Hyderabad Public School
-
హెచ్‌పీఎస్ జ్ఞాపకాలతో మురిసిన నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: సుమారు 45 ఏళ్ల క్రితం తాను చదువుకున్న స్కూల్లోని జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో అడుగుపెట్టారు. తాను ఆడుకున్న మైదానం, కూర్చున్న తరగతి గదులను చూసి మురిసిపోయారు. తనకు చదువుచెప్పిన ఉపాధ్యాయులను ఆప్యాయంగా పలకరించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ‘ఫ్లైట్ ఆఫ్ ది ఈగిల్’ పేరిట రూపొందిన కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది.ఈ కార్యక్రమానికి సత్య నాదెళ్లతో పాటు హెచ్‌పీఎస్‌కు చెందిన మరో పూర్వ విద్యార్థి అడోబ్ సీఈవో శంతను నారాయణ్ (shantanu narayen) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1923లో జాగిర్దార్ కాలేజీగా ప్రస్థానం ప్రారంభమై వందేళ్లపాటు వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ల ఘన చరిత్రపై పుస్తకాన్ని విడుదల చేశారు. హెచ్‌పీఎస్‌లోనే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాంనాదెళ్ల, శంతను ఈ సందర్భంగా నాదెళ్ల, శంతను మాట్లాడుతూ హెచ్‌పీఎస్‌లోనే (HPS) తాము నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నామని చెప్పారు. ఈ పాఠశాల తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని.. ఇక్కడ నేర్చుకున్న నాయకత్వ లక్షణాలతోనే ఇంత స్థాయికి ఎదిగామన్నారు. తన భార్య అనుపమ కూడా ఇక్కడే చదువుకుందని నాదెళ్ల తెలిపారు. హెచ్పీఎస్తో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు.చదవండి: ‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలిపుస్తకంలోని కథలు, దృశ్యాలు పాఠశాల స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు ప్రశంసించారు. పుస్తకానికి ప్రధాన సంపాదకుడిగా కృష్ణమూర్తి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాఫీ టేబుల్ బుక్ సబ్–కమిటీ సహ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి కందూర్, హెచ్‌పీఎస్ సొసైటీ అధ్యక్షుడు గుస్తీనోరియా, ఫయాజ్‌ఖాన్ క్రియేటివ్ హెడ్ ప్రణవ్ పింగిల్, హెడ్ రీసెర్చర్ సంజీవ్ చక్రవర్తి, హెడ్ డిజైనర్ అనీష్ పెంటి, లీడ్ రైటర్ అలోక్ తదితరులు పాల్గొన్నారు. -
సందడిగా హెచ్‌పీఎస్ 101వ వార్షిక క్రీడోత్సవం
సనత్‌నగర్ : బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) 101వ వార్షిక క్రీడోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. హెచ్‌పీఎస్ ఆవరణలోని ఫ్రంట్ ఫీల్డ్‌లో అట్టహాసంగా నిర్వహించిన క్రీడా సంబరాల్లో వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ఆయా క్రీడల్లో సత్తా చాటారు. హెడ్‌బాయ్ శాని్వసాగి, హెడ్‌బాయ్ సార్తక్ లాంబా నేతృత్వంలో పాఠశాలలోని తక్షశిల, నాగార్జున, నలంద, విజయనగర బృందాలు అద్భుతరీతిలో మార్చ్ఫాస్ట్ నిర్వహణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు విద్యార్థులు కేరింతల నడుమ క్రీడాకారులు విజయం సాధించి తమ బృందానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చపెట్టేందుకు పోటీపడారు. సీనియర్ బాలురు, బాలికల 100 మీటర్ల పరుగు పందెంలో విజయనగర హౌస్‌కు చెందిన రుత్విక్ వూవాదన్, ఎస్ఎస్ సమితరెడ్డిలు మొదటి స్థానంలో నిలిచారు. అలాగే హార్స్ రైడింగ్ క్లబ్‌కు చెందిన విద్యార్థులు గుర్రాలపై విన్యాసాలు చేసి అలరించారు. ఏరోబిక్స్ విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. అనంతరం 6, 7 తరగతులకు చెందిన 690 మంది విద్యార్థులు ‘టాలోన్స్ ఆఫ్ ట్రయంఫ్’ పేరుతో ఆకర్షణీయమైన ప్రదర్శన ఇచ్చారు. పర్పుల్ అండ్ వైట్ దుస్తులు ధరించిన విద్యార్థులు రిబ్బన్లతో అదిరిపోయే సింఫనీని సృష్టించారు. 3, 4, 5 తరగతులకు చెందిన 981 మంది విద్యార్థులు ఆక్స్‌ఫర్ట్ అండ్ కేంబ్రిడ్జి బ్లూస్ ధరించి ‘ఫ్యూజన్ ఫిట్నెస్’ పేరుతో కాలిస్టెనిక్స్ పరిపూర్ణ ప్రదర్శన వీక్షకులను ఆశ్చర్యచకితులను చేసింది. 8, 9 తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన ‘వైబ్రెంట్ వైబ్స్’ డీల్ అబ్బురపరిచింది. క్రీడలు, ఇతర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్యోతిక శ్రీదండి ట్రోఫీలు, జ్ఞాపికలను ప్రదానం చేశారు. హెచ్‌పీఎస్ ప్రిన్సిపాల్ స్కంద్బాలి, సొసైటీ ప్రతినిధులు, ఆధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి..విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేలా పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తగిన శ్రద్ధ చూపించాలి. హెచ్‌పీఎస్ క్రీడోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవడం నా అదృష్టం. విద్యార్థులు వైఫల్యానికి భయపడవద్దు. క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి. అంకితభావం, పట్టుదలతో సాధించలేనిది ఏదీ ఉండదు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుంది. – ఒలింపిక్స్ జాతీయ చాంపియన్ (స్ప్రింటింగ్) జ్యోతిక శ్రీదండి -
నేచర్స్ లవింగ్లీ!
పొద్దుపొద్దున్నే లేవడం.. ఫోన్లు పట్టడం.. రీల్స్ చూడటం.. గేమ్స్ ఆడటం.. చాలా మంది పిల్లలు చేస్తున్న పనులు. ఫోన్ మోజులో పడి బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉంటున్నారు. అయితే వీళ్లు మాత్రం చాలా ప్రత్యేకం. ప్రకృతిని ప్రేమిస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. ప్రకృతిని పది మందికీ పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. చిన్న వయసులోనే జీవ వైవిధ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెబుతున్నారు. వారే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులైన అజ్మా ఖాన్, ఇబ్రహీం, నియో వెంకట్, అన్నవరపు సాతి్వక్. రెండేళ్లుగా ఎంతో శ్రమించి హెచ్‌పీఎస్‌లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా అద్భుతమైన ఫొటోలతో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం వెనుక ఉన్న వారి శ్రమ గురించి తెలుసుకుందాం.. కాంక్రీట్ అరణ్యంలో చాలావరకూ పక్షులు, కీటకాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. దాదాపు 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న హెచ్‌పీఎస్ బేగంపేట క్యాంపస్‌లో మాత్రం జీవవైవిధ్యం పరిఢవిల్లుతోంది. ఎన్నో రకాల జాతులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసుకున్న వీరంతా రెండేళ్లుగా స్కూల్లోని జంతు జాతులపై తీవ్ర పరిశోధన చేశారు. పక్షులు, కీటకాలు, సీతాకోకచిలుకలు ఇలా ఎన్నో రకాల జీవులను తమ కెమెరాల్లో అద్భుతంగా బంధించారు. వాటన్నింటినీ విభాగాల వారీగా విభజించి, ఒక్కో జీవం గురించి వివరించారు. 71 జాతుల పక్షులు, 128 జాతుల కీటకాలు, 16 జాతుల సరీసృపాలు, మూడు జాతుల ఉభయచరాలను పుస్తకంలో పొందుపరిచారు.అనేక విషయాలు నేర్చుకున్నాం.. తమ ప్రాజెక్టులో భాగంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వాళ్లు చెబుతున్నారు. సమా చారం సేకరణ సమయంలో చాలా మందితో మాట్లాడామని, వారంతా సహకరించారని పేర్కొన్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నామని తెలిపారు. పక్షులు, కీటకాల సమూహంలో ఎలా ప్రవర్తిస్తున్నాయో తమకు అర్థమైందని వివరించారు. వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. భవన నిర్మాణాల్లో మార్పు రావాలి.. పర్యావరణంలో ప్రతి జీవీ ముఖ్యమేనని, ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లో జీవ జాతుల కోసం ఎలాంటి ఏర్పాట్లూ చేయట్లేదని, దీంతో అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు. జీవ వైవిధ్యం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కలి్పంచడమే తమ పుస్తకం ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు. తమ తోటి విద్యార్థులు కూడా తమను చూసి ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నారని గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచి ఆసక్తితో.. ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. మా స్కూల్లో ఎన్నో జీవులు తారసపడుతుండేవి. వాటన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆలోచన ఉండేది. నాతో పాటు నాలాంటి ఆలోచన ఉన్న స్నేహితులతో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. స్కూల్లోని టీచర్లు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. – అజ్మా ఖాన్నెట్లో సరైన సమాచారం లేదు.. చాలా జీవుల గురించి ఇంటర్నెట్లో వెతికితే సరైన సమాచారం లభించట్లేదు. చాలాసార్లు తప్పుడు సమాచారం లభిస్తోంది. ఎలాగైనా వాటి గురించి సరైన సమాచారం అందించాలని అనుకున్నాం. అందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. సమాచారం సేకరణకు ఎంతో కష్టపడ్డాం. – నియో వెంకట్ పర్యావరణం అంటే ఇష్టం.. పర్యావరణం అంటే ఇష్టం. పక్షులు, జంతువులు, వాటి సమూహంతో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తాయో గమనిస్తుంటా. చేపలను పెంచడం అంటే ఇష్టం. ఇంట్లోనే సొంతంగా అక్వేరియం రూపొందించి, పలు రకాల చేపలను పెంచుకుంటున్నాను. రెడ్ టెయిల్ క్యాట్‌ఫిష్, టైగర్ ఆస్కార్, ఇరిడిసెంట్ ఆస్కార్, చెర్రీ బార్బ్ వంటి ఎన్నో చేపలను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. – ఇబ్రహీం వదూద్ అహ్మద్ దస్తగిర్కెమెరా ముఖ్యమైనది.. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఫోన్లు విస్తృతంగా వినయోగంలోకి వచి్చన తర్వాత ఫొటోలు, కెమెరాల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కెమెరాల్లో తీసిన ఫొటోలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాటి విలువ తెలుస్తుంది. మంచి ఫొటో కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. అప్పుడే అందమైన ఫొటోలు తీయడానికి అవకాశం ఉంటుంది. – సాతి్వక్ అన్నవరపు -
భారత్‌కు మించింది లేదు: యూట్యూబ్ ఎండీ
ప్రతిభావంతులైన, ఔత్సాహికులైన యువతకు ప్రస్తుతం భారత్‌కు మించిన మెరుగైన ప్రదేశం మరొకటి లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ. ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన ఇషాన్ ఛటర్జీ గత సంవత్సరం యూఎస్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఎన్డీటీవీతో పలు విషయాలు వెల్లడించారు. భారత్‌లో రాబోయే 10 సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. భారత్ అత్యంత వైవిధ్యమైన, డైనమిక్ ఉత్తేజకరమైన మార్కెట్ అని పేర్కొన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లకు సైతం యూట్యూబ్ వేదికను కల్పించిందన్నారు. ఇషాన్ ఛటర్జీ పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఢిల్లీలోని సెయింట్ స్టీపెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ చేసిన ఆయన అమెరికాలోని వార్టన్ స్కూల్ యూనివర్సిటీ నంచి ఎంబీఏ పూర్తి చేశారు. యూట్యూబ్‌కు ముందు ఇషాన్ ఛటర్జీ గూగుల్, మెకెన్సీ కంపెనీల్లో పనిచేశారు. -
Hyderabad : ఓల్డ్ ఈజ్ గోల్డ్.. వింటేజ్ కార్ల షో అదుర్స్ (ఫొటోలు)
-
విద్యార్థుల ప్రతిభతోనే..దేశ గౌరవం ఇనుమడిస్తుంది
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు కనబర్చే ప్రతిభతోనే దేశ గౌరవం పెరుగుతుందని రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) శతాబ్ది ఉత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు జీవన నైపుణ్యాలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి, పర్యావరణంపైనా అవగాహన పెంచుకోవాలని, స్వార్థ ప్రయోజనాలు కాకుండా ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. జీవితంలో అభిరుచులను స్థిరంగా కొనసాగించడం చాలా అవసరమని, ఇవి సానుకూల శక్తిని పెంపొందించడమే కాకుండా ఇతరులకు ప్రేరణగా పని చేస్తాయన్నారు. దేశానికి గుర్తింపు తెచ్చి పెట్టింది.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గొప్ప గొప్ప విద్యార్థులను అందించి దేశానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని ద్రౌపదీ ముర్ము కొనియాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల లాంటి అనేకమంది గొప్పవాళ్లను ఈ స్కూల్ అందించిందని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొని ఉండొచ్చని, దాని అనుభవాల ఆధారంగా విద్యార్థులను శక్తివంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు కలిసి చదువుకోవడానికి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించినందుకు హెచ్‌పీఎస్‌ను అభినందించారు. పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందంటూ... ఈ స్కూల్లో చదివిన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. చదువు, క్రీడలు రెండు కళ్లు: గవర్నర్ విద్యార్థులకు చదువు, క్రీడలు రెండు కళ్లలాంటివని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విద్యార్థులను తరగతి గదుల నుంచి క్రీడా, సామాజిక రంగానికి తరలించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే సమాజంలో ఎలా ప్రవర్తించాలో అలవడుతుందని చెప్పారు. హెచ్‌పీఎస్ ఆనేక దిగ్గజాలను తయారు చేసిందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశంపాల్గొన్నారు. అంతకుముందు స్కూల్ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి జెండా ఊపి ప్రారంభించారు. వేడుకలు ఏడాది పొడవునా జరగనున్నాయి. -
అజయ్ బంగా హెచ్‌పీఎస్ విద్యార్థే
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ అయిన భారత–అమెరికన్ అజయ్ బంగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) విద్యార్థే. మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా 1976 బ్యాచ్‌కు చెందిన హెచ్‌పీఎస్ విద్యార్థి. ప్రస్తుత వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ మాల్పాస్ తర్వాత అజయ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ‘మా పూర్వ విద్యార్థుల్లో మరొకరు ప్రపంచ సంస్థలో ఉన్నత స్థాయికి చేరుకోవటం పాఠశాలకు గర్వకారణం’అని హెచ్‌పీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ జే నోరి యా తెలిపారు. కాగా, ప్రపంచంలోని ప్రము ఖ కంపెనీల అధినేతలు హెచ్‌పీఎస్ విద్యార్థులే కావటం విశేషం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో పాటు కావియం కో–ఫౌండర్ సయ్యద్ భష్రత్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, క్రికెటర్ కామెంటర్ హర్షా భోగ్లే, ప్రముఖ సినీనటులు రానా దగ్గుపాటి, అక్కి నేని నాగార్జున, రామ్‌చరణ్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సమైఖ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ఎందరో ప్రముఖులు హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థులు. -
ఘనాపాఠీల చదువులకు కేరాఫ్ బేగంపేట ‘హెచ్‌పీఎస్’
హైదరాబాద్: ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి.. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి.. సినీనటులు అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్.. ప్రస్తుత నగర కమిషనర్ సీవీ ఆనంద్.. ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యత హర్షభోగ్లే.. ఇలా ఏ రంగాన్ని తట్టినా మేటి స్థానాల్లో నిలబడిన వారెందరో. వారందరికీ అది పునాది రాయి.. ఇదే వారి ప్రఖ్యాతికి మైలు రాయి. రాష్ట్ర, దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లింది. అక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో ప్రస్తుతం ఉన్నత శిఖరాలను అధిరోహించి భరతమాత ముద్దు బిడ్డలుగా ఎదిగారు. వారంతా ఓనమాలు నేర్చుకున్న ఆ సరస్వతీ నిలయానికి అక్షరాలా నూరేళ్లు. అదే బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్). నేటి నుంచి శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న హెచ్‌పీఎస్‌పై ప్రత్యేక కథనం. అవతరణ ఇలా.. ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో బేగంపేటలో ‘జాగీర్దార్ కాలేజ్’ పేరుతో ఈ స్కూల్ షురువైంది. దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా ముగ్గురు విద్యార్థులతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రారంభమైంది. 1950లో ప్రభుత్వం జమీందారీ వ్యవస్థకు స్వస్తి చెప్పడంతో అప్పటివరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్దార్ స్కూల్ 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా అవతరించింది. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పడింది. 1988 వరకు బాలురకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్‌లో ఆ తర్వాత బాలికలకు కూడా ప్రవేశాలు కల్పించారు. దాదాపు 122 ఎకరాల సువిశాల ప్రాంగణం.. పెద్ద క్రీడా మైదానం.. ఎటుచూసినా పచ్చదనం.. లైబ్రరీ, ఇ–లైబ్రరీ, డైనింగ్‌హాల్, ఆధునిక లేబరేటరీలు, హాస్పిటల్, అన్ని రకాల క్రీడా కోర్టులు, గుర్రపు స్వారీ.. ఇలా అత్యాధునిక వసతులతో హెచ్‌పీఎస్ అలరారుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 3,200 మంది పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అప్పట్లోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఇండో– సారాసెనిక్ శైలిలో పాఠశాల భవనాన్ని నిర్మించారు. హెచ్‌పీఎస్‌కు విద్యారంగంలోని దాదాపు అన్ని రకాల ఉన్నత స్థాయి అవార్డులు వరించాయి. ఎడ్యుకేషన్ వరల్డ్, ఫ్యూచర్ 50 అవార్డు, ఎడ్యుకేషన్ టుడేస్ ఇండియా స్కూల్ మెరిట్ అవార్డ్, బెస్ట్ ఇన్నోవేటివ్ కే–12 స్కూల్ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాఠశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్ కొనసాగుతున్నారు. అతిపెద్ద ఎడ్యుకేషన్ సైన్స్ ఫెస్టివల్.. హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాలు ఏడాది పొడవునా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల నిర్వహణను చేపట్టింది. అందులో భాగంగా మొదటి దఫాగా ఈ నెల 20 నుంచి 27 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఇండియా సైన్స్ ఫెస్టివల్ (ఐఎస్ఎఫ్)తో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22న సింఫనీ ఆర్కెస్ట్రా ఆఫ్ ఇండియా ప్రదర్శన ఉంటుంది. 22 నుంచి 27 మధ్యన రౌండ్ స్క్వేర్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్‌లు హాజరుకానున్నారు. (క్లిక్ చేయండి: వైద్య విద్యార్థుల గోస.. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దు) సమాజానికి అమూల్యమైన సేవ.. విద్య ద్వారా సమాజానికి అమూల్యమైన సేవను హెచ్‌పీఎస్ అందిస్తోంది. సైన్స్, ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, అడ్వంచర్, ఇన్నోవేషన్, ఎక్స్పోజర్, సహకారం, నెట్వర్కింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పరంగా ప్రయోజనం చేకూర్చేలా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. – డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్, ప్రిన్సిపాల్ -
మనీశ్‌కు ఆరు వికెట్లు.. 147 పరుగులతో ఘన విజయం
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–16 స్కూల్, కాలేజీ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్–బేగంపేట)తో మ్యాచ్‌లో గౌతమ్ జూనియర్ కాలేజీ 147 పరుగుల తేడాతో నెగ్గింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ జట్టు గౌతమ్ కాలేజీ జట్టు స్పిన్నర్ డి.మనీశ్ (6/26) ధాటికి 62 పరుగులకే కుప్పకూలింది. తొలుత గౌతమ్ కాలేజీ 209 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ తేజ్ (100; 14 ఫోర్లు) సెంచరీ చేశాడు. -
కార్పొరేట్ స్కూల్స్‌లా వ్యవహరిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఫీజులు చెల్లిస్తే తప్ప ఆన్లైన్ క్లాసులకు అనుమతించబోమంటూ విద్యార్థుల తల్లిదండ్రుల తలలకు గన్ను పెట్టి ఫీజులు వసూలు చేయాలనుకుంటే ఎలా అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) యాజమాన్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. లాభాపేక్ష లేకుండా సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తున్నామని చెబుతూ.. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ఫీజుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడింది. విద్యార్థుల చదువుకునే హక్కును హరిస్తారా అంటూ నిలదీసింది. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితిని మానవత్వంతో అర్థం చేసుకోవాలని సూచించింది. ఫీజులు కట్టలేదన్న కారణంగా 219 మంది విద్యార్థులను గత 70 రోజులుగా ఆన్లైన్ క్లాసులకు అనుమతించకపోవడాన్ని తప్పుపట్టింది. ఫీజుల కోసం విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయేలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని ఆన్లైన్ తరగతులకు అనుమతించాలని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌పీఎస్ యాజమాన్యం ఫీజులు తగ్గించకపోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్‌పీఎస్ యాక్టివ్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఎం.ఆనంద్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. కరోనా నేపథ్యంలో ఫీజులు తగ్గించాలని కోరినా హెచ్‌పీఎస్ యాజమాన్యం స్పందించట్లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది ఈవీ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. స్కూల్ నిర్వహించాలంటే ఫీజులు తప్పనిసరి అని, ఎప్పటిలోగా ఫీజులు చెల్లిస్తారో చెప్పాలని హెచ్‌పీఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపించారు. విద్యార్థులందరికీ రూ.10 వేల చొప్పున ఫీజు తగ్గించామని, అయినా బకాయి ఫీజులు చెల్లించడం లేదని తెలిపారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. ఫీజులు వసూలు చేసుకోవచ్చని, అయితే ఫీజులు చెల్లించలేదన్న కారణంగా విద్యార్థులను తరగతులకు అనుమతించకపోవడం సరికాదని స్పష్టం చేసింది. విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. -
ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ క్లాసులు ఎలా ఆపుతారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజలు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌పై పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం చేసిన అప్పీల్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణచేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిటిషన్‌దారు కోర్టుకు తెలిపారు. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్లైన్ తరగతులు బోధించడం లేదన్నారు. పిటిషనర్ వాదనలకు బదులిస్తూ.. 10 శాతం ఫీజు పెంపును వెనక్కి తీసుకోవడంతోపాటు.. ఇప్పటికే 10వేల రూపాయల ఫీజు తగ్గించామని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ తరగతులు ఎలా ఆపుతారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అలా ఆపితే పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా విపత్తు వేళ మానవీయంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజులతో ముడి పెట్టకుండా ఆన్లైన్ బోధన కొనసాగించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ జూలై 13కి వాయిదా వేసింది. -
తల్లిదండ్రులకు ఐటీ నిపుణుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కనీస వయస్సు ఎనిదేళ్లు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్లను వినియోగించేందుకు ఇవ్వాలని ఐటీ కమ్యూనికేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రెండెళ్లు కూడా నిండని వారికి కూడా స్మార్ట్ఫోన్లు ఇచ్చి వారిని వ్యసన పరులుగా మారుస్తున్నారని, దీని ద్వారా వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బుధవారం జరిగిన ఓ సదస్సులో హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సైబ్- హర్ కార్యక్రమంలో భాగంగా ‘‘సాంకేతికతకు నేటి తరం పిల్లలు వ్యసన పరులవుతున్నారా’’ అనే అంశంపై ఇవాళ సాయంత్రం రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్‌లా స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భారతీయ సైనిక దళాలకు మీడియా శిక్షకురాలుగా ఉన్న జూహీకౌల్ ప్రధాన వక్తగా ప్రసంగించారు. ఈ సందర్బంగా జూహికౌల్ మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు అనివార్యమయ్యాయని అన్నారు. అయితే, కనీసం ఎనిమిదేళ్ల పైన వయస్సు ఉన్నపిల్లలకు మాత్రమే ఈ క్లాసులు వర్తింప చేయాలని ఆమె సూచించారు. పదేళ్ల లోపు పిల్లలకు రోజూ కనీసం ఒక గంటకన్నా ఎక్కువ సేపు ఈ ఆన్ లైన్ క్లాసులు ఉండొద్దని, ఈ వయస్సులో పిల్లలకు వివిధ అంశాలపై సహజంగా ఉండే ఆసక్తి, నిశిత పరిశీలన, ఇమాజినేషన్ లకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అధిక సమయం ప్రధానంగా అర్ద రాత్రివరకూ మొబైల్ ఫోన్లను ఉపయోగించడం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని వివరించారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయే విధంగా పేరెంట్స్ తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్, లాప్ టాప్ ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని సూచించారు. సోషల్ మీడియా పై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తీసుకురావోద్దని జూహీకౌల్ హెచ్చరించారు. టాబ్, మొబైల్, లాప్ టాప్ లలో అనవసరం , ఎప్పుడూ ఉపయోగించని యాప్ లను డిలీట్ చేయాలని అన్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందన్నారు. అనవసర యాప్‌లను తొలగించడంతో పాటు కేవలం విద్యా పరమైన అవసరాలకే ఇంటర్నెట్ ఉపయోగించడం, అధికంగా ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్ధమయ్యీట్టు చెప్పడం చేయాలని అన్నారు. ప్రతి రోజూ ఇంట్లోనే యోగా, సంగీత సాధన, వ్యాయామం చేయడం లాంటివి చేయించాలని ఆమె తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐడీ విభాగానికి చెందిన రవి కుమార్ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలి, నీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ తో పాటు ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడు వేలమంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌కు పట్టుదల చాలా ఎక్కువ
-
వైఎస్ జగన్ స్కూల్ కెప్టెన్ టూ స్టేట్ కెప్టెన్
-
మా పాఠశాల నుంచి రెండో సీఎం వైఎస్ జగన్..
సాక్షి, సిటీబ్యూరో: ‘నాయకత్వ లక్షణం అనేది వారసత్వంగానే వచ్చింది. అందుకే ఆయన చిన్నప్పటి నుంచే నాయకుడిగా ఎదిగాడు. అందరిలో ఉన్నా... ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. మా అందరి ఆప్త మిత్రుడు, క్లాస్మేట్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతున్నాడంటే. .మేమెంతో మురిసిపోతున్నాం’ అని బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి చదువుకున్న మిత్రులు పులకించిపోయారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు అనేక మంది నేడు ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక పదవుల్లో ఉండగా... తాజాగా ఏపీ చరిత్రలోనే రికార్డు మెజారిటీతో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న క్రమంలో ఆయన స్నేహితులంతా తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. హైదరాబాద్ నగరమంతా డిజిటల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విద్య, వ్యాపార, క్రీడ, రాజకీయ రంగాల్లో పేరొందిన ఎంతోమంది చదువుకున్న హెచ్‌పీఎస్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి 1983లో 5వ తరగతిలో చేరి అక్కడే ప్లస్ టూ పూర్తి చేశారు. వైఎస్ జగన్‌తోనే చదువుకున్న సినీ నటుడు సుమంత్, సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ ఆమీర్ అలీఖాన్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి త్వరలోనే వైఎస్ జగన్‌తో ‘ఓల్డ్ స్టూడెంట్ మీట్’కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌తో తమ చిన్ననాటి అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. స్టూడెంట్ లీడర్ వైఎస్ జగన్ స్కూల్లోనే మా అందరికీ నాయకుడు. ఆయన నాగార్జున హౌస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తే నేను డిప్యూటీ హెడ్‌బాయ్‌గా పని చేశాను. నాకంత పని ఉండేది కాదు. కానీ హౌస్ కెప్టెన్ అనేది అత్యంత కీలకం. ఆ బాధ్యతలను జగన్మోహన్రెడ్డి సులువుగా నిర్వహించేవారు. ప్లానింగ్, కో–ఆర్డినేషన్, ఎగ్జిక్యూషన్ ఫర్ఫెక్ట్గా ఉండేది. – సుమంత్, సినీనటుడు ఆయనే గుర్తొస్తాడు.. జగన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు చూసేవాళ్లం. ఎమర్జెన్సీ వస్తే మాకు ఆయనే గుర్తొస్తాడు. సాదాసీదాగానే ఉంటూ అందరినీ కలుపుకుపోయేవాడు. అప్పుడే అనుకున్నాం.. గొప్ప నాయకుడు అవుతాడని. ఏపీ ప్రజల మద్దతుతో సీఎం అవుతుండడం సంతోషకరం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే జగన్ సైతం మైనారిటీలకు మంచి చేస్తాడన్న నమ్మకం ఉంది.– ఆమీర్ అలీఖాన్, సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ ఆల్‌రౌండర్ జగన్ మేం 5వ తరగతి నుంచి కలిసే చదువుకున్నాం. మేమిద్దరం బెంచ్‌మేట్స్ కూడా. నాగార్జున హౌస్ గ్రూప్ మాది. జగన్ శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా ఎప్పడూ గర్వం చూపేవారు కాదు. జగన్ పాఠశాల విద్యార్థి దశ నుంచే గొప్ప నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవారు. తరగతి హెడ్ బాయ్‌గా ఉండేవారు. ఆటలు, చదువులో ఆల్‌రౌండ్ ప్రతిభ చూపేవారు. స్నేహానికి అత్యంత విలునిచ్చే వ్యక్తి మా జగన్. – కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, పారిశ్రామికవేత్త ఫుల్ హ్యాపీ... మా పాఠశాల విద్యార్థి జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుండడం సంతోషంగా ఉంది. ఆయన జనరంజక పాలన అందిస్తూ అన్నివర్గాలకు మరింత మేలు చేస్తారని, రాష్ట్రాన్ని అగ్రస్ధానంలో నిలుపుతారనిఆశిస్తున్నాం. – మర్రి ఆదిత్యారెడ్డి, పూర్వ విద్యార్థి రెండో సీఎం... మా పాఠశాల నుంచి రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచే మంచి నాయకత్వ లక్షణాలున్న జగన్ ఎప్పటికైనా పాఠశాల గర్వించే స్థాయికి ఎదుగుతాడని మేము అనుకునేవాళ్లం. – ఫయాజ్‌ఖాన్,పూర్వ విద్యార్థి -
హెచ్‌పీఎస్‌లో రీయూనియన్ ఈవెంట్
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 2005 నుంచి ప్రతిఏటా నిర్వహిస్తున్న ఈ రీయూనియన్ ఈవెంట్‌ను డిసెంబర్ 25, 26తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ భంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మాజి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అసదుద్దిన్ ఓవైసి, అక్బరుద్దిన్ ఓవైసి, పల్లం రాజు, కిరణ్ కుమార్‌రెడ్డిలాంటి ప్రముఖులెందరో ఇక్కడ విద్యనభ్యసించారు. ఈ ఏడాది నిర్వహించబోతున్న రీయూనియన్ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరువుతున్నారని తెలిపారు. -
క్రీడోత్సాహం
-
వైఎస్ జగన్‌ను కలిసిన చిన్ననాటి క్లాస్మేట్స్
-
స్కూల్లో వైఎస్ జగన్‌ది సంచలన రికార్డు
సాక్షి, విశాఖపట్నం : ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావం తెలడపడానికి ఆయన స్కూల్ మిత్రులు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 257వ రోజులో భాగంగా వైఎస్ జగన్ శనివారం కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా 1991 బ్యాచ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 30మంది పూర్వ విద్యార్థులు వైఎస్ జగన్‌కు స్వాగతం పలకడానికి వచ్చారు. స్కూల్లో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షనాలున్న వైఎస్ జగన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని వారందరూ ఆకాంక్షించారు. ఉక్కు నగరంలో ప్రవేశించిన వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు విశాఖవాసులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే అదో రికార్డు : 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వైఎస్ జగన్ క్లాస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చరిత్రలోనే అదో సంచలన రికార్డు అని వైఎస్ జగన్ క్లాస్‌మెట్స్ పేర్కొన్నారు. మొదటి తరగతి నుంచే వైఎస్ జగన్‌కు నాయకత్వ లక్షణాన్నాయని, ఆయన బిల్ట్ ఇన్ లీడర్ అని అభివర్ణించారు. వైఎస్ జగన్‌ని చూస్తుంటే తామందరికి చాలా గర్వంగా ఉందన్నారు. తాను గ్రీన్ హౌస్ కెప్టెన్‌గా, వైఎస్ జగన్ రెడ్ హౌస్ కెప్టెన్, రామారావు బ్లూ హౌస్ కెప్టెన్‌గా వ్యవహరించామని 27 ఏళ్ల కిందటి విషయాలను జగన్ స్నేహితుడు ఒకరు గుర్తు చేసుకున్నారు. తాము ముగ్గురం హౌస్ కెప్టెన్లుగా వ్యవహరించామన్నారు. వైఎస్ జగన్ నాగార్జునా హౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి ఆల్‌రౌండర్ షీల్డ్ తీసుకున్నారన్నారని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వైఎస్ జగన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. -
విద్యార్థి దశ నుంచే వైఎస్ జగన్ నాయకుడు
-
బ్రేకింగ్ న్యూస్ బిజినెస్ న్యూస్‌గా మారాయి
-
డబ్బింగ్ సినిమాలతో తీవ్ర నష్టం..
సాక్షి, హైదరాబాద్: అనేక రకాల దాడుల నుంచి సెక్యులరిజాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగమే గొప్ప ఆయుధమని, రాజ్యాంగం ప్రసాదించిన అత్యున్నతమైన విలువల వెలుగులలో లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలని సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా పిలుపునిచ్చారు. సెక్యులరిజానికి విఘాతం కలిగించే చర్యలను నియంత్రించకపోవడం వల్ల రోజురోజుకూ తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ‘బీయింగ్ ఏ సెక్యులర్ ముస్లిం ఇన్ ఇండియా’అనే అంశంపై ఆమె ప్రసంగించారు. అషార్ఫరాన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గాంధీ, నెహ్రూ కాలం నాటి సెక్యులరిజాన్ని ఇప్పుడు చూడలేమని, ఆనాటి లౌకికవాద విలువలు ఇప్పుడు ఏ మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వరుసగా జరుగుతున్న దాడులతో సెక్యులరిజానికి తూట్లు పడుతున్నాయి. దీంతో రాజ్యాంగ లక్ష్యం అమలుకు నోచడం లేదు. ప్రభుత్వాలు కూడా ఎలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టడం లేదు. ఇది మన సెక్యులర్ వ్యవస్థకే ప్రమాదకరం’’అని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వర్గాల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతోందని, దీనివల్ల దాడులు, హింస చెలరేగుతున్నాయన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు పరమత సహనం, లౌకిక భావాలపై అవగాహన కల్పిస్తే భావితరాల్లో సెక్యులరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. వేర్పాటువాదం, మతం ఒకటి కాదు.. ప్రపంచంలో ఎక్కడ హింస చోటుచేసుకున్నా, దాడులు జరిగినా ఇక్కడ ముస్లింల పట్ల అసహనాన్ని ప్రదర్శించడం సరైంది కాదన్నారు. భారతీయ ముస్లింలు ఈ దేశ సంస్కృతిలో ఒక భాగమని అర్థం చేసుకోవాలన్నారు. ‘మైనారిటీ’భావనను ఏ ఒక్క దేశానికి, రాష్ట్రానికి పరిమితమైన అర్థంలో కాకుండా విస్తృత పరిధిలో చూడాలని, మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని మైనారిటీ భావనను పునర్నిర్వచించాలని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో తలెత్తే వేర్పాటువాద ఆందోళనలకు ముస్లిం మతానికి ఎలాంటి సంబంధం లేదని, రెండూ ఒకటి కాదని చెప్పారు. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇలాంటి అనేక విషయాలు స్పష్టంగా బోధపడతాయన్నారు. జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో సొంత అభిప్రాయాలకు తావు లేకుండా వాస్తవాలను యథాతథంగా రిపోర్ట్ చేయాలన్నారు. ‘పద్మావత్’ మూవ్మెంట్లో ఉన్నాం.. కొన్ని రకాల అసహన భావాలను చూస్తోంటే ఎంతో విస్మయం కలుగుతోందని, చరిత్రను ఉన్నదున్నట్లుగా స్వీకరించేందుకు కూడా కొన్ని వర్గాలు సిద్ధంగా లేవని నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కన్నబీరన్ అన్నారు. ఇప్పుడు మనమంతా ‘పద్మావత్’ సినిమా మూవ్మెంట్లో ఉన్నామని, పద్మావతి అనే మహిళ పేరును ‘పద్మావత్’గా మార్చి చెప్పుకునే దుస్థితిలో ఉన్నామన్నారు. ‘ది పబ్లిక్ వాయిస్ ఆఫ్ వుమెన్’అనే అంశంపై కొలంబియా రచయిత్రి లారా రెస్ట్రెపో, సీమా ముస్తఫా పాల్గొన్నారు. కొలంబియాలో ఇప్పటికీ మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్నారని లారా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు తమ భావప్రకటన స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నారని, ఇందుకు రాజకీయాల్లో, సమాజంలో వ్యవస్థీకృత పురుషాధిపత్యమే కారణమని సీమా ముస్తఫా అన్నారు. మరోవైపు ‘ది జర్నీ ఆఫ్ కాటన్ ఇండియా’ అనే అంశంపై జరిగిన చర్చలో మీనా మీనన్, ఉజ్రమ్మ పాల్గొన్నారు. బీటీ కాటన్బారి నుంచి దేశ రైతాంగాన్ని కాపాడాలని, మన దేశ అవసరాలకు అనుగుణమైన స్వదేశీ విధానాన్ని అమలు చేయాలని ఉజ్రమ్మ కోరారు. ‘ది జునూన్ ఆఫ్ ది కెండల్స్ అండ్ కపూర్స్’అనే అంశంపై శశికపూర్ కూతురు సంజనా కపూర్ మాట్లాడారు. తమ తండ్రి కుటుంబం నుంచి, అమ్మ కుటుంబం నుంచి నాటక రంగానికి జరిగిన కృషిని గురించి వివరించారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో వెలువడిన ‘గులాబీ టాకీస్’సినిమాను ప్రదర్శించారు. ముంబైకి చెందిన చింటూసింగ్ కళాకారుల బృందం ప్రదర్శించిన బాంబే బైరాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ భాషల్లో సాగిన కవి సమ్మేళనం విశేషంగా ఆకట్టుకుంది. మిలిటరీ హీరోస్‌కు సెల్యూట్.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ శత్రువుతో వీరోచితంగా పోరాడే ఎందరో సైనికులు తమ సొంత జీవితాలను త్యాగం చేశారని, వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని ప్రముఖ జర్నలిస్టులు శివ్అరూర్, రాహుల్‌సింగ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో పాటు, ఇటీవల జరిగిన పలు ఘటనల్లో ప్రాణాలను కోల్పోయిన 14 మంది వీరుల గాథలను వివరిస్తూ వారు రాసిన ‘ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలటరీ హీరోస్’పుస్తకంపై నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. సరిహద్దుల్లో సైనికులతో గడిపిన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. డబ్బింగ్ సినిమాలతో తీవ్ర నష్టం.. ‘లిటరేచర్ అండ్ ఫిల్మ్’అనే అంశంపై నిర్వహించిన చర్చలో ప్రముఖ కన్నడ డైరెక్టర్ గిరీష్ కాసరవల్లి మాట్లాడుతూ.. డబ్బింగ్ సినిమాల వల్ల సినీపరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోందన్నారు. డబ్బింగ్ సినిమాల్లో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదని, దీనివల్ల ఆయా భాషల్లో సినిమాలు తీసేందుకు అవసరమైన 70 విభాగాలు నష్టపోతాయన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రజలు ఇప్పటికీ కనీస అవసరాలకు నోచుకోవడం లేదని, ప్రభుత్వ సేవలను కూడా వినియోగించుకోలేకపోతున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త ఆదిరాజు పార్థసారథి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల స్థితిగతులపై నిర్వహించిన చర్చా కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య అధ్యక్షత వహించారు. -
నేటి నుంచి సాహిత్యోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి 28 వరకు మూడ్రోజుల పాటు జరిగే సాహిత్యోత్సవాలు బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో పలు సాహిత్య, సామాజిక అంశాలపై 30కి పైగా సదస్సులు, సాంస్కృతిక, చర్చా కార్యక్రమాలు, వర్క్‌షాపులు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేడుకలకు స్పెయిన్ అతిథి దేశంగా పాల్గొననుండటంతో పాటుగా 15కు పైగా రాష్ట్రాలు, 10 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. -
సాహిత్యోత్సవం.. అందరికీ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నామని, ఇందులో వివిధ అంశాలపై వందకుపైగా ప్రసంగాలు, చర్చలు, ఇష్టాగోష్టులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నామని హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (హెచ్ఎల్ఎఫ్) డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ వేదికగా జరగనున్న ఈ వేడుకల్లో సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, కళారంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొననున్నట్లు వివరించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిటరరీ ఫెస్టివల్‌కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వేడుకల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా సాహిత్యోత్సవం హైదరాబాద్ సాహిత్యోత్సవానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని, రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తోందని విజయ్‌కుమార్ తెలిపారు. కవులు, రచయితలతో ప్రారంభమై ప్రస్తుతం ఇతర అనేక కళారూపాలకు కూడా విస్తరించిందన్నారు. అలాగే హైదరాబాద్ గొప్పతనాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు వేడుకలు దోహదం చేస్తాయన్నారు. సమావేశంలో హెచ్ఎల్ఎఫ్ ప్రతినిధులు అజయ్ గాంధీ, అమితాదేశాయ్, కిన్నెర మూర్తి పాల్గొన్నారు. ఇది ఎనిమిదో వేడుక.. నగరానికి చెందిన కొందరు సాహితీ ప్రియులు 2005లో ‘మ్యూస్ ఇండియా’పేరుతో ఒక వెబ్ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. భారత సాహిత్యాన్ని పాఠకులకు పరిచయం చేసే లక్ష్యంతో మొదలైన ఈ మ్యాగజైన్ ఆ తర్వాత ఒక అంతర్జాతీయ సాహిత్య వేదికగా ఆవిర్భవించింది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కవులు, రచయితలు, కళాకారులు, విమర్శకులు, ఔత్సాహికులు, పాఠకులు అందరినీ ఒక వేదికపైకి తెచ్చిన వేడుకే ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’. జర్మనీ సెంటర్ నిర్వాహకులు అమితాదే శాయ్, ప్రముఖ సాఫ్ట్వేర్ నిపుణులు జీఎస్పీ రావు, ఉస్మానియా వర్సిటీ ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తదితరులు 2010లో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. కొద్దిమంది సాహితీవేత్తలతో ప్రారంభమైన ఈ లిటరరీ ఫెస్టివల్ ఇప్పుడు 8వ ఎడిషన్‌కు చేరుకుంది. ఈ ఏడాది అతిథి దేశంగా స్పెయిన్ హాజరుకానుంది. -
26 నుంచి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మరో సాహితీ ఉత్సవానికి వేదిక కానుంది. ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ సాహిత్యోత్సవం’ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సన్నాహాలు చేపట్టింది. వివిధ భాషల సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు సామాజిక, ఆర్థిక అంశాలపై సదస్సులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సాహిత్యోత్సవంలో ఈ ఏడాది అతిథి దేశంగా స్పెయిన్ హాజరుకానుంది. ఆ దేశానికి చెందిన మేధావులు, రచయితలు, కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. అమెరికా, బ్రిటన్, కొలంబియా, కెనడా, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు సైతం తరలిరానున్నారు. హైదరాబాద్ సాహిత్యోత్సవాల్లో ఈసారి భారతీయ భాషగా కన్నడంపై విస్తృత చర్చలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కర్ణాటకకు చెందిన సాహితీ ప్రముఖులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు. బెంగళూరులో ప్రఖ్యాత రంగశంకర్ థియేటర్ నిర్మాత అరుంధతినాగ్, ప్రముఖ దళిత సామాజిక కార్యకర్త సరస్వతి, దివంగత పాత్రికేయురాలు గౌరీలంకేష్ స్నేహితురాలు, ప్రముఖ ఆర్టిస్ట్ పుష్ప మేలా తదితరులు పలు అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ పాత్రికేయులు రాజ్‌దీప్ సర్దేశాయ్, సాగరికా ఘోష్, సీమా ముస్తఫా, శివఅరూర్ తదితరులు కూడా పాల్గొననున్నారు. ప్రముఖులకు నివాళులు.. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభం సందర్భంగా ఏటా వివిధ రంగాల్లో అపార సేవలందించి కన్నుమూసిన ప్రముఖులకు నివాళులర్పిస్తారు. ఈ ఏడాది నలుగురు మహనీయులకు ఈ ఉత్సవాల సందర్భంగా నివాళులర్పించనున్నారు. హిందుస్థానీ సంగీ తంలో ట్రుమీ సింగర్‌గా పేరొందిన ప్రముఖ గాయని గిరిజాదేవి, బాలీవుడ్ సినీదిగ్గజం శశికపూర్, బాలీవుడ్, రంగస్థల నటుడు టామాల్టర్, ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్‌ను స్మరిస్తూ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభంకానుంది. ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. వైవిధ్యభరితమైన సాంస్కృతిక, కళారూపాలను సమున్నతంగా ఆవిష్కరించే లక్ష్యంతో 2010 నుంచి ఏటా హైదరాబాద్ సాహిత్యోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇది ఎనిమిదో వేడుక. ఈసారి కూడా అద్భుతమైన కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ఆహూతులను ఆకట్టుకోనున్నాయి. స్పెయిన్ కళాకారుల జానపద నృత్యం ‘ఫ్లెమెంకో’ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కన్నడంలో ప్రముఖ అంతర్జాతీయ సినీ దర్శకుడు గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో వెలువడిన ‘ఘటశ్రాధ’, ‘గులాబీ టాకీస్’, ‘ద్వీప’చిత్రాలను ప్రదర్శిస్తారు. శశికపూర్ కూమార్తె సంజనకపూర్ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. శశికపూర్ తీసిన సినిమా ‘షేక్స్పియరియానా’ను ప్రదర్శించనున్నారు. అలాగే టామాల్టన్ సినిమాలు కూడా ప్రదర్శిస్తారు. వీటితో పాటు వంట చేస్తూ చెప్పే సరస్వతి రామాయణం కథ, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ‘నన్న నుక్కడ్’(చిన్నారుల వీధి మలుపు), హైదరాబాద్ దక్కనీ హాస్య కవితా సమ్మేళనం, ముంబైకి చెందిన సంగీత, నృత్యకళాకారుల ‘బాంబే బైరాగ్’, కాలితో అద్భుతమైన చిత్రాలు గీసే కళాకారుడు బందేనవాజ్ నదీఫ్ ఫుట్ అండ్ మౌత్ పెయింటింగ్, తెలంగాణ విమెన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా చిత్రకారుల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. -
ఒకటి చదవకుండానే రెండో తరగతా?
సాక్షి, హైదరాబాద్: బుడిబుడి అడుగులు వేసే బాలుణ్ని ఒకటో తరగతి చదవకుండానే రెండో తరగతిలో ఎలా చేర్చుకుంటారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్)ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విధానాన్ని తాము అంగీకరించేది లేదని, ఒకటో తరగతికి డిమోట్ చేయాలని స్కూల్ ప్రిన్సిపల్‌ను హైకోర్టు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన మనవడు కొమ్మిరెడ్డి అద్వేత్యను ఒకటో తరగతికి డిమోట్ చేయమని కోరినా హెచ్‌పీఎస్ యాజమాన్యం పట్టించుకోకుండా రెండో తరగతిలోనే కొనసాగించడంపై బాలుడి నానమ్మ కొమ్మిరెడ్డి జ్యోతిదేవి హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ కోరిన మేరకు రెండో తరగతిలో చేర్చుకున్నామన్న హెచ్‌పీఎస్ యాజమాన్యం వాదనల తర్వాత వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి కొట్టివేశారు. దాంతో బాలుడి నాయనమ్మ అప్పీల్ చేయడంతో ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వచ్చింది. చదువుకు బీజాలు పడే చిన్న వయసులోనే చిన్నారులను ఒత్తిడికి లోనయ్యేలా చేయడం ఎంతమాత్రం సబబుకాదని ధర్మాసనం అభిప్రాయపడింది. -
ఒకటో తరగతి.. కాదు రెండో తరగతి..
సాక్షి, హైదరాబాద్: చదవలేను మొర్రో.. అని పిల్లాడు మొత్తుకుంటుంటే.. ఒకటో తరగతి కాదు రెండో తరగతి చదవాల్సిందేనన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తీరును ప్రశ్నిస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. రెండో తరగతి పాఠాల్ని తన మనవడు అద్వేత్య చదవలేకపోతున్నాడని, ఒకటో తరగతికి డిమోట్ చేయాలన్న తన వినతిని స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ బాలుడి నాయనమ్మ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం ఈ రిట్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం విచారించింది. స్కూల్ యాజమాన్యం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ధర్మాసనం ముందుకు చేరకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. బాలుడి నాయనమ్మ కోరిక మేరకే అద్వేత్యను రెండో తరగతిలో చేర్చామని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో సింగిల్ జడ్జి ఆమె వ్యాజ్యాన్ని కొట్టివేశారు. దాంతో ఆమె డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. -
లిటరరీ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
-
హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు నేడు లాటరీ
హైదరాబాద్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో ప్రవేశాలకు సంబంధించి గురువారం సాయంత్రం లాటరీ తీయనున్నట్టు రంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి సురేష్ రెడ్డి తెలిపారు. బేగంపేట, రామంతపూర్‌లోని ఆ స్కూళ్లలో 2017-18 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు బాలబాలికల నుంచి ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి లక్డీకపూల్‌లోని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సాయంత్రం 5 గంటలకు లాటరీ తీయనున్నారు. దరఖాస్తులు అందజేసిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరుకావాలని అధికారులు సూచించారు. -
ఆ స్కూల్ బండారం బయటపెడతా: ఎమ్మెల్యే
⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్ధులకు సీట్లు కేటాయించడంలో నిర్లక్ష్యం ⇒ హెచ్‌పీఎస్ లీజు రద్దుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ⇒ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపాటు హైదరాబాద్: పజల అభీష్టం మేరకు శ్మశాన వాటికకు 3.26 ఎకరాలను కేటాయిస్తే.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం(హెచ్‌పీఎస్) అభివృద్ధిని అడ్డుకుంటోందని, వారి చేసే అక్రమాలన్నింటినీ బయటపడతానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. శ్యాంలాల్‌బిల్డింగ్ తాతాచారికాలనీ గ్రౌండ్లో స్థానికులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. శవాలను కూడా తీసుకెళ్లనీయకుండా, మహిళలకు కనీసం స్నానాలు గదులు కట్టనీయకుండా చేస్తున్నారని హెచ్‌పీఎస్ యాజమాన్యంపై మండిపడ్డారు. రూ.85 లక్షలతో (ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ నిధులు) 3.26 ఎకరాల్లో హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులు గత నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన విషయం విదితమే. అయితే రెండెకరాల స్థలానికి సంబంధించి కోర్టు స్టే ఉందని, పోలీసుల సహాయంతో హెచ్‌పీఎస్ స్కూల్ వారు పనులను నిలుపుదల చేయిస్తున్నారని మాధవరం కృష్ణారావు తెలుసుకున్నారు. యాజమాన్యం చేస్తున్న అక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి హెచ్‌పీఎస్ కు కేటాయించిన స్థల లీజును రద్దుచేయాలని కోరతామన్నారు. లీజును రద్దు చేయించి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రా ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు గానీ వినియోగించేలా కృషి చేస్తానని స్థానికులకు హామీనిచ్చారు. ఇక్కడ పాఠశాల డెరైక్టర్ల బంధువులు, కుటుంబసభ్యుల పిల్లలకే సీట్లు పరిమితమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు స్థానికంగా ఉంటున్న వారి పిల్లలకు చోటు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెరైక్టర్లుగా చెప్పుకుంటున్న వారు కార్లలో తిరుగుతూ బంగ్లాల్లో ఉంటున్నారని, అసలు వారి ఆస్తులపై విచారణ జరిపే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్మశానవాటికకు కేటాయించిన రెండెకరాల స్థలంపై ఉన్న స్టేను త్వరలోనే ఎత్తివేయించి మొత్తం 3.26 ఎకరాలను అభివృద్ధి చేసేవరకు తాను ఈ సమస్యను వదిలేది లేదన్నారు. హెచ్‌పీఎస్ యాజమాన్య అక్రమాలపై 3, 4 రోజుల్లో అన్ని రకాల పత్రాలను తీసుకుని సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్ ఉప్పల తరుణినాయీ, టీఆర్ఎస్ నాయకులు డీవీ నరేందర్‌రావు, సురేష్‌యాదవ్, యాదగిరిగౌడ్, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యాకేంద్రంగా ఓరుగల్లు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మడికొండలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం మడికొండ : వరంగల్ నగరాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. మడికొండలో ఏర్పాటుచేసిన ‘ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జిల్లాలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాల సొంత భవన నిర్మాణానికి త్వరలోనే 14 ఎకరాల భూమి కేటాయిస్తామని, మిగతా ప్రాంతాల్లోని భవనాలను తలదన్నేలా ఇక్కడ అత్యాధునిక వసతులతో భవనం నిర్మించాలన్నారు. అలాగే, హైదరాబాద్ రామంతాపూర్‌లోని పాఠశాల ప్రమాణాలనే ఇక్కడా కొనసాగించాలని సొసైటీ నిర్వాహకులకు కడియం సూచించారు. త్వరలోనే ఐఐఎం వరంగల్‌లో ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఉన్నాయని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే, త్వరలోనే సైనిక్ స్కూల్, రాక్వెల్ స్కూల్‌తో పాటు ఐఐఎం ఏర్పాటుకానున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ వరంగల్ నగరంలో ఎలాంటి అభివృద్ధి అయినా వర్థన్నపేట నియోజకవర్గం నుండే జర గడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారన్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని సుచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు బీ.వీ.పాపారావు, కలెక్టర్ వాకటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, స్థానిక కార్పొరేటర్ జోరిక రమేష్, మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ జగదీశ్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్యాంమోహన్, సొసైటీ సభ్యులు రాఘురాం, గుస్తీ జైన్, మర్రి ఆదిత్యరెడ్డి, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, ఈ.వీ.శ్రీనివాస్, స్థానిక నాయకులు మద్దెల నారాయణస్వామి, బైరి కొంరయ్య, తాడూరి మోహన్, రాజేందర్, రవీందర్, రవి పాల్గొన్నారు. -
1813లోనే మొదటి స్కూల్
నగరంలో ఏర్పాటైన మొదటి స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. 1813లోనే దీన్ని స్థాపించారు. 1869లోనే సివిల్ ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించడం విశేషం.. 1872లో నిర్మించిన మదర్సా-ఐ-అలియా స్కూలు అప్పట్లో ఎంతో పేరుపొందింది. 1872 నాటికి హైదరాబాద్‌లో 16 ప్రభుత్వ స్కూళ్లు ఉండేవి... తెలుగు, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లిషు బోధించేవారు. 1887లో హైదరాబాద్ స్కూల్, మదర్సా -ఐ-అలియాను కలిపి నిజాం కాలేజీగా మార్చారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలో ఈ కాలేజీ పనిచేసేది. -
జిల్లాకో మహిళా గురుకుల డిగ్రీ కాలేజీ
వరంగల్‌లో 10న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఇందులో భాగంగా మొదట మెదక్, వరంగల్‌కు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. స్థలాలు లభించిన జిల్లాల్లో మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను వరంగల్లోనూ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 10న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలోనే (2015-16) తాత్కాలిక భవనంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలు చేపట్టి, తరగతులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాగా, వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రిని సీఎం కేసీఆర్, తాను కలసి స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే అమోదం లభిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌కు కూడా సైనిక్ స్కూల్ మంజూరు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. -
సత్యవిజయం స్ఫూర్తిదాయకం
సాఫ్ట్వేర్ సామ్రాజ్యంపై భాగ్యనగర పతాకాన్ని ఎగురవేసిన సహచరుడి జ్ఞాపకాలతో స్నేహితులు మురిసిపోయారు. శిఖరంపై శిష్యుడ్ని చూసి గురువులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తన ఒడిలో అక్షరాలు నేర్చుకున్న విద్యార్థిని తలచుకుని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పరవశించిపోయింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎన్నికకావడంతో ఆయన సహచరులు, సంబంధీకులు అందరూ గర్వపడుతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. హెచ్‌పీఎస్‌లో ప్రత్యేక అసెంబ్లీ.. అసాధారణ స్థాయిలో ఎదిగిన సత్య నాదెళ్లను అభినందిస్తూ బుధవారం ఉదయం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ‘ప్రత్యేక అసెంబ్లీ’ నిర్వహించారు. సత్యను అభినందిస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు. తెలుగుజాతికే కాకుండా మెత్తం దేశానికే స్ఫూర్తిగా నిలిచిన సత్యను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలని ప్రిన్సిపల్ కల్నల్ ఆర్ఎస్ ఖత్రీ సూచించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెక్రటరీ ఫయాజ్‌ఖాన్, రిటైర్డ్ ప్రిన్సిపల్, సత్యకు పాఠాలు చెప్పిన జయానంద్ మాస్టర్, సత్య క్లాస్మేట్ ఫణి తదితరులు పాల్గొన్నారు. అద్భుత విజయం.. సత్య నాదెళ్ల అద్భుతమైన విజయాన్ని సాధించారు. మొదటి నుంచి కార్యదక్షత ఉన్న మనిషి. మేమిద్దరం చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నాం. సత్య ఏడోతరగతి సెక్షన్ ‘ఎ’లో చేరగా, నేను ‘బి’ సెక్షన్లో ఉన్నా. ఆయన 1982లో టెన్త్ పాసయ్యారు. ఆయన భార్య అనుపమ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. సత్య మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా నియమితులవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయుల బోధన, అక్కడ క్రమశిక్షణే ఈ విజయానికి కారణం. - డాక్టర్ రఘురామ్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరె క్టర్ టెక్నాలజీ అంటే ఆసక్తి.. నేను.. సత్య ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాస్మేట్స్. సత్యకు చిన్నప్పట్నుంచి టెక్నాలజీ అంటే చాలా మక్కువ. క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను కొద్ది నెలల క్రితం వరకు మైక్రోసాఫ్ట్ సంస్థలో అకడమిక్స్ డెరైక్టర్‌గా పనిచేశా. వృత్తిలో భాగంగా తరచూ కలిసే వాళ్లం. - ఫణి ఉత్తమ విద్యార్థి.. సత్య చక్కటి అవగాహన, లోతైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. పాఠాలు శ్రద్ధగా వినేవాడు. అందరితో కలివిడిగా ఉండేవాడు. వాళ్లనాన్న ఐఏఎస్ అధికారిగా ఉన్నా సత్యకు ఎలాంటి గర్వం ఉండేది కాదు. క్రికెట్ బాగా ఆడేవాడు. ఉత్తమ విద్యార్థికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనలో ఉండేవి. నేను ఇష్టపడే విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉంది. - జయానంద్, రిటైర్డ్ ప్రిన్సిపల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ -
హెచ్‌పీఎస్ వార్షికోత్సవం
-
చెలరేగిన సింహా
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతపూర్-హెచ్‌పీఎస్‘ఆర్’) బ్యాట్స్‌మన్ సింహా (106 నాటౌట్) సెంచరీతో కదంతొక్కి అజేయంగా నిలిచాడు. దీంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో భారతీయపై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత భారతీయ జట్టు 244 పరుగులకే ఆలౌటైంది. ప్రజ్వల్ (71), అశోక్ (53 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ వికెట్ కోల్పోయి 245 పరుగులు చేసింది. అభిరథ్ రెడ్డి (86 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... షణ్ముఖ్ 45 పరుగులు చేసి చక్కటి ఆటతీరు కనబరిచాడు. మరో మ్యాచ్‌లో భరత్ సీసీ ఆటగాడు హర్షవర్ధన్‌రెడ్డి (బ్యాటింగ్ 88; బౌలింగ్ 5/30) ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు 48 పరుగుల తేడాతో గోల్కొండ సీసీపై నెగ్గింది. మొదట భరత్ సీసీ 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ధీరజ్ విశాల్ (85) అర్ధ సెంచరీతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గోల్కొండ సీసీ 167 పరుగులకు కుప్పకూలింది. -
హెచ్‌పీఎస్ @:90
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... నగరంతో తొమ్మిది దశాబ్దాల అనుబంధం. ఎందరో ప్రముఖులకు మార్గనిర్దేశనం చేసిన విద్యానిలయం. ఇరుకు గదుల్లో... విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు భిన్నంగా ప్రత్యేకత చాటుకుంది. సువిశాల ప్రాంగణంలో... అత్యాధునిక వసతులతో... నాణ్యమైన విద్యను అందిస్తూ దేశంలోనే విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. నేడు హెచ్‌పీఎస్ 90 వసంతాల ఉత్సవం జరుపుకొంటున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. దేశంలోని 20 ప్రసిద్ధ పాఠశాలల్లో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని ప్రఖ్యాత ‘వరల్డ్ మ్యాగజైన్’ గుర్తించింది. 140 ఎకరాల సువిశాల ప్రాంగణం... పెద్ద క్రీడా మైదానం... ఎటు చూసినా పచ్చందం... అత్యాధునిక వసతులతో చూడగానే ముచ్చటగొలుపుతుంది హెచ్‌పీఎస్. ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో ‘జాగీర్దార్ స్కూల్’ పేరుతో ప్రారంభమైందీ పాఠశాల. అప్పటి జాగీర్దార్లలో ఒకరైనా సర్ వికార్-ఉల్-ఉమా బహుల్‌ఖానగూడ పేరుతో ఉన్న ప్రస్తుత బేగంపేటలో దీర్ఘకాల లీజ్ ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా... ముగ్గురు విద్యార్థులతో పాఠశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. పబ్లిక్ స్కూల్‌గా... 1950లో ప్రభుత్వం జమిందారీ వ్యవస్థను రద్దు చేయడంతో... అప్పటి వరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్దార్ స్కూల్ పబ్లిక్ స్కూల్‌గా రూపాంతరం చెందింది. నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పాటైంది. బాలులకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్... 1988 నుంచి కోఎడ్యుకేషన్ విద్యాలయంగా మారిపోయింది. ఒకరా... ఇద్దరా..! ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఎందరో నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజకీయ నాయకులుగా, సినీతారలుగా, బడా వ్యాపారవేత్తలుగా ఉన్నారు. వారిలో కొందరు... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి పళ్లం రాజు, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్టార్ హీరోలు నాగార్జున, వెంకటేష్, రామ్‌చరణ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, లండన్‌లో కోబ్రా బీర్ వ్యవస్థాపక చైర్మన్ కరణ్బిల్లి మోరియా, ఐ2 టెక్నాలజీస్ సీఈఓ సంజీవ్సిద్ధు, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ, గాయకుడు తలజ్ అజీజ్, ఎంటీవీ వీజే నిఖిల్ చిన్నప్ప, క్రికెట్ వ్యాఖ్యాత హర్షభోగ్లే, ఫ్రాన్స్‌లో భారత మాజీ రాయబారి వీర్మొహిసిన్ సయిద్, కెనడాలో స్థిరపడ్డ ఫెయిర్‌ఫాక్స్ చైర్మన్ రాజ్వత్సా, ఇటీవల వార్తల్లో నిలిచిన బిజినెస్ మ్యాన్ ప్రేమ్‌వత్సా. ప్రముఖులు ఎంతో మంది విద్యాభ్యాసం చేసిన హెచ్‌పీఎస్‌లో చదువుకోవడం చాలా ఆనందంగా ఉంది. దశాబ్ధాలు గడిచినా పాఠశాల ఖ్యాతి తరగకపోవడం విశేషం. ఇప్పటికీ నగరంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు హెచ్‌పీఎస్‌లో సీటు సంపాదించడానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఇది పాఠశాలకే గర్వకారణం. - మర్రి ఆదిత్యారెడ్డి, పూర్వ విద్యార్థి, హెచ్‌పీఎస్ సొసైటీ సభ్యుడు -
ఆర్మీ స్కూల్ విజయం
సాక్షి, హైదరాబాద్: ఎయిర్టెల్ రైజింగ్ స్టార్స్ ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) జట్లకు పరాజయం ఎదురైంది. తిరుమలగిరి మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్మీ స్కూల్ 1-0 తేడాతో హెచ్‌పీఎస్‌పై విజయం సాధించింది. ఆర్మీ జట్టు తరఫున అమిత్ ఏకైక గోల్ నమోదు చేశాడు. రెండో మ్యాచ్‌లో ఏపీ స్పోర్ట్స్ స్కూల్ 2-0 స్కోరుతో హెచ్‌పీఎస్‌ను ఓడించింది. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి రాకేశ్ ఒక్కడే 2 గోల్స్ చేయడం విశేషం. మరో మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్ ద్వారా గవర్నమెంట్ బాయ్స్ స్కూల్‌కు విజయం దక్కింది. సెయింట్ ప్యాట్రిక్స్తో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో పెనాల్టీ షూటౌట్‌తో విజేతను తేల్చారు. ఇందులో గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ 5-4 గోల్స్ తేడాతో సెయింట్ ప్యాట్రిక్పై సంచలన విజయం సాధించింది. -
సత్తాచాటిన హెచ్‌పీఎస్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రీజినల్ స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్, బేగంపేట్) జట్లు సత్తా చాటాయి. బాస్కెట్‌బాల్ ఈవెంట్లో జూనియర్, సీనియర్ బాలుర విభాగాల్లో హెచ్‌పీఎస్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సీనియర్ బాలుర సెమీస్‌లో హెచ్‌పీఎస్... హెరిటేజ్ వ్యాలీ స్కూల్‌తో, గీతాంజలి స్కూల్... అభ్యాస స్కూల్‌తో తలపడతాయి. జూనియర్ బాలుర సెమీస్‌లో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ)తో హెచ్‌పీఎస్, జాన్సన్ గ్రామర్ స్కూల్‌తో ఫ్యూచర్ కిడ్స్ పోటీ పడతాయి. శుక్రవారం జరిగిన సీనియర్ బాలుర పోటీల్లో శ్రీనిధి స్కూల్ 39-15తో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి)పై, గీతాంజలి స్కూల్ 35-21తో హెరిటేజ్ వ్యాలీపై, హెచ్‌పీఎస్ 51-21తో అభ్యాస స్కూల్‌పై విజయం సాధించాయి. జూనియర్ బాలుర పోటీల్లో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) 29-26తో శ్రీనిధి స్కూల్‌పై చెమటోడ్చి నెగ్గగా, జాన్సన్ గ్రామర్ స్కూల్ 14-13తో గీతాంజలి స్కూల్‌ను ఓడించింది. సీనియర్ బాలికల పోటీల్లో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) 14-12తో సెయింట్ జార్జ్స్ స్కూల్‌పై, సెయింట్ ఆన్స్ 6-0తో షేర్వుడ్ స్కూల్‌పై, ఎన్ఏఎస్ఆర్ స్కూల్ 12-2తో గీతాంజలిపై గెలుపొందాయి. జూనియర్ బాలికల విభాగంలో హెచ్‌పీఎస్ 15-3తో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట్)పై, ఫ్యూచర్ కిడ్స్ 14-0తో శ్రీ అరబిందోపై, సెయింట్ ఆన్స్ 20-2తో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి)పై గెలిచాయి. -
గచ్చిబౌలి కేవీకి హాకీ టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆజాదీ వన్డే ఇంటర్ స్కూల్ హాకీ టైటిల్‌ను గచ్చిబౌలికి చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) స్కూల్ జట్టు చేజిక్కించుకుంది. జింఖానా హాకీ మైదానంలో గురువారం జరిగిన ఫైనల్లో గచ్చిబౌలి కేవీ స్కూల్ జట్టు 1-0 స్కోరుతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో కేవీ స్కూల్ జట్టు ఆటగాడు విశ్వజిత్ 15వ నిమిషంలో చే సి ఏకైక గోల్‌తో ఆ జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ స్కూల్ జట్టు 5-2 స్కోరుతో గచ్చిబౌలి కేవీ-2 స్కూల్ జట్టుపై గెలిచింది. ఈ పోటీలను ఇంటర్నేషనల్ హాకీ కోచ్ మధుకర్ లాంఛనంగా ప్రారంభించారు. ముగింపు వేడుకలకు విచ్చేసిన బాక్సింగ్ అవార్డు గ్ర హీత జయరామ్ ట్రోఫీలను అందజేశారు.