Army school
-
మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ
న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ వద్ద డిసెంబర్ 8న చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వరుణ్ సింగ్ ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ సింగ్ రెండు నెలల క్రితం అనగా సెప్టెంబర్ 21, 2021న తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌కు రాసిన ఓ లేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. చండి టెంపుల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వరుణ్ సింగ్ చదువుకున్నారు. చదవులో సామాన్య ప్రతిభ కనబరిచే విద్యార్థులనుద్దేశించి ఈ లేఖ రాశారు వరుణ్ సింగ్. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) ‘‘మీరు చదువులో యావరేజ్ స్టూడెంట్స్ అని ఎప్పుడు బాధపడకండి. చదువులో సామాన్యమైన విద్యార్థిగా ఉండటం తప్పేం కాదు. ప్రతి ఒక్కరు 90 శాతం మార్కులు తెచ్చుకోలేరు. ఒకవేళ మీరు మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు అయితే మీకు నా అభినందనలు. ఒకవేళ మీరు ర్యాంకర్ కాకపోయినా బాధపడకండి. చదువులో సామాన్య విద్యార్థి అయినందున మీ జీవితం కూడా అలానే ఉంటుంది అని భావించకండి’’ అని వరుణ్ సింగ్ సూచించారు. ‘‘మీకు దేని మీద ఆసక్తో దాన్ని గుర్తించండి. సంగీతం, నటన, రచన ఏది అయినా కావచ్చు. దానిలో రాణించేందుకు శ్రమించండి. చదువులో నేనూ యావరేజ్ స్టూడెంట్‌నే. ఎప్పుడు టాప్ మార్కులు రాలేదు. ఇక తొలిసారి నన్ను స్క్వాడ్రన్‌లో యువ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించిన్పుడు చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత నాకు ఓ విషయం అర్థం అయ్యింది. నేను కనుక నా మనసు, బుద్ధిని దీని మీదే కేంద్రీకరిస్తే.. చాలా అద్భుతంగా పని చేయగలనని తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి నేను అత్యుత్తమంగా పని చేయడం ప్రారంభించాను’’ అని వరుణ్ సింగ్ రాసుకొచ్చారు. (చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు) ‘‘నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడు నేను చదువలో, క్రీడల్లో రాణించలేదు. కానీ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించినప్పుడు నేను దాని మీద మనసు పెట్టాను. ఆ తర్వాత నాకు విమానాల పట్ల మక్కువ పెరిగింది. అలా నేను మెరుగ్గా పని చేస్తూ.. జీవితంలో ఎదిగాను. తొలుత నేను నా వాస్తవ సామర్థ్యాలను విశ్వసించలేదు. ఈ విషయం నాకు అర్థం అయిన తర్వాత నేను వెనుతిరిగి చూడలేదు. మీరు కూడా మీ మీద నమ్మకం పెట్టుకొండి. మీకు నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేయండి. మార్కులు మన జీవితానికి కొలమానం కాదు’’ అన్నారు వరుణ్ సింగ్. అంతేకాక తాను శౌర్య చక్ర అవార్డు అందుకోవడానికి ఆర్మీ స్కూలే కారణమని వరుణ్ సింగ్ తన లేఖలో తెలిపారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 'It's ok to be mediocre' Inspiring letter of Group Captain Varun Singh, lone survivor in helicopter crash, to principal of his school with request to share it with teenaged students to motivate them. Sharing the wonderful journey & beautiful thoughts of the braveheart with u. pic.twitter.com/vSpymhMg0p — Arun Bothra 🇮🇳 (@arunbothra) December 9, 2021 చదవండి: ఊరే అతడింటికి కదిలొచ్చింది -
మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం ఆర్మీ స్కూల్ ఏర్పాటుచేయాలన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజకీయ లబ్ధి కోసమే ఆరెస్సెస్ ఆర్మీ పాఠశాలను ఏర్పాటు చేయాలనుకుంటుందని, ఆ పాఠశాలలో సామరస్యాన్ని దెబ్బతీయడం, మూక దాడులు చేయడమే నేర్పిస్తుందని దుయ్యబట్టింది. ఆరెస్సెస్ సమాజాన్ని విభజించే భావజాలాన్ని అనుసరిస్తోందని, స్వాతంత్ర్య పోరాటంలో ఆరెస్సెస్ పాత్ర ఏమీ లేదని, ఇప్పటికీ కూడా స్వాతంత్ర్య పోరాట ఆశయాలను ఆ సంస్థ పట్టించుకోవడం లేదని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరెస్సెస్ ఆర్మీ స్కూల్ ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తోందని, జాతీయస్థాయిలో కుట్రగా ఇది కనిపిస్తోందని, ఇది రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని ఎస్పీ ధ్వజమెత్తింది. యూపీ బులంద్‌షహర్ జిల్లాలోని శిఖర్‌పూర్‌లో ఆర్మీ స్కూల్ ఏర్పాటుచేయాలని ఆరెస్సెస్ భావిస్తోందని, ‘సైనిక్’ స్కూల్ తరహాలో ఈ పాఠశాలలో పిల్లలకు భారత సైన్యానికి పనికొచ్చేవిధంగా శిక్షణ ఇవ్వనున్నారని, దీంతోపాటు సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో బోధన ఉంటుందని కథనాలు వచ్చాయి. -
‘ఆర్మీ స్కూల్స్‌కు పిల్లలను పంపకండి’
సాక్షి, శ్రీనగర్ : కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, హురియత్ కాన్ఫెరెన్స్ ఛైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ఆర్మీ విద్యాసంస్థలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని ముస్లింలు.. తమ పిల్లలను ఆర్మీ స్కూల్స్‌కు పంపవద్దని పిలుపునిచ్చారు. ఆర్మీ విద్యాసంస్థలు.. ముస్లిం సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా విద్యా బోధన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలు ఎవరూ.. తమ పిల్లలను ఆర్మీ విద్యాసంస్థలకు పంపవద్దని పిలుపునిచ్చారు. ఆర్మీ విద్యాసంస్థల్లో చదువుకుంటే.. మని పిల్లలు పూర్తిగా మారిపోతారని ఆయన చెప్పారు. అంతేకాక ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం, సంప్రదాయాలు ఉన్న ఇస్లాం నుంచి చిన్నారులు దూరంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆర్మీ విద్యాసంస్థలకన్నా.. మంచి ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ, ఇతర విద్యాసంస్థల్లో చిన్నారులను చేర్చాలని ఆయన తల్లిదండ్రులకు చెప్పారు. -
పాక్ చిన్నారులకు భారత్ నివాళి
-
పెషావర్ దాడి భయానక దృశ్యాలు!
-
స్కూళ్ల భద్రతకు మార్గదర్శక సూత్రాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఒక ఆర్మీ స్కూలుపై తాలిబన్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రముఖ పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు సహా దాడులకు ఆస్కారం ఉన్న సంస్థల భద్రతపై పాటించాల్సిన మార్గదర్శక సూత్రాలను కేంద్రం త్వరలోనే జారీచేయనుంది. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన పక్షంలో పిల్లలు ప్రాణాలతో తప్పించుకునేందుకు తగిన ప్రణాళిక రూపొంచుకోవాలని, దుండగులు విద్యార్థులను బందీలుగా పట్టుకోకుండా నివారించడం, అత్యవసర పరిస్థితిలో బిగ్గరగా కేకలు వేసి పరిస్థితి తీవ్రతను తెలియజేయడం వంటి చర్యలు తీసుకోవాలని కేంద్రం తన మార్గదర్శక సూత్రాలద్వారా కోరనుంది. దేశం ఉత్తరాదిలోని రెండు బోర్డింగ్ స్కూళ్లు, ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ లక్ష్యాలుగా, పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు దిగవచ్చని ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ, అతని అనుచరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా ఇంటరాగేషన్‌లో చెప్పినట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్గదర్శ సూత్రాల జారీచేయబోతోంది. గతంలో ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రధాన నిందితుడు హెడ్లీ 2010లో అమెరికాలో అరెస్టయినపుడు కూడా భద్రతపై స్కూళ్లకు మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు. -
తెలంగాణకూ కావాలి ఓ సైనిక స్కూలు!
సందర్భం భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం అభ్యంతరపెడితే సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు సైనిక స్కూళ్లలో 67 శాతం సీట్లు 13 జిల్లాల విద్యార్థులకే చెందే అవకాశం ఉంది. కే్రందం, తెలంగాణ సర్కారు జోక్యం చేసుకుంటే తప్ప తెలంగాణ విద్యార్థులకు ఈ రెండు సైనిక స్కూళ్లలో సీట్లు దొరకడం కష్టమవుతుంది. దేశానికి క్రమశిక్షణ కలి గిన పౌరులను అందించే లక్ష్యంతో ఏర్పాటైన సైనిక స్కూళ్లు ఆ లక్ష్యం దిశగా వెళుతున్నాయి. రక్షణ రం గంలో ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాల ఎంపికకు మం చి వేదికగా ఉపయోగపడు తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోరుకొండలో సైనిక స్కూలు ఏర్పాట యింది. దీనిని సెప్టెంబర్ 10, 1961న లాంఛ నంగా ప్రారంభించినా; 1962 జనవరి 18న అధికారికంగా కార్యక్రమాలు మొదలుపెట్టిం ది. ఆంధ్రప్రదేశ్ విభజనకు కొద్దిగా ముందు అక్కడ ఒక సైనిక స్కూలు ఉండగానే, చిత్తూరు జిల్లా కలికిరిలో మరో సైనిక స్కూలు ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది. అప్పటి ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత ఊరి మీద ప్రేమతో దీన్ని ఏర్పాటు చేయించారు. దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రానికి ఓ సైనిక పాఠశాల ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు రెండు చొప్పున సైనిక స్కూళ్లు ఉన్నాయి. కర్ణాటకలో బీజాపూర్, కొడగు జిల్లాల్లో ఇవి ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 25 సైనిక స్కూళ్లు ఉన్నా యి. మరో రెండు త్వరలో ఏర్పాటు కాబోతున్నా యి. సైన్యంలో ప్రాంతీయ, వర్గ అసమానతలను రూపుమాపేందుకు 1961లో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అప్పటి రక్షణ మంత్రి వీకే కృష్ణమీనన్ వీటికి అంకురార్పణ చేశారు. మౌలి కంగా విద్యార్థులను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యేలా తయారు చేయడమనే లక్ష్యంతో ఇవి ఏర్పాటయ్యాయి. యువ విద్యార్థుల్లో శారీర కంగా, మానసికంగా, ఉన్నత గుణశీలాలు పెం పొందించి దేశానికి ఉత్తమ పౌరులను అందించడం కూడా వీటి ల క్ష్యాలలో ఒకటి. పబ్లిక్ స్కూళ్ల మాదిరి గానే ఇవి ఆశ్రమ పాఠశాలలు. రెసిడెన్షియల్ విధా నంతో చక్కటి వాతావరణంలో విద్యాభ్యాసం సాగుతుంది. 12వ తరగతి వరకు తప్పనిసరిగా ఎన్సీసీ శిక్షణ ఇస్తారు. ఒక్కో సైనిక స్కూలులో అన్ని తరగతులు - ఆరు నుంచి 12 వరకు కలిపి 525 మంది విద్యార్థు లకు బోధన సౌకర్యం ఉంటుంది. కొన్ని పాఠశా లల్లో కొన్ని సీట్లు ఎక్కువ, కొన్నింటిలో తక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దేశంలోని సైనిక స్కూళ్లు త్రివిధ దళాలకు 7,000 మంది అధికారులను అందించాయి. పాఠశాలకు అవసరమైన భూమి, భవనాలు వంటి మౌలిక వస తులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుం ది. వీటిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థి వేతనాలను అంది స్తాయి. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దడం సైనిక స్కూళ్ల ప్రత్యేకత. దీనికితోడు సీబీఎస్ఈ సిలబస్ ద్వారా, ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం లభి స్తుంది. అంతేకాకుండా విద్యార్థులకు జాతీయ స్థాయి క్రీడాపోటీలు, ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల పరేడ్‌లో పాల్గొనే అవ కాశం కలుగుతుంది. సాహసకృత్యాలలో కూడా మంచి తర్ఫీదు ఇస్తారు. వీటిలో అరవయ్యో దశ కంలో చదువుకున్న విద్యార్థుల్లో కొందరు ‘జనరల్’ స్థాయికి, అదేవిధంగా వాయుసేనలో ‘ఎయిర్ చీఫ్ మార్షల్’, నౌకాదశంలో ‘అడ్మిరల్’ వంటి పదవు లను పొందారు. ఈ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో ప్రతిఏటా 130 నుంచి 160 మంది దాకా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యేటట్లు తర్ఫీదు ఇవ్వడం వీటి ప్రత్యేకత. రాష్ర్ట విభజన జరిగిన తరువాత తెలం గాణ రాష్ట్రానికి కూడా అత్యవసరంగా ఓ సైనిక స్కూలును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రానికి ఓ సైనిక స్కూలు ఉన్నట్లే ఈ రాష్ట్రంలోనూ ఉండటం న్యాయం. ప్రస్తుతం 2015-16 సంవత్సరానికి ప్రవేశాల కోసం ప్రకటన వెలువడింది. దీనిలో కోరు కొండలో ఆరో తరగతిలో ప్రవేశానికి 90 సీట్లు, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 25 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లా కలికిరి లో ఆరో తరగతిలో ప్రవేశానికి 105 సీట్లు ఉన్నాయి. వీటన్నిటికి ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అయితే సైనిక స్కూలు ఉన్న రాష్ట్రంలోని విద్యార్థులకు 67 శాతం సీట్లు కేటాయిస్తారు. దీనివల్ల ఆయా రాష్ట్రా ల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతానికి (2015-16 విద్యా సంవత్సరా నికి) ఈ విషయంలో పాత పద్ధతే (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కలిపి ఇవ్వనున్నారు) అవలంబిస్తున్నారు. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం అభ్యంతరపెడితే సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు సైనిక స్కూళ్లలో 67 శాతం సీట్లు 13 జిల్లాల విద్యార్థులకే చెందే అవకాశం ఉంది. కేంద్రం, తెలంగాణ సర్కా రు జోక్యం చేసుకుంటే తప్ప తెలంగాణ విద్యార్థు లకు ఈ రెండు సైనిక స్కూళ్లలో సీట్లు దొరకడం కష్టమవుతుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో సైనిక స్కూలు ఏర్పాటైతే 67 శాతం సీట్లు ఈ ప్రాంత విద్యార్థులే పొందడానికి అవకాశం ఉంటుంది. లేదంటే జాతీయ విధానం ప్రకారం చాలా స్వల్ప సంఖ్యలోనే సీట్లను పొందాలి. రాష్ట్ర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ సైనిక స్కూలును రక్షణ శాఖ ఏర్పాటు చేసేలా కేసీఆర్ సర్కారు చర్యలు తీసుకో వాలి. దీనికి తగిన ప్రణాళికను కేంద్రానికి సమ ర్పిస్తే మరో మూడు నాలుగేళ్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కేంద్రం సైనిక స్కూలు మంజూరు చేయడానికి బలమైన కారణాలు ఉం డనే ఉన్నాయి. కావాల్సిందల్లా తెలంగాణ సర్కారు కార్యాచరణ, చొరవ మాత్రమే. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు) -
యువతిపై ఆర్మీ ఉన్నతాధికారి అత్యాచారం!
క్రమశిక్షణకు మారు పేరు భారతీయ ఆర్మీ. ఆ ఆర్మీ రంగానికి చెందిన ఉన్నతాధికారి ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం...రోహిత్ శర్మ (29) ఆర్మీలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్మీ కళాశాలలో ఉపాధ్యాయురాలి ఉద్యోగం ఇప్పిస్తానని 24 ఏళ్ల యువతికి మాయ మాటలు చెప్పాడు. ఆ విషయంపై చర్చించేందుకు హోటల్ రూమ్ అనువైన వేదిక అని ఆ యువతికి వెల్లడించాడు. హోటల్‌కు వెళ్లిన యువతిపై రోహిత్ అత్యాచారం జరిపాడు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్నితల్లీ తండ్రులకు వివరించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.అత్యాచారానికి గురైన యువతికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. యువతి వాంగ్మూలాన్ని రికార్డు చెసినట్లు పోలీసు ఉన్నతాధికారి గురువారం మీరట్ లో వివరించారు. అత్యాచారం విషయమై ఆర్మీ అధికారులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ కేసులో ఇంతవరకు లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేయలేదని పోలీసు ఉన్నతాధికారి వివరించారు.అయితే ఆ ఘటన ఈ ఏడాది ఆక్టోబర్ 22న జరిగిందని పోలీసులు చెప్పారు. -
ఆర్మీ స్కూల్ విజయం
సాక్షి, హైదరాబాద్: ఎయిర్టెల్ రైజింగ్ స్టార్స్ ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) జట్లకు పరాజయం ఎదురైంది. తిరుమలగిరి మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్మీ స్కూల్ 1-0 తేడాతో హెచ్‌పీఎస్‌పై విజయం సాధించింది. ఆర్మీ జట్టు తరఫున అమిత్ ఏకైక గోల్ నమోదు చేశాడు. రెండో మ్యాచ్‌లో ఏపీ స్పోర్ట్స్ స్కూల్ 2-0 స్కోరుతో హెచ్‌పీఎస్‌ను ఓడించింది. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి రాకేశ్ ఒక్కడే 2 గోల్స్ చేయడం విశేషం. మరో మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్ ద్వారా గవర్నమెంట్ బాయ్స్ స్కూల్‌కు విజయం దక్కింది. సెయింట్ ప్యాట్రిక్స్తో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో పెనాల్టీ షూటౌట్‌తో విజేతను తేల్చారు. ఇందులో గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ 5-4 గోల్స్ తేడాతో సెయింట్ ప్యాట్రిక్పై సంచలన విజయం సాధించింది.