underway
-
జమ్ము కశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ కెప్టెన్ మృతిచెందగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతాబలగాలకు అందిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు అస్సార్ నది ఒడ్డున దాక్కున్నారు. ఈ నేపధ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది. నిర్దిష్ట సమాచారం అందిన దరిమిలా పాట్నిటాప్ సమీపంలోని అకర్ ఫారెస్ట్‌లో భారత సైన్యం, జేకేపీ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని పేర్కొంది. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు ఆర్మీ పేర్కొంది.ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బారాముల్లాలో భద్రతను గణనీయంగా పెంచారు. సీనియర్ అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాగా జమ్ముకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై చర్యలు చేప్టటేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా సంస్థల అధిపతులు పాల్గొననున్నారు. *Op ASSAR* Based on specific intelligence inputs, a joint operation by #IndianArmy and #JKP was launched in Akar Forest near Patnitop.Contact has been established with the terrorists and operations are in progress.@adgpi@NorthernComd_IA@JmuKmrPolice pic.twitter.com/j967WkaHFA— White Knight Corps (@Whiteknight_IA) August 13, 2024 -
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
-
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముంద్కా ప్రాంతంలో ఉన్న విడిభాగాల ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం మంటలంటుకున్నాయి. ఇవి మరింత విస్తరించి భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది. Delhi: 26 fire tenders present at the spare parts factory in Mundka, where a fire has broken out. https://t.co/O8XY1gDSss pic.twitter.com/sidhMphqdo — ANI (@ANI) February 13, 2020 -
అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్
శ్రీనగర్ : జుమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య బుధవారం తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని లాల్ చౌక్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంలో సైన్యం ఆ ప్రాంతాన్ని అర్ధరాత్రి నుంచి జల్లెడ పడుతుంది. భద్రతా బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ముందుగా కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ప్రతికాల్పులు జరుపుతున్నారు. ఉయం నాలుగు గంటల నుంచే పెద్ద ఎత్తున కాల్పుల, పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కొందరు తీవ్రవాదులు ఇక్కడి ఇళ్లలో ఉన్నారనే సమాచారంతో తాము కార్డన్ సెర్చ్ చేపట్టినట్టు తెలిపారు. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఎన్కౌంటర్ ప్రారంభం కాగానే అధికారులు అనంత్‌నాగ్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా శ్రీనగర్ నుంచి బనిహల్ మార్గంలో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నుట్టు రైల్వే అధికారులు తెలిపారు. -
వారణాసిలో మోదీ రోడ్ షో
-
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
-
శాస్త్రవేత్తలను రక్షించేందుకు సాహసం...
అనారోగ్యంతో ఉన్న ఇద్దరు సైంటిస్టుల ప్రాణాలు కాపాడేందుకు దక్షిణ ధృవానికి అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా రెండు చిన్న విమానాలు బయల్దేరాయి. అంటార్కిటికాలో శీతాకాలం నడుస్తున్న సమయంలో ఇటువంటి ప్రయోగం నిజంగా సాహసమేనని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పోలార్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ కెల్లీ ఫాల్కనర్ తెలిపారు. దక్షిణ ధృవానికి వెళ్ళిన ఇద్దరు శాస్త్రవేత్తలకు కొన్ని అనుకోని కారణాలవల్ల అనారోగ్యం సంభవించిందని, అయితే వారిప్రాణాలు రక్షించేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెల్లీ పాల్కనర్ వివరించారు. ప్రతియేటా 50 మంది శాస్త్రవేత్తల బృదం శీతాకాలానికి ముందే దక్షిణ ధృవానికి చేరుకుని అక్కడే దాదాపు ఆరునెలలు ఉంటారు. శీతాకాలం సమయంలో అక్కడినుంచీ వారు ఎట్టిపరిస్థితిలో బయటకు వచ్చే అవకాశం ఉండదని, రేడియో కాంట్రాక్టుద్వారా అమెరికా, రష్యాల్లోని కమాండింగ్ సెంటర్లకు సమాచారం పంపుతుంటారు. అయితే ఈ సీజన్ లో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనుకోకుండా అనారోగ్యం సంభవించినట్లు సమాచారం అందిందని, ప్రయోగాత్మకంగా వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పాల్కనర్ తెలిపారు. అయితే వారికి అందించే మెడికల్ హెల్ప్ కు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం గోప్యతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్, లాక్ హీడ్ మార్టిన్ లు కలసి ప్రతి సంవత్సరం దక్షిణ ధృవానికి వెళ్ళే ఈ బృందాన్ని ఎంపిక చేస్తుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము అన్ని నిర్ణయాలు సమతుల్యంగా ఉండేట్లు ప్రయత్నిస్తున్నామని పాల్కనర్ చెప్తున్నారు. ఈ సమయంలో రోగుల పరిస్థితి, విమాన సిబ్బంది భద్రత తో పాటు అముంద్సేన్ స్కాట్ లోని మిగిలిన 48 మంది శాస్త్రవేత్తల అసవసరాలను కూడ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అయితే 60 సంవత్సరాల సౌత్ పోల్ రీసెర్స్ సెంటర్ చరిత్రలో ఈ తరహా రెస్క్యూ ఆపరేషన్లు రెండు మాత్రమే జరిగాయని, ఇటువంటివి ఆసాధారణంగా ఉంటాయని, శీతాకాలంలో అత్యంత మంచుతోను, చీకటిగాను ఉన్నసమయంలో అక్కడ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ వంటి వాటికి ఎంతమాత్రం అనుకూలంగా ఉండదని అంటున్నారు. 1999 లో, ఓ డాక్టర్ తన ఛాతీభాగంలో క్యాన్సర్ కణతిని గుర్తించి, తనకు తానే శస్త్రచికిత్స చేసుకొని, అనంతరం కీమో థెరపీ చేసుకోగా, ఆమెను బయటకు తెచ్చేందుకు శీతాకాలం ముగిసే సమయంలో బృందం వెళ్ళింది. పదేళ్ళ తర్వాత 2001 ఆగస్టులో ఓ మేనేజర్ గుండెపోటుకు గురికాగా, ఓ వైమానిక బృదం రిస్క్ తీసుకొని మరీ అక్కడకు వెళ్ళి ఆయన్ను క్షేమంగా బయటకు తెచ్చింది. కాగా ప్రస్తుతం దక్షిణ ధృవంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనారోగ్యం సంభవించడంతో నేషనల్ ఫౌండేషన్ అధికారులు వారిని క్షేమంగా బయటకు తెచ్చే సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు. -
పఠాన్‌కోట్ లో మళ్ళీ పేలుడు కలకలం
పంజాబ్: పఠాన్‌కోట్ భారత వైమానిక స్థావరం బయట మంగళవారం మరోసారి భారీ పేలుడు శబ్దం వినిపించింది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూండగానే మళ్లీ పెద్ద ఎత్తున పేలుడు వినిపించడం కలకలం రేపింది. దీంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగివున్నారనే దానిపై మరింత ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు అసలు భారత సైనిక దుస్తుల్లో పఠాన్-కోట్ ఎయిర్-బేస్ వరకు ఎలా రాగలిగారు? లోపలి మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది? లోపల ఉన్నవారే ఎవరైనా ఉగ్రవాదులకు ఉప్పందించారా లాంటి అంశాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ ఎత్తున పేలుడు శబ్దం రావడంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగి వున్నరానే దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. గత మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
సాయంత్రం వరకు నిమజ్జన వేడుకలు