Errabelli Dayakar rao
-
జమిలి ఎన్నికలపై ఎర్రబెల్లి ఆసక్తికర కామెంట్స్
సాక్షి,వరంగల్: బీఆర్ఎస్ దీక్షాదివస్ సందర్భంగా వరంగల్‌లో శుక్రవారం(నవంబర్ 29) జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని,కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని ఎర్రబెల్లి అనడం చర్చనీయాంశమైంది. ‘కేసిఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు.పార్టీ శ్రేణులు,ప్రజలు అధైర్య పడొద్దు.వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలి దేవత సోనియాగాంధీ. రేవంత్ రెడ్డికి సిగ్గులేదు. సోనియాగాంధీని నాడు బలి దేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవత అంటున్నాడు.రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా?తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ చేసిన ఘనత కేసిఆర్‌ది. కాంగ్రెస్‌కు ఓటువేసిన ప్రజలంతా తప్పు చేశామని భావిస్తున్నారు’అని ఎర్రబెల్లి అన్నారు. -
రేవంత్ వ్యాఖ్యలకు ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
రైతులను నట్టేట ముంచుతున్న రేవంత్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొదలవుతు న్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన రైతుభరోసా హామీని ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం అమలు చేయడం లే దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతాంగం గొంతుకోయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ, ఈ పాటికే రైతుబంధు డబ్బులు పడా ల్సి ఉందని, రైతుభరోసా పేరు చెప్పి రైతులను మో సం చేస్తున్నారని విమర్శించారు.రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్ లైన్ పెట్టారని, అయితే అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని, సీజన్ అయిపోయాక రైతు భరో సా ఇస్తారా? అని ప్రశ్నించారు. రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదని నిల దీశారు. కేసీఆర్ హయాంలో 68.90 లక్షల మందికి 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద ఇచ్చినట్లు చెప్పారు.మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారని, రైతు భరోసాకు పట్టాదార్ పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలని అన్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడి యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, డిసెంబర్ 9న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇపుడు కేబినెట్లో చర్చిస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. -
కేసీఆర్ ను మళ్లీ సీఎంని చేస్తా
-
రైతు ప్రభుత్వం అనడానికి సిగ్గులేదా రేవంత్?: ఎర్రబెల్లి ఫైర్
సాక్షి, హైదరాబాద్: మీది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించటం లేదా రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని సీరియస్ అయ్యారు. అలాగే, తాను పార్టీ మారడంలేదని క్లారిటీ ఇచ్చారు.కాగా, ఎర్రబెల్లి దయాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి. ఆరు నెలల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. కరెంట్ లేదు, మోటార్లు కాలి పోతున్నాయి. రైతులు ఆగం అవుతున్నారు.. కుప్పకూలి పోతున్నారు ఇది నిజం.రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించటం లేదా రేవంత్ రెడ్డి?. ఆగస్టు 15 వరకు ఎలా రెండు లక్షల రుణమాఫీ చేస్తావు. ఇది మోసం.. బోగస్ మాటలు కాదా రేవంత్ రెడ్డి?. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిత్యం ఇచ్చాము. ఇప్పుడు రైతుబంధు లేదు, ఎరువులు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు. పాత రోజులు మళ్ళీ వస్తున్నాయి.నేను పార్టీ మారటం లేదు. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. ప్రస్తుతం నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశాము. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయి, పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం. అంతే తప్ప నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్లోనే ఉంటూ మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే నా ధ్యేయం’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఎర్రబెల్లిపై ఫిర్యాదు కేసులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ–మెయిల్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవి గుప్తాలకు అందిన ఈ ఫిర్యాదులోని అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఎర్రబెల్లి ఆదేశాలతో పోలీసు అధికారులు తనను బెదిరించి, తన పేరిట ఉన్న ఇంటిని బలవంతంగా ఆయన బంధువుల పేరిట రాయించారని శరణ్ చౌదరి ఆరో పించారు. ఓ వైపు ఎస్ఐబీ అధికారుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తుండగా, మరోవైపు ఆ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై శరణ్ చౌదరి ఫిర్యాదు చేయ డం కలకలం సృష్టిస్తోంది. ఇంటిని రాయించుకోవ డంతో పాటు బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. బూటు కాళ్లతో తన్నారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు.. దయాకర్‌రావు ఆదేశాలతో తనను బూటు కాళ్లతో తన్ని, పలుమార్లు చెంపదెబ్బలు కొడుతూ హింసించినట్టు కూడా శరణ్ చౌదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘2023 ఆగస్టు 21న నేను నా కార్యాలయానికి వెళుతుండగా ప్రైవేటు కారులో సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు బలవంతంగా సీసీఎస్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. నా కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావు బంధువు విజయ్ పేరిట నా ఇంటిని రిజిస్టర్ చేయాలని అప్పటి హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వ రరావు బలవంతపెట్టారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నన్ను బూటు కాళ్లతో తన్నారు. రెండురోజులు అక్రమంగా నన్ను వారి కస్టడీలో పెట్టుకున్నారు. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులను డబ్బుల కోసం ఒత్తిడి చేశారు. అప్పుడు నా స్నేహితుడు రూ.50 లక్షలు పంపాడు. చివరకు నా ఇంటిని విజయ్ పేరిట రాసేందుకు అంగీకరించిన తర్వాత నన్ను బయటకు పంపించారు. తర్వాత న్యాయం కోసం నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే పోలీసులను నా ఇంటి మీదకు పంపారు. రిట్ పిటిషన్ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించారు. ఏసీపీ ఉమామహేశ్వరావు ఒత్తిడి తట్టుకోలేక నేను నా రిట్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నా..’ అని శరణ్ చౌదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న రాజ కీయ పరిణామాలను అడ్డుపెట్టుకుని లబ్ధి పొందడానికే వడ్డేపల్లి శరణ్ చౌదరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శరణ్ చౌదరి, ప్రవాస భారతీయుడు విజయ్‌కు నడుమ జరిగిన వ్యాపార, రియల్ ఎస్టేట్ లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేద న్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. -
శరణ్ చౌదరి ఎవరో తెలియదు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: తనపై శరణ్ చౌదరి ఆరోపణలు చేశారని తన దృష్టికి వచ్చిందని.. ఆయన ఎవరో తెలియదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, శరణ్ చౌదరి బీజేపీలో ఉన్నాడని తెలిసింది. శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డాడని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని ఎర్రబెల్లి అన్నారు. ‘‘దొంగ డాక్యుమెంట్లు సృష్టించి శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డారు. ఎన్.ఆర్.ఐ.విజయ్‌కు, శరణ్ చౌదరి రెండు కోట్లు బాకీ వున్నారు శరణ్ చౌదరిపై చాలా కేసులు వున్నాయి. శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ ఎవరో నాకు పరిచయం లేదు. శరణ్ చౌదరి, అతని భార్య పాస్ పోర్టులను పోలీసులు సీజ్ చేశారు. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నా.. ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదు’’ అని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. బంజారాహిల్స్ పీఎస్ లో శరణ్ చౌదరి పై అనేక కేసులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నన్నెందుకు లాగుతున్నారో అర్దం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు నాకు సంబంధం లేదు. ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ప్రణీత్ రావు వాళ్ల బంధువులు మా ఊర్లో ఉంటారని తెలిసింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. నేను ప్రస్తుతం పార్టీ మారే ఉద్దేశ్యం లేదు. నేను పార్టీ మారను. పార్టీ మారాలని నాపై పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’’ అని దయాకర్‌రావు తెలిపారు. ‘‘శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ నాకు బంధువు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను అనేక కేసులు ఎదుర్కొన్నాను. గతంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రజల కోసం జైలుకు వెళ్లాను’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. -
‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’
హన్మకొండ: తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఎర్రబెల్లి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఓ ఫేక్ అని స్పష్టం చేశారు. మంగళవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ‘నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రణీత్ రావు ఎవరో కుడా తెలియదు. ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి. నా పేరు చెప్పాలని ప్రణీత్‌రావు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ కూడా నాకు తెలియదు. చాలా మంది నాయకులు పార్టీ వీడి పోతున్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారు అధికార పార్టీలోకి పోతున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటిలు అమలు చేయలేరు. ఎన్నికల కోసమే డ్రామా చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేరు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటే. నీళ్లు లేవు.. పంటలు ఎండిపోతున్నాయి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదు. కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం.. గెలుపు, ఓటములు సహజం. ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదు’అని ఎర్రబెల్లి అన్నారు. -
అత్త వ్యూహం.. కోడలు విజయం
పాలకుర్తి: ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందునుంచి ఊహించినట్లే పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పాలకుర్తి సీటు ఎంపికలో ఆ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న హనుమాండ్ల ఝాన్సీరెడ్డి .. చివరి నిమిషంలో ఆమె కోడలు యశస్వినిని బరిలోకి దింపారు. అత్త వ్యూహం.. కోడలు విజయం పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఝాన్సీరెడ్డి కుటుంబ సభ్యురాలైన యశస్వినినికే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీనిపై సర్వత్రా చర్చ కూడా జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా రాణిస్తూ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చెక్‌పెట్టేలా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ఎన్ఆర్ఐ ఝాన్సీలక్ష్మీరెడ్డిని రంగంలోకి దింపారు. ఇలాంటి తరుణంలోనే ఝాన్సీలక్ష్మీరెడ్డి భారత దేశ పౌరసత్వంపై వివాదం తలెత్తింది. వారం రోజుల వరకూ తనకు పౌరసత్వం వస్తుందనీ, ఏలాంటి అపోహాలకు గురికావద్దన్న ఝాన్సీరెడ్డి ప్రత్యామ్నయంగా తన కోడలును ఎన్నికల సమరంలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి హనుమాంఢ్ల ఝాన్సీరెడ్డి పౌరసత్వం అడ్డోస్తే దేవరుప్పుల మండలం మాధాపురంకు చెందిన ప్రముఖవైద్యులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణనాయక్ రావడం అనివార్యంగా బావించారు. కానీ పాలకుర్తి నుంచి కాంగ్రెస్ జెండా ఎగురవేసే లక్ష్యంగా ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తన కుటుంబం తగ్గేదీలేదని ఎట్టకేలకు తన కోడలు యశస్వినికి రెండో విడతలో కాంగ్రెస్ టికెటు సాధించడంలో సఫలీకృతమయ్యారు ఝాన్సీరెడ్డి, అప్పటివరకూ తానొక్కతే ప్రచారంలో దూసుకపోతున్న క్రమంలో తోడుగా కోడలు రావడంతో కొంత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నప్పటీకీ డబుల్ ప్రచారంతో ప్రభుత్వ వ్యతిరేకతను కలిగిన ప్రజల్ని కూడగట్టుకొని చారిత్రాత్మక విజయం సాధించి ఝూన్సీరెడ్డి తనమార్కు నిలుపుకున్నారు. ఫలితంగా తొలిసారి పోటీ చేసి గెలుపును సొంతం చేసుకోవడంతో యశస్విని అరుదైన ఘనతసు సొంతం చేసుకున్నారు. ఆది నుంచి ఎర్రబెల్లే టార్గెట్.. ఎర్రబెల్లిని కచ్చితంగా ఓడించాలనే వ్యూహంతో ఆది నుంచి పావులు కదిపిన కాంగ్రెస్ తన వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కాంగ్రెస్. యశస్విని కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేసి ఓటర్లను ఆకర్షించింది. దానికి తోడు కాంగ్రెస్ జోష్ కూడా తోడవడంతో ఆమె గెలుపు సునాయాసమైంది. ఇక పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. .ఎర్రబెల్లికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. కానీ అది ఈసారి కలిసి రాలేదు. కాంగ్రెస్ జోరు ముందు ఎర్రబెల్లి పరాజయం చెందారు. మరొకవైపు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామ్మోహన్రెడ్డ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి జాబితాలోనే సీటు దక్కించుకని ప్రచారాన్ని ఆదిలోనే ప్రారంభించినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం కాంగ్రెస్‌కే షిప్ట్ అయ్యింది. -
ఎర్రబెల్లికి నిరసన సెగ
-
TS: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది. ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్ -
నాపై పోటీకి అభ్యర్థులే లేరు
రాయపర్తి: ‘నాపై పోటీకి అభ్యర్థులే కరువయ్యారు.. అమెరికా నుంచి టూరిస్టులను తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిండ్లు’ అని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. శుక్రవారం మండలంలోని తిర్మలాయపల్లి, రాయపర్తి, గన్నారం, కొండూరు, బురహాన్‌పల్లి, కాట్రపల్లి, మొరిపిరాల, కిష్టాపురం, మహబూబ్‌నగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలినడకన ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ అని తేల్చిచెప్పారు. తాను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశా రు. సేవ చేశానే తప్ప అవినీతి పేరు తెచ్చుకోలేదు.. దయాకర్‌రావు హామీ ఇచ్చాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశాను.. కొత్తగా చేర్చిన హామీల ప్రకారం ప్రతి గ్రామంలో వంద డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా.. పదివేల మంది మహిళలకు కుట్టుశిక్షణ ఇప్పించి సంగెం టెక్స్టైల్ పార్కులో ఉద్యోగ అవకాశం కల్పిస్తా.. తిర్మలాయపల్లి, తొర్రూరులో ఆయిల్‌పాం మిల్లు పెట్టిస్తున్నాను.. అందులో వెయ్యిమందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేశాను.. కొడకండ్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయించాను.. గ్రామాల్లో ఉన్న కోతులను పట్టించి ఏటూరునాగారం అడవుల్లో వదలడమే కాకుండా అక్కడ కోతులకోసం పండ్ల మొక్కలను నాటించానని వివరించారు. ఆదరించి గెలిపిస్తే మీముందుకు వచ్చి మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్‌రావు, బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జ్ గుడిపూడి గోపాల్‌రావు, మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్‌రావు, పూస మధు, వనజారాణి, ఎండీ.నయీం, గబ్బెట బాబు, సర్పంచ్, ఎంపీటీసీలు గారె నర్సయ్య, గజవెల్లి అనంత, రాధిక, ఐత రాంచందర్, కర్ర సరితరవీందర్రెడ్డి, కుక్కల భాస్కర్, గాదె హేమలత పాల్గొన్నారు. పద్మశాలి సంఘం మద్దతు కొడకండ్ల: బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మండల పద్మశాలి సంఘం మద్దతు తెలిపింది. అధ్యక్షుడు పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో శుక్రవారం కులస్తులు మంత్రిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సొంత గూటికి చేరిన కార్యకర్తలు పాలకుర్తి : మండలం నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు కార్యకర్తలు కళాకారుడు చిరుపాటి ఎల్ల్ల స్వామి, రాజు మరో 20 మంది తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు శుక్రవారం వారిని మంత్రి దయాకర్‌రావు సతీమణి, ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదేవి స్వాగతించి కండువాలు కప్పారు. పాలకుర్తి వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు, ముదిరాజ్ సంఘం నాయకుడు మామిండ్ల శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు దేవరుప్పుల : పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం సాధించాలని కోరుతూ.. కామారెడ్డిగూడెం మసీదులో శుక్రవారం ముస్లింలు మతగురువు ఇనాయత్ రసూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఖాసీం, జాకీర్, ఖలీల్, షబ్బీర్, మీరాన్, అర్జుమాన్, మౌలానా, పాషా, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయకపోతే ప్రజలు ఐదేళ్లపాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం జనగాం జిల్లా పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరై కేసీఆర్ ప్రసంగించారు. పాలకుర్తి బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు సంధించారు. ‘‘మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని అంటున్నడు. రైతు బంధు దుబారానా?.. రైతు బంధు ఉండాలా? వద్దా? ఉండుడు కాదు.. దయాకర్‌ను గెలిపిస్తే రైతు బంధు రూ.16వేలకు పెంచుతాం. అదే కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు మాయమైపోతది.. ..ఇంకోకాయన మాట్లాడుతున్నడు. ఆయన టీపీసీసీ చీఫ్. కేసీఆర్‌కు ఏం పని లేదు. 24 గంటలు ఇచ్చి వేస్ట్ చేస్తున్నడు అని. కరెంట్ ఎన్ని గంటలు అవసరం. 24 గంటలు అవసరం. కానీ, కాంగ్రెస్ గెలిస్తే అది జరగదు. చెప్పేటోళ్లు ఎల్లయ్య.. మల్లయ్య కాదు.. ఆ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అమెరికాలో చెప్పిండు, ఇక్కడా టీవీ ఇంటర్వ్యూల్లో బల్లగుద్ది చెబుతున్నారు. కేసీఆర్‌కు ఏం తెల్వది. 10 హెచ్‌పీ మోటర్తో నడిపిస్తే మూడు గంటల కరెంట్ చాలంటున్నడు. మనం ఇక్కడ వాడేది 3, 5 హెచ్‌పీ మోటర్లు. మరి 10హెచ్‌పీ మోటర్ మీ అయ్య కొనిస్తడా? అని రేవంత్‌ను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలొస్తే ఇలాంటోళ్ల మాటలు విని గోల్మాల్కావడం కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతుంది. ఒక్కసారి కాదు 11, 12సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు. కడుపులో సల్ల కదలకుండా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయండి. ప్రలోభాలకు లోనై ఓటేయొద్దు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. అని సభకు హాజరైన ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారాయన. మంది మాటలు విని ఆగం కావొద్దు కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ధైర్యంగా పని చేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే పని చేయలేదని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఏది ఏమైనా కరెంటు సమస్య పరిష్కరించాలని స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. సమస్యను పరిష్కరించి చూపించాం. గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుకున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దళితులను ఆదుకుందా? కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు నీరు, కరెంటు సంగతి మీకు తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక హక్కు.. ఓటు. ఇది ఎలాపడితే అలా వేసేది కాదు. ఎన్నికలు అనగానే ఎందరో వస్తుంటారు.. ఏవేవో మాట్లాడుతుంటారు. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంది మాటలు విని ఆగం అయితే ఐదేళ్లపాటు కష్టాల పాలవుతాం. అందుకే ఓటు వేసే ముందు అన్ని ఆలోచించి వేయాలి. అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు వెళ్లాలి... వెనక్కి పోవద్దు. తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలని కోరుతున్నా. జానారెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నారు. గతంలో జనారెడ్డికి మీరు ఓటుతో బుద్ధి చెప్పారు. నాగార్జునసాగర్‌లో భగత్‌ను 70వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు 196 కేసులు వేశారు పదేళ్లుగా తెలంగాణలో సంక్షేమ పాలన అందించామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అన్నారు. ‘‘ఈసారి ఎన్నికలను మనం సీరియస్‌గా తీసుకోవాలి. ప్రజలు ఓటు వేసే ముందు.. పార్టీల చరిత్ర కచ్చితంగా చూడాలి. అభ్యర్థి గురించి ఆలోచించాలి. ఎవరి చేతిలో పెడితే రాష్ట్రం బాగుపడుతుందో ఆలోచన చేయాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, పదేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించాం. విధివంచితులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. సామాజిక బాధ్యతలో భాగంగానే పింఛన్లు పెంచాం. మళ్లీ అధికారంలోకి రాగానే రూ.5వేల వరకు పింఛన్ పెంచుతాం. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేశాం. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు రావాలి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొస్తే ఆపేందుకు కాంగ్రెస్ వాళ్లు 196 కేసులు వేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది’’ అని సీఎం కేసీఆర్ వివరించారు. -
నమ్మక ద్రోహి.. ఎర్రబెల్లి వల్లే జైలుకు వెళ్లాను: రేవంత్ రెడ్డి
సాక్షి, జనగామ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నామినేషన్ పురస్కరించుకొని నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంత్రి ఎర్రబెల్లిపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ఈ రావుల పాలన పోవాలంటే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించాలని రేంత్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో దొరల గడీలను పూడ్చివేద్దామన్నారు. పాలకుర్తి ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నారై ఝాన్సీ రెడ్డి అమెరికాలో డబ్బులు పోగుచేసి కృషి చేస్తుంటే.. ఇక్కడ సంపాదించిన వేలకోట్ల అక్రమ సంపాదనను మంత్రి దయాకర్ రావు అమెరికాలో పెట్టుబడులు పెడుతూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల దయాకర్ రావు రాజకీయంలో అక్రమ సంపాదనలే తప్ప.. ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఎర్రబెల్లికి బుద్ధి చెప్పాలి: రేవంత్ ఓటుకు నోటు కేసులో తాను జైలుకు పోవడానికి ఎర్రబెల్లినే కారణమని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో టీడీపీ బలహీన పడటానికి కూడా దయాకర్ రావునే కారణమని అన్నారు. ఎర్రబెల్లి వెన్నుపోటు పొడిచే వ్యక్తి, నమ్మక ద్రోహి అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, దయాకర్ రావు దొరల పాలనాలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజు అడిగిన పరిస్థితి లేదని విమర్శించారు. చెన్నూరు రిజర్వాయర్ కోసం రూ. 360 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ఎర్రబెల్లి దానిని రూ.7వందల కోట్లకు పెంచి, రూ.350 కోట్లు దోచుకున్న దొంగ అని ధ్వజమెత్తారు. ఓటు ద్వారా పాలకుర్తి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలని కోరారు. రేవంత్ ఐటమ్ సాంగ్ లాంటోడు: ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కౌంటర్ ఇచ్చారు. పాలకుర్తి ప్రజలను రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ దగ్గరకు వచ్చిన వారిని రేవంత్ రెడ్డి కాళ్లతో తన్నాడని విమర్శించారు. పాలకుర్తి ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఐటమ్ సాంగ్ లాంటోడని, ఈ విషయం తాను టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబుతో చెప్పానని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా దీనిని అంగీకరించారన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు పేయింటర్గా పనిచేసేవాడని, బ్లాక్ మెయిల్ చేసి ఈ స్థాయికి వచ్చాడని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. పది కోట్ల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని బయట రేవంత్ గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. దందాలు, బ్రోకరిజం బంద్ చేయాలని రేవంత్ రెడ్డికి అప్పుడే చెప్పానని తెలిపారు. దయన్న లెక్క నీతి నిజాయితీతో ఉంటే బతకలేమని అప్పుడు రేవంత్ రెడ్డి అన్న సంగతి గుర్తు చేశారు. తాము తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తే రేవంత్ రెడ్డి చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. పాలకుర్తి ప్రజలు నావెంటే ఉన్నారని స్పష్టం చేశారు. చదవండి: ఐటీ దాడులు.. పొంగులేటి అనుచరుడు ఆత్మహత్యాయత్నం -
పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌తో టుడేస్ లీడర్
-
అటు ఎర్రబెల్లి, ఇటు రేవంత్ రెడ్డి నామినేషన్స్
-
ఎర్రబెల్లికి ఎన్నారై ట్రబుల్ !
సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించే లక్ష్యంతో హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఓ ఎన్ఆర్ఐ మహిళను రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆమెకు పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారింది. దీంతో ఆమె కోడలికి పాలకుర్తి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాకు పౌరసత్వం సమస్యను సృష్టిస్తే..వారసత్వంతో కొడతా అంటోంది ఆ ఎన్ఆర్ఐ. ఎర్రబెల్లిని ఓడిస్తా అంటున్న ఆ ఎన్ఆర్ఐ ఎవరు? ఏమా కథ? ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ రక్తికట్టిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కంచుకోటగా ఉన్న పాలకుర్తిలో తాజా రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సరికొత్త అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపింది. ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేశారు. ఎర్రబెల్లికి ఉన్న రాజకీయ అనుభవంలో సగం వయస్సుకూడా లేని యువతి రాజకీయ అరంగేట్రం చేసి..ఎన్నికల బరిలో దిగడం ఇప్పుడు పాలకుర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థులిద్దరూ ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పటి వరకు ఓ సారి ఎంపీగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. తనపై పోటీ చేసి ఓటమి పాలైన రాజకీయ ప్రత్యర్ధులు మళ్ళీ పోటీకి ఆసక్తి చూపలేని పరిస్థితి తీసుకొచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్రమంత్రిగా కొనసాగుతూ ఏడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు పాలకుర్తి నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉన్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పోటీకి సిద్ధమై మూడు మాసాల క్రితం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశారు. సొంతూరు పాలకుర్తికి రాగానే కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపారు. ఆమె రాకతో రాజకీయంగా కాస్త ఇబ్బంది పడ్డారు ఎర్రబెల్లి. సరైన అభ్యర్థి దొరికారని కాంగ్రెస్ సంబరపడుతుండగా ఝాన్సీరెడ్డి పౌరసత్వ సమస్య పోటీకి అడ్డంకిగా మారింది. అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీరెడ్డి ఇండియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సకాలంలో ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. ఇక ఎర్రబెల్లి పై పోటీకి సరైన అభ్యర్థి లేరని అందరూ అనుకుంటుండగా...రాజకీయ అనుభవం లేకున్నా.. ఎర్రబెల్లిని ఎదుర్కోవడమే కర్తవ్యంగా భావిస్తూ ఝాన్సీరెడ్డి తన కోడలు యశస్వినిరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థి కోడలు యశశ్వనిరెడ్డితో కలిసి అత్త నియోజకవర్గంలో ఎంట్రీతోనే సత్తా చాటారు. భారీ ర్యాలీతో గులాబీ గూటిలో గుబులు పుట్టించారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునే దశలో ఉన్న ఝాన్సీరెడ్డి పౌరసత్వం రాకుండా అడ్డుకుంటే వారసత్వంతో ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు అమెరికాను వదిలి పురిటిగడ్డకు వచ్చిన బిడ్డలాంటి కోడలును ఆశీర్వదిస్తే సమ్మక్క సారక్క మాదిరిగా సేవలందిస్తామని పాలకుర్తి ప్రజల్లో జోష్ నింపారు. మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎర్రబెల్లి మాత్రం ప్రత్యర్థులు ఎవరైనా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారాచ్యూట్ నేతలకు పాలకుర్తిలో స్థానం లేదంటున్నారు. రాజకీయంగా ఝాన్సీరెడ్డి దూకుడు పెంచడంతో మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గం అంతా కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. పాలకుర్తిలో సర్వే రిపోర్ట్ లు సైతం ఆందోళన కలిగిస్తుండడంతో ఎర్రబెల్లి వినూత్న పద్ధతిలో ప్రచారం సాగిస్తూ ప్రజల మనిషిగా రికార్డు సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయ పరిణామాలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఎర్రబెల్లి తోపాటు ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు సైతం రంగంలోకి దిగి సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమై ప్రచారం సాగిస్తున్నారు. అటు కాంగ్రెస్ కేడర్‌తో ఝాన్సీరెడ్డి ఆమె కోడలు యశశ్వనిరెడ్డి.. ఇటు ఎర్రబెల్లి కుటుంబసభ్యులు, గులాబీ పార్టీ శ్రేణులు ఎత్తుకు పై ఎత్తులతో ప్రచారాన్ని హోరెత్తించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎర్రబెల్లికి ఎదురు లేదనుకున్న పాలకుర్తిలోఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి రాకతో రాజకీయం అలజడి మొదలైంది. పోటాపోటీ ప్రచారాలతోపాటు ఇరుపక్షాలవారు వలస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. నేతల మధ్య మాటల యుద్దం కొనసాగితే అనుచరులు మాత్రం వాట్సాప్ వేదికగా వార్ సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు శృతిమించి కేసుల వరకు వెళ్ళాయి. రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి కి వణుకు పుట్టించే పరిస్థితి ఈసారి ఎన్నికల్లో వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని ఇలాంటి నాయకులను ఎంతో మందిని చూసిన ఎర్రబెల్లికి ఈ ఎన్నిక ఓ లెక్క కాదనే వాదనా వినిపిస్తోంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. -
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా హనుమాండ్ల యశశ్విని రెడ్డి
-
కేటీఆర్‌ను విమర్శించడానికి రేవంత్‌కు అర్హత లేదు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-
టార్గెట్ ఎర్రబెల్లి.. ఝాన్సీరెడ్డి బదులు యశస్వినీ!
సాక్షి, హన్మకొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం గడుస్తున్న కొద్దీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మరోసారి హైలైట్ అయ్యింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పౌరసత్వం విషయంలో సమస్య కారణంగా ఆమెకు బదులుగా ఝాన్సీ కోడలు యశస్వినీ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ యశస్వినీ పేరును ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం కూడా ఉంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. మీరా నీతులు చెప్పేదంటూ.. -
ఎర్రబెల్లిని ఎదిరించేదెవరు?
-
ఎమ్మెల్యేను కొట్టిన మంత్రి..
-
ప్రధాని మోడీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైర్
-
ఇక మగాళ్ళ పని అయిపోయినట్లే..
-
మంత్రినైపోయా.. లేకుంటే కొట్టేవాడిని
సంగెం: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ జిల్లా సంగెం మండలంలో బుధవారం కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన మాటలు గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. గవిచర్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు దుర్మార్గపు అబద్ధపు మాటలు చెబుతుంటే.. ఈడ్చి కొట్టాలని ఉన్నా.. మంత్రి పదవి అడ్డు వస్తోందని పేర్కొన్నారు. తనకు టీడీపీని వీడాలని లేదని.. చంద్రబాబు ఇక్కడ దుకాణం ఎత్తివేసి ఆంధ్రాకు వెళ్లడంతో.. ఇక్కడ పార్టీని ఎంత లేపాలని చూసినా లేవదు కాబట్టి.. కార్యకర్తలను కాపాడుకోవడానికే బీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.