సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 31 టార్గెట్‌గా పెట్టుకు ని బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) రాష్ట్రం గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలు గా తీర్చేదిద్దే పనిని వేగవంతం చేయాలని ఆదేశించా రు. స్వయం సహాయక సంఘాలు నిధులు సక్రమం గా వినియోగించుకునేలా దృష్టి సారించాలని సెర్ప్ అధికారులను కోరారు. యువతకు ఉపాధి అవకాశా లు కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించారు. ముందుగా తన నియోజకవర్గం పాలకుర్తిలో జాబ్‌మేళా ఏర్పాటు చేయాలని కోరారు. బుధవారం సచివాలయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్), సెర్ప్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆసరా పింఛన్లకు సంబంధించి 57 ఏళ్లు పైబడిన కొత్త లబ్ధిదారులను గుర్తించాలని మంత్రి ఆదేశించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై అసంతృప్తి..
ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై ఎర్రబెల్లి అసంతృప్తి వ్యక్తం చేశా రు. వారితో సక్రమంగా పనిచేయించే బాధ్యత అధికారులే తీసుకోవాలన్నారు. తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లను సమీపంలోని కొత్త పంచాయతీల బాధ్యతలు అప్పగించాలన్నారు. ఉపాధి హామీ కూలీలు పూర్తి వేతనం పొందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల కార్యాలయ భవనాల నిర్మాణాని కి చర్యలు తీసుకోవాలన్నారు. శ్మశాన వాటికలు లేని గ్రామాల్లో భూసేకరణకు రూ. 2 లక్షలు అందించే యత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆ శాఖ కమిషనర్ నీతూ కుమారి తదితరులు పాల్గొన్నారు.
31లోగా ఓడీఎఫ్ రాష్ట్రంగా తెలంగాణ3
Published Thu, Feb 28 2019 4:25 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment