పొద్దుపొద్దున్నే లేవడం.. ఫోన్లు పట్టడం.. రీల్స్ చూడటం.. గేమ్స్ ఆడటం.. చాలా మంది పిల్లలు చేస్తున్న పనులు. ఫోన్ మోజులో పడి బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఎప్పుడూ ఫోన్‌లో బిజీగా ఉంటున్నారు. అయితే వీళ్లు మాత్రం చాలా ప్రత్యేకం. ప్రకృతిని ప్రేమిస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. ప్రకృతిని పది మందికీ పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. చిన్న వయసులోనే జీవ వైవిధ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెబుతున్నారు. వారే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులైన అజ్మా ఖాన్, ఇబ్రహీం, నియో వెంకట్, అన్నవరపు సాతి్వక్. రెండేళ్లుగా ఎంతో శ్రమించి హెచ్‌పీఎస్‌లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా అద్భుతమైన ఫొటోలతో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం వెనుక ఉన్న వారి శ్రమ గురించి తెలుసుకుందాం..
కాంక్రీట్ అరణ్యంలో చాలావరకూ పక్షులు, కీటకాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. దాదాపు 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న హెచ్‌పీఎస్ బేగంపేట క్యాంపస్‌లో మాత్రం జీవవైవిధ్యం పరిఢవిల్లుతోంది. ఎన్నో రకాల జాతులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసుకున్న వీరంతా రెండేళ్లుగా స్కూల్లోని జంతు జాతులపై తీవ్ర పరిశోధన చేశారు. పక్షులు, కీటకాలు, సీతాకోకచిలుకలు ఇలా ఎన్నో రకాల జీవులను తమ కెమెరాల్లో అద్భుతంగా బంధించారు. వాటన్నింటినీ విభాగాల వారీగా విభజించి, ఒక్కో జీవం గురించి వివరించారు. 71 జాతుల పక్షులు, 128 జాతుల కీటకాలు, 16 జాతుల సరీసృపాలు, మూడు జాతుల ఉభయచరాలను పుస్తకంలో పొందుపరిచారు.
అనేక విషయాలు నేర్చుకున్నాం..
తమ ప్రాజెక్టులో భాగంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వాళ్లు చెబుతున్నారు. సమా చారం సేకరణ సమయంలో చాలా మందితో మాట్లాడామని, వారంతా సహకరించారని పేర్కొన్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నామని తెలిపారు. పక్షులు, కీటకాల సమూహంలో ఎలా ప్రవర్తిస్తున్నాయో తమకు అర్థమైందని వివరించారు. వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.
భవన నిర్మాణాల్లో మార్పు రావాలి..
పర్యావరణంలో ప్రతి జీవీ ముఖ్యమేనని, ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లో జీవ జాతుల కోసం ఎలాంటి ఏర్పాట్లూ చేయట్లేదని, దీంతో అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు. జీవ వైవిధ్యం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కలి్పంచడమే తమ పుస్తకం ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు. తమ తోటి విద్యార్థులు కూడా తమను చూసి ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నారని గుర్తుచేసుకున్నారు.
చిన్నప్పటి నుంచి ఆసక్తితో..
ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. మా స్కూల్లో ఎన్నో జీవులు తారసపడుతుండేవి. వాటన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆలోచన ఉండేది. నాతో పాటు నాలాంటి ఆలోచన ఉన్న స్నేహితులతో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. స్కూల్లోని టీచర్లు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు.
– అజ్మా ఖాన్
నెట్‌లో సరైన సమాచారం లేదు..
చాలా జీవుల గురించి ఇంటర్నెట్‌లో వెతికితే సరైన సమాచారం లభించట్లేదు. చాలాసార్లు తప్పుడు సమాచారం లభిస్తోంది. ఎలాగైనా వాటి గురించి సరైన సమాచారం అందించాలని అనుకున్నాం. అందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. సమాచారం సేకరణకు ఎంతో కష్టపడ్డాం. – నియో వెంకట్
పర్యావరణం అంటే ఇష్టం..
పర్యావరణం అంటే ఇష్టం. పక్షులు, జంతువులు, వాటి సమూహంతో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తాయో గమనిస్తుంటా. చేపలను పెంచడం అంటే ఇష్టం. ఇంట్లోనే సొంతంగా అక్వేరియం రూపొందించి, పలు రకాల చేపలను పెంచుకుంటున్నాను. రెడ్ టెయిల్ క్యాట్‌ఫిష్, టైగర్ ఆస్కార్, ఇరిడిసెంట్ ఆస్కార్, చెర్రీ బార్బ్ వంటి ఎన్నో చేపలను జాగ్రత్తగా చూసుకుంటున్నాను.
– ఇబ్రహీం వదూద్ అహ్మద్ దస్తగిర్
కెమెరా ముఖ్యమైనది..
ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఫోన్లు విస్తృతంగా వినయోగంలోకి వచి్చన తర్వాత ఫొటోలు, కెమెరాల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కెమెరాల్లో తీసిన ఫొటోలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాటి విలువ తెలుస్తుంది. మంచి ఫొటో కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. అప్పుడే అందమైన ఫొటోలు తీయడానికి అవకాశం ఉంటుంది. – సాతి్వక్ అన్నవరపు
Comments
Please login to add a commentAdd a comment