padayatra
-
వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : కేటీఆర్
సాక్షి,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘వచ్చే ఏడాది పాదయాత్ర బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడేమే లక్ష్యం. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం’ అని ధీమా వ్యక్తం చేశారు.మరోసారి కేసీఆరే సీఎంఅంతకుముందు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు.రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి.ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను నంబర్ వన్ చేశారు కేసీఆర్.ఎస్ఎల్బీసీలో విషాదం.. చేపల కూర తింటున్న మంత్రులు ఎస్ఎల్బీసీలో విషాదం జరిగితే మంత్రులు చేపల కూర తింటున్నారు. ఓ మంత్రి నీళ్లు, వాటర్ కలిశాయని అంటున్నారు. గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్‌పై ద్వేషంతో జిల్లాలో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఇది. చెరువులు నింపితే బోర్లు ఎందుకు ఎండిపోతాయి. రేవంత్‌కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఒక్క మాట మాట్లాడదు. ఏం మాట్లాడకముందే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అసెంబ్లీని గాంధీభవన్ అన్న మజ్లిస్ సభ్యులపై చర్యలు తీసుకునే దమ్ము లేదా? అని ప్రశ్నించారు. -
జగనన్న చేసిన సాయం.. ‘తండేల్’లో చూపకపోవడం బాధాకరం
శ్రీకాకుళం అర్బన్: తండేల్ సినిమా యథార్థ ఘటన ఆధారంగా తీసినప్పటికీ అందులో పూర్తిస్థాయిలో సన్నివేశాలు చూపలేదని కె.మత్స్యలేశం గ్రామవాసి, మత్స్యకార సంఘ నాయకుడు, న్యాయవాది మూగి గురుమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రీల్ స్టోరీ తీశారే తప్ప రియల్ స్టోరీ తీయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 నవంబర్ 28న 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీలుగా చిక్కుకున్నారని, వారిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అపుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజాంలో జరుగుతున్న పాదయాత్రలో కలిశామని, మత్స్యకార కుటుంబాల సమస్య వివరించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బందీలను విడిపించారన్నారు. అనంతరం 22 మంది మత్స్యకారులతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున ఆర్ధిక సహాయం కూడా చేశారన్నారు. ఈ సంఘటన తండేల్ సినిమాలో లేకపోవడం బాధాకరమన్నారు.ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలుశ్రీకాకుళం అర్బన్: ‘తండేల్’ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సినిమా చిత్ర కథా రచయిత తీడ కార్తీక్ అన్నారు. శ్రీకాకుళంలోని ఎస్వీసీ థియేటర్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండేల్ సినిమా విజయంతో వచ్చిన సౌండ్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు దేశవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. సక్సెస్ మీట్‌కు చిత్ర యూనిట్ మొత్తం త్వరలోనే శ్రీకాకుళం రానుందని తెలిపారు. మత్స్యకారుడు గనగళ్ల రామారావు మాట్లాడుతూ పాకిస్తాన్లో తాము పడిన ఇబ్బందులు, బాధలను దర్శకుడు చందు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. బందీగా ఉన్న సమయంలో అన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయన్నారు. సమావేశంలో ఎస్వీసీ థియేటర్ మేనేజర్ రవి, అభిమానులు పాల్గొన్నారు. -
180 రోజులు..14 రాష్ట్రాలు.. 4,900 కి.మీలు
తిరుపతి కల్చరల్: గోరక్షణ, భూ సంరక్షణ, దేశ సుభిక్షతను కాంక్షిస్తూ బాలకృష్ణ గురుస్వామి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన గోమాతతో పాదయాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది. తొలిత మంగళం రోడ్డులోని బొంతాలమ్మ ఆలయం వద్ద స్థానికులు, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన సభ్యులు గోమాత పాదయాత్రకు హారతులు పట్టి స్వాగతం పలికారు. గోమాత పాదయాత్ర దారుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ భూ సంరక్షణ గోమాత రక్షణతోనేనని, భరతభూమి రక్షణతో దేశం సుభిక్షతతో వరి్థలిల్లుతుందన్నారు. గోమాతను సంరక్షించి తద్వారా భారతభూమి సారవంతమైన భూమిగా పర్యావరణం పరిమళించడంతో దేశం, మానవాళి సుభిక్షతగా ఉంటారనే నినాదంతో గోమాతతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 180 రోజుల పాటు 14 రాష్ట్రాల మీదుగా 4,900 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పది రాష్ట్రాల మీదుగా 3710 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపతికి నగరానికి చేరుకున్నామన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి పాదయాత్రను కన్యాకుమారికి కొనసాగిస్తామని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం గోమాతను రక్షించాలని కోరుతూ చేపడుతున్న ఈ పాదయాత్ర పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. అనంతరం అక్కడ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం, అలిపిరి వరకు గోమాత పాదయాత్ర సాగించారు. -
మూసీ నదిలో రేవంత్ రెడ్డి పర్యటన
-
సీఎం రేవంత్ యాత్ర నేపథ్యంలో ముందస్తు అరెస్టులు
-
భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యకర్తల కోరిక మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం అత్యంత నీచమన్నారు. తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్న సీఎం రేవంత్, ఆయన వందిమాగధులపై ప్రజల మద్దతుతో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ‘ఆస్క్ కేటీఆర్’పేరిట నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. ఆయా అంశాలు కేటీఆర్ మాటల్లోనే.. ఈ నష్టం నుంచి కోలుకోవడం కష్టమే.. ‘‘తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు కాంగ్రెస్ ప్రారంభించిన రాజకీయ వేధింపులకు భయపడేది లేదు. కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి, ఢిల్లీ కోసమే అన్నట్టుగా తయారైంది. రాష్ట్రం నుంచి పెట్టుబడులు కూడా వెనక్కి మళ్లుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న నష్టం నుంచి తెలంగాణ కోలుకోవడం కష్టమే. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పారీ్టకి తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం అతిపెద్ద సవాల్‌గా మారుతుంది. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం నీచం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదు. సుమారు రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురయ్యాను. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్థం కాదు. రేవంత్ అధికారంలోకి వచి్చన తర్వాత ఈ నీచ రాజకీయ సంస్కతి అత్యంత హీనదశకు చేరుకుంది. కాంగ్రెస్‌ను ఐదేళ్ల కోసం ప్రజలు ఎన్నుకున్నారు. ఈ సీఎం ఐదేళ్లు పదవిలో ఉంటారా లేదా అనేది చెప్పలేం. కాంగ్రెస్‌లో ఎప్పుడైనా ఎలాంటి పరిణామమైనా జరగొచ్చు. ఆ అధికారులను గుర్తుపెట్టుకుంటాం! విధులు మరిచి, చట్టవిరుద్ధంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై రెచి్చపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుని.. మేం అధికారంలోకి వచి్చన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొందరు పోలీసు అధికారులు బిజీగా ఉండటంతో శాంతిభద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలసి పనిచేస్తున్నాయి. ఇచి్చన హామీలను అమలు చేయని కాంగ్రెస్ వంటి పారీ్టలపై చర్యలకు బలమైన సంస్కరణలు అవసరం. కొత్త సంవత్సరంలో జనంలోకి కేసీఆర్.. ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్‌గా మారారు. త్వరలో సోషల్ మీడియా విభాగంతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. పార్టీ అధినేత కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో పారీ్టకి, నాయకులకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హమీల అమలుకు సరిపడా సమయం ఇచ్చారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తాం. ప్రతిపక్ష పారీ్టగా నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం వచి్చంది. పార్టీ ఫిరాయింపులు జరిగిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖాయం..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర
-
కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది. -
తిరుమల: సొమ్మసిల్లిన పవన్.. పాదయాత్ర రసాభాస
సాక్షి, తిరుపతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పాదయాత్ర రసాభాసగా సాగింది. నిన్న(మంగళవారం) తిరుపతి అలిపిరి మెట్లమార్గం నుంచి 4.45 నిముషాలకు ప్రారంభించిన పాదయాత్ర దాదాపు 5 గంటలపాటు నడిచి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 9.20 నిముషాలకు తిరుమలకు చేరుకున్నారు. నడకదారిలో పాదయాత్ర ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆదిలోనే నిరసించిపోయారు. అలసిపోయి నడవడానికి ఇబ్బందులు పడ్డారు. దారిపొడవున కూర్చుంటూ వచ్చారు. నడవలేక అష్టకష్టాలు పడ్డారు.. ఎలాగోలా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.పవన్ కల్యాణ్ పాదయాత్ర సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులను మధ్యలోనే అపేసారు.. డిప్యూటీ సీఎం వద్ద మార్కులు కొట్టేయడానికి టీటీడీ అధికారులు, పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మెట్లమార్గం పొడవున రోప్ వేసి తిరుమలకు వచ్చే భక్తులను చుక్కలు చూపించారు. గోవింద నామస్మరణలతో మార్మోగాల్సిన తిరుమల గిరులు వ్యక్తిగత నినాదాలతో తిరుమల పవిత్రతను మంటగలిపారు. ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందే నినాదాలు చేస్తున్నా ఆపకుండా వేడుక చూశారు.. సనాతన ధర్మం అంటూ నినదిస్తున్న పవన్‌కి తిరుమల పవిత్రతను కాపాడాలని తెలియదా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు పోలీసులు మరో అడుగు ముందుకేసి మోకాళ్ళ మెట్లు వద్ద వాహనాలను ఆపివేశారు. దాదాపు గంటన్నర పాటు వాహనాలు నిలిపోవడంతో తిరుమల జీఎన్సీ వరకు వాహనాలు నిలిపోయింది. దీంతో స్వామివారిని దర్శించుకోని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు.ఇదీ చదవండి: కింకర్తవ్యం!? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మథనంగంటపాటు ఆలస్యం కావడంతో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు సకాలంలో చేరుకోలేక నానా కష్టాలు పడ్డారు. తిరుమలకు చేరుకున్న పవన్ కల్యాణ్ బస్టాండ్ వరకు నడిచి అక్కడి నుంచి వాహనంలో పద్మావతి ప్రాంతంలో ఉన్న గాయత్రి నిలయం చేరుకున్నారు. -
Political Corridor: కేటీఆర్ పాదయాత్ర..
-
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల దుష్ప్రచారం నమ్మొద్దు
చందుర్తి (వేములవాడ): రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుస్తుందని సర్వేలు చెబుతుండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ అన్నారు. దీనిని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఆదివారం బండి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కట్టలింగంపేటలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచారం నమ్మొద్దని కోరారు. స్వయం ప్రకటిత మేధావి గత ఎన్నికల్లో ఎక్కడి నుంచో వచ్చి కరీంనగర్లో పోటీ చేశాడని, ఇప్పుడు సైతం ఇక్కడ ఎంపీగా గెలుస్తానని కలలు కంటున్నాడని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యత లోపించి కూలేందుకు సిద్ధమైందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు నెలల పాలనతో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయామని భావి స్తున్నారని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. -
నేటి నుంచి ‘బండి’యాత్ర
కరీంనగర్ టౌన్: ‘మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న ఈ మహాయాగంలో మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా మీ గడపకొస్తున్నా.. ఆశీర్వదించండి’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. యా త్రను విజయవంతం చేయాలని కోరారు. శనివారం ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రారంభమయ్యే తొలివిడత యాత్ర ఈనెల 15 వరకు కొనసాగనుంది. తొలిరోజు యాత్ర మేడిపల్లి, కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడ, బొమ్మెన, దూలూరు, సరికొండ, కథలాపూర్ గ్రామాల్లో జరగనుంది. రాత్రి కథలాపూ ర్లో సంజయ్ బసచేస్తారు. తొలివిడతలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే క్రమంలో వాహనం వాడతారు. గ్రామాల్లో మా త్రం పాదయాత్రగా ముందుకు సాగుతారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. నియోజకవర్గం మొత్తం పర్యటించేలా రూట్‌మ్యాప్ ప్రజాహిత యాత్ర పేరిట కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేసేలా ఇప్పటికే సంజయ్ రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మొదట కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి సంజయ్ తనయాత్రను ప్రారంభించనున్నారు. తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి తంగళ్లపల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నారు. తొలిదశలో మొత్తం 119 కి.మీ. మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రతీ మండలం కవర్ చేస్తూ.. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు యాత్రను కొనసాగించేలా షెడ్యూల్‌ను రూపొందించారు. -
అయోధ్యకు చేరువలో పాదయాత్రికురాలు షబ్నం!
మతపరమైన ఆంక్షలన్నింటినీ దాటుకుని ముంబై నుంచి శ్రీరాముని దర్శనానికి కాలినడకన బయలుదేరిన షబ్నం ఇప్పుడు అయోధ్యకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. ఆమె హలియాపూర్‌లోని అయోధ్య సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇది తన కల నిజమవుతున్న తరుణమని అన్నారు. కొద్దిసేపటిలో రామ్‌లల్లా దర్శనం చేసుకోబోతున్నానన్నారు. షబ్నం షేక్‌కు హాలియాపూర్‌లో స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ముంబైలో ఉంటున్న షబ్నమ్ షేక్ (23) బీకామ్ విద్యార్థిని. రామునిపై ఆమెకు ఉన్న భక్తిప్రపత్తులను ఆమె సోషల్ మీడియాలో వెల్లడిస్తుంటారు. 38 రోజుల క్రితం ఆమె తన ముగ్గురు హిందూ స్నేహితులైన రమణ్ రాజ్ శర్మ, వినీత్ పాండే, శుభమ్ గుప్తాలతో కలిసి అయోధ్యకు కాలినడకన బయలుదేరారు. శనివారం సాయంత్రం హాలియాపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర స్థానికులు వారికి స్వాగతం పలికారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రతాప్ ధాబా నిర్వాహకుడు హరి ప్రతాప్ సింగ్, అతని భార్య ప్రీతి సింగ్ షబ్నం బృందానికి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని వారు కోరారు. షబ్నం వారి అభ్యర్థనను అంగీకరించారు. ఈ సందర్భంగా షబ్నం మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి శ్రీరామ భక్తురాలినని, అయోధ్యకు సమీపానికి చేరుకోవడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను రెండు రోజుల పాటు అయోధ్యలో ఉండి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకుని, ఆ తర్వాత తిరిగి ముంబైకి చేరుకుంటానన్నారు. -
కరువు, చంద్రబాబు కవలపిల్లలు
పుట్టపర్తి: కరువు, చంద్రబాబు కవలపిల్లలని, ఆయన హయాం మొత్తం కరువు రాజ్యమేలిందని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపే పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన తొమ్మిది రోజులపాటు చేపట్టిన ‘వైఎస్సార్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర’ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ముగింపు సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో పంటలు ఎండిపోయి రైతులు అల్లాడిపోయారన్నారు. వైఎస్సార్ చలువతో హంద్రీ–నీవా కాలువ తవ్వడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం అనేక చెరువులకు నీరందుతుండడంతో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులను నింపితే రెండు లక్షల ఎకరాలు సాగులోకి రావడమే కాకుండా సుమారు రెండు లక్షల జనాభాకు తాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. -
ఏంటో యువగళం గందరగోళం..లోకేష్ పాదయాత్రపై పేర్ని నాని పంచులు
-
భారత్ న్యాయయాత్ర.. రాహుల్ మళ్లీ పాదయాత్ర
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర ద్వారా జనంలో వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్ న్యాయయాత్ర పేరుతో రాహుల్ ఈసారి పాదయాత్ర చేయబోతున్నారని.. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. రెండో విడతలో.. ఈశాన్యం నుంచి పశ్చిమ భారతం వైపు రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అయ్యి 14 రాష్ట్రాలు.. 85 జిల్లాల గుండా ఉంటుంది. మణిపూర్‌లో మొదలై.. ముంబై దాకా దాదాపు 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. మార్చి 20వ తేదీతో యాత్ర ముగుస్తుంది. అయితే ఈసారి యాత్రకు భారత్ జోడో యాత్ర అని కాకుండా.. భారత్ న్యాయయాత్ర అని పేరు పెట్టినట్లు తెలిపారాయన. రాహుల్ యాత్ర ఈసారి హైబ్రీడ్ మోడల్లో సాగనుంది. అంటే.. బస్సు ద్వారా, కాలి నడక ద్వారా రాహుల్ యాత్ర కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారు. భారత్ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో రాహుల్ భారత్ న్యాయయాత్ర చేయబోతున్నారు. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదు. ఈసారి యువతను, మహిళలను, అణగారిన వర్గాలతో రాహుల్ ముఖాముఖి అవుతారని వెల్లడించారు. #WATCH | Congress General Secretary KC Venugopal says, "Now Rahul Gandhi is doing a yatra with great experience from the first Bharat Jodo Yatra. This Yatra is going to interact with youth, women and marginalised people. This Yatra will cover a distance of 6,200 kms. It travels… pic.twitter.com/ICfR4jDExA — ANI (@ANI) December 27, 2023 జోడో యాత్ర సాగిందిలా.. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకేనని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ‘మిలే కదం.. జుడే వతన్ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో రాహుల్ యాత్ర మొదలైంది. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా.. 12 రాష్ట్రాల్లో సాగింది. 145 రోజుల (దాదాపు 5 నెలలు)పాటు దాదాపు 3970 కి.మీ మేర రాహుల్ యాత్ర కొనసాగించారు. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది. -
జంపింగ్ జపాంగ్ యాత్ర..పవన్ కు అవమానం
-
యువగళం వేదికపై పగటి వేషగాళ్లు
-
ఇంతేనా.. ఇంక వీళ్లు మారరా??
నారా లోకేష్ యువగళం-నవశకం సభ అట్టర్ ప్లాప్. ఈ మాట రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్ కాదు.. స్వయంగా టీడీపీ హార్డ్‌కోర్ అభిమానులే చెబుతున్న మాట. అంతకు మించి సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ అభిమానులు చర్చించుకుంటున్న విషయం. అందుకు కారణాల్ని విశ్లేషిస్తే.. సహాజంగా వేదిక ఎక్కితే ఊగిపోయే పవన్.. నిన్నటి సభలో తగ్గి మాట్లాడాడు. బహుశా తాను చంద్రబాబుకి బానిసే అని విషయం ఇలా చెప్పాలనుకున్నారో ఏమో. ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వడం లేదు అంటూనే.. చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని తెగ ఫీలైపోయారు. నమ్ముకున్నవాళ్లు ఏమైపోతే నాకేంటి.. బాబు కోసమే తాను పని చేసేది, చేయబోయేది అని తన స్పీచ్ ద్వారా పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఇదే వేదిక నుంచి జనసైనికులు, అభిమానులకు ఊరట ఇచ్చేలా ఏదైనా సందేశం ఇస్తాడా? అని ఆశిస్తే.. అదీ జరగలేదు. ఇక బాలయ్య స్పీచ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉచితాలకు, సంక్షేమ పథకాలకు తేడా గుర్తించలేకపోతున్నారాయన. పవన్ కల్యాణా? అతనెవరో తెలియదు!. అలగా బలగా పార్టీలు, సంకర పార్టీలు అంటూ పలికిన నోరు.. ఇప్పుడు ‘తమ్ముడు పవన్ కళ్యాణ్.. ఇక తెగిద్దాం’.. ‘మా ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి’’.. అనే సరికి వినలేక ‘‘అయ్య బాబోయ్..’’ అనుకున్నాయి. అక్కడి నుంచి తెలుగుదేశం కార్యకర్తలు నవ్వుతూ బయటకు వెళ్లిపోవడం కనిపించింది. ఇక జనసేన సైనికుల ముఖచిత్రాల్లో ఎక్స్ప్రెషన్ గురించి చెప్పనక్కర్లేదు. పాదయాత్ర అనుభవాలతో ఎంతో నేర్చుకున్నాడట నారా లోకేష్. గతంలో పలువురు నాయకులు చేసిన యాత్రకు.. ఆగి ఆగి సాగిన చినబాబు యాత్రకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. లోకేష్ తన యాత్రలో ఎక్కువ సమూహాలను కలిసిందే లేదు. కేవలం ప్రభుత్వాన్ని తిట్టాలి.. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని ఆలోచనతో త్వరగతిన ముగించారే తప్పా.. సీరియస్‌గా సాగని ఆ యాత్రను, నిన్న జరిగిన ముగింపు సభలో లోకేష్ ప్రసంగాన్ని ఏపీ ప్రజలు కూడా అంతే లైట్ తీసుకున్నారు. లోకేశ్ ప్రసంగం.. రోజూ వారీ యాత్రలో చేసిన ప్రసంగంలానే సాగింది. మాట తీరులో ఎలాంటి మార్పూ రాలేదు. మొత్తంగా.. టీడీపీకి తెల్లజెండా ఎత్తేంత వరకు నిద్రపోను అనే రీతిలో సాగింది లోకేష్ స్పీచ్. ఇక జనసేనలో నెంబర్ టూగా చెప్పుకునే నాదెండ్ల అయితే ఏకంగా, ఊహించని రీతిలో లోకేష్ భజన చేశారు. పొరపాటున పొత్తు ప్రభుత్వం గెలిస్తే.. నారా లోకేష్ సీఎం!! అవుతాడంటూ అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ మాటలకు ‘ష్..’ విస్తుపోవడం చాలామంది వంతు అయ్యింది. ఇక నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం గురించి చెప్పాలి. ఎన్నికల నిమిత్తం తాను గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి గుర్తుచేశారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి.. మంచిని మచ్చుకైనా ప్రస్తావించలేదు. ఎందుకంటే.. అక్కడ ఏం లేదు కాబట్టి. గత వారం పదిరోజులుగా పొత్తుపై అసంతృప్తిగా ఉంటూ వస్తున్న పవన్‌ను ఊరడించేలా మాట్లాడారు. నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం ఉందంటూనే.. వ్యక్తిగతం దూషణలతో దిగజారి ప్రసంగించారు. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నేతగా చంద్రబాబు అంత పేలవంగా మాట్లాడతారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. నారా లోకేష్ బాబు ఒక ఐరన్ లెగ్.. కాలు పెట్టాడు. కాస్త దూరం నడిచాడు. ఇంక ఏముంది.. ఫసక్!. కట్ చేస్తే.. భోగాపురం మండలం పోలిపల్లి సభ వేదికపై ఒక్కరి మొహంలో కూడా నవ్వు లేదు. చంద్రబాబు సహా ఒక్కరి ప్రసంగంలో పస లేదు. ఒంటరిగా వచ్చి 151 సీట్లు కొట్టి బాహుబలిలా ఎదిగారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. నాలుగున్నరేళ్లలో ప్రజలకు చేరువలోనే ఉన్నారాయన. అలాంటిది ఇప్పుడు జగన్‌ను ఓడించగలమా? ఇంతమంది కలిసినా ఓడిపోతే తల ఎక్కడ పెట్టుకోవాలి?.. ఇదే భయం వాళ్ల కళ్లలో స్పష్టంగా కనిపించింది. ::: సాక్షి వెబ్, పొలిటికల్ డెస్క్ -
అయ్యా బాబోయి లోకేష్ స్పీచ్...ఉన్న నలుగురు జంప్
-
నారా లోకేష్ పాదయాత్ర పై సర్వత్రా విమర్శలు
-
యువగళం..ఓ అట్టర్ ప్లాప్ షో
-
మాలోకం గారి విహార యాత్ర
-
ప్రజా స్పందన కరువైన లోకేష్ పాదయాత్ర
-
ప్రగల్బాలకే పరిమితమైన నారా లోకేష్
-
విషయం చాలా వీక్..
-
పాయకరావుపేట రోడ్డు కూడా తాకలేవు
-
పాదయాత్ర పేరుతో లోకేష్ ఇక్కడ అడుగుపెడితే
-
మాలోకంపై మహిళా లీడర్ వేరే లెవెల్ ర్యాగింగ్
-
లోకేష్ పాదయాత్రలో వంగలపూడి అనిత పరువు తీసిన టీడీపీ కార్యకర్తలు
-
చిన్నపిల్లల లాగులు తడుపుతున్న లోకేష్..
-
Nara lokesh: లోకేష్ వస్తే మరింత నష్టం తప్పదని టీడీపీ నేతల్లో ఆందోళన
-
లోకేష్ పాదయాత్రకు మంగళం
రాష్ట్రమంతా నడుస్తానంటూ నానా హంగామా చేసిన నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను మరో పది రోజుల్లో ముగించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నడవాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎంతగా సూచించినా.. లోకేష్ మాత్రం తన వల్ల కాదని తేల్చిచెప్పినట్టు సమాచారం. పాదయాత్రకు పార్టీ చాలా ప్రచారం చేసిందని, ఇప్పుడు మధ్యలోనే నిలిపివేస్తే మైలేజీ రాదని పార్టీ సీనియర్లు చెప్పినా.. లోకేష్ ససేమిరా అన్నట్టు తెలిసింది. ఇప్పటికే చాలా నడిచాను, ఇంకా నడవాలంటే తన వల్ల కాదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. అవకాశం దొరికితే పాదయాత్రకు బ్రేక్ ఏ నాయకుడికయినా జనంలో ఉండడం గొప్ప అవకాశం. దాన్ని సరిగా నిర్వహించుకోగలిగితే.. అన్ని వర్గాలకు చేరువ కావడం సులభం. పైగా తెలుగునాట ఇప్పటివరకు పాదయాత్రలు చేసిన వారందరికి అద్భుతమైన అవకాశాలు వచ్చాయి, ప్రజలు అంతేస్థాయిలో ఆదరించారు. అదే ఉద్దేశ్యంతో లోకేష్‌ను పాదయాత్రకు దించారు చంద్రబాబు. కానీ, ఆరంభం నుంచి ఈ పాదయాత్రను ఎప్పుడు ఆపేద్దామా అన్నట్టు సాగింది. చంద్రబాబు అరెస్టయినప్పుడు లోకేష్ వెంటనే పాదయాత్ర నిలిపివేశారు. నిజానికి పార్టీ కార్యకలపాలు స్తంభించినప్పుడు.. లోకేష్ జనంలోకి వెళ్లి నడిచి ఉంటే.. మంచి మైలేజీ వచ్చేదేమో. అయితే పాదయాత్ర ఆపేసి ఢిల్లీ వెళ్లిపోవడంతో లోకేష్ నాయకత్వంపై సందేహాలొచ్చాయి. బెయిల్ తర్వాతా అదే పరిస్థితి చంద్రబాబు అక్టోబర్ 31న విడుదలయ్యాడు. ఆ తర్వాతయినా లోకేష్ కదులుతాడా.. అంటే అతి కష్టమ్మీద నెట్టాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తీరా ఎన్నికల సమయంలో ఇచ్ఛాపురం వరకు నడిచి ఉంటే.. కనీసం డ్యామేజీకంట్రోల్ అయ్యేది. కానీ మొదటి నుంచి ఉత్తరాంధ్ర అంటే చిన్నచూపు చూసే లోకేష్.. తన యాత్రను పోలిపల్లితో సరిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. పోలిపల్లిలో యువగళానికి మంగళం మరో పది రోజుల్లో, డిసెంబర్ 17న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం పాదయాత్రను ముగించాలని లోకేష్ నిర్ణయించారు. విశాఖ నుంచి భోగాపురం మద్య దూరం దాదాపు 60 కిలోమీటర్లు. అదే ఇచ్ఛాపురం నుంచి భోగాపురం మధ్య దూరం దాదాపు 200 కిలోమీటర్లు. అంటే చివరి 200 కిలోమీటర్లను లోకేష్ తన యాత్ర నుంచి కత్తిరించేశారు. ఇక ఇప్పటివరకు చేసిందేమీ లేకున్నా.. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముగింపు సభ నుంచే చంద్రబాబు రాజకీయం ప్రారంభం 52 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు.. బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు పాటు కోర్టు ఆంక్షల వల్ల ఇంటికే పరిమితమయ్యారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెరవెనక మంత్రాంగాలతో సరిపెట్టారు. ఆ తర్వాత ఆంక్షలు ముగిసినా.. ఆధ్యాత్మిక యాత్రలతో పర్యటనలు జరిపారు. ఒక భారీ బహిరంగ సభ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ముగింపు సభను అవకాశంగా తీసుకుని మళ్లీ రాజకీయాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభకు పవన్ కళ్యాణ్‌కు కూడా ఆహ్వానం పంపారు. డిసెంబర్ 17న ఆదివారం రానుంది. ఇన్నాళ్లు మ్యానిఫెస్టోను ఆలస్యం చేసిన చంద్రబాబు, పవన్ ఆ రోజు కనీసం మినీ మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా? -
6 రోజుల పాటు కాలినడకన తిరుమలకు పాదయాత్ర
-
సీఎంకు కృతజ్ఞతతో..శబరిమలకు పాదయాత్ర
పెనుగొండ: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న తన కూతురికి లక్షలాది రూపాయల వ్యయంతో అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి అవసరమని, పేద ప్రజలకు అండగా నిలిచే నాయకుడు జగనే మళ్లీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఓ అయ్యప్ప మాలధారుడు శబరిమలకు పాదయాత్రను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తూర్పుపాలెంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆచంట మండలం అయోధ్యలంకకు చెందిన కొప్పాడి రాంబాబు కుమార్తె హనీ చిన్న వయసులోనే అరుదైన వ్యాధికి గురైంది. వ్యవసాయం చేసుకొంటూ జీవించే రాంబాబు వైద్యం చేయించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో 2022 జూన్ 23న గంటి పెదపూడి వచ్చిన సీఎం జగన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో సత్వర వైద్యానికి ఆర్థికంగా అండగా నిలుస్తానని సీఎం భరోసా ఇచ్చారు. హనీకి ప్రతి నెలా రూ.1.50 లక్షలతో ఇంజక్షన్ చేయించవలసి ఉంది. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందంటూ సీఎం భరోసా ఇచ్చి అక్టోబర్‌లో వైద్య సహాయం ప్రారంభించారు. దీనికి గాను ఒకేసారి 40 ఇంజక్షన్లను అందజేశారు. అవి ఇప్పటివరకు రావడంతో మరోసారి 24 ఇంజక్షన్లు 2 రోజుల్లో పంపించనున్నారని రాంబాబు శుక్రవారం తెలిపారు. వైద్యం అందించడమే కాకుండా, కోనసీమ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలోనూ చదువుకునేందుకు ఏర్పాటు చేసి, నెలకు రూ.10 వేలు పింఛన్ సౌకర్యం కల్పించారని తెలిపారు. అందుకే సీఎంగా జగనే కావాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ శబరిమల వరకు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. -
జనాలు లేరు..‘జెండాలూ’ లేవు.. నీరసంగా లోకేశ్ యువగళం
తాళ్లరేవు: టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తోన్న యువగళం పాదయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నీరసంగా సాగుతోంది. లోకేశ్ బస చేసిన తాళ్లరేవు మండలం సుంకరపాలెం శిబిరం నుంచి ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. లచ్చిపాలెం, బాపనపల్లి, పి.మల్లవరం, తాళ్లరేవు, కోరంగి, పటవల, జి.వేమవరం మీదుగా చొల్లంగి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం లచ్చిపాలెం, బాపనపల్లి గ్రామాల మధ్య టీడీపీ నేతలు పలు సంఘాలు, రైతులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే జనం లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన ఎంతకీ రాకపోవడంతో చేసేదిలేక స్థానిక టీడీపీ నేతలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులను పంపాలని యాజమాన్యాలను అభ్యర్థించారు. దీంతో మండల పరిధిలోని పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు రహదారి వద్ద లోకేశ్‌కు స్వాగతం పలికారు. కోరంగిలో లోకేశ్ మాట్లాడుతూ..టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పారు. లిక్కర్ వేలంపాటలో కల్లు గీత కార్మికులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, పాదయాత్రలో ఎక్కడా జనసేన కార్యకర్తలు, జెండాలు కనిపించకపోవడం గమనార్హం. చదవండి: ఇక కాళ్ల బేరమే! -
ఓ అసమర్ధుని కామెడీ యాత్ర
-
లోకేష్ ని ఏకిపారేసిన మంత్రి జోగి రమేష్
-
అడ్డంగా దొరికిన నారా లోకేష్ డబ్బుల పంపిణీ
-
కిరాయి కూలీలు..అడ్డంగా దొరికిన లోకేష్
-
నారా లోకేష్ యువగళం వాయిదా!.. టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్!
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ కావడంతో టీడీపీని కొత్త భయం పట్టుకుంది. పార్టీని ముందు నడిపే నాయకుడు లేకపోవడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టు సమాచారం. చినబాబు భయంతో పాదయాత్రకు బ్రేక్.. ► లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా ► యువగళం పాదయాత్ర తేదీ వాయిదా వేయాలని తెలుగుదేశం నిర్ణయం ► ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాతే పునఃప్రారంభించాలని నిర్ణయం ► అప్పటివరకు ఢిల్లీలోనే ఉండాలని యోచిస్తోన్న లోకేష్ ► రాజమండ్రికి వస్తే జైలుకు పోవడమొక్కటే మిగిలిందని లోకేష్‌కు సూచించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా టాప్ మేనేజ్మెంట్లు ► అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ కేసు విచారణను బట్టి నిర్ణయం తీసుకుందామని సూచన ► ఢిల్లీలో మంచి లాయర్లను ముందస్తు బెయిల్ కోసం మాట్లాడుకొమ్మని సలహా ► ఇప్పుడే పాదయాత్రకు వెళ్లాలనుకుంటే అరెస్ట్ అవుతారని సూచన ► టీడీపీ నాయకుల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేష్ ► పాదయాత్ర సంగతి తర్వాత చూద్దాం, ఢిల్లీ హోటల్లోనే ఉంటానన్న లోకేష్. రేపు టీడీపీ యాక్షన్ కమిటీ భేటీ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రేపు(శుక్రవారం) నంద్యాలలో టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ నుంచి నారా లోకేష్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే యాక్షన్ కమిటీ భేటీ కానుంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పట్లో చంద్రబాబు బయటకు వస్తారా?. చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?. భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు?. ఎల్లో మీడియాలో జరుగుతున్నట్టు మహిళలిద్దరే పార్టీకి నేతృత్వం వహిస్తారా?. అనే దానిపై చర్చించనున్నట్లు తెలిసింది. బాలయ్య హడావిడి అంతకే.. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న లోకేష్ .. తండ్రి కోసం న్యాయపరమైన, రాజకీయ మంతనాలు అంటూ ఢిల్లీకి చెక్కేశారు. ఒకట్రెండు రోజులు పార్టీ సమావేశాల పేరుతో చంద్రబాబు కుర్చీలో కూర్చుని హడావిడి చేశారు నందమూరి బాలకృష్ణ. ఆ తర్వాత ఆయన తెర మీద కనిపించింది లేదు. ప్రస్తుతం షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారనే సమాచారం. ఇక.. జైలులో ములాఖత్ అయిన జనసేన పవన్ కల్యాణ్, పొత్తు ప్రకటన చేస్తూనే వారాహికి సిద్ధమయ్యాడు. ఈ గ్యాప్‌లో మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నారు. పార్ట్‌టైం రాజకీయాలతో బాబు అరెస్ట్‌ను వీళ్లే పట్టించుకోనప్పుడు.. మనకెందుకులే అని టీడీపీ ముఖ్యనేతలు అనుకుంటున్నారు. అందుకే పరిస్థితులపై మొక్కుబడి సమీక్షలు నిర్వహించడం లేదు. ఫలితంగానే.. దిశానిర్దేశానికి బదులు లోకేష్‌ను అయోమయంలోకి నెట్టేస్తున్నారు. ఇది కూడా చదవండి: లోకేష్‌ను డైరెక్ట్ చేస్తోందెవరు? యెల్లో మీడియా ఎందుకు డీగ్రేడ్ చేస్తోంది? -
వైఎస్ఆర్ అడుగుపెడితే అక్కడ అద్భుతాలు..!
-
పాదయాత్ర వెనుక ముఖ్య ఉదేశ్యం ఏంటో మీకు తెలుసా..?
-
రాజశేఖరరెడ్డి పాదయాత్రపై టీడీపీ నేతల స్పందన
-
వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర
-
పోలీసులపై రెచ్చిపోయిన పచ్చమూక
ద్వారకాతిరుమల: పచ్చమూక మరోసారి రెచ్చిపోయింది. పోలీసులపై దాడులకు తెగబడింది. పోలీసుల్ని కిందకు తోసేసింది. తెలుగుదేశం వర్గీయులు విచక్షణారహితంగా ప్రవర్తించడంతో శుక్రవారం ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం శివారులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి బెయిల్ రావాలని కోరుతూ టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు మారంపల్లి నుంచి పాదయాత్రగా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరారు. 144 సెక్షన్ అమలులో ఉండటంతో తిరుమలంపాలెం శివారులో ద్వారకాతిరుమల, భీమడోలు పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, పాదయాత్రలు వంటివి చేయకూడదని హెచ్చరించారు. అయినా టీడీపీ వర్గీయులు పోలీసులను నెట్టుకుంటూ దాడులు, దౌర్జన్యాలు చేస్తూ, బెదిరిస్తూ దూసుకెళ్లారు. ఎవరడ్డొచ్చినా ఆగేది లేదంటూ.. పోలీసులను నోటికొచ్చినట్టు తిడుతూ ముందుకెళ్లారు. వారు తోసేయడంతో భీమడోలు సీఐ వి.వెంకటేశ్వరరావు, ద్వారకాతిరుమల హెడ్ కానిస్టేబుల్ అమీర్ కింద పడిపోయారు. అక్కడ పలువురు పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం తిమ్మాపురం శివారులో టీడీపీ పాదయాత్రకు జనసేన నాయకులు మద్దతిచ్చి, వారితో కలసి ద్వారకాతిరుమల చేరుకున్నారు. పథకం ప్రకారం మహిళలను ముందుపెట్టి.. టీడీపీ నేతలు పథకం ప్రకారం మహిళలను ముందుపెట్టి వెనుక వారొచ్చారు. మహిళలను అడ్డుకుంటారా.. అంటూ పోలీసులను తోసుకుంటూ దౌర్జన్యంగా దూసుకెళ్లారు. పోలీసులపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. పోలీసులు మధ్యలో అడ్డుకుంటారని తెలిసినా, అల్లర్లు సృష్టించి, గొడవలు పెట్టుకోవాలనే వారు ఈ పాదయాత్రను చేపట్టినట్టు తెలిసింది. పోలీసుల పట్ల తెలుగుదేశం వర్గీయుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పలువురు టీడీపీ నాయకులపై కేసు పోలీసులపై దౌర్జన్యం చేసి, 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన పలువురు టీడీపీ నాయకులపై ద్వారకాతిరుమల ఎస్ఐ టి.సుదీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ జి.దుర్గారావు తెలిపారు. ఇప్పటికే 13 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారికి 41 నోటీసులు ఇచ్చి విడుదల చేశామని చెప్పారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. -
దేశ భద్రత కోసమే రాహుల్ పోరాటం
సాక్షి, హైదరాబాద్ / ఖైరతాబాద్ / దిల్సుఖ్నగర్ / గచ్చిబౌలి: దేశాన్ని ఒక్కటి చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ, డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాల వరకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఐమాక్స్ ఇందిరాగాంధీ రోటరీ చౌరస్తాలో మాట్లాడుతూ.. దేశ భద్రత, సమగ్రత కోసం రాహుల్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని అహింసా పోరాటాన్ని పునాదిగా వేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు, 4,183 కిలోమీ టర్లు రాహుల్ గాంధీ నడిచారని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటించాలి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటే వరకు తరమాల్సిన బాధ్యత ప్రజ లందరిమీద ఉందని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను గెలిపించాలని ప్రతిసారీ అసదుద్దీన్ చెప్తున్నాడని, అసలు ఎందుకు గెలిపించాలని నిలదీశారు. త్రిపు ల్ తలాక్‌కు మోదీకి మద్దతుగా నిలిచినందుకా, 370 ఆర్టికల్‌కు ఓటు వేసినందుకా, నోట్ల రద్దు, జీఎస్టీలో మద్దతు తెలిపినందుకు గెలిపించాలా.. అని అసదుద్దీన్‌ను ప్రశ్నించారు. లక్ష కోట్లు లూటీ చేసిన కేసీఆర్ ఫ్యామిలీకి మద్దతు తెలుపుతున్నారంటే దాని ఆంతర్యమేంటన్నారు. దేశ హోంమంత్రికి చిల్లర రాజకీయం తగునా 16,17,18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని తలపెడితే అధికారం ఉంది కదా అని తాము బుక్ చేసుకున్న గ్రౌండ్‌ను రద్దు చేసి బీజేపీ వాళ్లు గుంజుకున్నారని రేవంత్ నిందించారు. ఇంత చిల్లర రాజకీయం హోంశాఖ మంత్రి చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేశాయని, ఇందుకు ప్రతిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కదలి వచ్చి మూడు రోజులపాటు హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టాలని, అత్యద్భుతంగా ఏఐసీసీ సమావే శాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ... దేశాన్ని కలిపేందుకు ధర్మాలను ఒకటి చేసేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేశారని ఇది ప్రపంచ రికార్డ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్, రోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలో భట్టి.. కోదాడలో ఉత్తమ్..ఎల్బీనగర్లో యాష్కీ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టా యి. మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేటలో జరిగిన పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కోదాడలో జరిగిన యాత్రలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్బీనగర్లో జరిగిన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. రేపు భట్టి పాదయాత్ర ‘డైరీ’ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర డైరీని శనివారం ఆవిష్కరించనున్నారు. సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సురేందర్ రచించిన ఈ డైరీని గాంధీభవన్‌లో విడుదల చేయనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే హాజరుకానున్నారు. మేకిన్ ఇండియా అని భారత్ పేరు పెడతారా.. మేకిన్ ఇండియా అన్న పీఎం మోదీ ఇప్పుడు ఇండియా పేరు తీసేసి భారత్ పేరు పెడతాననడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు కలిసి ఇండియా కూటమి కడితే.. దాన్ని ఎదుర్కోలేక ఇండియా పేరు మారుస్తానన్న భావదారిద్య్రం ప్రధాన మంత్రికి, బీజేపీకి వచ్చిందంటే సిగ్గుపడాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలే గానీ ఈ దేశం పేరు మారిస్తే ఎవరి బతుకుల్లోనూ మార్పులు రావన్నారు. మోదీ పాలనలో దేశ భద్రతకే ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఖాయం: పొంగులేటి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తుందని... అందరికీ ఇందిరమ్మ పథకాలు అందిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో–చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీనియర్ నేత రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లో ర్యాలీ నిర్వహించారు. పొంగులేటి మాట్లాడుతూ జోడో యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకున్న రాహుల్ ప్రధాని అయిన తరువాత పరిష్కరిస్తారని తెలిపారు. -
మళ్ళీ దొరికిపోయిన లోకేష్..
-
ఖబడ్ధార్ నారా లోకేష్... ప్రజలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు..
అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ సందర్బంగా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరావని ప్రజల్లో తిరిగేందుకు అసలు పనికిరావని విమర్శించారు. దౌర్జన్యం చేయడానికి వచ్చావా? పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర రక్తపాతాన్ని సృష్టించడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్త్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టమొచ్చినట్లు రౌడీలను పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నావ్ ఖబడ్దార్ లోకేష్ అని హెచ్చరిస్తూనే నువ్వు ఇప్పటి వరకు ఎంత మంది ప్రజలు కష్టాలు తెలుసుకున్నావ్? అసలు నువ్వొచ్చింది ప్రజల బాగోగులు తెలుసుకోవడానికా? దౌర్జన్యం చెయ్యడానికా? అంటూ ప్రశ్నించారు. అంతటా వ్యతిరేకత.. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నల్లజర్ల, మందలపర్రు, భీమవరం ఇలా అన్ని చోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ గొడవలు చేస్తున్నావ్. భీమవరంలో అయితే వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ మీ పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు అవగాహన లేక మాట్లాడుతున్నాడని 'పప్పు' అనుకునేవారు. కానీ ఈ పాదయాత్రతో ప్రజల్లో నీ మీద పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నావ్. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మారణాయుధాలు ఎందుకు? నారా లోకేష్ ఒక క్రిమినల్ లాగా, ఒక రక్త పిశాచి లాగా, ఒక సైకో లాగా తయారయ్యాడని ప్లెక్సీ కనిపిస్తే చింపేయమంటూ.. దుర్మార్గుడిలా తయారయ్యారన్నారు. మీ పాదయాత్రకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే మీ మనుష్యులతో ఆ పోలీసులనే కొట్టిస్తున్నావు.. నీ వెనుక ఉన్న వారిలో నేర చరిత్ర ఉన్నవాళ్లని ట్రాక్ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు మీద దాడి చేస్తే సహించేది లేదు ఖబడ్దార్.. లోకేష్ నువ్వు రాజకీయాలకు పనికిరావు, ప్రజల్లో తిరిగేందుకు అస్సలు పనికిరావు. నీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు, మరణయుధాలు తీసుకుని వెళ్తున్నావ్. తండ్రీకొడుకులు ఇద్దరూ జైలుకే.. చంద్రబాబు బండారం బయట పడిపోయింది. అతనిపై ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో వారిలో గుబులు మొదలైంది. చంద్రబాబు చేసిన తప్పులకు జైలుకి వెళ్లడం ఖాయం. నారా లోకేష్ కూడా పాదయాత్ర ఇలాగే చేస్తే అతను కూడా జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు. ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లా ద్రోహి చంద్రబాబు: మంత్రి రోజా -
నారా లోకేష్ ఓవర్ యాక్షన్..షాకిచ్చిన హైకోర్టు..!
-
ఫ్లెక్సీపై రాళ్లు.. ప్రశ్నించినవారిపై దాడులు
గణపవరం/నిడమర్రు: లోకేశ్ పాదయాద్ర సందర్భంగా టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేతల ఫ్లెక్సీలపై రాళ్లు విసిరారు. ప్రశ్నించినవారిపై దాడికి పాల్పడ్డారు. ఆదివారం ఉంగుటూరు నియోజకవర్గం మందలపర్రుకు లోకేశ్ పాదయాత్ర చేరుకోగానే.. గతంలోనే గ్రామంలో పెదనిండ్రకొలనుకు చెందిన టీటీడీ పాలక మండలి సభ్యుడు గాదిరాజు వెంకటసుబ్బరాజు(పెదబాబు) కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు ఫ్లెక్సీపై టీడీపీ నాయకులు రాయి విసిరారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, పెదబాబు అభిమానులు ప్రశ్నించడంతో టీడీపీ కార్యకర్తలతోపాటు యువగళం వలంటీర్లు వారిపై దాడి చేశారు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు గాయపడ్డారు. మరోవైపు తనకు ఏ పార్టీతో సంబంధం లేకపోయినా యువగళం వలంటీర్లు దాడి చేశారని నిడమర్రుకు చెందిన పిట్టా రామకృష్ణ అవేదన వ్యక్తం చేశారు. స్కూటర్‌పై వెళుతూ లోకేశ్‌ను చూసేందుకు ఆగానని, టీడీపీ నేతలు, వలంటీర్లు తన బట్టలు చింపేసి కొట్టారని, తన బైక్‌ను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. లోకేశ్ వెంట జనం లేకనే వైఎస్సార్సీపీ శ్రేణులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు విమర్శించారు. తన ఫ్లెక్సీలపై రాళ్లు విసురుతున్నా అడ్డుకోవడం మానేసి చోద్యం చూస్తుండటం లోకేశ్‌కే చెల్లిందని పెదబాబు వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం రాత్రి ఏలూరు జిల్లా గణపవరంలో ఏర్పాటుచేసిన సభలో లోకేశ్ ప్రసంగిస్తూ ఒక్క హామీని సీఎం జగన్ నెరవేర్చలేదన్నారు. నాలుగేళ్లు అభివృద్ధికి దూరం చేశారని ఆరోపించారు. -
పాదయాత్రలో లోకేశ్ అత్యుత్సాహం.. సైగ చేయడంతో..
నల్లజర్ల: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో శుక్రవారం ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర పలు గ్రామాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. పోతవరంలో ప్రారంభమైన పాదయాత్ర కవులూరు, చీపురుగూడెం, తిమ్మన్నపాలెంలలో జరిగింది. తిమ్మన్నపాలెం జంక్షన్లో సీఎం ఫ్లెక్సీని చూసిన లోకేశ్.. యువగళం సభ్యుడికి సైగ చేయడంతో ఆ వ్యక్తి సీఎం ఫ్లెక్సీని మూడొంతులకుపైగా చింపేశాడు. విషయం తెలియడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఫ్లెక్సీ చింపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ రజనీ, డీఎస్పీ వర్మ తదితరులు హామీ ఇచ్చారు. వెంటనే అదే ప్రదేశంలో కొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నా పలుమార్లు టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం శాంతించిన కార్యకర్తలు సీఎం జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సాయంత్రం పాదయాత్ర నల్లజర్ల జంక్షన్‌కు వచ్చేసరికి సొసైటీ అధ్యక్షుడు కారుమంచి రమేష్ ఇంటి ముందు నిలబడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై యువగళం సభ్యుడు పిడిగుద్దులు గుద్దాడు. దీనిపై కార్యకర్తలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. చదవండి: ఐటీ దర్యాప్తు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ -
అపర భగీరథుడు
సాక్షి, అమరావతి: దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల 1995 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్ రాజశేఖరరెడ్డిని కదిలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆయన బాస చేశారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే.. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుతోసహా అనేక ప్రాజెక్టులను జలయజ్ఞం కింద కార్యరూపంలోకి తెచ్చారు. 2004–05లో రాష్ట్ర బడ్జెట్ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. 2014 మే 14 నుంచి 2009 సెప్టెంబరు 2 వరకు అంటే ఐదేళ్ల మూడు నెలల్లోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 16 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 19.53 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు. 3.96 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. సాగునీటి రంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టం: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తన తండ్రి వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టుల పనులకు వైఎస్సార్ హయాంలో అడ్డుతగిలిన తరహాలోనే ఇప్పుడూ చంద్రబాబు సైంధవుడిలా అడ్డుతగులుతున్నారు. అయినా సీఎం జగన్ వాటిని అధిగమిస్తూ పనులు కొనసాగిస్తున్నారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్, హంద్రీ–నీవా ద్వారా కర్నూలు పశ్చిమ మండలాల్లో 68 చెరువులను నింపే పథకం, వెలిగొండ తొలి దశ, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తి కావొస్తున్నాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరు, అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మట్టికట్ట లీకేజీలకు డయాఫ్రమ్ వాల్‌తో అడ్డుకట్ట వేశారు. బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ 2019, 2020, 2021, 2022లలో ఏటా సగటున కోటి ఎకరాలకు నీళ్లందించి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇక రాష్ట్రానికి పోలవరం జీవనాడి. వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. అటవీ, పర్యావరణ, ప్రణాళికా సంఘం సహా అవసరమైన అన్ని అనుమతులను సాధించారు. భారీ వ్యయమయ్యే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి.. కేంద్రం ఇచ్చే 90 శాతం వాటా నిధులతో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ సఫలమై ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చే సమయంలోనే వైఎస్సార్ హఠాన్మరణం చెందారు. విభజన నేపథ్యంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అప్పటి సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. చంద్రబాబు పాపం ఫలితంగా గోదావరికి వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నారు. -
ఆర్భాటం ఫుల్.. జనం మాత్రం నిల్
టి.నరసాపురం:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను రక్తి కట్టించేందుకు పార్టీ అధిష్టానం ఎంతగా ఆర్భాటం చేస్తున్నా.. స్పందన లేక వెలవెలబోతోంది. కిరాయి ఇచ్చి ముందుగా ఏర్పాటు చేసుకున్న జనం తప్ప ప్రజలెవరూ పాదయాత్ర వైపు కన్నెత్తి చూడటం లేదు. మంగళవారం చింతలపూడి మండలం తీగలవంచ నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలైంది. పోలవరం నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించే సమయంలో స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు రెండు కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రమైన టి.నరసాపురం వరకు పాల్గొన్నారు. పాదయాత్రకు ఎక్కడా ప్రజాస్పందన కనిపించలేదు. పాదయాత్ర బొర్రంపాలెం వరకు సాగింది. శ్రీరామవరంలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి మధ్యాహ్నం భోజనం కోసం ఏర్పాట్లు చేశారు. జనం ఎవరూ రాకపోవడంతో వంటకాలన్నీ మిగిలిపోయాయి. కాగా.. టి.నరసాపురం మండలంలో మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ వర్గీయులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. శ్రీరామవరంలో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీల ఏర్పాటుకు ఆ గ్రామంలోని పార్టీ నాయకులు అభ్యంతరం తెలపడం కొసమెరుపు. -
జనం లేక లోకేశ్ పాదయాత్ర వెలవెల
లింగపాలెం/చింతలపూడి: ఏలూరు జిల్లా లింగపాలెం, చింతలపూడి మండలాల్లో సోమవారం నారా లోకేశ్ పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. లింగపాలెం మండలంలోని సుందరరావుపేట నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి చింతలపూడి మండలం వెలగలపల్లి, ఫాతిమాపురం గ్రామాల మీదుగా చింతలపూడి శివారు క్యాంప్ సైట్‌కు చేరారు. ఎన్వీఎన్ కాలనీ సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని లోకేశ్ ప్రారంభించారు. పాదయాత్రలో నాయకులు, యువగళం టీం సభ్యులు మినహా స్థానిక ప్రజలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అక్కడక్కడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా, తనకు ఒక చెయ్యి నొప్పిగా ఉందని చెబుతూ మరో చేతిని ఊపుతూ వెళ్లిపోయారు. లింగపాలెం గ్రామ శివారుకు వెళ్లిన తర్వాత మాజీ ఎమ్మెల్యే, స్థానిక మాజీ ప్రజాప్రతినిధిని ‘మీ గ్రామంలో జనం ఏరి..’ అంటూ లోకేశ్ ప్రశ్నించారు. కాగా, లోకేశ్ క్యాంప్ సైట్లో పామాయిల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నేతలు ముందుగానే ఎంపిక చేసిన తమ పార్టీకి చెందిన రైతులనే ఈ కార్యక్రమానికి అనుమతించారు. తన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పామాయిల్ రైతులకు ఎంతో మేలు చేసినట్లు చెప్పినా రైతుల నుంచి స్పందన రాకపోవడంతో ‘కనీసం చప్పట్లన్నా కొట్టండయ్యా..’ అంటూ లోకేశ్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడంతో రైతులు నవ్వుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత లోకేశ్ పాదయాత్ర చింతలపూడి వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు చేరుకోగానే ‘సైకో పోవాలి, సైకిల్ కావాలి...’ అంటూ మైకులో కేకలు వేయడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ‘జై జగన్... వైఎస్సార్సీపీ జిందాబాద్...’ అంటూ నినాదాలు చేశారు. దీంతో లోకేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితోపాటు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి దూసుకువచ్చారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. కూలి ఇవ్వలేదని జెండాలు పారేసి వెళ్లిన వైనం.. ముసునూరు: ఏలూరు జిల్లాలో జరుగుతున్న లోకేశ్ పాదయాత్రలో పెయిడ్ ఆర్టిస్టులే కనిపిస్తున్నారు. పల్లెల్లో ప్రజల్లో స్పందన కరువవడంతో పెయిడ్ ఆర్టిస్టులతో పాదయాత్ర సాగిస్తున్నారు. పాదయాత్రకు కూలి డబ్బులిస్తామని జనాన్ని తరలించిన విషయం సోమవారం వెలుగుచూసింది. శనివారం యువగళం పాదయాత్ర నూజివీడు మండలం పోతురెడ్డిపల్లిలో ప్రారంభమై మండలంలోని కొర్లగుంట–ముసునూరుల మీదుగా వలసపల్లి వరకు జరిగింది. ఈ క్రమంలో కొందరు ఆటోలో కాట్రేనిపాడు గ్రామం మీదుగా దగ్గర దారిలో హనుమాన్‌జంక్షన్ వైపు వెళుతూ జెండాలను రహదారి పక్కనే పడేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు.. అలా పడేశారేంటని ఆటోలోని వారిని ఆరా తీశారు. కూలి డబ్బులు ఇస్తామని పాదయాత్రకు తీసుకొచ్చారని, కానీ డబ్బులివ్వకుండా తమను మోసం చేశారని ఆటోలోనివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వెనుదిరిగి వెళ్లిపోతున్నామని చెప్పారు. పాదయాత్రలో పాల్గొనేందుకు తమకు ఇచ్చిన జెండాలు, చొక్కాలను విప్పి దారిలో పారేసి వెళుతున్నామని తెలిపారు. ఈ ఘటనపై కాట్రేనిపాడుకు చెందిన కంబాల రాజేశ్ సోషల్‌మీడియాలో పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా రాజేష్ సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. పాదయాత్ర తమ గ్రామం మీదుగా జరగలేదని, దగ్గర దారి కావడంతో వీరంతా ఇటువైపు వెళ్లారని చెప్పారు. వారు ఏ గ్రామానికి చెందినవారో చెప్పలేదని ఆయన తెలిపారు. -
రౌడీ రాజకీయాలను ప్రేరేపిస్తున్న బాబు, లోకేశ్
తిరుపతి సిటీ: చంద్రబాబు, లోకేశ్ పాదయాత్రల పేరుతో చంపుతాం.. అంతు చూస్తాం.. అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రౌడీ రాజకీయాలను ప్రేరేపించడమేనని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి మేలు చేస్తామని ఒక్క మాట కూడా లోకేశ్ తన పాదయాత్రలో మాట్లాడకపోవడం దారుణమన్నారు.పుంగనూరులో టీడీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు. కులపిచ్చి, వెన్నుపోటు రాజకీయాలు తప్ప ప్రజాప్రభుత్వం రావాలనే ఆకాంక్ష టీడీపీ వారికి లేదన్నారు. రామోజీ గ్రూపునకు చెందిన మార్గదర్శి సంస్థ మోసాలను సీఎం వైఎస్ జగన్ బయటపెట్టడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. పదవులు పోవడంతో మతిభ్రమించి బొండా ఉమ, అయ్యన్నపాత్రుడు రాక్షసుల్లాగా మాట్లాడుతున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఉచ్చపోయిస్తాం.. అంటున్న లోకేశ్ లెట్రిన్, బాత్రూమ్లు కట్టే పనిలో ఉన్నారా.. అని ప్రశ్నించారు. లోకేశ్ అందుకు కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు. -
శాంతిభద్రతల విఘాతానికే లోకేశ్ కుట్ర
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : విద్వేషపూరిత ప్రసంగాలతో వర్గ విభేదాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రపన్నిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పోలీసు శాఖను కోరింది. ఈమేరకు వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా విభాగం ఇన్చార్జిలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో శుక్రవారం ఫిర్యాదులు చేశారు. పాదయాత్ర కోసం పోలీసులు ఇచ్చిన అనుమతి నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తూ మరీ లోకేశ్, ఇతర టీడీపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించేలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదు చేశారు. మంత్రులు, వైఎస్సార్సీపీ శాసన సభ్యులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడటంతోపాటు వారి అంతుచూస్తామని బెదిరించడాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. సమాజంలో వర్గ విభేదాలు రెచ్చగొట్టి రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు, అలజడులు సృష్టించాలన్నది లోకేశ్ పన్నాగమని పేర్కొన్నారు. శాంతిభద్రతలను భగ్నం చేసేందుకు యత్నించిన లోకేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, పాదయాత్ర కోసం పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రంలోని షరతులకు కట్టుబడేలా కట్టడి చేయాలని కోరారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో జిల్లా సోషల్ మీడియా కన్వినర్ చిక్కాల దుర్గాప్రసాద్ నేతృత్వంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఎవరిపై ఎన్ని ఎక్కువ పోలీసు కేసులు నమోదైతే వారికి తమ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతటి ప్రాధాన్యం ఇస్తామంటూ ఘర్షణలను ప్రేరేపించేలా ప్రసంగిస్తున్నారని తెలిపారు. టీడీపీ మూకలను ఉగ్రవాదుల తరహాలో ప్రజలపై ఉసిగొల్పుతూ ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా లోకేశ్ ప్రసంగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా సోషల్ మీడియా కన్వినర్ మేకా వెంకట్రామిరెడ్డి మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లోనూ శుక్రవారం పలువురు ఫిర్యాదు చేశారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్లోనూ చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై ఫిర్యాదు చేశారు. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్లోనూ వైఎస్సార్సీపీ నాయకులు లోకేశ్, అచ్చెన్నాయుడిపై ఫిర్యాదు చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల కన్వినర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల దాడులపై పలు కేసులు నమోదు హనుమాన్ జంక్షన్ : లోకేశ్ పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేసిన టీడీపీ నేతలపై వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తలారి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, మొవ్వా వేణుగోపాలరావు, మొవ్వా శ్రీనివాసరావు, వెనిగళ్ల జ్ఞానశేఖర్, కనకవల్లి శేషగిరి, కనకవల్లి చిన్న యాకోబ్, కొలుసు రంగారావు, మందపాటి రాంబాబు, ఆళ్ల గోపాలకృష్ణ తదితరులపై 307, 324 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేత తలారి వినయరత్నంపై దాడికి పాల్పడ్డ ఘటనపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ గన్నవరం ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ నేతలు మొవ్వా వేణుగోపాల్, పరసా కిరణ్, బెజవాడ కృష్ణ, పొలగాని వీరాంజనేయులు తదితరులపై ఐపీసీ సెక్షన్లు 323. 506 రెడ్ విత్ 34, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేత కసుకుర్తి చైతన్య ధర్మేంద్ర (చిన్ను)పై జరిగిన దాడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, మొవ్వా వేణుగోపాల్, మొవ్వా శ్రీనివాసరావు, వెనిగళ్ల జ్ఞానశేఖర్, కనకవల్లి శేషగిరిరావు, కనకవల్లి చిన్న యాకోబ్, కొలుసు రంగారావు, మందపాటి రాంబాబు, ఆళ్ల గోపాలకృష్ణపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 323, 506, 290 రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలు అయ్యన్న, బుద్దాపై కేసులు ఉంగుటూరు : కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో ఇటీవల జరిగిన యువగళం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఫిర్యాదు మేరకు వారిపై విడివిడిగా కేసులు నమోదు చేశారు. అయ్యన్నపై 153ఏ, 354ఏ1 (4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద, బుద్దా వెంకన్నపై 153, 153ఏ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. -
యువగళం ముసుగులో టీడీపీ గూండాల దాడి
నూజివీడు: లోకేశ్ యువగళం పాదయాత్ర ముసుగులో టీడీపీ గూండాలు ఏలూరు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తపైన, విలేకరులపైన దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం నూజివీడు మండలం తుక్కులూరులో లోకేశ్ పాదయాత్ర చేశారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పాదయాత్రలో సైకో అంటూ ముఖ్యమంత్రి పట్ల అవమానకరంగా మాట్లాడటాన్ని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త యలమర్తి చిట్టిబాబు సహించలేకపోయారు. వైఎస్సార్సీపీ నాయకుడు పాలడుగు నాని ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్లో నుంచి వైఎస్సార్సీపీ జెండా ఊపుతూ మా ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నారంటూ పెద్దగా అన్నారు. లోకేశ్ వెంటనే యువగళం టీంలో ఉన్న రౌడీమూకకు సైగ చేయడంతో దాదాపు 20 మంది ఒక్కసారిగా చిట్టిబాబు వద్దకు పరుగెత్తుకెళ్లి దాడి చేశారు. అక్కడే ఉన్న రూరల్ సీఐ ఆర్.అంకబాబు, ఎస్ఐ తలారి రామకృష్ణ వెంటనే చిట్టిబాబును పక్కకు లాగేసి, టీడీపీ గూండాలను వెళ్లగొట్టారు. సీఐ, ఎస్ఐ స్పందించకపోతే చిట్టిబాబు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది. పాలడుగు నాని పైనా టీడీపీ గూండాలు రాళ్లు విసిరారు. టీడీపీ గూండాల దాడులను వీడియో తీస్తున్న హెచ్ఎం టీవీ రిపోర్టర్ అక్కినేని ప్రసాద్, ఆర్ టీవీ రిపోర్టర్ గోగినేని నానిలను కూడా టీడీపీ వారు పిడిగుద్దులు గుద్దుతూ వారి ఫోన్లు లాక్కోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. విలేకరులిద్దరూ ఎదురు దాడికి దిగడం, అంతలో పోలీసులు రావడంతో యువగళం రౌడీమూక వెళ్లిపోయింది. వైఎస్సార్సీపీ నాయకుడు పాలడుగు నాని ఇంటిపైనా రాళ్లు రువ్వారు. టీడీపీ గూండాల దాడిపై యలమర్తి చిట్టిబాబు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు చిట్టిబాబు ను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ద్వారకా కాంప్లెక్స్ వద్ద కవ్వించిన టీడీపీ కార్యకర్తలు సాయంత్రం 5 గంటలకు తుక్కులూరు వద్ద లోకేశ్ పాదయాత్ర ద్వారకా సెంటర్ వద్దకు వచ్చింది. అదే సమయంలో ద్వారకా కాంప్లెక్స్ పైభాగాన స్థానికులు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. లోకేశ్‌కు ముందు నడుస్తున్న టీడీపీ వారు కాంప్లెక్స్ వద్ద ఆగి, పైన ఉన్న వారిని రెచ్చగొట్టేలా చేతులు, కర్రలు ఊపుతూ ఖాళీ మంచి నీటి సీసాలను విసిరారు. జనం లేక అన్ని కార్యక్రమాలు రద్దు లోకేశ్ పాదయాత్రలో జనం లేకపోవడంతో ముందుగా ప్రకటించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గొల్లపల్లిలో గ్రామస్తులతో, మొర్సపూడిలో ముస్లిం మైనారిటీలతో, తుక్కులూరులో ఎస్సీ వర్గీయులతో భేటీలు ఉంటాయని ప్రకటించారు. అయితే, జనం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఈ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని మధ్యాహ్నం 12 గంటల కల్లా లోకేశ్ శిబిరంలోకి వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటల నుంచి పట్టణంలో నిర్వహించిన పాదయాత్ర కూడా వెలవెలబోయింది. -
జనం లేకే కుట్రకు తెర
సాక్షి ప్రతినిధి, విజయవాడ/హనుమాన్ జంక్షన్ రూరల్/నూజివీడు: యువగళం పాదయాత్ర జనాలు లేక వెలవెలబోయింది. గురువారం మధ్యాహ్నం తర్వాత జనం బాగా పలుచబడి పోవటంతో ఇటీవల టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుపై లోకేశ్ విరుచుకుపడ్డారు. అసమర్థుడు.. జనాలను తేలేకపోయాడని ఇతర నాయకుల ముందే చిందులు తొక్కారు. కొల్లు రవీంద్రను పిలిచి మీరైనా జనాన్ని పోగు చేసి.. జిల్లాలో చివరి రోజు యాత్రలో పరువు పోకుండా కాపాడాలని కోరారు. దీంతో కొల్లు రవీంద్ర గతంలో టీడీపీలో పని చేసిన కొంత మంది నాయకులకు ఫోన్ చేసి.. బతిమిలాడి రప్పించారు. కొంత మంది నేతలు కార్యకర్తలను బలవంతంగా అప్పటికప్పుడు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ నేతలు, కార్యకర్తల తీరు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నాలుగేళ్లుగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైఎస్సార్సీపీ నాయకుడు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కసుకుర్తి శ్రీనివాసరావు, ఆయన తనయుడు చిన్ను వారి సొంత స్థలంలో బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనిపై లోకేశ్ యువగళం టీం సభ్యులు రౌడీమూకల్లా విరుచుకుపడ్డారు. క్షణాల్లో ఆ బ్యానర్‌ను ధ్వంసం చేసి, అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తలారి ఈశ్వరరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కసుకుర్తి శ్రీనివాసరావు, ఆయన తనయుడు చిన్ను, పార్టీ నాయకులు తలారి పండు, మెడబలిమి చిరంజీవిలపై విచక్షణారహితంగా దాడి చేశారు. బ్యానర్‌ను కట్టిన కర్రలతో వైఎస్సార్సీపీ నాయకులను ఇష్టారాజ్యంగా కొట్టారు. కిందపడేసి కాళ్లతో తొక్కారు. అరుపులు, కేకలతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నారా లోకేశ్, దేవినేని ఉమా కనుసైగతో రెచ్చిపోయి రాక్షసత్వంగా ప్రవర్తించారు. వారి నుంచి కర్రలను లాక్కునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. అనంతరం టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించారు. ఈ దాడిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా విరుచుకుపడ్డారు. కొందరి సెల్ఫోన్లు, కెమెరాలు లాక్కుని డేటాను డిలీట్ చేశారు. ఎమ్మెల్యే వంశీ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కులం పేరుతో దూషించారు.. టీడీపీ నేతలు తమను ఎస్సీ, ఎస్టీ కులం పేరుతో దూషించారని, దాడి చేసి కొట్టారని వైఎస్సార్సీపీ నేతలు వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతలో టీడీపీ నేత దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, ఇతర నేతలు, కార్యకర్తలు వారిని దూషిస్తూ పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చారు. ఆ ముగ్గుర్ని కులంపేరుతో దూషిస్తూ పోలీసుల ఎదుటే వారిపై దాడికి యత్నించారు. పోలీసులు టీడీపీ నేతలను బయటకు పంపారు. ఈ ఘటనపై దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్రతో కలిపి 22 మంది పోలీస్‌స్టేషన్‌లోనే తమపై దాడికి యత్నించారని, కులం పేరుతో దూషించారని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అంతకు ముందు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మైలేజ్ కోసం దిగజారిన టీడీపీ కృష్ణాజిల్లాలో యాత్ర చివరి రోజు జనాలు లేకపోవటంతో ఏదో ఒక రకంగా శాంతిభద్రతల సమస్య సృష్టించి మైలేజ్ పొందాలని టీడీపీ నేతలు పన్నాగం పన్నారు. వైకాపా కార్యకర్తలను, పోలీసులను కవ్వించి ఏదొక విధంగా శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొద్దిసేపు ధర్నా, నిరసన చేపట్టారు. పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంయమనం పాటించి ఎదురు దాడికి దిగకపోవడంతో వారు చేసేదేమీ లేక యాత్రను త్వరగా ముగించుకుని ఏలూరు జిల్లాలోకి వెళ్లిపోయారు. కాగా, యువగళం పాదయాత్రలో లోకేశ్‌ను అడ్డుకున్నారని, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమను పోలీస్‌స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకున్నారని టీడీపీ నేతలు కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. ఆయా ఘటనల్లో వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా తెలిపారు. పాదయాత్రలో ఏబీవీ ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద టీడీపీ నేత లోకేశ్ పాదయాత్ర ఏలూరు జిలా్లలోకి ప్రవేశించింది. పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు. సింగన్నగూడెంలో గౌడ సామాజిక వర్గీయులతో, మల్లవల్లిలో బీసీ కులస్తులతో, కొత్త మల్లవల్లిలో ఆయిల్‌పామ్ రైతులతో ఆయన భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మల్లవల్లిలో లోకేశ్‌ను కలిసి మంతనాలు సాగించారు. పరోక్షంగా ఏర్పాట్లు సైతం పర్యవేక్షించారు. గురువారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో బస వద్ద ఆయన లోకేశ్‌ను కలిసి చర్చించారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, రావి వెంకటేశ్వరరావుతో కూడా మాట్లాడారు. టీడీపీ నేతల బ్యానర్లలో ఆయన ఫొటో ముద్రించడం గమనార్హం. -
పాదయాత్రలో లోకేష్‌కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. పాదయాత్ర చేసుకుంటూ పోతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఫ్యూచర్ సీఎం.. జూ.ఎన్టీఆర్ అంటూ ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, తమకు బలం ఉందని చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ సత్తా ఏమిటో తేలిపోయింది. అభ్యర్థులు లేకపోవడం, ఉన్న వారి మధ్య గొడవలతో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ సినిమా డైలాగ్‌లను వల్లె వేస్తున్నా టీడీపీలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులే లేకపోవడమే అసలు విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఉన్న నేతలు కూడా చంద్రబాబును లెక్క చేయడం లేదు. లోకేశ్‌నైతే అసలు పట్టించుకోవడమే లేదు. ఆ పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు యువగళం యాత్రను బహిష్కరించడమే ఇందుకు ఉదాహరణ. లోకేశ్ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చదవండి: బేల ‘గళం’.. అభ్యర్థులు లేక హైవే రూటు! -
బుద్ధి తక్కువై లోకేష్ పాదయాత్రకెళ్లా!
Viral Video: పాదయాత్ర చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలి. ప్రజల కష్టాలు దగ్గరగా వెళ్లి చూడాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అలా చేసి ప్రజల కష్టాలు చూశారు కాబట్టే.. ఆశీర్వదించి ఘన విజయం కట్టబెట్టారు ఏపీ ప్రజలు. పులిని చూసి నక్కవాత పెట్టుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది?.. అసలు తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు చేస్తోంది ఏం యాత్ర?.. ఆ అనుమానాల్ని నివృత్తి చేసే వీడియో మరొకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా యువగళం పాదయాత్రలో ఓ దివ్యాంగుడిని పరామర్శించిన(యాక్టింగ్లేండి) పరామర్శించాడు నారా లోకేష్. బ్యాక్‌గ్రౌండ్‌లో టీడీపీ సాంగ్ మారుమోగుతుంటే.. ఆ పెద్దాయనతో చిరునవ్వుతో రోడ్డు మీద ఓ ఫొటో కూడా దిగాడు. కానీ, ఈలోపు పక్క నుంచి ఓ పచ్చ నేత ఐదొందల నోటును ఆ దివ్యాంగుడి చేతిలో పెట్టాడు. దాన్ని ఆయన తీసుకున్నాడు. కట్ చేస్తే.. తన మానాన తాను చర్చికి వెళ్తుంటే.. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఉందని చెబుతూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తీసుకెళ్లాడని, 2వేల రూపాయలు ఇస్తామని చెప్పి.. కేవలం 500లే ఇచ్చారని, వికలాంగుడినైన తనని కూడా మోసం చేశారని, పాదయాత్రకెళ్లి బుద్ధి తక్కువ పని చేశానని చెంపలేసుకున్నాడు పాపం ఆ పెద్దాయన. -
అదో విఫల గళం
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ పాదయాత్రకు బాహుబలి స్థాయిలో బిల్డప్‌లు ఇచ్చేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా ప్రజలు జోకర్‌గానే భావిస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త(విజయవాడ తూర్పు) దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు ప్రజా స్పందన లేకపోవడంతో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌ను రంగంలోకి దించారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ సైకోల్లా ప్రవర్తిస్తుండటం వల్లే వారిని ప్రజలు ఆదరించడం లేదన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో ప్రజలు మెచ్చేలా పరిపాలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభంజనంలో ఆ ముగ్గురూ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఆ ముగ్గురూ ద్రోహులే: వెలంపల్లి శ్రీనివాస్ అధికారంలో ఉండగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా చంద్రబాబు, లోకేశ్ ద్రోహం చేశారు. టీడీపీ సర్కార్‌కు మద్దతిచ్చిన పవన్‌కళ్యాణ్ కూడా ద్రోహే. ఆ ముగ్గురూ కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో 45 దేవాలయాలను కూల్చేసిన హిందూ ద్రోహులు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను సైతం ధ్వంసం చేసిన ద్రోహులు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. వాటిని పొందిన వారిలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. లోకేశ్ పాదయాత్రకు టీడీపీ నేతలు కూడా స్పందించడం లేదు. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని, గల్లా జయదేవ్.. లోకేశ్ పాదయాత్రను బహిష్కరించారు. లోకేశ్ పాదయాత్రపై చంద్రబాబుకు నమ్మకం ఉంటే 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము పవన్‌కు ఉందా? రాజకీయాల్లో జీరో అయిన పవన్ ఇప్పుడు సినిమాల్లో కూడా జీరో అయిపోయారు. ఆ ముగ్గురూ సన్నాసులు కాబట్టే కలసి పోటీ చేసి జగన్‌ను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నారు. విదేశీ విద్య పథకం ద్వారా ఆర్య వైశ్యుల పిల్లలను కూడా విదేశాలకు పంపిన ఘనత సీఎం జగన్‌ది. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరిస్తే రాష్ట్ర అవతరణ దినాన్ని జూన్ 2కు మార్చింది చంద్రబాబే. దాన్ని మళ్లీ మార్చి నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని సీఎం జగన్ నిర్వహిస్తున్నారు. బ్యారేజ్‌పై ఫొటో షూట్‌కు రూ.5 కోట్లు: మల్లాది విష్ణు టీడీపీ హయాంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్తామంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపి పసుపు నీళ్లతో కడిగే స్థాయికి దిగజారిపోయారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రను మేం ఎక్కడన్నా అడ్డుకునే ప్రయత్నం చేశామా? డబ్బులు, మద్యాన్ని పంచి పెయిడ్ వర్కర్లతో ప్రకాశం బ్యారేజ్‌పై ఈవెనింగ్ వాక్ చేసిన లోకేశ్ ఫొటో షూట్‌కు రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లను దారి మళ్లించి ద్రోహం చేసింది చంద్రబాబే. దొంగ టీడీఆర్ బాండ్లను తయారు చేసి అమ్మిన పార్టీ టీడీపీ. అమ్మవారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి లోకేశ్. బ్రాహ్మణ వీధిలో గోశాలను కూలగొట్టి గోవులకు నిలువ నీడ లేకుండా చేశారు. నదీ తీరంలో పురోహితులకు చోటు లేకుండా చేసిన ఘనత కూడా టీడీపీదే. మేం 11 అంశాలతో రూపొందించిన చార్జ్షిట్కు లోకేశ్, చంద్రబాబు సమాధానం చెప్పాలి. జగనన్న కాలనీల ద్వారా విజయవాడలో 90 వేల మందికి ఇళ్ల స్థలాలు అందించిన ఘనత సీఎం జగన్‌ది. టీడీపీ పాలనలో వైశ్యులు, ముస్లింలు, బ్రాహ్మణులకు ఏం చేశారో లోకేశ్ చెప్పాలి. ఆర్–5 జోన్లో విజయవాడకు చెందిన 30 వేల మందికి సీఎం జగన్ ఇళ్ల పట్టాలిస్తుంటే వాటిని రద్దు చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్, పవన్ ముగ్గురూ సైకోలే. విజయవాడ నగరం వైఎస్సార్సీపీ అడ్డా. ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా: దేవినేని అవినాశ్ పెయిడ్ వర్కర్లతో ఈవెనింగ్ వాక్ చేస్తున్న లోకేశ్‌కు 2014–19 మధ్య ప్రజలకు ఏం చేశారో చెప్పే దమ్ముందా? ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా ఊగిపోతున్నాడు. లోకేశ్ యాత్ర వల్ల చంద్రబాబు సీఎం కాలేరు. లోకేశ్ ఎమ్మెల్యే కాలేడు. చంద్రబాబూ? ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది. గత నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో విజయవాడ నగరం మౌలిక సదుపాయాల కల్పనతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిటైనింగ్ వాల్, ఫ్లైఓవర్లు వంటి అనేక నిర్మాణాలు పూర్తి చేశారు. పాదయాత్రలో లోకేశ్ వాటిని చూడాలి. టీడీపీ హయాంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌ను సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని చూస్తే ఇప్పుడు సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
వైరల్ 75 కాదు 25!
సాధారణంగా 75 సంవత్సరాల వయసులో కొద్దిదూరం నడిచినా ఆయాసపడుతుంటారు. అస్సాంలోని దిబ్రూఘర్‌కు చెందిన 75 సంవత్సరాల హీర బోరా అలా కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో యువతను చైతన్యవంతం చేయడానికి త్రివర్ణ పతాకం చేతబూని పదికిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘ఆమె వయసు 75 నుంచి 25కు వచ్చింది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
మద్యం మత్తులో కారుతో టీడీపీ కార్యకర్తల హల్చల్
మంగళగిరి: లోకేష్ యాత్రలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి కారులో వచ్చిన నలుగురు యువకులు మద్యంమత్తులో హల్చల్ చేశారు. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ప్రమాదానికి కారణమయ్యారు. ఈ దుర్ఘటన బుధవారం జరిగింది. తాడేపల్లి పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి కలకాల తేజశ్రీ విష్ణు వర్థన్ చౌదరి మరో ముగ్గురితో కలిసి లోకేష్ బస చేస్తున్న నగరంలోని యర్రబాలెంకు చేరుకున్నారు. మద్యం ఫూటుగా తాగి కారులో టీడీపీ జెండాలతో తిరుగుతూ చక్కర్లు కొట్టారు. తాడేపల్లి నులకపేట వద్ద విజయవాడకు చెందిన ఏసీ మెకానిక్‌లు బి.గోపి, పి.రాఘవేంద్ర ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చౌదరి తమ కారుతో వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఫలితంగా గోపి, రాఘవేంద్ర గాయపడ్డారు. స్థానికులు ఘటనాస్థలికి చేరుకునేలోపు చౌదరి అతని స్నేహితులు కారు వదిలి పరారయ్యారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎస్సీ కాలనీవాసులపై టీడీపీ శ్రేణుల బరితెగింపు
పెదకూరపాడు: టీడీపీ నేత నారా లోకేశ్ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం నిర్వహించిన యువగళం పాదయాత్రలో ఆ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాదయాత్ర లగడపాడు గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే.. రోడ్డు పక్కన ఉన్న ఎస్సీ కాలనీ వాసులు ఎప్పడో ఏర్పాటు చేసుకున్న వైఎస్సార్సీపీ జెండాలను తొలగించాలంటూ ఆందోళనకు దిగారు. కొందరు టీడీపీ శ్రేణులు ముందుకొచ్చి ఆ జెండాలను తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. తాము ఏర్పాటు చేసుకున్న జెండాలను ఎందుకు తొలగించారంటూ టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. ఒక దశలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. అయినా టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ఎస్సీ కాలనీ మహిళలు తమ ఇళ్లలో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఫొటోలు తెచ్చి.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. మా ఎస్సీలకు టీడీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. దీంతో కొందరు టీడీపీ కార్యకర్తలు వాటర్ బాటిళ్లను మహిళలపైకి విసిరారు. ఆగ్రహించిన ఎస్సీ మహిళలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. రెండు వర్గాలకు మధ్య పోలీసులు నిలబడి సర్దిచెప్పారు. అటుగా వెళుతున్న లోకేశ్‌ను చూసి.. జై జగన్ అంటూ ఎస్సీ కాలనీ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
ప్రగతి కాదు.. సర్పంచ్‌లకు దుర్గతి.. ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతి పథకాల పేరుతో ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప, వాటికి నిధులే ఇ వ్వడం లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో గ్రామ సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉందని, దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో శనివారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో భట్టి ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేక, డీజిల్ సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న నిధులూ ఇవ్వలేదన్నారు. రాజధానికి గ్రామీణుల వలసలు పెరిగినా, హైదరాబాద్‌లో మౌలిక వసతులు మెరుగుపర్చలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ చలవే: రాజధానిలో ఈ మాత్రం అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే అని భట్టి స్పష్టం చేశారు. అందువల్లే హై దరాబాద్‌లో భూములు రేట్లు పెరిగాయన్నారు. ప్రజల కో సం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును ఓ ప్రైవేటు కంపెనీకి 30 ఏళ్ళకు కట్టబెట్టడం దారుణమని నిందించారు. ఐఆర్బీ ఇన్ఫ్రాకు రింగు రోడ్డు ధారాదత్తం చే యడంపై పూర్తి వివరాలు సభ ముందుంచాలని భట్టి డి మాండ్ చేశారు. చెరువులు, నీటి కుంటల్లో క్రీడా ప్రాంగణాలు అంటూ బోర్డులు పెట్టడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. భట్టి క్షమాపణ చెప్పాలి: బీఆర్ఎస్ డిమాండ్ భట్టి ప్రసంగానికి మంత్రులు అడుగడుగునా అడ్డుపడ్డారు. అనారోగ్యంతో ఇల్లంతలకుంట సర్పంచ్ చనిపోతే, రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ అభ్యంతరం చెప్పారు. సభను తప్పుదోవ పట్టించినందుకు భట్టి క్షమాపణ చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పాదయాత్రతో అలసిపోయి అసత్యాలు మాట్లాడుతున్నాడని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు పదేళ్ళలో రూ. 4వేల కోట్లు ఇస్తే, తాము 9 ఏళ్ళలోనే రూ.31 వేల కోట్లు ఇచ్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై భట్టి అబద్ధాలు చెబుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆక్షేపించారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు వివేకానంద, ఆలె వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాంగ్రెస్ ఎజెండా
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమసాధన ఆకాంక్షలు నెరవేరని తీరును ఎండగట్టాలని అనుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని సభ దృష్టికి తేవడం ద్వారా వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించేలా అసెంబ్లీలో గళమెత్తాలని నిర్ణయించింది. దీంతో పాటు సీఎల్పినేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర అనుభవాలు, ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరుగుతోందని, ముఖ్యంగా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నిర్వహణలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగానే తాజా వరదనష్టం జరిగిందని, ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు ప్రభుత్వ ఎత్తుగడల లోపమే కారణమనే అంశాలను ఫోకస్ చేయాలని నిర్ణయించింది. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజుల పాటు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకుగాను గురువారం కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇక, ఈ అసెంబ్లీ గడువు తీరేలోపు ఇవే చివరి సమావేశాలనే చర్చ జరుగుతోంది. 2018 జరిగిన ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్‌పార్టీ చివరి సమావేశాల నాటికి తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయి ఐదుగురికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం. -
అద్దంకిలో లోకేష్ ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన కార్యకర్తలు
-
‘సాక్షి’ విలేకరులపై టీడీపీ గూండాల దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళిత సామాజికవర్గానికి చెందిన సాక్షి విలేకరులు ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. లోకేశ్ పాదయాత్ర కవరేజికి వెళ్లిన ఓ విలేకరిపై బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి, హింసించారు. పాదయాత్రంలో జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చిత్రీకరించారన్న నెపంతో మరో మరో విలేకరిపై దాడికి పాల్పడ్డారు. లోకేశ్ పాదయాత్రపై వాస్తవాలను నిర్భయంగా రాస్తున్నారన్న అక్కసుతో లోకేశ్ ప్రైవేటు సైన్యం ఈ దాడులకు పాల్పడింది.లోకేశ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్ వద్ద సెల్ఫీ కార్యక్రమం జరిగింది. కొందరు టీడీపీ కార్యకర్తలను సెల్ఫీకి అనుమతించకపోవడంతో అక్కడ గొడవ జరిగింది. ఈ సమయంలో పాదయాత్ర కవరేజికి వెళ్లిన సాక్షి విలేకరి, దళిత సామాజిక వర్గానికి చెందన కరుణాకర్ ఆ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన లోకేశ్ ప్రైవేటు సెక్యూరిటీ కరుణాకర్‌ను టెంట్‌లోకి లాక్కొని వెళ్లి డెయిరీ, సెల్‌ఫోన్, లాక్కొని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ పిడుగుద్దులు గుద్దారు. ‘సాక్షి’ విలేకరులకు బాగా బలిసింది.. మీ సంగతి తేలుస్తామని దూషిస్తూ గంటసేపు టెంట్లో నిర్బంధించారు. సెల్‌ఫోన్ మొత్తం పరిశీలించి ఫొటోలు డిలీట్ చేశారు. మరోసారి పాదయాత్రలో ఫొటోలు తీసినా, వ్యతిరేక వార్తలు రాసినా సహించేది లేదని, పాదయాత్రలో కనిపిస్తే చంపుతామంటూ లొకేశ్ పర్సనల్ సిబ్బంది బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ సంగతి తేలుస్తామని బెదిరించి పంపేశారు. వెల్లంపల్లి దగ్గర జరిగిన లోకేశ్ పాదయాత్రలో సాక్షి విలేకరి మరొకరిపైనా టీడీపీ మూక దాడికి పాల్పడంది. పాదయాత్రలో జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న దళిత యువకులపై లోకేశ్ ప్రైవేటు సైన్యం దాడి చేసింది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న నాగులుప్పలపాడు మండల ‘సాక్షి’ విలేకరి, దళిత సామాజికవర్గానికి చెందిన అత్తంటి మధుబాబుపై కూడా టీడీపీ మూక దాడికి పాల్పడింది. పది మంది చుట్టుముట్టి చేతిలో నుంచి సెల్‌ఫోన్ లాక్కొని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు. మరోమారు ఇటువంటివి పునరావృతమైతే ప్రాణాలు ఉండవంటూ తీవ్రస్థాయిలో బెదిరించి పంపేశారు. విలేకరి మధును వదిలేసినా జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన దళిత యువకులను శుక్రవారం రాత్రికి కూడా వారి నిర్బంధంలోనే ఉన్నట్లు సమాచారం. దాడి హేయమైన చర్య: దళిత సంఘాలు ఏ తప్పూ చేయని దళిత విలేకరులపై లోకేశ్ గుండాలు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాలు మండి పడుతున్నాయి. లోకేశ్ సిబ్బందిని అదుపులో పెట్టుకోకపోతే పాదయాత్ర సాగకుండా అడ్డుకుంటామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. దళిత విలేకరులు కరుణాకర్, మధుబాబుకు, వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘సాక్షి’ రిపోర్టర్లపై దాడి దారుణం ‘సాక్షి’ విలేకరులు కరుణాకర్, మధుబాబుపై టీడీపీ గుండాల దాడి హేయమైన చర్య. ఒంగోలులో లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి స్పందన లేదు. సాక్షి పత్రిక ఈ నిజాలను నిర్భయంగా రాస్తోంది. దీనిని జీర్ణించుకోలేక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే జర్నలిస్టులపై టీడీపీ గూండాల దాడి, సెల్ఫోన్లు లాక్కోవడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా గాయపడ్డ సాక్షి దళిత విలేకరి కరుణాకర్, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి -
కార్యకర్తల కోసం వంట చేసిన భట్టి విక్రమార్క
-
అంబులెన్స్‌కు దారివ్వని నారా లోకేశ్..
ఒంగోలు: అలవలపాడులో ముఖాముఖి అనంతరం లోకేష్ పాదయాత్ర జరుగుతుండగా అలవలపాడు, హాజీస్‌పురం రోడ్డు మధ్యలో అంబులెన్స్ రోగులతో వస్తుండగా దానికి దారి ఇవ్వలేదు. పాదయాత్రలో లోకేష్‌తో నాయకులు ఉగ్ర నరసింహారెడ్డి, గొట్టిపాటి రవి, ముత్తుముల అశోక్‌రెడ్డి తదితర నాయకులు ఉన్నా కూడా అంబులెన్స్‌కు దారిద్దామని కానీ..రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలనే ప్రయత్నం చేయకపోవడం టీడీపీ కార్యకర్తలను కూడా ఒకింత విస్మయానికి గురిచేసింది. యాత్రలో మద్యం ఏరులై పారింది. అలవలపాడు, రామాపురం, బండ్లపురం, హజీస్‌పురం వద్దకు రాగా 2001 కి.మీ పాదయాత్ర జరిగినందుకు గుర్తుగా శిలాఫలకం వేశారు. ఇదిలా ఉండగా తక్కువ మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఎక్కువ మందిని తీసుకు రావడంతో వాగ్వాదాలు జరగడం కొసమెరుపు. -
యువగళంలో నారా లోకేష్‌కు షాక్ ఇచ్చిన తమ్ముళ్లు
-
యువగళంలో నారా లోకేష్ బిత్తరపోయేలా..
సాక్షి, ప్రకాశం: యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. సెల్ఫీ(ల్ఫ్) పాదయాత్ర చేసుకుంటూ పోతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు బిత్తరపోయే దృశ్యం కనిపించింది. ఒంగోలులో లోకేష్‌కు ఝలక్ ఇచ్చేలా కొందరు తెలుగు తమ్ముళ్లే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను హైలెట్ చేస్తూ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలు.. ‘‘అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే’’ అంటూ ప్రధాన కూడలలో వాటిని ఏర్పాటు చేశారు. ఒకవేళ.. భవిష్యత్తులో ఎప్పుడైనా టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆరే సీఎం అవుతాడంటూ అందులో రాసి ఉంచారు. దీంతో ఫ్లెక్సీని చూసి ఉలిక్కిపడ్డ లోకేష్ అనుచరగణం దానిని తొలగించే యత్నం చేసింది. బహుశా ఇది జూనియర్ ఫ్యాన్స్ పని అయ్యి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. ఇదే ఫ్లెక్సీ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్(స్వర్గీయ) ఫొటోతో పాటు .. లోకేష్ తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ కూడా ఉండడం గమనార్హం. ఇక లోకేష్‌ను ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని.. సిసలైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాంటూ ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజల అవసరాలే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వాన్ని త్వరలోనే తీసుకువస్తామని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పి) నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా తన పాదయాత్ర అనుభవాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి జూలై 2వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పి రి గ్రామం నుంచి ఖమ్మం నగరం వరకు నిర్వహించిన ‘పీపుల్స్ మార్చ్’అనుభవాలను శనివారం గాందీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. తన పాదయాత్ర సందర్భంగా అనేక విషయాలను తాను ప్రత్యక్షంగా చూశానని, కొన్ని పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీఆర్ఎస్ మసిపూసి మారేడు కాయ చేస్తోందని విమర్శించారు. గోబెల్స్ ప్రచారంతో అద్భుతాలు జరిగినట్టు, బంగారు కుటుంబాలు తయారయినట్టు కట్టుకథలతో నెట్టుకొస్తోందని భట్టి నిందించారు. ఆ రూ.5లక్షల కోట్లు ఎటుపోయాయో? ‘‘రాష్ట్రంలో రైతులు బాగుపడలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. దళితులకు భూమి ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ అమలు కావడం లేదు. గిరిజనులకు పోడు హక్కులు క ల్పించలేదు. ఐటీడీఏలను నిర్వీ ర్యం చేశారు.. యూనివర్శిటీల్లో నియామకాలు లేవు. మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెట్టిన తొమ్మిది బడ్జెట్ల నిధులు ఏమయ్యాయో తెలీదు. అప్పుగా తెచ్చిన రూ.5లక్షల కోట్లు ఎటుపోయాయో అర్థం కాదు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు.’అని వ్యాఖ్యానించారు. త్వరలో ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం సాగునీటిలో రాష్ట్రానికి గుండు సున్నా అని, గోదావరి, కృష్ణా నదులపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నుంచి నీరివ్వకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని భట్టి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పేందుకు, వాస్తవ పరిస్థితులను వివరించేందుకు త్వరలోనే ప్రాజెక్టుల వద్దకు వెళ్తామని, అక్కడ çపరిస్థితులను ప్రజలకు వివరించి సెల్ఫీలు దిగి చూపెడతామని వెల్లడించారు. ఇక్కడ ఫ్యూడల్.. అక్కడ బహుళజాతి సర్కారు తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని భట్టి వ్యాఖ్యానించారు. ఎవరు ఏం మాట్లాడాలన్నా భయపడుతున్నారని, ఏం మాట్లాడితే ఏం కేసు పెడతారో అనే భయంతో బతికే పోలీసు రాజ్యాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఫ్యూడల్ ప్రభుత్వం, దేశంలో బహుళ జాతి ప్రభుత్వం కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ 2004లో అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పా ర్టీదని, ఉచిత విద్యుత్‌పై పేటెంట్ తమకే ఉందని భట్టి స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరూ ఆలోచించనప్పుడే 1999లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రైతులకు ఉచిత విద్యుత్‌ను మేనిఫెస్టోలో చేర్చామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ పేరు చెప్పేముందు కాంగ్రెస్ పా ర్టీకి దండం పెట్టాలని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఫామ్‌హౌస్ సంస్కృతిని తీసుకువచ్చారని ఆరోపించారు. జర్నలిస్టులకు ఎప్పుడు ఇండ్ల స్థలాలు ఇచ్చినా కాంగ్రెస్ పా ర్టీనే ఇచ్చిందని, మళ్లీ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పా ర్టీనేనని వ్యాఖ్యానించారు. సీఎం కురీ్చలో ఎవరు కూర్చుంటారన్నది ఇప్పుడు అప్రస్తుతమని ఓ ప్రశ్నకు సమాధానంగా భట్టి స్పష్టం చేశారు. గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళులు నాంపల్లి: 1440 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలతో కలిసి భట్టి విక్రమార్క తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నేతలు చల్ల నరసింహారెడ్డి, జగదీష్ రావు, బల్మూరి వెంకట్, అజ్మతుల్లా హుస్సేని, ప్రేమ సాగర్, సిరిసిల్ల రాజయ్య, కుంభం అనీల్‌కుమార్ రెడ్డి, నూతి శ్రీకాంత్, పల్లవి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజాస్పందన కరువు
-
మరపురాని మహానేత
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల మూడు నెలల కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. ఆయన మరణించి 13 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు అడుగులు వేస్తున్నారు. జనం కోసం ఎందాకైనా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. మండుటెండలో 1,475 కి.మీల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కా>ంగ్రెస్‌కు ప్రాణం పోశారు. 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థం చేసుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వైఎస్సార్.. అధికారంలోకి వచ్చాక కన్నీళ్లు తుడిచారు. ఐదేళ్లు సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించి.. 2009 ఎన్నికల సందర్భంగా గెలుపోటములకు తనదే బాధ్యత అని నిబ్బరంగా ప్రకటించారు. ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం ఆ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజారోగ్యానికి ఆరోగ్యశ్రీతో భరోసా 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. ఈ సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. రైతును రాజు చేసిన మారాజు సీఎంగా ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు. వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించి పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని తప్పించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. మద్దతు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. పేదరికానికి విద్యతో విరుగుడు పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్సార్ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని దృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు. ఫీజుల పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు సైతం ఉన్నత చదువులను అభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. వైఎస్సార్ బాటలో పలు రాష్ట్రాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం దేశాన్ని కూడా తాకినా, ఉమ్మడి రాష్ట్రంపై పడకుండా వైఎస్సార్ నివారించగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేపట్టి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చారు. ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. ఇది జంట నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేందుకు దోహదం చేసింది. -
పాదయాత్రలో తాను వేసుకున్న బూట్లపై సీఎం జగన్ ఫన్నీ ఆన్సర్
-
భట్టి పాదయాత్ర అంశాలే మేనిఫెస్టో
కూసుమంచి/ఖమ్మం సహకారనగర్: ఆదిలాబాద్ జిల్లా మొదలుకొని ఖమ్మం జిల్లా వరకు తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దగ్గరగా చూశారని.. ప్రజలు కూడా తమకు ఏమి కావాలో చెప్పినందున ఆ సమస్యలతోనే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందనుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం భట్టి పాదయాత్ర కొనసాగగా తల్లంపాడులో పాదయాత్ర శిబిరాన్ని పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవితో కలసి రేవంత్ సందర్శించారు. పలు అంశాలపై గంటకుపైగా చర్చించాక అక్కడే భోజనం చేశారు. ఆ తర్వాత ఖమ్మంలో ఆదివారం జరగనున్న సభ విజయవంతంపై రేవంత్ సమీక్షించారు. అలాగే సభావేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించాక రేవంత్ మీడియాతో మాట్లాడారు. భట్టి చేపట్టిన పాదయాత్ర యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించిందని చెప్పారు. భవిష్యత్తులో తాము ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, అవసరమైన ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకొనేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పేరిట ప్రజల్లో తీసుకొచి్చన భ్రమలన్నీ భట్టి పాదయాత్రతో పటాపంచలయ్యాయన్నారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని, ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ అన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఇచ్చే సందేశం తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనుందని, ఈ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనున్నామని తెలిపారు. అంతకుమించి... ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరికతో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని రేవంత్ అన్నారు. తమ పార్టీలో చేరే వారిపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని.. అంతా సమన్వయంతో ముందుకెళ్లి అధికారమే లక్ష్యంగా కృషి చేయాలని నేతలకు సూచించారు. ఖమ్మం సభతో బీఆర్ఎస్ పాలనకు సమాధి కడతామని జోస్యం చెప్పారు. శ్రీనన్న మూడో కన్ను లాంటి వాడని, శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో.. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే ఉంటుందన్నారు. తాజాగా బీజేపీ నేత జితేందర్‌రెడ్డి ట్వీట్ చూస్తే ఆ పార్టీ నాయకులు ఎంత అవమానాలు భరిస్తున్నారో తెలుస్తోందని... బాత్రూంకు వెళ్లి ఏడవాల్సిన పరిస్థితి వచ్చిందని రేవంత్ ఎద్దేవా చేశారు. కాగా, బీఆర్ఎస్ తొలి సభ కంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ జనగర్జన సభకు అధిక సంఖ్యలో జనం వస్తారని, అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలవడంతోపాటు రాష్ట్రంలో 80కిపైగా సీట్లు దక్కించుకుంటామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సచివాలయానికి రాని కేసీఆర్‌ను ప్రజల బాట పట్టించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని చెప్పారు. ఇప్పుడు ఖమ్మంలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వీహెచ్, తెలంగాణ జనగర్జన సభ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.మహే‹Ùకుమార్ గౌడ్‌తోపాటు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. సభ విజయవంతానికి నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను రేవంత్ ప్రకటించారు. -
లోకేష్ యాత్ర చూసి ఆ పార్టీ నాయకులే చీదరించుకుంటున్నారు
-
సూర్యాపేట నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పాదయాత్ర
-
కేసీఆర్ చేతిలో నలిగిపోతున్న రాష్ట్రం
సూర్యాపేట: సీఎం కేసీఆర్ చేతిలో పడి రాష్ట్రం మొత్తం నలిగిపోతోందని.. ధరణి పేరుతో రాష్ట్రంలో నడుస్తున్న అతిపెద్ద ల్యాండ్ మాఫియా కారణంగా రైతులు భూములు కోల్పోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తంచేశారు. పీపుల్స్‌మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ధరణి మాఫియా సూత్రధారి సోమేశ్‌కుమార్, పాత్రధారి కేసీఆర్ అని ఆరోపించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలను కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలు అడిగానని, అయితే వారు స్పష్టమైన సమాధానాలు చెప్పడం లేదని అన్నారు. ‘మీరు నడిచే రోడ్డు.. పీల్చే గాలి మాదే’ అంటూ వంకర మాటలు మాట్లాడుతున్నారని భట్టి దుయ్యబట్టారు. మరి సూర్యాపేటకు వచ్చే నీళ్లు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. ‘నీళ్ల పండుగ పేరుతో ఎస్సారెస్పీ కాల్వల వద్ద మీరు చల్లుకునేవి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి వైఎస్సార్ కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వస్తున్న నీళ్లో కాదో చెప్పాలి’అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమేనని.. అయితే అక్కడి నుంచి ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లిచ్చారా.. అన్నది చెప్పాలన్నారు. ‘మంత్రులు చల్లుకుంటున్న నీళ్లు కాంగ్రెస్ తెచ్చినవి. మీ కారు వస్తున్న రోడ్డు మేము వేసిందే. ఇక్కడ వెలిగే కరెంటు. వంద రోజుల పని, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ కార్డులు, సూర్యాపేటలో 5 వేల మంది పేదలకు ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్సే’అని భట్టి అన్నారు. కాగా, సూర్యాపేట జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ మద్దతు తెలిపారు. యాత్రలో ఆయన భట్టిని కలిశారు. రానున్న 150 రోజుల్లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భూమిలేని పేదలకు ‘కూలీబంధు’: భట్టి భానుపురి (సూర్యాపేట): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూమిలేని పేదలకు ‘కూలీబంధు’పథకాన్ని ప్రవేశపెడతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం రాత్రి సూర్యాపేటలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద పేదలకు ఏటా రూ.12,500 అందజేస్తామని తెలిపారు. తన పాదయాత్రలో రైతులు, రైతు కూలీల బాధలు విన్నానని, సింగరేణి బొగ్గుబాయిలో దిగితే కారి్మకుల గోస కనపడిందన్నారు. పేదలకు భూములను పంచడంతోపాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి బతుకులను బాగు చేస్తుందన్నారు.జనాభాలో 50 %ఉన్న బీసీలకు సబ్‌ప్లాన్ తీసుకొస్తామని చెప్పారు. -
బీఆర్ఎస్, బీజేపీ.. రెండూ ఒకటే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పరస్పర విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్లు కలసి ఆడుతున్న నాటకంలో భాగమేనని ధ్వజమెత్తారు. ఈ పా ర్టీలు రాష్ట్రంలో ఇతర రాజకీయ పా ర్టీలకు ఉనికి లేకుండా చేయాలని కుట్ర పన్నాయన్నారు. ఆ పా ర్టీల కుట్రలను ఇప్పటికే కాంగ్రెస్ బయటపెట్టిందన్నారు. బడ్జెట్ సమావేశాలు, జాతీయ జెండా ఆవిష్కరణ వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ గవర్నర్‌తో కలిసి పాల్గొనేందుకు ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు సయోధ్య కుదుర్చుకొని, చిరునవ్వులు నవ్వుతూ గవర్నర్‌తో కలసి పోవడంతో.. కేసీఆర్ గురించి తెలంగాణ సమాజానికి పూర్తిగా అర్థమైందన్నారు. నియంతృత్వ పోకడలతో ఫాసిస్టు పాలన సాగిస్తున్న మోదీ, కేసీఆర్‌లను వదిలించుకుంటే తప్ప తమకు స్వేచ్ఛ ఉండదని ప్రజలు గ్రహించారన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అంతా అవినీతేనని అన్నారు. ధరణితో భూ కుంభకోణాలు, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు లీజు అక్రమాలు, విలువైన భూముల అమ్మకాల్లో అవినీతి, కాళేశ్వరం అవినీతి, లిక్కర్‌స్కాం చిట్టా తమ వద్ద ఉందని మాట్లాడిన అమిత్‌షా, మోదీలు ఇప్పటివరకు కేసీఆర్‌పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్లోకి వెళ్లిన నాయకులు కేసీఆర్ అసలు స్వరూపం తెలుసుకుని పెద్దఎత్తున మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టి 3 నెలలు దాటుతోందని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన గుండె చప్పుడు, వారి ఆవేదనను మీడియా సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నానన్నారు. మీడియా సమావేశంలో నల్లగొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య, నల్లగొండ ఎంపీపీ సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల స్థలాల కోసం 2007లో పాదయాత్ర చేశా: కొడాలి నాని
-
నెల్లూరులో తొలిరోజే యువగళం పాదయాత్ర అట్టర్‌ప్లాఫ్
-
లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి
బద్వేలు అర్బన్ : నారాలోకేష్ యువగళం పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా విద్యానగర్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికే కార్యకర్తలు టపాసులు పేల్చడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి విద్యానగర్ సమీపంలో ఆర్.విజయమ్మ, ఆర్.నాగమ్మలకు చెందిన గడ్డివాములు దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. వేసవికాలం పశువులకు మేత దొరకని కష్ట సమయంలో ఉన్న గడ్డివాములు దగ్ధమవడంపై మహిళలు బోరున విలపించారు. ఈ ఘటనలో సుమారు రూ.70 వేలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
నల్లగొండ జిల్లాకు చుక్కనీరు తెచ్చారా?
కొండమల్లేపల్లి: ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు దేని కోసం.. నల్లగొండ జిల్లాకు చుక్క నీరు తెచ్చారా.. లేదా పెద్ద ప్రాజెక్టు కట్టారా’అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండలంలో కొనసాగింది. సాయంత్ర కొండమల్లేపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో భట్టి మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తొమ్మిదేళ్లుగా రూ.వెయ్యి కోట్లు తీసుకురాని దుర్మార్గులు ఈ బీఆర్ఎస్ పాలకులని విమర్శించారు. ఆనాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం దగ్గరికి వెళ్లి సమీక్షలు చేసి 70 శాతం వరకు పనులు పూర్తి చేయించారని.. మంత్రి అంటే పని చేయించే కోమటిరెడ్డిలా ఉండాలని వ్యాఖ్యానించారు. జగదీశ్‌రెడ్డి ఒక్కరోజు కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లలేదని, సమీక్షలు చేయకుండా దిష్టి»ొమ్మగా ఉన్నారని విమర్శించారు. భట్టిని విమర్శించే స్థాయి మంత్రి జగదీశ్‌రెడ్డికి లేదు.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల కోసం భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుంటే స్వార్థం కోసం పాదయాత్ర చేస్తున్నాడని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భట్టి విక్రమార్కను విమర్శించే స్థాయి జిల్లా మంత్రికి లేదన్నారు. నల్లగొండలో ప్రియాంకగాం«దీతో సభ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. గుమ్మడవెల్లిలో పైలాన్ ఆవిష్కరణ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చేరుకోవడంతో ఆదివారం వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.. కాగా భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో ఆయనను కలుసుకునేందుకు భార్య నందిని, కుమారుడు సిద్ధు ఇక్కడికి వచ్చారు. -
ఎస్ఎల్బీసీపై నిర్లక్ష్యపు కుట్ర
అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్ఎల్బీసీ పనులు చేపట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే నిర్లక్ష్యం చేస్తూ రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పీపుల్స్‌మార్చ్ పాదయాత్రలో భాగంగా 83వ రోజు ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. గ్రావిటీ ద్వారా 4లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు ఇచ్చేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుకు రూ.2,259 కోట్లు మంజూరు చేసి 2008 మార్చి 26న టీబీఎం మిషన్ ప్రారంభించారని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 23.5 కిలోమీటర్ల సొరంగం పనులు జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 కిలోమీటర్ల మేర మాత్రమే పని జరిగిందన్నారు. ఈ ప్రభుత్వ కాలయాపనతో అంచనా వ్యయం 4,776.42 కోట్లకు పెరిగిందన్నారు. ఎస్ఎల్బీసీ నుంచి నీళ్లు తీసుకుపోవాలనే సోయి నల్లగొండ జిల్లా మంత్రికైనా ఉండాలి కదా? ఆయన పదేళ్లుగా ఏం చేస్తున్నట్లు? అని భట్టి ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీలాంటి ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే మిషన్ భగీరథకు రూ.42వేల కోట్లు ఖర్చుచేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఆయన వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు. -
పోలీసులు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి
అచ్చంపేట: పోలీసులు రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించాలని.. లేకపోతే రాజ్యాంగేతర శక్తులు పుట్టుకొస్తాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పోలీసులు చట్టాన్ని తుంగలో తొక్కి అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా నడుచుకుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా లింగరోనిపల్లి శివారులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారన్నారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐ మొదలుకొని డీఎస్పీ వరకు ఎమ్మెల్యేల ఆదేశాలే పాటిస్తున్నారని ఆరోపించారు. ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తాం: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు. జీఓ 317ను రద్దు చేసి పాత విధానంలోనే బదిలీలు చేపడతామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని, ధరణిని ఎత్తివేస్తామని చెప్పారు. పోడు భూములపై గిరిజన రైతులకు హక్కు కల్పిస్తూ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్యూడలిజాన్ని తిరిగి తీసుకొచ్చేందకు సీఎం ధరణి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ముందుస్తు అరెస్టులు సరికాదు: కాంగ్రెస్ పార్టీని దేశంలో, తెలంగాణలో నిషేధించారా..? ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వాహనాలకు ముందు, వెనక పోలీసు ఎస్కార్టు పెట్టుకొని.. ముందుస్తు అరెస్టులు చేయించేవాళ్లు అసలు ప్రజాప్రతినిధులేనా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. -
లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఈవినింగ్ వాకింగ్ లా ఉంది: రాచమల్లు
-
మంత్రుల పర్యటనల్లో విపక్షాల అరెస్టులా?
పెద్ద కొత్తపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలీసులు వెంట లేకుండా ప్రజలకు వద్దకు వచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా? అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పోలీసు భద్రత లేకుండా తిరిగితే వారి పరిస్థితి ఏమిటో అప్పుడు అర్థమవుతుందన్నారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా చంద్రకల్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు అచ్చంపేటలో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించడానికి వస్తే కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రులు వస్తున్నప్పుడు ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ప్రజలను కలవకుండా ప్రారంబోత్సవాలు చేసుకోవడం దేని కోసమని భట్టి ప్రశ్నించారు. ‘ప్రజలేమైనా దోపిడీదారులా, దొంగలా.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలను ఏమైనా నిషేధించారా?’అని ధ్వజమెత్తారు. ప్రశ్నించే అధికార పార్టీ నాయకులను సైతం అరెస్టు చేయించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. పాలకులు చెప్పినట్లు కాకుండా పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని, ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటానికి వ్యవస్థీకృతమైన పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేసేలా ఉండాలని భట్టి సూచించారు. తప్పులు చేస్తున్న అధికారుల లెక్కలు రాస్తున్నామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను భయపెట్టి పాలించడం కాదని.. ప్రజల హృదయాలు గెలిచి పరిపాలన సాగించాలని సూచించారు. -
‘అమరావతి’ పట్టాల పంపిణీని హర్షిస్తూ భారీ ర్యాలీ
వెంకటపాలెం(తాడికొండ)/తాడేపల్లిరూరల్: అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ పాల్గొని వెంకటపాలెం టీటీడీ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటామంటూ చంద్రబాబు, రాజధాని రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు, కులవాదులు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో బాబు ఆయన అనుయాయుల మనసు మార్చాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బహుజన పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. పలువురు బహుజన పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు. నాడు పెత్తందారుల పసుపు నీళ్లు.. నేడు పేదల క్షీరాభిషేకం అమరావతి ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తే నాడు ‘పచ్చ’ పెత్తందారులు పసుపు నీళ్లు చల్లి కుట్రలకు తెరదీస్తే.. నేడు అదే ప్రాంతంలో పేదలు జగనన్నకు క్షీరాభిషేకం చేసి అభిమానం చాటుకుంటున్నారు. అమరావతిలో నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో అమరావతి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గురువారం ఆ ప్రాంతంలో పేదలతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు శృంగారపాటి సందీప్, పలువురు 11 గ్రామాల్లోని 25 లే అవుట్లలో 2000 లీటర్ల పాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు, ప్లాట్లకు క్షీరాభిషేకం చేశారు. తాడేపల్లి ప్రాంతంలో.. కొండపోరంబోకులోనూ, రైల్వే స్థలాల్లోనూ బిక్కుబిక్కుమంటూ 40–50 సంవత్సరాల నుంచి నివాసముంటున్న పేదలకు సొంతింటి కల నెరవేరడంతో ఆనందంతో తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముదిగొండ ప్రకాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇత్తడి పండు, ఎం. మార్తమ్మ, జమ్మలముడి సునీత తదితరులు పాల్గొన్నారు. -
వ్యవస్థలో మార్పు కోసమే యాత్రలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర, మల్లు భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కాదని.. వ్యవస్థలో మార్పు కోసమేనని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు అన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రధాని పదవి కోసం చేయలేదని, దేశంలో నెలకొన్న విద్వేషాలను తొలగించేందుకు చేశారని చెప్పారు. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి.. రాహుల్ సందేశాన్ని వివరిస్తూ వ్యవస్థలో మార్పు కోసం పాదయాత్రలు చేస్తున్నారని వివరించారు. ఆ మార్పు కోసం కాంగ్రెస్ పారీ్టకి ఓటు వేయాలని కోరారు. ‘పీపుల్స్‌మార్చ్ ఫర్ ఛేంజ్’ పేరుతో ప్రారంభమైన భట్టి పాదయాత్ర 69వ రోజు 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గురువారం నిర్వహించిన బహిరంగ సభకు హిమాచల్ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ కారణంగానే దేశాభివృద్ధి స్వాతంత్య్రం వచి్చన తొలినాళ్లలో దేశంలో గుండుసూది కూడా తయారు చేసే పరిస్థితి లేదని.. ఆ స్థితి నుంచి ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పారీ్టయే కారణమని సుఖు చెప్పారు. 2004లో సోనియాగాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ త్యాగం చేశారని గుర్తు చేశారు. అప్పట్లో సోనియా ప్రధాని కావాలని చెప్పిన పారీ్టల్లో బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ కూడా ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిమాచల్ ప్రదేశ్ తరహాలో ఓపీఎస్ (పాత పింఛను విధానం) తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పేదలకు అన్నం పెట్టేందుకు కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కరోనా కాలంలో ఎంతోమంది పేదలకు ఆ పథకం కడుపు నింపిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్, భట్టిల పాదయాత్రలు ముగిశాక పార్టీ ముఖ్య నేతలందరితో కలిసి బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. అన్ని జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ కిడ్నీలు ఇచ్చినా జనం నమ్మరు: రేవంత్‌రెడ్డి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్లను ఇచ్చే ఆలోచన చేస్తున్నారని, కేసీఆర్ కిడ్నీలు ఇచ్చినా జనం నమ్మే పరిస్థితిలో లేరని రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలితే, బడుగుల బిడ్డలు వలసలు పోవాలా? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసిన కేసీఆర్, పాలమూరుకు మాత్రం చుక్కనీరు తేలేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి అండగా నిలవాలని కోరారు. రేవంత్‌రెడ్డి పరోక్షంగా అలంపూర్ అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించారు. వెనుకబడిన అలంపూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సంపత్‌కుమార్‌ను అధిక మెజారీ్టతో గెలిపించాలన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో తిరగబడాలి: భట్టి ‘కాంగ్రెస్ పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో లాక్కొంటోందని.. ఈ భూములపై పోరాడతాం.. రుతుపవనాలు వస్తున్నాయి.. మేమంతా వచ్చి అరకలు దున్నిస్తాం..’ అంటూ రైతులకు భట్టి విక్రమార్క భరోసా కలి్పంచారు. కాంగ్రెస్ పంచిన భూములను కాపాడుకునేందుకు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు గుర్తించామని ఆయన తెలిపారు. తొమ్మిదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తిచేయని బీఆర్ఎస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సభలో మొదటగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 12 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తామూ నల్లగొండలో 12 సీట్లను గెలిపించి మొత్తం 24 సీట్లతో కాంగ్రెస్‌కు ఆధిక్యాన్ని కట్టబెడతామని చెప్పారు. సభలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నవీన్ జావెద్, కొప్పుల రాజు, టీపీసీసీ నేతలు వి.హన్మంతరావు, అనిరు«ద్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బహిరంగసభకు హాజరయ్యేందుకు సిమ్లా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచి్చన సుఖుకు మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, వంశీచందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు. దాదాపు అర్ధగంటకు పైగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. -
తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజాసంక్షేమ యాత్ర
-
‘పీపుల్స్ మార్చ్’కు అతిరథులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో మార్చి 16న ప్రారంభమైన భట్టి యాత్ర ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, పరిగి మీదుగా ఈ నెల 16న రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలో అడుగుపెట్టింది. 17న యాత్ర ఇదే మండలంలోని రుక్కంపల్లికి చేరుకుంది. ఇప్పటివరకు 25 నియోజకవర్గాల్లో 800 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. అయితే వడదెబ్బతో డాక్టర్ల సూచన మేరకు 18 నుంచి యాత్రకు విరామం ప్రకటించారు. నాలుగు రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో మళ్లీ పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మంచిర్యాలలో బహిరంగ సభ నిర్వహించగా.. తాజాగా మరో మూడు చోట్ల బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలతో చర్చలు జరిపిన ఆయన జాతీయ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నెల 25 లేదా 26న జడ్చర్లలో సభ నిర్వహణకు శ్రీకారం చుట్టగా.. ముఖ్యఅతిథిగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రానున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తదితర ముఖ్యనేతలు ఈ సభకు హాజరుకానున్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ నియోజకవర్గ పరిధిలో లక్ష మందితో బహిరంగ సభకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సభకు అగ్ర నేత ప్రియాంకాగాందీని, ఖమ్మంలో ముగింపు సందర్భంగా మూడు లక్షల మందితో నిర్వహించే సభకు రాహుల్‌గాందీని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ సభలకు సంబంధించి కాంగ్రెస్ ముఖ్యనేతలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా.. తేదీల ఖరారుపై స్పష్టత రావాల్సి ఉంది. వడదెబ్బతో యాత్రకు కొంత విరామం ప్రకటించామని.. అయినా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. -
నారా లోకేష్ పాదయాత్ర పొడవునా టీడీపీలో గొడవలే
-
గహ్లోత్‌కు సచిన్ పైలట్ అల్టిమేటం
జైపూర్: రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దూకుడు పెంచారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్న తన డిమాండ్‌ను ఈ నెలాఖరులోగా నెరవేర్చకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామంటూ సొంత పార్టీకే చెందిన సీఎం అశోక్ గహ్లోత్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఈ డిమాండ్ సాధనలో భాగంగా ఆయన చేపట్టిన ఐదు రోజుల పాదయాత్ర సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా తన మద్దతు దారులైన 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జైపూర్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ)ని రద్దు చేసి, పునర్వ్యవస్థీకరించాలని, పేపర్ లీక్‌తో పరీక్షలను రద్దు వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలన్న రెండు కొత్త డిమాండ్లను వినిపించారు. నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
మాజీ ఎమ్మెల్యే డైరెక్షన్.. తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్!
ములకలచెరువు : నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు ములకలచెరువులో సోమవారం చేపట్టిన సంఘీభావ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్ నేతృత్వంలో చేపట్టిన ఈ ర్యాలీకి పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేదు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నా... శంకర్‌యాదవ్ డైరెక్షన్లో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి అలజడి సృష్టించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ దౌర్జన్యకాండకు ఒడిగట్టారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ములకలచెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంయమనంతో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా టీడీపీ శ్రేణులు ఈలలు వేస్తూ వారి మీదికొచ్చారు. అల్లరి మూకలు వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్లు, చెప్పులతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో పోలీసులతోపాటు వైఎస్సార్సీపీ నేతలకూ గాయాలయ్యాయి. సంఘీభావ ర్యాలీ చేపట్టిన శంకర్ అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని నిలిపివేయాలని మదనపల్లి డీఎస్పీ కేశప్ప మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు సూచించారు. ‘మీకు చేతనైతే ర్యాలీని ఆపుకోండి.. దేనికైనా సిద్ధం’ అంటూ శంకర్ పోలీసులను రెచ్చగొట్టారు. అంతటితో ఆగని శంకర్.. తన వాహనంతో మండల కేంద్రానికి వచ్చి అనుచరగణంతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవు : డీఎస్పీ బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా పొందాలని డీఎస్పీ కేశప్ప స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జన జీవనానికి విఘాతం కలిగిస్తూ.. సభలు, సమావేశాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు తెలుగు తమ్ముళ్ల దాడిలో మహిళలకు గాయాలు యాదమరి(చిత్తూరు జిల్లా): లోకేశ్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదమరి మండలంలో చేపట్టిన సంఘీభావ యాత్రలో వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై టీడీపీ నాయకులు టపాకాయలు కాల్చి దాడికి దిగారు. సోమవారం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు యాదమరి నుంచి దళవాయిపల్లెకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కావాలనే 14 కండిగ ముస్లింవాడ గ్రామం మీదుగా దళవాయిపల్లె వరకు పాదయాత్ర చేశారు. 14 కండిగ ముస్లింవాడలో వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకులు, స్థానిక సర్పంచ్ కుటుంబం కబీర్ ఇంటి ముందు బాణసంచా పేల్చి, వారిని ఇబ్బందులకు గురిచేయాలని భావించారు. ప్రణాళిక ప్రకారం వీధిలో దాదాపు 500 మీటర్ల దూరం బాణసంచా పేర్చి నిప్పు పెట్టారు. చెవులకు చిల్లులు పడేలా శబ్దాలు రావడంతో ఇంట్లో ఏడాది బాబుతో పాటు మహిళలు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై స్థానిక మహిళలు తెలుగు తమ్ముళ్లును ప్రశ్నించగా, వారు రెచ్చిపోయి విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దీనిపై మైనారిటీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే నిర్బంధాలు: భట్టి విక్రమార్క
సాక్షి రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే నిర్బంధాలు అమలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాజధాని నడిబొ డ్డున భయంకరమైన రాజ్యహింసను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్‌పేట, బడంగ్‌పేట మీదుగా ఆయన చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర కొనసాగింది. బడంగ్పేట్లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కోరి తెచ్చుకున్న తెలంగాణలో నిశ్శబ్దంగా రాజ్యహింస అమలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ విషయమై మేధావులు గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు భూములు పంపిణీ చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కొంటోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను లాక్కునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. సామాజిక బాధ్యత కలిగిన రాజకీయ పారీ్టలు నోరు మెదపకపోవడం బాధాకరమని చెప్పారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5 లక్షల కోట్ల విలువైన 10 వేల ఎకరాలను, హైదరాబాద్ చుట్టూ 25 లక్షల కోట్ల విలువైన పేదల భూములను ఈ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. కందుకూరు మండలంలో ఫార్మాసిటీ కంపెనీ పేరుతో ఐదొందల ఎకరాలు, మరో నాలుగు వందల ఎకరాలు బఫర్ జోన్లో ఈ ప్రభుత్వం తన వద్ద ఉంచుకుందన్నారు. ‘మేము అధికారంలోకి వచ్చాక బలవంతంగా లాక్కున్న భూముల్లో లబ్ధిదారులతో దున్నిస్తాం. ఇంటి స్థలాలను పంపిణీ చేస్తాం. కట్టిన ఇళ్లు పంపిణీ చేయకుండా ఉంటే గృహప్రవేశం చేయిస్తాం’అని భట్టి చెప్పారు. భూములను కొల్లగొట్టడానికే ధరణి: గద్దర్ పేదల భూములను కొల్లగొట్టడానికే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తెచ్చారని ప్రజా గాయకుడు గద్దర్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కట్టింది కూలగొట్టు, కమీషన్లు కొట్టు, ఎన్నికల్లో పంచు, గద్దెనెక్కు అన్న చందంగా నడుస్తోందని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించేవారు లేరని, ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని హెచ్చరించారు. -
కర్నూలులో లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
-
ప్రతి పేదవాడికీ ఇల్లు కావాలి
సాక్షి, యాదాద్రి, జనగామ: ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని.. వైట్‌హౌజ్ లాంటి బంగ్లాలు కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో అద్భుతంగా ఉండే పాలకుల ప్యాలెస్ కోసం తెలంగాణ తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం 45వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా సరిహద్దు ఆలేరు మండలంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సాయంత్రం ప్రారంభమైన పాదయాత్ర శ్రీనివాసపురం, పటేల్‌గూడెం, గుండ్లగూడెం మీదుగా ఆలేరు పట్టణానికి చేరుకుంది. ఆలేరులోని రైల్వేగేట్ వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య అధ్యక్షతన జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సంపద మొత్తం 4 కోట్ల మంది ప్రజలకు సమానంగా పంచుకోవడానికి తెచ్చుకుంటే దురదృష్టవశాత్తూ కేసీఆర్ కుటుంబంతో పాటు వారితో మమేకమైన వారు దోచుకుతింటున్నారని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఆరుట్ల కమలాదేవి ఈ ప్రాంతంలో భూములు పంచితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సునీతకు ప్రజల మీద కంటే భూములపైన, వెంచర్లపైన, భూకబ్జాలపైన ప్రేమ ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. నగేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్త సచివాలయం వల్ల ప్రజలకు ప్రయోజనమేమిటి? పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకలి కేకలు పట్టించుకోకుండా.. ఇళ్లు లేక ప్రజలు, ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతుంటే ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. -
ఉద్రిక్తంగా మారిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
-
జనగామలో భట్టి పాదయాత్రలో ఉద్రిక్తత
-
అసలుకే ఎసరు పెట్టిన లోకేష్ యాత్ర.. టీడీపీలో కొత్త ట్విస్టులు!
నారా లోకేష్ పాదం మోపుతున్న ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీలో గ్రూపులు బయటపడుతున్నాయి. ఒకచోట ఫ్లెక్సీల గొడవ, మరోచోట ఆధిపత్య పోరు.. ఇలా ప్రతీ చోటా ఏదో ఒక తలనొప్పి లోకేష్‌ను ఇబ్బంది పెడుతోంది. కర్నూల్ జిల్లాలో సాగుతున్న పాదయాత్ర అక్కడి టీడీపీని మరింత బలహీనపరుస్తోందని చెబుతున్నారు. ఇంతకీ కర్నూల్ పచ్చ పార్టీలో ఏం జరుగుతోంది..? పాతాళంలో ఉన్న తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొద్దామని నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఎక్కడికక్కడ గ్రూపులు బయటపడి పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయట. ప్రస్తుతం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నేతల్లో ఉత్సాహం ఏమాత్రం కనిపించడంలేదు. ఏ నియోజకవర్గంలో లోకేష్ కాలు పెడుతున్నాడో ఆ నియోజకవర్గంలో నాయకుల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ని మార్చాలంటూ కరపత్రాలను పంచగా.. ఆలూరు నియోజకవర్గంలో తమకు ఈ ఇన్ఛార్జ్ వద్దంటూ ప్లెక్సీల ద్వారా నారా లోకేష్‌కు అక్కడి నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో మొదటి నుండి నాలుగు వర్గాలుగా కొనసాగుతున్న నాయకులు ఎవరి ఇష్టం మేరకు వారు నడుచుకుంటున్నారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ మాత్రం అందర్నీ కలుపుకునిపోతేనే వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అసమ్మతి వర్గం మాత్రం సుజాతమ్మకు వ్యతిరేకంగా మహాకూటమిగా ఏర్పడి సుజాతమ్మకు టికెట్ ఇవ్వద్దని ఎలుగెత్తి చాటుతున్నారు. సుజాతమ్మను వ్యతిరేకిస్తున్న ఆ మూడు గ్రూపుల్లో మాలో ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదు.. కలిసి పనిచేసి గెలిపించుకుంటాం.. సుజాతమ్మకు మాత్రం టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని లోకేష్‌కు తేల్చి చెప్పారట. నారా లోకేష్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. అసమ్మతి వర్గం మాత్రం తమ బలాన్ని నిరూపించుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. కోట్ల సుజాతమ్మ సీటు తనకే ఇస్తారని ధీమాగా ఉన్నారు. ఒక పార్టీ ముఖ్య నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడంటే.. ప్రజల సమస్యలు వింటాడని, పార్టీలో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతాడని అందరూ ఆశిస్తారు. అయితే, ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం ఎక్కడ పాదం మోపితే అక్కడ పార్టీ మరింత వీక్ అవుతోందనే టాక్ నడుస్తోంది. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న గ్రూపులు లోకేష్ కనిపించగానే బయటికొస్తున్నాయి. ఒకవైపు పొగడ్తలు.. మరోవైపు నిరసనలతో యువగళం కాస్తా నిరసనగళంగా మారుతోంది. -
బీసీ బంధు పథకం ఎక్కడ?
సాక్షి, పెద్దపల్లి: దళితబంధు మాదిరిగానే బీసీలకు బీసీ బంధు పథకం ప్రారంభించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. బీసీబంధు ప్రారంభిస్తామని అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీ ఎందుకు కార్యరూపం దాల్చడం లేదని ప్రశ్నించారు. హాథ్ సే హాథ్ జోడోయాత్రలో భాగంగా ఆయన చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర పెద్దపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో భట్టి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో 54 శాతానికి పైగా ఉన్న బీసీల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడటం మానుకోవాలని, వారికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేసి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2023–24లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2.90లక్షల కోట్లుకాగా.. ఇందులో బీసీ సంక్షేమానికి కేవలం 5 శాతం నిధులు మాత్రమే కేటాయించారని తెలిపారు. చివరికి కేటాయించిన ఆ కొద్ది శాతం నిధులనూ పూర్తిస్థాయిలో ఖర్చు చేయటం లేదని విమర్శించారు. 2018–19లో కూడా బీసీల సంక్షేమానికి రూ.5,960 కోట్లు కేటాయించినా అందులో 63 శాతం కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. సబ్సిడీ రుణాల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. సీఎం కళ్లు తెరిచి బీసీలు, ఎంబీసీలు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ఏదీ..? బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తెస్తామని 2017లో అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు చేయలేదని భట్టి ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తే మరో రూ.10 వేల కోట్లు అదనంగా సమాకూరేవన్నారు. 2017లో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా అలంకారప్రాయంగానే మిగిలిందన్నారు. ప్రతి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు చూపుతున్నా.. ఫైనాన్స్ విభాగం ఆమోదం పొందింది నామమాత్రమేనని, అందులో ఖర్చు చేసింది చాలా తక్కువని ఆరోపించారు. 2018–19లో 75 శాతం, 20–22లో 100 శాతం నిధులు ఖర్చు చేయకుండా ఎంబీసీలను మోసగించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని ఇచ్చిన జీవోలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, ఎంబీసీ జాబితాలో చేర్చాలని 15 కులాలవారు ప్రభుత్వానికి విన్నవించుకుని ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను 18 శాతానికి కుదించారని, మంత్రివర్గంలో కేవలం ముగ్గురికి పదవులిచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. -
అలా కుదరదు.. లోకేష్‌కు షాకిచ్చిన టీడీపీ కార్యకర్తలు!
సాక్షి, కర్నూలు: టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కర్నూలుకు చేరుకుంది. ఈ క్రమంలో లోకేష్‌కు టీడీపీ స్థానిక నేతలు ట్విస్ట్ ఇచ్చారు. పాదయాత్ర సందర్బంగా టీడీపీలో వర్గపోరు మరింత ముదిరింది. స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఆలూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు వర్గ విభేదాలతో టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. కాగా, లోకేష్ పాదయాత్ర సందర్బంగా ఫ్లెక్సీల గొడవ షురూ అయ్యింది. ఆలూరులో ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుంది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఫొటో ఫ్లెక్సీలు కట్టాలని లోకేష్.. టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అయితే, సుజాతమ్మ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలను కట్టే ప్రస్తకేలేదని అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. దీంతో, వారి సమాధానం విని లోకేష్ బాబు ఖంగుతిన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అసమ్మతి నేతలు కట్టిన ఫ్లెక్సీల్లో సుజాతమ్మ.. తన ఫొటోను అతికించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
ఇదేందయ్యా లోకేశం.. ‘యువగళం’కు కర్ణాటక కిక్కు!
మడకశిర: నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు తరలిస్తున్నట్లు భావిస్తున్న కర్ణాటక మద్యం బాక్సులను ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (సెబ్) పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, ఈ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మద్యం పంపిణీ చేసైనా సరే పాదయాత్రకు జనసమీకరణ చేయాలని స్థానిక టీడీపీ నాయకులు భావించారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని తుమకూరు నుంచి కర్నూలు జిల్లాకు ఓ కారులో మద్యం తరలిస్తుండగా మడకశిరలోని ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద సెబ్ పోలీసులు పట్టుకున్నారు. 35 బాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 35 బాక్సుల్లో 3,360 మద్యం ప్యాకెట్లు ఉన్నాయని సెబ్ సీఐ భార్గవ్‌రెడ్డి తెలిపారు. ఈ మద్యం విలువ రూ.1.68 లక్షలు ఉంటుందని చెప్పారు. కారును సీజ్ చేసి.. మద్యం తరలిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన సాయి ప్రకాశ్‌రెడ్డి, శేఖర్‌ను అరెస్ట్ చేశారు. -
కమీషన్ల కోసం ఎంసీహెచ్‌ను ముంచారు!
మంచిర్యాలటౌన్: స్థానిక నడిపెల్లి ఎమ్మెల్యే దివాకర్‌రావు కమీషన్లకు కక్కుర్తిపడి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)ను గోదావరి ఒడ్డున వరద నీటిలో మునిగే చోట నిర్మించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హాథ్‌సే హాథ్ జోడో యాత్ర కొనసాగింపులో భాగంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 31వ రోజు ఆదివారం మంచిర్యాల పట్టణంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ నివాసం నుంచి ప్రారంభమై ఐబీ చౌరస్తాలో ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ఐబీ ఆవరణలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించి మాట్లాడారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఐబీ ఆవరణలో నిర్మించి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉండి, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఎన్నిసార్లు చెప్పినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. గోదావరి ఒడ్డున నిర్మించడం వల్ల ప్రజలకు దూరభారం కావడంతోపాటు, ప్రభుత్వాసుపత్రికి దూరంగా ఉంటుందని, గోదావరికి వరదలు వస్తే మునిగి పోయే ప్రమాదం ఉందని చెప్పినా వినలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమీషన్ల కోసమే ఎంసీహెచ్‌ను గోదావరిలో ముంచారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలో పంటలతోపాటు ఎంసీహెచ్ కూడా మునిగిందన్నారు. నిధులు ఖర్చు చేయాల్సింది ప్రజల సంక్షేమం కోసమే కానీ, ఎమ్మెల్యేల కమీషన్ల కోసం కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు విద్య, వైద్యం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. -
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా.. ఆద్యంతం భట్టికి ఆత్మీయ అనుబంధమే
మంచిర్యాల టౌన్/ మంచిర్యాల రూరల్ (హాజీపూర్): హాథ్‌సే హాథ్ జోడో యత్ర కొనసాగింపులో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా పిప్రి వద్ద షురూ అయిన ఈ యాత్ర 31 రోజుల పాటు సాగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా సాయంత్రం పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఇంటి నుంచి యాత్ర ప్రారంభమైంది. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి భట్టి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్సవ విగ్రహంలా ఎమ్మెల్యే.. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మంచిర్యాల అ భివృద్ధికి నిధులు తీసుకురావడంలో స్థానిక ఎమ్మె ల్యే విఫలమయ్యారని ఆరోపించారు. గోదావరి బ్యా క్ వాటర్ వచ్చి, రాళ్లవాగు ఉప్పొంగి ఈ ప్రాంతం మునిగిపోయినా నిరాశ్రయులను ఆదుకోకుండా, వారికి పరిహారం ఇవ్వకుండా, ఉత్సవ విగ్రహంలా దివాకర్‌రావు ఉన్నారని విమర్శించారు. స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్నారు. పనిచేయని ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. యాత్రలో పాల్గొన్న జనం మాకు అవసరం లేదంటూ నినాదాలు చేశారు. పనిచేసే వారు, ఈ ప్రాంత ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసే నాయకులే మనకు కావాలన్నారు. అధికారంలో ఉ న్నా, లేకపోయినా ప్రజల కోసం తపించే నా యకు డు ప్రేమ్‌సాగర్‌రావు అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కో రారు. చేతగాని ఎమ్మెల్యే దివాకర్‌రావు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఎద్దేవా చేశారు. సమస్యలు తెలుసుకుంటూ... పాదయాత్రలో భాగంగా మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో దోస, పండ్లు అమ్ముకునే వారిని భట్టి పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేదరివాడలో వెదురు బుట్టలు, చాటలు తయారు చేసి అమ్ముకునే బొల్లం రజితతో మాట్లాడగా, తాను బీఈడీ చదివానని చెప్పింది. ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తప్పనిసరి పరిస్థితుల్లో కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోగా, డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు సైతం ఇవ్వడం లేదని చెప్పింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే కులవృత్తులకు పెద్దపీట వేస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని భట్టి తెలిపారు. హాజీపూర్ మండలంలో ఘన స్వాగతం.. పాదయాత్ర హాజీపూర్ మండలం వేంపల్లికి చేరగానే స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. భట్టితోపాటు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీటీసీ డేగ బాపు దంపుతులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జాతీయ రహదారి మీదుగా ముల్కల్ల, గుడిపేట వరకు యాత్ర చేశారు. గుడిపేటలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత గుడిపేట గోదావరి రోడ్ మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీదుగా భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది. భట్టి విక్రమార్క పాదయాత్రలో స్థానికులకు అభివాదం చేస్తూ కలిసిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సమస్యలు పరిష్కరించాలని, నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తమ ఇళ్లు, భూములు కోల్పోకుండా అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌పై కేక్ కటింగ్.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌పై కేక్ కట్ చేశారు. మత్స్యకారులు భట్టికి చేపల వల అందజేశారు. అనంతరం భట్టి పాదయాత్రకు ప్రాజెక్ట్ వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు భట్టికి జిల్లాలోకి స్వాగతం పలికారు. పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ, రఘునాథ్‌రెడ్డి, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఒడ్డె రాజమౌళి, ఎంపీటీసీ బాలరాజు, నాయకులు సురేందర్, కుమార్ యాదవ్, పార్టీ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు. -
కర్నూల్ లో లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
-
కర్నూలు: లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
సాక్షి, కర్నూలు: నారా లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. దళితులు ఏం పీకారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దళిత సంఘాలు ఆయనను అడ్డుకున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో లోకేష్ ఏం చేయాలో తెలియక తెల్లమొహం వేసుకున్నాడు. కాగా.. దళితులపై నారా లోకేశ్ నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రలో లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి లోకేశ్ చేరుకున్నారు. జక్కసానిపల్లిలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగానే దళితులు పీకిందేమీ లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చదవండి: Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు -
భూమా కుటుంబంలో మరోసారి అసమ్మతి చిచ్చు
ఆళ్లగడ్డలో భూమా కుటుంబంలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ‘భూమా వర్గీయుల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో భూమా కిషోర్‌రెడ్డి నిర్వహించిన సమావేశం టీడీపీలో కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల పొత్తులో భాగంగా కిషోర్ పోటీ చేస్తారా? లేదంటే టీడీపీ ఆయననే అభ్యర్థిగా ప్రకటిస్తుందా? అనే చర్చ మొదలైంది. రాజకీయంగా తన వైఖరితో పాటు అఖిల, భార్గవ్ లక్ష్యంగా కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. సాక్షి ప్రతినిధి కర్నూలు: లోకేశ్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో కిషోర్‌రెడ్డి సమావేశం చర్చనీయాంశమైంది. అఖిలపై విమర్శలు, తాను బరిలో ఉంటానని ప్రకటించడం రాజకీయంగా వేడి పెంచుతోంది. పొత్తులు ఉంటే బీజేపీ నుంచి.. లేదంటే మీరంతా అనుకుంటున్న పార్టీ నుంచి అని చెప్పడం ద్వారా పరోక్షంగా టీడీపీ తరపున పోటీలో ఉంటానని ప్రకటించారు. కొన్ని విషయాలు బహిర్గతం చేయలేనంటూనే టీడీపీతో టచ్‌లో ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే కిషోర్ ఏం మాట్లాడుతున్నారో తనకే స్పష్టత లేదనే చర్చ ఆళ్లగడ్డలో నడుస్తోంది. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ వర్గానికి నాయకత్వం వహిస్తారని, అలాంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారనే చర్చ కొనసాగుతోంది. బీసీ జనార్దన్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి.. కిషోర్‌ను వెనుక ఉండి నడిపిస్తున్నారని తెలుస్తోంది. అఖిలకు టిక్కెట్ రాకుండా వీరిద్దరూ పొత్తులు ఉంటే బీజేపీ తరఫున కిషోర్‌ను, లేదంటే టీడీపీ టిక్కెట్ దక్కేలా తెరవెనుక రాజకీయం చేస్తున్నారని ఆ పార్టీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్ వైఖరిపై కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో టీడీపీ పూర్తిగా బలహీనపడిందన్నారు. ఆళ్లగడ్డ రమేశ్‌రెడ్డి కమిషన్ ఇవ్వలేదని రూ.3కోట్లకు ఫోర్జరీ సంతకం చేసి చెక్‌బౌన్స్ అయిందని భార్గవ్ కేసు వేయించారన్నారు. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన రమేశ్‌రెడ్డి పరిస్థితి ఇలా ఉందని, కమీషన్ల కోసం కార్యకర్తల రక్తం పీలుస్తున్నారన్నారు. వీరి వైఖరితో చాగలమర్రి రాంపల్లి రఘునాథరెడ్డిరెడ్డి, రామోహన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిలను భార్గవ్ అవమానించి పార్టీని వీడేలా చేశారన్నారు. ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లో చాలామంది కీలక నేతలు పార్టీ వీడారన్నారు. శివరామిరెడ్డి క్రషర్‌ను లాక్కోవాలని చూస్తే ఆయన దూరమయ్యారన్నారు. పాము తన పిల్లలు తానే తిన్నట్లు భార్గవ్, అఖిల కార్యకర్తలను తినేస్తున్నారని విమర్శించారు. ‘భూమా’ వర్గం అంటూ ఏదీ లేదని, అది పూర్తిగా బలహీనపడిందని కిశోర్ పరోక్షంగా అంగీకరిస్తున్నారు. తద్వారా టీడీపీ కూడా అత్యంత బలహీనమైందని ఆయన మాటల్లోని అర్థం. అయితే ఇదే సమయంలో భూమా వర్గానికి అండగా ఉంటానని చెప్పడం గమనార్హం. ఇదిలాఉంటే కిశోర్ సమావేశాన్ని అఖిల తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనొక పిచ్చోడని, అలాంటి వ్యక్తి మాటలు పట్టించుకోవల్సిన అవసరం లేదని.. అతని వెనుక ఎవరు ఉన్నారో? ఎలా ఆడిస్తున్నారో తనకు తెలుసని అఖిల తన అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఆళ్లగడ్డలో అత్యంత దారుణంగా ఉన్న టీడీపీకి ఇలాంటి ఇంటిపోరు, వర్గపోరుతో మరింత నష్టం వాటిల్లనుంది. -
సేమ్ టు షేమ్ లోకేష్
-
కేంద్రంపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆగ్రహం.. సింహాచలానికి పాదయాత్ర..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై 24 గంటల్లో మాట మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. వీరికి వైఎస్సార్సీపీ శ్రేణులు మద్దతిచ్చాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతున్నారు. చదవండి: చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి.. మహిళలకు విద్యుత్ షాక్.. పట్టించుకోలేదని ఆగ్రహం.. -
Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు
సాక్షి ప్రతినిధి కర్నూలు: దళితులపై నారా లోకేశ్ నోరుపారేసుకున్నారు. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రలో లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి లోకేశ్ చేరుకున్నారు. జక్కసానిపల్లిలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన అక్కులప్ప అనే దళితుడు విదేశీ విద్య, అవుట్ సోర్సింగ్, కస్తూరిబా గురుకుల పాఠశాలలోని ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయంలో టీడీపీ వైఖరిని ప్రశ్నిం చాడు. టీడీపీ అధికారంలోకి వస్తే ‘అంబేడ్కర్ విదేశీ విద్య’ అని పేరు మారుస్తారా? అన్నారు. ఇందుకు లోకేశ్ బదులిస్తూ ‘విదేశీ విద్యను చంద్రబాబు తీసుకొచ్చారు. కొంతమంది పిల్లలైనా విదేశాలకు వెళ్తే, మరో పదిమంది వెళ్తారనే ఉద్దేశంతో ప్రారంభించారు. ప్రస్తుతం చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్లి ఇరుక్కుపోయారు. టీడీపీ ప్రభుత్వం ఒక ఏడాది ఫీజులు చెల్లించింది. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. విదేశాల్లో చదివే విద్యార్థులు అప్పులపాలయ్యారు. విదేశీ విద్యతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు తీసేశారు. ప్రభుత్వం రూ.30కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చినంత మాత్రాన పిల్లలు విదేశాలకు వెళ్లరు. విదేశీ విద్యపై పోరాడిన వ్యక్తి మీ లోకేశ్. మంగళగిరి వేదికగా నేనే పోరాడాను. దళితులు పీకింది లేదు... పొడిచింది లేదు. ఈయన పేరు పెట్టేందుకు!’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలంరేపుతున్నాయి. గతంలో లోకేశ్ తండ్రి చంద్రబాబు కూడా ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
ఉత్తర తెలంగాణలోని 20 అసెంబ్లీ సీట్లపై కాంగ్రెస్ ఫోకస్
-
లోకేశ్ పాదయాత్రకు జనసేకరణ చేయలేమన్న టీడీపీ నేతలు
లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అట్టర్‌ఫ్లాప్ అయింది. ‘అనంత’లో అదే పరిస్థితి. కర్నూలు జిల్లాలో టీడీపీది అత్యంత బలహీన స్థితి. ఇక్కడ ‘యువగళం’ ఫెయిల్ అవుతుందని అధిష్టానానికి ముందస్తు సమాచారం ఉంది. జిల్లా నేతల్లో కూడా ఉత్సాహం కనిపించడం లేదు. జన సమీకరణ చేయలేమని, ఖర్చు భరించలేమని చేతులెత్తేశారు. దీంతో అధిష్టానమే నేరుగా రంగంలోకి దిగింది. జన సమీకరణకు ప్రణాళిక రచించి, పారీ్టనే ఖర్చు భరించేందుకు సిద్ధమైంది. దీనికి తగ్గట్లు కొందరి బాధ్యులను ఇప్పటికే కర్నూలుకు పంపి ఏర్పాట్లు చేస్తోంది. అయితే పార్టీ పరిస్థితి, నేతల తీరు చూస్తే కర్నూలు, నంద్యాల జిల్లాలలో యువగళానికి కష్టాలు తప్పేలా లేవు. సాక్షిప్రతినిధి కర్నూలు: నారా లోకేశ్‌ను ప్రజల్లోకి పంపితే కనీసం కొద్దిమేరకైనా నాయకత్వలక్షణాలు మెరుగుపడతాయనే లక్ష్యంతో టీడీపీ చేస్తోన్న కార్యక్రమం యువగళం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ నెల 13న డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. డోన్ తర్వాత పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించి కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు ముగించుకుని పాణ్యం నియోజకవర్గం ద్వారా నంద్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నంద్యాల జిల్లాలో శ్రీశైలం, నందికొట్కూరు మినహా తక్కిన 5 నియోజకవర్గాల్లో సాగనుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోకి యాత్ర చేరుతుంది. అంటే ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. దాదాపు 40రోజుల పాటు యాత్ర సాగేలా రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. అయితే యాత్రకు జనాలు వచ్చే పరిస్థితి లేదని టీడీపీ అధిష్టానం గ్రహించింది. దీంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. రోజూ రెండు షిఫ్ట్ లు...షిఫ్ట్ కు ఒక్కో కూలికి రూ.500! లోకేశ్ పాదయాత్రకు జనాలు రావడం లేదు. దీంతో సోషియల్ మీడియాలో యాత్ర ‘అట్టర్‌ఫ్లాప్’ అని వైరల్ చేస్తున్నారు. చివరకు యాత్రకు మద్దతు ఇచ్చే పత్రికల్లో కూడా రోజూ జనాలు ఉన్న ఫొటోలు ప్రచురించలేనిస్థితి! టీడీపీకి గట్టి నాయకత్వం ఉందని భావించే అనంతపురం జిల్లాలోని ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కర్నూలు జిల్లాలో మరింత దారుణంగా పరిస్థితి ఉంటుందని పార్టీ గ్రహించింది. దీంతో యాత్రలో పాల్గొనేందుకు జనాలు సమీకరించేందుకు సిద్ధమైంది. రోజూ రెండు వేలమందికి తగ్గకుండా జనాలు సమీకరించే బాధ్యత ఇన్‌చార్జ్‌లకు అప్పగించింది. అంతమంది అంటే ఖర్చులు భరించలేమని ఇన్‌చార్జ్‌లు నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కూలీ పార్టీ చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉదయం వచ్చినవారు సాయంత్రం వరకూ ఉండటం కష్టం. దీంతో రెండు షిఫ్ట్‌లుగా జనాలను తరలించనున్నారు. షిప్్టకు వెయ్యిమంది చొప్పున రోజూ 2వేలమందికి జనసమీకరణకే రూ.10 లక్షలు ఖర్చు చేయనున్నారు. వీరితో పాటు లోకేశ్ భద్రతా, ఇతర సిబ్బంది మరో 500 మందిదాకా ఉన్నారు. వీరందరికీ భోజనాల ఖర్చు మాత్రం ఇన్‌చార్జ్‌లే భరించాలని చెప్పారు. వీరి కూలీ, వాహనాల అద్దె ఖర్చులు మాత్రం పార్టీ చెల్లిస్తుంది. ముఖ్యంగా ఆదోని డివిజన్ నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయని, ఆ ప్రాంతం నుంచి కూలీలను తరలించడంపై దృష్టి సారించింది. దీంతో ఆయా గ్రామాల్లో టీడీపీ తరఫున వలంటీర్లు గ్రామాల్లో వెళ్లి ఆయా గ్రామాల్లో జనసమీకరణ చేయగలిగే వారిని కలుస్తున్నారు. ఈ నెల 13 లేదా 14 తేదీ నుంచి రోజూ తమకు ఎంతమంది అవసరం? కూలీ తదితర వివరాలు చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయిలో జనాలను తరలించే వ్యక్తులకు రోజూ రూ.3వేలు చెల్లించాలి. ఇప్పటికే ఒక విడత సమావేశం పూర్తి యువగళం నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ నేతలు అమర్నాథరెడ్డి, బీదా రవిచంద్ర జిల్లాలోని ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. రోడ్‌మ్యాప్, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. అయితే ఇన్‌చార్జ్‌ల నుంచి ఆశించినస్థాయిలో స్పందన కన్పించలేదు. దీంతో కర్నూలు పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వివరించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో జనసమీకరణపై అచ్చెన్నాయుడు ఆడియో రికార్డులు బయటకు రావడం, సోషియల్ మీడియాలో హల్చల్ చేసిన క్రమంలో కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనలు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని అచ్చెన్నాయుడు సూచించినట్లు తెలుస్తోంది. -
ఇదేందయ్యా ఇది లోకేష్ బాబూ.. మైండ్ బ్లాంక్?
శింగనమల/గార్లదిన్నె: టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ ఎంత చేస్తారని ఆ పార్టీ నాయకుడు నారా లోకేశ్‌ను పలువురు రైతులు ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నె కొట్టాల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కాగా, అక్కడకు టీడీపీ శ్రేణులు రైతులను బతిమాలి తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు ‘మీ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ ఎంత చేస్తారు’ అని రాసి అక్కడ ఉంచిన ప్రశ్నోత్తరాల బాక్స్‌లో వేయగా.. వాటి గురించి లోకేశ్ సమాధానం చెప్పలేదు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానిస్తామని, బటన్ నొక్కగానే వ్యవసాయ యంత్ర పరికరాలు అందేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. -
లోకేష్ యాత్ర లో మజ్జిగ ప్యాకెట్లు..ఎలా విసురుతున్నారో చూడండి
-
లోకేష్ ను ఓ ఆట ఆడుకున్న వంశీ
-
టీడీపీ వర్గీయుల దాష్టీకం.. రైతుకు కోలుకోలేని నష్టం
రామగిరి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ వర్గీయుల దాష్టీకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా ఓ దళిత రైతు మల్బరీ పంటపై పురుగు మందు పిచికారీ చేసి, అతనికి తీరని నష్టం కలిగించారు. పరిటాల కుటుంబం అండతోనే టీడీపీ వర్గీయులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు బాధిత రైతు వాపోతున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గరిమేకలపల్లికి చెందిన హరిజన కొల్లప్ప వైఎస్సార్సీపీలో చురుకైన కార్యకర్త. కొల్లప్పకు ఇటీవల పార్టీ సచివాలయ కన్వీనర్ బాధ్యతలు కూడా అప్పగించారు. కొల్లప్ప స్థానికంగా వైఎస్సార్సీపీని మరింతగా పటిష్ట పరచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు రెండెకరాల్లో అతను సాగు చేస్తున్న మల్బరీ పంటపై శనివారం పురుగు మందు పిచికారీ చేశారు. మూడు రోజుల్లో పట్టు గూళ్ల ఉత్పత్తి మొదలవుతుందనగా ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం పట్టు పురుగులు చనిపోయి ఉండడంతో కొల్లప్ప తోటను పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర జరిగిన సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం. రామగిరి ఎస్ఐ జనార్ధన్ నాయుడు ఆదివారం బాధిత రైతు మల్బరీ తోటను పరిశీలించారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం
సాక్షి, సత్యసాయి జిల్లా: లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బత్తలపల్లి మండలం పొట్లమర్రిలో ఘటన జరిగింది. -
ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్ డైరీలో ఏముంది?
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీపీఎంకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి తరచు ఒక సామెత చెబుతుండేవారు. అదేమిటంటే.. పొగడరా!పొగడరా! అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అని పొగిడాడని. దాని అర్థం ఏమిటి? మిరియపు గింజను కూడా తాటికాయంత ఉందని చెప్పడం. దానిని ఎవరైనా నమ్మగలరా? అలాగే ప్రస్తుతం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చెబుతున్న కబుర్లు కూడా ఉన్నాయి. ఆయన ఒక టీడీపీ పత్రికలో పాదయాత్ర డైరీ రాస్తున్నారు. డైరీ రాయడం తప్పుకాదు. పైగా ఆయనేమీ రాయరు. ఎవరో ఆయన తరపున రాసిస్తే ఆ పత్రిక అచ్చేస్తుంది. ఏభై ఏడో రోజు డైరీలో ఏమని ఉందో చూడండి. 'ఈ రోజు రెడ్డిచెరువు కట్ట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించాను. యువగళానికి సంఘీభావంగా దారిపొడవునా వెల్లువలా తరలివచ్చిన జనం 1983నాటి అన్న ఎన్టీఆర్ ప్రభంజనాన్ని గుర్తుకు తెచ్చారు." అని రాశారు. ఇది చదవడానికి ఎంత ఎబ్బెట్టుగా ఉంది!. లోకేష్ తరపున రచయితలు ఎవరో కాని, మరీ అతిగా పొగుడుతున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. తన పాదయాత్ర గురించి తానే ఇంతగా పొగుడుకుంటారా?. గతంలో ఒక మిత్రుడు అంటుండేవారు. ఎవరూ పొగడకపోతే తనను తానైనా పొగుడుకోవాలని.. అలా ఉంది ఈ కథ.. లోకేష్ అప్పటికి ఇంకా పుట్టలేదనుకుంటా! ఎన్టీఆర్ ప్రజలలో తిరిగే సన్నివేశాల గురించి తెలిసినవారిని అడిగి ఉంటే ఇలా రాసుకునేవారు కాదు. ఎన్టీఆర్ ఎప్పుడూ పాదయాత్ర చేయలేదు. ఆయన చైతన్యరథం పేరుతో ఒక ప్రత్యేక వాహనంలో పర్యటించేవారు. ఆయనను చూడడానికి పల్లె, పట్టణం, పేద, ధనిక వ్యత్యాసం లేకుండా తండోపతండాలుగా వచ్చేవారు. అన్ని కులాలు, మతాలవారు ఇందులో ఉండేవారు. అది నిజంగానే ప్రభంజనంలా సాగేది. గంటల తరబడి ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూసేవారు. జనాన్ని తరలించడం కోసం ఎన్టీఆర్ కాని, ఆయన తరపున కాని ఎవరూ రూపాయి ఖర్చు పెట్టే పని ఉండేది కాదు. దానితో లోకేష్ తన పాదయాత్రను పోల్చుకోవడం అంటే ఎన్టీఆర్‌కు ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదేమో! లోకేష్ కుప్పం నుంచి యాత్ర ప్రారంభించినప్పుడు కొన్ని చోట్ల జనం లేక ఇబ్బంది పడ్డారు. జనాన్ని ఎక్కడికక్కడ తరలించాలని, పూలు చల్లే ఏర్పాట్లు హారతులు ఇవ్వడం వంటివి చేయాలని పార్టీ స్థానిక నేతలకు ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పిన ఆడియో లీక్ ఒకటి అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఎన్టీఆర్‌కు అప్పట్లో అలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అది వాస్తవమో కాదో, తెలియదు కాని, అందులో ఉన్న విషయం ఆసక్తికరంగా ఉంది. పచ్చచొక్కా వేసుకుని ఉన్న ఒక కార్యకర్త లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఎవరో ఆయనతో సంభాషించి దానిని రికార్డుచేశారు. ఆ కార్యకర్త ఏమి చెప్పారంటే తాము నెలకు రూ.25 వేల రూపాయల జీతానికి ఈ పాదయాత్రకు వచ్చామని, తనలా సుమారు మూడువేల మంది వచ్చారని వెల్లడించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఎప్పుడూ ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. టీడీపీ లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అధీనంలోకి వచ్చాక ఇలా డబ్బులు ఇచ్చి జనాన్ని పోగుచేసే సంస్కృతి మొదలైందని చెప్పాలి. గతంలో ఎప్పుడైనా జరిగినా అది చాలా తక్కువే. కాని చంద్రబాబు మాత్రం దానిని ఒక వ్యూహంగా అమలు చేస్తుండేవారు. తద్వారా తన సభలకు జనం బాగానే వస్తున్నారన్న భావన కల్పించాలన్నది ఆయన ఉద్దేశం. అందులో కొంతవరకు ఆయన సఫలం అయ్యేవారు. సరిగ్గా లోకేష్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారేమో తెలియదు. అయితే గతానికి, ఇప్పటికీ ఒక తేడా ఉంది. అప్పట్లో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇంత విస్తారంగా లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు చంద్రబాబుకు అండగా ఉండేవి. ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాయి. దానివల్ల అసలు లోగుట్టు తెలిసేది కాదు. కాని ఇప్పుడు మీడియా స్వరూపం మారిపోవడం వల్ల క్షణాలలో వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు అసత్యాలు కూడా ప్రచారం జరుగుతుండవచ్చు. కాని లోకేష్ పాదయాత్రకు సంబంధించి మాత్రం ఎక్కువ భాగం వాస్తవాలే వచ్చినట్లు అనిపిస్తుంది. ఆయన సరిగా తెలుగు మాట్లాడలేకపోవడం, కొన్ని చోట్ల జనాలు తక్కువగా ఉండడం వంటివి వీడియో సహితంగా వెలుగు చూడడమే ఆధారంగా కనిపిస్తాయి. చదవండి: Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? ఇక లోకేష్ మాటలు కూడా కోటలు దాటుతున్నాయి. మా జోలికి వస్తే ఫ్యాక్షనిస్టులవుతాం అని ఆయన అన్నారట. పసుపు జెండా ధాటికి జగన్‌కు జ్వరం వచ్చిందట. తాడేపల్లి పాలస్ పునాదులు బద్దలయ్యాయట. ఇక వైసీపీ దుకాణం బంద్ అట.. ఇలాంటి డైలాగులను ఎవరో రాసిస్తే చదవడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది! తనతో పాటు వచ్చే అసలు కార్యకర్తలు కొంతమందికి కొద్దిగా ఉత్సాహం రావచ్చేమో కాని, వినేవారికి మాత్రం ఇవి పిట్టలదొర మాటలు అనిపిస్తాయి. జగన్ ప్రభుత్వం విధానాల మీద మాట్లాడడానికి సరుకు లేక ఇలాంటి పిచ్చి మాటలు ఆయన నోట వెంట వస్తున్నాయేమోననిపిస్తుంది. పాదయాత్రలో ప్రజలను కలిసేటప్పుడు వారికి ఏదో ఉపయుక్తమో దాని గురించి ఎక్కువ మాట్లాడాలి తప్ప, ఇలాంటి ఊకదంపుడు ప్రసంగాల వల్ల ఒరిగేది ఏముంటుంది? అయినా ఆయన పార్టీ, ఆయన పాదయాత్ర.. ఆయన ఇష్టం. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
లోకేష్‌కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా?
యువగళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న వాగ్దానాలు చిత్ర, విచిత్రంగా ఉంటున్నాయి. ఆయన పాదయాత్రకు జన స్పందన ఎలా ఉందన్నది పక్కనబెడితే, టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 లు లోకేష్‌కు నిత్యం విపరీత ప్రచారం ఇస్తున్నాయి. రోజూ ఆయన చేసిన ఉపన్యాసమో, ప్రకటననో ఈ మీడియాలు చాలా ప్రముఖం ఇస్తున్నాయి. అది వారి కమిట్ మెంట్ కాబట్టి దానిపై ఇంకేమీ వ్యాఖ్యానించజాలం. లోకేష్ మాత్రం అదేదో, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినట్లు, తెలుగుదేశం పార్టీ గతంలో పాలన చేయనట్లు, మాట్లాడుతుండడమే విశేషం. ఉదాహరణకు ఈ మధ్య ఒక పాదయాత్ర సభలో ఆయన ఏపీని ఉద్యోగాంధ్ర ప్రదేశ్ చేస్తానని అన్నారు. అంతగా ఉద్యోగాలు ఇవ్వగలిగితే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండగా ఎందుకు జాబ్స్ ఇవ్వలేకపోయారు?. పోనీ అప్పుడు ఉద్యోగాలు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఇంకా లక్షల ఉద్యోగాల అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి కదా! లోకేష్‌కు టీడీపీ చరిత్ర, ముఖ్యంగా తన తండ్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఏమి చెప్పేవారో తెలిసినట్లు లేదు. ప్రభుత్వాలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత లేదని ఆయన అనేవారు. అంతేకాదు.. విద్య, వైద్యం వంటివాటిని ప్రభుత్వం నడపనవసరం లేదని భావించేవారు. గత టరమ్ లో కూడా ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పారు. విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రైవేటు రంగం చూసుకుంటుందని ఆయన ఒక సందర్భంలో అన్నారు. అనేక కార్పొరేషన్లను చంద్రబాబు మూసివేసి గొప్ప సంస్కరణ వాదిగా ప్రచారం చేసుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా యువతకు ఉద్యోగాలు సమకూర్చుతామని చెప్పారు. ఆయన అదే ప్రకారం ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో యువతకు అవకాశం కల్పించారు. ఇదే టీడీపీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఒకసారి అదంతా వృథా ఖర్చు అని ప్రచారం చేస్తుంటాయి. మరోసారి మాత్రం తాము ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాంధ్రప్రదేశ్ చేస్తామని చెబుతుంటాయి అదెలా సాధ్యమో చెప్పరు. జగన్ ఆరోగ్య రంగంలో సుమారు నలభై వేల ఉద్యోగాలు ఇస్తున్నారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి పరీక్షలు జరుగుతున్నాయి. ఇలా వివిధ శాఖలలో ఉద్యోగాలు ఇస్తున్నా, లోకేష్ మాత్రం ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలకు చెబుతుంటే, అదేదో మహా సత్యం మాదిరి టీడీపీ మీడియా పట్టం కట్టి ప్రచురిస్తున్నాయి. రాష్ట్రం నుంచి వలసలను ఆపుతామని కూడా ఆయన అంటున్నారు. రాష్ట్రం అంతా ఎందుకు తన తండ్రి నియోజకవర్గం అయిన కుప్పంలో ఆ పని చేసి ఉండవచ్చు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఆ పని చేయడంలో విఫలం అయ్యారని లోకేష్ ఒప్పుకుంటున్నారా?. కుప్పం నుంచి నిత్యం వందలు, వేల మంది బెంగుళూరుకు వెళ్లి పనులు చేసుకుని తిరిగి వస్తుంటారు. ఆ విషయం బహుశా లోకేష్‌కు తెలియదేమో!. టీడీపీ తెచ్చిన కంపెనీలను నిలబెట్టి ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేవట. ఇంత పెద్ద అబద్దం చెప్పగలగడం అంటే మామూలు సంగతి కాదు. ఏపీలో అలాంటి అసత్యాలు చెప్పగల నైపుణ్యం ఒక్క చంద్రబాబుకే ఉంటుందని అంతా నమ్ముతారు. ఆయన కుమారుడిగా లోకేష్ ఆ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నారన్నమాట. ఒకవైపు తన నడిచే రోడ్డులో ఉండే పరిశ్రమల ఎదుట సెల్ఫీ దిగి, అవన్ని తమ టైమ్లోనివేనని చెప్పుకుంటారు. ఇంకో వైపు జగన్ ఆ పరిశ్రమలన్నీ పంపించివేశారని అంటారు. అబద్దమాడడానికి అయినా హద్దు ఉండాలి. ఏమి చేస్తాం. ఇదంతా ఎందుకు ఆయన చెబుతున్నారంటే, విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సమ్మిట్ అనూహ్యంగా విజయం చెందడంతో ఏమి చెప్పాలో తెలియక చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ఇలాంటి మాటలు చెబుతున్నారు. దేశంలోనే అత్యంత ప్రముఖమైన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వచ్చి సమ్మిట్‌లో జగన్ చెంత మూడు గంటలకు పైగా కూర్చోవడంతో టీడీపీ నేతలకు దిమ్మదిరిగినంత పనైంది. దాంతో ముఖ్యమంత్రి జగన్ విశ్వసనీయత విపరీతంగా పెరిగింది. దానిని ఎలా చెడగొట్టాలా అన్న దుగ్దతో లోకేష్ కాని, ఇతర టీడీపీ నేతలు కాని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. మరో వాగ్దానం ఆయన చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ టు పీజీ వరకు విద్యార్ధులకు ఉచిత బస్ పాస్‌లు ఇస్తారట. గత టరమ్‌లో ఆయన ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలి కదా?. ప్రభుత్వపరంగా విద్యార్ధులకు ఎప్పుడూ బస్ చార్జీలలో రాయితీ ఇచ్చి పాస్‌లు మంజూరు చేస్తుంటారు. జగన్ పాదయాత్రలో చేసే వాగ్దానాలకు ఎంత వ్యయం అవుతుందో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసేది. మరి అదే పని లోకేష్ కాని, చంద్రబాబుకాని ఎందుకు చేయడం లేదు?. జగన్ అధికారంలోకి వచ్చాక తన మానిఫెస్టోని సచివాలయంలోనే పెట్టి, మంత్రులు, అధికారులకు ఇచ్చి దానిని నెరవేర్చాలని మొదటి రోజే ఆదేశించారు. ఆ తర్వాత 98.5 హామీలను అమలు చేసి మరో రికార్డు సృష్టించారు. అదే తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక, ఎన్నికల మానిఫెస్టోని పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించి అందరిని ఆశ్చర్చపరిచింది. సుమారు 400 హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన టీడీపీ ఇప్పుడు లోకేష్ ఇచ్చే హామీలకు ఎలా కట్టుబడి ఉంటుందో ఆయన కాని, చంద్రబాబు కాని చెప్పగలగాలి కదా!. లోకేష్ మరో ప్రశ్న వేశారు. జగన్ ఒక్క పరిశ్రమను అయినా తెచ్చారా అని అంటున్నారు. కొద్ది కాలం క్రితమే వైఎస్సార్ జిల్లాలో 8800 కోట్ల పెట్టుబడి కలిగిన జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సంగతి లోకేష్‌కు తెలియదేమో!. తెలిసినా, తెలియనట్లు నటిస్తున్నారేమో!. చదవండి: అసెంబ్లీ ఆవరణలో ఆనాడు చెప్పిన ముచ్చట్లు మరిచారా? ఈనాడు రామోజీ! బద్వేల్ వద్ద సెంచురి ప్లైవుడ్, కొప్పర్తి లో పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలు, అచ్యుతాపురం వద్ద టైర్ల ప్యాక్టరీ, రామాయం పోర్టుకు శంకుస్థాపన ఇలా అనేక విధాలుగా జగన్ టైమ్‌లో పారిశ్రామిక అభివృద్దికి బీజం పడితే, అసలేమీ రాలేదని ఎంత ధైర్యంగా లోకేష్ అబద్దం ఆడగలుగుతున్నారు!. ఒకటి మాత్రం వాస్తవం. ఎన్.టి. రామారావు టైమ్ లో టీడీపీని అబద్దాల పార్టీగా జనం అనుకోలేదు. ఆయనను పడదోసి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాత్రం ఏకంగా అబద్దాల ఫ్యాక్టరీని పెట్టేశారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని లోకేష్ కొనసాగిస్తూ పాదయాత్రను అబద్దాల యాత్రగా మార్చుకున్నట్లుగా ఉంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
పెనుకొండ టీడీపీ టికెట్ సవితమ్మకేనా.. బీకే అవుట్!
సాక్షి, పుట్టపర్తి/పెనుకొండ: నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర టీడీపీకి ఊపు తెస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తుండగా...క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎక్కడ కూడా ఊహించిన స్థాయిలో ‘స్పందన’ రాకపోగా, తమ్ముళ్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. దీంతో ‘కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోయిందన్న’ చందంగా ‘యువగళం’ సాగుతోంది. సభ అంతా స్థానికేతరులే.. కదిరి, పుట్టపర్తి తర్వాత యువగళం పాదయాత్ర సోమవారం పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెనుకొండలో ముగ్గురు నేతలు ఉండటమే కాకుండా వారి మధ్య సమన్వయం లేకపోవడంతో ‘యువగళం’ పాదయాత్రకు స్పందన కరువైంది. ఈ క్రమంలోనే పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎకరా స్థలంలో సభ ఏర్పాటు చేసినా జనాలు నిండకపోవడం గమనార్హం. ఉన్న వారిలో సగం మందికి పైగా నిత్యం నారా లోకేశ్ వెంట ఉండేవారే. కొత్తగా జనాలు రాకపోవడంపై నియోజకవర్గ నాయకులతో ఆయన ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. డబ్బు, మద్యం, పెట్రోల్ పంపిణీ చేసినా రాకపోవడం ఏంటనే దానిపై బీకే పార్థసారథి సెకండ్ క్యాడర్‌పై మండిపడ్డారని తెలిసింది. గోరంట్లకు వచ్చిన వారిలో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల ప్రజలు కూడా కొందరు ఉండటం విశేషం. ఎవరికి వారే యమునా తీరే.. యువగళం పెనుకొండ నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి నిమ్మల కిష్టప్ప, సవితమ్మ, బీకే పార్థసారథి ఎవరికి వారుగా వ్యవహరించారు. పైగా నియోజకవర్గంలో సభలు సక్సెస్ అయితే తమ పరిస్థితి ఏమిటని మిగతా నేతలు ఆలోచించడంతో పరిస్థితి తారుమారైంది. నిమ్మల కిష్టప్ప సొంత మండలం గోరంట్ల కావడంతో.. బీకే ప్లాన్లు బెడిసికొట్టాయి. అంతేకాకుండా బీకే ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు సవితమ్మ మరో టీంను రెడీ చేసినట్లు సమాచారం. ఎత్తుకు పైఎత్తు.. సవితమ్మ ఎక్కడ లోకేశ్‌కు దగ్గరై తన టికెట్‌కు ఎసరు పెడుతుందోనని భావించిన బీకే పార్థసారథి ఆద్యంతం లోకేశ్ వెంటే నడిచారు. బహిరంగ సభలోనూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీనికి పోటీగా సవితమ్మ వర్గం భారీ హంగామా చేసింది. సవితమ్మతో పాటు ఆమె భర్త కూడా పాదయాత్రలో లోకేశ్‌ను అనుసరిస్తూ అనేక సూచనలు చేస్తున్నారు. పాదయాత్ర తాము చేపడుతున్న అన్నా క్యాంటీన్ మీదుగా నడిపి లోకేశ్ చేతుల మీదుగా భోజనాలు వడ్డించాలని సవితమ్మ వర్గం భావించింది. ఈమేరకు లోకేశ్‌కు ఈ విషయం వెల్లడించగా ఆయన ఓకే అన్నట్లు ఆ వర్గం చెబుతోంది. కానీ బీకే వర్గం మాత్రం నిర్దేశించిన మేరకే హైవే మీదుగా పాదయాత్ర కొనసాగిద్దామని వివరించినట్లు తెలుస్తోంది. బీకేకు టికెట్ డౌటే.. నారా లోకేశ్ ప్రసంగంలో బీకే పార్థసారథిని గెలిపించాలని ఎక్కడా పిలుపునివ్వలేదు. టీడీపీని గెలిపించండి.. టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పారు. లోకేశ్ ప్రసంగం చూస్తే బీకే పార్థసారథికి పెనుకొండ టికెట్ అనుమానమే అనిపిస్తోంది. స్పందన కరువు.. గోరంట్ల: లోకేష్ పాదయాత్ర సోమవారం ఉదయం 9 గంటలకు రెడ్డిచెరువుకట్ట గ్రామం నుంచి ప్రారంభమై, చలమయ్యగారిపల్లి, చింతమానుపల్లి, జీనంవాడ్లపల్లి, గోరంట్ల మీదుగా గుమ్మయ్యగారిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వరకు కొనసాగింది. అయితే ఎక్కడా పెద్దగా స్పందన కనిపించలేదు. మధ్యాహ్నం భోజన విరామంలో దీనిపై లోకేష్ స్థానిక నేతలను మందలించినట్లు తెలుస్తోంది. కనీసం జన సమీకరణ కూడా చేతకాకపోతే ఎలా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో నేతలు అప్పటికప్పుడు పొరుగున ఉన్న నియోజకవర్గాల నుంచి తెలుగు తమ్ముళ్లను డబ్బు, మద్యం ఇచ్చి తరలించినట్లు తెలుస్తోంది. -
అనంతపురం: లోకేష్ పాదయాత్రలో డబ్బుల గోల
-
లోకేష్ యాత్రలో డబ్బుల గోల.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, అనంతపురం: నారా లోకేష్ యాత్రలో డబ్బుల గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. తమకు 500 రూపాయల చొప్పున ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన హిందూపురం టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. తెలుగు తమ్ముళ్ల రభస సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేష్ పాదయాత్ర కు జన సమీకరణ కోసం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు డబ్బు, మద్యం భారీగా పంపిణీ చేశారు. చదవండి: ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. 78.94 లక్షల మందికి రూ.6,419 కోట్లు -
ప్రజలను అగ్నిగుండంలోకి నెట్టేశారు
సాక్షి, ఆదిలాబాద్: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను సీఎం కేసీఆర్ అగ్నిగుండంలోకి నెట్టేశారని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం దక్కుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటు ఎదురైందన్నారు. హాథ్‌సే హాథ్ జోడో అభియాన్ కొనసాగింపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి భట్టి మొదలుపెట్టిన పాదయాత్ర రెండోరోజు శుక్రవారం బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో కొనసాగింది. శుక్రవారం రాత్రి సిరికొండలో పాదయాత్రకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపి వెంట నడిచారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ గిరిజన బిడ్డల బతుకుల బాగు కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, మీ కుటుంబం బాగు పడడానికి కాదంటూ సీఎం కేసీఆర్‌నుద్దేశించి విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాయమాటలు చెప్పి హౌసింగ్ శాఖనే ఎత్తివేసి ప్రజలను దగా చేశారని ఆరోపించారు. అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి పోడు భూముల పట్టాలివ్వకుండా గిరిజనులను వేధించి కేసులు పెడుతున్నారన్నారు. మీ అబ్బ సొత్తా..: కాంగ్రెస్ పాదయాత్రకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాలు ఆపివేస్తామని అనడానికి మీరెవరంటూ బీఆర్ఎస్ నేతలను భట్టి ప్రశ్నించారు. రాష్ట్ర సంపద ఏమైన మీ అబ్బ సొత్తా అంటూ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న తర్వాత బోథ్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి కుప్టి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామన్నారు. అడ్డగోలుగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధర తగ్గించి రూ.500కే వంట గ్యాస్ ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకొని పీపుల్స్ గవర్నమెంట్‌ను తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. -
రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కి..
సాక్షి, ఆదిలాబాద్: కేసీఆర్ పాలనతో రాష్ట్రం యాభై ఏళ్ల వెనక్కి వెళ్లిందని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలతో ప్రజలు విసుగెత్తిపోయారని, ఆయా పార్టీలను వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో పడేద్దామని పిలుపునిచ్చారు. హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కొనసాగింపుగా మల్లుభట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రి నుంచి పీపుల్స్‌మార్చ్ పాదయాత్రను తలపెట్టారు. గురువారం మొదటి రోజు పిప్రి నుంచి ఇచ్చోడ వరకు 4 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఇచ్చోడలో కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఇక కేసీఆర్ ఆటలు సాగవన్నారు. లక్షల కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టామని చెబుతున్న కేసీఆర్‌వి అన్ని కల్లబొల్లి మాటలేనని ధ్వజమెత్తారు. లక్షల కోట్ల నిధులు పోయినవి.. నీళ్లు రాలేదు.. ఉద్యోగాలు రాలేదు.. నోటిఫికేషన్లు జారీ చేసి ప్రశ్నపత్రాలను లీక్ చేసిన వ్యవహారంలోనూ ఈ ప్రభుత్వ పెద్ద మనుషులే ఉన్నారని ఆరోపించారు. లక్షలాది నిరుద్యోగుల మానసిక క్షోభకు ఈ ప్రభుత్వం కారణమన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మూడు నెలల పాటు తాను పాదయాత్ర చేపట్టి ప్రజలకు ఈ ప్రభుత్వాల వల్ల జరుగుతున్న మోసాలను తెలియజేస్తానని చెప్పారు. భట్టికి గద్దర్ సంఘీభావం ఇచ్చోడ సభలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొని భట్టికి సంఘీభావం తెలిపారు. పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని తెలియజేశారు. కాగా, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, తెలంగాణ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో భట్టి పాదయాత్ర ప్రారంభించారు. ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌బాబు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్ హన్మంత్‌రావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
భట్టి పాదయాత్ర @ 1,365 కిలోమీటర్లు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క భారీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా రాష్ట్రంలోని 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,365 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు జరగనున్న ఈ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభమై ఖమ్మం నగరంలో నిర్వహించే భారీ బహిరంగసభతో ముగియనుంది. ఇందుకు సంబంధించి రూట్‌మ్యాప్ కూడా ఖరారయింది. ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న యాత్రకు తోడుగా భట్టి మరోవైపు నుంచి యాత్రకు ఉపక్రమించడం గమనార్హం. భట్టి యాత్రకు సంబంధించి గాందీభవన్ వర్గాలు శనివారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న సాయంత్రం నాలుగు గంటలకు ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బజార్ హత్నూర మండలం పిప్రి గ్రామంలో యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి , చెన్నూరు, మంచిర్యాల వరకు జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గంలో యాత్ర ముగింపు సందర్భంగా లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ యాత్రకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ హాజరవుతారని సమాచారం. ఈ సభ తర్వాత ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ (వెస్ట్), స్టేషన్ ఘన్పూర్, జనగామ, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్‌నగర్‌ల వరకు యాత్ర షెడ్యూల్‌ను రూపొందించారు. షాద్‌నగర్ వెళ్లే లోపు హైదరాబాద్ పరిసరాల్లో మరో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత జడ్చర్ల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందుల మీదుగా ఖమ్మం వరకు యాత్ర సాగనుంది. ఈ క్రమంలో యాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. యాత్రల్లో భాగంగా నిర్వహించనున్న మూడు బహిరంగ సభలకు ఏఐసీసీ నాయకత్వం హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజల ఆశలు, అవసరాలే నా యాత్ర ఎజెండా యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం శనివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యక్రమాల అమ లు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ నేతలు ఆమేర్ జావెద్, భరత్‌తో కలిసి భట్టి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు లక్ష్యాలు నెరవేరక ప్రజ లు నిరాశా నిస్పృహల్లో ఉ న్నారని, వారికి ధైర్యం చెప్పి అండగా నిలబడేందుకు యాత్ర చేపట్టామని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వా త రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడంతోపాటు ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా నిలబెడతామని చెప్పారు. ‘మీలో ఒకడిగా మీ మధ్య పాదయాత్ర చేసేందుకు వస్తున్నా. నాతో పాటు నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇవ్వాలని కోరుతున్నా’అని భట్టి అన్నారు. కాగా, తెలంగాణ పోరు యా త్ర పేరుతో తాను బాస ర నుంచి నిర్వహిస్తు న్న పాదయాత్రను కూడా భట్టి యాత్రలో విలీనం చేస్తున్నట్టు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. తనతోపాటు ఉత్తమ్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, రాజనర్సింహ భట్టి యాత్రలో భాగస్వాములం అవుతామని చెప్పారు. -
డామిట్.. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదా?.. ఎందుకిలా జరిగింది?
పీసీసీ చీఫ్ రేవంత్‌కు దమ్కీ ఇద్దామనుకున్నారు. సొంత జిల్లాలో పాదయాత్ర, సభ నిర్వహించారు. రేవంత్ వ్యతిరేక నేతలందరినీ కూడగట్టారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్‌కు దడ పుడుతుందని భ్రమించారు. కాని సీన్ రివర్సయింది. నాయకులు చాలా మంది వచ్చారు. కాని జనమే తక్కువ మంది వచ్చారు. నేతల ఉపన్యాసాలు వినేందుకు జనమే కరువయ్యారు. అది ఏ జిల్లా? రేవంత్‌కు పోటీగా పాదయాత్ర నిర్వహించిన ఆ నేత ఎవరు? చేతిలో పోటీ పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వరరరెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే తన పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సందేశాన్ని, తెలంగాణ సర్కార్ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు టీపీసీసీ చీఫ్. రాబోయే ఎన్నికలలో హస్తం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు రేవంత్. ఇదిలా ఉంటే మహేశ్వర రెడ్డి నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బైంసాలో తన పాదయాత్ర చేపట్టారు. రేవంత్ యాత్రకు సవాలు విసిరే విధంగా ఉందని భావించిన ఆయన వ్యతిరేక ఉద్దండ నేతలంతా మహేశ్వరరెడ్డి పాదయాత్ర ప్రారంభించడానికి హాజరయ్యారు. సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితర రేవంత్ వ్యతిరేక వర్గం అంతా మహేశ్వరరెడ్డి పాదయాత్రకు మద్దతుగా తరలివచ్చారు. పబ్లిక్ రిపోర్ట్‌లో రిజల్ట్ లేదా? అయితే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. తన పాదయాత్ర అంటే వేలాది మంది ప్రజలు తరలి వస్తారని మహేశ్వర్ రెడ్డి అంచనా వేసుకున్నారు. కాని సభకు కొన్ని వందల మంది మాత్రమే హజరయ్యారు. వచ్చినవారంతా మహేశ్వరరెడ్డి సొంత నియోజకవర్గం నిర్మల్ జనమే ఎక్కువగా ఉన్నారు. సభ నిర్వహించిన ముథోల్ నియోజకవర్గం నుండి జనాన్ని తరలించడంలో మహేశ్వరరెడ్డి అనుచరులు ఫెయిలయ్యారనే టాక్ వినిపిస్తోంది. జనం లేక పాదయాత్ర ప్రారంభ సభలో కాంగ్రెస్ నాయకులకు ప్రోత్సాహం కరువైంది. మహేశ్వరరెడ్డితో సహా సభలో పాల్గొన్న నాయకులంతా నిమిషాల వ్యవధిలోనే తమ ఉపన్యాసాలను ముగించారు. అందరూ మహేశ్వరరెడ్డి పాదయాత్ర చేపట్టినందుకు ప్రశంసించారు. కాంగ్రెస్ ఉద్దండులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆ సభ ప్రసంగాలు వినే ప్రజలు లేక కేవలం 40 నిమిషాల్లోపే ముగిసింది. ఎందుకిలా జరిగింది? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రకు పోటీ పాదయాత్ర అంటే జనం పోటెత్తుతారని భావిస్తే.. అసలు స్పందనే రాకపోవడంతో మహేశ్వరరెడ్డి ఆందోళన చెందుతున్నారట. పార్టీలోని సీనియర్ నాయకుల ముందు పరువు పోయిందని మదన పడుతున్నారట. రేవంత్ పాదయాత్ర కంటే తన పాదయాత్రకు ప్రజలు భారీగా వస్తారని అంచనాలు వేసుకున్నారట మహేశ్వరరెడ్డి. కాని రేవంత్ పాదయాత్రకు వస్తున్న స్పందనలో పది శాతం కూడా తనకు రాకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారట. నిర్మల్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం అయింది. బారీ బహిరంగ సభలు సక్సెస్ చేశారు. కాని తన పాదయాత్రకు స్పందన లేకపోవడానికి గల కారణాలను వెతుకుతున్నారట. మొదటగా జనాన్ని తరలించడంలో విఫలమైన అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారట మహేశ్వర్ రెడ్డి. ఆ వైఫల్యానికి కారణాలేంటీ? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే సీనియర్ నాయకులంతా వెన్ను తట్టి ప్రోత్సహించడంతో.. అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు స్పందన రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. మహేశ్వరరెడ్డి రోడ్డు మీదకు వెళితే తండోపతండాలుగా జనం వచ్చేంత పాపులర్ లీడర్ ఏమీ కాదు. పైగా ఆయన తన సొంత నియోజకవర్గం నిర్మల్ వదిలి పక్క నియోజకవర్గం అయిన ముథోల్‌లో పాదయాత్ర చేపట్టారు. ముథోల్ సెగ్మెంట్‌కు చెందిన డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో.. క్యాడర్ మొత్తం ఆయనతో పాటు కాషాయ తీర్థం తీసుకుంది. కాంగ్రెస్ జెండాలు కట్టేవాళ్లు లేనిచోట మహేశ్వర రెడ్డి పాదయాత్ర చేపట్టడం మైనస్ గా మారిందట. ముథోల్‌లో కాకుండా సొంత నియోజకవర్గం నిర్మల్‌లోనే యాత్ర చేపట్టాలని సన్నిహితులు, సీనియర్లు సూచించినా మహేశ్వరరెడ్డి పట్టించుకోలేదట. కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ హోదాలో ఉండి అత్యుత్సాహం చూపిన ఫలితంగా మహేశ్వర రెడ్డి తన పరువు తానే తీసుకున్నారని ఆయన అనుచరులు, కార్యక్తలు అందోళన చెందుతున్నారట. చదవండి: ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి? ఆరంభ సభే అట్టర్ ప్లాప్ కావడంతో...ఈ ప్రభావం తర్వాత రోజులలో నిర్వహించే పాదయాత్రపై పడకుండా మహేశ్వరరెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారట. భారీగా జనాన్ని తరలించాలని అనుచరులకు మహేశ్వర రెడ్డి ఆదేశాలు జారీచేశారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
వైఎస్సార్‌లాంటి పాలన అందిస్తాం: రేవంత్ రెడ్డి
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించి తెలంగాణ ఇచి్చన కాంగ్రెస్ పారీ్టకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వైఎస్సార్ లాంటి పాలన అందిస్తాం’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో భాగంగా ఆదివారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 2024లో కాంగ్రెస్ అధికారంలోకొస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, రూ.500కే ఇంటికి గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీనిచ్చారు. ఆది శ్రీనివాస్ సూచనతో.. 2005లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్థానిక కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సూచనతో మెట్టప్రాంతమైన వేములవాడకు రూ.1,735 కోట్లతో ఎల్లంపల్లి నీళ్లను ఫాజుల్‌నగర్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చందని రేవంత్ చెప్పారు. ఇది తెలుసుకున్న సీపీఐ సీనియర్ నేత సీహెచ్.రాజేశ్వర్‌రావు ఓ సభలో స్వయంగా ఆది శ్రీనివాస్ వయసులో చిన్నవాడైనా వైఎస్సార్‌ను ఒప్పించి ఈ ప్రాంతానికి సాగునీరు తెచ్చి ఎంతో గొప్ప పని చేశారంటూ మెచ్చుకున్న వైనం ఈ ప్రాంతప్రజలు మరచిపోవద్దన్నారు. 43 వేల ఎకరాలకు సాగునీరు హామీ ప్రగల్బాలే స్వరాష్ట్రం సిద్ధించాక అధికారంలోకి వచ్చినపుడు మంత్రి హరీశ్‌రావు ఫాజుల్‌నగర్‌లో 43 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రగల్భాలు పలికారని రేవంత్ విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు దండుకుని ఇప్పటికీ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ వివక్ష కథలాపూర్: ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రుల మాదిరిగానే తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై వివక్ష చూపిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కలిగోట గ్రామ శివారులోని అసంపూర్తిగా మిగిలిన సూరమ్మ రిజర్వాయర్‌ను పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఆది శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే 18 నెలల్లో సూరమ్మ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామన్నారు. -
చిత్తూరు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వరకు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించాయి. సోమవారం నుంచి లోకేష్ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణుల్లో దడ పుట్టిస్తున్నాయి. చదవండి: చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. -
దొరలకో నీతి.. గిరిజనులకో నీతా?: రేవంత్ ఫైర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి విమర్శలు సంధించారు. వేములవాడ రాజన్నను సైతం కేసీఆర్ మోసం చేశారంటూ మండిపడ్డారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. ఇవాళ వేములవాడలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఉదయం ఆయన మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్‌తో కలిసి దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. కానీ, కేసీఆర్ వేములవాడ రాజన్నను కూడా మోసం చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం అని రేవంత్ ప్రకటించారు. ఇక.. మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని మండిపడ్డారాయన. అలాగే.. కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ డిమాండ్ చేశారు. పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదు. దొరలకు ఒక నీతి.. గిరిజనులకు ఒక నీతా?. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు గురించి ప్రస్తావిస్తూ.. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడినే గెలిపించాలని, కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని వేములవాడవాసులను కోరారాయన. -
చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి..
అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి అన్నట్లు యువగళం పాదయాత్రతో కేడర్‌లో జోష్ నింపాలని చినబాబు భావిస్తే.. ఉన్న నేతలే పార్టీ నుంచి వెళ్లితున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని ఆలోచిస్తే.. సరైన గౌరవం దక్కలేదని సీనియర్లు గుర్రుమంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేద్దామనుకుంటే.. ఇన్నేళ్లు వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు జెండా వదిలేస్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలోనూ లోకేష్ తన అవగాహనరాహిత్యంతో తమ్ముళ్ల మధ్య చిచ్చుపెట్టేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీని బలోపేతం చేయడం సంగతి దేవుడెరుగు.. వర్గపోరును రాజేసి విభేదాలు సృష్టిస్తున్నారు. చినబాబు వ్యవహారశైలి నచ్చక సీనియర్ నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఒకరొకరుగా టీడీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. సాక్షి, చిత్తూరు : నిస్తేజంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉత్సాహం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. అది కూడా తన తండ్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే జనవరి 27వ తేదీన ప్రారంభించారు. ఇప్పటి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. అయినప్పటికీ పార్టీలో మాత్రం ఉత్తేజం ఏమాత్రం కనిపించటం లేదు. పార్టీ కేడర్‌కు లోకేష్ పాదయాత్ర భరోసా కల్పించలేకపోయింది. ఏ నియోజకవర్గంలోనూ పాదయాత్ర, సభలు సక్సెస్ అని చెప్పుకునే పరిస్థితి కనిపించలేదు. సామాజిక మాధ్యమాల్లో వెలవెలబోతున్న లోకేష్ సభల ఫొటోలు, వీడియోలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇలాంటివాటిపై స్వయంగా లోకేష్ ఆ పార్టీ సీనియర్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో పెయిడ్ ఆర్టిస్టులు, జనాలను వాహనాల్లో తీసుకొచ్చి పాదయాత్ర కొనసాగించటంలో నేతలు తలమునకలయ్యారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో పాదయాత్రకు ఎక్కడికక్కడ బ్రేక్ తీసుకుంటూ కొనసాగిస్తున్నారు. ఆగ్రహంలో సీనియర్లు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ జెండాను కొందరు నేతలు మోస్తూనే ఉన్నారు. కష్టకాలంలోనూ కొందరు సీనియర్లు ఆ పార్టీని వీడలేదు. కానీ, లోకేష్ చేపట్టిన పాదయాత్ర అలాంటి వారిని డైలమాలో పడేసిందనడంతో ఏమాత్రం సందేహం లేదు. అంతగా రాజకీయ అనుభవం లేని లోకేష్ పార్టీలోని సీనియర్లను చిన్నచూపు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన కొత్త ముఖాలకు బాధ్యతలన్నీ అప్పగించటంపై కొందరు సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. సమయం చూసి తమ అసమ్మతి గళం వినిపించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సందీప్ దారిలో మరికొందరు? టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి మహదేవ సందీప్‌నాయుడు చాలా దగ్గర. ఒకప్పుడు ఆయన తండ్రి మహదేవ నాయుడు అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ కారణంగానే సందీప్‌కు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. అయితే లోకేష్ పాదయాత్రలో ఆయనకు పూర్తి తిరస్కారమే ఎదురైంది. దీంతో బీసీ నేతలు సిపాయి సుబ్రమణ్యం , షణ్ముగం వెళ్లిన దారినే ఆయన ఎంచుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే సందీప్ నాయుడే అలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడితే? భవిష్యత్‌లో తమకూ ఇక్కట్లు రావచ్చని పలువురు నేతలు అనుకుంటున్నట్లు తెలిసింది. చేతులు మరింతగా కాలకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. టికెట్‌కు లేని భరోసా రాబోయే సాధారణ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు లోకేష్ పాదయాత్రలోముందుంటున్నారు. కానీ, టికెట్ వస్తుందని ఆశిస్తున్న నేతలకు లోకేష్ ఏమాత్రం హామీ ఇవ్వటం లేదు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి మొండిచెయి చూపినట్టు ఆ పార్టీ నేతలే గుసగులాడుతున్నారు. టికెట్ ఇస్తారా..? లేదా..? అన్నది కూడా లోకేష్ తేల్చకపోవడంతో ఆశనిరాశల నడుమ ఊగిసలాడుతున్నారు. -
యాతరో యాతర.. పోటా పోటీ జాతర
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రల నిర్వహణలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోటీలు పడుతున్నారు. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో యాత్రలు నిర్వహించాలనుకున్నా... కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయన తాత్కాలిక షెడ్యూల్ రూపొందించుకుని హాథ్‌సే హాథ్ జోడో యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు పోటీగా కొందరు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు షెడ్యూల్ రూపొందించుకుని ఇతర నియోజకవర్గాల్లో యాత్రలకు సిద్ధమవుతుండడం గమనార్హం. ఎవరి ’దారి’వారిదే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పోటీగా శుక్రవారం రాష్ట్రంలో మరో యాత్ర ప్రారంభమయింది. ‘తెలంగాణ కాంగ్రెస్ పోరు యాత్ర’పేరుతో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ యాత్రలను ప్రారంభించారు. ఏఐసీసీ అనుమతితో బాసర పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్ వరకు తాను యాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఏలేటికి కాంగ్రెస్ సీనియర్లు కూడా మద్దతిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఈ యాత్రలో పాల్గొనడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చకు తావిస్తోంది. మహేశ్వర్‌రెడ్డి కంటే ముందే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా యాత్రకు ప్లాన్ చేశారు. ఆయన కూడా రేవంత్‌కు సమాంతరంగా బాసర పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్‌కు యాత్ర చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏలేటి ఆ యాత్రకు ఉపక్రమించారు. అయితే, భట్టి ఇప్పటికే పీపుల్స్ మార్చ్ పేరుతో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న మధిర నియోజకవర్గంలో పాదయాత్ర గతంలోనే పూర్తి చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా మళ్లీ ‘పీపుల్స్ మార్చ్’పేరుతో రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మాణిక్‌రావ్ ఠాక్రే చేతుల మీదుగా.. మరోవైపు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కూడా తనదైన శైలిలో హాథ్ సే హాథ్ జోడో యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని విద్యార్థి లోకం మద్దతు కాంగ్రెస్ పారీ్టకి కూడగట్టేందుకు గాను ఆయన విశ్వవిద్యాలయాల్లో ఈ యాత్ర చేయాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్ కూడా తయారవుతోంది. మరోవైపు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా తనతో పాటు తన సతీమణి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో యాత్రకు ఉపక్రమించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఈ యాత్రలను ప్రారంభించడం గమనార్హం. ఇక, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో తాను బైక్ యాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల నేతలందరూ రెండు నెలల పాటు పాదయాత్ర చేయాల్సి ఉంది. అయితే ఢిల్లీ పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా ఈ యాత్రలు జరుగుతుండడం గమనార్హం. కరీంనగర్లో 9న సభ హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా ఈనెల 9న కరీంనగర్లో భారీ బహిరంగసభ నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పాటు చేస్తామని అప్పట్లో కరీంనగర్లో సభలోనే సోనియాగాంధీ హామీ ఇచ్చి అమలు చేసిన నేపథ్యంలో ఆ సభ జరిగిన ప్రదేశంలోనే భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలను కూడా ఆహా్వనించనున్నారు. రేవంత్‌కు సీనియర్లు దూరంగా.. సీఎల్పీ నేత మల్లు భట్టి, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు రేవంత్ యాత్రకు హాజరై అందరం కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆ తర్వాత సీనియర్ నేతలు ఆయన యాత్ర వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంమీద ఏఐసీసీ ఉద్దేశానికి భిన్నంగా రాష్ట్రంలో యాత్రలు జరుగుతున్నాయని, రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలంతా కలిసికట్టుగా ఉన్నామన్న భావన ప్రజల్లో కలిగించేందుకు సిద్ధంగా లేరనే చర్చ జరుగుతోంది. ఇక, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి యాత్రపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ హాథ్ సే హాథ్ జోడో యాత్రలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేయాలని ఏఐసీసీ చెప్పిందని, చేయకపోతేనే ఏఐసీసీ చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ తెలంగాణ పోరు ‘యాత్ర’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మరో యాత్రకు సిద్ధమవుతోంది. మార్పు కోసం పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్‌సే హాథ్ జోడో’ యాత్ర ఓ వైపు కొనసాగిస్తుండగా, మరోవైపు నుంచి ఇంకో యాత్ర ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో వెల్లడించారు. మహేశ్వర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి మూడో తేదీ నుంచి ‘కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర’ పేరుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. బాసర సరస్వతీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భైంసా వరకు తొలి రోజు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత నిర్మల్, ఖానాపూర్, ఉట్నూర్, ఆదిలాబాద్, ఇచ్ఛోడ మీదుగా బోథ్ వరకు తొమ్మిదో తేదీవరకు యాత్ర నిర్వహిస్తారు. మధ్యలో మార్చి 7వ తేదీన హోలీ సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించనున్నారు. తొమ్మిదో తేదీన బోథ్ వరకు తొలి విడత యాత్ర ముగిసిన తర్వాత రెండో విడత షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. మొత్తం మీద బాసర నుంచి హైదరాబాద్ వరకు యాత్రను పూర్తి చేసి, ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించేలా యాత్ర షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1,2 రోజుల పాటు యాత్ర కొనసాగేలా షెడ్యూల్ తయారు చేశామని, అధిష్టానం ఆదేశాల మేరకే ఈ యాత్ర జరుగుతోందని, యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలందరూ పాల్గొంటారని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. -
ఒక్క పార్టీ ఆఫీసుపై దాడిచేస్తే మేం వంద పగలగొడతాం.. రెచ్చిపోయిన లోకేశ్
రేణిగుంట (తిరుపతి): ‘మా జోలికొస్తే వదిలిపెట్టం. వాళ్లు ఒక్క పార్టీ ఆఫీసు మీద దాడిచేస్తే మేం వంద పగలదొబ్బుతాం. దాడిచేసిన వారిని కడ్రాయర్లతో ఊరేగిస్తాం. మాపైనే అక్రమ కేసులు పెడుతారా? రేపు అధికారంలోకి వచ్చేది మేమే. పోస్టింగులు నిర్ణయించేది నేనే. గుర్తుపెట్టుకో..’ అంటూ టీడీపీ నాయకుడు లోకేశ్ బెదిరింపులకు దిగారు. ఆయన నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేటకు చేరుకుంది. అక్కడ మూడురోడ్ల కూడలి వద్ద ఆయన స్టూల్ వేసుకుని బహిరంగసభను తలపించేలా మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో రేణిగుంట డీఎస్పీ రామచంద్ర ఆయన్ని వార్నింగ్ ఇచ్చారు. దీంతో లోకేశ్ గట్టిగా గద్దిస్తూ ‘కేసులు పెట్టుకోబో.. ఏం తమాషానా.. రేపు అధికారంలోకి వచ్చేది మేమే.. పోస్టింగులు నిర్ణయించేది నేనే.. మా నాయకులపై దాడిచేసి తిరిగి వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు అక్రమంగా పెడుతున్నారు. దాడిచేసిన వారిని కడ్రాయర్‌తో ఊరేగిస్తాం. డీఎన్ఏలో రాయలసీమ అనేది ఉంటే నాకు మైక్ ఇవ్వు. పిరికోడిలా ప్యాలెస్‌లో కూర్చోకుండా వచ్చి సమాధానం చెప్పు. మాకు పౌరుషం లేదనుకుంటున్నావా? మీసం తిప్పి చెబుతున్నా.. చంద్రబాబును ఒక్క చిటికె వేయమనండి.. వైఎస్సార్సీపీ ఉంటుందో.. లేదో.. నేను చూస్తా. గన్నవరంలో మా పార్టీ ఆఫీసుపై దాడిచేస్తే కేసు పెట్టరు. నేను ఇక్కడ స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసు పెడతారా? బ్లాక్ అండ్ వైట్ పేపర్లు హెలికాప్టర్లో నుంచి విసిరితే ఏమవుతుంది..’ అన్నారు. అంతకుముందు రాజులకండ్రిగ సమీపంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఎస్ఎస్ కెనాల్ పూర్తిచేస్తామని చెప్పారు. -
పాదయాత్ర చేస్తే పంది ఏనుగు అవ్వదు..లోకేష్ పై వల్లభనేని వంశీ కామెంట్స్
-
మీరు సోంబేర్లు.. మీకు పోరాట పటిమ లేదు!
రేణిగుంట(తిరుపతి జిల్లా): ‘మీరు సోంబేర్లు.. మీకు పోరాటపటిమ లేదు’ అంటూ వన్నెకుల క్షత్రియులపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఏర్పేడు మండలం కోబాక వరకు నారా లోకేశ్ పాదయాత్ర చేశారు. మార్గంమధ్యలో బండారుపల్లి సమీపంలో వన్నెకుల క్షత్రియుల సంఘం నేతలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. లోకేశ్ మాట్లాడుతూ ‘మీరు సోంబేర్లు అబ్బా.. మీకు పోరాటపటిమ లేదు. గట్టిగా నిలదీసి సాధించుకునే మనస్తత్వం లేదు. మేం అధికారంలోకి వస్తే మీకు సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే బాధ్యతను తీసుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను నిర్మూలిస్తామని.. 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేశ్ చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ సహా అన్ని పథకాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కోతలు విధిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో సైతం ఏనాడూ ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్‌లో లేవన్నారు. అంతకుముందు శ్రీకాళహస్తిలో ముస్లిం, మైనార్టీ నాయకులతో లోకేశ్ సమావేశమయ్యారు. సమావేశంలో టీడీపీ నేతలు బొజ్జల సుధీర్‌రెడ్డి, రెడ్డివారి గురవారెడ్డి, సత్రవాడ మునిరామయ్య పాల్గొన్నారు. పాదయాత్రకు ప్రజా స్పందన కరువు.. లోకేశ్ పాదయాత్రకు శ్రీకాళహస్తి మండలంలో ప్రజా స్పందన కరువైంది. కొద్ది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్ప స్థానికులు కనిపించలేదు. వార్తల్లో నిలిచేందుకు లోకేశ్ ఇష్టారీతిన నిబంధనలను ఉల్లంఘించారు. తొండమాన్‌పురం వద్ద పోలీసులతో లోకేశ్ వాగ్వాదానికి దిగారు. -
మేమంతా ఒక్కటే
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘మేమంతా ఒక్కటే.. మా నాయకులంతా కలిసే ఉన్నాం.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఈ రాష్ట్ర ప్రజలు, మేం సిద్ధంగా ఉన్నాం.. 2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది’అని టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం హనుమకొండ అమృత జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టం జరుగుతున్నా అమరుల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ సరైన పరిపాలన జరగక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో నివేదిక ప్రకారం రాష్ట్రంలో 80 వేలమంది రైతులు, మూడు వేల మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఇప్పటికీ పూర్తికాలేదు కానీ 9 నెలల్లో 10 ఎకరాల్లో 150 గదులతో దొరల గఢీలను తలపించే ప్రగతి భవన్ మాత్రం పూర్తయిందని ఎద్దేవా చేశారు. ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు బిల్లా రంగాల్లా దోచుకుంటున్నారు వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ పసిపిల్లగాడు అనుకుంటున్నారని, కానీ ఆర్టీసీ టైర్ల ఫ్యాక్టరీని మూసివేసి హంటర్ సెంటర్లో 6 ఎకరాల భూమిని కాజేసిన ఘనత ఆయనదని ఆరోపించారు. ఓరుగల్లు ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠా అని, వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు బిల్లా రంగాల్లా ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘వరంగల్‌లో ఏ ఎమ్మెల్యేను తీసుకున్నా ఉద్యమం సమయంలో వీరి దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు వేల కోట్లకు పడగలెత్తారు. దండుపాళ్యం ముఠాకు హన్మకొండ సాక్షిగా హెచ్చరిక చేస్తున్నా. గోడ మీద రాసిపెట్టుకోండి. రోజులు లెక్కపెట్టుకోండి. డైరీలో ప్రతి ఒక్కటీ నోట్ చేసుకుంటున్నాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధించిన దండుపాళ్యం ముఠాకు ఇంతకింత మిత్తితో సహా చెల్లిస్తాం’’ అని హెచ్చరించారు. పాదయాత్రకు ముందు కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గాను దర్శించుకొని రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ మంత్రులు మహ్మద్ అలీ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ సర్కార్‌పై వైఎస్ షర్మిల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా అంటూ మండిపడ్డారు. ఇక, వైఎస్ షర్మిల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. ఒక మహిళపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా?. ప్రశ్నినందుకు శంకర్ నాయక్ దాడికి ప్లాన్ చేశాడు. కనిపించిన భూములన్నీ కబ్జా చేస్తున్నారు. శంకర్ నాయక్ ఆగడాలను ప్రజలు గమనించాలి. పాలకపక్షం కుట్రతోనే పాదయాత్రను అడ్డుకుంది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
కాంగ్రెస్‌లో మరో పాదయాత్ర
కాంగ్రెస్‌లో మరో పాదయాత్ర -
లోకేష్ వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆగ్రహం
-
కాంగ్రెస్‌లో మరో ‘యాత్ర’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో పాదయాత్రకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్ర సాగుతుండగా.. వచ్చే నెల తొలివారంలో అదే పేరుతో యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి మొదలుపెట్టి.. రోజుకో నియోజకవర్గం చొప్పున మొత్తం 35 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో భట్టి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు భేటీ అయి యాత్ర షెడ్యూల్‌పై కసరత్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా యాత్ర కొనసాగించి ఖమ్మంలో ముగింపు సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ షెడ్యూల్ మేరకు నియోజకవర్గాల నేతలకు సమాచారం అందించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరగనున్న ఏఐసీసీ ప్లీనరీ తర్వాత ఈ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. బాసర టు ఖమ్మం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెండు నెలల వ్యవధిలో హాథ్‌సే హాథ్ జోడో యాత్రలను పూర్తి చేయాలని ఏఐసీసీ ఇంతకుముందే ఆదేశించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈనెల ఆరో తేదీన ములుగు నియోజకవర్గం నుంచి యాత్రను ప్రారంభించారు. దీనిలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొని తామంతా కలిసే ఉన్నామని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల కారణంగా రేవంత్ యాత్రలో సీఎల్పీ నేత భట్టి తొలుత పాల్గొనలేకపోయారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తాను కూడా రాష్ట్రంలో మరోవైపు నుంచి యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హాథ్‌సే హాథ్ జోడో యాత్రలను రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని.. అందువల్ల ఓ వైపు రేవంత్, మరోవైపు భట్టి ఆధ్వర్యంలో యాత్రలు చేయడం ద్వారా త్వరగా ముగించవచ్చన్నదే పార్టీ యోచన అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో వివాదమేమీ లేదని అంటున్నాయి. భట్టి ఆధ్వర్యంలో నిర్వహించే యాత్రలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, శ్రీధర్‌బాబు, వి.హనుమంతరావు వంటి ముఖ్య నేతలతోపాటు రేవంత్‌రెడ్డి కూడా పాల్గొంటారని చెప్తున్నాయి. -
ప్రగతిభవన్‌ను బద్దలు కొట్టి సోనియారాజ్యం తెద్దాం
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: సబ్బండ వర్గాల ఉద్యమకారుల ఆత్మబలిదానాలతో సిద్ధించిన తెలంగాణ ప్రగతిభవన్ గేట్లను బద్దలు గొట్టి అమరులు కన్న కలలు సాకారం దిశలో సోనియాగాంధీ రాజ్యం తీసుకొద్దామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జనగామ జిల్లా జఫర్ఘడ్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ వరకు హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో ప్రజాసమస్యలను తెలుసుకున్న ఆయన స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభ లో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ఊళ్లలో తప్పు ను తప్పు.. అనే స్వేచ్చ లేకుండా పోయిందన్నారు. ఈసారి కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తేనే.. బతుకులు బాగుపడతాయని పిలుపునిచ్చారు. మరోసారి వస్తే రాచరిక పాలన పేట్రేగిపోతుందన్నారు. కడియం, రాజయ్యలు ఏమి ఒరగబెట్టారు.. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలకు అదృష్టం కలిసి వచ్చి విద్యాశాఖ, ఆరోగ్య శాఖల మంత్రులతోపాటు ఉపముఖ్యమంత్రులుగా అవకాశం వచ్చినా.. ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. గురువులుగా పనిచేసిన వీరు సొంత నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. దొరల గడీలో చేరాక చచ్చిన పాములా, బానిసలా బతుకుతున్న కడియంసార్ను... పిల్చటోడు.. కూ ర్చోబెట్టడోడు లేడు.. ఆఖరికి రాజయ్య తరిమికొట్టేందుకు పురమాయించే పరిస్థితిలో ఉన్నాడు’అని వ్యాఖ్యానించారు. ఘనుడు రాజయ్య గురించి పాదయాత్రలో ఆడబిడ్డలు చెబుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదని అన్నారు. నడ్డి మీద తన్ని అవినీతి ఆరోపణలు పెట్టి కేబినెట్‌నుంచి ఇంటికి పంపించేలా రాజయ్య చేయించుకున్నాడని ఎద్దేవా చేశారు. రాజీనామా పత్రం తీసుకోకుండా ఏకంగా బర్తరఫ్ చేయడంతో దళితులపట్ల సీఎం కేసీఆర్ వైఖరి వెల్లడైందని విమర్శించారు. ఈ విషయంలో రాజయ్యకు సిగ్గులేకుండా పోవచ్చుగానీ, మాదిగ బిడ్డలకు పౌరుషం ఉందని, త్వరలో కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజయ్యపై చేసిన ఆరోపణలపై నేటికి విచారణ జరగలేదని, ఇందులో కేసీఆర్‌కు వాటా ఉందని అర్థమవుతుందన్నారు. వరంగల్‌కు వైద్య విధాన పరిషత్ తెస్తానని రాజయ్య ప్రకటించడంతో చిర్రెత్తకుపోయిన సీఎం కర్రు కాల్చి వాత పెట్టాడన్నారు. శ్రీహరితో పోల్చితే ఎర్రబెల్లి ఎందుకూ పనికిరాడు శ్రీహరితో పోల్చితే... ఎందుకు పనికిరాని ఎర్రబెల్లిని మంత్రి వర్గంలో తీసుకోవడంపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఉద్యమ వారసులుగా అడుగుతున్నాము.. సోనియాగాంధీకి ఇప్పటికైనా కృతజ్ఞతగా కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. త్వరలో డ్వాక్రా మహిళలకు నేరుగా ప్రియాంకాగాంధీ వరాలు ప్రకటిస్తారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, సుదర్శన్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, దయాసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిర, అమృతరావు పాల్గొన్నారు. -
బహిరంగ చర్చకు సిద్ధమేనా
సాక్షి, మహబూబాబాద్: ‘నేను మీపై చేసిన ఆరోపణలను అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా.. మీ నిజాయితీని నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమేనా’? అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. షర్మిల పాదయాత్ర శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామ శివారునుంచి సాగింది. ఈ సందర్భంగా నెల్లికుదురు, మడిపెల్లిలో ఆమె మాట్లాడారు. వందల ఎకరాల భూమి ఎలా వచ్చిందని మంత్రిని ప్రశ్నించారు. ఆడదానివి కాబట్టి ఉపేక్షిస్తున్నారని మంత్రి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అవుతాపురంలో వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సహకరించిన వారిపై మంత్రి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరించినట్లు తన దృష్టికి వచ్చిందని షర్మిల పేర్కొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తనయాత్రను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదని, ఆయన తనను అడ్డుకుంటే వైఎస్ఆర్ అభిమానులు తడాకా చూపిస్తారని అన్నారు. మార్చి 5న షర్మిల పాదయాత్ర ముగింపు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర మార్చి 5వ తేదీన ముగియనున్నదని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ తెలిపారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నిత్యం జనం మధ్యలోనే ఉంటూ అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ నెల 20న డోర్నకల్ నియోజకవర్గం మీదుగా షర్మిల పాదయాత్ర పాలేరులో అడుగుపెడుతుందన్నారు. ఆ నియోజకవర్గంలోని కూసుమంచిలో జరిగే సభతో పాదయాత్ర ముగుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎలా సంపాదించావు?: కొడాలి నాని
-
‘చంద్రబాబు, లోకేష్ ప్రవాసాంధ్రులు’
సాక్షి, కృష్ణా: నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తేల్చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక అజెండా లేకుండా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. చంద్రబాబు తాను లేస్తే మనిషిని కాదంటాడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. బాబు హయాం నుంచి చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు కన్నబాబు. చివరికి కుప్పం నుంచి గెలవలేని పరిస్థితి చంద్రబాబుదని కన్నబాబు తేల్చేశారు. ‘‘బాబు పాలనలో కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి. చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ కరువు, కష్టాలే!.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే’’ అని కురసాల పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రవాసాంధ్రులని ఎద్దేవా చేసిన కురసాల కన్నబాబు.. దరిద్రానికి డెఫినిషన్ చంద్రబాబు అని అభివర్ణించారు. తనను మించిన మహానటుడు చంద్రబాబు అని స్వయానా ఎన్టీఆరే అన్నారని, చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని కన్నబాబు పేర్కొన్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అని, సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్ ఉందా? అని ఎమ్మెల్యే కన్నబాబు ప్రశ్నించారు. ‘అన్న ఎవరో.. దున్న ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. పాదయాత్రలో లోకేష్ భాష, బాడీలాంగ్వేజ్ అసభ్యకరంగా ఉంది. ఓర్వలేనితనంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లోకేష్ తన భాషను అదుపులో పెట్టుకుంటే మంచిద’ని కన్నబాబు టీడీపీ జాతీయ కార్యదర్శికి సూచించారు. -
టీడీపీ స్కెచ్.. ‘నీ పంట దున్నెయ్.. లీడర్ని చేస్తాం..’
శ్రీకాళహస్తి: తన పంటను తానే ధ్వంసం చేసుకుని వైఎస్సార్సీపీ వారిపైకి నెట్టిన టీడీపీ కార్యకర్త బాగోతం బట్టబయలైంది. పోలీసుల విచారణలో తెలుగుదేశం నేతల కుట్ర బయటపడింది. లోకేశ్ పాదయాత్ర తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం మీదుగా సాగనుండడంతో దానికి ప్రచారం తీసుకురావాలని టీడీపీ నేతలు కుట్రకు తెరతీశారు. అందుకు పార్టీ కార్యకర్త మురళీకృష్ణారెడ్డిని పావుగా చేసుకున్నారు. మండలంలోని చిట్టత్తూరు గ్రామానికి చెందిన మురళీకృష్ణారెడ్డి 4.25 ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ సాగుచేశాడు. ‘నీ పంటను నువ్వే ధ్వంసం చేసి దాన్ని వైఎస్సార్సీపీ వారు చేశారని ప్రచారం చెయ్యి. పాదయాత్రలో లోకేశ్‌ను మీ ఇంటికి తీసుకొస్తాం. నీకు నష్టపరిహారం ఇప్పించి, మంచి లీడర్ని చేస్తాం..’ అంటూ మురళీకృష్ణారెడ్డికి చెప్పారు. దీంతో మురళీకృష్ణారెడ్డి, డ్రైవర్ మధు ఈనెల 9న (గురువారం) రాత్రి రోటావేటర్తో వేరుశనగ పంటను ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తన పంటను వైఎస్సార్సీపీ నాయకులు నాశనం చేశారంటూ మురళీకృష్ణారెడ్డి గగ్గోలు పెట్టారు. పథకం ప్రకారం టీడీపీ నేతలంతా గ్రామంలో పర్యటించి వైఎస్సార్సీపీ నాయకులపైన, ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా, సీసీ ఫుటేజీలు పరిశీలించి మురళీకృష్ణారెడ్డిని, మధుని విచారించారు. తన పంటను తానే ధ్వంసం చేసుకున్నట్లు మురళీకృష్ణారెడ్డి అంగీకరించారని సీఐ విక్రమ్ తెలిపారు. ఈ విషయంపై విలేకరులు డ్రైవర్ మధుని అడగగా.. పంట ధ్వంసం వెనుక రాజకీయాలు తనకు తెలియదని చెప్పాడు. పంట సరిగా రాలేదని, ధ్వంసం చేస్తే ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పడంతోనే రోటావేటర్తో దున్నేశానని స్పష్టం చేశాడు. దీంతో టీడీపీ కుట్ర బహిర్గతమైంది. -
‘దయాకర్‌రావు ఎంతకు అమ్ముడుపోయారు’
సాక్షి, మహబూబాబాద్: ‘మంత్రి దయాకర్‌రావు టీడీపీలో ఉన్నప్పుడు.. కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు అని మాట్లాడారు.. ఇప్పుడు ఆయన కేసీఆర్‌కు ఎంతకు అమ్ముడుపోయి ఆయన పార్టీలో చేరారు’అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురంలో పాదయ్రాత కొనసాగించారు. 3,800 కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుని నాంచారి మడూరు మీదుగా తొర్రూరు చేరుకున్నారు. సాయంత్రం తొర్రూరు బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఐదో తరగతి చదివిన దయాకర్‌రావు మంత్రి అయ్యారని, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన బిడ్డలు నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీపరుడినని చెప్పే మంత్రి 680 ఎకరాల భూమిని ఎలా సంపాదించారని ప్రశ్నించారు.