
సాక్షి, శ్రీనగర్ : కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, హురియత్ కాన్ఫెరెన్స్ ఛైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ఆర్మీ విద్యాసంస్థలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని ముస్లింలు.. తమ పిల్లలను ఆర్మీ స్కూల్స్‌కు పంపవద్దని పిలుపునిచ్చారు. ఆర్మీ విద్యాసంస్థలు.. ముస్లిం సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా విద్యా బోధన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలు ఎవరూ.. తమ పిల్లలను ఆర్మీ విద్యాసంస్థలకు పంపవద్దని పిలుపునిచ్చారు.
ఆర్మీ విద్యాసంస్థల్లో చదువుకుంటే.. మని పిల్లలు పూర్తిగా మారిపోతారని ఆయన చెప్పారు. అంతేకాక ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం, సంప్రదాయాలు ఉన్న ఇస్లాం నుంచి చిన్నారులు దూరంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆర్మీ విద్యాసంస్థలకన్నా.. మంచి ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ, ఇతర విద్యాసంస్థల్లో చిన్నారులను చేర్చాలని ఆయన తల్లిదండ్రులకు చెప్పారు.