుకాణదారులు తెలిపారు. కాగా, కోల్‌కతా అంతటా మైనం పూసిన యాపిల్స్ విక్రయిస్తున్నారని, ఇది ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని స్ధానిక కౌన్సిలర్ గౌతం ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను కోల్‌కతా మేయర్ దృష్టికి తీసుకువెళతానని ఘోష్ చెప్పారు. -
రక్తపోటును గుర్తించే ఆపిల్ కడియం!
వేసే అడుగులు, కరిగిన కేలరీలను లెక్కపెట్టేందుకు ఇప్పటికే బోలెడన్ని ఫిట్నెస్ ట్రాకర్లు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థ ఆపిల్ ఇంకో అడుగు ముందుకేసి ఈ ఫిట్నెస్ బ్యాండ్ల ద్వారానే రక్తపోటును కూడా కచ్చితంగా గుర్తించేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రక్తపోటు సమస్య ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. అయితే చాలామంది ఈ సమస్యను గుర్తించరు. ఈ నేపథ్యంలో కొన్ని హైటెక్ సెన్సర్లు, కడియం ఆకారంలోని గాడ్జెట్‌తో రక్తపోటును ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఆపిల్ కంపెనీ ఓ పరికరాన్ని తయారుచేస్తోంది. ఈ పరికరం అప్పుడప్పుడూ బెలూన్ మాదిరిగా ఉబ్బుతుందని అంచనా. పేటెంట్ కోసం చేసిన దరఖాస్తులో ఆపిల్ కంపెనీ ఈ పరికరం గురించి వివరిస్తూ... చేసే పనిని బట్టి రక్తపోటు మారుతూంటుందని, కొలిచేటప్పుడు బాడీ పొజిషన్, మద్యం లేదా కాఫీ లాంటి ద్రవపదార్థాలు తీసుకుని ఉండటం, ఒత్తిడి వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ వివరణ ఆధారంగా ఆపిల్ రక్తపోటును గుర్తించే గాడ్జెట్‌ను తయారు చేస్తోందని, ఇతర ఆపిల్ పరికరాలతో అనుసంధానమై ఎప్పటికప్పుడు వివరాలు అందించేలా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆపిల్ కంపెనీ 2004లోనే తన హెల్త్ కిట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రమేపీ ఆరోగ్య సంబంధిత యాప్‌లు అభివృద్ధి చేస్తోంది. -
మొబైల్ యాప్స్‌పై ఆపిల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అప్లికేషన్ల (యాప్స్)పై ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వర్చువల్ కరెన్సీ అయిన క్రిప్టో కరెన్సీ (బిట్ కాయిన్) అప్లికేషన్లను అభివృద్ధి చేసేవారు ఇకపై తప్పనిసరిగా ఒక సంస్థగా నమోదు కావాల్సి ఉంటుందని ఆపిల్ సంస్థ తెలిపింది. అలాంటి సంస్థలకు చెందిన అప్లికేషన్లకు మాత్రమే ఆపిల్ యాప్ స్టోర్‌లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఆపిల్ ఫోన్ స్టోరేజీతో సంబంధం లేకుండా కేవలం క్లౌడ్-బేస్డ్ స్టోరేజీలో క్రిప్టో మైనింగ్ చేసే అప్లికేషన్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాటరీని ఎక్కువగా వినియోగించే, మొబైల్‌ను త్వరగా వేడెక్కించే అప్లికేషన్లపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. క్రిప్టోనే ఎందుకంటే.. క్రిప్టో కరెన్సీ అప్లికేషన్లలో థర్డ్‌పార్టీ అడ్వర్టయిజింగ్లు ఉంటాయనీ.. యాప్స్‌తో సంబంధం లేని ప్రకటనలతో వినియోగదారునికి అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆపిల్ వెల్లడించింది. ‘బిట్ కాయిన్లలో ట్రేడింగ్ చేసే అప్లికేషన్లు మిగతా వర్చువల్ కరెన్సీ అప్లికేషన్లను అడ్డుకుంటాయి. డౌన్లోడ్ ప్రక్రియను మందకొడిగా మారుస్తాయి. సోషల్ మీడియా యాప్‌లపైన కూడా వీటి వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆయా యాప్స్‌ను చురుగ్గా పనిచేయనీయవు’ కనుకనే ఆపిల్ ఫోన్ స్టోరేజీలో ఎలాంటి క్రిప్టో కరెన్సీ మైనింగ్‌ని అనుమతించబోమని ఆపిల్ స్పష్టం చేసింది. న్యాయబద్ధంగా వర్చువల్ ట్రేడింగ్ సేవల్ని అందించే యాప్‌లను అనుమతిస్తామని తెలిపింది. -
అమెజాన్‌లో ఐఫోన్ ఫెస్ట్, ఆఫర్లు ఇవిగో!
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన వెబ్సైట్లో ఐఫోన్ ఫెస్ట్‌కు తెరలేపింది. ఈ ఫెస్ట్ సందర్భంగా పలు ఆపిల్ ఐఫోన్ మోడల్స్‌పై ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఫోన్లను కేవలం హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఈఎంఐ లావాదేవీలపై కూడా వాలిడ్‌లో ఉంటుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్, జూన్ 12 వరకు కొనసాగుతోంది. ఫెస్ట్‌లో భాగంగా అందించే ఆఫర్లు... ఆపిల్ ఐఫోన్ 10వ వార్షికోత్సవంగా వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్‌పై 4,001 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అదనంగా దీనిపై 4 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను ఇస్తోంది. అమెజాన్‌లో రూ.89వేలుగా లిస్ట్ అయిన ఈ ఫోన్, రెండు డిస్కౌంట్ల అనంతరం రూ.80,999కే అందుబాటులోకి వచ్చింది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,600 ఎక్స్చేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8 స్మార్ట్ఫోన్లపై కూడా 3 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను కస్టమర్లు పొందవచ్చు. రూ.1,001 ఫ్లాట్ డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 8 ప్లస్‌ను రూ.71,999కు అమెజాన్ విక్రయిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. మరోవైపు 4వేల రూపాయల డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 8 రూ.59,999కు అందుబాటులోకి వచ్చింది. దీనిపై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 7పై యూజర్లు 2 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను పొందనున్నారు. 45,999 రూపాయలకు విక్రయించే ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.6,371 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఈ ఫోన్‌పై కూడా రూ.14,600 ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇలా ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ స్మార్ట్‌ఫోన్ అన్నింటిపై అమెజాన్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ప్రతి కొనుగోలుపై రూ.250 అదనపు క్యాష్‌బ్యాక్‌నూ అమెజాన్ నేడు ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఇండియా ఐదో వార్షికోత్సవంలో భాగంగా ఈ క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. -
శుభవార్త : ఐఓఎస్ 12 వచ్చేసింది...
కాలిఫోర్నియా : టెక్ దిగ్గజం ఆపిల్ తన అభిమానులకు శుభవార్త చెప్పేసింది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న ఐఓఎస్ 12ను ఆపిల్ ఎట్టకేలకు విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో(డబ్ల్యూడబ్ల్యూడీసీ) ఈ అప్డేట్ను కంపెనీ ప్రవేశపెట్టింది. లక్షల కొద్దీ ఐఫోన్లు, ఐప్యాడ్లు మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం ఈ ఐఓఎస్ 12ను విడుదల చేయడంతో పాటు సరికొత్త ఫీచర్స్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఐఓఎస్ 12 బగ్స్‌ను ఫిక్స్ చేయడంతోపాటు ఐఫోన్, ఐప్యాడ్ల పనితీరును మెరుగుపరుస్తుందని కంపెనీ చెప్పింది. ఐఓఎస్ 12తో ముందు అనుభవించలేని సరికొత్త అనుభూతిని అందించనున్నామని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రైగ్ ఫెడెర్గి చెప్పారు. ఐఓఎస్ 12.. టాప్ 12 ఫీచర్లు.. మరింత వేగం, మరింత రెస్పాన్సివ్ : ఐఫోన్ 5ఎస్తో పాటు సిస్టమ్స్ అన్నింటిలోనూ మెరుగైన పనితీరుపై ఇది ఎక్కువగా ఫోకస్ చేసింది. ఐఓఎస్ 12తో కెమెరాను 70 శాతం వరకు, కీబోర్డ్ 50 శాతం వరకు వేగవంతం చేసింది. షేర్డ్ ఏఆర్ ఎక్స్పీరియన్స్ : ఐఓఎస్ 12తోపాటు ఏఆర్‌కిట్2ను ఆపిల్ ప్రవేశపెట్టింది. దీంతో మరింత మెరుగైన ఏఆర్ యాప్స్‌ను డెవలప్ చేసుకోవచ్చు. కొత్త ఓపెన్ ఫైల్ ఫార్మాట్, యూఎస్డీజెడ్ను ఆపిల్ డిజైన్ చేసింది. దీంతో ఐఓఎస్‌లో ఎక్కడైనా ఏఆర్ అనుభవాన్ని తేలికగా పొందవచ్చు. గ్రూప్ ఫేస్ టైమ్ : ఆపిల్లోఉండే ఫేస్‌టైమ్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను మరింత మెరుగుపర్చారు. ఇది ప్రస్తుతం గ్రూప్ కాల్స్‌కు సపోర్టు చేయనుంది. ఈ కొత్త గ్రూప్ ఫేస్‌టైమ్ ఫీచర్‌తో ఒకేసారి అనేక మందితో చాట్ చేయొచ్చు. ఈ గ్రూప్ ఫేస్‌టైమ్ కాల్లో గ్రూప్ మెసేజ్ నుంచి కనెక్ట్ అవొచ్చు. ఏ సమయంలోనైనా అభ్యర్థులు జాయిన్ కావొచ్చు. సంభాషణ మధ్యలో ఉండగానే కూడా చేరవచ్చు. ఆపిల్ వాచ్ నుంచి కూడా ఫేస్‌టైమ్ ఆడియోలో పాలుపంచుకోవచ్చు. సిరి షాట్‌కట్స్ : సిరితో ఈ రంగంలో కొత్త సంచలనానికి తెరలేపిన ఆపిల్‌కు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాల నుంచి పోటీ ఎదురైంది. ఇపుడు సిరి మరింత స్మార్ట్‌గా చేశారు. ఇప్పుడు అన్ని యాప్‌లు సిరితో కలిసి పనిచేస్తాయి. మరింత వేగవంతంగా.. సరియైన సమయానికి పని పూర్తి చేస్తాయి. ఇప్పటికే సిరి ఒక్క నెలలో 10 బిలియన్ అభ్యర్థలను పూర్తి చేస్తుంది. ఫోటో సెర్చ్ మెరుగుపరచడం : ఫోటోయాప్ అంతాకొత్తగా ‘ఫర్ యూ’ అనే ట్యాబ్‌ను కలిగి ఉంటుంది. ఇది మెమరీస్, ఐక్లౌడ్ షేర్డ్ అల్బామ్స్ నుంచి ఇష్టమైన క్షణాలన్నింటిన్నీ ఒకచోటికి చేరుస్తోంది. ఈ ఫీచర్‌తో స్నేహితులతో తేలికగా ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్నేహితులు అదే ఈవెంట్‌కు సంబంధించి తిరిగి వీడియోలను, ఫోటోలను షేర్ చేయవచ్చు. డు నాట్ డిస్టర్బ్ : నోటిఫికేషన్ బెడద లేకుండా హాయిగా నిద్రపోయేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పైగా బెడ్ టైమ్ మోడ్‌ని ఆన్ చేస్తే డిస్ప్లే కూడా డిమ్ అయిపోతుంది. అంతేకాకుండా అన్ని నోటిఫికేషన్లను లాక్ స్క్రీన్ నుంచి హైడ్చేసుకోవచ్చు. అంతేకాక ఫోన్ యూజర్ చెప్పిన సమయానికి ఈ డీఎన్డీ బెడ్‌టైమ్ మోడ్ పూర్తయి నార్మల్లోకి వచ్చేస్తుంది. నోటిఫికేషన్లను డిస్ప్లే అవుతాయి. గ్రూప్డ్ నోటిఫికేషన్లు : పదేపదే వచ్చే నోటిఫికేషన్లతో ఎప్పుడూ తలనొప్పిగా ఉంటుంది. ఆ తలనొప్పి నుంచి బయటపడేందుకు గ్రూప్డ్ నోటిఫికేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి సెట్టింగ్స్‌లోకి వెళ్లకుండానే నోటిఫికేషన్లను కంట్రోల్ చేసుకోవచ్చు. అనుకున్న నిర్ణీత సమయంలో వాటిని చూసుకునేలా ఇది ఉపయోగపడుతోంది. స్ర్కీన్ టైమ్ : అందరూ ఊహించినట్లే డిజిటల్ హెల్త్ ఫీచర్‌ను ఐఓఎస్12లో పొందుపర్చారు. దీనివల్ల యాప్స్, వెబ్‌సైట్స్‌పై మీరు వెచ్చించే సమయాన్ని ఈ ఫీచర్ కంట్రోల్ చేస్తుంది. ఒక్కో యాప్‌పై మీరు ఎంత సమయం వెచ్చించారో గంటవారీ, రోజువారీ, వారంవారీగా డేటా తెలుపుతుంది. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ : ఆపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, మెరుగైన ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి ఐఓఎస్ 12 అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. సఫారీలో ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ప్రివెన్షన్ ఆప్షన్‌తో మీరు సోషల్ మీడియా లైక్ లేదా షేర్ బటన్స్‌ను బ్లాక్ చేయొచ్చు. మెమోజీ, ఫన్ కెమెరా ఎఫెక్ట్స్ : గత ఏడాది అనిమోజీని ప్రవేశపెట్టిన ఆపిల్ ఈసారి మెమోజీలను ప్రవేశపెట్టింది. ఇది అచ్చం శాంసంగ్ ఏఆర్ ఎమోజీలాగానే ఉంది. మెజర్ యాప్ : కొత్త యాప్ ఇది. వస్తువులు, గోడల కొలతలను ఈ ఫీచర్‌తో కొలవవచ్చు. ఐ బుక్స్‌ను ఆపిల్ బుక్స్‌గా రీడిజైన్ చేసింది. -
యాపిల్, అమెజాన్ చేతిలో ‘ఫేస్బుక్’
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. తమ వినియోగదారుల భద్రతే ముఖ్యమని మాటలు చెబుతున్న ఫేస్బుక్.. చేతల్లో మాత్రం యూజర్ల డేటాను ఇతరులకు కట్టబెట్టే ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. తాజాగా ఫేస్బుక్ తమ వినియోగదారుల సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేలా 60 పరికరాల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో ఇటీవల వరకు ఉక్కిరిబిక్కిరైన ఫేస్బుక్ సంస్థ తాజా ఉదంతంతో మరోసారి వార్తల్లోకెక్కింది. తాజా వివాదంలో ప్రముఖ పరికరాల తయారీ సంస్థలు యాపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, మైక్రోసాఫ్ట్, సామ్సంగ్లతోపాటు మరికొన్ని సంస్థలకు గత దశాబ్ద కాలంగా ఫేస్బుక్ తన యూజర్ల సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. యూజర్ల అనుమతి లేకుండా.. డివైజ్ తయారీదారులకు ఫేస్బుక్ తన యూజర్ల ప్రొఫెల్ వివరాలతోపాటు ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వారి వ్యక్తిగత వివరాలను కూడా యాక్సెస్ చేసుకునేలా పర్మిషన్ ఇచ్చిందని పేర్కొంది. ఫేస్బుక్ తన వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకునేందుకు ఈ ఒప్పందాలు పనిచేస్తున్నాయని వెల్లడించింది. పరికర తయారీ సంస్థలు యూజర్ల డేటాను ఉపయోగించి మెసేజింగ్, లైక్ బటన్, అడ్రస్ బుక్ లాంటి ఫీచర్లను వారివారి పరికరాల్లో పొందుపరిచేవని పేర్కొంది. వీటిలో కొన్ని సంస్థలైతే యూజర్ల ఫ్రెండ్స్ లిస్ట్‌లోని వారి ఖాతాల నుంచి కూడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేవని తెలిపింది. తాజా వివాదంతో మరోసారి ఫేస్బుక్ వ్యక్తిగత గోప్యత భద్రతా విధానాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రైవసీ రీసెర్చర్ సెర్గీ ఎగ్లిమన్ స్పందిస్తూ.. ‘పరికర తయారీ సంస్థలను విశ్వసనీయమైన సంస్థలుగా ఫేస్బుక్ భావిస్తుండొచ్చు. అయితే పరికర సంస్థల డివైజ్‌లలో ఉంచిన సమాచారాన్ని యూజర్లు వాడే ఇతర థర్డ్ పార్టీ యాప్స్ గనుక యాక్సెస్ చేయగలితే అది తీవ్రమైన గోప్యతా, భద్రతా పరమైన ప్రమాదంగా మారుతుంది’అని వివరించారు. ఆరోపణల్ని కొట్టిపారేసిన ఫేస్బుక్.. తాజాగా చెలరేగిన ఆరోపణలను ఫేస్బుక్ కొట్టిపారేసింది. ఫేస్బుక్ గోప్యతా విధానంలో ఉన్న ప్రకారమే సంస్థ నడుచుకుంటున్నట్లు వివరించింది. పరికర తయారీ సంస్థలతో చేసుకున్న ఈ ఒప్పందాలు యాప్ డెవలపర్లు తమ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే దానికి భిన్నంగానే ఉన్నాయని ఫేస్బుక్ సహాధ్యక్షుడు ఇమీ అర్షిబాంగ్ పేర్కొన్నారు. డెవలపర్లు గేమ్స్, ఇతర సర్వీసుల కోసం యూజర్ల డేటాను వాడుకుంటారని.. అయితే తయారీ సంస్థలు ఫేస్బుక్ వర్షన్లకు సంబంధించిన విషయాలకై మాత్రమే డేటాను ఉపయోగిస్తాయని తెలిపారు. -
కొత్త ఐఫోన్ల డిస్ప్లే స్క్రీన్లు ఏంటో తెలుసా?
టర్కీ : వచ్చే ఏడాది కొత్త ఐఫోన్ మోడల్స్ మూడింటిని లాంచ్ చేయాలని ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఐఫోన్లకు ఓలెడ్ స్క్రీన్లను వాడాలని ఆపిల్ నిర్ణయించినట్టు దక్షిణ కొరియా ‘ఎలక్ట్రానిక్ టైమ్స్’ రిపోర్టు చేసింది. దీంతో జపాన్ డిస్ప్లే షేర్లు 10 శాతం కిందకి పడిపోయాయి. జపాన్ డిస్ప్లే ప్రస్తుతం ఐఫోన్లకు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే(ఎల్సీడీ) స్క్రీన్లను అందించే సప్లయిర్లలో ప్రధానమైనది. ఆపిల్ ఇక తన కొత్త ఐఫోన్లకు ఓలెడ్ డిస్ప్లేలను వాడనుందని తెలియడంతో జపాన్ డిస్ప్ షేర్లు పతనమయ్యాయి. దీనికి వ్యతిరేకంగా ఎల్జీ డిస్ప్లే కో పైకి ఎగిసింది. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి ఆపిల్ దక్షిణ కొరియా కార్యాలయం కానీ, జపాన్ డిస్ప్లే కానీ నిరాకరించాయి. జపాన్ డిస్ప్లే కూడా ఓలెడ్ ప్యానల్స్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్లాన్‌ను 2019 నుంచి అవలింభించబోతోంది. ఈ కొత్త ప్రొడక్షన్ లైన్‌ను లాంచ్ చేయడం కోసం కొత్త ఇన్వెస్టర్లను సైతం జపాన్ డిస్ప్లే వెతుకుతోంది. నిజంగానే ఆపిల్ వచ్చే ఏడాది నుంచి అన్ని మోడల్స్‌కు ఓలెడ్ డిస్ప్లేలను వాడితే, అది ఎల్జీకి గుడ్‌న్యూస్ కానుంది. దీంతో ఈ కంపెనీ షేర్లు కూడా 5 శాతం పైకి జంప్ చేశాయి. ఓలెడ్ డిస్ప్లేల సరఫరా కోసం వనరులను విస్తరించాలని కూడా ఆపిల్ చూస్తున్నట్టు సియోల్‌కు చెందిన సిన్‌యంగ్ విశ్లేషకుడు లీ ఓన్-సిక్ చెప్పారు. -
శాంసంగ్‌కు భారీ ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఐప్యాడ్ కేసులో శాంసంగ్‌పై ఆపిల్ విజయం సాధించింది. ప్రతిష్మాత్మకమైన తమ ప్రొడక్ట్ ఐఫోన్లను శాంసంగ్ కాపీ కొడుతోందన్న ఆరోపణలపై ఫెడరల్ కోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 533 మిలియన్ డాలర్లు (సుమారు 3600 కోట్ల రూపాయలు) చెల్లించాలని శాంసంగ్‌ను కోర్టు ఆదేశించింది. రెండు పేటెంట్ రైట్స్ ఉల్లంఘనపై అదనంగా 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది. ఏడు సంవత్సరాల నాటి పేటెంట్ కేసులో అమెరికా ఫెడరల్ కోర్ట్ జ్యూరీ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆపిల్‌కు అతి ముఖ్యమైన ఐఫోన్ డిజైనింగ్ పేటెంట్ పోరులో ఆపిల్‌కు ఇది కీలక విజయమని టెక్ నిపుణుల అంచనా. ప్రొడక్టు డిజైనింగ్ సహా ప్యాకేజింగ్, యూజర్ ఇంటర్ఫేస్ తదితర అంశాల్లో శాంసంగ్ కాపీకొడుతోందని ఆపిల్ ఆరోపించింది. దీన్ని పేటెంట్, ట్రేడ్‌మార్క్ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. శాంసంగ్ యథేచ్ఛగా తమ ఉత్పత్తులను కాపీ కొడుతోందని ఆపిల్ ఆరోపించింది. మొబైల్ ఫోన్ డిజైన్లు, టెక్నాలజీ విషయమై శాంసంగ్, ఆపిల్ నడుమ గత కొన్నేళ్ళుగా అమెరికా న్యాయస్థానాల పరిధిలో న్యాయపోరాటం నడుస్తున్న విషయం తెలిసిందే. -
ఐఫోన్ ఎక్స్‌లో మరో ప్రాబ్లమ్, యూజర్లు గగ్గోలు
ఐఫోన్ ఎక్స్.. ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 10వ ఐఫోన్ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఈ స్మార్ట్‌ఫోన్‌కు అమర్చిన ఫేస్ఐడీలో లోపం ఉన్నట్టు యూజర్లు ఫిర్యాదులు చేస్తే.. తాజాగా వెనుక వైపు గల డ్యూయల్ కెమెరాకు అమర్చిన గ్లాస్ ప్రొటెక్షన్ అనుకోకుండా పగిలిపోతుందట. ఈ విషయంపై యూజర్లు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం ప్రారంభమైంది. రెడ్డిట్, ఆపిల్ సపోర్టు ఫోరమ్స్ల్లో పలు రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు ఐఫోన్ యూజర్లు తమ కెమెరా గ్లాస్ పగిలిపోతుందని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ గ్లాస్ పగిలిపోతుందో సరియైన కారణం మాత్రం తెలియడం లేదు. తమ ఫోన్లను కింద పడేయలేదని, దానికదే పగిలిపోతుందని యూజర్లు పేర్కొంటున్నారు. ‘నా ఐఫోన్ ఎక్స్ కెమెరా లెన్స్ పగిలిపోయినట్టు ఇప్పుడే చూశా. కానీ నేనసలు ఈ ఫోన్‌ను కిందనే పడేయలేదు’ అని ఒక యూజర్ రెడ్డిట్‌లో రిపోర్టు చేశాడు. చల్లని వాతావరణంతో మనిషి చేతులు, కాళ్లు పగిలినట్టు, ఫోన్ వెనుక వైపు కెమెరా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా చల్లని వాతావరణానికి దెబ్బతింటుందని పలువురు యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో ఉన్నందుకు వెనుక వైపు కెమెరా గ్లాస్ పగులుతుందని రిపోర్టులు వస్తున్నాయని, తాను మలేషియాలో ఉంటానని, ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉందని, అయితే ఇక్కడ ఏ కారణం చేత పగిలింది అని ఓ బాధిత యూజర్ ఆపిల్ సపోర్టు ఫోరమ్‌కు లేఖ రాశారు. తమ వద్ద 32-36 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టు పేర్కొన్నారు. ఐఫోన్ ఎక్స్‌తో పాటు యూజర్లు తన పాకెట్లలో మరికొన్ని వస్తువులను పెట్టుకుని ఉంటుండటంతో, కెమెరా గ్లాస్ పగులుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 7 నుంచి ఆపిల్ తన ఐఫోన్ మోడల్స్‌కు సఫైర్ గ్లాస్ కవర్‌ను వాడుతోంది. ఇది చాలా స్వచ్ఛంగా ఉంటోంది. కానీ ఎందుకు పగులుతుందో మాత్రం సరియైన క్లారిటీ తెలియడం లేదు. అయితే పగిలిపోయిన ఈ కెమెరా గ్లాస్‌కు వారెంటీ కిందకి వస్తుందో రాదో కూడా అనుమానమే. -
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను ప్రారంభించింది. ఆపిల్ వీక్ సేల్ పేరుతో ఈ ఈ-కామర్స్ దిగ్గజం వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకు మీ ఫేవరెట్ ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా అవకాశం కల్పిస్తోంది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్ 10వ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ సిరీస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్, ఎంపిక చేసిన ఆపిల్ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, మే 27 వరకు జరుగనుంది. ఐఫోన్ ఎక్స్... ఆపిల్ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్‌ను 85,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఇది అసలు ధర కంటే నాలుగు వేలు తక్కువ. ఇది 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర. 256జీబీ మోడల్ ధర ఐఫోన్‌ను 97,920 రూపాయలకు విక్రయిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ వస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్... ఐఫోన్ 8 (64జీబీ మోడల్) స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ధరలో 62,999 రూపాయలకు విక్రయిస్తోంది. 256జీబీ స్టోరేజ్ మోడల్‌ను కూడా 73,999కే అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ మోడల్‌ను 72,999 రూపాయలు అందుబాటులోకి తీసుకురాగ, 256జీబీ మోడల్‌ను 85,999 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ప్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ 6ఎస్.. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను 33,999 రూపాయల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 40వేల రూపాయలు. ఈ ధర స్పేస్ గ్రే, గోల్డ్ కలర్ వేరియంట్లు మాత్రమే. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ రోజ్ గోల్డ్, సిల్వర్ కలర్స్ వేరియంట్లను 34,999 రూపాయలకు అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ.. ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్‌ను 17,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఆపిల్ వీక్ సేల్‌లో ఇదే బెస్ట్ డీల్. అదనంగా కస్టమర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తోంది. ఇతర డీల్స్... ఆపిల్ ఎయిర్‌పాడ్స్ బ్లూటూత్ హెడ్సెట్ విత్ మిక్‌ను 11,499కు విక్రయిస్తోంది ఆపిల్ ఇయర్‌పాడ్స్ విత్ 3.5ఎంఎం హెడ్‌ఫోన్ ప్లగ్ వైర్డ్ హెడ్సెట్ విత్ మిక్‌ను 1,899కు అందుబాటులోకి ఆపిల్ టీవీ 32 జీబీ మోడల్ ఏ 1625ను 14,698 రూపాయలకు విక్రయం 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్ 32జీబీ మోడల్‌ను 22,900 రూపాయలకు ఆఫర్ 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్(6వ జనరేషన్)32 జీబీ ని 28వేల రూపాయలకు అందుబాటు ఆపిల్ వాచ్ సిరీస్‌ల ప్రారంభ ధర 20,900 రూపాయలు -
టాప్‌లో అమెజాన్, గూగుల్: మరి ఆపిల్?
లండన్: స్మార్ట్ స్పీకర్ల ఎగుమతుల్లో దిగ్గజ కంపెనీలు అమెజాన్, గూగుల్ టాప్ ప్లేస్‌లో నిలిచాయి. 2018 మొదటి త్రైమాసికంలో స్మార్ట్ స్పీకర్ల ఎగుమతుల్లో ఈ రెండు కంపెనీలు 70 శాతం వాటాను సాధించాయి. శుక్రవారం వెల్లడైన తాజా నివేదిక ప్రకారం ఈ సెగ్మెంట్లో ఆపిల్ నాలుగవ స్తానంలో నిలిచింది. ఆపిల్ 600,000 హోమ్ పాడ్లను విక్రయించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. మార్కెట్ పరిశోధనా సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ ప్రకారం మొదటి త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్ స్పీకర్ల ఎగుమతులు 9.2 మిలియన్ యూనిట్లు చేరుకున్నాయి. 43.6 శాతం మార్కెట్ వాటాతో అమెజాన్ నాలుగు మిలియన్ల స్పీకర్లు షిప్మెంట్ చేసి టాప్ ప్లేస్‌ను కొట్టేసింది. నాలుగు మిలియన్ల స్పీకర్లు షిప్మెంట్ చేసింది. అయితే 2017 ఏడాదితో పోలిస్తూ గ్లోబల్ మార్కెట్ వాటా ఈఏడాది బాగా తగ్గింది. గూగుల్ 2.4 మిలియన్ల విక్రయాలతో 26.5 శాతం వాటాను కొల్లగొట్టి రెండవ స్థానంలో నిలిచింది. చైనా ఇ-కామర్స్ జెయింట్ ఆలీబాబా 7.6 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానానికి చేరుకుంది. కాగా, ఆరు శాతం వాటా కలిగిన ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద స్మార్ట్ స్పీకర్ బ్రాండ్‌గా నిలిచింది. 70 శాతం వాటాతో టాప ప్లేస్‌లో ఉన్నప్పటికీ మొత్తం వాటా గత ఏడాది ఇదే క్వార్టర్లోని 94 శాతంతో పోలిస్తే 84 శాతానికి పడిపోయింద ని డేవిడ్ వాట్కిన్స్ వెల్లడించారు. అలాగే చైనాలో అలీబాబా, షావోమీ దేశీయంగా పుంజుకోడంతో పాటు, గ్లోబల్‌గా టాప్ ఫైవ్ లోకి దూసుకువచ్చాయని వ్యాఖ్యానించారు. కీబోర్డ్, మౌస్, టచ్ స్క్రీన్ స్థానంలో వాయిస్ మోడ్ ఇంటరాక్షన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే సమయం ఎంతో దూరంలో లేదన్నారు. -
ఆపిల్ వాచ్ 76 ఏళ్ల వ్యక్తిని కాపాడింది!
హాంకాంగ్ : ఆపిల్ వాచ్.. ఐఫోన్‌కు కొనసాగింపుగా టెక్ దిగ్గజం తీసుకొచ్చిన వినూత్న ప్రొడక్ట్. యూజర్ల ఫోన్ కాల్స్, మెసేజ్‌ల నుంచి, హెల్త్ ఫిట్నెస్ ట్రాకర్ వరకు అన్ని రకాల పనులను ఇది చేస్తోంది. హార్ట్ రేటు స్టేటస్‌ను కనుగొనడంలో ఈ డివైజ్‌లకు మించినది మరేమీ లేదంటే అతిశయోక్తి లేదు. తాజాగా ఈ ఆపిల్ వాచే ఓ 76 ఏళ్ల వ్యక్తి ప్రాణాల్ని కాపాడింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ప్రకారం హాంకాంగ్‌కు చెందిన గాస్టన్ డీఅక్వినోను ఒక్కసారిగా హార్ట్ రేటు సాధారణ స్థాయి నుంచి ఎక్కువకి పెరిగిపోయింది. ఆ విషయాన్ని ఆపిల్ వాచ్ కనిపెట్టేసి, హార్ట్ ఎటాక్ సూచనలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చింది. చర్చిలో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో ఆపిల్ వాచ్ ద్వారా ఈ సంకేతాలు వచ్చాయని గాస్టన్ పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్తే, నిజంగానే గుండె పోటు సంభవించబోతున్నట్టు ముందుగానే తెలిసినట్టు తెలిపారు. ‘ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలియదని డాక్టర్‌కి చెప్పా. కానీ నా హార్ట్ రేటు పెరుగుతుందని నా వాచ్ చెప్పింది’ అని గాస్టన్ అన్నారు. గాస్టన్ మాటలు విన్న డాక్టర్, మీకైనా ఆరోగ్యం కాస్త తేడాగా అనిపిస్తుందా అని గాస్టన్‌ను అడిగారు. కానీ అతను అంతా బాగున్నట్టు చెప్పినట్టు సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు రిపోర్టు చేసింది. కానీ డాక్టర్లు ఆయన ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్(ఈసీజీ) మిషన్ ద్వారా పరీక్షిస్తే, నిజంగానే హార్ట్ ఎటాక్ సంభవిస్తున్నట్టు తెలిసినట్టు పేర్కొంది. అప్పటికే గాస్టన్ గుండెకు చెందిన మూడు ప్రధాన హృదయ ధమనుల్లో రెండు పూర్తిగా మూసుకుపోయాయని, మూడోది కూడా దాదాపు 90 శాతం బ్లాక్ అయినట్టు నిర్ధారణ అయినట్టు డాక్టర్లు చెప్పారు. దీనివల్ల గుండె పోటు అధికంగా సంభవించి, మనిషి ప్రాణాలను హరింపజేస్తుందని తెలిపారు. వెంటనే డాక్టర్లు గాస్టన్కు శస్త్రచికిత్స చేశారు. గుండెకు రక్తం సరఫరా అయ్యేలా చికిత్స చేసి, గాస్టన్‌ను డిశ్చార్జ్ చేశారు. ఆపిల్ వాచ్ వల్లే తన ప్రాణాలను కాపాడుకోగలిగానని గాస్టన్ చెప్పారు. ఆపిల్ వాచే తనకు కొత్త జీవితం ఇచ్చిందని, తనకు ప్రసాదించిన ఆపిల్ వాచ్ ప్రొడక్ట్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు ఈమెయిల్ పంపారు. కార్డియాక్ సమస్యలు ఉన్న వారు ఆపిల్ వాచ్‌ను వాడితే బాగుంటుందని ఆయన సూచించారు. తన కజిన్ కూడా గత రెండు వారాల క్రితం తీవ్రమైన గుండె పోటుతో ప్రాణాలు వదిలారని, నిజంగానే తన వద్ద కూడా ఆపిల్ వాచ్ ఉంటే, తనలాగే ప్రాణాలు కాపాడుకునే అవకాశముండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గాస్టనో పంపిన ఈమెయిల్‌కు సమాధానమిచ్చిన టిమ్ కుక్, మీ స్టోరీని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు, ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆపిల్ వాచ్ యూజర్ల ప్రాణాలు కాపాడటం ఇదే తొలిసారి కాదు, ఏప్రిల్ నెలలో కూడా ఇలాంటి సంఘటనే మూడు చోటు చేసుకున్నాయి. ఆపిల్ వాచ్‌లు యూజర్లు హెల్త్ స్టేటస్‌ను పరిశీలించి, ముందస్తుగానే వారి ఆరోగ్యంపై హెచ్చరికలు, సూచనలు చేస్తున్నాయి. -
క్రెడిట్ కార్డులను తీసుకొస్తున్న టెక్ దిగ్గజం
వాషింగ్టన్ : స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ మార్కెట్లో తనదైన హవా సాగిస్తున్న టెక్ దిగ్గజం ఆపిల్ దృష్టి ఇప్పుడు క్రెడిట్ కార్డు వ్యాపారంపై పడింది. ఈ కంపెనీ ఇప్పుడు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ‘గోల్డ్ మ్యాన్ శాక్స్’తో కలిసి, క్రెడిట్ కార్డులను ఆఫర్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆపిల్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. దీనికోసం ఇటీవలే గోల్డ్ మ్యాన్ శాక్స్ తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. మరింత ఆదాయం పొందే వ్యూహంలో భాగంగా ఆపిల్ క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. ఆపిల్ పే బ్రాండుతో ఈ కార్డులు మార్కెట్లోకి వస్తాయని రిపోర్టులు పేర్కొన్నాయి. ఆపిల్ పే అనేది ఈ టెక్నాలజీ దిగ్గజానికి చెందిన మొబైల్ పేమెంట్, డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫామ్. తన రెవెన్యూల్లో గాడ్జెట్లనే కాకుండా.. మిగతా వాటిని భాగస్వామ్యం చేయాలని ఆపిల్ భావిస్తోంది. బ్యాంకులు, టెక్ స్టార్టప్‌ల నుంచి ఇటీవల పేమెంట్స్ స్పేస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంటున్న సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఆపిల్ ఆదాయాలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.భారత మార్కెట్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్, గోల్డ్‌మ్యాన్ శాక్స్ అధికార ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు.