శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, స్థానిక పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగతున్నాయి. ఈ ఎదురుకాల్పులల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. డచిగామ్‌లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్ పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం డచిగామ్‌లో టెర్రరిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాల చేతిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ మృతిచెందినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గగన్‌గీర్, గందేర్బల్ సహా పలు ప్రాంతాల్లో దాడులకు సూత్రధారి జునైద్ అని పోలీసులు చెబుతున్నారు. అక్కడ టెర్రరిస్టుల దాడుల కారణంగా సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. ఈ ఎదురుకాల్పుల ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
In the ongoing operation, one terrorist was killed and has been identified as Junaid Ahmed Bhat (LeT, Category A). The said terrorist was involved in civilians killing at Gagangir, Ganderbal and several other terror attacks. Operation continues in the upper reaches of Dachigam by… pic.twitter.com/8JhMfc1qMH
— ANI (@ANI) December 3, 2024
ఈ ఏడాది అక్టోబర్ నెలలో కశ్మీర్‌లో గందేర్‌బల్ జిల్లాలోని గగన్‌గిర్ వద్ద ఓ ప్రైవేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జునైద్ టీమ్ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ వైద్యుడితో పాటు, ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ కార్మికులు గగన్‌గీర్ నుంచి సోనామార్గ్ వరకు చేపడుతున్న జడ్-మోర్హ్ సొరంగం పనుల్లో పాల్గొంటున్న క్రమంలో ఉగ్రదాడి జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment