లోయలో పేట్రేగుతున్న ఉగ్రవాదులు | recent Terror attacks in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

వరుస దాడులకు దిగుతున్న మిలిటెంట్లు

Published Wed, Oct 11 2017 2:49 PM | Last Updated on Wed, Oct 11 2017 2:51 PM

 recent Terror attacks in Jammu and Kashmir

శ్రీనగర్‌ : ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు భారీగా దాడులకు తెగబడ్డారు. భద్రతా బలగాలపై హతమార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల వివరాలు.

  • జూన్‌ 13 : పుల్వామా జిల్లాలోని ట్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పది మంది జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. భధ్రతాబలగాలు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు పరారయ్యారు.
  • జూన్‌ 16 : అనంతనాగ్‌ జిల్లాలోని అచాబల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుమంది పోలీసులు మృతి చెందారు.
  • జూలై 10 : అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతి చెందారు.
  • ఆగస్టు 14 : బుద్గామ్‌ జిల్లాలో స్వతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న భద్రతా దళాలపై మిలిటెంట్లు గ్రెనేడ్లతో దాడి చేశారు. అయితే ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు.
  • ఆగస్టు 27 : పుల్వామా జిల్లాలోని హై సెక్యూరిటీ పోలీస్‌ జోన్‌పై మిలిటెంట్ల దాడి.. ఈ ఘటనలో ఎనిమిది మంది అధికారులు మృతి. ఈ దాడి చేసేంది మేమేని జైషే మహమ్మద్‌ ప్రకటన.
  • సెప్టెంబర్‌ 1 : బద్రతా బలగాలను తీసుకెళ్తున్న వాహనంపై మిలిటెంట్ల దాడి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
  • సెప్టెంబర్‌ 9 : అనంతనాగ్‌ పట్టణంలోని బస్‌స్టాండ్‌ వద్ద మిలిటెంట్ల దాడి. ఈ ఘటనలో ఒక జవాన్‌ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు.
  • సెప్టెంబర్‌ 21 :  బనిహాల్‌ పట్టణంలోని జమ్మూ-శ్రీనగర్‌ హైవే మీద భద్రతా బలగాలపై మిలిటెంట్ల దాడి. కొత్తగా ఉగ్రవాద గ్రూపులలో చేరిన ముగ్గురు యువకులు ఈ దాడికి పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇదే రోజు పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
  • అక్టోబర్‌ 4 : శ్రీనగర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌పై మిలిటెంట్ల దాడి. భధ్రతా బలగాలు మిలిటెంట్లను సమర్థవంతగా ఎదుర్కొన్నాయి. ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement