రాష్ట్రంలో పారిశుధ్యాన్ని కాపాడే అంశంపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ ఏడాది ముగిసేలోపు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి రాష్ట్రంలో వ్యాధులు ప్రబలకుండా చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇటీవల కామెర్ల వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందిన కశ్మీర్ కుల్గామ్ జిల్లాలోని చెక్ వానిగండ్ గ్రామంలో ఇప్పటికే 240 మరుగుదొడ్లు నిర్మించామని, మిగిలిన 1.33 లక్షల మరుగుదొడ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. వైద్యులు, నిపుణులతో సమీకృత వ్యాధి నిరోధ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కుల్గామ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని నిపుణుల బృదం బాధిత గ్రామంలో సందర్శించి ప్రజల నుంచి రక్త నమూనాలతోపాటు, నీటి నమూనాలను కూడా సేకరించినట్లు తెలిపారు. నిపుణుల బృందం సేకరించిన రక్త నమూనాల్లో 8 హెపటైటిస్ ఇ పాజిటివ్స్ ఉన్నట్లు గుర్తించామని, రోగులకు చికిత్సను ప్రారంభించినట్లు ప్రతినిధులు చెప్తున్నారు.
మొత్తం 1545 మంది జనాభా ఉన్నకుల్గామ్ గ్రామంలో ఒక్క గర్భవతిపై కూడా వ్యాధి ప్రభావం లేదన్నారు. గ్రామంలోని ప్రజలంతా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షితమైన తాగునీటిని వినియోగించాలని, వ్యర్థాలను పారేసే విషయంలో కూడా నిబంధనలు పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతినిధులు తెలిపారు. మరోవైపు ఇంటింటి సర్వే నిర్వహించి హెపటైటిస్ వైరస్ వ్యాప్తి పట్ల ప్రజల్లో ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పిస్తామని అన్నారు.
వ్యాధుల నిర్మూలనే ధ్యేయంగా..
Published Wed, Mar 2 2016 3:52 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement