సోషల్‌ మీడియాలో కొత్త క్రేజ్‌.. స్లోఫీ, అంటే? | Apple  Slofie is the new fad on selfie crazy social media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో కొత్త క్రేజ్‌.. స్లోఫీ, అంటే?

Published Tue, Sep 24 2019 9:14 AM | Last Updated on Tue, Sep 24 2019 9:23 AM

Apple  Slofie is the new fad on selfie crazy social media - Sakshi

ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు యువతలో ఉన్న సెల్పీ పిచ్చిన బాగానే క్యాష్‌  చేసుకుంటున్నారు.  భారీ సెల్పీ కెమెరా, బ్యూటీ మోడ్, ఫేస్  ఫిల్టర్స్‌,  టైమ్ లాప్స్,  బోతీ వంటి ప్రీ-లోడెడ్ కెమెరా ఆప్షన్లతో  ఆకట్టుకుంటున్నారు. తాజాగా  మరో కొత్త ఫీచర్‌ యూత్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. దాని  పేరే  స్లోఫీ. అంటే స్లో మోషన్​ సెల్ఫీ అన్నమాట. అమెరికా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం యాపిల్‌ తీసుకొచ్చిన తాజా యాపిల్​  ఐఫోన్ల 11 సిరీస్​లోని ఫ్రంట్ కెమెరాలో ఈ ఫీచర్‌ను జోడించింది. ఇది సెప్టెంబర్ 27 నుండి భారతదేశంలో అందుబాటులో ఉంటుంది.

స్లోఫీ అనేది ఐఫోన్  సెల్ఫీ కెమెరా ద్వారా  తీసుకునే స్లో మోషన్ షార్ట్ వీడియో.  ఇది కూడా  స్లో మోషన్ వీడియో లానే పనిచేస్తుంది.  120 ఎఫ్‌పిఎస్ (సెకనుకు ఫ్రేమ్‌లు) క్యాప్చర్‌ చేస్తుందట. స్లోఫీ కోసం, వినియోగదారులు ముందు కెమెరాలో స్లో-మో మోడ్‌ను ఆన్ చేయాలి, రికార్డ్ బటన్‌పై ప్రెస్‌చేసి తల, చేయి, ముఖంలోని వేగవంతమైన కదలికలను రికార్డు చేయవచ్చు. అయితే, నెటిజన్లు మాత్రం ఈ స్లోపీపై ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లలో సెటైర్లు పేలుతున్నాయి. 2019లో చెత్త పదాల్లో ఇదొకటి వ్యాఖ్యానింస్తున్నారు. ఫన్నీ వీడియోలను పోస్ట్‌ చేశారు. కాగా సెప్టెంబర్ 10న యాపిల్  ఐ ఫోన్లు 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించిన ప్రత్యేక కార్యక్రమంలో స్లోఫీ ఫీచర్‌ను పరిచయం  చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement