book
-
సాహిత్య సందడి
సాహిత్యం వార్త కావడం అరుదు. కానీ సాహిత్యం వార్తగా మారిన ప్రతిసారీ సమాజం ఇంకొంత సానుకూలంగా కనబడుతుంది. మనుషుల్లోని చీకటి వెలుగుల మీద, రక్తమాంసపు ఉద్వేగాల మీద చూపు ప్రసరిస్తుంది. విచికిత్సకూ, నెమ్మదితనానికీ వీలు చిక్కుతుంది. సాహిత్యం వార్తగా మారకపోవడానికి ప్రధాన కారణం, సాహిత్యంలో ఏమీ జరుగుతున్నట్టు కనబడకపోవడం. ఒక రచయిత తన పుస్తకంలోని మొదటి అధ్యాయం అయిందని ప్రెస్ మీట్ పెట్టడు. ఇందాకే ఈ వాక్యం తట్టిందని బహిరంగ ప్రకటన చేయడు. అదంతా ఎప్పటికో తుదిరూపు దిద్దుకునే వ్యవహారం. అప్పుడు మాత్రం హడావిడి ఏముంటుంది? అయితే సాహిత్యమే వార్తగా మారే సందర్భాలు లిటరేచర్ ఫెస్టివల్స్ కలిగిస్తాయి. పదుల కొద్దీ రచయితలు, వందల కొద్దీ పుస్తకాలు, చర్చోపచర్చలు, ముఖాముఖి సంభాషణలు, ఇన్ ఫోకస్ అంశాలు, వెరసి విస్మరించలేని వార్త అవుతాయి. సాహిత్యం సందడిని కోరదు. ఏకాంతమే దానికి తగినది. కానీ రణగొణ ధ్వనుల్లో చిక్కుకున్నవారిని ఏకాంతపు ఒడ్డును చేర్చడానికి అవసరమైనంత సందడిని సాహిత్య వేడుకలు పుట్టిస్తాయి.సంవత్సరంలో పతాక శీర్షికలకెక్కేంత వార్త నోబెల్ పురస్కార ప్రకటన. అక్టోబర్ నెలలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ ప్రకటించడంతో సాహిత్య వాతావరణం చురుగ్గా మారిపోయింది. ఆమె పుస్తకాల మీద ఎనలేని ఆసక్తి మొదలైంది. దీనికంటే ముందు సెప్టెంబర్ నెల చివర్లో, 28, 29 తేదీల్లో రెండ్రోజుల ‘సౌత్ ఏసియన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్’ అమెరికాలో జరిగింది. ‘సమాజంలో బహుళత్వం’ థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో శశి థరూర్ సహా ప్రపంచవ్యాప్త రచయితలు పాల్గొన్నారు. అక్టోబర్ 16–20 వరకు ఐదు రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన సుమారు నాలుగు వేల స్టాళ్లతో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ‘ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్’ జరిగింది. గెస్ట్ ఆఫ్ హానర్: ఇటలీ. పొరుగునే ఉన్న ‘కర్ణాటక తుళు సాహిత్య అకాడెమీ’ తుళు భాష మీద మరింత అవగాహన కలిగించేలా, కొత్త తరానికి దాన్ని చేరువ చేసేలా అక్టోబర్ నెలలోనే ఒక కార్యక్రమం చేపట్టింది. కశ్మీర్ సాహిత్యం, సంస్కృతిని ఉత్సవం చేసే లక్ష్యంతో ‘మారాజ్ అద్బీ సంగం’ జరిపే వార్షిక సాహిత్య సదస్సు కూడా అక్టోబర్‌లోనే జరిగింది. అక్టోబర్‌లోనే 25 లక్షల రూపాయలతో దేశంలో అత్యంత ఖరీదైన పురస్కారంగా ఉన్న జేసీబీ ప్రైజ్ కోసం ఐదు నవలల షార్ట్ లిస్ట్ వచ్చింది. భారతీయ భాషల సాహిత్యాన్ని వేడుక చేస్తున్న ఈ పురస్కారం కోసం రెండు ఆంగ్ల నవలలతో సహా మలయాళీ, బెంగాలీ, మరాఠీ రచనలు తుది జాబితాలో ఉన్నాయి.పురస్కార ప్రకటన నవంబర్ 23న జరగనుంది. ‘ఆటా గలాటా బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్’ కూడా పిల్లల పుస్తకాల అవార్డుల కోసం షార్ట్ లిస్ట్ ప్రకటించింది. విజేతలను డిసెంబర్ 14, 15 తేదీల్లో జరిగే వేడుకల్లో ప్రకటిస్తారు. అక్టోబర్ నెల ఇచ్చిన ఊపును ఏమాత్రం తగ్గించకుండా నవంబర్‌లో ‘ద డెహ్రడూన్ లిటరేచర్ ఫెస్టివల్’ ఆరవ ఎడిషన్ 8–10 తేదీల వరకు జరిగింది. ‘సాహిత్యం, సమాజం, సినిమా’ పేరుతో జరిగిన ఇందులో రజిత్ కపూర్, సల్మాన్ ఖుర్షీద్, జెర్రీ పింటో, ఇంతియాజ్ అలీ లాంటివాళ్లు పాల్గొన్నారు. ఒక్కోసారి ఊరికే వార్తలు వల్లెవేసుకోవడం కూడా ఉత్సాహంగా ఉంటుందని ఈ సాహిత్య ఉత్సవాలు తెలియజెబుతున్నాయి.ఇక, ‘ముంబయి లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 15–17 వరకు జరగనుంది. 2010 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవంలో ఈసారి గుల్జార్, విలియం డాల్రింపుల్ సహా 13 దేశాలకు చెందిన రచయితలు పాల్గొంటున్నారు. ఇంకా ప్రత్యేకం మహా కథకుడు ఫ్రాంజ్ కాఫ్కా ‘ద మెటమార్ఫసిస్’ను ఫోకస్ పుస్తకంగా తీసుకోవడం. నలభై ఏళ్లకే కన్నుమూసిన చెక్ రచయిత కాఫ్కా (1883–1924) నూరవ వర్ధంతి సంవత్సరం ఇది.‘ద మెటమార్ఫసిస్’లోని మొట్టమొదటి వాక్యమే తన సాహిత్య ప్రస్థానానికి ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆరాధనగా చెబుతారు లాటిన్ అమెరికా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’’ అంటారు. అలాంటి మెటమార్ఫసిస్‌కు డిజిటల్ రిక్రియేషన్ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక, నేరము–సినిమా నేపథ్యంలో విభిన్నమైన ‘క్రైమ్ లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 29 నుంచి మూడ్రోజుల పాటు డె్రçహాడూన్లో జరుగుతుండటం దీనికి కొనసాగింపు. ప్రకాశ్ ఝా, సుజయ్ ఘోష్, హుస్సేన్ జైదీ లాంటివాళ్లు మాట్లాడుతారు. లోకంలో ఇంత జరుగుతున్నప్పుడు, కోట్ల జనాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమీ జరగట్లేదని నిందించడానికి అవకాశం ఉందిగానీ, రవి మంత్రి తొలి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ లక్ష కాపీలు అమ్మిన మైలురాయిని ఈమధ్యే చేరుకుంది. ‘అజు పబ్లికేషన్స్’ ప్రచురించిన ఈ నవలతో పుస్తకాలు చదవడం మరిచిపోయిందనుకున్న ‘ఇన్‌స్టా తరం’ కొత్త ఆశలను రేపింది. ఇక, పది రోజుల పుస్తకాల పండుగలైన ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ వచ్చే నెలలో మొదలవుతుంది. అది పూర్తవుతూనే ‘విజయవాడ బుక్ ఫెయిర్’ జరుగుతుంది. దాని అనంతరం ‘హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్’ ఉండనేవుంది. ఈ సద్దు ఆగేది కాదు. ఈ సందడిలో భాగం కావడమే మన వంతు. -
వ్యక్తిగా టాటా ఎలా ఉండేవారు?
అత్యంత ప్రభావవంతుల జీవితాలు ఎలా ఉంటాయో మనకు ఎప్పుడూ తెలీదు. కేవలం వారి కంపెనీల గురించిన ఉత్థాన పతనాలే తప్ప వ్యక్తిగతజీవితంలోని ఎగుడుదిగుళ్లు బయటికి రావు. ఇటీవల మరణించిన దేశంలోని అతి పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటా చిన్నతనంలో తల్లితండ్రులు విడాకులు తీసుకున్న కారణంగా అభద్రతకు గురయ్యారు. దానివల్లే పాఠశాలలో హేళన ఎదుర్కొన్నారు. ప్రేమించినప్పటికీ పెళ్లికి దూరంగా ఉండిపోయిన రతన్‌కు తన చివరి జీవితంలో తోడుగా ఉన్నది టిటో అనే కుక్క. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమంగా ఉండేదట.ఇలాంటి ఎన్నో అంశాలను ‘రతన్ టాటా: ఎ లైఫ్’ పుస్తకం వెల్లడిస్తుంది.మనందరికీ పారిశ్రామికవేత్త రతన్ టాటా తెలుసు. ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ప్రత్యేకత కలిగివున్నారు. కానీ ఒక వ్యక్తిగా ఆయన ఎలా ఉండేవారు? ఆయనకు ఎలాంటి బాల్యం ఉండేది? ఆయన ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోని స్త్రీలు ఉన్నారా? ఆయన వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఇలాంటి అంశాలను సాధారణంగా మనం ఎప్పటికీ తెలుసుకోలేం. కానీ థామస్ మాథ్యూ ఇటీవల ప్రచురించిన పుస్తకం ‘రతన్ టాటా: ఎ లైఫ్’ కలిగించే మహదానందం ఏమిటంటే, ఆయన ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించారు.రతన్ టాటా పదేళ్ల వయసులో ఉండగా ఆయన తల్లితండ్రులు విడాకులు తీసుకున్నారు. అందువల్ల వాళ్ల నానమ్మ (నవాజ్‌బాయి టాటా) వద్ద పెరిగాడు. లేడీ టాటా వైభవంగా ఒక పెద్ద భవంతిలో యూనిఫారం ధరించిన పనివాళ్లతో నివసించారు. ఆమెకు రోల్స్ రాయిస్ కారు ఉండేది. నేను ‘బీబీసీ’ కోసం రతన్ టాటానుఇంటర్వ్యూ చేసినప్పుడు, తాను చెడిపోలేదని టాటా నొక్కి చెప్పారు; కాకపోతే ఎంతో గారాబంగా పెరిగానని ఒప్పుకున్నారు. అయితేఆ విషయాన్ని కనుగీటి మరీ చిరునవ్వుతో చెప్పారు.తమ తల్లితండ్రుల విడాకులురతన్ పై, ఆయన సోదరుడు జిమ్మీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని థామస్ మాథ్యూ మనకు చెబు తారు. అది వారిలో అభద్రతా భావాన్ని కలిగించింది. వారు పాఠ శాలలో చదువుతున్నప్పుడు ర్యాగింగ్‌కు గురయ్యారు, హేళనకు గురయ్యారు. ఈ సమయంలో టాటా తన నాన్నమ్మకు మరింత దగ్గర య్యారు. నిజం చెప్పాలంటే, ఆమెను ఆరాధించారు.సీనియర్ కేంబ్రిడ్జ్ విద్య పూర్తి చేసిన తర్వాత టాటా అమెరికా వెళ్లారు. కుమారుడు చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి బ్రిటన్ వెళ్లాలని ఆయన తండ్రి కోరుకున్నారు. కానీ రతన్ ఆర్కిటెక్చర్‌పై మనసు పడ్డారు. చివరికి ఆయన నిర్ణయమే గెలిచింది. చాలా ఏళ్ల తర్వాత రతన్ టాటా బొంబాయిలో హలేకై (సముద్రం పక్కని ఇల్లు అనిఅర్థం) అని పిలిచే తన సొంత ఇంటిని తానే డిజైన్ చేసుకున్నారు.అయితే టాటా అమెరికాతో ప్రేమలో పడ్డారు. వృద్ధురాలైన నానమ్మ ఆయన్ని తిరిగి రమ్మని గట్టిగా కోరుకోకపోతే, ‘‘ఆయన అమెరికాలోనే ఉండి పని చేస్తూ తన జీవితాన్ని అక్కడే గడిపేవారు. దానిని ఆయన తన రెండవ ఇల్లు అని పిలుస్తారు’’ అని మాథ్యూ వెల్లడించారు.లాస్ ఏంజిల్స్‌లో ఆయన తన మొదటి ప్రియురాలు కరోలిన్ ఎమ్మన్స్ను కలుసు కున్నారు. ఆమె తండ్రి ఫ్రాంక్ ఆయన మొదటి బాస్. ఆయనే వారిని పరస్పరం పరిచయం చేశారు. రతన్ జీవితంలో మరో మూడు ప్రేమలు ఉన్నాయి కానీ ఎవరినీ పెళ్లి చేసు కోలేదు. ‘బీబీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను ఇతర విషయాలకు ప్రాధాన్యంఇచ్చాను గానీ ఎన్నడూ పెళ్లిపై దృష్టి పెట్టలేదని చెప్పారు. అయినప్పటికీ, కరోలిన్ తో టాటా టచ్‌లో ఉండేవారు. 2017లో జరిగిన ఆయన 80వ పుట్టినరోజుకు ఆమె హాజరయ్యారు. రతన్ అమెరికాలో ఉన్న ప్రతిసారీ కరోలిన్‌ను డిన్నర్‌కి తీసుకువెళ్లేవారని మాథ్యూ పేర్కొన్నారు. అందుకే దీన్ని చేదైన తీపి కథగా నేనుభావించడంలో పొరబడలేదు కదా? ఇది కచ్చితంగా నిజమని కూడా అనిపిస్తుంది.టాటా వ్యక్తిత్వంలోని ఆకర్షణీయమైన అంశాలను థామస్ పుస్తకం వెల్లడిస్తుంది. ఉదాహరణకు, ఆయన చెక్స్ షర్టులను ఇష్టపడే వారు. ‘‘ఆయన బాలుడిగా లేదా పెద్ద వయస్సులో ఉన్నప్పుడు తీసిన ఫొటోలలో దాదాపు 90 శాతం వరకు ఆయన ఫార్మల్ దుస్తులుకాకుండా చెక్స్ షర్టు ధరించి ఉన్నట్లు చూపుతాయి.’’ ఆయనకుకార్లంటే కూడా మోజు ఉండేది. వాటిని హాలెకైలో ప్రత్యేకంగా నిర్మించిన నేలమాళిగలో భద్రపరిచారు. అమెరికన్ ‘మజిల్ కార్లు’ అంటే ఆయనకు ఎంతో ఇష్టం.టీవీలో రతన్ టాటా అంత్యక్రియలను చూసిన మీకు, ఆయన పెంచిన కుక్క గోవా ఎలా దూకి శవపేటిక పక్కన కూర్చుందోగుర్తుకు వస్తుంది. టాటా తన కుక్కలకు ఎంత సన్నిహితంగాఉండేవారో ఇది తెలియజేస్తుంది. మాథ్యూ దీనిపై పూర్తి కథను వెల్లడించారు.ఆయన కుక్కలను తనకు లేని పిల్లలుగా చూసుకున్నారన్న భావన మీకు వస్తుంది. వీటిలో చాలా కుక్కలను టిటో, ట్యాంగోఅనిపిలిచేవారు. మాథ్యూ అదే పేరుతో ఉన్న మూడు తరాలకుక్కల గురించి చెబుతారు.2008లో ట్యాంగోలలో ఒకదానికి కాలు విరిగింది. అప్పుడు టాటా ఆ కాలిని రక్షించగల పశువైద్యుని కోసం ప్రపంచాన్ని జల్లెడ పట్టారు. చివరికి ట్యాంగోను చికిత్స కోసం మిన్నెసోటా (యూఎస్ నగరం) తీసుకెళ్లారు.తన చివరి జీవితంలో టిటో ఆయన ప్రధాన సహచరుడు. ‘‘ఇప్పుడు టాటాకు టిటో మాత్రమే ఉంది’’ అని మాథ్యూ రాశారు. ‘‘ప్రతి సాయంత్రం టిటో కోసం ఏ అవాంతరం లేకుండా ఒక సమయం రిజర్వ్ చేయబడేది. ఆ షెడ్యూల్‌కు ఎవరైనా, లేదా ఏ కార్య క్రమమైనా భంగం కలిగించడం టాటాకు ఇష్టం ఉండేది కాదు. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమ సమయం’’ అని మాథ్యూ వివరిస్తారు.బహుశా నమ్మశక్యం కాని విధంగా, టాటాలో చిలిపిగుణం కూడా ఉండేది. బోర్డ్ మీటింగ్‌లలో వృద్ధ డైరెక్టర్లు తమ బూట్లను తీసేస్తారని గమనించిన తర్వాత, ఆయన నిశ్శబ్దంగా వాటిని వీలైనంత దూరంలోకి తన్నేవారు. ఆ బూట్లు ఎక్కడ ఉన్నాయో వారికి కనిపించనప్పుడు అల్లరిగా నవ్వుతూ ఉండేవారు. మాథ్యూ పుస్తకంలోని అన్ని విశేషా ల్లోకీ ఇది నాకు రసవత్తరమైన సంగతిగా అనిపించింది.అయితే, సైరస్ మిస్త్రీ, టెట్లీ టీ, కోరస్, జాగ్వార్ అధ్యాయాలతో సహా ఇంకా చాలానే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ వివరాలు ఉండకుండా ఎలా ఉంటాయి? కానీ వ్యక్తిగత వివరాలే నా దృష్టిని ఆకర్షించాయి. అవి మిమ్మల్ని కూడా ఆకర్షిస్తాయని నేను ఆశించవచ్చా?- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి 'రతన్ టాటా' మరణించిన తరువాత.. థామస్ మాథ్యూ రచించిన 'రతన్ టాటా: ఏ లైఫ్' (Ratan Tata: A Life) అనే పుస్తకం విడుదలైంది. 100 పేజీల కంటే ఎక్కువ ఉన్న ఈ పుస్తకం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ.. ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ బుక్ లాంచ్ చేశారు. దీని ద్వారా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని, రతన్ టాటా పదవీ విరమణ చేసిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరన్ మిస్త్రీ పూర్తి బాధ్యతలను అధికారికంగా చేపట్టడానికి ముందే.. ఆ పదవికి మిస్త్రీ అర్హుడేనా అనే ఆలోచన రతన్ టాటాకు వచ్చినట్లు థామస్ మాథ్యూ పుస్తకం ఆధారంగా తెలుస్తోంది.నిజానికి రతన్ టాటా తన చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి ముందే.. ఎంపిక కమిటీ 2011లోనే సైరన్ మిస్త్రీని ఎంపిక చేసింది. ఆ తరువాత మిస్త్రీ సంస్థ నిర్వహణ విషయంలో మెళుకువలను తెలుసుకోవడానికి రతన్ టాటా కింద అప్రెంటిస్‌షిప్‌గా ఉన్నారు. ఈ సమయంలోనే ఏడాది తరువాత కంపెనీ బాధ్యతలను తీసుకోవడానికి మిస్త్రీ సరైన వ్యక్తేనా అని రతన్ టాటా పునరాలోచన చేశారు.2016లో సైరన్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్‌గా తొలగించవలసి వచ్చింది. ఆ సమయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి రతన్ టాటాకు ఎంతో కష్టంగా అనిపించిందని.. హార్వర్డ్ బిజినినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా ద్వారా తెలిసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. టాటా సన్స్ డైరెక్టర్‌గా ఉన్న వేణు శ్రీనివాసన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు పుస్తకంలో వివరించినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇషా ఆడపడుచు పెద్ద బిజినెస్ ఉమెన్.. తన గురించి ఈ విషయాలు తెలుసా?సైరన్ మిస్త్రీ మీద సంస్థ సంస్థ డైరెక్టర్లకు విశ్వాసం లేదని తెలుసుకున్నప్పుడే చైర్మన్ బాధ్యతల నుంచి స్వయంగా బయటకు వెళ్లి ఉంటే బాగుండేదని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. కానీ రతన్ టాటా అనుకున్నట్లు జరగలేదు. దీంతో బోర్డు సభ్యులందరూ కలిసి సైరన్ మిస్త్రీ తొలగించడం జరిగింది. ఆ తరువాత జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థానానికి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ తెలిపారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని దేవస్థానం ఈవోకి అందజేశారు. ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర ప్రత్యేకతలను వివరించారు. శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసిన క్షేత్రం కావడం, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధాన ఆలయాల ఎత్తు, వెడల్పు, ప్రధానాలయం చుట్టూగల అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు, నందీశ్వరుడు సైజు, ఆలయ నిర్మాణం మొదలైన అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చినట్లు ఉల్లాజి ఇలియాజర్ చెప్పారు. దక్షిణ భారత్‌లో ఈ తరహా క్షేత్రాలు ఉంటే 9000798123 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
స్థానం మారిన పుస్తకం
‘ఎ మిస్ ప్లేస్డ్ బుక్ ఈజ్ ఎ లాస్ట్ బుక్‘ అన్నది ఆంగ్ల నానుడి. అలాగే ‘దయచేసి ఎక్కడ నుంచి తీసిన పుస్తకాలు అక్కడే పెట్టండి’ అన్న మాట కూడా గ్రంథాల యాలలో చూస్తుంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, పుస్తకం కానీ స్థానభ్రంశం చెందితే దానిని తిరిగి పట్టుకోవడం కష్టం అవుతుంది. పుస్తకాల విషయంలో అది మరీ కష్టం. అందుకే ఎక్కడ తీసిన పుస్తకాన్ని అక్కడ పెట్టడం అవసరమే కాదు, అనివార్యం కూడా.గ్రంథాలయాల్లో పుస్తకాల్ని ఒక క్రమంలో సర్దుతారు. ఫలానా పుస్తకం కావాలి అంటే ఫలానా అలమరలోని ఫలానా అరలో ఉంది అ నిర్వాహకులు ఉన్న చోటు నుండి కదలకుండా చెప్పగలరు. కానీ, ఆ పుస్తకాన్ని ఉన్న చోటు నుండి తీసి తిరిగి అక్కడ పెట్టక ΄ోతే చెప్పటం సాధ్యం కాదు. బద్ధకించి, మళ్ళీ అక్కడిదాకా వెళ్ళటం ఎందుకు అని తాము ఉన్న చోటనే ఎక్కడి నుండో తెచ్చిన పుస్తకం పెట్టేసేవాళ్ళు ఉన్నారు. మరి కొంత మంది తాము చదవటం పూర్తి కాలేదు, దానిని దాని స్థానంలో పెడితే ఎవరైనా తీసుకువెడితే వాళ్ళు తిరిగి ఇచ్చేదాకా ఎదురు చూడాలి, కనుక దాని చోటు మారిస్తే తానే తీసుకోవచ్చు అని జాగ్రత్తగా... గుర్తుగా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సమయానికి పెట్టిన చోటు మర్చి΄ోతారు. ఇంకొకరు ఎవరో ఇది ఇక్కడిది కాదు అని తీసి పక్కన పెడతారు. అంతే సంగతులు. మళ్ళీ ఎప్పుడో అన్నీ సద్దుతున్నప్పుడు మాత్రమే బయట పడుతుంది. ఇది ఒక్క పుస్తకాల విషయానికే కాదు, అన్ని విషయాలకీ వర్తిస్తుంది. ఇంట్లో ఏదైనా వస్తువుని అది ఉండే చోట కాక మరొకచోట పెడితే, ఎదురుగా ఉన్నా త్వరగా కనపడదు. ఇంకేదో వెతుకుతున్నప్పుడు కనపడుతుంది. అప్పుడు అది పనికి రావచ్చు, రాక ΄ోవచ్చు. అందుకే ఎక్కడ నుండి తీసిన వస్తువుని అక్కడ పెడితే వెతుక్కునే పని ఉండదు. కళ్ళు మూసుకుని అయినా దానిని తీయవచ్చు. దీనికి కారణం మనిషి ఒక వస్తువుని పరిసరాలు మొదలైన వాటిని కూడా జత చేసి గుర్తు పెట్టుకునేట్టు చేయటం మనసు లక్షణం. మనుషులనైనా మొదటి సారి ఎక్కడ చూశామో అక్కడ కనపడితే వెంటనే గుర్తిస్తాం. వాతావరణం, పరిసరాలు మారితే గుర్తు పట్టటం కష్టమే. ఇక్కడ ఉంటారు అని అనుకోలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నాలు దీనికి చిహ్నం. ఇల్లు అందంగా, వెసులుబాటుగా ఉండటానికి ఒక సూత్రం ΄ాటించాలని ΄ాశ్చాత్యులు గట్టిగానే చె΄్పారు. ‘‘ప్రతి వస్తువు దాని చోట ఉండటం, ప్రతి వస్తువుకి ఒక చోటు ఉండటం.’’ వేలం వెఱి<గా వస్తువులని సేకరించితే ఎక్కడ పెట్టాలో తెలియక చిందరవందరగా పడేస్తూ ఉంటారు. వస్తువుది, ఇంటిది కూడా అందం, విలువ తగ్గి΄ోతాయి. పెట్టటానికి తగిన చోటు లేనప్పుడు తెచ్చి వాటి విలువని తగ్గించ కూడదు. ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టటం గొప్ప సౌలభ్యమే కాదు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ హనుమ. సంజీవని పర్వతాన్ని తెచ్చి, దానితో పని పూర్తి అయిన పిమ్మట ఎక్కడి నుండి తీసుకువచ్చాడో తిరిగి అక్కడ భద్రంగా పెట్టి వచ్చాడు. అందువల్ల రెండవమారు తేవటానికి వెళ్ళినప్పుడు అది ఉండే ప్రదేశం తెలుసు కనుక వెంటనే తేగలిగాడు. మొదటిసారి పని అయింది కదా అని ఎక్కడో అక్కడ పెట్టి ఉంటే వెతకటానికి ఎంతో సమయం వెచ్చించవలసి వచ్చేది. వ్యక్తిత్వ వికాసానికి ఇది కూడా పెం΄÷ందించుకోవాల్సిన ఒక లక్షణం. వస్తువుల విషయం మాత్రమే కాదు. ప్రేమాభిమానాలు, నమ్మకం, విశ్వసనీయత మొదలైన మనోభావాలని కూడా అస్థాన పతితం చేయకూడదు. కఠిన మైన మనస్సు కలవారి మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటే, తరువాతి కాలంలో ఎవరినైనా ప్రేమగా చూడగలగటం కష్టమే. ప్రేమరాహిత్యంలో బతికే వారి విషయంలో ఇటువంటిదే జరిగి ఉండవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్‌చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్‌లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
కృత్రిమ సంక్షిప్తం
పుస్తకం మొత్తం చదవనక్కరలేకుండా కేవలం అట్టల వెనుక ఉన్నది చదివి కూడా ‘సమీక్ష’ రాయొచ్చునని... సాహిత్య ప్రపంచంలో ఒక జోక్. చదవడానికి బద్దకించడం అనేది సర్వ మానవ సమస్య. మన సినిమా రూపొందుతున్నది దీని ఆధారంగానే కాబట్టి దీన్నొకసారి చదవమని ‘ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ’లో సినిమా నటుడి పాత్రధారికి దర్శకుడి పాత్రధారి ఒక పుస్తకం ఇస్తాడు. ఆ నూరు పేజీల భారీ పుస్తకాన్ని చదవలేక, అందులోని సారాంశం ఏమిటో తన భార్యను చెప్పమంటాడు నటుడు. అలాంటివాళ్ల కోసమే కాబోలు, పుస్తకాలు సంక్షిప్తంగా రావడం మొదలైంది.కాలం తెచ్చిన మార్పుల్లో వేగం ఒకటి. దేనిమీదా ఎక్కువసేపు ఎవరూ నిలబడటం లేదనేది అందరూ అంగీకరిస్తున్న మాట. ప్రయాణ సాధనాలు పెరిగి జీవితం వేగవంతం కావడానికీ, పాఠకులు చదవడం తగ్గిపోవడానికీ సంబంధం ఉంది. ఆ పెరిగిన వేగానికి తగినట్టుగా పాఠకులను శ్రోతలుగా మార్చడానికి ఆడియో బుక్స్ మార్కెట్ ప్రయత్నించింది. గంటల తరబడి ఉండే నవలలు యథాతథంగా రికార్డు చేస్తే ఖర్చుతో పాటు అసలుకే మోసం రావొచ్చు. అలా పుట్టినవే అబ్రిడ్జ్డ్ ఆడియో బుక్స్. హెలెన్ కెల్లెర్, ఎడ్గార్ అలెన్ పో, డైలాన్ థామస్ లాంటివారి రచనలు అమెరికాలో తొలుదొలుత ఆడియో బుక్స్‌గా వచ్చాయి. అలాగే అచ్చు పుస్తకాలు ఎన్నో కుదించుకుని అందుబాటులోకి వచ్చాయి. అలా కుదించడం వల్ల కొత్త పాఠకులు సాహిత్యంలో అందుబాటులోకి వచ్చారు. ఉదాహరణకు ఇలా వచ్చిన ‘ఏడు తరాలు’, ‘గాన్ విత్ ద విండ్’ లాంటి నవలల అనువాదాలు తెలుగులో ఎంతో ఆదరణ పొందాయి. ఎన్నో మేలిమి రచనలను ‘పీకాక్ క్లాసిక్స్’ ప్రత్యేకించి సంక్షిప్తంగా తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించింది. సచిత్ర బొమ్మల భారతం, సచిత్ర బొమ్మల రామాయణం లాంటి పుస్తకాలు మనకు తెలియనివి కాదు. పిల్లల కోసం, పిల్లలంత ఓపిక మాత్రమే ఉన్న పెద్దల కోసం ఎన్నో పుస్తకాలు ఇలా పొట్టిరూపాల్లో వచ్చాయి.పుస్తకాలను సంక్షిప్తం చేయడం దానికదే ఒక ఎడిటింగ్ స్కిల్. సారం చెడకుండా, టోన్ మారకుండా, ‘అనవసర’ వివరాలు లేకుండా కుదించడం చిన్న విషయమేమీ కాదు. రచయిత ఒక పదం వాడటానికి ఎంతగా ఆలోచిస్తాడో, దాన్ని తొలగించడానికి సంక్షిప్తకుడు అంతే గింజుకుంటాడు. అలాంటి రంగంలోకి కృత్రిమ మేధ జొరబడటమే ఇప్పుడు సాహిత్య లోకంలో సంచలనమైంది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం జూలై నుంచి కొత్త ఏఐ యాప్ ‘మాజిబుక్’ అందుబాటులోకి వచ్చింది. ఆంగ్ల క్లాసిక్ రచనలను కుదించడం ఈ యాప్ ప్రత్యేకత. మాబీ డిక్, ఎ టేల్ ఆఫ్ టు సిటీస్, ద కౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టో, క్రైమ్ అండ్ పనిష్మెంట్, డ్రాకులా, రాబిన్సన్ క్రూసో, ద త్రీ మస్కటీర్స్, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ద గ్రేట్ గాట్స్బీ లాంటి రచనలు ఇందులో ఉన్నాయి. ఇందులో అత్యధికం తెలుగులోకి అనువాదమైనవే. ఉదాహరణకు చార్లెస్ డికెన్స్ రాసిన ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ ప్రారంభ వాక్యాలు ఉద్విగ్నభరితంగా ఉంటాయి. ‘ఇట్ వాజ్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాజ్ ద వరస్ట్ ఆఫ్ టైమ్స్.’ (‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్న శకం’; రెండు మహానగరాలు– తెన్నేటి సూరి అనువాదం.) వీటిని, ‘ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ థింగ్స్ వర్ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యాడ్’ (‘అదొక చాలా మంచి చాలా చెడ్డల కాలం’) అని ఏఐ కుదించిందని విమర్శకులు ఎత్తిపొడుస్తున్నారు. సంక్లిష్టమైన వాక్య సంచయనానికి లోనుకావడం బౌద్ధిక వృద్ధికి కీలకం అంటారు యూనివర్సిటీ ఆఫ్ బఫెలోకు చెందిన లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ కసాండ్రా జాకబ్స్. రచయితలు తమ పదాలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకుంటారనీ, ఏఐ సరళీకృతం చేయడంలో అవి నష్టపోతామనీ ఆమె చెబుతారు. కథకు సంబంధించిన అసలైన అంతరార్థం పోయి, అది తప్పుడు భావనకు దారితీయవచ్చని హెచ్చరిస్తారు. మరో రకమైన విమర్శ భాషకు సంబంధించినది. పొలిటికల్ కరెక్ట్‌నెస్, తటస్థ మాటల వాడుక పెరుగుతున్న నేపథ్యంలో, అలాగే శిక్షణ పొందివుండే ఏఐ ‘సహజంగానే’ రచనలోని అసలు మాటల స్థానంలో బోలు మాటలు చేర్చవచ్చు. కొన్నింటిని వివాదాస్పదమైన అంశాలుగా అది చూడవచ్చు. దాంతో రచనలోని భావోద్వేగ తీవ్రతకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. అయితే, ‘పుస్తకాలను, వాటి ఆలోచనలను ప్రజాస్వామీకరించడమే’ తమ మిషన్ అని మాజిబుక్ సమర్థించుకుంటోంది. ఆంగ్లం నేర్చుకుంటున్నవారు, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా డిస్లెక్సియా, తీవ్ర ఏడీహెచ్‌డీ ఉన్నవారికి ఇవి ఉపకరిస్తాయని చెబుతోంది.‘రోబో’ సినిమాలో ‘చిట్టి రోబో’ వందల పుస్తకాలను ఇట్టే స్కాన్ చేయగలుగుతాడు. పుస్తకాలు చదవాలి అనుకుంటూనే చదవలేకపోయే అందరి కల అది. తలగడగా పెట్టుకుంటే వాటికవే అక్షరాలు తలలోకి వెళ్లిపోతే బాగుంటుందని చిన్నతనంలో అనుకోనివాళ్లెవరు? అదంతా ‘కృత్రిమ’ ప్రపంచం. సహజ ప్రపంచంలో మనమే చదువుకోవాలి. సహజంగా చదవలేనప్పుడే కృత్రిమ సాయం అవసరం అవుతుంది. అయితే, రామాయణాన్ని ఆసాంతం చదవనూవచ్చు. కట్టె కొట్టె తెచ్చె అనేలా విషయమేమిటో తెలుసుకోనూవచ్చు. కానీ విషయం ఏమిటి అని తెలుసుకోవడంలో అసలు విషయం మొత్తం రాదనేది రసజ్ఞులందరికీ తెలుసు. విందు భోజనం విందు భోజనమే, రుచి చూడటం రుచి చూడటమే! ఏది కావాలి అనేది మన మేధో కడుపును బట్టి నిర్ణయించుకోవడమే. కానీ ఓసారంటూ రుచి చూడటం కూడా విందు భోజనానికి ఉపక్రమించేలా చేస్తుందేమో! కాకపోతే ఆ రుచి ఆ విందుకు దీటుగా ఉండాలి. -
నీలినీడలో ఆడపిల్ల
‘ఐయామ్ వాట్ ఐయామ్’... సునీతకృష్ణన్ రాసుకున్న జీవన జ్ఞాపకాల గుచ్ఛం. ఆడపిల్లల అక్రమ రవాణా, లైంగికదాడి బాధితుల పునర్జీవనం పై పోరాడుతున్న సామాజిక కార్యకర్తగా సునీతా కృష్ణన్ ఈ పుస్తకంలో సాంకేతికత ముసుగులో సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితులను నమోదు చేశారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలు...‘‘సైబర్ టెక్నాలజీ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్’ మీద నేను జాతీయస్థాయి సర్వే చేస్తూ ఆధారాల కోసం ఒక యాప్ ద్వారా ‘పిల్లల అశ్లీల వీడియో’ల కోసం ప్రయత్నించాను. అందుకోసం 532 రూపాయలు చెల్లించాను. మూడు రోజుల్లో తొమ్మిదివేల వీడియోలు వచ్చాయి. ఆరు నెలల పసిబిడ్డ నుంచి ఎనిమిదేళ్ల అమ్మాయి వరకు ఉన్న వీడియోలు కళ్లు మూసుకోవాల్సినంత ఘోరంగా ఉన్నాయి. ఇది ఏ డార్క్ వెబ్లోనో కాదు, పబ్లిక్ డొమైన్‌లోనే. ఒక ఇన్‌ఫ్లూయెన్సర్‌కి డబ్బు పంపించాం, వీడియో రావడం ఆలస్యమైంది. ఫోన్ చేసి అడిగితే వచ్చిన సమాధానమేంటో తెలుసా... ‘నేను ట్యూషన్లో ఉన్నాను. తర్వాత పంపిస్తాన’ అని. అంటే ఆ కుర్రాడి వయసు ప్లస్‌టూ దాటలేదని అర్థమవుతోంది. సమాజం ఇలా ఉంది’మగపిల్లలకూ రక్షణ లేదు ‘ఒకప్పుడు మానవ అక్రమ రవాణా అంటే చదువులేక పేదరికంతో కష్టాలు పడుతున్న వారికి మాయమాటలు చెప్పి మోసం చేసేవారు. ఇప్పుడు ఆ ఆర్థిక రేఖ కూడా చెరిగిపోయింది. బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా బాధితులవుతున్నారు. ఒకప్పుడు ఈ నేరాలు ఎవరు చేశారనేది దర్యాప్తులో స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు నేరస్థులు సాంకేతికత మాటున దాక్కుంటున్నారు. మగపిల్లలు కూడా ట్రాఫికింగ్‌కి గురవుతున్నారిప్పుడు. ఈ ఘోరాలన్నింటికీ సోషల్‌మీడియా అనేది ప్రధాన మాధ్యమంగా మారింది. వీటన్నింటినీ నియంత్రించాలంటే ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పటిష్టంగా ఏర్పాటు చేయాలి, వాటిని కచ్చితంగా అమలు చేయాలి. మాలాంటి సోషల్ నేను నా పుస్తకం ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’లో ఉదహరించిన అనేక అంశాలు, వాటి నుంచి నేను నేర్చుకున్న ΄ాఠాలు కూడా ఈ సమస్యల మీద ముందుకెళ్లడానికి ఉపకరిస్తాయనే అనుకుంటున్నాను’ ఎందుకు రాశానంటే... ‘మా నాన్నకు తన ఆటోబయోగ్రఫీ రాయాలనే కోరిక ఉందని తెలిసి పిల్లలుగా మేము సహకరించాం. ఆయన తుదిశ్వాస వదలడానికి రెండు నెలల ముందు పుస్తకం ఆవిష్కరించాం. బంధువులు, స్నేహితులకు ఆ ప్రతులను పంచినప్పుడు ఒక్కొక్కరూ ‘ఆయన సమాజం కోసం ఇంత సర్వీస్ ఇచ్చారని మాకిప్పటి వరకూ తెలియద’ంటూ నాన్నగారి గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. ఆ మాటలు వినడానికి నాన్న లేరు. అప్పుడు నాకు ఒక మనిషి గురించి పదిమందికి ఆ మనిషి బతికుండగానే తెలియాలి. అలాగే ఆ పదిమంది ఏమనుకున్నారనేది అది మంచి అయినా చెడు అయినా సరే... ఆ మనిషి బతికుండగానే తెలుసుకోవాలి అనిపించింది. అది తొలి కారణం. రెండో కారణం బాలీవుడ్ బయోపిక్. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు నా బయోపిక్ తీస్తామని అనుమతి కోరారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే యూ ట్యూబ్‌లో నా గురించి ఎవరికి తోచిన కథ వారు పెట్టారు. ఇతరులకు ఆ అవకాశం ఇవ్వడం కంటే నా స్టోరీ నా వెర్షన్ నేనే చె΄్పాలి అనుకున్నాను. నా పుస్తకంలో నేనేంటో ఉంది. ఒక గదిలో కూర్చుని రోజుకు 14 గంటల చొప్పున 13 రోజుల్లో పూర్తి చేసి జూన్ 17వ తేదీన విడుదల చేశాను. ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’ ఆన్లైన్లో అందుబాటులో ఉంది’ అని వివరించారు సునీతాకృష్ణన్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : అనిల్ కుమార్ మోర్లబలహీనత తెలియడమే బలం మన బలహీనతలను గుర్తించగలగడమే మన శక్తి. నా బలహీనత ఏమిటో గుర్తించగలిగాను కాబట్టే శక్తిమంతమయ్యాను. మన ఇచ్ఛాశక్తిలో శుద్ధి ఉంటే ప్రపంచంలోని శక్తులన్నీ మనకు సహాయంగా వస్తాయి. ప్రజ్వల నిర్వహణ కోసం ఫండ్‌రైజింగ్ గురించి ్ర΄ోగ్రామ్ చేయడానికి ఎన్డీటీవీ, సాక్షి టీవీలు అవకాశం ఇచ్చాయి. లైవ్ పూర్తయ్యేలోపు ఒక చిన్న ΄ాప తన కిడ్డీ బ్యాంక్‌ని పగలకొట్టి ఏడువేల రూ΄ాయలిచ్చింది. ఇలాంటి ఎంతోమంది సహకారం అందించారు. ఇప్పటి వరకు బాధితులైన మహిళల రక్షణ కోసమే పని చేశాను. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న సామాజిక విధ్వంసం చూస్తుంటే ప్రమాదం బారిన పడుతున్న మహిళల గురించి పని చేయాలనుకుంటున్నాను.– సునీతా కృష్ణన్, ఫౌండర్, ప్రజ్వల ఫౌండేషన్ -
నేచర్స్ లవింగ్లీ!
పొద్దుపొద్దున్నే లేవడం.. ఫోన్లు పట్టడం.. రీల్స్ చూడటం.. గేమ్స్ ఆడటం.. చాలా మంది పిల్లలు చేస్తున్న పనులు. ఫోన్ మోజులో పడి బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉంటున్నారు. అయితే వీళ్లు మాత్రం చాలా ప్రత్యేకం. ప్రకృతిని ప్రేమిస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. ప్రకృతిని పది మందికీ పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. చిన్న వయసులోనే జీవ వైవిధ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెబుతున్నారు. వారే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులైన అజ్మా ఖాన్, ఇబ్రహీం, నియో వెంకట్, అన్నవరపు సాతి్వక్. రెండేళ్లుగా ఎంతో శ్రమించి హెచ్‌పీఎస్‌లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా అద్భుతమైన ఫొటోలతో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం వెనుక ఉన్న వారి శ్రమ గురించి తెలుసుకుందాం.. కాంక్రీట్ అరణ్యంలో చాలావరకూ పక్షులు, కీటకాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. దాదాపు 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న హెచ్‌పీఎస్ బేగంపేట క్యాంపస్‌లో మాత్రం జీవవైవిధ్యం పరిఢవిల్లుతోంది. ఎన్నో రకాల జాతులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసుకున్న వీరంతా రెండేళ్లుగా స్కూల్లోని జంతు జాతులపై తీవ్ర పరిశోధన చేశారు. పక్షులు, కీటకాలు, సీతాకోకచిలుకలు ఇలా ఎన్నో రకాల జీవులను తమ కెమెరాల్లో అద్భుతంగా బంధించారు. వాటన్నింటినీ విభాగాల వారీగా విభజించి, ఒక్కో జీవం గురించి వివరించారు. 71 జాతుల పక్షులు, 128 జాతుల కీటకాలు, 16 జాతుల సరీసృపాలు, మూడు జాతుల ఉభయచరాలను పుస్తకంలో పొందుపరిచారు.అనేక విషయాలు నేర్చుకున్నాం.. తమ ప్రాజెక్టులో భాగంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వాళ్లు చెబుతున్నారు. సమా చారం సేకరణ సమయంలో చాలా మందితో మాట్లాడామని, వారంతా సహకరించారని పేర్కొన్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నామని తెలిపారు. పక్షులు, కీటకాల సమూహంలో ఎలా ప్రవర్తిస్తున్నాయో తమకు అర్థమైందని వివరించారు. వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. భవన నిర్మాణాల్లో మార్పు రావాలి.. పర్యావరణంలో ప్రతి జీవీ ముఖ్యమేనని, ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లో జీవ జాతుల కోసం ఎలాంటి ఏర్పాట్లూ చేయట్లేదని, దీంతో అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు. జీవ వైవిధ్యం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కలి్పంచడమే తమ పుస్తకం ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు. తమ తోటి విద్యార్థులు కూడా తమను చూసి ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నారని గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచి ఆసక్తితో.. ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. మా స్కూల్లో ఎన్నో జీవులు తారసపడుతుండేవి. వాటన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆలోచన ఉండేది. నాతో పాటు నాలాంటి ఆలోచన ఉన్న స్నేహితులతో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. స్కూల్లోని టీచర్లు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. – అజ్మా ఖాన్నెట్లో సరైన సమాచారం లేదు.. చాలా జీవుల గురించి ఇంటర్నెట్లో వెతికితే సరైన సమాచారం లభించట్లేదు. చాలాసార్లు తప్పుడు సమాచారం లభిస్తోంది. ఎలాగైనా వాటి గురించి సరైన సమాచారం అందించాలని అనుకున్నాం. అందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. సమాచారం సేకరణకు ఎంతో కష్టపడ్డాం. – నియో వెంకట్ పర్యావరణం అంటే ఇష్టం.. పర్యావరణం అంటే ఇష్టం. పక్షులు, జంతువులు, వాటి సమూహంతో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తాయో గమనిస్తుంటా. చేపలను పెంచడం అంటే ఇష్టం. ఇంట్లోనే సొంతంగా అక్వేరియం రూపొందించి, పలు రకాల చేపలను పెంచుకుంటున్నాను. రెడ్ టెయిల్ క్యాట్‌ఫిష్, టైగర్ ఆస్కార్, ఇరిడిసెంట్ ఆస్కార్, చెర్రీ బార్బ్ వంటి ఎన్నో చేపలను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. – ఇబ్రహీం వదూద్ అహ్మద్ దస్తగిర్కెమెరా ముఖ్యమైనది.. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఫోన్లు విస్తృతంగా వినయోగంలోకి వచి్చన తర్వాత ఫొటోలు, కెమెరాల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కెమెరాల్లో తీసిన ఫొటోలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాటి విలువ తెలుస్తుంది. మంచి ఫొటో కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. అప్పుడే అందమైన ఫొటోలు తీయడానికి అవకాశం ఉంటుంది. – సాతి్వక్ అన్నవరపు -
అటవిక రాజ్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా రెండు వారాలుగా జిల్లాలో టీడీపీ మూకలు సాగిస్తున్న భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అరాచకాలు, దాషీ్టకాలతో సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్లల్లోకి చొరబడి మహిళలనే విచక్షణ మరిచి ఆటవికంగా హింసకు పాల్పడుతున్నారు. మరో వైపు ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లపై శిలఫలకాల ధ్వంసాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్థలాల కబ్జా సాగిస్తున్నారు. జగనన్న లేఅవుట్లలో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చేశారు. పారీ్టలో క్రియాశీలకంగా పనిచేసిన నేతల ఆస్తులను కాల్చి బూడిద చేశారు. వీరి ఆటవిక చర్యలను అడ్డుకునేందుకు సాహించలేక మౌనంగా రోధిస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ప్రజలు గుర్తుచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోయినా.. సంక్షేమ పథకాలు అందించారని ప్రజలు అంటున్నారు. నారా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా? అని మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం వెంకటాచలం పోలీస్‌స్టేషన్ ఎదుటే వైఎస్సార్సీపీ కార్యకర్త దూడల మనోజ్‌కుమార్ తన కారును పోలీస్‌స్టేషన్ బయట నిలిపి లోపలికి వెళ్లారు. ఆ కారును టీడీపీ కార్యకర్తలు సండి సురేష్ బాలిబోయిన మహేష్ ధ్వంసం చేశారు. పోలీస్‌స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరిగినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. వీఎస్యూనూ వదలని మూకలు కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో సెంట్రల్ లైబ్రరీ శిలాఫలకాలను టీడీపీ నాయకులు గడ్డపారతో శిలాఫలకాలను ధ్వంసం చేశారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా భవనం వద్దకు చేరుకుని, ఆయన విగ్రహాన్ని భవనంలో ఎలా ఏర్పాటు చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిపాలన భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని, లేకుంటే తామే ధ్వంసం చేస్తామని అధికారులను హెచ్చరించారు.నవరత్నాల బోర్డు ధ్వంసం రామాయపట్నం గ్రామ సచివాలయంపై ఉన్న నవరత్నాల బోర్డును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. తాడుకట్టి పైకెక్కి ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి నెల్లూరు నగరంలోని చంద్రబాబునగర్‌కు చెందిన 29వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్యకర్త సాజిద్‌పై స్థానిక టీడీపీ కార్యకర్త హమీద్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. వీరి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి వెళ్తున్న సాజిద్‌ను మార్గమధ్యలో అటకాయించి మరోమారు విచక్షణరహితంగా దాడి చేశారు. అప్పుడు కాదురా...ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ కాపాడతారు.. వైఎస్సార్సీపీకి చెందిన కొందరి లిస్టు తమ వద్ద ఉందని.. వీరందరికీ ఇదే గతిపడుతుందని బెదిరించారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసం ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. డీజే పెట్టి, బాణసంచా పేలుస్తూ రామిరెడ్డి ఇంటి గేటును కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. దగదర్తిలో వైఎస్సార్సీపీ కార్యకర్త కాండ్ర శ్రీనివాసులు ఇంటికి సంబంధించిన నిర్మాణాన్ని జేసీబీతో కూల్చేశారు. తడకలూరుకు చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆత్మకూరు గిరినాయుడిపై దాడికి తెగబడ్డారు. దీంతో గిరినాయుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్‌నాయుడి ఇంటి ఎదుట కవి్వంపు చర్యలకు పాల్పడి బాణసంచా కాల్చి ఇంట్లో వేశారు. ద్విచక్ర వాహనం దహనం కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం యలమంచిపాడులో స్థానిక టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త షేక్ మస్తాన్‌పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన తల్లి షేక్ బీబీపైన కూడా దాడి చేశారు. 75 ఏళ్ల వయస్సున్న వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా తలపైన దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అదే రోజు తడకలూరులో టీడీపీ నాయకులు స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్త యలమా వెంకటేశ్వర్లుకు చెందిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగుల బెట్టారు.ఆర్బీకే శిలాఫలకం ధ్వంసం ఉలవపాడు మండలం ఆత్మకూరులో నిర్మించిన రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ధ్వంసం చేశారు. దీంతో పాటు రూమ్ తాళాన్ని సైతం పగలగొట్టారు. రూమ్ లోపల ఉన్న ఫ్యాన్‌ను సైతం ఎత్తుకెళ్లారని, టీడీపీ కార్యకర్తలు ఈ పనిచేసి ఉండొచ్చని.. దీనిపై ఫిర్యాదు చేయనున్నామని కాంట్రాక్టర్ తెలిపారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడలో వైఎస్సార్సీపీ నేతలు గిరికృష్ణ, మురళీకృష్ణ ఇంటిపై 15 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. దాదాపు 15 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు బైక్‌లపై తన ఇంటి ముందు పెద్ద శబ్దాలు చేస్తూ.. బయటకు రా నీ అంతు చూస్తామంటూ బెదిరించారు. తన తల్లి గుండెజబ్బుతో బాధపడుతోందని చెప్పినా, వినిపించుకోకుండా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తన ఇంటిపై వేశారని తెలిపారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో మరోసారి వచ్చి కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా త్వరలోనే చంపేస్తామని తనను బెదిరించారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.ట్రాక్టర్, ఆక్వా సామగ్రి దహనం తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు పంచాయితీకి చెందిన వైఎస్సార్సీపీ నేత కావల్‌రెడ్డి రంగారెడ్డికి చెందిన ఓ ట్రాక్టర్, ఏయిరేటర్ల, ఇతర ఆక్వా సామగ్రిని టీడీపీ వర్గీయులు దహనం చేశారు. మాజీ మంత్రి కాకాణి సమీప బంధువైన రంగారెడ్డి గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి తీవ్రంగా శ్రమించారు. ఇది గిట్టని స్థానిక టీడీపీ నాయకులే అధికార అండతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న లేఅవుట్లోని నిర్మాణ ఇల్లు ధ్వంసం దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్లోని నిర్మాణంలో ఉన్న తొమ్మిది ఇళ్లను అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఏరుకొల్లు ఎస్సీ కాలనీ సమీపంలో జగనన్న లేఅవుట్ ఏర్పాటు చేసి 36 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 20 నిర్మాణాలు చేపట్టి పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీ వాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారని అక్కసుతో 9 ఇళ్ల నిర్మాణాలను జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశి్నస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు. ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు అనంతసారం మండలం శంకరనగరం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. వారి ఇంట్లోకి టీడీపీ నేతలు చొరబడి టీవీలు, ఫ్రిజ్‌లను ధ్వంసం చేశారు. సర్పంచ్ వరలక్ష్మి నివాసం వద్ద డీజే, బాణసంచా కాల్చుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. టీడీపీ నేతలు సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. సర్పంచ్‌పై దాడికి తెగబడ్డారు. ఇంట్లో చొరబడి ధ్వంసం ఆస్తులు చేశారు. ఆ పక్క ఇంట్లోనే ఉన్న సర్పంచ్ బంధువు రవికుమార్‌రెడ్డి, అడ్డుకోబోయిన ఆయన బావ మరిది నాగసునీల్‌రెడ్డి, మామ రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఇంట్లోని వృద్ధులని కూడా చూడకుండా ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ జెండా స్థూపం ధ్వంసం నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డికాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ జెండాను, స్థూపాన్ని, శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత ఇల్లు ధ్వంసం కావలి పట్టణం 13వ వార్డు పుల్లారెడ్డినగర్‌లో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసులురెడ్డి ఇంటి నిర్మాణ పనులను ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు శనివారం జేసీబీతో ధ్వంసం చేశారు. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టా ఉన్నప్పటికీ అధికారులు ఇంటి నిర్మాణ పనులను తొలగించారు. మహిళపై టీడీపీ కార్యకర్త దాడి పంచాయతీ నిధులతో నిర్మించిన రచ్చబండను టీడీపీ కార్యకర్త ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న మహిళపై ఇనుప రాడ్‌తో దాడికి తెగబడిన ఘటన వెంకటాచలం మండలం కసుమూరులో జరిగింది. పది మందికి ఉపయోగపడే రచ్చబండను ధ్వంసం చేసి ఇంటి నిర్మాణం చేసుకోవడం ఏమిటని స్థానికంగా నివాసం ఉంటున్న ఉప్పు చెంగమ్మ ప్రశ్నించడంతో సదరు టీడీపీ కార్యకర్త షేక్ మస్తాన్ ఆమె తలపై రాడ్డుతో దాడి చేశాడు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మహిళపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆలియా డ్రీమ్ : సరికొత్తగా మరో ఘనత తన ఖాతాలో
నటిగా, భార్యగా, తల్లిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్ లుక్, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆలియా తాజాగా రచయిత్రిగా తొలి పుస్తకాన్ని ఆవిష్కరించింది. దివంగత తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్(‘Ed Finds a Home)'ను ఆదివారం తీసుకొచ్చింది. పిల్లల కోసం స్పెషల్‌గా పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు చెందిన పఫిన్ భాగస్వామ్యంతో పిల్లల కథల పుస్తకాన్ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా పిల్లలతో ముచ్చటించింది. అలాగే ఆలియా కుమార్తె రాహాకపూర్ కోసం చిన్నారులు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించింది. ఈ లాంచింగ్‌కు ఆలియా తల్లి సోనీ రజ్దాన్ సోదరి షాహీన్ భట్ హాజరయ్యారు. ముంబైలోని స్టోరీవర్స్ చిల్డ్రన్స్ లిటరరి ఫెస్ట్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తన బాల్యం నుంచీ తన జీవితం కథలు, స్టోరీ టెల్లింగ్ చుట్టూ అల్లుకొని ఉందని, తన బాల్యాన్ని, పిల్లలకోసం వెలికి తీయాలని కలలు కన్నాననీ, ఇది ప్రారంభం మాత్రమే..ఈ బుక్ సిరీస్‌గా ఉండబోతోందని ఆలియా ఇన్‌స్టాలో వెల్లడించింది. ఈ సందర్బంగా ఆలియా బటర్ ఎల్లో ఫ్లోరల్ ప్రింటెడ్ గౌనులో ఆకట్టుకుంది. సీబీ బ్రాండ్‌కు చెందిన లోలిత పేరుతో ఉన్న ఈ ఎల్లో కలర్ పూల గౌను ధర రూ. 17,901 లట. ఇప్పటికే ‘ఎడ్-ఎ-మమ్మా’ పేరుతో కిడ్స్ వేర్ బ్రాండ్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ మూవీలో నటించిన ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే బ్రహ్మాస్త్ర-2లో కూడా కనిపించనుంది. ది ఆర్చీస్ ఫేమ్ వేదాంగ్ రైనాతో కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'జిగ్రా' ఈ అక్టోబర్‌లో విడుదల కానుంది -
సింగపూర్‌లో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆద్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది, పుస్తక రచయిత, సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమానిగా ఆకెళ్ళ రాఘవేంద్ర అందరికీ సుపరిచితులు. ఈ కార్యక్రమంలో పాట షికారుకొచ్చింది పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200 పైగా వేదికల మీద మాట్లాడినా కుటుంబ సమేతంగా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తొలిసారి ఇక్కడే కుదిరిందని, ఇంతకు ముందు ఎన్ని సార్లు ప్రయత్నించినా వీలు కానిది ఈ సింగపూరు సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తన గురువు సిరివెన్నెల జీవితాన్ని సమతుల్యం చేస్తూ రాసిన పుస్తకం అని రచయిత తెలిపారు. ఈ సందర్బంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబందాన్ని, తనను ప్రోత్సహించిన వైనాన్ని పంచుకున్నారు. సింగపూరులో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇకపై సంస్థ నిర్వహించే కార్యక్రమాలను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సిరివెన్నెల అబిమానులందరికీ కృతజ్ఞతలు అని భావోద్వేగానికిలోనయ్యారు. సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోసంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి అయిన మే 20వ తేదీకి ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని, పుస్తక రచయిత, సిరివెన్నెల ఆత్మీయ శిష్యులు ఆకెళ్ళ రాఘవేంద్ర ద్వారా సింగపూర్‌లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందం అని, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలును తెలియచేసారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెల స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరొక్కసారి అందరికీ దక్కిందన్నారు. తెలుగు అక్షరం ఉన్నంత వరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని తెలియచేసారు.ఈ కార్యక్రమమునకు రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమము, ఆన్లైన్ ద్వారా 1000కి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణ కాంతి, మాధవి, పణీష్ తమ పాటలు, కవితలు వినింపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమము చివర్లో ఆకెళ్ళ సిరివెన్నెల అద్భుతమైన ప్రసంగంతో తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు పొందారు. అతిదులందరికి విందు భోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు. -
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
"మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్‌నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు. -
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
ప్రజలకు దారి చూపినవాడు నాయకుడవుతాడు. ప్రజలు నడిచే దారిలో తానూ నడిచినవాడే నాయకుడవుతాడు. ప్రజలు నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? మా దారిలో కష్టం ఉంది తొలగించు... మా గింజలకు వెలితి ఉంది పూరించు... మాకు జబ్బు చేస్తే వైద్యానికి దోవ లేదు చూపించు... మా పిల్లలకు చదువు చెప్పించు... మా నెత్తిన ఒక నీడ పరువు... మా పిల్లలకు ఒక ఉపాధి చూపించు... ఇలా చెప్పుకోవడానికే కదా.అవి విన్నవాడే నాయకుడవుతాడు. నేను ఉన్నానని అనేవాడే పాలకుడవుతాడు.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వర్తమాన పరిణామాలకు మూలాలు ఏమిటో తెలియడం తెలుగు ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రజల నొసట రాత పాలకులే రాస్తారు. నాటి మద్రాసు రాష్ట్రంతో మొదలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రకటన, తెలంగాణ ఉద్యమాల దరిమిలా తెలుగు రాష్ట్రాల విభజన... వీటన్నింటిలో పాలకుల ఎత్తుగడలకు, ప్రజల ఆకాంక్షలకు జరిగిన ఘర్షణ ఒక క్రమానుగతంగా చదివితే ఎక్కడెక్కడ నాయకుడనేవాడవసరమో అక్కడక్కడ తెలుగు జాతి ఒక నాయకుణ్ణి తయారు చేసుకోగలిగింది అనిపిస్తుంది. అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఈ నాయకుల్లో ప్రజల కోసం నిలిచే నాయకులూ ఉన్నారు. ప్రజలను వంచించే నాయకులూ ఉన్నారు.సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రదర్శించిన అహం, ప్రోత్సహించిన ముఠా రాజకీయాల సంస్కృతి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక అనిశ్చితిలోనే ఉంచాయి. స్థిరంగా నిలిచి, బలంగా కొనసాగే నాయకుడు ఉన్నప్పుడే జాతి ముందుకు వెళ్లగలదు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు సమర్థమైన నాయకత్వం వహించినా కుర్చీ కింద పెట్టే మంటలు వారిని కుర్చీ వదులుకునేలా చేశాయి. అసలు తెలుగువారికి ఒక ఆత్మాభిమానం ఉందా అనే సందేహం కలిగించాయి.ఈ సందర్భమే ఎన్.టి.రామారావు పుట్టుకకు కారణమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా, చరిష్మా కలిగిన పాలకుడిగా, పేదవాడి గురించి ఆలోచన చేసిన అభిమాన నేతగా ఎన్.టి.రామారావు ప్రజల మెప్పును పొందారు. కాని ఆయన అహం, తొందరపాటు చర్యలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి అవమానపడే రీతిలో ఎన్.టి.ఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ ఫండ్ ఉన్న అకౌంట్‌ను కూడా హస్తగతం చేసుకున్న వార్త అందిన రోజున ఎన్.టి.ఆర్. తీవ్ర మనస్తాపం చెందారు. అదే ఆయన మృతికి కారణమైందన్న భావన ఉంది.‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ఒక రాష్ట్రాన్ని ప్రజల వారసత్వంగా చూడాల్సిందిపోయి దానినో కార్పొరెట్ ఆఫీసుగా మార్చి, దానికి తాను సి.ఇ.ఓగా భావించి పాలించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు ప్రజలు చులకనను ఎదుర్కొన్నారు. గుండు దెబ్బలు తిన్నారు. నీతి, రీతులే వ్యక్తిత్వమని భావించే మన సంస్కృతిలో వంచనతో వచ్చిన నాయకుడిని నమ్మి మోసపోతున్నామని తెలుగు ప్రజలకు పదేపదే అనిపించిన ఉదంతాలు ఉన్నాయి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చి పెద్ద గీత గీసే వరకూ చంద్రబాబు ఎంత చిన్న గీతో ప్రజలకు అర్థమైందని విశ్లేషకులు అంటారు.ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత... పాలన చేస్తే ఎలా ఉంటుందో వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చూపారు. విశాలమైన హృదయం, దయ, ఆర్ద్రత ఉన్న నాయకుడు తన పాలనలో ప్రతి వ్యక్తి ఉన్నతి కోసం తపన పడతాడని, పడాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, జలయజ్ఞం... రాష్ట్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నదని ప్రజలు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉన్న కాలమది.కాని రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తెలుగుజాతిని స్థాణువును చేసింది. రాజశేఖర రెడ్డిని చూసిన కళ్లు అలాంటి నాయకుడి కోసమే వెతుకులాడాయి. ఆ నాయకుణ్ణి వై.ఎస్.జగన్‌లో చూసుకున్నాయి. అయితే రాజకీయ కుయుక్తులు పన్నడంలో తలపండిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్‌కు మధ్య సైంధవుడిలా నిలిచారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించి, అబద్ధాల మేడలు కట్టి మరోసారి జనాన్ని నమ్మించి సి.ఎం. అయ్యారు. కాని చంద్రబాబు పరిపాలనా కాలంలో రాష్ట్రం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. చిన్నా చితక పథకాల ప్రయోజనాల కోసం కూడా ప్రజలు అల్లల్లాడారు. ఒక వర్గం ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల లబ్ధి పొందుతున్నారని సామన్యులకు అవగతమైంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని కోసం వారు తిరగబడ్డారు. వై.ఎస్.జగన్‌ని తమ ముఖ్యమంత్రిని చేసుకున్నారు.రాష్ట్ర విభజన వల్ల అనేక వెసులుబాట్లు కోల్పోయి, నిధుల లోటులో రాష్ట్రం ఉన్నప్పటికీ జగన్ తన విశిష్ట సమర్థతతో ప్రజాహిత పాలన కోసం నవరత్నాలతో ముందుకు వచ్చారు. రెండేళ్ల కరోనా కాలం ప్రపంచాన్ని స్తంభింపచేసినా తెలుగు రాష్ట్రం ముందంజలో ఉండేలా చూసుకున్నారు. విద్య నుంచి వికాసం, వైద్య ఖర్చు నుంచి విముక్తి ప్రధాన అజెండాగా చేసుకున్న జగన్ విస్తృత తెలుగు సమూహాలను గట్టున పడేశారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి జరిగింది. రాజధానిలో పేదలకూ చోటుండాలని భావించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఉన్నారా?దారులు స్పష్టం. ప్రజలు ఏ దారిని ఎంచుకోవాలో తమకు తాముగా నిర్ణయించుకోవాలని అంటారు దేవులపల్లి అమర్. ఆయన రాసిన ‘మూడు దారులు’ గ్రంథం ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి మొదలయ్యి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధోరణులను తెలియచేస్తూ ఇప్పుడు వై.ఎస్. జగన్‌తో తల పడుతున్న చంద్రబాబు ‘యూ టర్న్’లను, వెన్నుపోట్లను, నమ్మించి వచించిన సంఘటలను విపులంగా తెలియచేసి పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా మాత్రమే కాదు, చేయి తిరిగిన జర్నలిస్టుగా కూడా దేవులపల్లి అమర్ ఎంతో సులభంగా, సరళంగా చరిత్రని, వర్తమానాన్ని, తెలుగు నేలకు సంబంధించిన రాజకీయ ఘటనలను ఒక వరుసలో ఉంచి పాఠకులకు గొప్ప అవగాహన కలిగిస్తారు. కొన్ని ఘటనలు జరక్కపోయి ఉంటే తెలుగు జాతి మరింత ముందంజలో ఉండేది కదా అనిపించే విషయాలన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది నేటి రాజకీయ కార్యకర్తలకు, నిపుణులకే కాదు భావి విద్యార్థులకు కూడా కీలకమైన రిఫరెన్స్ గ్రంథం.‘చరిత్రదేముంది... చింపేస్తే చిరిగి పోతుంది’ అనేది సినిమాలో డైలాగ్. కాని చరిత్ర చిరిగిపోదు. అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఉజ్జీవనం చెందుతూనే ఉంటుంది. చరిత్ర నిర్మింపబడే కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విభజన అయ్యాక కాళ్లూ చేతులు ఊనుకుని ఒక గొప్ప పురోగమనానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో ఎటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో, తద్వారా ఎటువంటి ఘన చరిత్రకు తెలుగు జాతి ఆలవాలంగా ఉండాలో ఈ ఎన్నికల కాలంలో నిర్ణయించుకోవాలి. దారి స్పష్టం కావాలంటే ఈ గ్రంథం చదవండి.మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు; రచన– దేవులపల్లి అమర్; ప్రచురణ– రూప బుక్స్; పేజీలు: 210; వెల–395; ప్రతులకు–రూప పబ్లికేషన్స్, హైదరాబాద్.– వి.ఎన్.ప్రసాద్ (చదవండి: మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు) -
అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన టీడీపీ అభిమానులనూ ఆకట్టుకుంటోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అభిమాని అయిన సీనియర్ జర్నలిస్ట్ రేణుక పోతినేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనిక పాలనపై ప్రత్యేకంగా ఓ పుస్తకం రూపొందించారు. ‘జగన్ విజన్.. ట్రాన్స్ఫార్మింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ’ శీర్షికతో ఆమె రచించిన ఈ పుస్తకం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీలో కనిపిస్తున్న అద్వితీయ మార్పులను ఎలుగెత్తి చాటుతూ, మాజీ సీఎం చంద్రబాబు హయాంలోని అవినీతి కోణాలను ఈ పుస్తకం తూర్పారపట్టింది.ఏపీలో అభివృద్ధి, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయం, విద్య, ఆక్వా రంగం అభివృద్ధి, వైద్యం, సంక్షేమం, భూ సంస్కరణలు, ఇళ్ల నిర్మాణం, మేనిఫెస్టో విశ్వసనీయత, సీఎం జగన్ స్కీములు, చంద్రబాబు స్కాములను వివరిస్తూ, అప్పటి.. ఇప్పటి అప్పులపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సమగ్ర వివరాలు అందించిన ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటోంది.సీఎం జగన్ సమగ్ర పాలనా స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన రేణుక పోతినేని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఈ పుస్తకాన్ని రూపొందించడమే కాకుండా, సీఎం జగన్ పాలనను సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు.చరిత్ర ఎరుగని దుర్మార్గపు దాడి..ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై గత ఐదేళ్లుగా ప్రధాన మీడియాల్లో పదేపదే తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు రేణుక తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. ‘నిజం రెండు అడుగులు వేసేలోపు.. అబద్ధం వెయ్యి అడుగులు వేస్తుంది’ అనే నినాదాన్ని టీడీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు నమ్ముకున్నాయయి’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్‌తో ప్రధాన, సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయన్నారు.తెలుగుదేశం పార్టీ, న్యూట్రల్ ముసుగులో ఉన్న రెండు పత్రికలు, ఐదారు మీడియా సంస్థల అసత్య ప్రచార దాడిలో ఎన్నో వాస్తవాలు మరుగున పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ తరఫున 1.50 లక్షల వాట్సాప్ గ్రూప్‌లు, 100కు పైగా పెయిడ్ మీమర్స్, వెయ్యికి పైగా ఫేస్బుక్ పేజీలను నడిపిస్తూ నిత్యం ప్రజా పాలనపై చరిత్రలో ఎన్నడూ లేనంతగా దుర్మార్గపు దాడికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు.ఐదేళ్లలో ఏపీ సాధించిన అభివృద్ధి, సంక్షేమం వివరాలు ప్రజలకు గణాంకాలతో సహా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాల వెనుక ఏపీ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా మారుతుందో, ఎంతటి గొప్ప మార్పులు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవడానికే కచ్చితమైన సమాచారంతో ‘జగన్ విజన్’ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు’ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. ఆమె చెప్పిన అక్షర సత్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. -
Book Fair: వెలుగులు విరజిమ్మనీ
-
సావిత్రిగారిని చూడగానే నోట మాట రాలేదు: చిరంజీవి
‘‘మహానటి సావిత్రిగారిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో నా జన్మ సార్థకం అయిందని భావిస్తున్నాను’’ అన్నారు హీరో చిరంజీవి. దివంగత నటి సావిత్రిపై సంజయ్ కిశోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘పునాదిరాళ్లు’లోనే సావిత్రిగారితో నటిస్తున్నానని తెలియగానే ఒళ్లు జలదరించింది. రాజమండ్రిలోని పంచవటి హోటల్లో ఉన్న సావిత్రిగారిని పరిచయం చేసేందుకు నన్ను తీసుకెళ్లారు. ఆమెను చూడగానే నోట మాట రాలేదు. ‘నీ పేరేంటి బాబు’ అని అడిగారామె. చిరంజీవి అన్నాను. ‘శుభం బాగుంది’ అన్నారు. మరుసటి రోజ వర్షం వల్ల ‘పునాదిరాళ్లు’ షూటింగ్ క్యాన్సిల్ అయింది. నేను సరదాగా డ్యాన్స్ చేస్తూ జారిపడ్డాను. అయినా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్ చేయడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు సావిత్రిగారు ‘భవిష్యత్‌లో మంచి నటుడు అవుతావు’ అని చెప్పిన మాట నాకు వెయ్యి ఏనుగుల బలం అనిపించింది. ‘ప్రేమ తరంగాలు’లో సావిత్రిగారి కొడుకుగా నటించాను. ఆ తర్వాత ఆమెతో నటించే, ఆమెను చూసే చాన్స్ రాలేదు. కేవలం కళ్లతోనే నటించగల, హావభావాలు పలికించగల అలాంటి గొప్ప నటి ప్రపంచంలో మరెవరూ లేరు’’ అన్నారు. ఈ వేడుకలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీశ్ కుమార్, నటీనటులు జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. -
అమర్ రచన "మూడు దారులు" పై.. కల్లూరి భాస్కరం సమీక్ష!
సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్‌కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్‌పై, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్‌ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది. అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్‌తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి. ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్‌తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే. మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్‌తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు). ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం -
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు.. మరోసారి విచారణ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి టీడీపీ లాయర్లు మళ్లీ సమయం కోరగా, మార్చి 11కి విచారణను కోర్టు వాయిదా వేసింది. గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో టీడీపీ న్యాయవాదులు నెట్టుకొస్తున్నారు. కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నిస్తున్నారు. కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలను కూడా లోకేష్ పట్డించుకోలేదు. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగారు. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్‌కి నోటీసులు జారీ కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లోకేష్ లెక్కచేయలేదు. నేటి విచారణలో మరోసారి టీడీపీ లాయర్లు వాయిదా కోరారు. -
రతన్ టాటా బయోగ్రఫీ బుక్ లాంచ్ ఎప్పుడంటే..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలలో ఒకరైన 'రతన్ టాటా' జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రానున్నట్లు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. పుస్తక రచయిత 'మాథ్యూ' (Mathew) నవంబర్ 2022లో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2022లో రతన్ టాటా బయోగ్రఫీ బుక్ విడుదలవుతుందని ఎదురుచూసే అభిమానులకు అప్పుడు నిరాశే ఎదురైంది. ఆ తరువాత బుక్ లాంచ్ తేదీని 2023 మార్చి నెలకు మార్చారు, మళ్ళీ ఓసారి 2024 ఫిబ్రవరి అన్నారు. ఈ నెలలో కూడా బుక్ లాంచ్ సాధ్యంకాదని తేలిపోయింది. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ మార్చి 30 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి.. దాతృత్వానికి మారుపేరుగా నిలిచినా రతన్ టాటాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంది. ఇటీవలే రతన్ టాటా ఏకంగా 165 కోట్ల రూపాయలతో పెంపుడు జంతువుల కోసం హాస్పిటల్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. -
చంద్రబాబు పుస్తకం..రక్తం పొంగుతుంది..
-
‘ఆంధ్ర సంపాదక శిఖరాలు’.. పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, విజయవాడ: సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన 'ఆంధ్ర సంపాదక శిఖరాలు' పుస్తకాన్ని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ రాజశేఖర్,ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు సోమవారం ఆవిష్కరించారు. నాగార్జున యూనివర్సిటీ(ఎన్యూ)లో జరిగిన "తెలుగు భాష సేవా రత్న" అవార్డుల ప్రదానోత్సవ సభలో ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఆర్. మీడియా అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్రికా రంగాన్ని ఉర్రూతలూగించిన తొలి తరం సంపాదకుల సంక్షిప్త జీవిత చరిత్రలను ప్రస్తుత తరానికి అందించాలన్న తలంపుతో మీడియా అకాడమీ ఈ పుస్తకాన్ని ప్రచురించిందన్నారు. ఆయా సంపాదకుల వివరాలు సేకరించి మా శర్మ ఈ పుస్తకాన్ని అద్భుతంగా రచించారని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీతో మీడియా అకాడమీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కొమ్మినేని గుర్తుచేసుకున్నారు. వర్కింగ్ జర్నలిస్టులకోసం తాను ఛైర్మన్‌గా పనిచేసిన కాలంలో ప్రారంభించిన జర్నలిజం డిప్లమో కోర్సుకు సహకరించిన వైస్ ఛాన్సిలర్, ప్రొ. రాజశేఖర్‌కు, జర్నలిజం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ డా. జి. అనితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రచయిత మా శర్మను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సిలర్ ప్రొ. కొలకలూరి ఇనాక్ సి.ఆర్. మీడియా అకాడమీ తరపున శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస ఆంధ్రుల కమిటీ చైర్మన్, మేడపాటి వెంకట్, తెలుగు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ వాసుదేవరావు, జర్నలిజం హెచ్‌వోడీ డా. జి. అనిత, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి.. తిరుమల ధార్మిక సదస్సులో పలు తీర్మానాలు -
'మూడుదారులు': రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు!
నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. కాకపొతే, ఈ మువ్వురిలో చంద్రబాబు నాయుడిది రాజకీయంగా భిన్నమైన మార్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలభయ్ ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వుంది. ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్ జర్నలిస్టుగా దగ్గరనుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్, తన అనుభవ సారాన్ని తాను రాసిన మూడు దారులు అనే ఈ రెండువందల పేజీల గ్రంథంలో సవిస్తరంగా ప్రస్తావించారు. చంద్రబాబు అనగానే గుర్తు వచ్చే మరో ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ. రామారావు. ఆ పేరు వినగానే తలపుకు వచ్చే మరో పదం వైస్రాయ్ ఎపిసోడ్. ఇప్పుడు మూడు, నాలుగు పదుల వయసులో వున్నవారికి గుర్తు వుండే అవకాశం లేదు కానీ, కొంత పాత తరం వారికి తెలుసు. విచిత్రం ఏమిటంటే వారికీ పూర్తిగా తెలియదు. ఆ కాలంలో చురుగ్గా పనిచేసిన కొందరు జర్నలిస్టులు అప్పటి రాజకీయ పరిణామాలను నిశితంగా చూసిన వారే అయినా, ఇంకా ఏదో కొంత సమాచారం మరుగున ఉందేమో అనే సందేహం, వారు ఈ అంశంపై రాసిన రచనలు, వార్తలు, పుస్తకాలు చదివినప్పుడు పాఠకులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణాన్ని కూడా అమర్ తన గ్రంథంలో ప్రస్తావించారు. ఆయన అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్రప్రభలో రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జ్ గా వున్నారు. ‘మరి, అప్పట్లో ఇటువంటి (ఈ గ్రంథంలో పేర్కొన్న) విషయాలను మీరెందుకు రిపోర్ట్ చేయలేదని కొందరు మితృలు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు అలా అడగడం సబబే. ఇలా అడిగిన వారిలో మీడియా మితృలు కూడా వున్నారు. పత్రికా స్వేచ్ఛ నేతి బీరకాయ చందం అని వారికి తెలియనిది కాదు. పత్రిక పాలసీని సంపాదకులు కాకుండా యజమానులే నిర్ణయించే కాలానికి వచ్చాక జరిగిన ఉదంతం ఇది. అప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక యజమాని, చంద్రబాబు నాయుడు పక్షం ఎంచుకున్నారు. ఇక మా ఎడిటర్ ఆయన్ని మించి బాబు భక్తి ప్రదర్శించేవారు.’ అంటూ రాసుకొస్తూ అమర్ ఆ రోజుల్లో జరిగిన డిస్టిలరీ అనుమతి ఉదంతాన్ని పేర్కొన్నారు. ‘బాబుకు అనుకూలంగా రాసిన ఆ వార్తను ఈనాడు పత్రిక మాత్రమే ప్రముఖంగా ప్రచురించడం, ఆ వార్త మా పత్రికలో మిస్ అవడం తట్టుకోలేని మా ఎడిటర్, మా బ్యూరోను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. జరిగిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మర్నాడు మొదటి పేజీలో, సుదీర్ఘంనైన సంపాదకీయం రాసి, చంద్రబాబు పట్ల తన విధేయతను చాటుకున్నారు. అయితే సంపాదకుడి వైఖరికి నిరసనగా ఉద్యోగాన్ని వదిలి వేయవచ్చు కదా అంటే, నిజమే చేయవచ్చు. కానీ అప్పట్లో వెంటనే మరో చోట ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆ సాహసం చేయలేదు. చాలామంది జర్నలిస్టుల పరిస్థితి అదే. బయటకు చెప్పుకోలేక పోవచ్చు. ఇప్పుడయినా ఆ వివరాలన్నీ రాసే అవకాశం వచ్చింది. వైస్రాయ్ సంఘటనలో నిజానిజాలు గురించి నేటి యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సవివరంగా రాయడం జరిగింది’ అని అమర్ ఇచ్చిన వివరణ. మూడు దారుల్లో ఇదొకటి. మిగిలినవి రెండూ వై.ఎస్. ఆర్., వై ఎస్. జగన్ ఎంచుకున్న దారులు. ఈ దారులపై మీడియా కావాలని వికృత ధోరణితో వార్తలు వండి వార్చింది అనే ఆరోపణలకు సంబంధించి కొన్ని దృష్టాంతాలను అమర్ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. నాటి సంఘటనలకు సాక్షీభూతులైన అనేకమందిని కలుసుకుని, చంద్రబాబు అనుకూల, ప్రతికూల జర్నలిస్టులు, రచయితలు రాసిన పుస్తకాలలోని అంశాలను కూడా ఆయన ఉదహరించి, తన రచనకు సాధికారతను ఒనగూర్చే ప్రయత్నం చేశారు. తాను స్వయంగా గమనించిన విషయాలతో పాటు, తనకు తెలియ వచ్చిన మరి కొన్ని అంశాలను ధ్రువపరచుకునేందుకు అమర్ చాలా కసరత్తు చేసినట్టు ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది. కన్నవీ, విన్నవీ విశేషాలతో కూడిన గ్రంధరచన కాబట్టి కొంత వివాదాస్పదం అయ్యే అవకాశాలు వున్నాయి. నాటి సంఘటనలకు నేనూ ఒక ప్రత్యక్ష సాక్షిని కనుక పుస్తకం చదువుతున్నప్పుడు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు మూగ మనసులు సినిమాలోలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాఠకులను ఇది ఆకర్షిస్తుంది. ఈ పుస్తకాన్ని ముందు అమర్ ఆంగ్లంలో DECCAN POWER PLAY అనే పేరుతొ ప్రచురించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. తెలుగు అనువాద రచన మూడు దారులు పుస్తకావిష్కరణ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్లో మరోమారు జరగనుంది. తోకటపా: విజయవాడ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగ ఉవాచ: ‘దేవులపల్లి అమర్ కు వై.ఎస్. రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ. జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి ఏమి రాసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు’. భండారు శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు) -
సమస్యలు రాయరా అంటే సమోసాలు గురించి రాస్తాడు: పేర్ని నాని
-
‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పుస్తకాన్ని సీఎం జగన్‌కు అందజేసిన ధర్మాన
సాక్షి, అమరావతి: రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన ప్రజాజీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా చట్టసభల్లో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో ‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆయన కలిసి పుస్తకాన్ని అందించారు. ఇదీ చదవండి: అభిమానులపై ‘పంజా’!