
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా హ్యాకర్లకు సవాల్ విసిరింది. తన లేటెస్ట్ కారును ఎవరైనా హ్యాక్ చేస్తే భారీ పారితోషికం ఇస్తామని వెల్లడించింది. సెక్యూరిటీ వ్యవస్థలోని భద్రతా సమస్యలను కనిపెట్టే హ్యాకర్లు ప్రోత్సహించడానికి ఈ హ్యాకింగ్ పోటీ నిర్వహిస్తోంది. ఇందుకుగాను బహుమానంగా భారీ నజరానాలు అందజేయనుంది.
తెస్లా మోడల్3 కారు సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని కనుక్కున్నవారికి ఒక మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. అత్యంత సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన తమ కారులో సాఫ్ట్‌వేర్లో బగ్, సాంకేతిక వ్యవస్థలో లోపాన్ని గుర్తించిన వారికి దాదాపు 77 కోట్ల రూపాయల నజరానా ఇవ్వనుంది. అంతేకాదు లోపాన్ని గుర్తించిన వారికి టెస్లా 3 కారును కూడా ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉందని టెస్లా ప్రకటించింది.
మైక్రోసాఫ్ట్, వీఎంవార్‌తో కలిసి ఈ ఏడాది మార్చిలో కెనడా వాంకోవర్‌లో పాన్‌టు ఓన్ (Pwn2Own) హ్యాకింగ్ కాంటెస్ట్‌ను నిర్వహించనుంది. తన కంపెనీ కార్ల విషయంలో అత్యధిక భద్రతా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి టెస్లా కృషి చేస్తోందని, ఈ నేపథ్యంలో అత్యంత విలువైన భద్రతా పరిశోధనకు విలువైందిగా భావిస్తామని టెస్లా వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ లాయు ప్రకటించారు. బగ్ బౌంటీ కార్యక్రమాన్ని టెస్లా 2014లో ప్రారంభించినప్పటికీ ఈ తరహా మోడల్‌లో ఇదే తొలిసారని పేర్కొన్నారు.
కాగా డ్రైవర్ రహిత కార్లను హ్యాక్ చేసే ప్రమాదం పొంచి ఉందని గతంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment