Jammu
-
ఉగ్రవాదుల చొరబాటు కట్టడికి అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ
శ్రీనగర్: జమ్ము ప్రాంతంలోకి సరిహద్దు వెంబడి దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భారత ఆర్మీ అంచనా వేస్తోంది. ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో ఆర్మీ బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులను విజయవంతంగా అంతం చేసిన అనంతరం 10వ పదాతిదళ విభాగానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ విలేఖరులతో మాట్లాడారు. ‘‘పౌరులకు హాని కలిగించే ఉగ్రవాదుల ప్రయత్నాలను ఆర్మీ అడ్డుకుంటుంది. మంగళవారం ఉదయం అఖ్నూర్ సెక్టార్‌లోని ఒక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో 27 గంటల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరుకుంది. అఖ్నూర్ కఠినమైన నిఘాలో ఉంది. ...అఖ్నూర్లో ఉగ్రవాదుల శాశ్వత ఉనికి లేదు. మేము మా గార్డును వదులుకోం. చాలా కాలంగా ఈ ప్రాంతం చొరబాట్లను చూడలేదు. ప్రతి ఏడాది చొరబాటు విధానం మారుతోంది. ముఖ్యంగా చలికాలం సమయంలో మేము కూడా ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో అప్రమత్తంగా ఉన్నాం’’ అని అన్నారు.ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. సరిహద్దుల వెంబడి 50 నుండి 60 మంది ఉగ్రవాదులు ఉన్నారని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. అఖ్నూర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా బలగాలకు లభించిన పెద్ద విజయంగా అభివర్ణించారు.చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
ఆర్మీ కాన్వాయ్‌పై ముష్కరుల కాల్పులు
జమ్మూ: జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వాస్తవాధీన రేఖకు సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ఆర్మీ కాన్వాయ్‌పైకి ఉగ్ర మూకలు కాల్పులకు దిగాయి. బలగాలు అప్రమత్తమై దీటుగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ముష్కరులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన బలగాలు అదనంగా పోలీసులను, ఆర్మీని తరలించి గాలింపు ముమ్మరం చేశారు. ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద ఆయుధం స్వాధీనం చేసుసుకున్నారు. హెలికాప్టర్‌ను రంగంలోకి దించి బలగాలు ఓ భవనం బేస్మెంట్లో ఉగ్రవాదులు దాగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా భారీ పేలుళ్లు, కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు సభ్యుల ముష్కరుల ముఠా ఆదివారం రాత్రి సరిహద్దులు దాటి దొంగచాటుగా దేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అంబులెన్సుకు కనీసం డజను బుల్లెట్లు తగిలాయని చెప్పారు. అంతకుముందు, ఉగ్రవాదులు అస్సన్ ఆలయంలోకి ప్రవేశించి సెల్‌ఫోన్ కోసం అక్కడి వారిని అడిగారు, ఇంతలోనే అటుగా వస్తున్న ఆర్మీ కాన్వాయ్‌ని గమనించి కాల్పులకు దిగారన్నారు. -
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవు
జమ్ము: ఈనెల 31న దీపావళి పండుగను వేడుకగా జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి సెలవులను ప్రకటించాయి. తాజాగా జమ్ము పాఠశాల విద్యా డైరెక్టర్ దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించించారు.దీపావళి సందర్భంగా అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకూ సెలవులను ప్రకటించారు. నవంబర్ 3 ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. నవంబర్ 4న విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ తన అధికారిక వెబ్సైట్లో నోటీసు జారీ చేశారు.దీపావళికి ఆదివారంతో కలుపుకుని ఆరు రోజుల పాటు సెలవు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తిరిగి తమ స్వస్థలానికి వచ్చేందుకు వీలుగా నవంబర్ ఒకటిన సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..! -
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మధ్య కుదిరిన పొత్తు
శ్రీనగర్ : అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్లో పొత్తు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో జరగనున్న 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.ఈ తరుణంలో పొత్తుపై ఇరు పార్టీల నేతలు స్పందించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనుందని తెలుస్తోంది. ఈ పొత్తు సంతోషకరం. ఇక్కడ ప్రజలను విభజించి పాలించాలని ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా మేం ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తాం. కశ్మీర్లో ఇండియా కూటమి దేశాన్ని మతతత్వం, విభజించడం, విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులతో పోరాడుతుంది’ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఇక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరినా.. సీట్ల పంపకాల విషయంలో విబేధాలు తలెత్తాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ట్రబుల్ షూటర్లుగా కేసీ వేణుగోపాల్,సల్మాన్ ఖుర్షీద్‌లను శ్రీనగర్‌కు పంపింది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు సీనియర్ల రాక, ఆపై మంతనాలు.. వెరసి తొలి విడత ఎన్నికల నామిషన్ల దాఖలు ప్రక్రియకు ఒక రోజు ముందే పొత్తు కుదిరిందని కేసీ వేణుగోపాల్ చెప్పారు.ఇరు పార్టీల మధ్య చర్చలు పూర్తయియ్యాయి. ఈ ఎన్నికల్లో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాం. జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం’ అని వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. Attended @INCIndia-@JKNC_ joint press conference along with AICC GS-Org Shri @kcvenugopalmp ji and NC President Jenab Farooq Abdullah sahib as formal declaration of our pre-poll alliance. Together, we will sweep the upcoming assembly election in #JammuKashmir. pic.twitter.com/TVeXkr6GS1— Bharat Solanki (@BharatSolankee) August 26, 2024 -
జమ్ము కశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ కెప్టెన్ మృతిచెందగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతాబలగాలకు అందిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు అస్సార్ నది ఒడ్డున దాక్కున్నారు. ఈ నేపధ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది. నిర్దిష్ట సమాచారం అందిన దరిమిలా పాట్నిటాప్ సమీపంలోని అకర్ ఫారెస్ట్‌లో భారత సైన్యం, జేకేపీ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని పేర్కొంది. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు ఆర్మీ పేర్కొంది.ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బారాముల్లాలో భద్రతను గణనీయంగా పెంచారు. సీనియర్ అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాగా జమ్ముకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై చర్యలు చేప్టటేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా సంస్థల అధిపతులు పాల్గొననున్నారు. *Op ASSAR* Based on specific intelligence inputs, a joint operation by #IndianArmy and #JKP was launched in Akar Forest near Patnitop.Contact has been established with the terrorists and operations are in progress.@adgpi@NorthernComd_IA@JmuKmrPolice pic.twitter.com/j967WkaHFA— White Knight Corps (@Whiteknight_IA) August 13, 2024 -
కుప్వారాలో ఎన్కౌంటర్.. ఒక జవాను వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఐదుగురు భారత సైనికులు గాయపడ్డారు. వారిలో ఒక జవాను వీరమరణం పొందారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండోలతో పాటు, బాట్ టీమ్ స్క్వాడ్లలో అల్-బదర్, తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది.ప్రస్తుతం మచల్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం(నేడు) తెల్లవారుజామున మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌లో ఉన్న సైనికులు అటుగా కొందరు(బ్యాట్ స్క్వాడ్) వెళ్లడాన్ని గమనించారు. వారిని లొంగిపోవాలని కోరారు. దీంతో బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి, పరుగులు తీయడం ప్రారంభించింది. దీంతో భారత సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ నేపధ్యంలో ఐదుగురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక జవాను చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. ఈ ఎన్కౌంటర్లో ఒక బ్యాట్ సభ్యుడు హతమయ్యాడు. అతని మృతదేహం పాక్ సైన్యానికి చెందిన డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్లో పడి ఉంది. -
జమ్ములో ఉగ్ర ఘటనలు.. విద్యాసంస్థల మూసివేత
జమ్ములో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా ఆర్మీ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ నుండి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారు. 27వ తేదీ వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆన్లైన్ మాధ్యమం ద్వారా విద్యార్థులకు బోధన జరగనుంది.జూన్ 9న జమ్ము డివిజన్లోని రియాసీలో శివఖోడి నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత మరిన్ని ఉగ్ర దాడులు చోటుచేసుకున్నాయి. గత బుధవారం జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చారు. అదే సమయంలో ఒక సైనికుడు గాయపడ్డాడు.అంతకుముందు జూలై 24న జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని బట్ సెక్టార్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు వీరమరణం పొందారు. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర ఘటనలను గుర్తించామన్నారు. సాధారణ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం తేదని, మన భద్రతా దళాలు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులందరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు తాజాగా ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం ఆప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ జవాను గాయపడ్డారు.ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా సరిహద్దు జిల్లా లోలాబ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.కుప్వారాలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిర్దిష్ట ఇన్పుట్ల ఆధారంగా భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. తాజాగా భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. లోలాబ్‌లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీని ఆధారంగా కుప్వారా పోలీసులు ఆర్మీకి చెందిన 28, 22 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. Chinar Corps, Indian Army tweets, "Based on specific input regarding presence of terrorists in general area Kowut, Kupwara, a Joint Search Operation was launched by Indian Army and J&K Police on days leading upto 23 July 24. On 24 July, suspicious movement was observed and… pic.twitter.com/nxZHyajCOv— ANI (@ANI) July 24, 2024 -
జమ్మూలో 40 మందికి పైగా పాక్ ఉగ్ర మూకలు.. ఏరివేతలో భద్రతా బలగాలు
భారత్‌లో పాక్ ఉగ్ర మూకల వేట కొనసాగుతోంది. జమ్మూ ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు కేంద్ర నిఘూ వర్గాలు గుర్తించాయి. దీంతో భద్రతా బలగాలు ఉగ్ర మూకల్ని ఏరిపారేసేందుకు కూంబింగ్ ప్రారంభించాయి..పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొందారు. వారి వద్ద అమెరికా తయారు చేసిన ఎం4 కార్బైన్ రైఫిల్స్‌తో పాటు అత్యంత ఆధునిక, అధునాతన ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న బుల్లెట్లను ఉన్నాయని తేలింది. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు యాక్టీవ్‌గా ఉన్నారు. ముఖ్యంగా పర్వతాలు, అడవుల కేంద్రంగా ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. వారి ఏరివేత కోసం ఆర్మీ దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. -
జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) విడుదల చేసిన సమాచారం ప్రకారం జమ్ము కాశ్మీర్లో శనివారం సాయంత్రం 5.34 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అయితే దీని కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.జమ్ముకాశ్మీర్‌లో సంభవించే తేలికపాటి భూకపాలు కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం కిష్త్వార్ ప్రాంతంలో ఉందని అధికారులు తెలిపారు. భూమికి 10 కి.మీ లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కశ్మీర్ లోయ కూడా ఒకటి. గతంలో ప్రకృతి ప్రకోపానికి ఈ ప్రాంతం బలయ్యింది.2005లో కశ్మీర్ లోయలో సంభవించిన భూకంపాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేదు. ఆ ఏడాది అక్టోబర్ 8న ఇక్కడ బలమైన భూకంపం వచ్చింది. దీని ప్రభావానికి 69 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 75 వేల మంది గాయపడ్డారు. నాడు భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. -
ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ములో సైనికుల మోహరింపు
జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో సైనికులను మోహరించారు. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇంటర్ కమాండ్‌లో మార్పులు చేశారు. కథువా, సాంబా, దోడా, బదర్వా, కిష్త్వార్లలో సైనికుల సంఖ్యను మరింతగా పెంచారు. వెస్ట్రన్ కమాండ్ నుండి కూడా ఇక్కడకు సైనికులను పంపారు.గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన సాయుధ ఉగ్రవాదులతో జరిగిన భీకర ఎన్కౌంటర్లో కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. మూడు వారాల్లో జమ్మూ ప్రాంతంలో ఇది మూడో అతిపెద్ద ఉగ్రవాద ఘటన. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. అంతేసంఖ్యలో సైనిక సిబ్బంది గాయపడ్డారు.అంతకుముందు జూలై 9న కిష్త్వార్ జిల్లా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఉగ్రవాదులు పారిపోయారు. జూన్ 26న గండో ప్రాంతంలో ఒక రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదేవిధంగా జూన్ 12న జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడటంతో దోడాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరం చేశారు.గండోలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక పోలీసు గాయపడ్డాడు. 2005- 2021 మధ్య భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తర్వాత జమ్ము ప్రాంతం సాపేక్షంగా శాంతియుతంగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో గత నెల నుంచి ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. -
జమ్ముకశ్మీర్‌లో నాల్గవరోజూ ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్కౌంటర్ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు. -
జేకేలో అమరులైన కెప్టెన్, జవాన్లు వీరే
జమ్ముకశ్మీర్‌లో మరోసారి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఉదంతం చోటుచేసుకుంది. దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో భారత ఆర్మీకి చెందిన ఒక కెప్టెన్, నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దట్టమైన అడవుల మధ్య సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.ఉగ్రవాదులు సైనికులపై దాడికి తలపడగా నలుగురు వీర జవాన్లు అమరులయ్యారు. ఈ అమరుల పేర్లను సైన్యం విడుదల చేసింది. భారత ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందారు. థాపా రెండవ తరం ఆర్మీ అధికారి. అతని తండ్రి కల్నల్ భువనేష్ థాపా ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. సోదరి నేపాలీ గాయని. థాపా సిలిగురిలో నివసిస్తున్నారు. ఆయన 2019లో భారత సైన్యంలో చేరారు. ఆయనతో పాటు జవాను నాయక్ డి రాజేష్, కానిస్టేబుళ్లు, బిజేంద్ర, అజయ్ అమరులైనవారిలో ఉన్నారు.దోడాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ఆర్మీ అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అంతకంతకూ పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్‌తో మాట్లాడి తాజాగా జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఆర్మీ చీఫ్‌కు రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. -
అమర్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు
జమ్ముకశ్మీర్‌లో ప్రతీయేటా జరిగే అమర్నాథ్యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తారు. మహాశివుని నామస్మరణలతో జరుగుతున్న యాత్రలో రెండవ రోజున (ఆదివారం) సుమారు 14,717 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 28 వేల మంది అమరనాథుని దర్శనం చేసుకున్నారు.అమర్నాథ్ యాత్ర చేసేందుకు తాజాగా పహల్గావ్, బాల్టల్‌ల నుంచి రెండవ బృందం బయలుదేరింది. మొత్తం 309 వాహనాలలో బాల్టన్ మార్గంలో 2,106 మంది పురుషులు, 11 మంది పిల్లలు, 115 మంది సాధువులు, 41 మంది సాధ్విలు యాత్రకు బయలుదేరారు. ఈ మార్గంలో స్థానికులు యాత్రికులకు స్వాగతం పలికారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు అమర్నాథ్ యాత్రకు వెళుతున్న భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు.శ్రీనగర్‌లోని వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై మొదటివారం నుంచి వర్షాలు కురియనున్నాయి. 25వ సారి అమర్నాథ్ యాత్ర చేస్తున్న కృష్ణకుమార్ మీడియాతో మాట్లాడుతూ గతంలోకన్నా ప్రస్తుతం ఏర్భాట్లు బాగున్నాయని అన్నారు. తాను కోవిడ్ సమయంలోనూ హెలికాప్టర్లో అమర్నాథ్ యాత్ర చేసుకున్నానని తెలిపారు. -
కశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తిన పాక్.. ఖండించిన భారత్
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై మరోమారు జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై వెంటనే స్పందించిన భారత్ జమ్ముకశ్మీర్‌పై పాక్ నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నదని విమర్శించింది. ఆ దేశంలో జరుగుతున్న పలు ఉల్లంఘనల నుండి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలా చేస్తున్నదని భారత్ తెలిపింది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు, సాయుధ పోరాటాలపై బహిరంగ చర్చ జరిగింది. దీనిలో భారత ఉప ప్రతినిధి ఆర్ రవీంద్ర మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమన్నారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఒక ప్రతినిధి చేసిన రాజకీయ ప్రేరేపిత, నిరాధారమైన వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.వారి దేశంలో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నుంచి దృష్టిని మరల్చడానికే పాక్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ ప్రతినిధి జమ్ముకశ్మీర్ గురించి ప్రస్తావించిన తర్వాత ఆర్ రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. -
అమర్నాథ్కు పెరిగిన భక్తుల సంఖ్య!
అమర్నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడమే కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్ నుంచి ఏటా అరమ్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30 వేలు కాగా, దీనిని తొలగించిన తర్వాత యాత్రికుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుండి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 19 న రక్షాబంధన్ వరకు కొనసాగనుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల ప్రయాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ తేదీని ప్రకటించిన వెంటనే ప్రయాణికులు రైలు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించనున్నారు. అయితే కొందరు ప్రయాణ తేదీలను అంచనా వేస్తూ రిజర్వేషన్లు చేయించుకుటున్నారని సమాచారం. ఈసారి మధ్యప్రదేశ్ నుంచి అమర్నాథ్ వెళ్లే యాత్రికుల సంఖ్య 45 వేలు దాటుతుందని ఓం శివసేవా శక్తి మండల్ సంస్థ అంచనా వేసింది. ఎంపీ నుంచి 2018లో 35 వేల మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. 2019లో 30 వేల మంది అమర్నాథ్ యాత్ర చేశారు. అయితే 2020, 2021లలో కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర జరగలేదు. 2022లో 35 వేల మంది, 2023లో 40 వేల మంది అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ!
అందాల పోటీల్లో పాల్గొనేవాళ్లంతా టీనేజర్లు, పెళ్లి కానీ వాళ్లే ఉంటారు. ఇటీవల ఇంకాస్త ముందడుగు వేసి పెళ్లైన వాళ్లు కూడా పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు. కానీ వాటన్నింటిని దాటి ఐదు పదుల వయసులో అది కూడా ఇద్దరు పిల్లల తల్లి అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటి శభాష్ అనిపించుకుంది. చెప్పాలంటే ఆమె గెలుపు చారిత్రాత్మక విజయానికి నాంది పలికింది. వివరాల్లోకెళ్తే.. జమ్మూ నగరానికి చెందిన 55 ఏళ్ల రూపికా గ్రోవర్ మోడల్ మిసెస్ ఇండియా వన్ ఇన్ ఏ మిలియన్ 2023 అందాల పోటీల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. సక్సెస్‌కి వయోపరిమితి ఉండదని ప్రూవ్ చేసింది. ప్రతి మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఆమె నటన, మోడలింగ్ ప్రపంచంలోకి చాలా నిర్భయంగా అడుగుపెట్టి తానెంటో ప్రూవ్ చేసుకున్న ధీశాలి. బాలీవుడ్ దిగ్గజ నటులు అమితా బచ్చన్, రణవీర్‌సింగ్ వంటి లెజెండరీ నటులతో కలిసి పనిచేసింది. అంతేగాదు ఆమె ఇద్దరు పిల్లల తల్లి కూడా. ఇక రూపిక గ్రోవర్ ఫిట్ క్లాసిక్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్లాసిక్, టాలెంటెడ్ క్లాసిక్ వంటి టైటిళ్లను కూడా దక్కించుక్ను టాలెంటెడ్ మహిళ. ఇద్దరు పిల్లల తల్లిగానూ అలాగే తన కెరీర్ పరంగా అచంచలంగా దూసుకుపోతూ మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక్కడ ఆమె కనబర్చిన ఆచంచలమైన నిబద్ధత, అంకితబావాలే ఆ విజయాల పరంపరను తెలియజేస్తున్నాయి. ఆమె విజయగాథ ఎలాంటి పరిస్థితులోనైనా తమ డ్రీమ్స్‌ని వదులకోకుండా కృషి చేయలని తెలుపుతోంది. దేనిలోనైన విజయ సాధించాలంటే అటెన్షన్ ఉంటే చాలు వయసుతో సంబంధం లేదని చాటి చెటి చెప్పింది. ఇక ఈ మిసెస్ ఇండియా వన్ ఏ మిలియన్ అనేది దేశంలో వివాహిత మహిళల కోసం ప్రత్యేకంగా కండెక్ట్ చేస్తున్న అందాల పోటీ. ఇది మహిళలంతా విజేతలే అనే లక్ష్యంగా ఈ పోటీలను పెడుతోంది. తమ కలలను వాస్తవంలోకి తీసుకురాలేకపోయిన మహిళలకు ఇదోక గొప్ప వేదిక. ఈ పోటీల్లో రూపికా గ్రోవర్ చారిత్రాత్మక విజయాన్ని సాధించి మహిళందరికి ప్రేరణగా నిలిచింది. ఆమెలాంటి ఎందరో మహిళలు ధైర్యంగా తమ కలలను నెరవేర్చుకునేందుకు రూపికా గ్రోవర్ గెలుపే స్పూర్తినిస్తుంది. View this post on Instagram A post shared by Rupika Grover (@rupikagrover) (చదవండి: ఎవరీమె? ఆమె స్పీచ్‌కి..పార్లమెంటే దద్దరిల్లింది!) -
పాక్ కాల్పులతో పెళ్లిళ్లకు చిక్కులు
శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న విచక్షణారహిత కాల్పులతో జమ్మూలోని పలు గ్రామాల్లో పెళ్లిళ్లకు చిక్కులొచ్చి పడ్డాయి. దాంతో చివరి నిమిషంలో పలు పెళ్లిళ్లకు వేదికను మార్చుకోవాల్సి రావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ కాల్పుల దెబ్బకు అతిథులు పెళ్లి విందు మధ్య నుంచే అర్ధంతరంగా నిష్క్రమిస్తున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. పాక్ రేంజర్లు ఇలా కాల్పులకు తెగబడటం 2021 కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచీ అరి్నయా తదితర ప్రాంతాలపై కాల్పులు ఏడు గంటలకు పైగా కొనసాగాయి. మరోవైపు వరి కోతల వేళ కాల్పులకు భయపడి కూలీలెవరూ పొలాలకు కూడా వెళ్లడం లేదు. బంకర్లోనే పాఠాలు! కాల్పుల భయంతో జమ్మూ జిల్లాలో పలు స్థానిక స్కూళ్లు మూతబడ్డాయి. అయితే సరిహద్దుకు సమీపంలోని షోగ్పూర్లో ఉన్న సర్కారీ పాఠశాల మాత్రం శుక్రవారం భూగర్భ బంకర్లలో నడిచింది! తమ ఇంట్లోవాళ్లు భయపడ్డా తాను మాత్రం స్కూలుకు హాజరయ్యానని సునీతా కుమారి అనే విద్యారి్థని చెప్పింది. ఆమెతో పాటు దాదాపు 20 మంది విద్యార్థులు స్కూల్లోని బంకర్లో పాఠాలు విన్నారు. -
గుజరాత్ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి? వైష్ణోదేవి దర్శనానికి ఎంతసేపు వేచివుండాలి?
శరన్నవరాత్రులు దేశంలోని తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అన్నిచోట్లా వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దుర్గా మండపాలను అందంగా అలంకరిస్తారు. మరికొన్ని చోట్ల దాండియా నైట్ నిర్వహిస్తారు. దేశంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరిగే ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతా వైష్ణో దేవి(జమ్ము) మాతా వైష్ణో దేవి ఆస్థానంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే నవరాత్రుల ప్రత్యేక సందర్భంలో ఆలయ బోర్డు ప్రత్యేక అలంకరణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు రెండుమూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మవారిని దర్శించుకుని, వేడుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. అహ్మదాబాద్‌లో.. గుజరాత్ ప్రభుత్వానికి నవరాత్రి పండుగ నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నవరాత్రులకు రాష్ట్రానికి పర్యాటకులు కూడా తరలివస్తుంటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నవరాత్రుల సందర్భంగా అనేక వేదికలు ఏర్పాటవుతాయి. ప్రముఖ గాయకులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. సామూహికంగా గర్బా నృత్యం చేస్తారు. దాండియా నైట్ నిర్వహిస్తారు. గుజరాత్‌ను సందర్శించాలనుకునేవారు శారదా నవరాత్రులలో వెళితే మరింత ఎంజాయ్ చేయవచ్చని టూర్ నిపుణులు చెబుతుంటారు. గుజరాత్‌లోని పలు ప్రదేశాలు శారదా నవరాత్రులలో అమ్మవారి కీర్తనలతో మారుమోగుతుంటాయి. వారణాసిలో.. వారణాసిని శివుడు కొలువైన నగరం అని అంటారు. నవరాత్రి, దీపావళి తదితర పండుగల సందర్భంగా ఘాట్లపై దీపాలు వెలిగిస్తారు. పురాణాలలోని వివరాల ప్రకారం మాతా సతీదేవి మణికర్ణిక(చెవిపోగు) వారణాసిలో పడిపోయిందని చెబుతారు. దీంతో ఇది కూడా శక్తిపీఠంగా వెలుగొందుతోంది. ఇక్కడ అమ్మవారికి విశాలాక్షి, మణికర్ణి రూపాలలో పూజిస్తారు. పార్వతీ దేవి చెవి పోగు ఇక్కడి కొలనులో పడిపోయిందని, దానిని శంకరుడు కనుగొన్నాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు. కేరళలో.. కేరళలో అమ్మవారు కొలువైన దేవాలయాలు అనేకం ఉన్నాయి. అమ్మవారి పూజా సమయంలో ఏనుగులను కూడా పూజిస్తారు. నవరాత్రి సందర్భంగా కేరళలోని కొన్ని దేవాలయాలలో జాతర నిర్వహిస్తారు. విజయదశమి రోజున కేరళీయులు తమ ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. బంగారు ఉంగరం సహాయంతో పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాస్తారు. ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. కొట్టాయంలోని పనచ్చిక్కడ్ సరస్వతి ఆలయం, మలప్పురంలోని తుంచన్ పరంబ్, తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయం, త్రిసూర్‌లోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, ఎర్నాకులంలోని చోటానిక్కర దేవి ఆలయాలలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో.. నవరాత్రుల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో రథయాత్ర జరుగుతుంది. అమ్మవారికి మహువా లడ్డూలను సమర్పిస్తారు. 52 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో ఉంది. ఈ శక్తిపీఠాన్ని దంతేశ్వరి ఆలయం అని అంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. నవరాత్రి రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? -
జమ్మూలో ‘శ్రీవారి ఆలయం’ మహా సంప్రోక్షణ
సాక్షి, న్యూఢిల్లీ/తిరుపతి కల్చరల్/నెల్లూరు(దర్గావిుట్ట)/తిరుమల: జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి (సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ, శ్రీవారి కళ్యాణం గురువారం ఆగమోక్తంగా జరిగింది. సుప్రభాతం అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు యాగశాలలో మహాపూర్ణాహుతి, కుంభప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 7.30 నుంచి 8.15 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన నిర్వహించారు. ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. అనంతరం అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం అందించారు. ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, కిషన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ట్వీట్.. జమ్మూలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. శ్రీ బాలాజీ ఆలయ నిర్మాణాన్ని భిన్నత్వంలో ఏకత్వ వేడుకగా కేంద్రమంత్రి జితేందర్ సింగ్ అభివర్ణించారు. జమ్మూలోని శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన ఏపీ సీఎం జగన్, టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. హిందూ సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. -
జమ్ములో టీటీడీ దేవాలయం ప్రారంభోత్సవం
-
జమ్మూలో టీటీడీ దేవాలయం ప్రారంభోత్సవం
జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి, టీటీడీ నార్త్ ఎల్ ఏసీ చైర్ పర్సన్ ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు టీటీడీ నిర్మిస్తోంది. జమ్మూలో ఈ రోజు 12 గంటల నుంచి భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభమవుతుంది. చదవండి: జెండా ఊపి ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్ -
జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీనగర్: జమ్ములో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని, వాళ్లను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన మరో డజను మందికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే.. బస్సు అమృత్సర్ నుంచి కాత్రాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. #WATCH | J&K | A bus from Amritsar to Katra fell into a gorge in Jammu. As per Jammu DC, 7 peopled died and 4 critically injured; 12 others also sustained injuries. Visuals from the spot. pic.twitter.com/iSse58ovos — ANI (@ANI) May 30, 2023 CRPF, Police and other teams are also here. Ambulances were called & the injured were immediately rushed to hospital. Bodies have also been taken to the hospital. A crane is being brought here to see if someone is trapped under the bus. A rescue operation is underway. We are… pic.twitter.com/0H5FiJ2eQe — ANI (@ANI) May 30, 2023 ఇదీ చదవండి: కరెంట్ పోల్ నిలబెడుతుండగా.. షాక్ తగిలి ఎనిమిది మంది..! -
జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలోని ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించిందని, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ, 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ - కాట్రా మార్గంలో ఈ ఆలయం ఉందని, భక్తులు బాలాజీ ఆశీస్సులు కూడా అందుకోవచ్చని అన్నారు. ఈ ఆలయం నగరానికి దూరంగా ఉందని, ఇక్కడ 24 గంటల పాటు శాశ్వత భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని జమ్మూ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. కాగా, ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆలయాల నిర్మిస్తున్నామని, ఇటీవల చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్, అమరావతి, తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అదేవిధంగా అహ్మదాబాద్, రాయపూర్‌లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవో వీరబ్రహ్మం, ఎస్పీ రాహుల్, సీవీఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్ నుంచి ఏపీకి 'అంతా క్షేమంగా'.. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రెండు బ్యాగుల నిండా బాంబులు స్వాధీనం
శ్రీనగర్: జమ్ము రైల్వే స్టేషన్ వద్ద పేలుళ్లు జరిపేందుకు చేసిన భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద 18 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెండు బ్యాగుల్లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. డిటోనేటర్లతో పాటు రెండు బాక్సుల్లో వైర్లను గుర్తించామని, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘సుమారు 500 గ్రాముల మైనపు రకం పదార్థం బాక్సులో ప్యాక్ చేసి కనిపించింది. వాటిని సీజ్ చేశాం.’ అని ప్రభుత్వ రైల్వే పోలీసు జీఆర్పీ ఎస్ఎస్పీ ఆరిఫ్ రిషూ తెలిపారు. ట్యాక్సీ స్టాండ్‌లో అనుమానిత బ్యాగ్‌ను గుర్తించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రెండు బాక్సుల్లో డిటోనేటర్లు, వైర్లు ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో పేలుడు పదార్థాలు లభించటం ఆందోళనలు పెంచుతోంది. ఇదీ చదవండి: ఆ కేసులో దోషిగా తేలిన సైకిల్ పార్టీ కీలక నేత.. ఎమ్మెల్యే పదవికి ఎసరు! -
ఒకే ఇంట్లో ఆరుగురు మృతి.. ఏం జరిగింది?
ఒకే ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందడాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్ ఉల్ హబీబ్, సాజిద్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, వీరు ఎలా చనిపోయారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉగ్రవాదులు సోఫియాన్ జిల్లాలో కశ్మీర్ పండిట్లపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఓ కశ్మీర్ పండిట్ చనిపోగా, అతని సోదరుడు గాయపడ్డాడు. మృతున్ని సునీల్ కుమార్ భట్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 6 members of family found dead at home in Jammu https://t.co/QIgJKdeD3A — Hindustan Times (@HindustanTimes) August 17, 2022 ఇది కూడా చదవండి: రోడ్డు లేక డోలీలో ఆస్పత్రికి బాలింత.. కవలలు కన్నుమూత! -
ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే పేలుడు
జమ్మూ: జమ్ముకశ్మీర్‌లో ప్రధాని పర్యటనకు కొన్నిగంటల ముందు సభావేదికకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. జమ్ము జిల్లాలోని లాలియాన గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక పొలంలో పేలుడు చోటు చేసుకొంది. ప్రధాని బహిరంగ సభ జరగనున్న సాంబా జిల్లాలోని పల్లీ గ్రామానికి ఇది సమీపంలోనే ఉంటుంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్మూ-కశ్మీర్లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన బనిహాల్-కాజీగుండ్ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. సుంజ్వాన్ ప్రాంతంలో మొన్న ఇద్దరు జైషే-మహమ్మద్ తీవ్రవాదుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రధాని భద్రతను అధికారులు మరింత పటిష్ఠం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్ఐఏ అధిపతి కుల్దీప్ సింగ్ సుంజ్వాన్ ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ పర్యటించనున్న పల్లీ గ్రామానికి కూడా చేరుకొని అక్కడి భద్రతా పరిస్థితినీ సమీక్షించారు. చదవండి: (ఏప్రిల్ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ) -
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని జమ్మూలో నిర్మించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన గురువారం తిరుమల అన్నమయ్య భవన్లో నూతన బోర్డు తొలి సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా టీటీడీ చేపట్టే అభివృద్ధి, ఇతర మరమ్మతు పనుల టెండర్లను ఆమోదించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్‌రెడ్డి, బోర్డు సభ్యులతోపాటు అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. ► జమ్మూలో రూ.17.4 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం టెండర్లను ఆమోదించారు. ► చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు, శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్ల చైర్మన్ల నియామకానికి ఆమోదం. చెన్నైలో ఏజే శేఖర్‌రెడ్డి, బెంగళూరులో రమేష్‌శెట్టి, ముంబైలో అమోల్‌కాలే నియామకం. ► రూ.7.5కోట్లతో అలిపిరి కాలిబాట సుందరీకరణ పనుల టెండర్లకు ఆమోదం. ► రాయచోటిలో రూ.2.21 కోట్లతో కల్యాణ మండపం నిర్మాణం టెండర్లకు ఆమోదం. ► టీటీడీలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్కాస్ తరహాలో టీటీడీ కార్పొరేషన్ ఏర్పాటు, టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య నిధి ఏర్పాటుకు ఆమోదం. ► రూ.2.61కోట్లతో తిరుమలలోని శ్రీ వరాహస్వామి విశ్రాంతి భవనం–2 మరమ్మతుల టెండర్లకు ఆమోదం. ► స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చి భవనంలో రూ.4.46 కోట్లతో నిర్మించనున్న 4, 5 అదనపు అంతస్తుల నిర్మాణానికి టెండర్ల ఆమోదం. -
‘ఆలస్యానికి మా బాధ్యత లేదు’ రైల్వేశాఖపై సుప్రీంకోర్టు ఫైర్
మీరు ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు చాలా ఓల్డ్ డైలాగ్ కానీ మనం ఎక్కిన రైలు సరైన సమయానికి చేరుకోవడమన్నది చాలా అరుదుగా జరిగే సంఘటన. చాలా సార్లు రైళ్లు ఆలస్యం కావడం వల్ల ముఖ్యమైన పనులు చేయలేకపోతుంటా. సరేలే అని సర్థుకుపోతాం. కానీ ఓ వ్యక్తి అలా ఊరుకోకుండా రైలు ఆలస్యంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఫలితం సాధించాడు. అంతులేని ఆలస్యం కశ్మీర్‌కి చెందిన సంజయ్ శుక్లా జమ్ము నుంచి శ్రీనగర్‌కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఈ ఫ్లైట్‌ని అందుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటలకి జమ్ము ఏయిర్పోర్టు చేరుకోవాలి. కానీ అతను ఎక్కిన రైలు ఉదయం 8 గంటలకు జమ్ము రావాల్సింది. మధ్యాహ్నం 12 గంటలకు గానీ చేరుకోలేదు. దీంతో సంజయ్ తన ఫ్లైట్‌ని మిస్ అయ్యాడు. దీంతో ప్రత్యేకంగా కారులో ప్రయాణించి శ్రీనగర్ చేరుకున్నాడు. వేళ కాని వేళ చేరుకోవడం వల్ల అక్కడ హోటల్లో బస చేయాల్సి వచ్చింది. ఈ ఘటన 2016లో జరిగింది. రైలు ఆలస్యం వల్ల తనకు కలిగిన నష్టంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మా బాధ్యత కాదు రైల్వే శాఖ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బటి వాదిస్తూ ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ కోచింగ్ టారిఫ్ నంబర్ 26, పార్ట్ 1, వాల్యూమ్ 1 ప్రకారం రైలు ఆలస్యానికి ఎటువంటి పరిహారం అందివ్వాల్సిన అవసరం లేదంటూ కోర్టుకు విన్నవించారు. సమయానికి వెల కట్టలేం రైల్వే తరఫున సోలిసిటర్ వినిపించిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వినియోగదారుడి సమయానికి వెల కట్టలేమని వ్యాఖ్యానించింది, రైళ్ల ఆలస్యానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. జవాబుదారి తనం ఉండాలని సూచించింది. ఇలా రైళ్లు ఆలస్యంగా నడిపిప్తూ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేరంటూ హెచ్చరించింది. పరిహారం చెల్లించండి నిర్దేశిత సమయానికి రైలును గమ్యస్థానం చేర్చలేకపోయినందుకు రైల్వేశాఖను మందలించింది. రైలు ఆలస్యం కారణంగా నష్టపోయిన సంజీవ్ శుక్లాకు పరిహారంగా రూ. 30,000లను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. చదవండి: ఐపీఎల్లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? -
జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం
జమ్మూ: జమ్మూలోని మూడు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. ఈ పరిణామంతో పోలీసులు, సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిరాన్ సాహిబ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.23 గంటలకు ఒక డ్రోన్ కనిపించగా, కలుచక్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకి ఒక డ్రోన్, కుంజ్‌వానిలో 4.52 గంటలకి మరో డ్రోన్ కనిపించిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై ఆదివారం డ్రోన్ దాడి జరిగిన దగ్గర్నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట డ్రోన్లు కనిపిస్తూనే ఉన్నాయి. జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వైమానిక స్థావరంపైనే ఆదివారం డ్రోన్లతో తొలిసారిగా దాడి జరిగిన విషయం తెలిసిందే. డ్రోన్లతో ఏ క్షణంలో ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనని ఈ వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, సాఫ్ట్ జామర్లు ఏర్పాటు చేసినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో చైనాకు చెందిన డ్రోన్లు వాడినట్టుగా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. డ్రోన్ల నుంచి పేలుడు పదార్థాలను జారవిడిచినట్టుగా భావిస్తున్నారు. నైట్ విజన్, నావిగేషన్ వ్యవస్థ కలిగిన డ్రోన్లను ముష్కరులు వాడినట్టుగా భద్రతా అధికారులు వెల్ల డించారు. మరోవైపు రాజౌరి జిల్లాలో ఏ అవసరానికైనా డ్రోన్లను వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు. -
జమ్మూలో మరోసారి డ్రోన్ కలకలం
-
Jammu Airport: జంట పేలుళ్ల కలకలం.. ఉగ్రకోణంలో దర్యాప్తు!
న్యూఢిల్లీ: జమ్ము విమానాశ్రయం వద్ద ఎయిర్‌ఫోర్స్ కార్యాకలాపాలు నిర్వహించే చోట జంట పేలుళ్ల కలకలం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటాక హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు స్వల్ప తీవ్రతతో జరగడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. కాగా, రాత్రి 1గం.35ని. నుంచి 1.గం.42 ని.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఒక దాడిలో పైకప్పు స్వల్పంగా దెబ్బతిందని, మరో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని ప్రకటించింది. ఈ ఘటనలో రెండు బ్యారక్‌లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు గాయపడినట్లు తొలుత సమాచారం అందించింది. అయితే డిఫెన్స్ పీఆర్వో మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదేని ప్రకటించడం విశేషం. Two low intensity explosions were reported early Sunday morning in the technical area of Jammu Air Force Station. One caused minor damage to the roof of a building while the other exploded in an open area. — Indian Air Force (@IAF_MCC) June 27, 2021 కాగా, టెక్నికల్ ఏరియాల్లో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీంలు రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్ టీంలు క్లూస్ కోసం గాలిస్తున్నాయి. డ్రోన్లలో ఐఈడీ బాంబులు అమర్చిన ఉగ్రవాదులు.. ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారేమోనని అనుమానిస్తున్నారు. చదవండి: అలాగైతేనే పోటీ చేస్తా: మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు -
జమ్ము విమానాశ్రయం లో జంట పేలుళ్లు
-
జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా..?
-
కశ్మీర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ
సాక్షి, ఢిల్లీ: కశ్మీర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ పాల్గొన్నారు. దేవాలయం కోసం లీజు ప్రాతిపదికన 62 ఎకరాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కేటాయించింది. రూ.33.52 కోట్ల వ్యయంతో 18 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తికానుంది. దేవాలయ ప్రాజెక్ట్‌లో భాగంగా వేద పాఠశాల, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించనున్నారు. చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు భక్తులకు మరింత సులభంగా వసతి గదులు -
కాంగ్రెస్ బలహీనపడింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నాయకులు మరోసారి తమ గళం విప్పారు. గత దశాబ్ద కాలంగా పార్టీ పూర్తిగా బలహీనపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త తరం పార్టీకి కనెక్ట్ కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జమ్మూలో శుక్రవారం జీ23 గ్రూపులో నాయకులు బహిరంగంగా ఒకే వేదికపై శాంతి సమ్మేళన్ పేరుతో బల ప్రదర్శనకి దిగారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులైన గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, భూపీందర్ హూడా, రాజ్ బబ్బర్ వంటి నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గతంలో ఈ నాయకులంతా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖలో పార్టీ ప్రక్షాళన, అంతర్గత ప్రజాస్వామ్యం, నాయకత్వం వంటి అంశాలను ప్రస్తావించారు. పార్టీని ఇలా చూడలేకపోతున్నాం గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా మారిపోయిందని జీ23 నేతల్లో ఒకరైన ఆనంద్ శర్మ అన్నారు. పార్టీ బాగా ఉన్న రోజుల్ని చూసిన తాము ఇలా బలహీనంగా ఉన్న పార్టీని చూడలేకపోతున్నామని అన్నారు. ‘‘మేము ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. మాలో ఎవరూ దొడ్డిదారిలో పార్టీలోకి రాలేదు. ప్రధాన ద్వారం వెంబడి నడిచే వచ్చాం. విద్యార్థి ఉద్యమాలు, యువజన ఉద్యమాల్లో పాల్గొని ఈ స్థాయికి చేరుకున్నాం. కానీ నేటి తరం పార్టీకి కనెక్ట్ కావడం లేదు’’అని ఆనంద్ శర్మ వాపోయారు. ఆజాద్ అనుభవం అక్కర్లేదా ..? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కి మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై కపిల్ సిబల్ మండిపడ్డారు. ఆజాద్ అనుభవం పార్టీకి అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ ఇంజనీర్ వంటి వాడని ఆయన పార్లమెంటులో లేకపోవడం అత్యంత విచారకరమని అన్నారు. ప్రతీ రాష్ట్రంలోని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితులు ఆజాద్‌కి తెలిసినట్టుగా మరే నాయకుడికి తెలియవని అన్నారు. నిప్పు రాజేసిన నార్త్ వర్సస్ సౌత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ తీసుకుంటున్న నిర్ణయాలపై చాలా కాలంగా సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీలో కీలక పదవుల్ని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పదవుల్ని రాహుల్ తన సన్నిహితులకి ఇస్తున్నారని, పార్టీలో సీనియర్లని విస్మరిస్తున్నారన్న అసంతృప్తిలో ఉన్నారు. అదే సమయంలో కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన నార్త్ వర్సస్ సౌత్ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా నిప్పు రాజేశాయి. ఈ మధ్య రాహుల్ గాంధీ తిరువనంతపురంలో మాట్లాడుతూ ‘‘ఉత్తరాదిన నేను 15 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు రాజకీయాలు వేరేగా ఉండేవి. కేరళ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాక చాలా హాయిగా అనిపిస్తోంది. దక్షిణాది ప్రజలకి అన్ని అంశాల్లో ఆసక్తి ఉంది. ఎంతో లోతుగా అన్ని విషయాలు వారు తెలుసుకుంటారు’’అని కితాబునిచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే జీ23 నాయకులు సమావేశమయ్యారు. ప్రజలు ఏ ప్రాంతం వారైనా ఒక్కటేనని, వారి తెలివితేటల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కపిల్ వంటి నాయకులు రాహుల్‌పై ఫైర్ అయ్యారు. -
వీరుడొకడు అమరుడయ్యాడు
‘అమరుడు’ అనిపించుకునే అదృష్టం అందరి నుదుటునా రాసి ఉండదు. కోట్ల జనులు శాల్యూట్ చేసే ఘనత అందరికీ దొరకదు. చరిత్ర పుటల్లో సగర్వంగా తలుచుకునే పేరుగా నిలవడం అందరి వశం కాదు. ప్రవీణ్ కుమార్ వంటి సైనికుడికే ఆ గౌరవం సాధ్యం. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల పోరులో చిత్తూరు జిల్లా పరాక్రమవంతుడు ప్రవీణ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. వారితో సీమ పులిలా పోరాడి ప్రాణాలర్పించాడు. తెలుగుజాతితో పాటు దేశ ప్రజలూ అతణ్ణి గుర్తు పెట్టుకుంటారు. ప్రవీణ్ కుటుంబ నేపథ్యం.... చిత్తూరు జిల్లా ఐరాలమండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (37). మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రవీణ్ 2009లో అదే మండలంలోని ఐలవారిపల్లి గ్రామానికి చెందిన దగ్గరి బంధువు రామచంద్రారెడ్డి (రిటైర్ట్ఆర్మీ) కుమార్తె రజితతో పెళ్లి జరిగింది. వీరికి రోహిత, లీలేష్లు కుమార్తె కుమారుడు. కుమార్తె రోహిత రెండవ తరగతి. దేశ సేవచేస్తానని పట్టుబట్టి పద్దెనిమిదవ ఏటే మిలటరీలో చేరాడు. దేశం కోసం ప్రాణాలు విడిచి పెట్టడానికి కూడా వెనకాడేదిలేదని చెప్పేవాడు. చివరికి మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. ప్రాణాలు కోల్పోయాడని బాధగా ఉన్నా దేశం కోసం అశువులు బాసినందుకు గర్వంగా ఉంది. నాలుగు రోజుల క్రితమే ఫోన్ చేశాడు. ‘నాన్నా.. అమ్మ జాగ్రత్త. కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇంట్లో ఎవరూ బయటకు వెళ్లొద్దు. సంక్రాంతికి వస్తున్నా. అందరం కలుద్దాం’ అని చెప్పాడు. తను చెప్పినట్టే సంక్రాంతికి వస్తున్నాడు కదా అని సంబరపడ్డాను. దేశంలో ఎక్కడ ఉన్నా సంక్రాంతికి మాత్రం గుమ్మం ముందు ఉండేవాడు...’’ దుఃఖంతో పూడుకుపోయింది ఆ తండ్రి గొంతు. జమ్ము కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తండ్రి సాక్షికి చెప్పిన మాటలివి. తన కుమారుడి గురించి ఆయన మాటల్లో... ‘నా కొడుకు ప్రవీణ్‌కుమార్ రెడ్డికి చిన్నతనం నుంచి పట్టుదల ఎక్కువ. రెడ్డివారిపల్లెలో బడికి పోయేటప్పుడు ఎవ్వరినీ ఏమీ అనేవాడు కాడు. ఐరాలలో ఇంటర్ వరకు చదివాడు. ఆ తరువాత నాకు చేదోడు వాదోడుగా సేద్యం పనులు చేసేవాడు. మిలటరీలో పనిచేస్తున్న బంధువులను చూసి దేశానికి సేవచేయాలని పట్టుబట్టాడు. ఆర్మీలో చేరేందుకు కబురొచ్చింది. 2002 ఊటీలో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌లో పాల్గొన్నాడు. ఊటీలోనే సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌లోని కప్పూర్తలాలో విధుల్లో చేరాడు. రెండేళ్లు పని చేశాక అస్సాంకు వెళ్లాడు. ఆ సమయంలో కర్ణాటకలోని బెల్గామ్‌లో ఆరు నెలలపాటు కమాండెంట్‌గా శిక్షణ పొందాడు. 2012–2016 వరకు ఢిల్లీలోని నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్(ఎన్ఎస్ఎఫ్)లో విధులు నిర్వహించాడు. అక్కడినుంచి మళ్లీ 2017–18వరకు జమ్మూలోని మీరాన్ సాహెబ్ ప్రదేశంలో పనిచేశాడు. 2019 సంవత్సరంలో పాకిస్థాన్ సరిహద్దులో అడుగుపెట్టి ఒక సైనికుడు చేరవలసిన అసలైన చోటుకు చేరానని గర్వపడ్డాడు. దేశ సరిహద్దు ఎప్పుడూ మంచు దుప్పటితో కప్పబడి ఉండటంతో శత్రువుకు అవకాశం ఇవ్వకూడదని కేవలం నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారట. కంటిపై రెప్ప వాలనివ్వకుండా దేశరక్షణకు కాపలా కాశానని చెప్పేవాడు. చివరకు జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందటంతో ముందు మాకు నోటమాట రాలేదు. ఎంత దిగమింగుదామనుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు. అమర సైనికుడికి కడసారి వీడ్కోలు పలకటం కోసం కుటుంబ సభ్యులమైన మేము, గ్రామస్తులు, అతడి స్నేహితులు కన్నీటితో ఎదురు చూస్తున్నాం’ అన్నాడాయన. – బాలసుందరం, సాక్షి చిత్తూరు రూరల్ -
జమ్మూలో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూ శివార్లలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్సై) ఒకరు నేలకొరిగారు. కశ్మీపోర్‌లీసులు, సీఆర్పీఎఫ్ కలిసి జమ్మూ శివార్లలోని పంథాచౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి నాకా బందీ చేపట్టాయి. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు బైక్‌పై వచ్చి, బలగాలపైకి కాల్పులు జరిపారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరుపుతూ వారి ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా ఎదురు కాల్పుల్లో ఏఎస్సై బాబూరామ్ నేలకొరగ్గా, ఒక దుండగుడు హతమయ్యాడు. మిగతా వారు కాల్పులు జరుపుతూ బైక్ వదిలి పరారయ్యారు. వెంబడించిన బలగాలు..దుండగులు దాగున్న ధోబీ మొహల్లా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పదేపదే హెచ్చరికలు చేశాయి. పాంపోర్ ప్రాంతానికి వారి సంబంధీకులను అక్కడికి తీసుకువచ్చి, వారి ద్వారా లొంగిపోవాలని కోరినా వినలేదు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తెల్లవారే దాకా కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మిగతా ఇద్దరు దుండగులు చనిపోయారు. మృతులను లష్కరే తోయిబాకు చెందిన సకీబ్ బషీర్ ఖాన్‌దే, ఉమర్ తారిఖ్ భట్, జుబైర్ అహ్మద్ షేక్‌గా గుర్తించారు. ముగ్గురిదీ పాంపోర్ జిల్లా ద్రంగ్‌బల్ ప్రాంతమే. వీరిలో ఖాన్‌దే ఏడాదిన్నర నుంచి కమాండర్‌గా ఉంటూ అనేక నేరాలకు పాల్పడినట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఎల్వోసీ వెంట పాక్ కాల్పులు అసువులు బాసిన జేసీవో జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. ఎలాంటి కవ్వింపులేకుండా జరిపిన ఈ కాల్పులకు భారత్ బలగాలు దీటుగా స్పందించాయి. పాక్ వైపు భారీగా నష్టం వాటిల్లిందని సైన్యం తెలిపింది. పాక్ కాల్పుల్లో నాయిబ్ సుబేదార్ రజ్వీందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని సైనిక వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రజ్వీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజ్వీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. -
సరిహద్దుల్లో సొరంగం
జమ్మూ: భారత్‌లో చొరబాట్లకు జిత్తుల మారి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంది. జమ్మూలోని సాంబా సెక్టార్లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ వైపు వెళుతున్న ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) కనుగొన్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3–4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాక్ దీనిని నిర్మించిందని అధికారులు వెల్లడిం చారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. పాకిస్తాన్లో తయారైనట్టుగా గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని కప్పి ఉంచినట్టుగా బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. దీంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా సాంబా సెక్టార్లో అణువణువు గాలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురవడంతో ఈ సొరంగ మార్గం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి వదులుగా మారింది. ఎందుకిలా మట్టి ఉందన్న అనుమానంతో అక్కడ అంతా పరిశీలించి చూడగా పాకిస్తాన్లో తయారీ అయినట్టుగా చిహ్నాలు ఉన్న ఇసుక బస్తాల్ని బలగాలు గుర్తించాయి. వాటిని తొలగించి చూడగా 170 మీటర్ల పొడవైన సొరంగం కనిపించింది. సాంబా సెక్టార్లో వేల్‌బ్యాక్ శిబిరానికి దగ్గరగా ఈ సొరంగం ఉంది. కరాచి, శంకర్గఢ్ అని పేర్లు ముద్రించి ఉన్న 8–10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ బస్తాలపై ఉన్న తేదీలను బట్టి అవి ఇటీవల తయారైనట్టుగా తెలుస్తోంది. ఈ సొరంగం పాకిస్తాన్ వైపు సరిహద్దు శిబిరం గుల్జార్ వరకు కొనసాగిం దని అధికారులు చెప్పారు. ఈ సొరంగం ద్వారా పాక్ ఉగ్రవాదులు చాలా సులభంగా చొరబాట్లు చేయవచ్చునని వివరించారు. పాక్‌కు తెలిసే చేసింది ఈ సొరంగం నిర్మాణం గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా తెలుసునని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. ఆ సొరంగాన్ని ఇటీవల తవ్వారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. సాంబా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి సొరంగాన్ని తవ్వారన్న సమా చారం తమకు అందగానే సరిహద్దు బలగాలు రంగం లోకి దిగాయన్నారు. శుక్రవారం సాయం త్రానికి దీన్ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం జమ్వాల్ సాంబ సెక్టార్లోనే ఉంటూ పాక్ ఇంకా ఎక్కడెక్కడ సొరంగాలు ఏర్పాటు చేసిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్
సాక్షి, ఢిల్లీ : జమ్మూలో టీటీడీ నిర్మించ తలపెట్టిన దివ్యక్షేత్రం (శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) స్థలాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బుధవారం పరిశీలించారు. త్వరలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశిస్తామని అక్కడి అధికారులకు సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలో ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణానికి పాలక మండలి సైతం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి బుధవారం జమ్మూకు వెళ్లి ఆలయ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. వైవి సుబ్బారెడ్డితో పాటు జమ్మూ కలెక్టర్ సుష్మా చౌహాన్, అడిషనల్ డిప్యూటి కమిషనర్ శ్యాం సింగ్, కుమార్,అదనపు సీఈఓ వివేక్ వర్మ చైర్మన్ సహా పలువురు అధికారులు ఆయన వెంట ఉన్నారు. (ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు) -
మూడేళ్ల చిన్నారికీ కోవిడ్
న్యూఢిల్లీ: కేరళలో మూడేళ్ల చిన్నారి సహా నలుగురికి తాజాగా కరోనా వైరస్ సోకడంతో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 44కు చేరింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూలలో ఒక్కో కేసు నమోదు కాగా.. ఇటీవల ఇటలీ నుంచి తిరిగి వచ్చిన మూడేళ్ల చిన్నారి వ్యాధి బారిన పడినట్లు ఆర్యోగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూయార్క్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికీ కోవిడ్ సోకింది. జమ్మూలో కోవిడ్ బారిన పడ్డ వ్యక్తి ఇరాన్‌కు వెళ్లినట్లు తెలిసిందని, ఉత్తర ప్రదేశ్ బాధితుడు కరోనా వైరస్ సోకిన ఆరుగురితో ఆగ్రాలో సన్నిహితంగా గడిపారని ఆరోగ్య శాఖ తన ప్రకటనలో వివరించింది. మరోవైపు రాజధాని ఢిల్లీలో మరో కేసు నమోదైన నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌లతో ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘వైరస్ నియంత్రణపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. 8255 విమానాల్లోని 8.74 లక్షల అంతర్జాతీయ ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. కేరళలోని కోచీలో వైరస్ బారిన పడ్డ మూడేళ్ల చిన్నారి రెండు రోజుల క్రితమే తల్లిదండ్రులతో కలిసి ఇటలీ నుంచి వచ్చింది. వైరస్ భయాందోళనలు ఎలా ఉన్నా కేరళలో మంగళవారం నాటి ఆటుక్కళ పొంగలలో లక్షలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం గమనార్హం. కర్ణాటకలో మొదటి కోవిడ్ కేసు వెలుగుచూసింది. అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన 40ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగికి కోవిడ్ సోకిందని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. మార్చి 1న భార్య, కుమార్తెతో న్యూయార్క్ నుంచి బెంగళూరుకు ఆ ఉద్యోగి వచ్చారు. -
జమ్మూలో భారీ అగ్నిప్రమాదం
-
ఐఏఎఫ్ డేర్‌డెవిల్ ఆపరేషన్
జమ్మూ: భారత వైమానిక దళం సిబ్బంది ధైర్య సాహసాలు ప్రదర్శించి వరదల్లో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కాపాడారు. జమ్మూకు చెందిన నలుగురు మత్స్యకారులు జమ్మూలోని భగవతి నగర్ వద్ద తావీ నదిలోకి దిగారు. ఒక్కసారిగా నదిలో వరద ఉధృతి పెరగడంతో వారు అక్కడే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌పైకి ఎక్కారు. అంతకంతకు నీటి మట్టం పెరుగుతుండటంతో స్థానికుల సాయంతో అధికారులకు సమాచారం అందించారు. ఐఏఎఫ్ వెంటనే రంగంలోకి దిగింది. ఐఏఎఫ్ హెలికాప్టర్ పిల్లర్‌కు అతి సమీపానికి రాగా గరుడ్ కమాండో కింది దిగారు. అక్కడున్న ఇద్దరినీ సురక్షితంగా హెలికాప్టర్లోకి ఎక్కేలా చేసి, మరో ఇద్దరి కోసం తాడు నిచ్చెనను వదిలారు. అయితే, వారిద్దరూ పైకి ఎక్కలేక తిరిగి నీళ్లలో పడిపోయారు. దీంతో గరుడ్ కమాండోలు తిరిగి పిల్లర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని, వారిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చేయగలిగారు. దాదాపు రెండుగంటలపాటు సాగిన ఈ సాహసోపేత చర్యను స్థానికులు ఉత్కంఠగా తిలకించారు. నలుగురినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఐఏఎఫ్ సిబ్బంది సాహసాన్ని వారు కొనియాడారు. ఇది డేర్‌డెవిల్ ఆపరేషన్ అని ఐఏఎఫ్ అధికారులు అభివర్ణించారు. ఇదంతా హెలికాప్టర్ పైలెట్, గరుడ్ కమాండో మధ్య సమన్వయం వల్లే సాధ్యమైందన్నారు. నగరంలోని హర్కిపౌడి ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో.. ఉధంపూర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ తావి నది వరదలో చిక్కుకుపోగా పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. -
జమ్మూ పేలుడు : నిందితుడికి హిజ్బుల్ సాయం
శ్రీనగర్ : జమ్మూ బస్‌స్టాండ్‌లోని ఓ బస్సుపై జరిగిన గ్రనేడ్ దాడిలో అరెస్ట్ అయిన అనుమానితుడు యాసిర్ భట్‌కు నిషేధిత ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజహిదిన్ రూ 50,000 ఇచ్చినట్టు వెల్లడైంది. గురువారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు మరణించగా, 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. కుల్గాం జిల్లాకు చెందిన అనుమానితుడు యాసిర్ భట్‌ను కశ్మీర్లోకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా జమ్మూ నగరం వెలుపల నాగ్రోటా టో్‌ల్‌ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడి ఆధార్ కార్డు, స్కూల్ రికార్డులను పరిశీలించగా 16 ఏళ్ల మైనర్‌గా వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న నిందితుడి తండ్రి వృత్తిరీత్యా పెయింటర్. కాగా యాసిర్ భట్‌ను ఈ దాడికి ప్రేరేపించేందుకు హిజ్బుల్ ముజహిదీన్‌కు చెందిన ముజమిల్ అనే అజ్ఞాత సానుభూతిపరుడు రూ 50,000 చెల్లించడంతో పాటు గ్రనేడ్‌ను సమకూర్చాడని నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. వాస్తవంగా గ్రనేడ్ దాడిని ముజమిల్‌కు హిజ్బుల్ జిల్లా కమాండర్ ఫయాజ్ భట్ అప్పగించగా ఈ దాడిని చేపట్టంలో ముజమిల్ విఫలమయ్యాడని నిందితుడు విచారణలో భాగంగా తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. -
9వ తరగతి విద్యార్థి లంచ్‌బాక్స్‌లో గ్రెనేడ్ తీసుకొచ్చి
-
జమ్మూలో గ్రెనేడ్ దాడి చేసింది 9వ తరగతి విద్యార్థి!
జమ్మూ: జమ్మూలో గ్రెనేడ్ దాడి జరిపింది 9వ తరగతి విద్యార్థేనని నిఘావర్గాలు పేర్కొన్నాయి. నిందితుడు గ్రెనేడ్‌ను లంచ్ బాక్స్‌లో తీసుకొచ్చి జమ్మూ ఆర్టీసీ బస్టాండ్ లక్ష్యంగా దాడి జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాడి జరిపి తిరుగు ప్రయాణమైన దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన నిందితుడిని పోలీసులు జమ్ముకు 20 కిలోమీటర్ల సమీపంలోని చెక్‌పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అయిన నిందితుడు యూట్యూబ్ సాయంతో గ్రేనేడ్ తయారు చేశాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇక నిందితుడు జమ్ముకు రావడం ఇదే తొలిసారని, అతను కారులో బుధవారమే ఇక్కడికి చేరాడని పేర్కొన్నారు. అతన్ని తీసుకొచ్చిన కారు డ్రైవర్ కోసం కూడా గాలిస్తున్నామన్నారు. మైనర్ అయిన నిందితుడు ఒక్కడే 250 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు? అది వన్‌వే ట్రాఫిక్ కలిగిన శ్రీనగర్-జమ్ము నేషనల్ హైవేపై ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో నిందితుడు చెప్పాడన్నారు. జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
జమ్మూలో గ్రెనేడ్ దాడి
జమ్మూ: జమ్మూలో ఉగ్రవాదులు గురువారం జరిపిన గ్రెనేడ్ దాడిలో మహ్మద్ షరీక్ (17) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 32 మంది గాయపడ్డారు. జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు యాసిన్ జావీద్ భట్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ సంస్థే జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడిందన్నారు. ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో యాసిన్ చెప్పాడన్నారు. చనిపోయిన మహ్మద్ ఫరీక్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వాడు. గతేడాది మే నుంచి చూస్తే జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడటం ఇది మూడోసారి. ఎన్కౌంటర్లో జైషే ఉగ్రవాది హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరుడు మరణించాడని పోలీసులు చెప్పారు. హంద్వారాలోని క్రల్గుండ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని పాకిస్తాన్ జాతీయుడైన అన్వర్‌గా గుర్తించామనీ, ఇతనికి జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి నేరారోపక వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూపీలో కశ్మీరీలపై దాడి చితక్కొట్టిన బజరంగ్ దళ్ సభ్యులు లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాదులనుకుని కశ్మీర్‌కు చెందిన యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన వ్యక్తులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రంలోని దాలిగంజ్ బ్రిడ్జిపై డ్రై ఫ్రూట్స్‌ను అమ్ముతున్న కొందరు కశ్మీర్ యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ కశ్మీరీ యువకులపైకి రాళ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడు, బజరంగ్దళ్ సభ్యుడు, విశ్వ హిందూదళ్ అధ్యక్షుడు సోంకర్, హిమాన్షు గార్గ్, అనిరుధ్, అమర్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు డ్రైఫ్రూట్స్ అమ్మేందుకు కశ్మీర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. -
గ్రెనేడ్ దాడి కేసులో నిందితుడి పట్టివేత
-
గ్రెనేడ్ దాడి కేసులో నిందితుడి పట్టివేత
ఢిల్లీ: జమ్మూ బస్టాండ్‌లో ప్రయాణికులపై గ్రెనేడ్ విసిరి పలాయనం చిత్తగించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన యాసిర్ భట్‌గా పోలీసులు గుర్తించారు. జమ్మూ నుంచి పారిపోతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం 11.45 గంటలకు జమ్మూ బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒకరు మృతిచెందగా..30 మందికి తీవ్రగాయాలైన సంగతి తెల్సిందే. పట్టుబడిన అనంతరం నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులతో పాటు సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతో నిందితుడిని త్వరగా పట్టుకోగలిగారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని జమ్మూ ఐజీ మనీష్ సిన్హా తెలిపారు. జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు -
జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు
శ్రీనగర్ : జమ్మూ బస్టాండ్ సమీపంలో ఓ బస్సులో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. బస్సులో బాంబు పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా, బాంబు పేలుడు ఘటనలో 30 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. బస్సుపై గ్రనేడ్ దాడి జరిగిందని జమ్మూ ఐజీ నిర్ధారించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా పుల్వామా ఉగ్రదాడి, ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ బస్టాండ్‌లోని బస్సులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, పోలీసు సిబ్బంది పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
భారీ వర్షాలతో నిలిచిన అమర్నాథ్ యాత్ర
జమ్మూ : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం జమ్మూలో అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో జమ్మూలోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి యాత్రను రద్దు చేశామని అధికారులు తెలిపారు. జమ్మూ నుంచి యాత్రికులను అమర్నాథ్ వైపు అనుమతించలేదని చెప్పారు. జూన్ 28న రెండు మార్గాల్లో ప్రారంభమైన 60 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్టు 26న రక్షా బంధన్ రోజు ముగియనుంది. కాగా ఆదివారం సాయంత్రం వరకూ 2,78,878 మంది యాత్రికులు అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. మరోవైపు అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడవచ్చనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో యాత్ర సాగే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. పోలీసు మృతి
శ్రీనగర్: జమ్మూలోని బటామలూ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక పోలీసు చనిపోగా ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ సందర్భంగా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం వేకువజామున భద్రతా బలగాలు శ్రీనగర్‌లోని బటామలూ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపై గ్రనేడ్ విసరడటంతోపాటు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుకుంటూ చీకట్లో పరారయ్యేందుకు యత్నించారు. పోలీసులు కూడా దీటుగా స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పర్వేజ్ అహ్మద్ అనే కానిస్టేబుల్ చనిపోగా ఇద్దరు పోలీసులు, ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. అయితే, పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోగలిగారు. -
సియర్ బాబా జలపాతంల వద్ద విషాదం
-
జలపాతంలో స్నానం చేస్తుండగా విషాదం
జమ్మూ : జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందగా దాదాపు 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలోని సియర్ బాబా జలపాతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రియాసి జిల్లాలోని సియర్ బాబా ఓ ఆధ్యాత్మిక ప్రదేశం కావటం వల్ల బాబా భక్తులు ఎక్కువగా అక్కడికి వస్తుంటారు. అక్కడ ఉన్న జలపాతంలో చిన్నాపెద్ద స్నానం చేస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగి జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై పడ్డాయి. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా 25 మంది గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, పోలీసులు గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. -
ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట..!
-
ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సుంజ్వాన్‌లోని ఆర్మీశిబిరంపై శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. తీవ్రవాదులు ఆర్మీ క్యాంపు వెనక వైపు ఉన్న నాలా ద్వారా చొరబడ్డట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ముగ్గురు లేక నలుగురు తీవ్రదాదులు పాల్గొన్నట్టు సమాచారం. ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ క్యాంపునకు 500 మీటర్ల వెలుపల ఉన్న అన్ని స్కూళ్లను మూసివేయాల్సిందిగా ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జైషే ఈ మొహ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడితో కేంద్రహోం శాఖ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్ డీజీపీతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
జమ్మూ/సాక్షి, చెన్నై: భారత్‌తో సరిహద్దు వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని సరిహద్దు వెంట ఆర్ఎస్ పురా, ఆర్నియా, రామ్‌గఢ్ సెక్టార్లలోని భారత ఔట్ పోస్టులపై బుధవారం రాత్రి నుంచి పాక్ కాల్పులు ప్రారంభించిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్‌కానిస్టేబుల్ ఎ.సురేశ్ చనిపోయారు. ఇంకా సరిహద్దులో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. -
కశ్మీర్లో మంచు తూఫాన్ నలుగురు మృతి
-
జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడి
-
లోయలో పేట్రేగుతున్న ఉగ్రవాదులు
శ్రీనగర్ : ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు భారీగా దాడులకు తెగబడ్డారు. భద్రతా బలగాలపై హతమార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడుల వివరాలు. జూన్ 13 : పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ బలగాలపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పది మంది జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. భధ్రతాబలగాలు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. జూన్ 16 : అనంతనాగ్ జిల్లాలోని అచాబల్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుమంది పోలీసులు మృతి చెందారు. జూలై 10 : అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతి చెందారు. ఆగస్టు 14 : బుద్గామ్ జిల్లాలో స్వతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న భద్రతా దళాలపై మిలిటెంట్లు గ్రెనేడ్లతో దాడి చేశారు. అయితే ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. ఆగస్టు 27 : పుల్వామా జిల్లాలోని హై సెక్యూరిటీ పోలీస్ జోన్‌పై మిలిటెంట్ల దాడి.. ఈ ఘటనలో ఎనిమిది మంది అధికారులు మృతి. ఈ దాడి చేసేంది మేమేని జైషే మహమ్మద్ ప్రకటన. సెప్టెంబర్ 1 : బద్రతా బలగాలను తీసుకెళ్తున్న వాహనంపై మిలిటెంట్ల దాడి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సెప్టెంబర్ 9 : అనంతనాగ్ పట్టణంలోని బస్‌స్టాండ్ వద్ద మిలిటెంట్ల దాడి. ఈ ఘటనలో ఒక జవాన్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. సెప్టెంబర్ 21 : బనిహాల్ పట్టణంలోని జమ్మూ-శ్రీనగర్ హైవే మీద భద్రతా బలగాలపై మిలిటెంట్ల దాడి. కొత్తగా ఉగ్రవాద గ్రూపులలో చేరిన ముగ్గురు యువకులు ఈ దాడికి పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇదే రోజు పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్ 4 : శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంప్‌పై మిలిటెంట్ల దాడి. భధ్రతా బలగాలు మిలిటెంట్లను సమర్థవంతగా ఎదుర్కొన్నాయి. ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఒక బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. -
హద్దులు దాటుతున్న పాక్
సాక్షి, జమ్మూ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ చట్టాన్ని ఉల్లంఘించింది. శనివారం అర్దరాత్రి పొద్దుపోయినప్పటినుంచీ పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద మోర్టార్ షెల్స్‌తో కాల్పులు జరుపుతోంది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. మరో 5మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులుకు తెగబడ్డం ఈ నెల్లో ఇది రెండోసారి. మోర్టార్ కాల్పుల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పాక్ కాల్పులకు ప్రతిగా బీఎస్ఎఫ్ జవాన్లు కూడా కాల్పులు జరిపారు. ఒకదశలో సరిహద్దు రేఖ వెంబడి బుల్లెట్ల వర్షం కురిసింది. -
ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులను బుధాన్ నుంచి మహోర్‌కు తీసుకు వెళుతుండగా టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలోని జామ్‌సలాం గ్రామంలోని చాచి నల్లా సమీపంలో చోటుచేసుకుంది. ఏడుగురు సంఘటనా స్థలంలోనే మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
విమాన బ్రేకులు ఫెయిలై టైర్లు పేలడంతో..
జమ్మూలో ల్యాండ్ అవుతుండగా బ్రేక్ ఫెయిల్, పేలిన టైర్లు జమ్మూ: జమ్మూ విమానాశ్రయంలో శుక్రవారం 134 మంది ప్రయాణికులతో కూడిన ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐ 821 విమానం మధ్యాహ్నం 12.15 గంటలకు ల్యాండ్ అవుతుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. తర్వాత నాలుగు టైర్లు పేలిపోయాయి విమానం రన్‌వేపై నుంచి పక్కకు జారి చివరకు రన్‌వే ఆఖరి భాగంలో నిలిచిపోయింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన వల్ల దాదాపు 10 విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. రన్‌వే తప్పిన విమానం ఎయిర్‌బస్ క్లాసిక్ ఏ320 రకానికి చెందినది. ఎయిరిండియా ఈ రకం పాత విమానాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెడుతోంది. ఇప్పటికే నాలుగు కొత్త విమానాలను కొనుగోలు చేసింది. -
పోలీస్ స్టేషన్ లో నిర్భయను మించిన ఘోరం
శ్రీనగర్: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ను మించిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే ఈ ఘటనలో నిందితులు సాక్షాత్తు పోలీసులే కావడం మరింత ఆందోళన రేకెత్తించింది. జమ్మూలోని కనాలాల్ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జమ్మూ కానాచక్ ప్రాంతానికి చెందిన చెందిన ఓ మహిళను (25) దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆమెపై నిర్హయ గ్యాంగ్ రేప్ తరహాలో తీవ్ర హింసను ప్రయోగించడంతోపాటు, లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కస్టడీలో ఉన్నపుడు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించాడు. అయితే మే 6వ తేదీన బెయిల్ మంజూరు కావడంతో తనకు జరిగిన ఘోరంపై న్యాయవాది సహాయంతో పోరాటానికి సిద్దపడింది బాధితురాలు. స్టేషన్ ఎస్.ఓ.ఒ.రాకేశ్ శర్మ ఒక వారంపాటు తనను హింసించిన తీరును మీడియాకు బాధితురాలు వివరించింది. తీవ్రమైన హింసతోపాటు, లైంగిక దాడికి పాల్పడ్డాడని, ప్రయివేట్ పార్ట్స్ లో బీర్ బాటిల్ .. కారంపొడిని చల్లారని ఆరోపించింది.కస్టడీలో ఉన్నప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేదని బాధితురాలు వాపోయింది. నీళ్ళు అడిగితే, మూత్రం త్రాగమంటూ పోలీసులకు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించింది. తనపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, తల్లి, భర్త, పిల్లలను పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు కూడా ఆ మహిళ ఆరోపించింది. బాధితురాలి తరపు న్యాయవాది ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్భయ కేసులోమాదిరిగా పోలీసులు ప్రవర్తించారని మండిపడ్డారు. కాపాడాల్సిన పోలీసులే బాధితురాలపై క్రూరత్వాన్ని చాటుకున్నారని ఆయన ఆరోపించారు.మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాన్ని వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ఉదంతంపై ర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. -
జమ్మూ కశ్మీర్లో ఆగని అల్లర్లు
-
జమ్ము-శ్రీనగర్ రహదారిపై రాకపోకలు బంద్
శ్రీనగర్: జమ్ము - శ్రీనగర్ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జమ్ముకాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరగిపడుతుండటంతో హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. సోమవారం నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తుండటంతో, అప్రమత్తమైన అధికారులు రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. -
మోదీ టూర్: శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పాత శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఆదివారం గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పోలీసు మృతి చెందగా, 11 మంది పోలీసులకు గాయాలయ్యాయి. నౌహట్టా ప్రాంతంలోని గంజ్‌బక్ష పార్కు సమీపంలో పహరా కాస్తున్న పోలీసులు లక్ష్యంగా తీవ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన పోలీసులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారని, ఈ క్రమంలోనే గ్రనేడ్ దాడి జరిగిందని అధికారులు చెప్తున్నారు. జమ్మూకశ్మీర్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉధంపూర్‌లో దేశంలో అతి పెద్దదైన చెనానీ-నష్రీ సొరంగమార్గాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ సొరంగ మార్గం వల్ల ప్రయాణదూరం గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా ఉధంపూర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఒకవైపు తప్పుదోవ పట్టిన కొంతమంది యువత రాళ్లు విసురుతున్నారు. మరోవైపు అకుంఠిత దీక్ష కలిగిన కశ్మీర్ యువత అవే రాళ్లను దేశ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. రక్తపాతం ద్వారా ఎవరూ లబ్ధిపొందరు. దానివల్ల ఎవరికీ ఎలాంటి మేలు ఒనగూడదు' అని హితబోధ చేసిన సంగతి తెలిసిందే. -
రాళ్లు విసురుతున్న యువతపై ప్రధాని కామెంట్!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం తాను ప్రారంభించిన చెనానీ-నష్రీ సొరంగ మార్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో ఈ సొరంగమార్గం అతిపెద్ద ముందడుగు అని పేర్కొన్నారు. ఉధంపూర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పర్యావరణానికి, హిమాలయాలకు ఏమాత్రం విఘాతం కలుగకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించామని, ఇందుకు కేంద్రం నిధులివ్వగా, దీని నిర్మాణంలో కశ్మీర్ యువత చెమటోడ్చడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేశారని కొనియాడారు. ఇటీవలికాలంలో కశ్మీర్ యువత తరచూ భద్రతా దళాలపై రాళ్లు విసురుతున్నారన్న వార్తలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర యువత ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఒకటి టూరిజం కాగా, మరొకటి టెర్రరిజం.. ఈ రెండింటిలో ఏది కావాలో యువత నిర్ణయించుకోవాలని సూచించారు. 'ఒకవైపు తప్పుదోవ పట్టిన కొంతమంది యువత రాళ్లు విసురుతున్నారు. మరోవైపు అకుంఠిత దీక్ష కలిగిన కశ్మీర్ యువత అవే రాళ్లను దేశ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. రక్తపాతం ద్వారా ఎవరూ లబ్ధిపొందరు. దానివల్ల ఎవరికీ ఎలాంటి మేలు ఒనగూడదు' అని మోదీ అన్నారు. తాజా సొరంగ నిర్మాణంలో కశ్మీర్ లో అభివృద్ధిని కొంత పుంతలు తొక్కిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏడాదికి 99 కోట్ల పెట్రోల్ ఆదా!
దేశంలో అతిపెద్దదైన చెనానీ-నష్రీ సొరంగమార్గం ప్రారంభం జమ్ము నుంచి శ్రీనగర్‌కు ప్రయాణసమయం రెండుగంటలు కట్ జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోదీ దేశంలోనే అతిపెద్ద సొరంగమైన చెనానీ-నష్రీ టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ సొరంగ మార్గం వల్ల ప్రయాణదూరం గణనీయంగా తగ్గనుంది. జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణదూరం 300 కిలోమీటర్లు కాగా.. ఈ సొరంగమార్గం ఏర్పాటు వల్ల అందులో 41 కిలోమీటర్ల దూరం.. 10.9 కిలోమీటర్లకు తగ్గనుంది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణసమయం కూడా రెండుగంటలు ఆదా కానుంది. అంతేకాకుండా పెట్రోల్ రూపంలో ఏడాదికి రూ. 99 కోట్లు ఆదా కానున్నట్టు భావిస్తున్నారు. ఉధంపూర్ జిల్లాలో ఆస్ట్రియన్ టెక్నాలజీతో ఈ సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సొరంగాన్ని ప్రారంభించిన అనంతరం జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, గవర్నర్ వోహ్రాతో కలిసి ప్రధాని మోదీ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. అనంతరం ఆయన ఉధంపూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారని తెలుస్తోంది. -
ఎమ్మెల్యే ఎస్కార్ట్‌పై ఉగ్ర కాల్పులు
శ్రీనగర్: జుమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం అనంతనాగ్ నుంచి షోపైన్కు వెళ్తున్న ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేది బుల్లెట్ ఫ్రూఫ్ కారు కావడంతో ఎమ్మెల్యేకు ఏమి కాలేదని పోలీసులు తెలిపారు. అయితే వాహనాలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయి. -
తుపాకితో కాల్చుకున్న జవాన్
జమ్మూ: ఓ వైపు అక్రమంగా ప్రవేశించిన ఉగ్రవాదులను తుదిముట్టిస్తూ సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే మరోవైపు ఓ జవాను తుపాకితో బలవన్మరణం పొందాడు. ఈ ఘటన జమ్మూలోని పూంచ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆర్ఆర్ సైనిక విభాగానికి చెందిన రోషన్ సింగ్ శనివారం సాయంత్రం స్టోర్ గదిలో తనకు తాను కాల్చుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. రోషన్ సింగ్ పంజాబ్‌కు చెందినవాడు. -
మళ్లీ పరీక్ష నిర్వహించాలి: ఇంటర్ విద్యార్థులు
జమ్మూ: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ లో సిలబస్ లోలేని ప్రశ్నలు అడిగారని జమ్మూ విద్యార్థులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని దిగ్భాందించారు. ఇంటర్ బోర్డు సిలబస్ లోలేని ప్రశ్నలు పరీక్షలో ఇచ్చిందని వారు తీవ్రంగా మండిపడ్డారు. స్కూల్ బోర్డు సిలబస్ లోలేని ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చిందని ప్రశ్నించారు. ఫిజిక్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని వారు డిమండ్ చేశారు. పోలీసులకు చెందిన వాహనాలను విద్యార్థులు ధ్వంసం చేయడంతో వారిని మా పర్యవేక్షణలోకి తీసుకున్నామని జమ్మూ డిప్యూటి కమీషనర్ సిమ్రన్ ధీప్ సింగ్ తెలిపారు. -
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఘర్షణలు
-
సరిహద్దులో కాల్పుల కలవరం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాక్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ శుక్రవారం కూడా సరిహద్దు గ్రామాలపై బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. గురువారం సాయంత్రం హీరానగర్, సాంబా సెక్టార్ల వద్ద గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకూ పాక్ రేంజర్లు మోటార్లతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లోని ఒక డజను ఇళ్లు నాశనం కాగా, మరో రెండు డజన్ల ఇళ్లు స్వల్పంగా ధ్వసం అయ్యాయి. పాకిస్తాన్ రేంజర్లకు గట్టి జవాబిచ్చిన బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ సరిహద్దు గ్రామాలను ధ్వంసం చేశారు. సుందర్బని, పల్లన్ వాలా, నౌషెరా సెక్టార్లలో శుక్రవారం ఉదయం నుంచి పాక్ కాల్పులు ప్రారంభించింది. దీంతో రంగంలోకి దిగిన బీఎస్ఎఫ్ బలగాలు పాక్ కు ధీటుగా బదులిస్తున్నాయి. కాల్పులకు సాంకేతికంగా బలమైన ఆయుధాలను పాకిస్తాన్ ఉపయోగిస్తున్న రక్షణ శాఖ పీఆర్వో తెలిపారు. -
రాజౌరీ సెక్టార్లో బయట పడిన మిలిటరి హైడవుట్
-
జమ్మూలో ఐఐఎం...
కశ్మీర్లో ఔట్-క్యాంపస్ ► ఈ ఏడాదే ప్రారంభం ► కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: భారతదేశపు 20వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను జమ్మూలో నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తర్వాత కశ్మీర్లో కూడా ఐఐఎం ఔట్-క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రతిపాదనకు గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచే 54 మంది విద్యార్థుల సామర్థ్యంతో జమ్మూలోని ఓల్డ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఐఐఎం తాత్కాలిక క్యాంపస్ ప్రారంభం కానుంది. ఇందుకు మొదటి నాలుగు సంవత్సరాలకు గాను రూ. 61.90 కోట్లు వ్యయం కానుంది. అలాగే.. ఎన్ఐటి - శ్రీనగర్ క్యాంపస్‌లో మౌలికవసతుల ఆధునీకరణకు రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించినట్లు హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఎయిమ్స్ కాలనీల పునరభివృద్ధి... ఢిల్లీలోని ఎయిమ్స్ కాంప్లెక్స్‌లో భాగంగా 60 ఏళ్ల కిందట నిర్మించిన నివాస కాలనీలను పునరభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ పునరభివృద్ధితో పాటు 30 ఏళ్ల పాటు నిర్వహణ, పర్యవేక్షణకు రూ. 4,441 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇథనాల్ ధర సవరణకు ఆమోదం స్వేచ్ఛా మార్కెట్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తూ.. పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగించే ఇథనాల్ ధరలను సవరించే కొత్త వ్యవస్థకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఫలితంగా ఇథనాల్ ధర లీటరకు రూ. 3 తగ్గి రూ. 39 కి దిగింది. చెరకు నుంచి తీసే ఇథనాల్ ధరను ఇకపై చెరకు మార్కెట్ ధర, డిమాండ్ - సరఫరా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. జార్ఖండ్‌లోని సాహిబ్గంజ్ను బిహార్‌లోని మణిహారితో అనుసంధానిస్తూ రూ. 1,955 కోట్లతో హైవే ప్రాజెక్టును చేపట్టేందుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. -
భారత గగనతలంలోకి పాక్ విమానం?
జమ్మూ: పాకిస్థాన్ విమానమొకటి సోమవారం భారత గగనతలంలోకి వచ్చి, కొన్ని నిమిషాల్లోనే తిరిగి వెళ్లిందని తెలుస్తోంది. జమ్మూలోని ఆర్ఎస్ పుర ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఒక విమానం కనిపించిందని బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) చెప్పింది. ఆరు రెక్కలతో సిల్వర్ రంగులో ఉన్న ఎగిరే వస్తువు మధ్యాహ్నం 1.10 గంటలకు భారత గగనతలంలోకి వచ్చి వెంటనే వెనక్కి వెళ్లినట్లు జవాను ఒక నివేదికను ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయానికి పంపారు. ఇందులో నిజమెంతో తెలుసుకోవాలని వాయుసేనను బీఎస్ఎఫ్ కోరింది. అనుమానాస్పద విమానం వచ్చిన ట్లు తమ రాడార్స్ గుర్తించలేదని వాయుసేన తెలిపింది. -
ఎట్టకేలకు వెయ్యిమంది కదిలారు
జమ్మూ: ఎట్టకేలకు మరోసారి అమర్ నాథ్ యాత్ర ముందుకు సాగుతోంది. శాంతిభద్రతలు పర్యవేక్షించిన పోలీసులు జమ్మూ నుంచి ప్రస్తుతం 1000మంది యాత్రికులను అనుమతించారు. గత కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్ లో ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వేలమంది అమర్ నాథ్ యాత్రికులు జమ్మూలో నిలిచిపోయారు. అరకొర వసతులతో నానా అవస్థలు పడుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన పోలీసులు, అధికారులు కొంత పరిస్థితి మెరుగైందనే నిర్ణయానికి వచ్చి 731మంది పురుషులను, 219 మంది మహిళలను 50 మంది సాధువులను అనుమతించారు. వీరంతా 29 వాహనాల్లో పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపులకు జమ్మూలోని భగవతి నగర్ నుంచి బయల్దేరారు. -
'ఈరోజు కూడా యాత్రకు నో'
జమ్ము: అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లో అశాంతికర పరిస్థితుల నేపథ్యంలో మరోసారి యాత్రికులను అధికారులు అడుగు కూడా వేయనివ్వడం లేదు. మరోపక్క 6,679మంది యాత్రికులు ఇప్పటికే దర్శనం ముగించుకొని అక్కడి నుంచి ఇటు వచ్చే పరిస్థితి లేకుండా అయింది. అలాగే, ప్రస్తుతం భగవతి నగర్ యాత్రి నివాస్‌లో 1,700మంది ఎదురుచూస్తున్నారు. దీనిపై ఓ సీనియర్ అధికారి వివరణ ఇచ్చాడు. ఈరోజు లోయలో పరిస్థితులు గమనించిన తర్వాతే మరోసారి చర్చించుకొని యాత్రికులను అనుమతించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
అమర్నాధ్కు వెళ్లి చిక్కుకుపోయిన యాత్రికులు