gift
-
నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్
ఏదైనా సక్సెస్ సాధించిన తరువాత స్నేహితులకు, సన్నిహితులు పార్టీ ఇవ్వడం చాలా కామన్. ఒక్కోసారి చిన్న చిన్న గిఫ్ట్‌లు కూడా ఇస్తుంటారు. మరి అలాంటిది ఊహించని విజయం వచ్చి వరిస్తే ఆసంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. ఈ సంతోషాన్ని తన కరియర్లో సక్సెస్‌కు తొడుగా నిలిచిన తన భార్యకు ఖరీదై గిఫ్ట్ ఇవ్వడం విశేషంగా నిలిచింది. స్టోరీ ఏంటంటే..నటుడు, కంటెంట్ సృష్టికర్త అవినాష్ ద్వివేది 'దుపాహియా' వెబ్ సిరీస్ ద్వారా అద్భుత విజయం సాధించాడు. దీంతో అతని బార్య సంభావన సేథ్‌కు తన కలల కారును బహుమతిగా ఇచ్చాడు. సంభావన కూడా నటి, యూట్యూబర్. ఇది తమ ప్రేమ, పట్టుదలతోపాటు పాటు, తమ ఉమ్మడి కలలకు ప్రతిరూపమని చెప్పాడు. భార్యకు రూ. 1.81కోట్ల విలువైన విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చాడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. దీని ప్రకారొం ఈ కారు వారి 7 సిరీస్ BMW 750e లాగా కనిపిస్తోంది. దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.అవినాష్ ద్వివేది, సంభావన సేథ్ప్రారంభం నుండి కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా అన్నివిధాల సంభావన, అండగా నిలిచి, ప్రతి పోరాటంలో తనకు వెన్నెముకగా నిలిచింది అంటూ భార్యకు కృతజ్ఞతలు తెలిపాడు. కష్టాల్లో, నష్టాల్లో తొడుగా నిలిచింది. నిజంగా ఆమె తనకు లభించిన గొప్ప వరమని పేర్కొన్నాడు. మరిన్ని కలలతో, తమ ప్రయాణం, ఇలాగే కలకాలం సాగిపోవాలని కోరుకున్నాడు. ఇది కేవలం మన విజయం మాత్రమే కాదు. మన తల్లిదండ్రులు ఆశీర్వాద బలం కూడా అంటూ View this post on Instagram A post shared by Avinash Dwivedi (@imavinashdwivedi)మీ(సంభావన) తల్లిదండ్రులు ఇప్పుడు వారితో లేకపోయినా, పై నుంచి వారు ఆశీర్వదిస్తారంటూ వారికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా తాను ఈ స్థాయికి రావడానికి ముంబైలో తను పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి ముంబైకి వచ్చినప్పుడు, ఒకే ఒక్క లక్ష్యం. నటుడిగా మారాలి. సక్సెస్సాధించాలి. ఇదే పట్టుదల. ఇందుకోసం గత ఐదేళ్లుగా నా సర్వస్వం అర్పించాను అని చెప్పాడు. అలాగే దుపాహియాపై ప్రేక్షకుల అపారమైన ప్రేమ కురిపించారు అంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. మార్చి 2025 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ విడుదలైంది. ఇది విమర్శకులు, వీక్షకులు ప్రశంసలు దక్కించుకుంది. సంభావన సేథ్ , అవినాష్ ద్వివేది 2016, జూలై 14న వివాహం చేసుకున్నారు. -
ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. సాధారణంగా నూతన వధూవరులకు బంధువు, సన్నిహితులు అనేక రకాల బహుమతులు,కానుకలు ఇస్తూ ఉంటారు. తద్వారా వారిని సంతోష పెట్టడంతోపాటు, వార్య మధ్య బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయని పె ద్దలు చెబుతారు. అలాగే పెళ్లింటి వారికి డబ్బులను చదివింపుల రూపంలో కానుకగా ఇస్తే వారికి కొంత ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని కూడా విశ్విసిస్తారు. అయితే మారుతున్న కాలంతోపాటు, బహుమతులు సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి. గతంలో పెళ్లి రోజులు లేదా వెడ్డింగ్ డేలకు ప్రాధాన్యత నామమాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుత యానివర్సరీ పార్టీలు, గిప్ట్‌ల ట్రెండ్‌నడుస్తోంది. అరుదైన, అపురూపమైన కానుకలివ్వడం ఆనవాయితీ మారిపోయింది. వెడ్డింగ్ డే రోజున డైమండ్ రింగో, ఖరీదైన చీరో, కారో ఏదో ఒకటి తాహతుకు తగ్గట్టు తమ జీవిత భాగస్వామికి కానుకలివ్వడం చాలా కామన్. అలాగే తన భార్యకు అద్భుత కానుక ఇచ్చాడో భర్త. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..సన్నిహితుల సమక్షంలొ ఆ జంట పెళ్లి రోజు వేడుకలకు సిద్ధమైనారు. దీంతో అక్కడి వాతావరణమంతా సందడి మారి పోయింది. అంతా ఆ జంటను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మంద్రమైన సంగీత ధ్వనుల పూలబొకేలతో వారిని అభినందిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా లిప్తకాలం పాటు అంతా నిశ్శబ్దం ఆవరించింది. అనుకోని అతిధి అక్కడికి వచ్చాడు. దీంతో పట్టలేని సంతోషంతా ఉక్కిరిబిక్కిరైంది భార్య బెక్కీ. అతణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకుంది. తమ పెళ్లి రోజున ఇంత అద్భుతమైన కానుకను అందించిన భర్తకు కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పుకుంది బెక్కీ. ఇంతకీ ఎవరా అతిథి?Husband left his wife speechless after he brought a surprise guest to their wedding pic.twitter.com/4V91B6jVEO— internet hall of fame (@InternetH0F) April 3, 2025కొడుకు గుండెను తన ‘గుండె’గా దాచుకున్న వ్యక్తి. 19 ఏళ్ల కుమారుడు ట్రిస్టన్ కన్నుమూశాడు. దీంతో ట్రిస్టన్ అవయవాలను దానం చేశారు తల్లిదండ్రులు. అలా ట్రిస్టన్ గుండెను అమర్చుకున్న వ్యక్తిని ఆమె ముందు నిలిపి భార్యతోపాటు, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వారు కలిసి క్షణాలు అక్కడున్నవారందరి గుండెల్ని తడి చేశాయి. ఎక్స్(ట్విటర్)లో షేర్ అయిన ఈ వీడియో 50.4 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించు కోవడం విశేషం. -
అమ్మకు ఖరీదైన కారు గిఫ్ట్..
ప్రతి తల్లీ తన పిల్లల విజయాన్నే కాంక్షిస్తుంది. వారి విజయానికి మించిన గొప్ప బహుమతి మరేది ఉండదామెకు. కానీ రేవతి కామత్‌కు ఆమె కుమారులు జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్, నితిన్ కామత్‌లు అమితమైన ఆనందాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు.ఖరీదైన సరికొత్త లగ్జరీ మెర్సిడెస్ కారును గిఫ్ట్ ఇచ్చి తల్లికి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. సంప్రదాయ స్పర్శను జోడించి ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకం చేశారు. గర్వంతో ఉప్పొంగిన తల్లి రేవతి కామత్ తన ఆనందాన్ని ఫేస్బుక్లో పంచుకున్నారు. "నా కొడుకులు ఈరోజు నాకు కొత్త కారును బహుమతిగా ఇచ్చారు. తలపాగ, శాలువాతో ఇలా.. కారు తాళాలు అందుకున్నాను" అంటూ ఫొటోలను షేర్ చేశారు.పేటా (సంప్రదాయ తలపాగా), షాల్ (ఉత్సవ శాలువా)తో సత్కరిస్తుండగా ఆమె కారు తాళాలు అందుకున్న క్షణాలు ఈ ఫొటోల్లో ఉన్నాయి. ఫోటోలలో కన్పిస్తున్న లగ్జరీ వాహనం మెర్సిడెస్ జీఎల్ఎస్. దీని ధర రూ .1.5 కోట్లకు పైగా ఉంటుంది. జీఎల్ఎస్ కారులో విశాలమైన అల్ట్రా-లగ్జరీ క్యాబిన్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్, శక్తివంతమైన ఇంజన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.వ్యాపార చతురతకు, దాతృత్వానికి పేరుగాంచిన నిఖిల్ కామత్, అలాగే ఆయన సోదరుడు జెరోధా సీఈఓ నితిన్ కామత్‌లు తమకు విలువలు, నైతికతను తీర్చిదిద్దిన ఘనత తమ తల్లిదేనని తరచూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. ఇదిలా ఉండగా నితిన్ కామత్ ఇటీవల ప్రతిష్టాత్మక ఈవై ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (ఈఓవై) 2024 అవార్డును అందుకున్నారు. ఆయన వినూత్న, తక్కువ-మార్జిన్, అధిక-వాల్యూమ్ బ్రోకరేజీ మోడల్ భారతదేశ స్టాక్ ట్రేడింగ్ పరిశ్రమను మార్చివేసింది. స్వయంకృషితో జెరోధాను బాహ్య నిధులు లేకుండానే బిలియన్ డాలర్ల సంస్థగా ఆయన నిర్మించారు. -
చెల్లి ఋణం తీర్చుకున్న అన్న
-
ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనం
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది రూల్.అయితే పెళ్ళికి ముందు ఈ అలకలు ముద్దు..ముద్దుగా బాగానే ఉంటాయి. భార్యాభర్తలుగా మారిన తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే ‘‘అలుక సరదా మీకూ అదే వేడుక మాకూ..కడకు మురిపించి గెలిచేది మీరేలే’’ అంటూ కోప్పకుండానే తనమనసులోని మాట చెప్పేశాడు సినీకవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితార్ అయింది!అలిగిన తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైన ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చ ప్రేమ అని గుర్తొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయల విలువ చేసే ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు. తిరస్కరించింది. దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే.. ‘‘మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్ళి కాగానే చేస్తారు మోసాలు’’ అనిపించక మానదు.రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో పయత్నం చేశాడు. ఖరీదైన పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజీ అయినా కారది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. ‘సీతతో అదంత వీజీ కాదన్నట్టు’ ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా అందుకే దాంట్లోని లోపాన్ని చటుక్కున గుర్తించింది. హన్నన్నా.. ఇంతటి అవమానమా? అంటూ మండిపడింది. అందుకే మరి ఛీ... పొమ్మంది. ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అసలా కారును చెత్తలో ఎలా పడేశాడు? కంటైనర్‌లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్లు మధ్య చర్చకు దారి తీసింది. దాదాపు రెండు వారాలుగా, పోర్స్చే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందట. -
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు రూ. 501.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: హర్యానాలోని జీంద్ జిల్లాకు చెందిన బీజేపీ మహిళా నేత రేఖా గుప్తా ఈరోజు (ఫిబ్రవరి 20) ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా (Rekha Gupta) పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారని తెలియగానే హర్యానా బీజేపీ మాజీ అధ్యక్షులు ఓంప్రకాష్ ధన్కర్ (Om Prakash Dhankar) ఆమెకు 501 రూపాయలు ఇచ్చారు. దీనిని చూసినవారంతా ఆనందంతో ఆశ్చర్యపోయారు.హర్యానాలో ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఓం ప్రకాష్ 501 రూపాయలను.. రేఖా గుప్తా ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెకు ఇచ్చారు. ఓంప్రకాష్ ధన్కర్ ఢిల్లీ సీఎం (Delhi CM) ఎంపికలో పర్యవేక్షకునిగా వ్యవహరించారు. రేఖా గుప్తాకు రూ. 501 ఇచ్చిన తరువాత ఓంప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ రేఖా మా హర్యానా (Haryana) ఆడపడుచు అని అన్నారు. 1974లో జన్మించిన రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. ఆమె గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారి పోటీ చేసినప్పుడు ఆమె 11,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తరువాత రేఖాగుప్తా ఆప్ అభ్యర్థి వందన చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు రేఖా గుప్తా తన ప్రత్యర్థి వందనను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీకి దిగిన ఆప్ అభ్యర్థి వందనకు 38,605 ఓట్లు వచ్చాయి. రేఖా గుప్తాకు 68,200 ఓట్లు దక్కాయి.ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి? -
మోదీకి స్పెషల్ గిఫ్ట్
ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు. ‘అవర్ జర్నీ టుగెదర్’ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని గురువారం వైట్‌హౌస్‌లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారు. దాని కవర్ ఫొటోలో ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కన్పిస్తున్నారు. కానుకను మోదీకి అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మీరు గ్రేట్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. 320 పేజీల ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవీకాలంలో 2016–2020 మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫొటోలున్నాయి. 2020లో ట్రంప్ భారత పర్యటన ‘హలో ట్రంప్’తో పాటు అంతకుముందు అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ తదితర కార్యక్రమాల ఫొటోలను పొందుపరిచారు. భార్య మెలానియాతో కలిసి తాజ్‌మహల్ దగ్గర తీసుకున్న ట్రంప్ ఫొటో కూడా ఉంది. ఆయన పదవీకాలపు మధుర ఘట్టాలన్నింటినీ పొందుపరిచారు. సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్ చొరవ, స్పేస్ ఫోర్స్ ఏర్పాటు, జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ వంటి దేశాధినేతలతో ఉన్నత స్థాయి భేటీల వంటి ఘటనలకు సంబంధించి ఎంపిక చేసిన ఫొటోలను పుస్తకాన్ని తయారు చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తనకు గొప్ప గౌరవ మని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘చిరకాలంగా ఆయన నాకు మంచి మిత్రుడు. మా మధ్య అద్భుతమైన బంధముంది. నా నాలుగేళ్ల తొలి పదవీకాలంలో ఆ బంధాన్ని చక్కగా కొనసాగించాం’’ అన్నారు. మోదీ కూడా ట్రంప్ నాయ కత్వాన్ని ప్రశంసించారు. ‘‘నేనెంతో ఇష్టపడే నాయకుడు ట్రంప్. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్య మివ్వడం ఆయన నుంచి నేర్చుకున్న ప్రధాన విషయం’’ అని చెప్పారు. -
అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
బిలియనీర్,అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani), వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షా (Diva Jaimin Shah) ను ఈ నెల ఏడున పెళ్లాడాడు. అహ్మదాబాద్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా గౌతమ్ అదానీ తన కుమారుడి వివాహ సమయంలో, వివిధ సామాజిక సమస్యలకుపయోగించేలా రూ. 10వేల కోట్లు విరాళంగా ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇందులో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చనున్నారు. అంతకుముందు, జీత్ అదానీ ,దివా షా జంట ప్రతీ ఏడాది 500 మంది వికలాంగుల మహిళల వివాహానికి ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు.ఈ వివాహంలో మరో విశేషంగా కూడా ఉంది.అదేమిటంటే..!షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా ప్యానలిస్ట్ , అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) జీత్ అదానీకి ఒక ఆసక్తికరమైన వివాహ బహుమతి (Wedding Gift) ఇచ్చాడు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో చాలా కాలంగా ఉండిపోయిన జీత్ ప్రొఫైల్‌ను తొలగించాడు.ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్మిట్టల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన వివాహానికి కొన్ని రోజుల ముందు షార్క్ ట్యాంక్ 'బియాండ్ ది ట్యాంక్' విభాగంలో మిట్టల్‌తో సంభాషించాడు జీత్. ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు జీత్. చిన్న వయసులో తన పాఠశాల స్నేహితులు చిలిపిగా షాదీ డాట్ కామ్‌లో ఒక ఖాతా క్రియేటర్ చేశారనీ, అది ఇప్పటికీ అది అలాగే ఉందని, దయచేసి దాన్ని ఇప్పటికైనా తొలగించాలని అభ్యర్థించాడు. As promised, here’s a small wedding gift from me to you & Diva @jeet_adani1. We have had ur profile deleted from @ShaadiDotCom now that u have confirmed ur participation in @sharktankindia 🤗💜 pic.twitter.com/1rNMtWmAhf— Anupam Mittal (@AnupamMittal) February 8, 2025దీనికి అనుపమ్ సరేనని సమాధాన మిచ్చారు. ఈ సందర్బంగా అదానీ గ్రూపు ఉద్యోగుల్లొ ఐదు శాతం వికలాంగులుగా ఉండాలని ఆదేశించినట్టు కూడా వెల్లడించారు. వాగ్దానం చేసినట్లుగామీ దంపతులకు ఇది ఒక చిన్న వివాహ బహుమతి అంటూ మిస్టర్ మిట్టల్ ఎక్స్‌లో ఒకపోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన జత చేశారు.జీత్ అదానీతో షార్క్ ట్యాంక్ "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్వికలాంగుల కోసం పనిచేసే వ్యవస్థాపకులకు ఏమి చేయవచ్చనే దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉండాలని జీత్ అదానీ సూచన మేరకు షార్క్ ట్యాంక్ ఇండియా "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్ ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 15 వరకు అనుమతి ఉంటుంది. -
నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్
ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) కు చైర్మన్ ముఖేష్ అంబానీ. మరోవైపు ఆయన భార్య నీతా అంబానీ ((Nita Ambani) కూడా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) స్థాపకురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. అంతేకాదు ఐఓసీ సభ్యురాలిగా ఉన్నారు నీతా అంబానీ. బిలియనీర్ అంబానీ తన భార్యకు ఇచ్చిన విలువైన బహుమతి ఒకటి ఇపుడు నెట్టింట సందడిగా మారింది. అదేంటో చూద్దామా. వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా రాణిస్తున్న తన భార్య ప్రయాణ ఇబ్బంది లేకుండా ముఖేష్ అంబానీ ఆమెకు ఒక ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇచ్చాట. 2007లో నీతా అంబానీ పుట్టినరోజున అంబానీ ఈ అందమైన గిప్ట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రయాణాల కోసం కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్‌బస్ 319ను ప్రైవేట్ జెట్ బహుమతిగా ఇచ్చి నీతాను సర్ప్రైజ్ చేశారట. సహా అల్ట్రా-లగ్జరీ ఇంటీరియర్లతో అదిరిపోయే దీని విలువ రూ.230 కోట్లు. అత్యంత అందమైన ఈ ప్రైవేట్ జెట్ ఫైవ్ స్టార్ హోటల్ కంటే తక్కువేమీ కాదు.కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్‌బస్ 319 ప్రత్యేకతలుచూడ్డానికి విలాసవంతంగా, అందంగా ఉండే ప్రైవేట్ జెట్‌లోని సౌకర్యాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందీ ప్రైవేట్ జెజ్లో. ఒకేసారి 10-12 మందికి పైగా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఈ అసాధారణ బహుమతి అన్ని సౌకర్యాలతో కూడిన సజావుగా, విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా రూపొందించారు. సుదీర్ఘ ప్రయాణాల సమయంలో సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ జెట్ విమానంలో హై-డెఫినిషన్ స్క్రీన్లు, సరౌండ్ సౌండ్, పెద్ద మీడియా లైబ్రరీ ఉన్నాయి. ప్రీమియం ఫిట్టింగ్‌లు, మార్బుల్ యాక్సెంట్లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బాత్రూమ్లు ఉన్నాయి. ఈ జెట్ విమానంలో ఎర్గోనామిక్ సీటింగ్ పెద్ద కాన్ఫరెన్స్ టేబుల్, విశాలమైన లాంజ్ ఏరియాదీని సొంతం.ప్రైవేట్ జెట్‌లో ధీరేంద్ర శాస్త్రిఅనంత్ అంబానీ వివాహ సమయంలో ఈ ప్రైవేట్ జెట్ విశేషమైన దృష్టిని ఆకర్షించింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి ఒక ఇంటర్వ్యూలో అనంత్ తన ప్రయాణానికి ప్రైవేట్ జెట్‌ను అందించి, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వ్యక్తిగతంగా ఆహ్వానించారని వెల్లడించారు.అయితే బిజీగా షెడ్యూల్ కారణంగా తొలిత సంకోచించిన శాస్త్రి అంబానీ ఆహ్వానాన్ని అందుకుని పెళ్లి తంతులుపాల్గొన్నారు. అంతేకాదు అంబాన కుటుంబం ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్దులైపోయారు కూడా. కాగా అంబానీకి దీంతోపాటు బోయింగ్ 737 మాక్స్ 9 కూడా ఉంది. అధునాతన సాంకేతికత, LEAP-18 ఇంజిన్లతో కూడిన ఈ విమానం భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్లలో ఒకటి. -
సెల్ఫీ కొట్టు.. స్కూటర్ పట్టు: ఎలా అంటే?
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric).. సరికొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇతర స్కూటర్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ సొంతం చేసుకోవాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకెలా ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ పరిచయం చేసిన కొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్ కలర్ ఎలిమెంట్స్ పొందుతుంది. కాబట్టి వీల్స్, మిర్రర్స్ వంటివన్నీ కూడా బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ డిజైన్ థీమ్‌తో పెర్ల్ వైట్, గోల్డ్ రంగులను పొందుతుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్లో మరింత పర్సనలైజ్డ్ అనుభవం కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. ఇందులో మూవ్ ఓఎస్ సాఫ్ట్వేర్ కూడా లభిస్తుంది. ఈ మోడల్ గోల్డ్ థీమ్ యూజర్ ఇంటర్ఫేస్, కస్టమైజ్డ్ మూవ్ఓఎస్ డ్యాష్‌బోర్డ్‌ని పొందుతుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్సనలైజ్డ్ చేసుకునేందుకు మరింత సూక్ష్మమైన, ప్రీమియం చిమ్స్ ఇందులో ఉన్నాయి.ఈ స్కూటర్‌ను ఎలా సొంతం చేసుకోవచ్చంటే?ఓలా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన కస్టమర్లకు ఓలా సోనా కాంటెస్ట్ ద్వారా ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనాలకునేవారు ఓలా ఎస్1తో రీల్ పోస్ట్ చేయాలి లేదా బ్రాండ్ స్టోర్ వెలుపల ఒక ఫోటో లేదా సెల్ఫీ తీసుకుని #OlaSonaContest అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఓలా ఎలక్ట్రిక్‌ను ట్యాగ్ చేయాలి. డిసెంబర్ 25న ఓలా స్టోర్లలో జరిగే పోటీలో విజేతను ప్రకటిస్తారు. -
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్‌కు దుబాయ్‌లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్‌లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్‌లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
కోటిన్నర కారు తల్లికి గిఫ్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరో
తెలుగు యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే సరైన హిట్ పడటం లేదు. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ ఉన్నాడు. ఇలా రెండు చేతులతో సంపాదిస్తున్న ఇతడు.. ఇప్పుడు తన తల్లికి అపురూపమైన బహుమతి ఇచ్చాడు. ఆ విషయాన్నే చెబుతూ తెగ మురిసిపోయాడు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్)'మా అమ్మకు బర్త్ డేకి ముందే గిఫ్ట్ ఇస్తున్నా. ఇప్పటికీ అమ్మ.. ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసేందుకు సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కారు కొనివ్వమని అడిగింది. ఇప్పుడు అది నెరవేర్చా. చిన్న కానుకలే బోలెడంత సంతోషాన్ని ఇస్తాయి' అని సందీప్ కిషన్ రాసుకొచ్చాడు. గిఫ్ట్ ఇచ్చిన ఈ రేంజ్ రోవర్ కారు ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.2010లో 'ప్రస్థానం' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ కిషన్.. ఇప్పుడు తెలుగు, తమిళంలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది 'ఊరు పేరు భైరవకోన', 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' తదితర సినిమాలు చేశాడు. ప్రస్తుతం 'మజాకా' అనే కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ అన్నారు. కానీ పండక్కి చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ మూవీస్ విడుదల కానున్నాయి. సందీప్ మూవీ కూడా అదే టైంకి అంటే కష్టమే.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ) -
ఖరీదైన అభిమానం.. సింగర్‌కు ఏకంగా కోట్ల రూపాయల గిఫ్ట్!
సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. అలాగే సింగర్స్ కూడా అభిమానులు ఉంటారు. అందులోనూ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారని ఇది చూస్తేనే తెలుస్తోంది. అసలేంటి ఖరీదైన ఫ్యాన్స్ అనుకుంటున్నారా? అదేంటో మీరు చూసేయండి.బెంగాల్‌కు చెందిన ఇండియన్ సింగర్ కమ్ రాపర్ మికా సింగ్ ఇటీవల యూఎస్‌లో సంగీత కచేరి నిర్వహించారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో పలు దేశాల నుంచి అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ కచేరికి హాజరైన పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగర్ మికా సింగ్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కోట్ల విలువైన బహుమతులు ఇచ్చిన తమ అభిమానాన్ని చాటుకున్నారు.రూ.3 కోట్ల విలువైన గిఫ్ట్..మికా సింగ్‌కు ఏకంగా రూ.3 కోట్ల విలువైన బహుమతులు కానుకగా ఇచ్చాడు. అత్యంక ఖరీదైన బంగారు గొలుసు, రోలెక్స్ వాచ్, డైమండ్ రింగులను బహుకరించాడు. వీటి విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మికా సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇలాంటి ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారా? కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. మికా సింగ్ బాలీవుడ్లో అనేక పాటలు పాడారు. ఆజ్ కి పార్టీ, అంఖియోన్ సే గోలీ మారే, చింతా టాటా చితా చితా లాంటి సాంగ్స్‌తో ఫేమస్ అయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక
అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ టెన్షన్‌తో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా డిసెంబర్ 5కి రావాల్సిందే అనే టార్గెట్‌తో బిజీబిజీగా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్తోళ్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం పనిచేస్తున్నారనే రూమర్స్ గురించి పక్కన పెడితే ఇప్పుడు ఓ విషయం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.సినిమా రిలీజ్‌కి మరికొన్ని రోజులు ఉందనగా.. ఇందులోనే హీరోయిన్గా చేస్తున్న రష్మిక హీరో అల్లు అర్జున్‌కి క్యూట్ అండ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోని బన్నీ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫొటో లీక్.. కేసు పెట్టిన 'కన్నప్ప' టీమ్)'ఎవరికైనా వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసొస్తుందని మా అమ్మ చెప్పేది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్.. మీకు మరింత అదృష్టం తీసుకొస్తుందని అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు' అని రష్మిక మందాన్న రాసుకొచ్చింది. 'ఇప్పుడు చాలా అదృష్టం కావాలి డియర్' అని 'పుష్ప 2' గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.'పుష్ప' కోసం తొలిసారి అల్లు అర్జున్-రష్మిక కలిసి పనిచేశారు. ఇప్పుడు 'పుష్ప 2' కోసం పాన్ ఇండియా లెవల్లో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. మూవీపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 17న ట్రైలర్ రిలీజ్ ఉందనే రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!) -
బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల వాచ్ గిఫ్ట్
పంజాబ్‌లో నివాస భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడో వ్యాపారవేత్త. నాణ్యతగా, వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతలో కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా చూపిన ఖచ్చితమైన శ్రద్ధను గుర్తిస్తూ ఆయనకు ఈ బహుమతి అందించినట్లు భవన యజమాని గుర్దీప్ దేవ్‌బత్ చెప్పారు.కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా అందుకున్న ఈ వాచ్ 18-క్యారెట్ల బంగారంతో రూపొందించిన రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ స్కై-డ్వెల్లర్. చూడగానే బంగారు కాంతులతో ధగాధగా మెరిసిపోతున్న ఈ వాచ్‌కి బలమైన బంగారు లింక్‌లతో తయారైన సిగ్నేచర్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఉంది. అలాగే ఇందులో షాంపైన్-రంగు డయల్ కూడా ఉంది.200 మందికిపైగా కార్మికులుపంజాబ్లోని జిరాక్పూర్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనం విషయానికి వస్తే ఇది ఆధునిక కోటను పోలి ఉంటుంది. పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రూప్రా అనే కాంట్రాక్టర్ అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో 200 మందికి పైగా కార్మికులతో నిరంతరం పనులు చేసి నిర్మాణం పూర్తి చేశారు.వాస్తుశిల్పి రంజోద్ సింగ్ భవనం డిజైన్‌ను రూపొందించారు. దృఢమైన సరిహద్దు గోడతో ఒక ప్రైవేట్ కోటలా దీన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన హాళ్లు, అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన గార్డెన్లు ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాణపరంగా విశిష్టమైన ప్రత్యేకతలెన్నో ఈ భవనంలో ఉన్నాయి. -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్‌ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్‌లు ఇస్తూంటాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్‌బాక్స్ అన్‌బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్‌ను అన్‌బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్‌ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు
దసరా, దీపావళి వస్తున్నాయంటే.. ఉద్యోగులకు సంబరపడిపోతుంటారు. ఎందుకంటే తాము పనిచేస్తున్న కంపెనీలు బోనస్‌లు లేదా గిఫ్ట్స్ వంటివి ఇస్తాయని. కొన్ని కంపెనీలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుంటే.. మరికొన్ని కంపెనీలు ఏకంగా ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.ఇటీవల హర్యానాలోని పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ 15 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పంచకుల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి 13 టాటా పంచ్ వాహనాలు, రెండు మారుతి గ్రాండ్ విటారా కార్లను గిఫ్ట్ ఇచ్చింది.కంపెనీ యజమాని ఎంకే భాటియా స్వయంగా కార్ల తాళాలు ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉత్తమ పనితీరు కనపరిచిన అందరూ నాకు సెలబ్రిటీల వంటివారని, కంపెనీ విజయానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని భాటియా అన్నారు.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటాఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 12 మంది ఉద్యోగులకు కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఏటా 15 మందికి కార్లను బహూకరించారు. ఇప్పటికి కంపెనీ మొత్తం 27 కార్లను ఉద్యోగులకు అందించింది. ఈ పద్దతిని మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ భవిష్యత్తులో కొనసాగించాలని యోచిస్తోంది. -
గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్.. 2000 మందికి ఉపాధి
అహ్మదాబాద్: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ(గిఫ్ట్ సిటీ) గాంధీనగర్‌లో టెక్‌ఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఈ సెంటర్‌ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్ల వ్యూహాత్మక కేంద్రంగా వినియోగించనున్నట్లు పేర్కొంది.ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) పరిశ్రమలకు సంబంధించిన క్లయింట్లకు ఆధునిక సాంకేతిక సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ప్రాథమికంగా ఈ సెంటర్లో 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్యను 2,000కు పెంచనుంది.ప్రపంచస్థాయి కంపెనీలను ఆకట్టుకోవడంలో రాష్ట్రానికున్న పటిష్టతను గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్ కొత్త కేంద్రం ప్రతిబింబిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధికి అత్యుత్తమ వాతావారణాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. టెక్‌ఫిన్ సెంటర్ ద్వారా బీఎఫ్ఎస్ఐ క్లయింట్లకు డిజిటల్ పరివర్తనలో తోడ్పాటునివ్వనున్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. -
భార్యకు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన మార్క్ జుకర్‌బర్గ్ (ఫోటోలు)
-
Jharkhand: మహిళలకు ఏటా రూ. 12,000
జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ సర్కారు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. వారి సంక్షేమం కోసం నూతన పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతి సంవత్సరం రూ.12,000 అందజేస్తుంది. ఈ పథకానికి ‘మైయా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. అర్హులైన మహిళలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ పలు ప్రాంతాల్లో క్యాంపులను నిర్వహిస్తోంది. జార్ఖండ్ ఏజెన్సీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ కార్యదర్శి మనోజ్ కుమార్ పేర్కొన్నారు.రాష్ట్రంలోని సుమారు 50 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంకింద ప్రయోజనం పొందేందుకు ఏ ఇతర పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందని మహిళలు అర్హులు. జార్ఖండ్ నివాసితులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులను ఆగస్టు 21 నుంచి పోర్టల్ ద్వారా సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. -
కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్.. చేనేత కుటుంబాలకు సాయం
సాక్షి,హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మరో మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గడిచిన ఏడు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు స్టేట్ హోమ్‌లో ఉన్న వందమంది అనాథ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కేటీఆర్ బుధవారం(జులై 24) తన పుట్టినరోజు జరుపుకున్నారు. -
ఉద్యోగులకు అంబానీ ఫ్యామిలీ అదిరిపోయే గిఫ్ట్ - వీడియో
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహం ఈ రోజు (జులై 12) జరగనుంది. అంబానీ ఇంట జరుగుతున్న ఈ పెళ్ళి సందర్భంగా రిలయన్స్ ఉద్యోగులకు గిఫ్ట్ బాక్స్ పంపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. రెడ్ కలర్ బాక్స్, దాని మీద దేవీ, దేవతల దివ్య దయతో 12 జులై 2024న ఆనంద్ మరియు రాధికల వివాహాన్ని జరుపుకుంటున్నాము. నీతా, ముఖేష్ అంబానీల శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు.అంబానీ ఫ్యామిలీ పంపించిన గిఫ్ట్ బాక్స్‌లో హల్దీరామ్ ఆలూ భుజియా సేవ్, లైట్ చివాడాతో సహా పలు రకాల స్వీట్లు ఉన్నాయి. వీటితో పాటు ఓ వెండి కాయిన్ కూడా ఉంది. ఈ గిఫ్ట్ అందుకున్న ఉద్యోగులు అనంత్ & రాధిక జంటను అభినందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ చేస్తున్నారు.అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాలతో జరిగే అవకాశం ఉంది. ప్రధాన వేడుకలు శుక్రవారం, జూలై 12 వివాహ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ఆ తరువాత జూలై 13, శనివారం శుభ్ ఆశీర్వాద్‌తో వేడుకలు.. జులై 14 ఆదివారం మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వివాహ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Tanya Raj (@vibewithtanyaa) -
కిమ్ మనసు గెల్చుకున్న పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మనసు గెల్చుకున్నారు. తన ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంలో రష్యన్ మేడ్ లగ్జరీ కారు ఒకదానిని కిమ్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ధృవీకరించగా.. ఓ టీవీ ఛానెల్ ఇందుకు సంబంధించిన ఫుటేజీని ప్రదర్శించింది. రష్యాలో తయారైన ఆరస్ లిమోసిన్ కారు.. తన కాన్వాయ్‌లోనూ ఉపయోగిస్తున్నారు పుతిన్. అదే కారును ఆయన గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా కారును పుతిన్ నడపగా, పక్కనే కిమ్ కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదించారు.Russia’s Vladimir Putin drives North Korea’s Kim Jong-un in Russian Limousine#Ytshorts #Russia #Northkorea #Putin #KimJonun #RussianLimousine pic.twitter.com/qJvVrKMoR7— Business Today (@business_today) June 20, 2024VIDEO CREDITS: Business Today గతేడాది సెప్టెంబర్‌లో కిమ్, రష్యాలో పర్యటించారు. ఆ టైంలో తన కాన్వాయ్‌లోని వాహనాలను పుతిన్ స్వయంగా కిమ్‌కు చూపించి.. ఇద్దరూ సరదాగా ప్రయాణించారు. ఆ టైంలో కిమ్ ఈ కారుపై మనుసు పారేసుకున్నారని, దీంతో ఇప్పుడు పుతిన్ ఇప్పడు ఆ కారును సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. కిమ్ విలాస ప్రియుడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన వస్తువులు, కార్లను ఆయన తన ఖాతాలో ఉంచుకున్నారు. అయితే.. ఉత్తర కొరియాలోకి విలాసవంతమైన గూడ్స్ వెళ్లకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధం విధించింది. అయినప్పటికీ అక్రమ మార్గంలో కిమ్ వాటిని తెప్పించుకుంటారని దక్షిణ కొరియా ఆరోపిస్తుంటుంది.Caption this...pic.twitter.com/ilIUhnxxw1— Mario Nawfal (@MarioNawfal) June 20, 2024ఇదిలా ఉంటే.. దాదాపు 24 సంవత్సరాల తర్వాత నార్త్ కొరియాలో అడుగుపెట్టారు పుతిన్. కొరియా జనం కేరింతలతో అట్టహాసంగా పుతిన్‌కు ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు.. అమెరికా ఒత్తిడి, ఆంక్షలను ఎదుర్కోవడంలో భాగంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా వీళ్లిద్దరూ పని చేస్తున్నట్లు వాళ్ల వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. -
ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?
స్టార్ హీరోయిన్, ఈ మధ్య ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. కజిన్ వరుణ్ రనౌత్ పెళ్లి రీసెంట్గా అతడికి చంఢీగడ్‌లో ఖరీదైన లగ్జరీ ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇన్ స్టా స్టోరీలో మొత్తం అవే ఫొటోలని పోస్ట్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరో దర్శన్ కేసులో మరో కన్నడ హీరోకి నోటీసులు)హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన కంగనా రనౌత్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో ఇబ్బందులు దాటుకుని హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ప్రభాస్‌తో 'ఏక్ నిరంజన్' సినిమా చేసింది. గత కొన్నాళ్ల నుంచి ఓవైపు నటిస్తున్నప్పటికీ మరోవైప రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటూ వచ్చింది. అలా ఈ మధ్య లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయిపోయింది.అలా ఎంపీగా అయిన ఆనందంలో ఉన్న కంగనా రనౌత్.. రీసెంట్గా తమ్ముడు వరసయ్యే వరుణ్ పెళ్లికి హాజరైంది. అందరిలా కాకుండా ఏకంగా ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చి అతడిని సర్ప్రైజ్ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' సినిమాలో కంగన నటిస్తోంది. ఒకప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగన నటిస్తోంది. ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?) View this post on Instagram A post shared by Varun Ranaut (@varunranaut) -
ముచ్చటగా మూడోసారి మోదీ : నగల వ్యాపారి అరుదైన కానుక
భారత దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అరుదైన బహుమతిని అందుకోనున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త, నగల వ్యాపారి రింకూ చౌహాన్ బీజేపీ చిహ్నమైన కమలం పువ్వును స్వచ్ఛమైన వెండితో రూపొందించి కానుకగా అందించనున్నారు.మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు కమలం పువ్వును ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి అద్వితీయమైన బహుమతి ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట జమ్మూ-కశ్మీర్‌లోని ముత్తి గ్రామానికి చెందిన జనతా యువమోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధి చౌహాన్ వెల్లడించారు.జమ్ము కశ్మీర్లో అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెరవేర్చిన నేపథ్యంలో ఆయనకు వెండి కమలాన్ని బహూకరించాలని సంకల్పించినట్టు తెలిపారు. తానే స్వయంగా స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు చేశాననీ, దీని తయారీకి 15 నుండి 20 రోజులు పట్టిందని చౌహాన్ మీడియాతో చెప్పారు. “నా ఆత్మ దానిలో ఉంది. మోదీ నాకు దేవుడిలాంటి వారు. ఆయన ఈ బహుమతిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్లో శాంతిని పునరుద్ధరించడంలో సహాయపడిందని, అలాగే 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యూపీలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందంటూ కొనియాడారు. అలాగే ఈ బహుమతిని అందజేసేందుకు ప్రధానిని కలిసే అవకాశం కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన భార్య అంజలి చౌహాన్ వెల్లడించారు. -
బాలీవుడ్ భామ బర్త్ డే.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన భర్త!
అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ సోనమ్ కపూర్. ఇవాళ తాజాగా 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్లో సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ చివరిసారిగా బ్లైండ్ సినిమాలో కనిపించింది. సోనమ్ కపూర్ బర్త్ డే సందర్భంగా ఆమె భర్త ఆనంద్ అహుజా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్యకు రవీంద్రనాథ్ ఠాగూర్ 'గీతాంజలి' బుక్‌ను పుట్టినరోజు కానుకుగా అందించారు. ఈ విషయాన్ని సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.సోనమ్ కపూర్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది నాకు అద్భుతమైన పుట్టినరోజు కానుక. నాకేం కావాలో నా భర్తకు మాత్రమే తెలుసు. ఠాగూర్ రాసిన గీతాంజలి మొదటి ఎడిషన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ అర్హత సాధించడానికి నీ కోసం ఏం చేశానో నాకు తెలియదు." అంటూ పోస్ట్ చేసింది. సోనమ్ బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి అనిల్ కపూర్ విషెస్ తెలిపారు. ఆమె తల్లి సునీతా కపూర్ సైతం సోషల్ మీడీయా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
క్యాప్షన్ కాంపిటీషన్లో విన్నర్: ఆనంద్ మహీంద్రా గిఫ్ట్ ఏంటో తెలుసా?
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఫోటోను షేర్ చేస్తూ.. ఓ ఫన్నీ కాంపిటీషన్ నిరవహించారు. గెలిచినవారికి గిఫ్ట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోను గమనిస్తే.. ఇనుప రెయిలింగ్ వెనుక కూర్చున్న ఓ కుక్క తన మొహాన్ని కరెక్ట్‌గా ఓ ఆకృతి దగ్గర పెట్టింది. దీనికి ఓ సరదా కామెంట్ చేయాలనీ, దాని కోసం జులై 3 వరకు గడువు ఇచ్చారు. గెలిచినవారికి ఓ బొమ్మ మహీంద్రా ఫ్యూరియో ప్రకటించారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటో మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ఇందులో ఒకరు ఫోటో మీద కామెంట్ చేస్తూ.. అది ఇన్‌కాగ్నిటో మోడ్ మాదిరిగా ఉందని పేర్కొన్నారు. ఈ సమాధానం ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. దీంతో వారి అడ్రస్ మెయిల్ చేస్తే గిఫ్ట్ పంపిస్తా అంటూ పేర్కొన్నారు.And the winner is... @raptorsworld : “Indognito mode” (incognito) Bravo! Would you please DM your mailing address details to @mahindracares to receive your Diecast, scale model Mahindra Furio Truck? https://t.co/fYGJybTOWS— anand mahindra (@anandmahindra) June 6, 2024 -
చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనేక ఖరీదైన బహుమతులను అందించారు. తాజాగా నీతా అంబానీ కాబోయే చిన్న కోడలికి దుబాయ్‌లోని అద్భుతమైన లగ్జరీ విల్లాను బహుమతిగా అందించ నున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా, ఎన్ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ దుబాయ్‌లో 640 కోట్ల విల్లాను కానున్నకొత్త కోడలికి గిఫ్ట్‌గా అందించనున్నారు. ఇందుల 10 విలాసవంతమైన బెడ్రూమ్లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు హైలైట్‌గా ఉంటాయిట. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. అంతేకాదు బిలియనీర్ ఫ్యామిలీ బస చేయడానికి, భారీ పార్టీలను హోస్ట్ చేసేందుకు కూడా ఇది సరిపోతుందని అంచనా.లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల గుజరాత్లో జామ్ నగర్లో ప్రీవెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. హస్తాక్షర్ వేడుకలో తమ ప్రేమపై సంతకాలుకూడా చేశారు. అటు రెండో విడత వేడుకలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఏడడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.కాగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనంత్‌కు ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ గా అందించారు ముఖేష్ అంబానీ. అలాగే కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలు సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
మిస్టర్ బీస్ట్ బర్త్‌డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
అమెరికన్ యూట్యూబర్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన ఫాలోయర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మిస్టర్ బీస్ట్‌గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ తన 26వ పుట్టినరోజు (మే 7) సందర్భంగా 26 టెస్లా కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని ప్రకటించడం విశేషం. కండిషన్స్ అప్లయ్ అంటూ కొన్ని నిబంధనలు కూడా పెట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ కంటెంట్ విచిత్రమైన సవాళ్లతో తనకు తానే సాటి అని నిరూపించుకనే మిస్టర్ బీస్ట్ తాజాగా దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో ఒక మతలబు ఉంది. తన పోస్ట్ కింద కామెంట్ చేసి, ఇద్దరు ఫ్రెండ్స్‌ను ట్యాగ్ చేసిన 26 మందిని ఎంపిక చేసి, 26 కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. డ్రా తీసిన అనంతరం విజేతలకు డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తానని, వారం రోజుల్లో (మే 11న) ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తానని తెలిపాడు. అంతేకాదు రకరకాల పేర్లు, లేదా రీపోస్ట్‌లు లాంటి జిమ్మిక్కులు పనిచేయవని కూడా వెల్లడించాడు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) 254 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా కొనసాగుతున్న మిస్టర్ బీస్ట్ నికర విలువ రూ.4,175 కోట్లు (500 మిలియన్ల డాలర్లు)గా తెలుస్తోంది. 2012 ప్రారంభంలో 13 ఏళ్ల వయస్సులో 6000 పేరిట తొలుత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. ఆ తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2, అలాగే ఒక దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రరోపీని నడుపుతున్నాడు. దీని ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను విరాళాలిస్తుంటాడు. -
పుట్టినరోజున రూ.5 కోట్లతో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
కొడుకు పుట్టిన రోజున డ్రెస్, మొబైల్.. మరీకాదంటే బైక్లాంటివి గిఫ్ట్ ఇస్తుంటారు. ఇదంతా మధ్య తరగతివారికి తీపి జ్ఞాపకాలను మిగుల్చుతాయి. మరి ధనవంతుల ఇళ్లలో పుట్టినరోజుకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రముఖ వ్యాపారవేత్త వివేక్‌కుమార్ రుంగ్తా తన కుమారుడి బర్త్‌డే రోజున ఏకంగా రూ.5 కోట్లు విలువచేసే ‘లాంబోర్గినీ హురకాన్ ఎస్టీఓ’ మోడల్కారును బహుమానంగా ఇచ్చారు. ఈమేరకు తనకు గిఫ్ట్ ఇస్తుంటే తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న వీకేఆర్ గ్రూప్ అధినేత వివేక్‌కుమార్ రుంగ్తా తన కుమారుడు తరుష్ రుంగ్తా 18వ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతో దుబాయ్‌లోని లాంబోర్గినీ సంస్థను సంప్రదించారు. కంపెనీ తయారుచేసిన హురకాన్ ఎస్టీఓ కారును కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త ఆ సూపర్ స్పోర్ట్స్ కారును చూసిన తరుష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా స్పందిస్తూ.. ‘నా 18వ పుట్టినరోజును డ్రీమ్కారు గిఫ్ట్‌గా ఇచ్చి మరింత అద్భుతంగా మార్చినందుకు నాన్నకు కృతజ్ఞతలు! తన ప్రేమాభిమానాలు ఎప్పటికే నాతోనే ఉంటాయి’ అని తెలిపారు. Indian businessman Vivek Kumar Rungta gifted a Lamborghini Huracan STO worth ₹5 Crore to his son Tarush on his 18th birthday pic.twitter.com/nNe4GMIGqI — Rosy (@rose_k01) April 11, 2024 -
గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రియురాలి కోసం గొప్ప సాహసం చేశాడో ప్రియుడు. ఇందుకోసంగా దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి మరీ జాగ్రత్తగా ఆమెకు విగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. విగ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడానికి అంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? రండి.. ఈ స్టోరీని చూద్దాం. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం మిచిగాన్‌లోని వాటర్ఫోర్డ్కు చెందిన కోడి ఎన్నిస్, హన్నా హోస్కింగ్ ఇద్దరూ ప్రేమికులు. ఆరునెలల డేటింగ్ తరువాత తనకోసం 30 అంగుళాల జట్టు కావాలని అడిగింది సరదాగా. అంతేకాదు దీనికి మూడు నాలుగేళ్లుపడుతుందని కూడా జోక్ చేసింది. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు ఎన్నిస్. 2020, మే నుంచి జుట్టు పెంచడాన్ని ప్రారంభించాడు. దీనికోసం వేలాది ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూశాడు. దీన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాడు. క్రమం తప్పకుండా జుట్టును వాష్ చేసుకోవడం, కండీషనింగ్ లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కాస్మోటాలజిస్ట్ సలహా మేరకు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడాడు. జుట్టు ఏ మాత్రం తెగకుండా సిల్క్ బోనెట్ వాడుతూ జాగ్రత్తపడ్డాడు. చివరికి గత అక్టోబరులో, తన జుట్టును 29-అంగుళాలకు పెంచాడు. దీన్ని కట్ చేసి అంతే జాగ్రత్తగా అందమైన విగ్‌ను ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అచ్చం ఆమె పాత జుట్టులా ఉండేలా శ్రద్ధ తీసుకోవడం మరీ విశేషం. అసలు విషయం ఏమిటంటే.. హన్నా హోస్కింగ్ ఒక కంటెంట్క్రియేటర్. ఆమెకు ఏడేళ్లున్నపుడే అలోపేసియా (హెయిర్ ఫోలికల్ మూలాలను నాశనం చేసే ఆటో-ఇమ్యూన్) అనే వ్యాధి సోకింది. దీంతో క్రమంగా దాదాపు ఐదేళ్ల క్రితంఆమె శరీరం మీద ఉన్న ఒక్కో వెంట్రుక(కనుబొమ్మలతో) సహా రాలిపోవడం మొదలైంది.దీంతో జుట్టుంతా షేవ్ చేసుకుంది. ఈ క్రమంలో 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో నవంబరులో హన్నా ఎన్నిస్ తొలిసారి కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమంగా మారింది. ‘ఇది తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, సినిమాలా అనిప్తిస్తోంది అని హన్నా భావోద్వేగానికి లోనైంది హనా. ‘‘ఇది మామూలు విగ్ కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవింతలో ఇంత ఇష్టపడే వ్యక్తి ఉన్నాడని తెలియడం,చాలా ఓదార్పుగా, భద్రంగా అనిపిస్తోంది’’ అంటూ కంటతడి పెట్టుకుంది. తన బాయ్‌ఫ్రెండ్స్ జుట్టుతో తయారు చేసిన విగ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది హన్నా. నా విగ్గు తనకి చక్కగా అమరిపోయింది అంటే..ఇక నాతో తను విడిపోలేదు అని చెప్పాడు ప్రేమతో -
మహిళ కానుక..సీఎం జగనన్న రియాక్షన్
-
మహిళలకు ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక
-
Rameswaram Cafe Blast: నిందితుడి జాడ చెప్తే రూ.10 లక్షలు
న్యూఢిల్లీ: బెంగళూరులో మార్చి ఒకటో తేదీన రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి సమాచారం అందిస్తే రూ.10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేసింది. కేఫ్‌లోకి అడుగుపెట్టేటపుడు ఆ వ్యక్తి క్యాప్, మాస్్క, కళ్లద్దాలు ధరించి ఉన్నాడని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుడు జాడ తెలిపిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ హామీ ఇచి్చంది. ఈస్ట్ బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. శక్తివంత పేలుడు పదార్ధం(ఐఈడీ) వాడటంతో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించడం తెల్సిందే. మొదట కర్ణాటక పోలీసులు కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, పేలుడు పదార్ధాల చట్టాల కింద కేసు నమోదుచేశారు. ముంబైలో నవంబర్ 26న ఉగ్రదాడి తర్వాత ప్రత్యేకంగా ఉగ్రసంబంధ ఘటనలపై దర్యాప్తు కోసం ఎన్ఐఏను 2008లో ఏర్పాటుచేశారు. -
నేటి గుజరాత్ పర్యటలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.52,250 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 25న ఉదయం 7:45 గంటలకు ప్రధాని ద్వారకా ఆలయాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు. అనంతరం సుదర్శన్ వంతెనను సందర్శిస్తారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ద్వారకలో రూ.4,150 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీని తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ రాజ్‌కోట్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌కోట్‌లోని రేస్ కోర్స్ గ్రౌండ్లో రూ. 48,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ద్వారకలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఓఖా ప్రధాన భూభాగంతో బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు రూ. 980 కోట్లతో నిర్మించిన సుదర్శన్ సేతును జాతికి అంకితం చేయనున్నారు. ఇది దాదాపు 2.32 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. వదినార్, రాజ్‌కోట్-ఓఖా, రాజ్‌కోట్-జెతల్సర్-సోమ్‌నాథ్ మరియు జెతల్సర్-వాన్సజలియా రైలు విద్యుదీకరణ ప్రాజెక్టుల వద్ద పైప్‌లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఫిబ్రవరి 26న దేశంలోని 550 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బండేల్లో రూ.307 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి స్టేషన్‌ను నిర్మించనున్నారు.టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లోని 28 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర స్పెషల్ గిఫ్ట్
పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నారు. క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఉద్దేశించి ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. క్రికెటర్ సర్ఫరాజ్‌లో విశ్వాసాన్ని నింపింనందుకు అతని తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. అనుకున్నది సాధించేంతవరకు నమ్మకాన్ని కోల్పోకూడదనే స్పూర్తి నిచ్చారు అంటూ వారిని ప్రశంసించారు. ఈ సందర్బంగా నౌషాద్ మాటలు, సర్ఫరాజ్ బ్యాటింగ్ వీడియోను షేర్ చేశారు. ఒక బహుమతిని కూడా ప్రకటించారు. విశ్వాసాన్ని కోల్పోవద్దు....కఠోర శ్రమ, ధైర్యం, సహనం..ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి ఒక తండ్రి పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు. అందుకే స్పూర్తిదాయకమైన తండ్రి నౌషద్ ఖాన్‌కు థార్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. ఇది తనకు గౌరవం ఈ బహుమతిని ఆయన స్వీకరిస్తానని విశ్వసిస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు. “Himmat nahin chodna, bas!” Hard work. Courage. Patience. What better qualities than those for a father to inspire in a child? For being an inspirational parent, it would be my privilege & honour if Naushad Khan would accept the gift of a Thar. pic.twitter.com/fnWkoJD6Dp — anand mahindra (@anandmahindra) February 16, 2024 జెర్సీ నంబర్ 97తో బరిలోకి సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలోనే ఇంగ్లండ్‌తో గురువారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. భారత వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అతడికి అరంగేట్రం క్యాప్ అందించిన సందర్భంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్, సర్ఫరాజ్ భార్య భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించినవ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జెర్సీ నంబర్ 97 సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ కూడా క్రికెటర్. తన కలను నెరవేర్చుకునే ఆశయంలో భాగంగా కుమారుడికి శిక్షణ ఇచ్చాడు. ఇక 97 విషయానికి వస్తే మూడో టెస్టుకు ముందు మాట్లాడుతూ జెర్సీ నంబర్ 97 విశేషాలుతెలిపాడు. తండ్రి పేరులోని నౌ అంటే తొమ్మిది, షాద్ నుంచి 7 తీసుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇటీవల అండర్-19 ప్రపంచకప్‌లో ఆడిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ జెర్సీ నంబర్ కూడా 97 కావడం విశేషమే మరి. -
భేదాలు చూడని ప్రేమకు భరోసానిచ్చే బహుమతి
కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. తమ ప్రియమైన జీవిత భాగస్వామికి తన మనసులోని ప్రేమను చాటుతూ వారికి మంచి బహుమతి ఇవ్వాలని చాలామంది చూస్తుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచన. ఎవరి అభిరుచి, బడ్జెట్‌కి తగినట్లు బహుమతి ఎంచుకుంటూ ఉంటారు. పుష్పగుచ్చం, చాక్లెట్స్, బంగారం ఇలా అనేక బహుమతులు ఇస్తుంటారు. ఈసారి ఇందుకు భిన్నంగా వారి ఆర్థిక జీవితానికి, భవిష్యత్‌కు భరోసానిచ్చే ఈ బహుమతులు ఇచ్చి చూడండి. తప్పకుండా వారు సర్ప్రైజ్ అవుతారు. డిపాజిట్లు, పెట్టుబడుల రూపంలో.. పెట్టుబడులు మీ జీవిత భాగస్వామికి గొప్ప బహుమతి అవుతాయి. వారి భవిష్యత్ లక్ష్యాలు చేరుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, పీపీఎఫ్ ఇలా పెట్టుబడులకు అనేక మార్గాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా విలువైన బహుమతి కొనాలనుకుని మీ వద్ద సరిపడా డబ్బు లేకపోతే.. ఎప్పుడు వారికి ఆ బహుమతి ఇస్తే వారికి ఉపయోగపడుతుందో చూడండి. ఒకటి రెండేళ్లు సమయం ఉంటే రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచి, కాలపరిమితి ఏర్పాటు చేసుకుని, ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని జమచేయండి. మొదటి నెల మొత్తాన్ని జమ చేసి దానికి సంబంధించిన వివరాలు వారికి తెలియజేసి బహుమతి ఇవ్వండి. దీర్ఘకాలం పాటు నెలవారీ సిప్ విధానం ద్వారా పెట్టుబడులు ప్రారంభించి బహుమతి ఇవ్వొచ్చు. లేదా మీ జీవిత భాగస్వామికి ఇష్టమైన సంస్థల షేర్లను కొనుగోలు చేసి బహుమతి ఇవ్వొచ్చు. జీవిత, ఆరోగ్య బీమాతో.. మీ జీవిత భాగస్వామి, పిల్లల భవిష్యత్‌కు బీమా భరోసా కల్పించొచ్చు. జీవిత (టర్మ్ ప్లాన్), ఆరోగ్య బీమాలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో అనుకోని సంఘటనలు జరిగితే ఈ పాలసీలు మీ జీవిత భాగస్వామికి అండగా ఉంటాయి. దీంతో భవిష్యత్‌కు భరోసానిచ్చే అతిపెద్ద బహుమతి వారికి ఇస్తున్నట్లే అవుతుంది. ఎమర్జెన్సీ కోసం క్రెడిట్ లైన్.. అన్ని అత్యవసర సమయాల్లోనూ మీరు మీ జీవిత భాగస్వామి పక్కన ఉండలేకపోవచ్చు. కానీ ఫ్లెక్సీపేతో వ్యక్తిగత క్రెడిట్ లైన్‌ను అందించవచ్చు. స్వల్పకాలిక, చిన్న చిన్న అత్యవసరాల కోసం ఇది వారికి ఉపయోగపడుతుంది. ప్రతిసారీ రుణం కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా అత్యవసరాలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది వారికి ఉపయోగపడే బహుమతి అవుతుంది. బంగారం పథకాలతో.. భారతీయులకు బంగారం పట్ల మమకారం ఎక్కువ. ఇందులో భావోద్వేగాలు నిండి ఉంటాయి. బంగారం బహమతి ఇస్తే మీ ప్రియమైన వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే, బంగారాన్ని ఆభరణాల రూపంలో కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో గానీ, గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో గానీ, డిజిటల్‌గా గానీ అందించడం వల్ల ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇదీ చదవండి: 'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్! ఈ ప్రేమికుల రోజున మీకు ప్రియమైన భార్య, పిల్లల భవిష్యత్‌ను సురక్షితం చేసే బహుమతులు వారికి అందించండి. మీ కుటుంబ సభ్యులకు పొదుపు, పెట్టుబడులు, బ్యాంకులు అందించే సేవలు, క్రెడిట్ కార్డులు, బీమా ఇలా అన్ని ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించండి. పొదుపు చేయడం పిల్లలకు అలవాటు చేయండి. మీరు చేసే పొదుపు అలవాట్లు, ఆర్థిక విషయాల గురించి నేర్పించే పాఠాలే భవిష్యత్‌లో వారికి గొప్ప బహుమతులు అవుతాయి. -
హనుమాన్ సూపర్ హిట్.. డైరెక్టర్‌కు కళ్లు చెదిరే గిఫ్ట్!
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చి దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. జై హనుమాన్ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నారట. ఇప్పటికే కారును కూడా బుక్ చేసినట్లు సమాచారం. సాధారణంగా సినిమాలు సూపర్ హిట్ అయితే ఖరీదైన కార్లు బహుమతిగా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. గతంలోనూ పలువురు నిర్మాతలు డైరెక్టర్లకు కార్లు బహుమతులుగా అందించారు. బేబీ డైరెక్టర్‌కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్ప్రైజ్ ఇచ్చారు. రజినీకాంత్, నెల్సన్‌కు కాస్ట్ లీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు సైతం ఖరీదైన కారు ఇవ్వనుండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా?
విప్రో వ్యవస్థాపకుడు 'అజీమ్ ప్రేమ్‌జీ' (Azim Premji) తన కుమారులు.. సంస్థ చైర్మన్ 'రిషద్ ప్రేమ్‌జీ', ఎంటర్ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'తారిఖ్ ప్రేమ్‌జీ'లకు జనవరి 23న దాదాపు రూ.500 కోట్ల విలువైన 10.2 మిలియన్ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ చూపించింది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అండ్ అజీమ్ ప్రేమ్‌జీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్‌లో బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు. లావాదేవీ తర్వాత, అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబానికి కంపెనీలో 4.4% వాటా ఉంది. ఇందులో ప్రేమ్‌జీకి 4.3%, అతని భార్య యాస్మీన్ ప్రేమ్‌జీకి 0.05%, ఇద్దరు కొడుకులకు 0.03% వాటా ఉంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు.. ప్రేమ్‌జీ కుటుంబం విప్రోలో 72.9% వాటా కలిగి ఉన్నప్పటికీ 7.4% షేర్ల నుంచి డివిడెండ్ ఆదాయాన్ని పొందుతుంది. ప్రస్తుతానికి విప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌తో సహా ప్రేమ్‌జీ సంపద మొత్తం 11.3 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో షేర్లు శుక్రవారం నాడు రూ.484.9 వద్ద ముగిశాయి. దీని ప్రకారం 1,0230,180 షేర్ల విలువ రూ. 496 కోట్లుగా ఉంది. -
సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక
చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2 కోట్ల రేషన్ కార్డుదారులకు రూ.1000ని పండగ కానుకగా అందజేశారు. దీంతోపాటు చెరకు గడ, కిలో ముడి బియ్యం, చెక్కర, చీర, దోతీలను పంపిణీ చేశారు. వీరితో పాటు తమిళనాడులో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు కూడా ఈ కానుకను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అళ్వార్‌పేటలో ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. Tamil Nadu Chief Minister MK Stalin inaugurates state government's Pongal gift hamper scheme in Chennai; also distributes gift hampers to people pic.twitter.com/kC7AlW82oF — ANI (@ANI) January 9, 2023 రాష్ట్రంలో ఉన్న 2,19,71,113 మంది రేషన్ కార్డుదారులు, శిబిరాల్లో ఉన్న శ్రీలంక తమిళ శరణార్థులకు దాదాపు రూ. 2,436.19 కోట్ల అంచనా వ్యయంతో సంక్రాంతి కానుకను అందజేశారు. ఈ పంపిణీలో జనం రద్దీని నివారించేందుకు టోకెన్ విధానాన్ని అమలుపరిచారు. 1.77 కోట్ల దోతి, చీరలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మాహుతి యత్నం -
గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్
భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ ఏమి చేసినా చెప్పుకోదగ్గదిగానే ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడిపే వీరు ఎప్పుడూ లగ్జరు కార్లను కొనుగోలు చేయడమే కాకుండా గిఫ్ట్స్ కూడా చాలా లగ్జరిగానే ఉండేట్లు అందిస్తారు. ఈ నేపథ్యంలోనే నీతా అంబానీ తన కోడలు శ్లోకా మెహతాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నీతా అంబానీ తన కోడలు శ్లోక మెహతాకు ఇచ్చిన నెక్లెస్ విలువ ఏకంగా రూ.451 కోట్లు అని తెలుస్తోంది. ఈ కారణంగానే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ గిఫ్ట్‌ను శ్లోకా మెహతా 2019లో ఆకాష్ అంబానీని వివాహం చేసుకున్నప్పుడు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 91 వజ్రాలు పొదిగిన ఈ నెక్లెస్‌లో 407.48 క్యారెట్ ఎల్లో డైమెండ్ కూడా కలిగి ఉంది. మరికొన్ని గిఫ్ట్స్ వివరాలు ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీ 44వ పుట్టినరోజు సందర్భంగా రూ.240 కోట్ల విలువైన ఏ319 లగ్జరీ జెట్‌ను గిఫ్ట్ ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా గత కొన్ని రోజులకు ముందు ఆమెకు రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్‌యూవీని కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పటి వరకు ఇదే భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు గిఫ్ట్ అని తెలుస్తోంది. ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా.. అనంత్ అంబానీ నిశ్చితార్థం సందర్భంగా ఆకాష్ అంబానీ రూ.1.3 కోట్ల విలువైన 18కె పాంథెరే డి కార్టియర్ బ్రూచ్‌ను గిఫ్ట్ ఇచ్చారు. ముఖేష్ అంబానీ మాత్రం ఆ సమయంలో సుమారు రూ. 4.5 కోట్ల బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం. -
టాలీవుడ్ హీరోకు ఎంఎస్ ధోని గిఫ్ట్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ హీరో నితిన్ మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ అంటూ అభిమానులను పలకరించునున్నారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వక్కంత వంశీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే హీరో నితిన్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ట్విటర్లో ఓ ఫోటోను నితిన్ పంచుకున్నారు. అందులో ఓ టీ షర్ట్‌ను చేతిలో పట్టుకుని కనిపించారు. ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ నుంచి ఎక్స్‌ట్రార్డీనరీ గిఫ్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ టీ షర్ట్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పంపించారంటూ ట్వీట్ చేశారు. కాగా.. నితిన్ నటించిన ఎక్స్‌ట్రార్డీనరీ డిసెంబర్ 8న థియేటర్లలో సందడి చేయనుంది. EXTRAORDINARY gift from an EXTRAORDINARY MAN… Thankuu @msdhoni sir for this!! Love u ❤️ pic.twitter.com/dNTeXl1JOe — nithiin (@actor_nithiin) November 29, 2023 -
‘మామయ్యా’ అనే పిలుపు కోసం..
చాలామంది అన్నదమ్ములు తమ సోదరికి జన్మించిన సంతానాన్ని అమితంగా ప్రేమిస్తుంటారు. వారి చేత ‘మామయ్యా..’ అని పిలిపించుకోవాలని తపన పడిపోతుంటారు. అయితే ఈ మెట్లనన్నింటినీ దాటేసిన ఒక మేనమామ తన మేనకోడలికి పెళ్లిలో ఘనమైన కానుకను సమర్పించుకున్నాడు. హర్యానాలోని రేవాడీలో ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు ఇచ్చిన కానుక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన వితంతు సోదరి కుమార్తెకు కానుకగా ఇచ్చేందుకు అతను సోదరి ఇంట్లో రూ.500 నోట్ల కట్టలను కుప్పలుగా పోశాడు. మేనకోడలికి ఖరీదైన కానుకను అందించిన ఆ వ్యక్తి పేరు సత్బీర్. అతను క్రేన్ వ్యాపారి. సత్బీర్ తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు విలువైన నగలు కూడా బహూకరించాడు. సత్బీర్ మొత్తంగా ఒక కోటి, ఒక లక్షా పదకొండు వేల నూటొక్క రూపాయలను పెళ్లి కుమార్తెకు కానుగా ఇచ్చాడు. ఈ ఘటనలో నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసల్వాస్ రేవారి.. ఇది జైపూర్-ఢిల్లీ హైవేకి ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఈ ప్రాంతానికి చెందిన సత్బీర్ సోదరి వివాహం సిందర్‌పూర్‌లో జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి ఆమె భర్త మృతి చెందాడు. సత్బీర్ సోదరికి ఒక కుమార్తె ఉంది. తన మేనకోడలి పెళ్లి సందర్భంగా సత్బీర్ తన ఊరి ప్రజలతోపాటు తన సోదరి ఇంటికి చేరుకున్నాడు. పెళ్లిలో సత్బీర్ తన మేనకోడలికి ఇచ్చిన కానుకను చూసి స్థానికులు ఆశ్యర్యపోయారు. ఈ సంద్భంగా సోదరి ఇంటిని సత్బీర్ రూ.500 నోట్ల కట్టలతో నింపేశాడు. కోటి రూపాయలకుపైగా మొత్తాన్ని తన మేనకోడలికి బహూకరించాడు. ఇది కూడా చదవండి: ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే! भाई ने विधवा बहन के घर लगा दिया रुपयों का ढेर, करोड़ों का भात बना चर्चा का विषय#rewari #haryana #bhaat pic.twitter.com/SYi95UEREl — Punjab Kesari Haryana (@HaryanaKesari) November 27, 2023 -
భగవంత్ కేసరి మూవీ సక్సెస్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్!
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్ల అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి దక్కుతున్న ఆదరణతో చిత్రబృందం సంతోషంలో మునిగిపోయింది. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన టొయోటా కారును బహుమతిగా అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. #BhagavanthKesari Producers @Shine_Screens gifted a brand new Toyota Vellfire car to the sensational director @AnilRavipudi for the tremendous Success of #BlockBusterBhagavanthKesari 👌🔥#NandamuriBalakrishna @sahugarapati7 pic.twitter.com/wDeXaLfPs5 — manabalayya.com (@manabalayya) November 27, 2023 -
అమితాబ్ కూతురికి బహుమతిగా కోట్లు విలువ చేసే బంగ్లా!
నటనకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. 80 ఏళ్లు దాటినా కుర్రాళ్లకంటే హుషారుగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అంతేకాదు పాపులర్ టీవీ షో ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’కి హోస్ట్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఇలా వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీకి మాత్రం దూరంగా ఉండలేరు బిగ్‌బీ. బాధ్యత గల తండ్రిగా ఇప్పటికీ తన పిల్లల బాగోగులను చూసుకుంటున్నారు. (చదవండి: పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు) కొడుకుతో పాటు కూతురు శ్వేతా బచ్చన్‌పై కూడా అమితాబ్‌కి ఎనలేని ప్రేమ. పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా.. ఇప్పటికీ ఆమెకు ఆర్థికంగా ఆదుకుంటూనే ఉంటాడు. తాజాగా తన కూతురుకి ఖరీదైన బహుమతిని అందించి, తండ్రి ప్రేమను చాటుకున్నాడు. తనకెంతో ఇష్టమైన జుహు బంగ్లా ‘ప్రతీక్ష’ను కూతురు శ్వేతా బచ్చన్‌కు గిఫ్ట్‌గా అందించారు. దీని విలువల దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. (చదవండి: అన్నదమ్ముల మధ్య ఈగో, డబ్బు సమస్యలు ఉండొద్దు: మనోజ్) ముంబైలోని అంత్యంత ఖరీదైన జై జుహు ప్రాంతంలో అమితాబ్ బంగ్లా ‘ప్రతీక్ష’ ఉంది. ఈ బంగ్లా అంటే అమితాబ్‌కు చాలా ఇష్టం. తన పేరెంట్స్‌తో కలిసి అమితాబ్ ఇక్కడే ఉండేవాడు. అంతేకాదు అభిషేక్, ఐశ్వర్యల పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇది మొత్తం 674 చదరపు మీటర్లు, 890.47 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు ప్లాట్స్‌లో విస్తరించి ఉంది. అమితాబ్ ఫ్యామిలీ ప్రస్తుతం జుహులో ఉన్న జల్సా బంగ్లాలో నివసిస్తోంది. View this post on Instagram A post shared by S (@shwetabachchan) -
కోహ్లి... నీకో బహుమతి: సచిన్
అహ్మదాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తన 49 సెంచరీల రికార్డును చెరిపేసిన కింగ్ కోహ్లికి అమూల్యమైన బహుమతిని బహూకరించాడు. 24 ఏళ్ల కెరీర్లో తన 10 నంబర్ జెర్సీ అంతర్జాతీయ క్రికెట్లో లిఖించిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఫైనల్‌కు ముందు సచిన్ స్వయంగా చేసిన ఆటోగ్రాఫ్ జెర్సీని కోహ్లికి అందజేశాడు. ఈ జెర్సీని సచిన్ 2012లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆఖరి వన్డే సందర్భంగా ధరించాడు. ‘ఈ ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక అనుభూతినిచ్చే గిఫ్ట్‌ను సచిన్... విరాట్‌కు అందజేశాడు’ అని బీసీసీఐ సచిన్, కోహ్లిల ఫోటోతో పోస్ట్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 50వ సెంచరీతో సచిన్ రికార్డు (49)ను బద్దలు కొట్టాడు. -
బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షతా మూర్తిని కలుసుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిషి సునాక్‌కు వినాయకుని విగ్రహాన్ని, భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు. జై శంకర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఖాతాలో .. ‘భారతదేశం- యూకేలు ప్రస్తుతం సంబంధాలను బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అందుకు ఇందుకు సహకారం అందిస్తున్న సునాక్‌కు ధన్యవాదాలు. వారి సాదర స్వాగతం, ఆతిథ్యం అద్భుతం" అని పేర్కొన్నారు. బ్రిటిష్ పీఎం రిషి సునక్ కూడా తన భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలలోని వివిధ అంశాలను సమీక్షించడం, స్నేహపూర్వక సంబంధాలలో కొత్త ఉత్సాహాన్ని కల్పించే లక్ష్యంతో జైశంకర్ ఐదు రోజుల బ్రిటన్ పర్యటన కోసం లండన్ చేరుకున్నారు. నవంబర్ 15న జైశంకర్ విదేశీ ప్రయాణం ముగియనుంది. జైశంకర్ తన పర్యటనలో పలువురు ప్రముఖులను కలుసుకోనున్నారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. దీనితోపాలు భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన దీపావళి ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: నీరుగారిన నిషేధం: పేలిన టపాసులు, ఎగిరిన తారాజువ్వలు! The Prime Minister @RishiSunak welcomed @DrSJaishankar to Downing Street this evening. Together they expressed their very best wishes as Indian communities around the world begin #Diwali celebrations. 🇬🇧🇮🇳 pic.twitter.com/gjCxQ0vr8d — UK Prime Minister (@10DowningStreet) November 12, 2023 -
ప్రియుడు ఖరీదైన గిఫ్ట్ ఇస్తే బ్రేకప్ చెప్పింది.. ట్విస్ట్ ఇదే!
తాజాగా ఇంటర్నెట్లో ఒక విచిత్ర ఉదంతం వైరల్‌గా మారింది. ఇటువంటి విషయాన్ని ఎవరూ ఎప్పుడూ వినివుండరు. ఒక యువకుడు తన ప్రియురాలికి ఆమె పుట్టినరోజు సందర్భంగా అత్యంత ఖరీదైన క్రూయిజ్ టికెట్ ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయి ఆనందంతో ఎగిరి గంతులేసేందుకు బదులు, ఆగ్రహంతో అతనికి బ్రేకప్ చెప్పింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక యువతి ఇటీవల తాను తన ప్రియుడి నుంచి విడిపోయానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ యువతి పోస్ట్‌లో ఇలా రాసింది.. ‘సముద్రాన్ని చూసినప్పుడు నాకు అనారోగ్యం వస్తుందని తెలిసి కూడా ఎందుకు నా కోసం క్రూయిజ్ టిక్కెట్ కొన్నావని నేను అతనిని అడిగాను. నేను కొన్ని నెలలుగా రెయిన్ఫేర్ ఫెస్టివల్ కోసం సిద్ధమవుతున్నానని కూడా అతనికి తెలుసు. తనకు క్రూయిజ్ ప్రయాణం ఇష్టమని నాతో చెప్పాడు. నాకు క్రూయిజ్ టిక్కెట్ కొన్నాడని తెలిశాక అతను ఎంత నీచమైనవాడో నేను గ్రహించాను. నా పుట్టినరోజున నేను ఎంత అనారోగ్యానికి గురైనా అతనికి అవసరం లేదు. అతనికి క్రూయిజ్ ప్రయాణం ఇష్టమని నేను కూడా అతనితో రావాలని అతను కోరుకున్నాడు. ఇది నాకు నచ్చక అతని నుంచి విడిపోయాను. అయితే నేను చెప్పిన బ్రేకప్ను అతను అంగీకరించడం లేదు. కొద్ది రోజుల్లో విబేధాలు సమసిపోతాయి’ అని ఆమె పేర్కొంది. ఆ యువతి రెడ్డిట్‌లో u/Helpful-Minimum8496 అనే ఖాతాతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది వేగంగా వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది ఆ యువతి అభిప్రాయానికి మద్దతుగా నిలిచారు. అలాగే తమ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేశారు. ఒక యూజర్ ఇలా రాశాడు..‘ఆ యువకుడు ఆమె ఆరోగ్యాన్ని గుర్తించి ఉంటే ఇలా జరిగేదికాదు. ఆ కుర్రాడి తీరు నీచమనిపిస్తోంది’ అని రాశారు. మరొక యూజర్ ఇలా రాశారు.. ‘అతను మీ అభిరుచులను పట్టించుకోకుండా, తన కోరికలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే మీరు అతనిని వదిలివేయడం ఉత్తమం’ అని రాశారు. ఇది కూడా చదవండి: ‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? -
రూ.1.3 కోట్ల కారులో బాబా రామ్‌దేవ్ - వీడియో వైరల్
ప్రముఖ యోగా గురువు 'బాబా రామ్‌దేవ్' సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 డ్రైవ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కారు ఎవరిదీ, దాని ధర ఎంత, ఇతర వివరాలు ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారుని పతంజలి CFA దివ్యాంశు కేసర్వాణి గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఆటో వార్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో రామ్‌దేవ్ బాబా ఈ కారుని కొనుగోలు చేయలేదని యూపీ ఈస్ట్ అండ్ సెంట్రల్ రీజియన్‌లోని పతంజలి గ్రూప్ సీఎఫ్ఓ ఇచ్చారని తెలిపారు. ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ధర సుమారు రూ. 1.3 కోట్లు వరకు ఉంటుంది. సెడోనా రెడ్ కలర్ షేడ్‌లో ఉన్న ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉండటం వీడియోలో చూడవచ్చు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదీ చదవండి: హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే.. నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొదటిది 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా రెండవది 3.0-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజిన్ 394 Bhp పవర్, 550 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 296 Bhp పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజన్లు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ & ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి. View this post on Instagram A post shared by AUTO WAAR (@auto.waar) -
కుమార్తెకు డర్టీ వాటర్ బాటిల్ గిఫ్ట్.. తండ్రి చెప్పే ‘జీవిత సత్యం’ ఇదేనట!
ఒక యువతి తన పుట్టినరోజున తన తండ్రి ఎటువంటి విచిత్రమైన బహుమతి ఇచ్చాడో ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన తండ్రి తనకు మురికి నీటితో నిండిన బాటిల్‌ను బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. అలాంటి బహుమతి ఇవ్వడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. ట్వట్టర్(ఎక్స్) యూజర్ ప్యాట్రిసియా మౌ తన పోస్టులో ‘ఈ సంవత్సరం నా పుట్టినరోజున, మా నాన్న నాకు మురికి నీటి బాటిల్‌ను బహుమతిగా ఇచ్చారు. నేను తమాషాకు చెప్పడం లేదు’ అని పేర్కొంది. ఇలాంటి బహుమతి పొందడం ఇదేమీ మొదటిసారి కాదని కూడా ఆమె చెప్పింది. ఇంతకు ముందు కూడా మా నాన్న నాకు అనేక బహుమతులు ఇచ్చారు. వాటిలో ప్రథమ చికిత్స కిట్, పెప్పర్ స్ప్రే, ఎన్సైక్లోపీడియా, కీ చైన్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఇచ్చిన బహుమతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దానిని డబ్బుతో కొనలేం. ఆ మురికి నీటి బాటిల్ జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. మురికి నీటితో కదులుతున్న బాటిల్ మన జీవితం లాంటిది. అయితే జీవితంలో మనం మన మనసును స్థిమితపరచుకున్నప్పుడు మనలోని మలినాలు 10 శాతం కంటే దిగువకు చేరుతాయి. మురికితో నిండిన బాటిల్‌ను స్థిరంగా ఉంచినప్పుడు ఇదే తెలుస్తుంది. సరిగ్గా ఇటువంటి దృక్ఫధాన్ని మనం కలిగివుండటం అవసరం అని ఆమె పేర్కొంది. ఆమె ఈ పోస్ట్‌ను అక్టోబర్ 2 న పోస్టు చేశారు. వైరల్‌గా మారిన ఈ పోస్టు ఇప్పటివరకూ 1.2 మిలియన్‌కు మించిన వీక్షణలు దక్కించుకుంది. ఈ పోస్ట్‌కు 5,900కు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘ఈ జీవిత పాఠాన్ని సేవ్ చేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న జనం? For my birthday this year, my dad gifted me a dirty bottle of water. Not kidding. In the past he’s gifted me: a first aid kit, pepper spray, an encyclopedia, a key chain, dedicated a book he wrote to me, etc. good ol dad gifts. He told me this years gift was extra special as… pic.twitter.com/N56AiGgErJ — Patricia Mou (@patriciamou_) October 2, 2023 -
మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్
యాపిల్ ఐఫోన్ తయారీదారు తైవాన్‌కు చెందిన పాక్స్కాన్(Foxconn) దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో దాని తయారీ సౌకర్యాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. భారతదేశంలో తన ఉద్యోగులను రెట్టింపు చేయాలని నిర్ణయించింది ఫాక్స్‌కాన్ ప్రతినిది లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఆదివారం ప్రధానమంద్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధి వి లీ ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించారు. "హ్యాపీ బర్త్‌డే, గౌరవ ప్రధానమంత్రి. మీ నాయకత్వంలో ఫాక్స్‌కాన్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందింది. వచ్చే ఏడాది గొప్ప బహుమతి అందించేలా మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశంలో వ్యాపార వృద్ధితోపాటు, రెట్టింపు ఉపాధిని అందించే లక్ష్యంతో మరింత కష్టపడి పని చేస్తామంటూ ప్రకటించారు. చైనాఆంక్షల నేపథ్యంలో అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఇండియాపై దృష్టిపెడుతోంది. తద్వారా ఐఫోన్ విక్రయాలకు పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని కంపెనీ చూస్తోంది. తమిళనాడు ప్లాంట్‌లో ఇప్పటికే 40వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. (మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!) ఫాక్స్‌కాన్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో, ఫాక్స్‌కాన్ రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులలో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కర్ణాటక ప్రకటించింది. ఇక్కడ ఐఫోన్ల కేసింగ్ కాంపోనెంట్స్ , చిప్ తయారీకి సంబంధించిన పరికరాల ఉత్పత్తికానున్నాయి. మరోవైపు తెలంగాణలోఇటీవల మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆ సంస్థ మొత్తం 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) గత నెలలో ఎర్నింగ్స్ బ్రీఫింగ్ సందర్భంగా, ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లియు యంగ్-వే ఇండియా మార్కెట్‌పై భారీ ఆశలే ప్రకటించారు. మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రారంభం మాత్రమేనని పేర్కొనడం గమనార్హం. -
వెంటనే ఉత్తరం రాస్తే.. ఈ బహుమతి మీకే..!
ఆదిలాబాద్: నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్, ఈ–మెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. ఐదు దశాబ్దాల ముందుకు వెళ్తే ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం లేఖల ద్వారానే జరిగాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారాన్ని ఉత్తరం, టెలిఫోన్, టెలిగ్రామ్ ద్వారా తెలుసుకునే పరిస్థితి ఉండేది. సెల్‌ఫోన్ వినియోగం.. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడకం తర్వాత సమాచార వ్యవస్థలో విప్లవం వచ్చిందని చెప్పవచ్చు. నేటి తరానికి ఇంచుమించుగా ఉత్తరం అంటే తెలియని పరిస్థితి ఉంది. అందుకే ఉత్తరాన్ని తిరిగి పరిచయం చేసేందుకు, తెలిసిన వారికి మరోసారి గుర్తు చేసేందుకు తపాలాశాఖ నడుం బిగించింది. లేఖరులకు పోటీ పెడుతోంది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉత్తరాలకు ప్రాధాన్యం తగ్గింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియజేయాలన్నా, వ్యాపార అవసరాల ని మిత్తం సమాచారం పంపించాలన్నా ఒకప్పుడు పె న్ను, పేపరు తీసుకుని లేఖలు రాసేవారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కానరాదు. మొబైల్ ఫోన్ ద్వారా స మస్త సమాచారాన్ని క్షణాల్లో వివిధ మార్గాల్లో చేరవేస్తున్నారు. ఫోన్లోనే ప్రత్యక్షంగా వాయిస్ కాల్, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఖండాంతరాల్లో ఉన్న వారితో సైతం వీడియో కాల్ ద్వారా మాట్లాడే పరిస్థితి ఉండడంతో లేఖల ద్వారా ఉత్తర, ప్రత్యుత్తరాలు మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఒకప్పటి సమాచార సాధనమైన ఉత్తరాన్ని నేటి యువతరానికి గుర్తు చేసేందుకు తపాలా శాఖ లేఖారచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ‘థాయి ఆఖర్’ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. బహుమతులు ఇలా.. రెండు కేటగిరీల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి 12 మందికి మించకుండా ప్రథమ రూ.25 వేలు, ద్వితీయ రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు, జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10 వేల నగదు అందజేస్తారు. సద్వినియోగం చేసుకోవాలి.. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సదవకాశం. వయసుతో పనిలేకుండా ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన అంశానికి సంబంధించి స్వదస్తూరితో వ్యాసం రాసి పోస్ట్ చేయాలి. – ఎన్.అనిల్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాలా శాఖ పర్యవేక్షకులు రెండు విభాగాల్లో.. ఈ పోటీల్లో భారతదేశ పౌరులు పాల్గొనవచ్చు. 18 ఏళ్ల లోపు వారికి ఒక కేటగిరీ, ఆపై వారిని మరో కేటగిరీగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపర్చారు. ఎ4 సైజ్ పేపరుపై రాసి ఎన్వలప్ కవర్లో పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్‌ల్యాండ్ లెటర్ అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. వ్యాసం చేతితో మాత్రమే రాసి పంపించాలి. లేఖలు పంపించేవారు వారి వయసును నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయస్సు, ఐడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ఎస్పీవోఎస్, ఆదిలాబాద్ డివిజన్ చిరునామాకు అక్టోబరు 31లోగా పంపించాలి. -
నాగార్జునకు రైతు బిడ్డ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్-7 సెప్టెంబర్ 3న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈసారి ఎవరూ ఊహించని విధంగా 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ సీజన్లో ఎప్పటినుంచో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాలని కలలు కంటున్న ఓ రైతు బిడ్డ కూడా ఉన్నారు. అతనే పల్లవి ప్రశాంత్. రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనేది తన కల చాలాసార్లు చెప్పేవాడు. చివరికీ ఈ సీజన్లో అతని కల నెరవేరింది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్-7తో అతని కల ఫలించింది. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే నాగార్జునకు అదిరిపోయే గిఫ్ట్ తీసుకెళ్లాడు. రైతు బిడ్డగా తన పొలంలో పండించిన బియ్యాన్ని నాగార్జునకు బహుకరించాడు. మా బాపు మీకు గిఫ్ట్‌గా పంపిచారంటూ బస్తాను మోసుకెళ్లి మరీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడుతూనే ఒక రైతు బిడ్డ ఎలా ఉంటాడో చూపించాడు. కాగా.. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. షోలో పార్టిసిపేట్ చేయాలన్న కల నెరవేర్చుకున్నాడు. మరీ రాబోయే రోజుల్లో హౌస్‌లో రైతు బిడ్డ గేమ్ ఎలా ఉండబోతుందో తేలనుంది. ఎగతాళి చేశారు 'ఉద్యోగం చేయాలంటే ఒకరి కింద బతకాలి.. కానీ ఇక్కడ పని చేసుకుంటే నేను, నా కుటుంబం బతుకుతుంది. నలుగురి కడుపు నింపుతామన్న సంతోషం ఉంటుంది. ఫోక్ సాంగ్స్ చేస్తే దాని ద్వారా వచ్చిన డబ్బు నా స్నేహితులు తీసేసుకుని మోసం చేశారు. నేను చచ్చిపోతా అంటే మా నాన్న కూడా చచ్చిపోతా అన్నాడు. అప్పుడే నేను సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం మొదలుపెట్టాను. కొందరు ఎంకరేజ్ చేశారు, మరికొందరు ఎగతాళి చేశారు. బిగ్‌బాస్ కోసం ఒక అడుగు ముందుకేశా. రైతుబిడ్డగా గర్వపడుతున్నా' అన్నాడు పల్లవి ప్రశాంత్. ‘బాపు’ అంటే తెల్వకపోతే ఎట్ల కాక నీకు @iamnagarjuna 🥲 pic.twitter.com/SGzOk2Zd0H — 🅺🅳🆁 (@KDRtweets) September 4, 2023 Finally You Made it Wish you All the best for #BiggBossTelugu7 #PallaviPrasanth pic.twitter.com/LUBaPVWIkR — Vinay (@vinayHere3) September 3, 2023 -
ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు బుడ్డోడు సర్ప్రైజ్ గిఫ్ట్
ఢిల్లీ:చంద్రయాన్ 3 విజయంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ పట్ల ప్రశంసల వెల్లువ కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సోమనాథ్‌కు ఓ చిన్నారి నుంచి అరుదైన బహుమతి అందింది. జాబిల్లిపై వాలిన విక్రమ్ ల్యాండర్ నమూనాను చేతితో తయారు చేసిన పిల్లాడు.. దానిని ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు బహుకరించాడు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంకటకృష్ణన్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చంద్రయాన్ 3 విజయంతో దేశంలో వచ్చే తరాలకు ఎంతో ప్రోత్సాహం అందించారని సోమనాథ్‌ను కొనియాడారు. ఆ బాలున్ని ఆసక్తిని మెచ్చుకున్నారు. భవిష్యత్‌లో ఎందరో పిల్లలు శాస్త్రవేత్తగా ఎదగాలనుకుంటారు. బాలునికి శుభాకాంక్షలు అని తెలిపారు. ISRO Chief Sri Somanath today had a surprise visitor,A young neighbour boy has handed over own made Vikram Lander model to the ISRO chief on behalf of all the neighbours. pic.twitter.com/BcyHYO0pDW — Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 2, 2023 చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ఆగష్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇస్రో చీఫ్ సోమనాథ్ విమానంలోకి ఎక్కగానే.. ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ ఆయన్ని అభినందించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3తో పాటు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్1ను కూడా ప్రయోగించింది. సూర్యూనిపై పరిశోధనలు జరపడానికి ఈ మిషన్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. 125 రోజుల పాటు ప్రయాణం చేసి సూర్యుని గుట్టు విప్పే పనిలో ఆదిత్య ఎల్ 1 నిమగ్నమవనుంది. ఇదీ చదవండి: Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్.. -
జైలర్ డైరెక్టర్‌కు జాక్‌పాట్.. చెక్, కోట్ల ఖరీదు చేసే లగ్జరీ కారు!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా భాటియా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది. (ఇది చదవండి: వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !) కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది. ఈ మూవీ ఘనవిజయంతో చిత్రబృందం ఫుల్ ఖుషీలో ఉన్నారు. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత హీరో రజినీకాంత్‌తో పాటు డైరెక్టర్ దిలీప్ కుమార్‌కు వాటాతో పాటు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. భారీ హిట్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగా దిలీప్ కుమార్‌కు సైతం కోట్ల విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును బహుకరించారు. దీంతో పాటు చెక్‌ను కూడా అందజేశారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పటికే తలైవాకు రూ.100 కోట్ల చెక్‌తో పాటు బీఎండబ్లూ కారును కూడా అందజేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ చిత్రంలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, టైగర్ ష్రాఫ్, సునీల్, వినాయకన్, వసంత్ రవి, మర్నా, యోగి బాబు, జాఫర్ సాదిక్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత!) Mr.Kalanithi Maran congratulated @Nelsondilpkumar and handed over a cheque to him, celebrating the Mega Blockbuster #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/b6TGnGaFd6 — Sun Pictures (@sunpictures) September 1, 2023 -
అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తున్నారా.. ఐటీ రూల్స్ ఏంటో తెలుసా?
తోబుట్టువుల మధ్య అపురూపమైన బంధానికి అపూర్వ ప్రతిక రక్షా బంధన్. సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ తమ బంధం జన్మ జన్మలకూ కొనసాగాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడతారు. ఇక తమ సోదరీమణులకు ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలగాలంటూ అన్నాతమ్ముళ్లు తమ శక్తిమేరకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు బహుమతులు లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కాలంతో పాటు ట్రెండ్స్ మారుతున్నాయి. కానీ స్థిరంగా ఉన్న ఒక విషయం కొనసాగుతోంది. అదే సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ రక్షా బంధన్ సందర్భంగా సోదరికి ఎంత డబ్బు బహుమతిగా ఇవ్వవచ్చు.. దీనిపై ట్యాక్స్ ఉంటుందా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఎలా ఉన్నాయి.. నిపుణులు ఏం చెబుతున్నారు...? తెలుసుకుందాం. రూ.2 లక్షలకు మించితే.. ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేవైనా ఇతర చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బహుమతి ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అది నగదు బహుమతికైనా సరే ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి బహుమతి ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ ఉంటుందా? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం బహుమతులు గ్రహీతల చేతిలోకి వెళ్లాక పన్ను ఉంటుంది. అయితే కొంతమంది నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే పన్నుల ప్రభావం లేకుండా షేర్లను సోదరికి బదిలీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం.. అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తే.. ఇచ్చేవారికి కానీ, తీసుకునేవారికి కానీ ఎలాంటి ట్యాక్స్ పడదు అని పేర్కొంటున్నారు. -
రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం..
రాయ్‌పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది రాఖీ పౌర్ణమి. సంతోషంగా జీవతాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ అన్నదమ్ముల్లకు ఆడపిల్లలు రాఖీ కడుతారు. వారి రక్షణ ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటారు. పండగపూట సోదరి కళ్లలో ఆనందం చూడటానికి ఓ మంచి గిఫ్ట్‌తో అన్నాదమ్ముళ్లు సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. చత్తీస్‌గఢ్‌లో మాత్రం ఓ సోదరి తమ్ముడి మీద ప్రేమతో ఓ కిడ్నీనే దానంగా ఇస్తోంది. ఓం ప్రకాశ్(48), ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌వాసి. గత ఏడాది మే నెల నుంచే అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఓ కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం వ్యాధి బారినపడ్డాయి. డయాలసిస్‌తో కాలం వెల్లదీస్తున్నాడు. అనేక ఆస్పత్రులకు తిరిగిన అనంతరం కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. దీంతో కిడ్నీదాత కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ్ముడి కోసం ఓం ప్రకాశ్ పెద్ద అక్క శీలాభాయ్ పాల్ ముందుకు వచ్చింది. రాయ్‌పూర్‌లోని టిక్రపారలో ఉంటున్న ఆమె తమ్ముడి సమస్య తెలిసి వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. పరీక్షల అనంతరం ఆమె కిడ్నీ ఓం ప్రకాశ్‌కు సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆపరేషన్ జరనుంది. తమ్ముడంటే ప్రేమ అని తెలిపిన శీలాభాయ్.. అతనితో కలిసి జీవితాంతం బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ఇంకా మూడు రోజులు ఉండగా.. నేడు శీలాభాయ్ తన తమ్ముడు ఓం ప్రకాశ్‌కి రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించింది. ఇదీ చదవండి: Raksha Bandhan 2023 Special: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా! -
ఆనంద్ మహీంద్ర గిప్ట్‌కు: ప్రజ్ఞానంద రియాక్షన్ ఇదీ!
RPraggnanandhaa Reacts Parents Long Term Dream పారిశ్రామికవేత్త, బిలియనీర్ తన తల్లి దండ్రులకు ప్రకటించిన బహుమతిపై భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ఫైడ్ చెస్ ప్రపంచ కప్ రన్నర్ అప్ ఆర్ ప్రజ్ఞానంద స్పందించారు. ఒక ఎలక్ట్రిక్ కారుకోసం కల గన్న తన అమ్మా నాన్నల చిరకాల వాంఛను ("లాంగ్ టర్మ్ డ్రీమ్") తీర్చినందుకు ధన్యవాదాలు సార్ అంటూ ప్రజ్ఞానంద ట్వీట్ చేశారు. తన కృతజ్ఞతను తెలియజేయడానికి పదాలు లేవు...చాలా ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజ్ఞానంద సాధించిన ఘనతకు గౌరవంగా అతని తల్లిదండ్రులకు ఆల్-ఎలక్ట్రిక్ SUVని బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించిన సంగతి తెలిసిందే. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) కాగా పిల్లవాడి ఆసక్తిని గమనించి, ప్రోత్సహించిన ప్రజ్ఞానంద పేరెంట్స్ నాగలక్ష్మి రమేష్‌బాబులను ఆనంద్ మహీంద్ర అభినందించారు. ఇందులో భాగంగానే వారికి ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు దేశంలో తల్లిదండ్రులు దీన్ని ప్రేరణగా తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మహీంద్ర ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ప్రత్యేక ఎడిషస్ను ఆ దంపతులకు ఇవ్వనున్నామని మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో బదులిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. No words to express my Gratitude 🙏 Thankyou very much @anandmahindra sir and @rajesh664 sir It is a long term dream of my parents to own an EV car thanks for making it a reality! https://t.co/YWCK1D99ik — Praggnanandhaa (@rpragchess) August 29, 2023 Sky is the limit! @rpragchess and @GM_JKDuda showed us that the mind of a genius knows no bounds! #chess #mind pic.twitter.com/TWzvPefBNV — WR_Chess_Masters (@wr_chess) August 29, 2023 -
గ్యాస్ బండ రూ. 200 తగ్గింది
వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయానికిఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక.– అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.200 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. మధ్యప్రదేశ్‌తోపాటు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే చౌక ధరకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ బండ ధరను రూ.200 చొప్పున తగ్గిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో గత రెండేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,103 ఉండగా, బుధవారం నుంచి రూ.903కు లభించనుంది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులు వంట గ్యాస్ సిలిండర్‌పై ఇప్పటికే రూ.200 చొప్పున రాయితీ పొందుతున్నారు. తాజా తగ్గింపు ధర వారికి కూడా వర్తిస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ రూ.703కే పొందవచ్చు. అంతేకాకుండా ఉజ్వల యోజన కింద అదనంగా 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్య 10.34 కోట్లకు చేరుకోనుంది. ఎన్నికలతో సంబంధం లేదు: మంత్రి ప్రజలకు ఉపశమనం కలి్పంచడానికే వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక అని వివరించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే గ్యాస్ ధరను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేసింది. నిత్యావసరాలు సరసమైన ధరలకే ప్రజలకు అందాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సోదరీమణులకు ఉపశమనం: మోదీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా వెలువడిన ఈ నిర్ణయం కుటుంబాల్లో సంతోషాన్ని పెంచుతుందని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు మరింత ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. తన సోదరీమణులంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఎన్నికల వ్యూహమే!? రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. -
అమ్మకు బహుమతిగా చందమామపై స్థలం!
గోదావరిఖని (రామగుండం): తల్లిపై ప్రేమతో వినూత్న కానుక ఇవ్వాలని ఆ కుమార్తె భావించింది. ఇందుకోసం ఏకంగా చందమామపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా అందించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత. ఆమె అమెరికాలోని ఐయోవాలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా లూనార్ రిజిస్ట్రీ వెబ్సైట్లో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎకరం భూమిని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రూ.35 లక్షలు చెల్లించి తన తల్లి వకుళాదేవి పేరిట దానిని రిజిస్టర్ చేయించానని వివరించారు. ఈ మేరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా వచ్చేశాయన్నారు. -
మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
ఈ ఏడాది మెగా ఇంట్లో పెద్ద పండగే జరిగింది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. జూన్ నెలలో రామ్ చరణ్ భార్య ఉపాసనకు బేబీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ తన మనవరాలి పేరును ప్రకటించారు. గతనెలలో నామకరణం ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) అయితే మెగా వారసురాలికి వచ్చిన గిఫ్ట్‌లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బిడ్డకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ పంపినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను మెగా ఫ్యామిలీ కొట్టిపారేసింది. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన మెగా వారసురాలికి మెగాస్టార్ ఏ గిఫ్ట్ ఇచ్చారనే విషయంపై ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కానీ తన మనవరాలికి చిరంజీవి దంపతులు ఓ చిరు కానుక ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ దంపతులు తమ మనవరాలు క్లీంకారకు ఆంజనేయస్వామి రూపంతో ఉన్న బంగారు డాలర్స్‌ను అందమైన డిజైన్‌తో తయారు చేయించి ఇచ్చినట్లు ఉపాసన వెల్లడించింది. మెగా ఫ్యామిలీ హనుమాన్ భక్తులు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి ఆంజనేయస్వామిని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే తన మనవరాలికి ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఉయలను గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది..!! కాగా.. ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!) ప్రెగ్నెన్సీ జర్నీపై ఉపాసన మాట్లాడుతూ.. 'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు' అని అన్నారు. -
తమన్నాకి ఉపాసన రెండు కోట్ల డైమండ్ గిఫ్ట్
-
ఊహించని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు.. చూడగానే టీచర్ ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు
చెన్నై: తల్లి, తండ్రి, గురువు అంటారు.. వీళ్లు ముగ్గురు జీవితంలో చాల కీలకమైన వాళ్లుగా మన పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు నీకు ఆలనాపాలనా చూస్తే , గురువులు నీకు విద్యా బుద్దులు నేర్పించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి గురువుకి కొందరు విద్యార్థులు ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా ఊహించిన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ ఘటన తిరువారూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి తమ గుర్తుగా ఓ చిరు కానుకను అందజేశారు. తిరువారూరు జిల్లా ముత్తుపేట సమీపంలోని అలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రామన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన 1988 జూన్ 27న ఈ స్కూల్లో చేరి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ క్రమంలో రామన్ ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని మాలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఆయనకు రూ.లక్ష విలువైన ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందజేశారు. ఉపాధ్యాయుడు రామన్‌ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. విద్యార్థులు తనపై చూపిన ప్రేమకు ఆ ఉపాధ్యాయుడికి ఆనందంతో కంట కన్నీళ్లు ఆగలేదు. చదవండి: బస్సు వైపు కోపంగా దూసుకొచ్చిన ఏనుగు.. ఇదే చివరి రోజు అనుకున్నారు.. కానీ ఫైనల్‌గా -
వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక
న్యూఢిల్లీ: వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కృపాణ్‌ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది. -
నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా కాబోయే చోటి బహు (చిన్న కోడలు) రాధికా మర్చంట్‌కి అత్తగారు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట. అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్‌కి నీతా అంబానీ ఒక అందమైన బహుమతి ఇవ్వడం వైరల్‌గా మారింది. నీతా, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో నిశ్చితార్థం తరువాత రాధికా మర్చంట్ అంబానీ కుటుంబంలో కీలక వ్యక్తిగా మారిపోవడమే కాదు, అత్తమామలతో పాటు, తోటికోడలు శ్లోకా మెహతా, ఆడపడుచు ఇషా అంబానీ కుటుంబాలతో బాగా కలిసి పోయింది. ఏ ఈవెంట్లో చూసిన వారితో సందడి చేస్తోంది. (హెచ్డీఎఫ్సీ సీఈవో శశిధర్ వార్షిక వేతనం ఎంతో తెలుసా? ) తాజాగా నీతా అంబానీ తన కాబోయే కోడలు రాధికా మర్చంట్ కోసం సిద్ధం చేసిన అందమైన గిఫ్ట్ హ్యాంపర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, తులసి మొక్కతోవెండి కుండీతోపాటు పాటు, వెండి అగరుబత్తీ స్టాండ్, లక్ష్మీ-గణేష్ విగ్రహాలసెట్ను చూడవచ్చు. అంతేకాదు తెల్ల చామంతి పువ్వులతో అద్భుతంగా అలంకరించిన ఈ స్పెషల్ హాంపర్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో ) జనవరిలో గుజరాతీ సంప్రదాయాల ప్రకారం సాంప్రదాయ 'గోల్ ధన' వేడుకలో రాధికా మర్చంట్ ,అనంత్ అంబానీ నిశ్చితార్థం చేసుకున్నారు. నీతా అంబానీ మాదిరిగానే రాధికా మర్చంట్ కూడా అందమైన భరతనాట్యం నృత్యకారిణి కూడా. జూన్ 2022లో, 'ది గ్రాండ్ థియేటర్' (జియో వరల్డ్ సెంటర్)లో ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. (సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?) -
చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్
రామ్ చరణ్-తారక్ వీరిద్దరూ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటుతూ ఆస్కార్ అవార్డును కొల్లగొట్టారు. RRR సినిమా కంటే ముందు నుంచే వారిద్దరి మధ్య సోదర బంధం ఉంది. ఇద్దరిలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే.. ఇంట్లో వాళ్ల కళ్లు గప్పి.. ఇద్దరం బయటికి చెక్కేస్తామని కూడా వారు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. చరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ముందే.. మొదట ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెర్రీ చెప్పాడు. అంతలా వారి మధ్య స్నేహం ఉంది కాబట్టే జక్కన్న RRR సినిమా చేయగలిగాడని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?) రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లైన 10ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే ఆ పాపకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు. మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా చెర్రీ దంపతుల గారాల పట్టీకి బహుమతులు భారీగానే అందాయి. అందులో భాగంగగానే జూ. ఎన్టీఆర్ కూడా క్లీంకార కోసం ప్రత్యేకమైన కానుకను పంపించారట. ఆ గిఫ్ట్ కూడా తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్‌లు ఎంతో ఇష్టంగా అందించినట్లు తెలుస్తోంది. చరణ్,ఉపాసన,క్లీంకార ముగ్గురి పేరుతో ఉన్న బాంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి గిఫ్ట్‌గా పంపించారని తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే ఉంటుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఎందుకంటే చరణ్-తారక్ స్నేహ బంధం అలాంటిది. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) -
ప్రస్తుతం ట్రెండ్ ఇదే! పుట్టినరోజు ఊహించని బహుమతి.. ఉబ్బితబ్బిబ్బైన మహిళ
ముంబై: ప్రస్తుతం దేశంలో టమాటా ట్రెండింగ్‌లో ఉంది. గతంలో అర్థసంచరీ కూడా లేని టమాట.. తాజా పరిస్థితుల నేపథ్యంలో సెంచరీ దాటేసి త్వరలోనే డబుల్ సంచరీ టచ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. అంతేనా టమాటాలు విలువైన వస్తువుల జాబితాలోకి వెళ్లిపోయాయి. ఎంతలా అంటే పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలకు విలువైన వస్తువుగా టామాటాలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ మహిళ పుట్టిన రోజు వేడుకలకు టమాటాలను బహుమతిగా ఇవ్వడం ఇది హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కళ్యాణ్‌లోని కొచ్చాడి ప్రాంతానికి చెందిన సోనాల్ బోర్స్ అనే మహిళ ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ వేడుకలో ఆమె ఊహించని బహుమతిని అందుకుంది. ఆమె బంధువుల గిఫ్ట్‌గా 4 కిలోల టమాటాలను ఓ బుట్టలో తీసుకొచ్చి ఇచ్చారు. ఈ టమాటాలను చుట్టూ పెట్టుకుని సోనాల్ కేక్ కట్ చేసింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టమాటాలను బహుమతిగా అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకంటే మంచి బహుమతి ఇంకేం ఉంటుందని సోనాల్ ఆనందం వ్యక్తం చేసింది. చదవండి: నిరుద్యోగ కార్మికుడికి రూ.24. 61 లక్షల పన్ను కట్టమంటూ నోటీసులు.. -
చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!
ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన కోలీవుడ్ చిత్రం మామన్నన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మరి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం థియేట్రికల్‌గా సక్సెస్ కావడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రమే ఉదయనిధి స్టాలిన్ కెరీర్లో చివరి చిత్రంగా నిలవనుంది. దీంతో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకుడికి హీరో సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..!) చివరి చిత్రం సక్సెస్ ఇచ్చినందుకు దర్శకుడు మరి సెల్వరాజ్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. లగ్జరీ కారు మిని కూపర్‌ను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈ కారు విలువు దాదాపు రూ.40 నుంచి 45 లక్షల ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ తన ట్వీట్లో రాస్తూ..'ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను కథ, ఫీల్డ్‌కు సంబంధించిన ఆలోచనలను పంచుకుంటారు. అంబేద్కర్, పెరియార్, అన్నా, కలైనార్ వంటి నాయకులు యువ తరంలో ఆత్మగౌరవ భావాన్ని, సామాజిక న్యాయ ఆలోచనలను పెంపొందించారు. మామన్నన్ చిత్రం వాణిజ్యపరంగా కూడా భారీ విజయం సాధించింది. మరి సెల్వరాజ్ సార్‌కి మినీ కూపర్ కారును అందించడం ఆనందంగా ఉంది. మామన్నన్తో ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినందుకు సెల్వరాజ్‌కి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..! ) ஒவ்வொருவரும் ஒவ்வொரு விதமாக விவாதிக்கிறார்கள். தங்களுடைய எண்ணங்களை கதையுடனும் களத்துடனும் தொடர்புபடுத்தி கருத்துகளை பகிர்கிறார்கள். உலகத் தமிழர்களிடையே விவாதத்துக்குரிய கருப்பொருளாக மாறியிருக்கிறது. அம்பேத்கர், பெரியார், அண்ணா, கலைஞர் போன்ற நம் தலைவர்கள் ஊட்டிய சுயமரியாதை உணர்வை,… pic.twitter.com/ro4j7epjAI — Udhay (@Udhaystalin) July 2, 2023 -
శంకర్ కి కమల్ హాసన్ స్పెషల్ గిఫ్ట్
-
యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్:ఈ కానుక ఏ తీరాలకి..?..ప్రత్యేకతలివే..!
► పసిఫిక్ మహా సముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడాన్ని సముద్రం చుట్టూ ఉన్న దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం కేవలం డ్రాగన్దేనంటే ఊరుకోబోమని అందులో తమకూ భాగం ఉందని గళమెత్తుతున్నాయి. అలాంటి దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. చైనా పొరుగునే ఉన్న వియత్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకి అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. భావసారూప్యత కలిగిన భాగస్వామ్య దేశమైన వియత్నాం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నది భారత్ వ్యూహంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం పెరుగుతున్న కొద్దీ ప్రపంచ పటంలో కొత్త మార్పులు వస్తాయన్న ఆందోళనలున్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంతో మన దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రక్షణ రంగంలో సహకరించుకుంటున్నాం. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ పెత్తనం సహించలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ భారతదేశ పర్యటనకు వచి్చనçప్పుడు ఈ యుద్ధ నౌకను కానుకగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు భారత్ ఎన్నో మిత్ర దేశాలకు మిలటరీ సాయాలు చేసింది. మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న చిన్న పడవలు, మిలటరీ పరికరాలు ఇచి్చంది. మయన్మార్‌కు ఒక జలాంతర్గామిని ఇచి్చంది. కానీ వియత్నాంకు క్షిపణిని మోసుకుపోగలిగే సామర్థ్యమున్న యుద్ధ నౌకను ఇవ్వడం వల్ల ఆ తీరంలో చైనా కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుందన్నది భారత్ ఉద్దేశంగా ఉంది. ప్రత్యేకతలివే..! ► ఐఎన్ఎస్ కృపాణ్ ఖుక్రీ క్లాస్‌కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధనౌక. 1,350 టన్నుల బరువైన, సముద్రజలాలను పక్కకు తోసేస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్లగల శక్తివంతమైన నౌక ఇది. ► పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్లు రూపొందించిన ఈ నౌక గత కొన్నేళ్లుగా మన నావికా దళానికి గర్వకారణంగా ఉంది. ► 1991 జనవరి 12న దీనిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.. 25 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ► మీడియం రేంజ్ గన్స్ అంటే 30 ఎంఎం తుపాకీలను ఈ నౌకకు అమర్చవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, చాఫ్ లాంచర్స్ వంటి వైవిధ్యమైన పనులు చేయగలదు. ► తీరప్రాంతాల్లో భద్రత, గస్తీ, కదనరంగంలో పాల్గొనడం, యాంటీ పైరసీ, విపత్తు సమయాల్లో మానవతా సాయం వంటివి చేయగల సామర్థ్యముంది. ► భారత్ నావికాదళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్‌ను కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఇచ్చింది. విదేశాలకు ఒక నౌకని బహుమతిగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నౌక విశాఖ నుంచి ఈ నెల 28 బుధవారం వియత్నాంకు బయల్దేరి వెళ్లింది. 2016 నుంచి భారత్, వియత్నాం మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మనం ఎన్నో దేశాలకు మిలటరీ సాయం చేశాము. కానీ కోట్లాది రూపాయల విలువ చేసే యుద్ధ నౌకను ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు ? ఎందుకీ నిర్ణయం? దీని వల్ల భారత్‌కు ఒరిగేదేంటి ? దక్షిణ చైనా సముద్రం వివాదమేంటి? ► దక్షిణ చైనా సముద్రంపై సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సముద్ర భూభాగంపై సార్వ¿ౌమాధికారాన్ని ప్రకటించుకున్న చైనా ఏకంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఈ సముద్రంలో ఎన్నో దీవులున్నాయి. మత్స్య సంపద అపారంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15 శాతం ఈ సముద్రంలో జరుగుతుంది. దీనిపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం ఇతర దేశాలకు మింగుడు పడడం లేదు.ఈ సముద్రంలో ఉన్న అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ చైనా విడుదల చేసిన ‘‘నైన్ డ్యాష్ లైన్’ మ్యాప్‌తో తనవేనని వాదిస్తోంది. ఈ సముద్రంలో భారీగానున్న చమురు నిల్వలపై అన్వేషణ కూడా ప్రారంభం కావడంతో దేశాల మధ్య పోటీ ఎక్కువైంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం మధ్యలో దక్షిణ చైనా సముద్రం ఉండడం వల్ల అక్కడ చైనా జోక్యం పెరిగితే భారత్‌కూ నష్టమే. ఈ సముద్రం చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలున్నాయి. ఇవి కూడా సముద్రంలో తమకూ వాటా ఉందని ప్రకటించాయి. మరోవైపు చైనా కృత్రిమ దీవులు, సైనిక స్థావరాలతో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య మనం పంపిన కృపాణ్ దక్షిణ చైనా జలాల్లో ఎంత మేరకు నిఘా పెడుతూ డ్రాగన్‌కు చెక్ పెడుతుందో వేచిచూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!
ఈ ఏడాది మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. దాదాపు పెళ్లయిన 11 ఏళ్లకు మెగాస్టార్ ఇంట్లో మనవరాలు అడుగుపెట్టింది. దీంతో మెగాఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే కాకుండా జూన్ 30న తన మనవరాలికి బారసాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన బిడ్డకు ప్రముఖ బిజినెస్మెన్ ముకేశ్ అంబానీ దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు ఊయలను బహుమతిని ఇచ్చారని నెట్టింట చర్చ మొదలైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) అయితే ఈ వార్తలపై రామ్ చరణ్ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఉయ్యాలనే ఈ వేడుకల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఉపాసనకు ప్రజ్వల ఫౌండేషన్ చెక్కతో తయారు చేసిన ఊయలను అందించింది. ఈ విషయాన్ని ఉపాసన తన ఇన్‌స్టాలో కూడా పంచుకుంది. దీంతో అంబానీ ఖరీదైన బహుమతి ఇచ్చారన్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఇవాళ జరగిన బారసాల కార్యక్రమంలో మెగాస్టార్ మనవరాలితి క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. (ఇది చదవండి: హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ స్పెషల్ గిఫ్ట్
దాదాపు పదకొండు ఏళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసింది. మంగళవారం మెగా కుటుంబానికి సెంటిమెంట్.. అదేరోజు వారి ఇంట్లోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టడంతో సంబురాలు చేసుకున్నారు. దీంతో లక్ష్మీ దేవిలా వారి కుటుంబంలో సందడి తెచ్చిందని బావించారు. ఆమె రాకతో మెగా కుటుంబమే కాదు మెగా ఫ్యాన్స్ సైతం సంతోషంతో సంబురాలు చేసుకున్నారు. ఇక పాప జాతకం కూడా చాలా బాగుందని చిరంజీవి కూడా అన్నారు. పలువురు జ్యోతిష్యులు కూడా పాప జాతకం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు కూడా. (ఇదీ చదవండి: రామ్ చరణ్-ఉపాసన కూతురి పేరు ఫైనల్ చేసేశారు) తాజాగా మెగా ప్రిన్సెస్‌కు నేడు (జూన్ 30)న పేరు పెట్టబోతున్నట్లు ఉపాసన తెలిపింది. దీంతో మెగా వారసురాలి బారసాల కార్యక్రమం నేడు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్- ఉపాసన దంపతులకు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ నుంచి ఒక కానుక వచ్చిందని ప్రచారం జరుగుతుంది. బంగారంతో తయారు చేసిన ఊయలను పాప కోసం అంబానీ పంపారట. అందుకోసం కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారికంగా ఎవరూ ప్రకటన చేయలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా, ఎక్కడంటే?) -
డైరెక్టర్‌కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్.. ఎన్ని లక్షలో తెలుసా?
సాధారణంగా సినిమా విడుదలై, అది హిట్ కొట్టిన తర్వాత సదరు దర్శకులకు ఖరీదైన బహుమతులని నిర్మాతలు ఇస్తుంటారు. 'విరూపాక్ష' డైరెక్టర్ కార్తీకవర్మకు అలానే రీసెంట్గా బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారు. తాజాగా విలక్షణ నటుడు కమల్‌హాసన్ మాత్రం తన సినిమా విడుదలకు చాలా నెలల ముందే దర్శకుడు శంకర్‌ని సర్ప్రైజ్ చేశాడు. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అల్లాడిపోయిన కమల్ హాసన్‌కు 'విక్రమ్' బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని ఇచ్చింది. దీంతో అదే ఊపుతో 'ఇండియన్ 2' చేస్తున్నాడు. 2001లో వచ్చిన 'ఇండియన్' చిత్రానికి ఇది సీక్వెల్. తెలుగులోనూ 'భారతీయుడు' పేరుతో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు తీస్తున్న రెండో భాగంపైనా మంచి అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) అందుకు తగ్గట్లే సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాల్ని చూసిన కమల్ హాసన్ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఈ క్రమంలోనే దాదాపు రూ.8.77 లక్షల విలువైన పనేరాయ్ ల్యూమినార్ చేతివాచీని శంకర్ కి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని చెబుతూ ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. గతంలో సూర్యకి రోలెక్స్ ఇచ్చిన కమల్.. ఇప్పుడు శంకర్ కి పనేరాయ్ ఇచ్చారు. నెక్స్ట్ నాగ్ అశ్విన్ ఏం వాచ్ ఇస్తారో ఏంటో? 'ఇండియన్ 2 సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ని ఈరోజే చూశాను. శంకర్ కు నా అభినందనలు. ఈ చిత్రం మీ అత్యుత్తమ పని కాకూడదు. మీ క్రియేటివ్ లైఫ్ లో ఇది హైయస్ట్ స్టేజ్. అందుకే దీన్ని తలకు ఎక్కించుకుని గర్వపడొద్దని నా సలహా. ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా' అని కమల్ హాసన్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ‘இந்தியன் 2’ படத்தின் பிரதான காட்சிகளை இன்று பார்த்தேன். என் உளமார்ந்த வாழ்த்துகள் @shankarshanmugh இதுவே உங்கள் உச்சமாக இருக்கக் கூடாது என்பதும் என் அவா. காரணம், இதுதான் உங்கள் கலை வாழ்வின் மிக உயரமான நிலை. இதையே உச்சமாகக் கொள்ளாமல் திமிறி எழுங்கள். பல புதிய உயரங்கள் தேடி.… pic.twitter.com/Mo6vDq7s8B — Kamal Haasan (@ikamalhaasan) June 28, 2023 (ఇదీ చదవండి: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!) -
సీఎం జగన్‌కు ఇంట్రెస్టింగ్ గిఫ్ట్..
-
ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?
రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లైఫ్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. అయితే ఇటీవల తన కోటి రూపాయల విలువైన లగ్జరీ గడియారాన్ని బ్రూనై సుల్తాన్ కుమార్తె గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతులను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాదు ఒకానొక సందర్బంలో ఆ వాచ్‌ని అమ్మాలని కూడా ప్రయత్నించాడట. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌లో విలన్ పాత్రలో కనిపించిన సైఫ్ కొన్నేళ్ల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సైఫ్ అలీఖాన్ బ్రూనై సుల్తాన్ కుమార్తె నుంచి వజ్రాలు పొదిగిన విలువైన గడియారాన్ని గిఫ్ట్ విషయంతో పాటు, ఒక ఫన్నీ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అతని మాటల్లో చెప్పాలంటే బ్రూనై సుల్తాన్ చాలా రిచ్. మైఖేల్ జాక్సన్‌ను పాడమని ఆహ్వానించేవారు. అలాగే అందులోనూ అతని కుమార్తెకు బాలీవుడ్ అంటే ఇష్టం. ఒకసారి అతను మమ్మల్ని ఆహ్వానించినట్టు గుర్తు.. లండన్‌లోని డోర్చెస్టర్ హోటల్లో నేను, మనీషా కొయిరాలా ఇంత కొంతమందిమి వెళ్లాం. అయితే పొరపాటున సుల్తాన్ కుమార్తె కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నా. అక్కడ ఒక పెద్ద కుర్చీ, చిన్న కుర్చీ ఉన్నాయి, అయినా ఆలోచించకుండా కూర్చుండిపోయా. ఇంతలో సుల్తాన్ కుమార్తె ఒక పెట్టె ఇచ్చింది. అందులో వజ్రాలు పొదిగిన రోలెక్స్ వాచ్‌ని చూసి షాక్ అయ్యానని సైఫ్ చెప్పాడు. (టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ ) దీంతో పాటు మరో షాకింగ్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన భార్య కరీనా కపూర్ ఖాన్ దగ్గరున్న ఈ అమూల్యమైన లగ్జరీ వాచ్‌ని అమ్మాలనుకున్నాడట. రేస్ షూటింగ్ సమయంలో నిర్మాత రమేష్ తౌరానీకి విక్రయిద్దామనుకున్నా, చివరికి విరమించుకుని కరీనా కపూర్ ఖాన్‌కు ఇచ్చానని పేర్కొన్నాడు. పటౌడీ ప్యాలెస్ కాగా 2011లో తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణించిన తర్వాత సైఫ్ అలీఖాన్ తన పూర్వీకుల ఆస్తి పటౌడీ ప్యాలెస్‌ను తిరిగి కొనుగోలు చేశాడు. అది వారి హాలిడే హోమ్ కూడా. దీన్నే ఇబ్రహీం కోఠి అని కూడా పిలుస్తారు, పటౌడీ ప్యాలెస్ చివరి పాలక నవాబ్ ఇఫ్తికర్ అలీ ఖాన్ నుంచి అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్‌కు ఇచ్చారు. 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లాలో ఏడు డ్రెస్సింగ్ రూమ్‌లు, ఏడు బెడ్రూమ్లు, ఏడు బిలియర్డ్ రూమ్‌లు, అలాగే రాజభవన డ్రాయింగ్ రూమ్‌లు , డైనింగ్ రూమ్‌లతో సహా 150 గదులు ఉన్నాయి. 2020 నాటికి పటౌడీ ప్యాలెస్ విలువ 800 కోట్లు. దీన్ని బట్టి ఈ ప్యాలెస్ ప్రస్తుత విలువను అంచనా వేసుకోవచ్చు. -
భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడి అపురూప కానుక
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అపురూపమైన బహుమతినిచ్చారు. వైట్ హౌస్ లో జరిగిన ఇరుదేశాల పారిశ్రామికవేత్తల సమావేశంలో ఒక టీషర్టును మోదీకి కానుకగా ఇచ్చారు. దాని మీద AI అంటే అమెరికా ఇండియా భవిష్యత్తు అని మోదీ సరికొత్తగా నిర్వచించిన మాటలను ముద్రించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. AI అంటే అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) కానివ్వండి అమెరికా ఇండియా కానివ్వండి. భవిష్యత్తు అంతా AI నే.. అని అన్నారు. అనంతరం ఇరుదేశాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు పాల్గొన్న సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఒక టీషర్ట్ మీద మోదీ చెప్పిన ఆ మాటలనే ముద్రించి కానుకగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు కానుక ఇచ్చిన ఆ ఫోటోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి ఐక్యంగా పని చేస్తే ఈ భూమి కంటే గొప్ప ప్రదేశం మరొకటి ఉండదని, అమెరికా భారత్ రెండు AI మాదిరిగానే శక్తివంతంగా తయారవుతున్నాయని రాశారు. ఈ సమావేశంలో అమెరికా పారిశ్రామికవేత్తలు మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ అధినేత సుందర్ పిచ్చై, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఒపెన్ AI సీఈవో సామ్ ఆల్ట్ మాన్,ఏఎండి సీఈవో లిసా సు, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ లతో పటు భారత పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, వృందా కపూర్ లు కూడా పాల్గొన్నారు. AI is the future, be it Artificial Intelligence or America-India! Our nations are stronger together, our planet is better when we work in collaboration. pic.twitter.com/wTEPJ5mcbo — Narendra Modi (@narendramodi) June 23, 2023 ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర -
బైడెన్‌కు దశ దానం.. దాని ప్రాముఖ్యత తెలుసా?
అమెరికా పర్యటనలో భాగంగా.. వైట్‌హౌజ్ విందుకు హాజరైన ప్రధాని మోదీ.. సతీసమేతంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో పరస్పరం కానుకలు ఇచ్చి గౌరవించుకున్నారు. మోదీ టేస్ట్‌కి తగ్గట్లే కెమెరాలను బైడెన్ ఇవ్వగా.. భారత సంప్రదాయానికి తగ్గట్లు ఉపనిషత్తుల కాపీని, ఆయన సతీమణి జిల్ బైడెన్‌కు గ్రీన్ డైమండ్‌కు బహుకరించారు. అదే సయమంలో మోదీ బహుకరించిన గంధపు చెక్కతో కూడిన పెట్టె ఒకటి బైడెన్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ పెట్టెను.. అందులో ఉన్న దశ దానం ప్రశస్తిని స్వయంగా మోదీనే బైడెన్‌కు వివరించారు. హిందూ జీవన విధానంలో ‘‘దశ దానం’’ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం. హిందూ ఆచారాలకు ప్రతీక కూడా. ► ప్రాచీన భారతీయ గ్రంథం కృష్ణ యజుర్వేదంలో వైఖానస గృహ్య సూత్రం ప్రకారం.. ఒక వ్యక్తి దాదాపు 29,530 రోజులు.. మరోలా చెప్పాలంటే ఎనభై సంవత్సరాల ఎనిమిది నెలల వయస్సును పూర్తి చేసినప్పుడు ‘దృష్ట సహస్రచంద్రుడు’ అంటే వెయ్యి పౌర్ణమిలను చూసిన వ్యక్తి అవుతాడు. ► హిందూ జీవన విధానంలో.. ప్రతీ వ్యక్తికి ఇదొక ముఖ్యమైన మైలురాయి లాంటిది. జీవితంలో ఆ దశ పూర్తైన వాళ్లను.. వాళ్ల పరిపూర్ణ అనుభవానికి గుర్తుగా గౌరవించబడతారు. శాస్త్రోక్తంగా.. వినాయక పూజలతో మొదలవుతుంది. పూర్ణహారతి, శతాభిషేకం.. చివరకు సహస్ర చంద్ర దర్శనంతో ముగుస్తుంది. ► సహస్ర పూర్ణ చంద్రోదయం సమయంలో.. దశ దానం చేయడం ఆనవాయితీ. గోదానం, భూదానం, తిలదానం(నువ్వులు) , హిరణ్యదానం(బంగారం), ఆజ్యదానం(నెయ్యిగానీ.. వెన్నగానీ), ధాన్యదానం, వస్త్రదానం, గుడ(బెల్లం) దానం, రౌప్యదానం(వెండి), లవణదానం(ఉప్పు) చేస్తారు. ► బైడెన్ కిందటి ఏడాది నవంబర్‌తోనే 80 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అందుకే ఆయనకు మోదీ దశ దానం సమర్పించారు. ► జైపూర్(రాజస్థాన్)కు చెందిన ఓ కళాకారుడు ఆ ప్రత్యేకమైన చందనపు పెట్టెను రూపొందించారు. అందుకు కావాల్సిన చెక్కలను మైసూర్ నుంచి తెప్పించారు. తరతరాలుగా ఇలా గంధపు పెట్టెల తయారీ రాజస్థాన్‌లో కుల వృత్తిగా నడుస్తోంది. ► బాక్స్‌లో గణేషుడి ప్రతిమ ఉంది. దీనిని కోల్‌కతాకు చెందిన ఓ స్వర్ణకారుడు తయారు చేశారు. ఆయన కుటుంబం ఐదు తరాలుగా విగ్రహాలను తయారు చేస్తోంది. ► ప్రతిమతో పాటు ప్రమిదను కూడా ఉంచారు. ఇది కూడా కోల్‌కతాకు చెందిన స్వర్ణకారుల కుటుంబమే చేసింది. ► ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కళాకారులు రూపొందించిన రాగి తామ్ర పాత్ర.. దాని మీద శ్లోకం చెక్కి ఉంది. The box gifted by PM Modi to US President Joe Biden contains ten donations- a delicately handcrafted silver coconut by the skilled artisans of West Bengal is offered in place of a Cow for Gaudaan (donation of cow). A fragrant piece of sandalwood sourced from Mysore, Karnataka… pic.twitter.com/I8ujKCoiK1 — ANI (@ANI) June 22, 2023 ఇక అసలైన దశ దానం.. వెండి పెట్టెల్లో ఉంది. ఆవు స్థానంలో బుల్లి వెండి కొబ్బరికాయ ప్రతిమను, భూదానం స్థానంలో మైసూర్ నుంచి తెప్పించిన సువాసనభరితమైన గంధపు చెక్క ముక్కను, తమిళనాడు నుంచి తెప్పించిన నువ్వులను, హిరణ్యదానం కోసం రాజస్థౠన్ నుంచి తెప్పించిన 24 క్యారెట్ల బంగారపు కాయిన్‌ను, పంజాబ్ నుంచి నెయ్యిని, జార్ఖండ్ నుంచి తెప్పించిన గుడ్డ ముక్కను, ధాన్యదానంలో భాగంగా యూపీ నుంచి బియ్యం, మహారాష్ట్ర నుంచి బెల్లం ముక్కను, రాజస్థాన్ నుంచి వెండి నాణేన్ని, అలాగే గుజరాత్ నుంచి తెప్పించిన ఉప్పును లవణ దానంలో భాగంగా.. చిన్న వెండి పెట్టెల్లో ఉంచి బైడెన్‌కు మోదీ దశ దానంలో భాగంగా అందించారు. The box contains the idol of Ganesha, a Hindu deity considered as the destroyer of obstacles and the one who is worshipped first among all gods. The idol has been handcrafted by a family of fifth-generation silversmiths from Kolkata. The box also contains A diya (oil lamp) that… pic.twitter.com/23eV5ZsWfC — ANI (@ANI) June 22, 2023 -
సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ సూపర్ కానుక..!
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఓ మంచి కానుకను పంపించారు. 600 కేజీల మామిడి పండ్లను కానుకగా బహుకరించారు. హిమాసాగర్, లంగ్రా రకాలకు చెందిన మామిడి పండ్లను కానుకగా పంపించినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కూడా ఇలాంటి బహుమతినే ఇచ్చినట్లు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ గుర్తుచేశారు. దౌత్య సంబంధాల్లో భాగంగానే ఈ మేరకు కానుకలు పంపినట్లు స్పష్టం చేశారు. మమతా బెనర్జీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సీఎంలకు కూడా షేక్ హసీనా బహుమతిగా మామిడి పండ్లను పంపించారు. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, త్రిపుర, అసోం సీఎంలకు కానుకగా మామిడి పండ్లను బహుకరించారు. ఇదీ చదవండి:‘220 నెలల్లో 225 కుంభకోణాలు.. అది బీజేపి ఘనత’ -
భార్య కోసం నౌక తరహాలో భారీ ఇల్లు
సాక్షి, చైన్నె: తన భార్య కోరికగా ఓ భర్త ఏకంగా నౌక తరహాలో ఇంటిని నిర్మించాడు. సముద్రాన్ని తలపించే నిర్మాణాలతో అచ్చం నౌకలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగించే విధంగా నిర్మించిన ఈ నివాసం ప్రస్తుతం కడలూరులో హాట్ టాపిక్‌గా మారింది. వివరాలు.. ఇటీవల కాలంలో భార్యలను స్మరిస్తూ ఆలయాలు, భర్తల కోసం భార్యల స్మారక మందిరాల నిర్మాణాలు, విగ్రహాల ఏర్పాటు వంటి ఘటనలు తమిళనాట అధికమయ్యాయి. అలాగే తమ తల్లిదండ్రుల కోసం స్మారక మందిరాలను నిర్మించే తనయులూ ఉన్నారు. రెండు రోజుల క్రితం తిరువారూర్ జిల్లా అమ్మయప్పన్ గ్రామంలో చైన్నెనకు చెందిన పారిశ్రామిక వేత్త అమరుద్దీన్ మరణించిన తన తల్లి జైలానీ బీవీ స్మారకంగా ఓ తాజ్ మహల్ తరహాలో మందిరాన్ని నిర్మించి అందరినీ విస్మయంలో పడేశాడు. ఈ తాజ్‌మహల్ గురించి గత రెండు రోజులుగా పెద్ద చర్చే జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కడలూరులో జీవించి ఉన్న తన భార్య కోరికను తీర్చే విధంగా షిప్లో పనిచేసే ఉద్యోగి ఒకరు నౌక తరహా నిర్మాణాలతో ఇంటిని నిర్మించడం విశేషం. నౌక తరహాలో.. కడలూరు జిల్లా వన్నార పాళయానికి చెందిన శుభాష్ ఓ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అధిక సమయం ఆయన నౌకలోనే పయనం చేస్తూ వస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వివాహమైన తొలి నాళ్లలో తన భార్య శుభశ్రీని వెంట బెట్టుకుని నౌకలో కొన్ని దేశాలకు వెళ్లాడు. ఈ సమయంలో నౌక తరహాలో ఇంటిని మనం కూడా నిర్మించుకోవాలని భర్తను శుభశ్రీ కోరింది. దీంతో భార్య కోరిక తీర్చేందుకు ఇటీవల వన్నార పాళయంలో 11 వేల చదరపు అడుగు స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఇందులో 4 వేల చదరపు అడుగులలో బ్రహ్మాండ నివాసం నిర్మించాడు. ఇది పూర్తిగా నౌకను తలపించే విధంగా ఉండడం విశేషం. మిగిలిన స్థలంలో ప్రత్యేక నిర్మాణాలతో సముద్రాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేశాడు. నౌకలో ఉండే విధంగానే మెట్లు, గదులు, స్విమ్మింగ్ ఫుల్, జిమ్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు. నౌకలో కెప్టెన్ కూర్చునే ప్రాంతాన్ని ప్రత్యేక గదిగా తీర్చిదిద్ది, అక్కడి నుంచి కడలూరు పరిసరాలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక బైనాకులర్ వంటి ఏర్పాట్లు చేయించుకున్నాడు. రాత్రుల్లో అయితే, సముద్రంలో నౌక పయనిస్తున్న తరహాలో లైటింగ్ సెట్టింగ్‌లు వేయించాడు. 90 శాతానికి పైగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఇంట్లోకి శుభాష్, శుభశ్రీ దంపతులు శుక్రవారం గృహ ప్రవేశం చేశారు. ఇంటికి ఎస్– 4 నిలయం అని వినూత్నంగా పేరు పెట్టారు. తన ఇంట్లో ఉన్న నలుగురి పేర్లకు ముందుగా ఎస్ అక్షరం రావడంతోనే ఈ పేరు పెట్టినట్టు శుభాష్ పేర్కొన్నారు. మిగిలిన ఖాళీ స్థలంలో నిర్మాణాలన్నీ పూర్తి కాగానే, ఓ దీవిలో తన ఇల్లు నౌక తరహాలో కనిపిస్తుందని, ఆ దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించాడు. పెళ్లైన కొత్తలో కోరిన కోరికను ఇప్పుడు తన భర్త సాకారం చేయడం ఆనందంగా ఉందని శుభశ్రీ తెలిపారు. -
మోహన్ లాల్ బర్త్ డే.. ఖరీదైన కారు కొనిచ్చిన ఫ్రెండ్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు అతని ప్రాణ స్నేహితుడు. మే 21న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఖరీదైన బహుమతి ఇచ్చి అభిమానం చాటుకున్నారు. మోహన్ లాల్‌కు సరికొత్త కియా ఈవీ-6 ఎలక్ట్రిక్ కారును గిప్ట్గా ఇచ్చాడు. ఈ లగ్జరీ ఎస్యూవీ కారు విలువ దాదాపు రూ. 65 లక్షలకు పైగానే ఉంది. సూపర్ స్టార్ తన భార్యతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) మోహన్ లాల్ ఆదివారం తన 63 వ పుట్టినరోజును జరుపుకున్నారు. తెలుగులోనూ పలు చిత్రాలో నటించారు. ఆయన తన పుట్టిన రోజును కొంతమంది నిరుపేద పిల్లల సమక్షంలో జరుపుకున్నారు. వారితో కాసేపు సరదా మాట్లాడి కేక్ కట్ చేశారు. అంతే కాకుండా 2019 వరద రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన కోజికోడ్‌కు చెందిన వ్యక్తికి మోహన్‌లాల్ ఇంటిని కూడా విరాళంగా ఇచ్చారు. (ఇది చదవండి: వెయిటర్‌గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని) కాగా.. మోహన్‌లాల్ ప్రస్తుతం 'మలైకోట్టై వాలిబన్'లో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by TOI ETimes Malayalam (@etimesmalayalam) -
పండగ ఏదైనా.. పచ్చనికానుక.. ఇప్పుడిదే ట్రెండ్
రామకృష్ణ రిటైర్డ్ బ్యాంకు అధికారి. కుమార్తెకు వివాహం కుదిరింది. రెండు రోజుల్లో నిశ్చితార్థం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అతిథులకు, వియ్యాలవారికి రిటర్న్ గిఫ్ట్ కొత్తగా ఏదైనా ఇవ్వాలని ఆయన ఆలోచన. రోజూ సాయంత్రం వాకింగ్‌లో కలిసే మిత్రుడిని సలహా అడిగారు. ఆకర్షణీయమైన మొక్కలను ఇద్దామని సూచించారు. అది రామకృష్ణకు నచ్చింది. వెంటనే కడియపులంక నుంచి తెప్పించి, వాటినే బహూకరించారు. (రాజమహేంద్రవరం డెస్క్) : రామకృష్ణ ఒక్కరే కాదు. ఇటీవల కాలంలో చాలామంది పర్యావరణ హితం కోరుతూ బహుమతుల జాబితాలో మొక్కలను చేరుస్తున్నారు. జీవం ఉన్న బుల్లి మొక్కలను బహుమతిగా ఇస్తూ ప్రకృతిపై ప్రేమను చాటుకుంటున్నారు. పూలదండలు, పుష్పగుచ్ఛాల స్థానాన్ని క్రమంగా ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్ ప్లాంట్స్ ఆక్రమిస్తున్నాయి. పెద్ద నాయకులు పర్యటనకు వచ్చినా, ఓ ఉద్యోగి రిటైరైనా శాలువా, మెమెంటోలతో పాటు గిఫ్ట్ ప్లాంట్లు కూడా తప్పనిసరి అయ్యాయి. కాన్వెంట్లో విద్యార్థి పుట్టిన రోజు నాడు క్లాస్ టీచర్లకు తల్లిదండ్రులు మొక్కలనే పిల్లలతో గిఫ్ట్‌గా ఇప్పిస్తున్నారు. అదొక్కటే కాదు పచ్చదనాన్ని ఇష్టపడే ఏ ఇంటి హాల్లో టీపాయ్‌పైన చూసినా ఒకటో, రెండో గిఫ్ట్ ప్లాంట్స్ కనిపిస్తాయి. మొక్కలు ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తాయని, ఎయిర్ ప్యూరిఫయర్‌గా ఉపయోగపడతాయని ఇలా చేస్తున్నారు. ఇదో పెద్ద పరిశ్రమ గిఫ్ట్ ప్లాంట్స్ ..ఇప్పుడో పెద్ద పరిశ్రమ. దీనికి కేరాఫ్ రాష్ట్రంలోనే అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ కడియం, కడియపులంక. 15 ఏళ్ల క్రితం గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మొదలయ్యాయి. స్వల్పకాలంలోనే నర్సరీ రంగంలో ఓ ప్రత్యేక విభాగంగా ఇవి రూపుదిద్దుకున్నాయి . ప్రస్తుతం వాటి టర్నోవర్ రూ.కోట్లలోకి చేరుకుంది. జామియా కులకస్, పొట్టి రకానికి చెందిన స్నేక్, రంగురంగుల అగ్లోనిమాలు, మెరంటా, సింగోనియం, సక్కలెన్స్ వంటి మొక్కలు గిఫ్ట్ ప్లాంట్స్‌గా ఆదరణ పొందాయి. పీస్ లిల్లీ, ఆంథూరియం, కలించీ, ఆర్చిడ్స్ వంటివి పూలతో కూడి న గిఫ్ట్ ప్లాంట్స్. వాటిలో ఆక్సిజన్ ప్లాంట్‌గా పిలిచే జామియా కులకస్ ఎక్కువగా అమ్ముడయ్యే గిఫ్ట్ప్లాంట్. వీటిని పూణె, బెంగళూరుల నుంచే గాకుండా థాయ్‌లాండ్, చైనా వంటి ఇతర దేశాల నుంచి ఇక్కడ నర్సరీల యజమానులు దిగుమతి చేసుకుంటున్నారు. గిఫ్ట్ప్లాంట్స్ చిన్నవి, సున్నితమైనవి కావడంతో ఎండవానల నుంచి రక్షణకు పాలీహౌస్‌లలో విక్రయానికి ఉంచుతారు. వాటి కోసం పెద్దపెద్ద నర్సరీల యాజమానులు రూ.లక్షలు ఖర్చు చేసి పాలీహౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. కడియపులంక ప్రాంతంలో 40 వరకూ పాలీహౌస్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, అమలాపురం, ఏలూరు, గుంటూరు, నెల్లూరు వంటి నగరాలకు సరఫరా అవుతుంటాయి. ఒక్కోగిఫ్ట్ ప్లాంట్ రకాన్ని బట్టి ఇంచుమించు రూ.250 నుంచి రూ.1000 వరకూ రేటు పలుకుతోంది. వెలెన్షియాలు.. సాధారణంగా 4, 5, 6 అంగుళాల సాధారణ కుండీల్లో గిఫ్ట్ ప్లాంట్స్ అందుబాటులో ఉంటాయి. మట్టికి బదులు పోషకాలు ఎక్కువగా ఉండే పాట్ మిక్స్ వాడుతుంటారు. మొక్కలతో కూడిన ఆ కుండీలను అంతకంటే అర అంగుళం ఎక్కువ సైజులో వివిధ రంగుల్లో, ఆకర్షణీయంగా ఉండే మరో కుండీలో ఉంచుతారు. దానిని వ్యవహారికంగా అవుటర్ పాట్ అంటారు. అసలు పేరు వెలెన్షియా.ప్లాస్టిక్ కుండీలు, గార్డెన్ ఉపకరణాలు తయారు చేసే పెద్దపెద్ద కంపెనీలే వివిధ రూపాల్లో, డిజైన్లలో ఆకట్టుకునేలా ఈ వెలెన్షియాలను తయారు చేస్తున్నాయి. వీటి అవుట్లెట్లు కడియపులంక ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో కీలకం నూతన సంవత్సర వేడుకలకు ఆతీ్మయులకు గిఫ్ట్ ప్లాంట్స్‌ను బహుమతిగా ఇవ్వడం ఇప్పటి ట్రెండ్. కడియం,కడియపులంకల్లో ఏడాది పొడవునా సాగే విక్రయాయి ఒక ఎత్తయితే, న్యూ ఇయర్ పేరుతో జరిగే గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మరో ఎత్తు. ఈ క్రమంలో డిసెంబర్ మూడో వారం నుంచి కడియం, కడియపులంకలలోని ప్రధాన నర్సరీల యజమానులు ఏటా సరికొత్త రకాల గిఫ్ట్ ప్లాంట్స్‌ను దిగుమతి చేసుకుంటారు. డిసెంబర్ కావడంతో వాటిలో వివిధ రకాల స్వదేశీ, విదేశీ రకాల పూలమొక్కలు కూడా ఉంటాయి. డిసెంబర్ ఆఖరి వారంలోనే రూ.కోట్లలో గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు జరుగుతాయి. గిఫ్ట్ ప్లాంట్‌తో స్వాగతం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో సందర్శనకు తరచూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు. వారికి గతంలో పుష్పగుచ్ఛా లను ఇచ్చి స్వాగతం పలికేవారం. వాటికి బదులు కొంతకాలంగా గిఫ్ట్ ప్లాంట్స్ ఇచ్చి ఆహా్వనిస్తున్నాం. పుష్పగుచ్ఛాలు రెండు రోజులకే వాడిపోతాయి. గిఫ్ట్ ప్లాంట్స్ ఎక్కువ కాల ఉంటా యి. ఆక్సిజన్‌ను ఇస్తాయి. పర్యావరణ రక్షణకు మేం కూడా ఎంతో కొంత మేలు చేసినట్టూ ఉంటుంది. – వీఎస్ఎల్ రావు, ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్, రాజమహేంద్రవరం డిపో 12 ఏళ్లుగా విక్రయిస్తున్నాం కడియపులంకలో 12 ఏళ్లుగా గార్డెన్ ఉపకరణాలు విక్రయిస్తున్నాం. ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు వెలెన్షియాల విక్రయాలు బాగా పెరిగాయి. అన్ని సైజుల్లో, రంగుల్లో మా వద్ద అందుబాటులో ఉంటాయి. వివిధ నగరాలు, పట్టణాల నుంచి వచ్చి కొనుగోలు చేసి తీసుకు వెళుతుంటారు. – రాజ్‌కుమార్ పాండే, మేనేజర్, హర్ష్ దీప్, గార్డెన్ ఉపకరణాల అవుట్లెట్, కడియపులంక సబ్సిడీపై పాట్ మిక్స్ ఇవ్వాలి రాష్ట్రంలోనే అతిపెద్ద గిఫ్ట్ ప్లాంట్ మార్కెట్‌గా కడియం, కడియపు ఎదిగాయి. గిఫ్ట్ఫ్లాంట్స్ ఆక్సిజన్‌ను ఇవ్వడమే కాదు, ఎయిర్ ఫ్యూరిఫయర్స్ కూడా. వాటిని విక్రయించే నర్సరీలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరం. ప్రధానంగా ఉద్యాన శాఖ ద్వారా మట్టికి బదులుగా గిఫ్ట్ ప్లాంట్‌కు వినియోగించే పాట్ మిక్స్‌ను రాయితీపై ఇచ్చి ప్రోత్సహించాలి. – మల్లు పోలరాజు, శివాంజనేయ నర్సరీ అధినేత, కడియపులంక -
అందమైన ప్యాకింగ్‌తో ఆదాయం.. తొమ్మిదేళ్లుగా..
వేడుకల సందర్భాలలో బంధుమిత్రులకు ఏదైనా కానుక తీసుకెళుతుంటాం. ఎంపిక చేసే కానుక ప్రత్యేకంగా ఉండాలనుకోవడమే కాదు, దానిని అంతే ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి, మన అభిమానాన్ని చాటుకుంటాం. ఈ విషయాన్ని గమనించిన కృతిక సబర్వాల్ ‘ది స్మార్ట్ ర్యాప్’ పేరుతో వ్యాపారవేత్తగా మారింది. వర్క్‌షాప్స్, వెబినార్ ద్వారా టీచర్ ప్రెన్యూర్గానూ తన సత్తా చాటుతోంది. న్యూ ఢిల్లీలో ఉండే కృతిక ఇప్పటివరకు 5000 మంది విద్యార్థులకు గిఫ్ట్ ప్యాకింగ్ తయారీలో శిక్షణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1300 మంది మహిళలకు ఉచితంగా గిఫ్ట్ ర్యాపింగ్ క్రాఫ్ట్ నేర్పించి, తన అందమైన మనస్తత్వాన్నీ చాటుకుంటుంది. తొమ్మిదేళ్లుగా చేస్తున్న ఈ కృషిలో మహిళలు గిఫ్ట్ ర్యాపింగ్‌లో ప్రతిరోజూ ఇంటి నుంచే మూడు గంటల పాటు శిక్షణ తీసుకుంటున్నారు. వెబినార్ ద్వారా ఉచితంగా గిఫ్ట్ ర్యాప్ తయారీతో పాటు ఇంటి నుంచే సొంత సంపాదన ఎలా సృష్టించుకోవచ్చో అవగాహన కల్పిస్తోంది కృతిక సబర్వాల్. వీటికి సంబంధించిన వివరాలను ఎంతో ఆనందంగా పంచుకుంటుంది. ‘‘జీవితం అనేది ఒక వేడుక. ఇక్కడ మనం ఆనందం, ప్రేమతో ఎంపిక చేసుకున్న బహుమతులను ఆప్తులకు బహుకరిస్తూ ఉంటాం. మన ప్రియమైనవారికి మన విలువైన సమయాన్ని వెచ్చించి, ఖరీదైన వస్తువులను ఎంపిక చేసి బహుమతిగా ఇచ్చినప్పుడు ఆటోమ్యాటిగ్గా వాటిపైన ఉన్న అందమైన ప్యాక్‌పైన దృష్టి వెళుతుంది. ఆ బహుమతిని అందుకునేవారి మనసును ఆకట్టుకునేలా ప్యాకింగ్ సేవలను అందించాలనుకున్నాను. వెంటనే ‘మీ బహుమతులను మరింత ఆహ్లాదకరమైన రీతిలో అందించండి’ అనే థీమ్‌తో 2013లో ది స్మార్ట్ ర్యాప్ బిజినెస్‌లోకి ప్రవేశించాను. ఆ తర్వాత 2016లో ఇంటి నుంచే చిన్న గిఫ్ట్ ర్యాపింగ్ వర్క్‌షాప్ చేయాలనే ఆలోచన నన్ను టీచర్ప్రెన్యూర్గా మార్చింది. దీంతో కోర్సులు, వర్క్‌షాప్‌లను రూపొందించడం ప్రారంభించాను. చాలా మంది గిఫ్ట్ ప్యాకేజింగ్ డిజైనర్లుగా మారడానికి సహాయం చేశాను. నాకే కాదు, ఎంతోమంది మహిళలకు ఉపాధికి అందమైన మార్గం దొరికింది అనిపించింది. గత పదేళ్లుగా 200కు పైగా వర్క్‌షాప్స్, 600కు పైగా వర్చువల్ క్లాసులు నిర్వహించాను. ప్రపంచంలో ఎవరైనా గిఫ్ట్ ప్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే వారికి మొదట గుర్తుకు వచ్చే పేరు ‘ది స్మార్ట్ ర్యాప్’ అనేది ఉండేలా సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇంటినుంచే వ్యాపారం ఎప్పటికప్పుడు మార్కెట్లోని తాజా ట్రెండ్లను అప్‌గ్రేడ్ చేయడం నా బిజినెస్ లక్ష్యం. గిఫ్ట్ ర్యాప్ వ్యాపారం ద్వారా ఇంటి నుంచే సంవత్సరానికి సుమారు తొమ్మిది లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా ఇంకా ఎక్కువే సంపాదించుకోవచ్చు. ఈవెంట్ నిర్వాహకులు, బేకర్లు, స్వీట్లు, గిఫ్టింగ్ కంపెనీలు, గృహాలంకరణ బ్రాండ్లు ఈ కళ పట్ల మొగ్గు చూపడానికి చాలా అవకాశాలున్నాయి. సందర్భానికి సరిపోయేలా గిఫ్ట్ ప్యాక్ ఎలా రూపొందించాలో తెలిసుండాలి. వాటిని నేను పరిచయం చేస్తాను. మంచి మాటలే కాదు మనం అందించే కానుక ప్యాకింగ్ కూడా చాలా కాలంపాటు అందుకున్నవారి మదిలో గుర్తుండిపోయేలా మనం చేయాలి. నిపుణులనూ తయారు చేయచ్చు ర్యాపింగ్ టెక్నిక్లను పంచుకోవడం, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నది నా లక్ష్యం. ఈ గిఫ్ట్ ర్యాప్ ప్యాక్ క్రాఫ్ట్ నుంచి మీ తోటివారితో వినూత్న ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్యాకర్‌గా మారడంలోనూ ఇది మీకు సహాయపడుతుంది. మీలాగే మరికొందరిని ఈ జాబితాలో చేర్చుకోవచ్చు. జట్టుగానూ విజయాలను సాధించవచ్చు. కార్పొరేట్ హ్యాంపర్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, బేబీ బర్త్ ప్యాక్స్, కృత్రిమ పూలు, కలపతో తయారుచేసిన బాస్కెట్స్ అలంకరణలు దీనికి జోడించవచ్చు. అంతేకాదు, ఈ ర్యాప్స్ నుంచి ఈవెంట్ డెకరేటివ్ ఆలోచనలకు కావల్సిన సలహాలనూ ఇస్తుంటాను. ఇన్నేళ్లలో ఇది ఎంతోమంది మహిళలకు ఉపయుక్తంగా మారిపోవడం ఆనందాన్నిస్తుంది’’ అని వివరిస్తున్న కృతికను చూస్తుంటే, స్మార్ట్‌గా మెలకువలను అమలు చేయడం ఎంత అవసరమో అర్థం అవుతుంది. చదవండి: నాన్న కళ్లలో ఆనందం కోసం.. ‘కలాసీ కూతురు ఇంజినీర్’ అని చెప్పుకోవాలి -
పట్టాభిషేకం వేడుకకు గుర్తుగా..రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు
లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో శనివారం కింగ్ చార్లెస్ 3కి పట్టాభిషేకం అట్టహాసంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకలో బ్రిటన్ రాజు దాదాపు రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ బహుమతులను పట్టాభిషేక పతకాల రూపంలో అందించనున్నారు. వీటిని యూకే ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ పట్టాభిషేకంలో సహకరించి, విజయవంతంగా పూర్తి అయ్యేలా మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వనున్నట్లు బ్రిటన్ పేర్కొంది. తమ దేశంలో అత్యవసర సమయంలో సేవలందించే.. ఆర్మీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందికి అందజేయనున్నట్లు భారత మూలాలు ఉన్న యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ అన్నారు. తమ కొత్త రాజు పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా..తమ దేశంలోని అత్యవసర సేవలందించే సిబ్బంది పాత్రను గుర్తించడమే గాక ఆ వేడుకకు గుర్తుగా ఈ కృతజ్ఞతా పతకాలను అందజేస్తున్నట్లు బ్రేవర్మాన్ అన్నారు. ఈ మేరకు బ్రేవర్మాన్ మాట్లాడుతూ..సాయుధ దళాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం, నిస్వార్థ సేవ లేకుండా ఈ పట్టాభిషేకం విజయవంతం కాదని అన్నారు. ఈ పతకం వారి సేవకు, కృషికి గుర్తింపుగా దేశం తరుఫున కృతజ్ఞతా బహుమతి అని అన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగికి అందజేస్తారని చెప్పారు. ఈ పతకం ముందు భాగంలో రాజు, రాణి డబుల్ పోర్ట్రెయిట్ ఉంటుంది. దీన్ని మార్టిన్ జెన్నింగ్స్ రూపొందించారు. ఈ పతకాలను బర్మింగ్‌హామ్‌లోని వోర్సెస్టర్షైర్ మెడల్ సర్వీస్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ పతకం మా సాయుధ దళాలు, చక్రవర్తి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి అద్దంపడుతుందన్నారు బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్. పట్టాభిషేకమహోత్సవ పతకాల సంప్రదాయం 1603 లో కింగ్జేమ్స్ హయాం నాటిదని చెప్పారు. ఈ వేడుకలో మొత్తం 4 లక్షల మందికి ఈ పట్టాభిషేక పతకాలు అందుకుంటారని బెన్ వాలెస్ చెప్పారు. ఈ మహోత్సవానికి ప్రపంచ దేశాల నుంచి అతిరథమహారథులకే గాక నిస్వార్థపూరితంగా పనిచేసి ఆయా విభాగాల్లో పేరుగాంచిన ప్రముఖులకు సైతం బ్రిటన్ ఆహ్వానం పలికింది. (చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ) -
మోదీకి 1500 కోట్ల విలువ చేసే ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిన అంబానీ
-
'విరూపాక్ష' డైరెక్టర్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్తా మీనన్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. చదవండి: ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్ సినిమా రిలీజ్ అయిన ఆరు రోజులకు కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో హీరోయిన్ సంయుక్తా మీనన్ డైరెక్టర్ కార్తీక్ దండుకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి షాకిచ్చింది. ఈ విషయంపై సంయుక్తా మాట్లాడుతూ.. 'మూవీ హిట్ కావడంతో కార్తీక్‌కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. విరూపాక్ష రిలీజ్ రోజు ఓ థియేటర్లో అతని ఫోన్ ఎవరో కొట్టేశారు. దీంతో సినిమా రెస్పాన్స్ చూడటానికి వేరే వాళ్ల ఫోన్లలో చూసేవాడు. అందుకే వెంటనే ఐఫోన్‌ను కొని గిఫ్ట్‌గా ఇచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే -
గిఫ్ట్ ఇవ్వడంలో అంబానీ స్టైలే వేరు - ఇదే నిదర్శనం
పండగలకో పబ్బాలకో బోనస్ ఇచ్చే యజమానులను చూసుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం చేసే యజమానులు చూసుంటారు. కానీ అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్తగా కీర్తించబడుతున్న అంబానీ ఈ విషయంలో కూడా 'అంతకు మించి' అనే చెప్పాలి. తన ఉద్యోగికి ఏకంగా రూ. 1,500 కోట్లు ఖరీదు చేసే ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 'రైట్ హ్యాండ్'గా పిలువబడే 'మనోజ్ మోదీ'కి ముంబైలోని నేపియన్ సీ రోడ్లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చాడు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోఉంటుంది. ఇందులో అధునాతన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిజానికి మనోజ్ మోదీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్, వారిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ తరువాత 1980లో ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మనోజ్ మోదీ రిలయన్స్‌లో చేరారు. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) మనోజ్ మోదీకి ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ కూడా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అంతే కాకుండా ఈయన ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్ ఇంబానీ మరియు ఇషా అంబానీలతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ కంపెనీ సాధించిన అనేక విజయాల్లో మనోజ్ మోదీ హస్తం ఉంది. మనోజ్ మోదీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
సితారకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. విదేశాల్లో ఉన్నా కూడా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా సితార తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పంపిన దుస్తులను పోస్ట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. (ఇది చదవండి: వెబ్సైట్ ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాం: సితార) ఆలియా భట్ గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కుమారులకు దుస్తులు పంపి సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా మరోసారి మహేశ్- నమ్రతల గారాలపట్టి సితారకు దుస్తులు పంపింది. వాటి ఫోటోలను సితార తన ఇన్‌స్టాలో పంచుకుంది. మీ కుటుంబంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది.. మీ అందరి నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్ పెళ్లాడిన ఆలియా భట్‌కు ఓ కూతురు జన్మించింది. వారి కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by sitara 💌 (@sitaraghattamaneni) -
ఆలియాకు రణ్‌బీర్ ఖరీదైన గిఫ్ట్.. స్పెషల్ ఏంటో తెలుసా?
బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట ఒకటి. గతేడాది వివాహాబంధంతో ఒక్కటైన ఈ జంటకు నవంబర్‌లో పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దురు కూతురుకు రాహా అని నామకరణం కూడా చేశారు. ఏప్రిల్ 14, 2022న సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితమే మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. మొదటి వివాహా వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ఆలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే హ్యాండ్‌బ్యాగ్ ఇచ్చి భార్యపై ప్రేమను చాటుకున్నాడు. కాగా.. బాలీవుడ్ జంట బాంద్రాలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. తమ కలల ఇంటి పనులను పర్యవేక్షించేందుకు రాగా.. ఆలియా, రణ్‌బీర్ కెమెరాలకు చిక్కారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా బ్యూటీఫుల్ కపుల్స్ అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బుట్ట బొమ్మకు లగ్జరీ కారు గిఫ్ట్.. స్పందించిన హీరోయిన్!
బుట్ట బొమ్మ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఒకలైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద, డీజే, మహర్షి, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో లాంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టాలీవుడ్లో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ’, ‘అలా.. వైకుంఠపురములో’ తర్వాత ముచ్చటగా మూడోసారి పూజాకు ఛాన్స్ ఇచ్చాడు తివిక్రమ్. అయితే ఇటీవల బుట్టబొమ్మపై రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం 'కిసీకా భాయ్ కిసీ కీ జాన్' మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న రూమర్స్‌పై స్పందించింది. ఇటీవలే డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన బుట్టబొమ్మ.. ఓ నిర్మాత కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చారన్న రూమర్స్‌పై తాజాగా స్పందించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. కాగా.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన చిత్రం 'మొహంజదారో'తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'హౌస్‌ఫుల్- 4', సర్కస్ చిత్రాల్లో కనిపించింది. పూజా మాట్లాడుతూ.. 'నా గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. నేను వాటన్నింటినీ చదువుతా. కానీ సమాధానాలు ఇస్తూ కూర్చోలేను. అప్పుడప్పుడు నా పేరేంట్స్ కూడా ఇవన్నీ నిజమేనా అని అడుగుతుంటారు. నేను నటిస్తున్న ఓ సినిమా నిర్మాతలు నాకు కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చారంటూ వార్తలొచ్చాయి. ఒక వేళ నా గురించి చెడుగా ప్రచారం చేయాలనుకుంటే నిజంగా నాకు కారు ఇవ్వండి.' అంటూ చెప్పుకొచ్చింది బుట్టబొమ్మ. -
స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్
సాక్షి, ముంబై: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్లో సరికొత్త ఫీట్‌ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసిన కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. ఇది ఐపీఎల్లో అతని 50వ 50-ప్లస్ స్కోరుతో ఆకట్టుకునే ఫీట్‌ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. అయితేఈ లిస్ట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60తో అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49తో ఓవరాల్ లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పేరు మీద 45 అర్ధసెంచరీలు. 5 సెంచరీలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ఆదివారం ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే, మొత్తంమీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.దీంతో ఆంపియర్ ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. (NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?) ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గిప్ట్గా అందుకున్నాడు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన కోహ్లి (82 నాట్ అవుట్)గా నిలిచాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (73)తో కలిసి 148 ఓపెనింగ్ పార్టనర్షిప్తో శుభారంభం చేసి జట్టుకు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ-థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సంస్థ కోహ్లీకి అందించింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ బెహ్ల్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్ను కోహ్లికి అందించారు. అయితే, మొత్తంమీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. (Gold rate 3 April 2023: తగ్గిన పసిడి ధర,గుడ్ న్యూసేనా?) కాగా ఆర్సీబీ ఆడే ప్రతి IPL మ్యాచ్ తర్వాత గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆర్సీబీ-థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 'ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'కి ఆర్సీబీ ప్లేయర్‌కు అందజేస్తుంది. ఆర్సీబీకి అధికారిక భాగస్వామి ఆంపియర్. The Limited Edition RCB themed Primus is set to be unveiled today. And the most electrifying RCB player of the match will get his very own Limited Edition scooter! Pre-booking for the Limited Edition RCB themed Primus at just ₹499 is live on our website NOW! pic.twitter.com/xkzeEEBPZd — Ampere Electric Vehicles (@ampere_ev) April 2, 2023 మరోవైపు గత వారమే లాంచ్ చేసిన ఆంపియర్ ప్రైమస్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఏప్రిల్ మొదటి వారం నుండి పరిమిత కాలానికి రూ. 499 ప్రీ-బుకింగ్‌లకు అందుబాటులో ఉంటుంది. తమ కంపెనీ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ ప్రైమస్ అని సంజయ్ వెల్లడించారు.లిమిటెడ్ ఎడిషన్ ఆంపియర్ ప్రైమస్ జట్టు స్ఫూర్తిని, క్రీడను, హర్ గల్లీని ఎలక్ట్రిక్‌గా మార్చాలనే తమ ఉద్దేశ్యానికి జీవం పోసిందన్నారు. తమకు 1.80 లక్షల మంది వినియోగదారులున్నారని కంపెనీ పేర్కొంది. -
బర్త్‌డే రోజు రామ్ చరణ్‌కు రాజమౌళి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 38వ పుట్టిన రోజును మార్చి 27న గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖలు హాజరై సందడి చేశారు. ఇక హీరోలతో ఫ్రెండ్లీగా ఉండే రాజమౌళి కూడా తన ఫ్యామిలీతో కలిసి చరణ్ బర్త్‌డే పార్టీకి వెళ్లాడు. అయితే ఎవరి బర్త్‌డే పార్టీకి వెళ్లినా ఓ బహుమతి ఇవ్వడం జక్కన్నకు అలవాటు. ఇక తన హీరో చరణ్‌కి కూడా రాజమౌళి ఓ సర్ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. రోజ్ వుడ్‌తో చేసిన ఓ యూనిక్ హ్యాండ్ మెడ్ లారీతో పాటు రోజ్‌వుడ్‌తో చేసిన ఓ ప్రతిమను బహుమతిగా అందించారు. కాగా,రాజమౌళి ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మగధీర సినిమాతో ఇరు కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడింది. ఇక ఆర్ఆర్ఆర్తో ఆ బంధం మరింత బలపడింది. రామ్‌చరణ్ బర్త్‌డే వేడుకల్లోనే ‘నాటు నాటు’కు ఆస్కార్ వరించినందుకుగాను ఆర్ఆర్ఆర్ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. That’s one grand party! #Rajamouli with his family was seen entering Ram Charan’s birthday celebrations in Hyderabad#upasana #upasanakonidela #ramcharan #ramcharanbirthday #hbdramcharan #upasanakamineni #nagarjuna #Telugu #Tollywood #ssrajamouli #saidharamtej #ranadaggubati pic.twitter.com/vWXBUNjkBc — BTown Ki Billi South Cinema (@bkbsouthcinema) March 28, 2023 -
యూ ఆర్ మై ఫేవరెట్.. ఎన్టీఆర్‌కు ఆలియాభట్ సర్ప్రైజ్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా ఆమె ఎన్టీఆర్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ కుమారులు అభయ్, భార్గవకు కొత్త దుస్తులు పంపి తన అభిమానాన్ని చాటుకుంది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్‌లో ప్యాక్ చేసి.. పిల్లల పేర్లతో ట్యాగ్లు పెట్టి మరీ పంపించింది. ఆలియా భట్ బహుమానానికి ఎన్టీఆర్ ఫిదా అయిపోయారు. త్వరలోనే నా పేరుతో మీరు ఓ బ్యాగ్ చూస్తారు అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు యంగ్ టైగర్. కాగా.. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్30 పేరు పెట్టారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి!
ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులకు నామినీలుగా చోటు దక్కించుకున్న నటీనటులు, దర్శకులు, ఇతర కళాకారులకు అకాడమీ అద్భుతమైన బహుమతులు ఇస్తుంది. అయితే ఈ సారి మాత్రం భూమిని బహుమతిగా అందించబోతోంది. ఎక్కడా అనుకుంటున్నారా..? ఆస్కార్ నామినీలు ఈ ఏడాది తమ గిఫ్ట్ బ్యాగ్‌లలో ఆస్ట్రేలియాలో ఒక చదరపు మీటర్ భూమిని అందుకోబోతున్నారు. అయితే ఆ భూమిని నామినీలు ఆధీనంలోకి తీసుకోలేరు. కానీ ఆ భూమి ఆస్కార్ నామినీల పేరుతో ఉంటుంది. అంటే వారి గుర్తుగా అన్నమాట. ఇదీ చదవండి: ట్విటర్ తరహాలో మెటా.. జుకర్‌బర్గ్‌పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు! సాధారణంగా ఆస్కార్ నామినీలకు బహుమతులు ఇచ్చేందుకు అకాడమీతో సంబంధం లేకుండా అనేక వ్యాపార సంస్థలు పోటీ పడుతుంటాయి. అందులో ‘పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఒకటి. నామినీలకు ఇచ్చే గిఫ్ట్ హాంపర్‌లో చోటు దక్కించుకోవడానికి 4 వేల డాలర్లు (రూ.3,27,862) చెల్లించింది. నామీనీల గిఫ్ట్ బ్యాగ్‌లో పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ తమ ‘ఆస్సీ మేట్ కన్జర్వేషన్ ప్యాక్స్’ను చేర్చింది. దీని ద్వారా క్వీన్స్‌ల్యాండ్‌లోని వెస్ట్రన్ డౌన్స్ ప్రాంతంలో ఉన్న ‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో ఒక చదరపు మీటర్ స్థలం ఆస్కార్ నామినీల పేరుపై ఉంటుంది. దీనికి సంబంధించిన లైసెన్స్ సర్టిఫికెట్‌ను గ్రహీతలకు అందిస్తారు. ‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో కొంత భాగాన్ని పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ ఆస్కార్ నామినీలకు బహుమతిగా ప్రకటించింది. కాగా ఈ భూమి మొత్తం 1,21,774 చదరపు మీటర్లు ఉంటుందని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పేర్కొంది. దీన్ని విక్రయిస్తే వచ్చే లాభం 2.5 మిలియన్ డాలర్లు వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే బొగ్గు సీమ్ గ్యాస్ ఫీల్డ్ నడిబొడ్డున ఉన్న ఈ భూమిపై పర్యావరణ సంస్థల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే.. -
ముద్దుల మనవలకు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్
సాక్షి,ముంబై: బిలియనీర్, రిలయన్స్చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అమ్మమ్మ, తాతయ్యలుగా కవల మనవలకు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆకర్షణీయమైన ఐదడుగుల అల్ట్రా-లగ్జరీ క్లోసెట్ను బహుమతిగా ఇచ్చారు. మనవడు కృష్ణ మనవరాలు ఆదియా పుట్టిన సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన అంబానీ దంపతులు తాజాగా వారికిచ్చిన గిఫ్ట్ వైరల్‌గా మారింది. పాపులర్ మహిళా పారిశ్రామిక వేత్త, అంబారీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్ దంపతులకు 2022 నవంబరులో కవల పిల్లలకు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ కవలల కోసమే లగ్జరీ క్లోసెట్( కప్బోర్డ్)ను ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎల్లో కలర్ రూంలో హాట్-ఎయిర్ బెలూన్లతో మేఘాల వాల్‌పేపర్‌తో ఆకట్టుకుంటోంది. అలాగే టెడ్డీ బేర్లు, ఆకర్షణీయమైన రంగుల కృత్రిమ పువ్వులు, రెండు స్పెషల్ బాక్స్లతోపాటు, ఒక గ్లోబ్, రెండు పాస్‌పోర్ట్‌లు, ఒక చిన్న విమానాన్ని కూడా ఇందులో పొందుపర్చారు. అలాగే కస్టమైజ్డ్ క్లోసెట్ డోర్ పైన "అడ్వెంచర్స్ ఆఫ్ ఆదియా అండ్ కృష్ణ" అని రాసి ఉండటం గమనార్హం. View this post on Instagram A post shared by Gifts Tell All (@giftstellall) -
ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన మిర్చి సింగర్.. ఎవరికో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్. అతను పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలు ఆలపించి ఫేమస్ అయ్యారు. సుప్రసిద్ధ పంజాబీ సింగర్ దలేర్ మెహంది తమ్ముడు మికా సింగ్. అతని తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావడం వల్ల మికా కూడా ఆ రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన వాయిస్ వినిపించాడు. తాజాగా మికా సింగ్ తన స్నేహితునికి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. తన అత్యంత సన్నిహితుడైన కన్వల్ జీత్ సింగ్‌కు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుకరించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మికా సింగ్. స్నేహితుని కారును ఇచ్చిన అతని కలను నెరవేర్చాడు సింగర్ మికా. మికా తన ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేస్తూ.. ' మేం ఎప్పుడు ఏదో ఒకటి కొనుగోలు చేస్తుంటాం. కానీ మీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తుల గురించి ఆలోచించరు. కానీ నా స్నేహితుడు ఈ ఆనందానికి అర్హుడు. అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు మికా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీది చాలా పెద్దమనసు ఉంటూ ప్రశంసిస్తున్నారు. సింగర్ మికా ప్రేమకు కన్వల్ జీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. కన్వల్ దీత్ సింగ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మేము కలిసి 30 ఏళ్లు అయింది. అతను కేవలం నా స్నేహితుడు మాత్రమే కాదు. అంతకు మించి మేము జీవితాంతం సోదరులం. నా ఫేవరేట్ కారును బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతంగా ఉంది. మీది చాలా గొప్పమనసు. ఈ బహుమతిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by Bollywood Celebrities (@bollycelebrities_) -
ఉద్యోగికి యాపిల్ అపూర్వ బహుమతి! స్వయంగా టిమ్‌కుక్...
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ యాపిల్ తమ ఉద్యోగికి అపూర్వ బహుమతి అందించింది. సంస్థలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగి ప్రత్యేకమైన బహుమతి అందుకున్నారు. ఓ వైపు ఆర్థిక మందగమనం కారణంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఓ ఉద్యోగి సేవలను గుర్తించి యాపిల్ బహుమతి పంపించడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఉద్యోగికి వచ్చిన బహుమతిని డాంగిల్బుక్ప్రో అనే యూట్యూబర్ అన్‌బాక్స్ చేశాడు. అందులో ఏమేమి వచ్చాయో చూపించాడు. సాధారణంగా యాపిల్ సంస్థ తమ ఉద్యోగులకు క్రిస్టల్‌తో తయారు చేసిన అవార్డులు పంపిస్తుంది. కానీ ఈ ఉద్యోగికి అల్యూమినియంతో తయారు చేసిన భారీ పెట్టె లాంటి బహుమతిని పింపించింది. దీనిపై ప్రకాశమంతమైన యాపిల్ లోగో ఉంది. దీంతో పాలిషింగ్ వస్త్రం కూడా ఉంది. ముఖ్యంగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా సంతకం చేసిన నోట్ సైతం పంపించడం గమనార్హం. ఉద్యోగి పదేళ్ల సర్వీస్‌ను సూచిస్తూ బహుమతిపై 10 సంఖ్యను జోడించడం ప్రత్యేకతగా నిలిచింది. పెద్దగా ఉద్యోగులను తొలగించని అతికొద్ది కంపెనీల్లో యాపిల్ ఒకటి. గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్దపెద్ద సంస్థలు లేఆఫ్స్ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. ఇదే కాక ఆయా సంస్థల్లో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులకు సైతం జీతాలు తగ్గించడం వంటి చర్యలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సేవలను గుర్తించి బహుమతులు పంపించిన యాపిల్ సంస్థను పలువురు అభినందిస్తున్నారు. (ఇదీ చదవండి: రూ.14 వేలకే ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!) -
సింపుల్ & స్వీట్
ఖరీదైన గిఫ్ట్లలోనే ప్రేమ ఉండదు. ప్రేమ గొప్పతనం అదే కదా! సింపుల్‌గా, తక్కువ ఖర్చుతో ప్రేమకానుకలు ఇవ్వడానికి మార్కెట్లో బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. మచ్చుకు కొన్ని... ► హార్ట్ షేప్డ్ మగ్స్, హార్ట్ పేష్డ్ చాక్లెట్స్ ► 365 లవ్ మెసేజ్‌లు, తియ్యటి టోఫీలతో కూడిన జార్ ► రొమాంటిక్ గ్రీటింగ్ కార్డ్స్ ► వాలంటైన్స్ డే క్రిస్టల్ మెమెంటో ► ఫ్లోటింగ్ హార్ట్స్ గ్లాస్ఫ్రేమ్స్ ► ‘ఇట్ వాజ్ ఆల్వేస్ యూ’ ఫొటోపోస్టర్ ► రొటేటింగ్ పర్సనలైజ్డ్ పెన్ స్టాండ్ ► మెటల్ ఫొటో కీచైన్ ► వుడెన్ పర్సనలైజ్ జిగ్సా పజిల్ ►లవ్ నెవర్ ఎండ్స్ ఫ్రేమ్ ► లవ్ సర్టిఫికెట్ విత్ ఫ్రేమ్ టెక్సావి అయితే... ► ఫుజీ ఫిల్మ్ ఇన్స్టాక్స్ మినీ–11 కంపాక్ట్ ఇన్స్టంట్ కెమెరాతో క్రెడిట్–కార్ట్ సైజ్‌లో ఫొటోలు తీసుకోవచ్చు ► బిసైడ్ ల్యాంప్: మన వాయిస్‌తో రకరకాల రంగులను ఇల్లంతా వెదజల్లుతుంది ► రక రకాల హెయిర్‌స్టైల్స్‌ను ఇష్టపడే వారి కోసం: డైసన్ ఎయిర్‌రాప్ ► వీడియో గేమ్ ప్రేమికుల కోసం... ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్ కన్సోల్, లాగిటెక్ ఎ30 గేమింగ్ హెడ్సెట్ ► సంగీత ప్రేమికుల కోసం... జేబియల్ మినీబ్లూ స్పీకర్, అమెజాన్ ఎకో స్టూడియో స్పీకర్, శాంసంగ్ ఎంఎక్స్–ఎస్టీ 40బీ సౌండ్ టవర్ ► సెల్‌ఫోన్‌లోని మీ విలువైన జ్ఞాపకాల ఫొటోలను అప్పటికప్పుడు ప్రింట్ తీసుకోవడానికి... హెచ్‌పీ స్ప్రోకెట్పోర్టబుల్ ప్రింటర్ -
దర్శకుడికి కమల్ ఖరీదైన కానుక
నటుడు కమలహాసన్‌ను సినిమా సైక్లోపీడియా అంటారు. చిత్రంలో 24 క్రాప్ట్స్కు చెందిన ఏ అంశాన్ని అయినా తడమాడకుండా చెప్పే నటుడు ఈయన. ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కమలహాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్ర విజయంపై ప్రేక్షకుల్లో ఎలాంటి సందేహాలు ఉండవని చెప్పవచ్చు. కాగా విక్రమ్ చిత్రం తరువాత కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై వరుసగా చిత్రాలను నిర్మించనున్నారు. ఆయన నటించే చిత్రాలతో పాటు ఇతర హీరోలతోనూ చిత్రాలు నిర్మించనున్నారు. కాగా ఇండియన్–2 చిత్రం తరువాత కమలహాసన్ దర్శకుడు హెచ్ వినోద్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇటీవల అజిత్ కథానాయకుడిగా తెరకెక్కించిన తుణివు చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈయన చెప్పిన కథ కమలహాసన్‌కు బాగా నచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే కమలహాసన్ దర్శకుడు వినోద్‌కు చిత్రం ప్రారంభానికి ముందే అడ్వాన్సుగా ఒక ఖరీదైన కారును కానుకగా ఇచ్చారని సమాచారం. సాధారణంగా చిత్రం సక్సెస్ అయితే ఆ చిత్ర నిర్మాత దర్శకడికి ఏదో ఒక ఖరీదైన కానుకను ఇవ్వడం జరుగుతుంటుంది. అలాంటిది కమలహాసన్ చిత్రం ప్రారంభం కాకుండానే కారును కానుకగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. -
మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చా? ఈ విషయాలు తెలుసా?
ఫండ్ పథకంలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా? – శ్రీలలిత మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని పిల్లల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలి. మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్ సంస్థలు ఆమోదించవు. ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవడం ఒక్కటే మార్గం. నేను ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఓ మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 లేదా 5 స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా? – రాజ్‌దీప్ సింగ్ ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్‌ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్ చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు. 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోండి. విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇది పన్ను ఆదా అవుతుంది. -ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అంకుల్‌కి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కిడ్నాప్ చేశా! నివ్వెరపోయిన పోలీసులు
ఒక వ్యక్తి ఇంటి బటయ ఆడుకుంటున్నా చిన్నారిని కిడ్నాప్ చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించి నిందితుడిన అరెస్టు చేశారు. ఐతే విచారణలో అతడు చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా పోలీసులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే...21 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని గౌతమ్‌పురిలో ఇంటి ముంగిట ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్‌కి గురయ్యింది. దీంతో చిన్నారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు రెండు రోజుల నుంచి చిన్నారి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాధితుడు పొరిగింటి వ్యక్తి కిడ్నాప్ అయిన రోజే అతను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తూ.. ఆవ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో నిందితుడిని గట్టిగా విచారించగా.. తన మేనమామకు పిల్లలు లేరని, తన మేనత్తకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారని చెప్పాడు. అందుకని వారికి ఈ బాలుడిని గిఫ్ట్‌గా ఇచ్చేందుకే ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్) -
చిన్నకూతురు శ్రీజకి చిరంజీవి కాస్ట్లీ గిఫ్ట్.. ఎన్ని కోట్లంటే..!
మెగాస్టార్ చిరంజీవికి కుటుంబం అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఖాలీ సమయం దొరికితే చాలు.. ఫ్యామిలీతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతాడు. కొడుకు కూతుళ్లతో పాటు మనవరాళ్లను ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. ముఖ్యంగా చిన్న కూతురు శ్రీజ అంటే మెగాస్టార్‌కు చాలా ఇష్టం. ఆమె ఏం అడిగినా వెంటనే కాదనకుండా చేసేస్తాడట. తాజాగా తన చిన్న కూతురు శ్రీజకు మెగాస్టార్ ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రూ. 35 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని కూతురికి కొనిచ్చాడట. ఆ ఇంటిని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో కొనుగోలు చేశారని సమాచారం. ఈ ఇంటిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయట. తాను చేసిన, చేయబోతున్న సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌తో ఈ ఇంటిని కొన్నారట. చిరు ప్రస్తుతం అనిల్ సుంకర, మైత్రీ మూవీస్‌లతో భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల ద్వారా వచ్చిన పారితోషికంతో పాటు చేయబోతున్న సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లతో ఆ ఇంటిని కొనుగోలు చేశారట. రూ.35 కోట్లు అంటే చిరంజీవికి చిన్న విషయమే కానీ.. విన్నవారికి మాత్రం ఇది చాలా పెద్ద విషయమే. (చదవండి: 'నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశాను'.. శ్రీజ ఇంట్రెస్టింగ్ పోస్ట్) ఇక శ్రీజ విషయానికొస్తే.. ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
మహిళా ఆటో డ్రైవర్‌కు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
తమిళసినిమా: మొదట్లో అక్క పాత్రలు.. అమ్మ పాత్రలు పోషించి ఆ తర్వాత కథానాయకి స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదు. దాన్ని సాధ్యం చేసిన నటి ఐశ్వర్య రాజేష్. ఈమె ఇప్పుడు సాధారణ హీరోయిన్ గానే కాదు. లేడీ ఓరియంటెడ్ కథా త్రాల హీరోయిన్గా రాణిస్తున్నారు. తాజాగా ఆమె నటింన చిత్రం డ్రైవర్ జమున. మహిళా డ్రైవర్‌గా బలమైన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని 18 ప్రిన్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించారు. కింగ్స్ లిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ గురువారం ఒక ప్రైవేట్ చానల్లో మహిళా ఆటోడ్రైవర్లను కలిశారు. ఇందులో చెన్నైతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మొత్తం 40 మందికిపైగా మహిళ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రీల్ మహిళా డ్రైవర్ ఐశ్వర్య రాజేష్‌తో రియల్ మహిళా ఆటో డ్రైవర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. నటి ఐశ్వర్య రాజేష్ వారి సాధక బాధకలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ ఆటో డ్రైవర్లలో ఒకరిని ఎంపిక చేసిన చిత్ర యూనిట్ ఆమెకు కొత్త ఆటోను కానుకగా అందించారు. దీని తాళం చెవిని ఆ మహిళా ఆటో డ్రైవర్‌కు నటి ఐశ్వర్యా రాజేష్ చేతుల మీదుగా అందించి ఆశ్చర్య పరిచారు. దీంతో డ్రైవర్ జమున చిత్ర యూనిట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు అభినందిస్తున్నారు. -
పెళ్లైన మొదటి రోజే నటి పూర్ణకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన భర్త
సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్ అయిన పూర్ణ ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే,కెరీర్లోనూ దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా పూర్ణకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పూర్ణకు ఆమె భర్త షానిద్ కపూర్ పెళ్లైన తొలిరాత్రే సర్ప్రైజ్ చేశాడట. కాస్ట్లీ అండ్ రేర్ డైమండ్ రింగును ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. అంతేకాదు ఆ రింగ్ నార్మల్‌గా చూస్తే పూర్ణ పేరు ఉండేలా రివర్స్‌లో చూస్తే షానిద్ పేరు కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ఈ గిఫ్ట్ చూసిన పూర్ణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. ఇప్పటికే పూర్ణకు ఆమె భర్త దాదాపు 170 తులాల బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లాను కూడా ఆమె పేరు మీద గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటి ఖరీదు సుమారు రూ. 30కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నిర్మాత రవీందర్, ధరెంతంటే!
ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి పెళ్లితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారరు. రెండు నెలల క్రితం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో, వార్తల్లోకెక్కారు. తాము ఒక్కటయ్యామంటూ ఫొటోలు షేర్ చేయడంతో వీరిని ట్రోల్స్ ఆటాడుకున్నారు నెటిజన్లు. దీనికి కారణం నిర్మాత రవిందర్ అధిక బరువు. కేవలం డబ్బు కోసమే రవిందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందని ఈ జంటను టార్గెట్ చేశారు. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు అయితే ఈవేవి పట్టించుకుని ఈ జంట తమ దాంపత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా భార్యకు కాస్ట్లీ కారు బాహుమతిగా ఇచ్చి తనపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు నిర్మాత రవీందర్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. మనం ప్రేమించే వ్యక్తి.. తిరిగి మనల్ని అంతే గొప్పగా ప్రేమిస్తే అది మరింత విశేషం. కొత్త భార్య, కొత్త జీవితం, కొత్త కారు.. ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ సాయంతో స్వచ్ఛమైన స్వర్గం లాంటి కారును మనం పొందగలమని కోరుకుంటున్నాను’ అంటూ తమిళంలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా భార్యతో కలిసి షో రూం దగ్గర కారు కొంటున్న వీడియోను షేర్ చేశాడు. చదవండి: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి నిర్మాత రవీందర్ తన భార్య మహాలక్ష్మికి ఇచ్చిన ఈ కారు ధర ఆసక్తిగా మారింది. బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ మోరీస్ గ్యారేజీ కారుని భార్యకు ఆయన గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీని ధర సుమారు రూ. 32 లక్షల వరకు ఉంటుందని అంచనా. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. నటి మహాలక్ష్మికి గతంలో అనిల్ నేరేడిమిలితో వివాహం జరిగగా వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మహాలక్ష్మి 2019లో మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కుమారుడితో ఒంటరి నివసిస్తున్న ఆమె ఈ క్రమంలో రవీందర్ చంద్రశేఖరన్‌తో ప్రేమలో పడింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by ♜🅼🅰🅷🅰🅻🅰🅺🆂🅷🅼🅸❤️ (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by ♜🅼🅰🅷🅰🅻🅰🅺🆂🅷🅼🅸❤️ (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ!
దీపావళి.. భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఇది కూడా ఒకటి. దివాళి వచ్చిందంటే సంస్థలు తమ ఉద్యోగులకు బహామతులు ,బోనస్‌లు ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఓ యజమాని మాత్రం జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్‌ని తన ఉద్యోగులకు ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ సూరత్‌లోని శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్టర్ అత్యంత ప్రసిద్ధ వజ్రాల కంపెనీల్లో ఒకటి. దీని యజమాని గోవింద్ ధోలాకియా. ఆయన గతంలో కార్లు, ఇళ్లు అంటూ తన ఉద్యోగులకు అనేక బహుమతులను అందించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బహామతులను ఇవ్వదలచుకున్నాడు. అయితే అది జీవితాంతం గుర్తుండడంతో పాటు వాళ్లకు ఉపయోగపడేలా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారి కంపెనీలో పని చేస్తున్న 1000 మంది ఉద్యోగులకు దీపావళి కానుకగా సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను అందించారు. దీని ద్వారా వారికి జీవితకాలం కరెంట్ ఉచితంగా అందించాలనుకున్నాడు. ఇప్పటికే 550 మంది ఉద్యోగులకు ఈ గిఫ్ట్ అందించినట్లు మిగిలిన వాళ్లకి కూడా అతి త్వరలో అందజేయనన్నారు. పర్యావరణానికి కూడా ఇది బోనస్! ధోలికియా తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం వల్ల కేవలం ఉద్యోగులు లాభపడటమే కాక.. పర్యావరణానికి సైతం మేలు జరగుతంది. ఇంతకు ముందు కూడా SRK నాలెడ్జ్ ఫౌండేషన్ ద్వారా SRK ఎక్స్‌పోర్టర్ సాంఘిక సంక్షేమ విభాగం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ! -
కారు బహుమతిగా వచ్చిందని సంబర పడిపోయారు.. చివరికి బిగ్ ట్విస్ట్
ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): మహేంద్ర కంపెనీ కారు బహుమతిగా వచ్చిందని సమాచారం తెలిపి రూ.59 వేల నగదును కాజేసిన వైనమిది. బుధవారం బాధితుల వివరాల మేరకు ఆత్మకూరు పట్టణంలోని పడమరవీధి మసీదు ప్రాంతానికి చెందిన కిర్మాణి జమీర్ చెల్లెలు హఫీజాకు ఇటీవల మహేంద్ర కంపెనీ కారు బహుమతిగా వచ్చిందని పోస్ట్ ద్వారా స్క్రాచ్‌కార్డు వచ్చింది. ఇతర వివరాలకు ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు. చదవండి: షాకింగ్ ఘటన.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఏ మార్చి.. మాఅయితే తనకు కారు వద్దని, నగదు కావాలని ఆమె ఫోన్లో సంప్రదించింది. నగదు కావాలంటే రూ.14.50 లక్షలుత్రమే ఇస్తామని, ఇందుకోసం రూ.14,800 ట్యాక్స్ చెల్లించాలని వారు తెలిపారు. అనంతరం కొద్ది సేపటికే మళ్లీ రూ.44,400 జీఎస్టీ చెల్లించాలని, అకౌంట్ నంబరు సైతం తెలిపారు. దీంతో కోల్‌కతాకు చెందిన బ్యాంకు అకౌంట్ నంబరు 623102010017104 నగదును ఫోన్ పే ద్వారా జమ చేశారు. అనంతరం ఆ ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు హఫీజా, ఆమె సోదరుడు జమీర్ బుధవారం ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
'మానాడు' విజయంతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన హీరో శింబు. తాజాగా ఆయన నటించిన ‘వెందు తానింధాతు కాడు’సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోకి ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’పేరుతో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. చిన్న ఊరు నుంచి వచ్చిన ముత్తు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత ఇషారి.కే గణేష్.. హీరో శింబు, గౌతమ్ మీనన్‌లకు కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చారు. హీరో శింబుకు టొయోటొ న్యూ వెల్‌వైర్ కారును గిఫ్టుగా ఇవ్వగా, డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు ఖరీదైన బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. #VTK Producer @IshariKGanesh gifted a brand new luxury car to Actor @SilambarasanTR_ and a Motor bike to Director @menongautham at #VTK success celebrations.. pic.twitter.com/M0YVVsplXF — Ramesh Bala (@rameshlaus) September 24, 2022 -
ఆఫీసుకు రోజూ ఇలానే వస్తున్నారు..!
ఆఫీసుకు రోజూ ఇలానే వస్తున్నారు..! -
ఆసక్తికర సన్నివేశం.. చంటిబిడ్డకు పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమలోని లంక గ్రామాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శిస్తున్న క్రమంలో సీఎం జగన్ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. ముఖ్యమంత్రి జేబులోని పెన్నుతో బుడ్డోడు ఆడుకున్నాడు. ఇంతలో ఆ పెన్ను పొరపాటున జారి కింద పడింది. అనంతరం పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్.. ఆ ఖరీదైన పెన్ను అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పెదపూడి లంక గ్రామంలో ఈ ఘటన జరిగింది. చదవండి: అంబేద్కర్ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన -
సీఎం జగన్ కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
-
‘కార్తికేయ 2’ ట్రైలర్ ఈవెంట్, వేదికపైనే ఫ్యాన్‌కి నిఖిల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఇది. నిన్న(జూన్ 24) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌తో పాటు హీరోయిన్, డైరెక్టర్ ఇతర నటీనటులు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు వచ్చిన వీరాభిమానికి నిఖిల్ అక్కడిక్కడే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ సదరు అభిమాని ఈవెంట్లో లేచి మాట్లాడుతూ.. నిఖిల్ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన నటించిన ప్రతి సినిమా చూస్తున్నానని చెప్పాడు. ఆయనంటే తనకెంతో ఇష్టమంటూ నిఖిల్‌పై అభిమానం కురిపించాడు. ఇక అతడి అభిమానానికి ఫిదా అయిన నిఖిల్ అతడి వేదిక మీదకు పిలిచాడు. అనంతరం తన గుర్తుగా అక్కడికక్కడే తన ఫ్యాన్‌కు తను పెట్టుకున్న కూలిగ్గ్లాసెస్ బహుమతిగా ఇచ్చాడు. ఈవెంట్ అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సదరు ఫ్యాన్ మహేశ్ దాసరి ట్విటర్లో షేర్ చేశాడు. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన అతడి ట్వీట్‌పై నిఖిల్ స్పందిస్తూ.. ‘బ్రో.. ఆ గ్లాసెస్‌ను జాగ్రత్త చూసుకోండి. నాపై మీరు చూపించిన ప్రేమకు గుర్తుగా వెంటనే నేను ఇచ్చిన గిఫ్ట్ అది’ అని రాసుకొచ్చాడు. కాగా సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అనే ఆసక్తికర కథాంశంతో ఈ కార్తికేయ 2 తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్గా వైవా హర్ష కనిపించనున్నారు. Take good care of the Goggles bro … My spontaneous gift for ur love ❤️🙏🏽 #Karthikeya2 trailer event.. https://t.co/KKTHtuz264 — Nikhil Siddhartha (@actor_Nikhil) June 25, 2022 -
కమల్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు: అనిరుధ్
సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు లోక నాయకుడు కమల్ హాసన్. ఆయన తాజాగా నటించిన విక్రమ్ మూవీ బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్లు వసూళు చేసింది. కమల్ స్వయంగా నిర్మించిన ఈ మూవీ భారీ హిట్ అందుకోవడంతో ఆయన ఫుల్ ఖుషిలో ఉన్నాడు. విక్రమ్ ఇంతపెద్ద హిట్ అయినందుకు ఇందులో భాగమైన చిత్రం యూనిట్‌కు ఖరీదైన బహుమతులు ఇచ్చిన సింగతి తెలిసిందే. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య అయితే ఈ సినిమా విజయంలో పాటలు, సంగీతం కూడా ముఖ్య పాత్ర పోషించాయి. అయితే ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించిన అనిరుద్ రవిచందర్‌కు మాత్రం కమల్ ఏ గిఫ్ట్ ఇవ్వలేదట. ఈ విషయాన్ని అనిరుధ్ స్యయంగా వెల్లడించాడు. విక్రమ్ సక్సెస్ నేపథ్యంలో ఇటీవల అనిరుధ్ రవిచందర్ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా విక్రమ్ సక్సెస్‌కి కమల్ సర్ అందరికి గిఫ్ట్స్ ఇస్తున్నారు.. మరి ఆయన నుంచి మీకు గిఫ్ట్ ఏం రాలేదా? అని అడగడంతో అనిరుధ్ ఇలా స్పందించాడు. చదవండి: విరాటపర్వం ఎమోషనల్ లవ్ స్టోరీ ‘కమల్ హాసన్ సర్ నుంచి నాకు ఎలాంటి బహుమతి అందలేదు. అసలు ఆయనతో పని చేసే అవకాశం రావడమే నాకు పెద్ద గిఫ్ట్. ఇంకా సపరేట్గా ఎలాంటి గిఫ్ట్ అవసరం లేదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా ఈ మూవీ దర్శకుడు లోకేశ్ కనగరాజుకు కోటీ విలువ చేసే లెక్సాస్ లగ్జరీ కారును కమల్ బహుమతిగా ఇవ్వగా.. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన 13 మందికి బైక్‌లు ఇచ్చాడు. ఇక ఇందులో కీ రోల్ పోషించిన హీరో సూర్య రూ. 60 లక్షలు విలువ చేసే రోలెక్స్ వాచ్ కానుక ఇచ్చాడు. ఇక మరో ప్రధాన పాత్రలు పోషించిన య్సేతుపతి, ఫాహద్ ఫాజిల్లకు కూడా ఆయన ఎలాంటి కానుకలు ఇవ్వలేదని తెలుస్తోంది. -
హరీష్ శంకర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్‌కు నిర్మాత బండ్ల గణేష్ ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. కాగా హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన దబాంగ్ రీమేక్ చిత్రమే గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి పదేళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్‌కు సుమారు రూ. 5లక్షలు విలువచేసే వాచ్‌ను బండ్ల కానుకగా ఇచ్చారు. Successful Producer Bandla Ganesh gifted an expensive watch to Blockbuster Director Harish Shankar on the occasion of #DecadeForGabbarSingh #10YearsForGabbarSingh @harish2you @ganeshbandla pic.twitter.com/brxVrCRB6f — Vamsi Kaka (@vamsikaka) May 11, 2022 -
కూతురి కోసం చిరంజీవి ఊహించని బహుమతి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. చిరుతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆయన కూతురు సుష్మిత కొణిదెల కూడా చిరుతో సినిమాతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుప్తుంది. చాలాకాంలంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న సుష్మిత మొన్నటివరకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరించారు. చదవండి: రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2 ఇప్పుడు ఆమె గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ కోసం సుష్మిత ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా డైరెక్టర్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే కూతురికి గిఫ్ట్‌లాగా చిరు ఈ సినిమాను చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చదవండి: అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్ -
బాలినేని కుమారుడి గిఫ్ట్‌కు సీఎం జగన్ ఫిదా
సాక్షి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలులో మూడో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి సీఎం జగన్‌కు దూసుకెళ్తున్న బుల్(ప్రభుత్వం అభివృద్దిలో దూసుకుపోతోంది అన్నట్టుగా)ను బహుమతిగా అందజేశారు. ఈ బహుమతికి సీఎం జగన్ ఫిదా అయ్యారు. కాగా, అంతకుముందు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళల పక్షపాతి.. అన్నింటా మహిళలే ప్రధానం అని భావిస్తారు. మేనిఫెస్ట్‌లో ఇచ్చిన వాగ్ధానాలను 90 శాతం వరకు సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఇది చదవండి: దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉంది: సీఎం జగన్ -
కొత్త జంటకు రణ్‌బీర్ తల్లి కళ్లు చెదిరే ఫ్లాట్ గిఫ్ట్, ఖరీదెంతంటే!
Neetu Kapoor Gifted Costly Flat To Ranbir-Alia: కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్న బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్లు ఏప్రిల్ 14న మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యలు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సీక్రెట్‌గా ఈజంట పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహనికి బాలీవుడ్ ప్రముఖులెవరు హాజరు కాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, సిద్దార్థ్ మల్హోత్రా, ఇతర స్టార్స్ ఖరీదైన బహుమతులు పంపించారట. చదవండి: అందుకే దక్షిణాది సినిమాలు హిట్ అవుతున్నాయి: బాలీవుడ్ నటి ఇదిలా ఉంటే రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ తన కొడుకు-కొడలికి ఖరీదైన ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని ఓ విలాసవంతమైన అపార్టుమెంట్లో అలియా-రణ్‌బీర్‌ల కోసం 6 బెడ్రూం ప్లాట్‌ను బహుకరించినట్లు సమాచారం. దీని ఖరీదు దాదాపు 26 కోట్ల రూపాయలు ఉంటుందని బాలీవుడ్ సర్కిల్ టాక్. అయితే రణ్‌బీర్ మాజీ ప్రేయసి, హీరోయిన్ కత్రినా కైఫ్ అలియాకు రూ. 14. 5 లక్షల విలువ చేసే ప్లాటినం బ్రాస్లెట్ను కానుకగా పంపించిందట. చదవండి: OTT: దక్షిణాది భాషల్లోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే అలాగే దీపికా తన సొంత బ్రాండ్ చోపార్డ్ నుంచి ఈ కొత్త జంటకు రూ. 15 లక్షలు విలువ చేసే కపుల్ వాచ్ ఇవ్వగా.. ప్రియాంక చోప్రా ఆలియాకు రూ.9 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చిందట. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా అలియాకు రూ.3 లక్షలు వెరసి హ్యాండ్‌బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. వరుణ్ ధావన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అలియాకు రూ. 4 లక్షల గూచీ హై హీల్ చెప్పులను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలాగే అర్జున్ కపూర్ తన స్నేహితుడు రణబీర్ కపూర్‌కు గూచీ జిప్పర్ జాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు, దాని విలువ రూ. 1.5 లక్షలు. -
North Korea: కిమ్ సంచలన నిర్ణయం.. ఆనందంలో నార్త్ కొరియన్లు
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసినా ప్రపంచవ్యాప్తంగా సంచలనే అవుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు తన వైఖరితో వార్తల్లో ట్రెండింగ్‌లో నిలిచిన కిమ్.. మరోసారి సోషల్ మీడియాలో నిలిచారు. ఇంతకీ ఈసారి ఏం చేశారంటే.. ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్ యాంకర్ రీ చున్ హీకి(79).. కిమ్ జోంగ్ ఉన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆమె కోసం పాంగ్యాంగ్లో నిర్మించిన విలాసవంతమైన ఇంటిని స్వయంగా కిమ్ అందజేశారు. ఆమె మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు సైతం ఏర్పాటు చేపించినట్టు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. అయితే, ఉత్తర కొరియా, అధికారిక పార్టీ కోసం యాంకర్ రీ చున్ హీకి గత 50 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. కొరియా సంప్రదాయ వస్త్రధారణలో ఉండే రీ చున్.. దేశ అవసరాలకు తగ్గినట్టుగా తన స్వరాన్ని మార్చుకుంటూ యాంకరింగ్ చేస్తున్నారు. ఉత్తర కొరియాకు సంబంధించిన కీలక వార్తలన్నింటినీ ప్రజలకు తెలియచేసే రీ చున్ హీ.. విదేశీయులకూ సైతం సుపరిచితమే. కేసీఎన్ఏ టీవీ ఛానల్లో వార్తలు చదువుతూ ఆమె ‘పింక్ లేడీ’గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ప్రజల్లో దేశభక్తిని ఉప్పొంగించేందుకు భావోద్వేగభరితంగా, ఒకప్పటి దేశాధినేత మరణం మొదలు.. ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ జరిపే అణు పరీక్షలు వరకు.. ఉత్తర కొరియాకు సంబంధించిన అన్ని కీలక వార్తలను సందర్భాన్ని బట్టి స్వరాన్ని మారుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఆమెకు సేవలను గుర్తించిన కిమ్.. ఇలా బహుమానం అందించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. రీ చున్‌కు అధికార పార్టీ రుణపడి ఉంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటూ పార్టీ కోసం ఇదే ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ క్రమంలో ఆనందం వ్యక్తం చేసిన రీ చున్ హీ.. కిమ్ ఉదారతకు తన కుటుంబ సభ్యులు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని ఉద్వేగంగా తెలిపారు. ఇదిలా ఉండగా.. రీ చున్‌తో పాటు పార్టీ కోసం పని చేస్తున్న దాదాపు 10వేల మందికి కూడా కిమ్.. విలాసవంతమైన ఇళ్లను కానుకగా అందజేశారు. — The International Magazine (@TheIntlMagz) April 14, 2022 -
సాఫ్ట్వేర్ కంపెనీ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు గిఫ్ట్‌గా కార్లు!
తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఎదుగుదలలో శ్రమించిన ఉద్యోగుల కష్టాన్ని గుర్గించింది. ఏళ్ల తరబడి కంపెనీ అభివృద్ధికి తోడ్పాటును అందించిన ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందించింది. తమిళనాడుకు చెందిన ఐడియాస్2ఐటీ కంపెనీ చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. ఒకప్పుడు చిన్న కంపెనీగా మొదలై నేడు 500ల మంది పని చేసే స్థాయికి చేరుకుంది. అయితే పదేళ్ల కిందట ఈ కంపెనీ ప్రస్థానం మొదలైనప్పుడు.. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను కనుక చేరితే కంపెనీ లాభాలను ఉద్యోగులకు పంచి ఇస్తామంటూ ప్రకటించింది. నష్టాల్లో ఉన్నప్పుడు ఒకలా, లాభాల్లోకి వచ్చినప్పుడు మరోలా ఐడియాస్2ఐటీ కంపెనీ యాజమాన్యం భావించలేదు. పదేళ్ల క్రితం ఐడియాస్2ఐటీ కంపెనీ యాజమాన్యం ఇచ్చిన మాట నిలుపుకునే తరుణం వచ్చినట్టుగా గుర్తించింది. అనుకున్నదే తడవుగా కంపెనీ అభివృద్ధికి పాటుపడిన వంద మంది ఉద్యోగులను గుర్తించి.. అందరికీ ఒకేసారి మారుతి సుజూకి కంపెనీకి చెందిన కార్లను బహుమతిగా అందించింది. వారి కుటుంబ సభ్యులను పిలిచి ఓ వేడుకగా ఈ కార్లను అందజేసింది. తమిళనాడులోని చెన్నై కార్పోరేట్ వరల్డ్‌లో సరికొత్త కల్చర్ పెరుగుతోంది. కంపెనీ కోసం శ్రమించిన ఉద్యోగులను అక్కడి యాజమాన్యాలు గుర్తించి తగు విధంగా సత్కరిస్తున్నాయి. ఐడియాస్2ఐటీ కంపెనీ కంటే ముందు మరో సాఫ్ట్వేర్ కంపెనీ ఈ సంస్థలోని ఎగ్జిక్యూటివ్ స్థాయి వారికి ఒక్కొక్కటి కోటి రూపాయలు విలువ చేసే ఐదు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించింది. -
Crime News: ప్రియురాలి ఉసురు తీసిన సెల్‌ఫోన్ గిఫ్ట్
ప్రేమలో ఉన్నప్పుడు పరస్పరం కానుకలు ఇచ్చుకోవడం సహజం. అలాగే ప్రేమలో బ్రేకప్‌లు కూడా సర్వసాధారణమే. కానీ, మరో యువతితో పెళ్లి ఫిక్స్ కావడంతో బ్రేకప్ చెప్పిన ఆ ప్రియుడి తీరును ఆమె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో.. ప్రియురాలిపై కోపంతో దాష్టీకానికి పాల్పడ్డాడు. తాను కానుకగా ఇచ్చిన సెల్‌ఫోన్.. తిరిగి ఇవ్వడం లేదన్న కోపంతో ప్రియురాలిని ఏకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. జార్ఖండ్‌లోని పాకుర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువకుడు, సదరు బాధిత యువతి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో కూడా తెలుసు. అబ్బాయి ఇంట్లో అభ్యంతరాలు చెప్పకపోతే ఈ ఏడాదిలో వీళ్లద్దరికి వివాహం చేయాలని అనుకున్నారు కూడా. అయితే.. ఈ మధ్యే ఆ యువకుడికి మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. దీంతో ప్రియురాలికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అంతేకాదు తాను కొనిచ్చిన కాస్ట్లీ ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలంటూ ఆమెను అడుగుతూ వస్తున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఆదివారం ఉదయం స్థానిక మైదానంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూద్దామంటూ ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె గొంతు కోసి సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. రక్తపు మడుగులో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో ప్రియుడే ఆమెను బయటకు తీసుకెళ్లినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గట్టిగా నిలదీయడంతో నేరం ఒప్పుకున్నాడు నిందితుడు. -
మండుతున్న ఇంధన ధరలు...ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ..!
ఏ క్షణాన రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలైందో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరు దేశాల యుద్దం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. భారత్‌తో సహా పలు ప్రపంచ దేశాల్లో ఇంధన ధరలు రాకెట్లాగా దూసుకుపోతున్నాయి. ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. కాగా చెన్నైకు చెందిన ఓ సంస్థ ఇంధన ధరలకు విరుగుడుగా తన ఉద్యోగులను ఆశ్యర్యపరుస్తూ అద్బుతమైన గిఫ్ట్‌ను అందించింది. సైకిల్‌పై సవారి..! కొఠారి పెట్రోకెమికల్స్‌కు చెందిన మనాలి ప్లాంట్స్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులకు సైకిళ్లను గిఫ్ట్‌గా ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. వారంలో ఒకసారైనా సైకిల్ మీద ఉద్యోగులు ఆఫీసులకు రావాలని పేర్కొంది. దీంతో పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ఉపశమనం కలుగుతూనే...వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని కొఠారి పెట్రోకెమికల్స్ యాజమాన్యం పేర్కొంది. ఈ కంపెనీలో అటెండర్ నుంచి ఉన్నత ఉద్యోగులతో సహా సైకిల్‌పై రావాల్సిందంటూ కంపెనీ వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉద్యోగులు సైకిల్‌పై ఆఫీసులకు వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. చదవండి: వాట్సాప్ సంచలన నిర్ణయం..! -
కాస్ట్లీ గిఫ్ట్‌తో సమంతను సర్ప్రైజ్ చేసిన నయనతార
స్టార్ హీరోయిన్ సమంత కోలీవుడ్‌లో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ట్రయాంగిల్ ప్రేమకథతో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతపతి, నయనతార నటించారు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ద్వారా నయనతార, సమంతల మధ్యఫ్రెండ్షిప్ మరింత బలపడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సమంత కోసం నయనతార ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది. 'డియర్ ఖతీజా.. విత్ లవ్.. కణ్మణి' అంటూ నయన్ సమంత కోసం కాస్ట్లీ గిఫ్ట్ పంపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. థ్యాంక్యూ డార్లింగ్ నయన్ అంటూ పోస్ట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంతో పాటు శాకుంతలం, యశోద సినిమాలతో పాటు సామ్ హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
జానీ మాస్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
BB Kannada Host Gift To Dhee 14 Judge Jani: టాలీవుడ్‌కి చెందిన టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్స్‌లో జానీ మాస్టర్ ఒకరు. స్టార్ హీరోల సినిమాల్లో చాలామందికి జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ఇటీవలె బీస్ట్ మూవీ నుంచి 'అరబిక్ కుతు...' సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసింది కూడా ఆయనే. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో జానీ మాస్టర్‌కి మాంచి పేరుంది. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్తో ఆయన పనిచేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్‌కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు సుదీప్. ఖరీదైన థార్ కారును ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను జానీ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సుదీప్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ థార్ కారు ధర సుమారు రూ. 12-14 లక్షలు ఉండొచ్చని తెలుస్తుంది.కాగా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. త్వరలో విడుదల కానుంది. ఇందులో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. View this post on Instagram A post shared by Jani Master (@alwaysjani) -
ఇది కదా సహాయమంటే.. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ.2 కోట్ల బహుమానం!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. మరణించిన సహోద్యోగి కుటుంబ సభ్యులకు తన వద్ద ఉన్న బ్యాంకు 5 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు. నేటి షేరు ముగింపు ధర బట్టి చూస్తే వీటి విలువ రూ.2 కోట్లుకు పైగా ఉంటుంది. ''మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ వి.వైద్యనాథన్ తన వద్ద ఉన్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 5,00,000 ఈక్విటీ షేర్లను చాలా కాలం పాటు తనకు బాగా తెలిసిన మరణించిన సహోద్యోగి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు బహుమతిగా ఇచ్చినట్లు" బ్యాంక్ పేర్కొంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు గురువారం బీఎస్ఈలో 1.55 శాతం పెరిగి రూ.42.65 వద్ద ముగిశాయి. వైద్యనాథన్ ఇలా బహుమతిగా షేర్లు ఇవ్వడం మొదటిసారి కాదు. అతను ఇంతకు ముందు తన ట్రెయినర్, పనిమనిషి, డ్రైవర్‌తో పాటు అయిదుగురికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు. నాటి షేరు ముగింపు ధర బట్టి చూస్తే వీటి విలువ రూ.3.95 కోట్లుగా ఉంటుంది. ఈ అయిదుగురి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆయన ఈ మేరకు సహాయం చేశారు. వీరెవ్వరితోనూ ఆయనకు బంధుత్వం లేదని స్టాక్ ఎక్సేంజీలకు బ్యాంకు తెలిపింది. వైద్యనాథన్ ఇలా బహుమతిగా షేర్లను ఇస్తూ ప్రసిద్ధి చెందాడు. ఉదాహరణకు, గత ఏడాది మేలో వైద్యనాథన్ బ్యాంకు 4.5 లక్షల షేర్లను రూ.2.34 కోట్ల చొప్పున ముగ్గురు వ్యక్తులకు విరాళంగా ఇచ్చారు. వారందరికీ ఒక్కొక్కరికి 1.5 లక్షల షేర్లు వచ్చాయి. 2020లో వైద్యనాథన్ తన పాఠశాల ఉపాధ్యాయుడికి రూ.30 లక్షల మొత్తం విలువ గల ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇచ్చారు. (చదవండి: హ్యాకర్ల దెబ్బకు వణికిపోతున్న రష్యా.. వెబ్సైట్లు డౌన్.!) -
సీఎం జగన్ కి మహిళల అరుదైన గౌరవం
-
గుడ్‌న్యూస్: మహిళా దినోత్సవాన ఆర్టీసీ నజరానా!
సాక్షి, హైదరాబాద్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎస్ ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక కానుకలు ఇవ్వాలని నిర్ణయించింది. నగరంలో పీక్ అవర్స్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నాలుగు ట్రిప్పులను నడపనున్నట్లు తెలిపింది. ఈనెల 8న 60 ఏళ్లు పైబడిన మహిళలు వయసు ధ్రువపత్రం చూపి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని వెల్లడించింది. హెవీ వెహికిల్ నడపటంలో ఆసక్తి ఉన్న మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయిస్తూ, ఆసక్తి ఉన్న లైసెన్స్‌దారులు సమీపంలోని డిపోలో దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. 8వ తేదీ నుంచి 14 వరకు జీహెచ్ఎంసీ, వరంగల్ నగరాల పరిధిలో టీ24 టికెట్ ధరలపై రాయితీ ఉంటుందని తెలిపింది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రెండు సీట్లు రిజర్వ్ చేస్తామంది. ఇక సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో డ్రైవర్ వెనక రెండు సీట్లను మహిళలకు కేటాయించినట్లు, గుర్తుగా ప్రత్యేక రంగులు వేయించనున్నట్లు వివరించింది. అలాగే మార్చి 31 వరకు బస్టాండ్లలో ప్రత్యేకంగా కేటాయించే పర్పుల్ కలర్ బాక్సుల్లో తమ టికెట్లు వేస్తే, డ్రా ద్వారా విజేతలను గుర్తించి సంబంధిత డిపో నుంచి 30 కి.మీ. పరిధిలో ఉచితంగా ప్రయాణించేలా నెలవారీ సీజన్ టికెట్‌తోపాటు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ టికెట్‌తోపాటు తమ చిత్రాన్ని జోడిస్తూ 9440970000కు వాట్సాప్ చేస్తే, లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందిస్తామంది. చదవండి: గుడ్‌న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్ -
లక్కంటే వీళ్లదే.. ఒక్క రోజులోనే కోటీశ్వరులయిన డ్రైవర్, పనిమనిషి
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి. వైద్యనాథన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. తన ట్రెయినర్, పనిమనిషి, డ్రైవర్‌తో పాటు అయిదుగురికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు. సోమవారం నాటి షేరు ముగింపు ధర బట్టి చూస్తే వీటి విలువ రూ. 3.95 కోట్లుగా ఉంటుంది. సొంతింటి కోసం ఈ అయిదుగురి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆయన ఈ మేరకు సహాయం చేశారు. వీరెవ్వరితోనూ ఆయనకు బంధుత్వం లేదని స్టాక్ ఎక్సేంజీలకు బ్యాంకు తెలిపింది. వ్యక్తిగత ట్రెయినర్ రమేష్ రాజుకు 3 లక్షల షేర్లు, పనిమనిషి ప్రాంజల్ నర్వేకర్.. డ్రైవర్ అలగర్‌సామికి చెరి 2 లక్షలు, ఆఫీస్ సపోర్ట్ ఉద్యోగి దీపక్ పఠారే మరో పని మనిషి సంతోష్ జోగ్లేకు చెరి 1 లక్ష షేర్లను వైద్యనాథన్ బహుమతిగా ఇచ్చారు. గతంలో ఆయన గతంలో కూడా వ్యక్తిగత హోదాలో కొందరు వ్యక్తులకు ఇలాగే షేర్లను బహుమానంగా ఇచ్చారు. మరోవైపు, సామాజిక సేవా కార్యకలాపాల కోసం వైద్యనాథన్‌కు చెందిన రుక్మణి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ 2 లక్షల షేర్లను విరాళంగా ఇచ్చినట్లు బ్యాంక్ వివరించింది. -
గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ అందుకున్న స్టార్ ఫుట్‌బాలర్
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్‌ను బహుమతిగా అందుకున్నాడు. ఫిబ్రవరి 5న రొనాల్డో పుట్టినరోజు పురస్కరించుకొని రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ రూ.1.2 కోట్ల విలువైన బ్లాక్ కాడిల్లాక్ ఎస్యూవీ మోడల్ కారును గిఫ్ట్‌గా అందించింది. గర్ల్‌ఫ్రెండ్ కారు ఇచ్చిన మరుక్షణమే రొనాల్డో అదే కారులో మాంచెస్టర్ యునైటెడ్ గ్రౌండ్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోనూ జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. కార్లంటే పిచ్చి ఉన్న వ్యక్తికి ఒక మంచి గిఫ్ట్‌ను ఇవ్వడం సంతోషం కలిగించింది. నాకు ఒక మంచి భర్తను.. పిల్లలకు మంచి తండ్రిని రొనాల్డో రూపంలో అందించినందుకు దేవుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రొనాల్డోను మించిన పర్ఫెక్షనిస్ట్ మరొకరు లేరు. తనే నాకు ఆదర్శం అంటూ ఎమెషనల్‌గా రాసుకొచ్చింది. కాగా సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్‌ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు View this post on Instagram A post shared by Georgina Rodríguez (@georginagio) -
ఆ ఆనందం వెలకట్ట లేనిది!: హృదయాన్ని కదిలించే వైరల్ వీడియో!:
ఇంతవరకు మనం ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. చాలా వరకు మనస్సుకు హత్తుకునేవి, కదిలించేవి చూశాం. అచ్చం అలాంటి వైరల్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. పైగా తమిళ నటుడు మాధవన్‌ని సైతం ఆకట్టుకుంది. (చదవండి: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!) అసలు విషయంలోకెళ్తే...ఆ వీడియోలో ఒక కొడుకు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా బహుమతి తీసుకువచ్చి ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆమె సందేహంగా ఆ కవర్ని తెరుస్తుంది. ఆ తర్వాత ఆమె అందులో ఉన్న రూ. 8 వేలు ఖరీదు చేసే ఫోన్‌ని చూసి ఒక్కసారిగా చాలా సంబరపడిపోతుంది. పైగా ఆ ఆనందం మాటల్లో చెప్పలేనది, వెలకట్టలేనిది. ఈ మేరకు మనసును కదిలించే ఈ వీడియోకి "ఈ ఆనందాన్ని వెలకట్ట లేం" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ విఘ్నేష్ అనే యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో ఎంతో మంది నెటిజన్లను కదిలించింది. ఆఖరికి తమిళనటుడు మాధవన్ సైతం "తల్లి ముఖంలో తెచ్చిన ఆనందం వెలకట్ట లేనిది" అని తమిళంలో క్యాప్షన్ ఇచ్చి మరీ రీట్విట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) Adhula Irundha Mobile-oda Velai Verum 8800 Rs Dhan...! Aana Enga Amma Patta Sandhoshathuku Velayae Kidayaadhu ❤️ Birthday Gift..! pic.twitter.com/4QZJE7Ocii — Vignesh (@VigneshSammu) January 5, 2022 -
యువ మహిళా షూటర్ కొనికా లాయక్ ఆత్మహత్య.. సుసైడ్ నోట్ రాసి..
కోల్‌కతా: జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ యువ క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడటం తోటి క్రీడాకారులని దిగ్భ్రాంతికి గురిచేసింది. కోల్‌కతాలో తాను ఉంటున్న హాస్టల్లో కొనికా లాయక్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్లో రాణించలేకపోతున్నా అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు నెలల్లో నలుగురు క్రీడాకారులు ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో సోనూసూద్ రూ. 2.70 లక్షల విలువైన జర్మన్ రైఫిల్‌ను బహుమతిగా అందించడం ద్వారా ఈ క్రీడాకారిణీ వార్తల్లో నిలిచింది. కోనికా కోల్‌కతాలో మాజీ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్ వద్ద శిక్షణ పొందుతోంది. కోనికా లాయక్ జనవరిలో సోనూ సూద్‌ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్ చేసింది. అందులో.. 11వ జార్ఖండ్ స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో నేను రజతం, బంగారు పతకం సాధించాను. అయితే, ప్రభుత్వం నుంచి నాకు ఏమాత్రం సహాయం లేదు. దయచేసి సహాయం చేయండని ట్వీట్ చేసింది. తాను ఈ ట్వీట్‌ని సోనూ సూద్‌తో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ అధికారిని కూడా ట్యాగ్ చేసింది. में आपको राइफल दूंगा। आप देश को मेडल दे देना। आपकी rifle आप तक पहुंच जाएगी। @SoodFoundation https://t.co/4JFXdrQl2l — sonu sood (@SonuSood) March 10, 2021 చదవండి: Viral: మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న.. -
ఎంత మంచివాడవయ్యా! ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌గా ఎలక్ట్రిక్ స్కూటర్లు
దీపావళి పండగ అంటేనే సంతోషం, ఆనందం. దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు దీపావళికి ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తుంటాయి. ఇతరత్రా గిఫ్టులు అందచేస్తాయి. కానీ సూరత్‌కి చెందిన ఈ కంపెనీ యజమాని ఔరా అనిపించే పని చేశాడు. సూరత్‌లో సూరత్‌కి చెందిన అలియన్స్ సంస్థ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. కంపెనీ ఎదుగుదలతో తోడ్పాటు అందించిన ఉద్యోగులకు ఏదైనా చేయాలని ఆ కంపెనీ యజమాని తలిచాడు. దీపావళి పండుగని అందుకు తగిన సందర్భంగా ఎంచుకున్నాడు. రూ.76,848 తమ ఆఫీసుకు వచ్చి పోయే ఉద్యోగులకు సౌకర్యంగా ఉండటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఒక్కో ఉద్యోగికి ఓకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ని పండగ గిఫ్ట్‌గా అందించాడు. ఒక్క స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ.76,848లుగా ఉంది. మొత్తం సంస్థలో ఉన్న ముప్రై ఐదు మందికి ఈ స్కూటర్లను అందించాడు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఓకినావా స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 88 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గరిష్ట వేగం గంటకు 58 కి.మీలు. ఒకసారి ఛార్జ్ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఆందోళన చెందాం ‘పెరుగుతున్న పెట్రోలు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే వాటి నుంచి మా కంపెనీ ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు ఈవీలు ఉపయోగించం వల్ల కొంతైనా కాలుష్యం కూడా తగ్గుతుంది. అందుకే ఈవీ స్కూటర్లు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాని అలయన్స్ డైరెక్టర్ సౌరభ్ అంటున్నారు. -
లేడీ బాస్ ఉదారత.. ఒక్కో ఉద్యోగికి రూ.7.5లక్షలు గిఫ్ట్
సాధారణంగా సమాజంలో మూడు రకాల బాస్లుంటారు. ఒకరు మంచివారు. ప్రతిభావంతులను గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహిస్తారు. మరికొందరు బాస్‌లు ఉంటారు.. వీరికి ఉద్యోగి ఎంత బాగా పని చేసినా సంతృప్తి ఉండదు. ఏదో విధంగా వారిని ఇబ్బందిపెడుతూనే ఉంటారు. ఇక మూడో రకం బాస్‌లు.. వీరు నూటికో కోటికో ఒక్కరు. ఈ కోవకు చెందిన బాస్‌లు ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లానే చూస్తారు. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉంటారు. కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు సమాన వాటా కల్పిస్తారు. ఇప్పుడు ఈ బాస్‌ల టాపిక్ ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మహిళా బాస్ మీద ప్రశంలసు కురిపిస్తున్నారు నెటిజనులు. అమ్మతనాన్ని చూపించావ్ అంటూ పొగుడుతున్నారు. ఈ బాస్‌ను ఇంతలా ప్రశంసించడానికి కారణం ఏంటంటే.. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికి సమానంగా పంచింది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి 7.5లక్షల రూపాయల చొప్పున ఇచ్చి.. తన మంచి మనసు చాటుకుంది సదరు మహిళా బాస్. ఆ వివరాలు... (చదవండి: ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే) స్పాంక్స్ కంపెనీ లేడీ బాస్ పేరు సారా బ్లేక్లీ. ఇక ల్యాడ్‌బైబిల్ ప్రకారం, పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్ స్పాంక్స్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత సారా బ్లేక్లీ కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే సారా ఆ వచ్చిన మొత్తాన్ని తానే వాడుకోలేదు. కంపెనీ ఉద్యోగులందరికి దానిలో వాటా ఇస్తూ.. తన ఉదార మనస్తత్వాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు పార్టీ ఇచ్చింది సారా. ఇక పార్టీలో ఓ పెద్ద బాంబు పేల్చింది సారా. “నేను మీకు ఓ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వాలని భావించాను. దానిలో భాగాంగా మీలో ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు 10 వేల డాలర్లు విలువ చేసే ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. టికెట్ వద్దు అంటే డబ్బులే తీసుకోవచ్చు’’ అని తెలిపింది. (చదవండి: అద్భుతం చేసిన ఫేస్బుక్.. ఏకంగా 58 ఏళ్ల తర్వాత) "ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని తమదైన రీతిలో జరుపుకోవాలని, జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందుకే మీకు ఈ గిఫ్ట్’’ అని ప్రకటించింది సారా. ఈ వార్త విని అక్కడ ఉన్న ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతేశారు. కొందరు ఆనందం ఎక్కువయ్యి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సారాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: ట్రెండింగ్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్, మార్మోగుతున్న శ్రీరామ్ పేరు -
గిఫ్ట్ బాక్స్ చూసి షాక్ అయిన వధువు.. ఇంతకీ అందులో ఏమందంటే..!
ఇటీవల పెళ్లిలో జరుగుతున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని వీడియోలు వధువుకు సంబంధించినవి ఉండగా, మరొకొన్ని వరుడువి, ఇంకొన్ని సందర్భాల్లో వధూవరులు ఇద్దరివీ ఉంటున్నాయి. ఆ మంటపంలో ఎవరో ఒకరు ఆ వేడుకల్ని వీడియో తీసి అందరికీ షేర్ చేస్తున్నారు. అందులో కొన్ని నెట్టింట దర్శనమిస్తూ వైరల్‌గా మారి హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ రోజుల్లో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం షరా మామూలే. తాజాగా ఈ వీడియోలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అందులో.. వధువు, వరుడు వేదికపై కూర్చొని ఉన్నారు. వివాహానికి విచ్చేసిన అతిథిలు.. కొత్త జంటకు విషెస్ చెబుతూ బహుమతులను ఇస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం అందరి ముందే ఓపెన్ చెయ్యాలని వధువుని కోరారు. దీంతో అందులో ఏదో ప్రత్యేకమైన వస్తువు ఉంటుందని అందరూ ఆసక్తిగా చూడసాగారు. తీరా వధువు ఆ గిఫ్ట్ బాక్సును ఓపెన్ చేసి చూడగా.. చపాతీ కర్రను ఉండడంతో ఓ వైపు షాక్‌కు గురి కాగా మరో వైపు నవ్వింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ᴘᴜɴᴊᴀʙi couples (insta.gram)❤️ (@punjabi_couples_64) చదవండి: వరుడిని చూసి పట్టరాని సంతోషంతో గాల్లో ముద్దులు పంపిన వధువు -
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గత ఏడాది.. లాభాల్లో 28% వాటాను కార్మికులకు ప్రకటిం చగా, ఈ ఏడాది దసరా కానుకగా దానిని 29 శాతానికి పెంచినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో సింగరేణిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను సీఎంఓ ఆ ప్రకటనలో వెల్లడించింది. కార్యకలాపాలు విస్తరించాలి సింగరేణి లాభాల్లో వాటాను పండుగకు ముందే కార్మికులకు చెల్లించాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌ను సీఎం ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిం చారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సంస్థ కార్యకలాపాలను బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి విస్తరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కార్మికుల నైపుణ్యాన్ని ఆయా ఖనిజాల తవ్వకాలలో కూడా వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రిటైర్డ్ కార్మికులను ఉపయోగించుకుందాం ‘ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలు రిటైర్డ్ సింగరేణి కార్మికులను వినియోగించుకుని బొగ్గు తదితర ఖనిజాల గనులను నిర్వహిస్తూ లాభాలు గడిస్తున్నాయి. మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? వారి నైపుణ్యాన్ని, శక్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుంది. బొగ్గుతో పాటు రాష్ట్రంలోని ఇతర మైనింగ్ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుంది..’అని సీఎం స్పష్టం చేశారు. సాయంపై సానుకూల స్పందన: రిటైర్డ్ సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను నెలకు రూ.2 వేల లోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా వారికి సాయం చేయగలమో.. నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం లాభాల్లో వాటా ను ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి సింగరేణి కోల్ బెల్టు ఏరియా ప్రజా ప్రతినిధులు, టీజీబీకేఎస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు, టీబీజీకేఎస్ నేతలు పాల్గొన్నారు. ఒక్కో కార్మికుడికి రూ.18 వేలు హైదరాబాద్: సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభాల్లో 29 శాతం వాటా ను కార్మికులకు అందజేస్తే .. సంస్థలో పనిచేస్తున్న 43 వేల మంది కార్మికులు సగటున రూ.18 వేలు పొందనున్నారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.272 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జించింది. ఇందులో 29 శాతం అంటే రూ.79 కోట్లను కార్మికులకు లాభా ల్లో వాటాగా పంచనున్నారు. మూడు రకాలుగా కార్మికులకు లాభాల్లో వాటాల చెల్లింపులుంటలాయి. భూగర్భ గనుల కార్మికులకు కొంత అధికంగా, ఉపరితల గనుల కార్మికులకు మధ్యస్తంగా, ఇతర సివిల్ విభాగాల్లో పనిచేసే వారికి కొంత తక్కువగా వాటాలు చెల్లిస్తారు. పనిచేసే గనులు/విభాగం, పనిచేసిన రోజుల ఆధారంగా ఒక్కో కార్మికుడికి రూ.17 వేల నుంచి రూ.25 వేల వరకు లాభాల్లో వాటా వచ్చే అవకాశముందని సింగరేణి అధికారవర్గాలు తెలిపాయి. కరోనా ఎఫెక్ట్: కరోనా ప్రభావం సింగరేణి సంస్థ లాభాలపై పడింది. 2019–20లో సంస్థ రూ.999.86 కోట్ల లాభాలు ఆర్జించింది. ఆ ఏడాది లాభాల్లో 28 శాతం అనగా రూ.278 కోట్లను కార్మికుల వాటాగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కో కార్మికుడు సగటున రూ.60,468 వాటాను అందుకున్నాడు. ఈసారి లాభాల్లో వాటాను 29 శాతానికి పెంచినా కార్మికులకు లభించేది సగటున రూ.18 వేలు మాత్రమే కావడం గమనార్హం. -
అల్లు అర్జున్‌కి అరుదైన బహుమతి..160 ఏళ్ల పురాతన గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడులో కూడా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కేరళలో బన్నీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి అభిమానులు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఆయన సినిమాలకు కేరళలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తుంటాయి. బన్నీ కూడా కేరళ అభిమానులతో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటాడు. తాజాగా అల్లు అర్జున్ కి ఓ కేరళ అభిమాని ఓ అరుదైన గిఫ్ట్ ని బహూకరించాడు. (చదవండి: ఫుష్ప బిగ్ అప్డేట్: రష్మిక లుక్ అదిరిందిగా) కేరళలో పుట్టి దుబాయ్‌లో సెటిలైన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్‌కి బన్నీ అంటే ఎనలేని అభిమానం. తన అభిమాన హీరోని ఒక్కసారైనా నేరుగా కలవాలనుకున్నాడు కిల్టన్. షూటింగ్ నిమిత్తం ఇటీవల యూఏఈ వెళ్లిన బన్నీని కిల్టన్ కలిశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్‌ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ వీడియోని షేర్ చేశాడు. అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొదటి పార్ట్ ని త్వరలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్‌తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ మూవీలో రష్మిక మందన్నా లుక్ కూడా విడుదలైంది. ఇందులో రష్మిక గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. -
వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన వేడుక. ఈ సందర్భాన్ని జీవితాంతం మర్చిపోలేని మధురానుభూతిగా మార్చుకోవడం కోసం తమ స్థాయికి తగ్గట్లు ఖర్చు పెడతారు. పెళ్లిలో మిగితవన్ని ఒక ఎత్తు అయితే.. విందు ఒక ఎత్తు. రకరకాల పదార్థాలతో వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేస్తారు. పెళ్లికి వచ్చినవారు తృప్తిగా భోంచేసి.. తమను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ ఓ జంట పెళ్లికి అతిథులు తెచ్చిన బహుమతి ఖరీదు ఆధారంగా వారికి విందు భోజనం పెడతామని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆహ్వాననోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. రెడిట్‌లో ‘బిగ్గర్ క్యాష్ గిఫ్ట్.. బెటర్ డిన్నర్’ అనే క్యాప్షన్‌తో వైరలవుతోన్న ఈ నోట్లో కాబోయే దంపతులు.. తమ వివాహ బహుమతి కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలియజేయమని అతిథులను అడిగారు. గిఫ్ట్ కోసం చేసే ఖర్చును బట్టి వారికి డిన్నర్లో ఏం ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు సదరు జంట. ఈ నోట్ ప్రకారం సదరు జంట తమ వివాహానికి హాజరయ్యే అతిథులను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ నాలుగు గ్రూప్‌లకు ‘ప్రేమపూర్వక బహుమతి’, ‘బంగారు బహుమతి’, ‘వెండి బహుమతి’, ‘ప్లాటినం బహుమతి’ అని వేర్వేరు పేర్లు పెట్టారు. పెళ్లికి వచ్చిన అతిథులు తమకిచ్చే బహుమతి విలువ 250 డాలర్లు అయితే, అది 'ప్రేమపూర్వక బహుమతి' కేటగిరీలోకి వస్తుంది. వారికి ఇచ్చే విందులో రోస్ట్ చికెన్ లేదా చేపను వడ్డిస్తారు. అతిథులు కొనుగోలు చేసే బహుమతుల విలువ 251-500 డాలర్ల మధ్య ఉంటే, అది 'సిల్వర్ గిఫ్ట్' కేటగిరీ కిందకు వస్తుంది. వారికి డిన్నర్లో భాగంగా మొదటి కేటగిరీలో ఉన్న వంటలు లేదా ముక్కలు చేసిన స్టీక్, సాల్మన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అతిథులు కొనుగోలు చేస్తున్న బహుమతుల విలువ 501-1000 డాలర్ల మధ్య ఉంటే, అది 'బంగారు బహుమతి' కేటగిరీ కిందకు వస్తుంది. ఇక వారికి డిన్నర్లో మొదటి, రెండవ కేటగిరీ కింద వంటకాలు కలిపి వడ్డిస్తారు. అవి వద్దనుకుంటే ఫైలెట్ మిగ్నాన్, ఎండ్రకాయల తోకలను ఎంచుకోవచ్చు. అతిథులు కొనుగోలు చేస్తున్న బహుమతుల విలువ 1000 -2500 డాలర్ల లోపు ఉంటే అది 'ప్లాటినం గిఫ్ట్' కేటగిరీ కిందకు వస్తుంది. ఇక వారికి డిన్నర్లో మొదటి, రెండవ, మూడో కేటగిరీ కింద వంటకాలు వడ్డిస్తారు. వద్దనుకుంటే ఎండ్రకాయతో పాటు సావనీర్ షాంపైన్ గోబ్లెట్ని వడ్డిస్తారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మీరు భారతీయులై ఉండి.. ఇలాంటి రూల్స్ పెడితే.. మీ పెళ్లికి మీరిద్దరే తప్ప వేరే బంధువులు ఎవరు రారు.. అయినా గిఫ్ట్‌ని బట్టి భోజనం పెట్టడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వర్క్ ఫ్రం.. వెడ్డింగ్! పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా? -
మీరాబాయి గొప్ప మనసు, నెటిజన్లు ఫిదా, వైరల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం విజేతలకు పెట్టని అభరణం. దీన్ని 2020 టోక్యో ఒలింపిక్స్ ఇండియాకు తొలి పతకాన్ని అందించిన ఘనతను చాటుకున్న వెయిల్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈ మాటను మరోసారి నిరూపించారు. మహిళల విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత, మీరాబాయి తన కల నెరవేరడానికి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అరుదైన బహుమతిని అందించింది. అకాడమీకి వెళ్లేటపుడు సహకరించిన ప్రతి ఒక్కరినీ గౌరవించాలని భావించారు. అలా మరోసారి మీరాబాయి నెటిజన్లు హృదయాలను దోచుకుంది. ఆమె గెల్చుకున్నది వెండి పతకం అయినా ఆమె మనకు మాత్రం 24 క్యారెట్ బంగారం. జీవితంలో సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు అంటూ నెటిజనులు ఫిదా అవుతున్నారు. తాజాగా మళ్లీ ప్రాక్టీస్ షురూ చేసిన ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో 2024 పారిస్ ఒలింపిక్స్‌కి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అభిమానులు ట్వీట్ చేశారు. 2022 ఆసియా గేమ్స్, 2024 ఒలింపిక్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయంటూ ఇంకొకరు వ్యాఖ్యానించడం విశేషం. ఉచితంగా లిప్ట్ ఇచ్చి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ట్రక్ డ్రైవర్లకు గిఫ్ట్ ఇచ్చి పెద్దమనసు చాటుకుంది మీరాబాయి చాను. దాదాపు150 మంది డ్రైవర్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. అంతేకాదు వారికి ఒక షర్ట్, మణిపురి కండువాను బహుమానంగా ఇచ్చి సత్కరించింది. శిక్షణా కేంద్రానికి వెళ్లేందుకు రెగ్యులర్‌గా లిఫ్ట్ అందించిన ట్రక్కర్లను కలిసి, వారి ఆశీర్వాదం పొందాలని కోరుకున్నానని మీరాబాయి ఈసందర్భంగా ప్రకటించింది. కష్ట సమయంలో వారంతా ఆదుకున్నారు. అందుకే భవిష్యత్తులో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఫిల్మ్ మేకర్ నౌరెం మోహెన్ ట్విటర్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. కాగా మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మీరాబాయి తన ఇంటి నుండి శిక్షణా అకాడమీకి 30 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. అటు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం, ఇటు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొనే స్థోమత లేని మీరాబాయి ఇంపాల్‌కు ఇసుకను తీసుకెళ్తున్న ట్రక్కుల ద్వారానే లిఫ్ట్ తీసుకునేది. అలా కఠోర సాధనతో టోక్యో ఒలింపిక్స్‌లో తన కలను సాకారం చేసుకోవడమే కాదు, యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. pic.twitter.com/mrYZRXHtlK — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 6, 2021 Olympiad @mirabai_chanu home was more than 25 km from the Sport Academy. No means of transport during those days, except trucks which carried river sands to the City. These truck drivers gave her lift everyday. Today she rewarded these truck drivers. pic.twitter.com/9WegUkwjkz — Naorem Mohen (@laimacha) August 5, 2021 -
విస్కీ బాటిల్ ఎక్కడుంది? విచారణ చేపట్టిన అమెరికా
వాషింగ్టన్: విస్కీ బాటిల్ కనిపించడం లేదని అమెరికా విచారణ చేపట్టింది. ఈ విస్కీ ఖరీదు 5800 డాలర్లు (రూ.4.30 లక్షలు) కాగా, దాన్ని 2019 లో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు జపాన్ ప్రభుత్వం బహుకరించిందని ట్రెజరీ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఆ బాటిల్ అధికారిక లెక్కల్లో కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సంబంధిత అధికారులు మాయమైన ఆ విస్కీ బాటిల్ ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. విదేశాంగ కార్యదర్శిగా పాంపియో పని చేస్తున్నప్పుడు జూన్ 24, 2019 న సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో జపాన్ అధికారులు అమెరికా విదేశాంగ శాఖకు బహుమతి ఇవ్వగా అది పాంపియో స్వీకరించాడా లేదా అనేది అస్పష్టంగా ఉందని టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే ఈ అంశంపై పాంపియో న్యాయవాది స్పందిస్తూ.. మిస్టర్ పాంపియోకి అప్పట్లో ఈ విస్కీ బాటిల్ అందుకున్న జ్ఞాపకం లేదు, అలానే ఆ బాటిల్ ఎలా మాయమైందనేది కూడా తనకు తెలియదని వెల్లడించారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక వస్తువు మాయంకావడంతో ఈ వార్త అక్కడ వైరల్‌గా మారింది. -
వధువుకి వరుడి స్నేహితుల సర్ఫ్రైజ్ గిఫ్ట్; కోపంతో నేలకేసి కొట్టింది!
వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో వరుడు స్నేహితులు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్‌ను చూసి వధువు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అందులో ఊహించని విధంగా ఇబ్బందికరమైన వస్తువు ఉండటంతో వెంటనే కోపంతో దాన్ని బయటకు విసిరేస్తుంది. మరి వరుడు స్నేహితులు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లిపోదాం.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వధూవరులిద్దరూ పెళ్లి వేదికపై కూర్చొని ఉంటారు. అంతలోనే అక్కడకు పెళ్లి కొడుకు స్నేహితులు వచ్చి నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతారు. అలాగే ప్యాక్ చేసి ఉన్న ఓ గిఫ్ట్‌ను సరదాగా వధువుకి అందిస్తారు. గిఫ్ట్‌ను పెళ్లి కూతురు అక్కడే తెరిచి చూడగా అందులో చిన్న పిల్లలకు పాలు తాగించే బాటిల్ ఉంటుంది. తనకిచ్చిన ఫన్నీ గిఫ్ట్ నచ్చకపోవడంతో వెంటనే దాన్ని వధువుకు విసిరేసింది. దీనిని చూసిన అక్కడి వారంతా పడిపడి నవ్వుతూనే.. మళ్లీ అదే బాటిల్ ఉన్న గిఫ్ట్‌ను వధువుకివ్వడంతో ఈసారి వధువుకు చిర్రెత్తింది. ఈ విషయాన్ని గమనించిన పక్కన ఉన్న మరో మహిళా ఆ వస్తువును వెంటనే లాక్కుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో బంటి ఠాగూర్ అనే వ్యక్తి పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ పోస్టుకు వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ‘ప్రతి ఒక్కరిని గౌరవించాలి. సరదా కోసం ఎవరిని హర్ట్ చేయొద్దు’ అంటూ నెటిజన్లు హితవు పలుకున్నారు. -
బీజీఎంఐ తొలి లాంచ్ పార్టీ.. విజేతలకు రూ.6 లక్షలు
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) అందరికీ అందుబాటులో వచ్చిన విషయం తెలిసిందే. బీజీఎంఐను రూపొందించిన క్రాఫ్టన్ సంస్థ తొలిసారిగా లాంచ్ పార్టీని జరపనుంది. జూలై 8 నుంచి జూలై 9 వరకు లాంచ్ పార్టీ జరగనుంది. లాంచ్ పార్టీకి సంబంధించిన టీజర్‌ను క్రాఫ్టన్ యూట్యూబ్‌లో షేర్ చేసింది. రెండురోజులపాటు సాగే ఈ వెంట్లో 18 ప్రో టీమ్స్ ఆడనున్నాయి. ఈ వెంట్లో గెలిచిన విజేతలకు రూ. 6 లక్షల రూపాయల నగదు బహుమతిని అందిచనున్నారు. ఈ లాంచ్ పార్టీలో ప్రసిద్ది చెందిన డైనమో, మోర్టల్, కె 18, క్రోంటెన్, గాడ్నిక్సన్, ఘటక్, శ్రీమాన్ లెజెండ్, మాక్స్టర్న్, బండూక్బాజ్, క్లాష్ యూనివర్స్, పాల్గొననున్నారు. ఈ మ్యాచ్‌లను మొబైల్ ఇండియా అధికారిక ఫేస్బుక్, యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం చేయనున్నారు. -
వివాహ వేడుకలో పెట్రోలు బహుమానం..
సాక్షి, నర్మెట(జనగామ): పెట్రోల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య చాలా వివాహ వేడుకలలో దీన్ని కూడా బహుమానంగా ఇస్తుండం ఒక ట్రెండ్‌గా మారింది. కాగా, పెళ్లి వేడుకలకు వచ్చిన బంధుమిత్రులు వధూవరులకు బహుమతిగా నగదు, నూతన వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే నర్మెట మండల కేంద్రంలో శనివారం జరిగిన మహేష్–సుస్మిత వివాహానికి హాజరైన బాల్య మిత్రులు భాస్కర్, సతీష్, శివ, శ్రీనివాస్, నవీన్ లీటర్ పెట్రోలు అందజేసి ధరలు బాగా పెరిగాయి పొదుపుగా వాడుకోవాలని సలహా ఇచ్చారు. చదవండి: టీ సర్కార్ ఉల్లంఘనలపై తెలంగాణ హైకోర్టుకు ఏపీ రైతులు -
ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్ గుర్తించి జాక్‌పాట్ కొట్టేసిన ముంబై యువకుడు
సాక్షి, ముంబై: ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ల్లో అకౌంట్ లేని వారు చాలా అరుదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలతో మమేకమవ్వడానికి ఈ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రమ్ వంటి సోషల్ మీడియా యాప్స్ నెటిజన్ల ప్రైవేసి విషయంలో అసలు రాజీ పడవు. అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియా యాప్స్‌లో లోపాలు వెలుగులోకి వస్తూంటాయి. కొన్ని సందర్బాల్లో సోషల్ మీడియా యాప్స్‌లో ఉన్న లోపాలను కొంతమంది ఎథికల్ హకర్స్ వెలుగులోకి తెస్తుంటారు. వాటిని వెంటనే గుర్తించి, ఆయా కంపెనీలకు తెలియజేస్తారు. కాగా తాజాగా ముంబై షోలాపుర్కు చెందిన మయూర్ ఫార్టేడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బగ్‌ను గుర్తించాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ చేశాడు. ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బగ్‌ను నిరూపించమని తిరిగి అతని కోరగా అందుకు తగిన ఆధారాలను చూపిస్తూ ఫేస్‌బుక్‌కు తెలియజేశాడు. దీంతో ఫేస్బుక్ కంపెనీ ఇన్‌స్టాగ్రమ్‌లో లోపం ఉందని నిర్ధారించింది. బగ్‌ను గుర్తించినందుకుగాను ఫేస్బుక్ మయూర్ ఫార్టేడ్ కు భారీ నజరానాను అందించింది. సుమారు రూ. 22 లక్షలను మయూర్‌కు అందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బగ్ ఏంటీ..? ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు తమ అకౌంట్ విషయంలో గోప్యతను పాటించేందుకు ప్రైవేటు అకౌంట్‌గా మార్చుకుంటారు. ఈ బగ్ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు అకౌంట్లో ఉన్న యూజర్ల అర్కవైడ్ పోస్ట్‌లు, స్టోరీస్, రిల్స్ వీడియోలను చూడవచ్చునని మయూర్ తెలిపాడు. దీంతో యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుత్తుంది. చదవండి: శరీరాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్ ఛార్జింగ్..! -
ఇంగ్లండ్ మహిళ క్రికెటర్‌కు సీఎస్కే గిఫ్ట్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో దారుణ ప్రదర్శన కనబరిచిన సీఎస్కే ఈసారి మాత్రం దానికి భిన్నంగా రాణించింది. అయితే దురదృష్టవశాత్తు ఐపీఎల్‌కు కూడా కరోనా సెగ తగలడంతో బీసీసీఐ మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కోవిడ్ దృశ్యా సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం పక్కనబెడితే.. ఈ సీజన్లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సీఎస్కే తన అభిమానికి జెర్సీని గిఫ్ట్‌గా పంపింది. అయితే ఆ అభిమాని ఎవరో కాదు.. ఇంగ్లండ్ మహిళ స్టార్ క్రికెటర్ కేట్ క్రాస్. సీఎస్కే అంటే విపరీతమైన అభిమానం చూపించే కేట్కు సీఎస్కే జెర్సీని పంపింది. అయితే సీఎస్కే జెర్సీని అందుకున్న కేట్ దానిని ధరించి తన ట్విటర్లో షేర్ చేసింది. ''మీ అభిమానానికి థ్యాంక్స్ సీఎస్కే.. మీరు పంపిన జెర్సీని ఇప్పుడే వేసుకున్నా. సీఎస్కే జెర్సీపై 16 నెంబర్ కేటాయించడం నాకు సంతోషంగా అనిపించింది. కానీ కరోనా పరిస్థితుల దృశ్యా ఐపీఎల్ రద్దు కావడం బాధ కలిగించింది. అయితే బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుంది. ఆట కంటే ముందు ప్రాణాలు ముఖ్యం.. పరిస్థితులు చక్కబడి మళ్లీ లీగ్ ఆరంభిస్తే చూడాలని ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా సీఎస్కే జట్టులో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా కరోనా బారీన పడినట్లు సీఎస్కే మంగళవారం రాత్రి ట్వీట్ చేసింది. చదవండి: 'అక్కడ ప్రాణాలు పోతున్నాయి.. రద్దు చేయడం మంచిదే' A HUGE thank you to @cskfansofficial and @chennaiipl for sending me my first CSK shirt. When it is safe to start the tournament again, I can #whistlefromhome 💛 #Yellove #WhistlePodu #nandri pic.twitter.com/aobCKSTNgd — Kate Cross (@katecross16) May 4, 2021 As disappointing as people will be to see this news, it’s the right decision. Health comes before cricket. All my thoughts are with everyone involved in the current COVID crisis in India 🇮🇳 https://t.co/hWII9zxx3M — Kate Cross (@katecross16) May 4, 2021 -
గిఫ్ట్స్ కోసం కక్తుర్తి.. ఒకేసారి 35 మందితో
టోక్యో: ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ప్రేమించేవారిని చూశాం. మహా అయితే ఓ ఐదుగురిని అనుకుందాం.. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి వీరందరికన్నా తోపు. ఎలా అంటే ఇతగాడు ఒకేసారి 35 మందిని ప్రేమలో దించాడు. విజయవంతంగా సాగిపోతున్న ఈ రోమియే లవ్‌ట్రాక్‌కి బ్రేక్ వేసింది అతడి కక్కుర్తి బుద్దే. అదేంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. జపాన్ దక్షిణ ప్రాంతానికి చెందిన తకాషి మియాగావా(39) హైడ్రోజన్ వాటర్ షవర్ హెడ్స్, ఇతర పరికరాలు అమ్మే మార్కెటింగ్ కంపెనీలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మియాగావాకి తనకి పరిచయం అయిన వారిలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకునేవాడు. వారితో ప్రేమగా మాట్లాడుతూ.. ముగ్గులోకి దింపేవాడు. ఆ తర్వాత తాను వారిని ఎంతో సీరియస్‌గా ప్రేమిస్తున్నానని నమ్మబలికేవాడు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 35 మంది మహిళలను ఏకకాలంలో ప్రేమలో పడేశాడు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరిలో కొందరు వయసులో ఇతడి కంటే పెద్దవారు కూడా ఉన్నారు. ఇక మియాగావా ఒరిజనల్ పుట్టిన రోజు నవంబర్ 14 కాగా.. తన ప్రియురాళ్లకి మాత్రం వేర్వేరు నకిలీ తేదీలు చెప్పి వారి నుంచి గిఫ్ట్స్ పొందేవాడు. ఒకరికి ఫిబ్రవరి.. మరోకరికి జూన్.. ఇంకొకరికి ఏప్రిల్ ఇలా ఫేక్ బర్త్‌డే తేదీలు చెప్పి.. వారి నుంచి లక్ష జపనీస్ యెన్ల(69,442 రూపాయలు) విలువ చేసే దుస్తులు, డబ్బు బహుమతులుగా పొందాడు. అంతటితో ఆగక.. తన గర్ల్‌ఫ్రెండ్స్‌లో కొందరి చేత తాను పని చేస్తున్న కంపెనీ ఉత్పత్తులు కొనేలా చేశాడు. అలా దాని మీద కూడా లాభం పొందాడు. ఇక తన ప్రియురాళ్లలో ఎవరైనా పెళ్లి చేసుకోమని అడిగితే.. తాను సెటిల్ అవ్వాలని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపేవాడు. ఇతగాడి మీద అనుమానం వచ్చిన కొందరు ప్రియురాళ్లు మియాగావా గురించి ఎంక్వైరీ చేయగా అతడి బాగోతం బట్టబయలైంది. కేవలం బహుమతుల పొందడం.. తన ఉద్యోగంలో టార్గెట్ రీచ్ కావడం కోసమే ఇంత మందితో ప్రేమాయణం నడిపినట్లు అంగీకరించాడు మియాగావా. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఈ సంఘటనపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘నీ మార్కెటింగ్ తెలివికి జోహార్లు నాయనా’’ అంటుండగా.. ‘‘మరికొందరు నెలకి 30 రోజులు.. రోజుకొక గర్ల్‌ఫ్రెండ్ చొప్పున కలిసినా.. మరో ఐదుగురు బ్యాలెన్స్ ఉంటారుగా.. ఎలా మ్యానేజ్ చేశావ్ సామి’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. చదవండి: ప్రిన్స్ ఫిలిప్ బర్త్‌డేకి మామిడి పండ్లు -
యూకే నుంచి బహుమతి అంటూ... రూ.18 లక్షలు స్వాహా
సాక్షి, నాగోలు: యూకే నుంచి బహుమతి పార్శిల్ వచ్చిందని, దానిని మీకు ఇవ్వాలంటే ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చార్జీలు చెల్లించాలని నమ్మించి రూ.18 లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను శనివారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన హెన్రీ చుక్వుని ఒపెరా మెడికల్ వీసాపై భారత్ వచ్చి కర్టాటకకు చెందిన మహిళను వివాహం చేసుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ద నగర్లో నివాసం ఉంటున్నాడు. న్యూఢిల్లీలో ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసే వ్యక్తితో నైజీరియా జాతీయుడి పరిచయం చేసుకున్నాడు. ఆన్లైన్ మోసాలకు అలవాటు పడ్డారు హెన్రీ ఫుట్‌బాల్ ఆడటానికి వచ్చేవాడు. అక్కడే ఉండే మరోక నైజీరియా చెందిన చీమా ఫ్రాంక్ను ఇతర స్నేహితులకు పరిచయం చేశాడు. అందరూ కలసి ఆన్లైన్ బహుమతి మోసాలు, ఉద్యోగ మోసాలు, రుణ మోసాలు పాల్పడి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఆన్లైన్ మోసాలు చేయడం ప్రారంభించారు. బహుమతులు పంపే నెపంతో నగరంలోని ఓ వ్యక్తికి హెన్రీ చుక్వుని ఒపెరా మెసేజ్ పెట్టాడు. యూకే నుంచి కరెన్సీలో పెద్ద మొత్తంలో బహుమతి వచ్చింది.. ఢిల్లీ విమానాశ్రమంలో ఉంది. దానిని మీకు పంపించాలంటే కస్టమ్ అధికారులకు ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని స్థానికంగా ఉండే నోయిడాకు చెందిన ఆటో డ్రైవర్ సూరజ్ బ్యాంకు ఖాతాల్లో రూ. 18 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. ఆటో డ్రైవర్‌కు రూ. 55 వేలు నగదు అందజేశాడు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో హెన్రీ చుక్వుని ఒపెరా, ఆటో డ్రైవర్ సూరజ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. ( చదవండి: సైబర్ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా ) -
ఆటో డ్రైవర్‌కు సమంత ఊహించని గిఫ్ట్
మనూరు (నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కవితకు ప్రముఖ నటి సమంత ఊహించని బహుమతిని అందజేసింది. ఓ షోరూం నుంచి ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకున్న కవిత.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. వారు చెప్పినట్లు గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా.. నిర్వాహకులు స్విఫ్ట్ డిజైర్ కారును అందజేశారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో కవితకు ఆహ్వానం అందింది. ఈమె జీవిత చరిత్ర తెలుసుకున్న నిర్వాహకులు.. యూ ట్యూబ్‌లో పోస్టు చేశారు. అది చూసిన సమంత తనకు ఇలా గిఫ్ట్ ఇచ్చారని కవిత సంబర పడుతోంది. డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన కవితకు బాల్య వివాహం జరిగింది. భర్త రోజు తాగొచ్చి కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చింది. అక్కడ పొలం పనులకు వెళ్తూ ఏగుడురి చెల్లెళ్లను పోషించింది. తల్లి, దండ్రులు చనిపోవడంతో కుటుంబ పోషణ మరింత కష్టమైంది. దీంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్‌కి వచ్చింది. మీయాపూర్ టూ బాచుపల్లి దారిలో ఆటో నడుపుతూ ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. చదవండి: రామ్ చరణ్ మూవీ: జర్నలిస్టుగా రష్మిక! ఆయన క్యాచ్ జారవిడిస్తే.. నాకు తిట్లు పడేవి: నటి -
ప్రధాని మోదీకి తెలుగు విద్యార్థిని ప్రశ్న, ఊహించని గిఫ్ట్
సాక్షి, ప్రకాశం: ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడిన పల్లవిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అభినందించారు. ఆమె ఉన్నత విద్యకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. గురువారం మార్కాపురంలోని తన నివాసంలో మంత్రి పల్లవిని సత్కరించారు. తల్లిదండ్రులు మోహనరావు, సంపూర్ణ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన పల్లవితో ఆయన మాట్లాడారు. ‘‘ఎంతో ధైర్యంగా ప్రశ్న అడిగావు.. ప్రధాని సమాధానం ఇచ్చారు. శభాష్ పల్లవి..’’ అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భవిష్యత్తులో ‘‘నీ లక్ష్యం ఏమిటి’’ అని పల్లవిని మంత్రి.. ప్రశ్నించగా తాను డాక్టర్ కావాలనుకుంటున్నట్లు చెప్పడంతో ప్రభుత్వం తరపున ఉన్నత చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పల్లవి ఆన్లైన్ విద్యాభ్యాసానికి తమ ఇంట్లో టీవీ లేదని చెప్పగా మంత్రి అప్పటికప్పుడు టీవీతో పాటు డిక్షనరీని కూడా బహూకరించారు. ధైర్యంగా ప్రధానిని ప్రశ్నించిన పల్లవి ‘పరీక్షా పే చర్చ' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవి ఎంపికై తన సందేహాలను వీడియో ద్వారా ప్రధాని ముందుంచింది. 'కరోనా ప్రభావంతో ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పరీక్షలు దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నాం. భయాన్ని వీడి ఏకాగ్రతతో పరీక్షలు రాసేందుకు ఉపాయం చెప్పండి' అని పల్లవి కోరింది. ఇందుకు ప్రధాని 'పరీక్షలంటే భయపడవద్దు. మనల్ని మెరుగుపరచుకునేందుకు ఉపకరించేవిగా వాటిని చూడండి. కొన్నిసార్లు సామాజిక, కుటుంబ వాతావరణం కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఒత్తిడి లేకపోతే విద్యార్థులు పరీక్షలను భారంగా భావించరు. కష్టంగా అనిపించిన సబ్జెక్టుల నుంచి దూరంగా పారిపోవద్దు. నా వరకు నేను కష్టమైన పనిని ఉదయాన్నే చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. సులభమైన పనుల్ని రాత్రి పొద్దుపోయాక చేస్తుంటాను'' అని సమాధానమిచ్చారు. ( చదవండి: ‘నే ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి! ) -
ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్..
చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ సంస్థకు చెందిన ఎస్యూవీ థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వాహనాన్ని అందుకున్న టీమిండియా సెన్సేషనల్ బౌలర్ టి నటరాజన్.. ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని నటరాజన్ గురువారం ట్విటర్ వేదికగా తెలియజేశాడు. తనకు అందిన ఎస్యూవీ వాహనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. "నా ప్రయాణాన్ని గుర్తించి నాకు అండగా నిలిచిన మీకు కృతజ్ఞతలు సర్(ఆనంద్ మహీంద్ర), భారత్ తరఫున క్రికెట్ ఆడే అవకాశం రావడం నాకు దక్కిన వరం, గొప్ప వ్యక్తుల నుంచి ప్రోత్సాహం లభించడం నాకు దక్కిన గౌరవం, నాకు బహుమతిగా ఇచ్చిన వాహనాన్ని ఈ రోజే నడిపాను, నా అరంగేట్ర టెస్ట్ మ్యాచ్ జెర్సీని మీకోసం పంపిస్తున్నాను" అంటూ క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, నటరాజన్‌తో పాటు మహీంద్ర థార్ వాహనాలను సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీలు అందుకున్నారు. Playing cricket for India is the biggest privilege of my life. My #Rise has been on an unusual path. Along the way, the love and affection, I have received has overwhelmed me. The support and encouragement from wonderful people, helps me find ways to #ExploreTheImpossible ..1/2 pic.twitter.com/FvuPKljjtu — Natarajan (@Natarajan_91) April 1, 2021 ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ కోసం నటరాజన్ సిద్దమవుతున్నాడు. గురువారమే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరాడు. నిబంధనల మేరకు ఏడు రోజుల క్వారంటైన్లో ఉండనున్నాడు. గత సీజన్లో యార్కర్లతో అదరగొట్టిన నట్టూ ఈసారి అంతకుమించి రాణించాలని సన్‌రైజర్స్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చెన్నై వేదిక ఏప్రిల్ 11న జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: నా డార్లింగ్‌తో చివరి పెగ్: వార్నర్ -
ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ బంపర్ ఆఫర్!
హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల అందరికి హోలీ బోనాంజా బహుమతిని ప్రకటించింది. స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కిమ్ కింద రూ.10,000 అడ్వాన్స్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కీం పొందేందుకు చివరి తేదీ మార్చి 31. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం హోలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మూడో ఇన్స్టాల్మెంట్ ఎర్రీర్స్‌ను విడుదల చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. త్రిపుర ప్రభుత్వం హోలీ సందర్భంగా డియర్నెస్ అలవెన్స్ హైక్‌ను ప్రకటించింది. ఇదొక్కటే కాదు పెన్షనర్స్ 3 శాతం డీఏ హైక్ పొందనున్నారు. అలాగే, గత జూలై నుండి పెండింగ్‌లో ఉన్న డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ కు సంబంధించిన శుభవార్త చెప్పింది. చదవండి: హైదరాబాద్ రోడ్ల మీదకి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్ -
అనుష్కకు ‘అరణ్య’ స్పెషల్ గిఫ్ట్
‘భళ్లాలదేవుడు’ రానా దగ్గుబాటి, ‘దేవసేన’ అనుష్క శెట్టికి పంపిన బహుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా రానా నటించిన ‘అరణ్య’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రానా, అనుష్కకు ఓ గిఫ్టును పంపాడు. రానా పంపిన ఈ బహుమతిని అనుష్క సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోయింది. అలాగే భళ్లాలదేవుడికి స్వీటి ధన్యవాదాలు తెలుపుతూ ‘అరణ్య’ మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపింది. అదే విధంగా రానా ఇలాంటి బహుమతులనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు, అక్కినేని వారి కోడలు సమంత కూడా పంపాడు. రానా పంపిన ఈ బహుమతులను ఉపాసన, సమంతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అరణ్యకు మంచి హిట్ రావాలని ఆశించారు. కాగా అనుష్క చివరిగా నిశ్శబ్ధం మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనుష్క కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. ఏ సినిమా చేయబోతున్నారనేది కూడా ఎలాంటి స్పష్టత లేదు. అయితే స్వీటీ ఓ సినిమాకు కమిట్ అయ్యారనేది తాజా సమాచారం. సందీప్ కిషన్ హీరోగా ‘రారా కృష్ణయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించిన పి. మహేశ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సరికొత్త పాయింట్‌తో రూపోందనున్న ఈ మూవీలో అనుష్క, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో నటిస్తున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) చదవండి: ‘అరణ్య’ మూవీ రివ్యూ యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్న అనుష్క! -
ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్
డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్, దర్శకుడు. వైష్ణవ్ తేజ్, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం. భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ చిత్రం అదే రేంజ్లో కలెక్షన్స్ సాధించింది. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హీరో, హీరోయిన్లకు ఊహించని.. భారీ సర్ప్రైజ్ ఇచ్చారట. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీరిద్దరికి భారీ ఎమౌంట్ గిఫ్ట్‌గా ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో హీరో వైష్ణవ్ తేజ్‌కి కోటి రూపాయలు.. హీరోయిన్ కృతీ శెట్టికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే చెక్స్‌ని హీరో, హీరోయిన్లకు ఇచ్చినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారట. గతంలో బుచ్చి బాబుకు కారు లేదా ఇల్లుని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఉప్పెన’ చిత్రానికి గాను వైష్ణవ్ తేజ్ 50 లక్షల రూపాయల పారీతోషికం తీసుకోగా.. గిఫ్ట్‌గా అంతకు రెట్టింపు అందుకోవడం విశేషం. ఏది ఏమైనా ఉప్పెన విజయం ఈ మెగా హీరోకు ఇండస్ట్రీలో బలమైన పునాది వేసిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో అల్లు అర్జున్ పుష్ప, మహేష్ బాబు సర్కార్ వారి పాట వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. చదవండి: బాలీవుడ్లో రీమేక్ కానున్న ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే?