
‘అవర్ జర్నీ టుగెదర్’ పేరుతో పుస్తకం అందజేసిన ట్రంప్
ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు. ‘అవర్ జర్నీ టుగెదర్’ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని గురువారం వైట్‌హౌస్‌లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారు. దాని కవర్ ఫొటోలో ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కన్పిస్తున్నారు. కానుకను మోదీకి అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మీరు గ్రేట్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. 320 పేజీల ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవీకాలంలో 2016–2020 మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫొటోలున్నాయి. 2020లో ట్రంప్ భారత పర్యటన ‘హలో ట్రంప్’తో పాటు అంతకుముందు అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ తదితర కార్యక్రమాల ఫొటోలను పొందుపరిచారు. భార్య మెలానియాతో కలిసి తాజ్‌మహల్ దగ్గర తీసుకున్న ట్రంప్ ఫొటో కూడా ఉంది.
ఆయన పదవీకాలపు మధుర ఘట్టాలన్నింటినీ పొందుపరిచారు. సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్ చొరవ, స్పేస్ ఫోర్స్ ఏర్పాటు, జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ వంటి దేశాధినేతలతో ఉన్నత స్థాయి భేటీల వంటి ఘటనలకు సంబంధించి ఎంపిక చేసిన ఫొటోలను పుస్తకాన్ని తయారు చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తనకు గొప్ప గౌరవ మని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘చిరకాలంగా ఆయన నాకు మంచి మిత్రుడు. మా మధ్య అద్భుతమైన బంధముంది. నా నాలుగేళ్ల తొలి పదవీకాలంలో ఆ బంధాన్ని చక్కగా కొనసాగించాం’’ అన్నారు. మోదీ కూడా ట్రంప్ నాయ కత్వాన్ని ప్రశంసించారు. ‘‘నేనెంతో ఇష్టపడే నాయకుడు ట్రంప్. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్య మివ్వడం ఆయన నుంచి నేర్చుకున్న ప్రధాన విషయం’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment