ఐఫోన్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో టాప్ బ్రాండ్ ఫోన్ అది. చేతిలో ఆ కంపెనీ గాడ్జెట్ ఉందంటే అది తన తాహతకు చిహ్నం. అదే ఆపిల్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే బ్రాండ్ ఇదే. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ ఇలా పలు గాడ్జెట్‌లతో ఖరీదైన బ్రాండ్‌గా పేరొందింది.
కానీ అలాంటి పెద్ద బ్రాండ్‌ను ఓ తెలుగు అక్షరం ముప్పుతిప్పలు పెడుతోంది. అక్షరం టైప్ చేస్తే ఫోన్‌లోని యాప్స్ అన్నీ వాటంతట అవే క్రాష్ అవుతున్నాయి. బగ్ కారణంగా తెలుగు అక్షరం 'జ్ఞ' టైపు చేయగానే అన్ని యాప్స్ నిలిచిపోతున్నాయి. ఛాటింగ్ యాప్స్, స్లాక్, టెలిగ్రామ్, స్కైప్ ఓపెన్ చేసి మెస్సేజ్ కంపోజ్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ సమస్య ఎదురౌతోంది. ఇటలీకి చెందిన ఓ ప్రోగ్రామర్ ఈ బగ్‌ను యాపిల్ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన ఆపిల్ సంస్థ తన ఐఓఎస్‌లో ఈ బగ్ ఉందంటూ నిర్ధారించింది. దాన్ని సరిచేయడానికి త్వరలోనే పరిస్కారం తీసుకువస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బీటా వెర్షన్ వాడుతున్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. అయితే ఈ బగ్‌తో యాపిల్ సంస్థపై సటైర్లు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. ఇంత చిన్న బగ్‌ను పరిస్కరించలేని ఆపిల్‌కు అంత పెద్ద పేరు ఎలా వచ్చిందంటూ విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment