
నీరా రుచి చూస్తున్న వైఎస్ షర్మిల
పాలకుర్తి టౌన్/పాలకుర్తి: ‘పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ తెచ్చుకోనోడు మంత్రి అంట’అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఉద్దేశించి వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. టీడీపీలో ఉన్నప్పడు కేసీఆర్‌ను రాక్షసుడు అన్న మంత్రి దయాకర్‌రావు.. బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత కేసీఆర్ దేవుడు అయితే మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు.
ఇదే నియోజవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూడా పాదయాత్ర చేస్తున్నారని, ఆయనది పాదయాత్ర కాదు కారుయాత్ర అని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారందరూ కేసీఆర్‌కి అమ్ముడుపోయారని అన్నారు. కాగా, పాదయాత్రలో భాగంగా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం వద్ద కల్లుగీత కార్మికుడు గూడ రవిగౌడ్ కోరిక మేరకు షర్మిల నీరా రుచి చూశారు.
Comments
Please login to add a commentAdd a comment