kashmir
-
కశ్మీర్‌కు వందేభారత్.. మంచులోనూ వెచ్చదనం
దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతూ, ప్రయాణికులకు నూతన రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. తాజాగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రైల్వే లైన్ ద్వారా దేశాన్ని అనుసంధానించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్(యూఎస్బీఆర్ఎల్) పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఢిల్లీ నుండి రైళ్లు కశ్మీర్‌కు బయలుదేరనున్నాయి. ఈ మార్గంలో నడిపేందుకు ముందుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంపిక చేశారు. అయితే కశ్మీర్ లోయలో హిమపాతం, అక్కడి సబ్-జీరో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ వందేభారత్ రైలులో పలు నూతన ఫీచర్లను జోడించారు.ఇప్పటివరకు కశ్మీర్ వైపు వెళ్లే రైళ్లు కాట్రా వరకు మాత్రమే నడుస్తున్నాయి. తదుపరి రైల్వే లైన్ వేసే పనిని వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్(USBRL Project) కింద చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా 17 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఇది త్వరలో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్మూ, కాట్రా గుండా వెళతాయి. సంగల్డాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీనిని రోడ్డు మార్గంతో పోలిస్తే, ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం అవుతుంది.కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందే భారత్‌ను ఎంపిక చేశారు. ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. రైలు బయట మంచుకురుస్తుంటో లోపలి ప్రయాణికులు వెచ్చదనాన్ని అనుభవించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్లో రైళ్లు నడపడానికి మంచు కురువడం, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి. విండ్ స్క్రీన్ పై మంచు కురుస్తున్న కారణంగా, లోకో పైలట్ ముందున్న రోడ్డును చూడలేకపోతారు. మైనస్ ఉష్ణోగ్రత(Subzero temperature)లో టాయిలెట్ పైప్లైన్లు కూడా స్తంభించిపోతాయి. అలాగే విపరీతమైన చలి కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.కశ్మీర్‌కు నడిపేందుకు రూపొందించిన రైలులో పైలట్ క్యాబిన్ విండ్‌స్క్రీన్ డబుల్ లేయర్ గ్లాస్‌తో తయారు చేశారని, మధ్యలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఉత్తర రైల్వే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మీడియాకు తెలిపారు. ఈ సాంకేతికత కారణంగా గ్లాస్‌కు అంటుకున్న మంచు వెంటనే కిందకు జారిపోతుందన్నారు. వైపర్ నుండి వేడి నీరు కూడా బయటకు వస్తుందని, ఇది మిగిలిన మంచు, ఆవిరిని తొలగిస్తుందన్నారు. కొత్త ఫీచర్లతో కూడిన ఈ వందే భారత్‌లో లోకో పైలట్ క్యాబిన్‌లోని సీట్లు కూడా మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. రైలు అంతటా హీటర్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌లో హై లెవల్ థర్మోస్టాట్ లేయరింగ్ ఉంటుంది. తద్వారా సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా లోపలి ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉంటుంది.వందే భారత్ టాయిలెట్లలో నీటి పైప్‌లైన్‌ను సిలికాన్ హీటింగ్ ప్యాడ్లతో ఇన్సులేట్ చేశారు. తద్వారా బయో టాయిలెట్‌లోని ట్యాంక్‌కు హీటింగ్ కూడా అందుతుంది. ఫలితంగా దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. ఇదేవిధంగా ఈ నూతన వందే భారత్ రైలు కిటికీలకు డబుల్ లేయర్డ్ గ్లాస్ కూడా అమర్చారు. దీంతో ఎవరైనా ఒకవేళ రాయి విసిరినప్పటికీ, పైగాజు మాత్రమే పగిలిపోతుంది. ప్రయాణికులకు ఎటువంటి హాని వాటిల్లదు.ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా -
మంచు పులులు
గడ్డ కట్టే మంచు, కోత పెట్టే చలి పరీక్ష పెట్టే వాతావరణంకాని తప్పని బతుకుపోరు...కశ్మీర్లో పురుషులతో పాటు స్త్రీలూ శ్రమ చేసి సంపాదిస్తేనే ఇళ్లు గడుస్తాయి. దాల్ లేక్ వెంబడి వందలాది స్త్రీలు చిల్లర వస్తువులు అమ్ముతూ బతుకు ఈడుస్తారు. ప్రస్తుతం దాల్ లేక్ గడ్డ కట్టింది. ఆగక మంచుకురుస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి సరస్సు వొడ్డున మంచుపులుల్లా తల్లులు తమ కొట్లు తెరిచి నిలుచున్నారు. వారి బతుకు చిత్రం.కశ్మీరీలు గిరిజనులే అయినా వారికి జ్ఞానం మెండు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకూ వచ్చే ‘చిలాయి కలాన్’ (భారీ మంచు)కు వారు సిద్ధమయ్యే వుంటారు. కాని ఈసారి చిలాయి కలాన్ గత 30 ఏళ్లలో లేనంత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకూ పడిపోయాయి. దాల్ లేక్ రాత్రిళ్లు పూర్తిగా గడ్డకట్టి మధ్యాహ్నానికి గాని కొద్దిగా పలుచబడదు. ఈలోపు ఎలా జీవించాలి?‘ఇంట్లో పండిన కూరగాయలను ఉదయాన్నే తీసుకొని షికారా (చిన్న పడవ)లో బయలుదేరి దాల్ లేక్ ఒడ్డు మీదకు వచ్చి అంగడి తెరుస్తాను. దాల్ లేక్ గడ్డ కడితే షికారా కదలదు. ట్రాలీలు వెతుక్కుని రోడ్డు మార్గాన రావాలి. అసలే మంచుతో కరువు... ఇదో ఖర్చు’ అంటుంది ఒక కశ్మీరీ దుకాణం దారు.శ్రీనగర్‌లో జనం రెండు విధాలుగా జీవిస్తారు. ఒక విధం దాల్ లేక్ చుట్టుపక్కల... మరో విధం మైదాన, ఎత్తయిన ఏరియాల్లో. దాల్ లేక్‌లో జీవించే వారికి హౌస్బోట్లు, విహార బోట్లు, రోడ్డు మీద చిల్లర అంగళ్లు... ఇవే ఆధారం. ‘మేము చాలామంది స్త్రీలము రోడ్డు మీద కూరగాయలు, పూలు, చేపలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతాం. నిజానికి మా అందరికీ ఈ పని చాలా కష్టం. కాని మా పిల్లలైనా బాగుపడాలని వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఈ ప్రయత్నం చేస్తాం. ఇలా మా పూర్వికులు కూడా చేశారు. కాని బాగుపడిన వారు తక్కువ’ అంటారు వారు.8 నుంచి 13 గంటలు...కశ్మీర్ అంటే టూరిస్టులు. టూరిస్టులు వచ్చే వేసవి కాలంలో బేరాలు ఒక రకంగా ఉంటాయి. మంచు తీవ్రంగా కురిసే సమయంలో టూరిస్ట్‌లకు బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో కూడా బతకడానికి దాల్ లేక్ ఒడ్డున అంగళ్లు తెరవక తప్పదు. ‘రోజూ తెల్లవారు జామునే వచ్చి సాయంత్రం వరకూ నిలబడతాము. 8 నుంచి 13 గంటలు రోడ్డు మీద ఉంటాము’ అని చె΄్తారు వీళ్లు. ‘నా కూతురు డాక్టర్ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. దాని చదువు కోసం ఈ కష్టాన్ని మునిపంట నొక్కి చేస్తున్నాను’ అని ఒకావిడ చెప్పింది. దట్టమైన మంచు కురిసే సమయంలో వీరికి ఆస్పత్రి సౌకర్యం ఉండదు. ప్రసూతి అవసరాలకు ఆస్పత్రికి వెళ్లడానికి వీలు కానంతగా దార్లు మూసుకుపోతాయి. దాల్ లేక్ ఒడ్డున అమ్ముకునే స్త్రీలకు అవసరమైన టాయిలెట్లు కూడా ఉండవు. అయినా సరే వారు తమ కుటుంబాలు గడవడానికి మంచులో తడుస్తూనే ఉంటారు.టార్పాలిన్ కట్టకూడదు!దాల్ లేక్ ఒడ్డున రోడ్డు మీద వెళుతూ ఉంటే స్త్రీలు ఏ టార్పాలిన్ కట్టకుండా ఆకాశం కింద నిలబడి వస్తువులు అమ్ముతుంటారు స్త్రీలు. ‘మేము చలికి ఆగలేక, మంచు నుంచి రక్షించుకుందామని టార్పాలిన్లు కట్టుకుంటాం. కాని భద్రత దృష్ట్యా మునిసిపాలిటీ వాళ్లు, రక్షణ దళాలు వాటిని పీకేస్తాయి. ఏ ఉగ్రవాదులో ఈ టార్పాలిన్ల దగ్గర చాటు తీసుకుంటారని వీరి భయం. కాని మా ్రపాణాల సంగతి?’ అని మరో మహిళ ప్రశ్నించింది. మంచుకు తడిసి, నీటికి నాని ఈ స్త్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు. కాని చిరునవ్వు చెరగనివ్వరు. టూరిస్ట్‌లతో స్నేహంగా మాట్లాడుతూ సంధ్య చీకట్లలో ఇళ్ల వైపుకు వెళ్లిపోతారు. ఈ స్త్రీల శ్రమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? -
వీర లెవల్లో అందాలు అదరహో.. మంచుకురిసే వేళలో మైమరపిస్తున్న కశ్మీరం (చిత్రాలు)
-
మంచు ముద్దయిన కశ్మీరం!
శ్రీనగర్: కశ్మీర్లో శనివారం భారీగా మంచు కురిసింది. దీంతో స్థానికులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తుండగా సాధారణ జనజీవనానికి మాత్రం అవరోధం ఏర్పడింది. కశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఒక మోస్తరు నుంచి భారీగా మంచు కురుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో, రైలు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. మంచు కారణంగా కశ్మీర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. శనివారం సాయంత్రం కల్లా 90 శాతం వరకు ఫీడర్లలో సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అననుకూల వాతావరణం కారణంగా కశ్మీర్ విశ్వవిద్యాలయం శనివారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. శ్రీనగర్–సోనామార్గ్ హైవేపై రాకపోకలు నిలిచిపోవడంతో చిక్కుకుపోయిన పర్యాటకులకు గుండ్‌లోని మసీదులో స్థానికులు ఆశ్రయం కల్పించారు. సోనామార్గ్ నుంచి శుక్రవారం తిరుగుపయనమైన పంజాబ్‌కు చెందిన సుమారు డజను మంది శుక్రవారం రాత్రి మసీదులోనే గడిపారని స్థానికులు తెలిపారు. అదేవిధంగా, గండేర్బల్ జిల్లా కంగన్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులకు స్థానిక కుటుంబం ఆశ్రయం క ల్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దక్షిణ కశ్మీర్‌పై ఎక్కువ ప్రభావం దక్షిణ కశ్మీర్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో రెండడుగుల మేర మంచు కురిసిందని అధికారులు వివరించారు. బారాముల్లా జిల్లాలో 4 నుంచి 9 అంగుళాల మేర మంచు నమోదవగా గుల్మార్గ్లో 15 అంగుళాల మంచు కురిసింది. పుల్వామాలో 10 నుంచి 15 అంగుళాలు, పొరుగునే ఉన్న కుల్గామ్‌లో 18 నుంచి 25 అంగుళాలు, షోపియాన్‌లో 6 నుంచి 10 అంగుళాల మంచు పేరుకుపోయింది. శ్రీనగర్‌లో 8 అంగుళాల మేర మంచు కురియగా, పొరుగునే ఉన్న గందేర్బల్లో 7 అంగుళాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతం సోనామార్గ్‌లో 8 అంగుళాల మేర మంచు నమోదైందని అధికారులు చెప్పారు. పర్యాటక పట్టణం పహల్గామ్లో శనివారం 18 అంగుళాల మేర మంచు కురిసింది. అనంత్‌నాగ్ జిల్లాలో అత్యధికంగా 17 అంగుళాల హిమపాతం నమోదు కాగా శ్రీనగర్–లేహ్ రహదారి వెంట ఉన్న జోజిలాలో 15 అంగుళాలు, బుద్గాం జిల్లాలో 7 నుంచి 10 అంగుళాల మేర మంచు నమోదైంది. మైనస్‌కు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు శ్రీనగర్‌లో గురువారం రాత్రి మైనస్ 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం రాత్రికి తీవ్రత తగ్గి మైనస్ 1 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకుంది. స్కయింగ్కు పేరున్న ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్లో మైనస్ 5 డిగ్రీలు, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపున్న పహల్గామ్లో మైనస్ 2.8 డిగ్రీలుగా ఉంది. కశ్మీర్‌కు ముఖద్వారం వంటి క్వాజీగుండ్లో కనీస ఉష్ణోగ్రత మైనస్ 0.6 డిగ్రీలుగా నమోదవగా, పంపోర్ ప్రాంతంలోని కుగ్రామం కొనబాల్లో మైనస్ 1.5 డిగ్రీలుగా రికార్డయింది. కశ్మీర్ లోయలో అతి తీవ్రమైన చలికాలం ‘చిల్లాయ్–కలాన్’ఈ నెల 21 నుంచి మొదలైంది. దాదాపు 40 రోజులపాటు భారీగా మంచు కురియడంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా మైనస్ స్థాయికి పడిపోతాయి. జనవరి 30వ తేదీకల్లా ఈ తీవ్రత తగ్గుముఖం పట్టనుంది. అయితే, చలి గాలులు మాత్రం మరో 40 రోజుల వరకు కొనసాగుతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి జమ్మూ–శ్రీనగర్ 44వ నంబర్ జాతీయ రహదారిని మంచు కారణంగా అధికారులు మూసివేశారు. నవ్యుగ్ టన్నెల్ వద్ద అతి భారీగా మంచు కురుస్తుండటంతో యంత్రాలతో మంచు తొలగింపు పనులకు అంతరాయం కలుగుతోందని ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. వాతావరణం మెరుగుపడి, రోడ్లు క్లియర్ అయ్యేదాకా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వాహనదారులను వారు కోరారు. పట్టాలపై భారీగా మంచు పేరుకుపోవడంతో అధికారులు ముందు జాగ్రత్తగా బనిహాల్–బారాముల్లా సెక్షన్లో రైళ్లను రద్దు చేశారు. ట్రాక్‌ను క్లియర్ చేసే పనులు కొనసాగుతున్నాయన్నారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలను రద్దు చేశామని అధికారులు తెలిపారు. రన్‌వేను క్లియర్ చేసే పనులు చేపట్టామని, వాతావరణం అనుకూలిస్తేనే విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి మొదలవుతాయన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం కోసం వైమానిక సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రాల్లోని ప్రధాన రహదారులు, ఆస్పత్రులకు దారి తీసే రోడ్లపై మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మంచు కారణంగా అంతర్గత రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. వాహనాలు జారుతున్నందున మంచులో డ్రైవ్ చేయడం కష్టసాధ్యమే కాదు, ప్రమాదకరమని హెచ్చరించారు. -
India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది?
అది 1957వ సంవత్సరం.. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విమానంలో అమెరికా వెళుతూ, మార్గమధ్యంలో సిరియా రాజధాని డమాస్కస్‌ను సందర్శించారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలింది. అప్పటికి భారత్- సిరియా మధ్య ఏడేళ్ల దౌత్య సంబంధాలున్నాయి.కశ్మీర్ అంశంపై భారత్‌కు సిరియా మద్దతునెహ్రూ డమాస్కస్‌ను సందర్శించినందుకు గుర్తుగా అక్కడి ఒక వీధికి జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారు. దశాబ్దాలు గడిచాయి. అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిరియా యుద్ధ కాలాన్ని చూసింది. ఇది ఇరు దేశాల స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయాక భారత్- సిరియా మధ్య దోస్తీ ఏమికానున్నదనే ప్రశ్న తలెత్తుతోంది.తొలుత హఫీజ్ అల్ అసద్ పాలనలో, తరువాత బషర్ అల్ అసద్ పాలనలో సిరియా.. భారత్‌కు పలు అంశాలలో మద్దతు పలికింది. ముఖ్యంగా కశ్మీర్ సమస్యకు మద్దతునిచ్చింది. కశ్మీర్ విషయంలో పలు ముస్లిం దేశాలు పాకిస్తాన్ తీరుకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే సిరియా భారతదేశానికి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చే కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది.ఇరు దేశాల మధ్య సారూప్యతఅసద్ లౌకిక ప్రభుత్వం, భారతదేశం కట్టుబడిన సూత్రాల మధ్య చాలా సారూప్యత ఉంది. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు ఇది పునాదిగా నిలిచింది. 2019లో కశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని భారతదేశం తొలగించినప్పుడు, సిరియా ప్రభుత్వం దానిని భారతదేశ అంతర్గత సమస్యగా పేర్కొంది. ఆ సమయంలో రియాద్ అబ్బాస్ న్యూఢిల్లీలో సిరియా రాయబారిగా ఉన్నారు. ఆయన భారత్‌కు మద్దతునిస్తూ ‘ప్రతీదేశ ప్రభుత్వానికి తమ దేశంలోని ప్రజల భద్రత కోసం తమ భూమిలో ఏదైనా చేసే హక్కు ఉంటుంది. మేం భారత్‌తోనే ఉంటాం’ అని పేర్కొన్నారు.సిరియాకు తీవ్రవాద గ్రూపుల ముప్పుబషర్ అల్ అసద్ పతనం తరువాత ఇప్పుడు సిరియాలో తీవ్రవాద గ్రూపులు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. ఇది భారతదేశానికి సమస్యలను సృష్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఐఎస్ఐఎస్ ప్రభావవంతంగా ఉన్నప్పుడు రష్యా, ఇరాన్ మద్దతుతో సిరియా ఈ ఉగ్రవాద సంస్థ ప్రభావాన్ని చాలా వరకు అరికట్టింది. అయితే ఇప్పుడు ఈ రాడికల్ గ్రూపులు మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మధ్యప్రాచ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.సిరియా తీర్మానానికి భారత్ మద్దతుఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థల పెరుగుదల భారతదేశానికి పలు భద్రతా సవాళ్లను సృష్టించే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ దేశంలోని సంఘర్షణలకు అడ్డుకట్ట వేసేందుకు సిరియా చేసిన తీర్మానానికి భారతదేశం మద్దతు పలికింది. సిరియా అంతర్యుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలోనూ డమాస్కస్‌లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని కొనసాగించింది. గోలన్ హైట్స్‌పై సిరియా చేస్తున్న వాదనలకు భారతదేశం మద్దతు పలికింది. అయితే దీనిని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది. 2010లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ డమాస్కస్‌ను సందర్శించి మనదేశ వైఖరిని పునరుద్ఘాటించారు.సిరియాను సందర్శించిన వాజ్పేయిభారత్-సిరియా మధ్య సంబంధాలు ఆర్థిక, సాంస్కృతిక మార్పిడిపై ఆధారపడి ఉంటాయి. 2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సిరియాలో పర్యటించి బయోటెక్నాలజీ, చిన్న పరిశ్రమలు, విద్యకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. డమాస్కస్‌లోని బయోటెక్నాలజీ సెంటర్ కోసం భారత్ 25 మిలియన్ డాలర్ల రుణంతో పాటు ఒక మిలియన్ డాలర్ల సాయం అందజేసింది.ఎగుమతులు.. దిగుమతులు ఇలా..2008లో బషర్ అల్ అసద్ భారత్‌ను సందర్శించారు. నాడు సిరియాలో ఐటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని భారతదేశం ప్రతిపాదించింది. గత ఏడాది విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి వి మురళీధరన్ బషర్ అల్ అసద్‌తో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు వృద్ధి దశలో కొనసాగుతున్నాయి. భారతదేశం సిరియాకు వస్త్రాలు, యంత్రాలు, మందులను ఎగుమతి చేస్తుంటుంది. కాటన్, రాక్ ఫాస్ఫేట్ వంటి ముడి పదార్థాలు సిరియా నుంచి భారత్‌కు దిగుమతి అవుతుంటాయి. ఇది కూడా చదవండి: ఆప్ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం -
కశ్మీర్లో కాల్పులు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, స్థానిక పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగతున్నాయి. ఈ ఎదురుకాల్పులల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. డచిగామ్‌లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్ పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం డచిగామ్‌లో టెర్రరిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాల చేతిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మృతిచెందినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గగన్‌గీర్, గందేర్బల్ సహా పలు ప్రాంతాల్లో దాడులకు సూత్రధారి జునైద్ అని పోలీసులు చెబుతున్నారు. అక్కడ టెర్రరిస్టుల దాడుల కారణంగా సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. ఈ ఎదురుకాల్పుల ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. In the ongoing operation, one terrorist was killed and has been identified as Junaid Ahmed Bhat (LeT, Category A). The said terrorist was involved in civilians killing at Gagangir, Ganderbal and several other terror attacks. Operation continues in the upper reaches of Dachigam by… pic.twitter.com/8JhMfc1qMH— ANI (@ANI) December 3, 2024ఈ ఏడాది అక్టోబర్ నెలలో కశ్మీర్లో గందేర్బల్ జిల్లాలోని గగన్‌గిర్ వద్ద ఓ ప్రైవేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జునైద్ టీమ్ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ వైద్యుడితో పాటు, ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ కార్మికులు గగన్‌గీర్ నుంచి సోనామార్గ్ వరకు చేపడుతున్న జడ్-మోర్హ్ సొరంగం పనుల్లో పాల్గొంటున్న క్రమంలో ఉగ్రదాడి జరిగింది. -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
నాలుగు రోజుల క్రితం ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వచ్చాయి. మంగళవారం కౌంటింగ్ మొదల య్యాక ఉదయం 9 గంటల వేళ తొలి ఫలితాల సరళీ వచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా అంతా మారి పోయింది. హర్యానా, జమ్ము–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు, ఆశాభావాలు తలకిందుల య్యాయి. పోటాపోటీతో హంగ్ అవుతుందని బీజేపీ ఆశపడ్డ జమ్ము – కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్‌దే విజయం అని ఎగ్జిట్‌పోల్స్ కోడై కూసినచోట అవన్నీ తోసిరాజని విజయంతో బీజేపీ అబ్బురపరిచింది. 1966 హర్యానా ఏర్పాటయ్యాక ఇప్పటి దాకా ఏ పార్టీ సాధించని హ్యాట్రిక్‌తో రికార్డ్ సృష్టించింది. పార్టీల నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాలు పాఠాలు నేర్పడం గమనార్హం. ఏ ఎన్నికా చిన్నది కాదనీ, ప్రతిదీ కీలకమేననీ, అతి విశ్వాసం పనికిరాదనీ మరోసారి ఈ ఫలితాలు తేల్చాయి. దశాబ్దం తర్వాత, అదీ 2019 ఆగస్ట్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక, జమ్ము–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు ఆసక్తికరమే. కొన్నేళ్ళుగా ‘నయా కశ్మీర్’గా ఎంతో చేశామని చెప్పుకున్నప్పటికీ, జమ్మూను దాటి కశ్మీర్ లోయలో బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. దోడా స్థానం గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కశ్మీర్లో ఖాతా తెరవడం విశేషం. మరోపక్క హర్యానాలో ‘తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తెచ్చుకున్న గెలుపు’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్ ఫలితాల సరళిని చూపిన తీరు, ఈవీఎంల బ్యాటరీల శాతమూ అనుమానాస్పదమన్నది ఆ పార్టీ ఆక్షేపణ, ఆరోపణ. ఆ మధ్య లోక్ సభ ఎన్నికల్లో లానే ఇప్పుడూ ఈసీ ఆ ఆరోపణల్ని బాధ్యతారహితమంటూ కొట్టిపారేసింది. ఆరోపణల్ని పక్కనబెట్టి అసలు జరిగింది ఇప్పటికైనా పరిశీలించుకోవడం అన్ని వర్గాలకూ కీలకం. కశ్మీర్ సంగతి అటుంచి, హర్యానానే తీసుకుంటే... ‘జవాన్... కిసాన్... పహిల్వాన్’ నినాదంతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ హర్యానాలో ఆ అంశాలు బీజేపీని మట్టికరిపిస్తాయని భావిస్తూ వచ్చింది. కానీ, జరిగింది వేరు. పదేళ్ళుగా హర్యానాను పాలిస్తున్న బీజేపీ పట్ల అధికారపక్ష వ్యతిరేకత ఒకటికి రెండింతలు ఉన్నప్పటికీ దాని నుంచి ఎందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ లబ్ధి పొందలేకపోయింది. అందుకు కారణాలను ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. సమైక్య ప్రతిపక్షంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని భంగపడింది. ఆప్‌కి హర్యా నాలో చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, సీట్ల సర్దుబాటు, పొత్తు విషయంలో కాంగ్రెస్ మొండిపట్టుతో పోవడం గట్టి దెబ్బ తీసింది. ఆప్ సీట్ల డిమాండ్ 20 దగ్గర మొదలై, 10 దగ్గరకు వచ్చి ఆగి, చివరకు 5 స్థానాల దగ్గరకు వచ్చి ఆగినా, పొత్తు పొడవనే లేదు. తప్పక గెలిచే 3 సీట్లిచ్చినా చాలు... ‘ఆప్’ ఓకే అంటుందని తెలిసినా, ఆఖరికి రాహుల్ సైతం పొత్తుకే మొగ్గు చూపినా, కాంగ్రెస్ దూతలు పడనివ్వలేదు. చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అధిష్ఠానం జోక్యం చేసుకొని పరాజయానికి బాధ్యులెవరో చూడాలంటూ కుమారి సెల్జా గొంతు విప్పారు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో వర్గవిభేదాలకు కొదవ లేదని అర్థమవుతోంది. సీట్ల పంపిణీ వేళ భూపీందర్ సింగ్ హూడా తన వర్గం వారికే ఎక్కువ సీట్లివ్వడం ఇతర సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. ఆ అంతర్గత కుమ్ములాటలు ఆఖరికి మొత్తంగా రాష్ట్రంలో పరాజయానికీ దారి తీశాయన్నది ప్రాథమిక విశ్లేషణ. కాంగ్రెస్ ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. స్థానిక అంశాలతో పాటు సూక్ష్మపరిశీలనతో ఎన్నికల మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టడం, సీఎంనూ, కొన్నిచోట్ల అభ్యర్థులనూ మార్చడం కమలనాధులకు కలిసొచ్చింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కనిపించని ఆర్ఎస్ఎస్ ఈసారి ప్రభావం చూపింది. అలాగే, ప్రధాని మోదీ సభలు, మాటలు నాన్ – జాట్ వర్గాలను ఆకర్షించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పూర్తిగా జాట్లు – దళితుల ఓట్బ్యాంక్పైనే అతిగా ఆధారపడి, జాట్లు మినహా మిగతా వర్గాలు, ఓబీసీలు కాషాయఛత్రం కింద ఏకమవుతున్న సంగతి కనిపెట్టలేకపోవడం ఘోర తప్పిదమైంది. కాంగ్రెస్ పక్షాన సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై నెలకొన్న గందరగోళం, గతంలో సాగిన హుడా హయాం పట్ల అసంతృప్తి, ఆయనే మళ్ళీ సీఎం కావచ్చనే అభిప్రాయం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గకుండా ఆపింది. మొత్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1 శాతం కన్నా తక్కువే. అయితే, సీట్ల పరంగా బీజేపీ గణనీయ విజయం సొంతం చేసుకోవడం క్షేత్రస్థాయి వ్యూహ∙ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో ఓట్ల శాతం అంచనా కాస్త అటూ ఇటూగా అంతేవున్నా, వచ్చే సీట్ల సంఖ్యపై అతిగా జోస్యం చెప్పడం ఎదురుతన్నింది. వెరసి, ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వాన్ని అనుమానంలోకీ, నిర్వాహకుల్ని ఆత్మపరిశీలనలోకీ నెట్టాయి. ఆప్, కాంగ్రెస్ గనక కలసి పోటీ చేసివుంటే, ఆ రాష్ట్ర ఫలితాలు కచ్చితంగా మరోలా ఉండేవని ఓట్ షేర్ శాతాన్ని బట్టి విశ్లేషణ. కశ్మీర్లో వాస్తవం గుర్తించి, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పని హర్యానాలో చేయకపోవడమే విడ్డూరం. ఇప్పుడిక రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలపైకి ఫోకస్ మారనుంది. ఇప్పటికే హర్యానా ఫలితానికి కాంగ్రెస్‌ను ఆప్ తప్పుబట్టడం మొదలుపెట్టింది. మరి, ఫిబ్రవరిలోగా జరగనున్న ఢిల్లీ ఎన్నికలకైనా ఈ పార్టీలు జత కడతాయో, లేదో చూడాలి. ఏమైనా, తప్పక గెలుస్తారనుకున్న ఎన్నికల్లో సైతం ఆఖరి క్షణంలో కోరి చేతులారా ఓటమి కొని తెచ్చుకోవడం కాంగేయులకు పరిపాటి అయింది. క్షేత్రస్థాయి లోపాల్ని సరిదిద్దక, పోటీకి ముందే గెలుపు ధీమాతో అతిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఎదురుదెబ్బలు ఖాయమని గుర్తిస్తే మంచిది. -
పాక్ ప్రియురాలి కోసం సరిహద్దులు దాటబోయి..
భుజ్: పాకిస్తాన్‌లోని తన ప్రియురాలిని కలుసుకునేందుకు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ జిల్లా ఖవ్రా గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడ జమ్ముకశ్మీర్‌కు చెందిన 36 ఏళ్ల యువకుడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్లో పరిచయమైన ఓ యువతిని కలుసుకునేందుకు ఆ యువకుడు అక్రమంగా సరిహద్దులు దాటి, పాకిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నించాడు.పోలీసులు నిందితుడిని ఇంతియాజ్ షేక్ ముల్తాన్‌గా గుర్తించారు. అతను బందిపోరా జిల్లా వాసి. ఓ పాకిస్తానీ యువతిని కలుకునేందుకు కచ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి పాక్ వెళ్లేందుకు స్థానికుల నుంచి సహకారం కోరాడు. ఈ ఉదంతం గురించి కచ్ (పశ్చిమ) ఎస్పీ సాగర్ బాగ్మార్ మాట్లాడుతూ ఆ యువకుడు ఆన్లైన్లో పరిచయమైన యువతిని కలుసుకునేందుకు సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు వెళ్లాలనుకున్నాడన్నారు. ఈ నేపధ్యంలోనే తాము అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసులతో అతను చెప్పిన విషయాలను ధృవీకరించాక, అతనితో ఎటువంటి ముప్పులేదని నిర్ధారించాక అతనిని విడుదల చేశామన్నారు.ఆ యువకుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, పాక్‌లోని ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆకర్షితుడయ్యాడన్నారు. గూగుల్ మ్యాప్స్ చూసి, కచ్ నుంచి పాక్ వెళదామనుకుని స్థానికుల సహకారం కోరాడన్నారు. అయితే వారు ఆ యువకునిపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారన్నారు. ఆ తర్వాత ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సాగర్ బాగ్మార్ తెలిపారు.ఇది కూడా చదవండి: Jharkhand: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం -
జమ్మూకశ్మీర్‌లో ముగిసిన రెండో విడత పోలింగ్..
Elections Live Updates..👉జమ్ము కశ్మీర్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.#WATCH | Budgam, J&K: National Conference (NC) MP, Aga Syed Ruhullah Mehdi says, "...We got a good response during campaigning in both phases...We are hopeful of getting better results in this phase..." pic.twitter.com/pPjelXEFIt— ANI (@ANI) September 25, 2024 👉శ్రీనగర్‌లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు, వారిని అడ్డుకున్న స్థానిక ఎన్నికల సిబ్బంది, పోలీసులు. #WATCH | J&K Assembly elections | A delegation of diplomats from various countries visits polling stations across Srinagar to witness the polling process in the second phase. Visuals from a polling station at S.P. College, Chinar Bagh - the fourth polling station that they have… pic.twitter.com/7QvyEHtrp0— ANI (@ANI) September 25, 2024👉ఉదయం 11 గంటల వరకు 24.10 శాతం పోలింగ్ నమోదైంది. 👉 ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు.J&K Assembly elections | Voters in queues at a polling station in Ganderbal Assembly constituency.JKNC vice president Omar Abdullah is contesting from here, facing a contest from PDP's Bashir Ahmad Mir.(Pics Source: ECI) pic.twitter.com/8rvH7Pl1eK— ANI (@ANI) September 25, 2024 👉పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు #WATCH | Ganderbal, J&K: People queue up at a polling station in Kangan Assembly constituency to vote in the second phase of the Assembly elections today.Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/aBe1JqvPmh— ANI (@ANI) September 25, 2024 👉ఓటు వేసేందుకు బారులు తీరిన జనం.. #WATCH | J&K Assembly elections | Long queues of voters at a polling station in Reasi constituency, as polling gets underway. Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today.BJP has fielded Kuldeep Raj Dubey who faces a… pic.twitter.com/mQUSpBFbkf— ANI (@ANI) September 25, 2024 #WATCH | J&K: People queue up at a polling station in Srinagar to vote in the second phase of the Assembly elections today. Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/iSUrcqZEvV— ANI (@ANI) September 25, 2024 👉ఓటర్లకు మోదీ సందేశం..అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో తమ వంతు బాధ్యతగా ఓటు వేయండి. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి కంగ్రాట్స్. Prime Minister Narendra Modi tweets, "Today is the second phase of voting for the assembly elections in Jammu and Kashmir. I appeal to all voters to cast their vote and play their important role in strengthening democracy. On this occasion, I congratulate all the young friends… pic.twitter.com/zdr03sCFgL— ANI (@ANI) September 25, 2024 👉వైష్టో దేవీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో నిలుచున్నారు.#WATCH | Katra, J&K | People queue up at a polling station in Shri Mata Vaishno Devi assembly constituency of Katra to vote in the second phase of Assebly elections today. Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/eLzwmfmfqU— ANI (@ANI) September 25, 2024 👉పలువురు బీజేపీ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | J&K Assembly elections: People await their turn to cast vote as voting for the second phase of elections begins. Voting being held in 26 constituencies across six districts of the UT today.Visuals from Govt middle school in Shri Mata Vaishno Devi assembly constituency… pic.twitter.com/lFo17cfqBK— ANI (@ANI) September 25, 2024#WATCH | J&K Assembly elections: People queue up outside a polling station in Balhama, Srinagar to vote as polling for the second phase of elections begins. Voting being held in 26 constituencies across six districts of the UT today. pic.twitter.com/q5wxemTJ5B— ANI (@ANI) September 25, 2024 #WATCH | Katra, J&K | BJP candidate from Shri Mata Vaishno Devi assembly constituency, Baldev Raj Sharma casts his vote. pic.twitter.com/Zx4QDQemfA— ANI (@ANI) September 25, 2024👉బీజేపీ చీఫ్ రవీందర్ రైనా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీ విజయం సాధిస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మా పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. నేను పార్టీలో ఒక సాధారణ కార్యకర్తను మాత్రమే. నేషన్ ఫస్ట్ అనే భావనతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మోదీ, అమిత్ షా కృషితో రికార్డు స్థాయిలో ఓటింగ్ చూస్తారు. #WATCH | Nowshera, J&K: When asked if he would be the CM if BJP wins, J&K BJP chief and Nowshera candidate Ravinder Raina says, "BJP should register a thumping majority in J&K and the party should form the government. Anyone could be the CM...I am an ordinary worker of the party… pic.twitter.com/UJWUzOVCne— ANI (@ANI) September 25, 2024 👉జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడతలో 26 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 👉26 నియోజకవర్గ 239 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. దాదాపు 25 లక్షల మంది ఓటర్లు రెండో విడతలో ఓటు వేయనున్నారు. Voting for the second phase of Assembly elections in Jammu & Kashmir begins. Eligible voters across 26 constituencies in six districts of the UT are casting their vote today. 239 candidates, including National Conference vice president Omar Abdullah, are in fray in today’s… pic.twitter.com/gGGQhkdG1V— ANI (@ANI) September 25, 2024 👉సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో కశ్మీర్ లోయలో మూడు జిల్లాల్లో, జమ్మూ డివిజన్లో మూడు జిల్లాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.👉పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పారు.👉ఈ దఫాలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కరా, బీజేపీ జమ్ము కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనాలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఒమర్ ఈసారి గందేర్బల్, బుద్గామ్ చోట్ల నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. -
స్వర్గానికి కొంచెమే తక్కువ... ఎలా చేరుకోవాలో తెలుసా?
కాంచన్‌జంగ... మనదేశంలో ఎత్తైన శిఖరం. ప్రపంచ శిఖరాల జాబితాలో మూడవస్థానం. తొలిస్థానంలో ఎవరెస్టు ఉంటే రెండో స్థానంలో కేటూ ఉంది. కేటూ శిఖరం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పరిధిలో ఉండడంతో మనదేశంలో తొలి ఎత్తైన శిఖరం రికార్డు కాంచన్జంగకు వచ్చింది. ప్రపంచంలో అద్భుతంగా విస్తరించిన అరుదైన నేషనల్ పార్కుల్లో కూడా కాంచన్‌జంగ నేషనల్ పార్కుది ప్రత్యేకమైన స్థానం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది విదేశీ ట్రెకర్లను ఆకర్షిస్తున్న కాంచన్‌జంగ నేషనల్పార్కు, పర్వత శిఖరాలను వరల్డ్ టూరిజమ్ డే (27, సెప్టెంబర్) సందర్భంగా మనమూ చుట్టి వద్దాం...స్వర్గానికి కొంచెమే తక్కువపక్షులు, జంతువులు, పర్వతసానువులు, మంచు శిఖరాలను సంతృప్తిగా వీక్షించాలంటే ట్రెకింగ్‌ను మించినది లేదు. కంచన్‌జంగ నేషనల్ పార్కు, పర్వత శిఖరాలకు ట్రెకింగ్ చేయాలనుకునేవాళ్లకు దారులు పెంచింది సిక్కిం రాష్ట్రం. ట్రెకింగ్‌లో త్వరగా గమ్యాన్ని చేరాలని హడావుడిగా నడిచే వాళ్లు తమ చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించలేరు. ప్రశాంతంగా అడుగులు వేస్తూ సరస్సులు, హిమనీ నదాలు, రోడోడెండ్రాన్ పూల చెట్లు, ఓక్ చెట్లు, ఔషధవృక్షాలను మెదడులో ముద్రించుకోవాలి. ఎప్పుడు కంటికి కనిపిస్తాయో తెలియని కస్తూరి జింక, మేక జాతికి చెందిన హిమాలయ తార్, అడవి కుక్కలు, హిమాలయాల్లో మాత్రమే కనిపించే నీలం గొర్రెలు, మంచు చిరుత, ఎర్రటిపాండా, నల్ల ఎలుగుబంటి, టిబెట్ గాడిదల కోసం కళ్లను విప్పార్చి శోధించాలి. కాంచన్‌జంగ నేషనల్పార్క్ ట్రెకింగ్‌లో కాళ్ల కింద నేలను చూసుకోవడంతోపాటు అప్పుడప్పుడూ తలపైకెత్తి కూడా చూస్తుండాలి. తలదించుకుని ముందుకు΄ోతే పక్షులను మిస్సవుతాం. పక్షిజాతులు 500కు పైగా ఉంటాయి. వాటిని గుర్తించడం కూడా కష్టమే. ఆకుపచ్చరంగులో మెరిసే రెక్కలతో ఏషియన్ ఎమరాల్డ్కూ వంటి అరుదైన పక్షులు కనువిందు చేస్తాయి. కాంచన్‌జంగ పర్వత శిఖరాన్ని చేరడానికి మౌంటనియరింగ్లో శిక్షణ ఉండాలి. ట్రెకింగ్ చేయడానికి సాధారణం కంటే ఒక మోస్తరు ఎక్కువ ఫిట్నెస్ ఉంటే చాలు.నదం నదవుతుంది!కశ్మీర్లో చలికి గడ్డకట్టిన దాల్ లేక్‌ను చూస్తాం. కంచన్‌జంగ టూర్లో జెమూ గ్లేసియర్‌ను తప్పకుండా చూడాలి. ఈ హిమానీనదం దాదాపుపాతిక కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మంచులా బిగుసుకుపోయిన నీరు రాతికంటే గట్టిగా తగులుతుంది. ఎండాకాలంలో కరిగి నీరయి ప్రవహిస్తూ అనేక ఇతర నదులకు చేరుతుంది. తీస్తా నదికి కూడా ఈ గ్లేసియరే ఆధారం.శిఖరాలను చూడవచ్చు!హిమాలయాలను ఏరియల్ వ్యూలో చూడడానికి విమాన ప్రయాణంలోనే సాధ్యం. కంచన్ జంగ నేషనల్ పార్కుకు చేరాలంటే సిలిగురి, బాగ్డోగ్రా ఎయిర్΄ోర్టు నుంచి 220కిమీల దూరం ప్రయాణించాలి. ఈ దూరం రోడ్డు మార్గాన వెళ్ల వచ్చు లేదా హెలికాప్టర్లో 20 నిమిషాల ప్రయాణం. రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వాళ్లు జల్పాయ్గురిలో దిగాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. పరిసరాలను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రైలు, రోడ్డు ప్రయాణాలు బెస్ట్. ఒకవైపు ఫ్లయిట్ జర్నీ, మరో వైపు ట్రైన్ జర్నీప్లాన్ చేసుకుంటే టూర్ పరిపూర్ణమవుతుంది. ఇక్కడ పర్యటించడానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. మనదేశంలో సింగిల్ యూజ్ ప్లాలాస్టిక్ని నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం. పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనుషులను, లగేజ్‌ని సోదా చేసి ప్లాస్టిక్ వస్తువులను బయటవేస్తారు. -
కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డా
న్యూఢిల్లీ: కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డానంటూ యూపీఏ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ‘ఫైవ్ డికేడ్స్ ఆఫ్ పాలిటిక్స్’అనే పేరుతో తన ఆత్మకథను షిండే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పట్లో జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ‘హోం మంత్రి కాకమునుపు కశ్మీర్‌కు చాలాసార్లు వెళ్లాను. నా స్నేహితుడు, విద్యావేత్త విజయ్ ధార్ ఇంటికి అప్పట్లో వెళ్లేవాణ్ని.మంత్రి నయ్యాక మాత్రం ‘శ్రీనగర్‌లో దాల్ సరస్సును చూడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగు. అంతేతప్ప, మిగతా చోట్లకు మాత్రం వెళ్లకు అని విజయ్ సలహా ఇచ్చాడు. దీంతో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రినే అయినప్పటికీ కశ్మీర్ వెళ్లడానికి మాత్రం భయపడ్డా’అని చెప్పారు. ‘స్వయంగా హోం మంత్రిని అయిన నేను ఈ విషయం ఎవరికి చెప్పుకోను? ఇప్పుడెందుకు చెబుతున్నానంటే..కేవలం నవ్వుకోడానికి మాత్రమే. మాజీ హోం మంత్రి ఇలాంటి వాటిపై మాట్లాడకూడదు’అని షిండే చెప్పారు.మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2012–14 సంవత్సరాల్లో షిండే హోం మంత్రిగా ఉన్నారు. షిండే వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రే కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డారు. మోదీ హయాంలో మాత్రం ఏటా 2–3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్‌ను సందర్శిస్తున్నారు. రెండు పార్టీల ప్రభుత్వాలకీ ఉన్న ముఖ్యమైన తేడా ఇదే’అని ఆయన పేర్కొన్నారు. -
మెహబూబా వారసురాలు...కంచుకోటను నిలబెట్టేనా?
కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్‌బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది. మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్‌కు బిజ్బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్‌ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్‌కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్‌పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్‌నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.ఎన్సీ ప్రత్యేక దృష్టి పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్‌గనీ షా 1977–1990 దాకా బిజ్‌బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్సీ ఇక్కడ బషీర్నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్‌ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్‌ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మధ్య కుదిరిన పొత్తు
శ్రీనగర్ : అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్లో పొత్తు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో జరగనున్న 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.ఈ తరుణంలో పొత్తుపై ఇరు పార్టీల నేతలు స్పందించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనుందని తెలుస్తోంది. ఈ పొత్తు సంతోషకరం. ఇక్కడ ప్రజలను విభజించి పాలించాలని ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా మేం ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తాం. కశ్మీర్లో ఇండియా కూటమి దేశాన్ని మతతత్వం, విభజించడం, విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులతో పోరాడుతుంది’ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఇక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరినా.. సీట్ల పంపకాల విషయంలో విబేధాలు తలెత్తాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ట్రబుల్ షూటర్లుగా కేసీ వేణుగోపాల్,సల్మాన్ ఖుర్షీద్‌లను శ్రీనగర్‌కు పంపింది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు సీనియర్ల రాక, ఆపై మంతనాలు.. వెరసి తొలి విడత ఎన్నికల నామిషన్ల దాఖలు ప్రక్రియకు ఒక రోజు ముందే పొత్తు కుదిరిందని కేసీ వేణుగోపాల్ చెప్పారు.ఇరు పార్టీల మధ్య చర్చలు పూర్తయియ్యాయి. ఈ ఎన్నికల్లో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాం. జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం’ అని వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. Attended @INCIndia-@JKNC_ joint press conference along with AICC GS-Org Shri @kcvenugopalmp ji and NC President Jenab Farooq Abdullah sahib as formal declaration of our pre-poll alliance. Together, we will sweep the upcoming assembly election in #JammuKashmir. pic.twitter.com/TVeXkr6GS1— Bharat Solanki (@BharatSolankee) August 26, 2024 -
జమ్ము కశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ కెప్టెన్ మృతిచెందగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతాబలగాలకు అందిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు అస్సార్ నది ఒడ్డున దాక్కున్నారు. ఈ నేపధ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది. నిర్దిష్ట సమాచారం అందిన దరిమిలా పాట్నిటాప్ సమీపంలోని అకర్ ఫారెస్ట్‌లో భారత సైన్యం, జేకేపీ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని పేర్కొంది. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు ఆర్మీ పేర్కొంది.ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బారాముల్లాలో భద్రతను గణనీయంగా పెంచారు. సీనియర్ అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాగా జమ్ముకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై చర్యలు చేప్టటేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా సంస్థల అధిపతులు పాల్గొననున్నారు. *Op ASSAR* Based on specific intelligence inputs, a joint operation by #IndianArmy and #JKP was launched in Akar Forest near Patnitop.Contact has been established with the terrorists and operations are in progress.@adgpi@NorthernComd_IA@JmuKmrPolice pic.twitter.com/j967WkaHFA— White Knight Corps (@Whiteknight_IA) August 13, 2024 -
కాశ్మీర్‌లోయలో కుండపోత.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లాలో ఆదివారం(ఆగస్టు4) కుండపోత(క్లౌడ్‌బర్స్ట్) వర్షం కురిసింది. దీంతో శ్రీనగర్-లేహ్ జాతీయరహదారికి దారి తీసే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్- లేహ్ జాతీయరహదారిపైనా ట్రాఫిక్‌ను రద్దు చేయడంతో బల్టాల్ వద్ద అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన ఆకస్మిక వరదల కారణంగా పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు తాజాగా ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం ఆప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ జవాను గాయపడ్డారు.ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా సరిహద్దు జిల్లా లోలాబ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.కుప్వారాలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిర్దిష్ట ఇన్పుట్ల ఆధారంగా భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. తాజాగా భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. లోలాబ్‌లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీని ఆధారంగా కుప్వారా పోలీసులు ఆర్మీకి చెందిన 28, 22 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. Chinar Corps, Indian Army tweets, "Based on specific input regarding presence of terrorists in general area Kowut, Kupwara, a Joint Search Operation was launched by Indian Army and J&K Police on days leading upto 23 July 24. On 24 July, suspicious movement was observed and… pic.twitter.com/nxZHyajCOv— ANI (@ANI) July 24, 2024 -
జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) విడుదల చేసిన సమాచారం ప్రకారం జమ్ము కాశ్మీర్లో శనివారం సాయంత్రం 5.34 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అయితే దీని కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.జమ్ముకాశ్మీర్‌లో సంభవించే తేలికపాటి భూకపాలు కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం కిష్త్వార్ ప్రాంతంలో ఉందని అధికారులు తెలిపారు. భూమికి 10 కి.మీ లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కశ్మీర్ లోయ కూడా ఒకటి. గతంలో ప్రకృతి ప్రకోపానికి ఈ ప్రాంతం బలయ్యింది.2005లో కశ్మీర్ లోయలో సంభవించిన భూకంపాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేదు. ఆ ఏడాది అక్టోబర్ 8న ఇక్కడ బలమైన భూకంపం వచ్చింది. దీని ప్రభావానికి 69 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 75 వేల మంది గాయపడ్డారు. నాడు భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. -
అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే ఇలా!
టీమిండియాలోకి ఎంత ‘వేగం’గా దూసుకువచ్చాడో.. అంతే త్వరగా జట్టుకు దూరమయ్యాడు కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.అత్యంత వేగంగా బంతులు విసురుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం వన్డేల్లోనూ అడుగుపెట్టాడు ఈ స్పీడ్‌గన్. అయితే, నిలకడలేమి ప్రదర్శన కారణంగా మేనేజ్మెంట్ నమ్మకం పోగొట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. చివరగా గతేడాది వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో ఆడాడు.ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఉమ్రాన్ మాలిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు కెప్టెన్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. అందుకే జట్టుకు దూరమైపోయాడని పేర్కొన్నాడు.కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు‘‘మనలోని ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి. ఓ బౌలర్ ఎక్స్‌ప్రెస్ పేస్ కలిగి ఉండటం అరుదైన అంశం. అతడి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.అతడు గంటకు 145- 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినపుడు.. అంతకంటే వేగంగా బంతులు విసరగలడని భావించాం. కానీ అలా జరుగలేదు.కానీ తన బౌలింగ్‌లోని పేస్ మాత్రమే తన బలం. అంతేగానీ బౌల్ చేసేటపుడు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీ20లలో పూర్తి కంట్రోల్ ఉండాలి.అందులో విఫలమైతే కచ్చితంగా కష్టాలు మొదలవుతాయి. బ్యాటర్ బాల్‌ను బాదుతూ ఉంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. అలాంటపుడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం.రంజీలు ఆడమని పంపించాంఅతడికి బౌలింగ్‌పై పూర్తి నియంత్రణ రావాలనే ఉద్దేశంతోనే రంజీలు ఆడమని పంపించాం. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ కచ్చితంగా నైపుణ్యాలు ప్రదర్శించగలగాలి’’ అని పారస్ మాంబ్రే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించాడు.కాగా ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎనిమిది టీ20లు, పది వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. -
ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే!
కశ్మీర్ వేర్పాటు వాదుల తీవ్రవాద చర్యలను సమర్థిస్తూ, భారత సైన్యంపై విషం కక్కుతూ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు 14 సంవత్సరాల క్రిందటివి. 2010 అక్టోబర్ 21న దేశ రాజధాని నగరం ఢిల్లీలో ‘ఆజాది ఓన్లీ ద వే’ అనే అంశంపై కశ్మీరీ వేర్పాటు వాదులు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కశ్మీర్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్, రచయిత్రి అరుంధతీ రాయ్ భారత సైన్యానికీ, భారత ప్రభుత్వానికీ వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్ర పరిధిని అతిక్రమించాయనే చెప్పాలి. దేశభద్రతపై ఆ వ్యాఖ్యలు చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఫిర్యాదు మేరకు ‘ఉపా’ కింద 2010 అక్టోబర్ 28న ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. లౌకికవాద ముసుగు వేసుకున్న కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు కశ్మీర్ వేర్పాటువాదుల వాదనలకు వ్యతిరేకంగా విచారణ చేస్తే... ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందో అనే భీతితో ఆ కేసును తొక్కి పట్టారు. వాస్తవంగా దేశ భద్రతతో ముడిపడిన ఈ విషయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించి ఉండాలి. 14 ఏళ్లు ఆ కేసుపై విచారణ జరగకుండా తాత్సారం చేయడం దేశాన్ని ప్రేమించే వాళ్లకు మాత్రమే ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ భద్రత విషయంలో కఠిన వైఖరి అవలంబించే మోదీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ కేసును విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేయడానికి కారణాలనూ దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలదే! అనూహ్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కేసు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు సవాల్‌గా మారిన తీవ్రవాదులకు అనుకూలంగా గళం విప్పిన వాళ్ళ పని పట్టడానికి మూడోసారి అధికారంలో కూర్చున్న మోదీ∙ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందని ముందస్తు సమాచారం ఇవ్వడంలో భాగంగానే ఈ ‘ఉపా’ కేసును తెరపైకి తెచ్చేలా కేంద్రం చేసిందా అనే అనుమానం దేశ ప్రజలకు కలగక మానదు.‘ఆజాదీ ఓన్లీ ద వే’ కాన్ఫరెన్స్‌లో అరుంధతీ రాయ్ మాట్లాడిన మాటలను, ఆమె ఉద్దేశాలను ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఎవరిది? కశ్మీర్ స్వతంత్ర దేశమనీ, దాన్ని భారత ప్రభుత్వం దౌర్జన్యంగా ఆక్రమించిందనీ, కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా బతికే హక్కు ఉందనీ, ఈ హక్కు కోసం భారత సైన్యంతో పోరాడే కశ్మీరు వేర్పాటు వాదులు తన సోదరులనీ, ఈ పోరాటంలో భారత సైన్యానికి ఎదురొడ్డి నిలవడం సమర్థనీయమనీ ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలకు తెలియనీయకుండా కనుమరుగు చేసింది ఎవరు?స్వాతంత్య్రానంతరం 562 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనట్లే జమ్మూ–కశ్మీర్ సంస్థానం రాజు ‘రాజా హరి సింగ్’ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని, జమ్మూ–కశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. నిజానికి పాకిస్తానే 1948లో కశ్మీర్లో మూడో వంతును ఆక్రమించింది. దాన్ని ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి కశ్మీర్లో పాక్ వెన్నుదన్నుతో తీవ్రవాదులు చేసిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం ముక్కలు కావాలని ఎవరు కోరినా క్షమించరాని నేరమే అవుతుంది. – ఉల్లి బాలరంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
ఏది వాస్తవ చరిత్ర?
జూన్ 27న ‘వాస్తవ చరిత్రతోనే మెరుగైన భవిత’ అని డా. కత్తి పద్మారావుగారు రాసిన వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయానికి అభ్యంతరం లేదు. కాని వాస్తవ చరిత్ర ఏదన్నదే అసలైన చిక్కు. నాలుగు దశాబ్దాల నాడు వచ్చిన ఒక తెలుగు సినిమాలో రావుగోపాలరావు పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ ‘చరిత్ర అడక్కు... చెప్పింది విను’ అనే దాన్ని ఆయన తన వ్యాసం ద్వారా మరోమారు చెప్పారు. డీ.డీ. కోశాంబి, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్రలు చెప్పిందే చరిత్రగా అంగీకరించి తీరాలా! అంతకన్నా భిన్నమైన చరిత్ర ఉందని కొత్త పరిశోధన ద్వారా బయటకు తీసుకురాకూడదా?ఒక సబ్జెక్టులో ఒకరి కన్నా ఎక్కువ మంది రాసిన పుస్తకాలు ఉంటాయి. వాటిలో దేనినైనా చదువుకోవచ్చు. కాని చరిత్రలో మాత్రం నియంతృత్వ పోకడగా రొమిల్లా, బిపిన్ చంద్రల పుస్తకాలు దాటి చదవటానికి వీలు లేదనడం సబబేనా? ఈ రచయితలు భారతీయ చరిత్రకు ఒక రంగు పులిమారు. ఆ రంగును పలుచన చెయ్యటాన్ని అంగీకరించం అంటారు వారి శిష్యులు. వివాదాస్పద కట్టడం కూల్చివేత చిన్న విషయం కాదన్నారాయన. ఆ కూల్చివేత వెనుక హిందూ రాజ్య నిర్మాణ భావన ఉందని తీర్మానించారు. అయితే జమ్మూ–కశ్మీర్, కాశీ, మధురల్లో దేవాలయాలు ధ్వంసమవ్వడం చారిత్రక వాస్తవమే కదా! ఆ ధ్వంసం వెనుకనున్న భావన ఏమిటో కూడా పిల్లలకు తెలియాలి కదా!ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి చరిత్ర పుస్తకాలలో మత ఘర్షణల గురించి చెప్పిన అధ్యాయంలో ఏమి రాశారో ఆయన చదివారా? అందులో గుజరాత్లో జరిగినవి, అయోధ్య నేపథ్యంలో జరిగినవి మాత్రమే ఉన్నాయి. నవీన భారత చరిత్రలో ఆ రెండు సందర్భాలలో తప్పించి మరెన్నడూ మత కల్లోలాలు జరగలేదన్నది యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ వంటి రచయితలు భావిస్తుంటే అంతకన్నా హాస్యాస్పదం ఏదీ ఉండదు.కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి, ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సిక్కుల ఊచకోత గురించి కూడా వీరు ప్రస్తావించి ఉంటే అది వాస్తవ చరిత్ర అయి ఉండేది. కొన్నింటిని కప్పిపుచ్చి, మరికొన్నింటిని కొందరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వివరంగా రాస్తామంటే అది వాస్తవ చరిత్ర కానేకాదు. రైతు ఉద్యమాల గురించి రాసినప్పుడు, 2018లో నాసిక్ నుండి ముంబైకి, ఆ తర్వాత పంజాబ్ నుండి ఢిల్లీకి జరిగిన రైతాంగ ఊరేగింపుల గురించే రాస్తామంటే ఎలా!ఆంధ్రాలో జరిగిన ఎన్జీ రంగా ఆధ్వర్యంలో పలాస నుండి చెన్నపట్నంకి జరిగిన రైతు యాత్ర గురించి రాయం అంటే ఎలా! ‘దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరగనున్నాయి’ అనడాన్ని అంతా స్వాగతించాల్సినదే. అయితే భారతీయులందరికీ వర్తించే లౌకిక చట్టాలు లేకుండా లౌకికవాదం ఎలా పెరుగుతుంది? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అమలు చెయ్యకుండా రాజ్యాంగ స్ఫూర్తి ఎలా వస్తుంది?ఏ వర్గానికి చెందినవైనా చరిత్రలోని మంచి చెడులు చెబితేనే అది వాస్తవ చరిత్ర. ముఖ్యమైనవి, విద్యార్థులకు అంతగా అవసరం లేని అంశాలు పుస్తకాల నుండి తొలగించటం అన్ని సబ్జెక్టులలో జరుగుతుంది. చరిత్ర పుస్తకాల్లోనూ జరిగింది. విద్యార్థులకు మేలు చేసిన అంశం మీద అనవసరపు రాద్ధాంతం ఎందుకు? – డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, 9440421695 -
కశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తిన పాక్.. ఖండించిన భారత్
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై మరోమారు జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై వెంటనే స్పందించిన భారత్ జమ్ముకశ్మీర్‌పై పాక్ నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నదని విమర్శించింది. ఆ దేశంలో జరుగుతున్న పలు ఉల్లంఘనల నుండి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలా చేస్తున్నదని భారత్ తెలిపింది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు, సాయుధ పోరాటాలపై బహిరంగ చర్చ జరిగింది. దీనిలో భారత ఉప ప్రతినిధి ఆర్ రవీంద్ర మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమన్నారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఒక ప్రతినిధి చేసిన రాజకీయ ప్రేరేపిత, నిరాధారమైన వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.వారి దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నుంచి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ ప్రతినిధి జమ్ముకశ్మీర్ గురించి ప్రస్తావించిన తర్వాత ఆర్ రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. -
కశ్మీర్లో మిస్టర్ బచ్చన్
కశ్మీర్లో మెలోడీ డ్యూయెట్ పాడుతున్నాడు మిస్టర్ బచ్చన్ . రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్ ’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ వ్యాలీలో జరుగుతోంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.‘‘నాలుగు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారంతో ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. విజువల్ ఫీస్ట్‌గా ఉంటూనే ఎమోషనల్ ఎలిమెంట్‌తో ఈ సాంగ్ ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ తొంభై శాతం పూర్తయింది. మిగతా భాగాన్ని త్వరగా చిత్రీకరించేలా శరవేగంగా పని చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్ ఫిల్మ్ అజయ్ దేవగన్ ‘రైడ్ ’(2018)కు తెలుగు రీమేక్‌గా ‘మిస్టర్ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. -
వాక్ స్వాతంత్య్రంపై విచారణా?
కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు ఆరోపణలు వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత ‘ఉపా’ చట్టం కింద అరుంధతీ రాయ్‌ని విచారించేందుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. భారత్‌లో విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. అందుకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ, అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. నేడు మనం విశ్వ గురువులమని చెప్పుకొంటున్నప్పుడు అరుంధతీ రాయ్ పట్ల ఈ నిర్దయాపూరితమైన వ్యవహారశైలి మన గురించిన బాధాకరమైన సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా?మహాత్మా గాంధీ, అందునా మన జాతిపిత... ఆయన చెప్పిన విషయాలను మనం ఎంత తరచుగా గుర్తు చేసుకుంటున్నాం? అంతకన్నా కూడా ఎంత తరచుగా మన ప్రభుత్వాలు ఆయన ఆకాంక్షలకు కట్టుబడి ఉంటున్నాయి? ఇదేమీ అలంకారిక ప్రశ్న కాదని మీరు తొందరలోనే గ్రహిస్తారు. నిజానికి, మనకింకా మనస్సాక్షి అన్నది మిగిలి ఉంటే బహుశా అదొక ఇబ్బందికరమైన మనోస్థితి కావచ్చు!1922 మార్చి 18న ‘యంగ్ ఇండియా’ పత్రికలో... ప్రభుత్వాలకు, మన పైన అధికారం కలిగి ఉన్న వారికి తన వైఖరి ఏమిటో గాంధీ వివరించారు. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అని రాశారు. ‘‘ఒక వ్యక్తికి – ఆ వ్యక్తి హింసను తలవనంత వరకు, హింసను ప్రోత్సహించనంత వరకు, లేదా హింసను ప్రేరేపించనంత వరకు – తన అయిష్టతను పూర్తిగా వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఉండాలి’’ అన్నారు. మన ప్రభుత్వం శిలాక్షరాలుగా చెక్కించి ప్రతి ఒక్క మంత్రి కార్యాలయంలో ప్రముఖంగా కనిపించేలా ఉంచాల్సిన మాటలివి. ఆ మాటలు ఈ కాలానికీ ఎందుకు సరిపోతాయో వివరిస్తాను. కశ్మీర్ అన్నది భారతదేశంలో ‘అంతర్భాగమా’ అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ఆరోపణలపై ‘ఉపా’ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక) చట్టం కింద అరుంధతీ రాయ్‌ని విచారించేందుకు తాజాగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు – ఇందులో సుదీర్ఘమైన పదేళ్ల కాలం మోదీ ప్రభుత్వంలోనిది – ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవటం, లేదా తీసుకోవటం అవసరమని భావించకపోవటం అనే వాస్తవం ఎన్నో విషయాలను చెబుతోంది. ‘ఇప్పుడు ఎందుకు?’ అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. భారతదేశంలో ప్రముఖులు ఒకరు రాష్ట్ర విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. ‘‘ద్రవిడియన్లు స్వయం నిర్ణయాధికారం కోసం డిమాండ్ చేస్తున్నారు... దక్షిణాది రాష్ట్రాలకు మాకు ప్రత్యేక దేశం కావాలి’’ అన్నారు. ఆ మాటకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. ఆయన మాటల్ని దేశ వ్యతిరేకమైనవిగా పరిగణించలేదు. నిజమే, అన్నాదురై అలా కోరటం అభ్యంతరకరం, అవాంఛనీయం కావచ్చు. కానీ ఆరు దశాబ్దాల క్రితమే భారతదేశం ఆన్నాదురై మాటల్ని ఆయన వాక్ స్వాతంత్య్రంలో భాగంగా అంగీకరించింది. ఆ కాలంలోనే వివాదాస్పద ఉద్దేశాన్ని వ్యక్తం చేయటాన్ని సైతం వాక్ స్వాతంత్య్రంలోని ఒక హక్కుగా మనం గుర్తించాం. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అనే గాంధీజీ ప్రసిద్ధ ప్రకటనను గౌరవించాం. ప్రపంచం మనకు ఏదైనా నేర్పించిందీ అంటే అది నేడు మరింత సహనాన్ని, సర్దుబాటును కలిగి ఉండమనే. బ్రిటన్‌లోని స్కాటిష్ జాతీయవాదులు, కెనడాలోని పార్తీ కెబెక్వాలు, లేదా స్పెయిన్‌లోని కెటలాన్‌లు ఆయా దేశాల నుంచి విడిపోవటం కోసం చేసిన వేర్పాటు ఉద్యమాలు గౌరవనీయమైనవిగా, దేశ వ్యతిరేకమైనవి కానివిగా పరిగణన పొందటం అంటే... పరిణతి చెందిన వివేకవంతమైన ప్రజాస్వామ్యాలు అలాంటి వేర్పాటువాద ఉద్యమ పిలుపులను దేశ వ్యతిరేకమైనవిగా చూడకూడదని సూచించటమే కదా? ఎలా మనం వివేచన గల సహనశీలత నుండి అనాలోచితమైన, ఆమోదయోగ్యం కాని అసహనంలోకి జారిపోయాం?అందుకు కారణం... వేర్పాటు గురించి మాట్లాడి, మనల్ని కలవరానికి గురి చేసినవారు అరుంధతీ రాయ్ కావటమేనా? అందుకు కారణం... మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శ చేస్తున్న ఆమె గొంతుక ఎదురులేనిదిగా, నమ్మదగినదిగా ఉండటమేనా? అందుకు కారణం... ఎదుర్కోడానికి మనం ఇష్టపడని సందేహాలను లేవనెత్తటం ద్వారా ఆమె మన మనసు లోతుల్లో లేని పైపై మనశ్శాంతిని హరించటమేనా?అరుంధతీ రాయ్‌ని మన అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ (రష్యా రచయిత)లా భావించాలి కానీ, విస్మృత సోవియెట్ యూనియన్ ఆయన పట్ల ప్రవర్తించిన రీతిలో ఆమె పట్ల మనం ఉండకూడదు. ఆమె మన ఉత్తమ రచయితలలో ఒకరు. ప్రపంచానికి కూడా ఆమె ఇలాగే తెలుసు. మనం నిస్సిగ్గుగా మర్చిపోయిన సల్మాన్ రష్దీ తర్వాత అంతటి ప్రసిద్ధురాలైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్. ఆమె పట్ల ఈ అనాగరిక, అధికార దర్ప, అనాలోచిత ప్రవర్తన... ప్రపంచంలోని అతి పెద్దదైన ప్రజాస్వామ్యానికి, అంతకుమించి ప్రజాస్వామ్యాలకే మాతృమూర్తి అయిన ఇండియాకు చెడ్డ పేరు తెస్తుంది. నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలంటే అంతే. నేడు మనం విశ్వ గురువులమని, దక్షిణార్ధ గోళానికి నాయకులమని, ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తగిన వాళ్లమని చెప్పుకొంటున్నాం. ఇటీవల ప్రధానమంత్రి తను తిరిగి ఎన్నికవటం ‘యావత్ ప్రపంచ ప్రజాస్వామ్య విజయం’ అని అన్నారు. అలాంటప్పుడు అరుంధతీ రాయ్ అభిప్రాయం పట్ల నిర్దయాపూరితమైన వ్యవహార శైలి మన గురించిన బాధాకరమైన, తప్పించుకోలేని సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకై మీరే చెప్పుకొమ్మని వదిలేస్తున్నాను. బదులుగా, నాకు ఎలా అనిపిస్తోందో చెబుతాను. మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలు, పౌరహక్కుల పట్ల జీవితకాలం గర్వంగా గడిపాను. వాటినెవరూ మన నుంచి తస్కరించలేరన్నది సత్యం. ఇందిరాగాంధీ ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకున్న ఉపశమనంలో ఉన్నప్పుడు అవి మన చేతుల్లోంచి జారిపోతాయా? అవును, అరుంధతీ రాయ్‌పై విచారణ తప్పుడు ఫలితంతో ముగిస్తే!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎంగేజ్ విత్ సిటీ..
లామకాన్‌లో సంగీత దినోత్సవం..ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోచిన్నారుల కోసం మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్..ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్ స్టోర్ అందించే రీసైక్లింగ్ పేపర్‌తో తయారు చేసిన షాపింగ్ బ్యాగ్‌పై ‘భూమిని కాపాడే సూపర్‌హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్ స్టోర్‌లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
అరుంధతి రాయ్‌పై ఉపా కేసు
న్యూఢిల్లీ: 2010లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా)’ కింద రచయిత్రి అరుంధతి రాయ్‌పై విచారణ జరపడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీలో 2010 అక్టోబరు 21న ‘ఆజాదీ.. ది ఓన్లీ వే’ పేరిట జరిగిన సదస్సులో అరుంధతి రాయ్, కశీ్మర్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అభియోగం.