శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ కెప్టెన్ మృతిచెందగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతాబలగాలకు అందిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు అస్సార్ నది ఒడ్డున దాక్కున్నారు. ఈ నేపధ్యంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది. నిర్దిష్ట సమాచారం అందిన దరిమిలా పాట్నిటాప్ సమీపంలోని అకర్ ఫారెస్ట్‌లో భారత సైన్యం, జేకేపీ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని పేర్కొంది. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు ఆర్మీ పేర్కొంది.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బారాముల్లాలో భద్రతను గణనీయంగా పెంచారు. సీనియర్ అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాగా జమ్ముకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై చర్యలు చేప్టటేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా సంస్థల అధిపతులు పాల్గొననున్నారు.
*Op ASSAR*
Based on specific intelligence inputs, a joint operation by #IndianArmy and #JKP was launched in Akar Forest near Patnitop.
Contact has been established with the terrorists and operations are in progress.@adgpi@NorthernComd_IA@JmuKmrPolice pic.twitter.com/j967WkaHFA— White Knight Corps (@Whiteknight_IA) August 13, 2024
Comments
Please login to add a commentAdd a comment