ఆర్మీ స్కూల్ విజయం | Airtel wrestling sports football tournment Army school won | Sakshi
Sakshi News home page

ఆర్మీ స్కూల్ విజయం

Published Wed, Sep 25 2013 12:16 AM | Last Updated on Fri, Aug 17 2018 6:21 PM

Airtel wrestling sports football tournment Army school won

సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌టెల్ రైజింగ్ స్టార్స్ ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) జట్లకు పరాజయం ఎదురైంది. తిరుమలగిరి మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్మీ స్కూల్ 1-0 తేడాతో హెచ్‌పీఎస్‌పై విజయం సాధించింది. ఆర్మీ జట్టు తరఫున అమిత్ ఏకైక గోల్ నమోదు చేశాడు. రెండో మ్యాచ్‌లో ఏపీ స్పోర్ట్స్ స్కూల్ 2-0 స్కోరుతో హెచ్‌పీఎస్‌ను ఓడించింది.
 
 స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి రాకేశ్ ఒక్కడే 2 గోల్స్ చేయడం విశేషం. మరో మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్ ద్వారా గవర్నమెంట్ బాయ్స్ స్కూల్‌కు విజయం దక్కింది. సెయింట్ ప్యాట్రిక్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో పెనాల్టీ షూటౌట్‌తో విజేతను తేల్చారు. ఇందులో గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ 5-4 గోల్స్ తేడాతో సెయింట్ ప్యాట్రిక్‌పై సంచలన విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement