bug
-
ఇది టైప్ చేశారంటే అంతే.. ఐఫోన్ క్రాష్!
ఐఫోన్లు, ఐప్యాడ్లలో కొత్త బగ్ ఒకటి బయటపడింది. కొన్ని అక్షరాలను టైప్ చేస్తే ఐఫోన్లు, ఐప్యాడ్లు క్రాష్ అవుతున్నాయి. “”: తర్వాత ఏదైనా అక్షరం టైప్ చేయగానే స్ప్రింగ్‌బోర్డ్ అని పిలిచే యాపిల్ డివైజ్ ఇంటర్ఫేస్ క్షణంలో క్రాష్ అయ్యి తిరిగి లాక్ స్క్రీన్‌కి వెళ్తోంది.ఈ విషయాన్ని మొదట ఓ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించారు. ఆ తర్వాత టెక్ పబ్లికేషన్ ‘టెక్‌క్రంచ్’ కూడా దీన్ని పరీక్షించింది. సెట్టింగ్స్ యాప్ లేదా యాప్ యాప్ లైబ్రరీలోని సెర్చ్ బార్లో ఈ అక్షరాలను టైప్ చేయగా క్రాష్ అవుతోందని ధ్రువీకరించింది. కొన్ని సందర్భాల్లో డివైజ్ సాధారణ స్థితికి రావడానికి ముందు స్క్రీన్ ఒక సెకను బ్లాక్‌గా ఫ్లాష్ కావచ్చని పేర్కొంది.అయితే ఈ బగ్ భద్రతా ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన రియాన్ స్టోర్జ్ సమస్యను విశ్లేషిస్తూ ఇది మీ డివైజ్ భద్రతకు హాని కలిగించదని నిర్ధారించారు. డబుల్యూ అనే సెక్యూరిటీ స్టార్టప్‌ని స్థాపించిన మరో ఐఓఎస్ నిపుణుడు పాట్రిక్ వార్డ్లే కూడా బగ్ కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినా ప్రమాదకరం కాదని అంగీకరిస్తున్నారు.కాగా ఈ బగ్‌పై యాపిల్ ఇంకా స్పందించలేదు. అయితే వారు భవిష్యత్తు అప్డేట్లో దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అసౌకర్యాన్ని నివారించాలనుకుంటే, మీ ఐఫోన్, ఐప్యాడ్ సెర్చ్ బార్లలో “”: అని మాత్రం టైప్ చేయొద్దు. -
Microsoft outage: బగ్‌తో పరిహాసమా?!
బ్రస్సెల్స్: మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బగ్ వల్ల బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ సమస్య తలెత్తడంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత సేవలు నిలిచిపోయాయి. కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సైబర్‌సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్రై్టక్ అందించిన అప్డేట్లో బగ్ వల్లే ఈ సంక్షోభం ఏర్పడింది. ఇది చాలా తీవ్రమైన విషయం కాగా, బెల్జియం వ్యంగ్య రచయిత విన్సెంట్ ఫ్లిబస్టీర్ పరిహాసానికి దిగాడు. నెటిజన్లతో చీవాట్లు తింటున్నాడు. తాను క్రౌడ్స్రై్టక్ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరానని, మొదటి రోజు సాఫ్ట్‌వేర్‌లో చిన్న ఆప్డేట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టాడు. కోడ్‌లో కేవలం ఒక లైన్ మార్చడం వల్ల బగ్ ఏర్పడిందని తెలిపాడు. క్రౌడ్‌స్ట్రైక్ ఆఫీసులో దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు. నిజానికి అతడు ఈ సంస్థలో ఉద్యోగి కాదు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఈ ఫొటో సృష్టించాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ మారింది. 3.8 లక్షల లైక్‌లు వచ్చాయి. 37,000 మంది షేర్ చేశారు. కొన్ని గంటల తర్వాత విన్సెంట్ మరో పోస్టు చేశాడు. సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాధపడ్డాడు. ఇది చాలా అన్యాయం అంటూ ఆక్రోశించాడు. తనకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని దీనంగా వేడుకున్నాడు. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్‌్కను సైతం కోరాడు. తాను బాధపడుతున్న వీడియోను పంచుకున్నాడు. నెటిజన్లు చాలామంది ఇదంతా నిజమేనని నమ్మేశారు. కానీ, నిజం దాగదు కదా! వాస్తవం ఏమిటో తెలిసిపోయింది. పిచి్చవేషాలు మానుకోవాలంటూ విన్సెంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. విన్సెంట్ నార్డ్ప్రెస్ అనే బెల్జియన్ పేరడీ న్యూస్ సైట్‌కు వార్తలు రాస్తుంటాడు. -
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
న్యూయార్క్: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాఉంటుందో శుక్రవారం(జులై 19) అర్థమైంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో బగ్ సమస్య తలెత్తి అమెరికాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్,డెల్టా,యునైటెడ్ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయాయి. దీంతో అగ్రదేశ గగనతలంలో విమానాల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ సాధారణ సమయంలో విమానాల రద్దీ ఎలా ఉంటుంది.. శుక్రవారం విమానాల రద్దీ తగ్గిన తర్వాత ఎలా ఉందనే 12 గంటల ఆసక్తికర టైమ్‌లాప్స్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానాల ట్రాఫిక్ టైమ్‌లాప్స్ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. 12-hour timelapse of American Airlines, Delta, and United plane traffic after what was likely the biggest IT outage in history forced a nationwide ground stop of the three airlines. pic.twitter.com/wwcQeiEtVe— Colin McCarthy (@US_Stormwatch) July 19, 2024 -
అంతరిక్ష కేంద్రంలో ‘స్పేస్ బగ్’ .. ఇబ్బందుల్లో సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్(59) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో సురక్షింతగా అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)కు చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్‌తో సహా 8 మంది సిబ్బందికి ‘స్పేస్ బగ్’ రూపంలో ఇబ్బంది వచ్చిపడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్గా పిలిచే ‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష వాతావరణంలో ఈ బ్యాక్టీరియా మరింత బలం పెంచుకుంటోందని తెలిపారు. ఇది అనేక ఔషదాలను నిరోధించగలిగే శక్తివంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కావడం వల్ల దీన్ని ‘సూపర్ బగ్’గా పిలుస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ స్పేస్ బగ్‌తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునితా విలియమ్స్ సహా మిగిలిన ఎనిమిది మంది సిబ్బంది ఇబ్బందుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అంతరిక్ష కేంద్రం.. కదిలే అంతరిక్ష శిధిలాల వల్ల ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఒకరి నుంచి మరోకరి వ్యాపించే ‘స్పేస్ బగ్’ గత కొన్ని ఏళ్ల నుంచి అభివృద్ధి చెందటం మరింత ఆందోళన కలిగిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొటుంన్నారు. వ్యోమగాములు అంతరిక్ష యాత్రల సమయంలో ఆరోగ్యపరంగా సవాళ్లను ఎదుర్కొంటారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యం కోసం ‘స్పేస్ బగ్’ ప్రభావాన్ని, ప్రతికూలతలను అంతరిక్ష కేంద్రం త్వరగా అంచనా వేయటం కీలమని పేర్కొంటున్నారు.సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్ బారీ యూజీన్ బుచ్ విల్మోర్ జూన్ 6, 2024 న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునిత డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే వారు వారం రోజులు పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి.. అనంతరం భూమిపైకి తిరిగి వస్తారు. -
ఈ ఒక్కపని చేస్తే చాలు రూ. 16 లక్షలు గెలిచే ఛాన్స్.. డోంట్ మిస్!
విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసిన చాట్‌జీపీటీ గురించి దాదాపు అందరికి తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్న చాట్‌జీపీటీ యూజర్లకు 'ఓపెన్ఏఐ' (OpenAI) కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, చాట్‌జీపీటీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి చెప్పిన వారికి 20,000 డాలర్లు బహుమతిగా అందిస్తామని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 16 లక్షల కంటే ఎక్కువే. ఈ కొత్త ప్లాట్ఫామ్లో బగ్‌లను గుర్తించి పరిష్కరించే కార్యక్రమంలో భాగంగానే ప్రోగ్రామర్స్, ఎథికల్ హ్యాకర్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రోగ్రామర్స్ లేదా ఎథికల్ హ్యాకర్స్ చాట్‌జీపీటీలో గుర్తించే బగ్ తీవ్రతను బట్టి బహుమతి ఉంటుంది. దీనికోసం ఓపెన్ ఏఐ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ మంగళవారం నుంచి మొదలైంది. ఇందులో తక్కువ బహుమతి 200 డాలర్లు కాగా (రూ. 16,000 కంటే ఎక్కువ), గరిష్టంగా 20,000 డాలర్ల వరకు బహుమతి పొందవచ్చు. మీరు గుర్తించే బగ్ మీ ప్రైజ్ మనీని డిసైడ్ చేస్తుంది. టెక్నాలజీ ఇండస్ట్రీలో ఇలాంటి బగ్స్ గుర్తించడం సులభమే, కానీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్‌లో బగ్ గుర్తించడం కష్టంతో కూడుకున్న పనే అనిచెబుతున్నారు. అయితే గతంలో సాఫ్ట్వేర్ సిస్టమ్స్‌లో కూడా బగ్స్ గుర్తించి బహుమతులు పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. (ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ) చాట్‌జీపీటీ ఏ విధంగా పనిచేస్తోందని పరిశీలించి ఇందులో ఏదైనా సమస్య లోపాలను గుర్తించినప్పుడు కంపెనీ దానిని పరిష్కరిస్తుంది. అయితే ప్రస్తుతం చాట్‌జీపీటీ ఆదరణ ఎక్కువగా ఉన్నప్పటికీ యూజర్లు, వారి డేటాతో ఏ విధంగా డీల్స్ చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ప్రైవసీ రూల్స్‌ను అతిక్రమిస్తున్న కారణంగా ఇటలీలో దీనిని బ్యాన్ చేశారు. అంతే కాకుండా కొన్ని వ్యాపార కంపెనీలు, నిపుణులు దీనిని నిలిపివేయాలని ఇది రాబోయే రోజుల్లో ఎక్కువమంది మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. -
Bug in Uber: ఉబర్‌లో ఫ్రీ రైడింగ్ సర్వీస్.. ఇండియన్ హ్యాకర్‌కి రూ.4.6 లక్షల రివార్డ్!
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ 'ఉబర్' (Uber) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ రోజు మన ప్రయాణాలను మరింత సుగమనం చేయడానికి ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ యాప్‌లో కంపెనీ కూడా గుర్తించని ఒక బగ్ ఒక ఇండియన్ గుర్తించి సంస్థ నుంచి భారీ నజరానా పొందాడు. నివేదికల ప్రకారం.. ఉబర్ యాప్‌లో ఫ్రీ రైడింగ్‌కి సంబంధించిన ఒక బగ్ ఉన్నట్లు భారతీయ ఎథికల్ హ్యాకర్ 'ఆనంద్ ప్రకాశ్' కనిపెట్టాడు. ఈ విషయాన్నీ స్వయంగా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి కంపెనీ అతనికి రూ. 4.5 లక్షలు బహుమతిగా అందించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబర్‌లో కనిపించిన ఈ కొత్త బగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఫ్రీ రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది, అప్పుడు కంపెనీ ఎక్కువ నష్టాలను భరించాల్సి వచ్చేది. కానీ ఎట్టకేలకు ఇది హ్యాకర్ కంటపడి కంపెనీ దృష్టికి చేరటం వల్ల ఆ ప్రమాదం తప్పింది. దీని గురించి ఒక వ్యక్తి చెప్పే వరకు కంపెనీ గుర్తించకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: ఒకే రోజు 400 కార్లు డెలివరీ చేసిన మహీంద్రా.. బుక్ చేసుకున్న వారికి పండగే!) ప్రకాష్ 2017లో ఈ కనుగొన్నట్లు, 2019లో దీని గురించి కంపెనీకి వివరించినట్లు సమాచారం. కంపెనీకే తెలియని విషయం చెప్పిన ఇతనికి సంస్థ జీవితాంతం ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఆనంద్ ప్రకాశ్ ఈ బగ్ గురించి వివరంగా తన లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా వివరించారు. -
లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ని వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ కోట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో చాలామంది ఇందులో సమయ గడిపే వారు కూడా ఉన్నారు. అయితే ఓ విద్యార్థి మాత్రం ఇన్‌స్టాని వాడడంతో అందులో బగ్ ఉన్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని కంపెనీకి తెలియజేసి లక్షల రివార్డ్ గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన విద్యార్థి నీరజ్ శర్మ.. తన ఫోన్లో ఇన్‌స్టా వాడుతుండగా అందులో ఓ బగ్ ఉన్నట్లు గుర్తించాడు. అదేంటంటే.. అవతలి యూజర్ లాగిన్, పాస్వర్డ్ లేకుండా అతని ఖాతాలోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ థంబ్‌నైల్స్ మార్చేందుకు ఈ బగ్ అనుమతిస్తోంది. దీంతో శర్మ ఈ విషయాన్ని జనవరిలో కంపెనీకి తెలియజేశాడు. ఇందుకు స్పందనగా.. ఈ బగ్‌కు సంబంధించిన డెమో వీడియోను పంపాలని కంపెనీ శర్మను కోరింది. బగ్ ఎలా పనిచేస్తుందనే తెలిపే 5 నిమిషాల డెమో వీడియోని చిత్రీకరించి అతను కంపెనీకి పంపాడు. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, ఫేస్బుక్ శర్మకి $45,000 రివార్డ్‌ను ప్రకటించింది (అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 38 లక్షలు). అంతేకాకుండా రివార్డ్‌ని నాలుగు నెలలు ఆలస్యం చేసినందుకు కూడా $4500 అంటే రూ.3.6 లక్షలు ఆఫర్ చేసింది. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
పెను ప్రమాదంలో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్..!
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! తాజాగా వెలుగులోకి వచ్చిన బగ్‌తో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ పెను ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదం ఎక్కువగా ఆండ్రాయిడ్ 12తో నడుస్తోన్న స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండనుంది. డర్టీ పైప్ డర్టీ పైప్ అనే బగ్ ఆండ్రాయిడ్ 12తో నడుస్తున్న పలు స్మార్ట్‌ఫోన్స్‌ను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బగ్‌తో హ్యాకర్లు స్మార్ట్‌ఫోన్స్‌పై యాక్సెస్‌ను సులువుగా పొందుతారు. అంతేకాకుండా రీడ్-ఓన్లీ ఫైల్స్‌లో డేటాను ఓవర్‌రైట్ చేసే అవకాశం ఉంది. జర్మన్ వెబ్ డెవలప్మెంట్ కంపెనీ CM4కి చెందిన భద్రతా పరిశోధకుడు మాక్స్ కెల్లర్‌మాన్ 'డర్టీ పైప్' దుర్బలత్వాన్ని గుర్తించారు. దీనిని మొదటగా లైనక్స్ (Linux) కెర్నల్లో గుర్తించారు. ఈ వారం ప్రారంభంలో CVE-2022-0847గా నమోదు చేయబడిన సెక్యూరిటీ బ్రీచ్‌ను కెల్లర్‌మాన్ బహిరంగంగా వెల్లడించారు. చదవండి: శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.! కెల్లర్‌మాన్ ప్రకారం...ఈ సమస్య Linux 5.16.11, 5.15.25 , 5.10.102లో పరిష్కరించనప్పటికీ, వెర్షన్ 5.8 లైనక్స్ కెర్నల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 2018లో వచ్చిన డర్టీ కౌ(Dirty CoW)ను పోలీ ఉందని పరిశోధకులు తెలిపారు. అప్పట్లో పలు ఆండ్రాయిడ్ యూజర్లను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ సమయంలో గూగుల్ సెక్యూరిటీ ప్యాచ్‌ను విడుదల చేయడంతో ఈ లోపాన్ని వెంటనే పరిష్కరించగల్గింది. ఎన్‌క్రిప్డెడ్ సందేశాలను సులువుగా..! డర్టీ పైప్ బగ్ సహయంతో హ్యాకర్లు సులువుగా ఆయా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా స్మార్ట్‌ఫోన్ సిస్టంలోని రీడ్-ఓన్లీ ఫైల్లలో డేటాను ఓవర్‌రైట్ చేయడానికి యాక్సెస్‌ను హ్యాకర్లు పొందుతారు. ఆండ్రాయిడ్ సిస్టంకు లైనక్స్ కెర్నల్‌ను కోర్గా ఉపయోగిస్తుంది దీంతో ఆయా స్మార్ట్‌ఫోన్ యూజర్లపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ సందేశాలను చదవడానికి, మార్చడానికి, ఓటీపీ సందేశాలను క్యాప్చర్ చేయడానికి ఈ బగ్ హ్యకర్లకు ఉపయోగపడనుంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసిన బ్యాంకింగ్ యాప్స్‌ను రిమోట్‌గా నియంత్రించేందుకు వారికి అనుమతి లభిస్తోంది. వీటిపై ప్రభావం ఎక్కువగా..! ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఆండ్రాయిడ్ వెర్షన్ 12 కి ముందు వెర్షన్స్ అస్సలు ప్రభావితం కావు. అయితే ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఉన్న పలు స్మార్ట్‌ఫోన్స్ ప్రభావితమవుతాయని కెల్లర్‌మాన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 6, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 స్మార్ట్‌ఫోన్స్ బగ్‌తో ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈ బగ్ గురించి గూగుల్ ఇప్పటికే తెలుసు కానీ దాని పరిష్కారాన్ని ఇంకా చూపలేదు. కాగా ఈ బగ్ నుంచి తప్పించుకోవడం కోసం ఆండ్రాయిడ్ యూజర్లు ఎలాంటి థర్డ్-పార్టీ సోర్స్ నుంచి యాప్స్‌ను ఇన్స్టాల్ చేయకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చదవండి: నోకియా సంచలన నిర్ణయం..! -
ఆగిపోయిన ట్విటర్ సేవలు! కారణం ఏంటంటే..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల సేవల్లో అంతరాయం ఈరోజుల్లో సాధారణమైపోయింది. అయితే ఈ విషయంలో మిగతా వాటితో పోలిస్తే ట్విటర్ కొంచెం మెరుగు అనే అభిప్రాయం ఉంది యూజర్లలో. అందుకే వేరే ఏదైనా ప్లాట్‌ఫామ్ సేవలకు ఇబ్బంది అయినప్పుడు.. ట్విటర్లో చెడుగుడు ఆడేసుకుంటారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చాలా కాలం తర్వాత ట్విట్టర్ పిట్ట కూత ఆగిపోయింది. గంటల వ్యవధిపాటు సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు నానా అవస్థలు పడ్డారు. గత రాత్రి(శుక్రవారం) 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. సమస్య ఏంటంటే.. ఈ అంతరాయంపై స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల(టెక్నికల్ బగ్) కారణంగానే సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది. ట్విటర్ తిరిగి సేవలు ప్రారంభించగానే.. ట్విటర్‌నే ట్రోల్ చేస్తూ పలువురు ట్వీట్లు చేయడం కొసమెరుపు. We’ve fixed a technical bug that was preventing timelines from loading and Tweets from posting. Things should be back to normal now. Sorry for the interruption! — Twitter Support (@TwitterSupport) February 11, 2022 మొబైల్ మాత్రమే కాదు వెబ్సైట్లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని పలువురు ఫిర్యాదులు చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే అది లాగౌట్ అయిందని మరికొందరు తెలిపారు. డౌన్‌డిటెక్టర్ అనే ట్రాక్ ప్రకారం.. సుమారు 48 వేలకు పైనే ఫిర్యాదులు అందాయి. -
వాట్సాప్ యూజర్లకు కొత్త తలనొప్పి..! యాప్‌లో సమస్య..ఇలా చేస్తే బెటర్..!
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యతో తరుచూ వాట్సాప్ యాప్ క్రాష్ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమస్య కేవలం వాట్సాప్ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఒపెన్ చేస్తే ఎర్రర్..! వాట్సాప్ బీటా యూజర్లు యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు లేదా మీడియాను షేర్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చినట్లు పలువురు యూజర్లు నివేదించారు. ఈ సమస్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ యాప్ క్రాష్ అవుతున్నట్లు మెటా కూడా నిర్థారించింది. యాప్ క్రాష్‌కు కారణమైన బగ్‌కు మెటా పరిష్కారాన్ని కూడా చూపింది. ఇలా చేస్తే సెట్..! వాట్సాప్ ట్రాకర్ WABetaInfo ప్రకారం..కొత్త మంది బీటా యూజర్లకు యాప్ క్రాష్ సమస్య వస్తోన్నట్లు నివేదించింది. వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ 2.22.4.6, 2.22.4.7 వెర్షన్ల యూజర్లు మీడియాను ఇతర యూజర్లతో షేర్ చేస్తున్నప్పుడు క్రాష్ అవుతున్నట్లు సమాచారం. ఈ సమస్యకు మెటా పరిష్కారాన్ని చూపింది. వాట్సాప్ బీటా 2.22.4.6, 2.22.4.7 వెర్షన్లను వాడే యూజర్లను వెంటనే 2.22.4.8 వెర్షన్‌కు అప్డేట్ చేయాలని మెటా సూచించింది. వాట్సాప్ యూజర్ల డేటాను భద్రంగా ఉంచేందుకుగాను ఆయా యూజర్లు తమ గూగుల్ డ్రైవ్‌తో బ్యాకప్ చేసుకోవాలని వాట్సాప్ ట్రాకర్ WABetaInfo తెలిపింది. చదవండి: మీరు వాట్సాప్ గ్రూప్ అడ్మినా..! అయితే మీకో గుడ్‌న్యూస్..! -
యాపిల్ లోపం... విద్యార్థి ఇంట కాసుల వర్షం!
కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న, చిన్న తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ సూత్రం మనకే కాదు దిగ్గజ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. దిగ్గజ కంపెనీలకు చెందిన సాంకేతికతలో ఉన్న చిన్న లోపం వల్ల కూడా కొన్నిసార్లు వేల కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి చిన్న తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటే ఏమి పర్వాలేదు. టెక్ దిగ్గజ యాపిల్ కంపెనీ ఇప్పుడు అదే పని చేసింది. ర్యాన్ పిక్రెన్ అనే సైబర్ సెక్యూరిటీ విద్యార్థికి బిగ్ బౌంటీ కింద 100,500 డాలర్లు(సుమారు రూ.75 లక్షలు) ఇచ్చింది. మ్యాక్ వెబ్‌క్యామ్‌లను హ్యాకర్లు హ్యాక్ చేసే విధంగా ఉన్న ఒక లోపాన్ని గుర్తించినందుకు యాపిల్ ఆ డబ్బులను ఇచ్చింది. ఐక్లౌడ్ షేరింగ్, సఫారీ 15తో సహ ఇతర బ్రౌజర్లలో వరుసగా బయటపడుతున్న లోపాల వల్ల హ్యాకర్లు వెబ్‌క్యామ్‌లను హ్యాక్ చేయవచ్చు అని ర్యాన్ పిక్రెన్ ఒక బ్లాగ్ పోస్టులో తెలిపారు. గత ఏడాది యాపిల్ ఈ లోపాలను పరిష్కరించినట్లు వైర్డ్ మీడియా తెలిపింది. "ఈ లోపం వల్ల భాదితులు ఓపెన్ చేసిన పోర్టల్ వివరాలు అన్నీ హ్యాకర్ చేతికి వెళ్తాయి. కొన్నిసార్లు, మన వెబ్‌క్యామ్ కూడా రికార్డు చేయడం ప్రారంభిస్తుంది. నేను కనిపెట్టిన బగ్ మీ ఐక్లౌడ్, పే పాల్, ఫేస్ బుక్, జీమెయిల్ మొదలైన ఖాతాలను కూడా హ్యాక్ చేయగలదు" అని ఆయన ఆ పోస్టులో రాశారు. సాధారణంగా కొన్నిసార్లు మనం డజన్ల కొద్దీ బ్రౌజర్ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు అకస్మాత్తుగా అనేక యాదృచ్ఛిక ప్రకటనల రావడం మనం గమనిస్తుంటాం. అయితే, ఇది కూడా హ్యాకింగ్‌లో ఒక టెక్నిక్. గత సంవత్సరం చివరలో బయటపడిన మాక్ ఓఎస్ లోపం మీ సఫారీ ట్యాబ్, ఇతర బ్రౌజర్ సెట్టింగ్ వివరాలను దోపిడి చేసి ఉండవచ్చు అని పిక్రెన్ పేర్కొన్నారు. ఈ లోపం వల్ల హ్యాకర్లు మీ ఆన్లైన్ ఖాతాలపై నియంత్రణ పొందడమే కాకుండా, మీ మైక్రోఫోన్ ఆన్ చేయడం లేదా మీ వెబ్‌క్యామ్ హ్యాక్ చేసి ఉండవచ్చు అని అన్నారు. అందుకే, ముఖ్యమైన వివరాలను,పాస్‌వర్డ్‌లను ఎన్నడూ కూడా బ్రౌజర్లలో సేవ్ చేయకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైన నగదు లావాదేవీలు చేసేటప్పుడు వర్చువల్ కీ బోర్డ్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. (చదవండి: తిక్క కుదిరిందా ఎలన్ మస్క్? అదిరిపోయే పంచ్!) -
మళ్లీ అదే అంధకారమా..! తెరపైకి మరోసారి Y2K సమస్య..! ప్రభావమెంతంటే..?
1999 చివరలో ఒక్కసారిగా టెక్ ప్రపంచాన్ని మూగబోయేలా చేసింది Y2K సమస్య. దీని కారణంగా ఎన్నో కంప్యూటర్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు మూలన పడిపోయాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది Y2K. తాజాగా ఇలాంటి టెక్ బగ్ ఒకటి మరోకటి వెలుగులోకి వచ్చింది. అప్డేట్ వెర్షన్‌తో...! Y2K కొత్త ఏడాదితో సరికొత్తగా అప్డేట్ వెర్షన్‌తో Y2K22 అనే కొత్త బగ్ వచ్చింది. విచిత్రంగా ఈ సమస్య కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. Y2K22 సమస్య యూకే, యూఎస్, కెనడాలో వెలుగు చూసినట్లు వార్తలు వస్తున్నాయి. హోండా, అకురా పాత కార్లలో..! హోండా, అకురా బ్రాండ్స్‌కు చెందిన ఆయా కారు మోడల్స్‌లో Y2K22 బగ్ కన్పించినట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది 2022 లోకి ప్రవేశించినప్పుడు ఆయా హోండా పాత కార్లలో జనవరి 1, 2022 బదులుగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి జనవరి 1, 2002 తేదీని చూపించినట్లు యూకేకు చెందిన ఓ నెటిజన్ ట్విటర్లో తెలిపారు. ఈ సమస్య గురించి ఆయా వాహనదారుడు హోండా సంస్థకు నివేదించాడు. ఆయా హోండా, అకురా కార్ మోడల్స్‌లో సమస్యను వెలుగుచూసిన యాజమానుల ప్రకారం... సమయం, తేదీని సర్దుబాటు చేయడానికి మాన్యువల్ ఓవర్‌రైడ్ పని చేయడం లేదని నివేదించారు. స్పందించిన కంపెనీ..! నయా Y2K22 సమస్యపై కంపెనీ స్పందిస్తూ త్వరలోనే పరిష్కారం చూపుతామని హోండా వెల్లడించింది. కార్లలోని నావీ క్లాక్ సమస్య గురించి కంపెనీ ఇంజనీర్ బృందాలకు తెలియజేసినట్లు హోండా తెలిపింది. ఈ సమస్య జనవరి 2022 నుంచి ఆగస్టు 2022 వరకు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అది స్వయంచాలకంగా సరిదిద్దబడుతుందని వెల్లడించింది. కాగా ఈ సమస్య గురించి కంపెనీకి ముందుగానే తెలిసి ఉంటుందని సమాచారం. ప్రభావమెంత..! 2000 సంవత్సరంలో Y2K బగ్ టెక్ ప్రపంచాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టి వేసింది. ఎంతో మంది Y2K సమస్యతో తమ ఉద్యోగులను కూడా పొగోట్టుకున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా ఏకంగా 100 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది. ఈ చిన్న బగ్ అప్పట్లో పీడకల లాగే మిగిలిపోయింది. కాగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన Y2K22 సమస్య ప్రభావం తక్కువేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తూ Y2K22 సమస్య కేవలం తప్పుడు సమయం, తేదీల్లో మాత్రమే సమస్యగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఆయా కార్లలో ఇతర ఫంక్షన్లతో పాటుగా, నావిగేషనల్ సిస్టమ్స్ బాగా పనిచేస్తున్నాయని ఆయా వాహనదారులు తెలిపారు. దీంతో Y2K22 ప్రభావం చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ఏడాది ముందే Y2K22 సమస్యను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్ సేవలకు అంతరాయం కల్గించిన Y2K22 బగ్‌ను మైక్రోసాఫ్ట్ వెంటనే పరిష్కరించింది. My @Honda 2007 CR-V clock now useless in 2022; resets to 2:00 MST on 1/1/2002 after every startup. 32-bit signed integer overflow of yymmddHHMM? Would unsigned int fix it? This is time-critical. ;-) Thousands of us need a software update! pic.twitter.com/BSGCaxnMmx — Sumner Hushing (@_______shushing) January 4, 2022 చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...! -
శెభాష్ దాస్.. క్యాష్రివార్డ్ ప్రకటించిన గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ యువకుడికి నజరానా ప్రకటించింది. హ్యాకర్ల పాలిట కల్పతరువుగా మారిన ఓ బగ్‌ను కనిపెట్టిన కృషికి ఫలితంగా ఆ యువకుడికి క్యాష్ ప్రైజ్‌ను అందించింది. అస్సాంకు చెందిన రోనీ దాస్ అనే యువకుడు.. గూగుల్ ఆండ్రాయిడ్ ఫోర్‌గ్రౌండ్ సర్వీసులో ఒక బగ్‌ను గుర్తించాడు. ఈ బగ్ సాయంతోనే హ్యాకర్లు యూజర్ల ఫోన్‌ను హ్యాక్ చేయడంతో పాటు వ్యక్తిగత డాటాను తస్కరించే అవకాశం ఉంది. ఈ బగ్‌ను రిపోర్టింగ్ చేసినందుకు గానూ 5 వేల డాలర్లను(మన కరెన్సీలో మూడున్నర లక్షల రూపాయలు) ప్రకటించింది గూగుల్. దాస్ ఈ బగ్‌ను ఈ ఏడాది మే నెలలోనే గుర్తించాడు. ఈ కష్టానికి గుర్తింపుగా 5వేల డాలర్లు అందిస్తున్నాం అని గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ టీం ఒక మెయిల్ ద్వారా దాస్‌కు తెలియజేసింది. దాస్ చెప్తున్న వివరాల ప్రకారం.. ఈ బగ్ ద్వారా ఫోన్ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్..ఇలాంటి వివరాలు కూడా హ్యాకర్ల చేతికి వెళ్తాయట. అయితే గోప్యత కారణంగా బగ్‌కి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించేందుకు దాస్ ఇష్టపడలేదు. సైబర్ అన్వేషణలో ఆసక్తి ఉన్న దాస్.. గతంలో గువాహటి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోనూ బగ్‌ను గుర్తించాడు. ఇక రోనీ దాస్ గుర్తించిన బగ్‌ను ఫిక్స్ చేసిందా? లేదా? అనే విషయంపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. బగ్‌లను గుర్తించిన రీసెర్చర్లు, ఇంజినీర్లు, సైబర్ ఎక్స్‌పర్ట్స్‌లకు టెక్ దిగ్గజాలు నజరానా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆసక్తి ఉంటే మీరూ ఆ దిశగా ప్రయత్నం చేసి అదృష్టం పరీక్షించుకోండి. చదవండి: భారత్‌లో గూగుల్, ఫేస్బుక్ ఆదాయం.. వామ్మో! -
ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య...! డిలీట్ చేస్తే అంతే..!
గత వారం ఐఫోన్లకు ఐవోఏస్ 15ను ఆపిల్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఐవోఎస్15 సాఫ్ట్‌వేర్‌లో బగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఐఫోన్లను అప్డేట్ చేసిన వారికి ఈ సమస్య తలెత్తుంది. యూజర్లు కొత్త ఐవోఎస్ వెర్షన్‌కి అప్డేట్ చేసిన తర్వాత, మెసేజెస్ యాప్‌లో ఫోటోస్ థ్రెడ్‌ని డౌన్లోడ్ చేశాక థ్రెడ్‌ను డిలీట్ చేయగానే ఫోన్ మెమరీలో కన్పించడం లేదంటూ తెలుస్తోంది. మరికొంత మంది యూజర్లకు డిఫాల్ట్ కెమెరా యాప్ కొన్నిసార్లు నాన్-ఫంక్షనల్ వ్యూఫైండర్ను ఆటోమేటిక్‌గా ఆన్ అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఐఫోన్ వేకప్‌లో కూడా సమస్యలు ఉన్నట్లు యూజర్లు గుర్తించారు. అంతేకాకుండా డిఫాల్ట్ మెయిల్ యాప్ కూడా నిలిచిపోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Rolls-Royce: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! దృష్టిలోపం ఉన్నవారికి ఐఫోన్లలోని సిరి అందించే కామండ్స్‌ను కూడా ఈ బగ్ తొలగిస్తున్నట్లు తెలుపోతుంది. అంతేకాకుండా మునపటి వెర్షన్లలో కూడా కామండ్స్ పనిచేయడం లేదు. దీంతో యూజర్లు ఆపిల్ సపోర్ట్ కమ్యూనిటీ ఫోరమ్స్‌కు రిపోర్ట్ చేస్తున్నారు. కాగా ఆపిల్ ఈ సమస్య స్పందించలేదు. మెసేజ్ యాప్ థ్రెడ్ నుంచి ఫోటోస్ థ్రెడ్‌ను డిలీట్ చేయకుండా ఉంటే ఫోన్ మేమోరీలోను ఉంటాయి. ఆపిల్ ఈ బగ్ సమస్యను పరిష్కరించే వరకు ఈ పద్దతినే ఫాలో అవ్వడం ఉత్తమమని టెక్నికల్ నిపుణులు అభిప్రాయపడ్డారు. చదవండి: భారత్‌లో ఊపందుకొనున్న స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు -
ఐఫోన్లలో కొత్త సమస్యలా?.. ఇలా చేయండి
iphone iOS 15 Update Bugs: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య వచ్చిపడింది. ఐవోఎస్ 15 అప్డేట్తో గుడ్‌న్యూస్ అందించిన యాపిల్.. ఆ తర్వాత ఎదురవుతున్న ‘స్టోరేజ్ ఫుల్’ బగ్ విషయంలో మాత్రం త్వరగతిన పరిష్కారం చూపించడం లేదు. యాపిల్ తన ఐఫోన్ యాజర్ల (ఐఫోన్ 6ఎస్ మోడల్ మొదలు తర్వాతి వెర్షన్లు) కోసం ఈ మధ్యే ఐవోఎస్ 15 అప్డేట్ తీసుకొచ్చింది. 2021 సెప్టెంబరు 20 నుంచి ఈ అప్డేట్ని యూజర్లకు అందిస్తోంది. అయితే ఈ అప్డేట్ చేసుకున్న వెంటనే యూజర్లకు ‘ఫోన్ మొమరీ ఫుల్’ అనే పాప్-అప్ చూపిస్తోందట. దీంతో వేల మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఈ సమస్యపై కంగారుపడాల్సిన అవసరం లేదని యాపిల్ చెబుతోంది. iPhone storage almost full బగ్ పరిష్కారం కోసం సింపుల్‌గా ఫోన్‌ను రీస్టార్ట్ చేయమని సూచిస్తోంది. కానీ, అలా చేసినా కూడా చాలామందికి సమస్య తీరడం లేదంట. పైగా కొందరికి ఫోన్లో ఉన్న స్పేస్ కంటే.. ఎక్కువ స్టోరేజ్ చూపిస్తోందని చెప్తున్నారు. ఇక ఐఫోన్లతో పాటు ఐప్యాడ్‌లలోనూ ఇదే తరహా సమస్య ఎదురవుతోందట. సమస్య గురించి ప్రస్తావిస్తున్న వాళ్లందరికీ ఓపికగా రిప్లైలు ఇస్తున్న యాపిల్.. సమస్య ఏంటన్నది మాత్రం చెప్పడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ.. ఐవోఎస్ 15 వెర్షన్ అప్డేట్ చేసుకున్న ఐఫోన్లలో ఇన్స్టాగ్రామ్ యాప్ సరిగా పని చేయడం లేదని తెలుస్తోంది. వీడియోలు, స్టోరీల విషయంలో సౌండ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు కొందరు. అయితే ఇన్స్టాగ్రామ్ 206.1 వెర్షన్ మాత్రం ఈ బగ్‌ను ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేసుకోవడం విశేషం. యాపిల్ సపోర్ట్ కమ్యూనిటీ ఫోరమ్‌లోనూ స్టోరేజ్ బగ్ ఇష్యూ తలెత్తడం కొసమెరుపు. ఇక యాపిల్ యూజర్ల కోసం 14.8 నుంచి ఐవోఎస్ 15 అప్డేట్కి చేరింది. తద్వారా ఫోన్ పనితీరులో మరింత మెరుగు అవుతుందని యాపిల్ పేర్కొంది. ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్, ఎక్స్ప్లోర్ విభాగంలో అప్డేట్ బాగా పని చేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం బగ్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు యాపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఎంత టైం పడుతుందనేది చెప్పలేదు. చదవండి: యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు.. -
ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బగ్ గుర్తించిన విద్యార్థి..!
చెన్నై: రైల్వే ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫాం ఐఆర్సీటీసీలో పన్నెండో తరగతి విద్యార్థి గుర్తించిన బగ్‌ను సరిచేసినట్లు సెప్టెంబర్ 21న సీనియర్ అధికారి ప్రకటించారు. వివరాలోకి వెళ్తే.. చెన్నైలోని తాంబరం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల రంగనాథ్ రైల్వే టికెట్ బుక్ చేద్ధామని భారత రైల్వే ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫాం ఐఆర్సీటీసీకి వెళ్లాడు. గత నెలలో ఆగస్టు 30న టికెట్టు బుక్ చేసే సందర్భంలో వెబ్సైట్లో నెలకొన్న బగ్‌ను గుర్తించాడు రంగనాథ్. వెంటనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు, ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌కు తెలియజేశాడు. చదవండి: గౌనులో పేలిన స్మార్ట్‌ఫోన్..! చర్యలకు సిద్దమైన కంపెనీ..! బగ్ సహయంతో ప్రయాణికుల డేటా హ్యకర్ల చేతిలోకి వెళ్తే ప్రమాదం ఉండటంతో ఐఆర్‌సీటీసీను రంగనాథ్ అప్రమత్తం చేశాడు. ఈ బగ్‌తో హ్యాకర్లు ప్రయాణికులకు సంబంధించిన పేరు, వయసు, ప్రయాణ వివరాలు, పీఏన్‌ఆర్ నంబర్, గమ్యస్థానం మొదలైనవి తెలుసుకునే అవకాశం ఉందని రంగనాథన్ ఐఆర్సీటీసీకి నివేదించాడు. అంతేకాకుండా హ్యకర్లు ప్రయాణికులకు తెలియకుండానే వారి టిక్కెట్టును కూడా రద్దు చేయవచ్చునని గుర్తించాడు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బగ్ ఉందని ఐటీ వింగ్ గుర్తించింది. వెబ్సైట్లో నెలకొన్న సమస్యను పరిష్కారం చేసినట్లు సెప్టెంబర్ 11 తారీఖున ఐటీవింగ్ నుంచి రంగనాథ్‌కు ఈ-మెయిల్‌ను పంపింది. గతంలో లింక్డ్ఇన్, యునైటెడ్ నేషన్స్, బైజూస్, నైక్, లెనోవో, అప్‌స్టాక్స్ వెబ్ అప్లికేషన్లలో భద్రతా లోపాలను గుర్తించాడు. చదవండి: Neeraj Chopra: అప్పుడేమో రాహుల్ ద్రావిడ్..ఇప్పుడు నీరజ్ చోప్రా..! సరికొత్త రూపంలో.. -
భారత్‌లో యాపిల్ యూజర్లకు అలర్ట్
భారత్‌లో యాపిల్ డివైజ్‌ల యూజర్లకు అలర్ట్ జారీ అయ్యింది. వెంటనే ఐఫోన్లను, ఐప్యాడ్లను వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని సూచనలు అందాయి. ఈ మేరకు ఐటీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ విభాగం సీఈఆర్టీ-ఇన్(Indian Computer Emergency Response Team) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఐవోఎస్ 14.7.1, ఐప్యాడ్ 14.7.1 వారం కిందట రిలీజ్ అయ్యాయి. వీటికి సంక్లిష్టమైన మెమరీ కరప్షన్ బగ్‌ను ఫిక్స్ చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి, వెంటనే ఆ వెర్షన్లకు అప్డేట్ చేసుకోవాలని యాపిల్ యూజర్లకు సూచించింది. మెమరీ కరప్షన్ ఇష్యూస్ ఉన్నందున అప్డేట్ చేసుకోమని తెలిపింది. ‘హ్యాకర్లు పాత అప్డేట్ ఉన్న ఐఫోన్లలో కోడింగ్‌ను హ్యాక్ చేసి.. రిమోట్ యాక్సెస్ చేసే ప్రమాదం ఉంద’ని పేర్కొంది. వీటితో పాటు మాక్ యూజర్లు(డెస్క్‌టాప్ వెర్షన్) యూజర్లు కూడా సాప్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మంచిదని సూచించింది. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.. జనరల్‌ను క్లిక్ చేయాలి.. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ వేటికంటే.. ఐఫోన్ 6ఎస్, ఆ తర్వాత వచ్చిన మోడల్స్, ఐప్యాడ్ ప్రో మోడల్స్ అన్నీ, ఐప్యాడ్ ఎయిర్ 2 ఆ తర్వాత వచ్చిన మోడల్స్, ఐప్యాడ్ ఫిఫ్త్ జనరేషన్-ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లు, ఐప్యాడ్ మినీ 4-తర్వాతి మోడల్స్, ఐప్యాడ్ టచ్(సెవెన్త్‌జనరేషన్), మోస్ట్ అడ్వాన్స్డ్ మాక్‌ఓస్ బిగ్ సర్ డివైజ్‌లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. -
గూగుల్ బంపర్ ఆఫర్, వేలుకాదు కోట్లు చెల్లిస్తాం
గూగుల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. వేర్ బిలిటీ రివార్డ్ ప్రోగ్రాం (వీఆర్పీ)ప్రోగ్రాంలో భాగంగా లక్షలు కాదు కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది. గూగుల్‌లో లోపాల్ని(బగ్) గుర్తించిన వారికి వీఆర్పీ -2022 లో భాగంగా రూ.29 మిలియన్ల డాలర్లకు పైగా చెల్లించినట్లు..11 సంవత్సరాల వ్యవధిలో గూగుల్‌కు చెందిన టూల్స్‌లో 11,055 మిస్టేక్స్ గుర్తించినట్లు.. అందుకుగాను రూ.218 కోట్ల బహుమతి అందించినట్లు తెలిపింది. అదే సమయంలో ఈ వీఆర్పీ ప్రోగ్రాంలో మార్పులు చేస్తున్నట్లు చెప్పింది. వీఆర్పీ ప్రోగ్రాంకు బదులు 'బగ్ హంటర్' పేరుమీద కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేసింది. తద్వారా గూగుల్‌కు చెందిన గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఆండ్రాయిడ్, గూగుల్ క్రోమ్, గూగుల్ ప్లేస్టోర్లలో ఎర్రర్స్ గుర్తించవచ్చని, ఆ ప్రాసెస్ అంతా ఈ వెబ్సైట్ ద్వారా జరుగుతున్నట్లు చెప్పింది. అంతేకాదు గామిఫికేషన్ సాఫ్ట్వేర్ వ్యవస్థను గూగుల్ డెవలప్ చేయాలని భావిస్తోంది.అదే సమయంలో గామిఫికేషన్‌లో ఎర్రర్స్‌ను గుర్తించిన వారికి 'అవార్డులు, బ్యాడ్జ్‌లను' కేటాయిస్తుంది. అంతేకాదు జాబ్ చేయాలనుకుంటే వీఆర్పీ బృందంతో కలిసి పనిచేయోచ్చని కంపెనీ తెలిపింది. 84దేశాల్లో గూగుల్ తొలిసారి వీఆర్పీ ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఆయా అప్లికేషన్స్‌లో ఎన్ని ఎర్రర్స్ గుర్తిస్తారనే విషయంపై అవగాహనలేదు. కానీ తొలిసారి వీఆర్పీ సభ్యులు సహకారంతో 0-20 ఎర్రర్స్ ను గుర్తిస్తారనే అంచనా ఉంది. కానీ అనూహ్యంగా 25 బగ్‌లను గుర్తించి అంచనాల్ని తల్లకిందులు చేసినట్లు గూగుల్ తన బ్లాగ్ లో ప్రస్తావించింది. కాగా, బగ్స్ ను గుర్తించేందుకు 84 దేశాల్లో పెయిడ్ రీసెర్చర్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు కొత్తగా మార్పులు చేసిన ఈ వీఆర్పీ ప్రోగ్రాం ద్వారా ఔత్సాహికులు తమ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవచ్చని సూచించింది. -
ఐఫోన్లో కొత్త బగ్..! ఇలా పరిష్కరించండి...
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అప్పుడప్పుడు ఐఫోన్లు బగ్‌లకు గురైతే వెంటనే వాటికి ఆపిల్ పరిష్కారం చూపుతుంది. తాజాగా ఆపిల్ ఐఫోన్లో మరొక బగ్‌ను గుర్తించారు. ఈ బగ్ ఆపిల్ ఫోన్లలో వైఫై సపోర్ట్‌ను పూర్తిగా నిలివివేస్తోంది. ‘%secretclub%power’ అనే పేరుతో ఉన్న వైఫై నెట్వర్క్ కు ఐఫోన్‌ను కనెక్ట్ చేసినప్పుడు వైఫై ఆటోమెటిగ్గా డిసేబుల్ అవుతుందని కార్ల్ షౌ అనే బ్లాగర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. అతను % సింబల్ ఉన్న వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావడంతో అతని ఐఫోన్లో వైఫై పూర్తిగా డిసేబుల్ అయ్యిందని తెలిపాడు. నెట్వర్క్ సెట్టింగ్‌లను రిసెట్, ఫోన్‌ను రీస్టాట్ చేసిన తిరిగి వైఫై సౌకర్యాన్ని పొందలేకపోయాడు. ఇలా చేస్తే..బెటర్.. ఆపిల్ ఐఫోన్లలో ఎదురవుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి కొంతమంది టెక్ నిపుణులు రెండు మార్గాలను సూచించారు. వైఫై సెట్టింగ్స్‌ను రీసెట్ చేసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చునని పేర్కొన్నారు. ఐక్లౌడ్ నుంచి వైఫై నెట్వర్క్ పేరును తొలగించడం ద్వారా తిరిగి వైఫై సౌకర్యాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ బగ్‌పై ఆపిల్ అధికారికంగా స్పందించ లేదు. -
బగ్‌ను కనిపెట్టి రూ. 22 లక్షలు గెలుచుకున్న 20 ఏళ్ల యువతి
ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ అదితి సింగ్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అజ్యూర్‌లో బగ్‌ను గుర్తించినందుకు 30,000 డాలర్ల(సుమారు రూ.22 లక్షలు) రివార్డును గెలుచుకుంది. కేవలం రెండు నెలల క్రితం ఫేస్ బుక్ లో ఇలాంటి బగ్ ను కనుగొన్న అదితి 7500 డాలర్ల(సుమారు రూ.5.5 లక్షలకు పైగా) రివార్డు గెలుచుకుంది. రెండు కంపెనీలకు చెందిన రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్(ఆర్సీఈ)లో బగ్ ఉన్నట్లు కనుగొంది. ఇటువంటి బగ్స్ ద్వారా హ్యాకర్లు సులువుగా ఇంటర్నల్ సిస్టంలోకి ప్రవేశించి అందులోని సమాచారాన్ని పొందగలరని గుర్తించింది. ఇలాంటి బగ్స్ గుర్తించడం అంత సులభం కాదని, ఎథికల్ హ్యాకర్లు కొత్త బగ్స్ గురించి వారి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించడంపై దృష్టి సారించడం కంటే, మొదట ఎథికల్ హ్యాకింగ్ గురించి జ్ఞానం సంపాదించుకోవాలని సూచిస్తుంది. సైబర్ నేరగాళ్ల భారీ నుంచి తప్పించుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్రోగ్రాంలను అప్డేట్ చేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిలో కొన్ని లోపాలు ఉంటుంటాయి. అలాంటి వాటిని ముందుగా కనిపెట్టి తమ దృష్టి తీసుకొచ్చిన వారికి కంపెనీలు నగదు బహుమతి అందజేస్తుంటాయి. ఈ బగ్ గురుంచి రెండు నెలల క్రితమే మైక్రోసాఫ్ట్ కు నివేదించినట్లు అదితి సింగ్ తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్ దీనిపై వెంటనే స్పందిచలేదని బగ్ ఉన్న ప్రోగ్రాంను యూజర్స్ డౌన్లోడ్ చేసుకోలేదని నిర్థారించుకున్న తర్వాత లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది. బగ్ బౌంటీ కోసం ఎక్కువగా సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు లేదా భద్రతా పరిశోధకులు పోటీ పడుతుంటారు. వారు సదరు వెబ్ ను క్రాల్ చేస్తారు. హ్యాకర్లు చొరబడి కంపెనీలకు హానిచేయగల బగ్స్ ఉన్నాయా? లేదా అని మొత్తం కోడ్ ను స్కాన్ చేస్తారు. ఒకవేళ వారు ఏమైనా లోపాన్ని కనిపెడితే వారికి నగదు బహుమతిగా ఇవ్వబడుతుంది. ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ లో గుర్తించబడిన ఆర్సీఈ బగ్ గురించి అదితి మాట్లాడుతూ.. డెవలపర్లు మొదట ఎన్పీఏ (నోడ్ ప్యాకేజ్ మేనేజర్)ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే కోడ్ రాయాలని సూచించింది. ఫేస్బుక్, టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్, మొజిల్లా, పేటీఎం, ఎథీరియమ్, హెచ్‌పీ వంటి దిగ్గజ కంపెనీల్లో సుమారు 40 వరకు బగ్‌లను కనుగొన్నట్లు తెలిపింది. మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రాకపోవడంతో ఎథికల్ హ్యాకింగ్‌పై దృష్టి సారించినట్లు అదితి చెప్పుకొచ్చింది. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసా లేఖలను అందుకుంది. చదవండి: రూ.80కే.. 800 కిలోమీటర్ల ప్రయాణం -
ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్ గుర్తించి జాక్‌పాట్ కొట్టేసిన ముంబై యువకుడు
సాక్షి, ముంబై: ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ల్లో అకౌంట్ లేని వారు చాలా అరుదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలతో మమేకమవ్వడానికి ఈ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రమ్ వంటి సోషల్ మీడియా యాప్స్ నెటిజన్ల ప్రైవేసి విషయంలో అసలు రాజీ పడవు. అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియా యాప్స్‌లో లోపాలు వెలుగులోకి వస్తూంటాయి. కొన్ని సందర్బాల్లో సోషల్ మీడియా యాప్స్‌లో ఉన్న లోపాలను కొంతమంది ఎథికల్ హకర్స్ వెలుగులోకి తెస్తుంటారు. వాటిని వెంటనే గుర్తించి, ఆయా కంపెనీలకు తెలియజేస్తారు. కాగా తాజాగా ముంబై షోలాపుర్కు చెందిన మయూర్ ఫార్టేడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బగ్‌ను గుర్తించాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ చేశాడు. ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బగ్‌ను నిరూపించమని తిరిగి అతని కోరగా అందుకు తగిన ఆధారాలను చూపిస్తూ ఫేస్‌బుక్‌కు తెలియజేశాడు. దీంతో ఫేస్బుక్ కంపెనీ ఇన్‌స్టాగ్రమ్‌లో లోపం ఉందని నిర్ధారించింది. బగ్‌ను గుర్తించినందుకుగాను ఫేస్బుక్ మయూర్ ఫార్టేడ్ కు భారీ నజరానాను అందించింది. సుమారు రూ. 22 లక్షలను మయూర్‌కు అందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బగ్ ఏంటీ..? ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు తమ అకౌంట్ విషయంలో గోప్యతను పాటించేందుకు ప్రైవేటు అకౌంట్‌గా మార్చుకుంటారు. ఈ బగ్ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు అకౌంట్లో ఉన్న యూజర్ల అర్కవైడ్ పోస్ట్‌లు, స్టోరీస్, రిల్స్ వీడియోలను చూడవచ్చునని మయూర్ తెలిపాడు. దీంతో యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుత్తుంది. చదవండి: శరీరాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్ ఛార్జింగ్..! -
గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ నెంబర్లు!
న్యూఢిల్లీ : వాట్సాప్ పలు ఆకర్షణీయ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్నా ఇప్పుడు అవే ఫీచర్లలో ఉన్న బగ్ యూజర్ల గోప్యతను ప్రమాదంలో పడవేస్తోంది. ఈ బగ్ గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వాట్సాప్ యూజర్ ఫోన్ నంబర్ కనిపించేలా చేస్తోంది. వాట్సాప్ క్లిక్ టు చాట్ ఫీచర్‌లోని బగ్ సోషల్ మెసేజింగ్ సైట్ యొక్క వినియోగదారుల ఫోన్ నంబర్లను గూగుల్ సెర్చ్ ఇండెక్స్‌కు అనుమతించడంతో గోప్యతకు పెనుముప్పు ఎదురవుతోందని బగ్-బౌంటీ హంటర్ అతుల్ జయరామ్ వెల్లడించారు. ఇది వెబ్‌లో వినియోగదారుల ఫోన్ నంబర్ల కోసం వెతికేందుకు ఎవరినైనా అనుమతించడంతో వాట్సాప్ యూజర్ల భద్రత ప్రమాదంలో పడుతుంది. దీంతో క్లిక్ టూ చాట్‌తో యూజర్ మరో వాట్సాప్ యూజర్‌తో వారి ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోకుండానే వాట్సాప్ చాట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇక వెబ్సైట్లు తమ విజిటర్లతో నేరుగా ఫోన్ నెంబర్లను సంప్రదించకుండానే వారితో సంప్రదింపులు జరిపే వెసులుబాటు లభిస్తుంది. ఈ వెసులుబాటుతో స్కామర్ల చేతికి వాట్సాప్ యూజర్ల ఫోన్ నెంబర్ల జాబితాలు చిక్కుతాయని బగ్-బౌంటీ హంటర్ జయరామ్ పేర్కొన్నారు. చదవండి : వాట్సాప్‌లో పెళ్లి ఫోటోలు.. మనస్తాపంతో.. వ్యక్తిగత ఫోన్ నెంబర్లు లీకైతే ఎటాకర్లు వాటికి మెసేజ్ చేయడం, క్సాల్ చేయడంతో పాటు ఆయా ఫోన్ నెంబర్లను వారు మార్కెటర్లకు, స్పామర్లు, స్కామర్లకు విక్రయించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫోన్‌నెంబర్లతో ఎటాకర్లు యూజర్ల ప్రొఫైల్స్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. వాట్సాప్ ప్రొఫైల్‌లో యూజర్ ఫోటోను చూసే ఎటాకర్లు వారి ఇతర సోషల్ మీడియా ఖాతాలను సెర్చి చేయడం ద్వారా ఆయా వ్యక్తులను టార్గెట్ చేస్తారని అన్నారు. కాగా మే 23న పరిశోధకుడు బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా ఫేస్‌బుక్‌ను సంప్రదించగా కంపెనీ డేటా అబ్యూజ్ ప్రోగ్రాం కింద వాట్సాప్ కవర్ కాదని కంపెనీ బదులిచ్చింది. ఇక వాట్సాప్ యూజర్లు అవాంఛిత మెసేజ్‌లను ఒ బటన్ ద్వారా బ్లాక్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. -
ఊహించని పరిణామం అంటే ఇదే..
ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అనడానికి ఉదాహరణగా ఈ సన్నివేశాన్ని చెప్పుకోవచ్చు. ఒక బగ్‌ను సాలీడు అమాంతం లాగేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక బగ్ ఆహారం వెతుక్కుంటూ తన దారిన తాను పోతుంది. దాని పక్కన ఒక పెద్ద మట్టికుప్పలాగా ఉంది. ఆ మట్టికుప్ప కింద సాలీడు తన స్థావరాన్ని ఏర్పరుచుకొంది. అయితే బగ్ దానిని చూసి పట్టించుకోకుండానే ముందుకు వెళ్లిపోయింది. అయితే బగ్ తన చావు ఆ మట్టికుప్పలోనే పొంచి ఉందని అస్సలు ఊహించి ఉండదు. బగ్ అలా కొంచెం ముందుకు వెళ్లగానే.. కుప్పలో నుంచి సాలీడు బయటికి వచ్చి తన ఎనిమిది కాళ్లతో అమాంతం దానిని కిందకు లాక్కొంది. ఈ ఘటన జరిగి చాలా రోజులైంది. తాజాగా ఈ వీడియోనూ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుషాంత నందా తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ' జీవితంలో ఎవరైనా ఇలాంటి ఆశ్చర్చకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. చావు నుంచి ఎవరు అతీతులు కారు' అంటూ కాప్షన్ జత చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోనూ 4500 మందికి పైగా వీక్షించారు. 'పాపం.. బగ్'.. 'వీడియో చూడగానే భయమేసింది'.. 'ఓ మై గాడ్'.. 'తెలివైన స్పెడర్' అంటూ కామెంట్లు పెట్టారు. -
వాట్సాప్‌లో గ్రూపులను టార్గెట్ చేసే బగ్
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లోని వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేసే బగ్‌ను తాము గుర్తించినట్లు వాట్సాప్ వెల్లడించింది. దీని బారిన పడకుండా ఉండేందుకు తాజా వెర్షన్ 2.19.58కు అప్డేట్ చేసుకోవాలని మంగళవారం సూచించింది. బగ్ కారణంగా గ్రూపుల్లోని మెసేజులు శాశ్వతంగా డిలీట్ అవుతున్నాయని తెలిపారు. హ్యాకర్లు వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించి వెబ్ డీబగ్గింగ్ టూల్ ద్వారా గ్రూపుల్లో ప్రత్యేక పారామీటర్లు ఉన్న సందేశాలు పంపుతున్నారని తెలిపారు. దీనివల్ల గ్రూప్ క్రాష్ అయ్యి పనిచేయడం ఆగిపోతోందని వాట్సాప్ ప్రొడక్ట్ వల్నెరబిలిటీ రీసెర్చ్ చెక్ పాయింట్స్ హెడ్ ఓడెడ్ వనును తెలిపారు. అయితే ఈ హ్యాకింగ్ ప్రక్రియను సాగించే హ్యాకర్లు ఆయా గ్రూపుల్లో సభ్యులై ఉంటారని చెప్పారు. ఈ బగ్‌కు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో వినియోగదారులు వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తోందన్నారు. -
ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టిన భారతీయుడు
శాన్ఫ్రాన్సిస్కో: ఫోన్ ఆధారిత క్యాబ్ సర్వీస్ ఉబర్ సాఫ్ట్‌వేర్‌లో ఓ బగ్ బయటపడింది. ఇది ఎవరి ఖాతాలోకైనా అనధికారికంగా ప్రవేశించేందుకు హ్యాకర్లకు మార్గం కల్పించేలా ఉంది. దీన్ని కనుగొని తెలియజేసినందుకుగాను భారత సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఆనంద్ ప్రకాశ్‌కు ఉబెర్ రూ. 4.6 లక్షలను బహూకరించింది. ఏపీఐ రిక్వెస్ట్ ద్వారా ఉబర్ క్యాబ్స్, ఉబర్ ఫుడ్ ఖాతాల్లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ బగ్ గురించి ఆనంద్ ఉబర్‌కు తెలియజేయగానే బగ్ బౌంటీ ప్రోగ్రాంను ఉబర్ అప్డేట్ చేసింది. జీవితాంతం ఉబర్ క్యాబ్‌లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించే బగ్‌ను గతంలో గుర్తించి ఆకాశ్ తొలగించాడు. 2014లో సెక్యురిటీ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు 2016లో సైబర్ సెక్యురిటీ స్టార్టప్ ‘ఆప్ సెక్యుర్’ను స్థాపించాడు. ఫోర్బ్స్ 30 ఏళ్ల లోపు ఆసియా జాబితాలోనూ అతడు స్థానం దక్కించుకున్నాడు. ఎటువంటి ఖాతా లేకపోయినా ఫేస్బుక్లో లాగిన్ అయ్యే లొసుగును గుర్తించడంతో 2015లో ఫేస్బుక్ సంస్థ అతడికి 15 వేల డాలర్లు నజరానాగా ఇచ్చింది. తమిళనాడులోని వెలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించిన ఆకాశ్.. సైబర్ సెక్యురిటీలోని లోపాలను గుర్తించి ప్రశంసలతో బహుమానాలు అందుకున్నాడు.