defecation
-
31లోగా ఓడీఎఫ్ రాష్ట్రంగా తెలంగాణ3
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 31 టార్గెట్‌గా పెట్టుకు ని బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) రాష్ట్రం గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలు గా తీర్చేదిద్దే పనిని వేగవంతం చేయాలని ఆదేశించా రు. స్వయం సహాయక సంఘాలు నిధులు సక్రమం గా వినియోగించుకునేలా దృష్టి సారించాలని సెర్ప్ అధికారులను కోరారు. యువతకు ఉపాధి అవకాశా లు కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించారు. ముందుగా తన నియోజకవర్గం పాలకుర్తిలో జాబ్‌మేళా ఏర్పాటు చేయాలని కోరారు. బుధవారం సచివాలయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్), సెర్ప్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆసరా పింఛన్లకు సంబంధించి 57 ఏళ్లు పైబడిన కొత్త లబ్ధిదారులను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై అసంతృప్తి.. ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై ఎర్రబెల్లి అసంతృప్తి వ్యక్తం చేశా రు. వారితో సక్రమంగా పనిచేయించే బాధ్యత అధికారులే తీసుకోవాలన్నారు. తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లను సమీపంలోని కొత్త పంచాయతీల బాధ్యతలు అప్పగించాలన్నారు. ఉపాధి హామీ కూలీలు పూర్తి వేతనం పొందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల కార్యాలయ భవనాల నిర్మాణాని కి చర్యలు తీసుకోవాలన్నారు. శ్మశాన వాటికలు లేని గ్రామాల్లో భూసేకరణకు రూ. 2 లక్షలు అందించే యత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆ శాఖ కమిషనర్ నీతూ కుమారి తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధుల నిర్మూలనే ధ్యేయంగా..
రాష్ట్రంలో పారిశుధ్యాన్ని కాపాడే అంశంపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ ఏడాది ముగిసేలోపు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి రాష్ట్రంలో వ్యాధులు ప్రబలకుండా చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇటీవల కామెర్ల వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందిన కశ్మీర్ కుల్గామ్ జిల్లాలోని చెక్ వానిగండ్ గ్రామంలో ఇప్పటికే 240 మరుగుదొడ్లు నిర్మించామని, మిగిలిన 1.33 లక్షల మరుగుదొడ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. వైద్యులు, నిపుణులతో సమీకృత వ్యాధి నిరోధ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కుల్గామ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని నిపుణుల బృదం బాధిత గ్రామంలో సందర్శించి ప్రజల నుంచి రక్త నమూనాలతోపాటు, నీటి నమూనాలను కూడా సేకరించినట్లు తెలిపారు. నిపుణుల బృందం సేకరించిన రక్త నమూనాల్లో 8 హెపటైటిస్ ఇ పాజిటివ్స్ ఉన్నట్లు గుర్తించామని, రోగులకు చికిత్సను ప్రారంభించినట్లు ప్రతినిధులు చెప్తున్నారు. మొత్తం 1545 మంది జనాభా ఉన్నకుల్గామ్ గ్రామంలో ఒక్క గర్భవతిపై కూడా వ్యాధి ప్రభావం లేదన్నారు. గ్రామంలోని ప్రజలంతా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షితమైన తాగునీటిని వినియోగించాలని, వ్యర్థాలను పారేసే విషయంలో కూడా నిబంధనలు పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతినిధులు తెలిపారు. మరోవైపు ఇంటింటి సర్వే నిర్వహించి హెపటైటిస్ వైరస్ వ్యాప్తి పట్ల ప్రజల్లో ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పిస్తామని అన్నారు.