సాక్షి, హైదరాబాద్: మీది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించటం లేదా రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని సీరియస్ అయ్యారు. అలాగే, తాను పార్టీ మారడంలేదని క్లారిటీ ఇచ్చారు.
కాగా, ఎర్రబెల్లి దయాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి. ఆరు నెలల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. కరెంట్ లేదు, మోటార్లు కాలి పోతున్నాయి. రైతులు ఆగం అవుతున్నారు.. కుప్పకూలి పోతున్నారు ఇది నిజం.
రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించటం లేదా రేవంత్ రెడ్డి?. ఆగస్టు 15 వరకు ఎలా రెండు లక్షల రుణమాఫీ చేస్తావు. ఇది మోసం.. బోగస్ మాటలు కాదా రేవంత్ రెడ్డి?. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిత్యం ఇచ్చాము. ఇప్పుడు రైతుబంధు లేదు, ఎరువులు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు. పాత రోజులు మళ్ళీ వస్తున్నాయి.
నేను పార్టీ మారటం లేదు. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. ప్రస్తుతం నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశాము. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయి, పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం. అంతే తప్ప నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే నా ధ్యేయం’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment