శ్రీనగర్ : అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్‌లో పొత్తు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లో జరగనున్న 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
ఈ తరుణంలో పొత్తుపై ఇరు పార్టీల నేతలు స్పందించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనుందని తెలుస్తోంది.
ఈ పొత్తు సంతోషకరం. ఇక్కడ ప్రజలను విభజించి పాలించాలని ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా మేం ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తాం. కశ్మీర్‌లో ఇండియా కూటమి దేశాన్ని మతతత్వం, విభజించడం, విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులతో పోరాడుతుంది’ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.
ఇక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరినా.. సీట్ల పంపకాల విషయంలో విబేధాలు తలెత్తాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ట్రబుల్ షూటర్లుగా కేసీ వేణుగోపాల్,సల్మాన్ ఖుర్షీద్‌లను శ్రీనగర్‌కు పంపింది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు సీనియర్ల రాక, ఆపై మంతనాలు.. వెరసి తొలి విడత ఎన్నికల నామిషన్ల దాఖలు ప్రక్రియకు ఒక రోజు ముందే పొత్తు కుదిరిందని కేసీ వేణుగోపాల్ చెప్పారు.
ఇరు పార్టీల మధ్య చర్చలు పూర్తయియ్యాయి. ఈ ఎన్నికల్లో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాం. జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం’ అని వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.
Attended @INCIndia-@JKNC_ joint press conference along with AICC GS-Org Shri @kcvenugopalmp ji and NC President Jenab Farooq Abdullah sahib as formal declaration of our pre-poll alliance. Together, we will sweep the upcoming assembly election in #JammuKashmir. pic.twitter.com/TVeXkr6GS1
— Bharat Solanki (@BharatSolankee) August 26, 2024
Comments
Please login to add a commentAdd a comment